Kondagattu Temple
-
కొండగట్టుకు పవన్ కళ్యాణ్
-
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు
జగిత్యాల, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉదయం రోడ్డు మార్గంలో గట్టుకు చేరుకున్న ఆయనకు.. ఆలయ పూజారులు సాదరంగా స్వాగతం పలికారు. పవన్‌కు కొండగట్టు ఆలయం మొదటి నుంచి ఒక సెంటిమెంట్‌గా ఉంది. ఎన్నికల ప్రచారానికి ముందు కూడా ఆయన ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అంతకు ముందు తుర్కపల్లి దగ్గర బీజేపీ-జనసేన శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయి. ఆ సమయంలో కారుపైకి అభివాదం చేసిన ఆయన.. తెలంగాణలో రెండు పార్టీల పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
భక్తజన సంద్రంగా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి (ఫొటోలు)
-
భక్తజన సంద్రంగా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి (ఫొటోలు)
-
కొండగట్టులో ‘బలగం’ వేణు ప్రత్యేక పూజలు
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘బలగం’. కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది. ఒకవైపు ప్రముఖ ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ థియేటర్స్‌లోనూ మంచి కలెక్షన్స్‌ని రాబడుతోంది. ఇక తన తొలి చిత్రం సూపర్ హిట్ కొట్టడంతో వేణు యెల్డండి ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఇన్నాళ్లు వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న వేణు..తాజాగా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాడు. ఫ్యామిలీతో కొండగట్టు వెళ్లిన వేణు.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘కొండగట్టు అంజన్న ఆశీర్వాదంతో బలగం సినిమా మొదలు పెట్టాను..అంజన్న దయతో బలగం మీ అందరిని మెప్పించింది..అంజన్న దర్శనం అద్భుతంగా జరిగింది’అని వేణు రాసుకొచ్చాడు. ఇక బలగం విషయానికొస్తే.. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. కొండగట్టు అంజన్న ఆశీర్వాదంతో బలగం సినిమా మొదలు పెట్టాను..అంజన్న దయతో బలగం మీ అందరిని మెప్పించింది..అంజన్న దర్శనం అద్భుతంగా జరిగింది ..🙏#balagam #kondagattu #hanuman #venuyeldandi #venutillu #devotional @dilrajuprodctns pic.twitter.com/FDGUsw06jn — Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) March 29, 2023 -
కొండగట్టు చోరీ కేసు: ఛేదనలో పోలీస్ డాగ్ ప్రధాన పాత్ర
సాక్షి, కరీంనగర్: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో చోరీచేసింది కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాకు చెందిన దొంగలని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు పాల్గొన్నారని గుర్తించారు. అందులో ముగ్గురిని అరెస్ట్ చేసి, వారినుంచి 5 కేజీల వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మిగతావారి కోసం మూడు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ మేరకు జగిత్యాల ఎస్పీ భాస్కర్ కొండగట్టు చోరీ, నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించారు. దొంగల ముఠా కర్ణాటక నుంచి కొండగట్టుకు మోటార్ సైకిళ్లపై ఫిబ్రవరి 2న రాత్రి చేరుకుంది భక్తుల మాదిరిగా తెలుపు, కాషాయ వస్త్రాలు ధరించి అదేరోజు రాత్రి అంజన్నను దర్శించుకుంది. మరుసటిరోజు (ఫిబ్రవరి 23)న మరోసారి స్వామివారిని దర్శించుకుంది. ఈ సమయంలోనే పరిసరాలపై రెక్కీ నిర్వహించింది. అదేరోజు అర్ధ రాత్రి(శుక్రవారం వేకువజామున) దాటాక ఆలయం వెనకాల అటవీ ప్రాంతం నుంచి ఆలయంలోకి ప్రవేశించింది. స్వామివారిపై ఉన్న మకర తోరణం, కిరీటం, ఆలయంలోని రెండు శఠగోపాలు, ఒకవెండి గొడుగు, రామరక్ష. ద్వారాలకు ఉన్న కవచ ముఖాలు దొంగిలించింది. ఆ తర్వాత మళ్లీ మోటార్ సైకిళ్లపైనే కర్ణాటకకు బయలుదేరి వెళ్లింది. దాదాపు రూ.3 లక్షల విలువైన 15 కేజీల వెండి అభరణాలు చోరీకి గురైనట్టు పూజారులు మల్యాల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇటీవల కొండగట్టు ఆలయానికి సీఎం కేసీఆర్ వచ్చి వెళ్ళిన తరవాత దొంగతనం జరగడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. జగిత్యాల ఎస్పీ భాస్కర్.. డీఎస్పీ ప్రకాశ్ ఆధ్వర్యంలో 10 పోలీసు బృందాలను నియమించారు.దొంగలను పట్టుకునేందుకు గాలింపులు తీవ్రతరం చేశారు. అంతకుముందే ఫింగర్ ప్రింట్, డాగ్ స్క్వాడ్ ఆధునిక శాస్త్ర, సాంకేతిక సాయంతో 24 గంటల్లోనే దొంగలపై అవగాహనకు వచ్చారు. కర్ణాటకకు చెందిన దొంగల ముఠా పనేనంటూ, వారిని పట్టుకునేందుకు ఆ రాష్ట్రంలో గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏడుగురు నిందితుల్లో ఎ-1 బాలాజీ కేశవ రాథోడ్, ఎ-5 నర్సింగ్ జాదవ్ ఏ-7 విజయ్ కుమార్ రాథోడ్ ను అదుపులోకి తీసుకున్నారు.. వారినుంచి 3.50 లక్షల విలువైన 5 కిలోల వెండి ఆభరణాలు (వెండి శఠగోపం, ఒకవెండి గొడుగు. ఒకవెండి పెద్ద రామరక్ష, రెండు ద్వారాలకు గల కవచం ముఖాలు, మోటార్ సైకిల్, రెండు సెల్ ఫోన్ల)ను స్వాధీనం చేసుకున్నారు. ఎ-2 రామరావు జాదవ్, ఎ-3 రాంశెట్టి జాదవ్, ఎ-4 విక్రమ్ జాదవ్, ఎ-6 దేవిదాస్ జాదవ్ ఆచూకీ కోసం మూడు. పోలీసు బృందాలు కర్ణాటక రాష్ట్రంలో గాలింపు చేస్తున్నాయి.. పోలీస్ డాగ్ది ప్రధాన పాత్ర కొండగట్టు దొంగల పట్టుకోవడంలో పోలీసు డాగ్ పాత్ర ప్రధానం అని చెప్పాలి.. దొంగలు కొండగట్టు ఆలయానికి భక్తుల్లాగా వచ్చి రెక్కీ నిర్వహించారు.. బస్టాండ్ ప్రాంతం నుంచి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని చుట్టుపక్కల కలియ తిరిగారు. గుడిలోకి ఏవి ధంగా ప్రవేశించవచ్చనే విషయమై క్షుణ్నంగా పరిశీలించారు. ఆలయానికి వచ్చేది.. వెళ్లేది.. రెక్కీ నిర్వహించే దృశ్యాలన్ని సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. వాటన్నింటిని పోలీసులు సేకరించారు. దొంగలు చోరీ చేసిన అనంతరం ఆలయం వెనకవైపు వెళ్లి మద్యం సేవించారు.. పోలీసు జాగిలం ఆలయం నుంచి వెనకవైపు పడేసిన ఖాళీ బీరు సీసాల వరకూ వెళ్లి గుర్తించింది.. పోలీసులు వాటిపై వెలిముద్రలను సేకరించారు. వాటి ఆధారంగా ఆధార్ కార్డును గుర్తించేసరికి అసలు నిందితుల ఆచూకీ దొరికింది. వెంటనే కర్ణాటక రాష్ట్రం బీదర్ వెళ్లి ఏడుగు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకు పట్టుకొచ్చారు. ఆలయంలో చోరీ చేసిన నిందితులు కేవలం వెండి వస్తువులు, ఆభరణాలు మినహా బంగారం, ఇతర వస్తువులు ముట్టుకోలేదు.. నిందితులు అంతా రక్త సంబంధీకులు కావడం మరో చెప్పుకోదగ్గ విషయం. ఏడుగురూ రక్త సంబంధీకులే కొండగట్టు చోరీ చేసిన ఏడుగురు రక్త సంబంధీకులు కావడం చెప్పుకోదగ్గ విషయం. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా ఔరద్ తాలుకా హులియట్ తండాకు చెందిన బాలాజీ కేశవ రాథోడ్, రామరావు జాదవ్, రాంశెట్టి జాదవ్, విక్రమ్ జాదవ్, నర్సింగ్ జాదవ్, దేవిదాస్ జాదవ్, విజయ్ కుమార్ రాథోడ్ ఒకే. ప్రాంతానికి చెందిన రక్తసంబంధీకులు. వీరు ముఠాగా ఏర్పడి ఆలయాల్లో దొంగతనాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఇప్పటికే మహారాష్ట్రలోని పండరీపురం, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని చాముం డేశ్వరి తదితర ఆలయాల్లో చోరీచేశారు.. కొండగట్టు ఆలయంలో జరిగిన చోరీలోనూ వీరు పాల్గొన్నారు. ఇందులో తండ్రీకొడుకులు కూడా ఉండటం గమనార్హం. 24 గంటల్లోనే దొంగలను గుర్తించిన పోలీసులు కొండగట్టు చోరీ కేసును చాలెంజ్‌గా తీసుకుని, 24 గంటల్లోనే దొంగలను గుర్తించి, నాలుగైదు రోజుల్లోనే ముగ్గురు నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ భాస్కర్ అభినందించారు. ఆపరేషన్ లో పాల్గొన్న 27 మంది పోలీసులకు ప్రభుత్వం తరఫున రివార్డులు అందించనున్నట్లు చెప్పారు. -
కొండగట్టు ఆలయంలో చోరీ.. దొంగలు ఎవరంటే?
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో ప్రముఖ ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. కాగా, చోరీ కేసును పోలీసులు చేధించారు. ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. సదరు దొంగను కర్నాటకలోని బీదర్‌లో పట్టుకున్నారు. వీరంతా మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ సమీపంలోని ఓ తండాకు చెందిన గ్యాంగ్‌గా గుర్తించారు. వివరాల ప్రకారం.. కొండగట్టు ఆలయంలో గత శుక్రవారం దొంగతనం జరిగింది. తొమ్మిది లక్షల విలువైన మకర తోరణం శఠగోపాలు, వెండి తొడుగు, వెండి వస్తువులు మొత్తం 15 కిలోల వెండి అపహరించారు. కాగా, ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. చోరీ కోసం దొంగలు.. శుక్రవారం అర్ధరాత్రి 1.20 గంటలకు ఆలయం వెనుక నుంచి గుడిలోకి వెళ్లి దొంగతనం చేసి.. ఆ తర్వాత వెనుక వైపు నుంచి గుట్ట కిందకు దిగి వెళ్లిపోయినట్టు గుర్తించారు. అనంతరం, మెయిన్‌రోడ్డుకు వెళ్లి బైకులపై కోరుట్ల, మెట్పల్లి మీదుగా కామారెడ్డి, నారాయణ్ ఖేడ్ నుండి బీదర్ వెళ్లినట్టు పోలీసులు ట్రాక్ చేశారు. ఇక, ఈ దొంగతనానికి ఎనిమిది ఉన్న ఓ గ్యాంగ్ ప్లాన్ చేసినట్టు గుర్తించారు. ప్రస్తుతానికి వారి వద్ద నుంచి 60 శాతం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆభరణాలు మొత్తం రికవరీ అయ్యాక ఈ ఘటన గురించి పోలీసులు వివరాలు తెలిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
కొండగట్టు ఆలయ ఆభరణాల చోరీ కేసులో ముందడగు
-
జగిత్యాల : కొండగట్టు ఆలయంలో చోరీ
-
కొండగట్టు ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ సర్కార్
-
కొండగట్టు ఆలయ అభివృద్ధి సీఎం కేసీఆర్ సమీక్ష
-
కొండగట్టు అంజన్న ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు
-
ప్రపంచాన్ని ఆకర్షించేలా కొండగట్టును తీర్చిదిద్దాలి: సీఎం కేసీఆర్
►సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన ముగిసింది. కొండగట్టు నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు బయల్దేరారు. ► కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అనంతరం విహంగ వీక్షణం ద్వారా ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు. 100 కోట్లతో చేపట్టబోయే ఆలయ పునర్నిర్మాణం ప్రతిపాదనలు పనులు, వసతులపై అధికారులతో రెండు గంటలకు పైగా సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు వినిపించాలని అన్నారు. ►దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టులో జరగాలని.. భక్తుల హనుమాన్ దీక్షాధారణ, విరమణ చేసే సమయంలో ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. హనుమాన్ దీక్ష దివ్యంగా, గొప్పగా జరిగేలా చూడాలని తెలిపారు. ►ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి బృహత్తర ప్రాజెక్ట్ అని.. భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని తెలిపారు. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ధి చేయాలన్నారు. ►‘సుమారు 850 ఎకరాలలో ఆలయ అభివృద్ధి , విస్తరణ పనులు చేయాలి. పెద్ద వాల్, పార్కింగ్, పుష్కరిణీ, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరు, పుష్కరిణీ నీ అభివృద్ధి చేయాలి. 86 ఎకరాలలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలి. వసతులు గొప్పగా ఉంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారు. మళ్ళీ కొండగట్టు వస్తా.. ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష నిర్వహిస్తాను’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. ► కొండగట్టు ఆలయం వద్ద సీఎం కేసీఆర్‌కు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రులు, ప్రజాప్రతినిథులు, అధికారులతో కలిసి కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించారు. ► ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కఅంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు దేవాలయానికి బయల్దేరారు. ప్రగతిభవన్ నుంచి బేగంపేటకు చేరుకున్న ముఖ్యమంత్రి.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కొండగట్టు అంజన్న క్షేత్రానికి పయనమయ్యారు. కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకొని అక్కడి నుంచి ఆలయానికి వెళ్లనున్నారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించనున్నారు. తరువాత జేఎన్టీయూ వెళ్లి.. అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు-చేర్పులపై సమాలోచనలు జరుపుతారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టే అభివృద్ధి పనులపై ఓ నిర్ణయానికి రానున్నారు. కాగా కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో 14న సాయంత్రం 4 గంటల నుంచి 15న మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఆలయానికి గత వారమే రూ.100 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే -
ఇవాళ కొండగట్టుకు సీఎం కేసీఆర్
-
కొండగట్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్/కొండగట్టు (చొప్పదండి): ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు బుధవారం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించనున్నారు. దేవస్థానాన్ని రూ. 100 కోట్ల వ్యయంతో అభివృద్ధి్ధ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక అభివద్ధి నిధి కింద గత వారమే ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఈ నిధులతో ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న అంశంపై ప్రత్యక్షంగా దేవాలయ ప్రాంతాన్ని పరిశీలించడంతోపాటు ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం మంగళవారం ఆయన ఆలయ సందర్శనకు వెళ్లాల్సి ఉన్నా ఆ రోజు భక్తులు అధిక సంఖ్యలో ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి వస్తారని... తన పర్యటన వల్ల భక్తులకు ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో సీఎం ఆలయ సందర్శనను ఒకరోజు వాయిదా వేసుకున్నట్లు సమాచారం. యాదాద్రి ఆలయ అభివృద్ధి్ధ తరహాలోనే కొండగట్టును అభివృద్ధి చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. యాదాద్రి దేవస్థాన పునర్నిర్మాణానికి ఆర్కిటెక్ట్‌గా వ్యవహరించిన ఆనంద్‌సాయికి ఈ దేవాలయ అభివృద్ధి నమూనాల రూపకల్పన, వాటి అమలును పర్యవేక్షించే బాధ్యత అప్పగించనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి వెంట ఆనందసాయి కూడా వెళ్లనున్నట్లు తెలిసింది. దేవాలయంలో భక్తులకు వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై సీఎం దృష్టిసారించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు చెందిన మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ యాస్మిన్ బాషా, ఎస్పీ భాస్కర్ సోమవారం కొండగట్టును సందర్శించారు. సీఎం పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో 14న సాయంత్రం 4 గంటల నుంచి 15న మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
ఈనెల 14న కొండగట్టుకు సీఎం కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 14న జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యాదాద్రి ఆలయ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి ఆదివారం కొండగట్టుకు వెళ్లనున్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించిననున్నారు ఆనంద్ సాయి. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను జగిత్యాల ఎస్పీ భాస్కర్ పరిశీలించారు. కాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. దేవాలయ అభివృద్ధికోసం ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్) కింద ఈ నిధులను మంజూరు చేస్తూ ప్రణాళికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె, రామకృష్ణా రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆలయ అభివృద్ధికి రూ.వంద కోట్లు విడుదల చేస్తామని గత డిసెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వగా.. ఈ మేరకు నిధులు విడుదల చేశారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ కేసు: మరోసారి తెరమీదకు ఎమ్మెల్సీ కవిత పేరు -
రాజన్నకు 50, అంజన్నకు 100 కోట్ల రూపాయల నిధుల విడుదల
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది. దేవాలయ అభివృద్ధికోసం ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్) కింద ఈ నిధులను మంజూరు చేస్తూ ప్రణాళికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె, రామకృష్ణా రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఉన్న కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయానికి రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల భక్తులూ అధికసంఖ్యలో వస్తుంటారు. ఆలయ అభివృద్ధికి రూ.వంద కోట్లు విడుదల చేస్తామని గత డిసెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఈ నిధులను వెచ్చించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న ఆలయాలకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యం దక్కినట్లయ్యింది. మొన్న రాజన్న ఆలయానికి రూ.50 కోట్లు కేటాయించిన సర్కారు.. తాజాగా కొండగట్టుకు రూ.100 కోట్లు ప్రకటించింది. దీంతో ఆలయాల అభివృద్ధికి ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న ఘడియలు వచ్చినట్లయ్యింది. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించిన సీఎం గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి అశేష భక్తజనం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. pic.twitter.com/spGZ3N4NUb — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 8, 2023 ఎములాడ జంక్షన్ల సుందరీకరణ.. రాజన్న గుడి అభివృద్ధిపై సీఎం కేసీఆర్ 18 జూన్ 2015న స్వయంగా గుడి, పట్టణం కలియ తిరిగారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, ఇందుకు ఏటా రూ.100 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామని ప్రకటించారు. ముందుగా రూ.71 కోట్లు మంజూరు చేశారు. అనంతరం వీటీడీఏ ఏర్పాటు చేసి కమిటీనీ ప్రకటించారు. చైర్మన్‌గా సీఎం కేసీఆర్, వైస్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పురుషోత్తంరెడ్డిని నియమించారు. నిధులను వీటీడీఏ ద్వారానే ఖర్చు చేయాలని జీవో విడుదల చేశారు. వేములవాడ రాజన్న ఆలయం ఆ మేరకు ఆలయ అధికారులు రూ.410 కోట్లతో భక్తుల సౌకర్యాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. గతేడాది, ఈసారి బడ్జెట్లో రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు. తాజా నిధులతో బద్దిపోచమ్మ గుడి వద్ద సేకరించిన భూమికి ప్రహరీ, బోనాల మంటపం నిర్మిస్తామని వీటీడీఏ వైస్ చైర్మన్ వెల్లడించారు. నగరమంతా ఫుట్‌పాత్‌ల నిర్మాణం, గుడి ట్యాంక్‌బండ్‌పై వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ పనులు చేపడతామని, నందికమాన్ నుంచి వేములవాడకు చేరుకునే రోడ్డు సుందరీకరణ, జంక్షన్లు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గోదావరినదిలో పడవల పోటీ(ఫైల్) కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక కాళేశ్వరం.. దాని అనుబంధ ప్రాజెక్టుల వద్ద పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ పేరిట బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయించింది. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, గోదావరిఖని వంతెన, కోటిలింగాల బ్యాక్ వాటర్, లోయర్, మధ్య, ఎగువ మానేరు డ్యామ్‌ల వద్ద పర్యాటక అభివృద్ధికి ఈ నిధులు వెచ్చించనున్నారు. అయితే ఉమ్మడి జిల్లాను పర్యాటక క్షేత్రంగా మలచాలన్న ప్రభుత్వ లక్ష్యం ఎప్పటిలోగా నెరవేరుతుందోనన్న విషయం ఆసక్తికరంగా మారింది. కొండగట్టు కొండగట్టుకు మాస్టర్‌ప్లాన్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి బడ్జెట్లో రూ.100 కోట్లు మంజూరు చేశారు. గత డిసెంబరు 7న జగిత్యాల సభలో స్వామివారికి రూ.100 కోట్లు ఇస్తామన్న సీఎం.. సరిగ్గా 50 రోజులకు తన మాట నిలబెట్టుకున్నారు. రానున్న 50 ఏళ్లలో భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాల్సి ఉందని, ప్రత్యేక ప్రణాళికతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. నాంపల్లి గుట్ట నాంపల్లి గుట్టకు రోప్‌వే వేములవాడను తీర్చిదిద్దే క్రమంలో మంత్రి కేటీఆర్ సూచనల మేరకు నాంపల్లిగుట్టపై రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం జరగనుంది. వేములవాడకు వచ్చే కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వేట్రాక్ నాంపల్లి గుట్టను ఆనుకుంటూ వెళ్లనుంది. దీంతో హైదరాబాద్, మేడ్చల్, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నుంచి వచ్చే భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా ఇక్కడి పరిసరాలను తీర్చిదిద్దనున్నారు. ఈ పనులపై కేటీఆర్ ఇప్పటికే సమీక్షించారు కూడా. -
వాయుపుత్ర.. వాహనమిత్ర..!.. కేసీఆర్, పవన్ నోట కొండగట్టు
సాక్షి, కరీంనగర్: ఆంజనేయుడు అంటేనే అభయం. వజ్రకాయుడి పేరు పలికితే తెలియని మనోబలం. ధైర్యానికి, స్థైర్యానికి, విశ్వాసానికి మారుపేరు హనుమంతుడు. ఉమ్మడి జిల్లాలో కొండగట్టుపై వెలసిన పవనసుతుడి గొప్పతనం తెలియనివారుండరు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉమ్మడి జిల్లావాసులకు దాదాపు కులదైవం. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి నుంచి ప్రతీ ఇంట ఆంజనేయుడి పేరును ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పెట్టుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఏ వాహనం కొన్నా మారుతి పాదాల చెంత తొలిపూజ చేసిన తరువాతే రంగంలోకి దింపుతారు. ఉమ్మడి జిల్లాలోని కొండగట్టు ఆ తరువాత మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి, వేములవాడ మండలం అగ్రహారంలోని అంజన్న ఆలయాలు వాహనపూజలకు ప్రసిద్ధి చెందినవి. ఆయా ఆలయాల విశిష్టతపై సండే స్పెషల్.. చిన్న కొండగట్టు గట్టుదుద్దెనపల్లి చిన్నకొండగట్టుగా పేరొందిన మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి ఆంజనేయస్వామి ఆలయం కూడా రోజురోజుకి ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. గట్టుదుద్దెనపల్లిలో ఆంజనేయుడి ప్రాచీన విగ్రహాన్ని పెద్ద బండరాయిపై చెక్కారు. అది కాలావధులపై సమాచారం లేదు. 1982 నుంచి గ్రామస్తులు ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం సగటున రోజుకు 200కుపైగా వాహనాలు ఇక్కడ పూజలు అందుకుంటాయి. దళితబంధులో మంజూరైన 1,285 వాహనాలకు ఇక్కడే పూజలు చేయించారు. 700 ఏళ్ల చరిత్ర.. కొండగట్టు దేశంలోని అత్యంత ప్రాచీన ఆలయాల్లో ఒకటి. ఇక్కడి స్వామివారిని దాదాపుగా 700 ఏళ్లుగా కొలుస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. కొండగట్టు మీద వాహన పూజల సంప్రదాయం అనాదిగా వ స్తోంది. ఒకప్పుడు రాజులు, సంస్థానాధీశులు, జ మీందారుల రథాలు, రైతుల ఎండ్లబండ్లకు పూజ లు జరిగేవి. ప్రస్తుతం కొండగట్టుకుపై నెలకు 5000 కుపైగా వాహనాలు పూజకు వస్తాయి. సగటున రోజుకు 170 వాహనాలు ఇక్కడ పూజలందుకుంటాయి. మన రాష్ట్రమే కాదు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తమ కొత్త వాహనాలకు పూజలు చేయిస్తుంటారు. అగ్రహారంలో.. వేములవాడ మండలంలోని అగ్రహరం శ్రీ జోడాంజనేయస్వామి ఆలయంలోనూ వాహనపూజలు చేస్తుంటారు. మంగళవారం, శనివారం నాడు ఎక్కు వ సంఖ్యలో వాహనపూజలు నిర్వహిస్తారు. మిగి తా రోజుల్లోనూ పదులసంఖ్యలో వస్తుంటాయి. దసరాకు రద్దీగా.. ఈ మూడు ఆలయాల్లోనూ దసరా రోజు పూజ చేయించేందుకు వేలాది వాహనాలు వరుస కడతాయి. దసరారోజు ఈ ఆలయాల వద్ద పూజలు చేయిస్తే.. మంచి జరుగుతుందన్న విశ్వాసంతో ఆ రోజున పాత వాహనాలకు సైతం ఇక్కడ పూజలు చేయడం గమనార్హం. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్టు, సివిల్ పనులు చేసే కాంట్రాక్టర్లు తమ వాహనాలను కొండగట్టుకు తీసుకువస్తుంటారు. దళితబంధుతో తాకిడి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం ద్వారా 8,851 మంది లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు. ఇందులో జేసీబీలు, ట్రాక్టర్లు, ట్రక్కులు, లారీలు, ఆటోలు, ట్రాలీలు ఉన్నాయి. వాహనమేదైనా బాహుబలి వద్ద పూజ చేయించకుండా బయటికి తీసేదే ఉండదంటే అతిశయోక్తి కాదు. దళితబంధులో ఇచ్చిన వాహనాల్లో హుజూరాబాద్ మాత్రమే కాకుండా.. ఉమ్మడి జిల్లా, పొరుగున ఉన్న ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి కూడా కొండగట్టు, గట్టుదుద్దెనపల్లి, అగ్రహారానికి తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్, పవన్ నోట కొండగట్టు గతేడాది డిసెంబరు 7వ తేదీన జగిత్యాలలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించి తన భక్తిని చాటుకున్నారు. అదే నెలలో జనసేన పార్టీ అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నికల రథం వారాహికి జనవరి నెలాఖరున పూజలు చేస్తానని ప్రకటించడంతో మరోసారి కొండగట్టు పేరు మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కింది. ప్రతీవారం మంత్రులు, ప్రముఖులు, ఎమ్మెల్యేలు, సాధారణ భక్తుల తాకిడితో పుణ్యక్షేత్రం కిటకిటలాడుతోంది. -
జగిత్యాల పర్యటన.. కొండగట్టుపై సీఎం కేసీఆర్ వరాల జల్లు
సాక్షి, జగిత్యాల: జగిత్యాల పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు ప్రకటించారు. జగిత్యాల జిల్లా మోతె గ్రామంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా నేడు అద్భుతమైన కలెక్టరేట్ నిర్మించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది కాబట్టి జగిత్యాల జిల్లా ఏర్పడిందన్నారు. జగిత్యాల జిల్లా అయితదని కలలో కూడా అనుకోలేదని, ప్రస్తుతం జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు అభినందలు తెలిపారు. ఏకైక రాష్ట్ర తెలంగాణే తెలంగాణలో అద్భుత పుణ్యక్షేత్రాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. బండలింగాపూర్‌ను మండల కేంద్రం చేస్తామని పేర్కొన్నారు. దేశంలో రైతుబంధు, రైతు బీమా ఇచ్చే ఏకైక రాషష్ట్రం తెలంగాణనే అని అన్నారు. తాను బతికున్నంత వరకూ రైతుబంధు, రైతు బీమా ఆగవని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ధాన్యం కొనదని, కానీ దేశంలో ధాన్యం కొనే ఏకైక రాష్ట్ర తెలంగాణేనని చెప్పారు. ఇంకా ఎన్నో పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చదవండి: మనకు మనమే సాటి.. ఎవరూ లేరు పోటీ: సీఎం కేసీఆర్ ‘మోటర్లకు మీటర్లు పెట్టాలట.. పెడదామా అని ప్రశ్నించారు. గోల్‌మాళ్ గోవిందం గాళ్లు, కారుకూతలు కూసేవాళ్లు మన మధ్య తిరుగుతున్నారు. వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణలాగే దేశమంతా అభివృద్ధి చెందాలి. మనం వచ్చినప్పుడే కేంద్రంలో మోదీ కూడా వచ్చారు. కానీ ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని జరిగిందా? మోదీ వచ్చాక ఉన్న ఆస్తులు ఊడగొడుతున్నారు. రైతులకు ఉచితాలు ఇవ్వొద్దు కానీ.. ఎన్పీఏల పేరిట రూ. 14 లక్షల కోట్ల ప్రజా సంపదను దోచిపెట్టారు. రూ. 35 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న ఎల్ఐసీని కూడా అమ్మేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అందరూ పిడికిళ్లు బిగించాలి. దేశంలో ఇప్పటికే 10 వేల పరిశ్రమలు మూతపడ్డాయి. 50 లక్షల మంది కార్మికుల ఉద్యోగాలు ఊడిపోయాయి.’ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. -
Kondagattu: అంజన్న భక్తులకు శఠగోపం..
సాక్షి, కొండగట్టు(జగిత్యాల): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీఆంజనేయస్వామి సన్నిధిలో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఇలాంటి అక్రమాలను అడ్డుకునేందుకు కొండపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండాపోతోంది. అంజన్న దర్శనం కోసం తరలివస్తున్న భక్తుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. 20 కెమెరాలు.. రూ.10లక్షల వ్యయం భక్తుల రక్షణ, అక్రమాలు అరికట్టే ఉద్దేశంతో ఐదేళ్లక్రితం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో 20 కెమెరాలకు రూ.8లక్షల – రూ.10లక్షల వరకు వె చ్చించారు. ఆలయంలో 16, వై జంక్షన్ వద్ద రెండు, ఇతర ప్రదేశాల్లో మరోరెండు సీసీ కెమెరాలు బిగించారు. ఆలయంలోని టెంకాయ కొట్టేచోట కెమెరా లేదు. టెండర్‌దారులు భక్తుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకొని వె ళ్తున్న వారిని కొందరు అర్చకులు మరీ పిలిపించుకు ని గోత్రానామాలు చదవడం, స్వామివారి కుంకు మ, పండ్లు ఇవ్వడం ద్వారా రూ.100 – రూ.500వరకు దండుకుంటున్నారు. ఈ తంతు సీసీ కెమెరాల సాక్షిగా సాగుతోంది. అయినా వారిలో భయం, భక్తీలేదు. రూ.వేలల్లో వేతనాలు తీసుకునే అర్చకులు.. ఆలయ హుండీల్లోకి వెళ్లే సొమ్మును సైతం తమ జేబుల్లోకి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హిందూ వాహిని సంస్థకు చెందిన కొందరు.. భక్తుల నిలువుదోపిడీ చూడలేక ఇటీవల ఆలయ ఈవోకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అర్చకులు, టెంకాయ కొట్టేచోట దోపిడీ ఆగినా.. కరోనా లాక్డౌన్ ఎత్తివేశాక.. ఇప్పుడు మళ్లీ మొదలైంది. కెమెరాల ముందే దోపిడీ జరుగుతున్నా.. ► ఇప్పటికే ఆలయంలోని పలుచోట్ల 20 సీసీ కెమెరాలు ఉన్నాయి. మరో 30 కెమెరాలు ఏర్పాటుచేస్తే అంతటా నిఘా ఉంచినట్లవుతుంది. ► ఇటీవల రూ.10లక్షలు వెచ్చించి మరికొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఈ ప్రోక్యూర్మెంట్ పిలిచారు. ► రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సాక్షిగా భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అయినా పట్టించుకునే నాథుడేలేడు. ► ఇప్పటికిప్పుడు రూ.10లక్షలు వెచ్చించి కెమెరాలు ఏర్పాటు చేసినా ఎవరు పర్యవేక్షిస్తారో అధికారులకే తెలియాలి. ► ఇదే సొమ్ముతో ఆలయ అధికారులు నేరుగా కెమెరాలు కోనుగోలు చేస్తే రూ.5లక్షల లోపే ఖర్చవుతుందని భక్తులు అంటున్నారు. ► రూ.లక్ష వెచ్చించి నిరంతరం సీసీ కెమెరాలను పర్యవేక్షించినా రూ.6లక్షల్లో ఈప్రక్రియ పూర్తవుతుందని, ఇందుకు రూ.4లక్షలు చేర్చి రూ.పదిలక్షలతో టెండర్ పిలవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నిఘా వ్యవస్థ పనిచేస్తే.. ► భక్తుల భద్రతకు ఢోకా ఉండదు. ► కట్నాలు, కానుకల రూపంలో స్వామివారికి సమర్పించే సొమ్మంతా హుండీల్లోకే వెళ్తుంది. ► తద్వారా అంజన్న ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ► దొంగలు, అక్రమాలకు పాల్పడేవారు ఆలయ పరిసరాల్లోకి వస్తే గుర్తుపట్టడం సులభమవుతుంది. ► ఇతరత్రా నేరాలు, అఘాయిత్యాలు అరికట్టే వీలుంటుంది. ► సీసీ ఫుటేజీలు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారుతాయి. నిఘా ఉన్నా భయం లేదు కొండపై టెంకాయ కొట్టేచోట కొందరు అర్చకులు భక్తులను దోపిడీ చేస్తున్నారు. మేం ఈవోకు ఫిర్యాదు చేశాం. ఆయన స్పందించి అక్రమార్కులను హెచ్చరించారు. కొద్దిగా దోపిడీ తగ్గింది. ఇప్పుడు మళ్లీ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీసీ కెమెరాలు పనిచేస్తే అక్రమార్కులపై చర్య తీసుకునే అవకాశం ఉంది. – కె.అనిల్‌గౌడ్, హిందూ వాహిని ప్రతినిధి, కొడిమ్యాల రూ.లక్షలు వృథా ఎందుకు? గతంలో పదిలక్షల రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటితో ఎవరూ భయపడతలేరు. ఇప్పుడు మరో పదిలక్షల రూపాయలతో మళ్లీ సీసీ కెమెరాలు పెడితే ఏం లాభం? వాటి నిర్వహణకు ఓ టెక్నీషియన్‌ను నియమించండి. ఆ పనిచేయకుండా సీసీ కెమెరాలు ఎన్ని ఏర్పాటు చేసినా వృథానే. – ఎ.వపన్ భక్తుడు, జగిత్యాల బాధ్యులపై చర్యలు తప్పవు కొండపై భక్తులను ఇబ్బందులకు గురిచేస్తే వారు ఎవరైనా చర్యలు తప్పవు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ఈ ప్రొక్యూర్మెంట్ పిలిచాం. ఫ్రైస్ బిడ్ ఫైనల్ కాలేదు. సీసీ కెమెరాల ఏర్పాటు టెండర్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వారి ఆదేశాల మేరకు టెండర్ ఫైనల్ చేస్తాం. ఎలాంటి అపోహలకు తావులేదు. –ఎ.చంద్రశేఖర్, ఈవో చదవండి: బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం -
మొహమాటం ఖరీదు రూ.3 లక్షలు.. కొండగట్టులో వింత ఆచారం
సాక్షి, కొండగట్టు(కరీంనగర్): కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయం తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. రోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కోరిన కోర్కెలు తీరడంతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈసందర్భంగా ఆలయానికి పెద్దమొత్తంలో ఆదాయం సమకూరుతోంది. ఇలా వచ్చే నిధులను భక్తుల సౌకర్యాలు, వసతుల కల్పనకు వెచ్చించాల్సి న ఆలయ యంత్రాంగం.. వీఐపీలు, వీవీఐపీల సందర్శనల సందర్భంగా మొహమాటానికి వెళ్తోంది. ఆలయ నిబంధనల మేరకు శాలువాలతో ప్రముఖులను సత్కరించడం ఆనవాయితీ. కానీ, వారితో వచ్చే చిన్నాచితకా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులను సైతం సన్మానిస్తోంది. ఇందుకోసం లెక్కకు మించి శాలువాలను వృథా చేస్తోంది. ఏటా వందమందికిపైగా వీఐపీల రాక.. కొండగట్టులోని శ్రీ ఆంజనేయస్వామి దర్శనం కోసం ఏటా 100 మందికిపైగానే వీఐపీలు తరలివస్తుంటారు. వారు స్వామివారిని దర్శించుకుని వెళ్లంటారు. ఈసమయంలో ఆలయ అధికారులు ప్రముఖులను శాలువాలు, కండువాలతో సన్మానిస్తున్నారు. అయితే, స్వామివారి దర్శనం కోసం వచ్చే ప్రముఖులు ఒకరిద్దరు ఉంటే.. వారివెంట చిన్నాచితకా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఒక్కోసారి అధికారులూ లెక్కకు మించి ఉంటున్నారు. కొందరి పర్యటనలో 25 మంది – 30 మంది వరకు ఉంటే.. మరికొందరి వెంట ఆ సంఖ్య రెట్టింపుకన్నా అధికంగానే ఉంటోంది. కరోనా సమయంలోనూ ఒకరిద్దరు రావాల్సి ఉండగా, పదుల సంఖ్యలో హాజరవడం విస్మయం కలిగించింది. ప్రముఖులు పూజలో కూర్చుండగానే వారి అనుయాయులూ అనుసరిస్తున్నారు. ఎంతైనా ప్రముఖులతోనే వచ్చారు కదా, వారిని కూడా సత్కరించకుంటే వీఐపీలు ఏమనుకుంటారోనని మొహమాటానికి గురవుతున్నారు అధికారులు. దీంతో ప్రముఖుల వెంట వచ్చిన అనధికారులను సైతం శాలువాలు, కండువాలతో సన్మానిస్తున్నారు. క్యూలైన్లలో తాగునీటికి తిప్పలు.. అంజన్న దర్శనం కోసం క్యూలైన్లలో వెళ్తున్న భక్తులు తాగునీటి సౌకర్యంలేక తపిస్తున్నారు. అనధికారులకు వెచ్చిస్తున్న సొమ్ముతో క్యూలైన్లలో తాగునీటి సౌకర్యం కల్పిస్తే సమస్య పరిష్కారమవుతుందని కొందరు అధికారులు భావిస్తున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకునే నాథుడే లేకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో శాలువా ధర రూ.25– రూ.200.. నాణ్యత, బ్రాండ్‌ను బట్టి ఒక్కో శాలువా రూ. 25–200 వరకు ధర ఉంటుంది. అయితే, కేవలం ప్రముఖులనే సన్మానిస్తే అంజన్న ఆలయంపై ఏటా సుమారు రూ.లక్ష వరకే ఉంటుందని అంచనా. కానీ, అనధికారులనూ సన్మానిస్తుండడంతో శాలువాలు, కండువాలు అధికంగా వినియోగించాల్సి వస్తోంది. తద్వారా అంజన్నపై ఏటా రూ.3లక్షల వరకు భారం పడుతోంది. ఇదంతా భక్తుల ద్వారా ఆలయానికి సమకూరిన సొమ్మే. దీనిని ఇష్టం వచ్చిన వారికి వెచ్చించడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. చదవండి: CM KCR: ‘టాలెస్ట్ టవర్ ఆఫ్ వరంగల్’గా ఆస్పత్రి -
‘కొండగట్టు’ వద్ద నారాయణ బలిహోమం
జగిత్యాల జోన్/కొండగట్టు: కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం స్వామి పరిపూర్ణానంద ఆధ్వర్యంలో బుధవారం నారాయణ బలిహోమం నిర్వహించారు. బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రీ, పులి సీతారామ శాస్త్రీ, శ్రీనివాసశర్మ తదితర వేద పండితుల బృందం రెండు గంటలపాటు హోమం నిర్వహించింది. యాగం నిర్వహిస్తున్న స్థలంలోని వేదికపై దాదాపు అరగంట పాటు స్వామిజీ ప్రత్యేక జపం చేస్తూ, మౌనంగా ఉండిపోయారు. ప్రమాద స్థలంలోనే 50 మందికిపైగా చనిపోయినందున సామూహికంగానే మృతులకు పిండ ప్రదానం చేశారు. యజ్ఞహోమం వద్ద పిండాలను ఏర్పాటు చేసి.. మృతుల కుటుం బాలతో పిండాలు ప్రదానం చేయించారు. అనం తరం ధర్మపురి గోదావరిలో కలిపేందుకు తీసుకెళ్లారు. కాగా, కొండగట్టు బస్సు ప్రమాద స్థలాన్ని గోదావరి నీటితోపాటు యజ్ఞ విభూతితో శుద్ధి చేశారు. ప్రత్యేక పూజలూ చేశారు. వస్త్రాల బహూకరణ: మృతుల కుటుంబాలకు పరిపూర్ణానంద స్వామి తన చేతుల మీదుగా వస్త్రాలను బహూకరించారు. ఆ సమయంలో బాధితులు తమవారిని తలుచుకుని స్వామివారి పాదాలపై పడి ఏడ్వడం చూసేవారికి సైతం కన్నీళ్లను తెప్పించింది. మృతుల కుటుంబీకులు సంతోషంగా ఉండాలని స్వామి ఆకాంక్షించారు. -
కొండంత విషాదం.. పాపం పసివాడు
మొన్ననే రాఖీ కట్టిన తమ్ముడు ప్రమాదంలో విగతజీవుడయ్యాడు. తమ్ముడితో వెళ్లిన అమ్మ చావుబతుకుల మధ్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. బతుకుదెరువు కోసం నాన్నేమో దుబాయ్‌కు పోయిండు.. ఏం చేయాలో తెలియని ఆ అక్కాచెల్లెళ్లు.. ‘లేరా తమ్ముడూ ఆడుకుందాం’ అంటూ ఏడుస్తున్న ఘటన హృదయాల్ని పిండేస్తోంది.. సాక్షి, కొండగట్టు: గుండెల్ని పిండేసే ఘోర రోడ్డు ప్రమాదంతో ఆ ఊరు కన్నీటి ప్రవాహంగా మారింది. ఎవరిని కదిలించినా కన్నీళ్లు తప్ప.. మాటలు రావడం లేదు. వెక్కివెక్కి ఏడ్చేవాళ్లు కొందరు.. తమ వాళ్లను కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగుకుని వారిని ఓదార్చేవాళ్లు ఇంకొందరు.. ప్రమాద బాధిత శనివారంపేటలో ఎవరిని కదిలించినా ఇదే దృశ్యాలు. కొండగట్టు రోడ్డు ప్రమాదంలో ఈ ఊరి నుంచే ఏకంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారి హర్ష అంత్యక్రియలు తల్లితండ్రులు లేకుండానే పూర్తయ్యాయి. గ్రామానికి చెందిన గాజుల లత, అశోక్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. ఒక కుమారుడు హర్ష(2). అశోక్ బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లగా.. లత గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తోంది. అనారోగ్యంతో ఉన్న కుమారుడికి చికిత్స చేయించేందుకు ఆమె జగిత్యాలకు బస్సులో బయల్దేరింది. అంతలోనే ఊహించని ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నిపింది. ప్రమాదంలో హర్ష మరణించగా.. అతడి తల్లి తీవ్రంగా గాయపడింది. అప్పటి వరకు తమతో ఆడుకున్న హర్ష ఒక్కసారిగా విగతజీవిగా మారడంతో అతడి అక్కలు తట్టుకోలేకపోయారు. తమ్ముడు కావాలి అంటూ ఏడుస్తున్న ఆ చిన్నారులను ఆపడం ఎవరితరం కావడం లేదు. గల్ఫ్‌లో ఉన్న తండ్రికి కుమారుడి మరణ వార్త ఎలా తెలియజేయాలో తెలియక మధన పడ్డ కుటుంబ సభ్యులు చివరకు ఆ బాలుడి అంత్యక్రియలు పూర్తి చేశారు. గల్ఫ్‌లో ఉన్న ఆ తండ్రి, ఆసుపత్రిలో ఉన్న ఆ తల్లి తన ముద్దుల కొడుకును కడసారి చూసుకోలేకపోయారు. ఆ తల్లి కోలుకొని తన కొడుకు ఎక్కడా అని అడిగితే ఏమని చెప్పాలని బంధువులు బోరుమంటున్నారు. రాఖీ పౌర్ణమీ సందర్భంగా తన అక్కలు రాఖీ కడితే హర్ష కాళ్లు మొక్కి డబ్బులు కూడా ఇచ్చాడని ఆ ఫొటోలు ఇవే అంటూ చూపిస్తూ వారు కంటతడి పెట్టారు. -
అంజన్న భక్తులకు విషాదం
సాక్షి, కొండగట్టు : జగిత్యాల జిల్లాలో పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల జిల్లా శనివారంపేట నుంచి బయలు దేరిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు కొండగట్టు ఘాట్ రోడ్డు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కొండగట్టుకు వచ్చిన హనుమాన్ భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం కావడంతో కొండగట్టుకు హనుమాన్ భక్తుల తాకిడి ఎక్కుగా ఉంది. దర్శనం చేసుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో అధిక సంఖ్యలో బస్సెక్కారు. దీంతో ఓవర్లోడైన బస్సు అదుపు తప్పి లోయలో పడ్డట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొండగట్టులో బస్సెక్కిన భక్తులకు కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో మూడు కిలోమీటర్లు దూరం వెళ్తే బస్సు జగిత్యాల హైవే ఎక్కేది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 88 మంది ప్రయాణీకులున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తమ ఇష్టదైవం దగ్గరకు వచ్చిన భక్తులు ఊహించని ప్రమాదంలో మరణించారు. నిమిష నిమిషానికి మృతుల సంఖ్య పెరుగుతోంది. మృతుల్లో అధిక సంఖ్యలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఊపిరాడకనే ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అప్పటివరకు తమతో కలిసి ప్రయాణం చేసిన వారిలో చాలా మంది నిర్జీవులుగా మారడంతో బాధితుల దుఃఖానికి అంతేలేకుండా పోయింది. జగిత్యాల ఆసుపత్రి ప్రాంగణం బాధితుల ఆర్తనాదాలతో దద్దరిల్లుతోంది. -
కుటుంబంపై కర్కశత్వం
కొండగట్టు (చొప్పదండి) : కొండగట్టు దర్శనానికి వెళ్లిన కుటుంబ సభ్యులను పథకం ప్రకారం హతమార్చేందుకు యత్నించాడో కర్కోటకుడు. రెండేళ్ల కూతురును చంపి.. అనంతరం రెండో కూతురు, భార్యను హత్య చేసేందుకు యత్నించగా.. భార్య తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం భర్తతో పాటు రెండో పాప ఆచూకీ లభించడం లేదు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం బొగ్గులకుంట వద్ద సోమవారం వెలుగు చూసింది. మల్యాల సీఐ నాగేందర్‌గౌడ్ కథనం ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం శివపురి గ్రామానికి చెందిన అశోక్ భార్య లక్ష్మీ, ఇద్దరు పిల్లలతో కలసి శనివారం కొండగట్టు దర్శనానికి వచ్చాడు. రాత్రి ఇక్కడే నిద్రించి ఆదివారం మధ్యాహ్నం భార్యా పిల్లలను తన వెంట బొగ్గులగుంట వైపు తీసుకెళ్లాడు. భర్త వ్యవహారశైలిపై శంకించిన భార్య.. అటువైపు వెళ్లేందుకు నిరాకరించింది. అయితే.. కోనేరు ఉందని, అక్కడ స్నానం చేద్దామని వారిని నమ్మబలికాడు. అడవిలోకి వెళ్లిన తర్వాత చిన్న కూతురు అక్షిత (2)ను గొంతు నులిమి చంపాడు. పెద్దమ్మాయి అంజలి (4)ని చంపేందుకు యత్నించగా.. భార్య అడ్డుకోబోయింది. దీంతో ఆమె మెడకు వైరు బిగించి హత్యాయత్నం చేయగా.. స్ఫృహ కోల్పోయింది. కొద్దిసేపటి తర్వాత ఆమె లేచి చూసేసరికి భర్త, పెద్దపాప కానరాలేదు. వెంటనే ఇంటికి చేరుకున్న లక్ష్మి.. తన తల్లిదం డ్రుల సహాయంతో వాంకిడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కొడిమ్యాల, మల్యాల ఎస్ఐలు సోమ సతీష్‌కుమార్, నీలం రవి అడవిలో వెతకగా రాత్రి చిన్నారి అక్షిత శవం లభ్యమైంది. అశోక్‌తోపాటు మరో కూతురు అంజలి ఆచూకీ లభించలేదు. కేసు దర్యాప్తులో ఉంది.