
జనగామ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న షర్మిల
జనగామ: రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అంటే ఏంటో చూపించిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శించే సీఎం కేసీఆర్... బొంకుడు మాటలు మాట్లాడేది ఎవరో చెప్పాలని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. వైఎస్‌ఆర్‌పై అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను షర్మిల ఖండించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సోమవారం జరిగిన సభలో ఆమె మాట్లాడారు.
పథకాల పేరు చెబుతూ... ప్రజలను మోసం చేసేది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 33 ప్రాజెక్టుల నిర్మాణం చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి బొంకుడు మనిషి అయ్యారా? అటువంటి బొంకుడు మాటలు చెప్పే అలవాటు నీకే ఉందని కేసీఆర్‌పై ఆమె నిప్పులు చెరిగారు. ప్రజల గుండెల్లో వైఎస్సార్ దేవుడిగా నిలిచిపోతే... కేసీఆర్‌ను దెయ్యమని పిలుచుకుంటున్నారన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిది పాదయాత్రనో.. దొంగయాత్రనో అర్థం కావడంలేదని విమర్శించా రు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి, కేసీఆర్ చేతిలో పిలకగా మారిన రేవంత్.. ప్రజల గురించి మాట్లాడతాడంటే మనం నమ్మొచ్చా అని ప్రశ్నించారు. షర్మిల వెంట నేతలు ఏపూరి సోమన్న, జిల్లా అధ్యక్షుడు గౌరబోయిన సమ్మయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment