సాక్షి, హైదరాబాద్: అబద్ధాలు అతికినట్లు చెప్పినా.. అవి నిజాలు అయిపోవని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. మెటర్నిటీ మరణాలను ఆపలేని ప్రభుత్వానికి.. మెరుగైన వైద్యంలో తెలంగాణ నంబర్ 1 అని చెప్పుకోవడం సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విడుదల చేసిన హెల్త్ రిపోర్ట్ ‘ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డైడ్’ అన్నట్లుందని వ్యాఖ్యానించారు.
300 మంది సిబ్బంది ఉండాల్సిన జిల్లా ఆసు పత్రిలో 30 మందితో వైద్యం అందించ డం అభివృద్ధి అంటారా అని ప్రశ్నించారు. ఎక్స్‌రే, సిటీ స్కాన్, టిఫా స్కాన్ లాంటి యంత్రాలకు టెక్నీషియన్లు లేక ఎన్నో ఆసు పత్రుల్లో మూలకు పడ్డాయన్నారు. మహానేత హయాంలో అద్భుతంగా అమలైన ఆరోగ్యశ్రీ పథకాన్ని డెత్ బెడ్ ఎక్కించారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment