టాలీవుడ్‌లో గుర్తుండిపోయే సినిమాల లిస్ట్ తీస్తే అందులో 'బలగం' కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ గ్రామీణ నేపథ్య కథతో తీసిన ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. అప్పటివరకు కమెడియన్ గా తెలిసిన వేణులో ఇంతమంచి దర్శకుడు ఉన్నాడని బయటపెట్టింది.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 29 సినిమాలు రిలీజ్)
ఈ ఏడాది 'బలగం' సినిమాతో దర్శకుడిగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన వేణు యెల్దండి.. ఇప్పుడు తండ్రిగా మరోసారి ప్రమోషన్స్ పొందాడు. తనకు అమ్మాయి పుట్టిందని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఇకపోతే వేణుకి ఇదివరకే ఓ కొడుకు ఉన్నాడు. ఇద్దరూ కలిసి యూట్యూబ్ ఛానెల్‌లో పలు వీడియోస్ కూడా చేశారు.
ఇక 'బలగం' తర్వాత మళ్లీ దిల్ రాజు నిర్మాణంలో వేణు మరో సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో 'బలగం'లో యాక్ట్ చేసిన ప్రియదర్శినే హీరోగా నటిస్తున్నాడని టాక్. అయితే ఈ విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: మెగాస్టార్ పాన్ ఇండియా సినిమా.. రెండు నెలల్లో పూర్తి)
Comments
Please login to add a commentAdd a comment