
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘బలగం’. కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది. ఒకవైపు ప్రముఖ ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ థియేటర్స్‌లోనూ మంచి కలెక్షన్స్‌ని రాబడుతోంది.
ఇక తన తొలి చిత్రం సూపర్ హిట్ కొట్టడంతో వేణు యెల్డండి ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఇన్నాళ్లు వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న వేణు..తాజాగా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాడు. ఫ్యామిలీతో కొండగట్టు వెళ్లిన వేణు.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘కొండగట్టు అంజన్న ఆశీర్వాదంతో బలగం సినిమా మొదలు పెట్టాను..అంజన్న దయతో బలగం మీ అందరిని మెప్పించింది..అంజన్న దర్శనం అద్భుతంగా జరిగింది’అని వేణు రాసుకొచ్చాడు.
ఇక బలగం విషయానికొస్తే.. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు.
కొండగట్టు అంజన్న ఆశీర్వాదంతో బలగం సినిమా మొదలు పెట్టాను..అంజన్న దయతో బలగం మీ అందరిని మెప్పించింది..అంజన్న దర్శనం అద్భుతంగా జరిగింది ..🙏#balagam #kondagattu #hanuman #venuyeldandi #venutillu #devotional @dilrajuprodctns pic.twitter.com/FDGUsw06jn
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) March 29, 2023