YSR Telangana Party
-
టీడీపీ ప్లాన్.. కాంగ్రెస్ యాక్షన్
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానం చివరికి కాంగ్రెస్‌కు చేరింది. దీనివల్ల ఆమెకు రాజకీయంగా ఎంతవరకు ఉపయోగం జరుగుతుందో చెప్పలేం కానీ, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు మరోసారి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సహకారం ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు పార్టీలలో చేరి రాజకీయాలు చేయడం కొత్తకాదు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. వారు ఇచ్చిన ఆఫర్ల గురించి కూడా వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తామని, ఏపీసీసీ అధ్యక్షురాలు, లేదా స్టార్ కాంపెయినర్‌గా వ్యవహరించాలని కోరుతున్నట్లు ఆమె తెలియచేశారు. తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీచేసే ఆలోచన కూడా ఉందని చెబుతున్నారు. ఆమె కాంగ్రెస్‌లో చేరినా తెలంగాణకే పరిమితం అయితే మంచిదే. కానీ, రాజకీయం ఎప్పుడూ అనుకున్నట్లు జరగదు. సహజంగానే ఆమెను రాజకీయంగా ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్న శక్తులు తప్పుదారి పట్టించే యత్నాలు కూడా ఉంటాయి. ఇప్పటికే షర్మిల, ఆమె భర్త అనిల్ ఒక తెలుగుదేశం మీడియా యజమాని రాజకీయ ట్రాప్‌లో ఉన్నారు. ఆయన సహాయ సహకారాలు తీసుకుంటున్నారంటేనే చంద్రబాబు కూడా ఈ కుట్రలో భాగస్వామిగా ఉన్నారనే అభిప్రాయం కలుగుతుంది. అందుకు తగినట్లుగానే షర్మిల భర్త అనిల్ టీడీపీ నేత బీటెక్ రవితో మాటామంతి కలిపారని అనుకోవచ్చు. షర్మిల ఒకప్పుడు వైఎస్ జగన్‌కు అండగా ఉన్న మాట నిజం. ఆయన కూడా ఆమె పట్ల ఎంతో అభిమానంగా ఉంటారు. అయినా రాజకీయం ఎంతటి వారి మధ్య అయినా బేధాలు సృష్టిస్తుంటుంది. కారణం ఏమైనా ఆమె తెలంగాణ రాజకీయ మార్గం ఎంచుకున్నారు. అలా చేయవద్దని సీఎం జగన్ చెప్పి చూశారు. కానీ, ఆమె అంగీకరించలేదు. దీంతో, రాజకీయాలలో ఆమె దారి ఆమెది అని సీఎం జగన్ చాలా స్పష్టంగా చెప్పేసి, తన పనిలో తాను పడ్డారు. షర్మిల కూడా చిత్తశుద్దితో తెలంగాణ రాజకీయాలు చేయాలని అనుకున్నారు. సొంతంగా పార్టీని నిలబెట్టడానికి యత్నించారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీచేసి అసెంబ్లీకి వెళ్లాలని భావించి తగు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. పాదయాత్ర జరిపారు. ఆ క్రమంలో నర్సంపేటలో టీఆర్ఎస్ నేతలతో ఒక పెద్ద వివాదం కూడా జరిగింది. ఆ సందర్భంలో హైదరాబాద్‌లో తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు ఎదురొడ్డి కారులో నుంచి దిగకుండా ఉండడం, దాంతో టోల్ వెహికిల్ ద్వారా ఆ కారును పట్టుకువెళ్లే యత్నం జరిగింది. అప్పుడు ఆమె నిరసన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఆమె తెలంగాణలో పార్టీని వ్యవస్థాపరంగా అభివృద్ది చేసుకోలేకపోయారు. పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుంచి చేసుకోలేకపోయారు. పార్టీ భవిష్యత్తుపై అనుమానాలు ఏర్పడటంతో పలువురు నేతలు తమదారి తాము చూసుకున్నారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌తో కలిసి రాజకీయం చేయాలని భావించారు. కానీ, అప్పటికే టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి పీసీసీ అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి అందుకు అంగీకరించలేదు. దీంతో ఆమె కొన్నిసార్లు రేవంత్ రెడ్డిపై ఘాటైన విమర్శలు కూడా చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేయాలని అనుకున్నా, ఆమె ఏ కారణం వల్లనైతేనేమీ చేయలేకపోయారు. ఈలోగా ఆమెను కాంగ్రెస్‌లోకి తీసుకు వచ్చి ఏపీ రాజకీయాలలో ప్రవేశపెట్టాలని కొందరు ప్రయత్నాలు చేశారు. బహుశా ఆమె కూడా దీనిపై మల్లగుల్లాలు పడి ఉండవచ్చు. తొలుత అంత సుముఖత చూపలేదు. చివరికి కాంగ్రెస్ అధిష్టానం చేసిన సంప్రదింపుల పర్యవసానంగా ఆమె తన పార్టీని విలీనం చేయడానికి ఒకే చేశారు. కానీ.. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఏమన్నారో చూడండి. షర్మిల ఆరునెలలుగా కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని అడుగుతున్నారని చెప్పారు. దీనిని బట్టి కాంగ్రెస్ వారు ఎలా వ్యవహరిస్తారో అర్ధం చేసుకోవచ్చు. షర్మిలకు ఏ పదవి ఇస్తారో అది వేరే విషయం. ఆమెను ఎలాగైనా ఏపీ రాజకీయాలలోకి తీసుకు వచ్చి ముఖ్యమంత్రి, ఆమె సోదరుడు అయిన సీఎం జగన్‌ను ఇబ్బంది పెట్టాలన్నది కాంగ్రెస్, టీడీపీలోని కొందరి లక్ష్యం. కొద్ది రోజుల క్రితం బెంగుళూరు ఎయిర్ పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల మధ్య జరిగిన ఏకాంత చర్చలలో షర్మిల విషయం ప్రస్తావనకు వచ్చిందని రాజకీయవర్గాలలో ప్రచారం జరిగింది. ఈ ఉదంతంలో చంద్రబాబు, ఎల్లో మీడియా యజమాని ఒకరిని ప్రయోగించి ఉండవచ్చు. ఈ వ్యూహంలో భాగంగానే చంద్రబాబు తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచార సమయంలోనే తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఏపీ రాజకీయాలలో కూడా ట్విస్ట్ వస్తుందని చెప్పడం గమనార్హం. అప్పుడే కాంగ్రెస్ కుట్రలకు శ్రీకారం చుట్టిందన్న అనుమానం వ్యక్తం అయింది. అది నిజమే అన్నట్లుగా ప్రస్తుత పరిణామాలు సాగుతున్నాయి. ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కారణమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సీఎం జగన్ గతంలో సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయనను కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో కలిసి ఎన్ని కష్టాల పాలు చేసింది తెలిసిందే. ప్రస్తుతం ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకపోయినా, ఎన్నికలలో తెలుగుదేశంకు ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు అర్దం అవుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ షర్మిల, తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఛార్జిషీట్లో పెట్టడంపై కూడా నిపులు చెరిగారు. ఆ విషయాలను పక్కనబెట్టి ఆమె కాంగ్రెస్‌లో చేరడం కాస్త ఆశ్చర్యమే అయినా, రాజకీయాలలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఆ మాటకు వస్తే తెలుగుదేశంలో జరిగిన పరిణామాలను ఒక్కసారి నెమరువేసుకోండి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఇంటిలో చంద్రబాబు పెట్టిన చిచ్చు గురించి జ్ఞప్తి చేసుకోండి. రామారావును ఆయన అల్లుళ్లు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ తదితరులు ముఖ్యమంత్రి పదవి నుంచి కూలదోసి అవమానించారు. ఆ పరాభవం భరించలేక ఎన్టీఆర్ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనతో పోల్చితే షర్మిల కాంగ్రెస్‌లో చేరడం అన్నది పెద్ద విషయమే కాదు. ఆమె ఎప్పుడో ఏపీ రాజకీయాలకు దూరమై.. తాను తెలంగాణలో రాజకీయం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనసు మార్చుకుని ఆమె ఏపీలో కూడా చేస్తే చేసుకోవచ్చు. అందులో పెద్ద ఆక్షేపణ ఏమీ లేదు. ఆమె వైఎస్సార్సీపీలో ఉండి అన్నకు వ్యతిరేకంగా, అంటే చంద్రబాబు తన మామపై చేసినట్లు కుట్రలు చేస్తే తప్పు కానీ, ఆమె నేరుగా రాజకీయాలు నడుపుకుంటే విమర్శించవలసిన అవసరం లేదు. కాకపోతే కాంగ్రెస్, టీడీపీల కుట్రలో ఆమె పావు అవుతున్నారేమో అన్నదే డౌటు. చంద్రబాబు నాయుడు అప్పట్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి, తన కుట్రలో భాగస్వామిని చేసి, ఆ తర్వాత అవమానించి బయటకు పంపించారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణది అదే పరిస్థితి. ఆయన ఎమ్మెల్యేగా లేనప్పుడు మంత్రిని చేశారు. తీరా ఉప ఎన్నికలో గెలిచి ఎమ్మెల్యే అయినా మంత్రి పదవి ఇవ్వకుండా ఘోరంగా అవమానించారు. దాంతో ఆయన సొంతంగా అన్నాటీడీపీ పేరుతో పార్టీని పెట్టుకుని కొంతకాలం నడిపారు. చంద్రబాబు తన ఆధ్వర్యంలోని టీడీపీ ఓడిపోయిన తర్వాతే తిరిగి హరికృష్ణతో రాజీ చేసుకుని ఎంపీ పదవి ఇచ్చారు. అయినా హరికృష్ణ ఆయనను నమ్మేవారుకారు. అప్పట్లో హరికృష్ణ ఒక నక్కను పెంచుకునేవారట. దానికి ఎవరి పేరు పెట్టుకున్నారో తెలుసా! వద్దులే.. చెబితే బాగుండదు. ఇక జూనియర్ ఎన్టీఆర్‌కు ఎన్ని చేదు అనుభవాలు జరిగాయో చెప్పనవసరం లేదు. ఆ ఘట్టాలతో పోల్చితే షర్మిల ఉదంతం చాలా ఫెయిర్‌గా ఉన్నట్లు లెక్క. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి తనభర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి కాంగ్రెస్‌లో ఎందుకు చేరారు?. చంద్రబాబు ఇంటికి వెళ్లిన దగ్గుబాటిని అవమానించడం అవాస్తవమా!ప్రస్తుతం పురందేశ్వరి బీజేపీలో ఎందుకు ఉన్నారు. 2019లో దగ్గుబాటి వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన పోటీచేస్తే, పురందేశ్వరి బీజేపీ తరపున పోటీ చేశారు. పురందేశ్వరి సోదరుడు బాలకృష్ణ టీడీపీలో చంద్రబాబు వెంట ఎలా ఉన్నారు?. చంద్రబాబుకు అత్త అయ్యే లక్ష్మీపార్వతి వైఎస్సార్ కాంగ్రెస్‌లో క్రియాశీల పదవిలో ఉన్నారు. అవేవి తప్పు కానప్పుడు షర్మిల తన ఇష్టం వచ్చిన విధంగా రాజకీయం చేసుకుంటే తప్పు ఏమి ఉంటుంది?. ఇవన్ని ఎందుకు! చంద్రబాబు నాయుడిని తన సోదరుడు రామ్మూర్తి నాయుడు 1999లో ఎంత తీవ్రంగా విమర్శించింది, కాంగ్రెస్‌లో చేరి కుప్పంలో పోటీచేయడానికి సిద్దపడింది గుర్తు లేదా!. తాజాగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గాలు ఎలా గొడవలు పడుతున్నాయి? వారి కుటుంబంలో చంద్రబాబే చిచ్చుపెట్టారన్న విమర్శకు సమాధానం ఏమిటి?. అన్నదమ్ములు, సోదరి, సోదరులు, చివరికి తల్లి, కొడుకులు వేర్వేరు పార్టీలలో ఉన్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. రాజమాతగా పేరొందిన విజయరాజే సింధియా బీజేపీ నేత అయితే ఆమె కుమారుడు మాధవరావు సింధియా కాంగ్రెస్ నేతగా ఉండేవారు. ఇందిరాగాంధీ కోడళ్లు సోనియాగాందీ కాంగ్రెస్ నేత అయితే మేనకా గాంధీ బీజేపీ నేతగా ఉన్నారు. 1952లోనే తిరువూరు నియోజకవర్గంలో తండ్రి, కుమారులు పేట బాపయ్య, పేట రామారావులు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల తరపున పోటీ పడ్డారు. ఇప్పటికిప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే షర్మిల కాంగ్రెస్‌లోకి వచ్చినంత మాత్రాన ఆ పార్టీకి ఏదో ఊపు వస్తుందనుకుంటే భ్రమే అవుతుంది. సీఎం జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయలేరన్నది ఎక్కువ మంది భావన. షర్మిలవల్ల ఏవైనా ఓట్లు వస్తే అవి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే అవుతాయి కాని, ముఖ్యమంత్రి జగన్ అనుకూల ఓట్లు అవడానికి తక్కువ అవకాశం ఉంటుంది. ఏదో జగన్ చెల్లి వేరే పార్టీలో ఉన్నారని చికాకు పెట్డడానికి ప్రత్యర్ధులు ప్రయత్నించవచ్చు. అంతే తప్ప ఆమె వల్ల వైఎస్సార్సీపీకి నష్టం ఉండదు. చివరిగా ఒక మాట.. 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత భార్య భువనేశ్వరితో కలిసి చంద్రబాబు నాయుడు తన మామ ఎన్టీఆర్ ఇంటివద్దకు వెళితే ఆయన కనీసం వీరి ముఖాలు చూడడానికి ఇష్టం పడలేదు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వచ్చిన చెల్లెలు వైఎస్ షర్మిలను సీఎం జగన్ సాదరంగా స్వాగతించి రాజకీయాలతో సంబంధం లేకుండా మర్యాద చేసి పంపించారు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్. -
కాంగ్రెస్‌లో చేరిన షర్మిల
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు షర్మిల. న్యూఢిల్లీలోని AICC కార్యాలయానికి భర్త అనిల్‌తో వచ్చిన వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల.. కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు. షర్మిల ఏమన్నారంటే.. వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉంది ఈరోజు నుంచి కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ ఒక భాగం దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణలో పోటీ చేయలేదు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడం మా నాన్న కల కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పనిచేస్తా రాహుల్ జోడో యాత్ర వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆ యాత్రతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రాహుల్ జోడో యాత్ర ప్రజలతో పాటు నాలో కూడా విశ్వాసం నింపింది సెక్యులర్ పార్టీ కేంద్రంలో లేనందువల్లే మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి దేశంలో అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే కాంగ్రెస్‌లో చేరినందుకు గర్వపడుతున్నాను. ఇక, వైఎస్సార్టీపీని 2021 జులై 8వ తేదీన ప్రారంభించారు షర్మిల. 2021 అక్టోబర్‌లో చేవెళ్ల నుంచి పాదయాత్ర చేశారు షర్మిల. ఈరోజు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. షర్మిల చేరిక కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి కొందరు నేతలు హాజరయ్యారు. Senior leader from Andhra Pradesh YS Sharmila ji joins the INC in the presence of Congress President Shri @kharge, Shri @RahulGandhi and General Secy (Org.) Shri @kcvenugopalmp at the AICC HQ in New Delhi. pic.twitter.com/LqMvqqqwCm — Congress (@INCIndia) January 4, 2024 AICC కార్యాలయంలో చేరిక అనంతరం సోనియా నివాసానికి వెళ్లారు షర్మిల, అనిల్. సోనియాను కలిసి పార్టీలో స్వాగతించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ బలోపేతం కోసం పని చేయమని సోనియా చెప్పారని, దేశమంతా రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా.. పార్టీ కోసం పని చేస్తానని, మీడియా అడిగే అన్ని ప్రశ్నలకు ఒకటి రెండు రోజుల్లో అన్నిటికీ సమాధానం చెప్తానని, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ బరిలో దిగుతానని చెప్పారు. -
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: షర్మిల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని శుక్రవారం ఆమె మీడియాకు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. అందుకే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాము నిర్ణయించామని చెప్పారు. కాంగ్రెస్ గెలుపు అవకాశాలను అడ్డకోకూడదనే ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులన్నా, కార్యకర్తలన్నా తనకు అపారమైన గౌరవం ఉందని, ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసినప్పుడు... తనను కుటుంబ సభ్యురాలిగా వారు చూశారని ఆమె తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నామని... తమ పార్టీ తరపున పలువురిని ఎన్నికల బరిలో నిలపాలని తాను అనుకున్నానని చెప్పారామె. తాను ఎమ్మెల్యేగా గెలిచి, అసెంబ్లీలో అడుగు పెడతాననే పూర్తి నమ్మకం తనకు ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్న ఆమె.. ఈ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులందరూ అర్థం చేసుకోవాలని కోరారు. -
వైఎస్సార్టీపీకి బైనాక్యులర్ గుర్తు కేటాయింపు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఆ పార్టీకి బైనాక్యులర్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వైఎస్సార్టీపీ బైనాక్యులర్ గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగనుంది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని వైఎస్ షర్మిల ప్రకటించారు. ఇది కూడా చదవండి: ఫైనల్ స్టేజ్‌కు కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. ఐదు స్థానాలపై టెన్షన్! -
TS: బీఆర్ఎస్లోకి ప్రజాగాయకుడు సోమన్న
సాక్షి, హైదరాబాద్: వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఝలక్ ఇస్తూ.. ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్లో చేరున్నారు. ఆయన గులాబీ కండువా కప్పుకోవడం ఖరారు అయ్యింది. ఈ మేరకు చేరికకు ముందర ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును మర్యాదపూర్వకంగా కలిశారాయన. సోమన్నను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేటీఆర్.. సదరు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. రెండేళ్ల కిందట ఆయన వైఎస్సార్టీపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన షర్మిల వెంట నడుస్తూ వస్తున్నారు. ఏపూరి సోమన్న నిన్నటి దాకా వైఎస్సార్టీపీ తరపున తన సొంత నియోజకవర్గం తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో వైఎస్సార్టీపీకి ఝలక్ ఇస్తూ.. టిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ సమక్షంలో ఇవాళ కేటీఆర్‌ను కలిశారు. సోమన్న అంతకు ముందు ఆయన కాంగ్రెస్‌లోనూ పని చేశారు. ఆ టైంలో రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా నడుచుకున్నారు. రేవంత్ పాదయాత్రలోనూ పాల్గొని సోమన్న తన గళం వినిపించారు. కాంగ్రెస్‌ను వీడి.. వైఎస్సార్ టీపీలో చేరే సమయంలో ‘‘నియంతృత్వ భావజాలం ఉన్న ప్రభుత్వాన్ని(బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి..) ఎదుర్కొనేందుకే వైఎస్సార్ టీపీలో చేరుతున్నాన’’ని ప్రకటించారాయన. ఇక సోమన్న పాటలకు తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. -
షర్మిల పార్టీపై రేపే నిర్ణయమా?
