Director Venu Yeldandi Responds to Balagam Movie Question in Constable Exam - Sakshi
Sakshi News home page

Venu Yeldandi: కానిస్టేబుల్‌ పరీక్షలో బలగం ప్రశ్న, మురిసిపోతున్న డైరెక్టర్‌

Published Mon, May 1 2023 11:23 AM | Last Updated on Mon, May 1 2023 12:22 PM

Director Venu Yeldandi Responds Balagam Question in Constable Exam - Sakshi

బలగం సినిమానా? మజాకా? కానిస్టేబుల్‌ పరీక్షలో బలగం చిత్రానికి సంబంధించిన ప్రశ్న వచ్చిందంటే ఈ మూవీ ఏ రేంజ్‌లో ఆదరణ పొందిందో అర్థమవుతోంది. ఏప్రిల్‌ 30న జరిగిన కానిస్టేబుల్‌ మెయిన్స్‌ పరీక్షలో బలగం సినిమాకు వచ్చిన అవార్డుపై ఓ ప్రశ్న అడిగారు. మార్చి 2023లో ఒనికో ఫిలింస్‌ అవార్డుల్లో ఏ విభాగంలో బలగం సినిమాకు పురస్కారం లభించింది? అని అడిగారు.

ఆబ్జెక్టివ్‌ టైప్‌ కాబట్టి 1. ఉత్తమ డాక్యుమెంటరీ, 2. ఉత్తమ నాటకం, 3. ఉత్తమ దర్శకుడు, 4. ఉత్తమ సంభాషణ అని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. వీటిలో 2. ఉత్తమ నాటకం సరైన సమాధానం. ఈ సినిమా ఒక్క ఒనికో ఫిలిం అవార్డు మాత్రమే ఏంటి లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో బెస్ట్‌ ఫీచర్‌ ఫిలిం, బెస్ట్‌ సినిమాటోగ్రఫీ అవార్డులు సైతం సొంతం చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలోనూ ఎన్నో అవార్డులు అందుకుని సత్తా చాటింది.

తాజాగా కానిస్టేబుల్‌ పరీక్షలో బలగంపై ప్రశ్న రావడంపై దర్శకుడు వేణు సంతోషం వ్యక్తం చేశాడు. ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. 'నిన్న నా స్నేహితుడొకరు ఈ ఫోటో పంపారు. చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తోంది. నా కలను నిజం చేసిన తెలుగు ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అంటూ చేతులెత్తి నమస్కరించిన ఎమోజీలను జత చేశాడు.

చదవండి: రూ.7 లక్షలు రావాల్సి ఉంది, చైతన్య మాస్టర్‌కు పేమెంట్‌ ఆపేశారు
కానిస్టేబుల్‌ పరీక్షలో బలగంపై ప్రశ్న

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement