
సభలో మాట్లాడుతున్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
జగిత్యాల: దివంగత మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా ప్రజలముందుకొచ్చా నని, వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. జగిత్యాల జిల్లాలో చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం 196వ రోజు కొనసాగింది. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్‌లో జరి గిన బహిరంగసభలో ఆమె మాట్లాడుతూ..అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, వంటి పథకాలను అమలు చేసిన ప్రజానాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన ఎనిమిదేళ్ల పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు. ప్రతీ వర్గాన్ని మోసం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణను బీరు, బార్ల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ డ్రామారావుగా మారారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ హయాంలోనే జగిత్యాల అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment