
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రంలోనూ ఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలు కనుమరుగవుతున్నాయని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆమె.. పార్టీ కార్యకర్తలకు మిఠాయిలు, సకినాలు పంచిపెట్టారు. అనంతరం మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగం, సబ్బండ వర్గాల పోరాట ఫలితం ‘తెలంగాణ‘అని, అది కూడా నీళ్లు, నిధులు, నియామకాల కోసం మూడు కోట్ల మంది ఏకమై కొట్లాడితే వచ్చిందని అన్నారు.
ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే మళ్లీ మరో పోరాటం జరగాలన్నారు. ఈ సర్కారు మారితేనే బతుకులు మారుతాయన్నారు. వ్యవసాయం పండుగ కావాలన్నా, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు కావాలన్నా వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలని స్పష్టం చేశారు. నిధులు పక్కదారి పడుతుంటే, తెలంగాణ సంపద కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయితే.. ప్రశ్నించే గొంతుకగా తమ పార్టీ నిలిచిందన్నారు. రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేస్తే ఎదురు నిలిచి, ప్రశ్నించిందని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment