జగిత్యాల, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉదయం రోడ్డు మార్గంలో గట్టుకు చేరుకున్న ఆయనకు.. ఆలయ పూజారులు సాదరంగా స్వాగతం పలికారు.
పవన్‌కు కొండగట్టు ఆలయం మొదటి నుంచి ఒక సెంటిమెంట్‌గా ఉంది. ఎన్నికల ప్రచారానికి ముందు కూడా ఆయన ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంతకు ముందు తుర్కపల్లి దగ్గర బీజేపీ-జనసేన శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయి. ఆ సమయంలో కారుపైకి అభివాదం చేసిన ఆయన.. తెలంగాణలో రెండు పార్టీల పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment