jagtial district
-
రాజవ్వ అటుకులు.. ఆహా!
జగిత్యాల టౌన్: రాజవ్వ అటుకులంటే జగిత్యాలలో తెలియని వారుండరు. ఆ టేస్టుకు ఫిదా కాని వారుండరంటే అతిశయోక్తి కాదు. జగిత్యాల పట్టణ టవర్ సర్కిల్లోని ప్రధాన కూరగాయల మార్కెట్లో రాజవ్వ అనే మహిళ గత 25 ఏళ్లుగా రుచికరమైన అటుకులు, చాయ్ హోటల్ నిర్వహిస్తున్నారు. శుచి, శుభ్రతతో తయారు చేసిన అటుకులకు దాల్చా చేర్చి నిమ్మకాయ పిండి ఇచ్చే అటుకులకు టిఫిన్ ప్రియులు ఫిదా అవుతున్నారు. ఉదయం నుంచే రాజవ్వ అటుకుల కోసం టిఫిన్ ప్రియులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్లేట్ కేవలం రూ. 20కే అందిస్తున్న రాజవ్వ అటుకులను మార్కెట్‌కు వచ్చే కొనుగోలు దారులు, కూరగాయల అమ్మకం దారులు, వ్యాపారులు తెగ ఇష్టపడి తింటుంటారు. దేశ విదేశాల్లో కూడా రాజవ్వ అటుకుల గురించి చర్చ జరగడం ఇక్కడి అటుకుల రుచికి నిదర్శనమని పలువురు టిఫిన్ ప్రియులు చెబుతున్నారు. జగిత్యాల కూరగాయల మార్కెట్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది రాజవ్వ అటుకులే కావడం విశేషం. అటుకులే కాదు రాజవ్వ చేసే చాయ్ అంటే కూడా చాయ్ ప్రియులు ఎంతో ఇష్టపడి తాగుతుండటం విశేషం. View this post on Instagram A post shared by shivani patel (@jagtial_pilla__)ఇంట్లో తిన్నట్లుంటుంది రాజవ్వ చేసే అటుకులు తింటే ఇంట్లో చేసిన అటుకులు తిన్న అనుభూతి కలుగుతుంది. శుచి, శుభ్రతతో పాటు మంచి రుచితో ఉండే రాజవ్వ అటుకులంటే నాతో పాటు నా మిత్రులు ఇష్టపడతారు. మిత్రులతో కలిసి రాజవ్వ హోటల్లో అటుకులు తింటాను. – ప్రసాద్‌గౌడ్, స్థానికుడుఅటుకులు బాగుంటాయి మాది జగిత్యాల మండలం నర్సింగాపూర్. నేను రైతును. పలు రకాల కూరగాయలు మార్కెట్‌కు తెచ్చి అమ్ముతుంటాను. రాజవ్వ హోటల్ వద్ద రుచికరమైన అటుకులు తిన్నాకే దందా మొదలు పెడతాను. రాజవ్వ చేసే అటుకులు చాలా రుచిగా ఉంటాయి. – గంగవ్వ, రైతు -
అద్భుతమైన ఇంజనీరింగ్ శైలి..
కోరుట్ల: పెద్ద పెద్ద రాతి స్తంభాలు.. వాటిపై శిలాఫలకాలతో శ్లాబ్ వంటి నిర్మాణాలు. అక్కడక్కడ చిన్నచిన్న విశ్రాంతి గదులు. దుస్తులు మార్చుకునేందుకు అనువైన నిర్మాణాలు. మూడు అంతస్తుల నిర్మాణం. భూమిపై కనిపించేది కేవలం ఒక అంతస్తు మాత్రమే.. మిగిలిన రెండు అంతస్తుల నిర్మాణం భూగర్భంలోకి వెళ్లిపోయింది. క్రీ.శ. 957–1184 మధ్య కాలం నాటి శిల్పుల ఇంజనీరింగ్ శైలికి నిదర్శనంగా నిలిచిన అద్భుతమైన నిర్మాణం జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. జైన చాళుక్యుల కాలంలో.. క్రీ.శ. 1042–1068 వరకు వేములవాడ రాజధానిగా పరిపాలన సాగించిన జైన చాళుక్యుల కాలంలో ఈ మెట్ల బావి నిర్మించినట్లు సమాచారం. 7–10వ శతాబ్ది వరకు పరిపాలన సాగించిన కల్యాణి చాళు క్యులు, రాష్ట్రకూటుల హయాంలోనూ ఈ మెట్ల బావి (Stepwell) ఆ కాలం నాటి రాజవంశీయుల స్నానాలకు, విశ్రాంతి తీసుకోవడానికి, ఈత నేర్చుకోవడానికి వినియోగించారని చెబుతారు. ఈ మెట్ల బావిలోని రాతి స్తంభాలపై చెక్కిన తీరు అమోఘం. రాతి స్తంభాల కింది భాగంలో భూగర్భమార్గంలో రాజకోటను చేరుకోవడానికి సొరంగం వంటి మెట్ల నిర్మా ణం ఉన్నట్లుగా ప్రచారంలో ఉంది. రాజవంశీయుల కాలంలో నిషిద్ధ ప్రాంతంగా ఉన్న ఈ మెట్ల బావి ప్రస్తుతం కోరుట్ల (Korutla) మున్సిపల్ అధీనంలో ఉంది. ఎక్స్‌లెన్స్ సర్టిఫికెట్ కోరుట్లలోని మెట్ల బావిలో స్నానాలకు వచ్చే రాజవంశీయులకు దుస్తులు మార్చుకోవడానికి అనువుగా మెట్లబావి రెండవ అంతస్తులో చిన్నచిన్న గదులుండటం గమనార్హం. వీటితో పాటు విశ్రాంతి తీసుకోవడానికి మెట్ల బావి చుట్టూ రాతి స్తంభాల మీద నిలబెట్టిన శిలాఫలకాలతో పెద్ద వసారా ఉంది. మెట్ల బావి (stair well) చుట్టూ దీపాలు వెలిగించడానికి అవసరమైన చిన్నపాటి గూళ్లు ఉన్నాయి. మెట్లబావిపై భాగంలో ఉన్న మెట్లకు వెంబడి ఎడమ వైపు ఉన్న ఓ రాతిపై శిలాశాసనం (Epigraphy) ఉంది. ఈ శిలాశాసనం సంపూర్ణంగా చదవడానికి వీలు కానట్లుగా సమాచారం. ఈ మధ్య కాలంలో దెబ్బతిన్న కోరుట్ల మెట్లబావిని మున్సిపల్ ఆధ్వర్యంలో బాగు చేయించి కొత్త సొబగులద్దారు. దీంతో ఈ మెట్లబావికి ఇండి గ్లోబల్ నెట్వర్క్ నుంచి 2022–23 సంవత్సరంలో ఎక్స్‌లెన్స్ సర్టిఫికెట్ దక్కింది. చదవండి: వెండితెరపై మానుకోట -
జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత మృతి
సాక్షి, జగిత్యాల జిల్లా: గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రైం రికార్డ్స్ బ్యూరో ఎస్ఐ శ్వేత మృతి చెందారు. కారులో ధర్మారం వైపు నుంచి జగిత్యాల వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. చిల్వాకోడూర్ వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను ఆమె కారు ఢీకొట్టింది. ఆ తర్వాత చెట్టును ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ.. ఘటనా స్థలంలోనే మృతిచెందారు.కారు, బైక్‌ను ఢీకొనడంతో ఎస్ఐతో పాటు, బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ముత్యంపేట వాసిగా పోలీసులు గుర్తించారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ముత్యంపేట వాసిగా గుర్తించారు. ఎస్ఐ శ్వేత గతంలో వెల్గటూరు, కథలాపూర్, కోరుట్ల, పెగడపల్లిలో ఎస్ఐగా పనిచేశారు. -
50 ఏళ్లుగా చొక్కా వేసుకోలేదు చివరికి పెళ్ళికి కూడా..
-
పది శాతం పాలు, 90 శాతం కల్తీ
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ.. జీవన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్
జగిత్యాల: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎన్నికల్లో పోటీ చేయడం, చేయించడం పార్టీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. తన వ్యక్తిగత నిర్ణయం ఏమీ లేదని కుండబద్ధలు కొట్టారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ అంశంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తే బాగుంటుంది. ఆ అభిప్రాయం అధిష్టానానికి కాంగ్రెస్ రాష్ట్ర శాఖ నివేదిస్తుంది. నివేదిక తర్వాత ఎవరు బరిలో ఉండాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. పోటీ చేయడం, చేయించడం పార్టీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. నా వ్యక్తిగత నిర్ణయం అంటూ ఏది లేదు.గతంలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీగా నేనే వ్యక్తిగతంగా ఏమీ పోటీ చేయలేదు. పార్టీ నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను. నాకు ఎవరూ హామీ ఇవ్వలేదు.. నాకు ఎలాంటి ఒప్పందాలూ లేవు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల టీపీసీసీ చీఫ్ పార్టీ నేతలతో మాట్లాడుతూ.. వచ్చే పట్టభ్రదుల ఎన్నికల్లో మరోసారి జీవన్ రెడ్డికే అవకాశం ఇవ్వాలని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డికే అవకాశం దక్కే అవకాశం ఉంది. -
సార్.. ఈ అన్నం మాకొద్దు
కరీంనగర్/జగిత్యాలటౌన్: మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నామంటూ రెండుచోట్ల విద్యార్థులు ఆందోళనకు దిగా రు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని పురాతన పాఠశాల వి ద్యార్థులు రోడ్డెక్కగా, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ఆరెపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి చేరుకొని కలెక్టర్ సత్యప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌లోని పురాతన పా ఠశాలలో 400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సో మవారం 217 మంది పాఠశాలకు హాజరయ్యారు. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న ఈ పాఠశాలలో వారంరోజులుగా ఉడికీఉడకని అన్నం పెడుతున్నారని, అడుగు భాగం మెత్తగా, ముద్దగా మారి మాడిపోతోందని, ఆ అన్నం ఎలా తినేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అరగంట పాటు ఆందోళన చేసినా ఉన్నతాధికారులెవరూ పాఠశాలకు రాలేదు. దీంతో విద్యార్థులు అన్నం తినకుండానే పడేశారు. ఆరెపల్లి పాఠశాలలో వంట మనిషిని మార్చాలని కోరుతూ కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. అన్నంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయని, రుచిలేని అన్నం వడ్డిస్తున్నారని, ప్రశ్నిస్తే ఇష్టమున్నచోట చెప్పుకోమంటూ వంట మనుషులు బెదిరిస్తున్నారని ప్రజావాణిలో గోడు వెళ్లబోసుకున్నారు. నాలుగు నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ప్రజావాణి ఆడిటోరియంలోకి వెళ్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించారు. వంటమనిíÙని తొలగించి సరైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని నిరసన విరమింపజేశారు. -
ఛార్జింగ్ పెడితే పేలిన ఎలక్ట్రిక్ బండి
-
జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్.. ఛార్జింగ్ పెట్టిన ఐదు నిమిషాల్లోనే..
సాక్షి, జగిత్యాల జిల్లా: కొనుగోలు చేసిన నెల రోజుల్లోనే ఎలక్ట్రిక్ బైక్ పేలిన సంఘటన జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో ఛార్జింగ్ పెడుతుండగా ఘటన జరిగింది. ఛార్జింగ్ పెట్టిన క్రమంలో కేవలం ఐదు నిమిషాల్లోనే బైక్ పేలిపోయింది.బైక్ పేలడంపై బాధితుడు బేతి తిరుపతి రెడ్డి, కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇంటి తలుపులు పాక్షికంగా ధ్వంసమవ్వగా, స్కూటీ పూర్తిగా కాలిపోయింది. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపులోకి తెచ్చారు. బైక్ డిక్కీలోనే ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు సుమారు లక్షా 90 వేల రూపాయలున్నట్టు బాధితుడు పేర్కొన్నారు.కాగా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బైక్ పేలుడుపై టీవీఎస్ మోటార్ డీలర్‌తో బాధితుడు వాగ్వాదానికి దిగారు. ఇన్సూరెన్స్ ద్వారా నష్టం పూడ్చే ప్రయత్నం చేస్తామని కంపెనీ డీలర్ తెలిపారు. వరసగా జరుగుతున్న ఎలక్ట్రిక్ బైక్‌ల పేలుడు ఘటనలతో వాహనదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఓవైపు ఇంధన ధరల పెరుగుదల.. మరోవైపు పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్న వారిలో టెన్షన్ కలిగిస్తున్నాయి.ఇదీ చదవండి: ‘ఈవీ’లు... టైంబాంబులు! -
జీవన్ రెడ్డి సేవలు పార్టీకి అవసరం..
-
జగిత్యాల: కాంగ్రెస్ నేత గంగారెడ్డి దారుణ హత్య
సాక్షి, జగిత్యాల జిల్లా: జగిత్యాల రూరల్ జాబితాపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆయనను కారుతో వెనుక నుంచి ఢీకొట్టి, సంతోష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. కత్తిపోట్లకు గురైన గంగారెడ్డిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. పాత కక్షలతోనే హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పలుమార్లు సంతోష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడిగా గంగారెడ్డి ఉన్నారు. ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి.. గంగారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తోందా?: జీవన్‌రెడ్డి ఆగ్రహంజగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తోందా? అంటూ పోలీసులపై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల- ధర్మపురి రహదారిపై ఆయన బైఠాయించారు. బీఆర్ఎస్ నేతలే హత్య చేయించారని ఆరోపించారు.ఇదీ చదవండి: రూ.20 కోట్ల భూ కుంభకోణం -
ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదని..
మల్యాల(చొప్పదండి): కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు కాటికి చేరింది. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.. తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, తన చావుకు తానే కారణమని తనువు చాలించింది. ‘తాను ఎవరి కారణం వల్ల చనిపోవడం లేదు.. నన్ను ఎవరూ ఏమీ అనలేదు.. నాకే ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదు. అందుకే వెళ్లిపోతున్నా..’ అంటూ చేతిపై రాసుకుని ఓ నవ వధువు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో విషాదం నింపింది. ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన పానుటి భాగ్యలక్ష్మీకి ఇదే మండలం మ్యాడంపల్లికి చెందిన ఉదయ్‌కిరణ్‌తో గతనెల 18న వివాహమైంది. అప్పటి నుంచి ఇద్దరూ హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. ఈనెల 3న భాగ్యలక్ష్మీని తల్లిదండ్రులు పుట్టినింటికి తీసుకొచ్చారు. బుధవారం తల్లిదండ్రులు మల్యాల వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో భాగ్యలక్ష్మీ బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలాన్ని ఎస్సై సందర్శించారు. సంఘటనపై వివరాలు సేకరించారు. భాగ్యలక్ష్మి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ కుమార్ తెలిపారు. -
ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు
జగిత్యాల క్రైం: వందమందితో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక టైర్లు ఉన్నట్టుండీ ఊడిపోయిన సంఘటనలో ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా రాయికల్ ప్రధాన రహదారిపై శనివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. సామర్థ్యానికి మించి ప్రయాణికులు బస్సు ఎక్కడంతో.. ఒకేసారి రెండు వెనుక టైర్లు ఊడిపోయాయి. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జగిత్యాల నుంచి ఖానాపూర్ వెళ్తోంది.సుమారు 100 మంది ప్రయాణికులున్న బస్సు జగిత్యాల రూరల్ మండలం చల్గల్–మోరపల్లి శివారు చేరగానే.. బస్సు వెనుక కుడివైపు రెండు టైర్లు ఊడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా బస్సు కుదుపునకు గురికావడంతో ప్రయాణికులు భయభ్రాంతులయ్యారు. ఎవరికేమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో బస్సును రప్పించి ప్రయాణికులను అక్కడి నుంచి తరలించారు. -
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు
జగిత్యాల, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉదయం రోడ్డు మార్గంలో గట్టుకు చేరుకున్న ఆయనకు.. ఆలయ పూజారులు సాదరంగా స్వాగతం పలికారు. పవన్‌కు కొండగట్టు ఆలయం మొదటి నుంచి ఒక సెంటిమెంట్‌గా ఉంది. ఎన్నికల ప్రచారానికి ముందు కూడా ఆయన ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అంతకు ముందు తుర్కపల్లి దగ్గర బీజేపీ-జనసేన శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయి. ఆ సమయంలో కారుపైకి అభివాదం చేసిన ఆయన.. తెలంగాణలో రెండు పార్టీల పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
గుండెపోటుతో అన్నాచెల్లెళ్ల మృతి
సాక్షి, జగిత్యాల జిల్లా: కోరుట్ల మండలం కల్లూరులో ఊహించని విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో అన్నాచెల్లెళ్లు మృతి చెందారు. రంగుల పోషాలు అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా మోస్రాలో ఉంటున్న చెల్లెలు పోషవ్వ.. అన్న మరణవార్త విని కన్నీటి పర్యంతమై గుండెపోటుతో హఠాన్మరణం చెందింది. ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు పెను సవాల్ విసురుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు. విద్యార్థుల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు గుండెపోటు బారిన పడుతున్నారు. చదవండి: పిల్లలున్నా అతడితో లవ్ ట్రాక్.. చివరకు.. -
ప్రియుడి కోసం.. అక్కకు వోడ్కా తాగించి.. చేతులు కట్టేసి..
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో సంచలనంగా మారిన జగిత్యాల దీప్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. దీప్తి హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రియుడి సహకారంతో చెల్లినే అక్కను చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే క్రమంలో సొంత అని కూడా చూడకుండా చందన.. దారుణానికి ఒడిగట్టింది. హత్య ప్లాన్‌లో భాగంగా వోడ్కా, బ్రీజర్ ఆమె తగించినట్టు పోలీసులు తెలిపారు. దీప్తి హత్య కేసు వివరాలను జగిత్యాల ఎస్పీ భాస్కర్ శనివారం మీడియాకు వెల్లడించారు. "కోరుట్లకు చెందిన బంక చందన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఉమర్ షేక్ సుల్తాన్(25) అనే యువకుడు చందనకు వన్ ఇయర్ సీనియర్. బీటెక్‌లో చందన ఒక ఏడాది డిటెయిన్డ్ అయింది. ఇక ఉమర్ రెండేళ్లు డిటెయిన్డ్ అయ్యాడు. దీంతో ఇద్దరు క్లాస్మేట్స్ అయ్యారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఏర్పడిన పరిచయం ఏర్పడింది. ప్రేమలో పడ్డారు". పెళ్లి ప్రపోజల్.. ప్రేమ అనంతరం.. తనను పెళ్లి చేసుకోవాలని ఉమర్‌ను చందన కోరింది. ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీన ఉమర్‌ను చందన కోరుట్లకు పిలిపించింది. పెళ్లి చేసుకోవాలని అతన్ని కోరింది. అయితే, ఇద్దరు ఇంకా సెటిల్ కాకపోవడంతో తర్వాత పెళ్లికి ప్లాన్ చేద్దామని ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని వాట్సాప్ కాల్ ద్వారా ఉమర్ తల్లి సయ్యద్ అలియా, చెల్లి ఫాతిమా, స్నేహితుడు హాఫీజ్తో చందన మాట్లాడినట్టు తెలిపారు. అక్కకు వోడ్కా తాగించి.. ఆగస్టు 28న కాల్ చేసి "ఓ ఫంక్షన్ నిమిత్తం మా అమ్మ, నాన్న హైదరాబాద్ వెళ్తున్నారు. ఇంట్లో నేను, మా అక్కనే ఉంటామని చందన.. ఉమర్‌కు చెప్పింది. ఇంట్లో మనీ, బంగారం ఉంది. అది తీసుకొని పోయి పెళ్లి చేసుకుంటే.. సెటిలవుతామని" చెప్పింది. ఆగస్టు 28న ఉదయం హైదరాబాద్ నుంచి కారులో బయల్దేరి 11 గంటలకు కోరుట్లకు ఉమర్ చేరుకున్నాడు. ప్లాన్‌లో భాగంగా వోడ్కా, బ్రీజర్ తెప్పించింది చందన. రాత్రి సమయంలో దీప్తి, చందన కలిసి వోడ్కా, బ్రీజర్ తాగారు. రాత్రి 2 గంటల సమయంలో ఉమర్‌కు మేసేజ్ చేయడంతో ఇంటి వెనుకాల కారు ఆపి ఇంట్లోకి వచ్చాడు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీస్తున్న సమయంలో దీప్తికి మెలకువ వచ్చి లేచింది. గట్టిగా అరిచింది. చందన తన వద్ద స్కార్ఫ్‌తో దీప్తి మూతికి, ముక్కుకు చుట్టింది. ఆమె సోఫా మీద పడిపోయింది. ఉమర్, చందన కలిసి ఆమె చేతులు కట్టేశారు. గట్టిగా అరవకుండా మూతికి ప్లాస్టర్ వేశారు. పది నిమిషాల తర్వాత దీప్తిలో చలనం లేకుండా పోయిందని పేర్కొన్నారు. డబ్బు, బంగారంతో పరారీ.. అక్క అచేతన స్థితిలో ఉండిపోవడంతో.. ఇంట్లో ఉన్న ఒక లక్షా 20 వేల నగదు, 70 తులాల బంగారం బ్యాగులో వేసుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు దీప్తికి ప్లాస్టర్ తీసేసి వెళ్లారు. వోడ్కా తాగి చనిపోయినట్లు అందరు నమ్మేలా సీన్ క్రియేట్ చేశారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో హైదరాబాద్‌కు బయల్దేరారు. ఉమర్ తల్లి, చెల్లి, బంధువుకు జరిగిన విషయం చెప్పి.. నగదు, బంగారంతో.. ముంబై, నాగ్‌పూర్ వెళ్లాలని చందన, ఉమర్ ప్లాన్ చేసుకున్నారు. అక్కడే పెళ్లి చేసుకుని, సెటిల్ అవ్వాలని అనుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో ఏ1 చందన, ఏ2 ఉమర్, ఏ3 సయ్యద్ అలియా, ఏ4 ఫాతిమా, ఏ5 హాఫీజ్‌గా చేర్చామని తెలిపారు. ఈ ఐదుగురిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ భాస్కర్ తెలిపారు. ఇది కూడా చదవండి: సహజీవనం పేరుతో ఒక్కో సీజన్లో ఒక్కో భాగస్వామి.. ఆరోగ్యకరం కాదు -
ఐదు తరగతులు.. ఒక్కరే మాస్టారు
కథలాపూర్ (వేములవాడ): వందమంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు బోధిస్తున్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా భీమారం మండలం మన్నెగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల దుస్థితి ఇది. ఇక్కడి ఐదు తరగతుల్లో 100 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఒక్క ఉపాధ్యాయుడు బోధిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయిని అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారు. దీంతో వల్లంపెల్లి పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ను డిప్యుటేషన్‌పై నియమించారు. ఉపాధ్యాయులను నియమించాలని ఎనిమిదేళ్లుగా జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన కరువైందని ఎస్ఎంసీ చైర్మన్ కొక్కుల శంకర్, సర్పంచ్ సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి తెలిపారు. ఇది కూడా చదవండి: ఆధునిక హంగులతో.. పర్యాటక కేంద్రాల అభివృద్ధి -
TS: 15మంది సర్పంచ్‌లకు మావోయిస్టుల హెచ్చరిక
సారంగాపూర్(జగిత్యాల): మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణ్‌రావు ఉరఫ్ గణపతి సొంత జిల్లాలో ఒకేసారి 15మంది సర్పంచ్‌లకు ఆ పార్టీ పేరిట లేఖలు విడుదల కావడం కలకలం రేపింది. శుక్ర, శనివారాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు ఈ లేఖలు అందినట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని 15 గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులతో పాటు, ఎంపీపీ, తహసీల్దార్, ఎంపీడీవోలు, నర్సింహులపల్లె గ్రామంలోని మరో 12 మందికి మావోయిస్టు గోదావరి బెల్ట్ ఏరియా కమిటీ కార్యదర్శి మల్లికార్జున్ పేరిట లేఖలు అందాయి. అటవీ భూములు ఆక్రమిస్తూ, అక్రమంగా పట్టాలు జారీచేస్తున్నారని, ఇందుకోసం రూ.కోట్లు దండుకున్నారని లేఖల్లో ఆరోపించింది. గ్రామాల్లో నిర్వహించాల్సిన పంచాయితీలను పోలీసుస్టేషన్ల దాకా తీసుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. నర్సింహులపల్లెలో అక్రమంగా నిర్మించిన ఓ దుకాణాన్ని కూలి్చవేయాలని హెచ్చరించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారు తమ పద్ధతులు మార్చుకోకుంటే ప్రజాకోర్టులో శిక్షించాల్సి వస్తుందన్నారు. అయితే, ఒకేరోజు 15మంది సర్పంచ్‌లు, అధికారులు, గ్రామస్తులకు లేఖలు పోస్టు ద్వారా పంపించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇవి మావోయిస్టులు జారీచేసినవా లేక, కావాలనే కొందరిలా చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బాధితులు ఎస్పీతోపాటు సీఐ, ఎస్సైలను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. ఈ లేఖల విషయాన్ని ఎస్పీ భాస్కర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈవిషయంపై బీర్పూర్ ఎస్సై అజయ్‌ను వివరణ కోరగా పోలీస్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని చెప్పారు. ఇది కూడా చదవండి: ఇంగ్లండ్ ఎన్నికల్లో ఖమ్మం వాసి నాగేంద్ర విజయం -
బిల్లులు ఇవ్వకుంటే పెట్రోల్ పోసుకుంటాం.. సర్పంచులు
-
ధర్మపురి వివాదంలో మరో ట్విస్ట్.. కాంగ్రెస్ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల జిల్లా: మరోసారి ధర్మపురి ఎన్నికల వివాదం ఉత్కంఠ రేపుతోంది. ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలను అధికారులు పగలగొట్టిన సంగతి తెలిసిందే.. అయితే, నాలుగు బాక్సులకు మినహా మిగతా వాటికి తాళాలు లేవని, అధికారుల చర్యలు అనుమానం కలిగిస్తున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, హైకోర్టు ఆదేశాలతో ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు అధికారులు పగలగొట్టారు. 2018 ధర్మపురి అసెంబ్లీ ఎన్నిక ఫలితాలపై వివాదం నెలకొంది. గత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి.. హైకోర్టును ఆశ్రయించారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిటిషన్‌తో నివేదిక సమర్పించాలని జగిత్యాల జిల్లా అధికారులు, నాటి జిల్లా ఎన్నికల అధికారిని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఈ నెల ఏప్రిల్ 10వ తేదీనే స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరవడానికి అధికారులు సిద్ధమయ్యారు. కాగా, స్ట్రాంగ్ రూమ్ తాళం చెవుల మిస్సింగ్‌తో హైడ్రామా నెలకొంది. కీస్ మిస్సింగ్‌పై విచారణ చేపట్టాలని భారత ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. చదవండి: ధీరుడు కన్నీళ్లు పెట్టడు.. రేవంత్ నీతో నాకు పోలికేంటి..? ఈటల కౌంటర్ కోర్టు ఆదేశాలతో ఈ నెల ఏప్రిల్ 17వ తేదీన నాచుపల్లి జేఎన్టీయూలో నాటి ఎన్నికల అధికారి శరత్, ఆ తర్వాత విధులు నిర్వహించిన కలెక్టర్ రవినాయక్, ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ బాషాతో పాటు, నాటి రిటర్నింగ్ ఆఫీసర్, ఇతర అధికారులను ఈసీఐ బృందం విచారించింది. ఈసీఐ నివేదిక సమర్పించడంతో స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగులగొట్టేందుకు జగిత్యాల జిల్లా కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో నాటి అభ్యర్థుల సమక్షంలో ఆదివారం.. స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టారు. -
జగిత్యాల: బస్సును ఢీకొన్న లారీ.. ఐదుగురి పరిస్థితి విషమం
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో, ఈ ప్రమాద ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. ఎండపల్లి మండలంలోని కొత్తపేట వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అయితే, సిద్దిపేట జిల్లాలోని బెజ్గాం గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఇటీవలే ఓ వృద్ధురాలు చనిపోయింది. ఈ నేపథ్యంలో, ఆమె అస్తికలను ధర్మపురి వద్ద గోదావరి నదిలో కలిపేందుకు ఆమె కుటుంబ సభ్యులు దాదాపు 25 మంది శుక్రవారం ఓ ప్రైవేటు బస్సులో బయల్దేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సును కొత్తపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో బస్సును లారీ ఎదురుగా ఢీకొనడంతో డ్రైవర్ బస్సులోనే చిక్కుకుపోయాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం.. జేసీబీ సహాయంతో డ్రైవర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఇక, ప్రమాదంలో త్రీవంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మిగతా వారిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. -
16 నెలల క్రితం మహిళ కడుపులో క్లాత్ వదిలేసిన వైద్యులు.. చివరికి ఏం జరిగిందంటే?
సాక్షి, జగిత్యాల జిల్లా: మేం చాలా గొప్పగా పనిచేస్తున్నామని చెప్పుకునే కొందరు తెలంగాణ మంత్రుల మాటలకు భిన్నంగా.. అడుగడుగునా నిర్లక్ష్యపు ఛాయలు బట్టబయలవుతూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిలువెత్తు నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. కొడిమ్యాల మండలం నమిలికొండకు చెందిన నవ్యశ్రీ అనే మహిళకు పదహారు నెలల క్రితం.. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయింది. అయితే ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు కడుపులోనే క్లాత్ వదిలేయడం కలకలం రేపుతోంది. ఏడాది తర్వాత నవ్యశ్రీకి తీవ్ర కడుపు నొప్పి రావడంతో వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకుంది. స్కానింగ్‌లో కడుపులో బట్ట ఉన్నట్టు గుర్తించగా.. వెంటనే ఆసుపత్రిలో సర్జరీ చేసి బట్ట తొలగించారు. ఈ మొత్తం విషయాన్ని లేఖలో పేర్కొంటూ నవ్యశ్రీ కుటుంబీకులు జగిత్యాల డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. చదవండి: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు -
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో సిబ్బంది నిర్లక్ష్యం
-
మమ్మల్ని మా ఊర్లో ఉండనివ్వడం లేదు..
జగిత్యాల: ‘మమ్మల్ని మా ఊర్లో ఉండనివ్వడం లే దు.. వివాహాలను అడ్డుకుంటున్నారు.. గ్రామంలో ఎవరు చనిపోయినా ఆధార్‌కార్డు ఇస్తేనే అంత్యక్రియలకు అనుమతి ఇస్తానంటున్నారు’ అని ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ప్రజావాణి ద్వారా అద నపు కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. 40ఏళ్లుగా వేములకుర్తిలో జీవనం సాగిస్తున్నామని తెలిపారు. వలస వచ్చి ఇక్కడ ఉండొద్దా? అని ప్రశ్నించారు. మా పని మేం చేసుకుంటామని, మమ్మల్ని బతకనివ్వాలని ప్రజావాణి ద్వారా వేడుకున్నారు. సుమారు 20 మంది వరకు కలెక్టరేట్‌కు తరలివచ్చి తమ ఆవేదనను వెలిబుచ్చారు. సుమారు 60 కుటుంబాలు గ్రామంలో ఉంటున్నాయని, గ్రామం వదిలిపెట్టి వెళ్లిపోవాలని సర్పంచ్ ఒత్తిడి తీసుకు వస్తున్నారని ఆరోపించారు. అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇల్లు కిరాయి ఇవ్వడం లేదు నేను పరాయి దేశం పోయి వచ్చి అంతా లాసైన. అప్పుల బాధతో నా సొంతింటిని అమ్ముకున్న. కిరాయి ఇంట్లో ఉండనివ్వడంలేదు. ఇబ్బందులకు గురిచేస్తున్నారు. – మాచర్ల లక్ష్మణ్ పెళ్లి అడ్డుకునేందుకు యత్నించారు నేను దివ్యాంగుడిని. ఇటీవల నాకు వివాహం నిశ్చయమైంది. పెళ్లిని అడ్డుకునేందుకు సర్పంచ్ ప్రయత్నం చేశారు. బ్రాహ్మణులను రాకుండా చేశారు. వేరేవాళ్లతో పెళ్లి చేయించుకున్నాం. – రాట్నం మహేశ్ శవాన్ని అడ్డుకున్నారు మా తాత ముత్తయ్య ఇటీవల చనిపోయాడు. ఆ శవాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్దామంటే ఆధార్‌కార్డు ఇస్తేనే పంపిస్తామని సర్పంచ్ చెప్పిండ్రు. చేసేది లేక ఆధార్‌కార్డులు ఇచ్చినం. ఇప్పుడు మా వద్ద అవిలేవు. ఇబ్బందిగా ఉంది. – రాజ్‌కుమార్ -
బైక్‌ను ఢీకొట్టి.. 10 మీటర్లు ఈడ్చుకెళ్లి..
మల్యాల(చొప్పదండి): కారు బైక్‌ను ఢీకొ ని సుమారు పది మీటర్ల దూరం లాక్కె ళ్లిన ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయ పడిన ఇద్దరు దుర్మరణం చెందారు. ఓ యువకుడిని ఈడ్చుకెళ్లడంతో రోడ్డంతా మాంసపు ముద్ద, రక్తపు మరకలతో గగుర్పొడిచేలా తయారైంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కరీంనగర్ జిల్లా మానకొండురు మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ లతీఫ్(32) అతడి స్నేహితుడు మహమ్మద్ హమీద్ ఖాన్(28)తో కలిసి ఈనెల 26న జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి బైక్‌పై వెళ్లారు. గురువారం అర్థరాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. మల్యాల మండలం ముత్యంపేట శివారులోకి రాగానే.. జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై దిగువ కొండగట్టు వద్ద వారి బైక్‌ను ఎదురుగా వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. కారు చక్రాల్లో బైక్ చిక్కుకోవడంతో పది మీటర్ల దూరం లాక్కెళ్లింది. బైక్ నడుపుతున్న హమీద్‌ఖాన్ కుడికాలు రక్తపు ముద్దలతో రోడ్డంతా తడిసింది. అబ్దుల్ లతీఫ్ ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డాడు. 108 అంబులెన్స్‌లో ఇద్దరినీ జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో హమీద్‌ఖాన్ మృతిచెందారు. అబ్దుల్ లతీఫ్ ఖాన్ పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. లతీఫ్ సోదరుడు అబ్దుల్ రఫీక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కారును నడిపిన వ్యక్తి జగిత్యాలకు చెందిన ఎర్ర సాయివర్ధన్‌గా గుర్తించారు. -
శ్రావణి రాజీనామాపై స్పందించిన ఎమ్మెల్యే సంజయ్.. ఏమన్నారంటే?
సాక్షి, జగిత్యాల: స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమ పనులకు అడ్డుపడుతున్నారని అవి భరించలేకనే పదవికి రాజీనామా చేస్తున్నట్టు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజీనామా చేసి మీడియా ఎదుటే శ్రావణి కన్నీరుపెట్టుకున్నారు. కాగా, ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. శ్రావణి రాజీనామాపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా తన వ్యక్తిగతం. చైర్పర్సన్ వ్యాఖ్యలు చాలా బాధించాయి. నేను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదు. శ్రావణి వెనుక ఎవరో వ్యక్తులు ఉన్నారు. రాజకీయ కారణాలతో రాజీనామా చేశారు. కౌన్సిలర్లను ఎలాంటి క్యాంపులకు పంపలేదు. అధిష్టానం అన్ని విషయాలు చూసుకుంటుంది. తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆమె కామెంట్స్ చేయడం సరికాదు. దీన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను. సమన్వయ లోపం ఉందని అవిశ్వాసం పెడతామని కౌన్సిలర్లు చెప్పినా వద్దని చెప్పాము. సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలనీ నిర్ణయించి చైర్‌పర్సన్‌కు కాల్ చేశాము. ఈలోపే ఆమె ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేయడం బాధించింది. కలిసి పనిచేస్తానంటే కౌన్సిలర్లను సముదాయించేందుకు ప్రయత్నం చేస్తాను. 50% బీసీ మహిళలకు పదవులు ఇచ్చామ’ని వ్యాఖ్యలు చేశారు. -
దొరగారూ.. మీకో దండం!
సాక్షి, కరీంనగర్: ‘దొరగారూ మీకో దండం. మూడేళ్లుగా అడుగడుగునా అవమానాలు, వేధింపులు భరించా. ఇక నా వల్ల కాదు, మీ గడీ సంకెళ్లు తెంపుకుని బయటికి వస్తున్నా..నా కుటుంబాన్ని, పిల్లల్ని కాపాడుకునేందుకే రాజీనామా చేస్తున్నా. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఆశీస్సులతో మూడేళ్ల పాటు పదవిలో కొనసాగాను. ఇక ఈ నరకం నా వల్ల కాదు. దొరా మీరే గెలిచారు..’ అంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ను ఉద్దేశించి మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నీటి పర్యంతమవుతూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బు ధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఉద్వేగంగా మాట్లాడారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి.. ‘ఒక మహిళా బీసీ నేతగా జగిత్యాల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మూడు నెలల పసిగుడ్డును వదిలి రాజకీయాల్లోకి వచ్చాను. కేటీఆర్, కవిత ఆశీస్సులతో బలహీనవర్గాలకు చెందిన నేను మున్సిపల్ చైర్పర్సన్ పదవి పొందగలిగా. కానీ ప్రమాణ స్వీకారం చేసిన రెండోరోజు నుంచే విషం చిమ్మే కోరలు ఉన్న మనుషుల మధ్య పనిచేయాల్సి వచ్చింది. ‘మున్సిపల్ చైర్పర్సన్ పదవి అంటే ముళ్లకిరీటం’ అని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చెబితే తన తండ్రిలాంటి వాడు, తన బాగు కోసం సలహాలు ఇస్తున్నాడని భావించానే తప్ప.. ఆయన రాక్షసత్వానికే బలవుతానని అనుకోలేదు..’ అని శ్రావణి అన్నారు. పేరుకే మున్సిపల్ చైర్‌పర్సన్‌ని.. ‘కరీంనగర్ రోడ్లో ఏర్పాటు చేసిన డివైడర్లు ఎందుకు చిన్నగా ఉన్నాయని ప్రశ్నిస్తే.. కాంట్రాక్టర్, కౌన్సిలర్ల ముందే అవమానించారు. పార్కులు అభివృద్ధి చేయాలని కోరితే అమరవీరుల స్తూపం సాక్షిగా తీవ్రంగా అవమానించారు. మున్సిపాలిటీ లో ఎలాంటి పర్యటనలు చేయకూడదు. కనీసం రూ.10 వేల విలువ గల పనికి కూడా కొబ్బరికాయ కొట్టలేని దయనీయస్థితి. పేరుకే మున్సిపల్ చైర్‌పర్సన్‌ని. పెత్తనం ఎమ్మెల్యేదే..’ అని చెప్పారు. చైర్పర్సన్ పదవిని అమ్ముకోవడానికి బేరం ‘నాలుగేళ్లలోపు అవిశ్వాసాలు పెట్టరాదని తెలిసినా ఎమ్మెల్యే కౌన్సిలర్లను బెదిరించి అవిశ్వాస తీర్మానం డ్రామా ఆడారు. చైర్పర్సన్ పదవిని అమ్ముకోవడా నికి ఓ మహిళా కౌన్సిలర్ భర్తతో బేరం కుదుర్చుకు న్నారు. కర్కశత్వం, మూర్ఖత్వం, క్రూరత్వం కలిపితే ఎమ్మెల్యే సంజయ్. ఆయనతో మాకు ఆపద పొంచి ఉంది. మా కుటుంబానికి ఏమైనా జరిగితే ఎమ్మె ల్యేనే కారణం. మాకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎస్పీగారిదే’ అని శ్రావణి తెలిపారు. శ్రావణికి బీఫామ్ ఇచ్చిందే నేను చైర్పర్సన్ భోగ శ్రావణి ఆరోపణలు సమంజసం కాదు. ఆమెకు బీఫామ్ ఇచ్చిందే నేను. అలాంటిది నేను ఎందుకు ఆమెకు వ్యతిరేకంగా వ్యవహరిస్తాను. అవిశ్వాసం విషయంలో నా ప్రమేయం లేదు. ఈ విషయంలో ఇంతకుమించి స్పందించలేను. – ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ -
కామారెడ్డి, జగిత్యాల మాస్టర్‌ప్లాన్ రద్దుకు తీర్మానం
-
మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ జగిత్యాల అష్టదిగ్భందానికి పిలుపు
-
ఆగని మాస్టర్ ప్లాన్ మంటలు
జగిత్యాల: జిల్లాలో మాస్టర్ ప్లాన్ మంటలు మంగళవారం మరింత ఉధృతరూపం దాల్చాయి. పట్టణ సమీపంలోని మోతె, తిమ్మాపూర్, అంబారిపేట, నర్సింగాపూర్, ధరూర్, లింగంపేట, హస్నాబాద్ గ్రామాల్లో రైతులు, నాయకులు, ప్రజలు బల్దియా తీరుపై నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామాల్లోంచి ర్యాలీగా బయలు దేరి జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు చేరుకుని నిరసన తెలిపారు. తమ గ్రామాలను మాస్టర్ ప్లాన్ పరిధి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అంబారిపేట గ్రామపంచాయతీ కార్యాలయ భవనం ఎక్కిన మహిళలు.. నిరసన తెలిపారు. కాగా, ప్రతిపక్షాలు మాస్టర్‌ప్లాన్‌పై చేస్తున్న అసత్య, అర్థసత్య ప్రచారాలు నమ్మొద్దని, రైతులు, ప్రజలకు తాను వెన్నంటి ఉంటానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ భరోసానిచ్చారు. అయితే, మాస్టర్ ప్లాన్‌ను కేవలం జగిత్యాల పట్టణం వరకే పరిమితం చేస్తే ఎవరికీ ఎలాంటి నష్టం జరగదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. -
గంటల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరూ గుండెపోటుతో మృతి
సాక్షి, మెట్పల్లి (కోరుట్ల): గంటల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరూ మృతి చెందిన విషాదకర ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో చోటుచేసుకుంది. తమ్ముడు గుండెపోటుతో మృతి చెందగా, అంత్యక్రియలకు హాజరైన అన్నకూడా గుండెపోటుకు గురై మరణించాడు. మెట్పల్లి పట్టణంలోని చైతన్యనగర్‌కు చెందిన బోగ భూషణ్, లత దంపతులకు ముగ్గురు కుమారులు. ఇందులో రెండో కుమారుడు శ్రీనివాస్ (30) హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఏడాది వయసుగల పాప ఉంది. శనివారం రాత్రి ఇంట్లో ఉన్న శ్రీనివాస్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఆదివారం ఉదయం మెట్‌పల్లికి తీసుకొచ్చారు. అంత్యక్రియలు జరపడానికి మృతదేహాన్ని శ్మశానికి తరలిస్తుండగా, అప్పటికే అక్కడికి వెళ్లిన శ్రీనివాస్ అన్న సచిన్ (33) ఒక్కసారిగి కూప్పకూలాడు. ఇది గమనించిన బంధువులు మొదట ప్రైవేట్ ఆస్పత్రికి.. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సచిన్ మృతి చెందినట్లు తెలిపారు. గంటల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాద ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పలువురు ప్రముఖులు ఆ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. చదవండి: (Hyderabad: ఇంటర్ విద్యార్థులకు టెన్షన్ టెన్షన్!) -
రూ.4 కోట్లతో రియల్టర్ పరారీ పట్టిస్తే రూ.3 లక్షలిస్తాం
జగిత్యాల క్రైం: దొంగల్ని పట్టిస్తే నగదు బహుమానం ఇస్తాం.. అంటూ పోలీసులు ప్రకటించడం చూసే ఉంటారు. కానీ జగిత్యాలలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ.4 కోట్ల వరకు అప్పులు చేసి పారిపోవడంతో.. అతన్ని పట్టిస్తే రూ.3 లక్షల నజరానా.. అంటూ బాధితులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. జగిత్యాల జిల్లా గోవిందుపల్లికి చెందిన గాండ్ల వెంకన్న కుటుంబంతో సహా 15 రోజులుగా కనిపించడం లేదు. వెంకన్న చాలాకాలంగా చిట్టీలు నడుపుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. నమ్మకంగా ఉండటంతో చాలామంది నమ్మి అతనికి సుమారు రూ.4 కోట్ల వరకు అప్పు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. వెంకన్న పదిహేను రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. దీంతో బాధితులు జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో ‘గాండ్ల వెంకన్న కనిపించడం లేదు.. ఆయనను పట్టించిన వారికి రూ.3 లక్షల నజరానా ఇస్తాం’ అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బాధితులెవరూ తమకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. -
నిరుపేద డ్రైవర్‌కు లక్ష్మీ కటాక్షం!.. రాత్రికే రాత్రే రూ.30 కోట్లకు యజమాని
సాక్షి, జగిత్యాల(సారంగాపూర్): ఓ నిరుపేద యువకుడిని లక్ష్మీదేవి కరుణించడంతో రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన ఓగుల అజయ్ అనే యువకుడు దుబాయ్‌లో కొన్న లాటరీ టికెట్ అతన్ని రూ.30 కోట్లకు యజమానిని చేసింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. తుంగూరుకు చెందిన ఓగుల ప్రమీల– దేవరాజుది పేద కుటుంబం. వారికి గుంట వ్యవ సాయభూమి కూడా లేదు. దేవరాజు 2015లో మృతిచెందగా.. ప్రమీల తన ఇద్దరు పిల్లలు అజయ్, రాకేశ్‌ను కష్టపడి చదివించింది. అజయ్ నాలుగే ళ్లక్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఓ బంగారం దుకాణంలో డ్రైవర్‌గా పనికి కుదిరాడు. ఈ క్రమంలోనే 30 దిర్హాములతో రెండు ఎమిరేట్స్ లక్కీ లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. అందులో నంబర్లు కలిపితే ప్రైజ్‌మనీ గెలుచుకోవచ్చు. అజ య్ ఆరు నంబర్లు కలపడంతో 1.50 కోట్ల దిర్హాము లు (రూ.30 కోట్ల రూపాయలు) గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా అజయ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘మాది పేద కుటుంబం. నేను కొనుగోలు చేసిన లాటరీ టికెట్ ద్వారా రూ.30 కోట్లు గెలుచుకోవడం సంతోషంగా ఉంది’ అని తెలిపారు. -
అప్పుడు కొడుకును.. ఇప్పుడు భార్యను..
పెగడపల్లి(ధర్మపురి): డబ్బు కోసం, పొలంలో వాటా కోసం కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి చంపాడు... కూతురిపై కూడా దాడి చేసేందుకు యత్నించేలోగా ఆమె పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది. గతంలో కొడుకును హత్య చేసి ఆ కేసులో జైలుకెళ్లి వచ్చి ఇప్పుడు భార్యను పొట్టనబెట్టుకున్న ఓ కర్కోటకుడి నిర్వాకం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలో ఆదివారం కలకలం రేపింది. సీఐ వెంకట రమణమూర్తి కథనం మేరకు.. గ్రామానికి చెందిన నక్క రమేశ్–గంగవ్వ(45) దంపతులు. వీరికి కుమారుడు జలేందర్, కూతురు స్నేహ ఉన్నారు. రమేశ్ ఉపాధి కోసం గతంలో దుబాయి వెళ్లివచ్చాడు. అక్కడ సంపాదించిన డబ్బు విషయంలో రమేశ్, గంగవ్వ మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో 2019 నవంబర్‌లో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మధ్యలో వారించిన కొడుకు జలేందర్‌ను గొడ్డలితో నరికి హత్య చేశాడు రమేశ్. ఈ కేసులో జైలుకు వెళ్లి ఇటీవల విడుదలయ్యాడు. అప్పట్నుంచి భార్య, భర్త వేర్వేరుగానే ఉంటున్నారు. తమకు ఉన్న వ్యవసాయ భూమిని ఇద్దరూ వేర్వేరుగా సాగు చేసుకుంటున్నారు. అయితే, గంగవ్వ సాగు చేసుకుంటున్న భూమి తనకే ఇవ్వాలని రమేశ్ కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఆమె నిరాకరించడంతో హత్య చేయాలని పథకం పన్నాడు. ఆదివారం గంగవ్వ, ఆమె కూతురు స్నేహ పొలంలో వరి నాటు వేసేందుకు వెళ్లారు. విషయం తెలిసి రమేశ్.. పొలం వద్దకు వెళ్లి.. కత్తితో భార్య గంగవ్వపై దాడి చేశాడు. కూతురు స్నేహ అడ్డుకునేందుకు యత్నించగా ఆమెపైనా దాడికి యత్నించాడు. కూతురు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని అక్కడినుంచి తప్పించుకుని పారిపోయింది. భార్య గంగవ్వను కత్తితో కడుపు, వీపు భాగంలో గట్టిగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రమేశ్ పరారీలో ఉన్నాడనీ మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. -
రాష్ట్రానికి పీడ విరగడైంది
జగిత్యాల, మల్యాల(చొప్పదండి): సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోయిండు.. తెలంగాణ ప్రజలకు పీడ విరగడైంది’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. మంగళవారం ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణకు పట్టిన శని అని, టీఆర్ఎస్ నుంచి ‘తెలంగాణ’అనే పేరు తొలగించి తెలంగాణ తల్లికి ద్రోహం చేశారని విమర్శించారు. తెలంగాణతో ఉన్న బంధం ఇక కేసీఆర్‌కు తెగిపోయిందన్నారు. తెలంగాణను దోచుకున్న కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆయనపై యుద్ధం చేస్తే భయపడి ఢిల్లీకి పోయారని, భవిష్యత్‌లో విదేశాలకు పారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ దందాలో ఇరుక్కుపోయారని, ఆమెను విడిచిపెడదామా? అని ప్రశ్నించారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో పైలెట్ రోహిత్‌రెడ్డి.. బెంగళూర్ డ్రగ్స్ కేసులో పైలెట్ రోహిత్ ఉన్నారని సంజయ్ ఆరోపించారు. డ్రగ్స్ కేసు విచారిస్తున్న కొందరు బెంగళూర్ అధికారులు. హైదరాబాద్ అధికారులు సీఎంవోకు వివరాలు లీక్ చేస్తున్నారని అన్నారు. తనపై లీగల్ టీం ఎంక్వైరీ చేసిన విషయం రోహిత్‌రెడ్డికి తెలియదని, ఒక వేళ తెలిస్తే రోహిత్‌రెడ్డి వాస్తవాలు చెబుతాడని సీఎం భయపడ్డారని వ్యాఖ్యానించారు. అందుకే హడావుడిగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డితో సెక్షన్ 164 కింద జడ్జి ఎదుట వాంగ్మూలం ఇప్పించారన్నారు. కేసీఆర్‌వి జూటా మాటలు ‘కేసీఆర్‌వి జూటా మాటలు.. కొండగట్టు బస్సు దుర్ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు కన్నీరు పెట్టినా.. సీఎంలో చలనం లేదు.. బా«ధిత కుటుంబాలను కనీసం పరామర్శించిందిలే.. రూ.లక్ష కూడా పరిహారం ఇవ్వలేదు.. అలాంటి సీఎం.. కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు ఇస్తారా’ అని సంజయ్ నిలదీశారు.. ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా మంగళవారం కొండగట్టులో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతులకు నివాళి అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం.. కొండగట్టు ప్రమాద బాధితుల ఊసెత్తకపోవడం సిగ్గుచేటనీ.. ఆయనకు పేదోళ్ల ఉసురు తగుల్తది అని బండి శాపనార్థాలు పెట్టారు. ‘తెలంగాణలో ఏం పీకినవ్ అని.. దేశ రాజకీయాల్లో ఏం పీకుతావని’ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్, గుజరాత్, యూపీ, హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తా అంటడు.. నిన్ను ఎవరు పిలిచారు.. దేశంలో కేసీఆర్ అంటే కూడా ఎవరికీ తెలియదు. కవితకు బతుకమ్మ ఆడవచ్చా.. డీజే డ్యాన్సులు, డిస్కో డ్యాన్సులతో బతుకమ్మ సంస్కృతిని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, హత్యలు జరుగుతుంటే కళ్లలో ఎందుకు నిప్పులు చెరగడం లేదు.. కవితా నీకు బాధ వస్తేనే నిప్పులు చెరుగుతాయా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నన్ను ఆరు ముక్కలు చేసినా సరే..
కోరుట్ల/కోరుట్ల రూరల్: ‘నన్ను ఆరు ముక్కలు చేస్తారట. నన్ను చంపినా సరే.. కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేయాలి’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన నిర్వహిస్తున్న ప్రజాసంగ్రామ యాత్ర ఆదివారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్, మోహన్‌రావుపేటలో సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రచ్చబండలో సంజయ్ మాట్లాడారు. ప్రధాని మోదీ పేరుచెప్పి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. 24 గంటల ఉచిత కరెంటు మాట ఉత్తదేనన్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీడీ కార్మికుల సమస్యలు యధాతథంగా ఉన్నాయని, ఉద్యోగాలు, ఉపా«ధి లేక గల్ఫ్ వెళ్తున్న కుటుంబాలను ఆదుకునే దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అ«ధికారంలోకొస్తే ఉచిత విద్య, వైద్యం, గల్ఫ్ కార్మికుల ప్రత్యేక పాలసీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులు, ఆర్టీసీ చార్జీలు పెంచి పేదలపై పెనుభారం మోపిందని ధ్వజమెత్తారు. దేశంలో అత్యంత సంపన్న కుటుంబం కేసీఆర్‌దేనని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ దందాకే పరిమితం కాలేదని, పత్తాల ఆటలోనూ పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. ఇంద్రభవనం తీరుగా ఉన్న కవిత ఇల్లు చూసి లిక్కర్ స్కామ్ విచారణకు వెళ్లిన సీబీఐ అధికారులు కూడా విస్తుపోయారన్నారు. 50 గ్రామాలకు వాడాల్సిన కరెంటును కేసీఆర్ తన ఫామ్‌హౌస్ కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. -
శ్మశానం కోసం 4 కిలోమీటర్ల ప్రయాణం
కోరుట్ల: శ్మశానవాటికకు స్థల కేటాయింపు వివాదాస్పదం కావడంతో.. అంత్యక్రియల కోసం నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో శనివారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఏసికోనిగుట్ట కాలనీకి చెందిన వంగాల ఈశ్వరయ్య (56) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందాడు. ఆ కాలనీ వాసులకోసం గతంలో మున్సిపల్ అధికారులు కేటాయించినట్లుగా భావిస్తున్న స్థలంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని అక్కడికి తీసుకెళ్తుండగా సమీపంలోని ఇళ్లకు చెందినవారు అడ్డుకున్నారు. అక్కడ శ్మశానం కోసం స్థలం కేటాయించలేదని.. తమ ఇళ్ల ముందు శవదహనం చేయడం కుదరదని పట్టుబట్టారు. దీంతో పాడె మీద ఉన్న మృతదేహాన్ని కిందకి దించలేక సుమారు 2 గంటలపాటు అలాగే ఎత్తుకుని ఉన్నారు. ఇరువర్గాల మధ్య వివాదం ముదరడంతో ఎస్సైలు సతీష్, శ్యాంరాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. శ్మశానం కేటాయింపు విషయంలో స్పష్టత లేదని మున్సిపల్ అధికారులు కూడా చెప్పడంతో కాలనీకి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదర్శనగర్ పూల్వాగు శ్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. -
సీఎం గైర్హాజరుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం
రాయికల్: అహంకారంతో సీఎం ప్రధాని పర్యటనలో పాల్గొనకపోవడం.. రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఆయన జగిత్యాల జిల్లా రాయికల్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా పార్టీలకు అతీతంగా స్వాగతం పలకడం సంప్రదాయమ ని ఆయన స్పష్టం చేశారు. విపక్ష సీఎంలు స్టాలిన్, మమతబెనర్జీలు సైతం తమ రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించినప్పుడు స్వాగ తం పలికి.. రాష్ట్రాభివృద్ధిపై నిలదీస్తారని వివరించారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరై రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 9 మండలాలు ఆంధ్రలో కలిసినప్పుడు సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఆరోపించారు. -
వైఎస్సార్ బిడ్డను.. ఆశీర్వదించండి
జగిత్యాల: దివంగత మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా ప్రజలముందుకొచ్చా నని, వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. జగిత్యాల జిల్లాలో చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం 196వ రోజు కొనసాగింది. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్‌లో జరి గిన బహిరంగసభలో ఆమె మాట్లాడుతూ..అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, వంటి పథకాలను అమలు చేసిన ప్రజానాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన ఎనిమిదేళ్ల పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు. ప్రతీ వర్గాన్ని మోసం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణను బీరు, బార్ల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ డ్రామారావుగా మారారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ హయాంలోనే జగిత్యాల అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. -
ఎన్నికలు వస్తేనే సీఎం బయటకు వస్తారు
మల్లాపూర్(కోరుట్ల)/మల్లాపూర్: వరి వేస్తే ఉరే.. అని చెప్పిన కేసీఆర్ ఒక సన్నాసి ముఖ్యమంత్రి అని, రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న బంగారం లాంటి తెలంగాణను రూ.4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలంలోకి ప్రవేశించింది. వివిధ గ్రామాల గుండా ఈ యాత్ర సాగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా సీఎం కేసీఆర్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వస్తారని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా షర్మిల యాత్ర టీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సొంత గ్రామమైన రాఘవపేటకు చేరుకున్న సందర్భంగా ఆమె సీఎం కేసీఆర్, ప్రభుత్వంపై విమర్శిస్తూ ప్రసంగించారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల ప్రసంగాన్ని అడ్డుకుని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
ఆటోను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మహిళలు దుర్మరణం
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్గటూర్ మండలం కృష్ణారావుపేటలో వేగంగా వచ్చిన ఓ కారు ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు ధర్మపురి మండలం కమలాపూర్ వాసులుగా గుర్తించారు. ఇదీ చదవండి: పాణం తీసిన బంగారు గొలుసు -
దొంగచాటుగా మహిళల ఫొటోలు తీసి.. ట్విటర్లో పెట్టి..
సాక్షి, జగిత్యాల జిల్లా: అతడో వాటర్ బబుల్ బాయ్.. మినరల్ వాటర్ సరఫరా చేస్తూ.. అదను చూసి దొంగచాటుగా మహిళల ఫొటోలు చిత్రీకరించాడు.. ఓ మహిళ పేరిట ట్విటర్ ఖాతా తెరిచాడు.. సుమారు 400 ఫొటోలను అందులో అప్లోడ్ చేశాడు.. విషయం తెలిసిన బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాలు.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెం గ్రామానికి నల్ల రవి(34) మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఎకీన్పూర్, సంగెం గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ వాటర్ బబుల్స్ సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళల ఫొటోలను మొబైల్ ఫోన్లో దొంగచాటుగా చిత్రీకరించాడు. సుమారు ఏడాదిగా దాదాపు 400 మంది మహిళలను ఫొటోలు తీసినట్లు సమాచారం. ఇలా తీసిన ఫొటోలను మంగళవారం ఉమ పేరిట ట్విటర్ ఖాతా తెరిచి అందులో అప్లోడ్ చేశాడు. వీటిని చూసిన సంగెం గ్రామస్తులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఆ వెంటనే కోరుట్ల పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడి ఆచూకీ కోసం ఎస్సై సతీశ్‌కుమార్ ప్రయత్నించగా మొబైల్ ఫోన్‌స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆరా తీయగా ఇంట్లో కూడా లేడని తెలిసింది. అయితే, ట్విటర్లోని ఫొటోలు వెంటనే తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అయితే, ఈ ఫొటోలు అశ్లీలంగా లేవని తెలిసింది. -
యమధర్మరాజుకి ప్రత్యేక పూజలు
-
దేవాలయమే పాఠశాల
-
జగిత్యాలలో కారు ప్రమాదం
-
ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై గ్రామస్తుల దాడి
ఇబ్రహీంపట్నం/కోరుట్ల/జగిత్యాల: వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై ఎర్దండి గ్రామస్తులు దాడి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టునుంచి నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిని ఆ వరద చుట్టుముట్టింది. బాధితులను పరామర్శించి, గోదావరి వరదపై సమీక్షించేందుకు ఎంపీ అర్వింద్ శుక్రవారం ఆ గ్రామానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ‘ఎంపీ అర్వింద్ డౌన్ డౌన్.. గో బ్యాక్’అని నినాదా లు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఓ గ్రామస్తుడు ఎంపీకి చెప్పుల దండ వేసేందుకు య త్నించాడు. పోలీసులు అడ్డుకుని అతడిని పక్క కు పంపించారు. తమ గ్రామంలో భూ సమస్యను పరిష్కరించకుండా ఎందుకు వచ్చారని గ్రామస్తులు ఆయనను నిలదీశారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకుని పంపించారు. దీంతో ఎంపీ గోదావరి నది వద్దకు వెళ్లి వరద పరిస్థితి సమీక్షించి వెనుదిరిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మరోసారి ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. కొందరు ఆగ్రహంతో ఎంపీ కారుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎంపీ కారు వెనుకాల అద్దం పగిలిపోయింది. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో పోలీసులు బందోబస్తు మధ్య ఎంపీని అక్కడినుంచి పంపించివేశారు. కారుపై దాడి చేసిన ఓ వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. గోదావరి వరద ముంపు కారణంగా 1996లో ఎర్దండి గ్రామంలోని 200 మందికి సమీపంలోని బర్ధీపూర్‌లో భూములు కేటాయించారు. అయితే గతంలోనే బర్ధీపూర్లోని మరికొందరికి కూడా ఆ భూములు కేటాయించారు. ఒకే సర్వేనంబర్‌లోని భూములు కావడంతో అది వివాదంగా మారింది. ఏడాది కిందట విజ్ఞప్తి చేసినా తమ సమస్య పరిష్కరించలేదని ఎర్దండి వాసులు ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంత్రి, ఎమ్మెల్యేల కుట్ర: అర్వింద్ తమ భూ దందాలు బయట పడతా యన్న భయంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తనపై దాడి చేయించారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. శుక్రవారం కోరుట్లలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిర్మల్ ప్రాంతానికి చెందిన ఎస్సారెస్పీ ముంపు బా«ధితులకు ఎర్దండిలో రోడ్డు వెంట కేటాయించిన భూమిని ఆక్రమించాలన్న లక్ష్యంతో కుట్ర లు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ గూండాలను ఉసిగొలిపి తన కారు అద్దాలు ధ్వంసం చేయడం సిగ్గుచేటన్నారు. చదవండి: వరద విరుచుకుపడినా నిలబడిన కడెం.. చరిత్రలో తొలిసారి భీకర దృశ్యాలు అర్వింద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై జరిగిన దాడిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. దాడి జరిగిందనే సమాచారం తెలియగానే అమిత్ షా అర్వింద్‌కు ఫోన్‌చేసి ఘటనపై ఆరా తీశారు. పథకం ప్రకారమే తనపై దాడి జరిగిందని, అమిత్ షాకు అర్వింద్ వివరించా రు. నియోజకవర్గం పరిధిలో తాను ఎక్కడ పర్యటించినా దాడులు చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు సూచించిందని ఆయన అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లా రు. దాడి వెనుక కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు హస్తం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, ఆర్వింద్‌పై దాడి ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. -
రైలు ఢీకొని 82 గొర్రెలు మృతి
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చినమెట్‌పల్లి సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద ఆదివారం మధ్యాహ్నం గూడ్సు రైలు ఢీకొని 82 గొర్రె లు మృతి చెందాయి. కాపరి గొర్రెలను పట్టాలు దాటిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. సుమారు రూ.8 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు బాధితుడు లక్కం రాజం ఆవేదన వ్యక్తం చేశా డు. లక్కం రాజంను ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్ తెలిపారు. -
కరీంనగర్ జిల్లాలో మరో ఆరు కొత్త మండలాలు!?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో మరో ఆరు కొత్త మండలాలు రాబోతున్నాయి. ఒకప్పుడు 57 మండలాల సువిశాల జిల్లాగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ తరువాత నాలుగు కొత్త జిల్లాలుగా ఆవిర్భవించింది. మరో మూడుజిల్లాల్లోనూ పాత మండలాలు కలిశాయి. మొత్తానికి జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016లో కేవలం 16 మండలాలతో చిన్న జిల్లాగా కరీంనగర్ ఆవిర్భవించింది. చాలాకాలంగా కొన్ని గ్రామాలను మండలాలుగా చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ఇటీవల సర్వే కూడా ప్రారంభించింది. చల్లూరు (వీణవంక), వావిలాల (జమ్మికుంట), గర్షకుర్తి (గంగాధర), గోపాలరావుపేట (రామడుగు), రేణికుంట (తిమ్మాపూర్) (పర్లపల్లి లేదా నుస్తులాపూర్ను సైతం పరిశీలిస్తున్నారని సమాచారం) గ్రామాలను కొత్త మండలాల కోసం గురువారం సర్వే నిర్వహించారు. గ్రామాల మ్యాప్‌లతో కొత్త మండలాల ప్రతిపాదనలను జిల్లా అధికారులకు అందజేసినట్లు తెలిసింది. వీటిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జగిత్యాలలో రాజారాంపల్లి జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలం రాజారాంపల్లి– ఎండపెల్లి గ్రామాలను కలిపి మండలకేంద్రంగా చేయాలని ప్రతిపాదనలను తాజాగా రెవెన్యూ అధికారులు పంపారు. ఇందుకోసం ధర్మారం మండలంలోని మూడు గ్రామాలను విలీనం చేసేందుకు గతంలోనే గ్రామపంచాయతీలు తీర్మానం కూడా చేశాయి. వీటిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉందని, ఆగస్టు 15 నాటికి ప్రతిపాదనలకు సంబంధించిన మండలాలపై అధికారిక ప్రకటన ఉండే అవకాశముందని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజనలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న వేళ కొత్త మండలాల ప్రస్తావన ఆసక్తికరంగా మారింది. (క్లిక్: కాకతీయ ఉత్సవాలు అద్భుతం!) -
కిడ్నాపర్ల చెరలో నందగిరి వాసి
పెగడపల్లి(ధర్మపురి): జగిత్యాల జిల్లాలో కిడ్నాప్‌కు గురైన మత్తమల్ల శంకరయ్య (50)ను తాళ్లతో కట్టేసి బంధించిన ఫొటోను కిడ్నాపర్లు గురువారం అతడి కుమారుడు హరీశ్‌కు పంపించారు. దీంతో శంకరయ్య కిడ్నాపర్ల చేతిలో బందీగా ఉన్నట్లు తేలిపోయింది. వివరాల్లోకి వెళ్తే... పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన శంకరయ్య ఈ నెల 22న దుబాయి నుంచి ముంబైకి వచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చి ట్యాక్సీ ఎక్కే క్రమంలో అతను కిడ్నాప్‌కు గురయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. కిడ్నాపర్లు శంకరయ్య ఫొటోను ఇంటర్నెట్ ద్వారా అతడి కుమారుడు హరీశ్ వాట్సాప్‌కు గురువారం పంపించారు. ఇంటర్ నెట్ ద్వారా ఫోన్ చేసిన కిడ్నాపర్లు తమిళ, మళయాల భాషల్లో మాట్లా డారు. రూ.15 లక్షలు ఇస్తేనే శంకర య్యను వదిలిపెడతామని తేల్చి చెప్పారు. మధ్య తరగతి కుటుంబా నికి చెందిన తాము రూ.15 లక్షలు ఎక్కడి నుంచి తేవాలని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. అతని భార్య అంజవ్వ, కుమారుడు హరీశ్, కూతురు గౌతమి వారం రోజులుగా క్షణక్షణం భయంగా గడుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవ చూపి శంకరయ్య క్షేమంగా ఇంటికి చేరేలా తగిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. -
అధికారులపై పెట్రోల్ పోసి.. లైటర్‌తో నిప్పంటించి..
సారంగాపూర్ (జగిత్యాల): దారి వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన అధికారులపై ఓ వ్యక్తి దాడి చేశాడు. పవర్ స్ప్రేతో పెట్రోల్ చల్లి లైటర్‌తో నిప్పంటించాడు. దీంతో ఓ అధికారికి స్వల్ప గాయాలయ్యాయి. మిగతా అధికారులు, పక్కనున్న గ్రామస్తులు పరుగులు పెట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో మంగళవారం ఈ దారుణం జరిగింది. దారి తనదంటూ.. ఎవరూ వెళ్లొద్దంటూ.. తుంగూరు గ్రామానికి చెందిన చుక్క గంగాధర్ ఇంటి వద్దకు బస్టాండ్ సమీపంలోని మెయిన్ రోడ్డు నుంచి దారి ఉంది. మరో 10 ఇళ్లకు కూడా ఇదే దారి. అయితే ఆ స్థలం తన సొంత ఆస్తి అని, ఈ దారి నుంచి ఎవరూ నడవొద్దని ఆ 10 ఇళ్ల వాళ్లను గంగాధర్ కొంతకాలంగా బెదిరిస్తున్నాడు. దీంతో వాళ్లు ఆరేడుసార్లు ప్రజావాణి ద్వారా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశించినా కింది స్థాయి అధికారులు ఇంతకాలం నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. గత ఫిబ్రవరిలో మళ్లీ ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేయగా కలెక్టర్ ఆదేశాలతో డీఎల్పీవో కనకదుర్గ, తహసీల్దార్ అరీఫుద్దీన్, ఎస్సై గౌతమ్ పవార్, ఎంపీవో వెంకటకృష్ణరాజు తుంగూరుకు వెళ్లారు. కాలనీవాసులు, గ్రామస్తులను కలిసి వివరాలు సేకరించారు. ఆ తర్వాత దారికి అడ్డుగా పెట్టిన కర్రలను పంచాయతీ సిబ్బంది తొలగించారు. దీంతో గంగాధర్ అసభ్య పదజాలంతో అధికారులను తిడుతూ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులపై దాడికి దిగాడు. అతడిని పోలీసులు అడ్డుకొని దారిని క్లియర్ చేయించారు. -
చేపల కోసం వలేస్తే.. మొసలి చిక్కింది!
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామశివారులోని పెద్దచెరువులో శుక్రవారం మత్స్యకారుల వలకు ఓ మొసలి చిక్కింది. చేపల పట్టుకునేందుకు కొందరు వలలు వేయగా.. ఆ వలలో మొసలి పడింది. మరికొందరితో కలిసి దానిని ఒడ్డుకు చేర్చిన మత్స్యకారులు, ఫారెస్ట్ బీట్ అధికారి రత్నాకర్‌కు సమాచారం ఇచ్చారు. సిబ్బందితో కలిసి వచ్చిన ఆయన మొసలిని తీసుకెళ్లారు. సమీప గోదావరి నదిలో విడిచి పెట్టారు. మొసలి వయసు సుమారు రెండేళ్లు ఉంటుందని, అరవై కేజీల బరువుంటుందని రత్నాకర్ తెలిపారు. కాగా, గ్రామ చెరువులో తొలిసారి మొసలి ప్రత్యక్షం కావడంతో మత్స్యకారులు కొద్దిగా ఆందోళన చెందారు. -
సొంతూరికి బస్సు వచ్చేలా చేసిన బిగ్‌బాస్ గంగవ్వ..
Bigg Boss Gangavva Initiative For Bus Service To Lambadipally: యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ గంగవ్వ పల్లెటూరి యాస, మంచి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంది. 'మై విలేజ్ షో'లో తనదైన నటనతో పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ బిగ్‌బాస్ నాలుగో సీజన్లో అడుగు పెట్టి మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అనారోగ్య కారణలతో ఐదో వారంలోనే బిగ్‌బాస్ హౌజ్ నుంచి నిష్కమించిన గంగవ్వ.. మల్లేషం, ఇస్మార్ట్ శంకర్, లవ్ స్టోరీ, రాజ రాజ చోర చిత్రాల్లో నటించి అలరించింది. ఇటీవల తన సొంతింటి కలను నిజం చేసుకున్న గంగవ్వ తాజాగా తన సొంతూరికి తిరిగి బస్సు సర్వీసును తీసుకొచ్చింది. గంగవ్వది తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామం. ఈ గ్రామానికి మొదట్లో బస్సు సర్వీసు ఉండేది. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా లంబాడిపల్లికి ఆర్టీసీ బస్సు రావట్లేదు. దీంతో గ్రామస్థులు, వ్యవసాయ దారులు, కూలీలు, విద్యార్థులు జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్లి రావడానికి ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ వాహనాల్లో జగిత్యాలకు వెళ్లి రావాలంటే వాహన చార్జీలతో తలకుమించిన భారమైంది. తమ సమస్యలకు పరిష్కారంగా బస్సు సర్వీసును తిరిగి ప్రారంభించాలనుకున్నారు లంబాడిపల్లి గ్రామ ప్రజా ప్రతినిధులు. ఇందుకోసం బిగ్‌బాస్ ఫేమ్, యూట్యూబ్ స్టార్ గంగవ్వ సహాయం కోరారు. చదవండి: తన కొత్తింటిని చూపిస్తూ మురిసిపోయిన గంగవ్వ లంబాడిపల్లికి తిరిగి బస్సు తీసుకురావాలన్న లక్ష్యంతో గ్రామస్థులతో కలిసి జగిత్యాల ఆర్టీసీ డిపో అధికారులను కలిసింది గంగవ్వ బృందం. గంగవ్వ వినతితో లంబాడిపల్లికి బస్సు సర్వీసును తిరిగి పునరుద్ధరించారు అధికారులు. ప్రస్తుతం ఈ గ్రామానికి జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ఐదు ట్రిప్పలుగా ఆర్టీసీ సేవలు అందిస్తోంది. లంబాడిపల్లికి తిరిగి బస్సు రావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులను కలిసిన గంగవ్వ బృందంలో 'మై విలేజ్ షో' టీం నటులు అనిల్, అంజి మామ తదితరులు ఉన్నారు. చదవండి: ‘గాడ్ ఫాదర్’లో తన రోల్ చెప్పెసిన గంగవ్వ, ఏకంగా చిరుకు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1571342813.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ఈత’రాన్ని మింగేసిన చెరువు
ధర్మపురి: ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చెరువులో మునిగి మృతి చెందారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో విషాదం నింపింది. గ్రామస్తులు, పోలీసులు అందించిన వివరాలివి.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామానికి చెందిన మారంపెల్లి శరత్ (12), నవదీప్ (12)తో పాటు నల్గొండ జిల్లా దోసారం గ్రామానికి చెందిన గొలుసుల యశ్వంత్ (13) ఆదివారం ఉదయం పాఠశాల పక్కనే ఉన్న చెరువులో ఈతకు వెళ్లారు. గతేడాది మిషన్ కాకతీయ కింద చెరువులో మట్టి తీయడంతో నీటి లోతు తెలియలేదు. దీంతో చెరువులోకి దిగిన ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగిపోయారు. కొంత సమయం తర్వాత గ్రామస్తులకు చెరువు పక్కన చెప్పులు కనిపించడంతో ఆందోళనతో కేకలు వేశారు. సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు.. గ్రామస్తుల కేకలు విని మూడు మృతదేహాలను బయటికి తీశారు. శరత్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి, యశ్వంత్ ఎంపీపీఎస్ పాఠశాలలో 4వ, తరగతి, నవదీప్ ధర్మపురిలోని కేరళ ఇంగ్లిష్ మీడియంలో 4వ తరగతి చదువుతున్నారు. బతుకుతెరువు కోసం నవదీప్ తండ్రి కిషన్ రెండేళ్ల క్రితం, శరత్ తండ్రి సత్తయ్య 10 నెలల క్రితం దుబాయ్ వెళ్లారు. యశ్వంత్ తల్లిదండ్రులు వారం క్రితం స్వగ్రామం నల్గొండ జిల్లాకు వెళ్లారు. ఈ సంఘటనతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులు చెరువు వద్దకు తరలివచ్చి కంటతడి పెట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. -
సీసీటీవీ ఫుటేజ్‌లో దొంగ విజువల్స్.. కానీ కనిపెట్టని పరిస్థితి..?
-
కారు కొనివ్వలేదని యాసిడ్ తాగాడు..
కోరుట్ల: తనకు కారు కొనివ్వడం లేదని సీపెల్లి భానుప్రకాశ్‌గౌడ్ (22) అనే యువకుడు యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మం డలం కల్లూర్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్సై సతీశ్ కథనం ప్రకారం.. కల్లూ ర్ గ్రామానికి చెందిన సీపెల్లి అంజయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు భానుప్రకాశ్‌గౌడ్ కొంతకాలంగా కారు కొనివ్వాలని కుటుంబసభ్యులను కోరుతూ వస్తున్నాడు. 15 రోజులుగా మరింత పట్టుబట్టి ఇంట్లో వారిని అడిగితే, ఎవరూ పట్టించుకోవడం లేదనే కారణంతో శనివారం రాత్రి 9 గంటల సమయంలో గ్రామశివారులో యాసిడ్ తాగాడు. ఆ తర్వాత మంటకు తాళలేక అరుస్తూ రోడ్డుపైకి వచ్చాడు. ఇది గమనించిన స్థానికులు భానుప్రకాశ్‌ను ఇంటికి తీసుకెళ్లారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. ఇదివరకు కూడా సెల్‌ఫోన్ కొనివ్వలేదని భానుప్రకాశ్ చేయి కోసుకున్నట్లు సమాచారం. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. -
టీచర్ పాడు బుద్ధి.. విద్యార్థినులకు అశ్లీల చిత్రాలు చూపించి..
ధర్మారం(ధర్మపురి)జగిత్యాల జిల్లా: ఓ ఉపాధ్యాయుడే విద్యార్థినులకు సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలు చూపించిన ఘటన ధర్మారం మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఆలస్యంగా వెలుగుచూసింది. సదరు టీచర్ ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్‌డే సందర్భంగా విద్యార్థులకు సెల్ఫోన్లో సైన్స్ ప్రయోగాలు చూపించాడు. అయితే తమకు అశ్లీల చిత్రాలు చూపించాడని పేర్కొంటూ ఇద్దరు విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు తెలిపారు. అప్పటినుంచి పాఠశాలకు సెలవులు రావడంతో ఆ విషయాన్ని మర్చిపోయారు. అయితే సదరు ఉపాధ్యాయుడు గురువారం తొమ్మిదో తరగతి చదువుతున్న మరో విద్యార్థినికి అశ్లీల చిత్రాలు చూపించాడు. చదవండి: ప్రేయసితో పెళ్లికి భార్య అంగీకరించలేదని.. దీంతో ఆమె ఇంటికెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కోపోద్రిక్తులైన వారు ఫోన్ చేసి, హెచ్ఎంకు ఫిర్యాదు చేశారు. తర్వాత గ్రామస్తులతో కలిసి పాఠశాలకు చేరుకొని, ఆ ఉపాధ్యాయుడిని గదిలో బంధించి, చితకబాదారు. టీచర్‌ను పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయురాలు డీఈవోకు తెలిపారు. డీఈవో ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడి నిర్వాకంపై ఆమె జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్సై శ్రీనివాస్ రాత్రి గ్రామానికి వెళ్లి, విచారణ జరిపినట్లు సమాచారం. దీనిపై పోలీసులను వివరణ కోరగా.. తమకు ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. -
క్షుద్రపూజ స్థావరాలపై దాడులు
జగిత్యాలక్రైం: క్షుద్రపూజలు, బాణామతి, మంత్రతంత్రాల స్థావరాలపై జిల్లా పోలీసులు ఆదివారం ఏకకాలంలో మెరుపు దాడులు చేశారు. ఎస్పీ సింధూశర్మ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని భవానీనగర్, మల్లాపూర్ మండలం వేంపేట శివారు, మేడిపల్లి మండలం కేంద్రం, కోరుట్ల పట్టణంలోని పలువురు ఇళ్లు, పూజాప్రాంతాలపై మధ్యా హ్నం 3.30గంటల ప్రాంతంలో స్థానిక పోలీసులు దాడులు చేశారు. ఆయా ప్రాంతాల్లో 78మందిని అదుపులోకి తీసుకు న్నారు. విచారణ అనంతరం నిందితులను తహసీల్దార్ల ఎదు ట బైండోవర్ చేశారు. కాగా, మంత్రాల నెపంతో జగిత్యాల టీఆర్ నగర్‌కు చెందిన తండ్రి, ఇద్దరు కొడుకులను ప్రత్య ర్థులు ఇటీవల దారుణంగా హతమార్చారు. రాయికల్ మం డలం జగన్నాథపూర్ గ్రామంలో మంత్రాలు, క్షుద్రపూజలు చేస్తున్నారని, వారు పద్ధతి మార్చుకోకుంటే మరణ శిక్ష తప్ప దని బహిరంగంగా ప్రకటిస్తూ కొందరు ఇటీవల ఫ్లెక్సీ ఏర్పా టు చేయడం సంచలనం సృష్టించింది. మూఢనమ్మకాలతో అమాయకుల ప్రాణాలు పోతున్నాయని, దొంగ బాబాలు, దొంగ పూజారులు, మాయగాళ్లు ప్రజల అమాయకత్వంతో ఆడుకుంటూ, డబ్బు దండుకుంటూ సమాజంలో భయభ్రాం తులు సృష్టిస్తున్నారని కొంతకాలంగా ఫిర్యాదులు వెల్లువెత్తు తున్నాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా పోలీసుశాఖ.. రహ స్య ప్రణాళికతో జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసింది. ఈ సందర్భంగా ఎస్పీ సింధూశర్మ మా ట్లాడుతూ మంత్రాల పేరిట ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
కుల ‘పెద్ద’ల కుటిలం.. అంత్యక్రియలకు కూడా ఆంక్షలు.. మాట వినలేదని
జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాలో కులపెద్దల కట్టుబాటుతో ఓ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పంచాయితీ పెద్దలను గౌరవించలేదని ఆ కుటుంబంపై కక్షగట్టారు. కులస్తులు దూరంగా ఉండాలని ఆంక్షలు విధించారు. దీంతో బాధిత కుటుంబంలో వ్యక్తి మృతిచెందినా అంత్యక్రియలకు ఎవరూ హాజరుకాలేదు. చివరకు అంత్యక్రియలకు సాయపడిన ఓ సామాజిక కార్యకర్తపై కూడా కన్నెర్ర చేశారు. అతడి కిరాణా షాపులో ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయొద్దని కట్టుబాటు విధించారు. జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మగ్గిడి ఎల్లయ్య (93)కు ముగ్గురు కుమార్తెలు. ఇందులో చిన్న కుమార్తెకు పెళ్లి చేసి వేరే ఇంటికి పంపగా, మిగతా ఇద్దరు కుమార్తెలు మగ్గిడి నర్సమ్మ, మగ్గిడి భూమవ్వలకు ఇల్లరికం పెళ్లి చేశాడు. తనకున్న భూమి నుంచి వచ్చే ఆదాయాన్ని తన పోషణ అనంతరం సమంగా తీసుకోవాలని సూచించాడు. ఈ క్రమంలో భూమవ్వ తనను పోషించడం లేదని కొద్దిరోజుల క్రితం తన పేరున ఉన్న భూమిని నర్సమ్మ పేరున రిజిస్ట్రేషన్ చేశాడు. దీంతో కొంతకాలంగా నర్సవ్వ, భూమవ్వల మధ్య భూవివాదం కొనసాగుతోంది. ఇదే అంశంపై భూమవ్వ కుల పెద్దలను ఆశ్రయించగా పంచాయితీ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 7న ఉదయం ఎల్లయ్య మృతిచెందాడు. దీంతో తాము చెప్పిన తీర్పునకు కట్టుబడి ఉంటేనే అంత్యక్రియలకు హాజరవుతామని కులపెద్దలు తేల్చిచెప్పారు. కులస్తులు ముందుకు రాకపోవడంతో నర్సమ్మ సాయంత్రం వరకూ ఎదురుచూసింది. దీంతో అంత్యక్రియలకు సహకరించాలని బాధితులు గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త కాసారపు రమేశ్‌తోపాటు మరికొందరిని సంప్రదించగా వారు ముందుకొచ్చి కార్యక్రమం పూర్తి చేశారు. దీంతో రమేశ్ కిరాణా దుకాణానికి ఎవరూ వెళ్లవద్దని కులపెద్దలు కట్టుబాటు పెట్టారు. దీంతో 17 రోజులుగా ఎవరూ రమేశ్ కిరాణా దుకాణానికి వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో మగ్గిడి నర్సవ్వతో పాటు, ఆమె మనుమడు, కాసారపు రమేశ్‌లు గురువారం జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్‌ను కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కులపెద్దల అరాచకంపై ఫిర్యాదు చేశారు. -
తీరు మారకుంటే.. ఆ ఎనిమిదిమంది మాంత్రికులను మట్టుబెడతాం!
సాక్షిప్రతినిధి, కరీంనగర్/రాయికల్ (జగిత్యాల): జగిత్యాలలో మంత్రాల నెపంతో ముగ్గురు వ్యక్తులను పాశవికంగా హతమార్చిన ఘటన మరువకముందే అలాంటి దృశ్యం పునరావృతం అవుతుందంటూ వెలిసిన ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. ఇటీవల మంత్రాల నెపంతో జగిత్యాలకు చెందిన వడ్డీ వ్యాపారి జగన్నాథం నాగేశ్వర్రావు అతని ఇద్దరు కుమారులను కులసంఘం సమావేశంలోనే హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో 8 మందిని అదే తరహాలో హతమారుస్తామంటూ.. శుక్రవారం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం జగన్నాథ్‌పూర్‌లో ఫ్లెక్సీ వెలిసింది. ఇది స్థానికులను కలవరపాటుకు గురిచేస్తోంది. గ్రామంలో 8 మంది మాంత్రికులు ఉన్నారని, వారు తీరు మార్చుకోకపోతే చంపుతామని అందులో హెచ్చరిక ఉంది. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్, ఎస్సై కిరణ్‌కుమార్ ఊరిలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో ఎవరికైనా ప్రాణభయం ఉన్నా, బెదిరింపులు వచ్చినా.. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. దీంతో గ్రామానికి చెందిన ఎనిమిది మంది గిరిజనులు తమకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. (చదవండి: బ్రహ్మ భైరవులు.. శివుడి ద్వారపాలకులు) -
మద్యం మత్తు.. అతివేగం
మల్యాల(చొప్పదండి): వారు వలసజీవులు .. ఆదివారం సెలవు దినం కావడంతో అవసరమైన వస్తువుల కొనుగోలుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆటోలో వస్తుండగా మద్యం మత్తులో వేగంగా బైక్ నడుపుతూ వచ్చిన వ్యక్తి వారి ఆటోని డీకొట్టాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యా ల జిల్లా మల్యాల మండలం రాజారం గ్రా మంలో జగిత్యాల – కరీంనగర్ రహదారిపై ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మల్యాల మండలం నూకపల్లిలో చేపట్టి నడబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో కూలీలుగా పనిచేసేందుకు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రా ష్ట్రాలకు చెందిన సుమారు 400 మంది వల స వచ్చారు. అక్కడే తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నారు. ఆదివారం నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు సదాకర్ సా హూ (25), గోపాల్ షత్నమి (20)తో పా టు మరోముగ్గురు జగిత్యాల వెళ్లారు. కొనుగోళ్లు పూర్తయ్యాక ఓ ఆటోలో నూకపల్లికి బయలుదేరారు. ఆటో మల్యాల మండలం రాజారం గ్రామ సమీపంలోకి చేరుకోగా, అదేసమయంలో మల్యాలకు చెందిన బత్తిని సంజీవ్ తన మిత్రుడు కలికంటి మధుతో కలిసి బైక్‌పై జగిత్యాల వెళ్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న సంజీవ్ బైక్‌ను అతివేగంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. బైక్ బలంగా ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న గోపాల్ షత్నమి, సదాకర్ సాహూతోపాటు బైక్ నడుపుతున్న బత్తిని సంజీవ్ (26) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రాజారం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ గుర్రం జితేందర్‌తోపాటు మరో నలుగురు వలసజీవులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. బైక్ వెనక సీటులో కూర్చున్న మధు కూడా గాయపడ్డాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై చిరంజీవి సందర్శించారు. -
బస్సులోనే గుండె పోటు: జగిత్యాలకు చెందిన మహిళ మృతి
సాక్షి, ముంబై: ముంబై నుంచి స్వగ్రామమైన జగిత్యాల జిల్లా పూడూరుకు వెళ్తుండగా మార్గమధ్యలో నే గుండెపోటుతో ఓ మహిళ మృతి చెందింది. పుణే లోని పాటస్ ప్రాంతంలో బుధవారంరాత్రి ఈ సం ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కొడి మ్యాల మండలం పూడూరుకు చెందిన పెద్ది కేతవ్వ (40) అనే మహిళ ముంబైలో కూలీగా పనిచేస్తుంది. తన కూతురు కల్యాణితో కలిసి బుధవారం శ్రీసాయిపూజా ట్రావెల్స్ బస్సులో ముంబై నుంచి బయలుదేరింది. అయితే అకస్మాత్తుగా కేతవ్వకు గుండెపోటు వచ్చింది. ట్రావెల్స్ యాజమాన్యం ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆమె కూతురికి అప్పగించారు. అనంతరం ఘటన స్థలం నుంచి భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు కూడా శ్రీసాయిపూజా ట్రావెల్స్ సహాయసహకారాలు అందించింది. మృతురాలి కుమార్తెతోపాటు అంబులెన్స్‌లో వచ్చి బంధువులకు మృతదేహాన్ని అప్పగించినట్టు ట్రావెల్స్ యజమాని పల్లికొండ తిరుపతి తెలిపారు. ట్రావెల్స్ యాజమాన్యాన్ని, మహేశ్, దుర్గేశ్, మునీందర్, డ్రైవర్ నర్సయ్య, ముహమ్మద్ అందరూ అభినందించారు. చదవండి: (రాత్రి కర్ఫ్యూ రద్దు.. ఫిబ్రవరి 1 నుంచి మళ్లీ బడులు: సీఎం) -
అనూహ్యంగా తెరపైకి పేరు.. గులాబీ బాస్‌గా ‘కల్వకుంట్ల’
సాక్షి, జగిత్యాల: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి అనూహ్యంగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు దక్కింది. అనేకమంది ఆశావహులు కుర్చీ కోసం పోటీపడ్డారు. అయినా, ముఖ్యమంత్రి కేసీఆర్.. విద్యాసాగర్‌రావుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇంతకాలం కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. గత సెప్టెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత ఎన్నికల సందడి మొదలైంది. నిరాశలో ఆశావహులు.. కీలకమైన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. పార్టీ సంస్థాగత కమిటీలు పూర్తయ్యాక జిల్లా అధ్యక్ష పదవిలో ఎవరిని నియమిస్తారనే అంశాన్ని సీఎం కేసీఆర్‌కు అప్పగిస్తూ అప్పట్లోనే నిర్ణయించారు. అనివార్య కారణాలతో ఆ ప్రక్రియ నిలి చిపోయింది. గ్రామ, మండల, పట్టణ కమిటీల నియామకం పూర్తయ్యింది. ప్రస్తుతం టీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడిగా విద్యాసాగర్‌రావును ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటన చేశారు. చదవండి: వీరే గులాబీ రథసారథులు.. 33 జిల్లాల అధ్యక్షుల జాబితా ఇదే మంత్రి ఆశీస్సులు ఉన్నవారికే పదవులని.. ధర్మపురి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఎమ్మెల్యేలకు అనుకూలమైన నాయకుల ఆశీస్సులు ఉన్నవారికే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని భావించారు. ఇందుకు భిన్నంగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు అనూహ్యంగా ఆ కుర్చీ దక్కింది. ధర్మపురి జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, మల్యాలకు చెందిన మిట్టపల్లి సుదర్శన్, వెల్గటూర్‌కు చెందిన పునుగోటి శ్రీనివాస్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి ఈ పదవిని ఆశించారు. వీరితోపాటు మరికొందరు నాయకులు పోటీపడ్డారు. మంత్రి, ఎమ్మెల్యేలు అందించిన నివేదికలోని పేర్లు, మరికొన్ని పేర్లను అధిష్టానం పరిశీలించింది. ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగా జిల్లా అధ్యక్షుడిగా విద్యాసాగర్‌రావును ఎంపిక చేసినట్లు తెలిసింది. పార్టీ భవనం పూర్తి ధరూర్ క్యాంప్‌లోని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిని ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే పార్టీ జిల్లా అధ్యక్ష పదవి భర్తీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బయోడేటా పేరు : కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (ఎమ్మెల్యే, కోరుట్ల) జననం: 10 నవంబర్ 1953 జన్మస్థలం: రాఘవపేట విద్యార్హతలు: బీఏ రాజకీయ ప్రవేశం..:1977లో స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ 1997 అక్టోబర్‌లో టీడీపీలో చేరారు. 1998లో ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2001లో ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీగా గెలుపొందారు. 2003లో ఆర్టీసీ జోనల్ చైర్మన్‌గా నియమితులయ్యారు.2008లో టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేస్తా జగిత్యాల/కోరుట్ల: ‘ప్రస్తుతం కోరుట్ల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా. ఇటీవల టీటీడీ బో ర్డు సభ్యుడిగా అకాశం కల్పించారు. తెలంగా ణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ సీఎం కేసీఆర్ నాకూ అనూహ్యంగా పదవి ఇచ్చారు. ఇది నాపై మరింత బాధ్యత పెంచింది’ అని కోరుట్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు వెల్లడించారు. ఇంకా ఏమంటున్నారంటే.. సాక్షి : చాలామంది జిల్లా అధ్యక్ష పదవి ఆశించారు. సీఎం కేసీఆర్ మిమ్మల్ని నియమించారు. మీ స్పందన ఏమిటి? విద్యాసాగర్‌రావు : ఉద్యమ నాయకుడిగా, సీనియర్ ఎమ్మెల్యేగా నాకు ఈ పదవి అప్పగించారు. బాధ్యతగా ఈ పదవిని నిర్వర్తిస్తా. సాక్షి : ఆశావహులు నిరాశలో ఉంటారు, వారిని ఎలా కలుపుకుపోతారు? విద్యాసాగర్‌రావు : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అందరినీ సమన్వయపరుస్తూ ముందుకు వెళ్తా. సాక్షి : చాలామంది నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు? విద్యాసాగర్‌రావు : జిల్లామంత్రి సహకారంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆశావహులకు న్యాయం చేస్తా. సాక్షి : రానున్న ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిగా ఎలాంటి చర్యలు చేపడతారు? విద్యాసాగర్‌రావు : టీఆర్ఎస్ ఇప్పటికే నంబర్‌వన్ స్థానంలో ఉంది. రానున్న ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో గెలుస్తాం. కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో వెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేస్తాం. సాక్షి : ఎమ్మెల్యేగా, టీటీడీ సభ్యుడిగా, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి.. వీటన్నింటికీ ఎలా న్యాయం చేస్తారు? విద్యాసాగర్‌రావు : ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నా. టీటీడీ సభ్యుడిగా భక్తులకు దైవ దర్శనం కల్పిస్తున్నాం. పార్టీ అధ్యక్షుడిగా అందరినీ సమన్వయపరుస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తా. -
జగిత్యాలలో దారుణం.. ముగ్గురు హత్య
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం తారకరామ నగర్లో ముగ్గురు వ్యక్తులను కొందరు దారుణంగా హత్య చేశారు. తండ్రి, ఇద్దరు తండ్రి నాగేశ్వరరావు, ఇద్దరు కుమారులు రాంబాబు, రమేశ్‌లను ప్రత్యర్ధులు దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. కుల సంఘం సమావేశం జరుగుతుండగా, రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రాల నేపంతో ఈ ముగ్గురి హత్య చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. -
జగిత్యాలలో క్షుద్రపూజల కలకలం
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడలో ఆదివారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు ఇళ్ల ముందు విచిత్రమైన ముగ్గులు, నిమ్మకాయలతో క్షుద్రపూజలు చేశారు. కాలనీవాసులు సోమవారం ఉదయం లేచి చూసేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కన్పించడంతో ఆందోళన చెందుతున్నారు. -
'నువ్వు ఈ రాత్రి మాతో ఉంటే నీ భర్తను అప్పగిస్తాం'
కోరుట్ల: మద్యం తాగి ఉన్న భర్తను కారులో బంధించి.. శారీరకంగా లొంగితేనే భర్తను అప్పగిస్తామంటూ.. ముగ్గురు వ్యక్తులు ఓ మహిళను బెదిరించి అర్ధరాత్రి నడిరోడ్డుపై లైంగికదాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బలో నివాసం ఉండే ఓ వ్యక్తి స్థానిక మున్సిపాలిటీలో ఐదేళ్లుగా పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య (36), ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈనెల 4వ తేదీన ఆ వ్యక్తి తన స్వగ్రామం చినమెట్‌పల్లికి వెళ్లాడు. అక్కడే బాగా కల్లు తాగాడు. మత్తులో ఉన్న అతడిని చూసిన అదే గ్రామానికి చెందిన నాగరాజు (26), తిరుపతి (24), రఘు (24).. కోరుట్లలో దింపుతామని తమ కారులో ఎక్కించుకున్నారు. తర్వాత అతడి భార్యకు ఫోన్‌చేశారు. ‘నీ భర్త మా దగ్గర ఉన్నాడు.. నువ్వు ఈ రాత్రి మాతో ఉంటే నీ భర్తను అప్పగిస్తాం’అని బెదిరించారు. తర్వాత రాత్రి 11.30 గంటల ప్రాంతంలో భీమునిదుబ్బలోని బర్రెల మంద వద్దకు చేరుకున్నారు. చదవండి: (Hyderabad: నగరంలో ఇద్దరు మహిళల అదృశ్యం.. ఫోన్ చేస్తే..) మరోసారి ఆ వ్యక్తి భార్యకు ఫోన్ చేసి ఆ రాత్రి తమతో ఉండాలని బెదిరించారు. అయితే, తన భర్తను అప్పగించాక ఎలా చెప్తే అలా వింటానని బాధితురాలు బదులిచ్చింది. ఆ వెంటనే తమ బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేసింది. తన భర్తను కొందరు కిడ్నాప్ చేసి తనను బెదిరిస్తున్నారని, వెంటనే ఇంటికి రావాలని కోరింది. తర్వాత బర్రెల మంద వద్దకు వెళ్లింది. అక్కడ కారులో స్పృహ తప్పి ఉన్న భర్తను చూసి, తన భర్తను వదిలేయాలని నాగరాజు బృందాన్ని ప్రాధేయపడింది. అయినా, వారు పట్టించుకోలేదు. అక్కడితో ఆగకుండా ఆమెపై లైంగికదాడికి యత్నించారు. మరో పక్క ఆ మహిళ పెనుగులాట దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. అదే సమయంలో ఆమె బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది చూసిన నాగరాజు తదితరులు భార్యాభర్తలను కారులో ఎక్కించుకుని వారి ఇంట్లో దింపేలోపు బంధువులు కూడా అక్కడకు చేరుకున్నారు. దీంతో ఆ ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయమై మరుసటిరోజు బాధిత వ్యక్తి తనను కిడ్నాప్ చేసి తనభార్యపై లైంగికదాడికి యత్నించారని ఆ ముగ్గురిపై కోరుట్ల ఎస్సై సతీశ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. -
ప్రాణ మిత్రుడు పోయాడని ప్రాణం తీసుకున్నాడు
కోరుట్ల: థర్టీ ఫస్ట్ వేడుకల ఏర్పాట్ల కోసం బైక్‌పై బయటకు వెళ్లిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్నేహితుడు చనిపోయాడన్న బెంగతో మరో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్లలో శనివారం యాక్సిడెంట్ జరిగి యువకుడు మరణించగా మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో శనివారం రాత్రి అతని స్నేహితుడు సూసైడ్ చేసుకున్నాడు. థర్టీ ఫస్ట్ వేడుకల కోసం.. కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట కాలనీలో పేర్ల ఆనంద్ (20), రేవెల్లి సురేశ్ (19) చిన్ననాటి నుంచి స్నేహితులు. ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే. అయితే ఆర్నెల్ల క్రితం సురేశ్ కుటుంబం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ సమీపంలో పార్నెల్ గ్రామానికి వలస వెళ్లింది. అక్కడ తండ్రి చినసాయిలుతో పాటు శ్మశానవాటికలో కాటికాపరిగా సురేశ్ పనిచేస్తున్నాడు. శ్మశానవాటికలోని గదిలో ఉంటున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 31 శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆనంద్.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్‌పై ఇంటి నుంచి వస్తూ గోదాం రోడ్డులో ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆనంద్ తల, ముఖానికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఆనంద్ పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొం దుతూ శనివారం సాయం త్రం మృతిచెందాడు. థర్టీ ఫస్ట్ వేడుకల కోసం ఏర్పా ట్లు చేసుకుంటున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వాట్సాప్ స్టేటస్‌లో చూసి: ఆనంద్ చనిపోయాడని వాట్సాప్ స్టేటస్‌లో చూసిన సురేశ్.. వెంటనే అహ్మద్‌నగర్ నుంచి కోరుట్లకు వెళ్తానని తండ్రి చిన్నసాయిలుకు చెప్పాడు. రాత్రి పూట రైళ్లు ఉండవని, తెల్లారాక వెళ్లాలని తండ్రి చెప్పడంతో ఆగిపోయాడు. రాత్రంతా సెల్లో ఆనంద్‌తో ఉన్న ఫొటోలు, వీడియోలు చూసిన సురేశ్.. పలుమార్లు కోరుట్లలోని తల్లి గంగవ్వకు ఫోన్ చేసి ‘అవ్వా.. ఆనంద్ సచ్చిపోయిండా’అని ఏడ్చినట్లు తెలిసింది. స్నేహితుడి మరణంతో కలత చెంది శ్మశానవాటికలోనే గదికి ఉన్న ఇనుప కడ్డీలకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని ఆదివారం ఉదయం గుర్తించిన తండ్రి అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
ఆదివారం.. వంట భారం.. సాయం తీసుకోమంటే ఏకంగా..
కోరుట్ల: రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ బీసీ గురుకుల పాఠశాలల నిర్వహణ గాడి తప్పుతోంది. గురుకులాల్లో ప్రతి ఆదివారం అల్పాహారం తయారు చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపైనే పడుతోంది. వంట మనుషుల్లేక ఒక్కోవారం ఒక్కో తరగతి విద్యార్థులు ప్రణాళిక వేసుకొని కావాల్సినవి తయారు చేసుకోవాల్సి వస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులే చపాతీలు చేసుకోవడం వెలుగులోకి వచ్చింది. 67 గురుకులాలు.. 2,200 మంది విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ బీసీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు 67 వరకు ఉన్నాయి. ఇందులో 5 నుంచి పదో తరగతి వరకు చదువు చెబుతుంటారు. ప్రస్తుతం వీటిలో సుమారు 2,200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గురుకుల పాఠశాలల్లో రోజూ విద్యార్థులకు టిఫిన్ అందజేస్తారు. ప్రతి 80 మంది విద్యార్థులకు ఓ వంటమనిషి ఉంటారు. ఈ లెక్కన ఒక్కో గురుకులంలో సుమారు ఆరుగురు వంట మనుషులు ఉండాలి. కానీ చాలా స్కూళ్లలో ఈ లెక్కన వంట మనుషుల్లేరు. సగానికి మించి గురుకులాల్లో ఉదయం విద్యార్థులకు ఇవ్వాల్సిన టిఫిన్ కేటరింగ్ ద్వారా తెప్పిస్తున్నారు. లేదంటే విద్యార్థులతోనే తయారు చేయిస్తారు. దాదాపు మూడేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. సాయం తీసుకోమన్నందుకు.. వారంలో 6 రోజుల పాటు కిచిడీ, ఇడ్లీ, అటుకులు వంటి టిఫిన్లు వంట మనిషులు లేదా కేటరింగ్ ద్వారా తెప్పిస్తున్నారు. అయితే ఆదివారం గురుకులాల్లో తప్పనిసరిగా చపాతీ లేదా పూరీ టిఫిన్‌గా పెట్టాలి. ఒక్కో గురుకులంలో ప్రతి ఆదివారం ఒక్కో విద్యార్థికి రెండు చపాతీలు లేదా పూరీల చొప్పున దాదాపు వెయ్యి వరకు కావాలి. ఇంత పెద్దమొత్తంలో చపాతీలు, పూరీలు తయారుచేయడం వంట మనుషులకు తలకు మించిన భారమవుతోందని చాలాచోట్ల ఉన్నతాధికారులకు ప్రిన్సిపాళ్లు నివేదించినట్లు సమాచారం. దీంతో ఆదివారం పిల్లల సాయం తీసుకుని చపాతీ లేదా పూరీలు తయారు చేసుకోవాలని అధికారులు మౌఖికంగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఇదే ఆసరాగా కొన్నిచోట్ల గురుకులాల ప్రిన్సిపాళ్లు ప్రతి ఆదివారం ఓ క్లాసు చొప్పున విద్యార్థులే చపాతీలు, పూరీలు చేసేలా ప్రణాళిక వేసి వంటపనులు చేయిస్తున్నారు. మౌఖిక ఆదేశాలున్నాయి ఆదివారం పెద్దసంఖ్యలో చపాతీలు, పూరీలు తయారుచేయడం వంట మనుషులకు సాధ్యం కావట్లేదు. దీంతో పిల్లల సాయం తీసుకోవాలని అధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారు. ప్రతి ఆదివారం ఓ క్లాసు చొప్పున పిల్లల సాయంతో చపాతీలు చేయిస్తున్నాం. మిగిలిన రోజుల్లో పిల్లలకు సమస్య ఉండదు. – బాబు, ప్రిన్సిపాల్, కోరుట్ల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల -
పెళ్లిళ్లలో హిజ్రాల వీరంగం.. నిరాకరిస్తే నగ్నంగా డ్యాన్స్
సాక్షి, జగిత్యాలక్రైం: పెళ్లంటే జీవితంలో ఒక్కసారి వచ్చే వేడుక. దీన్ని పేదవారు సైతం తమకు ఉన్నంతలో గొప్పగా జరిపించాలని అనుకుంటారు. కానీ హిజ్రాల కారణంగా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మామూళ్లు ఇవ్వకుంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ శుభకార్యాల్లో అలజడి సృష్టిస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన భీమయ్య కుమారుడి వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిపించారు. రాత్రి బరాత్ జరుగుతున్న సమయంలో హిజ్రాలు వచ్చి, వీరంగం సృష్టించారు. పెళ్లి కుమారుడిని డబ్బులు డిమాండ్ చేశారు. అతను నిరాకరించడంతో రెచ్చిపోయి, నగ్నంగా డ్యాన్స్ చేయడంతో అక్కడున్నవారు పారిపోయారు. రెండు రోజుల కిందట జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన రమణ కుమారుడి పెళ్లి స్థానిక ఓ ఫంక్షన్‌హాలులో జరిగింది. హిజ్రాలు వేదికపైకి వెళ్లి, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. డబ్బులివ్వాలంటూ అసభ్య పదజాలం వాడారు. దీంతో ఆయన రూ.5 వేలు ఇచ్చి, పంపించారు. చదవండి: (ఒకే కాలేజీ.. ఫేస్బుక్లో దగ్గరై సహజీవనం.. పవిత్రకు నిజం తెలిసి.. ) రూ.50 వేల వరకు వసూలు జగిత్యాల జిల్లాలోని అన్ని ఫంక్షన్‌హాళ్లలో హిజ్రాలు హల్చల్ చేస్తున్నారు. ఒక్కో పెళ్లికి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో వధూవరుల తల్లిదండ్రులు తమ బంధువులు, స్నేహితుల ముందు హేళన కావొద్దని వా రు అడిగినంత ముట్టజెబుతున్నారు. సామాన్య కుటుంబాలకు చెందినవారు డబ్బు ఇచ్చేందుకు నిరాకరిస్తే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఫలి తంగా శుభకార్యానికి వచ్చిన బంధువులు, కుటు ంబ సభ్యులు, స్నేహితులు భయపడుతున్నారు. ఎవరైనా హిజ్రాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే వారితో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అందరూ జంకుతున్నారు. చదవండి: (Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..) హిజ్రాల ఆగడాలను అరికట్టాలి జిల్లాలో వివాహ వేడుకలకు వచ్చి, హిజ్రాలు మామూళ్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకుంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో ఫంక్షన్‌కు వచ్చిన వారంతా భయపడుతున్నారు. పోలీసులు స్పందించి, హిజ్రాల ఆగడాలను అరికట్టాలి. – మారు గంగారెడ్డి, జాబితాపూర్ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం హిజ్రాలు మామూళ్ల కోసం డిమాండ్ చేస్తే బాధితులు 100 డయల్‌కు కాల్ చేయాలి. ఫిర్యాదు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. శుభకార్యాల్లో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి, డబ్బులివ్వాలని వేధిస్తే హిజ్రాలను కఠినంగా శిక్షిస్తాం. – రత్నపురం ప్రకాశ్, డీఎస్పీ, జగిత్యాల -
ప్రధానితో కేసీఆర్ కుమ్మక్కు
రాయికల్ (జగిత్యాల): రైతు సమస్యలు, సింగరేణి కార్మికుల ఇబ్బందులను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లడంలో టీఆర్ఎస్ ఎంపీలు విఫలమయ్యారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోనే ప్రధానమైన రైతాంగం, సింగరేణి కార్మికుల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన ఎంపీలు శీతాకాల సమావేశాలను బహిష్కరించడం ఏమిటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్..ప్రధాని నరేంద్రమోదీతో లోపాయికారీ ఒప్పదం చేసుకుని తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రతీబిల్లుకు టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీలు రైతాంగ, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. -
వెనక నుంచి వచ్చే ప్రమాదాన్ని గమనించలేదు.. రైతు సజీవదహనం
జగిత్యాల క్రైం: మంటల నుంచి గడ్డి వామును కాపాడుకునే ప్రయత్నంలో ఓ రైతు సజీవ దహనమయ్యాడు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన పోతుగంటి లక్ష్మణ్‌గౌడ్ (60) మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. పోతుగంటి లక్ష్మణ్ గౌడ్ గ్రామ శివారులోని తన రెండెకరాల్లో వ్యవసాయం చేస్తూ కులవృత్తి చేస్తాడు. ఇటీవల పంట కోశాడు. యాసంగిలో మళ్లీ సాగు చేసేందుకు మంగళవారం ఉదయం వరి కొయ్యకాలుకు నిప్పు పెట్టాడు. పొలం సమీపంలోనే గడ్డివాము ఉంది. దానికి నిప్పు అంటుకోకూడదని పొలంలోని మంటల్ని కర్రలతో కొడుతూ ఆర్పుకుంటూ ముందుకు సాగాడు. కానీ వెనక నుంచి వచ్చే మంటల్ని గమనించలేదు. ఈక్రమంలోనే లక్ష్మణ్‌గౌడ్ చుట్టూ మంటలు వ్యాపించాయి. తప్పించుకునే మార్గం లేక అందులోనే చిక్కుకుని కాలిపోయాడు. రూరల్ ఎస్ఐ అనిల్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: Telangana: కొత్తగా 205 మందికి కరోనా ) -
కళ్లెదుటే ఆరిన కంటి దీపాలు
కోరుట్ల: కొద్దిరోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి. హైదరాబాద్ వెళ్లి మూడ్రోజులు షాపింగ్ చేశారు. అంతే ఆనందంతో కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఇంకో పది నిమిషాల్లో ఇంటికి చేరతారనగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు ఢీకొట్టింది. ప్రమాదం లో ఇద్దరు చిన్నారులు, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం ఉదయం జగిత్యాల జిల్లా కోరుట్ల–మేడిపల్లి మండలాల సరిహద్దుల్లోని మోహన్‌రావుపేట వంతెన మూలమలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కారును కిరాయికి మాట్లాడుకొని.. కోరుట్లలోని బిలాల్‌పురాకు చెందిన సులేమాన్ జావీద్, సుమయ్య దంపతులు. జావీద్ నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. దుబాయ్‌లో ఉంటున్న ఆయన బావమరిది ఫుర్ఖాన్కు ఇటీవలే పెళ్లి కుదిరింది. ఈనెల 28న విహహం ఉంది. పెళ్లి షాపింగ్ కోసం జావీద్ దంపతులు తమ ముగ్గురు కొడుకులు ఆనస్, అస్సర్, అజాన్.. జగిత్యాలలో ఉండే అత్త రేష్మ, మరో బావమరిది రుషాన్‌తో కలిసి బుధవారం హైదరాబాద్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కోరుట్లకే చెందిన తన స్నేహితుడు సాజిద్ అలీ కారును కిరాయికి మాట్లాడుకున్నారు. ఆదివారం పొద్దున్నే కారులో బయలుదేరారు. మధ్యలో అత్త రేష్మ, బావమరిది రుషాన్‌ను జగిత్యాలలో దింపారు. కోరుట్లకు చేరుకుంటుందనగా.. జావీద్ కుటుంబం ఇంకో పది నిమిషాల్లో కోరుట్లకు చేరుకుంటుందనగా కోరుట్ల మండలం మోహన్ రావుపేట వంతెన మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వీళ్ల కారును ఢీకొంది. కారు నుంచి ఎగిరిబయటపడ్డ జావీద్ చిన్నకొడుకు అజాన్ (5) అక్కడిక్కడే మృతిచెందాడు. రెండో కొడుకు అస్సర్ (8) ఎగిరి కారు ఇంజిన్‌పై పడి కాలిపోయాడు. జగిత్యాల ఆస్పత్రికి తరలించే లోపు మృతిచెందాడు. డ్రైవర్ సాజిద్ అలీ (32) కారులోనే ప్రాణాలు వదిలాడు. అనస్ (12) పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌కు తరలించారు. జావీద్, సుమయ్యను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల కళ్లెదుటే.. ప్రమాదం జరిగిన వెంటనే తేరుకున్న జావీద్, సుమయ్య దంపతులు.. కారులో అచేతనంగా పడి ఉన్న పిల్లలను చూసి బోరున విలపించారు. తీవ్రంగా గాయపడిన మరో కుమారుడిని చూసిన వారి వేదన వర్ణనాతీతం. జావీద్ ఒళ్లో షాపింగ్ సామగ్రి ఉండటం, కారు బెలూన్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. అందరినీ ఆస్పత్రికి తరలించాక అక్కడ తమ పిల్లలెలా ఉన్నారని జావీద్ దంపతులు అడగగా, ఏం కాలేదని బంధువులు చెప్పారు. చివరకు పిల్లల అంత్యక్రియలు చేయాల్సి ఉండటంతో వాళ్లు చనిపోయిన విషయాన్ని జావీద్‌కు చెప్పగా ఒక్కసారిగా కుప్పకూలారు. రాత్రి 8 గంటల సమయంలో పిల్లల అంత్యక్రియలను జావీద్ పూర్తిచేసి చికిత్స కోసం తిరిగి ఆస్పత్రికి వెళ్లడం స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రమాదంలో జావీద్ పక్కటెములకు తీవ్ర గాయాలయ్యాయి. -
‘కట్నం’ వేధింపులు తట్టుకోలేక..
మెట్పల్లి: అదనపు కట్నం కోసం అత్తింటివారు పెట్టే వేధింపులు భరించలేక ఓ మహిళ తన ఐదేళ్ల కూతురుతో కలసి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై సుధాకర్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మనగర్‌కు చెందిన వేములవాడ రాజశేఖర్‌కు నిర్మల్ జిల్లా కడెం మండలం మద్దిపడిగ గ్రామానికి చెందిన వనజ (26)తో వివాహం జరిగింది. వీరికి సాన్వి అనే ఐదేళ్ల కూతురు ఉంది. కొంతకాలంగా భర్తతోపాటు అత్త లింగవ్వ, ఆడపడుచులు.. మరికొంత కట్నం తీసుకురావాలంటూ వనజను వేధించడం ప్రారంభించారు. పెద్దమనుషుల సమక్షంలో రూ.లక్ష ఇచ్చినా వేధింపులు ఆగలేదు. మరింత కట్నం కావాలంటూ వనజను వేధిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన వనజ, తన కూతురును తీసుకుని ఇంట్లోంచి బయటకు వెళ్లింది. సమీపంలోని వరద కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కాల్వలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం తల్లీకూతుళ్ల మృతదేహాలు నీటిపై తేలాయి. పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. వనజ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ముగ్గురు స్నేహితురాళ్ల ఆత్మహత్య?
జగిత్యాలక్రైం: ఒకే రోజు ముగ్గురు స్నేహితురాళ్లు మృత్యువాత పడటం జగిత్యాల జిల్లాలో కలకలం సృష్టించింది. జగిత్యాల శివారులోని ఉప్పరిపేటకు చెందిన గంగాజల(19), మల్లిక (19), వందన (16) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులే కాక బంధులు కూడా. వీరిలో గంగాజల, మల్లికలకు ఈ ఏడాది ఆగస్టులో వివాహం కాగా, వందన ఇంటర్ చదువుతోంది. ఏం జరిగిందో తెలియదుకాని, ఈ ముగ్గురు గురువారం ఉదయం పట్టణ శివారులోని చెరువులో విగత జీవులుగా తేలారు. వివరాలిలా ఉన్నాయి.. కొద్దిరోజులుగా మల్లిక అనారోగ్యంగా ఉండటంతో తండ్రి రాజం 10 రోజుల క్రితం ఆమెను పుట్టింటికి తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేయించారు. ఈ నేపథ్యంలోనే గంగాజల కూడా వారం క్రితం తల్లిగారింటికి వచ్చింది. బుధవారం సాయంత్రం మల్లిక, గంగాజల, వందన షాపింగ్‌కు వెళుతున్నామని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లారు. రాత్రయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. (చదవండి: ప్రతి వెయ్యికి 23 మంది) గురువారం ఉదయం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసే క్రమంలో ధర్మసముద్రం చెరువులో రెండు మృతదేహాలు ఉన్నట్లు సమాచారం అందింది. కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లి చూడగా మొదట మల్లిక, గంగాజల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో రెండు గంటల తర్వాత వందన మృతదేహం కూడా దొరికింది. కాగా, ముగ్గురూ ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారా, లేదా ఎవరైనా ఒకరు ఆత్మహత్య చేసుకోబోతుండగా రక్షించే క్రమంలో ప్రమాదవశాత్తు పడి మృతిచెందారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మల్లిక, గంగాజల వివాహమైన రెండు నెలలకే మృతిచెందడంతో వారి తల్లిగారింటితో పాటు అత్తగారింట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యమంటూ ఫిర్యాదులు: అనారోగ్యంతో తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మల్లిక తండ్రి రాజం ఫిర్యాదు చేయగా.. గంగాజల తండ్రి భూమ య్య కూడా కొద్దిరోజులుగా తన కూతురు ఆరోగ్యం బాగా లేదని బాధపడుతూ ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్నేహితులు ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో రక్షించే ప్రయత్నంలో నీటిలో పడి తన కూతురు మృతిచెంది ఉండొచ్చని వందన తండ్రి కొమురయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. (చదవండి: నాకిక ఓపిక లేదు..) -
కుటుంబాన్ని చిదిమేసిన లారీ
గొల్లపల్లి (వెల్గటూర్): స్కూటీపై భార్య, ముగ్గురు పిల్లలతో ఒక కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా, వారి వాహనాన్ని లారీ డీకొట్టింది. ఈ ఘటనలో ఇంటి యజమాని, ఇద్దరు పిల్లలు మరణించగా, భార్య కుమారుడు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పాశిగామ శివారులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కోడిపుంజుల తిరుపతి (38) ఇళ్లకు మార్బుల్స్ వేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య మనోజా, కొడుకులు ఆదిత్య(9), కన్నయ్య(1), కూతురు చిట్టి (1) ఉన్నారు. మనోజా తల్లి మూడు నెలల క్రితం చనిపోయింది. మూడు నెలల కార్యక్రమం కోసం కుటుంబాన్ని తీసుకుని స్కూటీపై అత్తగారి ఊరైన ధర్మపురి మండలం దమ్మన్నపేటకు వెళ్లారు. కార్యక్రమం ముగిశాక సాయంత్రం ఐదుగురూ ఇంటికి బయల్దేరారు. ఊరు చేరేందుకు మరో ఐదు కిలోమీటర్ల దూరంలో వెల్గటూరు మండలం పాశిగామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న హరితహోటల్ వద్దకు రాగానే వెనకాలే వస్తున్న లారీ స్కూటీని ఓవర్టేక్ చేస్తూ ఢీకొట్టింది. అందరూ రోడ్డుపై పడిపోయారు. లారీ వీరిపైనుంచి పోవడంతో చిట్టి, కన్నయ్య అక్కడికక్కడే చనిపోయారు. తిరుపతి నడుం పైనుంచి లారీ వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయ్యింది. మనోజా రెండు కాళ్లు విరిగాయి. ఆదిత్య రోడ్డుకు కొద్ది దూరంలో పడడం తో స్వల్పగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ధర్మపురి సీఐ కోటేశ్వర్ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాడు. అపస్మారకస్థితిలో ఉన్న తిరుపతి, మనోజాను 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఆదిత్యను సీఐ తన వాహనంలో ఆస్పత్రిలో చేర్చాడు. చికిత్స పొందుతూ తిరుపతి మృతిచెందాడు. అయితే ప్రమాదానికి కారణమైన వాహనం దొరకలేదని, సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. కాగా, గుంతలను తప్పించబోయే క్రమంలోనే వేగంగా వస్తున్న లారీ ఢీకొని ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. -
ప్రాణం తీసిన పేకాట: మద్యంమత్తులో బండరాయితో మోది..
జగిత్యాల క్రైం: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురవగా మూడు రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల పట్టణ శివారులోని టీఆర్‌నగర్‌కు చెందిన జగన్నాథం సమ్మయ్య గత నెల 28వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం తాటిపల్లి పెద్ద చెరువులో సమ్మయ్య మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్, రూరల్ సీఐ కృష్ణకుమార్, ఎస్సై చిరంజీవి సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని బయటకు తీయించారు. (చదవండి: ట్రాఫిక్ చలాన్ ఎలా వేస్తారని సర్పంచ్ హల్చల్) స్థానికుడితోపాటు కోరుట్లకు చెందిన మరో వ్యక్తితో కలిసి సమ్మయ్య పెద్దచెరువు సమీపంలో పేకాడి, మద్యం తాగినట్లు అనుమానిస్తున్నారు. పేకాట విషయంలో తలెత్తిన వివాదంతో మిగతా ఇద్దరు బండరాయితో అతని తలపై మోది హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారణ చేపడుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మృతుడి సోదరుడు నాగేశ్వర్రావు ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. (చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు) -
హత్య కేసులో నలుగురికి యావజ్జీవ ఖైదు
జగిత్యాలజోన్: ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న న్యాయవాదితో పాటు మరో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జగిత్యాల రెండో అదనపు జిల్లా జడ్జి గన్నారపు సుదర్శన్ శుక్రవారం తీర్పునిచ్చారు. అలాగే రూ.20 వేల చొప్పున జరిమానా విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీవాణి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామ మాజీ సర్పంచ్ తిర్మణి మోహన్‌రెడ్డి 2012 మే 7వ తేదీన పొలం నుంచి ఇంటికి వెళుతున్న క్రమంలో హత్యకు గురయ్యాడు. ఆయన భార్య శైలజ ఫిర్యాదు మేరకు పోలీసులు, న్యాయవాది రాచకొండ గంగారెడ్డి, బొడిగె నర్సయ్య, రాచకొండ అంజిరెడ్డి, పన్నాల మహేశ్, తిరుమణి నరసింహారెడ్డి, తిరుమణి జలపతి, తిరుమణి తిరుపతి, ముంజ భూమయ్య, ముంజ మల్లేశం, రాచకొండ లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేశారు. తర్వాత విచారణలో ఈ హత్యతో సంబంధం లేదంటూ తిరుమణి జలపతి, తిరుమణి తిరుపతి, ముంజ భూమయ్య, ముంజ మల్లేశం, రాచకొండ లక్ష్మీనారాయణల పేర్లను చార్జీ షీట్ సమయంలో పోలీసులు తొలగించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా రాచకొండ గంగారెడ్డి, బొడిగె నర్సయ్య, రాచకొండ అంజిరెడ్డి, పన్నాల మహేశ్, తిరుమణి నరసింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సుద్దపల్లి గ్రామానికి చెందిన రాచకొండ బాపురెడ్డి హత్య కేసులో మృతుడు మోహన్‌రెడ్డి, రాచకొండ గంగారెడ్డి కుటుంబాల మధ్య పాత పగలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే మోహన్‌రెడ్డి హత్య జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం జడ్జి సుదర్శన్.. రాచకొండ గంగారెడ్డి, బొడిగె నర్సయ్య, పన్నాల మహేశ్, తిరుమణి నరసింహారెడ్డికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసులో ఎ–3గా ఉన్న రాచకొండ అంజిరెడ్డి కోర్టు విచారణ సమయంలోనే మరణించడంతో ఆయన పేరును కేసునుంచి తొలగించారు. -
జగిత్యాల: షాపింగ్‌మాల్‌లో అగ్నిప్రమాదం.. రూ. కోట్ల నష్టం
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి ఓ షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రూ.18 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. కల్లూర్ రోడ్లో ఐదంతస్తుల్లో నిర్మించిన ఆనంద్ షాపింగ్ మాల్‌ను ఎప్పటిలాగే మంగళవారం రాత్రి 10 గంటలకు మూసివేశారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మాల్లో మంటలు వ్యాపించడంతో యజమాని హరికుమార్ పోలీసులకు, మెట్‌పల్లిలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. బుధవారం వేకువజామున 2.15 గంటలకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మంట లు రెండంతస్తుల వరకు వ్యాపించాయి. రెండు ఫైరింజన్లతో తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈలోగా మొత్తం ఐదు అంతస్తులోని ఫర్నిచర్, వస్త్రాలు మంటలకు ఆహుతయ్యాయి. దాని పక్కనే ఉన్న మరో రెండుషాపులకు సైతం మం టలు వ్యాపించాయి. ఈ రెండింటికి తోడు మరోరెండు ఫైరింజన్లు రావడంతో 18 గంటలపాటు శ్రమించి బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాం తంలో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఇన్వర్టర్ బ్యాటరీ షార్ట్ సర్క్యూట్‌తోనే మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నామని అగ్నిమాపక అధి కారి మురళీమనోహర్‌రెడ్డి తెలిపారు. రూ.6 కోట్ల విలువైన ఫర్నిచర్, ఇతర సామాగ్రి, ఐదంతస్తుల్లో ని రూ.12 కోట్ల విలువైన వస్త్రాలు మంటల్లో కాలిపోయినట్లు షాపు యజమాని తెలిపారు. -
పెద్దపులిని చూపిస్తానని తీసుకెళ్లి..
రాయికల్:(జగిత్యాల): ‘మీకు పెద్దపులిని చూపిస్త.. నాతో రండి’అని ఓ తల్లి తన ఇద్దరు కుమారులను గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడ పిల్లలతో కలసి బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లి, పెద్దకుమారుడు మృతిచెందగా, చిన్నకుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కిష్టంపేటలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కిష్టంపేటకు చెందిన కస్తూరి సంపత్, లావణ్య(25) భార్యాభర్తలు. వీరికి గణేశ్(8), హర్షవర్ధన్ (6) అనే కుమారులు ఉన్నారు. పదేళ్ల క్రితం స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి ఉపాధి కోసం కిష్టంపేట గ్రామానికి వచ్చారు. ఇక్కడే కూలీ పనిచేసుకుంటూ బతుకుతున్నారు. శుక్రవారం భార్యాభర్తలు అల్లీపూర్ గ్రామంలోని ఓ మేస్త్రీ వద్ద కూలీ పనిచేసి ఇంటికి తిరిగి వచ్చారు. కొద్దిసేపటి తర్వాత లావణ్య.. పెద్దపులిని చూపిస్తానంటూ తన ఇద్దరు కుమారులతో కలసి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావివద్దకు వెళ్లింది. తర్వాత ఇద్దరు కుమారులను పట్టుకుని బావిలో దూకింది. అయితే, ఈ ప్రయత్నంలో తల్లి, పెద్దకుమారుడు బావిలో పడిపోగా హర్షవర్ధన్ బావిగట్టువద్దే ఉండిపోయాడు. వెంటనే బాలుడు అక్కడ ఉన్నవారికి ఈ విషయం చెప్పగా, వారు బావి వద్దకు చేరుకుని లావణ్య, గణేశ్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే వారు నీటిలో మునిగి చనిపోయారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతోనే లావణ్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అమ్మతో కలసి కేక్ కట్ చేసిన నిన్న నా పుట్టినరోజు. అమ్మా, నాన్న, అన్నయ్యతో కలసి కేక్ కట్ చేసిన. అందరికీ మిఠాయిలు పంచిన. రాత్రి అందరం బాగానే ఉన్నం. పొద్దునే అమ్మ, నాన్న కలసి పనికి పోయిండ్రు. నాకు పెద్దపులిని చూపిస్తనని అమ్మ నన్ను బాయికాడికి తీసుకెళ్లింది. నన్ను, అన్నను తీసుకుని బావిలో దూకింది. నేను బావిగట్టు వద్దే పడిపోయా. – హర్షవర్ధన్, చిన్నకుమారుడు -
16 ఏళ్ల నిర్లక్ష్యం.. పోయిన ప్రాణం
సాక్షి, జగిత్యాల: జిల్లా వెల్గటూరు మండలం పాత గూడూరు గ్రామానికి చెందిన మల్లవేని రాజు (35) గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ట్రాక్టరు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య స్వప్న, కూతురు అవిఘ్నయ(2) ఉన్నారు. ఈ నెల 13న విధుల్లో భాగంగా గ్రామానికి చెందిన ఓ కౌలు రైతు వ్యవసాయ భూమిలో పనికి వెళ్లాడు. అయితే ఆ పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ నుంచి స్తంభానికి విద్యుత్ లైన్ ఉంది. ఎన్నో ఏళ్లుగా తీగలు వేలాడుతూ ఉండడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా వారు పట్టించు కోలేదు. దీంతో భూమి యజమాని తాత్కాలికంగా కర్రను సపోర్టుగా పాతాడు. పొలంలో రాజు ట్రాక్టరుతో పని చేస్తుండగా.. వేగంగా వీచిన గాలులకు కర్ర కింద పడిపోవడంతో ట్రాక్టరుకు తగిలిన తీగలు రాజుకు చుట్టుకుపోయాయి. దీంతో తీవ్ర విద్యుత్‌షాక్‌కు గురైన రాజు అక్కడికక్కడే చనిపోయాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే తన భర్త చనిపోయాడని రాజు భార్య స్వప్న ఆరోపిస్తోంది. 16 ఏళ్ల నుంచి ఆ సమస్య ఉందని రాజు సోదరుడు లక్ష్మణ్ చెప్పాడు. ఇదే ప్రాంతంలో 16 ఏళ్ల క్రితం వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి నాలుగు గేదెలు చనిపోయినా విద్యుత్ సిబ్బంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమస్యను పట్టించుకోలేదు. చదవండి: మూగజీవాలపై యమపాశం -
Coronavirus: మమ్మీ, డాడీ.. ఎప్పుడొస్తారు?
సాక్షి, జగిత్యాల: లేవగానే గుడ్‌మార్నింగ్ చెప్పే డాడీ గొంతు కొద్దిరోజులుగా వినిపించట్లేదు. అల్లరి చేస్తే.. వారించే మమ్మీ కనిపించట్లేదు. జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వెళ్లిన అమ్మానాన్న తిరిగి రాలేదు. గేటు చప్పుడు అయినప్పుడల్లా అమ్మానాన్న వచ్చారన్న సంబరంతో పరిగెత్తుకెళ్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులకు తల్లిదండ్రుల మరణవార్త తెలియకపోవడంతో ‘అమ్మా, నాన్న ఎక్కడ’అంటూ ప్రశ్నిస్తున్నారు. రేపు వస్తారంటూ బంధువులు చెప్పే మాటలు నమ్మి ఎదురుచూస్తున్నారు. జగిత్యాల జిల్లా పురాణిపేటకు చెందిన వనమాల నాగరాజు(38) బెంగళూరు లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడి భార్య లహరిక (32) గృహిణి. వీరికి ఇద్దరు పిల్లలు దివిజ (10), హైందవి (6). బెంగళూరులో ఉండగా, నెల కింద వారందరికీ కరోనా సోకింది. మొదట భార్య.. తర్వాత భర్త.. తొలుత అందరూ హోం ఐసోలేషన్ లో ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే కొద్దిరోజులకే దంపతులిద్దరి పరిస్థితి విషమంగా మారింది. దీంతో కుటుంబం మొత్తం హైదరాబాద్‌కు వచ్చింది. భార్యభర్తలిద్దరూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. త్వరలోనే వచ్చేస్తామంటూ చిన్నారులిద్దరినీ బంధువుల ఇంటికి పంపారు. నాగరాజుకు అమ్మానాన్న లేకపోవడంతో బంధువులే వారిని చూసుకున్నారు. మే 12న లహరిక ఆరోగ్యం విషమించి చికిత్స పొందుతూ చనిపోయింది. విషయం నాగరాజుకు చెబితే అతడి ఆరోగ్యం దెబ్బతిని ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని బంధువులు చెప్పలేదు. హైదరాబాద్‌లోనే లహరిక అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే 4 రోజుల తర్వాత భార్య చనిపోయిన విషయం నాగరాజుకు తెలిసింది. ఆ తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితి కూడా విషమించి చికిత్స పొందుతూ మే 17న చనిపోయాడు. నాగరాజు మృతదేహానికీ మున్సిపల్ సిబ్బందే అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, ఇద్దరి చికిత్సకు రూ.25 లక్షలకు పైగా ఖర్చయినా ప్రాణాలు దక్కలేదు. చదవండి: Corona Vaccine: టీకా వేసుకున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి! -
3 గజాల స్థల వివాదం.. ఓ నిండు ప్రాణం బలి
సాక్షి, కరీంనగర్(జగిత్యాల): జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. మూడు గజాల స్థల వివాదం ఒకరి ప్రాణాలను బలిగొంది. జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లిలో జాలపల్లి రవి, పత్తిపాక బాపన్నకు మధ్య ఇంటి దారి విషయంలో భూ వివాదం నెలకొంది. మూడు గజాల స్థలం కోసం పలుమార్లు వారు గొడవ పడ్డారు. గొడవ మరింత ముదరడంతో ఈరోజు బాపన్న.. రవి, ఆయన భార్య మల్లవ్వపై కర్రతో దాడికి పాల్పడ్డాడు. రవి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గాయపడ్డ మల్లవ్వను స్థానికులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చదవండి: దారుణం: కన్నతల్లిని చూడకుండానే కవలల మృతి -
పెళ్లికి నిరాకరించిందని ప్రేమోన్మాది దారుణం
సాక్షి, జగిత్యాల క్రైం: పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడికి తెగబడ్డాడు. అనంతరం గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌కు చెందిన యువతి(25), అదే గ్రామానికి చెందిన కట్కం రాజ్‌కుమార్ స్నేహితులు. ఇద్దరూ పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఇంటర్ తర్వాత రాజ్‌కుమార్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. యువతి ఇక్కడే ఉంటూ పీజీ చేస్తోంది. వారిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. యువతి మెడకు తగిలిన గాయం ఇరవైరోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చి... ఇరవై రోజుల క్రితం రాజ్‌కుమార్ దుబాయ్ నుంచి స్వగ్రామం చేరుకున్నాడు. యువతిని కలిసేందుకు అతడు విఫలయత్నం చేశాడు. ఫోన్ చేసినా సరిగా స్పందించకపోవడమేకాకుండా తనతో పెళ్లికి నిరాకరించిందని కోపం పెంచుకున్నాడు. ఆగ్రహంగా ఉన్న రాజ్‌కుమార్ శనివారం మధ్యాహ్నం జాబితాపూర్‌కు చేరుకున్నాడు. యువతి ఇంట్లోకి వెళ్లి కత్తితో ఆమె మెడ, వీపుపై దాడి చేశాడు. యువతి తప్పించుకొని, కేకలు వేసింది. ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చేసరికి అతడు అదే కత్తితో తన గొంతు కోసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రాజ్‌కుమార్‌ను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన యువతి జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మృతుడి సెల్ఫోన్లో ఉన్న మెసేజ్‌లు, కాల్‌డేటాను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నమ్మలేకపోతున్నాం... రాజ్‌కుమార్ మృతితో మేడిపల్లి మండలం మన్నెగూడెంలో విషాదం నెలకొంది. అందరితో కలిసిమెలిసి ఉండే యువకుడు క్షణికావేశానికి లోనై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని, దీనిని తాము నమ్మలేకపోతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. రాజ్‌కుమార్‌కు ఒక సోదరి ఉంది. ఆమె వివాహం కాగా, తల్లిదండ్రులకు అతడు ఒక్కగానొక్క కొడుకు. -
ప్రేమ వ్యవహారంలో యువకుడి హత్య
మెట్పల్లి (కోరుట్ల): ప్రేమ వ్యవహారం ఓ యువకుడి హత్యకు దారితీసింది. సీఐ శ్రీను కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిధి లోని వెంకట్రావ్‌పేటకు చెందిన గోపి (26), అదే కాలనీకి చెందిన బెదుగం నరేందర్ (35) సోదరుని కూతురును ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతనిపై కేసు నమోదైంది. అయినప్పటికీ గోపి వైఖరిలో మార్పు రాకపోవడంతో నరేందర్ సోదరుని కుటుంబం వెంకట్రావ్పేట నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆ యువతితో తనకు వివాహం జరిపించాలని స్థానికంగా ఉంటున్న నరేందర్‌ను గోపి తరచూ వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం మద్యం మత్తులో ఉన్న గోపి, నరేందర్ ఇంటికెళ్లి గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరగ్గా.. నరేందర్ మొదట కత్తెరతో ఆ తర్వాత గొడ్డలి తో గోపిపై దాడి చేయగా అతను ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీను, ఎస్సై సధాకర్ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. యువతిని వేధించిన కేసుతోపాటు మరో రెండు దొంగతనాల కేసుల్లో గోపి నిందితుడని పేర్కొన్నారు. కాగా నరేందర్ నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. చదవండి: రూ.30 లక్షల అప్పు.. సర్పంచ్ ఆత్మహత్య -
మనిషి లేని ‘నిజాయితీ దుకాణం’.. ఎక్కడ ఉందంటే?
ప్రధాన రహదారి పక్కనే చిన్న షెడ్డులో తాజా సేంద్రియ కూరగాయాలతో ‘నిజాయితీ దుకాణం’ వినియోగదారులకు దృష్టిని ఆకట్టుకుంటుంది. ఆ షెడ్డులో ఎవరూ ఉండరు. ఏ కూరగాయల ధర ఎంత అన్నది బోర్డుపై రాసి పెట్టి ఉంటుంది. రోడ్డున వెళ్లే వారు తమకు అవసరమైన కూరగాయలను తీసుకొని.. వాటికి తగినంత డబ్బును షెడ్డులో ఉన్న ఓ కవర్లో వేస్తారు. లేదంటే ఫోన్‌పే, గుగూల్‌పే ద్వారా చెల్లిస్తుంటారు. ఇంతకీ ఈ దుకాణం ఎవరిది, మనుషులపై ఇంత నమ్మకం ఉంచిన ఆ మనిషి ఎవరు అనేది తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి. వృత్తులన్నిటికీ తల్లి వంటిది వ్యవసాయం. కరోనా ప్రపంచాన్ని తల్లకిందులు చేసిన నేపథ్యంలో.. ఇతర వృత్తుల్లో స్థిర పడిన వాళ్లు ఇప్పుడు తిరిగి పల్లెలకు చేరుకొని వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా చేపడుతున్నారు. ఈ కోవకే చెందుతారు ఎడ్మల మల్లారెడ్డి. ప్రైవేటు పాఠశాల నడిపే మల్లారెడ్డి మరల సేద్యంలోకి వచ్చారు. తన ఏడెకరాల భూమిలో ప్రణాళికాబద్ధంగా సమగ్ర వ్యవసాయ విధానం చేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్నారు. కూరగాయల నుంచి కుందేళ్ల వరకు, కొత్తిమీర నుంచి అంజీర పండ్ల వరకు పండిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేయటమే కాకుండా, ఆ పంటను వినూత్నంగా ‘నిజాయితీ రైతు దుకాణం’ ఏర్పాటు చేసి వినియోగదారులకు సరసమైన ధరలకు విక్రయిస్తున్నారు. స్ఫూర్తిదాయకమైన ఈ ‘రైతు ఉపాధ్యాయుడి’ అనుభవాలను తెలుసుకుందాం.. అంజీర తోటలో రైతు మల్లారెడ్డి ఎడ్మల మల్లారెడ్డి స్వగ్రామం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్. కోవిడ్‌తో ఏడాది క్రితం నుంచే పాఠశాలలు మూతపడ్డాయి. ఎప్పుడు తెరిచే పరిస్థితులు వస్తాయో తెలియదు. ఆయనది వ్యవసాయ కుటుంబం. ఏడెకరాల సొంత వ్యవసాయ భూమి ఉంది. అప్పటి వరకు కౌలుకు ఇచ్చిన ఆ భూమిలో ఇక తానే వ్యవసాయం చేస్తానని గ్రామస్థులకు చెప్పాడు. అయితే, ‘ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న మాకే గిట్టుబాటు కావడం లేదు, నీవేమి వ్యవసాయం చేస్తావు, స్కూల్‌ను బాగా నడిపించుకో..’ అని మొహం మీదే చెప్పారు. అయితే, మల్లారెడ్డి సవాలుగా తీసుకున్నారు. అందరిలాగ వ్యవసాయం చేస్తే మన ప్రత్యేకత ఏంటి, సాధారణ రైతులకు భిన్నంగా సేంద్రియ పద్ధతిలో సమగ్ర వ్యవసాయం చేసి అదాయం పొందాలనుకున్నాడు. కసితో వ్యవసాయానికి శ్రీకారం చుట్టి, ప్రస్తుతం అందరికీ ఆదర్శం అయ్యారు. ప్రణాళికాబద్ధంగా సాగులోకి.. ఏడు ఎకరాల భూమిని ఐదారు ప్లాట్లుగా విభజించి, డ్రిప్ ఏర్పాటు చేసుకుని, చుట్టూ కంచే వేశారు. ఒక ప్లాట్‌లో– కోళ్లు, బాతులు, సీమ కోళ్లు.. రెండో ప్లాట్‌లో– జామ, బొప్పాయి, అరటి తోట.. మూడో ప్లాట్‌లో– మామిడి, సీతాఫలం మొక్కలు.. నాలుగో ప్లాట్‌లో– అంజీర, ఆపిల్ బెర్.. ఐదో ప్లాట్‌లో– కూరగాయ మొక్కలు పెంచుతున్నారు. బెంగళూర్, హైద్రాబాద్ నర్సరీల నుంచి పండ్ల మొక్కలు తెప్పించి.. పశువుల ఎరువు, గొర్రెల ఎరువు వేసి నాటారు. పొట్ల, బీర, సొర, కాకర, నేతిబీర, దోస, మునగ, వంకాయ వంటి 25 రకాల దేశీ రకాల కూరగాయ విత్తనాలను హైద్రాబాద్ నుంచి తీసుకువచ్చి సాగు చేస్తున్నారు. ఏడెకరాల్లో గుంట భూమి ఖాళీ లేకుండా దాదాపు 2 వేల రక రకాల పండ్లు, కూరగాయల మొక్కలు పెంచుతున్నారు. పంటలన్నిటినీ పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే పండిస్తుండటం, జగిత్యాలకు కేవలం 5 కి.మీ. దూరంలోనే ఉండటంతో, చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్ కస్టమర్లుగా నేరుగా తోట వద్దకే వచ్చి పండ్లు, కూరగాయలు, గుడ్లు తదితర ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. ఏటీఎం తరహాలో 365 రోజులు తోటలో కూరగాయలు, పండ్లను అందుబాటులో ఉంచుతూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు మల్లారెడ్డి. డిమాండ్‌ను బట్టి నాటు కోళ్లను పెంచుతూ, బాతులు, సీమ కోడి గుడ్లు అమ్ముతూ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. గొర్రెల పెంపకం, చేపల పెంపకం ప్రారంభించబోతున్నారు. ఆ కుక్కలంటే కోతులకు హడల్! మల్లారెడ్డి తోటలో ఎక్కువగా పండ్ల మొక్కలు ఉండటంతో కోతులు ఎక్కువగా వస్తున్నాయి. పొలంలో రెండు ‘బాహుబలి’ కుక్కలు పెంచుతున్నారు. రాత్రింబవళ్లు అవే కాపాలా కాస్తుంటాయి. కోతులు వస్తే ఈ కుక్కలు వాటిని ఉరికిస్తుంటాయి. దీంతో, ఈ తోటలోకి కోతులు వచ్చే పరిస్థితి లేదు. అలాగే, పట్టణానికి దగ్గరలో ఉండటంతో తల్లితండ్రులతో కలిసి పిల్లలు వచ్చేలా, మామిడి చెట్ల మధ్యలో పిల్లలు ఆటలాడుకునే వస్తువులను ఏర్పాటు చేశారు. ‘అగ్రి టూరిజం’ దృష్టితో తోటను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ నిజాయితీ దుకాణం! ప్రధాన రహదారి పక్కనే ఉన్న తన తోటలో పండిన కూరగాయలను తోట దగ్గరే ‘నిజాయితీ దుకాణం’ పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. చిన్న షెడ్డు వేశారు. అందులో కూరగాయలు పెట్టి, ఏ కూరగాయల ధర ఎంత అన్నది బోర్డుపై రాసి పెడుతుంటారు. ఆ షెడ్డులో ఎవరూ ఉండరు. రోడ్డున వెళ్లే వారు తమకు అవసరమైన కూరగాయలను తీసుకొని.. వాటికి తగినంత డబ్బును షెడ్డులో ఉన్న ఓ కవర్లో వేస్తారు. లేదంటే ఫోన్‌పే, గుగూల్‌పే ద్వారా చెల్లిస్తుంటారు. కోళ్లు, బాతు గుడ్లను కూడా తోటలోనే అమ్ముతుంటారు. రోజుకు రూ. 3 – 4 వేల వరకు ఆదాయం పొందుతూ మల్లారెడ్డి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సీనియర్ రైతులకే సేంద్రియ సమగ్ర సేద్య పాఠాలు నేర్పుతున్నారు! నిజాయితీ + నమ్మకం = విజయం! అందరిలాగా చేస్తే మనల్ని ఎవరూ గుర్తించరు. ఆరోగ్యదాయకంగా, వినూత్నంగా చేయాలి, దాని ద్వారా మనం ఆదాయం పొందాలి. వినియోగదారుల మనసులను చూరగొనాలి. నిజాయితీ, నమ్మకంతో చేస్తే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. తొలుత కొన్ని కష్టాలు తప్పవు. కష్టాలను అధిగమిస్తే విజయాలు చేకూరతాయని నేను నమ్ముతా. సమగ్ర సేంద్రియ వ్యవసాయంలో తృప్తితో పాటు మంచి ఆదాయమూ పొందుతున్నాను. – ఎడ్మల మల్లారెడ్డి (99598 68192), లక్ష్మీపూర్, జగిత్యాల జిల్లా -
ఫేస్బుక్ పరిచయం.. వివాహితతో ఎస్సై ప్రేమాయణం
సాక్షి, జగిత్యాలక్రైం: ఓ మహిళను నమ్మించి వంచించాడో ఎస్సై.. పెళ్లి చేసుకోమంటే నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వివాహిత తన భర్త, ఇద్దరు పిల్లలతో కలసి హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. ఏడాది క్రితం జగిత్యాల జిల్లా సరిహద్దు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఎస్సైకి ఫేస్బుక్లో సదరు మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెతో ప్రేమాయణం కొనసాగించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో వివాహిత కొద్ది రోజుల క్రితం భర్తకు విడాకులు ఇచ్చింది. అనంతరం రెండు నెలల క్రితం ఎస్సై ఆమెను కరీంనగర్లో రహస్యంగా ఉంచాడు. అయితే.. ఎస్సైకి ఇదివరకే పెళ్లి కావడంతో సదరు మహిళను వదిలించుకునేందుకు ప్రయత్నించాడు. మనస్తాపానికి గురైన ఆమె.. వారం క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తనను ఎస్సై మోసం చేశాడని బాధితురాలు జగిత్యాల డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో సదరు ఎస్సై సెలవులో వెళ్లాడు. -
హమ్మయ్య.. శ్రీనివాస్ క్షేమంగా వచ్చేశాడు!
పెగడపల్లి(ధర్మపురి): లెబనాన్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ షార్జాలో జైలు పాలయిన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మ్యాక వెంకయ్యపల్లికి చెందిన శ్రీనివాస్ ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాడు. శ్రీనివాస్ గల్ఫ్‌లో బందీ అయిన విషయంపై ‘సాక్షి’లో ‘జైలు నుంచి విడిపించరూ..’ శీర్షికన ప్రచురితమైన కథనానికి గల్ఫ్‌కార్మిక రక్షణ సమితి సభ్యులు స్పందించారు. షార్జా జైలు నుంచి ఇంటికొచ్చిన శ్రీనివాస్‌ను బుధవారం ‘సాక్షి’పలకరించింది. శ్రీనివాస్ 2013లో దుబాయ్‌కి వెళ్లగా జీతం తక్కువగా ఉండటంతో అక్కడే కల్లివెల్లి కార్మికుడిగా మారాడు. ఓ గదిలో పదిమందితో కలిసి ఉండేవాడు. ఈ క్రమంలో 2015లో గదిలో ఎవరో నల్లుల మందు పెట్టగా.. అది విషంగా మారి పక్క గదిలో ఉన్న ఒకరు చనిపోయారు. ఆ కేసులో సీఐడీ పోలీసులు శ్రీనివాస్‌ను జైలులో పెట్టి 20 రోజుల తర్వాత విడుదల చేయగా స్వగ్రామానికి వచ్చేశాడు. తర్వాత 2018లో లెబనాన్ వెళ్లిన శ్రీనివాస్ ఈ ఏడాది మార్చి 24న షార్జా నుంచి స్వదేశానికి తిరిగి వస్తుండగా శ్రీనివాస్‌పై కేసు ఉందని, రెండు నెలలు జైలుతోపాటు రూ.45 లక్షలు జరిమానా చెల్లించాలని చెప్పారు. ఆయన స్నేహితుడు ఈ విషయాన్ని గల్ఫ్‌కార్మిక రక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నరసింహకు తెలపగా, ఆయన చొరవతో ఎలాంటి జైలుశిక్ష, జరిమానా లేకుండానే విడుదలై, స్వగ్రామం చేరుకున్నాడు. గల్ఫ్‌లో కార్మికుల గోస.. ఆదుకోవాలని వేడుకోలు -
వీళ్లు మామూలు లేడీలు కాదు.. పెద్ద కేడీలు
జగిత్యాల: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు మహిళలు ప్రముఖులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఫొన్లలో పరిచయం పెంచుకొని వారితో సన్నిహితంగా మెదులుతూ ఫొటోలు తీసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. మాయలేడీ ముఠాల బ్లాక్‌మెయిల్స్‌కు బెదిరిన పలువురు ప్రముఖులు, డబ్బున్న యువకులు పెద్ద మొత్తంలో సమర్పించుకుంటున్నారు. ఇలాంటి ముఠాల బాగోతం జిల్లాలో ఇటీవల వరుసగా వెలుగుచూస్తున్నాయి. వరుసగా ఇదే తరహా ఘటనలు ► జిల్లాలోని ధర్మపురికి చెందిన జమున అనే మహిళ వ్యవహారం గత డిసెంబర్లో వెలుగుచూసింది. జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన పరిచయం ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా మెదులుతూ వారిని రహస్య ప్రాంతాలకు రప్పించేది. అక్కడికొచ్చాక ఆ ముఠాలోని మరో ముగ్గురు వ్యక్తులతో బెదిరించి వారి వద్ద గల డబ్బు, బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు దోచుకున్నారు. ► జగిత్యాల హనుమాన్‌వాడకు చెందిన కూకట్ రాజ్‌కుమార్, జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటకు చెందిన నలువాల తిలక్, సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన కోలపాక దినేశ్, ధర్మపురి పట్టణం మామిడివాడకు చెందిన మామిడి జమునతోపాటు రాయికల్ మండలం అల్లీపూర్‌కు చెందిన 20 ఏళ్ల యువతితో కలిసి గత అక్టోబర్ నుంచి జిల్లాలో పరిచయం ఉన్న వారితో పాటు డబ్బు ఉన్న వ్యక్తులను పరిచయం చేసుకుని రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి మహిళతో సన్నిహితంగా ఉంటున్న సమయంలో సదరు ముగ్గురు వీడియోలు చిత్రీకరించే వారు. వీటిని సోషల్‌మీడియా, వాట్సాప్‌లలో పోస్ట్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేస్తూ వారి వద్దనున్న బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లు దోపిడీకి పాల్పడ్డారు. ► డిసెంబర్ 22న జగిత్యాల విద్యానగర్‌కు చెందిన ఒకరిని ఓ మహిళ మేడిపల్లి మండలం వల్లంపల్లికి పిలిపించి బెదిరింపులకు పాల్పడింది. నాలుగు తులాల బంగారం, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లింది. బాధితుడు ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ► సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన ఓ మహిళ ముఠాగా ఏర్పడి జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన ఒకరిని నాలుగు నెలల క్రితం పరిచయం చేసుకున్నారు. తన వద్ద పలువురు యువతులున్నారని, సన్నిహితంగా ఉంచేందుకు వారిని ఒప్పిస్తానని నమ్మబలికి అతని నుంచి దశలవారీగా రూ.26 లక్షలు తమ ఖాతాల్లోకి మళ్లించింది. ఈ డబ్బులను సుమారు రూ.18 లక్షలు బుగ్గారం మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఖాతాలోకి వెళ్లాయి. సదరు వ్యక్తి డబ్బుల కోసం మహిళను నిలదీయడంతో తనను, తన కూతురును వాడుకుని చంపుతానని బెదిరిస్తున్నాడని జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో అసలు నిజయం తెలియడంతో వారే అవాక్కయ్యారు. ► ఇదే మహిళ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన ఒకరిని, కోరుట్లకు చెందిన వ్యక్తిని, జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన వ్యక్తిని మోసం చేసింది. సదరు మహిళపై బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా అప్పటి జగిత్యాల ఇన్చార్జి ఎస్పీ కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డిపై బుగ్గారం మండలానికి చెందిన రాజకీయ నాయకుడు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. ► నాలుగు రోజుల క్రితం వేములవాడలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన మహిళ కుంట సుమిత అలియాస్ నందు అక్కడి పోలీసులు ఓ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సదరు మహిళ సైతం పలువురు యువతులు తన వద్ద ఉన్నారని, సెల్ఫోన్లో మాట్లాడిస్తూ వారితో సన్నిహిత్యం ఏర్పాటు చేసుకుని ఒకరి నుంచే రూ.15 లక్షలు నరెండ్ల గంగారెడ్డి అనే వ్యక్తి ఖాతాలో వేయించి మోసానికి పాల్పడింది. వెలుగుచూడని నిజాలెన్నో.. జిల్లాలో ప్రముఖులు, డబ్బున్న వారిని ఈ కిలేడీ ముఠాలు పరిచయాలు పెంచుకుని సన్నిహితంగా ఉంటూ అందినంత డబ్బు వసూలు చేస్తున్నాయి. వీరి బారిన పడిన వారు జిల్లాలో చాలా మంది ఉన్నప్పటికీ పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. మరికొంత మంది మాత్రం డబ్బులు తీసుకుని పలువురు యువతులను వారి వద్దకు పంపి వారితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తెప్పించుకుని వారిని బ్లాక్మెయిల్ చేస్తూ అందినంత దోచుకుంటున్నారు. పరువు పోతుందనే బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకురావడం లేదు. ( చదవండి: ఆరోగ్యం బాగు చేస్తామని క్షుద్ర పూజలు, ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ ) -
ప్రైవేట్ టీచర్ ఆవేదన: సీఎం సారూ.. పస్తులుంటున్నం
సాక్షి, జగిత్యాల: ‘ఉపాధి కోల్పోయి పస్తులుంటున్నం. మా కుటుంబం ఆత్మహత్య చేసుకోకముందే మమ్మల్ని కాపాడండి, మాకు బతుకునివ్వండి’అంటూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన ప్రైవేట్ టీచర్ సీఎం కేసీఆర్‌ను ప్రాధేయపడ్డాడు. సోమవారం తన భార్య, ఇద్దరు పిల్లలతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన గడప చంద్రశేఖర్ తమ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ సీఎం కేసీఆర్‌ను వీడియో ద్వారా కోరారు. ‘సీఎం కేసీఆర్ సార్‌కు నమస్కారం. నేను 20 ఏళ్లుగా ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తున్నా. అరకొర వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకొచ్చాను. కరోనాతో ఉపాధి పోయి తిప్పలు పడుతున్నం. బతకలేని స్థితిలో ఉన్నాం. అద్దె ఇంట్లో ఉంటున్నాం. 12 నెలలుగా అద్దె కూడా చెల్లించలేదు. బతకడం కోసం అప్పులు చేశాం. అప్పు ఇచ్చిన వారి నుంచి వేధింపులు మొదలయ్యాయి. నా కొడుక్కి వారంరోజులుగా ఆరోగ్యం బాగాలేదు.. వైద్యం అందించలేకపోతున్న. భార్యాపిల్లలకు రెండుపూటలా తిం డిపెట్టే పరిస్థితి కూడా లేదు. పస్తులుంటున్నాం. మా కుటుంబం ఆత్మహత్య చేసుకోకముందే కాపా డే బాధ్యత మీదే సార్’అంటూ విన్నవించారు. -
జైలు నుంచి విడిపించరూ..!
పెగడపల్లి (ధర్మపురి): జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని మ్యాక వెంకయ్యపల్లికి చెందిన లింగంపల్లి శ్రీనివాస్(27) ఉపాధి కోసం లెబనాన్ వెళ్లి తిరిగి వస్తుండగా షార్జా విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనివాస్ 2013లో కంపెనీ వీసాపై దుబాయి వెళ్లి 2016 వరకు పనిచేశాడు. అక్కడి కంపెనీలో పని సక్రమంగా లేకపోవడం, జీతం తక్కువగా ఉండటంతో తిరిగి రావాలని భావించాడు. అయితే అప్పటికే వీసా గడువు సమయం ముగియడంతో శ్రీనివాస్‌పై అక్కడి ప్రభుత్వం కేసుపెట్టి అరెస్టు చేసింది. 15 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలై భారత్‌కు వచ్చాడు. 2018లో తిరిగి కంపెనీ వీసాతో లెబనాన్ వెళ్లాడు. తాజాగా లెబనాన్ నుంచి తిరిగొచ్చేందుకు ఈ నెల 25న బయల్దేరి షార్జాకు చేరుకున్నాడు. విమానాశ్రయంలో శ్రీనివాస్ పాసుపోర్టు స్కాన్ చేస్తుండగా దుబాయిలో కేసు ఉన్నట్లు తేలి, పాసుపోర్టు ఎర్రర్ చూపింది. దీంతో పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్టుచేసి జైలుకు పంపారు. కాగా, రెండు రోజుల కింద లెబనాన్ నుంచి బయల్దేరుతూ తమకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పాడని తల్లిదండ్రులు బాలయ్య, కొమురమ్మ, భార్య మమత రోదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్కడి రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి, తమ కొడుకు ఇక్కడికి వచ్చేలా చూడాలని కోరుతున్నారు. హృదయవిదారకం.. రోడ్డుపక్క గర్భిణి ప్రసవం -
జగిత్యాల.. ఆడబిడ్డల అడ్డా
సాక్షి, జగిత్యాల: ఆమె ఆధిక్యం.. దాదాపు రాష్ట్రమంతా కనిపిస్తోంది. ఆడబిడ్డ అంటే భారం, బాధ, వివక్ష అనుకునే అడ్డంకులను దాటి.. అమ్మాయి అంటే ఆనందం అంటూ ‘ఊపిరి’పోస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రం దేశ సగటును మించి పురుషుల కంటే ఎక్కువ మహిళలతోనే కళకళలాడుతోంది. ఇటీవల భారత ప్రభుత్వం విడుదల చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదిక (2019–20) ప్రకారం.. రాష్ట్రంలో ప్రతీ 1,000 మంది పురుషులకు 1,049 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో సర్వే చేసిన 31 జిల్లాల్లో (ములుగు, నారాయణపేట మినహా) ఆడబిడ్డల అడ్డగా జగిత్యాల తొలిస్థానంలో.. నిర్మల్, రాజన్నసిరిసిల్ల రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. పురుషులకంటే తక్కువ జనాభాతో హైదరాబాద్(959), ఆదిలాబాద్(992), మల్కాజిగిరి(996), వికారాబాద్(998) జిల్లాలున్నాయి. -
పోలీసులకు తలనొప్పిగా మారిన పందెం కోడి !
సాక్షి, జగిత్యాల : పందెం కోడి వ్యవహారం పోలీసులకు తలనొప్పిని తెచ్చింది. ఒకరి ప్రాణం పోయేందుకు కారణమైన కోడిని పోలీస్‌స్టేషన్‌లో ఉంచితే.. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు పోలీసులు కోడిని అరెస్ట్ చేశారంటూ సోషల్‌మీడియాలో చేసిన పోస్టు చర్చనీయాంశమైంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూర్‌లో ఈ నెల 22న కొందరు కోడిపందేలు ఆడారు. జిల్లాలోని వెల్గటూర్ మండలం కొండాపూర్‌కు చెందిన తనుగుల సంతోష్ సైతం లొత్తునూర్ ఎల్లమ్మ గుట్ట వద్ద కోడిపందెంలో పాల్గొన్నాడు. సతీశ్ తన కోడికి కత్తులు కట్టి వదిలేందుకు వంగగా.. అది ఒక్కసారిగా లేచి తన్నడంతో సతీశ్ మర్మాంగాలకు గాయమై మృతిచెందాడు. గొల్లపల్లి ఎస్సై జీవన్ సంఘటన స్థలానికి చేరుకుని సతీశ్ మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాణం పోయేందుకు కారణమైన కోడి అక్కడే ఉండడంతో ఠాణాకు తీసుకొచ్చి, కొద్దిసేపటి తర్వాత సంరక్షణ కోసం కోళ్ల ఫారానికి తరలించారు. అంతలోనే గుర్తు తెలియని వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కోడిని ఫొటో తీసి పోలీసులు కోడిని అరెస్ట్ చేశారంటూ సోషల్‌మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. దీంతో రాష్ట్రస్థాయి పోలీసు అధికారులు జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన గొల్లపల్లి ఎస్సై జీవన్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సంఘటన ప్రాంతంలో కోడి ఉండటంతో సంరక్షించేందుకే పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చామని, అరెస్ట్ చేయలేదని తెలిపారు. అరగంట తర్వాత కోళ్లఫారానికి తరలించామన్నారు. కోడిపందేలలో పాల్గొన్న వారి వివరాలు సేకరించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చదవండి: కల్లు తాగి వెనక్కి, ఆమె ఒత్తిడి చేయడంతో... తమ్ముడి ఆత్మహత్య.. ఆవేదనతో అన్న కూడా -
మే 23న కూతురి పెళ్లి.. అంతలోనే జలసమాధి
సాక్షి, జగిత్యాల/ మేడిపల్లి (వేములవాడ): దైవ దర్శనానికి వేకువజామునే సొంతూరుకు బయల్దేరిన ఓ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించినా తేరుకునే లోపే మృత్యువు కాటేసింది. నీట మునిగి ముగ్గురు కుటుంబసభ్యులు దుర్మరణం చెందారు. ‘‘అమ్మకు ఈత రాదు. అమ్మను తీసుకొని బయటకు వెళ్దాం..’’అని తండ్రి ధైర్యం చెప్పినా... తేరుకొని బయటపడే ప్రయత్నం చేసే లోపే కారులో నీరు నిండిపోయింది. దంపతులు, కూతురు దుర్మరణం చెందగా... కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట శివారులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డుకు చెందిన న్యాయవాది కటికనేని అమరేందర్‌రావు (55), ఆయన భార్య శిరీష (45), కూతురు శ్రేయ (23), కుమారుడు జయంత్ కలిసి సోమవారం స్వగ్రామమైన కోరుట్ల మండలం జోగన్ పెల్లికి బయల్దేరారు. ఊరిలో సోమవారమే ప్రారంభమైన వేంకటేశ్వరస్వామి ఉత్సవా లకు హాజరయ్యేందుకు తెల్లవారుజామున 5.15 గంటలకు బయల్దేరారు. ఆ తర్వాత 15 నిమిషాలకే కారు అదుపుతప్పి మేడిపల్లి మండలం కట్లకుంట శివారులో రోడ్డు పక్కనున్న ఎస్సారెస్పీ కాలువలో పడిపోయింది. ఆ సమయంలో అమరేందర్‌రావు కారు నడుపుతుండగా, కుమారుడు జయంత్ పక్కన కూర్చున్నాడు. భార్య శిరీష, కూతురు శ్రేయ వెనుక సీట్లో కూర్చున్నారు. కారు కాలువలో పడి సుమారు 20 మీటర్ల దూరం వరకు వెళ్లి మోటారు పైపునకు తట్టుకుని ఆగింది. కుమారుడు జయంత్ కారు డోరు తీసు కుని... ఈదుకుంటూ సురక్షితంగా బయట పడినప్పటికీ అమరేందర్‌రావుతో పాటు భార్య శిరీష, కూతురు శ్రేయ కారులో ఇరు క్కుపోవడంతో నీటిలోనే మునిగి మరణిం చారు. స్థానికులు సహాయ చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే ముగ్గురు చనిపోయారు. చదవండి: (నా భార్యను నేనే చంపేశా.. ఇక దేనికైనా సిద్ధమే) కాలువలో పడ్డ కారును బయటకు తీస్తున్న పోలీసులు నిద్రమత్తులోనే ప్రమాదం తెల్లవారుజామునే జగిత్యాల నుంచి బయల్దేరిన కారు మేడిపల్లి మీదుగా కోరుట్ల మండలం జోగిన్‌పల్లికి వెళ్లేమార్గంలో కట్లకుంట వద్దనున్న ఎస్సారెస్పీ కెనాల్ బ్రిడ్జి ముందు నుంచే కాలువలోకి దూసుకెళ్లింది. బ్రిడ్జి దగ్గరకు రాగానే నేరుగా బీటీ రోడ్డు వైపు వెళ్లకుండా కుడివైపునకు మళ్లించడంతో అదుపుతప్పి కారు కాల్వలో పడింది. నిద్రమత్తు కారణంగానే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురికి ఈత వచ్చినా.. కారు కాలువలోకి దూసుకెళ్లగా.. అమరేందర్‌రావు, ఆయన భార్య, పిల్లలు అందులో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ‘‘ఎవరూ కంగారు పడొద్దు. మన ముగ్గురికీ ఈత వస్తుంది.. అమ్మను మెల్లగా బయటకు తీసు కొద్దాం..’’అని అమరేందర్‌రావు పిల్లలకు చెప్పారు. కానీ.. కారు డోర్లు తీయలేక పోవడంతో లోపలే ఇరుక్కుపోయారు. కారులో నీళ్లు నిండుతున్నాయని శిరీష, శ్రేయలు కారు మునిగిపోయే సమయంలో అరిచినట్లు జయంత్ చెప్పాడు. మూడు నెలల్లో కూతురు పెళ్లి.. ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న శ్రేయకు వరంగల్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో ఇటీవలే పెళ్లి కుదిరింది. మే 23న పెళ్లి పెట్టుకున్నారు. సోమవారం జోగిన్‌పల్లిలో దైవ దర్శనం తరువాత హైదరాబాద్‌కు వెళ్లి పెళ్లి పనులు, షాపింగ్ పూర్తి చేసుకోవాలని అమరేందర్‌రావు కుటుంబీకులు భావించారు. ఈలోపే ప్రమాదం చోటుచేసుకొని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జగిత్యాల ఆసుపత్రిలో మృతదే హాలను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, కలెక్టర్ రవి, ఎస్పీ సింధుశర్మ పరిశీలించారు. రెయిలింగ్ లేక ప్రమాదాలు ఐదు రోజుల క్రితం వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం తీగరాజు పల్లి శివారులో ఎస్సారెస్పీ కాలువలో కారు పడి ఇద్దరు మృతి చెందిన ఘటన మరువకముందే సోమవారం జగి త్యాల జిల్లా కట్లకుంట శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్సా రెస్పీ కెనాల్ మీదుగా వెళుతున్న రహదారులపై బ్రిడ్జీలకు ఇరువైపులా సుమారు 100 మీటర్ల వరకు రెయిలింగ్ ఏర్పాటు చేయాల్సి ఉండగా రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి 16న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ శివారులో ఎస్సారెస్పీ ప్రధాన కాలువలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బంధువులు ప్రయాణిస్తున్న కారు కాలువలో పడి ముగ్గురు మృతిచెందారు. ఇక్కడే జనవరి 25న సుల్తానాబాద్‌కు చెందిన దంపతులు కారు రివర్స్ తీస్తుండగా ప్రమాదవశాత్తు కాల్వలో పడి ఇద్దరు మృతిచెందారు. ఇదే ప్రాంతంలో వేర్వే రు ఘటనలో రెండు బైక్ ప్రమాదాల్లో నలుగురు మరణించారు. అమ్మను కూడా తీసుకెళ్దాం అన్నారు ‘కారులో బయల్దేరాక నాన్నకు నిద్ర వస్తోందని నేను డ్రైవ్ చేస్తానన్నాను. పర్లేదు బిడ్డా... టెన్షన్ పడకు నేను నడుపుతా అన్నారు. బ్రిడ్జి వద్దకు రాగానే కారు అదుపుతప్పడంతో కాలువలో పడిపోయింది. వెంటనే నాన్నా కారు నుంచి బయటకు వెళ్దాం అన్నాను. ఏమీ కాదులే.. నీకు, నాకు, అక్కయ్యకు ఈతవచ్చు. అమ్మకు ఈత రాదు కాబట్టి ఆమెను తీసుకొని బయటకు వెళ్దాం అన్నారు. నాన్న ఆ మాట చెప్పేలోపే కారు నీటిలో మునిగిపోయింది. నేను డోరు తీసుకొని బయటకు వచ్చాను. కానీ నాన్న, అమ్మ, అక్క కారులోనే ఇరుక్కుపోయారు. కళ్లముందే అంతా అయిపోయింది.’ – జయంత్, కుమారుడు -
తెరపైకి అజీజ్ గ్యాంగ్: కిడ్నాప్ కలకలం
సాక్షి, జగిత్యాల: హైదరాబాద్ వ్యాపారి కిడ్నాప్ జిల్లాలో కలకలం రేపింది. అడ్తిదారుల మధ్య మక్కల డబ్బుల వివాదమే కిడ్నాప్‌కు కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీంతో మరోసారి గ్యాంగ్‌స్టర్ అజీజ్ తెరపైకి రావడం కలకలం సృష్టించింది. ఏడాదిక్రితం మెట్పల్లి, కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండలాలకు చెందిన రైతుల నుంచి మక్కలు కొనుగోలు చేసిన స్థానిక అడ్తిదారులు కోరుట్లకు చెందిన ఓ అడ్తిదారు మధ్యవర్తిగా హైదరాబాద్ వ్యాపారికి అమ్మినట్లు తెలిసింది. ఈ లావాదేవీలు సుమారు రూ.3 కోట్ల వరకు సాగినట్లు సమాచారం. అడ్తిదారులకు డబ్బు చెల్లింపులో జరిగిన జాప్యానికి వ్యాపారి కిడ్నాప్‌నకు దారితీసినట్లు తెలుస్తోంది. ఏడాదిగా వివాదం ఏడాదిపాటు మక్కల డబ్బుకోసం ఎదురుచూసిన అడ్తిదారులు విసిగిపోయారు. మెట్పల్లి సబ్‌డివిజన్ పరిధిలోనే సుమారు 20 మంది అడ్తివ్యాపారులకు రూ.3 కోట్లు మేర డబ్బు రావాల్సి ఉంది. రైతుల నుంచి ఒత్తిడిరావడంతో కొంతమంది అడ్తిదారులు హైదరాబాద్ వ్యాపారి నుంచి డబ్బు రాకున్నా చెల్లింపులు చేసినట్లు తెలిసింది. డబ్బు కోసం ప్రయత్నాలు చేసిన అడ్తిదారులు చివరికి అజీజ్ గ్యాంగ్‌ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అతడి సహకారంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వ్యాపారిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కిడ్నాప్‌కు సుపారీయా? వ్యాపారి కిడ్నాపునకు అజీజ్ గ్యాంగ్‌కు సుపారీ మాట్లాడుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అడ్తిదారులకు, హైదరాబాద్ వ్యాపారికి మధ్యవర్తిగా వ్యవహరించిన కోరుట్ల అడ్తిదారు అజీజ్ తనకు వ్యాపారం కోసం డబ్బు అప్పుగా ఇచ్చినట్లుగా పోలీసులకు చెబుతున్నట్లు సమాచారం. ఈ డబ్బుకోసం అజీజ్ తమపై ఒత్తిడి చేస్తే హైదరాబాద్ వ్యాపారి వద్దకు వెళ్లామని చెబుతున్నట్లు తెలిసింది. అజీజ్‌పై గతంలో కోరుట్లలో కిడ్నాప్, హత్య, పాత నోట్ల మార్పిడి, ఆర్మూర్‌లో కిడ్నాప్ కేసులు ఉండడం గమనార్హం. పట్టుబడింది ఇలా.. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన వ్యాపారి తాట్ల నాగభూషణంను ఆర్థిక లావాదేవీల గొడవలతోనే రూ.50 లక్షల సుపారీ కుదుర్చుకొని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కోరుట్లకు చెందిన వ్యాపారి నేరచరిత్ర ఉన్న అజీజ్‌ను సంప్రదించి ఎలాగైనా వ్యాపారి నుంచి డబ్బు వసూలు చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. వ్యాపారిని అజీజ్ తన కారులో కిడ్నాప్ చేసి తీసుకువస్తుండగా వ్యాపారి కుటుంబసభ్యులు గుమస్తా సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు అప్రమత్తమై వాహనం నంబరు ఆధారంగా వ్యాపారితో మాట్లాడిన ఫోన్నంబర్ల ఆధారంగా గుర్తించి కరీంనగర్ ఉమ్మడి జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. కొడిమ్యాల ఎస్సై శివకృష్ణ ఆధ్వర్యంలో దొంగలమర్రి చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేస్తుండగా కిడ్నాపర్లు కారును దారి మళ్లించడంతో వెంబడించి బాధితుడు నాగభూషణంతోపాటు కోరుట్లకు చెందిన అజీజ్, హైదరాబాద్‌కు చెందిన సునిల్పటేల్, నిఖిల్సింగ్ను అదుపులోకి తీసుకుని సోమవారం అర్ధరాత్రి సరూర్‌నగర్ పోలీసులకు అప్పగించారు. కారు నుంచి పారిపోయిన నాగరాజును కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామస్తులు మంగళవారం పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి బుర్రి రాజేశ్ మాత్రం పరారీలో ఉన్నాడు. అతడికోసం ప్రత్యేక పోలీస్ బృందం గాలింపు చేపట్టింది. అజీజ్ నేరచరిత్రపై పోలీసుల విచారణ రాయికల్ పట్టణంలో భూ మాఫియా పేరిట గతంలో వాయిస్‌రికార్డు సోషల్ మీడియాలో కలకలం రేపింది. అప్పుడు భూ యజమాని అయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయికల్ మండలంలోని కొంత మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. తాజా విచారణలో రాయికల్‌లో వాయిస్ రికార్డులో అజీజ్ పేరు బయటకు వచ్చినట్లు సమాచారం. అజీజ్‌తోపాటు రాయికల్‌కు చెందిన మరోవ్యక్తి మధ్యవర్తిగా ఉన్నట్లు పేరు కూడా చెప్పినట్లు తెలిసింది. అజీజ్ నేరచరిత్రపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ వేగవంతం చేశారు. -
కరోనా రోగికి అత్యవసర చికిత్స
సాక్షి, జగిత్యాల: ప్రమాదవశాత్తు గాయపడి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న కరోనా బా ధితుడికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ చొరవ తీసుకొని వైద్యం అందించారు. జ గిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని అంతర్గాం గ్రామానికి చెందిన ఓ గీత కార్మికుడు ఇటీవల ఇంట్లో జారిపడ్డాడు. తల కు బలమైన గాయంతోపాటు కుడికాలు విరిగిం ది. కన్నుకు కూడా తీవ్ర గాయమైంది. చికిత్స కోసం కరీంనగర్‌లోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిన క్రమంలో అతను కరోనా బారిన పడ్డాడు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో అక్కడి వైద్యులు చికిత్సకు నిరాకరించారు. ఈ క్రమంలో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ తీవ్రమైన నొప్పితో నరకయాతన అనుభవిస్తున్నాడు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ వెంటనే స్పందించారు. నేత్రవైద్యుడు అయిన ఎమ్మెల్యే సంజయ్‌తోపాటు ఆర్ధోపెడిక్ వైద్యుడు నవీన్, వైద్యసిబ్బంది పీపీఈ సూట్లు ధరించి కరోనా బాధితుడికి ఆదివారం చికిత్స అందించారు. ఇది తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. ఎమ్మెల్యే సంజయ్‌ను ట్విట్టర్లో అభినందించారు. -
తాగిన మైకంలో తండ్రినే..
సాక్షి, జగిత్యాల:జిల్లాకేంద్రంలోని విద్యానగర్ ప్రాంతానికి చెందిన మూగల రాజేశం(56) అనే వ్యక్తిని అతడి చిన్న కొడుకు వెంకటరమణ తాగిన మైకంలో బండరాయితో మోదీ ఆదివారం తెల్లవారుజామున హత్యచేశాడు. విద్యానగర్ ప్రాంతానికి చెందిన మూగల రాజేశం జీవనోపాధికోసం గల్ఫ్ వెళ్లి డబ్బులు సంపాదించి ఇంటికి పంపాడు. ఇంటి వద్ద ఉన్న భార్యతోపాటు కొడుకులు వృథాచేయడంతో కొద్దికాలంగా రాజేశంతోపాటు అతడి కొడుకు వెంకటరమణ మద్యానికి బానిసై గొడవపడేవారు. శనివారం రాత్రి రాజేశం మద్యంమత్తులో కొడుకుతో గొడవపడ్డాడు. దీంతో చిన్నకొడుకు వెంకటరమణ తాగి ఉండడం, నిత్యం గొడవలు జరుగుతుండడంతో క్షణికావేశంలో తండ్రిని బండరాయితో మోదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ జయేశ్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజేశం భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి మృతి
జగిత్యాల: బతుకుదెరువు కోసం అరబ్ దేశం బహ్రెయిన్‌కి వెళ్లిన ఓ తెలంగాణ వ్యక్తి అక్కడే గుండెపోటుతో మృతి చెందారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్ గ్రామానికి చెందిన ఎడ్ల గంగరాజం మూడేళ్ల క్రితం బహ్రెయిన్ వెళ్లాడు. దురదృష్టవశాత్తు ఏప్రిల్ 14వ తేదీన గుండెపోటుతో అతను నివాసం ఉంటున్న ఇంట్లోనే మృతి చెందాడు. గంగరాజంకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద దేశం కాని దేశంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం ఆధారం కోల్పోయింది. అయితే సాధారణ పరిస్థితుల్లోనే అరబ్ దేశాల్లో చనిపోయిన వారి డెడ్ బాడీ తరలింపు ఎంతో కష్టం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. లాక్‌డౌన్‌తో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడం మరింత కష్టమైంది. దీంతో బహ్రెయిన్‌లోని తోటి సన్నిహితులు మగ్గిడి రాజేందర్ ఎన్నారై శాఖకు సమాచారం అందించటంతో వెంటనే స్పందించిన ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి మృతుడి కంపెనీ యజమాని, అధికారులతో మాట్లాడారు. కంపెనీ సహకారంతో వారు మృతదేహాన్ని ఎమిరేట్స్ కార్గో ప్లయిట్లో బహ్రెయిన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి స్వగ్రామం రాఘవపేట్ వరకు ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ వారి అధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించడం జరిగింది. మృతదేహం స్వదేశానికి తీసుకురావడానికి కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగల, ఎన్నారై శాఖ అధికారి చిట్టిబాబు అన్ని విధాల కృషి చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్ బొలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రటరీ పుప్పాల లింబాద్రి, మగ్గిడి రాజేందర్, సెక్రటరీ చెన్నమనేని రాజేందర్ రావు, బాల్కొండ దేవన్న, ఉత్కం కిరణ్ కుమార్, ఆకుల సుధాకర్, బొలిశెట్టి ప్రమోద్, తమ్మళ్ల వెంకటేష్, కొత్తూరు సాయన్న, కుమ్మరి రాజుకుమార్, నల్ల శంకర్, చిన్నవేన బాజన్న, కోట నడిపి సాయన్న, ఆకులన చిన్న బుచ్చయ్య, సొన్న గంగాధర్, తప్పి చిన్న గంగారాం, మొహమ్మద్ తదితరులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
జగిత్యాలలో కాల్పుల కలకలం
-
కీచక ఖాకీ!
కోరుట్ల: మహిళా కానిస్టేబుల్‌ను వేధింపులకు గురిచేస్తున్న ఓ కీచక ఎస్ఐపై వేటు పడింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. జగిత్యాల జిల్లా ఓ పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ను అదే ఠాణాకు చెందిన ఎస్సై ఆర్నెల్లుగా వేధిస్తున్నట్లు తెలిసింది. తరచూ వాట్సాప్‌లో మెసేజ్ లు పెడుతూ.. వీడియో కాల్ చేయాలని ఆ వేధింపులకు గురి చేసేవాడు. బయట తెలిస్తే పరువు పోతుందేమోనని ఆమె ఎవరికీ చెప్పు కోలేక తనలో తాను కుమిలిపోయింది. రోజురోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె తన సన్నిహితులు.. అలాగే అదే సబ్ డివిజన్‌కు చెందిన ఓ సీఐతో మొర పెట్టుకున్నట్లు సమాచారం. ఆయన ఈ విషయంపై ఆరా తీసి సదరు ఎస్సైని మందలించినట్లు తెలిసింది. సీఐ చెప్పినా అతని వైఖరిలో మార్పు రాలేదు. చివరకు ఈ వ్యవహారం జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లగా.. తక్షణం అతడిని బదిలీ చేసి వీఆర్‌లో ఉంచినట్లు సమాచారం. -
శవాలకూ రక్షణ కరువు
సాక్షి, జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ప్రధానాస్పత్రిలో శవపరీక్షలకు కష్టకాలం వచ్చింది. జిల్లా ఆస్పత్రిలోని మార్చురీ గది చిన్నగా ఉండడం, ఫ్రీజర్ సైతం ఒకటే ఉండడం ఇబ్బందిగా మారింది. సెలవు దినాల్లో రెండుకు మించి మృతదేహాలు వస్తే భద్రపరచడం కూడా కష్టంగా మారింది. రెండేళ్ల క్రితం ఓ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీలో భద్రపరచగా.. ఎలుకలు తిన్నాయి. అంతేకాకుండా ఫ్రీజర్‌లోనూ రెండు మృతదేహాలను మాత్రమే భద్రపరిచే అవకాశం ఉంది. అది కూడా ఒక దానిపైన మరో శవాన్ని ఉంచాల్సి వస్తుండడంతో మృతుల బంధువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. జిల్లా ఆస్పత్రిలో ఒకే ఫీజర్ జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి చుట్టుపక్కల గ్రామాల నుంచి రోగులు వస్తుంటారు. ఏదైన ప్రమాదం జరిగి చనిపోతే పోస్టుమార్టం కోసం ఇక్కడికే తీసుకొస్తుంటారు. మున్సిపాలిటీగా ఉన్న సమయంలో ఆస్పత్రిని అప్పటి జనాభా అవసరాలకు అనుగుణంగా నిర్మించారు. ప్రస్తుతం జిల్లాగా అవతరించడం, జనాభా పెరగడం తో ఆస్పత్రి సరిపోవడం లేదు. దీంతో పోస్టుమార్టం గది సైతం చిన్నగా మారింది. ఈ గదిలో రెండు ఫ్రీజర్లతోపాటు ఒక బల్ల మాత్రమే ఉన్నా యి. ఈ ఆస్పత్రికి వారంలో కనీసం 3 నుంచి 4 మృతదేహాలు వస్తుంటాయి. సాయంత్రం వేళ పోస్టుమార్టం చేయకపోవడం, రాత్రి వేళ చనిపోయిన వారిని ఇక్కడే తేవడంతో మృతదేహాలను పోస్టుమార్టం గదిలో భద్రపరుస్తుంటారు. రెండు మృతదేహాలకన్నా ఎక్కువగా ఉంటే బయట వరండాలోనే వేయాల్సిన దుస్థితి. అన్నీ అసౌకర్యాలే.. పోస్టుమార్టం గదికి ఒక భవనంతోపాటు మృతదేహాలను భద్రపర్చేందుకు ఒక గది, కుళ్లిన మృతదేహాల నుంచి సేకరించిన నమూనాలను భద్రపరిచేందుకు ఒక గది ఉండాలి. కానీ ఇందులో రెండు మాత్రమే ఉన్నాయి. ఇందులో నిరంతరం నీటి సరఫరాతోపాటు శుభ్రం చేసేందుకు వాక్యుమ్‌క్లీనర్లు ఉండాలి. ఇవన్నీ కనిపించడం లేదు. పరికరాలు సైతం స్టీల్‌తో చేసినవి ఉండాలి. గది లోపలికి గాలి వెళ్లేందుకు ఎగ్జిట్‌ఫ్యాన్లు సైతం ఉండాలి. కానీ ఈ గది పురాతనమైనది కావడంతో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అంతేకాకుండా ఇతర సామగ్రిని సైతం ఇందులోనే వేస్తున్నారు. శవ పంచనామా రాసేందుకు ప్రత్యేక గది లేదు. మరొకటి ఎప్పుడో ? జగిత్యాల జిల్లా కేంద్రంగా మారడంతో ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసినప్పటికీ ఆ స్థాయిలో వసతులు కల్పించలేదు. మృతదేహాలు సైతం దాదాపు నెలకు 30కి పైగానే వస్తుంటాయి. వీటన్నింటికి పోస్టుమార్టం చేసేందుకు ఒకే గది ఉంది. గతంలో అధికారులు పరిశీలించినప్పటికీ స్థలం లేదని, ఉన్న దాంట్లోనే మరమ్మతులు చేపట్టారు. ఇప్పటికైన అధికారులు స్పందించి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో మరో పోస్టుమార్టం గదిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. స్థలం లేకనే ఇబ్బందులు ప్రస్తుతం ఉన్న పోస్టుమార్టం గదికి మరమ్మతులు చేయిస్తున్నాం. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. మరో గదిని ఏర్పాటు చేయాలంటే స్థలం లేదు. ప్రస్తుతం ధరూర్ క్యాంప్‌లో నిర్మిస్తున్న మాతాశిశు సంక్షేమ భవనంలోకి గైనిక్ విభాగం వెళ్తే ఇబ్బందులు తొలగుతాయి. ఇటీవల మృతదేహాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – సుదక్షిణాదేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
కొరడా ఝులిపిస్తున్న జగిత్యాల కలెక్టర్
సాక్షి, కోరుట్ల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముప్పై రోజుల ప్రణాళికలో నిర్లక్ష్యంపై వేటు తప్పడం లేదు. ముప్పై రోజుల ప్రణాళిక అమలులో కలెక్టర్ శరత్ సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న వేటు వేస్తున్నారు. నిత్యం ఏదో ఒక గ్రామంలో పర్యటిస్తూ ప్రణాళిక అమలును పరిశీలిస్తున్నారు. గ్రామాల్లో పర్యటించిన సమయంలో అక్కడ చేస్తున్న పనులు, గ్రామస్తుల భాగస్వామ్యం, అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శులపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. నాలుగు రోజుల క్రితం మెట్పల్లి మండలం వెల్లుల కార్యదర్శిని సస్పెండ్ చేశారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండ లంలో ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేయడమే కాకుండా.. మరో కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. అంతేకాకుండా తహసీల్దార్‌ను బదిలీ చేశారు. ఈ చర్యలతో జిల్లావ్యాప్తంగా 30 రోజుల ప్రణాళిక అమలులో కలెక్టర్ శరత్ ఎంత సీరియస్ ఉన్నారన్న విషయం అర్థమవుతుంది. పది రోజుల వ్యవధిలో ముగ్గురు కిందిస్థాయి సిబ్బంది సస్పెన్షన్‌కు గురవడంతో అధికారులు మరింత పకడ్బందీగా పనుల్లో నిమగ్నమయ్యారు. తనిఖీలు.. సమీక్షలు జిల్లావ్యాప్తంగా 30 రోజల ప్రణాళిక అమలులో లోటుపాట్లు లేకుండా కలెక్టర్ శరత్ ఎప్పటికప్పు డు అన్ని మండలాల్లో తనిఖీలు నిర్వహిస్తూ, అ ధికారులతో సమీక్షలు చేస్తున్నారు. గ్రామాలలో సమూల మార్పులు రావాలన్న లక్ష్యంతో 30 రోజుల ప్రణాళిక పనులు జిల్లాలోని 18 మండ లాల్లోని 380 గ్రామపంచాయతీల్లో చురుకుగా సాగుతున్నాయి. ప్రణాళిక అమలుకు 379 గ్రా మాల్లో 1,137 మంది కో–ఆప్షన్ సభ్యులు, 380 స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతీ గ్రా మానికి ప్రత్యేకాధికారులను నియమించి పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ శరత్ ఇప్పటికే జిల్లాలోని సగం మండలాల్లో పర్యటించి 30 రోజుల ప్రణాళిక తీరుతెన్నులపై సమీక్షలు.. ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రణాళిక అమలులో ఎక్కడెక్కడ లోపాలున్నాయనే దానిపై తనిఖీలు చేసి చ ర్యలు తీసుకుంటున్నారు. అలసత్వం వహిస్తు న్న అధికారులు, సిబ్బందికి హెచ్చరికలు జారీ చేస్తూ ముందుకెళ్తున్నారు. పది రోజుల వ్యవధిలో 30 రోజుల ప్రణాళిక అమలులో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు సస్పెన్షన్‌కు గురికాగా.. 8 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం పరిస్థితి తీవ్రతను అద్ధం పడుతోంది. ఇంటలిజెన్స్ కన్ను జిల్లాలో పది రోజులుగా సాగుతున్న 30 రోజుల ప్రణాళిక అమలు తీరు తెన్నులపై ఇంటలిజెన్స్ నివేదికలు అందిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాలవారీగా ఇంటలిజెన్స్ అధికారులు గ్రామపంచాయతీల్లో 30 రోజుల ప్రణాళిక అ మలు ఎలా ఉంది.. ఏ మేరకు అధికారులు, ప్ర జాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం ఉందన్న అంశంలో రోజువారీ ప్రగతి నివేదికలను ఉన్న తాధికారులకు అందిస్తున్నట్లు సమాచారం. ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయన్న విషయంలో ఇంటలిజెన్స్ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ నివేదికలు జిల్లా ఉన్నతాధికారులకు చేరుతుండగా వీటి ఆధారంగా జిల్లాలో 30 రోజుల ప్రణాళిక అమలులో వెనకబడ్డ మండలాలపై అధికారులు మరింత దృష్టి సారిస్తున్నారు. మిగిలిన పది రోజుల వ్యవధిలో అనుకున్న లక్ష్యాలను సాధించే క్రమంలో ఉన్నతాధికారులు మరింత నిక్కచ్చిగా వ్యవహరించే అవకాశాలున్నాయడంలో సందేహం లేదు. -
‘గిట్లనే చేస్తే కేంద్రంపై తిరుగుబాటు’
వెల్గటూరు (ధర్మపురి) : బీజేపీ నాయకులు చౌకబారు రాజకీయాలు చేస్తే కేంద్రంపై తిరుగుబాటు తప్పదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజారాంపల్లిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. ‘పార్లమెంట్ ఎన్నికల్లో అడ్డిమారి గుడ్డి దెబ్బలా నాలుగు సీట్లలో గెలిచిన మీరు ఎగిరెగిరి పడుతున్నరు.. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చావుదెబ్బ తిని.. సున్నాకే పరిమితం అయ్యారు. అయినా మీ వైఖరిలో మార్పు రావడం లేదు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి నయా పైసా సాయం లేకున్నా.. తగాదా ఎందుకు అని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నాం.. మీరు ప్రతి దాన్ని గిట్లనే రాజకీయం చేస్తే తిరగబడతామని మంత్రి హెచ్చరించారు. -
పల్లెను మార్చిన వలసలు
బండ్ల సురేష్, మేడిపల్లి(జగిత్యాల జిల్లా) : జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలంలోని మన్నెగూడెం వలస లకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. మెరుగైన ఉపాధి కోసం ఇక్కడి నుంచి యువకులు అత్యధికంగా గల్ఫ్‌కు వెళ్తున్నారు. ఈ గ్రామానికి చెందిన వారు గల్ఫ్‌లో ప్రస్తుతం 500 మందికి పైగా ఉండడం విశేషం. ఇందులో ఒక్క సౌది అరేబియాలోనే 200 మంది ఉపాధి పొందుతున్నారు. మన్నెగూడెం నుంచి గల్ఫ్‌కు వలసలు 1977 నుంచి ప్రారంభమయ్యాయి. మొదట్లో కొద్ది మంది మాత్రమే ఎడారి దేశాలకు వెళ్లారు. 1985 నుంచి వలసజీవుల సంఖ్య పెరిగింది. యూఏఈ, ఒమాన్, కువైట్‌తో పాటు సౌదీ అరేబియాకు వెళ్లడం ప్రారంభించారు. గ్రామాభివృద్ధిలో వీరే కీలకం.. గ్రామంలో చేపట్టే ప్రతి అభివృద్ధి పనికి గల్ఫ్‌లో ఉన్నవారు తోచిన విధంగా సహాయం చేస్తుంటారు. పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు అందిస్తున్నారు. పేదవిద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేయడం, చదువులో ముందంజలో ఉన్నవారికి ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటుతో పాటు విద్యా వలంటీర్‌తో బోధన చేయిస్తున్నారు. గ్రామంలో దేవాలయ నిర్మాణానికి కూడా పూనుకున్నారు. మేమున్నామంటూ భరోసా.. ఐదేళ్ల కాలంలో ఈ గ్రామానికి చెందిన ఐదుగురు గల్ఫ్‌లో వివిధ కారణాలతో మృతిచెందారు. కట్కం శ్రీకాంత్ అనే యువకుడు సౌదీలో గత ఏడాది అక్టోబర్‌లో గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో సౌదీలో ఉన్న శ్రీకాంత్ మిత్రులతో పాటు వివిధ గ్రామాలకు చెందిన తోటి కార్మికులు ఆ కుటుంబానికి రూ.15,59,236 (సౌదీ రియళ్ళు 81,500) అందజేశారు. మరికొందరి కార్మికుల కుటుంబాలకు కూడా చేయూత ఇచ్చారు. ప్రజాప్రతినిధులుగానూ.. ఇక్కడ ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన వారిలో గల్ఫ్‌కు వెళ్లి వచ్చిన వారే ఎక్కువ ఉన్నారు. 2013లో గౌరి భూమయ్య సౌదీ నుంచి ఇచ్చి ప్రజల సహకారంతో సర్పంచ్‌గా గెలుపొందారు. అలాగే ఎంపీటీసీగా గెలుపొందిన చెన్నమనేని రవీందర్రావు కూడా దుబాయి వెళ్లి వచ్చాడు. ప్రస్తుత సర్పంచ్ సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి సౌదీ నుంచి వచ్చి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సౌదీ నుంచి వచ్చి..సర్పంచ్గాఎన్నిక.. సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. ఇక్కడ తీవ్ర కరువు కారణంగా గల్ఫ్‌కు వెళ్లడమే ఉత్తమమని నిర్ణయించుకొన్నాడు. 2007లో సౌదీకి వెళ్లాడు. అక్కడ ఉపాధి పొంది ఆర్థికంగా నిలదొక్కుకోవడం కాకుండా పది మందికి ఉపాధి చూపించారు. దీంతో పాటు సామాజిక సేవ కూడా అలవర్చుకొని పేదవారికి తనవంతుగా సహాయం చేశారు. 2018లో ఇండియాకు తిరిగి వచ్చారు. ఈ సంవత్సరం పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడతా.. నేను సౌదీకి మొదట కార్మికుడిగానే వెళ్లాను. 3500 నుంచి 4000 రియాళ్లు వచ్చేవి. ఆ తర్వాత ఏఆర్ఏఎంసీవో(అరేబియన్ అమెరికన్ కోఆప్షన్ కంపెనీ)లో ఉద్యోగంలో చేరా. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. నెలకు ఇండియా కరెన్సీలో రూ.ఐదారు లక్షలకు పైనే సంపాదన ఉండేది. నాతో పాటు నా తమ్ముడిని కూడా సౌదీకి తీసుకువచ్చా. కొందరు మిత్రులము కలిసి సౌదీలో మ్యాన్ పవర్ సప్లై కంపెనీని ఏర్పాటు చేశాం. మా ఊరి వాళ్ళను, చుట్టు పక్కల గ్రామాల వాళ్లను సౌదీకి తీసుకువచ్చి పనులు కల్పించాం. దాదాపు 11 సంవత్సరాల పాటు సౌదీలోనే పనిచేశా. సామాజిక సేవ చేయాలన్నదే నా లక్ష్యం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాయం చేశా. మన్నెగూడెం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు మినరల్ వాటర్ ప్లాంటు, మధ్యాహ్న భోజనానికి వంటపాత్రలు, సిలిండర్‌తో పాటు విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించా. ప్రాథమిక పాఠశాలలకు ఎల్ఈడీ టీవీలతో పాటు కంప్యూటర్లు కొనిచ్చాను. నేను ఇండియాకు వచ్చేటప్పటికి నా జీతం రూ.15లక్షల పైనే ఉంది. గ్రామస్తులు, మిత్రులంతా నన్ను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఇది గ్రామస్తులు నాకు ఇచ్చిన బహుమతి అనుకుంటున్నా. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజాసేవ చేస్తా. మన్నెగూడెం జనాభా: 3,913 ఓటర్లు: 2827 మొత్తం కుటుంబాలు: 1200 గల్ఫ్‌లో ఉన్న వారు : 500 మంది -
తలసరి ఆదాయంలో అట్టడుగున జగిత్యాల జిల్లా
సాక్షి, జగిత్యాల: జిల్లావాసుల వ్యక్తిగత ఆదాయం రాష్ట్రంలోనే అత్యల్పంగా ఉంది. రాష్ట్రంలో ఏడాదికి ఒక వ్యక్తి పొందే ఆదాయం సగటున రూ.1,80,697 ఉండగా జిల్లా సగటు మాత్రం రూ.92,751గా ఉంది. తలసరి ఆదాయంలో జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగున ఉంది. జిల్లా భూ విస్తీర్ణం, సాగు విషయంలో రాష్ట్రంలో 12వ స్థానంలో ఉంది. వ్యవసాయాధారిత జిల్లాలో వ్యక్తిగత ఆదాయం రూ.93వేల లోపే ఉన్నట్లు సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడైంది. 2015–16తో పోలిస్తే మాత్రం వ్యక్తిగత ఆదాయంలో రూ.15వేలు వృద్ధి చెందినట్లు తెలుస్తుంది. రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించిన సందర్భంగా ప్రభు త్వం 2017–18 కాలానికి సంబంధించిన సోషల్, ఎకనామిక్ అవుట్‌లుక్‌ను విడుదల చేసింది. పక్క జిల్లాలు నయం తలసరి ఆదాయం విషయంలో జగిత్యాల జిల్లా కంటే పక్క జిల్లాలు మెరుగ్గా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా తలసరి ఆదాయం రూ.1,46,634 ఉండగా, కరీంనగర్ రూ.1,28,221, రాజన్న సిరిసిల్ల జిల్లా తలసరి ఆదాయం రూ.99,296గా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ.4,57,034గా ఉంది. 2015–16లో రూ.77,070గా ఉన్న జిల్లా తలసరి ఆదాయం 2017–18 నాటికి రూ.92,751కి చే రింది. అయినా తలసరి ఆదాయంలో రాష్ట్రంలో జగిత్యాల జిల్లా వెనుకంజలో ఉండటం గమనించాల్సిన విషయం. గ్రామీణ జనాభా ఎక్కువగా, పట్టణ జనాభా తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం. పట్టణీకరణ పెరుగుతున్నప్పటికీ పారిశ్రామికీకరణ చెందకపోవడం కూడా వ్యక్తిగత ఆదాయంపై ప్రభావం చూపుతుంది. జీడీడీపీలో 12వ స్థానం స్థూల దేశీయోత్పత్తిలో జగిత్యాల రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. సంవత్సర కాలంలో జిల్లా భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల లెక్కింపు విలువే జీడీడీపీ(డిస్ట్రిక్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్). జగిత్యాల జిల్లా జీడీడీపీ రూ.10,82,725 లక్షలుగా నమోదైంది. సాగు విస్తీర్ణం 1.60 లక్షల హెక్టార్లు జిల్లా భూవిస్తీర్ణం, సాగు విషయంలో రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 1.85 లక్షల హెక్టార్ల భూవిస్తీర్ణం ఉండగా ఇందులో 1.60 లక్షల హెక్టార్లు సాగవుతున్నాయి. రాష్ట్రంలో 1.5 నుంచి 2 లక్షల హెక్టార్ల భూమి ఉన్న పది జిల్లాల సరసన జగిత్యాల జిల్లా నిలిచింది. గతంతో పోలిస్తే ఆహార పంటల సాగు కంటే వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. 2001–02లో 70.8 శాతం ఆహారపంటలు, 29.2 శాతం వాణిజ్యపంటల సాగుకాగా.. 2017–18లో ఆహారపంటల విస్తీర్ణం 61.3 శాతానికి తగ్గగా, వాణిజ్యపంటల సాగు 38.7 శాతానికి పెరిగింది. ఆహారధాన్యాలు, తృణధాన్యాలు, పప్పులు వంటి ఆహార పంటలు సాగు తగ్గిపోగా, పత్తి, నూనెగింజలు, పూలు, పసుపు వంటి వాణిజ్యపంటల సాగు పెరిగింది. రాష్ట్ర అక్షరాస్యత రేటు 66.54 శాతంగా ఉండగా మహిళల కంటే పురుషుల అక్షరాస్యత శాతం మెరుగ్గా ఉన్నట్లు సర్వే తెలిపింది. ఈ ఏడాది రాష్ట్ర వృద్ధి రేటు 11.2 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. వ్యవసాయ పంటల సాంధ్రత విషయంలో కరీంనగర్ జిల్లా 1.58 లక్షల హెక్టార్ల విస్తీర్ణంతో ప్రథమస్థానంలో నిలవగా, రాష్ట్ర సాంధ్రత సగటు మాత్రం 1.24 లక్షల హెక్టార్లుగా ఉంది. జిల్లా జనాభా 9,85,417కు చేరుకుందని ప్రభుత్వ సర్వే వెల్లడించింది. ఇందులో పురుషులు 4,84,079 మంది ఉండగా స్త్రీలు 5,01,338 మంది ఉన్నట్లు తెలిపింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు 7,64,081 మంది కాగా 2,21,336 మంది జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారు. -
కొండగట్టు బస్సు ప్రమాదానికి ఏడాది
సాక్షి, చొప్పదండి: ఆ భయానక క్షణం ఇంకా వారిమదిలో మెదులుతోంది. ఆ బస్సు ప్రమాద గాయాలు నిత్యం సలుపుతున్నాయి. కన్నవారిని.. ఉన్నవారిని.. కట్టుకున్నవారిని.. ఆత్మీయులను.. అయినవారిని దూరం చేసుకుని ఏడాది అవుతున్నా.. ఆ కన్నీళ్లు నేటికీ ఆరడం లేదు. వారి కష్టాలు తీరడం లేదు. గుర్తుకొచ్చినప్పుడల్లా.. గుండెలవిసేలా రోదిస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం.. అదో ఘోర కలి. దేశంలోనే అతిపెద్ద ప్రమాదం.. జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డుపై బస్సు ప్రమాదం జరిగి నేటికి ఏడాది.. 65మందిని పొట్టన పెట్టుకున్న ఆ ‘మృత్యుఘాట్’ సంఘటన దృశ్యాలు పలువురి మదిలో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి. వందమందికి పైగా ప్రయాణించిన బస్సులో 24మంది ఘటనాస్థలంలో.. 41మంది చికిత్స పొందుతూ ప్రాణాలు విడవగా.. మరెందరో మంచానికే పరిమితమయ్యారు. బస్సు ప్రమాద బాధితుల్లో ఏడుగురికి పరిహారమే అందలేదు. దీంతో కొడిమ్యాల మండలంలోని నాలుగు గ్రామాల వారిని పలుకరిస్తే.. కన్నీళ్లే మాటలుగా వస్తున్నాయి. కొండగట్టు బస్సుప్రమాదం జరిగి నేటికి ఏడాదవుతున్నప్పటికీ.. నాటి పెనువిషాదం నుంచి కొడిమ్యాల మండలంలోని నాలుగు గ్రామాలు ఇంకా తేరుకోలేదు. చనిపోయినవారి జ్ఞాపకాలతో కుటుంబ సభ్యులు దుఃఖిస్తుండగా, మానని గాయాలతో, చికిత్సకోసం అయ్యే ఆర్థికఇబ్బందులతో క్షతగాత్రులు నరకయాతనను అనుభవిస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలు, గాయపడ్డ బాధితుల ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ. నాటి సంఘటనపై ఎవరిని కదిలించినా కన్నీళ్లు వెల్లువెత్తుతున్నాయి. జీవితకాలపు విషాదాన్ని మిగిల్చిన బస్సుప్రమాదం నుంచి బాధిత కుటుంబాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపించడంలేదు. ఆ ప్రమాదంలో 65 మంది మృతిచెందగా, 50 మంది గాయపడ్డారు. ప్రభుత్వం అందించిన పరిహారం బాధితకుటుంబాల వేదనను తీర్చలేదు. నాయకుల పరామర్శలు వారిలో ఆత్మస్థైర్యం నింపలేదు. విధివంచితులు తమ తలరాతలను తల్చుకుని తల్లడిల్లిపోతున్నారు. చీకటి రోజుకు ఏడాది.. కొండగట్టు: చీకటి రోజుకు నేటితో ఏడాది. దేశంలోనే అదో పెద్ద ప్రమాదం. ఆ ఘ టనలో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైనాయి. గతేడాది సెప్టెంబర్ 11న ఆర్టీసీ బస్సు లోయలో పడి 65మంది చనిపోయారు. క్షతగాత్రులు ఇప్పటికీ మంచాల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఘాట్‌రోడ్డు మూసివేత.. ఘటన జరిగిన వెంటనే అధికారులు ఘాట్‌రోడ్‌ను పూర్తిగా మూసివేశారు. ఎలాంటి వాహనాలకు అనుమతులు ఇవ్వలేదు. అనంతరం రోడ్డు సెఫ్టీ అథారిటీ ఐపీఎస్ డీజీపీ కష్ణప్రసాద్, ఢీల్లీకి చెందిన పలు రోడ్డు సెఫ్టీ సంస్థలు, ఇతర అధికారులు ఘటనా స్థలారనికి చేరుకుని ప్రమాదతీరును పరిశీలించారు. నూతన ఘాట్ ఇలా.. ఘటన తర్వాత అధికారులు దాదాపు కోటి రూపాయలతో ప్రమాద స్థలంతో పాటు మరికొన్ని చోట్ల రెయిలింగ్, క్రాష్ బేరియర్స్, బూమ్ బేరియర్స్, కల్వర్ట్స్, రక్షణ గోడలు, దొంగలమర్రి నుంచి నాచుపెల్లి జేఎన్టీయూ మీదుగా సూచికబోర్డులు ఏర్పాటు చేశారు. పాత ఘాట్ రోడ్డు 1.5కి.మీ ఉండగా రోడ్డు సెఫ్టీ, ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షించిన మార్పు చేసి 300మీటర్లు అదనంగా పెంచారు. దొంగలమర్రి నుంచి నాచుపెల్లి, జేఎన్టీయూ, అక్కడనుంచి కొండమీద ఉన్న వై జంక్షన్ సమీపంలోని హరిత హోటల్, ఆలయం ఎదురుగా బీఎస్ఎన్ఎల్ టవర్ దిగువ వరకు, అక్కడి నుంచి ప్రమాదం జరిగిన స్థలం వరకు కొత్త రోడ్డుమ్యాప్ 9.6 కిలో మీటర్లు సిద్ధం చేశారు. రూ.111 కోట్లతో నాలుగు లైన్ల రహదారిని నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. 10కి.మీ. అదనపు రవాణా.. ఘాట్‌రోడ్డు బంద్ కావడంతో దిగువ కొండగట్టు నుంచి దొంగలమర్రి మీదుగా గుట్టమీదకు చేరుకునేందుకు దాదాపు 10కి.మీ. ప్రయాణం పెరిగింది. దీంతో భక్తులకు కావాలసిన వాహనాలు ఆర్టీసీ వారు ఏర్పాటు చేశారు. చిన్నపాటి అవస్థలు పడుకుంటూ భక్తులు కొండకు చేరుకొని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అంతుచిక్కని వైనం.. ఘాట్‌రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికీ అధికారులు అధికారికంగా తెలపడంలేదు. డ్రైవర్ నిర్లక్ష్యమా? బ్రేకులు ఫెయిల్? అధిక లోడ్? బస్సు ఫిట్నెస్ లేకపోవడం?ఇలా అనేక సందేహాలు ఉన్నాయి. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు కొండ మీద నుంచి మరో బస్సును నడిపి పరీశీలించారు. స్థానిక అధికారులు, ఢిల్లీ నిపుణులు కొండకు వచ్చి అనేక విధాలుగా ఆధారాలు సేకరించుకొని వెళ్లారు తప్ప నేటికి ప్రమాదం ఎలా జరిగిందో స్పష్టం చేయలేకపోయారు. బస్సు నేటికి మల్యాల పోలీస్‌స్టేషన్ వద్దే ఉంది. బతికున్నందుకు బాధపడుతున్నా.. శనివారంపేటకు చెందిన గోలి లక్ష్మికి అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రికి వెళ్లేందుకు తోడుకోసం కోనాపూర్‌లో ఉండేకూతురు ఎల్లమ్మను రమ్మంది. బస్సుప్రమాదంలో కూతురు చనిపోయింది. లక్ష్మి రెండుకాల్లు, రెండుచేతులు విరిగాయి. నుజ్జునుజ్జయిన ఎడమకాలును వైద్యులు మోకాలు పైభాగం వరకు తొలగించారు. మిగతా కాలు, రెండు చేతులకు రాడ్లువేశారు. లక్ష్మి తానున్నచోటునుంచి కదలలేదు. కొట్టివేసిన కాలుకు ఇన్ఫెక్షన్ వచ్చి చీముకారుతుంద ని, నొప్పి భరించలేకపోతున్నానని వృద్ధురాలు చేసే రోదనలు చుట్టుపక్కలవారికి కంటనీరు తెప్పిస్తున్నాయి. ప్రతీ పదిహేను రోజులకోసారి జగిత్యాలలోని ఆసుపత్రికి వెళ్లేందుకు అయ్యే ఆర్థికభారాన్ని వారి పేదకుటుంబం భరిం చలేకపోతోంది. లక్ష్మికి కాలు తొలగించినా వికలాంగ పెన్షన్ రావడంలేదు. తనకు జైపూర్కాలును అమర్చాల ని బాధితురాలు కోరుతున్నది. అమ్మమ్మ వెంట తీసుకెళ్లడంతోనే తన తల్లి చనిపోయిందని మనవడు సరిగా మాట్లాడడంలేదు. తానుకూడా అదేరోజు కూతురుతోపాటు చనిపోతే బాగుండేదంటున్న వృద్ధు రాలి వేదన కఠిన హృదయాలను సైతం కరిగించేలా ఉన్నది. నడవలేక నరకయాతన.. హిమ్మత్‌రావుపేటకు చెందిన పెంచాల లక్ష్మి, కూతురు సౌందర్య ప్రమాదంలో గాయపడ్డారు. ఉపాధి కోసం బ్రూనై వెళ్లిన భర్త నర్సయ్య తిరిగివచ్చాడు. లక్ష్మి కాలుచర్మం పూర్తిగా పాడవడంతో శరీరంలోని వేరేప్రదేశంలోని చర్మాన్నితీసి కాలుకువేశారు. కాలుకు, చేయికి రాడ్వేశారు. కొత్తగా వేసిన చర్మానికి ఇన్ఫెక్షన్వచ్చి కాలు వాచింది. మంచం దిగి నడవలేని పరిస్థితిలో వేదనపడుతున్నది. – తల్లితో సౌందర్య -
గల్ఫ్ రిక్రూట్మెంట్ చార్జీలు కంపెనీలు భరించాలి
కోరుట్ల: వలస కార్మికుల రిక్రూట్మెంట్ చార్జీలు గల్ఫ్‌లో ఉండే యాజమాన్యాలే భరించాలని వలస కార్మిక సంఘాల నాయకులు మంద భీంరెడ్డి కోరారు. బుధ, గురువారాల్లో థాయిలాండ్ రాజ«ధాని బ్యాంకాక్‌లో నిర్వహించిన ‘ది గ్లోబల్ ఫోరం ఫర్ రెస్పాన్సిబుల్ రిక్రూట్మెంట్’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. సదస్సులో చర్చించిన అంశాలను ఈ సందర్భంగా వెల్లడించారు. ఆసియా దేశాల నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు అధికంగా ఉన్నాయని, రిక్రూట్మెంట్ చార్జీలను కంపెనీలు భరించాలని సదస్సులో తీర్మానించినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వాలను సమీకరించడం–ఆకాంక్షలు అవకాశాలు అన్న అంశంపై చర్చాగోష్టి జరిగినట్లు వెల్లడించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్‌రైట్స్ అండ్ బిజినెస్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, మైగ్రేషన్ ఫోరం ఇన్ ఆసియా, హ్యుమానిటీ యునైటెడ్ సంస్థలు సంయుక్తంగా బ్యాంకాక్‌లో నిర్వహించిన ఈ సదస్సులో సుమారు 100 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నట్లు చెప్పారు. ప్రఖ్యాత బ్రాండెడ్ కంపెనీల ప్రతినిధులు, కార్మిక సంఘాలు, పౌరసమాజ సంస్థలు, ప్రభుత్వాలు, ఎంబసీలు, అంతర్జాతీయసంస్థల ప్రతినిధులు గల్ఫ్ వలస కార్మికుల చర్చల్లో పాల్గొని తమ అభిప్రాయాలను చెప్పినట్లు వివరిం చారు. విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెడుతున్న వలస కార్మికులకు సంక్షేమ పథకాలు దేశంలో అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. గల్ఫ్ రిక్రూట్మెంట్ వ్యవస్థ, గల్ఫ్ వలసలకు ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి మెడికల్, టికెట్, నైపుణ్య శిక్షణ ఇస్తూ వాటికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. గల్ఫ్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ కోసం ఏజెన్సీలకు ఒక్కొక్కరికి రూ.30–40వేలు ఫీజుగా తీసుకోవాలని భారత ప్రభుత్వం అనుమతిచ్చిందని దీనికి బదులుగా ఫీజులేని విధానం అవసరమన్నారు. వలస కార్మికులకు అవగాహన కల్పించి సమగ్ర సంక్షేమానికి పథకాలు రూపొందించాలని కోరామన్నారు. -
అమ్మానాన్న.. నేను బతుకలేకపోతున్నా..
ధర్మపురి: అభం శుభం తెలియని ఆ బాలుడికి అమ్మానాన్నల గొడవలు మనస్తాపానికి గురిచేశాయి. బడికెల్లి చదువుపై శ్రద్ధ చూపాల్సిన బాలుడిని తల్లిదండ్రుల గొడవలు కలత చెందేలా చేశాయి. నిత్యం తల్లిదండ్రుల గొడవలు మనస్సును బాధపెట్టాయి. అమ్మానాన్నల గొడవలతో మనస్తాపానికి గురై ఇంట్లో క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం గ్రామానికి చెందిన పాయల్ శ్రీనివాస్–మమతలకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాస్ భార్యతో కలిసి మంచిర్యాల జిల్లాకేంద్రలో ఫైనాన్స్ నడిపిస్తుంటాడు. వీరికి కుమారుడు శ్రావణ్(12), కూతురు(5) సంతానం. కుమారుడు పుట్టిన తర్వాత దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. గొడవలు ఏగలేక భార్య మమత నాలుగేళ్ల క్రితం పుట్టింటికొచ్చింది. ఐదేళ్ల క్రితం దంపతులకు మరోపాప(5) జన్మించింది. పాప పుట్టినప్పటి నుంచి గొడవలు తీవ్రస్థాయికి చేరాయి. భార్యాభర్తల గొడవలపై పలుమార్లు గ్రామంలో పంచాయితీలు నిర్వహించారు. చివరికి పోలీస్స్టేషన్లోనూ పలుమార్లు పంచాయితీలు జరిగాయి. రెండో పెళ్లే కారణమా? భార్యాభర్తల మధ్య గొడవలకు రెండో పెళ్లే కారణం కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి భార్య మమతకు విడాకులివ్వాలని భర్త శ్రీనివాస్ గొడవలు పడుతుండేవాడని తెలిసింది. నాలుగేళ్లుగా భార్యాభర్తలు విడిగా ఉండేవారని విడాకుల విషయంలో మమత నిరాకరించడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు. 25 రోజుల క్రితం భూపాలపల్లె జిల్లా ములుగు మండలానికి చెందిన ఓ అమ్మాయితో శ్రీనివాస్‌కు రెండో వివాహమైనట్లు తెలిసింది. విషయం పంచాయితీ పెద్దల వరకు చేరింది. శ్రీనివాస్, వారి పాలివాళ్లకు చెందిన పొత్తుల భూమి సుమారు 20 ఎకరాల వరకు ఉన్నట్లు.. పంచాయితీలో మొదటి భార్య మమతకు రెండెకరాలు ఇవ్వాలని పెద్దలు చెప్పిన తీర్పును శ్రీనివాస్ నిరాకరించినట్లు తెలిపారు. శ్రీనివాస్ రెండో పెళ్లితో మొదటి భార్య విడాకుల వరకు చేరింది. తల్లిదండ్రుల గొడవలు, తండ్రి రెండో పెళ్లి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపాయి. తల్లిదండ్రుల గొడవలకు ఏగలేక కుమారుడు శ్రావణ్ బుధవారం ఇంట్లో క్రిమిసంహారక మందుతాగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా, కుటుంబ సభ్యులు గమనించి జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడు ధర్మారం మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. -
స్కూటీతో సేద్యానికి...
‘నాకు రాదు’అంటే ఏదీ రాదు!లక్ష్మీపూర్ అయితే అసలే ఊరుకోదు.‘బండి నేర్చుకో’ అంటుంది.ఆ ఊళ్లో ఏడాదంతా పంటకాలమే.మహిళలు బండి వెనుక కూర్చున్నంతకాలంకాలంతో పోటీపడలేకపోయారు.బండి ముందు కూర్చున్నాకకాలమే వారితో పోటీ పడలేకపోతోంది!ఇప్పుడు వాళ్లు.. బండెనక బండి కడుతున్నారు.ఊరికి ధాన్య‘లక్ష్మీకళ’ను తెస్తున్నారు. ఆ గ్రామంలో యువ మహిళా రైతులు చదివింది పదోతరగతి లేదంటే ఇంటర్మీడియట్. అయినప్పటికీ.. ఓ వైపు సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూనే, మరోవైపు దానికి ఆధునికతను జోడిస్తూ పంటల సాగులో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. అంతేకాదు, ఎప్పుడూ భర్త చాటు భార్యగా మోటర్ సైకిల్‌పై వెనుక సీట్లోనే కూర్చుని వెళ్లేవారు ఇప్పుడు అదే మోటర్ సైకిల్‌పై డ్రైవింగ్ సీట్లో కూర్చుని తాము ముందుకు వెళ్లడమే కాదు, కుటుంబాన్ని సైతం ముందుకు తీసుకెళ్లుతున్నారు! ఈ దృశ్యం మీకు.. ఇప్పటికే రైతుల ఐకమత్యంతో లక్ష్మీపూర్ రైస్, లక్ష్మీపూర్ సీడ్‌తో రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా వెలుగొందిన లక్ష్మీపూర్‌లోనే కనిపిస్తుంది. ఇప్పుడా ఆ గ్రామంలో ప్రతి ఇంటికీ ఓ స్కూటీ ఉందంటే అశ్చర్యం కలుగక మానదు. ఆ గ్రామ మహిళా యువ రైతులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఏడాదంతా వ్యవసాయం! జగిత్యాల జిల్లా కేంద్రానికి 7 కి.మీ దూరంలో ఉండే లక్ష్మీపూర్ గ్రామం వ్యవసాయానికి ప్రసిద్ధి. ఇక్కడి రైతులు ఎంత చదువుకున్నా వ్యవసాయాన్ని వదిలిపెట్టరు. అలాగే, వారి భార్యలు సైతం వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాల్సిందే. ఈ గ్రామంలో ఏదో ఒక్క పంటనే పండించకుండా పసుపు, వరి, మొక్కజొన్న, వేరుశెనగ.. ఇలా అన్నిరకాల పంటలు పండిస్తూ మిశ్రమ వ్యవసాయ సాగు చేస్తూ, ఆదాయాన్ని ఆర్జిస్తుంటారు. ఎండకాలంలో 10–20 రోజులు మినహాయిస్తే, ఏడాది మొత్తం వ్యవసాయ పనులు చేస్తూనే ఉంటారు. గ్రామం ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో, వారి కుటుంబ నిర్వహణలో కూడా అధునికత సంతరించుకుంటుంది. దీంతో ఈ గ్రామానికి ఆడపిల్లను ఇచ్చేందుకు తల్లితండ్రులు పోటీ పడుతుంటే, మరికొందరు ఆడపిల్లలు మాత్రం వ్యవసాయంపై ఉన్న అభిమానంతోనే ఇక్కడి వారిని పెళ్లి చేసుకుంటున్నారు. అప్పటి వరకు కాలే జీలకు వెళ్లిన ఆడపిల్లలు సైతం ఒకరిని చూసి ఒకరు వ్యవసాయం చేసేందుకే ఉత్సాహం చూపించడమే కాకుండా.. పాత వ్యవసాయ పనులకు భిన్నంగా నూతన ఒరవడితో సాగును ముందుకు తీసుకెళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో, ఏడాది పొడవునా పురుష రైతులతో సమానంగా మహిళా రైతులు తోటలకు వెళ్లి వ్యవసాయ పనులు చేయాల్సి ఉంటుంది. రైతులు ఉదయాన్నే పనులకు వెళ్లుతుంటే, వారి భార్యలు, పిల్లలను స్కూళ్లకు పంపించి, అన్నం వండుకుని, నడుచుకుంటూ 2–3 కి.మీ దూరంలో ఉన్న పంట పొలాలకు వెళ్లాల్సి ఉంటుంది. భార్యాభర్తలకు తోడు మరో ఇద్దరు కూలీలు అవసరమైనప్పుడు, వారిని తోటల వద్దకు తీసుకెళ్లడం కష్టంగా మారడంతో.. స్కూటీలు వారి పనిని సుళువు చేశాయి. ధైర్యం చేసి నేర్చుకున్నారు వివిధ పనుల్లో నిమగ్నమయ్యే రైతులకు, ప్రతిరోజూ మహిళా రైతులను తమ మోటర్ సైకిల్‌పై తోట వద్ద విడిచిపెట్టడం కుదరడం లేదు. దీంతో, మూడేళ్ల క్రితం కొంతమేర చదువుకుని, ధైర్యంగా ఉండే యువ మహిళా రైతుల్లో ఒకరిద్దరు నూతన మోడళ్లలో వచ్చిన స్కూటీలను కొనుగోలు చేసి నడపడం మొదలుపెట్టారు. ఆ స్ఫూర్తితో దాదాపు 50 నుండి 60 మంది మహిళా రైతులు స్కూటీలు కొనుగోలు చేసి, వాటిపై కూలీలను, తోటి మహిళా రైతులను ఎక్కించుకుని రయ్..రయ్ మంటూ పంటపొలాలకు వెళ్లుతున్నారు. అంతేకాదు, దగ్గర్లోని బంధువు ఇళ్లకు, జగిత్యాల లాంటి పట్టణాలకు వచ్చినప్పుడల్లా తమ స్కూటీపైనే వస్తుంటారు. రైతులు జగిత్యాలకు వచ్చినప్పుడు పెట్రోల్ కొని తీసుకెళ్లి, స్కూటీల్లో పోస్తుంటారు. దీంతో, తోటలో వ్యవసాయ పని ఉన్నప్పుడల్లా భర్త కోసం ఎదురు చూడకుండా, తోటలో అవసరమయ్యే ఒకరిద్దరు కూలీలను ఎక్కించుకుని పనికి వెళ్లుతున్నారు. ఇప్పుడు ఆ గ్రామంలో భర్తకోసం భార్య, భార్య కోసం భర్త ఇలా.. ఒక్కరి కోసం ఒకరి సాయం కోసం ఒకరు చూసే అవసరం లేకుండా పోయింది. ఎవరి మోటర్ సైకిళ్లపై వారు వెళ్తున్నారు. స్కూటీ కంపెనీల ఆశ్చర్యం గ్రామానికి చెందిన మహిళా యువ రైతులు పోటీ పడి స్కూటీలు కొనుగోలు చేస్తుండటంతో, చాల కంపెనీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, చివరకు ఈ గ్రామంలో స్కూటీ మోటర్ సైకిల్ మేళాలు కూడా ఏర్పాటు చేసాయి. మహిళా యువ రైతులను ఆకర్షించేందుకు కంపెనీలు పలు ఆఫర్లు కూడా ప్రకటించాయి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకుని, వ్యవసాయ పనులతో పాటు మహిళలు పలు శుభకార్యాలకు తమ బంధువులను ఎక్కించుకుని వెళ్లడానికి కుదురుతోంది. ఇదిలా ఉంటే, లక్ష్మీపూర్‌కి ఎవరైనా చుట్టం చూపుగా వచ్చిన వారు ఆ గ్రామ మహిళా యువ రైతులు స్కూటీలపై వెళ్లడం చూసి నోరు వెళ్లడం విశేషం. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల ఫొటోలు : ఏలేటి శైలేందర్ రెడ్డి బర్రెకు గడ్డి సైతం తోటలకు వెళ్లిన తర్వాత, అక్కడ గట్ల వెంబడి ఉండే గడ్డిని స్కూటీపై బర్రెలకు తీసుకు వస్తాను. మొదట స్కూటీ నడపడం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు స్కూటీ నడపడం తేలిక కావడంతో రోజు స్కూటీపైనే వ్యవసాయ పనులకు వెళుతున్నాను. నాతోపాటు కూలీలను సైతం తీసుకెళ్తున్నాను. – మిట్టపల్లి వరలక్ష్మి సామానంతా స్కూటీపైనే వ్యవసాయ పనులకు అవసరమైన పార, గుల్ల, ఇతర సామానంతా స్కూటీపైనే తీసుకుని వెళ్తాను. తోటలు దూరంగా ఉండటంతో స్కూటీ బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు తోట వద్ద దించి రావాలంటే భర్తకు కూడా కష్టమే. అందుకే స్కూటీ నేర్చుకుని నేను నడుపుతున్నా. కూలీలను ఎక్కించుకుని వెళ్తున్నా ప్రతిరోజూ ఇద్దరు కూలీలను ఎక్కించుకుని వ్యవసాయ పనులకు వెళుతుంటాను. మొదట స్కూటీ కొనిచ్చేందుకు నా భర్త భయపడ్డాడు. ఇప్పుడు నేనే స్వయంగా నడుపుకుంటూ వ్యవసాయ పనులకు వెళుతుండటంతో, నా భర్త ఇతర వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. -
పోలింగ్ తగ్గెన్.. ఓటింగ్ ముగిసెన్
సాక్షి, జగిత్యాల: లోక్‌సభ సమరం ముగిసింది. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో 70.04 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం భారీగా తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో 77.61 శాతం నమోదైంది. జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 62.53శాతం నమోదైంది. జగిత్యాల నియోజకవర్గంలో 69.20 శాతం, కోరుట్ల నియోజకవర్గంలో 68.85శాతం ఓటింగ్ నమోదైంది. ఎండ తీవ్రంగా ఉండడంతో మధ్యాహ్నం వరకే చాలా కేంద్రాలు బోసిపోయి కనిపించాయి. కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. తగ్గిన ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 77.61 శాతం పోలింగ్ నమోదుకాగా ప్రస్తుతం 70.04 శాతానికి పరిమితమైంది. ధర్మపురి నియోజకవర్గంలో అసెంబ్లీలో 78.02శాతం ఓటింగ్ జరిగితే ఈసారి 62.53, కోరుట్లలో అసెంబ్లీ ఎన్నికల్లో 75.45 శాతం, లోక్‌సభ ఎన్నికల్లో 68.85, జగిత్యాలలో 79.35 శాతం నుంచి 69.20 శాతానికి పడిపోయింది. తగ్గిన ఓటింగ్ శాతం ఎవరికి మేలు చేస్తుందనే చర్చ ఆసక్తిగా మారింది. మొరాయించిన ఈవీఎంలు జిల్లాలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మాక్‌పోలింగ్ నిర్వహణ జాప్యం కావడంతో పోలింగ్ సైతం ఆలస్యంగా ప్రారంభమైంది. రాయికల్ మండలం మూటపల్లి, మైతాపూర్ బూత్ నంబరు 46, పెగడపల్లిలోని 262 పోలింగ్‌కేంద్రంలో, సారంగాపూర్తోపాటు కోనాపూర్ గ్రామాల్లో 9 గంటలకు పోలింగ్ మొదలైంది. కోరుట్ల మండలం పైడిమడుగులో 114 పోలింగ్‌కేంద్రం, కోరుట్లలోని 181 ఈవీఎంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. మల్లాపూర్తోపాటు రాఘవపేటలోని 84 పోలింగ్‌కేంద్రంలో, మల్లాపూర్ మండలం వెంకట్రావ్‌పేటలోని 59 పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు సీజ్ చేశారు. జగిత్యాల మండలం ధరూర్‌లో గంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. జిల్లా కేంద్రంలోని 164 పోలింగ్‌కేంద్రంలో ఈవీఎంలు పనిచేయక 9 గంటల తర్వాత పోలింగ్ ప్రారంభమైంది. లింగంపేటలో, మెట్‌పల్లిలోని 196 కేంద్రంతోపాటు కోరుట్లలోని కల్లూరు 141 కేంద్రాల్లో ఉదయం 9 గంటల తర్వాత పోలింగ్ మొదలైంది. జగిత్యాలలోని కొత్తవాడలో ప్రభుత్వ బాలికల పాఠశాల, జగిత్యాల మండలం కల్లెడ, పొరండ్ల గ్రామాల్లో పోలింగ్ ముగింపు సమయంలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ జాప్యమైంది. కేంద్రాలు సందర్శించిన అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని బీట్‌బజార్ 192 పోలింగ్ కేంద్రాన్ని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత సందర్శించారు. గొల్లపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ సందర్శించారు. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలు స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరాయి. పటిష్ట బందోబస్తు మధ్య ఈవీఎంలను ఎన్నికల అధికారులు జిల్లా కేంద్రంలోని వీఆర్కే కళాశాలకు తరలించారు. ఓటింగ్ ముగియడంతో నిజామాబాద్ స్థానం నుంచి బరిలో ఉన్న 185 మంది అభ్యర్థుల భవితవ్యం ఇప్పు డు ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ఈ ఎన్నికపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రజా తీర్పు మే 23న వెలువడనుంది. -
కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ
సాక్షి, కొడిమ్యాల(చొప్పదండి): లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ది ఎక్స్ట్రా ప్లేయర్ పాత్రేనని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం అన్నారు. కొడిమ్యాలలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని పదవి కోసం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉందన్నారు. టీఆర్ఎస్కు ఎదురుగాలి తప్పదన్నారు. కేసీఆర్ అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. బోయినపల్లి వినోద్‌కుమార్ తన పదవీకాలంలో ఢిల్లీకే పరిమితమయ్యారని, ప్రజాసమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. తన సొంత మెడికల్ కాలేజీ కోసం జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్‌ను ఎంతో అభివృద్ధి చేశారని, ఈసారి ఎంపీగా గెలిపించుకోవాలని కోరారు. మాజీ జెడ్పీటీసీ చిలివేరి నారాయణగౌడ్, మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్ గడ్డం జీవన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, సాయి, వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
పైకి ధీమా.. లోలోన భయం!
సాక్షి, జగిత్యాల: నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలలో గెలుపుపై అభ్యర్థులు లోలోన భయపడుతున్నా.. పైకి మాత్రం ధీమాగా కనిపిస్తున్నారు. దేశంలో ఎప్పుడూ.. ఎన్నడూ లేని విధంగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉండడం.. అందులో అత్యధికం 178 మంది రైతులే ఉండడంతో ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో భయం మొదలైంది. వీరి పోటీ ఎవరి ఓట్లకు ఎసరు పెడుతుందనే ఆందోళన మొదలైంది. పదిహేను రోజులపాటు ప్రచారాలతో హోరెత్తించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్నారు. స్థానిక సమస్యలైన పసుపుబోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నలకు మద్దతు ధరపై చర్చ జరగాలనే ఉద్దేశంతో అత్యధిక సంఖ్యలో రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. ఏదైతే లక్ష్యంతో వారు నామినేషన్లు వేశారో.. అది దాదాపు విజయవంతంగా చేరుకున్నారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం రైతుల ప్రధాన డిమాండ్లు అయిన పసుపుబోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నలకు మద్దతు ధరలపై హామీలు ఇచ్చారు. అయితే నిజామాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న రైతుల ఓట్లు ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తాయనే ఆందోళనలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో ఓట్ల చీలికపై కూడా భయం పట్టుకుంది. అందరి దృష్టి వారిపైనే.. తమ సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ బరిలో నిలవాలని పసుపు, ఎర్రజొన్న రైతులు సంకల్పించుకున్నారు. అనుకున్నట్లుగానే పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి దేశం దృష్టిని ఆకర్షించారు. రైతుల నుంచి భారీ సంఖ్యలో నామినేషన్లు రావడం, ఉపసంహరించుకోకపోవడంతో ఒకదశలో ఎన్నిక వాయిదా పడుతుందని.. పేపరు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించ వచ్చనే చర్చ జరిగింది. అయితే ఎన్నికల సంఘం ఎం3 తరహా ఈవీఎంలతో ఎన్నికలను నిర్వహిస్తామని చాలెంజ్‌గా తీసుకుంది. దీంతో ఒకటికి బదులుగా 12 ఈవీఎంల బ్యాలెట్ యూనిట్ ద్వారా ప్రత్యేకమైన ఎన్నికలు ఇక్కడ జరుగబోతున్నాయి. ఎన్నికలకు ముందు రైతులంతా తమ ఓట్లు తమకే వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు మంగళవారం ఆర్మూర్‌లో రైతు ఐక్యత వేదిక ద్వారా తీర్మానించుకున్నారు. రాజకీయపార్టీల అభ్యర్థులకు కాకుండా అభ్యర్థులుగా ఉన్న రైతులకే తమ ఓట్లు వేయాలని ప్రకటించారు. వీరి నిర్ణయంతో ఎవరి ఓట్లకు గండి పడనుందోనని టెన్షన్ మొదలైంది. -
అందరి నోట రైతుల మాట
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు రైతుల సమస్యలే ఎజెండాగా ముందుకెళ్తున్నాయి. ఎన్నడూ లేనంతగా అత్యధిక సంఖ్యలో రైతులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వే యడంతో ఇక్కడి ఎన్నిక దేశం దృష్టిని ఆ కర్షించింది. తమ సమస్యలపై చర్చ జర గాలనే ఉద్దేశంతో పోటీలో నిలిచినట్లు రైతులు చెబుతుండగా.. ప్రధాన పార్టీలు సైతం రైతుల సమస్యలపైనే ప్రచారం చేస్తున్నాయి. పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్, బీజేపీలు ప్రచారం చేస్తుండగా.. రైతుల సమస్యలతోపాటు పేదరికాన్ని తరిమికొడతామంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. సాక్షి, జగిత్యాల: పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈనెల 11న లోక్‌సభకు ఎన్నికలు జరుగనుండగా.. 9వ తేదీతో ప్రచార గడువు ముగియనుంది. దీంతో పార్టీలన్నీ ప్రచారంలో దూకుడు పెంచాయి. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఈసారి రైతులు, రైతుసంఘాలు సంఘటితమై పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడంతో పార్టీలన్నీ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు పసుపురైతులు తమ సమస్యలపై గళమెత్తారు. నామినేషన్లతో ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా తమ ఎన్నికల ప్రచారంలో పసుపు రైతుల సమస్యలే ప్రధానాస్త్రంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. తమను ఎన్నుకుంటే ముందుగా మీ సమస్యలనే పరిష్కరిస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం పసుపు, ఎర్రజొన్న రైతుల చుట్టే తిరుగుతోంది. రైతుల పక్షపాతిగా టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ, అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఎక్కడికెళ్లినా ప్రచారంలో పసుపు రైతులను ప్రస్తావిస్తున్నారు. పసుపుబోర్డు కోసం, పంట మద్దతు ధర, రైతుల సమస్యల కోసం ఇప్పటి వరకు అందరి కంటే ఎక్కువగా పోరాడింది తానేనని చెబుతున్నారు. పసుపు రైతుల సమస్యలపై గతంలో పార్లమెంట్లో గళం వినిపించానని, ఈసారి అవకాశం ఇస్తే పసుపుబోర్డును సాధించి తీరుతామని హామీ ఇస్తున్నారు. తమ పార్టీకి 16 సీట్లు అప్పగిస్తే కేంద్ర ప్రభుత్వ మెడలు వంచైనా పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని పేర్కొంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా సాధిస్తామని ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, సాగునీటి పథకాలు, రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతుల పక్షపాతిగా నిలిచామని పేర్కొంటున్నారు. బీజేపీ నోట పసుపుబోర్డు బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ సైతం తమ ఎన్నికల ప్రచారంలో పసుపు రైతులనే ప్రధానాస్త్రంగా చేసుకున్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే మళ్లీ తమ పార్టీ అధికారం చేపట్టిన వారంలోగా పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు నామినేషన్లు వేశారని ఆయన ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ సామాన్యుల బాట కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మధుయాష్కిగౌడ్ ప్రచారంలో ప్రధానంగా రైతుల సమస్యలు, పేదలకు నెలకు రూ.6వేలు ఇస్తామని ప్రస్తావిస్తున్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వడంలో ఈ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శిస్తున్నారు. తమ పాలనలో పసుపు పంటకు రూ.10వేలకు పైగా ధర ఉందని, తిరిగి అధికారంలోకి వస్తే పసుపుబోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి చెరకు రైతులకు న్యాయం చేస్తామని, పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధరను కల్పిస్తామంటున్నారు. మహిళల ఓటు నిర్ణయాత్మకం జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో 6,63,231 మంది ఓటర్లు ఉండగా.. మహిళలు 3,41,370 మంది, పురుషులు 3,21,370 మంది ఉన్నారు. బీడీ కార్మికులపై ఆశలు అధికార టీఆర్ఎస్ పార్టీ జిల్లాలో భారీ సంఖ్యలో ఉన్న బీడీ కార్మికులపై అధికంగా ఆశలు పెట్టుకుంది. జిల్లాల్లో ప్రస్తుతం 60 వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్ అందుతుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా లక్ష మందికి పైగా బీడీ కార్మికులు ఉన్నారు. ఇందులో కోరుట్ల నియోజకవర్గంలోనే అత్యధికంగా 40 వేల మంది వరకు ఉన్నారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లతోపాటు పీఎఫ్ ఉన్న ప్రతీ కార్మికురాలికి ఆసరా పెన్షన్ అందజేస్తామని ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. మే నెల నుంచి పెరిగిన మొత్తంతో అందరికీ పెన్షన్ అందజేస్తామని చెబుతున్నారు. ఇలా పోటాపోటీగా ప్రచారం సాగుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో రైతులు, మహిళల సమస్యలే ప్రధానాస్త్రాలుగా సాగుతున్నారు. అయితే ఓటర్లు ఎవరి వైపు ఉంటారో మరికొన్ని రోజుల్లో తేలనుంది. -
ఈవీఎంలు 12.. అభ్యర్థులు 185
సాక్షి, జగిత్యాల: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ ప్రాంతంలోని పసుపు రైతులు లోక్‌సభ బరిలో అత్యధిక సంఖ్యలో నిలబడి వారి సమస్యలపై చర్చ జరిగేలా చేశారు. ప్రధాన పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలతో కలుపుకొని 185 మంది అభ్యర్థులు నిజామాబాద్ బరిలో ఉన్నారు. దీంతో ఎన్నికల సంఘం ఇక్కడి ఎన్నికలను ప్రత్యేకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటుంది. దేశంలోనే తొలిసారిగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు ఎన్నికలకు ఎం–3 తరహా ఈవీఎంలను వినియోగించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేసేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నారు. ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని ఓల్డ్హైస్కూల్ ప్రాంగణంలో మోడల్ పోలింగ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్టర్ నిఖిల్‌కుమార్ బృందం గురువారం సందర్శించింది. దేశంలోనే మొదలు..! తమ సమస్యల పరిష్కారం కోసం పసుపు రైతులు నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ నుంచి ప్రధాన అభ్యర్థులతోపాటు ఏకంగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నికల నిర్వహణ క్లిష్టతరంగా మారింది. మొదట బ్యాలెట్ పేపరుతో ఎన్నికలు నిర్వహిస్తారని.. వాయిదా వేస్తారనే చర్చలు జరిగాయి. ఎన్నికల సంఘం మాత్రం బ్యాలెట్ పేపర్ కాకుండా ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకోసం గతంలో వినియోగించిన ఎం–2 రకం ఈవీఎంలను కాకుండా ఎం–3 తరహా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో ఒక్క ఈవీఎంకు బదులుగా ఒకే పోలింగ్‌కేంద్రంలో 12 ఈవీఎంల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు. 12 ఈవీఎంల్లో 185 అభ్యర్థుల పేర్లు, ఫొటోలు, గుర్తులతోపాటు చివరన నోటాకు స్థానం కల్పించనున్నారు. ‘ఎం–3’ ఈవీఎంల వినియోగం నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎన్నికలకు ఎం–3 రకం ఈవీఎంలను వినియోగించాలని ఈసీ నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 785 పోలింగ్‌కేంద్రాలు ఉండగా.. నిజామాబాద్ పార్లమెంట్లో భాగమైన జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 516 పోలింగ్‌కేంద్రాలు ఉన్నాయి. ఆయా పోలింగ్‌కేంద్రాల్లో ఒక ఈవీఎంకు బదులుగా 12 ఈవీఎంలను వినియోగించనున్నారు. దీంతో మొత్తం 6,192 ఈవీఎంలు అవసరంకానున్నాయి. ఇందుకు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లను ఎన్నికల సంఘం ఇప్పటికే సమకూర్చింది. దేశ చరిత్రలో ఏ ఎన్నికల్లోనూ ఈ తరహా ఈవీఎంలను వినియోగించలేదు. టెక్నికల్ సిబ్బందితో విధులు ప్రత్యేకమైన ఈవీఎంలలో నోటాతో సహా 185 అభ్యర్థుల పేర్లు నిక్షిప్తమై ఉంటాయి. ఓటు వేసిన తర్వాత ఓటరు వేసిన ఓటును చెక్ చేసుకునేందుకు వీలుండే వీవీప్యాట్‌ను 12 ఈవీఎంలకు అనుసంధానం చేయనున్నారు. ఓటరు తాము వేసిన ఓటు ఏ అభ్యర్థికి పడిందన్నది 7 సెకన్లపాటు వీవీప్యాట్ మిషన్‌లో కనిపించనుంది. ఎం – 3 రకం ఈవీఎంల నిర్వహణకు ఈ ఎన్నికల్లో సుశిక్షితులైన టెక్నికల్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. మోడల్ పోలింగ్‌కేంద్రం 12 ఈవీఎంలలో ఎన్నికలు నిర్వహించనుండడంతో ఓటుహక్కు వినియోగించుకోవడంలో ఓటర్ల అవగాహన కోసం ఎన్నికల అధికారులు జిల్లాకేంద్రంలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో ఎం–3 ఈవీఎంలను మూడు టేబుళ్లపై ‘యూ’ ఆకారంలో ఏర్పాటు చేయనున్నారు. 12 ఈవీఎంలతోపాటు వీవీప్యాట్ మిషన్‌ను టేబుల్‌పై ఏర్పాటు చేయనున్నారు. అన్ని ఈవీఎంలకు వీవీప్యాట్ మిషన్‌తో అనుసంధానం ఉంటుంది. పోలింగ్‌రోజు వరకు మోడల్ పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు అవగాహన కల్పించనున్నారు. పోలింగ్ రోజున అన్ని పోలింగ్ కేంద్రాల ముందు ఈవీఎంల నమూనా, అభ్యర్థుల జాబితాతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించనున్నారు. -
‘కారు’ స్పీడ్ ఆగొద్దు..!
సాక్షి, కోరుట్ల: ‘టీఆర్ఎస్ మీ ఇంటి పార్టీ..కోరుట్ల నాకు సెంటిమెంట్ ఊరు..మరోసారి ఆశీర్వదించండి..నిరంతరం అభివృద్ధికి పాటుపడతానని’..నిజామాబాద్ లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట కవిత అన్నారు. బుధవారం కోరుట్లలోని పీబీ గార్డెన్స్‌లో టీఆర్ఎస్లో మున్నురు కాపు సంఘాల చేరిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మున్నురు కాపు సంఘాలతో పాటు బీడీ టేకేదార్లు టీఆర్ఎస్కు మద్దతుగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఎంపీగా మొదటిసారి గెలిచిన తర్వాత మొట్టమొదటగా కోరుట్లలో ప్రజలు నీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించి రూ.36లక్షలు కేటాయించానని, అప్పటి నుంచి నిజామాబాద్ పార్లమెంట్లో అభివృద్ధి పనులు చకచకా సాగాయన్నారు. కోరుట్ల ప్రజల ఆకాంక్షల మేరకు రెవెన్యూ డివిజన్, వంద పడకల ఆసుపత్రి, 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వేలైన్ పూర్తి చేయించి కోరుట్లకు రైలు తెప్పించామన్నారు. తిరుపతి, ముంబాయ్ రైళ్లు ఇక్కడి నుంచి వెళ్తున్నాయన్నారు. కోరుట్లలో ముంబాయ్ రైలు ఆగేలా ఇప్పటికే చర్యలు చేపట్టామని, కోరుట్ల మున్సిపాల్టీలో అభివృద్ధి పనుల కోసం ఎన్నడూ లేని రీతిలో రూ. 50 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేయిస్తున్నామన్నారు. మళ్లీ తనను గెలిపిస్తే..రానున్న కాలంలో కోరుట్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న టీఆర్ఎస్ను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే మనకు ఎక్కువ మొత్తంలో నిధులు వస్తాయన్నారు. సమావేశంలో మున్నూరు కాపు సంఘాలు, జెడ్పీచైర్‌పర్సన్ తుల ఉమ, ఆర్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ చీటి వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ గడ్డమీది పవన్, పట్టణ, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు అన్నం అనిల్, దారిశెట్టి రాజేశ్, నాయకులు యాటం చిట్టి, జక్కుల జగదీశ్వర్, కస్తూరి లక్ష్మీనారాయణ, గుడ్ల మనోహర్, సంగ లింగం, సేనాపతి రాజు, ఆడెపు మధు పాల్గొన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలి కోరుట్లరూరల్: రాష్ట్రంలో పేదప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని ఎంపీ కవిత అన్నారు. మండలంలోని అయిలాపూర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో ప్రతి గ్రామంలోని పేదలకు డబుల్ బెడ్రూం నిర్మిస్తామని, మళ్లీ ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు ఇళ్లు లేవని దరఖాస్తులు ఇచ్చే అవకాశం ఎవరికీ ఉండదన్నారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికీ రూ. 5లక్షలు ఇస్తామన్నారు. మన రాష్ట్రం నుంచి 16 మందిని లోక్‌సభకు పంపిస్తే మనకు రావలసిన నిధులు బాజాప్త తెచ్చుకోవచ్చని, కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేసేదేమీ లేదని, బీజేపీ అంటే భారతీయ జూట్ పార్టీ అని, దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లను నమ్మె పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 24గంటల విద్యుత్ అందిస్తున్నామని, రైతుబంధు, రైతుబీమా పథకాలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పిడుగు రాధ సందయ్య, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎంపీపీ టి.భారతి, మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన పబ్జీ
-
పబ్జీతో జగిత్యాల యువకుడు బలి
సాక్షి, హైదరాబాద్: పబ్జీ గేమ్ పద్మ వ్యూహానికి మరో యువకుడు బలయ్యాడు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజారంపల్లికి చెందిన సాగర్ అనే 20 ఏళ్ల యువకుడు పబ్జీ గేమ్ పిచ్చితో ప్రాణాలు కోల్పోయాడు. టైంపాస్‌గా ఆడటం ప్రారంభించిన సాగర్‌కు ఈ గేమ్ వ్యసనంలా మారింది. గత 45 రోజులుగా పదేపదే ఈ గేమ్ ఆడటంతో అతని మెడనరాలు పట్టేసి ఆరోగ్యం విషమించింది. దీంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు. గత 5 రోజులుగా వైద్యులు సాగర్‌కు చికిత్స అందించగా.. నరాలు పూర్తిగా దెబ్బతినడంతో గురువారం తుదిశ్వాస విడిచాడు. ఇక పబ్జీ గేమ్‌తో ప్రాణాల మీదకు తెచ్చుకున్న సాగర్‌ను చూపిస్తూ.. అతని స్నేహితులు ఓ అవేర్నెస్ వీడియోను కూడా రూపొందించారు. పబ్జీ గేమ్ ఆడటం ఎంత ప్రమాదకరమో సాగర్ పరిస్థితి చూసి తెలుసుకోండని ఆ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పబ్జీ మహమ్మారికి యువత బానిస అవుతోంది. ఈ గేమ్ వల్ల ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. నిద్రహారాలు మాని అనారోగ్యానికి గురవ్వడమే కాకుండా.. చదువు, చేసే పనిపై శ్రద్ద చూపించలేకపోతున్నారు. ఓ స్టూడెంట్ పరీక్షలో ఎకనామిక్స్ సూత్రాలకు బదులు పబ్ జీ వ్యాసం రాసిన విషయం తెలిసిందే. తాను గేమ్ ఆడటం మానేసినా.. దానికి సంబంధించిన చిత్రాలు వదలడం లేదని, పబ్జీ ఎంత ప్రమాదకరమో ఇప్పుడు అర్థమైందని ఆ యువకుడు తెలిపాడు. యువతకు వ్యసనంగా మారిన ఈ గేమ్‌ను నిషేంధించాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. -
ఓటరు జాబితా సిద్ధం చేయాలి
జగిత్యాల: గ్రామపంచాయతీల్లో ఓటరు జాబి తాను తయారు చేయాలని కలెక్టర్ శరత్ ఆదేశించారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు స్థానిక దేవిశ్రీ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను శనివారం పరిశీలించి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోని జాబితాలో లేని వారి పేర్లను సిద్ధం చేసుకొని ఇంటింటికీ వెళ్లి సరిచూసుకోవాలని సూచించారు. నేషనల్ రివ్యూ కమిటీ వస్తుందని.. బీసీ ఓటరు లిస్ట్‌ను తయారుచేయాలని తెలిపారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ని ర్మించుకున్న మరుగుదొడ్ల బిల్లులు చెల్లించాలన్నా రు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయి ంచాలని సూచించారు. గ్రామపంచాయతీ సెక్రటరీ, ఏపీడీ, ఈవోపీఆర్డీ, ఎంపీడీవోలు పరిశీలించి అర్హులకే అందజేయాలన్నారు. గ్రామపంచాయతీలకు ఎల్ఈడీ లైట్లు, తడి, పొడి చెత్త డబ్బాలు వస్తాయని, సరిపోకపోతే మళ్లీ పంపిస్తామన్నారు. జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీనారాయణ, అటవీ అధికారి నర్సింహారావు పాల్గొన్నారు. లక్ష్యాన్ని పూర్తి చేయాలి గొర్రెలు, పాడిపశువుల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. తన కార్యాలయంలో రెండో విడత గొర్రెల పంపిణీపై సమీక్షించారు. పాడి పశువులు 15,412కు ఇప్పటి వరకు 1333 పంపిణీ చేసినట్లు తెలిపారు. కరీంనగర్, విజయ డెయిరీల లబ్ధిదారుల వాటాను డీడీల రూపంలో త్వరగా చెల్లించాలన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ లక్ష్యం 10,510 యూనిట్లు కాగా ఇప్పటి వరకు 4629 యూనిట్లు సరఫరా చేసినట్లు తెలిపారు. చనిపోయిన గొర్రెలకు సంబ ంధించి 3,209 గొర్రెలకు ఇన్సూరెన్స్ మంజూరుకాగా 1,745 గొర్రెల లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. జిల్లా పశువైద్యాధికారి అశోక్‌రాజు, సహాయ సంచాలకులు శ్రీధర్ పాల్గొన్నారు. ‘పది’లో ఉత్తీర్ణతశాతం పెరగాలి జిల్లాలో పదోతరగతిలో ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ శరత్ సూచించారు. విద్యాశాఖ అధికారుల సమీక్షలో భాగంగా మాట్లాడారు. జిల్లాలో ఖాళీగా ఉన్న సబ్జెక్ట్ టీచర్ పోస్టులలో విద్యావలంటీర్లను నియమించినట్లు తెలిపారు. ప్రతీ సబ్జెక్ట్‌లో వందశాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందేలా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక తరగతుల్లో స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేందుకు ప్రతీ విద్యార్థి తల్లిదండ్రుల నుంచి రూ.100 తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులు చదువుకునేందుకు గ్రామస్థాయిలో ఓ గ్రూప్, వాడస్థాయిలో మరో గ్రూప్ పెట్టాలని సూచించారు. సబ్జెక్ట్‌లవారీగా ఉపాధ్యాయులు నోట్స్ తయారుచేసి పిల్లలకు అందివ్వాలన్నారు. డీఈవో వెంకటేశ్వర్లు, ఎంఈవోలు పాల్గొన్నారు. -
రూ. 800.. 60 ప్రాణాలు!
సాక్షి, హైదరాబాద్/జగిత్యాల జోన్: ప్రకృతి ప్రకోపించలేదు.. బాంబులు పేలలేదు.. తూటాలు విరు చుకుపడలేదు.. కేవలం అధికారుల నిర్లక్ష్యమే 60 నిండు ప్రాణాలను బలిగొంది. రూ.800లకు ఆర్టీసీ అధికారులు కక్కుర్తి పడటం వల్లే ఇంతటి ఘోర ప్రమాదం జరిగింది. ఉద్యోగులపై అధికారుల వేధింపులే కొండగట్టు బస్సు ప్రమాదానికి కారణంగా నిలిచాయి. మృతుల సంఖ్య పెరిగేందుకు స్థానిక అధికారుల తీరు కారణమైంది. వారి వేధింపులు, టార్గెట్ల కారణంగా ఎంతో సీనియారిటీ ఉన్న ఉద్యోగులు కూడా రక్షణ చర్యలు పక్కనబెట్టి, ఓవర్‌లోడ్ ఎక్కించుకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వం ఆర్టీసీ డిపో మేనేజర్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది. మెమోలు, వేధింపులు :గ్రామీణ ప్రాంతాల్లో నడిచే పల్లె వెలుగు బస్సుల్లో పెద్దగా ఆక్యుపెన్సీ రేషియో ఉండటం లేదని మొదటి నుంచి ఆర్టీసీ మొత్తుకుంటోంది. దీన్ని అధిగమించేందుకు ఆయా డ్రైవర్లు, కండక్టర్లకు ఎక్కువ మందిని ఎక్కించుకోవాలని టార్గెట్లు పెడుతున్నారు. బస్సు నిండా మంది ఉన్నారని స్టాపులో బస్సు ఆపలేదని తెలిస్తే తెల్లారి ఆ కండక్టర్, డ్రైవర్లకు చుక్కలు చూపిస్తారు. దీంతో అధికారులు చెప్పినట్లు వారు చేయాల్సి వస్తోంది. అదనపు ఆదాయం రూ. 828! కొండగట్టు నుంచి ఘాట్ రోడ్డు ద్వారా జగిత్యాల ప్రధాన రహదారి 3 కి.మీ. దూరం. ఇందుకు బస్సు ఎక్కితే కేవలం రూ.6 చార్జీ. అదే జీపు ఎక్కితే రూ.20కిపైగా వసూలు చేస్తారు. కండక్టర్ కూడా బస్సు సామర్థ్యం కన్నా అదనంగా 10 మందిని ఎక్కించుకున్నా పెద్దగా ప్రమాదం ఉండేది కాదు. దీనికి అదనంగా మరో 36 మందిని ఎక్కించుకోవడం వల్ల బస్సుపై ఓవర్‌లోడ్ పడింది. ఇంతచేస్తే ఈ 36 మంది ద్వారా టికెట్‌కు రూ.23 చొప్పున ఆర్టీసీకి వచ్చే అదనపు ఆదాయం కేవలం రూ.828. మహిళల మరణానికి కారణం ఇదే..! ప్రమాదానికి గురైన బస్సు వాస్తవ సామర్థ్యం 55 సీట్లు. ఈ బస్సు కొండగట్టుకు వచ్చే సరికి అప్పటికే బస్సు నిండా జనం ఉన్నారు. మంగళవారం కావడంతో అక్కడ భారీగా ఉన్న భక్తులంతా బస్సు ఎక్కా రు. మహిళా సీట్లు కాస్త విశాలంగా ఉండటంతో ఐదుగురికిపైగా సీట్లల్లో సర్దుకున్నారు. ఘటనాస్థలి వద్ద ఉన్న స్పీడు బ్రేకర్ల వద్దే బస్సు అదుపు తప్పింది. కుడివైపు ఉన్న ప్రయాణికులుఅంతా డ్రైవరుపై పడిపోవడంతో అతను బస్సును అదుపు చేయలేకపోయాడని స్థానికులు తెలిపారు. దీంతో నేరుగా వెళ్లి పక్కనే ఉన్న కందకంలో పడిపోయింది. బస్సు కుడివైపు భాగం నేలను బలంగా ఢీకొంది. ఈ తీవ్రతకు సీట్ల న్నీ విరిగిపోయాయి. ఆ ధాటికి శరీరాలు నలిగిపోయాయి. ‘ఘాట్’మీదుగా 44 ట్రిప్పులు.. కొండగట్టు ఘాట్ రోడ్డు మీదుగా ఆర్టీసీ వేములవాడ డిపోకు చెందిన 11 బస్సులు రోజూ 44 ట్రిప్పులు కొన్నేళ్లుగా నడుస్తున్నాయి. జగిత్యాల డిపో బస్సును కొడిమ్యాల మండలంలోని రాంసాగర్, హిమ్మత్‌రావుపేట, శనివారంపేట, డబ్బు తిమ్మయ్యపల్లె గ్రామాల కోసం కొంత కాలంగా దొంగలమర్రి మీదుగా నడిపిస్తున్నారు. తిరిగి అదే మార్గంలో వెళ్తుండటంతో ఆర్టీసీకి అనుకున్నంత ఆదాయం రావట్లేదు. దీంతో కొండగట్టు పుణ్యక్షేత్రం మీదుగా వెళ్తే భక్తుల రాకపోకలతో ఆదాయం పెరుగుతుందని జూలై 12 నుంచి దొంగలమర్రి నుంచి రావడం, కొండగట్టు నుంచి కిందకు దిగేలా రూటు మార్చారు. దీంతో కి.మీ.కు ఆదాయం రూ.12 నుంచి రూ.15కు పెరిగింది. దీంతో కొండగట్టు ఘాట్‌రోడ్డు మీద నుంచే బస్సు నడిపిస్తున్నారు. ‘సన్‌షైన్’లో నలుగురికి చికిత్స హైదరాబాద్: కొండగట్టు ప్రమాద ఘటనలో గాయపడిన నలుగురు బాధితులు సికింద్రాబాద్ సన్‌షైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నలుగురిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాలకు చెందిన రాజవ్వ (52), సత్తవ్వ (39), శనివారంపేట్కు చెందిన రాజయ్య (50), తిమ్మాయిపల్లికి చెందిన విజయ (45)లను బుధవారం రాత్రి జగిత్యాల నుంచి సన్‌షైన్ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉందని మరో 48 గంటలు గడిస్తే కానీ ఏది చెప్పలేమని డాక్టర్లు వెల్లడించారు. వీరి చికిత్సకు అయ్యే ఖర్చును ఆర్టీసీ భరిస్తుందని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వినోద్ కుమార్ ఆస్పత్రికి లేఖ రాసి ఇచ్చారు. దీంతో వీరికి ఆస్పత్రి వైద్యులు చికిత్స మొదలుపెట్టారు. -
ప్రమాద ప్రాంతాన్ని సందర్శించిన ప్రతిపక్ష నేతలు
జగిత్యాల జిల్లా: కొండగట్టు రోడ్డులో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కాంగ్రెస్, టీడీపీ నేతల బృందం బుధవారం సందర్శించి పరిశీలించింది. అనంతరం మృతుల కుటుంబాలను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, పెద్దిరెడ్డి, వి. హనుమంతరావు, పొన్నం ప్రభాకర్‌లు పరామర్శించారు. బస్సు ప్రమాదాన్ని ప్రభుత్వ హత్యగా పరిగణించాలని ఈ సందర్భంగా నాయకులు వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి బాధ్యులైన మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణలను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని కోరారు. ప్రభుత్వంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని..లేదంటే ఆర్టీసీ అన్ని డిపోల ముందు ఆందోళనకు దిగి ఆర్టీసీని స్థంభింపజేస్తామని కాంగ్రెస్, టీడీపీ నేతలు హెచ్చరించారు. కొండగట్టు ఘటన దురదృష్టకరమని మండలి చైర్మన్ స్వామిగౌడ్ వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు ప్రభుత్వమే చికిత్స చేయిస్తుందని, దీనికి కారకులైన వారిపై చర్య తీసుకుంటామని తెలిపారు. అసలే విషాదం.. ఆపై వర్షం కొండగట్టు ప్రమాదంలో మృతిచెందిన వారి అంత్యక్రియలకు వర్షం వల్ల అంతరాయం కలిగింది. శనివారం పేట, హిమ్మత్ రావు పేట, తిర్మలాపూర్, రామ్‌సాగర్, డబ్బూతిమ్మాయిపల్లిలో వర్షం జోరుగా పడుతోంది. -
అడ్డదారే ప్రమాదానికి కారణం
-
కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్షి బృందం – కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్ : జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో మంగళవారం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదం 60 మందిని బలిగొంది. కొడిమ్యాల మండలం శనివారంపేట నుంచి జగిత్యాలకు వస్తున్న ఆర్టీసీ (ఏపీ 29 జెడ్ 2319 ఆర్డినరీ) బస్సు కొండగట్టు సమీపంలోని ఘాట్ వద్ద లోయలో పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 101 మందిలో 60 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ప్రమాద స్థలంలోనే 24 మంది మృతి చెందారు. మరో 26 మంది జగిత్యాల ఆస్పత్రిలో, ఏడుగురు కరీంనగర్ జిల్లా కేంద్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, 38 మంది మహిళలు ఉన్నారు. 43 మంది క్షతగాత్రులను కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్ శ్రీనివాస్ మృతి చెందగా, కండక్టర్ పరమేశ్వర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. క్షతగాత్రుల్లో సగం మందికిపైగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రమాద ఘటనలో ఊపిరి ఆడకపోవడంతోనే ఎక్కువ మంది చనిపోయారని అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం విషయం తెలుసుకుని జిల్లా యంత్రాంగం, వైద్య సిబ్బంది అందరూ హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలను ఈటల రాజేందర్, కేటీఆర్, మహేందర్‌రెడ్డి, ఎంపీ కవిత పరామర్శించారు. ప్రమాదం జరిగిందిలా.. ఆర్టీసీ ఆర్డినరీ బస్సు ఉదయం 10.15 గంటలకు శనివారంపేట నుంచి జగిత్యాలకు బయల్దేరింది. 11.18 గంటల సమయంలో కొండగట్టు జంక్షన్‌ను దాటింది. తర్వాత ఘాట్‌రోడ్డు వద్ద జలబుగ్గ మూలమలుపునకు చేరుకోగానే అదుపు తప్పి పక్కనే ఉన్న ఘాట్‌లోకి దూసుకెళ్లింది. ఏం జరుగుతున్నదో తెలుసుకునే లోపే బస్సు లోయలో పడిపోయింది. బస్సు పడిపోతున్న సమయంలో ప్రయాణికుల హాహాకారాలు వినిపించాయి. మరో అరగంటలో జగిత్యాలకు చేరుకోవాల్సిన బస్సు.. పెను విషాదాన్ని మిగిల్చింది. కొంపముంచిన ఓవర్లోడింగ్ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిం చుకోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సులో సీటింగ్ సామ ర్థ్యం 52 మాత్రమే. కానీ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 101 మందిని ఎక్కించుకున్నారు. అంతమంది ఎక్కడంతో ఆ బస్సు కిక్కిరిసింది. దీనికి తోడు కొండగట్టు ఆలయ ప్రాంగణం నుండి గుట్ట కింద వరకు ఉన్న దారి పొడవునా ఆరు ప్రమాదకర మూలమలుపులున్నాయి. ఆ మార్గంలో వాహనాలు నడపాలంటే సుశిక్షుతులైన డ్రైవర్లే ఉండాలి. ఈ క్రమంలో డ్రైవర్ శ్రీనివాస్ కూడా ఉత్తమ డ్రైవర్ అవార్డు గ్రహీతనే. అయితే బస్సు జలబుగ్గ ప్రాంతానికి చేరుకోగానే ఎదురుగా వస్తున్న జీపును తప్పించబోయి డ్రైవర్ బస్సును కట్ కొట్టాడు. దీంతో బస్సు ప్రయాణికులందరూ ఒకేవైపు ఒరగడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిందని సాక్షులు చెబుతున్నారు. రూట్ మార్చడంపై విమర్శలు అధికారులు రూటును మార్చడం కూడా ప్రమాదానికి కారణమని మృతుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి బస్సు శనివారంపేట నుంచి హిమ్మత్‌రావుపేట, రాంసాగర్, తిమ్మయ్యపల్లె, నాచుపల్లి మీదుగా జగిత్యాలకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆర్టీసీ అధికారులు పదిరోజుల క్రితమే బస్సు రూటును మార్చి.. శనివారంపేట నుంచి హిమ్మత్‌రావుపేట, రాంసాగర్, తిమ్మయ్యపల్లె నుంచి నేరుగా కొండగట్టు మీదుగా జగిత్యాలకు నడిపిస్తున్నారు. కొండగట్టు స్టేజీ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందనే అధికారులు రూటు మార్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్తనాదాలతో దద్దరిల్లిన ఆస్పత్రి మృతుల కుటుంబీకుల రోదనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో జగిత్యాల జిల్లా ఆస్పత్రి దద్దరిల్లింది. మృతదేహాలను సంఘటనా స్థలం నుంచి ఆస్పత్రికి తరలించగానే.. వారి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులందరూ ఆస్పత్రికి చేరుకున్నారు. కుప్పగా పడి ఉన్న మృతదేహాలను చూస్తూ తమ వారి కోసం వెతుక్కున్నారు. గుండెలు పగిలేలా ఏడ్చారు. ఎవరిని కదిలించినా.. హృదయవిదారక గాథలే వినిపించాయి. చూపరులను కంటతడి పెట్టించాయి. మృతులు, క్షతగాత్రులను చూసేందుకు జిల్లా నలుమూలలతో పాటు కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల నుండి జనం వేల సంఖ్యలో తరలివచ్చారు. 45 మృతదేహాలకు జగిత్యాల ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించారు. సుమారు 18 మంది డాక్టర్లతో కూడిన వైద్య బృందం శవపరీక్షలు నిర్వహించింది. 12.10కి ప్రారంభమైన పోస్టుమార్టం ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. తొమ్మిది మృతదేహాలకు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. క్షతగాత్రులను జగిత్యాల ప్రధాన ఆస్పత్రికి తరలించేందుకు 15 అంబులెన్స్‌లు, మృతదేహాలను తరలించేందుకు 8 మార్చురీ వ్యాన్లను ఉపయోగించారు. పోస్టుమార్టం అనంతరం రాంసాగర్, డబ్బుతిమ్మయ్యపల్లి, హిమ్మత్‌రావుపేట గ్రామాలకు చెందినవారి మృతదేహాలు ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక వాహనాల ద్వారా పంపించారు. అధికారుల ఘెరావ్ ఘటనా స్థలాన్ని సందర్శించేందుకు వెళ్లిన కలెక్టర్ డాక్టర్ శరత్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి, జగిత్యాల ఎస్పీ సింధూశర్మను మృతుల కుటుంబీకులు ఘెరావ్ చేశారు. గతంలో రెండుసార్లు ప్రమాదాలు జరిగినా చర్యలు తీసుకోలేదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.10 లక్షల నష్ట పరిహారం ఇవ్వడంతోపాటు ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మార డంతో స్థానిక నాయకులు వారికి నచ్చజెప్పారు. ఫిట్నెస్ ఇంకో నెల రోజులుంది ప్రమాదానికి గురైన బస్సు ఫిట్నెస్ గడువు మరో నెల రోజులుంది. ఆర్టీఏ నిబంధనల ప్రకారం.. రోడ్డుపై నడవాలంటే ఆ వాహనం ఫిట్నెస్ చూస్తాం. ఫిట్నెస్ లేకపోతే వాహనాన్ని పక్కనబెడతాం. అంటే మనం ఆస్పత్రికి వెళ్తే ఆ రోజు వరకు ఉన్న పరిస్థితికి అనుగుణంగానే వైద్యం చేస్తాం. తర్వాత ఏమయ్యేదీ డాక్టర్లు చెప్పలేరు కదా.. వారంలోనే చావొచ్చు, 20 ఏళ్లు కూడా బతకవచ్చు. – కిషన్‌రావు, ఇన్చార్జి డీటీసీ, జగిత్యాల... (60 మంది మృతి చెందిన ఘటనను ఉద్దేశించి ఆర్టీఏ అధికారి ఇచ్చిన వివరణ ఇది) మృత్యుంజయులు ఈ చిన్నారులు కొడిమ్యాల: రాంసాగర్ గ్రామానికి చెందిన బైరి కీర్తన తన కూతురు రితన్య, ఏడాది వయసున్న కుమారుడు శివతో కలిసి జగిత్యాలకు బయలుదేరింది. ప్రమాదంలో రితన్య చనిపోగా.. కీర్తనకు తీవ్రగాయాలయ్యాయి. శివ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. రాంసాగర్కే చెందిన కావ్యశ్రీ,, ఉదయశ్రీ అనే కవలలు తాత మెడిచెల్మల రాజేశం (60)తో జగిత్యాల బయలుదేరారు. ప్రమాదంలో రాజేశం మృతిచెందగా.. కవలలు మృత్యుంజయులుగా నిలిచారు. శివ (పైన ), కవలలు కావ్యశ్రీ, ఉదయశ్రీ (కింద) అడ్డదారే ప్రమాదానికి కారణం ఘటన జరిగిన మార్గంలో పలు చోట్ల ప్రమాదకర మలుపులున్నాయి. ఇప్పటికే ఆ మార్గంలో రెండుసార్లు ప్రమాదం జరిగింది. 2012 మార్చి 21న అదే మార్గంలోని మరో లోయలో లారీ పడి 11 మంది మృతి చెందారు. రెండేళ్ల క్రితం ఇదే లోయలో ఆటో పడి ఇద్దరు చనిపోయారు. దీంతో ఆ మార్గం నుంచి బస్సులు నడపకుండా ప్రత్యామ్యాయంగా బైపాస్ రోడ్డు నిర్మించారు. ఘాట్ రోడ్డు నిర్మాణం కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆర్అండ్బీ అధికారులు గుర్తించి.. ప్రభుత్వానికి నివేదిక పంపారు. రోడ్డుకి ఇరువైపులా రక్షణ గోడ నిర్మించాలని సూచించారు. గోడ నిర్మించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని.. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ రోడ్డుపై వాహనాలు నడపరాదని చెప్పినా.. గత 3 నెలలుగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలకు అనుమతిస్తున్నారు. ఘాట్‌రోడ్డు నుంచి హైవే కిలోమీటరు దూరంలో ఉంటుంది. ప్రత్యామ్నాయ బైపాస్ రోడ్డును ఉపయోగిస్తే అదనంగా 5కి.మీ ప్రయాణించాల్సి వస్తుందని భావించిన ఆర్టీసీ అధికారులు.. ఘాట్ రూట్లోనే బస్సులు నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జగిత్యాల డిపోలో కాలపరిమితి ముగిసిన సుమారు 20 బస్సులను నడుపుతున్నట్లు తెలిసింది. మరోవైపు కొండగట్టు ఘాట్‌రోడ్ పెద్ద వాహనాలకు ప్రమాదం అని తెలిసి గతంలో పెద్ద వాహనాలు నడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఆర్టీసీ అధికారులు గత 10 రోజుల నుంచి కొడిమ్యాల నుంచి కొండగట్టుకు బస్సు నడుపుతున్నారు. దేశంలోనే అతిపెద్ద బస్సు ప్రమాదం! కొండగట్టు ప్రమాదం దేశంలోనే అతిపెద్దదిగా చెబుతున్నారు. ఆర్టీసీ చరిత్రలో కూడా ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వంటి ప్రమాదకర ఘాట్ రోడ్లు, కొండ చరియలు కలిగిన రాష్ట్రాల్లో జరిగిన ప్రమాదాల్లోనూ ఇంత పెద్ద మొత్తంలో ప్రాణనష్టం జరగలేదు. జమ్మూకశ్మీర్‌లో 2008లో 60 మందితో వెళ్తున్న బస్సు బోల్తా పడగా, 44 మంది మృతి చెందా రు. మరో ప్రమాదంలో ఆ రాష్ట్రంలోనే మరో 51 మంది దుర్మరణం చెందారు. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో 2012లో జరిగిన బస్సు ప్రమాదంలో 52 మంది మృతిచెందారు. మహారాష్ట్రలో 2008 లోని నాసిక్‌లో భక్తులతో వెళ్తున్న బస్సు లోయలో పడిన ఘటనలో 39 మంది ప్రయాణికులు మరణించారు. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 45 మంది, మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొట్టిన ప్రమాదంలో 26 మంది విద్యార్థులు చనిపోయారు. కొండ గట్టు బస్సు ప్రమాదంలో 60 మంది చనిపోవడంతో దేశ చరిత్రలోనే అత్యంత ఘోర ఘటనగా నమోదైంది. కంటతడి పెట్టిన కేటీఆర్, కవిత రాయికల్ (జగిత్యాల): కొండగట్టు ప్రమాద మృతదేహాలు, క్షతగాత్రులను చూసి మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ చలించిపోయారు. పరామర్శించేందుకు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వారు బాధితుల బంధువుల ఆర్తనాదాలు చూసి కంటతడి పెట్టారు. కాగా, ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరఫున రూ.3 లక్షలు అందిస్తామన్నారు. చనిపోయిన వారిలో రైతులు ఉంటే రైతుబీమా కింద మరో రూ.5 లక్షల పరిహారం అందుతుందన్నారు. ఓవర్‌లోడ్‌తో బస్సును నడిపించినందుకు జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న కేటీఆర్, మహేందర్ రెడ్డి, ఈటల, ఎంపీ కవిత తదితరులు కాలం చెల్లిన బస్సులు ఆర్టీసీ ధనదాహమే 60 మంది చావుకు కారణమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఒక్కో ఆర్టీసీ బస్సు 10 లక్షల కిలోమీటర్లు మాత్రమే నడపాలి. అయితే ప్రమాదానికి గురైన బస్సు పెద్దపల్లి జిల్లా మంథని డిపోలో రెండు నెలల క్రితమే 20 లక్షల కి.మీ తిరిగింది. తర్వాత ఆ బస్సును ఉన్నతాధికారుల మెప్పుకోసం జగిత్యాలకు తీసుకొచ్చి కొడిమ్యాల నుంచి జగిత్యాల రూట్లో నడుపుతున్నారు. రెండు నెలల కాలంలో ఇప్పటి వరకు ఆ బస్సు అదనంగా మరో 4 లక్షల కి.మీ తిరిగింది. మరోవైపు మూడేళ్ల క్రితం వరకు 8 లక్షల కి.మీ తిరిగిన బస్సులను ఆర్టీసీ స్క్రాప్ కింద పక్కన పెట్టేది. తర్వాత 10 లక్షల కి.మీ, 12 లక్షల కి.మీ వరకు పరిమితిని పెంచి ఇటీవల 14 లక్షల కి.మీ తప్పనిసరి చేసిందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదానికి గురైన బస్సుకు 3 నెలల క్రితమే మరమ్మతులు చేసి.. రంగుపూసి రోడ్డెక్కిచ్చినట్లు చెబుతున్నారు. ఆ దృశ్యం భయానకం... ఒక బాంబు పేలుడు జరిగితే ఎంతటి భయానకమైన పరిస్థితి కనిపిస్తుతుందో.. కొండగట్టు బస్సు ప్రమాదం అంతకు మించిన భయానక దృశ్యాన్ని చూపిస్తోంది. బస్సంతా ఛిన్నాభిన్నం.. స్టీరింగ్ ఎక్కడకు పోయిందో తెలియదు.. గేర్ రాడ్బాక్స్ తుక్కుతుక్కుగా మారిపోయింది. సీట్లు ఆకృతిని కోల్పోయి భయంకరమైన దృశ్యాన్ని తలపించాయి. ఘాట్ రోడ్డు నుంచి వస్తూ స్పీడ్ బ్రేకర్ల వద్ద బస్సు పట్టుతప్పింది. నేరుగా 15 మీటర్ల లోతులో ఉన్న గుంతలో పడింది. బస్సు ముందు భాగం వేగంగా వెళ్లి గుంత గట్టు ప్రాంతాన్ని ఢీకొట్టింది. ఇక్కడే బస్సులో నిల్చుని ఉన్న వాళ్లంతా డ్రైవర్ పైనా, గేర్ బాక్స్ ప్రాంతం నుంచి అద్దాల మీద పడి గుంత దరిని ఢీకొట్టారు. ఇక్కడే 15 నుంచి 25 మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. సీట్లలో కూర్చున్న వాళ్లు వెనుక భాగంలో నిల్చొని ఉన్న వాళ్లు సైతం ఒక్క కుదుపుకే తీవ్రమైన గాయాలతో, ఇంటర్నల్ బ్లీడింగ్‌తో సంఘటనా స్థలిలోనే మృత్యవాతపడ్డారు. మిగిలిన వాళ్లని బయటకు తీసే క్రమంలో స్థానికులు, భక్తులు ఎంత సహాయం చేసినా అంతర్గతంగా తగిలిన గాయాలతో మార్గమధ్యంలో, చికిత్స సమయంలో మృత్యువాతపడ్డట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. -
ఇంత నిర్లక్ష్యమా?!
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ‘ప్రగతి రథం–ప్రజల నేస్తం’ లోగోతో ఉంటాయి. ‘ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, క్షేమకరం’ అన్న నినాదాలకు కూడా కొదవలేదు. కానీ జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద మంగళవారం చోటుచేసుకున్న ప్రమాదంలో కనీవినీ ఎరుగని రీతిలో 57మంది ప్రయాణీకులు బలైపోయారు. దుర్ఘటన జరిగిన సమయంలో బస్సులో చిన్న పిల్లలతోసహా 102మంది ప్రయాణికులున్నారని చెబుతున్నారు. అనేకులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. మన రహదారుల వాలకం చూస్తున్నా, వాటిపై ప్రతి క్షణం పరుగులు తీసే వాహనాల తీరును గమనిస్తున్నా ఇంటి నుంచి బయటికెళ్లినవారు క్షేమంగా తిరిగొస్తారన్న గ్యారెంటీ ఉండటం లేదు. కానీ మంగళవారంనాటి ప్రమాదం అన్నిటినీ తలదన్నింది. బస్సులో డ్రైవర్‌తోసహా 51మంది ప్రయాణికులకు మించరాదన్న నిబంధన ఉండగా ఈ వాహనంలో అంతకు రెట్టింపు సంఖ్యలో ఎలా ఉన్నారన్న సందేహం తలెత్తుతోంది. ఇది చాలదన్నట్టు ప్రమాద సమయానికి అది పెను వేగంతో వెళ్తున్నదని గాయపడినవారిలో కొందరు చెబుతున్నారు. ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉన్న బస్సును వేగంగా పోనిస్తూ మలుపు తిప్పితే అందరూ అటువైపు ఒరిగిపోతారు. దాంతో బరువు ఒకవైపే పడి బస్సు అదుపు తప్పి ఉండొచ్చునన్నది నిపుణులు చెబుతున్న మాట. అంటే బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండకపోతే ప్రమాదానికి ఆస్కారం ఉండేది కాదు. కనీసం ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసేవి కాదు. మృతుల్లో చాలామంది ఊపిరాడక చనిపోవ డాన్ని గమనిస్తే ఈ సంగతి అర్ధమవుతుంది. కొండగట్టులో కొలువైన ఆంజనేయుడి దర్శనం కోసం భారీ సంఖ్యలో అక్కడికి భక్తులు వెళ్తుం టారు. మంగళవారాలు ఈ రద్దీ మరింత అధికం. ఇటువంటి మార్గాల్లో సాధారణ ప్రజలకు రవాణా సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ ఇటీవలికాలంలో దాన్ని గాలికొదిలేస్తు న్నారు. ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థగా కాక ప్రైవేటు సంస్థ మాదిరిగా వ్యవహరిస్తోంది. అధికా దాయం లభించే రూట్లలో తక్కువ బస్సులతో ఎక్కువ ఆదాయం రాబట్టడం ఎలా అన్నదే దానికి ప్రధానమైపోయింది. అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కంట్రోలర్లను నియమిస్తే ప్రయాణికుల సంఖ్యను గమనించి వారు డిపో మేనేజర్‌కు వర్తమానం పంపే వీలుంటుంది. అలాంటపుడు అవసర మనుకున్నప్పుడు అదనపు బస్సుల్ని పంపే అవకాశం ఏర్పడుతుంది. కానీ డిపో నుంచి బయల్దేరిన బస్సు ఎలా ఉందో, డ్రైవర్ పరిస్థితేమిటో, అది వెళ్లిన రూట్లో రద్దీ ఎలా ఉందో గమనించే నాథుడు లేకుండా పోయాడు. బస్సులుంటే సరిపోదు. తగినంతమంది డ్రైవర్లుండాలి. కానీ ఆ రెండు విషయా ల్లోనూ ఆర్టీసీ తీసికట్టే. రిటైరవుతున్నవారి స్థానంలో కొత్తవారిని తీసుకోవటం లేదని, ఉన్నవారితోనే అదనపు గంటలు పనిచేయిస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. ఒక డ్రైవరు ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉండగా, కనీసం అయిదారు గంటలు అదనంగా పనిచేయకతప్పడం లేదని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. అలాగే బస్సుల ఫిట్నెస్ గురించి పట్టడం లేదని చెబుతున్నాయి. ఇలాంటి పరి స్థితులు డ్రైవర్లపై ఒత్తిళ్లు పెంచుతున్నాయి. ఇటు బస్సు రావటంలో జాప్యం జరిగితే ప్రయాణికుల్లో అసహనం, ఆత్రుత పెరుగుతాయి. వచ్చిన బస్సు ఎక్కకపోతే వేరే బస్సు రావటానికి మరెంత సమయం పడుతుందోనన్న ఆందోళన వారిని ఆవహిస్తుంది. దాంతో కష్టమైనా, ఎంతో అసౌకర్యంగా ఉన్నా వచ్చిన బస్సే ఎక్కడానికి ప్రయత్నిస్తారు. లాభాలు ఆర్జించి కోట్లకు పడగెత్తాలన్న దురాశతో ప్రైవేటు సంస్థలు గతంలో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడాయి. కనుకనే అప్పట్లో బస్సు రూట్ల జాతీయం కోసం అందరూ డిమాండు చేసేవారు. కానీ ఇప్పుడు యూనియన్లు, సిబ్బంది చెబు తున్న మాటలు వింటుంటే ఆర్టీసీ కూడా అదే రూట్లో వెళ్తోందన్న భావన కలుగుతుంది. ప్రమాదం సంభవించిన బస్సును నడిపిన డ్రైవర్ శ్రీనివాస్‌కు మంచి పేరుంది. నెలక్రితం ఆయనకు అవార్డు కూడా వచ్చింది. మద్యం అలవాటు లేదంటున్నారు. ఇన్ని అనుకూలాంశాలు కూడా ఒక పెను ప్రమాదాన్ని నివారించలేకపోయాయి. ప్రమాదం సమయానికి బస్సు వేగంగా వెళ్తున్నదని బస్సులోని ప్రయాణికులతోపాటు బయటివారు కూడా చెబుతున్నారు. ఒకటి రెండు వాహనాలను ఓవర్ టేక్ చేయడంతోపాటు ప్రమాదం జరగడానికి ముందు బస్సు ఒక ఆటోను ఒరుసుకుంటూ పోయింది. దీన్నంతటిని గమనిస్తే బ్రేకులు విఫలం కావడం వల్ల డ్రైవర్ బస్సుపై అదుపు కోల్పోయాడా అన్న అనుమానం తలెత్తుతోంది. ఈ బస్సు ఇంతక్రితం వేరే డిపోలో ఎక్స్ ప్రెస్‌గా తిరిగి ఇప్పుడు పల్లె వెలుగు బస్సుగా రూపు మార్చుకుని వచ్చిందంటున్నారు. పైగా 8 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సును తక్కుగా పరిగణించి పక్కన పడేసే నిబంధనను మూడేళ్లక్రితం సవ రించి దాన్ని 10 లక్షల కిలోమీటర్లకు పెంచారని చెబుతున్నారు. చిత్రమేమంటే ఇప్పుడు ప్రమాదానికి గురైన బస్సు ఆ పరిమితిని కూడా దాటిపోయి, రెండు నెలలక్రితమే 20 లక్షల కిలోమీటర్ల స్థాయికి చేరుకుందని అంటున్నారు. అలాంటి బస్సుకు రంగులద్ది, మరమ్మతులు చేసి రోడ్డెక్కించిన పాపం ఎవరిదో, అసలు పాత నిబంధనలను ఎవరు ఏ ప్రాతిపదికన సవరించారో తేలాలి. ఇంకా దారుణ మేమంటే ఇలాంటి డొక్కు బస్సులు జగిత్యాల డిపోలోనే మరో 20 ఉన్నాయంటున్నారు. ఇతర డిపోల్లో ఎన్ని ఉన్నాయో కూడా లెక్క తీయాలి. వాటిని తక్కుగా పరిగణించాలి. అలాగే ఇప్పుడు ప్రమాదం జరిగిన రోడ్డు నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపాలున్నాయని గుర్తించారని, అందువల్లే ద్విచక్ర వాహనాలు తప్ప వేరే వాహనాలు వెళ్లకూడదన్న నిబంధన మొన్నటివరకూ ఉండేదని చెబుతున్నారు. ఆ నిబంధన మారిందా లేక జగిత్యాల డిపో అధికారులు అధికాదాయానికి ఆశ పడి దాన్ని ఉల్లంఘించారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా సాధారణ పౌరుల ప్రాణాలు గడ్డిపోచతో సమానమని కొండగట్టు ఘాట్ రోడ్డు దుర్ఘటన నిరూపించింది. ఇది సహించరాని నిర్లక్ష్యం. -
‘ఆర్టీసీ తప్పిదం వల్లే ప్రమాదం జరిగింది’
సాక్షి, కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి ఆర్టీసీ, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణమని వారు మండిపడుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు సాక్షితో మాట్లాడుతూ.. ‘ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. శనివారంపేట నుంచి జగిత్యాల వెళ్లే ఆర్టీసీ బస్సులు మాములుగా దొంగలమర్రి, నాచుపల్లి మీదుగా వెళ్లాలి. కానీ గత పది రోజులుగా బస్సులు కొండగట్టు ఘాట్ రోడ్డు మీదుగా వెళ్తున్నాయి. ప్రమాదం జరిగిన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండటం, బస్సు కండీషన్లో లేకపోవడం ప్రమాదానికి ఒక కారణం అయి ఉండొచ్చు. మూల మలుపు వద్ద బస్సు అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగింది. మేము ఇక్కడికి చేరుకున్నప్పుడు ఇరవై మంది మృతి చెందారు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం, ఆర్టీసీ తప్పిదం వల్లే జరిగింద’ ని తెలిపారు. ‘ఈ రూట్లో అసలు బస్సును నడపాల్సింది కాదు. దీనికి కారణమైన జగిత్యాల డిపో మేనేజర్, ఆర్టీసీ డీఎంపై చర్యలు తీసుకోవాలి. ఈ రోడ్డుపై గతంలో లారీ ప్రమాదం జరిగిందని.. అయినా ఘాట్ రోడ్డు భద్రతపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాల’ని స్థానికులు కోరుతున్నారు. కాగా ఈ ప్రమాదంలో 55మంది మృతి చెందారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. -
కొండగట్టు బస్సు ప్రమాదం; మృతుల వివరాలు
సాక్షి, కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 57 మంది మృతిచెందారు. ఆర్టీసీ, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 88 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ప్రమాదంలో గాయపడ్డ వారికి జగిత్యాల, కరీంనగర్‌లలో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో మహిళలు అధికంగా ఉన్నారు. మృతుల వివరాలు: 1. నామాల మౌనిక (23), శనివారంపేట 2. బైరి రిత్విక్(3), రామసాగర్ 3. పోలు లక్ష్మి(50), హిమ్మత్ రావుపేట 4. చెర్ల లక్ష్మి (45), హిమ్మత్ రావుపేట 5. గండి లక్ష్మీ (60), శనివారంపేట 6. డబ్బు అమ్మయి(50) D/o తిమ్మయ్య, డబ్బు తిమ్మయ్యపల్లి 7. బండపల్లి చిలుకవ్వ(76) 8. గోలి అమ్మాయి(44), శనివారంపేట 9. తిప్పర్తి వెంకటరత్నం(56), తిరుమలాపూర్ 10. కంకణాల ఎల్లవ్వ(70), సండ్రలపల్లి 11. లాంబ కిష్టయ్య(65), హిమ్మత్ రావుపేట 12. బందం లస్మవ్వ (65) ముత్యంపేట 13. బొల్లారం బాబు (54), శనివారంపేట 14. లైసెట్టి చంద్రకళ (45), శనివారంపేట 15. ఎండ్రికాల ఎంకవ్వ, శనివారంపేట 16.ఎండ్రికాల సుమ(30), శనివారంపేట 17. ర్యాగాల రాజవ్వ (56), డబ్బు తిమ్మయ్యపల్లి 18. ఉత్తమ్ నందిని , కోనాపూర్ 19. మల్యాల అనిల్(19), హిమ్మత్ రావుపేట 20. గాజుల చిన్నయ్య (60), s/o హన్మంతు, డబ్బు తిమ్మయ్యపల్లి 21. శామకూరా మల్లవ్వ (38), తిర్మలాపూర్ 22. సలేంద్ర వరలక్ష్మి (28), శనివారంపేట 23. కుంబాల సునంద (45), శనివారంపేట 24. గుడిసె రాజవ్వ (50), శనివారంపేట 25. పందిరి సత్తెవ్వ (75), హిమ్మత్ రావుపేట 26. దాసరి సుశీల (55), తిరుమలపూర్ 27. డ్యాగల ఆనందం(55), రామసాగర్ 28. నేదునూరి మదనవ్వ(75), హిమ్మత్ రావుపేట 29. చెర్ల హేమా(30), హిమ్మత్ రావుపేట 30. పిడుగు రాజిరెడ్డి(55), డబ్బు తిమ్మయ్యపల్లి 31. చెర్ల గంగయ్య(75), శనివారం పేట 32. ఒడ్నాల లస్మవ్వా (48), తిమ్మయ్యపల్లి 33. ఒడ్నాల కాశిరం(55), తిమ్మయ్యపల్లి 34. గోల్కొండ లచవ్వ(51), డబ్బు తిమ్మయ్యపల్లి 35. గోల్కొండ దేవయ్య (63), డబ్బు తిమ్మయ్యపల్లి 36.కొండ అరుణ్ సాయి(5), కోరెం 37. బొంగని మదునయ్య(55), రాంపెల్లి 38. ఓత్యం భూలక్మి(40), కొనపూర్ 39. సోమిడి పుష్ప(45), తిర్మల్పూర్ 40. బొంగోని భూమక్క(55), పెద్దపల్లి 41. వేముల భాగ్యవ్వ(50), హిమ్మత్ రావుపేట 42. బాలసాని రాజేశ్వరి(40), రేకుర్తి 43. తిరుమాని ముత్తయ్య(40), రామసాగర్ 44. బొంగోని రాంచరణ్ (09), రాంపెల్లి 45. చిర్రం పూజిత (15, జగిత్యాల 46. ఆరె మల్లయ్య, హిమ్మత్ రావుపేట 47. మేడి చెలిమల రాజేషం (70), రాంసాగర్ 48. చెర్ల మౌనిక (24), రాంసాగర్ 49. డ్రైవర్ శ్రీనివాస్ (ఆర్టీసీ డ్రైవర్) 50. మేడి చెలిమల గౌరీ (48), రాంసాగర్ 51.పడిగెల స్నేహలత (22), హిమ్మత్‌రావుపేట 52. డ్యాగల స్వామి (32), రాంసాగర్ 53. గాజుల శ్రీహర్ష (02), శనివారంపేట 54. తైదల పుష్ప (40), తిర్మలాపూర్ 55. పుండ్రా లలిత (36), డబ్బు తిమ్మాయిపల్లి 56. పోతుగంటి జ్యోత్స్నా (27), మల్యాల 57. గోలి రాజమల్లు (60), శనివారంపేట -
ర్యాష్ డ్రైవింగ్
జగిత్యాలక్రైం : రయ్..రయ్‌మంటూ కుర్రకారు జోష్.. ఆటోలను ఎలా నడిపిన తమను అడిగేవారు లేరనే ఆటోవాలాల ధీమ.. జగిత్యాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రాత్రయితే చాలు రోడ్లపైకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. బైక్‌పై ముగ్గురేసి యువకులు ఎక్కి హైస్పీడ్‌లో వెళ్తూ సడన్‌గా బ్రేక్‌లు వేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. మధ్యాహ్నం వేళ పోలీసుల నిఘా ఉంటున్నప్పటికీ రాత్రయితే వీరు జోష్ పెంచుతున్నారు. ఎక్కువ శబ్దాలు వచ్చే వాహనాలతో విపరీతమైన వేగంతో వెళ్తున్న వీరి సరదా ఎదుటి వారి ప్రాణాలమీదికి తెస్తుంది. రాత్రి వేళల్లో.. అర్ధరాత్రి ఆటోలు ఎక్కే ప్రయాణికులకు ఆటోవాలాలు తమను గమ్యస్థానాలకు క్షేమంగా చేరుస్తారన్న భరోసా లేకుండా పోతుంది. కొందరు ఆటోవాలాలు నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకొని వేగంగా నడుపుతుండడంతో ప్రయాణికులు జంకుతున్నారు. మెల్లగా వెళ్లాలని చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోయారు. రాత్రి వేళల్లో పోలీసుల నిఘా కరువవడంతోనే వీరి ఆగడాలు శృతిమించుతున్నాయి. నిఘా ఎక్కడా ? రోడ్లపై కొందరు ఆటోవాలాలు, ద్విచక్రవాహనదారులు, కార్లు, జీపులు ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తున్న ప్రధాన చౌరస్తాల వద్ద పోలీసులు, పెట్రోలింగ్ పోలీసులు వీరిని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిపై పోలీసులు చర్యలు తీసుకుంటే వారిలో మార్పు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. జిల్లాకేంద్రంలో న్యూసెన్స్‌కు పాల్పడేవారిపై ‘ఈ పెట్టి’ కేసులు ఎలా నమోదు చేస్తున్నారో వీరిపై అలాంటి కేసులు పెట్టాలని పలువరు అభిప్రాయపడుతున్నారు. ర్యాష్ డ్రైవింగ్‌పై పోలీసులు నిఘా పెట్టాలని కోరుతున్నారు. భద్రత కల్పించాలి ఆటోలో ప్రయాణించే వారికి భద్రత కల్పించాలి. ముఖ్యంగా ఒంటరిగా ఆటోలో వెళ్తే క్షేమంగా ఇంటికి చేరుతామన్న నమ్మకం కోల్పోతున్నారు. కొందరు ఆటోడ్రైవర్లు రాత్రివేళల్లో ప్రయాణికుల నుంచి రెట్టింపు కంటే ఎక్కువగా ఆటోచార్జీలు వసూలు చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించాలి. – కాటిపల్లి మునీందర్‌రెడ్డి, తిమ్మాపూర్ చర్యలు తీసుకుంటాం జిల్లా కేంద్రంలో రాత్రిపూట ఆటోల వేగాన్ని నియ ంత్రించేందుకు చర్యలు చేపడతాం. రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బందితో నిఘా పెట్టించి వేగంగా వెళ్లే ఆటోలు, ద్విచక్రవాహనదారులపై చ ర్యలు తీసుకుంటాం. ప్రయాణికులను ఇబ్బదిపెట్టినట్లు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. – ఆరోగ్యం, ట్రాఫిక్ ఎస్సై, జగిత్యాల -
నల్లగొండ గుట్టపై విషాదం
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కొడిమ్యాల మండలం నల్లగొండ గుట్టపై ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం హసన్కుర్తి గ్రామానికి చెందిన గౌతమి(20), ప్రశాంత్(21) ప్రేమించుకున్నారు. అయితే వీరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమజంట రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో వారి కుటుంబసభ్యులు కమ్మరపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం గుట్టపై ఓ చెట్టుకు రెండు మృతదేహాలు వేలాడుతూ ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో దొరికిన సిమ్ కార్డు ఆధారంగా పోలీసుల వివరాలు సేకరించి, ప్రేమజంట కుటుంబ సభ్యులకు తెలియజేశారు. గుట్టపైన ఆనవాళ్లను బట్టి ప్రేమికుల ఆత్మహత్య నెల క్రితం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. -
మట్టిపెళ్లలు పడి ముగ్గురి మృతి
సాక్షి, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మల్లాపూర్ మండలం కుస్తాపూర్‌లో ఉపాధి హామీ కూలీలపై మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో ఐదుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ కూలీలను చికిత్స నిమిత్తం మెట్పల్లి సామాజిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ముత్తమ్మ(45), రాజు(55), జెల్లా పోషాని(50) అనే ముగ్గరు కూలీలు మృతి చెందారు. మిగతా ఇద్దరు కూలీలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కూలీల మృతిలో గ్రామంలో విషాదం నెలకొంది. -
సివిల్స్ ఫస్ట్ ర్యాంక్‌తో సర్ప్రైజే ఇచ్చాడు
అమ్మకు తేడా తెలీదు. అమ్మ చూపులో చిన్నచూపుపెద్దచూపు ఉండదు. కలిమిలేమి, రాజుపేద, తన పర భేదాలు చూడకుండా అవసరాన్ని మాత్రమే చూడమని చెప్తుంది! అమ్మ ప్రోత్సాహం అనుదీప్ జీవితంలో చాలా విలువైంది. అమ్మ ఇచ్చే సందేశం కూడా అంతే విలువైంది. అనుదీప్‌తో ఒక స్నేహితురాలిలామెలిగాను అంటున్నారు తల్లి జ్యోతి దురిశెట్టి. ‘‘బాగా గుర్తుంది ఆ రోజు. సివిల్స్ ఇంటర్వ్యూ అయిపోగానే నాకు ఫోన్ చేశాడు. ‘అమ్మా.. ఈసారి వస్తుంది.. గ్యారెంటీ’ అన్నాడు. అన్నట్టుగానే తెచ్చుకున్నాడు. వాడికెలా ఉందోగానీ నాకైతే సంతోషమే సంతోషం. సివిల్స్ ఆల్ ఇండియా ఫస్ట్ అనుదీప్ అని రిజల్ట్స్ రాగానే ఫోన్లే ఫోన్లు. అనుదీప్ మదర్‌గా చాలా ప్రౌడ్‌గా ఫీలవుతున్నా. అమ్మగా నేనేం చేయాలో అది చేశాను తప్ప స్పెషల్‌గా ఏం పెంచలేదు. వాడే గోల్ సెట్ చేసుకున్నాడు. దానికి తగ్గట్టు కష్టపడ్డాడు. ఈ రోజు మీ అందరి గ్రీటింగ్స్.. బ్లెస్సింగ్స్ అందుకుంటున్నాడు. చాలా హ్యాపీగా ఉంది. మా ఊరు.. కుటుంబం మా సొంతూరు చిట్టాపూర్. ఇది జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండల్ కిందికొస్తది. కానీ మావారి (దిరిశెట్టి మనోహర్) ఉద్యోగం మెట్పల్లిలో కాబట్టి అక్కడే ఉంటాం. ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్. మాకు అనుదీప్ కాకుండా ఇంకో అబ్బాయి ఉన్నాడు. వాడి పేరు అభినయ్. మొన్ననే బీటెక్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలో ఆలోచించుకుంటున్నాడు. ‘అన్నయ్యలాగే నేను కూడా సివిల్స్ రాస్తా’ అన్నాడు. వాడిష్టం. పిల్లల మీద మేమెప్పుడూ ప్రెషర్ పెట్టలేదు. ఫలానా వాళ్ల పిల్లలు డాక్టర్స్ అయ్యారు.. ఫలానా వాళ్ల పిల్లలు ఇంజనీర్స్ అయ్యారు.. మీరూ అలాగే చదవాలి.. అని వాళ్లనెప్పుడూ ఫోర్స్ చేయలేదు. ఏం చదవాలన్నా.. ఏం కావాలన్నా వాళ్లిష్టమే. ఫ్యూచర్లో వాళ్లు ఏం కావాలో మేం డిసైడ్ చేయలేదు. చదువులో ఇంకే విషయాల్లో వాళ్లకు ఇబ్బంది కాకుండా చూసుకున్నాం అంతే. ఎప్పుడు చదువుకుంటావ్‌రా...? పిల్లలిద్దర్నీ మెట్పల్లిలోనే చదివించాం. అనుదీప్ మొదట్నించీ క్లాస్ ఫస్టే. అట్లాగని 24 గంటలూ పుస్తకాలు పట్టుకుని కూర్చునే టైప్ కాదు. క్లాస్‌లో విన్నదే. గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. హోమ్‌వర్క్స్ కూడా స్కూల్లోనే చేసేసుకునేవాడు. ఇంటికొచ్చి స్నాక్స్ తిని, పాలు తాగి అలసిపోయేంతగా ఆడుకునేవాడు. ఇంటికొచ్చాక నేను కూడా పిల్లల వెంట పడేదాన్ని కాను చదువుకోమని. ఆడుకోమనే చెప్పేదాన్ని. పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మా పిల్లలు ఆటలతోనే షార్ప్ అయ్యారని అనుకుంటా. ఫిజికల్ యాక్టివిటీ కాన్సన్ట్రేషన్ను పెంచుతుంది కదా. బహుశా అనుదీప్‌ను అంత షార్ప్ చేసింది వాడు ఆడిన ఆటలేనేమో. వాడికి ఫుట్‌బాల్ అంటే ఇష్టం. పోటీల్లో పాల్గొన్నాడు కూడా. మా ఇంటి పక్కన ఓ టీచర్ ఉండేది. ఆవిడ అనుదీప్‌ను చూసి ‘ఒరేయ్ ఎప్పుడు చూసినా ఆడుతూనే కనిపిస్తావ్... చదువులో మాత్రం ఫస్ట్ ర్యాంక్ తప్పవ్. ఎప్పుడు చదువుకుంటావ్‌రా నువ్వసలు?’ అని అంటుండేది. నిజమే.. ఆవిడ అన్నట్టుగా ఆటలతో అలసిపోయేవాడు చదువులో మాత్రం ఫస్ట్ ఎప్పుడూ తప్పలేదు. టెన్త్‌లోనూ స్కూల్ టాప్. కార్పోరేట్ కాలేజ్‌వాళ్లు ఫ్రీగానే ఇంటర్లో సీట్ ఇచ్చారు. ఫస్టియర్‌లో చాలా బెరుగ్గానే ఉన్నాడు. ‘అమ్మా.. ఇక్కడ అందరూ చాలా ఫ్లుయెంట్ ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు. నాకేమో అంత ఫ్లుయెన్సీ లేదు. వాళ్ల లెవెల్‌కి రీచ్ అవుతానా?’ అని అనేవాడు. ‘ఏంకాదు నాన్నా... నలుగురితో మాట్లాడుతూ కలిసిపోతే భయం పోతుంది. భయంపోతే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈజీగా మాట్లాడేస్తావ్’ అని చెప్పేవాళ్లం. అన్నట్లుగానే త్వరగా ఆ ఫీలింగ్‌నీ ఓవర్‌కమ్ చేశాడు. ఎమ్సెట్లో స్టేట్ ఫార్టీఫిఫ్త్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఐఐటీకీ ప్రిపేర్ అయ్యాడు. చికెన్‌పాక్స్ రావడంతో ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయాడు. ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రూమెంటల్) బిట్స్ పిలానీలో చేశాడు. ఒరాకిల్‌లో జాబ్ వచ్చినప్పడు మాత్రం... అనుదీప్‌కి పుస్తకాలు చదవడం అలవాటు. నా క్వాలిఫికేషన్ ఇంటర్. కాని కథల పుస్తకాలు బాగా చదివేదాన్ని. అలా నా చిన్నప్పుడు చదివిన చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, చిన్నయసూరి నీతికథలు.. అన్నిటినీ రాత్రి పిల్లలకు చెప్పేదాన్ని. అట్లా బుక్‌రీడింగ్ మీద అనుదీప్‌కి ఇంట్రెస్ట్ పెరిగింది. ఇవ్వాళ సివిల్స్ సక్సెస్‌కు అదీ ఒక రీజన్ అనుకుంటాన్నేను. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే క్యాంపస్ సెలక్షన్లో ఒరాకిల్‌లో జాబ్ వచ్చింది. అప్పుడు మాత్రం అనుకున్నాం.. వీడు ఉద్యోగంలో చేరకుండా సివిల్స్‌కి ప్రిపేర్ అయితే బాగుండు అని. అట్లా అనుకున్నామో లేదో తెల్లవారే ఫోన్ చేశాడు. ‘అమ్మా.. జాబ్‌లో చేరను. సివిల్స్‌కి ప్రిపేర్ అవుతా’ అని. ‘నీ ఇష్టం నాన్నా...’ అన్నాం. ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడే ఢిల్లీలో సివిల్స్‌కి కోచింగ్ తీసుకున్నాడు. ఫస్ట్ ఎటెంప్ట్‌లో రాలేదు. సెకండ్ ఎటెంప్ట్‌కి ఐఆర్ఎస్లో వచ్చింది. మేం హ్యాపీగానే ఉన్నాం. కాని వాడికే శాటిస్ఫాక్షన్ లేకుండింది. మళ్లీ ప్రిపేర్ అయ్యాడు. థర్డ్ ఎటెంప్ట్‌లో రాలేదు. పోనీలే నాన్నా.. వదిలెయ్ అన్నా వినలేదు. ‘లేదమ్మా.. నా గోల్ అది’ అంటూ మళ్లీ ఫోర్త్ టైమ్ రాశాడు. అప్పుడూ రాలేదు. అయినా ఊరుకోలేదు. అయిదోసారి.. ఇట్లా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని మాకూ సర్ప్రైజే ఇచ్చాడు. సమస్యలు తెలుసు... వాళ్ల నాన్న ఇంజనీర్ కదా. మా ఇంటికెప్పుడూ రైతులు వçస్తుండేవారు పొలంలో కరెంట్ సమస్యలతోని. వాళ్లు వాళ్ల ప్రాబ్లమ్స్ మావారితో చెప్పుకుంటుంటే మావారు వాళ్లకు సలహాలిస్తుంటే అనుదీప్ వెళ్లి వాళ్ల నాన్న పక్కన కూర్చుని అన్నీ వినేవాడు. రైతులు వెళ్లిపోయాక తనకొచ్చిన డౌట్స్ అన్నీ వాళ్ల నాన్నను అడిగి తెలుసుకునేవాడు. అట్లా చిన్నప్పటినుంచే వాడికి రైతుల ప్రాబ్లమ్స్, ఊళ్లో పరిస్థితుల గురించి తెలుసు. అవన్నీ వాడికిప్పుడు హెల్ప్ అవుతాయనే అనుకుంటున్నా. అనుదీప్ చాలా సెన్సిటివ్. పెద్దవాళ్ల పట్ల చాలా గౌరవంగా ఉంటాడు. ఆడవాళ్లంటే కూడా చాలా రెస్పెక్ట్. ఎవరినీ నొప్పించడు. అయినా వాడి నుంచి నేను కోరుకునేది ఒకటే. వాడి లైఫ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫ్యూచర్లో ఇంకా మంచి పొజిషన్‌కు వెళ్లొచ్చు. ఎప్పుడు ఎక్కడ.. ఏ పొజిషన్లో ఉన్నా అందరినీ రెస్పెక్ట్ చేయాలి. ప్రాబ్లమ్స్‌తో తన దగ్గరకు వచ్చిన వాళ్ల పట్ల భేదభావం చూపొద్దు. డబ్బున్నవాళ్లపట్ల, లేని వాళ్ల పట్ల ఎలాంటి తారతమ్యాలు చూపొద్దు అని. ఇదే మాట చెప్తాను వాడికెప్పుడూ. నా పిల్లల మీద నాకు చాలా నమ్మకం. తోటివాళ్లకు సహాయపడేలా ఉంటారని. తొలి జీతంతో కానుక అనుదీప్ ఫోర్త్‌టైమ్ సివిల్స్ రాశాక మమ్మల్ని సర్ప్రైజ్ చేశాడు. నాకు, వాళ్ల నాన్నకు ఢిల్లీకి టికెట్స్ బుక్ చేశాడు. ఫోన్లో ఆ విషయం చెప్పేవరకు మాకు తెలీదు. ‘అమ్మా.. నీ కోసమే ప్లాన్‌చేశా ఇది. నువ్వెప్పుడూ ఇల్లూ పని అంటూ కదలనే కదలవు. అందుకే ఈ సర్ప్రైజ్’ అని చెప్పాడు. ఆగ్రా తీసుకెళ్లాడు. తాజ్‌మహల్ చూపించాడు. నిజానికి దానికన్నా కూడా సర్ప్రైజ్ గిఫ్ట్ వాడు ఐఏఎస్ కావడం. వాడి కలను నెరవేర్చుకోవడం. ఇందులో నేను వాడికి చేసిన హెల్ప్ ఏమీ లేదు. అమ్మలా కాకుండా ఓ ఫ్రెండ్‌లా ఉన్నా. అన్నీ షేర్ చేసుకుంటాడు. అనుదీప్‌లో నాకు బాగా నచ్చేది ఈగో లేకపోవడం. వాడు మంచి పెయింటర్ కూడా. ఐఆర్ఎస్గా జాయిన్ అయ్యాక వచ్చిన ఫస్ట్ శాలరీతో నాకు పట్టుచీర కొన్నాడు. సెల్ ఫోన్ కొనిచ్చాడు. ఇప్పుడు మేమెక్కడ కనపడినా అనుదీప్ వాళ్ల మదర్ కదా.. అని నాతో సెల్ఫీలు తీసుకుంటున్నారు చాలామంది. మదర్‌గా ఇంతకన్నా ప్రైడ్ ఏముంటుంది నాకు? – సరస్వతి రమ -
నాన్న మాటలే స్ఫూర్తి..
తెలంగాణ బిడ్డ ‘దురిశెట్టి అనుదీప్’ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో మొదటిర్యాంకు సాధించాడు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన అనుదీప్... ఇంజనీరింగ్ అనంతరంక్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో జాబ్ వచ్చినా సివిల్స్‌నే లక్ష్యంగా చేసుకుని శ్రమించాడు. ఆ శ్రమ ఏ స్థాయిలోఅంటే... ఒకసారి కాదు!! ఏకంగా ఐదు సార్లు సివిల్స్ రాశాడు. రెండు సార్లు మెయిన్స్ కూడాదాటలేకపోయాడు. అయితేనేం!! పట్టు వదలకుండా శ్రమించాడు. చివరకు ఐఆర్ఎస్ సాధించాడు.అయినా అంతటితో సంతృప్తి చెందలేదు. కస్టమ్స్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తూనే...మళ్లీ సివిల్స్ రాశాడు. ఐదో ప్రయత్నంలో... ఏకంగా ఆలిండియా నెంబర్–1 ర్యాంకును సొంతంచేసుకున్నాడు. ఈ విజయాన్ని ‘సాక్షి’తో పంచుకుంటూ అనుదీప్ ఏమన్నాడంటే... సాక్షి, హెదరాబాద్ : సివిల్ సర్వీసెస్ పరీక్ష 2017 ఫైనల్ ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్ సత్తాచాటారు. దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రతిభావంతులు పోటీ పడే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలను అక్టోబర్–నవంబర్ 2017ల్లో నిర్వహించింది. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి–ఏప్రిల్ 2018లో ఇంటర్వ్యూలు జరిగాయి. మొత్తం 990 పేర్లను ప్రతిష్టాత్మక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్‌తోపాటు ఇతర కేంద్ర సర్వీసులైన గ్రూప్ ఏ,గ్రూప్ బీలకు అభ్యర్థులను సిఫార్సు చేసింది. 990 మందిలో 476 జనరల్, 275 ఓబీసీ, 165 ఎస్సీ, 74 ఎస్టీలు ఉన్నారు. వీరిలో 750 మంది పురుషులు, 240 మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన వారిలో ఐఏఎస్‌కు 180 మందిని, ఐఎఫ్ఎస్కు 42 మందిని, ఐపీఎస్‌కు 150 మందిని, కేంద్ర సర్వీసులోని గ్రూప్–ఏకు 565 మందిని, గ్రూప్–బీ సర్వీసులో 121 మందిని నియమించనున్నట్టు యూపీఎస్సీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఖాళీలకు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపింది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సత్తాచాటారు. మాది జగిత్యాల జిల్లా మెట్పల్లి. నాన్న దురిశెట్టి మనోహర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్, అమ్మ జ్యోతి గృహిణి. నేను పదో తరగతి వరకు మెట్పల్లిలోనే చదివా. ఇంటర్ పూర్తయ్యాక ఎంసెట్ ఎంట్రన్స్‌లో రాష్ట్రస్థాయిలో 40వ ర్యాంకు వచ్చింది. ఆ తర్వాత రాజస్థాన్‌లో బిట్స్పిలానీలో చేరి ఇంజినీరింగ్ పూర్తి చేశా. ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలోనే క్యాంపస్ సెలక్షన్స్‌లో ఒరాకిల్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యా. కానీ అందులో చేరలేదు. నాన్న లక్ష్యం మేరకు సివిల్స్ సాధించాలన్న లక్ష్యం పెట్టుకుని దానికోసమే శ్రమించాను. ఫైనల్ ఇయర్లోనే నా ఇంజనీరింగ్ 2011లో పూర్తయింది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లోనే సివిల్స్‌కు సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకున్నాను. కాబట్టే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఒరాకిల్‌లో ఆఫర్ వచ్చినా వద్దనుకుని ఢిల్లీ వెళ్లా. మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు వస్తుందనుకున్నా. కానీ రాలేదు. దీంతో ఉద్యోగం చేయాలని గూగుల్‌లో చేరా. జాబ్ చేస్తూనే ఒకవైపు గూగుల్‌లో ఉద్యోగం చేస్తూ సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించా. వారాంతాల్లో, సాయంత్రం సమయంలో ఎప్పుడు వీలు చిక్కినా చదివేవాడిని. రెండో ప్రయత్నంలో 2013లో 790వ ర్యాంకు వచ్చింది. దీంతో ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్) వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జీఎస్టీ, కస్టమ్స్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నా. ఆప్షనల్ ఆంత్రోపాలజీ మనుషులు, వాళ్ల ప్రవర్తన, సమాజం తదితరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం.. ఆంత్రోపాలజీ. మన గురించి మనం చదువుకోవడం ఎప్పుడూ ఆసక్తే. అందుకే ‘ఆంత్రోపాలజీ’ని ఆప్షనల్‌గా ఎంచుకున్నా. దీన్ని ఎంతో ఆసక్తిగా అధ్యయనం చేయటం కలిసొచ్చింది. ఐఏఎస్ లక్ష్యం.. వరస వైఫల్యాలు ఐఆర్ఎస్కు ఎంపికైనా ఐఏఎస్ సాధించాలనే కసి ఉండేది. ఐఆర్ఎస్ బాధ్యతలు చూస్తూనే సివిల్స్‌కు సీరియస్‌గా చదివా. కానీ వరసగా మూడు, నాలుగో ప్రయత్నాల్లో వైఫల్యాలే ఎదురయ్యాయి. రెండుసార్లు మెయిన్స్ దాటలేకపోయాను. ఈసారి అయిదో ప్రయత్నంలో మొదటి ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉంది. నాన్న ఇచ్చిన స్ఫూర్తి ఈ విజయానికి ప్రధాన కారణం. అంతా సొంత ప్రిపరేషనే... మొదట ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నా. తర్వాత సొంతంగా ప్రిపేరయ్యాను. మార్కెట్లో దొరికే ప్రామాణిక పుస్తకాలనే చదివాను. ఢిల్లీలో కోచింగ్ తీసుకున్న మెటీరియల్‌నే పునశ్చరణ చేశాను. ప్రస్తుత పోటీ నేపథ్యంలో మొదట్నుంచి ఒక ప్రణాళిక ప్రకారం చదివితేనే మంచి ఫలితం వస్తుంది. సివిల్స్ ఔత్సాహికులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలో అధిక శాతం ప్రశ్నలు నా ప్రొఫైల్ నుంచే వచ్చాయి. మీరు సివిల్స్ వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు? వంటి ప్రశ్నలే వేశారు. ఇంటర్వ్యూ ఎంత బాగా చేసినా, ప్రస్తుత పోటీలో ఫలితాన్ని ముందే ఊహించడం కష్టం. మొదట్నుంచి ఫలితం గురించి ఆలోచించకుండా చదివాను. చివరకు ఏకంగా మొదటి ర్యాంకు రావడం ఎంతో ఆనందం కలిగిస్తోంది. విద్య, ఆరోగ్యం: యువ రాష్ట్రమైన, ఎంతో అభివృద్ధికి అవకాశమున్న తెలంగాణకు ఐఏఎస్‌గా సేవచేసే అవకాశం వస్తే నిజంగా అదృష్టమే. సివిల్స్ ఫస్ట్ ర్యాంకు నాకు పెద్ద బాధ్యతను తీసుకొచ్చింది. నా శాయశక్తులా సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తా. ఎక్కడైనా పనిచేయడానికి రెడీనే. ప్రస్తుతం విద్య, ఆరోగ్యం..నాప్రాధమ్యాలు. ప్రొఫైల్ పదో తరగతి మార్కులు: 86 శాతం ఇంటర్ మార్కులు: 97 శాతం ఇంజనీరింగ్ మార్కులు: 76 శాతం తెలుగు తేజాలు 1 దురిశెట్టి అనుదీప్ 43 శీలం సాయి తేజ 100 నారపు రెడ్డి మౌర్య 144 జి/.మాధురి 196 సాయి ప్రణీత్ 206 నాగవెంకట మణికంఠ 245 వాసి చందీష్ 374 రిషికేశ్రెడి 512 ప్రవీణ్‌చంద్ 513 ప్రసన్నకుమారి 607 కృష్ణకాంత్ పటేల్ 624 వై.అక్షయ్ కుమార్ 816 భార్గవ్ శేఖర్ 884 వంశీ దిలీప్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2017కు ఫిబ్రవరి 22, 2017న యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్తో పాటు మొత్తం 24 కేంద్ర సర్వీసుల్లో నియామకాలకు మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ చేపట్టింది. జూన్18, 2017న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. సివిల్స్ టాపర్లను అభినందించిన వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అఖిల భారత సివిల్ సర్వీస్ పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన దురిశెట్టి అనుదీప్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్ పరీక్షల్లో ర్యాంకులు పొందిన ఉభయ రాష్ట్రాల తెలుగు అభ్యర్థులందరినీ అభినందిçస్తూ... వారి కృషికి ఫలితం దక్కిందని ప్రశంసించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. -
కొనుగోలు కేంద్రాన్ని అడ్డుకోవడం సరికాదు..
సారంగాపూర్(జగిత్యాల) : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అటవీశాఖ అడ్డుకోవడం సరికాదని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం బీర్పూర్ మండలం చెర్లపల్లిలో స్థానిక విండో ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు గురువారం బీర్పూర్ వెళ్లారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన భూమి తమదని..కేంద్రాన్ని ఎత్తివేయాలని అటవీశాఖ తొలగించాలని రేంజర్ ఉత్తంరావు సూచించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అధికారులతో చర్చించారు. భూమిపై అటవీ, రెవన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి.. తేల్చాలని సూచించారు. ఉమ్మడి సర్వే కోసం కలెక్టర్‌ను కోరుతానని.. ప్రస్తుతం అభ్యంతరం చెప్పడం సరికాదని ఎమ్మెల్యే అనడంతో అటవీశాఖ అధికారులు వెనక్కు తగ్గారు. సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో ఐకేపీ, సింగిల్‌విండోల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. లచ్చక్కపేట, రంగపేట, సారంగాపూర్, రేచపల్లి, బీర్పూర్, కొల్వాయి, మంగేళ, చెర్లపల్లి గ్రామాల్లోనూ ప్రారంభించారు. ఎంపీపీ కొల్ముల శారద, జెడ్పీటీసీ భూక్య సరళ, సింగిల్‌విండో చైర్మన్ ముప్పాల రాంచందర్‌రావు, తహసీల్దార్ వసంత, రాజేందర్, ఎంపీడీవో పుల్లయ్య, వైస్‌ఎంపీపీ కోండ్ర రాంచంద్రారెడ్డి, విండో చైర్మన్లు ముప్పాల రాంచందర్‌రావు, సాగి సత్యంరావు, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఇబ్రహీం, ఐకేపీ ఏపీఎం గంగాధర్, సర్పంచులు పాల్గొన్నారు. Congress MLA Jeevan Reddy -
స్నేహితుడి చెల్లెలినే చెరబట్టారు!
-
ఒగ్గు కథ
-
ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, మల్యాల: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని మల్యాల మండలం నూకపల్లిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామ శివారులోని వరద కాలువ వంతెనపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. జగిత్యాల నుంచి కరీంనగర్‌కు ఆపిల్ లోడ్‌తో వెళ్తున్న లారీ రోడ్డు పై ఉన్న భారీ గుంతను తప్పించే క్రమంలో.. ఎదురుగా గ్రానైట్ లోడుతో వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు లారీలు నుజ్జు నుజ్జు కాగా.. గ్రానైట్ లారీ డ్రైవర్‌తో పాటు అతని పక్కనే ఉన్న అతని తమ్ముడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు గుజరాత్ పోరుబందర్‌కు చెందిన జెముదా బాయి, కారా బాయిలుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కలర్‌పుల్ ప్యాకింగ్‌తో కల్తీ దందా
-
జగిత్యాలలో ఘోరం... నలుగురు మృతి
-
జగిత్యాల జిల్లా సమగ్ర స్వరూపం
అధికారులు కలెక్టర్: శరత్ ఎస్పీ: అనంతశర్మ మండలాలు: 18 జగిత్యాల, జగిత్యాల రూరల్, రాయికల్, సారంగాపూర్, బీర్పూర్, ధర్మపురి, బుగ్గారం, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూర్, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కథలాపూర్ జిల్లా విస్తీర్ణం: 3,043.023 చదరపు కిలోమీటర్లు డివిజన్లు: 2 (జగిత్యాల, మెట్పల్లి) గ్రామ పంచాయతీలు : 328 మున్సిపాలిటీలు: 3 (జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి) పరిశ్రమలు: ముత్యంపేటలో షుగర్ ఫ్యాక్టరీ (ప్రస్తుతం ఇది మూతపడింది) ఇరిగేషన్: ఎస్సారెస్పీ కాకతీయ కాలువ. ఎమ్మెల్యేలు: జీవన్‌రెడ్డి (జగిత్యాల), కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), విద్యాసాగర్‌రావు (కోరుట్ల), చెన్నమనేని రమేశ్ (వేములవాడ–రెండు మండలాలు), బొడిగె శోభ (చొప్పదండి–రెండు మండలాలు) ఎంపీలు: కల్వకుంట్ల కవిత (నిజామాబాద్), బాల్కసుమన్ (పెద్దపల్లి), వినోద్ (కరీంనగర్) పర్యాటకం: ప్రముఖ ఆలయాలైన కొండగట్టు, ధర్మపురి, కోరుట్ల సాయిబాబా ఆలయం, బండలింగాపూర్లోని గండి హనుమాన్ ఆలయం. వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల. కోరుట్ల మండలం నాగులపేటలో కాకతీయ కాల్వపై సైఫన్. జాతీయ రహదారులు: నిజామాబాద్–జగ్దల్పూర్ రైల్వేలైన్: కాగజ్‌నగర్–జగిత్యాల హైదరాబాద్ నుంచి దూరం: 200 కిలోమీటర్లు