గురువారం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలిసిన వైఎస్ షర్మిల రేపు(శనివారం) కీలక నిర్ణయం ప్రకటించనున్నట్టు సమాచారం. రెండేళ్లుగా తాను చేసిన పోరాటాలను ఈ సందర్భంగా షర్మిల సోనియాకు వివరించినట్టు YSRTP వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఓ ట్వీట్‌ను కూడా పార్టీ చేసింది. Yesterday,Hon’ble Party President @realyssharmila garu met Hon’ble Sonia ji & @RahulGandhi ji and had a very constructive discussion about state of Telangana and the problems faced by its people.They had an elaborate discussion on the need to bring a positive change in Telangana. pic.twitter.com/yXeT77AgrF — YSR Telangana Party (@YSRTelangana) September 1, 2023 తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి ఏ నిర్ణయం అయినా తీసుకుంటామని ఇప్పటికే సంకేతాలిచ్చింది షర్మిల. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా YSRTPని విలీనం చేస్తారని ప్రచారం జరుగుతోంది. వైఎస్ వర్థంతి సందర్భంగా రేపే పార్టీ విలీనం చేస్తుందని కొందరు చెబుతున్నారు. అయితే రాహుల్ గాంధీ షెడ్యుల్ బిజీగా ఉండటంతో విలీనం ప్రక్రియ వాయిదా పడవచ్చని మరికొందరు చెబుతున్నారు. తాను తెలంగాణను ఎంచుకున్నానని, తెలంగాణలోనే రాజకీయం చేస్తానని ఇటీవల కాంగ్రెస్ అధిష్టానానికి షర్మిల స్పష్టం చేసినట్టు తెలిసింది. అలాగే షర్మిల రాజకీయ భవిష్యత్‌పై సోనియా హామీ ఇచ్చినట్టు, జాతీయస్థాయిలో ఓ కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. చదవండి: గాంధీ మార్గంలోనే తెలంగాణ సాధించా: సీఎం కేసీఆర్ షర్మిలతో చర్చలకు సంబంధించి ఆపరేషన్ అంతా బెంగుళూరు కేంద్రంగా డీకే శివకుమార్ చేపట్టినట్టు కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. షర్మిల రావడం ఇష్టం లేని నాయకులతో చర్చించే బాధ్యత కూడా శివకుమార్‌కే పార్టీ అప్పగించినట్టు సమాచారం. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో శివకుమార్ చర్చించిన్నట్టు సమాచారం. ఈ చర్చల్లో పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా పాల్గొన్నట్టు తెలిసింది. ఈ సమావేశం కోసమే రేవంత్ రెడ్డి బెంగళూరు వెళ్లారని సమాచారం. అయితే మొదటి నుంచి తెలంగాణలో షర్మిల రాజకీయానికి విముఖత చూపుతున్న రేవంత్ రెడ్డి.. తన అభ్యంతరాలను ఈ సమావేశంలో తెలిపినట్లు కనిపిస్తోంది. అవసరమైతే ఎన్నికల తర్వాత షర్మిలను చేర్చుకోవాలని అధిష్టానానికి సూచించిట్టు సమాచారం. ఎన్నికలకు ముందే చేర్చుకుంటే కేసీఆర్‌కు అస్త్రంగా మారొచ్చని, పైగా తాను పాలేరులో పోటీ చేస్తానని ఇప్పటికే షర్మిల ప్రకటించిందని రేవంత్ అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. అసలు షర్మిలకు చెక్ పెట్టేందుకే తుమ్మలను రేవంత్ తెరపైకి తెచ్చినట్టు కాంగ్రెస్‌లో ప్రచారం ఉంది. -
సోనియా, రాహుల్ గాంధీని కలిశాను: షర్మిల
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. గురువారం ఉదయం సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ఆమె బ్రేక్‌ఫాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే రాజకీయపరమైన చర్చ జరిగినట్లు స్పష్టమవుతోంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలిశాను. చాలా నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా నిరంతరం పనిచేస్తా. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది అని భేటీ అనంతరం బయటకు వచ్చిన ఆమె మీడియాతో తెలిపారు. ఈ సమావేశంలో సోనియా, రాహుల్‌తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. షర్మిల వెంట ఆమె భర్త అనిల్ కూడా ఉన్నారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనం గురించి గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఇంతకుముందు ఆమె పలువురు కాంగ్రెస్ నేతలను కలవడంతో పాటు హస్తిన వెళ్లి పెద్దల్ని కలిసి వచ్చారు. ఆ మధ్య ఢిల్లీ నుంచి తిరిగి వస్తూ.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డితో పాటు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ఆమె కనిపించారు. ఆ టైంలో షర్మిలను కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు కూడా. అయితే విలీన ప్రస్తావనపై షర్మిల మాత్రం పెదవి విప్పలేదు. అయితే తాజా చర్చలతో ఆ ప్రక్రియలో ముందడుగు పడినట్లయ్యింది. ఇదీ చదవండి: నోటరీ ‘క్రమబద్ధీకరణ’పై సర్కారుకు నోటీసులు -
లోటస్‌పాండ్‌లో వైఎస్ షర్మిల దీక్ష విరమణ
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై నిరసనగా ఉదయం నుంచి లోటస్ పాండ్‌లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షకు దిగారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగించిన షర్మిలకు గజ్వేల్ ప్రజలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కాగా, వైఎస్ షర్మిలను పోలీసులు శుక్రవారం ఉదయం హౌజ్ అరెస్ట్ చేశారు. అయితే, షర్మిల నేడు సిద్దిపేటలోని గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. కాగా, జగదేవ్‌పూర్ మండలంలోని తీగుల్ గ్రామంలో షర్మిల పర్యటించాల్సి ఉండగా.. శుక్రవారం ఉదయమే పోలీసులు ఆమె నివాసానికి చేరుకున్నారు. పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు తనను అడ్డుకున్న పోలీసులకు హారతిచ్చి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అంటూ షర్మిల మండిపడ్డారు. దళితబంధులో అవకతవకలు జరిగాయని ఆమె ధ్వజమెత్తారు. చదవండి: తెలంగాణలో బీజేపీ దూకుడు.. ప్లాన్ ఫలించేనా? -
కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. షర్మిల మౌనం!
హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని ఊహాగానాలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే కాంగ్రెస్ కీలక నేతలతో భేటీ కావడం.. రాహుల్ గాంధీకి బర్త్‌డే విషెస్‌తో పాటు లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత శుభాకాంక్షలు తెలియజేయడం.. తాజాగా హస్తిన పర్యటనతోనూ దాదాపుగా సంకేతాలు ఇచ్చేశారు. ఈ క్రమంలో.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే లాభమే జరుగుతుందని చెబుతూనే.. ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ నిరవధిక వాయిదా పడడంతో.. హైదరాబాద్ చేరుకున్న ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో షర్మిల సైతం ఆయన వెంట ఉండడం గమనార్హం. ‘‘షర్మిల తెలంగాణకు వస్తే తప్పేంటి?. బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లారు కదా!. షర్మిలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నాం. వైఎస్సార్ కూతురిగా ఆమెకు ఎప్పుడైనా కాంగ్రెస్‌లోకి ఆహ్వానం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా షర్మిల పాదయాత్ర చేసింది. ఆమె కాంగ్రెస్‌లోకి వస్తే లాభమే జరుగుతంది. షర్మిల వల్ల 4 ఓట్లు వచ్చినా.. 400 ఓట్లు వచ్చినా లాభమే. ఒకరినొకరు కలుపుకుని బలపడాలన్నది కాంగ్రెస్ ఉద్దేశం. అందరినీ కలుపుకుని పోవాల్సిన బాధ్యత పార్టీది’’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. షర్మిల మౌనం.. మరోవైపు ఢిల్లీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల. ఈ క్రమంలో కోమటిరెడ్డితో పాటు ఉన్న ఆమెను మీడియా స్పందన కోరగా.. ఆమె మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే.. ఢిల్లీ పరిణామాలపై తర్వాత ఆమె ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలున్నాయని ఆమె వర్గీయులు చెబుతున్నారు. Warm congratulations to Sree @RahulGandhi ji on being reinstated as the Member of Parliament. While your unwavering grit continues to rekindle hopes among millions of people across the nation, justice took its course and delivered a verdict that gladdened many hearts. I am now… — YS Sharmila (@realyssharmila) August 8, 2023 ఇదీ చదవండి:మంత్రి శ్రీనివాసగౌడ్‌పై కోర్టు ఆగ్రహం -
లక్షలోపు రుణమాఫీ ఉత్తమాటేనా?
సాక్షి, హైదరాబాద్: రైతులందరికీ రూ. లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ 2014, 2018 ఎన్నికల్లో హామీనిచ్చి ఓట్లు వేయించుకున్నారని, అధికారంలోకి వచ్చాక ఆ హామీ ఉత్తమాటగానే మిగిలిపోయిందా అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే లక్షణం సీఎం కేసీఆర్‌కి లేదన్నది స్పష్టమవుతోందన్నారు. రైతులకు విడతల వారీగా రూ.90 వేలలోపు రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం రూ.37 వేల లోపు రుణాలు ఉన్న వారికే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని గుర్తు చేశారు. 5.66 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన ద్రోహంతో రాష్ట్రవ్యా ప్తంగా దాదాపు 31లక్షల మంది రైతులు బ్యాంకర్ల వద్ద తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నా రు. కేసీఆర్ ఇచ్చిన హామీని వెంటనే నిలబె ట్టుకోవాలని డిమాండ్ చేశారు. -
రాహుల్ గాంధీకి షర్మిల పుట్టినరోజు శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఎందులోనూ విలీనం చేయబోనని ప్రకటిస్తూ వస్తున్న ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారామె. ఇవాళ(జూన్ 19) రాహుల్ గాంధీ 53వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్లో.. రాహుల్ గాంధీ గారు.. మీకు సంతోషకరమైన, అద్భుతమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మీ పట్టుదల, సహనంతో ప్రజలకు స్ఫూర్తినిస్తూ.. మీ హృదయపూర్వక ప్రయత్నాల ద్వారా వాళ్లకు సేవ చేస్తూ ఉండండి. గొప్ప ఆరోగ్యం, ఆనందంతో సమృద్ధిగా మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని శుభాకాంక్షలు తెలియజేశారు. Wishing Shri @RahulGandhi ji a very happy and a wonderful birthday. May you continue to inspire the people with your perseverance and patience, and serve them through your sincere efforts. Wishing you great health, happiness, and success in abundance. — YS Sharmila (@realyssharmila) June 19, 2023 తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతరేకంగా ఆమె 3వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు కలిసిరావాలంటూ విపక్షాలకు సైతం ఆమె పిలుపు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ టీపీని ఆమె విలీనం చేస్తారని, ఈ మేరకు సోనియాగాంధీతోనూ ఆమె చర్చలు జరిపారంటూ ఆ మధ్య కథనాలు వెలువడ్డాయి. ఈలోపు ఆమె కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను కలవడం, పార్టీలోని కీలక సభ్యులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల హామీతోనే ఆమె కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాల నడుమ తాజా పరిణామం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదీ చదవండి: పీసీసీ సర్వే.. ట్విటర్లో రాములమ్మ! -
పాలమూరు ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టుకు తట్టెడు మట్టి మోయని సీఎం కేసీఆర్.. తానే జలకళ తెచ్చి నట్టు గప్పాలు కొట్టుకుంటున్నాడని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. కష్టం ఒకరిదైతే.. ప్రచారం మరొకరిదనే సామెత ఆయనకు సరిపోతుందని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ చెబుతున్న 20 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చే ప్రాజెక్టులకు నాడు మహానేత వైఎస్సార్ జలయజ్ఞం కింద వేసిన పునాదులేనని స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. మూడేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి అని చెప్పి కమీషన్లు దండుకు న్నారని ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే.. పదేళ్ల పాలనలో ఒక్క ఎకరాకు అయినా అదనంగా సాగునీరు ఇచ్చారా అని ఆమె నిలదీశారు. 10 లక్షల ఎకరాలు అని చెప్పి 10 ఎకరాలు తడిపింది లేదని నిందించారు. మహానేత హయాంలో మైగ్రేషన్ వద్దని ఇరిగేషన్ చేస్తే.. నేడు ఇరిగేషన్ పక్కన ఎట్టి మైగ్రేషన్ వైపే మళ్లేలా కేసీఆర్ పాలన సాగుతోందని ధ్వజమె త్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు అయినా వలసలు ఆగలేదని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. -
రైతులను నిండా ముంచి.. రైతు దినోత్సవమా!
సాక్షి, హైదరాబాద్: రైతులను నిండా ముంచిన కేసీఆర్ ఓట్ల కోసం ‘రైతు దినోత్సవం’జరుపుతున్నారంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రైతు దినోత్సవం’కంటే ‘రైతు దగా దినోత్సవం’అంటేనే బాగుంటుందని ట్విట్టర్ వేదికగా ఆమె విమర్శించారు. తొమ్మిదేండ్లలో 9వేల మంది రైతులను పొట్టన పెట్టుకున్నారని, అసలు ఏం సాధించారని ఈ రైతు దినోత్సవాలని షర్మిల నిలదీశారు. ఎకరాకు ముష్టి రూ.5వేల రైతుబంధు ఇచ్చి.. వందల ఎకరాలున్న భూస్వాములకు రూ.కోట్లు చెల్లిస్తున్నారని ఆరోపించారు. వడ్లను కొనకుండా ముప్పుతిప్పలు పెట్టి, కల్లాల్లోనే రైతుల గుండెలు ఆగేలా చేశారని విమర్శించారు. వ్యవసాయం అంటే మహానేత వైఎస్సార్ కాలంలో పండుగని, కానీ కేసీఆర్ కాలంలో దండగలా మారిందని వ్యాఖ్యానించారు. పంట నష్టపోయిన 15 లక్షల ఎకరాలకు వారం రోజుల్లో పరిహారం ఇవ్వాలని, మిగిలిపోయిన 30 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. -
ఉద్యమ ఆకాంక్షలు కనుమరుగు: షర్మిల
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రంలోనూ ఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలు కనుమరుగవుతున్నాయని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆమె.. పార్టీ కార్యకర్తలకు మిఠాయిలు, సకినాలు పంచిపెట్టారు. అనంతరం మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగం, సబ్బండ వర్గాల పోరాట ఫలితం ‘తెలంగాణ‘అని, అది కూడా నీళ్లు, నిధులు, నియామకాల కోసం మూడు కోట్ల మంది ఏకమై కొట్లాడితే వచ్చిందని అన్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే మళ్లీ మరో పోరాటం జరగాలన్నారు. ఈ సర్కారు మారితేనే బతుకులు మారుతాయన్నారు. వ్యవసాయం పండుగ కావాలన్నా, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ అమలు కావాలన్నా వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలని స్పష్టం చేశారు. నిధులు పక్కదారి పడుతుంటే, తెలంగాణ సంపద కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయితే.. ప్రశ్నించే గొంతుకగా తమ పార్టీ నిలిచిందన్నారు. రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేస్తే ఎదురు నిలిచి, ప్రశ్నించిందని గుర్తుచేశారు. -
YS Sharmila: డీకే శివకుమార్‌తో వైఎస్ షర్మిల భేటీ
బెంగళూరు: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిశారు. సోమవారం ఉదయం బెంగళూరు వెళ్లిన ఆమె.. ఆయన నివాసంలోనే మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం దిశగా కాంగ్రెస్ పార్టీని నడిపించినందుకుగానూ శివకుమార్‌ను పుష్ఫ గుచ్చం ఇచ్చి వైఎస్ షర్మిల అభినందించినట్లు సమాచారం. అయితే ఈ భేటీ సారాంశంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌ను విలీనం చేయాలంటూ సోనియా గాంధీ నుంచి షర్మిలకు ప్రతిపాదన వచ్చిందన్న ఊహాగానాలు ఆ మధ్య వినిపించాయి. అయితే వాటిని ఆమె కొట్టిపారేశారు. కర్ణాటకలో తిరుగులేని విజయాన్ని అందించనప్పటికీ డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు పీసీసీ చీఫ్ పదవిలో కొనసాగడంతోనే సరిపెట్టుకున్నారాయన. ఇక తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సంఘటితం కావాలంటూ ప్రతిపక్షాలకు షర్మిల పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె డీకే శివకుమార్‌తో భేటీ కావడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: కాంగ్రెస్ కుంపటిపై హస్తినలో హీట్ -
YS Sharmila Deeksha: నేను ఎందుకు వెనక్కి తగ్గాలి?: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ ఆధ్వర్యంలో ‘టీ–సేవ్’ నిరుద్యోగ దీక్షను ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం ఇందిరాపార్కు వద్ద చేపట్టారు. ఈ దీక్షలో ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, ‘‘నేను ఎందుకు వెనక్కి తగ్గాలి. రాజకీయాలంటేనే చీదరించుకునే దానిని.. మాకు పోలీసులతో గొడవ పెట్టుకోవడానికి ఏం అవసరం. తెలంగాణ యువత కోసం పోరాడుతున్నా. నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తేవడానికి వైఎస్ హయాంలో పోలీసులు పనిచేశారు. సెల్ఫ్ డిఫెన్స్‌లో చేశాను తప్ప.. పోలీసులను కించపరచాలని కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘బంగారు తెలంగాణ ఎక్కడ?. కల్వకుంట్ల కుటుంబం బంగారు తెలంగాణగా మారింది. సిట్ విచారణ కొండను తవ్వి ఎలుకను పట్టే విధంగా ఉంది. సిట్ విచారణలో సూత్రధారులను వదిలేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ప్రభుత్వ శాఖల్లో సమాచారం తీసుకోవడం అంత సులభమా?. ఐపీ అడ్రస్, పాస్వర్డ్ తెలిస్తే చాలా?. కేటీఆర్ తనకేమీ సంబంధం అంటున్నారు. ఐటీశాఖ బాధ్యతలు ఏంటో మీకు తెలుసా?. ఐటీ చట్టం-2000 వరకు అన్ని శాఖల్లో వాడే కంప్యూటర్లకు ఐటీ శాఖదే బాధ్యత. 2018లో టీఎస్పీఎస్సీలో కంప్యూటర్లు కొన్నారు.. ఐటీశాఖ సైబర్ సెక్యూరిటీ ఆడిట్ ఎప్పుడైనా చేసిందా?’’ అని షర్మిల ప్రశ్నించారు. ‘‘సైబర్ సెక్యూరిటీ ఆడిట్ జరిగి ఉంటే పేపర్ లీకేజీ జరిగేది కాదు. సిట్ అధికారులను ప్రగతిభవన్ గుప్పెట్లో పెట్టుకున్నారు. తీగలాగితే ఐటీ డొంక కదులుతుంది. కేటీఆర్‌ను కాపాడటానికే సిట్ ప్రయత్నం చేస్తుంది. దమ్ముంటే సీబీఐ దర్యాప్తు కోరండి. కేసీఆర్‌కు 10 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రం పంపుతున్నా’’ అని షర్మిల అన్నారు. చదవండి: TS: వాతావరణశాఖ హెచ్చరిక.. ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన -
ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత పైకి వస్తా: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో అరెస్ట్ అయిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనను ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత పైకి వస్తానని పేర్కొన్నారు.ఎందుకు అకారణంగా తనను రోజుల తరబడి హౌజ్ అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. బోనులో పెట్టినా పులి..పులే.. నేను రాజశేఖర్‌రెడ్డి బిడ్డనని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అరాచకాలు ఇంక ఎంతకాలం సహించాలని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పోలీసులు బెదిరించారని.. తన ఆత్మరక్షణ కోసమే మగ పోలీసులను నెట్టివేసినట్లు పేర్కొన్నారు. ఎవరిమీద చేయి చేసుకోలేదని అన్నారు. పోలీసులు ఏ అధికారం ఉందని తనను హౌస్ అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సిట్ ఆఫీస్‌కు సామాన్యుడికి పోయే పరిస్థితి లేదా? అని నిలదీశారు. ఇక్కడున్నది రాజశేఖర్‌రెడ్డి బిడ్డ.. భయపడటం తెలీదన్నారు. ‘రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటే కేసీఆర్ భయపడుతున్నారు. అందుకే నా మీద ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు. 9 ఏళ్లలో కేసీఆర్ ఏం సాధించారు. కేసీఆర్‌కు పరిపాలన చేతనైందా. అవినీతి చేయడం చేతనైంది. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కేసీఆర్‌కు చేతనైంది. కేసీఆర్ ఎప్పుడైనా సెక్రటేరియట్‌కు వెళ్లారా? కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. కొడుకు రియల్ ఎస్టేట్, కుమార్తె లిక్కర్‌స్కాం, చేయడం సాధ్యమైంది. వేలకోట్ల అవినీతి సొమ్ము సంపాదించడమే తెలిసింది. తాలిబన్లలాగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఇది అప్ఘనిస్తాన్ అనకపోతే ఏమనాలి. వైఎస్సార్టీపీకి నాయకురాలు ఒక మహిళ అని పోలీసులకు తెలియదా? పోలీసులు నాపై పడి దాడి చేసే ప్రయత్నం చేశారు. మహిళ అన్న ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరించారు. నాపై మళ్లీ దాడి చేస్తారనే ఉద్ధేశంతోనే పోలీసులను తోసేశాను. పోలీసులు కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నన్ను చూడటానికి అమ్మ వస్తే అది తప్పా? అమ్మతో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.’ అని షర్మిల పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ సర్కార్ వినూత్న ఆలోచన.. చదువుకుంటూనే సంపాదన! -
వైఎస్ షర్మిలకు షరతులతో కూడిన బెయిల్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల బెయిల్ మంజూరు అయ్యింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో ఆమెను సోమవారం అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె నిన్ననే బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అయితే.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోరిన కోర్టు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఈ ఉదయం పిటిషన్‌పై విచారణ కొనసాగగా.. షర్మిల కొట్టిందన్న వీడియోలను మాత్రమే పదే పదే చూపిస్తున్నారని, కానీ అంతకు ముందు ఆ తర్వాత ఏం జరిగిందనేది మాతంర చూపించడం లేదని ఆమె తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. చివరకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్టీపీ తరపున రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు షర్మిల పిలుపు ఇచ్చారు. షర్మిలను పరామర్శించిన విజయమ్మ చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్ షర్మిలను.. వైఎస్ విజయమ్మ మంగళవారం పరామర్శించారు. విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా? అని విజయమ్మ నిలదీశారు. ‘‘పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేశారు. షర్మిల పాదయాత్రను కూడా అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే స్వేచ్ఛ కూడా షర్మిలకు లేదా? ప్రజల కోసమే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ ఆశయ సాధన కోసమే షర్మిల పోరాటం చేస్తోంది. ప్రభుత్వాలను ప్రశ్నించడమే మా తప్ప. ప్రశ్నించే వారిని ఇంకా ఎంతకాలం అణచివేస్తారు? అని విజయమ్మ పేర్కొన్నారు. ఇదీ చదవండి: నాకు స్వేచ్ఛ లేదా?.. వైఎస్ షర్మిల -
‘ఆరోగ్య తెలంగాణ పేరుతో అనారోగ్య తెలంగాణగా మార్చారు’
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణ చేశామంటున్న దొరగారు కంటికి, పంటికి హస్తినకు ఎందుకు పోతున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఆరోగ్య తెలంగాణ అంటే ఒక్కో బెడ్డు మీద ఇద్దరు,ముగ్గురిని పడేయడమా.. 104 పథకాన్ని మూసేయడమా.. లక్షమందికి ఒక డాక్టర్, 10వేల మందికి ఒక నర్సు ఉండటమా.. కుని ఆపరేషన్లతో బాలింతలను పొట్టన పెట్టుకోవడమా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం JHS, EHS స్కీములను పాతరేయడంతో పాటు పేదోడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీకి నిధులు ఎగ్గొడుతోందంటూ విమర్శించారు. కేసీఆర్ హామీ ఇచ్చిన జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేదు.. రాజధానిలో నలుదిక్కులా హెల్త్ హబ్బులు లేవని, హెల్త్ టవర్ లేదని ఎద్దేవా చేశారు. ఎలుకలు కొరికి రోగులు చనిపోతున్నా పట్టింపులేదని, పరికరాలు, యంత్రాలు పనిచేయకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. దవాఖాన్లలో సిబ్బంది లేకపోయినా పట్టించుకోరు.. ఆసుపత్రి భవనాలు పాతబడి, పెచ్చులూడుతున్నా సోయి లేని ప్రభుత్వం ఇదేనంటూ ఫైర్ అయ్యారు. ఆరోగ్య తెలంగాణ పేరుతో అనారోగ్య తెలంగాణగా మార్చారని వ్యంగాస్త్రాలు సంధించారు. జబ్బు చేస్తే అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకునేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. -
ప్రతిపక్ష నాయకులకు వైఎస్ షర్మిల లేఖలు..
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాడేందుకు కలిసి రావాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రతిపక్షాలకు లేఖలు రాశారు. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి నిరుద్యోగుల కోసం పోరాడే సమయం ఆసన్నమైందని ఆమె పిలుపునిచ్చారు. ఈ పోరాటానికి జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఇప్పుడు చారిత్రక అవసరమని తెలిపారు. ఈ మేరకురేవంత్ రెడ్డి, బండి సంజయ్, కాసాని జ్ఞానేశ్వర్, కోదండరాం, అసదుద్దీన్ ఓవైసీ, మందకృష్ణ మాదిగ, తమ్మినేని వీరభద్రం, కూనంనేనీ సాంబశివరావు, ఎన్.శంకర్ గౌడ్లకు లేఖలు రాశారు. ప్రముఖ పార్టీలకు ముఖ్య ప్రతినిధులుగా ఉంటూ.. ప్రజాసమస్యలపై ఎల్లప్పుడూ పోరాడుతున్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉండి చేస్తున్న మీ పోరాటాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేడు తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత తీవ్రమైన నిరాశ, నిస్పృహలలో చిక్కి, గుండెలు మండి, కడుపుకాలి ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఈ నియంత, మోసపూరిత ప్రభుత్వం చేసిన ద్రోహానికి కొన్ని తరాలు మొత్తం ఆహుతి అవబోతున్నాయి. తొమ్మిదేండ్లు నోటిఫికేషన్లు విడుదల చేయకుండా, భర్తీలు పూర్తిచేయకుండా కేసీఆర్ సర్కారు చేస్తున్న నీచ నాటకాలు మీకు తెలియనిది కాదు. ఇప్పుడు పేపర్ లీకేజీ స్కాంతో విడుదల చేసిన నోటిఫికేషన్లపై కూడా ఆశ అడుగంటిపోయింది. ఈ కఠిన సమయంలో ప్రతిపక్ష పార్టీలన్నీ వారి వారి రాజకీయ విభేదాలను మరిచి, చేతులు కలిపి ఒక ఉమ్మడి కార్యాచరణను రూపొందించి మోసపోయిన నిరుద్యోగులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఒక జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) అత్యవసర పరిస్థితిగా ఏర్పాటు చేసి పోరాటాల వ్యూహాలన్నీ అమలుపర్చాలి. ఒక తాటిపైకి వచ్చి, చేతులు కలిపి తెలంగాణ యువత కోసం నిలబడాల్సిన సరైన సమయం ఇదే. ఏ యువకులు, విద్యార్థులు త్యాగాలతో తెలంగాణ రాష్ట్ర కాంక్ష నెరవేరిందో, ఏ యువత తమ రక్తాన్ని చిందించి తెలంగాణ తల్లికి అభిషేకం చేసారో, ప్రాణాలను నైవేద్యంగా అర్పించుకున్నారో, వారికోసం మన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడాల్సిన సమయం ఇదే. తెలంగాణ భవిత కోసం, యువత కోసం కలిసి నడుద్దాం, నిలిచి పోరాడదాం’ అని వైఎస్షర్మిల తన లేఖలో పేర్కొన్నారు. -
నేనామైనా క్రిమినల్నా.. నాపై ఎందుకింత కక్ష: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్ వ్యవహారంలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, పేపర్ లీక్ నేపథ్యంలో వైఎస్సార్టీపీ శ్రేణులు టీఎస్పీఎస్సీ ఆఫీసు ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. పోలీసులు, వైఎస్సార్టీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం, షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పేపర్ లీక్‌లో పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం జరుగుతోంది. నేను బయటకు రాకుండా హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని బయటకు వచ్చాను. ఒక హోటల్ రూమ్‌లో తలదాచుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాకు లుక్ అవుట్ ఆర్డర్ నోటీసులు ఇచ్చారు. నేను క్రిమినల్నా అని ప్రశ్నించారు. -
హైదరాబాద్: వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత
-
వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంటివద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రి సందర్శన కోసం వెళ్లేందుకు యత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఆమెకు వాగ్వాదం చోటు చేసుకుంది. అంతకు ముందు షర్మిలను బయటకు రానివ్వకుండా షర్మిలను హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బయటకు వచ్చేందుకు యత్నించిన వైఎస్ షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోగా, ఆమె కిందపడినట్లు తెలుస్తోంది. -
జంతర్ మంతర్వద్ద వైఎస్ షర్మిల ధర్నా
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని, అయినా ఇప్పటివరకు దీనిపై ఎటువంటి విచారణ చేపట్టలేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షరి్మల ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై పోరాడేందుకు ఎంపీలు కూడా తనతో కలసి రావాలని ఆమె సోమవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ మంగళవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనుందని వెల్లడించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఎస్సారెస్పీ ఫేజ్–2, ఎల్లంపల్లి, వరద కాలువ, దేవాదుల, మిడ్‌మానేర్ లాంటి ప్రాజెక్టులు నీళ్లు ఇస్తుంటే అవి కాళేశ్వరం నుంచి వస్తున్న ట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఒక మహిళ బతుకమ్మ ముసుగులో లిక్కర్ స్కాంలో ఇరుక్కుంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మె ల్యేలు సిగ్గు లేకుండా మద్దతిస్తున్నారని మండిపడ్డారు. -
కవితకు తప్ప ఎవరికీ రక్షణ లేదు: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. సర్కార్‌కు వ్యతిరేకంగా, తెలంగాణ మహిళలకు సంఘీభావంగా దీక్షకు దిగిన వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా.. ట్యాంక్ బండ్‌పై బుధవారం ఆమె మౌన దీక్ష చేపట్టారు. అయితే.. దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అంతకు ముందు.. రాణి రుద్రమ దేవి విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించి దీక్షకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా.. ఆమె కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఆమె ఏమన్నారంటే.. ‘‘తెలంగాణ రాష్ట్రం అత్యాచారాల్లో నెంబర్ వన్. మహిళలను ఎత్తుకుపోవడంలో నెంబర్ వన్. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. మహిళలకు భద్రత కల్పిస్తున్నాం అని కేసీఆర్ సర్కార్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. యేటా 20 వేల అత్యాచారాలు జరుగుతున్నాయి. కేసీఆర్‌కి మహిళల భద్రత పట్ల చిత్త శుద్ది లేదు. కేసీఆర్ దృష్టిలో మహిళలు ఓట్లు వేసే యంత్రాలు. మహిళ భద్రతకు చిన్న దొర కేటీఆర్ భరోసా యాప్ అని చెప్పాడు. ఎక్కడుంది భరోసా యాప్?. నేను ఫోన్ లో చెక్ చేశా.. ఎక్కడ కనపడలేదు యాప్. కేవలం మాటలకి మాత్రమే చిన్న దొర,పెద్ద దొర. తెలంగాణ రాష్ట్రం మహిళలకు ఒక ల్యాండ్ మైన్ లా తయారయ్యింది. మహిళల పట్ల ఎక్కడ ఏ బాంబ్ పేలుతుంది తెలియదు. .. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలే అత్యాచారాలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారామె. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో వేల కేసులు నమోదు అయ్యాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో మంది అత్యాచారాలకు పాల్పడ్డారు. చిన్న దొర కేటీఆర్ నియోజక వర్గంలో కూడా మైనర్లపై అత్యాచారం జరిగితే దిక్కు లేదు. హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలు అత్యాచారం జరిగితే దిక్కు లేదు. ‘ఆడపిల్లల పై కన్నెత్తి చూస్తే గుడ్లు పీకుతా’.. అని చెప్పిన కేసీఅర్ ఎంత మంది గుడ్లు పీకారు. స్వయంగా మంత్రుల బంధువులు రేపులు చేసినా దిక్కు లేదు. కేసీఆర్‌కి ఆడవాళ్లు అంటే వివక్ష. కేసీఆర్‌కి ఆడవాళ్లు అంటే కక్ష. దళిత మహిళలపై దాడులు చేస్తున్నారు. లాకప్ డెత్ లు చేస్తున్నారు. తెలంగాణలో ఓకే ఒక్క మహిళకు రక్షణ ఉంది. ఆమె కల్వకుంట్ల కవిత. మిగతా మహిళలంటే కేసీఆర్‌కి లెక్కే లేదు. ఏకంగా రాష్ట్ర ప్రథమ పౌరురాలైన గవర్నర్ మీదనే అసభ్య పదజాలం వాడుతున్నారు. గవర్నర్‌కే గౌరవం ఇవ్వడం లేదు. రాష్ట్రంలో మహిళా కమీషన్ ఒక డమ్మీ. స్వయంగా నేనే ఫిర్యాదు చేసినా దిక్కు లేదు. సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగడితే నోటి కొచ్చినట్లు తిట్టారు నన్ను. ఇదేనా రాష్ట్రంలో మహిళకు ఉన్న గౌరవం. గవర్నర్, సాధారణ మహిళలకు, మహిళా నేతలకే కాదు.. ఐఏఎస్ మహిళా అధికారులకు గౌరవం లేదు. మహిళా ఉపాధ్యాయులకు గౌరవం లేదు. పోడు భూములకు పట్టాలు అడిగితే చంటి బిడ్డల తల్లులను జైల్లో పెట్టారు. ఇది దిక్కుమాలిన పాలన. కేసీఆర్ బిడ్డకు తప్పితే ఎవరు సంతోషంగా లేరు. కేసీఆర్ బిడ్డ కవితకు ఏ లోటూ లేదు. ఓడిపోతే కవితకు ఎమ్మెల్సీ కట్టబెట్టి.. అదే మహిళలకు దక్కిన గౌరవం అని ప్రచారం చేసుకున్నారు. కవిత సిగ్గులేకుండా లిక్కర్ వ్యాపారం చేశారు. స్కాంలో చిక్కి.. మహిళల గౌరవాన్ని దెబ్బ తీశారు. రాష్ట్రంలో దిక్కు లేదు కానీ కవిత దేశంలో ధర్నా చేస్తారట!. అసలు రాష్ట్రంలో 33 శాతం ఎక్కడ అమలు అవుతుంది. ఇక్కడ నాలుగు శాతం కూడా అమలు కాలేదు. రెండు పర్యాయాలు కలిపి 10 సీట్లు కూడా మహిళలకు ఇవ్వలేదు. మహిళా మంత్రులకు దిక్కు లేదు. ఉన్న ఇద్దరు మంత్రులను డమ్మీలను చేశారు. అసలు మహిళల అభ్యున్నతికి ఒక్క పథకం లేదు. కేసీఆర్‌ది నియంత పాలన.. మహిళల పట్ల సర్కార్ నిర్లక్ష్యానికి నిరసనగా మౌన దీక్షఅని ప్రకటించారామె.