టాలీవుడ్‌లో విషాదం.. బలగం నటుడు కన్నుమూత! | Tollywood Movie Balagam Actor Narsingam Passed Away | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. బలగం సర్పంచ్‌ తాత ఇకలేరు!

Sep 5 2023 5:41 PM | Updated on Sep 5 2023 6:00 PM

Tollywood Movie Balagam Actor Narsingam Passed Away - Sakshi

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రం బలగం. వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. కాగా.. ఈ సూపర్‌ హిట్‌ మూవీలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ జంటగా నటించారు. మురళీధర్ గౌడ్, కేతిరి సుధాకర్‌ రెడ్డి, జయరామ్, రూప, రచ్చ రవి  ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: బలగం మూవీ అరుదైన ఘనత.. ఇంతవరకు ఏ సినిమాకు దక్కలేదు!)

అయితే ఈ చిత్రంలో సర్పంచ్‌ పాత్రలో కనిపించిన నర్సింగం తాజాగా కన్నుమూశారు.  ఈ విషయాన్ని దర్శకుడు వేణు యెల్దండి ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ఆయనకు నివాళులర్పిస్తూ ట్వీట్‌ చేశారు.  ఈ విషయం తెలుసుకున్న పలువురు చిత్రబృందం సభ్యులు ఆయనకు సంతాపం ప్రకటించారు.   

వేణు ట్వీట్‌లో రాస్తూ..' నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి. మీచివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి. బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను.ఆరోజు కల్లు, గుడాలు తెప్పించాడు నాకోసం.' అంటూ బలగం సినిమా రోజులను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. 

(ఇది చదవండి: ‘బలగం’ తర్వాత యష్‌తోనే సినిమా ఎందుకంటే:దిల్‌ రాజు )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement