baby girl
-
నీ శరీరం.. నీ ఇష్టం అన్నాడు : దీపికా పదుకొణె
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్లో జంట రణ్వీర్ సింగ్- దీపికా పదుకొణె ఒకటి. 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. దాదాపు ఆరేళ్ల తర్వాత 2024లో ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పిల్లలను కనడానికి ఇంత గ్యాప్ తీసుకోవడం తన నిర్ణయమే అంటోంది దీపికా. ఈ విషయంలో రణ్వీర్ సింగ్ తనకు ఎంతో సపోర్ట్‌గా నిలిచాడని చెప్పింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ప్రెగ్నెన్సీ విషయంలో రణ్వీర్ ఎంత క్లారిటీగా ఉన్నారనే విషయాన్ని చెబుతూ భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. ‘పెళ్లయిన కొత్తలో ఓ సారి పిల్లలను కనడం గురించి రణ్వీర్తో మాట్లాడుతూ..ఎప్పుడు ప్లాన్ చేద్దాం అని అడిగాను. దానికి ఆయన సమాధానం ఇస్తూ..‘పిల్లలను కనడం ఇద్దరి నిర్ణయం అయినప్పటికీ.. మోయాల్సింది నువ్వు మాత్రమే. నీ శరీరంలోనే బేబీ పెరుగుతుంది. కాబట్టి నువ్వే నిర్ణయం తీసుకోవాలి. పిల్లలను కనగలను అని నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ప్లాన్ చేద్దాం’ అన్నారు. ఆయన మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి’ అని దీపికా చెప్పుకొచ్చిది. ఇక తన కూతురుకి దువా అనే ఎందుకు పెట్టారో వివరిస్తూ.. ‘బేబీకి పెరు పెట్టే విషయంలో మేం తొందరపడలేదు. బిడ్డ పుట్టిన రెండు నెలల తర్వాత పేరు పెట్టాం. ముందుగా బేబీ క్షేమంగా మా చేతుల్లోకి రావాలనే కోరుకున్నాం.దువా అనే పేరు కూడా అనుకోకుండా పెట్టేశాం. ఓ రోజు రాత్రి సెట్లో ఉన్న రణ్‌వీర్‌కి మెసేజ్ చేశాను. బేబీ పేరు గురించి చర్చిస్తూ ‘దువా’ అన్నాను. వెంటనే ఓకే చెప్పేశాడు. అదే పేరును మేం ప్రకటించాం. అరబిక్ భాషలో దువా అంటే ప్రార్థన అని అర్థం. మా ప్రార్థనలకు సమాధానమే ఈ పాప అని అర్థం వచ్చేలా ఆ పేరు పెట్టేశాం’అని దీపికా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు బ్రేక్ తీసుకొని పూర్తి సమయం బేబీకి కేటాయించింది. కల్కి 2లో నటించబోతుంది. అలాగే షారుఖ్ ఖాన్ కొత్త సినిమాలో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
రాహుల్ తండ్రయ్యాడు...
కేఎల్ రాహుల్ ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ ఢిల్లీ తరఫున తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. వ్యక్తిగత కారణాలతో మ్యాచ్‌కు దూరమైనట్లు ముందుగా ఫ్రాంచైజీ ప్రకటించింది. మ్యాచ్ సాగుతున్న సమయంలో రాహుల్ శుభవార్త ట్వీట్ చేశాడు. తమకు అమ్మాయి పుట్టినట్లు రాహుల్, అతియా శెట్టి ప్రకటించారు. 2023 జనవరిలో వీరిద్దరి పెళ్లి జరిగింది. -
తండ్రైన కేఎల్ రాహుల్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అతియా శెట్టి
బాలీవుడ్ భామ అతియా శెట్టి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు పాప పుట్టారని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రి అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ స్టార్ జంటకు అభినందనలు చెబుతున్నారు. పలువురు సినీతారలు సైతం కంగ్రాట్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. గతంలోనే అతియాశెట్టి గర్భంతో ఉన్నట్లు రాహుల్ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ఏడాదిలోనే మా ఇంటికి అందమైన ఆశీర్వాదం రాబోతుందని పోస్ట్ చేశారు.కాగా.. అతియా శెట్టి బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. అతియా శెట్టి చివరిసారిగా 2019లో వచ్చిన చిత్రం 'మోతీచూర్ చక్నాచూర్'లో కనిపించింది. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఆమె మొదట 2015లో 'హీరో' మూవీ ద్వారా సూరజ్ పంచోలి సరసన బాలీవుడ్లో అడుగుపెట్టింది. అర్జున్ కపూర్ నటించిన 'ముబారకన్' సినిమాలో అతియా కీలక పాత్ర పోషించింది.కేఎల్, అతియా శెట్టి ప్రేమ వివాహంఅయితే కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. కేఎల్ రాహుల్, అతియా శెట్టిల వివాహం 2023, జనవరి 23న ముంబయిలోని ఫామ్‌హౌస్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో బాలీవుడ్ సినీతారలు, పలువురు క్రికెటర్ల సందడి చేశారు. View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) -
ఆ దేవుడు మా కోరిక నెరవేర్చాడు.. అందుకే ఈ పేరు పెడుతున్నాం (ఫోటోలు)
-
బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్
తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన రాధికా ఆప్టే శుభవార్త చెప్పింది. వారం క్రితం తాను ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఇప్పుడు బయటపెట్టింది. పాపకి పాలు పడుతున్న ఫొటోని పోస్ట్ చేసి, డెలివరీ తర్వాత వర్క్ మీటింగ్ అని ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈమెకు నటీనటులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఒకప్పటి బాలనటి)తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో సినిమాలు చేసిన రాధికా ఆప్టే.. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్‌ను పెళ్లాడింది. 2012లో వివాహ జరగ్గా.. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులయ్యారు.థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన రాధిక.. తెలుగులో 'లెజెండ్', 'లయన్', 'రక్త చరిత్ర' తదితర సినిమాల్లో హీరోయిన్గా నటించింది. రెగ్యులర్ హీరోయిన్ పాత్రల కంటే న్యూడ్, సెమీ న్యూడ్ చిత్రాల్లోనూ ఈమె నటించడం విశేషం. వాటిపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి.(ఇదీ చదవండి: తన వన్ సైడ్ ప్రేమకథ బయటపెట్టిన రాజమౌళి) View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) -
మాతృ స్పర్శను ఆస్వాదించకుండానే..
కాజీపేట: ‘ఒక దీపం వెలిగించును వేలకొలది జ్యోతులు. ఒక దీపం చూపించును ప్రగతికి రహదారులు’ అన్నాడో కవి. ఓ యువతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి అచేతనావస్థకు చేరుకోవడంతో జీవచ్ఛవంలా మారింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఎంత ఖరీదైన వైద్యం చేసినా బతికే అవకాశం లేదని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో అవయవదానం చేసి నలుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. కానీ ఆ యువతి మాతృ స్పర్శను ఆస్వాదించకుండానే కన్నుమూసింది. ఈ విషాద ఘటన కాజీపేటలో శనివారం జరిగింది. బాపూజీనగర్ కాలనీకి చెందిన వశాపాక శ్రీనిత (23) పదిరోజుల కింద ఆడశిశువుకు జన్మనిచ్చి తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్రీనిత ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే శ్రీనిత బ్రెయిన్ వాపు వచ్చి కోమాలోకి వెళ్లింది. చికిత్సకు ఆమె స్పందించకపోవడంతో బతికే అవకాశం లేదని, బ్రెయిన్ డెడ్ అని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. పుట్టిన బిడ్డ కనీసం తల్లి స్పర్శకు నోచుకోలేదు. ఇక.. ఎప్పటికీ తిరిగిరాని తమ బిడ్డ మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపితే చాలని కన్నవాళ్లు, భర్త అవయవదానానికి అంగీకరించారు. శ్రీనిత కళ్లు, గుండె, కిడ్నీలు, లివర్లను వైద్యులు శస్త్ర చికిత్స చేసి మరో నలుగురికి అమర్చారు. బిడ్డ పుట్టిందనే విషయం తెల్సి మురిసిపోయిన శ్రీనిత.. ఆ బిడ్డ ఆత్మీయ స్పర్శను ఆస్వాదించకుండానే కన్నుమూసింది. బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య శనివారం రాత్రి బాపూజీనగర్‌లో అంత్యక్రియలు పూర్తి చేశారు. -
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటి.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!
బాలీవుడ్ ప్రముఖ నటి మసాబా గుప్తా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈనెల 11న మొదటి బిడ్డకు స్వాగతం పలికింది. ఈ విషయాన్ని మసాబా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సత్యదీప్ మిశ్రాను పెళ్లాడిన మసాబాకు ఇటీవలే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ జంటకు ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. రిచా చద్దా, శిల్పాశెట్టి, సమీరా రెడ్డి, బిపాసా బసు అభినందనలు తెలిపారు.మసాబా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మాకు చాలా ప్రత్యేకమైన రోజు. చిన్న అమ్మాయి మా జీవితంలోకి 11.10.2024న అడుగుపెట్టింది' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. మసాబా గుప్తా నటిగా, ఫ్యాషన్ డిజైనర్‌గా బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ 18న మసాబా గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన భర్త సత్యదీప్‌తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది.ఎవరీ మసాబా గుప్తా..కాగా ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురే మసాబా గుప్తా. ఈమె గతేడాది జనవరిలో నటుడు సత్యదీప్ మిశ్రాను రెండో పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ దంపతులు త్వరలో పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇకపోతే మసాబా తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మసాబా మసాబా సిరీస్‌లో నటించింది. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta) -
స్టార్ హీరోయిన్‌కి కూతురు పుట్టింది.. ఎంత ముద్దుగా ఉందో? (ఫొటోలు)
-
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి..!
బుల్లితెర భామ స్మృతి ఖన్నా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2017లో నటుడు తమ్ గుప్తాను పెళ్లాడిన నటికి ఇప్పటికే అనైక కూతురు కూడా ఉన్నారు. తాజాగా మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ బుల్లితెర జంటకు రెండో కూతురికి తమ జీవితంలోకి ఆహ్వానం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.స్మృతి ఖన్నా బాలీవుడ్లో మెరీ ఆషికి తుమ్ సే హై అనే సీరియల్‌తో కెరీర్ ప్రారభించింది. ఆ తర్వాత యే హై ఆషికి, సీఐడీ, బాలికా వధు(తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) లాంటి సీరియల్స్‌తో మెప్పించింది. చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో డాక్టర్ వందనా మిట్టల్ పాత్రలో అలరించింది. అంతే కాకుండా పలు రియాలిటీ షోలలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. వీటితో పాటు జట్ ఎయిర్వేస్ అనే పంజాబీ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. చివరిసారిగా 2022లో వచ్చిన దప్పా అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. అయితే పెళ్లి తర్వాత సీరియల్స్‌కు గుడ్‌బై చెప్పేసింది బుల్లితెర భామ స్మృతి ఖన్నా. View this post on Instagram A post shared by Smoo (@smriti_khanna) -
బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె.. అభినందనల వెల్లువ!
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె బిడ్డకు జన్మనిచ్చారు. శనివారం సాయంత్రం ముంబయిలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికెళ్లిన దీపికా పదుకొణెకు ఇవాళ పండంటి ఆడబిడ్డ పుట్టింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న దీపికా, రణ్‌వీర్‌సింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. కాగా.. ఇటీవలే కల్కి మూవీతో అభిమానులను అలరించింది దీపికా పదుకొణె. 2018లో పెళ్లి చేసుకున్న దీపిక-,రణ్వీర్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. దీపికా గర్భంతో ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సెప్టెంబర్‌లో మొదటి బిడ్డను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. తాజాగా ఇవాళ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కాగా.. మొదటిసారి రామ్ లీలా చిత్రంలో దీపికా - రణ్వీర్ జంటగా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ అనంతరం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. -
బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. భర్త ఎమోషనల్ పోస్ట్!
యంగ్ హీరో డార్లింగ్ కృష్ణ తండ్రయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమకు కూతురు పుట్టిందని ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ప్రయాణంలో తన భార్యను చూసి గర్వపడుతున్నానని హీరో ఎమోషనల్ అయ్యారు. ప్రపంచంలో ఇలాంటి బాధను భరిస్తోన్న తల్లులందరికీ నమస్కారం అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. లవ్ మాక్‌టైల్ అనే కన్నడ సినిమాతో డార్లింగ్ కృష్ణ, నటి మిలానా నాగరాజ్ జంటగా నటించారు. ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ జంటగా నమ్మ దునియా నమ్మ స్టైల్, చాల్తి అనే సినిమాలలో నటించారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట 2021లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహా వేడుకలో కన్నడ చిత్రసీమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Darling Krishna (@darling_krishnaa) -
క్యాన్సర్‌తో పోరాడుతున్న పాపకు అడివి శేష్ సర్ప్రైజ్ (ఫోటోలు)
-
బిడ్డకు జన్మనిచ్చిన హీరామండి నటి!
బాలీవుడ్ నటి రిచా చద్దా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2024లో గుడ్ న్యూస్ చెప్పిన నటి జూలై 16న కుమార్తె జన్మించినట్లు వెల్లడించింది. ఈ విషయంపై సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. మా పట్ల మీ ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు తెలిపారు . ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అభినందనలు చెబుతున్నారు.కాగా.. ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్‌తో అభిమానులను అలరించింది. అయితే రిచా చద్దా, అలీ ఫజల్ మొదట 2021లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 2023లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించి గ్రాండ్‌గా మరోసారి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. దాదాపు 9 ఏళ్లపాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. వీరిద్దరు 2012లో జంటగా నటించిన ఫక్రే మూవీ సెట్స్‌లో తొలిసారి కలుసుకున్నారు. View this post on Instagram A post shared by Richa Chadha (@therichachadha) -
Hyderabad: ఆర్టీసీ బస్సులో పురుడు పోశారు..
కాచిగూడ (హైదరాబాద్): పురిటి నొప్పులు పడుతున్న గర్భిణికి బస్సులోనే డెలివరి చేసి ఆర్టీసీ సిబ్బంది మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. నగరానికి చెందిన శ్వేతారత్నం అనే గర్భిణి ఆరాంఘర్‌లో ముషీరాబాద్ డిపోకు చెందిన బస్సులో (టీఎస్వో 2జెడ్ 0341) శుక్రవారం ఉదయం 7:30 గంటల సమయంలో ఎక్కారు. ఆ బస్సులో డ్రైవర్ ఎం.అలీ, కండక్టర్ బి.సరోజ విధుల్లో ఉన్నారు. బస్సు బహదూర్‌పురా వద్దకు రాగానే శ్వేతారత్నంకు నొప్పులు రావడంతో బస్సు డ్రైవర్ బస్సును పక్కనే ఆపి ప్రయాణికులను దించాడు. బస్సు కండక్టర్ బి.సరోజ తోటి ప్రయాణికుల సహాయంతో శ్వేతారత్నంకు డెలివరీ చేశారు. శ్వేతారత్నం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని జజ్జిఖానాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి అడ్మిట్ చేశారు. మహిళకు పురుడు పోసిన కండక్టర్ సరోజను పలువురు ప్రయాణికులు అభినందించారు. ముషీరాబాద్ ఇన్చార్జి డీఎం రఘు అలీ, సరోజలను అభినందించారు. ఆర్టీసీ హైదరాబాద్ సిటీ రీజినల్ మేనేజర్ వరప్రసాద్, డిప్యూటీ ఆర్ఎంఓ జగన్, కాచిగూడ డీఎం, ముషీరాబాద్ డిపో ఇన్చార్జి డీఎం రఘు, బర్కత్‌పుర డీఎం వేణుగోపాల్, ముషీరాబాద్ అసిస్టెంట్ మేనేజర్ కళ్యాణి తదితరులు డ్రైవర్, కండక్టర్లను అభినందించి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ డ్రైవర్, కండక్టర్లకు అభినందనలు తెలియజేశారు. -
తండ్రయిన స్టార్ హీరో.. మహాలక్ష్మి పుట్టిందని వీడియో పోస్ట్
మరో హీరో తండ్రయ్యాడు. తాజాగా తమిళ హీరో శివకార్తికేయన్ భార్య పండంటి బిడ్డకు జన్మనివ్వగా, ఇప్పుడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా తండ్రి హోదాలోకి వచ్చేశాడు. ఇతడి భార్య నటాషా.. సోమవారం రాత్రి ఆడపిల్లని ప్రసవించింది. ప్రస్తుతం తల్లిబిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. ఈ విషయాన్ని వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ధ్రువీకరించారు.(ఇదీ చదవండి: మూడోసారి తండ్రయిన స్టార్ హీరో శివకార్తికేయన్)తండ్రి డేవిడ్ ధావన్ 2012లో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆ తర్వాత బద్లాపూర్, అక్టోబర్, స్ట్రీట్ డ్యాన్సర్ త్రీడీ, బేడియా తదితర చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'బేబీ జాన్', 'సన్నీ సంస్కారీ కీ తుల్సీ కుమారి' అనే మూవీస్ చేస్తున్నాడు.వరుణ్ ఫ్యామిలీ విషయానికొస్తే 2021లో నటాషా దలాల్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అంటే దాదాపు మూడేళ్ల తర్వాత ఈమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే వరుణ్‌కి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2' సినిమా) View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
రెండోసారి తండ్రైన ప్రముఖ నటుడు!
ప్రముఖ బాలీవుడ్ నటుడు హర్మన్ బవేజా రెండోసారి తండ్రయ్యారు. ఆయన భార్య సాషా రాంచందనీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ హర్మన్ బవేజా జంటకు అభినందనలు చెబుతున్నారు. డిసెంబరు 2022లోనే వీరిద్దరికి ఓ కుమారుడు జన్మించగా.. తాజాగా ఆడిబిడ్డకు జన్మనిచ్చారు.కాగా.. హర్మన్ బవేజా, సాషా రాంచందనీ 2021లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సినిమాల విషయానికొస్తే హర్మన్ బవేజా చివరిసారిగా స్కూప్లో కనిపించాడు. సన్యా మల్హోత్రాతో కలిసి ది గ్రేట్ ఇండియన్ కిచెన్ హిందీ రీమేక్‌లో కనిపించనున్నారు. 2008లో లవ్ స్టోరీ 2050 చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు హర్మన్. ఇందులో ప్రియాంక చోప్రా కూడా ప్రధాన పాత్రలో నటించింది. అంతే కాకుండా వాట్స్ యువర్ రాషీ, విక్టరీ, దిష్కియావూన్, ఇట్స్ మై లైఫ్ చిత్రాల్లో కనిపించారు. View this post on Instagram A post shared by Rowena Baweja (@rowenabaweja) -
టీవీ నటికి ముద్దుల పాపాయి : కుటుంబం ఘన స్వాగతం, వైరల్ వీడియో
టెలివిజన్ నటి, మోహెనా కుమారి సింగ్, సుయేష్ రావత్ దంపతుల ఇంట ఇటీవల ఆడబిడ్డ జన్మించింది. అయితే బుల్లి యవరాణికి మోహెనా కుటుంబం వేడుకగా స్వాగతం పలికిన తీరు విశేషంగా నిలిచింది. ఆరోగ్యం కుదుటపడిన నేపథ్యంలో తల్లీ-కూతురు ఇద్దరూ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో పాపాయికి ఘన స్వాగతం పలికారుకుటుంబ సభ్యులు, సన్నిహితులు. మోహెనా కుమారి సింగ్ అభిమాని పేజీ ప్రకారం, మోహెనా భర్త, సుయేష్ కుమారుడు అయాన్ష్‌ని చేతుల్లో పట్టుకుని కనిపించాడు. పాపాయిని పరిచయం చేసినపుడు బంధువులు, స్నేహితులు ఆనందంతో స్టెప్పులు వేశారు. అటు అయాన్ష్ కూడా తన బుజ్జి చెల్లాయ్ని చూసి మురిసి పోయాడు. ఇల్లంతా పింక్ కలర్ (పాపాయికి పింక్ కలర్ సింబల్) బెలూన్స్, బటర్ ఫ్లైస్తో అంలంకరించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. View this post on Instagram A post shared by princess of reva (@mohena.ksingh) కాగా ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’ అనే సీరియల్లో 'కీర్తి గోయెంకా సింఘానియా'గా నటించి దాన్నే ఇంటి పేరుగా మార్చుకున్న నటి మోహెనా. నయా అక్బర్ బీర్బల్, కుబూల్ హై, సిల్సిలా ప్యార్ కా , ప్యార్ తునే క్యా కియాతో లాంటి టీవీ సీరియల్స్‌తో పాపులర్ అయింది. తొలిబిడ్డగా కుమారుడు అయాన్ష్ పుట్టినపుడు చేతుల్లోకి మొదటిసారి పట్టుకున్నప్పుడు ఎంత భావోద్వేగానికి లోనైందీ తెలిపింది. అలాగే తన రెండో ప్రెగ్నెన్సీని కూడా భారతీయ శాస్త్రీయ నృత్యం చేస్తూ ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Mohena Kumari Singh (@mohenakumari) -
కుమార్తెను పరిచయం చేసిన శర్వానంద్ (ఫొటోలు)
-
Gal Gadot: నాలుగో బిడ్డకు జన్మనిచ్చిన ‘వండర్ వుమెన్’
డిస్నీ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘వండర్ వుమెన్’ ఒకటి. 2017లో రిలీజైన ఈ హాలీవుడ్ మూవీతో గాల్ గాడోట్ సూపర్ హీరోయిన్గా మారిపోయింది. తనదైన నటన, యాక్షన్, గ్లామర్‌తో యావత్ సినీ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత గాల్ గాడోట్ని వండర్ వుమెన్‌గా పిలవడం ప్రారంభించారు. తాజాగా ఈ సూపర్ లేడి నాలుగోసారి తల్లైయింది. బుధవారం ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ పాపకు ఓరి అని నామకరణం చేసినట్లు పేర్కొంది. ‘ ప్రెగ్నెన్సీ అంత సులభం కాదు.. కానీ నీ రాకతో మా జీవితాల్లోకి వెలుగు వచ్చింది. నీ పేరుగు తగినట్టే నీ లైఫ్‌లో వెలుగులు చిమ్మాలి అని ఆకాంక్షించారు. ఓరి అంటే హెబ్రూ భాషలో నా క్రాంతి అని అర్ధం’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది గాల్. కాగా, గాల్ గాడోట్ 2008లో జారోన్ వార్సానోను ప్రేమ వివాహం చేసుకుంది. ఇప్పటికే వీరిద్దరి ముగ్గురు ఆడ పిల్లలు. పేర్లు ఆల్మా(12), మాయా(6), డేనీయోలా(2). ఓరితో కలిపి మొత్తం నలుగురు సంతానం. సినిమాల విషయానికొస్తే.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్(2009) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది గాల్ గాడోట్. ఆ తర్వాత వండర్ ఉమెన్‌తో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుంది.ఇప్పటికే 20పైగా సినిమాల్లో నటించింది. తాజాగా ఆమె నటించిన హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో బాలీవుడ్ భామ అలియా భట్ ఓ ప్రధాన పాత్ర పోషించింది. ఇది అలియా భట్‌కి తొలి హాలీవుడ్ మూవీ. ప్రస్తుతం మూవీ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. (గాల్ గాడోట్ ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Gal Gadot (@gal_gadot) -
తండ్రి అయిన 'విశ్వంభర' డైరెక్టర్ వశిష్ఠ
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమాతో బిజీగా ఉన్నారు. ఒక్క సినిమా తీసిన అనుభవమున్న దర్శకుడు వశిష్ఠ.. దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హీరోయిన్ త్రిష గురించి రీసెంట్‌గానే అధికారిక ప్రకటన ఇచ్చారు. ఇలా అంతా సాఫీగా జరుగుతోంది. ఇలాంటి టైమ్‌లో ఓ గుడ్ న్యూస్ కూడా వినిపించింది. దర్శకుడు వశిష్ఠ తండ్రి అయ్యాడు. (ఇదీ చదవండి: అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన) వశిష్ఠ అసలు పేరు వేణు. తండ్రి నిర్మాత కావడంతో 'ప్రేమలేఖ' అనే సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ ఒక్క చిత్రంతో ఇక నటనకు పుల్‌స్టాప్ పెట్టేశాడు. చాలా ఏళ్ల తర్వాత 'బింబిసార' అనే చిత్రంతో దర్శకుడిగా మారిపోయాడు. అద్భుతమైన సక్సెస్ అందుకున్న ఈ చిత్రం.. వశిష్ఠకు మెగా ఛాన్స్ వచ్చేలా చేసింది. ప్రస్తుతం చిరుతో 'విశ్వంభర' సినిమా చేస్తూ వశిష్ఠ బిజీగా ఉన్నాడు. మరోవైపు ఇతడి భార్య సుజాత ప్రెగ్నెన్సీ ఉంది. సోమవారం సాయంత్రం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఈ విషయం ఎవరూ బయటకు చెప్పలేదు. పాప పుట్టడం గురించి దర్శకుడు వశిష్ఠ అందరూ తెలియజేయాల్సి ఉంది. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాడెవరో తెలుసా?) -
ఆడపిల్ల పుట్టిందని అమ్మేశారు
తిరుమలగిరి(నాగార్జునసాగర్): పుట్టిన నాలుగురోజులకే ఆడ శిశువును అమ్మేశారు. అయితే ఈ విషయం ఆలస్యంగా చూసింది. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం రంగండ్ల గ్రామానికి చెందిన ఆంగోతుసేవ– జ్యోతి దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. జ్యోతి గత సంవత్సరం సెపె్టంబర్ 16న నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మరో ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే ఇద్దరు ఆడపిల్లలను సాకే స్తోమత లేదని పుట్టిన శిశువును అమ్ముతామని ఆదే ఆస్పత్రిలో పనిచేస్తున్న స్వీపర్ ఈసం వరమ్మకు చెప్పారు. సంతానం లేక ఇబ్బంది పడుతున్న నాంపల్లి మండలం పసునూరుకు చెందిన బత్తుల సైదులు– కవిత దంపతులకు వరమ్మ ఈ విషయాన్ని చేరవేసింది. దీంతో వారు సెస్టెంబర్ 20న సేవ–జ్యోతి దంపతులకు రూ1.50 లక్షలు ఇచ్చి ఆ శిశువును తీసుకెళ్లారు. కాన్పు తర్వాత పాప కనిపించకపోవడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి అంగన్వాడీ టీచర్‌కు చెప్పారు. ఆమె చైల్డ్ వెల్ఫేర్ అధికారి దృష్టికి తీసుకెళ్లగా, పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు విచారించగా, అసలు విషయం వెలుగుచూసింది. దీంతో సేవ–జ్యోతి దంపతులతోపాటు, ఆడశిశువును కొన్న సైదులు–కవిత దంపతులు, స్వీపర్ వరమ్మను శుక్రవారం అరెస్టు చేశారు. ఆడశిశువును నల్లగొండలోని శిశుగృహకు తరలించారు. -
తండ్రి అయిన ‘బిగ్‌బాస్’ అర్జున్.. ఏం పేరు పెట్టారంటే..?
బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ అర్జున్ అంబటి తండ్రి అయ్యాడు. అర్జున్ భార్య సురేఖ ఈ రోజు (జనవరి 9) పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అర్జున్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన కూతురుకి ఆర్ఖా అని నామకరణం చేశాడు. కూతురు పుట్టినా, కొడుకు పుట్టినా ఈ పేరునే పెట్టుకుంటానని బిగ్‌బాస్ హౌస్‌లోనే చెప్పాడు అర్జున్. తన పేరులోని ఆర్.. సురేఖ పేరులో నుంచి ఖ తీసుకొని అర్ఖా అని పేరు ఫిక్స్ చేసినట్లు ఓ వీకెండ్ ఎపిసోడ్లో చెప్పాడు. అయితే తనకు మాత్రం కూతురు పుట్టాలనే ఉందని చెప్పాడు. అనుకున్నట్లే అర్జున్‌కి కూతురే పుట్టింది. దీంతో అర్జున్ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. అర్జున్-సురేఖ దంపతులకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, పలు సీరియళ్లలో హీరోగా నటించిన అర్జున్.. బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొని తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. షో ప్రారంభమైన ఐదు వారాల తర్వాత అర్జున్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతనితో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు త్వరగానే ఎలిమినేట్ అయ్యారు. కానీ అర్జున్ మాత్రం చివరి వరకు ఉన్నాడు. ఫినాలే రోజు టాప్ 6 ప్లేస్‌లో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం బుల్లితెరపై షోలు, సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. త్వరలోనే ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Nagarjuna Reddy Ambati (@ambati_arjun) -
రెండేళ్ల పాప మృతి : హైదరాబాద్
-
రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు
టాలీవుడ్లో గుర్తుండిపోయే సినిమాల లిస్ట్ తీస్తే అందులో 'బలగం' కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ గ్రామీణ నేపథ్య కథతో తీసిన ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. అప్పటివరకు కమెడియన్ గా తెలిసిన వేణులో ఇంతమంచి దర్శకుడు ఉన్నాడని బయటపెట్టింది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 29 సినిమాలు రిలీజ్) ఈ ఏడాది 'బలగం' సినిమాతో దర్శకుడిగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన వేణు యెల్దండి.. ఇప్పుడు తండ్రిగా మరోసారి ప్రమోషన్స్ పొందాడు. తనకు అమ్మాయి పుట్టిందని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఇకపోతే వేణుకి ఇదివరకే ఓ కొడుకు ఉన్నాడు. ఇద్దరూ కలిసి యూట్యూబ్ ఛానెల్లో పలు వీడియోస్ కూడా చేశారు. ఇక 'బలగం' తర్వాత మళ్లీ దిల్ రాజు నిర్మాణంలో వేణు మరో సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో 'బలగం'లో యాక్ట్ చేసిన ప్రియదర్శినే హీరోగా నటిస్తున్నాడని టాక్. అయితే ఈ విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: మెగాస్టార్ పాన్ ఇండియా సినిమా.. రెండు నెలల్లో పూర్తి) View this post on Instagram A post shared by Venu Yeldandi (@venuyeldandi9) -
పుట్టిన 24 గంటలకే బైపాస్ సర్జరీ
లక్డీకాపూల్: గుండెలో రంధ్రంతో పుట్టిన ఒక రోజు వయసుగల ఆడశిశువుకు మంగళవారం నిమ్స్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. యూకేకు చెందిన ఆల్డర్ హే ఆస్పత్రి కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ ధన్నపునేని ఆధ్వర్యంలోని వైద్య బృందం నిమ్స్ కార్డియోథిరాసిక్ సర్జన్ డాక్టర్ ఎ. అమరేశ్‌రావు, పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్‌తో కలసి ఈ సర్జరీ చేపట్టింది. నిజామాబాద్ జిల్లా చిట్టాపూర్‌కు చెందిన ప్రశాంత్ గ్రూప్–2 ప్రిపరేషన్ కోసం తన భార్య సమీర శ్రావణితో కలసి హైదరాబాద్ వచ్చి ఇబ్రహీంపట్నంలో ఉంటున్నాడు. ఆయన భార్య సోమవారం ఉదయం ఆడశిశువు (సిజేరియన్ శస్త్రచికిత్స ద్వారా)కు జన్మనివ్వగా శిశువుకు గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తరలించారు. అప్పటికే గుండె సంబంధ జబ్బులతో బాధపడుతున్న ఐదేళ్లలోపు చిన్నారులకు చార్లెస్ హార్ట్ హీరోస్ పేరిట నిమ్స్‌లో యూకే వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని (ఈ నెల 24 మొదలు 30 వరకు) నిర్వహిస్తుండటంతో వారి ఆధ్వర్యంలో శిశువుకు బైపాస్ సర్జరీ చేశారు. కాగా, హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ (ఏపీ–తెలంగాణ) మంగళవారం నిమ్స్‌ను సందర్శించి డాక్టర్ రమణ, ఆయన బృందాన్ని కలిసి అభినందించారు. అలాగే గుండె సర్జరీ అనంతరం కోలుకుంటున్న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన చిన్నారి నిత్యను గారెత్ పరామర్శించారు. నవజాత శిశువులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి!
టాలీవుడ్ బుల్లితెర నటి ప్రియాంక నాయుడు పండంటి బిడ్డకు జన్మినిచ్చింది. వదినమ్మ సీరియలతో గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక.. బుల్లితెర నటుడు మధుబాబును ప్రేమ వివాహం చేసుకున్నారు. మంగమ్మ గారి మనవడు సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన మధుబాబు.. ఆ తర్వాత అక్కాచెల్లెల్లు, అభిషేకం సీరియల్స్‌తో ఫేమ్ తెచ్చుకున్నారు. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. గతంలో సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రియాంక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. (ఇది చదవండి: బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి చార్లీ!) ఇన్‌స్టాలో రాస్తూ..' మా హృదయాలను ఆనందంతో నింపడానికి ఒక సరికొత్త చిన్న పాప వస్తోంది. దివి నుంచి మా జీవితాలలోకి పంపబడిన స్వర్గంలోని చిన్న తార. మీ అందరి ప్రేమ, మద్దతు పట్ల మేము ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాం. మీ ప్రార్థనలకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విలువైన సమయాన్ని మన ఎంజెల్తో అస్వాదిస్తాం' అంటూ షేర్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ జంటకు అభినందలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by G madhu (@actor__madhubabu) -
నిద్రలేని రాత్రులు కూడా సంతోషాన్నిస్తాయి.. గుడ్‌న్యూస్ చెప్పిన యువీ!
Yuvraj Singh Hazel Keech Second Baby: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిమానులతో శుభవార్త పంచుకున్నాడు. తమ కుటుంబంలో కొత్త సభ్యురాలి ఆగమనం గురించి తెలియజేస్తూ అందమైన ఫొటోను షేర్ చేశాడు. తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందన్న విషయాన్ని శ్రావణ శుక్రవార వేళ ఫ్యాన్స్‌కు తెలియజేశాడు. మా యువరాణి వచ్చేసింది ఈ మేరకు.. ‘‘మా యువరాణి ఆరా రాక కారణంగా నిద్రలేని రాత్రులను కూడా సరదాగా గడిపేస్తున్నాం. తన రాకతో మా కుటుంబం పరిపూర్ణమైంది’’ అని యువీ ఇన్‌స్టాలో ఫొటో షేర్ చేశాడు. ఇందులో.. యువీ భార్య హాజిల్ కీచ్ ఒడిలో కొడుకు ఓరియోన్ ఉండగా.. ఈ సిక్సర్ల కింగ్ చిన్నారి కూతురిని తన ఒడిలో పడుకోబెట్టుకుని పాలు పట్టిస్తున్నాడు. సిక్సర్ల కింగ్ ఆమె చూపులకు బౌల్డ్ మనసుకు ఆహ్లాదం కలిగిస్తున్న ఈ దృశ్యం ఎంతో అందంగా ఉందంటూ అభిమానులు యువీ కుటుంబానికి సంబంధించిన అపురూప ఫొటోను వైరల్ చేస్తున్నారు. కాగా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కిన యువరాజ్ సింగ్.. బాలీవుడ్ నటి హాజిల్ కీచ్ చూపులకు మాత్రం బౌల్డ్ అయిపోయాడు. నాలుగేళ్లపాటు ఆమె ప్రేమకై నిరీక్షించిన యువీ.. 2016, నవంబరు 30న పెళ్లి బంధంతో ఆమెను శాశ్వతంగా తన మనిషిగా మార్చేసుకున్నాడు. ఈ జంటకు జనవరి 25, 2022లో బాబు ఓరియోన్ జన్మించాడు. తాజాగా ఆరా రూపంలో కూతురు కూడా రావడంతో వీరిది కంప్లీట్ ఫ్యామిలీ అయింది. చదవండి: Asia Cup: షెడ్యూల్, జట్లు, ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial) -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జనతా గ్యారేజ్ నటి!
బాలీవుడ్ భామ విదిషా శ్రీవాస్తవ బాలీవుడ్‌తో పాటు తెలుగువారికి కూడా పరిచయమే. 2007లో విడుదలైన మా ఇద్దరి మధ్య అనే తెలుగు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో అలా,ప్రేమ్, అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత శ్రీకాంత్ సరసన దేవరాయ చిత్రంలోనూ కనిపించింది. తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్‌లోనూ మెరిసింది. జనతా గ్యారేజ్ మూవీలో ఓ పాత్రలో నటించారు. బాలీవుడ్లో ఎక్కువగా బుల్లితెరపైనే ఫేమ్ తెచ్చుకుంది. తాజాగా ఆమె ఈనెల 11న విదిషా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. అత్యంత దారుణస్థితిలో నటుడు మృతి!) అందుకే ప్రెగ్నెన్సీ వల్ల జూలై నుంచి సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు విదిషా. అయితే ఈ విషయాన్ని ఆమె ఎక్కడా కూడా షేర్ చేయలేదు. డెలివరీకి కేవలం 10 రోజుల ముందు నుంచి మాత్రమే విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. అవును.. 2018లోనే విదిషా బాయ్‌ఫ్రెండ్ సాయిక్ పాల్ని పెళ్లి చేసుకుంది. అయితే ఈ విషయాన్ని నాలుగేళ్ల పాటు రహస్యంగా ఉంచింది. బనారస్‌లో పెళ్లయిన విషయాన్ని ఏడాది క్రితమే అఫీషియల్‌గా ప్రకటించింది. తాజాగా ఈ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికింది. (ఇది చదవండి: గ్లామర్‌తో మతిపోగొడుతోన్న బ్యూటీ.. సినిమా బ్యాన్ చేయాలంటూ..) View this post on Instagram A post shared by Vidisha Srivastava (@vidishasrivastava) -
పెళ్ళైన ఒక్క రోజుకే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నవవధువు..
గ్రేటర్ నోయిడా: ఓ నూతన వధువు పెళ్ళైన మరుసటి రోజునే ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఉదంతం గ్రేటర్ నోయిడాలో ఒక గ్రామంలో చోటుచేసుకుంది. వివాహం జరిగి 24 గంటలైనా కాకుండానే తన భార్యకు డెలివరీ కావడంతో షాక్ లో ఉండిపోయాడు నవవరుడు. కడుపు నొప్పని వెళ్తే.. వివరాల్లోకి వెళ్తే జూన్ 26, సోమవారం రోజున పెద్దల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా ఆ జంట ఒక్కటయ్యారు. అదే రోజు రాతి ఆ వధువుకు కడుపులో చిన్నగా నొప్పి వస్తోందని చెప్పడంతో దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెను పరీక్షించి చూడగా ఆమె ఏడో నెల గర్భవతి అని నిర్ధారించి డెలివరీ కూడా చేయగా అడబిడ్డకు జన్మనిచ్చింది వధువు. దీంతో ఆమె భర్తతో పాటు అత్తమామలు షాక్ కు గురయ్యారు. గతంలో కిడ్నీలో రాళ్లు ఉన్నాయని ట్రీట్మెంట్ చేయించాము. ఆ తర్వాత కడుపు వాపు వస్తుండటంతో ట్రీట్మెంట్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్ అనుకున్నామని వధువు తల్లిదండ్రులు చెబుతున్నారు. బంధువుల జోక్యంతో.. సికింద్రాబాద్ కు చెందిన ఆ యువతి పెళ్ళికి ముందే గర్భం దాల్చిందన్న విషయం తెలిసి కూడా పెళ్లికూతురు తల్లిదండ్రులు విషయాన్ని దాచిపెట్టారని ఆమెను గానీ ఆమె బిడ్డను గానీ తమ ఇంటిలోకి రానిచ్చేది లేదని మొదట తెగేసి చెప్పారు పెళ్ళికొడుకు తల్లిదండ్రులు. అంతలోనే బంధువులు కల్పించుకుని సమస్య సద్దుమణిగేలా చేయడంతో వారు మాకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: వెడ్డింగ్‌లో విచిత్రం.. కోపంతో ఊగిపోయిన వధువు ఏం చేసిందంటే.. -
డెలివరీకి ముందు ఉపాసన ఏం చేసిందంటే.. వీడియో వైరల్!
మెగా కుటుంబం, ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మధుర క్షణాలు ఈ నెల 20న ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లయిన 11 ఏళ్లకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులయ్యారు. జూన్ 20న మంగళవారం మెగా కోడలు ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఇంట పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భం కోసం మెగా ఫ్యామిలీతో ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ప్రత్యేకమైన సందర్భానికి జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్ వేదికైంది. (ఇది చదవండి: మెగాప్రిన్సెస్‌కు ఘనస్వాగతం, ఫోటో షేర్ చేసిన ఉపాసన) కాగా.. డెలివరీ కోసం ఒకరోజు ముందుగానే మెగా కుటుంబం అపోలో ఆస్పత్రికి చేరుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోనూ ఉపాసన తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఆస్పత్రిలో వీల్ చైర్‌పై వెళ్తున్న వీడియోను అభిమానులతో పంచుకుంది. 'అంతేకాకుండా ఐదు రోజుల క్రితం జరిగిన అత్యంత మధురమైన క్షణమిదే. మీ అందరికీ ప్రేమకు ధన్యవాదాలు.' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. వీడియోతో పాటు మై లిటిల్ ప్రిన్సెస్ రావడానికి ముందు అంటూ కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: ఆదిపురుష్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ఎలాంటి కామెంట్ చేశాడంటే..) Moments before the #MegaPrincess arrived ❤️ Love this emotion video of #UpasanaKonidela. We spot #RamCharan𓃵 at the end too! 😍🫶🏼pic.twitter.com/1FYOijRvtS — ᴠᴇɴᴋᴀ𝟽ᴋᴜᴍᴀʀᴍsᴅɪᴀɴ (@venkysayzzz) June 25, 2023 -
ఈ రోజే ఉపాసన డిశ్చార్జ్.. అందరికీ ఉన్న ఆ సందేహం రివీల్ చేస్తారా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన కొణిదెల దంపతులు తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంతో పాటు ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకున్నారు. జూన్ 20వ తేదీ, మంగళవారం పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆరోజు నుంచి అపోలో ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో ఆమె ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మెగా ప్రిన్సెస్‌తో ఆమె ఈరోజు జూన్ 23న డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది. (ఇదీ చదవండి: కోలీవుడ్ సూపర్‌స్టార్ ఎవరు?) ఉపాసనతో పాటు బేబీ కూడా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలపడంతో ఈ రోజు మధ్యాహ్నం డిశ్చార్జ్ కానున్నారు. ఇప్పటికే అందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మెగా అభిమానులతో పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొందరికి ఓ సందేహం ఉంది. ఉపాసనకు నార్మల్ డెలివరీనా..? సిజేరియన్ చేశారా? అని! దీంతో నేడు ఈ దంపతులిద్దరూ సమాధానం చెప్పే అవకాశం ఉంది! ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లే ముందు రామ్ చరణ్- ఉపాసన దంపతులు అపోలో ఆస్పత్రి వదద మీడియాతో మాట్లాడనున్నారు. మెగా ప్రిన్సెస్ రాకతో శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ థాంక్స్ తెలపనున్నారు. ఇదే సమయంలో బేబీకి చెందిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో రియాక్ట్ అయిన మెగా ఫ్యామిలీ అవన్నీ ఫేక్ అని తెలిపింది. మరీ ఈరోజు బేబీ ఫోటో రివీల్ చేస్తారేమోనని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. (ఇదీ చదవండి: పిల్లలు ఎందుకు కలగలేదో ఓపెన్‌గానే చెప్పేసిన నటి) -
Ram Charan-Upasana: అపోలో ఆస్పత్రిలో మెగా ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
-
చరణ్-ఉపాసన బిడ్డకు ఆ నంబర్ సెంటిమెంట్!?
మెగాఇంట్లో సెలబ్రేషన్స్ సందడి మొదలైపోయింది. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు జూన్ 20న అంటే ఈ రోజు ఉదయం పాప పుట్టింది. దీంతో సెలబ్రిటీల దగ్గర నుంచి అభిమానులకు వరకు ప్రతిఒక్కరూ చరణ్-ఉపాసన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అదే సమయంలో మెగా ప్రిన్సెస్ విషయంలో ఓ సెంటిమెంట్ వర్కౌటైందా అని కూడా మాట్లాడుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. రెండో మూవీ 'మగధీర'తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. 2012లో ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట రీసెంట్ గా 11వ పెళ్లి వార్షికోత్సవం జరుపుకొంది. ఇప్పుడు జూన్ 20వ తేదీన పండంటి పాపాయికి ఉపాసన జన్మనిచ్చింది. మరోవైపు చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22, పవన్ కల్యాణ్ పుట్టినరోజు సెప్టెంబరు 2. పైన చెప్పిన వాటిలో ఏది చూసినా సరే దాదాపు అన్నింట్లోనూ '2' నంబర్ కనిపిస్తుంది. దీంతో అభిమానులు కూడా.. చరణ్-ఉపాసన దంపతులకు ఈ నంబర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందా అని మాట్లాడుకుంటున్నారు. ఇదంతా పక్కనబెడితే '2023' చరణ్ కి స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ ఈ ఏడాదే వచ్చింది కదా! Welcome Little Mega Princess !! ❤️❤️❤️ You have spread cheer among the Mega Family of millions on your arrival as much as you have made the blessed parents @AlwaysRamCharan & @upasanakonidela and us grandparents, Happy and Proud!! 🤗😍 — Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2023 (ఇదీ చదవండి: మెగా వారసురాలు అంటూ.. వీడియోలు షేర్ చేస్తున్న ఫ్యాన్స్) -
మెగా ఫాన్స్ హంగామా పుట్టిన పాపతో రామ్ చరణ్
-
పండంటి పాపకు జన్మనిచ్చిన ఉపాసన మెగా ఫ్యామ్లీయ్ లో సంబరాలు
-
అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట?
సాక్షి,ముంబై: రిలయన్స్ అధినేత, ఆసియా బిలియనీర్ ముఖేశ్ అంబానీ ఇంటికి ఆడబిడ్డ రూపంలో లక్ష్మీదేవి తరలి వచ్చింది. ముఖేశ్, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా దంపతులకు సోమవారం(మే 31న) కుమార్తె పుట్టింది.దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.అంబానీ కుటుంబం దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ బుజ్జి పాపాయికి ఏం పేరు పెడతారనే చర్చ కూడా ఊపందుకుంది. (వారసురాలొచ్చేసింది.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆకాష్ అంబానీ దంపతులు) ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల మనవరాలు అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ కమెంట్ చేస్తున్నారు. మే 31న మిథున రాశి (జెమిని) పాపాయి పుట్టిందని, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం,‘కే’ అనే అక్షరం ఉత్తమమైందని భావిస్తున్నారు. అంతేకాదు కష్వి, కైరా, కియానా, కుహూ, కనికా , క్రిష్టి లాంటి పేర్లయితే బావుంటాయంటూ కమెంట్ చేశారు. కాగా 2019, మార్చిలో పెళ్లి చేసుకున్న శ్లోకా మెహతా-ఆకాష్ అంబానీ జంటకు ఇప్పటికే పృథ్వీ అనే కుమారుడు ఉన్నాడు. డిసెంబర్ 2020లో పృథ్వీకి జన్మనిచ్చిన శ్లోకా గత ఏప్రిల్‌లో జరిగిన నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్‌లో బేబీ బంప్‌తో కనిపించినన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ఇషా ట్విన్స్‌కు అంబానీ బ్రహ్మాండమైన గిఫ్ట్: వీడియో వైరల్ AsmiJain ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్‌వర్త్ గురించి తెలుసా? -
వారసురాలొచ్చేసింది.. అంబానీ ఇంట మళ్ళీ ఆనందాల వెల్లువ..!!
భారతీయ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) ఇంటికి వారసురాలు వచ్చేసింది. ముకేశ్ పెద్ద కొడుకు 'అకాశ్ అంబానీ & శ్లోక మెహతా' దంపతులు మరో సారి తల్లిదండ్రులయ్యారు. శ్లోకా బుధవారం హాస్పిటల్లో ఆడబిడ్డకు జన్మనించింది. అంబానీ ఇంటికి వారసురాలు రావడంతో కుటుంభం మొత్తం ఆనందంతో మునిగిపోయింది. 2019లో ఆకాష్, శ్లోకల వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే ఒక బాబు ఉన్నట్లు అందరికి తెలుసు. కాగా ఇప్పుడు మరో పండంటి బిడ్డకు ఆ దంపతులు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అంబానీ కుటుంబానికి సన్నిహితుడైన 'పరిమల్ నథ్వానీ' ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇందులో ఆకాష్, శ్లోక అంబానీల ప్రిన్సెస్ రాకకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ఈ అమూల్యమైన క్షణాలు జీవితంలో అపారమైన ప్రేమను తెస్తాయని ట్వీట్ చేశారు. (అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట?) 2023 ఏప్రిల్ నెలలో ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో బేబీ బంప్‌తో కనిపించిన శ్లోక మెహతా మరో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ప్రకటించారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పుడు వైరల్ అయింది. (ఇదీ చదవండి: మళ్ళీ తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు.. ఈ సారి ఎంతంటే?) Heartiest congratulations to Akash and Shloka Ambani on the joyous arrival of their little princess! May this precious blessing bring immense happiness and love to your lives. pic.twitter.com/MXHdohoxqi — Dhanraj Nathwani (@DhanrajNathwani) May 31, 2023 ఇదిలా ఉండగా గత సంవత్సరం ముకేశ్ అంబానీ కుమార్తె ఈషా కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలో ప్రసవించిన ఈమె ఇండియాకు కవలలతో రావడంతో అంబానీ కుటుంబం ఘనంగా స్వాగతం పలికింది. ఆ సమయంలో దేశంలోని ప్రముఖ ఆలయాల నుంచి వేదపండితులు రప్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అంతే కాకుండా ఇంటికి కవలలు వచ్చిన సంతోషంతో సుమారు 300 కేజీల బంగారం దానం చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఐదు అనాధ శరణాలయాలు కూడా ప్రారంభించినట్లు చెబుతున్నారు. -
ఆడపిల్ల పుట్టిందని ఏనుగును తెప్పించి... ఆ తండ్రి చేసిన పనికి ఊరంతా షాకయ్యారు!
ముంబై: గతంలో ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావించి తల్లి గర్భంలో ఉన్నప్పుడో లేదా పురిటిలోనే చంపిన ఘటనలు బోలెడు చూశాం. కాలం మారుతోంది.. ఇటీవల తమ ఇంట ఆడపిల్ల పుడితే అదృష్టంగా భావించి కుటుంబాలు వేడుకలు చేసుకుంటున్నాయి. తాజాగా తమ వంశంలో చాలా సంవత్సరాల తర్వాత ఆడపిల్ల పట్టిందని సంబరాలు చేసుకోవడంతో పాటు ఆ చిన్నారిని తమ ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఘనంగా స్వాగతం పలికింది ఓ కుటుంబం. దీన్ని చూసిన ఊరు ప్రజలంతా షాకయ్యారు. ఈ అరుదైన ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా పచ్‌గావ్‌లో చోటుచేసుకుంది. ఎప్పటికీ గుర్తుండిపోయేలా... ఏనుగును పిలిపించి వివరాల్లోకి వెళితే.. పాచ్గావ్కు చెందిన గిరీష్‌పాటిల్, సుధ దంపతులకు ఐదు నెలల కిందట కుమార్తె పుట్టింది. ఆ చిన్నారికి ఆప్యాయంగా ‘ఐరా’ అని పేరు పెట్టారు. ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన తన భార్యను శనివారం తొలిసారిగా తన ఇంటికి తీసుకొచ్చాడు. అయితే గిరీష్ వంశంలో దాదాపు 35 ఏళ్ల తర్వాత ఈ ఆడపిల్ల పుట్టింది. ఈ ఆనందాన్ని ఎప్పటికీ గుర్తిండిపోయేలా ఉండాలని ప్లాన్ చేశాడు. అందుకోసం తన భార్య, పాపను గుజరాత్‌లోని హత్తివరోన్ నుంచి పచ్‌గావ్‌కు తీసుకొచ్చి.. ఘనస్వాగతం పలికాడు. ఊరిపొలిమేర నుంచి డప్పువాయిద్యాలు ఏర్పాటు చేసి పట్టణ శివారు నుంచి ఏనుగుపై తన కూతురిని ఇంటికి తీసుకెళ్లాడు. చాలా ఏళ్ల తరవాత తమ ఇంట ఆడపిల్ల పట్టడంతో పాటిల్ కుటుంబసభ్యులు సంబరాలు జరుపుకున్నారు. గిరీశ్ పుణెలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోన్న గిరీశ్.. బంధువులు, ఇరుగుపొరుగు వారిని ఆహ్వానించి భోజనాలు ఏర్పాటు చేశారు. కాగా గతేడాది కూడా మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఫ్యామిలీ సైతం ఏకంగా హెలికాప్టర్‌ను బుక్ చేసి ఔరా అనిపించిన సంగతి తెలిసిందే. చదవండి: Viral Video: తల్లి కోసం భగీరథుడిలా.. ఆ 14 ఏళ్ల బాలుడు.. -
మళ్లీ ఆడపిల్ల పుట్టిందని.. అమ్మేశారు !
పశ్చిమ గోదావరి: మూడో కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టడంతో ఏం చేయాలో తెలియక ఆడ శిశువును వేరొకరికి మధ్యవర్తి ద్వారా విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. ఏలూరు జిల్లా నూజివీడు మండలం ఓగిరాల తండాకు చెందిన వడిత్యా మూర్తి, వసుంధర దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూర్తి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గతేడాది నవంబరులో వసుంధరకు మూడో కాన్పులో కూడా స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఆడపిల్ల జన్మించింది. మూడు రోజుల అనంతరం మధ్యవర్తి ద్వారా తణుకు సమీపంలోని దువ్వకు చెందిన పిల్లలు లేని దంపతులకు ఆడపిల్లను తండ్రి మూర్తి ఇచ్చేశాడు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తన కుమార్తె కోసం తల్లి వసుంధర మనోవ్యధకు గురై భర్తను మన కూతురును తీసుకురమ్మంటూ రోజూ అడుగుతోంది. ఈ క్రమంలో ఈ విషయం ఆనోటా ఈనోటా పడి చైల్డ్‌లైన్ వారి దృష్టికి చేరింది. దీంతో వారు ఐసీడీఎస్ అధికారులకు ఈ నెల 17న సమాచారమిచ్చి విచారించమని చెప్పగా, నూజివీడు సీడీపీఓ ఎస్‌వై నూరాణి విచారించి నివేదికను చైల్డ్‌లైన్ నిర్వాహకులకు ఈ నెల 18న పంపారు. ఈ విషయంపై అదేరోజు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చైల్డ్‌లైన్ వారు ఏలూరులోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తెలపగా, వారు శిశువుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పెంచుకుంటున్న తల్లిదండ్రులను పిలిపించి విచారించారు. అనంతరం శిశువును నాలుగు రోజుల క్రితమే స్వాధీనం చేసుకొని శిశుగృహంలో ఉంచారు. పూర్తిస్థాయిలో విచారించిన తరువాత శిశువును ఎవరికి ఇవ్వాలి, లేదా ప్రభుత్వ సంరక్షణలో ఉంచాలా అనే విషయాన్ని నిర్ణయించనున్నారు. ఇటు పోలీసుల విచారణలో గాని, అటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్వహించిన విచారణలో గాని తాము బిడ్డను విక్రయించలేదని, పిల్లలు లేరని పెంచుకుంటామంటే ఇచ్చామని చెబుతున్నారు. అమ్మినవారిపైన, కొన్నవారిపైన చర్యలు తీసుకుంటాం శిశువులను అమ్మడం, కొనడం చట్టప్రకారం నేరం. ఈ కేసును సమగ్రంగా విచారిస్తున్నాం. విచారణలో తేలిన అంశాలను బట్టి అమ్మినవారిపైన, కొన్నవారిపైన చర్యలు తీసుకుంటాం. – ఈడే అశోక్‌కుమార్ గౌడ్, డీఎస్పీ, నూజివీడు -
ఆరుసార్లు అమ్మాయి.. మళ్లీ అదే పరిస్థితి.. కన్నీరు పెట్టిస్తున్న ‘అమ్మ’ ఉత్తరం
‘ఇప్పటికే నాకు ఆరుగురు ఆడ పిల్లలు పుట్టారు. మళ్ల అమ్మాయే పుట్టింది. మా అత్త నన్నెంతో ఇబ్బంది పెడుతోంది. అందుకే ఈ పని చేస్తున్నాను. మీకు అనుకూలంగా ఉంటే నా కుమార్తెను పెంచండి. నన్ను క్షమించండి’.. అత్యంత నిస్సహాయ పరిస్థితిలో ఒక మాతృమూర్తి చేసుకున్న అక్షర వేదన ఇది. ఆ తల్లి తన నవజాత ఆడ శిశువును ఒంటరిగా ఆ మహిళా ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయింది. ఆమెకు ఇప్పటికే ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఏడవ సంతానం కూడా ఆడపిల్లే కలిగింది. అత్తింటిలో పోరు పడలేక ఆ మహిళ తన కుమార్తెను ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయింది. ఆమె ఒక లెటర్‌ను కూడా అక్కడ ఉంచింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కాగా ఆసుపత్రిలో రోదిస్తున్న శిశువును గమనించిన సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. అలాగే ఆ చిన్నారికి తగిన రక్షణ ఏర్పాట్లు చేశారు. ఈ ఉదంతం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో చోటుచేసుకుంది. నవజాత శిశువును వైద్యులు వార్డుకు తరలించారు.ఈ సందర్భంగా భరత్పూర్ జనతా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హిమాంశు గోయల్ మాట్లాడుతూ ఈ చిన్నారి 3 రోజుల క్రితమే జన్మించిందని అన్నారు. చిన్నారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. చదవండి: అది చరిత్రలో అత్యంత ఖరీదైన పెళ్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే -
లేడీస్ హాస్టల్ సమీపంలో ఆడ శిశువు మృతదేహం కలకలం..
సాక్షి, వరంగల్: వరంగల్‌లో ఆడ శిశువు మృతదేహం కలకలం సృష్టించింది. అప్పుడే పుట్టిన బిడ్డను రోడ్డుపై పడేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆడ శిశువుని పడేశారో, మరేదైనా కారణమో తెలియదు కానీ, రంగంపేటలోని డాక్టర్ గన్నుకృష్ణ మూర్తి హాస్పిటల్ పక్క వీధిలో పసి పాప మృతదేహం చూపరుల హృదయాలను ద్రవింపజేసింది. చుట్టు పక్కల హాస్పిటల్, లేడీస్ హాస్టల్ ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ సంబంధంతో పుట్టిన బిడ్డని పడేశారో, పురిట్లోనే శిశువు మృతితో పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించి శిశు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. శిశువు పడేసిన విషయంపై ఆరా తీస్తున్నారు. చదవండి: పెళ్లయ్యాక ఆమెతో భర్త ఒక్కరోజు గడపలేదు.. మరో మహిళతో రీల్స్.. -
పండంటి పాపకు జన్మనిచ్చిన 'చిన్నారి పెళ్లికూతురు' నటి
బుల్లితెర నటి నేహా మర్దా బాలికా వధు(తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. డోలీ అర్మానో కి, క్యున్ రిష్టన్ మే కట్టి బట్టి లాంటి చిత్రాల్లోనూ నటించింది. గతంలోనే గర్భం ధరించినట్లు సోషల్ మీడియాలో వెల్లడించిన నటి.. తాజాగా పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలే గర్భధారణ సంబంధిత సమస్యలతో నేహా మర్దా ఆసుపత్రిలో చేరారు. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య స్థితిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. నేహా తన ఇన్‌స్టాలో రాస్తూ..'మా జీవితంలో అత్యుత్తమ క్షణాలు. మాకు ఇప్పుడే పాప పుట్టింది. తను రాగానే ఒక చిన్న మెరుపును తీసుకొచ్చింది. తానొక అద్భుతం. ఈ కొత్త జీవితంలో మమ్మల్ని తల్లిదండ్రుల్ని చేసినందుకు ధన్యవాదాలు. మా పాపకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నా.'అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నటికి కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా.. నేహా ఫిబ్రవరి 2012లో పాట్నాకు చెందిన వ్యాపారవేత్త ఆయుష్మాన్ అగర్వాల్‌ను వివాహం చేసుకుంది. గతేడాది గర్భం దాల్చినట్లు నేహా ప్రకటించింది. View this post on Instagram A post shared by Neha Marda (@nehamarda) -
వీడియో వైరల్ చిట్టి చేతులతో చపాతీ చేస్తున్న చిన్నారి
-
తండ్రైన ‘ఉరి’ నటుడు.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆయన భార్య
ప్రముఖ బాలీవుడ్ నటుడు మోహిత్ రైనా తండ్రి అయ్యాడు. శుక్రవారం ఆయన భార్య అదితి శర్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మోహిత్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కూతురు వేలు పట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ మోహిత్ మురిసిపోయాడు. ‘మేము ఇద్దరం కాస్తా ముగ్గురం అయ్యాం. ఈ ప్రపంచంలోకి మా బేబీ గర్ల్‌కి స్వాగతం’ అంటూ ఫ్యాన్స్‌తో గుడ్‌న్యూస్ పంచుకున్నాడు. బుల్లితెరపై మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న మోహిత్ రైనా ఉరి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ‘దేవోమ్ కా దేవ్ మహాదేవ్’ అనే టీవీ సిరీస్‌తో బుల్లితెరపై పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో విక్కీ కౌషల్ ‘ఉరి ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రంలో కీలక పాత్ర పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. View this post on Instagram A post shared by Mohit Raina (@merainna) -
కుక్క కాటుకు 1,000 కుట్లు
వాషింగ్టన్: స్నేహితురాలితో ఆడుకోవడానికి పొరుగింటికి వెళ్లిన ఆరేళ్ల బాలికపై శునకం దాడిచేసింది. ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను బతికించడానికి వెయ్యికిపైగా కుట్లు వేయాల్సి వచ్చింది. చికిత్స కోసం నిధులు సేకరించారు. హృదయవిదారకమైన ఈ ఉదంతం అమెరికాలోని చెస్టర్‌విల్లేలో చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారి లిలీ ఫిబ్రవరి 18న ఆడుకోవడానికి పొరుగింటికి వెళ్లింది. అక్కడ టేబుల్‌పై కూర్చొని ఉండగా ఆ కుటుంబం పెంచుకుంటున్న పిట్‌బుల్ అనే జాతి శునకం హఠాత్తుగా దాడి చేసింది. ముఖంపై కరిచేసింది. కంటి కింది నుంచి చుబుకం దాకా పంటి గాట్లు దిగాయి. లిలీ మిత్రురాలు వెంటనే గట్టిగా అరవడంతో వంటగదిలో ఉన్న ఆమె తల్లి బయటకు వచ్చింది. కుక్కను ఆమె దూరంగా తరిమేసింది. లిలీ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు చేతులెత్తేయడంతో బోస్టన్లోని మరో హాస్పిటల్లో చేర్చారు. చికిత్సకు చాలా డబ్బు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో లిలీ కుటుంబ మిత్రుడొకరు సోషల్ మీడియాలో ‘గోఫండ్‌మీ’ పేరిట పేజీని ఏర్పాటు చేసి, నిధులు సేకరించాడు. వైద్యులు లిలీకి చికిత్స పూర్తిచేశారు. ముఖంపై వెయ్యికిపైగా కుట్లు వేశారు. తన బిడ్డ దుస్థితిని చూసి శోకాన్ని ఆపుకోవడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని లిలీ తల్లి డోరోతీ నార్టన్ చెప్పారు. లిలీ ముఖంలో కండరాలన్నీ దెబ్బతిన్నాయని, ఇప్పట్లో మాట్లాడలేదని, కనీసం నవ్వలేదని డాక్టర్లు వెల్లడించారు. పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని అన్నారు. -
ఆడ పిల్లలంటే ఓర్కా తిమింగలాలకూ వివక్షే! మగ బిడ్డను సాకేందుకు ఏకంగా
మగబిడ్డపై ఎక్కువ ప్రేమ చూపడం.. ఆడపిల్లపై వివక్ష చూపడమనేది మానవ సమాజంలో మాత్రమే కనిపించే అవలక్షణం అనుకుంటాం. కానీ.. మగ పిల్లవానిపై మమకారంతో జీవితంలో మరో బిడ్డకు జన్మనివ్వని జాతులు సైతం ఈ సృష్టిలో ఉన్నాయి. ఆ జాబితాలో ఓర్కా తిమింగలాలు ముందు వరసలో ఉన్నాయట. ఈ కారణంగా ఆ జాతి తిమింగలాల ఉనికికే ప్రమాదం ముంచుకొస్తోందనే విభ్రాంతికర వాస్తవం వెలుగులోకి వచ్చింది. సాక్షి, అమరావతి: పుత్ర ప్రేమతో వంశాన్నే నాశనం చేసుకున్న ధృతరా్రషు్టడి గురించి మహాభారతంలో చదివే ఉంటారు. కానీ.. మగ బిడ్డలపై తల్లి ప్రేమ ఏకంగా ఓ జాతి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఆ జాతే ఓర్కా తిమింగలాలు. వీటినే కిల్లర్ తిమింగలాలు అని కూడా పిలుస్తారు. పసిఫిక్ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో కనిపించే అరుదైన తిమింగలాలు ఇవి. అత్యంత తెలివైనవిగా గుర్తింపు పొందిన డాల్ఫిన్ జాతికి చెందిన ఓర్కా తిమింగలాల ప్రవర్తన అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. ఫలితంగా వాటి ఉనికే పెను ప్రమాదంలో పడింది. మానవులు వాటిని వేటాడుతుండటమో.. శత్రు జీవుల నుంచి తలెత్తుతున్న ముప్పు వంటివి దీనికి కారణం కాదు. కేవలం మగ బిడ్డల పట్ల తల్లి తిమింగలాలకు మితిమీరిన మమకారమే కారణమన్నది ఆశ్చర్యకరమైన వాస్తవం. గుంపునకు నాయకత్వం వహిస్తాడనే ఆశతో.. సగటున 70 ఏళ్లు జీవించే ఓర్కా తిమింగలాలు గుంపులుగా సంచరిస్తాయి. పాడ్స్ అని పిలిచే ఆ గుంపునకు ఓ బలమైన మగ తిమింగలం నేతృత్వం వహిస్తుంది. ప్రతి తల్లి తిమింగలం తాను కన్న మగబిడ్డే ఆ గుంపునకు నాయకత్వం వహించాలని కోరుకుంటాయి. అందుకోసం తాము జన్మనిచ్చే మగ తిమింగలాల పట్ల విపరీతమైన మమకారాన్ని కనబరుస్తాయి. ఎంతగా అంటే ఆడబిడ్డను పెద్దగా పట్టించుకోవు. ఆడ తిమింగలం ఓ కాన్పులో ఒక బిడ్డకే జన్మనిస్తాయి. ఆడబిడ్డ పుడితే తల్లి తిమింగలం కేవలం 15 నెలల వరకే సాకుతుంది. ఆ తరువాత ఆడబిడ్డను వదిలేస్తుంది. మగబిడ్డ జన్మ నిస్తే మాత్రం తల్లి తిమింగలం చేసే హడావుడి అంతాఇంతా కాదు. మగ బిడ్డను ఎంతో సుకుమారంగా చూసుకుంటాయి. బిడ్డకు 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసు వరకు సాకుతాయి. అంతవరకు మగబిడ్డకు తల్లి తిమింగలమే ఆహారాన్ని తెచ్చి పెడుతుంది. తాను వేటాడి తెచి్చన ఆహారంలో సగానికిపైగా మగబిడ్డకే తినిపిస్తుంది. తాను కన్న మగ తిమింగలమే ఆ గుంపునకు నాయకత్వం వహించాలని తల్లి తిమింగలం ఎంత చేయాలో అంతా చేస్తుంది. జీవవైవిధ్యంలో ప్రధానమైనవి ఓర్కా తిమింగలాలు అత్యంత అరుదైనవి. జీవ వైవిధ్యంలో అత్యంత ప్రధానమైవవి కూడా. మగబిడ్డను అత్యంత మమకారంతో సాకడం కోసం తల్లి తిమింగలం మరో బిడ్డకు జన్మనివ్వకపోవడమన్నది వీటిలోనే మనం గమనిస్తాం. దాంతో వాటి సంఖ్య ప్రమాదకర స్థాయికి తగ్గిపోతోంది. వాటిని పరిరక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. – ప్రొఫెసర్ భరతలక్ష్మి , జువాలజీ విభాగం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం మగ బిడ్డ పుడితే.. మరో బిడ్డకు జన్మనివ్వవు మగ బిడ్డను బలంగా తయారు చేసేందుకు తల్లి తిమింగలాలు మరో పెద్ద నిర్ణయం తీసుకుంటాయి. ఓ సారి మగబిడ్డ పుడితే ఆ తల్లి తిమింగలం జీవితాంతం పిల్లల్ని కనదు. ఎందుకంటే ఆడ తిమింగలం గర్భధారణ సమయం 18 నెలలు. అంతకాలం తాను గర్భంతో ఉంటే అప్పటికే పుట్టిన మగబిడ్డను సక్రమంగా పెంచలేనని.. తగినంత ఆహారం అందించలేనని తల్లి తిమింగలం భావిస్తుంది. అందుకే మగబిడ్డ పుడితే తల్లి తిమింగలం మగ తిమింగలంతో జత కట్టవు. ఈ నిర్ణయమే ఓర్కా తిమింగలాల జాతికి పెనుముప్పుగాపరిణమిస్తోంది. ప్రధానంగా 1990 నుంచి క్రమంగా అంతరిస్తున్న వీటి ఉనికి 2005 తరువాత అత్యంత ప్రమాదంలో పడింది. ప్రస్తుతం ప్రపంచంలో ఓర్కా తిమింగలాలు కేవలం 73 మాత్రమే ఉన్నాయని లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెసర్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. వాటిలో కేవలం మూడు మాత్రమే గర్భంతో ఉండటం గమనార్హం. అంటే ఓర్కా తిమింగలాల్లో పునరుత్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్నేళ్లలో ఓర్కా తిమింగలాలు కనుమరుగైపోతాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ఓర్కా తిమింగలాలను అత్యంత వేగంగా అంతరించిపోయే ప్రమాదం ఉన్న జీవుల జాబితాలో చేర్చి వాటి పరిరక్షణకు పరిశోధనలను ప్రోత్సహిస్తోంది. ఓర్కా తిమింగలాల ప్రత్యేకతలు ఇవీ ► ఓర్కా తిమింగలాల పైభాగం ముదురు నలుపు రంగులోనూ.. కిందిభాగం స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉండటంతోపాటు కళ్ల మీద దళసరిగా తెల్లని మచ్చ ఉంటుంది. ►ఇవి అత్యంత తెలివైన జీవులు. నోటితో ఈల వేస్తాయి. ఈలలు, సంజ్ఞలు, శబ్దాలు చేస్తూ పరస్పరం సంభాషిం చుకుంటాయి. ► మానవుల మాటలు, హావభావాలను సరిగా అర్థం చేసుకుంటాయి. మానవులతో అత్యంత స్నేహంగా ఉంటాయి. ► పసిఫిక్ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం కిల్లర్ తిమింగలాల ఆవాసాలు. ► అమెరికాలోని అలస్కా, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాలు, ఒమన్ దేశంలో ఓర్కా తిమింగలాలను వీక్షించేందుకు ప్రత్యేక టూర్స్ నిర్వహిస్తున్నారు. ►మన దేశంలోని లక్షద్వీప్, అండమాన్ దీవులతోపాటు తమిళనాడు, పాండిచ్చేరి, మహారాష్ట్ర తీర ప్రాంతంలో అప్పుడప్పుడు ఈ తిమింగలాలు కనిపిస్తుంటాయి. -
బేబీ ఫోటోలు షేర్ చేసిన ఆలియా భట్.. !
ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది వివాహాబంధంతో ఒక్కటైన ఈ జంటకు నవంబర్‌లో పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. తమ ముద్దురు కూతురుకు రాహా అని నామకరణం కూడా చేశారు. అయితే ఇప్పటి వరకు బేబీ ఎక్కడా కూడా కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. అయితే తాజాగా ఆలియా భట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరలవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఆమె కూతురే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే రెండేళ్ల వరకు తమ బేబీని చూపించబోమని ఇప్పటికే ఆమె సన్నిహితులు కూడా తెలిపారు. అందుకే సోషల్ మీడియాలోను ఇప్పటివరకు ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో తాజాగా ఆమె షేర్ చేసిన బేబీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పింక్ డ్రెస్‌లో ఉన్న బేబీ ఫోటో అచ్చం ఆలియా భట్ లాగే ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ పాప ఆలియా-రణ్‌బీర్ గారాలపట్టి రాహా అని పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలు కేవలం ప్రమోషన్స్‌లో భాగంగానే చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అలియా భట్ దంపతులు స్పందిస్తేనే మరింత క్లారిటీ రానుంది. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
అమ్మా ఎందుకు వదిలేశావ్..?
రాత్రి 8 గంటల సమయం. చుట్టూ చిమ్మచీకటి. మెల్లగా ముసురుకుంటున్న చలి గాలులు. నిశ్శబ్దమైన వాతావరణంలో వినిపించిన ఓ పసికందు రోదన కోష్ట గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తొమ్మిది నెలలు అమ్మ కడుపులో భద్రంగా ఉన్న బిడ్డ ఆ పేగు తెంచుకున్నాక.. బంధాలకు కూడా దూరమై ఇలా చీకటిలో నిస్సహాయంగా స్థానికుల కంట పడింది. జేఆర్‌పురం ఎస్ఐ జి.రాజేష్ తెలిపిన వివరాల మేరకు.. కోష్ట గ్రామంలోని ఒక కర్రల మోపుపై ఎవరో ఒక ఆడ పసికందును విడిచిపెట్టి వెళ్లిపోయారు. స్థానికులు పసిపాప ఏడుపులు విని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ రాజేష్ పాపను రణస్థలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ బిడ్డను ఎవరు ఇక్కడ వదిలి వెళ్లిపోయారో తెలియాల్సి ఉంది. పసికందు 1.5 కిలోల బరువు ఉందని, జన్మించి ఒక రోజు అయి ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజేష్ తెలిపారు. (చదవండి: సిక్కోలు గుండెల్లో ఆ గురుతులు పదిలం) -
ఖమ్మం: ఆడబిడ్డ పుట్టిందని.. అమానుషం!
సాక్షి, ఖమ్మం: తల్లి పొత్తిళ్లకు దూరమైన ఆ పసికందు.. పాపం అనాథలా ఏడుస్తూ ఊయలలో కనిపించింది. అది చూసి అంతా అయ్యో బిడ్డా అనుకుంటున్నారు. నగర కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు తల్లిదండ్రులు. ఇది గమనించిన ఆస్పత్రి సిబ్బంది చైల్డ్‌కేర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కర్కశకంగా వ్యవహరించిన తల్లిదండ్రుల తీరును తిట్టిపోస్తున్నారు ఆ దృశ్యం చూసినవాళ్లు. బిడ్డలను వద్దనుకునే తల్లిదండ్రుల కోసం ఏర్పాటు చేసిన ‘ఊయల’లో ఈ చిన్నారిని వదిలేసి వెళ్లిపోయారు వాళ్లు. ఇలా వదిలేసిన తల్లిదండ్రుల కోసం సమాచారం సేకరించరు. ఖమ్మం శిశుగృహలో ఆ బిడ్డలను పెంచుతారు. ఎవరైనా ముందుకొస్తే దత్తతకు ఇస్తారు కూడా. -
ప్రియుడితో కలిసి పేగు బంధం మరచి.. కన్నతల్లి కర్కశత్వం
సాక్షి, నల్గొండ: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ తల్లి పేగుబంధం మరచి రెండేళ్ల పసిపాపను అత్యంత కర్కశంగా చంపేసింది. ప్రియుడితో కలిసి చిన్నారి ఊపిరి తీసేసింది. తలను గోడకు బాది.. ఆపై ముక్కు మూసి నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా హత్య చేసి ‘అమ్మ’తనానికి మాయని మచ్చతెచ్చింది. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడడంతో చివరకు కటకటాలపాలైంది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన రెండేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను సోమవారం నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. చిట్యాల మండలం ఎల్లికట్టె గ్రామానికి చెందిన ఉయ్యాల వెంకన్నకు కనగల్ మండలం లచ్చుగూడెం గ్రామానికి చెందిన రమ్యతో 2015లో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ప్రియాంశిక ఉన్నారు. రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి బారిన పడి వెంకన్న మృతిచెందడంతో రమ్య తన అత్తగారింట్లోనే ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. ఈక్రమంలో అదే గ్రామంలో కిరాణా దుకాణం నడుపుతున్న పెరిక వెంకన్నతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది అత్తమామలకు తెలియడంతో పలుమార్లు పెద్ద మనుషుల వద్ద పంచాయితీలు కూడా జరిగాయి. దీంతో మకాం నార్కట్‌పల్లికి మార్చారు. పెరిక వెంకన్న, రమ్య భార్యాభర్తలమని నమ్మబలికి రెండేళ్ల ప్రియాంశికతో కలిసి ఆరు నెలలుగా నార్కట్‌పల్లిలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కుమారుడిని మాత్రం తాత, నాయనమ్మల వద్ద ఎలికట్టేలోనే ఉంచింది. ఏడుస్తోందని చంపేశారు.. చిన్నారి రోదిస్తూ, భయపడుతోందంటూ పెరిక వెంకన్న, రమ్య హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ప్లాన్‌కు అనుగుణంగా తనకు, ఇద్దరు పిల్లలకు ఏమైనా హాని కలిగితే అత్త మామలు, ఎల్లికట్టె గ్రామ ఎంపీటీసీ దశరథ, మాదగోని శ్రీను, గ్రామ పెద్ద మనుషులే కారణం అని ఓ వీడియో తీసి దానిని ఈ నెల 13న ఎలికట్టె విలేజ్ గ్రూపులో పెట్టి బంధువులకు రమ్య వైరల్ చేసింది. మరుసటి రోజు రాత్రి ఇద్దరూ కలిసి చిన్నారి ప్రియాంశిక తలను గోడకు బాది.. సెల్‌ఫోన్‌తో కొట్టి, ఆ తర్వాత ముక్కు మూసి నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం చిన్నారికి ఫిట్స్ వచి్చందని నమ్మబలికి అదే రోజు రాత్రి 11 గంటలకు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలిక మృతిచెందిందని ధ్రువీకరించడంతో, మృతదేహాన్ని మార్చురీలో వదిలేశారు. సమాచారాన్ని అత్తమామలకు చేరవేసి ప్రియుడితో కలిసి రమ్య పరారైంది. బాలిక తాత యాదయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా రమ్య, పెరిక వెంకన్నను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారని డీఎస్పీ వివరించారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీఐ శివరాంరెడ్డి, ఎస్ఐ బొడిగే రామకృష్ణ, ఏఎస్ఐ నర్సిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ సురేందర్, రమేశ్‌లను డీఎస్పీ అభినందించారు. -
తండ్రైన సింగర్ రేవంత్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత
బిగ్‌బాస్ సీజన్-6 టైటిల్ గెలవకముందే సింగర్ రేవంత్ ఇంట సంబరాలు మొదలయ్యాయి. రేవంత్ మొదటిసారి తండ్రయ్యాడు. రేవంత్ భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయానికే అన్విత నిండు గర్భిణి. హౌస్‌లో ఉన్న సమయంలోనే ఆమె సీమంతం కూడా జరిగింది. ఆ వీడియోను చూసి రేవంత్ ఎంతగానో ఎమోషనల్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి తండ్రిలేని లోటు తనకు తెలుసని, అందుకే ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపించుకోవాలా అని ఎదురుచూస్తున్నట్లు రేవంత్ పలుమార్లు చెప్పాడు. ఇప్పుడు పాప పుట్టిన విషయం తెలిస్తే రేవంత్ సంతోషానికి అవధులు లేకుండా పోతాయంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. రేవంత్‌కు పాప పుట్టిన సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సహా నెటిజన్లు రేవంత్-అన్విత దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు బిగ్‌బాస్ సీజన్-6 టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ రేవంత్‌కే ఉందని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Singer Revanth 🎤 (@singerrevanth) -
షాకింగ్.. తోకతో జన్మించిన చిన్నారి.. ఫొటో వైరల్..
మెక్సికోలో ఓ శిశువు తోకతో జన్మించింది. దాని పొడవు రెండు అంగుళాలు(5.7 సెంటీమీటర్లు) ఉంది. తమ దేశంలో ఇప్పటివరకు ఇలాంటి కేసు నమోదు కాలేదని వైద్యులు తెలిపారు. పాప తోక ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే తల్లిదండ్రులు, పాప ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి సమస్యలు లేవు. తోకను సూదితో తాకినప్పుడు చిన్నారి ఏడ్చిందని వైద్యులు చెప్పారు. రెండు నెలల తర్వాత దాన్ని చిన్న సర్జరీ చేసి తొలగించినట్లు తెలిపారు. అదే రోజు పాపను డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. తల్లిగర్భంలో ఉన్నప్పుడే శిశవుల్లో తోక వంటి ఆకృతి ఏర్పడుతుందని, అయితే 9 నెలలు నిండేసరికి అది ఎముకగా మారి లొపలికి వెళ్లిపోతుందని వైద్య నిపుణులు చెప్పారు. అత్యంత అరుదైన సందర్భాల్లోనే ఇలా తోకలతో శిశువులు జన్మిస్తారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 2017 నాటికి ఇలా తోకతో జన్మించిన శిశువుల సంఖ్య 195గా ఉంది. అయితే మెక్సిలో మాత్రం ఇదే తొలి కేసు. ఎక్కువగా మగ శిశువులకు ఇలా జరుగుతుంది. మెదడు, పుర్రె వృద్ధి సమస్యల ప్రభావంతోనే చిన్నారులు ఇలా తోకతో జన్మిస్తారని ఓ అధ్యయనం పేర్కొంది. కానీ వైద్యులు మాత్రం దీనికి కచ్చితమైన కారణాలు వెల్లడించలేదు. చదవండి: కరోనా తర్వాత ప్రపంచానికి మరో ఉపద్రవం.. అన్నింటికంటే డేంజర్..? -
నాకు పెళ్లి చేసేయ్ నాన్న..!
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి
రామాయణం సీరియల్ నటి దెబీనా బొనర్జీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త, నటుడు గుర్మీత్ చౌదరి తెలిపారు. రెండోసారి పేరెంట్స్‌గా ప్రమోట్ అయినందుకు సంతోషంగా ఉందని, అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కాగా ‘అమ్మాయిలు అబ్బాయిలు’ అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన డెబీనా ఆతర్వాత రెండు, మూడు సినిమాల్లోనూ నటించింది. కానీ వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువగా గుర్తింపు పొందింది. రామాయణం సీరియల్‌తో మరింత పాపులర్ అయిన డెబీనా ఈ సీరియల్లో రాముడిగా నటించిన గుర్మీత్ చౌదరినే 2011లో పెళ్లాడింది. ఈ ఏడాది మొదటి బిడ్డకు జన్మనిచ్చిన డెబీనా తాజాగా రెండోసారి బేబీ గర్ల్‌కు జన్మనిచ్చింది. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేయడంతో పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్లు ఈ జంటకు శుభాకంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Gurmeet Choudhary (@guruchoudhary) -
ఆలియా భట్ షాకింగ్ కండీషన్.. బేబీని చూడాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ దంపతులకు నవంబర్ ఆరో తేదీన పాప జన్మించిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆలియా పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. ఇప్పటికే ఆస్పత్రి నుంచి గురువారం ఇంటికి కూడా చేరుకున్నారు. సర్ హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్ నుంచి కారులో ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆలియా బేబీని ఇంతవరకు ఎక్కడా బయటకు చూపించలేదు. బేబీ ముఖాన్ని చూడకుండా జాగ్రత్తలు తీసుకుంది ఈ బాలీవుడ్ జంట. (చదవండి: కంగ్రాట్స్.. పెళ్లైన ఏడు నెలలకే.. అలియా భట్ దంపతులపై కేఆర్కే సంచలన ట్వీట్) అయితే బేబీని ఇంటికి తీసుకురావడంతో బంధువులు, సన్నిహితులు, స్నేహితులు చూసేందుకు క్యూ కట్టారు. చాలా మంది బంధుమిత్రులు ఆలియా-రణ్‌బీర్ బేబీని చూడడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. కానీ ఆలియా క్యూట్ బేబీని చూడాలంటే ఓ షరతు విధించింది ఈ జంట. పాపను చూడాలంటే తప్పనిసరిగా కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అంటూ కండిషన్ విధించారు. దీంతో కొద్దిమంది బంధుమిత్రులు నిరాశకు గురవుతున్నారు. ఈ ఏడాది విడుదలైన బ్రహ్మస్త్ర-పార్ట్-1 ఘనవిజయం సాధించింది. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఈ బాలీవుడ్ జంట ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. కాగా.. ఆలియా తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన "రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ", హాలీవుడ్ తొలి చిత్రం "హార్ట్ ఆఫ్ స్టోన్", గాల్ గాడోట్‌తో కలిసి నటించనుంది. కత్రినా, ప్రియాంకతో కలిసి ఫర్హాన్ అక్తర్ మూవీ "జీ లే జరా"లో కూడా నటించనుంది. రణబీర్ రాబోయే ప్రాజెక్ట్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న "యానిమల్" లో నటిస్తున్నారు. -
ఆలియా భట్ బేబీని చూశారా.. సోషల్ మీడియాలో వైరల్.. కానీ..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ దంపతులకు ఇటీవలే పాప జన్మించిన విషయం తెలిసిందే. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆలియా పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న రణ్‌బీర్ కపూర్-అలియా 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు. పాపకు జన్మనివ్వడంతో కపూర్ కుటుంబంలో సంతోషంలో మునిగిపోయింది. కానీ ఇప్పటివరకు పాప ముఖాన్ని ఈ జంట ఎక్కడా చూపించలేదు. (చదవండి: ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన ఆలియా భట్) కానీ సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఆ వీడియోలో ఉన్నది ఆలియా భట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో బేబీని ముద్దాడుతూ ఓ మహిళ కనిపిస్తోంది. ఆ వీడియో ఆలియా ఉన్న ఆసుపత్రి నుంచి లీక్ అయిందని పలువురు భావిస్తున్నారు. కానీ ఆ వీడియో మార్ఫింగ్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుండడంతో ఆలియా భట్ కాదని తెలుస్తోంది. Congratulations 🥳 alia so cute baby girl ❣️❣️❣️🥰🥰🥰🥰 pic.twitter.com/kpYSt1Qfs4 — Drx.monikachoudhary (@monikac60799851) November 7, 2022 -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆలియా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తల్లైయింది. ఆదివారం ఉదయం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆలియా.. కాసేపటి క్రితమే పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. రణబీర్తోపాటు సోనీ రజ్దాన్, నీతూ కపూర్ ఆసుపత్రిలో అలియాతో ఉన్నట్లుగా సమాచారం. తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్లు కపూర్ కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న రన్బీర్ కపూర్-అలియా 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు.పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని వెల్లడించింది. గర్భిణీగా ఉన్నా షూటింగ్స్‌తో పాటు బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్స్‌లోనూ ఆమె యాక్టివ్‌గా పాల్గొంది.పాప రాకతో కపూర్ కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఆలియా, రణ్‌బీర్‌లకు శుభాకాంక్షలులు వెల్లువెత్తున్నాయి. అలియా తల్లి అయ్యారని తెలుసుకున్న అభిమానులు, సీనీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) -
అరుదైన కేసు: 21 రోజుల శిశువు కడుపులో ఎనిమిది పిండాలు
రాంచీ: రాంచీలో ఒక అరుదైన ఘటన జరిగింది. జార్ఖండ్‌లో రామ్‌గఢ్ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో అక్టోబర్ 10న ఒక పాప జన్మించింది. ఐతే ఆ పాప పొట్టలో గడ్డ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే పాపకు ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో ఆ పాపను పుట్టిన 21 రోజుల తర్వాత ఆస్పత్రి తీసుకు వచ్చారు తల్లిదండ్రులు. వైద్యులు తాము మొదటగా ఆ పాప పొత్తికడుపులో తిత్తి లేదా కణితి లాంటి దాన్ని గుర్తించడంతో దాన్ని ఆపరేషన్ చేసి తొలగించాలనుకున్నాం అని చెప్పారు.. ఈ మేరకు వైద్యులు ఆ పాపకు నవంబర్1న ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. అప్పుడే తాము ఆ పాపం శరీరంలో ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది పిండాలను తీశామని చెప్పారు. ఇలాంటి కేసు చాలా అరుదు అని అన్నారు. ఎప్పుడైనా ఏదైనా జన్యు లోపం తలెత్తితే కవలల్లో ఇలా జరుగుతుందని చెప్పారు. ఒక కవల శిశువు శరీరంలోకి మరో కవల పిండం ఉండటం జరుగుతుంది. కానీ ఇలా ఏకంగా ఎనిమిది పిండలు అనేది ఇదే మొట్టమొదటి కేసు అని చెప్పారు. ఈ మేరకు డాక్టర్ ఇమ్రాన్ మాట్లాడుతూ...దీనిని ఫెటస్ ఇన్ ఫీటు(ఎఫ్ఐఎఫ్) అని పిలుస్తారు. ఎఫ్ఐఎఫ్ అనేది చాలా అరుదు, పైగా ఒక పిండం మాత్రమే ఉంటుందని ఇలా ఎనిమిది పిండాలు ఉండటం ఇంతవకు ఎక్కడా జరగలేదు. పిండాల పరిమాణం కూడా మూడు నుంచి ఐదు సెంటిమీటర్లు ఉన్నాయి. ఇలా ఐదు లక్షల జనాభాలో ఒకరికి సంభవిస్తుంది. అని తెలిపారు. ప్రస్తుతం పాపను అబ్జర్వేషన్లో ఉంచామని, వారం రోజుల్లో డిశ్చార్జ్ చేసి పంపిస్తామని వైద్యులు చెప్పారు. (చదవండి: చనిపోయిన దోమలను తీసుకుని కోర్టుకు హాజరైన గ్యాంగ్‌స్టర్) -
అల్లూరి జిల్లా ఆడపిల్లల ఖిల్లా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆడ పిల్లలే డామినేట్ చేస్తున్నారు. ఈ జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆగస్టు వరకు జననాలను పరిశీలిస్తే మగ పిల్లలకన్నా ఆడపిల్లలే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో వెయ్యి మంది మగ పిల్లలకు 1001 మంది ఆడపిల్లలున్నారు. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) పని తీరు సూచికల పురోగతి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా తరువాత పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆడపిల్లల సంఖ్య మెరుగ్గా ఉంది. పల్నాడు జిల్లాలో వెయ్యి మంది మగ పిల్లలకు 993 మంది ఆడపిల్లలున్నారు. పశ్చిమగోదావరిలో వెయ్యి మంది మగ పిల్లలకు 991 మంది ఆడ పిల్లలున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆగస్టు వరకు రాష్ట్రం లో 2,55,582 జననాలు సంభవిస్తే అందులో 1,31,954 మగ పిల్లలు కాగా 1,23,628 ఆడ పిల్లలుగా నివేదిక తెలిపింది. రాష్ట్రం మొత్తం సగటు చూస్తే ఆగస్టు వరకు వెయ్యి మంది మగ పిల్లలకు 937 మంది ఆడ పిల్లలున్నారని పేర్కొంది. ప్రత్యేకతల జిల్లా.. అల్లూరి అల్లూరి సీతారామరాజు జిల్లాకు మరిన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఈ జిల్లాలో నూటికి నూరు శాతం కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగినట్లు నివేదిక వెల్లడించింది. అంతే కాకుండా నూరు శాతం కాన్పులు కోతల్లేకుండా సాధారణ కాన్పులే. ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టు వరకు 6,181 కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సాధారణంగా జరిగి నట్లు నివేదిక పేర్కొంది. వీటిలో ఒక్కటి కూడా కోత (సిజేరియన్) కాన్పు లేదని వెల్లడించింది. -
23 నెలలకే ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు
కమలాపూర్: 23 నెలల వయసులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది ఓ చిన్నారి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దివంగత ఆకినపెల్లి కృష్ణ మనుమరాలు శ్రేయాన్వి కృష్ణ వయస్సు రెండేళ్లు కూడా నిండలేదు. ఆమె తల్లిదండ్రులు శ్రావణి–సాయిరాం హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. శ్రేయాన్వి తెలుగు పాటలు, పద్యాలు, శ్లోకాల పఠనంతోపాటు తెలుగు సినిమా నటీనటులు, స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను గుర్తించడం, రామాయణంలోని కథలు చెప్పడం, దేవుళ్ల పేర్లను గుర్తించడం, పజిల్స్ సాల్వ్ చేయడం, ఇంగ్లిష్ రైమ్స్ వంటివి చెబుతూ అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. తల్లిదండ్రులు.. చిన్నారి వీడియోలను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి పంపించారు. ఆమె ప్రతిభను గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కల్పించి గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం పంపించారు. -
తలలో కణితి.. శిశువుకు శస్త్రచికిత్స
రఘునాథపల్లి: తలలో కణితితో జన్మించిన ఆడశిశువుకు ఆపరేషన్ చేసి ఉస్మానియా వైద్యులు విజయవంతంగా ఆ కణితిని తొలగించారు. అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన మూడు రోజుల ఆడశిశువును.. ఎవరో ఈ నెల 28న జనగామ జిల్లా రఘునాథపల్లి బస్టాండ్ సమీపంలో వదిలేశారు. బాలల సంరక్షణ, ఐసీపీఎస్, ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా మంగళవారం వైద్యులు ఆపరేషన్ చేసి కణితి తొలగించారు. కాగా, చిన్నారికి గుండెలోనూ సమస్య ఉందని, మరిన్ని పరీక్షలు నిర్వహిస్తే స్పష్టత వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతి తెలిపారు. -
కంటి పాపను వదిలించుకుని..
రఘునాథపల్లి: తలపై పెద్ద కణితితో పుట్టిన శిశువును నడిరోడ్డుపై వదిలేశారు. ఈ అమానవీయ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఉదయం జరిగింది. కంచనపల్లి రోడ్డులోని ఫాతిమా చికెన్ సెంటర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున మూడు రోజుల ఆడశిశువు ఏడుస్తుండటాన్ని స్థానికులు పలువురు గుర్తించారు. పాప తలపై పెద్ద కణితి ఉండటంతో వదిలేసి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అంగన్వాడీ టీచర్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతి దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె ఐసీపీఎస్, చైల్డ్‌లైన్ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించారు. వారి ఆదేశాలతో ఆశ వర్కర్లు కవిత, శ్రీలత అంగన్వాడీ టీచర్లతో కలిసి పసికందును స్థానిక పీహెచ్‌సీకి.. అక్కడి నుంచి జనగామ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం ఐసీడీఎస్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్‌లైన్ 1098 అధికారులు బాలరక్ష వాహనంలో పాపను హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. పోషించలేకుంటే సమాచారం ఇవ్వండి.. తల్లిదండ్రులు పసి పిల్లలను పోషించలేని స్థితిలో ఉంటే చెత్త కుప్పలు, రోడ్లపై వదిలేయకుండా.. బాలల పరిరక్షణ విభాగం లేదా 1098కు సమాచారం అందిస్తే సంరక్షిస్తామని బాలల పరిరక్షణ అధికారిణి జయంతి తెలిపారు. స్వయంగా బాలల పరిరక్షణ అధికారులకు అందజేస్తే ఆ పాపను మరొకరికి దత్తత ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుందని, అలా ఇచ్చి న వారి వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేశారు. -
35 ఏళ్ల పెంపుడు కుమార్తెతో బిడ్డను కన్న ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్!
ఎలన్ మస్క్ తన తొమ్మిది మంది సంతానంపై ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తరిగిపోతున్న జనాభా సంక్షోభానికి తమ వంతు సాయం చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఎలన్ మస్క్‌కు ఏ మాత్రం తీసిపోనంటూ ఆయన తండ్రి ఎర్రోల్ మస్క్ సైతం ఈ తరహా వ్యాఖ్యలు విస్మయానికి గురి చేస్తున్నాయి. అంతేకాదు మూడేళ్ల క్రితం తన పెంపుడు కుమార్తె జానా బెజుడెన్‌హౌట్‌తో మరోసారి తండ్రినయ్యానంటూ తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో వెల్లడించాడు. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం..యూకేకి చెందిన టాబ్లాయిడ్ ఎర్రోల్ మస్క్‌ను తాజాగా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో..ప్రపంచ సంతానోత్పత్తి రేటు తగ్గే అవకాశం ఉందంటూ వాషింగ్టన్ యూనివర్సిటీ ఓ డేటాను విడుదల చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఎర్రోల్ మస్క్ మాట్లాడుతూ..తగ్గిపోతున్న జనాభాకు తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పాడు. మనం ఈ భూమిపై ఉన్నది పునరుత్పత్తి కోసమే. అందుకే జానాతో తొలిసారి 2017లో అబ్బాయి ఎలియట్ రష్కు, 2019లో పాపకు జన్మనిచ్చినట్లు తెలిపాడు. ఎర్రోల్ మహానుభావుడు ఎలన్ మస్క్ కు తన తండ్రి ఎర్రోల్ మస్క్ అంటే అస్సలు నచ్చదు. సౌతాఫ్రికాలో బిజినెస్ మ్యాన్ గా ఉన్న ఎర్రోల్ అత్యంత క్రూరుడు. శారీరక సుఖ కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఎర్రోల్ తొలిసారి ఎలన్ మస్క్ తల్లి మేయల్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత మేయల్‌కు విడాకులిచ్చి అప్పటికే పెళ్లై 10ఏళ్ల కూతురున్నహెడీని వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత రెండో భార్య హెడీకి విడాకులిచ్చి ఆమె కూతురు జానాను వివాహం చేసుకున్నాడు. ఎర్రోల్, జానా దంపతులు అబ్బాయి, అమ్మాయికి జన్మనిచ్చారు. కాగా, రెండో భార్య కుమార్తె జానాకు ఎలన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ వయస్సు వ్యత్యాసం 40ఏళ్లు. -
రెండోసారి తండ్రైన సీఎస్కే బ్యాటర్.. మా చిన్నారి దేవత అంటూ ఎమోషనల్!
టీమిండియా వెటరన్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప రెండోసారి తండ్రయ్యాడు. ఊతప్ప దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని ఊతప్ప సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. భార్యా, బిడ్డలతో ఉన్న ఫొటోను ఈ సందర్భంగా షేర్ చేశాడు. ‘‘మా జీవితాల్లో అడుగుపెట్టిన చిన్నారి దేవతను మీకు పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ట్రినిటి థియా ఊతప్ప.. మమ్మల్ని నీ తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు.. నిన్ను ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చే అవకాశం ఇచ్చినందుకు నీకు రుణపడి ఉంటాం. నీకు తల్లిదండ్రులమైనందుకు మేము.. అన్నయ్య అయినందుకు నీ సోదరుడు.. దీనిని మాకు దక్కిన గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాం’’ అని ఊతప్ప ఉద్వేగపూరిత నోట్ రాసుకొచ్చాడు. కాగా కేరళకు చెందిన రాబిన్ వేణు ఊతప్ప వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎదిగాడు. 2006లో భారత్ తరఫున అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టాడు. ఆ మరుసటి ఏడాది టీ20 ఫార్మాట్లోనూ అరంగేట్రం చేశాడు. ఊతప్ప చివరిసారిగా జింబాబ్వేతో వన్డే మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక ఊతప్ప వ్యక్తిగత విషయానికొస్తే.. 2016లో శీతల్‌ను పెళ్లాడాడు. వీరికి ఇప్పటికే కుమారుడు నీల్ నోలన్ ఊతప్ప ఉన్నాడు. తాజాగా కుమార్తె జన్మించింది. కాగా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే ఊతప్ప ఎప్పటికప్పుడు తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. చదవండి: Ind Vs Eng 2nd ODI: తుది జట్ల అంచనా, పిచ్, వాతావరణం వివరాలు! రోహిత్ సేన గెలిచిందంటే! View this post on Instagram A post shared by ROBIN UTHAPPA (@robinaiyudauthappa) View this post on Instagram A post shared by ROBIN UTHAPPA (@robinaiyudauthappa) -
బాధపడుతూ వదిలేసినా.. బతికేందుకు దారి చూపాడు
ఈ ఫొటోలో దీనంగా కనిపిస్తున్న కుక్కను చూశారుగా. దీని పేరు బేబీ గర్ల్. మంటలు ఆర్పేందుకు ఏర్పాటు చేసిన ఓ ఫైర్ హైడ్రంట్‌కు కట్టేసి ఉంది. పక్కన ఓ బ్యాగుంది. జంతువుల బాగోగులను చూసుకునే ఓ చారిటీ వాళ్లు వచ్చి ఆ కుక్కను, ఆ బ్యాగును చూశారు. కుక్కను ఎవరు వదిలేశారు, ఎందుకు వదిలేశారని అనుకుంటూ ఆ బ్యాగును తెరిచి చూశారు. దాన్నిండా ఆ కుక్క ఆడుకునే వస్తువులు, దానికి ఇష్టమైన వస్తువులతో పాటు ఆ కుక్కును పెంచుకునే యజమాని ఓ లేఖను కూడా గుర్తించారు. దాన్ని చదివి చలించిపోయారు. యజమాని చెప్పింది నిజమా కాదా అని తెలుసుకునేందుకు వెంటనే కుక్కను మెడికల్ టెస్టుకు పంపారు. దానికి కెనైన్ డయాబెటిస్ (డయాబెటిస్ మిల్లిటస్) వ్యాధి ఉందని గుర్తించారు. ఆ వ్యాధి చికిత్స కోసం నెలనెలా కుక్కకు ఇన్సులిన్‌ను, మరిన్ని రకాల మందులూ కొనాల్సి ఉంటుంది. ప్రత్యేకమైన తిండిని పెట్టాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ప్రతి నెలా రూ. వేలల్లోనే ఖర్చవుతుంది. కుక్కను పెంచుకుంటున్న యజమానే కొన్ని వైద్యపరమైన సమస్యలతో సతమతమవుతున్నాడు. ఆయన వ్యాధి చికిత్సకే డబ్బులు సరిపోక ఇబ్బందిపడుతున్నాడు. ఇప్పుడు కుక్కు చికిత్సకు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని బాధపడ్డాడు. మరో అవకాశం లేక.. లోలోపల బాధపడుతున్నా ఎవరో ఒకరు ఆదుకోకుండా ఉంటారా జనాలు తిరిగే వీధిలో దాన్ని వదిలేశాడు. కానీ ఉండలేకపోయాడు. కుక్కను చారిటీ వాళ్లు తీసుకెళ్లారని తెలుసుకొని పరుగును వాళ్లను కలుసుకున్నాడు. ఆయన తిరిగి రావడం చూసి చారిటీ వాళ్లు సంతోషించారు. ‘కుక్కకు ఇష్టమైన వస్తువులను ప్యాక్ చేసి, ప్రమాదవశాత్తు కార్ల కింద పడకుండా, అందరికంట పడేలా ఓ పక్కన కట్టేసి, ఎందుకు వదిలేశారో లేఖను రాసిన తీరును చూసి కుక్కంటే మీకెంతిష్టమో మాకు అర్థమైంది’ అన్నారు. ఇక మీరు చింతించాల్సిన అవసరం లేదని, బేబీ గర్ల్‌కు మంచి భవిష్యత్తు ఉందని భరోసానిచ్చారు. ఈ సంఘటన అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో ఉన్న గ్రీన్ బే ప్రాంతంలో జరిగింది. -
రెండేళ్ల క్రితం దూరమైంది.. పాక్ క్రికెటర్ ఇంట్లో వెల్లివిరిసిన సంతోషం
పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఆసిఫ్ అలీ ఇంట్లో సంతోషం వెల్లివెరిసింది. ఆసిఫ్ రెండోసారి తండ్రిగా ప్రమోషన్ సాధించాడు. గురువారం ఆసిఫ్ అలీ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆసిఫ్ ట్విటర్ వేదికగా.. తన చిట్టితల్లి వేసుకోబోయే వస్తువులను షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ''నా ఇంట్లోకి చిన్న దేవదూత అడుగుపెట్టింది.. వెల్కమ్ టూ వరల్డ్ స్వీట్హార్ట్'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో లేటు వయసులో ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆసిఫ్ అలీ పాకిస్తాన్ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. 2018లో అరంగేట్రం చేసిన ఆసిఫ్ అలీ ఇప్పటివరకు 21 వన్డేల్లో 382 పరుగులు, 39 టి20ల్లో 435 పరుగులు సాధించాడు. రెండేళ్ల క్రితం మొదటి కూతురు మరణం.. ఆసిఫ్ అలీ ఇంట్లో రెండేళ్ల క్రితం విషాదం చోటుచేసుకుంది. తన రెండేళ్ల కూతురు నూర్ ఫాతిమా క్యాన్సర్ స్టేజీ-4తో పోరాడుతూ కన్నుమూసింది. మే 2019లో అమెరికాలో నూర్ ఫాతిమాకు చికిత్స అందించినప్పటికి వైద్యులు బతికించలేకపోయారు. కూతురు పోయిన బాధను దిగమింగుకొని ఆ ఏడాది పీఎస్ఎల్ 2019లో ఆసిఫ్ అలీ అద్బుత ప్రదర్శన నమోదు చేశాడు. కాగా రెండేళ్ల తర్వాత ఆసిఫ్ అలీ దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వడంతో నూర్ ఫాతిమా మళ్లీ పుట్టిందంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. Mere Ghar Ayee Aik Nanhi Pari!💓 Welcome to the World, Sweetheart!#blessed #blessedwithababygirl pic.twitter.com/R2dTGQ3gyk — Asif Ali (@AasifAli45) May 19, 2022 -
అనాథ పాపను దత్తత తీసుకోవాలనుకున్నా : స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం మాతృత్వపు క్షణాలను ఆస్వాదిస్తుంది. 2018లో నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న ప్రియాంక ఇటీవలె సరోగసి ద్వారా తల్లైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోనే సెటిల్ అయిన ప్రియాంక తాజాగా తన బయోగ్రఫీలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'ఓరోజు ఇంట్లో చిన్న పాప ఏడుపు వినిపించింది. వెళ్లి చూస్తే అమ్మ ఆ పాపను ఊయలలో వేసి ఆడిస్తుంది. ఎవరు అని అడగ్గా హాస్పిటల్ బయట కారు పార్కింగ్‌లో పాపను ఎవరో వదిలి వెళ్లారని, అక్కడ ఏడుస్తూ ఉండటంతో ఇంటికి తీసుకొచ్చానని అమ్మ నాకు చెప్పింది. వర్షం కురుస్తున్న సమయంలో చిన్న పాపను అలా వదిలేసి వెళ్లడం నాకు చాలా బాధనిపించింది. దీంతో ఆ పాపను దత్తత తీసుకొని నా దగ్గరే ఉంచుకుంటానని పట్టుబట్టగా అమ్మ అభ్యంతరం చెప్పింది. సంతానం లేని దంపతులకు పాపను ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు అమ్మ పేర్కొంది. ఆరోజు జన్మాష్టమి. అదేరోజు వర్షంలోనే వాహనం నడుపుకుంటూ సంతానం లేని దంపతులకు పాపును ఇచ్చేసింది అమ్మ. ఆ సమయంలో వాళ్ల సంతోషం ,ఆనాటి సంఘటనల్ని ఎప్పటికీ మర్చిపోలేను' అంటూ ప్రియాంక రాసుకొచ్చింది. -
ప్రియాంక చోప్రా గారాల పట్టి పేరు ఏంటో తెలుసా?
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా-నిక్ జోనస్ దంపతులు ఇటీవల సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 2018, డిసెంబర్లో వివాహం చేసుకున్న ఈ జంట.. మూడేళ్ల తర్వాత ఈ ఏడాది జనవరిలో సరోగసి ద్వారా తల్లిదండ్రులైయ్యారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బిడ్డకు సంబంధించిన ఫోటోలను కానీ, పేరుని కానీ బయటకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. తాజాగా ప్రియాంక, నిక్‌లు తమ బిడ్డకు పేరు పెట్టినట్లు తెలుస్తోంది. తమ గారాల పట్టికి ‘మాల్టీ మేరీ చోప్రా జోనస్’అని నామకరణం చేశారట. మాల్టీ అంటే సంస్కృతంలో సువాసన కలిగిన పువ్వు అని అర్థం. అంతేకాకుండా ప్రియాంక తల్లి మధుమాల్టీ నుంచి మాల్టీ అని తీసుకున్నారట. ఇక మేరీ అంటే నక్షత్రం అని అర్థం. అలాగే జోనస్ తల్లి పేరు కూడా కలుస్తుంది. ఇక చివరిగా తన పేరు, భర్త పేరు వచ్చేలా చోప్రా జోనస్ పెట్టారట. బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ప్రియాంక కూతురు అమెరికాలోని శాండియాగోలో 2022, జనవరి 15న ఉదయం 8 గంటలకు జన్మించినట్లు ఉంది. ఇక ప్రియాంక సినిమాల విషయానికొస్తే.. ఒకప్పుడు బాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన ఈ భామ.. ఇటీవల హాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. టీవలే హాలీవుడ్ యాక్షన్ సినిమా ఫ్రాంచైజీలో ఒకటైన 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్'తో అలరించింది. ప్రస్తుతం 'సిటాడెల్' అనే అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్‌లో నటిస్తోంది. (చదవండి: బిడ్డ పుట్టాక కాజల్ ఫస్ట్ పోస్ట్, ఇదేమీ ఆకర్షణీయంగా ఉండదంటూ!) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1131264712.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నేనేమి పాపం చేశానమ్మా..
సాక్షి, కర్నూలు రాజ్‌విహార్: కన్నపేగు తెంచుకొని పుట్టిన బిడ్డను ఆసుపత్రిలో వదిలేసి వెళ్లారు తల్లిదండ్రులు. ఆడపిల్లా అని అలా చేశారో మరెమో తెలియదు కానీ తల్లి ఒడిలో ఉండాల్సిన పాప అనాథగా మిగిలింది. డోన్ పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న యశోద ఆసుపత్రికి గత నెల 30 తేదీ తెల్లవారు జామున ఒక నిండు గర్బిణి పురిటి నొప్పులతో వచ్చింది. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది వివరాలు ఏమీ అడగకుండా తొలుత కాన్పు చేశారు. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తరువాత వివరాలు అడగగా తన భర్త, తల్లిదండ్రులు కింద ఉన్నారని వారిని కలవమంది. వారిని సంప్రదించగా కొద్ది సేపటి తర్వాత ఇస్తామని చెప్పి శిశువును అక్కడే వదిలేసి బాలింతతో కలిసి ఉడాయించారని డాక్టర్ సుంకన్న తెలిపారు. మాట్లాడుతున్న ఐసీడీఎస్ అధికారులు ఈ విషయం పోలీసులకు తెలియజేసి.. పాప కోసం ఎవ్వరైనా వస్తారేమోనని వేచి చూశామన్నారు. శుక్రవారం వరకు ఎవ్వరూ రాకపోవడంతో ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆశిశువును కర్నూలు శిశుమందిర్‌కు తరలించారు. చిన్నారిని 30 రోజుల్లోపు సంబంధికులు తగిన ఆధారాలు చూపించి తీసుకెళ్లకపోతే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తీర్మానం ద్వారా అనాథగా గుర్తించి చట్ట ప్రకారం దత్తత ఇవ్వనున్నట్లు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికార అధికారి కేఎల్‌ఆర్‌కే కుమారి తెలిపారు. వివరాలకు కర్నూలు కలెక్టరేట్లోని తమ కార్యాలయం లేదా సి.క్యాంప్ వద్ద ఉన్న శిశుగృహంలో సందర్శించాలని సూచించారు. -
Viral Video: అమ్మాయి పుట్టిందని తండ్రి సంతోషం.. హెలికాప్టర్లో స్వాగతం
పుట్టేదీ ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే పిండాన్ని చిదిమేస్తున్న ఘటనలు ఎన్నో చూశాం. ఆడపిల్ల పుట్టిన తర్వాత చంపడం, చెత్తకుప్పల్లో పడేసే దారుణాల గురించి కూడా ఎన్నో విన్నాం. ఆడపిల్లగా పుట్టి పెరిగినా సమాజంలో చిన్న చూపు మాత్రం పోలేదు. అయితే ప్రస్తుత రోజుల్లో ఈ పరిస్థితి కాస్త మారింది. పుట్టబోయేది ఎవరైనా సరే తల్లిదండ్రులు వారిని సంతోషంగా పెంచి పెద్ద చేస్తున్నారు. తాజాగా కూతురు పుట్టిందన్న సంతోషంలో ఓ కుటుంబం ఉబ్బితబ్బి అయిపోయింది. కూతురిని ఆసుపత్రి నుంచి ఇంటికి ఆహ్వానించేందుకు వినూత్నంగా ఆలోచించారు. లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఏకంగా హెలికాప్టర్‌తో స్వాగతం పలికారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పూణే జిల్లాలోని ఖేడ్ పట్టణానికి చెందిన విశాల్ జరేకర్ అనే న్యాయవాదికి జనవరి 22న పాప పుట్టింది. బోసారి పట్టణంలో జన్మించిన ఆ పాపకు రాజలక్ష్మీ అని నామకరణం చేశారు. కాగా విశాల్ కుటుంబంలో చాలా ఏళ్ల తరువాత ఆడపిల్ల పుట్టింది. దీంతో చిట్టితల్లిని ఇంటిని తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భావించారు. చిన్నారిని ఖేడ్‌లోని ఇంటికి తీసుకెళ్లేందుకు హెలికాప్టర్‌ను బుక్ చేశారు. ఇందుకోసం లక్షరూపాయలు ఖర్చు చేశాడు. ఇంటి దగ్గర హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు సరైన స్థలం లేకపోవడంతో వ్యవసాయ క్షేత్రంలో హెలికాప్టర్ ల్యాండ్ చేశారు. అలా హెలికాప్ట్ ద్వారా విశాల్ తన కూతురిని ఇంటికి తీసుకెళ్లాడు. చదవండి: హృదయ విదారకం: బిడ్డను కాపాడటం కోసం శత్రువుకెదురెళ్లి తల్లి ప్రాణ త్యాగం #WATCH Shelgaon, Pune | Grand Homecoming ! A family brought their newborn girlchild in a chopper We didn't have a girlchild in our entire family. So, to make our daughter's homecoming special, we arranged a chopper ride worth Rs 1 lakh:Vishal Zarekar,father (Source: Family) pic.twitter.com/tA4BoGuRbv — ANI (@ANI) April 5, 2022 ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ సందర్భంగా అమ్మాయి తండ్రి విశాల్ మాట్లాడుతూ.. ఇంట్లో ఆడపిల్ల పుట్టడాన్ని పండుగలా జరుపుకోవాలనే సందేశాన్ని సమాజానికి ఇచ్చేందుకే ఈ విధంగా చేసినట్లు తెలిపారు. ఆడపిల్ల పుడితే భారంగా భావించే మనషులకు విశాల్ ఆదర్శంగా నిలిచాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
ఆడపిల్ల పుట్టిందని... పసికందుని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి...
న్యూఢిల్లీ: కడుపులో ఉన్నది ఆడిపిల్ల అన్న అనుమానంతోనూ లేక స్కానింగ్‌లో ఆడపిల్ల అని తెలియడంతోనే చంపేసేవాళ్లు కొందరూ. మరికొందరు పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే వదిలి వెళ్లిపోయేవారు మరికొందరూ. ఏది ఏమైన ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చి చర్యలు తీసుకున్నప్పటికీ ఈ ఘటనలకు అంతే లేదు అన్నట్లుగా జరుగుతున్నాయి. అచ్చం అలానే ఢిల్లీలో ఓ ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలో నివాసం ఉంటున్న గుల్షన్ కౌశిక్, డింపుల్ కౌశిక్‌లకు జనవరి నెలలో అనన్య అనే పాప పుట్టింది. ఏమైందో మరి ఏం కష్టం వచ్చిందో ఆ తల్లిక తెలియదు గానీ రెండు నెలల పసికందుని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టింది. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఆమె తన కొడుకుతో కలసి గదిలోకి వెళ్లి తలుపుకి తాళం వేసుకుని ఉండిపోయింది. కాసేపటికి అనుమానంతో ఆమె అత్తగారు తలుపుతట్టగా తలుపు తీయకపోడంతో ఇరుగు పోరుగు అంతా వచ్చి తలుపు పగలుగొట్టి చూడగానే తల్లి కొడుకులిద్దరూ అపస్మారక స్థితిలో ఉన్నారు. అయితే వారి వద్ద పాప కనిపించలేదు. వారంతా చుట్టూ గాలించిన ఎంతకీ పాప కనిపించలేదు. కాసేపటికి ఏదో అనుమానంతో మైక్రోవేవ్ ఓవెన్ తెరిచి చూడగా పాప మృతి చెంది ఉంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలికి వచ్చి విచారించడం మొదలు పెట్టారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో పాప తల్లే ప్రధాన నిందుతురాలని తేలిందని పోలీసులు తెలిపారు. అంతే కాదు ఆ పాప తల్లి ఆడపిల్ల పుట్టడంతో తీవ్రంగా కలత చెందిందని, పైగా ఈ విషయమై భర్తతో పోరాడిందని సంబంధికులు చెబుతున్నారని పోలీసులు అన్నారు. ఈ మేరకు ఆ దంపతులను అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బెనిటా మేరీ జైకర్ తెలిపారు. (చదవండి: టీఎంసీలో కుమ్ములాట? కీలక నేత హత్య.. ఆపై ఏడుగురు మృతిపై అనుమానాలు!) -
మగబిడ్డే పుడతాడని అందరూ అనుకున్నారు.. కానీ
Singer Aditya Narayan Shweta Agarwal Blessed With Baby Girl: ప్రముఖ గాయకుడు ఆదిత్య నారాయణ్, నటి శ్వేతా అగర్వాల్ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ బ్యూటిఫుల్ జంటకు ఫిబ్రవరి 24న ఫస్ట్ బేబీ గర్ల్ జన్మించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆదిత్య నారాయణ్ ప్రకటించారు. ఆయన ఇన్‌స్టా ఖాతాలో తమ పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ '24.02.2022న ఆ సర్వశక్తి సంపన్నుడు మాకు అందమైన పాపను ప్రసాదించినందుకు నేను, శ్వేతా కృతజ్ఞతలు తెలుపుతున్నాము' అని రాశాడు. ఈ పోస్ట్ చూసిన ప్రముఖ సెలబ్రిటీలు ఈ జంటపై శుభాకాంక్షల వర్షం కురిపించారు. 'ఆదిత్య నారాయణ్ మీకు కుమార్తె జన్మించినందుకు శుభాకాంక్షలు. మీ తదుపరి జీవితపు దశను సంపూర్ణంగా ఆనందించండి.' అని బర్ఖా సేన్‌గుప్తా కామెంట్ చేసింది. 'ఆదిత్య, శ్వేత మీరు తల్లిదండ్రులు అయినందుకు శుభాకాంక్షలు. లవ్ టు ఆల్ ఆఫ్ యూ' అని సింగర్ నీతి మోహన్ రాయగా, 'ఇద్దరికీ శుభాకాంక్షలు' అని 'గంగుబాయి కతియావాడి' ఫేం శాంతను మహేశ్వరి తెలిపింది. ఇదిలా ఉంటే ఆదిత్య తనకు అందరూ మగబిడ్డే పుడుతుందని అందరూ అనుకున్నారని, కానీ తాను మాత్రం ఆడపిల్లే పుట్టాలని ఆశపడ్డానని తెలిపాడు. తండ్రులు తమ కూతుళ్లకు అత్యంత సన్నిహితులనే విషయాన్ని తాను నమ్ముతున్నాని పేర్కొన్నాడు. ఆదిత్య, శ్వేతా డిసెంబర్ 1, 2020న ముంబైలోని ఇస్కాన్ ఆలయంలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. View this post on Instagram A post shared by Aditya Narayan Jha (@adityanarayanofficial) -
దారుణం:పసికందును వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు
-
దారుణం: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పసికందు
సాక్షి, సికింద్రాబాద్: 20 రోజుల వయసున్న పసికందును గుర్తు తెలియని వ్యక్తులు సోమ వారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వదిలి వెళ్లారు. సదరు ఆడశిశువును సరక్షితంగా కాపాడిన రైల్వేపోలీసులు తదుపరి రక్షిత చర్యల నిమిత్తం శిశువిహార్‌కు తరలించారు. జీఆర్పీ సికింద్రాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీను కథనం ప్రకారం.. రైల్వేస్టేషన్ 2–3 ప్లాట్‌ఫామ్ మీద శిశువు ఒంటరిగా ఉన్నట్టు అదే ప్లాట్‌ఫామ్ మీద డ్యూటీలో ఉన్న టీటీఐ జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే శిశువును కాపాడిన పోలీసులు 1098కు సమాచారం అందించి శిశువిహార్‌కు తరలించారు. స్టేషన్‌లోని సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా గుర్తుతెలియని ఒక జంట శిశువును మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో వదలి వెళ్లినట్టు గుర్తించారు. శిశువును స్టేషన్లో వదిలి వెళ్లిన జంట ఎవరన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతుంది. అయితే సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆడపిల్ల అనే వదిలివెళ్లినట్టు భావిస్తున్నారు. చదవండి: జ్వరం, జలుబు, దగ్గుతో ఉక్కిరిబిక్కిరి.. కరోనా కావచ్చేమోనని? -
ఎంత ఘోరం : వేడి నీళ్లని తెలువక పాయె..
సాక్షి, చెన్నారావుపేట (వరంగల్): ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు స్నానం చేయించడానికి పెట్టిన వేడి నీటి బకెట్లో పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కందికడ్డతండా శివారు ఔసుల్‌తండాలో బుధవారం రాత్రి జరిగింది. తండాకు చెందిన సహదేవుల వెంకన్నకు ఇద్దరు కుమారులు, కుమార్తె జాహ్నవి(3) ఉంది. ఈ నెల 6న స్నానం చేయించడానికి తల్లి వేడి నీళ్లు సిద్ధం చేసింది. బట్టలు తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్లిన క్రమంలో జాహ్నవి బకెట్లో పడిపోయి తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ జాహ్నవి బుధవారం రాత్రి మృతి చెందింది. చిన్నారి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ స్వామి తెలిపారు. చదవండి: సీఎం కేసీఆర్‌వి తుగ్లక్ నిర్ణయాలు: బండి సంజయ్ -
రెండోసారి తండ్రైన కమెడియన్ తాగుబోతు రమేష్..
Comedian Thagubothu Ramesh Blessed with a Baby Girl: టాలీవుడ్ కమెడియన్ తాగుబోతు రమేష్ మరోసారి తండ్రి అయ్యారు. తనకు కూతురు పుట్టిందని స్వయంగా రమేష్ పేర్కొన్నాడు. చిన్నారి ఫోటోను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. కాగా సినిమాల్లో తాగుబోతు పాత్రలతో ఫేమస్ అయిన తాగుబోతు రమేష్ 2015లో స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2017లో కూతురు పుట్టింది. తాజాగా మరోసారి చిన్నారి రాకతో రమేష్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. View this post on Instagram A post shared by Thagubothu Ramesh (@thagubothramesh) -
గర్భవతిగా ఉన్నప్పుడు కోవిడ్ బారిన పడింది!.... ఏడు వారాలుగా కోమా ఐతే...!!
కొన్ని అత్యంత అరుదైన వ్యాధులు బారినపడి మృత్యు కుహరం నుంచి బయటపడ్డ వాళ్లను చూస్తే చాలా ఆశ్చర్యంగానూ, భయంగానూ ఉంటుంది. అలాంటిది గర్భంతో ఉండగా కోవిడ్ భారినపడితే ఎంత నరకంగా ఉంటుంది చెప్పండి. పైగా వారాలుగా కోమాలోనే ఉండిపోయింది. (చదవండి: 77 ఏళ్ల వయసు ... స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్! అయినా ఐస్ స్కేటింగ్ చేశాడు!!) అసలు విషయంలోకెళ్లితే...యూకేలోని ప్రైమరీ స్కూల్ టీచింగ్ అసిస్టెంట్ అయిన లారా వార్డ్ గర్భవతిగా ఉన్నప్పుడు కోవిడ్ బారిన పడటంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆమెకు ఇచ్చిన డెలివరీ తేదికి రెండు వారాల ముందే ఆమెకు డెలివరీ చేసేశారు. అయితే ఆమెకు పుట్టిన పాప చాల తక్కువ బరువుతో ఉంది. వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఆ బిడ్డ ఆరోగ్యంగానే ఉంది. అయితే ఆ చిన్నారి తల్లికి మాత్రం తనకు ఆడపిల్ల పుట్టిందన్న విషయం కూడా తెలియదు. ఈ మేరకు ఆమె ఏడు వారాలు అనంతరం కోమా నుండి బయటపడిని తర్వాత తనకు ఆడపిల్ల పుట్టిందని తెలుసుకుంది. అయితే యూకేలో లారాకి కోవిడ్ సోకిన సమయంలో ఇంకా అప్పటికి గర్భవతులకు వ్యాక్సిన్లు వేసే ప్రక్రియ ప్రారంభం కాలేదు (చదవండి: జాక్వెలిన్‌కి ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడంలో సుకేశ్ భార్యదే కీలక పాత్ర) -
నెలల వయసున్న చిన్నారికి.. ఇంత పెద్ద ఐడియా ఎలా వచ్చింది?
సాధారణంగా ఏదైనా.. నేర్చుకోవాలనే తపన.. సాధించాలనే ఆశయం ఉన్నవారు చుట్టు జరుగుతున్న ప్రతి సంఘటన నుంచి ప్రేరణ పొందుతుంటారు. చాలా మంది తమ జీవితంలో గొప్ప గొప్ప కలలు, ఆశయాలను పెట్టుకుంటారు. దాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో కొందరు.. కొన్ని ఆటంకాలు ఎదురుకాగానే ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారు. మరికొందరు మాత్రం.. తమ పట్టును వదలకుండా చివరి వరకు ఉండి తమకు కావాల్సిన దాన్ని సాధించుకుంటారు. వారికి మాత్రమే గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. తాజాగా, ఇలాంటి స్ఫూర్తివంతమైన వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్వీటర్ ఖాతాలో పోస్టు చేశారు. దానికి ‘ కోశిశ్ కర్నేవాలోకీ హార్ నహీ హోతి హై..’ అంటే ‘నిరంతరం ప్రయత్నం చేసేవారు.. ఎప్పటికీ ఓటమి బారినపడరంటూ’ ట్యాగ్ చేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో నెలల వయసున్న అందమైన బుజ్జాయి మంచంపై కూర్చోని ఉంది. ఆ పసిపాప దగ్గరలో ఆమె తల్లిదండ్రులు లేరు. అయితే.. ఆ పాప.. తన తల్లికోసం అటూ ఇటూ చూసింది. మంచంపై నుంచి దిగాలనుకుంది. మంచం ఎత్తుగా ఉండటంతో ఆ బాలిక కిందపడిపోతానేమోనని భయపడింది. మంచంపైన కొన్ని దిండులు, బెడ్షీట్లు ఉన్నాయి. ఆ బాలిక నెమ్మదిగా పాకుతూ.. ఒక బెడ్షిట్ను మెల్లగా మంచం కింద పడేసింది. దాన్ని ఆధారంగా చేసుకుని దిగాలనుకుంది. నెమ్మదిగా చూసింది. పాపం.. చిన్నారికి కాళ్లు అందలేవు. ఆ తర్వాత.. మరో బెడ్షిట్ను కిందపడేసి చూసింది. అప్పుడు కూడా ఆధారందొరకలేదు. ఇప్పుడు అలాకాదని.. ఒక దిండుని లాగి కిందపడేసింది. ఇప్పుడు.. కొద్దిగా అందినట్లే ఉన్నా.. పూర్తి స్థాయిలో ఆధారం దొరకలేదు. చివరకు ఇలాకాదని .. ఆ బాలిక మరో ట్రిక్ వేసింది. మంచంపై ఉన్న మరో దిండును లాగి కింద పడేసింది. ఆ తర్వాత.. నెమ్మదిగా ఆ దిండును ఆధారం చేసుకుని నవ్వుతూ.. ఆనందంగా కిందకు దిగేసింది. చివరకు తన ప్రయత్నం ఫలించినందుకు చిన్నారి ఆనందంతో ముసిముసినవ్వులు నవ్వింది. కాగా, ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్.. చిన్నారి ఎంత ముద్దుగా ఉందో..’, అంత చిన్న వయసులో ఐడియా ఎలా తట్టింబ్బా..’,‘ కష్టపడేవారికి ఎప్పటికైన విజయం లభిస్తోందంటూ..’ కామెంట్లు చేస్తున్నారు. -
Bigg Boss: తండ్రైన నటరాజ్ మాస్టర్.. ఎమోషనల్ పోస్ట్‌తో..
Bigg Boss 5 Telugu Contestant Nataraj Master & Neethu Blessed With Baby Girl: కొరియోగ్రాఫర్, డాన్సర్, బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ భార్య నీతూ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నటరాజ్ మాస్టర్ కోరుకున్నట్లే ఆడపిల్ల పుట్టింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ నటరాజ్ ఎమోషనల్ అయ్యాడు. తనకు అమ్మాయియే కావాలని కోరుకున్నానని, అనుకున్నట్లే పాప పుట్టిందని మురిసిపోయాడు. బుధవారం అర్థరాత్రి లోబోతో కలిసి ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన నటరాజ్.. అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. తనకు, తన బిడ్డకు అందరి ఆశిస్సులు ఉండాలని కోరుకున్నారు. దేవుడు బిగ్‌బాస్ హౌస్‌లో ఏమి ఇవ్వకున్నా.. బయట పండండి బిడ్డని ఇచ్చారంటూ ఎమోషనల్ అయ్యారు. కాగా, భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నటరాజ్ మాస్టర్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాడు. తొలుత వెళ్లొద్దని భావించినా.. భార్య కోరిక మేరకు తాను బిగ్‌బాస్ షోకి వచ్చానని నటరాజ్ మాస్టర్ చెప్పారు. హౌస్‌లో ఉన్నన్ని రోజులు తన భార్య గురించే ఆలోచించాడు. పుట్టబోయే బిడ్డను నా చేతుల్తో ఎత్తుకుంటానో లేదో అని బాధపడ్డాడు. అయితే అనూహ్యంగా ఐదో వారానికే ఆయన బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. భార్య డెలివరీ సమయంలో పక్కనే ఉండడం, అనుకున్నట్లే ఆడపిల్ల పుట్టడంతో నటరాజ్ మాస్టర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. View this post on Instagram A post shared by Natrajmaster (@natraj_master) -
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైద్రాబాద్‌లో నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పాపకి అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. చదవండి: బాలికపై టీఆర్ఎస్ సర్పంచ్ అత్యాచారం.. బాధితురాలికి బండి పరామర్శ -
తోబుట్టువుల కడుపు నింపడం కోసం పసికందు అమ్మకం
కాబూల్: ఆ తల్లికి నలుగురు సంతానం. నాలుగో బిడ్డ నెలల పసికందు చిన్న పాప. కొన్ని నెలల క్రితం వరకు వారి జీవితాలు బాగానే ఉండేవి. కానీ దేశం తాలిబన్ల కబంద హస్తాల్లోకి వెళ్లిన నాటి నుంచి గడ్డు పరిస్థితులు. కడుపునిండా తిని ఎన్ని రోజులవుతుందో. తాము సరే.. కానీ పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోతున్నారు. పసిదానికి పాలు కూడా కరువయ్యాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో.. ఆ మహిళ తన అమ్మ మనసును చంపుకుంది. మిగతా పిల్లల ఆకలి తీర్చడం కోసం నెలల పసిగుడ్డును అమ్మకానికి పెట్టింది. అది కూడా కేవలం 500 డాలర్లకు. ఇక భవిష్యత్తులో ఆ పాపను తన కుమారుడికి ఇచ్చి వివాహం చేయడం కోసం ఈ చిన్నారిని కొన్నాడు సదరు వ్యక్తి. అఫ్గన్‌లో ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయో.. ఈ ఒక్క సంఘటన చూస్తే అర్థం అవుతుంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులు ఇలాంటి చిన్నారులను బలి పశువులను చేస్తున్నారు. ఆవివరాలు.. (చదవండి: ఆకలితో అల్లాడుతున్న అఫ్గన్ చిన్నారులు.. తిండి దొరక్క) అఫ్గనిస్తాన్‌లోని ఓ కుగ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. చిన్నారి తండ్రి కొంతకాలం వరకు చెత్త ఏరుకుని అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. తాలిబన్ల ఆక్రమణ తర్వాత కష్టాలు ప్రారంభం అయ్యాయి. అతడికి నలుగురు సంతానం. భార్యాబిడ్డల ఆకలి తీర్చడం చిన్నారి తండ్రికి తలకు మించిన భారమయ్యింది. ఈ క్రమంలో ఆఖరి సంతానం అయిన నెలల పాపను 500 డాలర్లకు అమ్మకానికి పెట్టాడు. (చదవండి: తాలిబన్ల అతి.. అఫ్గనిస్తాన్‌కు పాక్ షాక్) మిగతా బిడ్డల ఆకలి తీర్చడం కోసం ఈ పసికందును అమ్మేశాడు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. పసిదాన్ని భవిష్యత్తులో తన కుమారుడికిచ్చి వివాహం చేయడం కోసం ఈ పాపను కొన్నాడట సదరు వ్యక్తి. ఈ సందర్భంగా చిన్నారి తల్లి మాట్లాడుతూ.. ‘‘పాపతో సహా ఇంట్లో అందరం ఆకలితో బాధపడుతున్నాం. చేతిలో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఈ దారుణానికి ఒడగట్టాను. పాప చాలా చిన్నది.. ఇప్పుడు నేను చేసిన పని గురించి దానికేం తెలియదు. మిగతా పిల్లలు పెద్దవాళ్లు. వారికి పరిస్థితి అర్థం అవుతుంది. బిడ్డను అమ్ముకునేంత కసాయి దాన్ని కాదు. కానీ మిగతా పిల్లల ఆకలి నన్ను ఈ పాపానికి పురిగొల్పింది’’ అంటూ కన్నీరుపెట్టుకుంది. చదవండి: తాలిబన్లతో డీల్.. మెలిక పెట్టిన అమెరికా -
"నేను మా ఆంటీకి గుడ్ బై చెప్పొచ్చా!"
న్యూఢిల్లీ: చిన్నపిల్లలు వారి ముద్దు ముద్దు మాటలు వింటుంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అంతేకాదు చిన్నారుల ముద్దులొలికే మాటలకు అప్పటి వరకు మనకు ఉన్న టెన్షన్లు, తనొప్పిలు ఎక్కడివక్కడికే ఎగిరిపోతాయి. పైగా వారి వచ్చిరాని మాటలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేయడమే కాక విస్మయానికి గురిచేస్తాయి. అచ్చం అలాంటి ఘటనే ఖతార్ హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. (చదవండి: ‘అభినందనలు మోదీ జీ" అంటూ వ్యంగ్యాస్త్రాలు) వివరాల్లోకెళ్లితే.....ఖతార్‌లోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరాధ్య అనే చిన్నపాప తన అత్తకు వీడ్కోలు ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలంటూ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ గార్డ్ని కోరుతోంది. ఆ తర్వాత ఆ సెక్యరిటీ గార్డు ఆ చిన్నారి మాటలకు నవ్వుతూ అంగీకారం తెలిపిన వెంటనే తన అత్త దగ్గరకు ఆనందంగా పరుగెత్తుకుంటూ వెళ్తుంది. ఈ సన్నివేశం చూపురులను తల తిప్పుకోనివ్వకుండా ఒక్క క్షణం కట్టిపడేసినట్లు ఉంటుంది. ప్రస్తుతం ఈ అందమైన వీడియోను కప్తాన్ హిందుస్థాన్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: రాజీనామా ఉపసంహరణ చేసుకున్న సిద్ధూ) -
ప్రెగ్నెన్సీని దాచిపెట్టిన హీరోయిన్ శ్రియ
Shriya Saran Welcomes Baby Girl: హీరోయిన్ శ్రియ సరన్ అతి పెద్ద సీక్రెట్‌ను రివీల్ చేసింది. గతేడాది తాను పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పి అందరికి షాకిచ్చింది. '2020 ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోయింది. ఒక ఏడాదంతా అందరూ క్వారంటైన్లో ఉండిపోయారు. కోవిడ్ కారణంగా అందరూ ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ మా జీవితంలో మాత్రం అద్భుతం జరిగింది. చిన్నారి రాకతో మా ప్రపంచమే మారిపోయింది. ఏంజిల్ లాంటి చిన్నారిని మాకు ప్రసాదించినందుకు ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను' అంటూ సోషల్ మీడియా వేదికగా శుభవార్తను పంచుకుంది. చదవండి: చేయి కొరకడంపై శివబాలాజీ భార్య సీరియస్ కాగా 2018లో రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్‌ను శ్రియ పెళ్లాడిన సంగతి తెలిసిందే. గతేడాది స్పెయిన్‌లోని బోర్సిలోనాలోనే శ్రియ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సంవత్సరం వరకు శ్రియ తన ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టకపోవడం గమనార్హం. ఇక గతేడాది వెకేషన్ నిమిత్తం బోర్సిలోనాకు వెళ్లిన శ్రియ దంపతులు లాక్డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయారు. ఈ మధ్యే భారత్‌కు తిరిగి వచ్చేసిన ఈ జంట ముంబైలో నివాసం ఉంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శ్రియ ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ కీలకపాత్ర పోషిస్తుంది. చదవండి: మణిశర్మ కుమారుడి నిశ్చితార్థం.. వైరలవుతోన్న ఫోటోలు -
హరితేజ ముద్దుల తనయ క్యూట్ ఇమేజస్
-
హరితేజ కూతురిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో.. ఫోటోలు వైరల్
ప్రముఖ నటి, యాంకర్ హరితేజ ఈ ఏడాది ఏప్రిల్‌లో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య బారసాల కూడా నిర్వహించి పాపకు పేరు పెట్టారు. భూమి దీపక్ రావ్ అని పాపకు నామకరణం చేశారు. భూమి అంటే సహనంగా ఉంటుంది అనుకునేరు, కోపంవస్తే భూకంపమే అంటూ.. కూతురు పేరు వెనుక అర్థం కూడా చెప్పింది హరితేజ. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హరితేజ..అప్పుడప్పుడు కూతురిని తన భర్త దీపక్‌రావు ఆడిస్తున్న కొన్ని వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన ముద్దులు కూతురి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా.. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ప్యూర్ వైట్ గౌనులో ఉన్న భూమి దీపక్ రావ్.. ముసి ముసి నవ్వులు నవ్వుతూ చాలా అందంగా ఉంది. ఇక హరితేజ విషయానికొస్తే..బుల్లితెరపై సీరియల్స్‌లో నటించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా పాపులారిటీ సంపాదించుకుంది. . తనకున్న క్రేజ్‌తో బిగ్‌బాస్ మొదటి సీజన్లోనూ అడుగు పెట్టిన ఆమె తన అల్లరితో, ఆటతో మరెంతోమంది అభిమానులను సంపాదించుకుంది. 2015లో దీపక్ రావును పెళ్లాడిన హరితేజ ఈ ఏడాది ఏప్రిల్ 5న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. రాజా ది గ్రేట్, హిట్, సరిలేరు నీకెవ్వరు, ప్రతిరోజు పండగే, ఎఫ్ 2, అరవింద సమేత, యూటర్న్, శ్రీనివాస కళ్యాణం లాంటి సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో హరితేజ నటించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చిన్నారి అనుమానాస్పద మృతి
-
తండ్రైన క్రికెటర్.. నీకు స్వాగతం చిట్టితల్లీ!
Aaron Finch announces arrival of a baby girl: ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తండ్రయ్యాడు. అతడి భార్య అమీ ఫించ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పాపాయికి ఎస్తేర్ కేట్ ఫించ్గా నామకరణం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను పంచుకున్న ఆరోన్ ఫించ్.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వెల్లడించాడు. ‘‘ఎస్తేర్ కేట్ ఫించ్.. ఈ అందమైన ప్రపంచంలోకి నీకు స్వాగతం. మా చిన్నారి రాకుమారి నిన్న సాయంత్రం 4 గంటల 58 నిమిషాల సమయంలో జన్మించింది. తను 3.54 కిలోల బరువు ఉంది. అమీ, బేబీ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు’’ అని భార్యాబిడ్డలతో దిగిన ఫొటోలను ఆరోన్ ఫించ్ ఇన్‌స్టాలో షేర్ చేశాడు. చదవండి: హింట్ ఇచ్చావుగా కోహ్లి; ఈసారి వసీం, మైకేల్ ఒకేమాట! ఇక కెరీర్ విషయానికొస్తే.. గాయాలతో సతమవుతున్న ఆరోన్ ఫించ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌లో మోకాలి గాయం కారణంగా వన్డే సిరీస్ మిస్సయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఆడలేకపోయాడు. మోకాలికి చికిత్స చేయించుకుంటున్న అతడు.. అంతా సవ్యంగా సాగితే అక్టోబరులో ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌నకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Aaron Finch (@aaronfinch5) -
తండ్రైన నటుడు.. బెస్ట్ ఫీలింగ్ అన్న స్టార్ హీరో
ముంబై: బాలీవుడ్ నటుడు అపర్శక్తి ఖురానా తండ్రయ్యాడు. అతడి భార్య ఆకృతి అహుజా శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియా వేదికగా అపర్శక్తి ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నాడు. పాపకు అర్జోయీ ఎ. ఖురానాగా నామకరణం చేసినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో ఖురానా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘చిన్నారి దేవతకు స్వాగతం’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక చిన్నారి రాకతో తమ కుటుంబం మరింత పెద్దదైందని, ఇదొక గొప్ప అనుభూతి అని బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఆనందం వ్యక్తం చేశాడు. కాగా ఆయుష్మాన్ ఖురానా తమ్ముడైన అపర్శక్తి.. ఆమిర్ ఖాన్ దంగల్ మూవీతో బీ-టౌన్లో అడుగుపెట్టాడు. సాత్ ఉచాకే, బద్రీనాథ్ కీ దుల్హనియా, హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ, స్త్రీ, లుకా చుప్పీ, రాజ్మా చావల్ వంటి సినిమాల్లో నటించాడు. బాలా, పతీ పత్నీ ఔర్ వో చిత్రాల్లో సోదరుడితో స్క్రీన్ పంచుకున్నాడు. నటుడు, ఆర్జే, సింగర్, టీవీ హోస్ట్‌గా గుర్తింపు పొందిన అపర్శక్తి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక హర్యానా అండర్-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా అతడు వ్యవహరించాడు. చదవండి: Shilpa Shetty: కొత్త తప్పులు చేస్తానంటున్న శిల్పాశెట్టి! View this post on Instagram A post shared by Aparshakti Khurana (@aparshakti_khurana) -
నేనేం పాపం చేశానమ్మా..!? పదిరోజుల ఆడపసికందును..
సాక్షి, మిర్యాలగూడ(నల్లగొండ): నవ మాసాలు మోసి జన్మనిచ్చావు..? ఆడ పిల్లనని వదిలించుకున్నావా..? మరో కారణంతో పేగు బంధాన్ని తెంచుకున్నావా..? నా ఆకలి ఎవరు తీరుస్తారు.. ఆలనా పాలనా చూసేవారేరీ..? గుక్కపెట్టి ఏడుస్తున్న ఆ పసికందుకు మాటలు వచ్చి ఉంటే ఇలానే ప్రశ్నల వర్షం కురిపించేదేమో. తల్లిపొత్తిళ్లలో హాయిగా నిద్దరోవాల్సిన రోజుల శిశువు గుక్కపెట్టి ఏడుస్తూ గురువారం నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ బస్టాండ్ పరిసరాల్లో ప్రయాణికుల కంటపడింది.పోలీసులు, ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ శిశువును ఐసీడీఎస్ సిబ్బందికి అప్పగించారు. వివరాలు.. మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ అవరణలో గురువారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ రోజుల ఆడ శిశువును ప్రయాణికులు లేని ప్రాంతంలో వదిలి వెళ్లింది. ఆ చిన్నారి గుక్కబట్టి ఏడుస్తుండటంతో ప్రయాణికులు, బిట్ పోలీసులు ఆర్టీసీ డీఎం బొల్లెద్దు పాల్‌కు సమాచారం అందించారు. ఈ విషయాన్ని బస్టాండ్‌లో గల విచారణ విభాగం వారు మైక్‌లో తెలియజేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీస్ సిబ్బంది శిశువును స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని వైద్యులు ఐసీడీఎస్ సీడీపీఓ మమతకు సమాచారం అందించడంతో సూపర్వైజర్ మాధవి, అంగన్వాడీ టీచర్లు రజని, పద్మ ఆస్పత్రికి పంపించా రు. ఆడ శిశువును వదిలింది ఎవరు అనే విషయంపై ఆరా తీసినప్పటికి ఫలితం లేదు. స్థానిక టూ టౌన్ సీఐ సురేష్‌తో మాట్లాడి ఐసీడీఎస్ సిబ్బందికి అప్పగించగా నల్లగొండ శిశుగృహకు తరలించారు. -
పహాడీషరీఫ్ శ్మశాన వాటికలో చిన్నారి మృతదేహం మాయం
-
శ్మశాన వాటికలో చిన్నారి మృతదేహం మాయం
సాక్షి, హైదరాబాద్: పహాడీషరీఫ్ శ్మశాన వాటికలో ఓ చిన్నారి మృతదేహం మాయమైన ఘటన కలకలం రేపుతోంది. శ్మశానవాటిలో పూడ్చిపెట్టిన చిన్నారి మృతదేహాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. మృతదేహం మాయంపై చిన్నారి బంధవులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరు ఎత్తుకెళ్లారు? ఎందుకు ఎత్తుకెళ్లారనే విషయం మిస్టరీగా మారింది. మృతదేహం మాయం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. -
16 రోజుల పసికందును వాటర్ ట్యాంకులోపడేసి..
నెల్లూరు (క్రైమ్): నిండా పదహారు రోజులు కూడా నిండని పసికందును పొట్టనబెట్టుకున్నారు. వాటర్ ట్యాంకులోపడేసి చిన్నారి ఉసురు తీశారు. నెల్లూరు రంగనాయకులపేట గొల్లవీధిలో శుక్రవారం జరిగిన ఈ అమానుష ఘటన స్థానికులను కలచివేసింది. పోలీసుల కథనం.. విద్యావతికి 2018లో కొడవలూరు పెయ్యళపాలేనికి చెందిన వెంకటేశ్వర్లుతో వివాహమైంది. వారికి రెండేళ్ల పాప అద్వికత ఉంది. గత నెల 24న విద్యావతి మరో పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి విద్యావతి ఇద్దరు పిల్లలతో కలిసి గొల్లవీధిలోని తల్లి వద్దే ఉంటోంది. శుక్రవారం చిన్నారికి విద్యావతి స్నానం చేయించి మొదటి అంతస్తులోని ఊయల్లో పడుకోబెట్టి నిద్రపోయింది. కొద్దిసేపటికి మెలకువ వచ్చి ఊయల్లో చూడగా పాప లేదు. ఇల్లంతా వెదికినా కనిపించలేదు. కుటుంబ సభ్యులు, స్థానికులు చుట్టుపక్కల అంతా గాలించినా ఫలితం లేకపోయింది. విద్యావతి నివాసముంటున్న పక్క ఇంట్లోనే ఆమె చిన్నమ్మ జ్యోతి ఉంటోంది. ఆమె ఇంటి మిద్దెపై ఉన్న వాటర్ ట్యాంకులో పాప మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆ చిన్నారి మృతదేహాన్ని చూసిన ఆ తల్లి, అమ్మమ్మలను ఓదార్చడం ఎవరితరం కాలేదు. సంతపేట ఇన్స్పెక్టర్ అన్వర్‌బాషా ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జ్యోతే ఈ దురాగతానికి ఒడిగట్టి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ విద్యావతి తల్లి శారద పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇలా పొదల్లోకి వచ్చిపడ్డాను ఏమిటమ్మా..?
రిమ్మనపూడి (పామర్రు): ‘వెచ్చని నీ పొత్తిళ్లలో ఉండాల్సిన నేను ఇలా పొదల్లోకి వచ్చిపడ్డాను ఏమిటమ్మా.. చలి గాలులకు నా చిట్టి ప్రాణం తట్టుకోలేక పోతోందమ్మా.. వీధి కుక్కలు ఎక్కడ వచ్చి పీక్కు తింటాయోనని భయంగా ఉందమ్మా.. ఆకలేసి గుక్కపెట్టి ఏడుస్తున్నా నీకు వినిపించడం లేదా అమ్మా.. ఏడ్చీ ఏడ్చీ గొంతు తడారిపోతోందమ్మా.. పొదల్లో నన్ను ఎవరెవరో వచ్చి చూస్తున్నారు కానీ నీవు రావడంలేదు ఏమిటమ్మా..’ అన్నట్టుంది ఆ పసిగుడ్డు పరిస్థితి. పామర్రు మండలం రిమ్మనపూడి శివారు అంకామ్మగుంట గ్రామం శివారులో చెట్ల పొదల నుంచి చంటిపాప ఏడుపు విన్న స్థానికులు ఆడ శిశువును గుర్తించారు. వెంటనే పామర్రు ఎస్ఐ పండుదొరకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి రోజుల వయస్సు శిశువుగా గుర్తించి ఐసీడీఎస్ అధికారుల ద్వారా మచిలీపట్నంలోని శిశు సంరక్షణ కేంద్రానికి పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మొదటిసారి కూతురి ఫోటోను షేర్ చేసిన హరితేజ
ప్రముఖ నటి, యాంకర్ హరితేజ మొదటి సారి తన చిన్నారిని పరిచయం చేసింది. పెళ్లిరోజు సందర్భంగా తమ కూతురి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..పాప రాకతో తమ వివాహ వార్షికోత్సవం మరింత ప్రత్యేకంగా మారిందని తెలిపింది. భర్త దీపక్‌తో కలిసి బిడ్డను ఎత్తుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా పలవురు బుల్లితెర ప్రముఖులు సహా నెటిజన్లు హరితేజకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఏప్రిల్ 5న హరితేజ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. బుల్లితెరపై సీరియల్స్‌లో నటించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. తర్వాత యాంకర్‌గా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ గుర్తింపుతో బిగ్‌బాస్ 1లోకి వెళ్లి తనదైన నటనతో బుల్లితెర ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంది. 2015లో ఆమె వివాహం జరిగింది. రాజా ది గ్రేట్, హిట్, సరిలేరు నీకెవ్వరు, ప్రతిరోజు పండగే, ఎఫ్ 2, అరవింద సమేత, యూటర్న్, శ్రీనివాస కళ్యాణం లాంటి సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో హరితేజ నటించిన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) చదవండి: నటి సీమంతం వేడుక.. బేబీ బంప్‌తో డ్యాన్స్ మన శరీరం కేవలం అందుకోసమే కాదు కదా : రేణు దేశాయ్ -
అప్పుడే పుట్టిన పసిబిడ్డ చెత్తకుప్పలో..
కుభీర్(ముథోల్): నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సిలో అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకుప్పల్లో పారేశారు. గ్రామంలోని సాయిబాబా ఆలయం వెనక నిర్మానుష్య ప్రదేశంలో చెత్తకుప్పల నుంచి ఆదివారం ఉదయం ఏడుపు వినిపించడంతో అటుగా వ్యవసాయ పనులకు వెళ్తున్న స్థానికులు శిశువును గుర్తించారు. గ్రామస్తులు స్థానిక ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి సమాచారం అందించడంతో ఆయన అక్కడకు చేరుకుని శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఐసీడీఎస్ సీడీపీవో నాగలక్షి్మ, సూపర్వైజర్ భారతి శిశువును భైంసా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం శిశువును ఆదిలాబాద్‌లోని శిశు గృహకు తరలించారు. శిశువును చెత్తకుప్పలో ఎవరు పడేశారన్నదానిపై పోలీసులు విచారణ చేపట్టారు. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హరితేజ
ప్రముఖ నటి, యాంకర్ హరితేజ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే సోషల్ మీడియా ద్వారా తన సన్నిహితులతో, అభిమానులతో పంచుకుంది. గతేడాది ప్రెగ్నెన్సీ గురించి హరితేజ సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండీ ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ ఫోటో షూట్స్ తో అభిమానులకు టచ్ లోనే ఉంది. ఏప్రిల్ 5న ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయాన్ని 'ఇట్స్ బేబీ గర్ల్' అంటూ హరితేజ తన భర్తతో ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దాంతో నెటిజన్లు ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. కాగా, బుల్లితెరపై సీరియల్స్‌లో నటించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. తర్వాత యాంకర్‌గా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ గుర్తింపుతో బిగ్‌బాస్ 1లోకి వెళ్లి తనదైన నటనతో బుల్లితెర ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంది. 2015లో ఆమె వివాహం జరిగింది. View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) -
ఆ చిట్టి తల్లి పేరు పెట్టడం వెనక ఓ విషాదం
అయిదేళ్ల ఆ చిన్నారి పేరు రెండు వారాల కిందట ఆసీస్ ప్రసార మాధ్యమాల్లో మార్మోగింది. కారణం.. ఓ ప్రాణాంతక వ్యాధిపై పోరుకోసం చేయనున్న చట్ట సవరణ ప్రతిపాదన బిల్లుకు ఆ చిన్నారి పేరు పెట్టడమే. దీనిని ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ ఏకంగా పార్లమెంట్లో ప్రకటించారు. ఆ చట్టం మావె లా.. ఆ చిన్నారి పేరు మావె హుడ్. విప్లవాత్మక చట్ట సవరణకు ఆ చిట్టి తల్లి పేరు పెట్టడం వెనక ఓ విషాదం దాగి ఉంది. సారా హుడ్, జోయెల్ హుడ్ దంపతుల మూడో కూతురు మావె హుడ్. ఐదు నెలల వయసులో తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య తలెత్తింది మావెలో. వైద్యుల పర్యవేక్షణ, చికిత్సతో కోలుకున్నప్పటికీ ఆ తర్వాతా అనేక సమస్యలు వెంటాడాయి. 18 నెలల వయసులో చిన్నారి మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈసారి పాపను పరీక్షించిన వైద్యులు.. మైటోకాండ్రియా లోపంతో వచ్చే లీ సిండ్రోమ్‌కు గురైనట్లు గుర్తించారు. పాపను అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటూ, అప్పటికప్పుడు మాత్రలతో వ్యాధి తీవ్రతను తగ్గించి, మరణాన్ని వాయిదా వేయడం తప్ప మరో మార్గం లేదన్నారు డాక్టర్లు. దీంతో ఆ తల్లిదండ్రులు తమ పాప పరిస్థితికి తల్లఢిల్లినా, పాపను అప్రమత్తంగా చూసుకోసాగారు. ఇటీవల ఈ విషయం పత్రికల ద్వారా ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రెగ్‌కు చేరింది. మావె పడుతున్న కష్టాలను తెలుసుకున్న ఆయన దేశంలో మరే చిన్నారికీ ఇలాంటి అవస్థ రాకూడదంటే ఏం చేయాలో చెప్పాలని వైద్యులనడిగారు. డీఎన్ఏ మార్పిడి ద్వారా ఈ సమస్య పరిష్కరించవచ్చని వాళ్లు చెప్పారు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే.. తల్లి గర్భిణిగా ఉన్నప్పడు చిన్నారిలోని ఆమె డీఎన్ఏ స్థానంలో మరొకరి నాణ్యమైన డీఎన్ఏను ఐవీఎఫ్ పద్ధతిలో ప్రవేశపెడితే ప్రాణాంతక వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చని వివరించారు. అయితే, ఇది కష్టమైన పని. ఎందుకంటే డీఎన్ఏ మార్పిడిపై ఆసీస్‌లో నిషేధం ఉంది. దీంతో ఈ చట్టాన్ని సవరించేందుకు గ్రెగ్ హంట్ తీర్మానించాడు. అందులో భాగంగానే చట్ట సవరణ కోరుతూ బిల్లు ప్రవేశపెట్టడంతోపాటు, ఆ బిల్లుకు మావె పేరు పెట్టాడు. నిజానికి ఆస్ట్రేలియాలో ఏటా కనీసం 56 మంది చిన్నారులు మైటోకాండ్రియా డిసీజ్‌తో జన్మిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అందులో చాలామంది ఐదేళ్లలోపే మరణిస్తున్నారు. ఈ పరిస్థితిని పరిష్కరించి, పసిప్రాణాలను కాపాడడం, తల్లిదండ్రుల కడుపుకోతను అడ్డుకోవాలనే తన ప్రయత్నానికి మనఃస్ఫూర్తిగా సహకరించాలని గ్రెగ్ హంట్ పార్లమెంట్లో విపక్ష సభ్యులందరినీ కోరాడు. ఈ చట్ట సవరణకు ఆమోదం లభిస్తే ఆ తరువాత ఆస్ట్రేలియాలో మైటోకాండ్రియాతో చిన్నారులు మరణించడమేనేది ఉండకపోవచ్చు. మైటోకాండ్రియా డిసీజ్ అంటే... మనిషిని పట్టి పీడించే ప్రాణాంతక వ్యాధుల్లో ఇదొకటి. మన శరీరానికి కావాల్సిన శక్తి మనం తీసుకునే ఆహారం నుంచి వస్తుందనే విషయం తెలిసిందే కదా. అయితే, ఆహారం జీర్ణమై శక్తిగా రూపొందడంలో కీలకంగా వ్యవహరించే పాత్ర మన శరీరంలోని ఉండే కణాల్లోని మైటోకాండ్రియాదే. ఏ కారణం వల్ల అయినా మైటోకాండ్రియా సరిగా పనిచేయకపోయినా, నిర్జీవమైనా మన శరీరానికి తగిన శక్తి ఆహారం నుంచి అందదు. ఫలితంగా రకరకాల రుగ్మతలు వస్తాయి. అందులో ముఖ్యమైనది ఆర్గాన్ ఫెయిల్యూర్.. అంటే అవయవం పనిచేయకపోవడం. ఇది మరణానికి దారి తీస్తుంది. అలాగే గుండెపోటు, చెవుడు, దృష్టిలోపం, నడవలేకపోవడం, మాట్లాడలేకపోవడం వంటివీ సంభవిస్తాయి. జన్యులోపం వల్లో, వంశపారంపర్యంగానో, జీవన శైలిలో మార్పుల వల్లో వచ్చే ఈ వ్యాధికి ఇప్పటికీ సరైన చికిత్స లేదు. పుట్టినప్పటి నుంచి చనిపోయేలోగా ఎప్పుడైనా సరే ఈ వ్యాధి వచ్చే ప్రమాదముంది. -
డెలివరీ బాక్స్‌లో ముసిముసి నవ్వుల ‘చిన్నారి’
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలామంది తల్లులు తమ చంటి పిల్లల్నీ ఎదరు పొట్టకుగానీ వెనుక వీపు మీద కట్టుకుని పనిచేస్తూ.. జీవనం సాగిస్తూంటారు. ఇది మనం రెగ్యులర్‌గా ఎక్కడో ఒకదగ్గర చూస్తూనే ఉంటాము. యాచించే స్త్రీలు అయితే పిల్లల్ని చూపిస్తూ డబ్బులు అడుగుతుంటారు. అయితే చైనాలో ఓ తండ్రి మాత్రం తన ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో చంటిబిడ్డను వెంటబెట్టుకుని మరీ ఉద్యోగం చేస్తున్నాడు. ఆ చిన్నారి పాప కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ.. తండ్రితోపాటు తనుకూడా వస్తువులను డెలివరీ చేస్తోంది. ఈ విషయం ఆనోటా ఈ నోటా సోషల్ మీడియాకు చేరడంతో ప్రస్తుతం ముసిముసి నవ్వుల డెలివరీ గార్ల్ ‘బుజ్జాయి’ నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. చైనాకు చెందిన లీ యువాన్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. రోజూ తన స్కూటర్ మీద వస్తువులను డెలివరీ చేసే యువాన్ తన రెండేళ్ల కూతుర్ని డెలివరీ బాక్స్‌లో కూర్చోబెట్టుకుని విధులు నిర్వహిస్తున్నాడు. డెలివరీ బాక్స్‌లో తన కూతురి కోసం డయపర్లు, తను తినే ఫుడ్‌ను తీసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు తను ఎటు వెళ్తే అటు తీసుకెళ్తున్నాడు. రోజూ తను ఎక్కడకు వెళ్తుంది? ఎందుకు వెళ్తుంది తెలియని పసిమనుసు..ఎవరైనా చూడగానే అందంగా నవ్వుతూ హాయ్ చెబుతోంది. లీయువాన్ మాట్లాడుతూ..‘‘తన కూతురు లీ ఫెర్రీ ఐదు నెలల వయసు ఉన్నప్పుడు తనకి నిమోనియా ఉన్నట్లు తెలిసింది. అప్పటి నుంచి తన చికిత్సకు చాలా ఖర్చవుతోంది. సేవింగ్స్‌లో ఎక్కువ భాగం ట్రీట్మెంట్కే కేటాయిస్తున్నాం. భార్యాభర్తలు ఇద్దరం కష్టపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. ఈ క్రమంలోనే లీఫెర్రీనీ చూసుకునేవారు ఎవరూ లేకపోవడంతో ఉదయం తనని తనతోపాటు తీసుకెళ్తాను. సాయంత్రానికి ఇంటికి వచ్చాక లీఫ్రెర్రీ రాత్రంతా అమ్మతో గడుపుతోంది’’ ఇలా తనని చూసుకునే సమయాన్నీ షేర్ చేసుకున్నాము’’ అని లీయువాన్ చెప్పాడు. లీ ఫెర్రీ ఆరునెలల వయసు ఉన్నప్పటినుంచే తనని నా డెలివరీ బాక్స్‌లో కూర్చోపెట్టుకుని విధులు నిర్వహిస్తున్నాను. ఇది కాస్త కష్టంగా ఉన్నప్పటికీ మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలతో ముందుకు సాగుతున్నాను. ప్రస్తుతం ఫెర్రీ పెద్దది అయ్యింది. రెండేళ్లు నిండడంతో తను ఇప్పుడు నడవ గలుగుతుంది. దీంతో తనని వెనుకాల కూర్చోపెట్టుకుని తీసుకెళ్లగలుగుతున్నాను’’అని లీ చెప్పాడు. ప్రస్తుతం నడుస్తోన్న ఫెర్రీ తండ్రితోపాటు డెలివరీ చేసేందుకు తెగ ముచ్చటపడుతూ తండ్రి వెనక హుషారుగా కూర్చుంటోంది. నెలల పసికందునుంచి రెండేళ్ల చిన్నారివరకు ఫెర్రీ డెలివరీ చేయడానికి వెళ్లిన వీడియోలు వైరల్ అవుతుండడంతో నెటిజన్లు లీయువాన్ను అభినందిస్తున్నారు. -
విరుష్కా: నెంబర్ 11 వెనుకున్న రహస్యం!
ముంబై : విరుష్క దంపతులకు నెంబర్11తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎలా అంటే.. విరాట్ కోహ్లీ పుట్టిన నెల, పెళ్లి రోజు, తండ్రైన రోజు, కెరీర్లో సాధించిన ఘనతలన్నింటీ 11తో సంబంధం ఉండటం ఇప్పడు చర్చనీయాంశమైంది. విరాట్ పుట్టినరోజు 11వ నెలలోనే వస్తుంది. అనుష్కతో పెళ్లి కూడా డిసెంబర్11న జరిగింది. ఇక విరాట్ కోహ్లి, నటి అనుష్క శర్మ దంపతులకు జనవరి 11న పండంటి పాప జన్మనిచ్చింది. అప్పటి నుంచి కూతురుకి సంబంధించిన ఏ విషయాన్ని అభిమానులతో విరుష్క జోడీ పంచుకోలేదు. అంతేకాకుండా.. ప్రైవసీ పేరు చెప్పిన విరాట్ కోహ్లీ.. కుటుంబ సభ్యుల్ని మినహా ఎవరినీ ఆసుపత్రిలో పాపని చూసేందుకు అనుమతించలేదు. (తొలిసారి కూతురి ఫొటో షేర్ చేసిన ‘విరుష్క’) తాజాగా తమ గారాలపట్టిని ఇన్స్టాగ్రామ్ వేదికగా అనుష్క ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా తమ ముద్దుల కుమార్తె పేరును వెల్లడించారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పేర్లు కలిసేలా 'వామికా' అని నామకరణం చేశారు. ఇంతకీ ఈ పేరు ఎలా పెట్టారో తెలుసా..ఆంగ్ల అక్షరం వి అంటే విరాట్, ఎ అంటే అనుష్కలను కలగలిపితే వా..దానికి 'మిక'ను జతచేయడం ద్వారా అమ్మవారి పేరువచ్చింది. వామిక అంటే కనకదుర్గ అని అర్థం. చిన్నారి వామికను అనుష్క పరిచయం చేసిన కొన్ని నిమిషాలకే ఆమె ఇన్‌స్టాగగ్రామ్ మొత్తం అభినందనలు, శుభాకాంక్షలతో నిండిపోయింది. పలువురు ప్రముఖులు చిన్నారిని ఆశీర్వదిస్తూ పోస్టులు పెట్టారు. ఇక న్యూమరాలజీ ప్రకారం అనుష్క అదృష్ట సంఖ్య 3కాగా, విరాట్‌కు 7గా ఉంది. చిన్నారి వామికా లక్కీ నెంబర్ 3గా ఉంది. అయితే 11 అనే నెంబర్‌తో కోహ్లీ, అనుష్కకు ఏదో అనుంబంధం ఉందని, ఆ సంఖ్య వారికి కలిసొస్తుందని వారి సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అయితే దాని వెనుకున్న రహస్యం మాత్రం ఎవరికీ తెలీదు. (కోహ్లి వీరాభిమాని కూతురు పేరు తెలుసా?) -
తొలిసారి కూతురి ఫొటో షేర్ చేసిన ‘విరుష్క’
ముంబై: విరాట్-అనుష్క అభిమానులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూస్తున్న వారి కూతురి ఫోటోను మొదటిసారిగా అనుష్క రివీల్ చేసింది. తమ ముద్దుల కుమార్తెకు ఈ జంట సోమవారం నామకరణం చేసింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పేర్లు కలిసేలా 'వామికా' అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని నటి అనుష్క శర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఎంతో ప్రేమానురాగాలతో నిండిన మా జీవితాల్లో వామికా ఆ సంతోషాలను మరింత రెట్టింపు చేసింది. తన రాక ఎన్నో వెలుగులను తీసుకొచ్చింది. ఆనందం, కన్నీళ్లు, ఆందోళన..ఇలా నిమిషాల వ్యవధిలోనే ఎన్నో భావోద్వేగాలు. కానీ మా హృదయం ఎంతో ప్రేమతో నిండి ఉంది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, ఆప్యాయతలకు ధన్యవాదాలు' అంటూ అనుష్క ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. (సంతోష సమయం.. చిన్న విన్నపం: విరుష్క) కాగా విరాట్ కోహ్లి, నటి అనుష్క శర్మ దంపతులకు జనవరి 11న పండంటి పాప జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమ చిన్నారి గోప్యతకు భంగం కలగకుండా తనను సంరక్షించుకోవాలని భావిస్తున్నామని, తమ కుమార్తె ఫొటోలు తీయవద్దని విరుష్క దంపతులు ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో విరుష్కల కూతురు ఎలా ఉంటుందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అనుష్క తమ చిన్నారి ఫోటో షేర్ చేయడంతో విరుష్క ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (ఆకతాయిలుగా పెంచాలనుకోవడం లేదు: అనుష్క) -
ధోని నుంచి కోహ్లి వరకు.. సేమ్ టు సేమ్
ఇటీవల తమకు మహాలక్ష్మీ వంటి పాప పుట్టడంతో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. తొలి బిడ్డ పుట్టిన క్షణాలను ఆస్వాదిస్తున్నారు. స్టార్ కపూల్ కాడవంతో పాపకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. విరుష్క జంట ఎక్కడికి పోయినా వారి వెంట ఓ కన్నేసి పెడుతున్నారు. ఈ క్రమంలో తమ కూతురు ప్రైవసికి భంగం కలిగించొద్దని, పాప ఫోటోలు తీయవద్దని అనుష్క, విరాట్ ఫోటోగ్రాఫర్లకు విజ్ఞప్తి చేశారు. సరైన సమయంలో తమ పాప ఫొటోలను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. కాగా జనవరి 11న తమకు పాప పుట్టిందని కోహ్లి సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. (చదవండి: కోహ్లి కూతురిపై అమితాబ్ ట్వీట్ వైరల్) ఇక కోహ్లి కూతురుపై బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఓ ట్వీట్ చేయడంతో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మన క్రికెట్ టీమ్ అంతా కలిసి భవిష్యత్తులో మహిళల క్రికెట్ టీమ్‌ను తయారు చేస్తోందంటూ బిగ్ బీ ఫన్నీ ట్వీట్ చేశాడు. ఇందులో క్రికెటర్లందరికీ కూతుళ్లే పుట్టారంటూ వరుసగా ఒక్కొక్కరి పేరు రాసుకుంటూ వెళ్లాడు. ధోనీ కూతురు ఈ టీమ్‌కు కెప్టెన్‌గా ఉంటుందేమో అని కామెంట్ చేశాడు. ఆ లిస్ట్‌లో వరుసగా రైనా, గంభీర్, రోహిత్, షమి, రహానే, జడేజా, పుజారా, సాహా, భజ్జీ, నటరాజన్, ఉమేష్ యాదవ్‌ల పేర్లు ప్రస్తావించాడు. తాజాగా కోహ్లికి కూడా కూతురే పుట్టిందంటూ.. వీళ్లంతా భవిష్యత్తు మహిళల క్రికెట్ టీమ్‌ను తయారు చేస్తున్నారని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. ఒక్క హర్ధిక్ పాండ్యాకు తప్ప మిగతా టీమిండియా క్రికెటర్లందరికి ఈ మధ్య కాలంలో దాదాపు ఆడపిల్లలే జన్మించారు. హర్ధిక్ పాండ్యా, నటాషాకు గతేడాది జూలై 30న కొడుకు పుట్టాడు. అంతేగాని రైనా నుంచి ఉమేష్ యాదవ్ వరకు అందరి ఇంట్లోకి మహాలక్ష్మీలే అడుగుపెట్టారు. 1. మహేంద్ర సింగ్ ధోని 2010లో సాక్షిని వివాహం చేసుకోగా వీరికి 2015లో కూతురు జీవా జన్మించింది. 2.సురేష్ రైనా, ప్రియాంక చైధురీలకు మొదటి సంతానం కూతురే. ఆమె పేరు గ్రేసియా.. ప్రస్తుతం తనకు నాలుగేళ్లు. 3. గౌతమ్ గంభీర్: గంభీర్,నటాషా జైన్లకు ఇద్దరు కూతుళ్లే.. మొదటి కూతురు పేరు అజీన్ గంభీర్ కాగా రెండో కూతురు అనైజా గంభీర్ 4. రోహిత్ శర్మ 2015 లో రితికా సజ్దాలను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు 2018 డిసెంబర్లో సమైరా అనే కూతురు జన్మించింది. 5. మహ్మద్ షమీ, హసీన్ జహాన్లకు 2015లో ఐరా షమీ అనే కూతురు జన్మించింది. 6. రవిచంద్రన్ అశ్విన్.. ప్రీతీ నారాయణన్ జంటకు చూడచక్కని ఇద్దరు కూతుళ్లు ఆద్యా, అకీరాలు. 7. అజింక్యా రహానే.. రాధిక జంటకు కూతురు ఉంది. తన పేరు ఆర్యా రహానే. 8.రవీంద్ర జడేజా తొలి ముద్దుల తనయ పేరు నిద్యానా. 9. ఛేతేశ్వర్ పుజారాకి మొదటి సంతానం అమ్మాయి. తన ముద్దుల తనయ పేరు అదితి. 10. వృద్ధిమాన్ సాహాకు భార్య రోమి సాహా.. అందమైన కుమార్తె అన్వి సాహా ఉంది. 11. హర్భజన్‌సింగ్- గీతా బస్రాల కూతురు హినాయా సింగ్. 12. ఉమేశ్ యాదవ్ భార్య తాన్య వాద్వా జనవరి 1న ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ జంటకు ఇది తొలి సంతానం. 13. విరాట్ కోహ్లి, అనుష్క శర్మకు జనవరి 11న కూతురు జన్మించింది. -
వైరలవుతున్న కోహ్లి కూతురు ఫస్ట్ ఫోటో..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, నటి అనుష్క శర్మకు సోమవారం పండంటి పాప జన్మనిచ్చిన విషయం తెలదిసిందే. ఈ విషయాన్ని కోహ్లి స్వయంగా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు. ‘ఈ రోజు మధ్యాహ్నం మాకు పాప పుట్టింది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మీ అందరి ప్రేమానురాగాలకు ధన్యవాదాలు. ప్రస్తుతం పాప, అనుష్క శర్మ ఇద్దరూ ఆరోగ్యం ఉన్నారు. దీంతో మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సమయంలో మా ప్రైవసీని మీరంతా గౌరవిస్తారని ఆశిస్తూ.. ప్రేమతో మీ విరాట్’ అని ట్విటర్లో లేఖ ద్వారా వెల్లడించాడు. కాగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు అనంతరం విరాట్ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వచ్చాడు. తమకు తొలి బిడ్డ జన్మిస్తున్న క్షణాల్లో భార్య అనుష్క పక్కనే ఉండాలని నిర్ణయించుకున్నకోహ్లి ప్రస్తుతం ఆ మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నాడు. చదవండి: అనుష్క-కోహ్లి దంపతులకు కుమార్తె..! ఇదిలా ఉండగా.. పాప పుట్టిన వార్తను తెలియజేసిన కోహ్లి తన ఫోటోను మాత్రం పంచుకోలేదు. ఈ నేపథ్యంలో విరుష్కల కూతురు ఎలా ఉంటుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లి సోదరుడు వికాస్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటో వైరల్‌గా మారాయి. వికాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ తండ్రి అయ్యాడన్న విషయాన్ని షేర్ చేస్తూ.. అప్పుడే పుట్టిన పాప కాలి ఫోటోను పోస్టు చేశారు. దీనికి ‘ఇంట్లోకి దేవత వచ్చింది. పట్టరానంత సంతోషంగా ఉంది.’ అనే క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఫోటోలో చిన్న పాప ఉండటంతో తనే కోహ్లీ కూతురేనని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా చెప్పకపోయినా ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కొడుతుంది. మరోవైపు అనుష్క, విరాట్ తల్లిదండ్రులు అయ్యారన్న విషయం తెలియగానే అభిమానులు ఆనందంలో మునిగితేలిపోతున్నారు. విరుష్క దంపతులకు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Vikas Kohli (@vk0681) View this post on Instagram A post shared by Bhawna Kohli Dhingra (@bhawna_kohli_dhingra) -
రహస్యంగా పెళ్లి; పాపకు జన్మనిచ్చిన నటి
విశ్వరూపం ఫేమ్ పూజా కుమార్ తల్లిగా ప్రమోషన్ పొందారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న పూజా ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమై విషయాన్ని పూజా భర్త విశాల్ జోషి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అప్పుడే పాపకి నవ్య జోషిగా నామకరణం కూడా చేశారు. తనకు కూతురు పుట్టిందన్న విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘ఒకప్పుడు మేము ఇద్దరం. కానీ ఇప్పుడు ముగ్గురం. మా చిన్నారి పాప నవ్య జోషిని మీ అందరికి పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. నేను కలలుగన్న గొప్ప భాగస్వామిగా నాజీవితంలోకి వచ్చినందుకు, లిటిల్ నవ్యను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు నీకు(పూజా) ధన్యవాదాలు. నా ఈ పుట్టినరోజును బెస్ట్ పుట్టినరోజుగా మలిచావు. లవ్ యూ బోత్ సో మచ్’.. అంటూ సతీమణి, కూతురిపై ప్రేమను కురిపించారు. అలాగే వీరిద్దరూ కూతురుతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా వైరలవుతున్నాయి. చదవండి: కమల్‌తో డేటింగ్.. పూజా క్లారిటీ ఇదిలా ఉండగా నటి పూజా కుమార్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ ‘జాయ్’ సీఈఓ విశాల్ జోషి అనే వ్యక్తిని పూజా కుమార్ వివాహం చేసుకున్నారు. కాగా 2000లో కాదల్ రోజావే చిత్రంతో కోలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ భామ కమల్ హాసన్ సరసన యాక్షన్ థ్రిల్లర్ విశ్వరూపంలో(2013) నటించి మంచి నటిగా గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత కమల్‌తో మరోసారి విశ్వరూపం-2, ఉత్తమ విలన్ సినిమాలతో జతకట్టారు. ఇక పూజా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. రాజశేఖర్ నటించిన ‘గరుడ వేగ’లో నటించారు. అమెరికాలోని మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో జన్మించిన పూజా భరతనాట్యం, కథక్, కూచిపూడిలో ఆమె శిక్షణ పొందారు. 1995లో మిస్ ఇండియా యూఎస్ఏ టైటిల్‌ని సొంతం చేసుకున్నారు. ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డ ఎన్నారైలు. మ్యాన్ ఆన్ ఎ లెడ్జ్, బ్రాల్ ఇన్ సెల్ బ్లాక్ 99, బాలీవుడ్ హీరో వంటి హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించారు. -
తండ్రిగా ప్రమోషన్ పొందిన టీమిండియా పేసర్
టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఆయన భార్య తాన్య వాద్వా శుక్రవారం రోజున ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఉమేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. చిన్న పాప ఫోటోను షేర్ చేస్తూ... ‘ఈ ప్రపంచంలోకి స్వాగతం రాకుమారి. నీ రాకతో ఎంతో థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతున్నాను.’ అని ట్విటర్లో అభిమానులతో పంచుకున్నారు. పేస్ బౌలర్ ఉమేష్, తాన్య వాద్వాలా వివాహం 2013లో జరిగింది. వీరిద్దరికి ఇది మొదటి సంతానం. చదవండి: ఉమేశ్ యాదవ్ స్థానంలో నటరాజన్! It's a girl. 😘😘😍😘😍😘 pic.twitter.com/mdorY5nBUv — Umesh Yaadav (@y_umesh) January 1, 2021 ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న ఉమేశ్ యాదవ్.. త్వరలో భారత్‌కు రానున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో ఉమేష్ యాదవ్ కాలికి గాయమై ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం తన ముద్దుల కూతురితో కాస్తా సమయం గడిపేందుకు అవకాశం దొరికినట్లైంది. ఇదిలా ఉండగా ఈ పర్యటనలో ఉమేష్ యాదవ్ రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. గాయం కారణంగా వెనుదిరిగిన ఉమేష్ యాదవ్ స్థానంలో లెఫ్టామ్ పేసర్ నటరాజన్‌కు చోటు దక్కింది. ఈ విషయాన్ని శుక్రవారం ట్విటర్ ద్వారా బీసీసీఐ వెల్లడించింది. -
దారుణం..పసికందు అక్కడికక్కడే మృతి
-
దారుణం..పసికందు అక్కడికక్కడే మృతి
సాక్షి, హైదరాబాద్ : సనత్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్త మీద కోపంతో 14 రోజుల పసికందుని భవనం పైనుంచి కిందపడేసింది ఓ తల్లి. పసికందు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన సంఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఫతేనగర్ డివిజన్ నేతాజీ నగర్లో వేణుగోపాల్ లావణ్య దంపతుల నివసిస్తున్నారు. వీరికి 2016లో వివాహమైంది. మూడేళ్ల బాబు ఉన్నాడు. రెండో సంతానంలో అమ్మాయి పుట్టడంతో భార్య భర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో శనివారం మరోసారి గొడవ జరగడంతో కోపంతో లావణ్య 14 రోజుల పసికందును మూడో అంతస్తు నుంచి పై నుంచి కింద పడేయడంతో చిన్నారి మృతి చెందింది. సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బాలురే అధికం.. మరణాల్లోనూ పురుషులే..
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఉమ్మడి జిల్లాలో బాల, బాలికల నిష్పత్తి మధ్య భారీగా అంతరం కనిపిస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నమోదవుతున్న జనన, మరణాలు బాల, బాలికల నిష్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. పుడుతున్న వారిలో బాలురే అధికంగా ఉంటున్నట్లు సివిల్ రిజిస్ట్రేషన్ శాఖ వెల్లడించింది. ఆయా మున్సిపాలిటీలు, ప్రణాళిక శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా గణాంకాలను క్రోడికరించి ప్రతీ రెండు సంవత్సరాలకోసారి ఒక ఏడాదికి సంబంధించిన జనన, మరణాల లెక్కలను సివిల్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేస్తుంది. అందులో భాగంగా 2018 ఏడాదికి సంబంధించి గణాంకాలను తాజాగా ప్రకటించింది. ఈ లెక్కల ప్రకారం బాలికల కంటే బాలుర సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తేలింది. సివిల్ రిజిస్ట్రేషన్ శాఖ వివరాల ప్రకారం.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2018లో 75,344 మంది జన్మించగా, 10,596 మంది మరణించారు. అయితే, జన్మిస్తున్న వారిలో బాలురే అధికంగా ఉన్నారు. ఇటు మరణిస్తున్న వారిలోనూ మహిళల కన్నా పురుషులు అధికంగా ఉండటం గమనార్హం. అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా జనాభా మొత్తం 25,43,647 కాగా, పురుషులు 12,46,875 మంది, మహిళలు 12,96,781 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే జననాలు ఎక్కువ.. ఉమ్మడి జిల్లాలో 2018 సంవత్సరంలో మొత్తం 75,344 మంది జన్మించారు. ఇందులో 37,972 మంది బాలురు జన్మిస్తే, 36,154 మంది బాలికలు ఉన్నారు. అంటే బాలికల కంటే 1,818 మంది బాలురు ఎక్కువ జన్మించారు. గ్రామీణ ప్రాంతాల్లోనే జననాల సంఖ్యలో ఎక్కువ ఉంది. జీవన ప్రమాణాలు పెరగడం, కుటుంబ నియంత్రణ అమలు కాకపోవడంతో జననాల సంఖ్య ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ఇక నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 2018 సంవత్సరంలో 10,596 మంది మృతి చెందారు. ఇందులో 4,939 మంది మహిళలుంటే, 5,657 మంది పురుషులున్నారు. మరణాల రేటులోనూ పురుషులే అధికంగా ఉన్నారు. శిశు మరణాలు కూడా ఎక్కువగానే సంభవించినట్లు సివిల్ రిజిస్ట్రేషన్ శాఖ వెల్లడించింది. 2018లో 480 శిశు మరణాలు నమోదైనట్లు పేర్కొంది. -
తండ్రి అయిన బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు అఫ్తబ్ శివదాసాని కుటుంబంలోకి కొత్త అతిథి వచ్చి చేరారు. ఆయన భార్య నీన్ దుసాంజి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. తాను తొలిసారి తండ్రైన ఆనందకర విషయాన్ని అఫ్తబ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వెల్లడించారు. "దివిపై నుంచి స్వర్గం భువిపైకి వచ్చి చేరింది. దేవుడి ఆశీర్వచనాలతో మాకు కూతురు జన్మించినందుకు సంతోషిస్తున్నాం. మా కుటుంబ సభ్యుల సంఖ్య ఇప్పుడు మూడుకు చేరింది. ఎంతో గర్వంగా ఉంది" అంటూ రాసుకొచ్చారు. దీనికి పాపాయి పాదాల ఫొటోను జత చేశారు. పుత్రికోత్సాహంతో పొంగిపోతున్న ఈ జంటకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. (మగ బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ జంట) కాగా ఈ మధ్యే అఫ్తబ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తొలి ప్రయోగాత్మక చిత్రమైన మస్త్తోనే ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని తెలిపారు. అదే తనకు గొప్ప విజయాన్ని సాధించినంత అనుభూతి కలిగించిందని, ప్రేక్షకులు తనను అంగీకరించారని చెప్పుకొచ్చారు. అయితే సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినా సరే, ప్రేక్షకులు వారిని ఆదరించలేకపోతే మనుగడ సాధించలేరని తెలిపారు. కాగా ఆయన మిస్టర్ ఇండియా, షాహెన్షా, చాల్బాజ్ చిత్రాల్లో బాలనటుడిగా అలరించారు. అనంతరం 'మస్త్' చిత్రంతో హీరోగా మారాడు. కసూర్, ఆవారా పాగల్ దీవానా, హంగామా, 1920: ది ఈవిల్ రిటర్న్స్ సినిమాల్లోనూ నటించారు. (తండ్రైన అర్జున్‌రెడ్డి డైరెక్టర్) -
చైల్డ్ హోంకు అన్విత అప్పగింత
కోల్‌సిటీ(రామగుండం): బరువు తక్కువగా జన్మించిన ఆడశిశువు ఆ తల్లిదండ్రులకు భారమైంది. అప్పటికే అధిక సంతానం.. ఈ శిశువు బతకడం కష్టమని భావించి ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లారు. ఆస్పత్రి వైద్యసిబ్బంది అమ్మలా..లాలపోసి.. జోలపాడి.. పాలుపట్టి కంటికి రెప్పలా కాపాడడంతో ఆరోగ్యం మెరుగైంది. బరువూ పెరిగింది. శిశువును స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేతుల మీదుగా ఐసీడీఎస్ అధికారులకు అప్పగిస్తూ కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ సంఘటన గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అధిక సంతానం ఉన్న ఓ నిరుపేద దంపతులకు ఈ ఏడాది ఏప్రిల్ 3న గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో కవలలు జన్మించారు. వీరిలో మగశిశువు చనిపోగా.. ఆడశిశువు 920 గ్రామాలు బరువు మాత్రమే ఉంది. ఇక బతకడం కష్టమని భావించిన ఆ తల్లిదండ్రులు బిడ్డను ఆస్పత్రిలోనే వదిలి వెళ్లారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కంది శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఎన్సీయూ విభాగం వైద్యులు, సిబ్బంది ఆ శిశువును అక్కున చేర్చుకుని మానవత్వాన్ని చాటుకున్నారు. ఐదు రోజులో పది రోజులు కాదు.. ఏకంగా 105 రోజులు శిశువును కంటికి రెప్పలా కాపాడారు. ఏప్రిల్ 24న పాపకు ఆస్పత్రిలోనే నామకరణం వేడుక కూడా నిర్వహించారు. కొత్త బట్టలతో పాపను ముస్తాబు చేసి, ఉయ్యాలలో జోలపాడి అన్విత అని పేరుపెట్టారు. ఇప్పటివరకు అన్విత సంరక్షణ బాధ్యతలను ఎస్ఎన్సీయూ విభాగం వైద్యులు సమత, శ్రీలత, అద్వేష్రెడ్డి, సరళి, స్టాఫ్‌నర్స్‌లు కవిత, సంధ్య, రమ, రజని, సరిత, నీల, కేర్ సపోర్టింగ్ స్టాఫ్ సరోజన, కవిత, సరోజన చూశారు. మెరుగైన వైద్యంతోపాటు పోషకా హారం అందించడంతో శుక్రవారం వరకు 2,950 గ్రాముల బరువు పెరిగింది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంతో శుక్రవారం చైల్డ్‌హోంకు తరలించడానికి ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేతుల మీదుగా అన్వితను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. పాపను అప్పగిస్తుండగా బావోద్వేగంతో సిబ్బంది కన్నీటిపర్యంతమయ్యారు. వైద్యులు, సిబ్బంది అందరూ పాపతో కలిసి సంతోషంగా ఫొటో దిగారు. కరీంనగర్‌లోని చైల్డ్ హోంకు తరలిస్తున్నట్లు జిల్లా డీసీపీఓ జితేందర్, సీడీపీఓ స్వరూపరాణి, కనకరాజు తెలిపారు. అభినందించిన ఎమ్మెల్యే చందర్ శిశువు ప్రాణాలు కాపాడడమే కాకుండా మానవత్వంతో ఆలనాపాలన చూసి అరోగ్యవంతురాలిగా తీర్చిదిద్దిన వైద్యులు, సిబ్బంది పనితీరు ఆదర్శనీయమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అభినందించారు. పిల్లలను దత్తత తీసుకోవాలని అనుకునే వారు శిశు సంక్షేమశాఖ ద్వారా తీసుకోవచ్చని తెలి పారు. కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్‌రావు, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్, పాముకుంట్ల భాస్కర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
‘అమ్మ’మ్మలే హతమార్చారు..
బోసినవ్వుల బుజ్జాయిలను చూస్తే.. ఎవరికైనా ముద్దులాడాలనిపిస్తుంది. అప్పటి వరకు ఎంతో అలసటగా చిరాకుగా ఉన్న వారికి సైతం వారు కనిపిస్తే.. క్షణాల్లో అవన్నీ మాయమైపోతాయి. అభం శుభం తెలియని.. పసిపాపలంటే ఇష్టం లేని వారెవరూ ఉండరు. ఇక గోదావరి వాసులైతే ఆడపిల్ల పుడితే చాలని కనిపించే దేవతలందరికీ మొక్కుతారు. లక్ష్మీదేవితో సమానమని తరతరాలుగా నమ్ముతూ వస్తున్నారు.. ఆడపిల్ల పుట్టింది అనగానే ఆ ఇంట్లో సంబరం అంతా ఇంతా కాదు. బంగారు తల్లి పుట్టిందని మురిసిపోతారు. ఇక అత్త, మామలైతే.. మా ఇంటి కోడలు వచ్చేసిందంటూ తెగ ఆనందపడతారు. మరోవైపు ప్రభుత్వాలు సైతం ఆడపిల్లల సంరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. బేటీ పడావో.. బేటీ బచావో అని పాలకులు సైతం నినాదాలు చేస్తున్న రోజులవి.. కానీ సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామంలో ఓ అమ్మ, అమ్మమ్మ, ముత్తమ్మలు ఆ పసిపాపను భారమనుకున్నారు. నవమాసాలు మోసి కన్న నవజాత శిశువును కనీస మానవత్వం లేకుండా కర్కశంగా చంపేశారు. చివరికి కటకటాలపాలయ్యారు. కోరుకొండ: సీతానగరం మండలంలో చినకొండేపూడి గ్రామానికి చెందిన కాళ్ల సతీష్, అదే గ్రామానికి చెందిన సృజన దంపతులు 2019 మేనెలలో వివాహమైంది. వీరు ఇక్కడే నివసిస్తున్నారు. భార్యకు నెలలు నిండటంతో భర్త సతీష్ ఆమెను రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా ఈనెల 4వ తేదీన ఆడపిల్లకు జన్మినిచ్చింది. ఆసుపత్రి నుంచి తల్లీబిడ్డలు సురక్షితంగా చినకొండేపూడి గ్రామం చేరుకున్నారు.. పుట్టింటికి చేరిన సృజనకు తన తల్లి మల్లిరెడ్డి మహాలక్ష్మి నుంచి నిరాదరణ ఎదురైంది. ఆడపిల్లకు జన్మనిచ్చావని అసహనం వ్యక్తం చేస్తూ వస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం రావులపాడు నుంచి వచ్చిన సృజన అమ్మమ్మ గంధం కనకరత్నం కూడా ఈ విషయంపై ఆగ్రహంగానే ఉంది. (ఒడి నుంచి మాయమై.. బావిలో శవమై..) మూడు తరాలుగా వంశంలో ఆడపిల్లలు జన్మించడం సమంజసంగా లేదని, ఆడబిడ్డ భారమని, పెరిగే కొద్దీ ఖర్చు పెట్టాల్సి ఉంటుందని కసి పెంచుకుంది. నవజాత శిశువును మునిమనురాలను కడతేర్చాలని నిర్ణయించుకుంది. కనకరత్నం, మహాలక్ష్మి ఈనెల 18వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో వారి ఇంటికి సమీపంలో ఉన్న బావిలో ఆడశిశువును హత్య చేసి పడేశారు. అనంతరం బిడ్డను ఎవరో ఎత్తుకుపోయారని కేకలు వేశారు. దీంతో సీతానగరం ఇన్చార్జి ఎస్సై పి. విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేయగా కోరుకొండ సర్కిల్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. శుక్రవారం తెల్లవారు జామున నవజాత శిశువు కిడ్నాప్ సంఘటన గ్రామంలో కలకలం రేపింది. చిన్నారి ఆచూకీ కోసం గ్రామస్తులు సైతం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ముగ్గురూ..ఇలా దొరికారు... శుక్రవారం సాయంత్రం సుమారు నాలుగు గంటలు దాటిన తరువాత సమీపంలో ఉన్న పాడుబడ్డ బావిలో చిన్నారి చనిపోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమారా్టనికి తరలించారు. అయితే ఈ సంఘటనలో లోతైన దర్యాప్తు చేసిన పోలీసులు కీలక అంశాలను సేకరించారు. ఆడశిశువును ఆమె తల్లి సృజన, అమ్మమ్మ ఎం.మహాలక్షి్మ, ముత్తమ్మ జి.కనకరత్నం హత్యచేసినట్టుగా గుర్తించి వారిని అరెస్టు చేశారు. ఆదివారం కోరుకొండ పోలీసు స్టేషన్ వద్ద రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఉత్తర మండలం డీఎస్పీ పి.సత్యనారాయణరావు, సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్సై విజయ్‌కుమార్ వారిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. డీఎస్పీ సత్యనారాయణరావు మాట్లాడుతూ ఆడబిడ్డ భారమనే భావంతోనే రక్త సంబంధులైన ముగ్గురు మహిళలు కలిపి హత్యకు పాల్పడ్డారన్నారు. ముక్కుపచ్చలారని చిన్నారని మొగ్గలోనే చిదిమేశారని తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్సై విజయ్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్ వాసంశెట్టి శ్రీను, గోవిందు, రాము, షేక్ వలీ, త్రిమూర్తులు, మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారు. -
ఒడి నుంచి మాయమై.. బావిలో శవమై..
సీతానగరం (రాజానగరం): తల్లి చనుబాలు తాగుతూ రాత్రి నిద్రపోయిన పదహారు రోజుల పసిపాప తెల్లవారేసరికీ అదృశ్యమైంది. అనంతరం ఇంటి సమీపంలో ఉన్న ఓ బావిలో శవమై తేలింది. హృదయ విదారకరమైన ఈ ఘటన సీతానగరం మండలం చిన కొండేపూడిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చిన కొండేపూడి గ్రామానికి చెందిన మల్లిరెడ్డి రమణ, మహాలక్ష్మికి ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె సృజనకు అదే గ్రామానికి చెందిన కాళ్ల సతీష్‌తో గతేడాది ఏప్రిల్‌లో వివాహమైంది. ఆమె ఈ నెల నాలుగో తేదీన రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. బిడ్డతో సహా ఈ నెల ఆరున చిన కొండేపూడిలోని పుట్టింటికి క్షేమంగా తిరిగి వచ్చింది. తెల్లవారుజామున ఘటన రోజూ మాదిరిగానే సతీష్ గురువారం రాత్రి 9 గంటల వరకూ భార్యాబిడ్డలతో గడిపి తన ఇంటికి వెళ్లాడు. భర్త వెళ్లిన తరువాత తల్లి, చెల్లెలు, అమ్మమ్మతో కలిసి సృజన ఒకే గదిలో పడుకుంది. అర్ధరాత్రి 12 గంటలకు కూడా పాపకు పాలిచ్చింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మెలకువ వచ్చి చూస్తే పక్కలో పాప లేదు. వెంటనే కంగారు పడి తన తల్లి మహాలక్ష్మి, అమ్మమ్మ గంధం కనకరత్నం పద్మావతి, చెల్లెలు ప్రమీలను నిద్రలేపింది. జారవేసిన తలుపులు అలాగే ఉన్నాయి. కానీ పాప అదృశ్యమైంది. ఊరంతా జల్లెడ సమాచారం తెలుసుకున్న అర్బన్ అడిషనల్ ఎస్పీ కె.లతామాధురి, నార్త్ జోన్ డీఎస్పీ సత్యనారాయణరావు, సీసీఎస్ సీఐలు జగన్, రాంబాబు, కోరుకొండ, రాజానగరం సీఐలు పవన్ కుమార్ రెడ్డి, ఎంవీ సుభాష్ తదితరులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆ ఇంటి పరిసరాలతో పాటు ఊరంతా జల్లెడ పట్టారు. డాగ్ స్క్వాడ్ ఆ సమీపంలోని పామాయిల్ తోట వరకు వెళ్లి ఆగాయి. సృజన కుటుంబ సభ్యులు తమకు ఎవ్వరి తోనూ విభేదాలు లేవని, ఎవరిపైనా అనుమానాలు లేవని చెప్పాడు. దీంతో ఏ విధమైన ఆచూకీ లభించక పోలీసులు తదుపరి నిఘ చర్యలు తీసుకునేందుకు వెళ్లిపోయారు. సీతానగరం పోలీస్ స్టేషన్ వద్ద పాప తల్లి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా.. పసిపాప అదృశ్యం విషయం తెలుసుకున్న పలువురు సృజన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 4.30 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన సంసాబత్తుల కృష్ట అక్కడకు వచ్చి బాధితులను పరామర్శించాడు. ఆ సమయంలో కాల్ రావడంతో సెల్‌ఫోన్ మాట్లాడుతూ సృజన ఇంటికి రోడ్డు అవతల ఉన్న వీరభద్రరాజు ఇంటి ఆవరణలోని బావి వరకూ వెళ్లాడు. బావికి ఆనుకుని మాట్లాడుతూ యాథాలాపంగా బావిలోకి చూశాడు. అందులో పసిపాప శవం కనిపించడంతో బిగ్గరగా అరిచాడు. సమాచారం తెలుసుకున్న సీఐ పవన్ కుమార్‌రెడ్డి అక్కడకు చేరుకుని పసికందు మృతదేహాన్ని బావి నుంచి పైకి తీశారు. పాప మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా.. ఆడపిల్ల కావడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నార్త్‌జోన్ డిఎస్పీ సత్యనారాయణరావు విలేకరులతో మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
తండ్రైన ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ జీవీ
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్‌కుమార్ తండ్రి అయ్యారు. ఆయన భార్య గాయని సైంధవి సోమవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో వారి కుటుంబంలో ఆనందం నెలకొంది. పలువురు ప్రముఖులు జీవీ ప్రకాష్, సైంధవి దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, జీవీ ప్రకాష్.. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు మేనల్లుడు అన్న సంగతి తెలిసిందే. ఆయన 2013లో తన చిన్ననాటి స్నేహితురాలైన.. గాయని సైంధవిని వివాహం చేసుకున్నారు. పలు హిట్ మూవీలకు సంగీతం అందించిన జీవీ ప్రకాష్.. నటుడిగా కూడా మెప్పించారు. తెలుగులో వచ్చిన ప్రేమ కథా చిత్రం.. తమిళ రీమేక్ ‘డార్లింగ్’తో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఓ వైపు మ్యూజిగ్ డైరక్టర్ కొనసాగుతూనే.. నటుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. చదవండి : జీవీ సోదరి బిజీబిజీ -
తండ్రైన అర్జున్‌రెడ్డి డైరెక్టర్
టాలీవుడ్ దర్శకుడు సందీప్‌రెడ్డి మరోసారి తండ్రి అయ్యారు. గురువారం ఆయన సతీమణి మనీషారెడ్డి పండంటి పాపకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో సందీప్‌రెడ్డి కుటుంబంలో సంతోషం నెలకొంది. కాగా, సందీప్‌రెడ్డి 2014లో మనీషాను వివాహంచేసుకున్నారు. సందీప్, మనీషా దంపతులకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. తన తొలి చిత్రం అర్జున్‌రెడ్డి పేరునే ఆయన తన కుమారుడికి పెట్టుకోవడం విశేషం. టాలీవుడ్లో పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేసిన సందీప్.. అర్జున్‌రెడ్డి చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే సందీప్ సంచలనాలు సృష్టించారు. ఆ తర్వాత అర్జున్‌రెడ్డి చిత్రాన్ని బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. -
మృత్యువుతో చిన్నారి పోరాటం
మండ్య: తోటి పిల్లలతో కలిసి ఆటపాటలతోఆనందంగా గడపాల్సిన ఓ చిన్నారిని రక్తదాహానికి మారుపేరైన తలసీమియా వ్యాధి పట్టి పీడిస్తోంది. నాలుగేళ్ల వయస్సులోనే మంచం పట్టిన కుమార్తెను కాపాడుకునేందుకు చేతిలో చిల్లిగవ్వలేక పోషకులు తల్లడిల్లుతున్నారు. మారాజులు మంచి మనస్సు చేసుకొని ఆపన్నహస్తం అందించి తమ కుమార్తె వైద్యానికి ఆర్థిక సహాయం అందజేయాలని పోషకులు కోరుతున్నారు. వివరాలు..మండ్య తాలూకా, హాడ్యా గ్రామానికి చెందిన సుధాకర్, భవాని దంపతులకు మనస్వి అనే నాలుగు సంవత్సరాల వయసున్న కుమార్తె ఉంది. పుట్టిన రెండు సంవత్సరాల తర్వాత బాలిక అనారోగ్యానికి గురవ్వడంతో వైద్యులకు చూపించారు. తరచూ రక్తం అవసరమయ్యే తలసీమియా అనే వ్యాధికి బాలిక గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. ఆపరేషన్‌కు రూ.30లక్షలు వ్యయం అవుతుందని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ చేసేవరకు బాలికను కాపాడుకోవాలంటే 15 రోజులకు ఒక మారు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. దీంతో పోషకులు అప్పులు చేసి రక్తం కొనుగోలు చేసి చిన్నారిని కాపాడుకుంటున్నారు. ఇప్పటివరకు ఐదారు లక్షల రూపాయల వరకు వ్యయం చేశారు. ప్రాణభిక్ష పెట్టండి:చిన్నారి మనస్వి తండ్రి సుధాకర్ మండ్యలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ రక్తం ఎక్కించాల్సిన ప్రతిసారి రూ. ఐదారువేలు వ్యయం అవుతోందని, అయితే చేతిలో చిల్లిగవ్వలేక అప్పులు చేస్తున్నామని వాపోయాడు. తన కుమార్తె ఆపరేషన్‌కు 30లక్షల రూపాయలు వ్యయం అవుతుందని వైద్యులు చెప్పారని, మనసున్న మారాజులు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేసి తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా మండ్య శాఖ ఖాతా నంబర్ 39024499683 ఐఎఫ్ఎస్సీ కోడ్–ఎస్బీఐ 0040326 సెల్‌నంబర్లు:9538716450, 953598590 -
పాపాయితో హైలెవల్ మీటింగ్‌కి
పుదుచ్చేరిలోని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆఫీస్‌లో మంగళవారం అత్యవసర సమావేశం జరుగుతోంది. ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసినవారు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడి! వివిధ శాఖల కార్యదర్శులు ఈ హైలెవల్ మీటింగ్‌కి హాజరయ్యారు. వారిలో ఐటీ శాఖ నుంచి వచ్చిన ఓ మహిళా కార్యదర్శి కూడా ఉన్నారు. సమావేశం గంభీరంగా సాగుతోంది. అంతలో.. మీటింగ్ హాలు బయట నుంచి పసిబిడ్డ ఏడుపు! ఆ ఏడుపు వింటూ మహిళా కార్యదర్శి స్థిమితంగా ఉండలేకపోయారు. అది గమనించారు కిరణ్ బేడి. ‘ఏమైంది?’ అన్నట్లు ఆమె వైపు చూశారు. ‘‘బయట ఏడుస్తున్నది నా కూతురే. పది నెలలు. నేను కనిపించకపోతే ఏడ్చేస్తుంది. వాళ్ల అమ్మమ్మ దగ్గర కూర్చోబెట్టి వచ్చాను’’ అని చెప్పారు ఆ ఆఫీసర్. పసికందు ఏడుపు ఆపడం లేదు. ‘‘వెళ్లి పాపను తెచ్చుకోండి’’ అన్నారు కిరణ్ బేడీ. ఆమె ముఖంలో సంతోషం. పరుగున వెళ్లి, పాపను ఎత్తుకుని తనతోపాటు లోపలికి తెచ్చుకుంది. ఆమె రాగానే మళ్లీ మీటింగ్ మొదలైంది. తల్లి ఒడిలో కూర్చొని ఉన్న పాప కూడా ఏడుపు మాని కిరణ్ బేడీ వైపే గంభీరంగా చూడ్డం మొదలు పెట్టింది. ఆ తల్లీ బిడ్డల ఫొటోను కిరణ్ బేడీ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘చైల్డ్ ఈజ్ హ్యాపీ’ అని కామెంట్ రాశారు. స్ట్రిక్ట్ ఆఫీసర్ అని కిరణ్‌బేడీకి పేరు. దేశంలోనే తొలి మహిళా ఐపీఎస్ అధికారి. కుటుంబ బాధ్యతల వల్ల మహిళలు ఉద్యోగాలను సరిగా చేయలేరు అనే మాటను కిరణ్ ఒప్పుకోరు. బిడ్డ ఏడుస్తుంటే పనిపై ధ్యాసపెట్టడం తల్లికి కష్టమే. బిడ్డ దగ్గర ఉంటే ఆ తల్లి ఇంకా బాగా పనిచేస్తుంది అంటారు ఆమె. ఇప్పుడీ ట్విట్టర్లో కూడా కిరణ్ బేడీ ‘చైల్డ్ ఈజ్ హ్యాపీ’ అన్నారు కానీ.. ‘మదర్ ఈజ్ హ్యాపీ’ అని అనలేదు. దానర్థం.. పిల్లల లాలన కూడా డ్యూటీలో భాగమేనని. పిల్లల బాధ్యతను సక్రమంగా నెరవేరిస్తే పిల్లలు సంతోషంగా ఉంటారు. వాళ్లసంతోషం తల్లిని సంతోషంగా ఉంచుతుంది. పనిలో తల్లి సామర్థ్యాన్ని పెంచుతుంది. -
ఆడపిల్లకు జన్మనిచ్చిందని..!
-
పాపకు జన్మనిచ్చిన నటి స్నేహ..
ప్రముఖ నటి స్నేహ రెండోసారి తల్లయ్యారు. శుక్రవారం రోజున ఆమె పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త నటుడు ప్రసన్న ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఏంజెల్ వచ్చేసిందని అన్నాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు స్నేహ-ప్రసన్న దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమిళ చిత్రం అచ్చముండు అచ్చముండు షూటింగ్ సమయంలో నటుడు ప్రసన్నతో స్నేహ ప్రేమలో పడ్డారు. 2012 వీరిద్దరి విహహ బంధంతో ఒకటయ్యారు. వీరికి ఇప్పటికే విహాన్ అనే బాబు ఉన్న సంగతి తెలిసిందే. కాగా, బాబు పుట్టిన తర్వాత సినిమాల గ్యాప్ ఇచ్చిన స్నేహ.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటీవల ధనుష్ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం పటాస్‌లో ఆమె నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. -
సాయం అందేలోపే..మృత్యువు మింగేసింది!
ప్రకాశం, ఉలవపాడు: కరేడు పంచాయతీ పరిధి కొత్తపాలెం గ్రామానికి చెందిన కొక్కిలగడ్డ రాస్య (2) తీవ్ర గాయాలతో వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం చెన్నైలో మృతి చెందింది. రాస్య సాంబార్లో పడటంతో తీవ్రంగా గాయపడింది. చెన్నైలోని వైద్యశాలలో చికిత్స పొందుతోంది. డబ్బులు లేని కారణంగా ఆ బాలికను ఆదుకునే వారు కావాలని గురువారం ‘సాక్షి’లో ఓ కథనం కూడా ప్రచురితమైంది. దాతల నుంచి సాయం అందేలోపు ఆ చిన్నారి మృత్యుఒడికి చేరుకుంది. ఇప్పటికే నాలుగు లక్షల రూపాయలకుపైన తల్లిదండ్రులు ఖర్చు పెట్టినా చిన్నారి దక్కలేదు. రాస్య పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఊటుకూరులో తన అమ్మమ్మ వద్ద ఉన్నప్పుడు వేడి వేడి సాంబార్లో పడిపోయింది. సాంబార్ ఆ చిన్నారి పాలిట విలన్‌గా మారి ప్రాణాలు తీసింది. -
కామాంధుడికి ఉరి
సాక్షి, చెన్నై: ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హతమార్చిన కేసులో కామాంధుడికి ఉరిశిక్ష విధిస్తూ కోయంబత్తూరు మహిళా కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. మరో నిందితుడిని కేసు నుంచి తప్పించారని, పునర్విచారణకు పట్టుబడుతూ కోర్టు ఎదుట మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. అలాగే, కేసు పునర్విచారణకు కోరుతూ ఆ బాలిక తల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పునర్విచారణకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మహిళలు, యువతులు, బాలికలకు భద్రత కల్పించే రీతిలో చట్టాలు కఠినం చేసినా, నేరాల కట్టడికి ప్రత్యేక బృందాలు, ప్రత్యేక టోల్ ఫ్రీలు ప్రకటించినా అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలో రోజుకో చోట, ఎక్కడో ఓ చోట దాడుల ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ అఘాయిత్యాలకు పాల్పడి పట్టుబడే నిందితుల్ని కఠినంగా శిక్షించినప్పుడే నేరాల తగ్గతాయని మహిళా సంఘాలు నినాదిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇటీవల హైదరాబాద్‌లో వెలుగు చూసిన దిశా ఘటన తరువాత మహిళలు, యువతులు, బాలికలు, చిన్న పిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడే వారిని మరింత కఠినంగా శిక్షించడంతో పాటు, ఇది వరకు దాఖలైన కేసుల విచారణల్ని త్వరిత ముగించే దిశగా జిల్లాల ఎస్పీలకు డీజీపీ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎనిమిది నెలల క్రితం సాగిన లైంగిక దాడి కేసు విచారణను ఆధారాలతో సహా పోలీసులు కోర్టులో నిరూపించడం విశేషం. అదే సమయంలో ఈకేసులో మరో నిందితుడిని తప్పించిన్నట్టుగా ఆరోపణలు బయలు దేరడం వివాదానికి దారి తీసింది. అదృశ్యం...మరుసటి రోజే మృతదేహంగా. కోయంబత్తూరు పన్నిమడైకు చెందిన ఓ దంపతుల కుమార్తె (7) ఈ ఏడాది మార్చి 25వ తేదీన అదృశ్యమైంది. బిడ్డ కోసం గాలించినా ఫలితం శూన్యం. దీంతో ఆ దంపతులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఆ మరుసటి రోజే ఆ దంపతుల ఇంటికి కూత వేటు దూరంలో బాలిక మృతదేహం పడి ఉండడం కలకలం రేపింది. ఆ బాలికపై లైంగిక దాడి జరిగినట్టు విచారణలో తేలింది. డీఎన్ఏ పరిశోధనలకు సైతం పోలీసులు చర్యలు తీసుకున్నారు. విచారణను ముమ్మరం చేయగా, తొండముత్తూరుకు చెందిన సంతోష్‌కుమార్ చిక్కాడు. బాలిక మృత దేహం పడి ఉన్న ప్రదేశానికి కూత వేటు దూరంలో ఉన్న ఇంట్లో ఉన్న ఓ వృద్ధురాలికి సాయంగా ఉంటూ వచ్చిన సంతోష్‌కుమార్ నిందితుడిగా తేల్చారు. ఎనిమిది నెలల్లో.....తీర్పు అన్ని రకాల ఆధారాల్ని సేకరించిన కోయంబత్తూరు పోలీసులు నిందితుడ్ని కటకటాల్లోకి నెట్టారు. కోయంబత్తూరులో పోక్సో కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక మహిళా కోర్టులో గతవారం వాదనను ముగించింది. కోర్టులో పోలీసులు సమర్పించిన అన్ని ఆధారాలు, సాక్షుల వాంగ్ములం మేరకు న్యాయమూర్తి శుక్రవారం సాయంత్రం తీర్పు ఇచ్చారు. నిందితుడు సంతోష్‌కుమార్‌కు ఉరి శిక్ష విధించారు. ఆ బాలికను హత్య చేసినందుకు ఉరి శిక్ష, పోక్సో చట్టం కింద నమోదైన కేసులకు యావజ్జీవ శిక్ష, ఆధారాల్ని రూపు మాపేందుకు చేసిన ప్రయత్నానికి ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సర్వత్రా ఆహ్వానించారు. మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే, ఆ కోర్టు ఎదురుగా మహిళా సంఘాలు తీర్పును ఆహ్వానిస్తూ, ఈ కేసులో మరో నిందితుడ్ని పోలీసులు తప్పించి ఉన్నట్టు ఆరోపిస్తూ, ఆ సంఘాలు ఆందోళనకు దిగాయి. డీన్ఏ పరిశోధన నివేదికలో ఆ బాలిక మీద లైంగిక దాడికి ఇద్దరు పాల్పడినట్టు పేర్కొన బడి ఉందని, అయితే, ఒకర్ని మాత్రే అరెస్టు చేసి , కేసును ముగించి ఉన్నట్టు ఆరోపించారు. అదే సమయంలో కేసును పునర్విచారణకు ఆదేశించాలని, మరో నిందితుడు సైతం శిక్షించబడాలని కోరుతూ, బాధిత కుటుంబం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను పరిగణించిన న్యాయమూర్తి ఆ పరిశోధన నివేదిక ఆధారంగా పున్వరిచారణకు ఆదేవించారు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు, కుటుంబీకులతోపాటు మహిళాసంఘాలు హర్షం వ్యక్తం చేశారు. -
ఏం పాపం చేశానని..
మాచవరం: ఆ కన్నతల్లికి ఏం కష్టం వచ్చిందో...ఒక్క రోజు పసికందును నిర్దాక్షిణ్యంగా వదిలివెళ్లింది. భూమ్మీదకు వచ్చి 24 గంటలు కూడా గడవకుండానే ఓ ఆడ బిడ్డకు నూరేళ్లు నిండాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఒక రోజు పసికందును ఖాళీ స్థలంలో వదిలివెళ్లగా, ఆ పసికందు ఏడుపులు విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ బిడ్డను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. వివరాలిలా ఉన్నాయి. ఈ అమానుష ఘటన మాచవరం మండలంలోని చెన్నాయిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...చెన్నాయిపాలెంలో బాణావత్తు దత్తునాయక్ ఇంటికి వెనుక ఖాళీ స్థలంలో బుధవారం రాత్రి పది గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కేవల ఒక్క రోజు వయస్సు ఉన్న ఆడ శిశువును వదిలేసి వెళ్లారు. ఆ పసికందు ఏడుపులు విని దారినపోయే వారు గుర్తించారు. ఆ పసికందు ఎక్కడి నుంచి వచ్చింది. గ్రామంలో ఒక రోజు క్రితం ఎవరు ప్రసవించారు ఆని ఆరా తీయగా సమాచారం లభించలేదు. దీంతో ఎక్కడ నుంచో తీసుకుని వచ్చి ఈ ప్రదేశంలో వదిలేసి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. గ్రామస్తులు మాచవరం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించగా, పసికందుకు వైద్యం అందించేందుకు మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆ ఆడపిల్ల గురువారం కన్నుమూసింది. పసికందు దొరికిన సంఘటనా స్థలాన్ని ఎస్ఐ లక్ష్మీనారాయణరెడ్డి పరిశీలించారు. సీడీపీవో శ్రీవల్లి, సెక్టార్ సూపర్వైజర్ రమాదేవి శిశుమరణాలు తమ పరిధిలోకి వస్తాయని, మృతి చెందిన పాపను తమకు అప్పగించాలని వారు కోరారు. మాచవరం ఎస్ఐ లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారిపై లైంగిక దాడికి యత్నం!
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): గొల్లపాలెంగట్టు జోడు బొమ్మల సెంటర్లో ఓ చిన్నారిపై యువకుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సేకరించిన వివరాల ప్రకారం వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం జోడు బొమ్మల సెంటర్లో ఉన్న బంధువుల ఇంటికి వచ్చింది. మూడేళ్ల చిన్నారి తల్లిదండ్రుల వెనుక నడుచుకుంటూ వస్తుండగా, జోడుబొమ్మల ప్రాంతానికి చెందిన ఎం. ఉదయ్కికణ్ ఆ చిన్నారిని ఆడిస్తున్నట్లు నటిస్తూ చీకటి సందులోకి తీసుకెళ్లాడు. తమతో పాటు వస్తున్న చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెనక్కి వెళ్లి చూశారు. అయితే, చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ యువకుడు కనిపించాడు. దీంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని కొత్తపేట సీఐ ఎండీ ఉమర్ తెలిపారు. -
పాప పుట్టిందని కాదంటున్నాడు
సంతబొమ్మాళి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. పెద్దలకు తెలియకుండా కాపురం కూడా పెట్టాడు.. పాపపుట్టిందని ముఖం చాటేశాడొక ఘనుడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మండలంలోని నర్సాపురం పంచాయతీ పరిధి యర్నాగులపేట గ్రామానికి చెందిన యర్నాగుల అరవింద్, విశాఖపట్నానికి చెందిన వానపల్లి శ్రావణికి రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. విశాఖపట్నంలో కాపురం కూడా పెట్టాడు. రెండు వారాల క్రితం వీరికి పాప పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని తన ఇంట్లో అంగీకరించని చెప్పి అరవింద్ భార్య శ్రావణితో గొడవపడి వెళ్లిపోయాడు. ఎప్పటికీ రాకపోవటంతో అరవింద్ ఇంటి వద్దకు చేరుకున్న శ్రావణికి అక్కడ కూడా చుక్కెదురైంది. నీవెవరో తెలిదని, తమకు సంబంధం లేదని అరవింద్ తల్లి తేల్చిచెప్పింది. దీంతో చేసేదిలేక అక్కడే దీక్షకు దిగింది బాధితురాలు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఎస్ఐ కామేశ్వరరావు శ్రావణిని స్టేషన్‌కు పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. గ్రామపెద్దలతో మాట్లాడి సమస్య పరిష్కరించుకుంటామని అరవింద్ కుటుంబ సభ్యుల హామీతో ప్రస్తుతానికి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. -
కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి
ప్రత్తిపాడు రూరల్: ప్రత్తిపాడు మండలం రౌతుపాలెం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి వాహిని ఎముకుల కేన్సర్‌తో బాధపడుతోంది. గ్రామానికి చెందిన తూరపాటి రాజు, దుర్గాదేవి దంపతుల కుమార్తె అయిన వాహినిని కొన్ని నెలలుగా జ్వరం పట్టి పీడిస్తుంటే మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య సేవలు అందించారు. వైద్య పరీక్షలు అనంతరం చిన్నారికి కేన్సర్ ఉండే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కాకినాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బోన్మోరో పరీక్ష చేయిస్తే బోన్ కేన్సర్ ఉన్నట్టు తేలింది. అసలే తమ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో చిన్నారికి ఖరీదైన ఈ వైద్యసేవలు అందించడం ఎలాగో అర్థం కాక తల్లిదండ్రులు అల్లాడిపోయారు. సన్నిహితుల సలహా మేరకు విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తీసువెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. వారానికి ఒక్కరోజు తప్పని సరిగా కిమోథెరపీ చేయించాల్సివస్తోంది. ఈ వైద్యానికి రూ.12 లక్షలు వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. అయితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించడం కొంత మేరకు ఊరటనిచ్చినా అంతకు మించి అవుతున్న ఖర్చులను తట్టుకోలేని పరిస్థితి వారిది. ఇప్పటికే శక్తికి మించి రూ.లక్షల్లో ఖర్చు చేశారు. రెక్కాడితేకాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన వారు వైద్య సేవలు అందించడం శక్తికి మించినది కావడంతో ఆపన్నహస్తం కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. సహాయం చేయాల్సిన వారు తూరపాటి దుర్గాదేవి, సామర్లకోట, యూనియన్ బ్యాంకు, అకౌంట్ నెం:606502010010408 సెల్ : 9505762979 -
అమ్మా.. ఎంతపని చేశావ్!
మైలవరం (వైఎస్సార్ కడప): రెండో కాన్పులోనూ ఆడబిడ్డ పుట్టడంతో ఆ తల్లికి అత్తింటి వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో నాలుగు నెలల పసిబిడ్డను కాలువలో పడేసింది. తర్వాత తానూ ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు అడ్డుకోగా.. కడుపు కోతతో ఘొల్లుమంటోంది.. వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం గొల్లపల్లె సమీపంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా సంజామల మండలం పేరుసోమలకు చెందిన సుహాసినికి బనగానపల్లె మండలం పాతపాడుకు చెందిన నాగేంద్రతో ఏడేళ్ల కిందట వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద పాప కీర్తనకు 5 సంవత్సరాలు .. చిన్నపాప జ్యోత్స్నకు 4 నెలలు. పెద్దపాప పుట్టినప్పుడే సుహాసినికి అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. ఆదిలోనే ఆడపిల్ల పుట్టిందంటూ చీదరింపులు ఎదురయ్యాయి. రెండోసారి కూడా ఆడపిల్ల పుడితే సుహాసినిని వదిలించుకోవాలనే నిర్ణయానికి అత్తింటి వారు వచ్చినట్లు తెలిసింది. రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టగా.. అత్తింటి వేధింపులు తాళలేక ఇద్దరు కుమార్తెలతో పుట్టింటికి చేరుకుంది. బిడ్డలలో ఒకరిని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. మంగళవారం సాయంత్రం ఇద్దరు బిడ్డలతో మైలవరం మండలం గొల్లపల్లె చేరుకుంది. సమీపాన ఉన్న రాళ్లవంక వద్దకు వెళ్లి నీటి ప్రవాహంలో చిన్నకుమార్తె జ్యోత్స ్నను పడేసింది. కళ్లముందే కన్న కూతురు ఊపిరాడక ప్రాణాలు కోల్పోవడం చూసి తల్లడిల్లిపోయింది. పెద్దకూతురితో కలసి తానూ అదే కాలువలో దూకబోతుండగా.. పొలాల్లో ఉన్నవారు పరుగున వచ్చి అడ్డగించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం సుహాసిని పోలీసుల అదుపులో ఉంది. -
మానవ మృగం.. ఆరేళ్ల చిన్నారిపై
దేశంలో అత్యాచారాలపై సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో రాష్ట్రంలోనూ అటువంటి దారుణాలు సంభవిస్తున్నాయి. పసిమొగ్గ అనే కనికరం లేకుండా చిదిమేశాడో మృగాడు. ఈదారుణంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బనశంకరి/ హుబ్లీ: అభంశుభం ఎరుగని ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. బెళగావి జిల్లాలోని కాకతి పోలీస్‌స్టేషన్ పరి«ధిలో జరిగింది. అకృత్యంతో ఆగ్రహం చెందిన ప్రజలు కోర్టు వద్ద కామాంధున్ని చితక్కొట్టారు. వివరాలు.. బెళగావి తాలూకా కడోలి గ్రామంలో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను సునీల్ బాలు బాలనాయక్ (26) అనే యువకుడు ఆడిస్తానని తన వెంట తీసుకెళ్లాడు. సమీపంలోని పొలంలో నిర్మానుష్యంగా ఉన్న ఇంట్లోకి తీసుకువెళ్లి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దుండగునిపై అనుమానం వచ్చిన బాలిక తండ్రి ఆ ఇంటికి వెళ్లగా ఘోరం బయటపడింది. పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే గ్రామానికి చేరుకున్న కాకతి పోలీసులు కామాంధుడు సునీల్‌ను అరెస్ట్ చేసి, బాలికను జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాలిక ఆరోగ్యం క్షీణించడంతోచికిత్సనందిస్తున్నారు. నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితునిపై ప్రజల దాడి కాగా, నిందితునిపై గురువారం బెళగావి నగర కోర్టు ఆవరణలో గ్రామప్రజలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. పోలీస్‌స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకొస్తుండగా ప్రజలు ఆగ్రహంతో దాడి చేశారు. పోలీసులు ప్రజలను అదుపు చేయడానికి కొంచెం కష్టపడ్డారు. కొందరిని అదుపులోకి కూడా తీసుకొన్నారు. దీనిపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకో కూడా చేపట్టారు. -
చెత్త డబ్బాలో చిన్నారి
వేలూరు: జోలార్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలోని ఓంశక్తి ఆలయం వద్దనున్న మున్సిపల్ చెత్త బాక్సులో 11 నెలల చిన్నారి ఉండడాన్ని గమనించిన స్థానికులు అవాక్కయ్యారు. చిన్నారి కేకలు విన్న స్థానికులు చెత్త బాక్సులో చూడగా చీమలు కరుస్తున్న స్థితిలో చిన్నారి కనిపించింది. చిన్నారిని తీసుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు జోలార్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చిన్నారి ఆలంగాయం సమీపంలోని పూంగులం గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఆనందన్ ప్రియ దంపతుల కుమార్తె కిర్తిక అని తెలిసింది. ప్రియ రెండు రోజుల క్రితం చిన్నారితో ఇంటి నుంచి మాయమైంది. దీనిపై ప్రియ తండ్రి మురుగన్ ఆలంగాయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ప్రియ, చిన్నారి ఫొటోను పోలీసుల వద్ద ఇచ్చాడు. ఈ ఫొటో ద్వారా చిన్నారి కిర్తికను పోలీసులు గుర్తించారు. ప్రియ చిన్నారిని చెత్త బాక్సులో ఎందుకు వేసి వెళ్లింది అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
రెడ్డి సుహానాను స్విమ్స్‌కు తరలించండి
చిత్తూరు,బి.కొత్తకోట: షుగర్ లెవల్స్‌లో వ్యత్యాసంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిన్నారని రెడ్డి సుహానా (1)ను తక్షణమే తిరుపతి స్విమ్స్‌కు తరలించాలని కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త మంగళవా రం జిల్లావైద్యశాలల సేవల సమన్వయకర్త సరళమ్మను ఆదేశించారు. బి.కొత్తకోట మండలానికి చెందిన బావాజాన్ కుమార్తె రెడ్డి సుహానా ఆరోగ్య పరిస్థితిపై ‘సాక్షి’లో పలు కథనాలు రావడంతో ప్రభుత్వం స్పందించి ఆదుకునే చర్యలు అమలు చేసింది. ఇన్సులిన్ మందులు, ఫ్రిడ్జ్, సీఎం సహాయ నిధి నుంచి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. ఇటీవల రెడ్డి సుహానా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం కావడంతో తల్లిదండ్రులు బెంగళూరులోని ఇందిరాగాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు చిన్నారి తలలో నీరు చేరిందని, దానివల్లే తల పెద్దదైందని గుర్తించి వెల్లడించారు. శస్త్రచికిత్స చేయించాలని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ తక్షణమే చిన్నారి రెడ్డి సుహానాను బెంగళూరు నుంచి తిరుపతి స్విమ్స్ తరలించాలని అధికారులను ఆదేశించారు. స్విమ్స్‌లో శస్త్ర చికిత్స సాధ్యం కాకుంటే హైదరాబాద్‌లో మెరుగైన శస్త్ర చికిత్స చేయించేందుకు నిర్ణయించారు. బి.కొత్తకోటకు వచ్చిన సరళమ్మ స్థానిక ప్రభుత్వ వైద్యుడు అభిషేక్‌ను బెంగళూరు వెళ్లాలని సూచించారు. ఒక ఆరోగ్యమిత్రను వెంట పంపుతానని చెప్పారు. రెడ్డి సుహానాను అంబులెన్స్‌లో ఎలా తీసుకురావాలో, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరించారు. అడ్వాన్స్ లైవ్ సేవ్ అంబులెన్స్‌ను దీనికోసం వినియోగించాలని, అందుకయ్యే ఖర్చును పీహెచ్సీ నిధుల నుంచి చెల్లించాలని కోరారు. బుధవారం ఉదయం 10 గంటలకల్లా రెడ్డి సుహానా స్విమ్స్‌లో ఉండాలని సరళమ్మ చెప్పడంతో తీసుకొచ్చేందుకు డాక్టర్ అభిషేక్ బెంగళూరు వెళ్లారు. -
11 మంది ఆడపిల్లల తర్వాత మగబిడ్డ
జైపూర్: రాజస్తాన్‌లోని చూరు జిల్లాకు చెందిన గుడ్డీ (42) అనే మహిళ పదకొండు మంది అమ్మాయిలకు జన్మనిచ్చిన తర్వాత పన్నెండో కాన్పులో మగ బిడ్డకు జన్మనిచ్చింది. కేవలం ఆడబిడ్డలనే కంటున్నావంటూ తన భర్త కృష్ణ కుమార్, ఇరుగుపొరుగు వారు తనను నిందించేవారని ఆమె చెప్పారు. తన వంశాన్ని కొనసాగించేందుకు మగబిడ్డ కావాలంటూ ఆమె భర్త కోరేవాడని తెలిపింది. మగబిడ్డకు ముందు పుట్టిన అమ్మాయిల్లో ముగ్గురికి పెళ్లిళ్లు అయ్యాయి. అందులో పెద్ద కుమార్తె వయసు 22. వీరిలో ఇద్దరు బిడ్డలు ఇంకా స్కూల్లో చేరాల్సి ఉండగా మిగిలిన వారు స్కూల్లో చదువుతున్నారు. ఇంతమంది బాధ్యతలు ఎలా నెరవేర్చగలవన్న ప్రశ్నకు ఆమె చిరునవ్వును సమాధానంగా ఇచ్చారు. 2017లో కూడా మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ 10 మంది ఆడబిడ్డల తర్వాత మగబిడ్డకు జన్మనిచ్చింది. -
పసికందు బతికి ఉండగానే..
-
హైదరాబాద్‌లో దారుణం..
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. బతికి ఉన్న శిశువును పాతిపెట్టేందుకు దుండగులు యత్నించారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దుండగులను అరెస్ట్ చేశారు. నగరంలోని జేబీఎస్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు దుండగులు అప్పుడే పుట్టిన పసికందును అంతమొందించాలని చూశారు. చిన్నారిని దుండగులు నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లడంతో అనుమానం వచ్చిన ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దుండగులను విచారించారు. తమ మనవరాలు చనిపోవడంతో పూడ్చిపెడుతున్నామని వారు పోలీసులకు తెలిపారు. అయితే వారి మాటలపై నమ్మకం కలగని పోలీసులు శిశువును చూడగా.. చిన్నారి ప్రాణాలతోనే ఉంది. దీంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆడపిల్ల పుట్టడంతోనే వారు ఈ చర్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
నంది వర్ధనం
కాకినాడ: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాలికకు రూ.25 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు చేసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ నెల 2వ తేదీన గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించడానికి కరప వచ్చిన సీఎం జగన్‌కు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పట్టణానికి చెందిన ఎం.నందిని కాలేయవ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతోందని తెలియజేశారు. అప్పట్లో సానుకూలంగా జగన్ స్పందించారు. గత రెండు రోజులుగా నందిని పరిస్థితి విషమించడంతో నగర ఎమ్మెల్యే ద్వారంపూడి సీఎం జగన్మోహన్రెడ్డికి ఫోన్ ద్వారా తండ్రి వెంకటరమణ చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లగా హుటాహుటిన స్పందించి రూ.25 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించేందుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో యశోద ఆసుపత్రి వైద్యులు నందినికి గురువారం శస్త్రచికిత్స చేశారు. నందిని ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే ద్వారంపూడికి, సీఎం జగన్‌కు బాలిక తండ్రి, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
మరోసారి తల్లి అయిన బాలీవుడ్ హీరోయిన్
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సమీరా రెడ్డి ఇంట మరోసారి సందడి నెలకొంది. ఆ కుటుంబంలోకి మరో బుజ్జాయి విచ్చేసింది. అశోక్, జై చిరంజీవి చిత్రాల్లో హీరోయిన్గా నటించిన సమీరా ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘మా లిటిల్ ఏంజెల్ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. మీ ప్రేమకి, ఆశీర్వాదాలకి ధన్యవాదాలు’ అంటూ ... ఆ చిన్నారి చేతిని పట్టుకుని ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వార్డేని వివాహం చేసుకున్న సమీరాకు నాలుగేళ్ల కుమారుడు హన్స్ ఉన్నాడు. మరోవైపు సమీరాకు అభిమానులు, బాలీవుడ్ సెలబ్రెటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా ప్రపంచానికి గుడ్‌బై చెప్పిన సమీరా చివరగా 2013లో కన్నడ చిత్రం ‘వరదనాయక’లో కనిపించారు. కాగా సమీరా రెడ్డి ఫోటో షూట్లతో హల్చల్ చేశారు. మాతృత్వం స్త్రీకి అపురూపమైనదంటూ.. తొమ్మిదో నెలను ఎప్పటికీ గుర్తుంచుకునేలా... దాని కోసమే ఇలా ఫోటోలు దిగానని, ఇదే నిజమైన సమీరా అంటూ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆమె మేకప్ లేకుండా సహజంగా కనిపించారు. -
‘మా ఏంజిల్ ఈరోజే ఈ లోకంలోకి వచ్చింది’
నటి సమీరా రెడ్డి ఈ రోజు ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు సమీరా రెడ్డి. కుమార్తె చేయి పట్టుకుని ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు సమీరా. ‘ఈ రోజు ఉదయం మా లిటిల్ ఏంజెల్ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. మీరు చూపిన ప్రేమకు, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు’ అని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు సమీరాకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆ దేవుడి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి’ అని కామెంట్లు చేశారు. View this post on Instagram Our little angel came this morning 🌸My Baby girl ! Thank you for all the love and blessings ❤️🙏🏻 #blessed A post shared by Sameera Reddy (@reddysameera) on Jul 12, 2019 at 1:00am PDT సమీరా ‘నరసింహుడు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తర్వాత ‘జై చిరంజీవ’, ‘అశోక్’ చిత్రాల్లో నటించారు. 2014లో అక్షయ్ వార్దే అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. 2015లో ఈ దంపతులకు కుమారుడు హాన్స్ జన్మించాడు. -
‘ఉదయం 11.02 గంటలకు ‘ఫొని’ పుట్టింది’
భువనేశ్వర్ : ఉపద్రవం గుప్పిట్లో చిక్కుకుని ప్రజలంతా అల్లాడుతున్న సమయాన.. మరో ప్రాణి క్షేమంగా ఈ భూమ్మీదకు వస్తే గట్టి పిండమే అంటాం. అంతేకాక ఆ చిన్నారికి ఉపద్రవాన్ని ప్రతిబింబించే పేరే పెడతారు. ఇలాంటి సంఘటనే ఒకటి భువనేశ్వర్‌లో చోటు చేసుకంది. ఒకవైపు బంగాళాఖాతం తీర రాష్ట్రాలు ‘ఫొని’ తుపాను సృష్టిస్తోన్న బీభత్సంతో వణికిపోతుంటే.. దానికి ఏమాత్రం జడవకుండా.. క్షేమంగా భూమ్మీదకు వచ్చిన ఓ చిన్నారి పాపకు ‘ఫొని’ అనే పేరు పెట్టారు తల్లిదండ్రులు. వివరాలు.. ఓ 32 ఏళ్ల మహిళ భువనేశ్వర్‌లోని రైల్వే కోచ్ రిపేర్ వర్క్‌షాప్‌లో విధులు నిర్వహిస్తుంది. ప్రస్తుతం నెలలు నిండిన ఆ మహిళ శుక్రవారం ఉదయం రైల్వే ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఓ వైపు ఒడిషా అంతా ఫొని ఎఫెక్ట్‌తో విలవిల్లాడుతూంటే.. ఈ చిట్లి తల్లి మాత్రం వెచ్చగా తల్లి పొత్తిళ్లలో సేదతీరుతుంది. ఇంతటి ఉపద్రవంలో కూడా క్షేమంగా భూమ్మీదకు వచ్చిన చిన్నారికి ఆమె తల్లితండ్రులు ‘ఫొని’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం తల్లిబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ‘ఫొని’ తుపాను ఒడిశాలో బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, గాలుల ధాటికి 6గురు ప్రాణాలు కోల్పోయారు. గంటకు 80-125 కి.మీ. వేగంగా పెనుగాలులు, అతి భారీ వర్షాలతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు రహదారులు ధ్వంసమైపోయాయి. చాలా చోట్ల విద్యుత్ సంభాలు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో ఒడిశాలో హై అలర్ట్ ప్రకటించారు. -
మద్యం మత్తులో పసికందు హత్య
చెన్నై, తిరువొత్తియూరు: మద్యం మత్తులో భార్యతో గొడవపడి నిద్రిస్తున్న మూడు నెలల ఆడ శిశువును హత్య చేసిన తండ్రిని పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. విల్లుపురం జిల్లా మ రక్కానం సమీపం తొట్టికుప్పం గ్రామానికి చెందిన మదివానన్ (30) భవన నిర్మాణ కార్మికుడు. అతను అదే ప్రాంతానికి చెందిన పొన్ని (27)ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రదీప్ రాజ్ (2), మీరా (మూడు నెలలు) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గత మూడు రోజులుగా మదివానన్ మద్యం తాగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం మదివానన్ ఎక్కువగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీనిపై పొన్ని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య గొడవ ఏర్పడింది. దీంతో ఆగ్రహం చెందిన మదివానన్ నిద్రిస్తున్న మూడు నెలల పసిబిడ్డను నేలపైకి విసిరి కొట్టాడు. దీంతో పసికందు తీవ్రంగా గాయపడింది. దిగ్భ్రాంతి చెందిన పొన్ని, బంధువులు చిన్నారిని వెంటనే మరక్కానం ఆస్పత్రికి తీసుకెళ్లగా పసికందు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న మరక్కాణం పోలీసులు కేసు నమోదు చేసి మది వానన్‌ను అరెస్టు చేశారు. -
అయ్యో పాపం.. కుక్కలు, పందులకు బలైన చిన్నారి..!!
విజయనగరం, నెల్లిమర్ల : ఏ తల్లి కన్నబిడ్డో... నడిరోడ్డుపై కుక్కలు, పందులకు ఆహారంగా మారిపోయింది. ఆడపిల్లని భారంగా భావించారో... పరువు పేరుతో నిర్దాక్షిణ్యంగా విసిరేశారో... నెల్లిమర్ల యాతవీధిలో ఓ పసికందు విగతజీవిగా పడి ఉంది. ఓ వైపు దట్టంగా కురుస్తున్న మంచు... మరోవైపు చలిగాలులకు కన్ను కూడా తెరవని ఆ చిన్నారి ఏడుపు సమీప కుటుంబాల చెవిన శుక్రవారం వేకువఝామున పడింది. తలుపుతెరుచుకుని వచ్చి చూస్తే ఆ శిశువును చీల్చేస్తున్న పందులు కనిపించాయి. వెంటనే ఆ పందులను తరిమి చిన్నారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ప్రాణాలు వదిలిన ఆ చిన్నారిని వారే శ్మశానంలో పూడ్చిపెట్టారు. నెల్లిమర్ల పట్టణంలోని శ్రీనివాసా థియేటర్ ఎదురుగా యాతవీధిలో ఖాళీగా నున్న ప్రదేశంలో ఆ పసికందును ఎవరో గుర్తు తెలియని ఇద్దరు మహిళలు విసిరేసినట్టు తాను చూశానని ఓ బాలుడు చెబుతున్నాడు. కనీసం బొడ్డు కూడా కోయకుండా తీవ్రమైన చలిలో పడేశారు. అక్కడే సంచరిస్తున్న పందులు, కుక్కలు చిన్నారిని చీల్చుకు తిన్నాయి. సంఘటన చూసిన స్థానికులు చలించిపోయారు. -
వాట్సాప్‌లో ట్రిపుల్ తలాఖ్
హైదరాబాద్: అదనపు కట్నం కోసం వేధించడమే కాక ఆడపిల్ల పుట్టిందని ఓ మాస్టారు వాట్సాప్ కాల్లో ట్రిపుల్ తలాఖ్ చెప్పిన ఉదంతమిది. కాళ్లవేళ్ల పడి బతిమిలాడినా భర్త వినకపోవడంతో పాఠశాల ముందు బాధితురాలు «ధర్నాకు పూనుకుంది. వివరాలు... హైదరాబాద్ టోలీచౌకీ ఎండీ లైన్స్‌లో నివాసముండే మొహమ్మద్ ముజామిల్ (29), యూసుఫ్‌గూడకు చెందిన సుమయ్యబాను దంపతులు. గతేడాది జనవరి 6న వీరి వివాహం జరిగింది. వివాహ సమయంలో 10 లక్షల కట్నకానుకలు ముట్టజెప్పారు. అదనపు కట్నం కోసం వేధింపులు.. వివాహం జరిగిన నెల తర్వాత సుమయ్యబానును అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. భర్త కూడా తల్లిదండ్రులకు వత్తాసు పలుకుతూ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. గతేడాది ఫిబ్రవరి 20న ముజామిల్ దంపతులకు కుమార్తె జన్మించింది. ఇంటికి వెళితే దాడులు.. సెప్టెంబర్‌లో ఆమె తన పాపతో కలసి టోలిచౌకీలోని అత్తారింటికి వెళ్లింది. అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించడమే కాక ఆడపిల్ల పుట్టిందని సూటిపోటీ మాటలనేవారు. కడుపు నిండా తిననివ్వకుండా ఆమె మీద భౌతికంగా దాడి చేయసాగారు. పాలు అందక పాప ఆరోగ్యం క్షీణించడంతో ఆమె తల్లిదండ్రులు నవంబర్ 11న వచ్చి తల్లిపిల్లను తీసుకెళ్లి ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ట్రిపుల్ తలాఖ్ అంటూ విడాకులు.. భర్త, అత్తామామలు, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మరిది కూడా కట్నంకోసం వేధిస్తుండటంతో నవంబర్ 23న బాధితురాలు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో భర్త, అత్తమామ, మరిదిలపై కేసు నమోదు చేశారు. దీంతో ఆగ్రహించిన ముజామిల్ నవంబర్ 28న ఆమెకు వాట్సాప్ కాల్ చేసి ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. పాపను చూసిన పాపాన పోలేదు: సుమయ్యబాను న్యాయం కావాలంటూ బాధితురాలు సుమయ్యబాను తన భర్త నిర్వహిస్తున్న పాఠశాల వద్ద సోదరుడు ఆదిల్‌ఖాన్‌తో కలసి ధర్నా చేసింది. అత్తింటివారు ఏనాడూ తన పాపను చూసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ట్రిపుల్ తలాఖ్ చెప్పిన తన భర్తలో మార్పు వస్తుందనే ఆశతో రోజూ ఫోన్ చేసి ప్రా«ధేయపడ్డానని చెప్పింది. తన భర్తకు వేరొకరితో ఉన్న అక్రమ సంబంధం గురించి నిలదీసిన నాటి నుంచి వేధింపులు మొదలయ్యాయని ఆమె తెలిపింది. -
మూడవ కాన్పులో కూడా కూతురు పుట్టిందని..
న్యూఢిల్లీ : మూడవ కాన్పులో కూడా కూతురు పుట్టిందన్న కోపంతో పసిబిడ్డను ఊపిరి ఆడకుండా చేసి చంపిందో తల్లి. ఈ సంఘటన పశ్చిమ ఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీకి చెందిన అశార్ఫి మహతో, రీతా దేవి దంపతులకు ఇద్దరు సంతానం. ఇద్దరు కూడా ఆడపిల్లలు కావటంతో మూడో కాన్పులోనైనా మగబిడ్డ కావాలని భర్త మహతో పట్టుబట్టాడని రీతా దేవి ఆరోపించింది. గర్భవతిగా ఉన్న రీతా దేవి ఈ ఆదివారం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మూడోసారి కూడా ఆడబిడ్డ పుట్టిందన్న కోపంతో కొద్దిసేపటి తర్వాత శిశువును ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత పాప కదలటం లేదని డాక్టర్లకు ఫిర్యాదు చేసింది. శిశువును పరీక్షగా చూసిన డాక్టర్లకు ముక్కుపై, పెదాలపై నల్లటి మచ్చలు కనిపించాయి. దీంతో ఇది ఖచ్చితంగా హత్యేనని భావించిన వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు రీతా దేవిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మొదట హత్య చేయలేదని వాదించిన ఆమె కొద్దిసేపటికి నేరాన్ని అంగీకరించింది. మూడవసారి ఆడబిడ్డ పుట్టిందనే కోపంతో చంపేసినట్లు ఒప్పుకుంది. ఈ హత్యకు ఆమె భర్త మహతోకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. అయితే తాను మగబిడ్డ కావాలని భార్యను ఎప్పుడూ అడగలేదని మహతో అనటం గమనార్హం. -
అదృష్టమంటే ఇదే.. పుట్టగానే లైఫ్‌టైం ఆఫర్!
అమెరికాలో అనుకోకుండా రెస్టారెంట్లో పుట్టిన పాప జీవితాంతం సరిపడేలా భారీ ఆఫర్ కొట్టేసింది. ఆమెకు రెస్టారెంట్ యాజమాన్యం ప్రకటించిన ఆఫర్‌పై చిన్నారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేయగా లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. వాషింగ్టన్ : టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోకి చెందిన రాబర్ట్ గ్రిఫిన్, మాగీలు భార్యాభర్తలు. మాగీ 9 నెలల గర్భవతి. ఈ జంట హాస్పిటల్‌కు చెకప్ కోసం వెళ్లాలనుకుంది. హాస్పిటల్‌కు వెళ్తుండగా మార్గం మధ్యలో మ్యాగీకి నొప్పులు మొదలయ్యాయి. రాత్రి 10 గంటల ప్రాంతంలో తలుపులు మూసివేసి లైట్స్ ఆఫ్ చేస్తున్న రెస్టారెంట్ డోర్‌ను మ్యాగీ భర్త కొట్టారు. రెస్టారెంట్‌ను తెరచిన సిబ్బంది విషయాన్ని గుర్తించి.. మ్యాగీని రెస్ట్రూమ్(బాత్రూమ్)లోకి తీసుకెళ్లారు. కొన్ని నిమిషాలు ఎలాగోలా కష్టపడి చిక్ ఫిల్ ఏ రెస్టారెంట్ సిబ్బంది మ్యాగీకి డెలివరీ చేశారు. మ్యాగీ ఓ పండంటిపాప గ్రేస్లైన్ మే వయోలెట్ గ్రిఫిన్‌కు జన్మనిచ్చింది. డబుల్ బొనాంజా! మేనేజర్ ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్చేసి రెండు టవల్స్ తెప్పించి, వాటిని కాస్త వేడి చేయించి మ్యాగీకి అందించారు. పాప చాలా అందంగా, ఆరోగ్యంగా ఉందని ఆనందంలో మునిగితేలుతున్న ఆ జంటకు రెస్టారెంట్ వారి ఆనందాన్ని రెట్టింపు చేసింది. తమ రెస్టారెంట్ ఆహారాన్నే కాదు పిల్లలను డెలివరీ చేస్తుందని చమత్కరించిన మేనేజర్.. చిన్నారి గ్రేస్లైన్కు జీవితాంతం ఉచితంగా ఆమెకు నచ్చిన ఆహారాన్ని అందిస్తామని ప్రకటించారు. దాంతోపాటుగా చిన్నారికి ఉద్యోగం చేసే వయసొచ్చాక తనకు ఇష్టం ఉంటే ఇక్కడే ఉద్యోగం కల్పిస్తామని మేనేజర్ చెప్పగానే.. ఆ పాప వారికి చాలా లక్కీ అని గ్రిఫిన్, మ్యాగీ హర్షం వ్యక్తం చేశారు. -
పసికందు కిడ్నాప్ కేసులో మహిళ అరెస్ట్
-
కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో.. పసికందు అదృశ్యం!
-
ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. పసికందు అదృశ్యం!
హైదరాబాద్ : కోఠి సుల్తాన్ బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ఆరు రోజుల పసికందు అదృశ్యమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన విజయ ప్రసూతి కోసం గతవారం ఆసుపత్రికి వచ్చారు. ఆమె ఓ ఆడశిశువుకు జన్మనిచ్చారు. ఆమె కదల్లేని స్థితిలో ఆస్పత్రిలో ఉండటంతో.. పక్కనే ఉన్న ఓ గుర్తుతెలియని ఓ మహిళ ఈ గమనించి.. శిశువుకు టీకా ఇప్పిస్తానటూ తీసుకెళ్లింది. ఎంతసేపటికీ ఆమె తన బిడ్డను తీసుకురాకపోవడంతో విజయ తల్లిడిల్లిపోయారు. వెంటనే ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది స్థానిక సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా శిశువును అపహరించిన మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. పసికందు అదృశ్యమైన వార్తను కవర్ చేసేందుకు వచ్చిన మీడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మీడియాపై పోలీసులు, సెక్యూరిటీ గార్డులు దాడికి దిగారు. -
అహ్మాదాబాద్‌లో విషాదం
-
ఇంకా ఆడ పిల్లనే!
ఈ సృష్టికి క్షేత్రం స్త్రీ. క్షేత్రమే లేకపోతే సృష్టి పతనం ప్రారంభమవుతుంది. ఇప్పుడు జిల్లాలో అదే జరుగుతోంది. ఆడపిల్ల జన్మిస్తే ఆర్థిక భారమని, ఆమెను కనిపెంచడం కష్టమని, ఎప్పుడైనా ఒకరింటికి వెళ్లాల్సిందే కదా అని.. తదితర కారణాలు చెబుతూ ఆడపిల్లలను కనడం తగ్గిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో పురుషుల కంటే స్త్రీల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. దీనికితోడు పలువురు వైద్యుల సహాయంతో కడుపులోనే ఆడపిల్లను(భ్రూణహత్య) చంపేస్తున్నారు. కర్నూలు (హాస్పిటల్): ఆడపిల్ల.. పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు భారంగా భావించే నేపథ్యంలో ఆ అపోహను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నా ఇంకా మార్పు రావడం లేదు. చదువు, పెళ్లికి ప్రోత్సాహాకాల పేరుతో భరోసానిస్తున్నా తల్లిదండ్రులు.. ‘ఆడ’ పిల్లగానే చూస్తున్నారు. అందమైన లోకంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి 2011 జనాభా లెక్కల ప్రకారం 40,53,463 మంది ఉన్నారు. ఇందులో 20,39,227 మంది పురుషులు, 20,14,236 మంది స్త్రీలు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ప్రతి 1000 మంది స్త్రీలకు 1012 మంది పురుషులు సగటున జిల్లాలో ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి లెక్కలు పంపించారు. 8 ఏళ్ల తర్వాత ఈ లెక్కలు ఇప్పటికి ఇంకా పెరిగి ఉంటాయి. ప్రతి 1000 మంది స్త్రీలకు 1050 మంది పురుషులు ఉండే అవకాశం ఉంది. అధికారిక లెక్కల ప్రకారం లెక్కలు ఇవి. వాస్తవ పరిస్థితి క్షేత్రస్థాయిలో మరింత దారుణంగా ఉంటుంవదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆదోని, కర్నూలు డివిజన్లో పురుషుల కంటే స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కడుపులోనే చిదిమేస్తున్నారు... జిల్లాలో భ్రూణహత్యలకు అదుపులేకుండా పోతోంది. అధికారికంగా జిల్లాలో 200కు పైగా స్కానింగ్ కేంద్రాలు ఉండగా, అనధికారికంగా రెట్టింపు సంఖ్యలో ఉంటాయి. ఇప్పటి వరకు అధికారుల వద్ద స్కానింగ్ కేంద్రాల కోసం 120 దాకా దరఖాస్తులు ఉన్నాయి. కర్నూలు నగరంలోని ఎన్ఆర్ పేట, కొత్తబస్టాండ్ పరిసర ప్రాంతాలు, ఆదోని, కోడుమూరు, నంద్యాలలోని కొన్ని స్కానింగ్ కేంద్రాల్లో యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. సాధారణంగా స్కానింగ్‌కు రూ.600 నుంచి రూ.800 వరకు చార్జ్ చేస్తారు. లింగనిర్ధారణ చేయడానికి మాత్రం డిమాండ్‌ను బట్టి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు తీసుకుంటున్నారు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే నిర్దాక్షిణ్యంగా చంపేయడానికి వెనుకాడటం లేదు. అనాథ ఆశ్రమాల్లో వారే అధికం.. గర్భస్రావానికి వీలుగాకపోతే ప్రసవించాక ఆ శిశువును అనాథలను చేస్తున్నారు. జిల్లాలోని అనాథాశ్రయాల్లో ఉన్న అనాథ పిల్లల్లో 80 శాతం ఆడపిల్లలే ఉండటం గమనార్హం. పుట్టిన వెంటనే ముళ్ల పొదల్లో పాడేసి చేతులు దులుపుకుంటున్నారు. అధికారుల చర్యలు శూన్యం కర్నూలు కొత్తబస్టాండ్‌లోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, కోడుమూరు, ఆదోని, నంద్యాలలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో భ్రూణహత్యలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తూతూ మంత్రంగా అధికారులు దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆయా ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారు. కొన్ని ఆసుపత్రులను సీజ్ చేసినా మరో తలుపును తెరిచి ఆసుపత్రిని నిర్వహిస్తున్నా చర్యలు తీసుకునేందుకు అధికారులు జంకుతున్నారు. సెంట్రల్ కమిటీలు దాడులు చేస్తాయి.. గతంలో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్లపై స్థానిక అధికారులు దాడులు చేస్తున్నా పెద్దగా ఫలితాలు లేవు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ కమిటీల ద్వారా దాడులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశాయి. ఇక జిల్లాపై స్కానింగ్ సెంటర్లపై ఎప్పుడైనా దాడులు జరగవచ్చు. – జేవీవీ ఆర్కే ప్రసాద్, డీఎంఅండ్‌హెచ్‌ఓ కర్నూలు నగరంలోని బుధవారపేట మాతా మారెమ్మ గుడి సమీపంలో ఈనెల 17వ తేదీన ఓ చెత్తకుప్ప వద్ద శిశువు ఆర్తనాదాలు వినిపించడంతో స్థానికులు గుర్తించి అక్కున చేర్చుకున్నారు. అనంతరం మూడవ పట్టణ పోలీసులకు చెప్పడంతో శిశువును చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో చేర్పించారు. నెలలు నిండకముందే ఈ బిడ్డ జన్మించడం, చెత్తకుప్పల పాలు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్కానింగ్‌లో ఒక్కోసారి లింగ నిర్ధారణ స్పష్టంగా కనిపించదు. ఈ కోవలోనే స్కానింగ్‌లో ఆడబిడ్డ అని రిపోర్ట్ రావడంతో అబార్షన్ చేయగా బిడ్డ బయటకు వచ్చాక మగ బిడ్డ అని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమీ లేక అవయవ లోపం ఉన్న శిశువును వదిలించుకునేందుకు ముళ్ల కంపల మధ్య పడేసినట్లు తెలుస్తోంది. -
‘మళ్లీ ఆడపిల్ల’ భయంతో గర్భిణి ఆత్మహత్య
తూప్రాన్: ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్న ఆ తల్లి, మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే భయంతో మనస్తాపంతో బలవర్మణానికి పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం మెదక్ జిల్లా తూప్రాన్ పంచా యతీ పరిధిలోని పాత బాపన్‌పల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నాగార్జునగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన కర్రె శ్రీశైలం యాదవ్, మమత దంపతులకు గతంలో ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. ప్రస్తుతం ఆమె గర్భం దాల్చింది. తిరిగి ఆడపిల్లే జన్మిస్తుందన్న అనుమానంతో మనస్తాపం చెందిన మమత(25)ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. మృతదేహంను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. -
ఆడపిల్ల వద్దంట..!
వారసుడి కోసం ఆ దంపతులు ఆడశిశువును వద్దకున్నారు.. మగ బిడ్డే ముద్దు.. ఆడబిడ్డ వద్దంటూ పేగుబంధాన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు.శిశువును అప్పగించేందుకు శిశుగృహకు చేరుకున్నారు. కానీ ఆ శిశువు పుట్టి మూడు నెలలు మాత్రమే కావడం, ఆరు నెలల పాటు తల్లి పాలనే పట్టించాలని అధికారుల కౌన్సిలింగ్‌తో వెనక్కు తగ్గారు. ఈ ఘటన తిరుమలగిరి మండలంలో మంగళవారం వెలుగుచూసింది. తిరుమలగిరి(నాగార్జునసాగర్) : మండలంలోని నెల్లికల్ గ్రామపంచాయతీ పరిధి జాల్ తండాకు చెందిన జటావత్ అంజి, లక్ష్మి వ్యవసాయంతో పాటు కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి మొదటి కాన్పులో ఆడ శిశువు జన్మించింది. రెండో కాన్పులో కూడా ఆడపిల్లనే పుట్టడంతో తాము ఆ శిశువును సాకలేమంటూ ఈ నెల 9వ తేదీన జిల్లా కేంద్రంలోని శిశుగృహకు తీసుకెళ్లారు. చిన్నారికి 3 నెలలు మాత్రమే ఉన్నాయని, కనీసం ఆరు నెలల వరకైన తల్లి పాలను పట్టించాలని అధికారులు సూచించడంతో నిరాశతో వెనుదిరిగారు. ఉన్నతాధికారుల సూచన మేరకు సీడీపీవో గంధం పద్మావతి మంగళవారం గ్రామానికి చేరుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి ప్రభుత్వ పథకాలపై ఆవగాహన కల్పించారు. ఆడపిల్ల పుట్టిన నాటి నుంచి చదువు, పెండ్లి వరకు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఆడపిల్ల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. అందులో భాగంగానే ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేలకు వేల ఫీజులు చెల్లించకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అన్ని సౌకర్యాలతో ప్రసవాలు చేస్తారన్నారు. దీంతో పాటు కేసీఆర్ కిట్టుతో పాటు ఆడపిల్ల పుడితే రూ. 13వేలు, మగ పిల్లాడు పుడితే రూ. 12వేలు అందిస్తుందని తెలిపారు. గిరిజనులకు ఆడపిల్ల భారం కాకుడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతనంగా గిరిపుత్రిక పేరుతో ప్రతి గిరిజన బాలికకు రూ.లక్ష డిపాజిట్ చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం బాలికల సంక్షేమానికి సుకన్యాయోజన పథకం, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో పేద విద్యార్థులకు చదువులు, సన్నబియ్యంతో పాటు, నాణ్యతతో కూడిన మెనూ అందిస్తుందని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్వైజర్, అంగన్వాడీ సిబ్బంది తదితరులు ఉన్నారు. మారని గిరిజన సంప్రదాయం అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా గిరిజనుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. గిరిజన సంప్రదాయాల ప్రకారం పెళ్లయిన దంపతులు మగబిడ్డకు జన్మనివ్వాల్సిందే నట... ఆ దంపతుల సంతానంలో మగపిల్లాడు పుట్టకుండా, ఆడపిల్లలే పుట్టినట్లయితే ఆ తల్లిని గొడ్రాలిగా భావించి హీనంగా చూడడం, శుభకార్యాలకు దూరంగా ఉంచడంతో పాటు, వారసుడి కోసం అత్తామామలు భర్తకు మరో యువతితో వివాహంం జరిపించటానికి వెనుకాడని పరిస్థితి.. తొమ్మిదినెలలు మోసిన తన బిడ్డను శిశుగృహకు అప్పగించటానికి ఆ తల్లులకు బాధగా ఉన్నా మగబిడ్డ కోసం తప్పడం లేదంటూ వాపోతున్నారు. -
చిన్నారి నరబలి కేసులో షాకింగ్ నిజాలు!
-
చిన్నారి నరబలి కేసులో షాకింగ్ నిజాలు!
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ చిలుకానగర్‌లోని చిన్నారి నరబలి కేసులో ఆశ్చర్యకర నిజాలు వెలుగుచూస్తున్నాయి. భార్య ఆరోగ్యం కోసం రాజశేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ ఆరేళ్ల పాపను నరబలి ఇవ్వడం నగరంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. రెండు వారాల కిందట జరిగిన చిన్నారి నరబలి కేసును పోలీసులు ఛేదించారు. రెండేళ్ల కిందటే నరబలికి బీజం పడింది. రెండేళ్ల కిందట మేడారం జాతరకు రాజశేఖర్, లత దంపతులు వెళ్లగా అక్కడ వారు ఓ కోయదొరను కలిశారు. ఆరోగ్యం బాగుపడాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవాలంటే నరబలి ఇవ్వడమే మార్గమని ఆ కోయదొర, మాంత్రికుడు ఈ దంపతులకు చెప్పాడు. ఇక అప్పటినుంచీ నరబలి గురించి ఎంతో ఆలోచిస్తున్న రాజశేఖర్, శ్రీలతలు బలి ఇచ్చేందుకు పిల్లలు ఎక్కడ దొరుకుతారని తీవ్రంగా యత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గత జనవరి 31న రాజశేఖర్ సోదరుడు గణేశ్ బోయగూడలోని ఓ ఫుట్ పాత్ నుంచి నరబలి కోసం చిన్నారిని ఎత్తుకొచ్చాడు. చార్మినార్‌లోని ఒక బాబా కన్నుసన్నల్లో పూజలు చేయించాడు. నరబలి తర్వాత రక్తం మరకలు ఉన్న దుస్తులను సోదరులు ఇద్దరు బండ్లగూడ మూసి సమీపంలో చెట్ల పొదలో పడేశారు. ప్రతాప సింగారం వద్ద మూసీనదిలో మొండెంను నిందితులు పడేశారు. పాప తలపై చంద్రుని వెలుగు, సూర్య కిరణాలు పడాలని చెప్పడంతో డాబాపై తల పెట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండేళ్ల నుంచి నరబలి ఇవ్వడానికి నిందితులు యత్నిస్తున్నట్లు తెలియడంతో పోలీసులే షాకయ్యారు. సెక్షన్ 124 , 302, 366, 201, 120 B కింద కేస్ నమోదు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. నరబలి జరిగినట్లు గుర్తించాం: మహేష్ భగవత్ నరబలి కేసుపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ పలు విషయాలు వెల్లడించారు. ఇటీవల జరిగిన నరబలి కేసును చేధించాం. చిన్నారి నరబలి కేసులో మొత్తం 122 ఫోన్లు, 54 సెల్ టవర్ ల డేటాను అనలైజ్ చేశాం. మొత్తం 40 మంది సాక్షులను, 45 మంది అనుమానితులను విచారించాం. 100 సీసీ కెమెరాల డేటాను పరిశీలించాం. ప్రధాన నిందితుడు రాజశేఖర్‌తో పాటు భార్య శ్రీలత, ఓ మాంత్రికుడు సహా పాపను తీసుకు వచ్చిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశాం. మొత్తం ఇప్పటి వరకు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశాం. భిన్నకోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత నరబలి జరిగినట్లు గుర్తించాం. క్యాబ్ డ్రైవర్, ఇంటి యజమాని రాజశేఖర్ కోయదొర, మాంత్రికుడి సలహా మేరకు పాపను నరబలి ఇచ్చినట్టు విచారణలో వెల్లడైంది. ఘటనా స్థలంలో లభ్యం అయిన నమూనాలతో ఫొరెన్సిక్ నివేదిక సమర్పిచింది. డీఎన్ఏ రిపోర్ట్ ద్వారా బలిచ్చింది ఆడ శిశువునే అని నిర్ధారణకు వచ్చినట్లు సీపీ మహేష్ భగవత్ వివరించారు. -
గుట్టు విప్పిన డీఎన్ఏ రిపోర్టు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ చిలుకా నగర్‌లోని చిన్నారి నరబలి కేసు విచారణ తుదిదశకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి డీఎన్ఏ నివేదిక పోలీసులకు అందింది. క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఇంటిపై లభించిన తల, అతడి ఇంట్లో లభించిన రక్తపు మరకలు ఆడ శిశువువిగా ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. మూఢ నమ్మకాల నెపంతో చిన్నారిని బలి ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రతాప సింగారం వద్ద మూసీనదిలో మొండెంను పడేసినట్లు దర్యాప్తులో నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. బలి ఇచ్చిన చిన్నారిని బోయగూడలోని ఫుట్‌పాత్ వద్ద నిద్రిస్తున్న వారి దగ్గర నుంచి చిన్నారిని ఎత్తుకొచ్చినట్లు సమాచారం. ఈ కేసులో క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్, అతని భార్య శ్రీలత, బంధువులు లచ్చక్క, బుచ్చమ్మ, నలుగురు మాంత్రికులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా రాజశేఖర్ తన భార్య శ్రీలత ఆరోగ్యం కోసం నరబలి చేసినట్లు పోలీసులు ముందు ఒప్పుకున్న విషయం తెలిసిందే. నిందితులను ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. నరబలి తర్వాత పాప తలపై చంద్రుని వెలుగు, సూర్య కిరణాలు పడాలని చెప్పడంతో డాబాపై తల పెట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నరబలి కేసులో మరొ కొత్త ట్విస్ట్.. నరబలి కేసులో బోయగూడకు చెందిన రాజశేఖర్ సోదరుడు గణేశ్ కీలకంగా వ్యవహారించాడు. గణేశ్ చార్మినార్‌లోని ఒక బాబా కన్నుసన్నల్లో పూజలు చేయించాడు. బోయగూడలోని ఓ ఫుట్ పాత్ నుంచి నరబలి కోసం చిన్నారిని ఎత్తుకొచ్చాడు. నరబలి తర్వాత రక్తం మరకలు ఉన్న దుస్తులను సోదరులు ఇద్దరు బండ్లగూడ మూసి సమీపంలో చెట్ల పొదలో పడేశారు. పోలీసులకు ఎటువంటి ఆధారాలు దొరకకుండా ముందు జాగ్రత్త పడ్డారు. వీరిద్దరికి కన్నతల్లి అన్ని విధాలా సహకరించింది. తనకు ఏమి తెలియనట్లు రాజశేఖర్ తల్లి పోలీసుల దగ్గర నమించే ప్రయత్నం చేసింది. కేసు దర్యాప్తులో మృతి చెందిన చిన్నారిని తల్లి గుర్తించడమే కాకుండా గణేశ్ అపహరించినట్లు పోలీసులకు సమాచారం అందించింది. పోలీసుల దృష్టి మరల్చేందుకు అర్ధరాత్రి సమయంలో గణేశ్ నరహరి ఇంటిలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. -
ఆ తల ఆడ శిశువుదే!
సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్: ఉప్పల్ చిలుకానగర్‌లోని మైసమ్మ దేవాలయం వద్ద నివసించే క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఇంటిపై లభించింది ఆడ శిశువు తలేనని ఫోరెన్సిక్ నిపుణులు నిర్థారించారు. ఈ నెల ఒకటిన లభించిన ఈ తలకు సంబంధించిన మొండెం ఆచూకీ లేకపోవడంతో ఆడా, మగా అన్నది ఇప్పటి వరకు తేలలేదు. తలకు ప్రాథమిక పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించిన ‘గాంధీ’ ఫోరెన్సిక్ వైద్యులు సైతం ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేకపోయారు. దీంతో పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు చెందిన నిపుణుల సహాయం కోరారు. ఈ తలకు సంబంధించిన పుర్రె నిర్మాణం తదితరాలను అధ్యయనం చేసిన నిపుణులు.. ఆడ శిశువు తలగా ప్రాథమికంగా నిర్ధారిస్తూ శుక్రవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న రాజశేఖర్ పోలీసు విచారణలో నోరు విప్పట్లేదు. అదుపులోకి తీసుకుని విచారించిన తొలిరోజు తానే నరబలి ఇచ్చానంటూ చెప్పినా ఆపై మాట మార్చాడు. పోలీసులు పదేపదే ప్రశ్నించినందుకు అలా చెప్పానంటూ చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇతడి నుంచి ఆశించిన సమాచారం రాకపోవడంతో దర్యాప్తు అధికారులు సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సిటీకి చెందిన ప్రత్యేక క్లూస్ టీమ్‌ను చిలుకానగర్‌కు రప్పించారు. ప్రధాన అనుమానితుడు రాజశేఖర్ ఇంటితో పాటు చుట్టుపక్కల మరికొన్ని ఇళ్లల్లోనూ తనిఖీలు చేశారు. రాజశేఖర్ ఇంటికి సంబంధించి అతడు నివసించే డాబాతో పాటు పక్కనే ఓ రేకుల షెడ్డు కూడా ఉంది. దీనిపై అనుమానాస్పద స్థితిలో ఉన్న వెదురు చీపురును అధికారులు గుర్తించారు. దీంతో పాటు లభించిన కొన్ని వస్తువుల్ని అనుమానిత వస్తువుల జాబితాలోకి చేర్చారు. ఇలాంటి వాటిని సాధారణంగా క్షుద్రపూజల కోసం వినియోగిస్తారని అనుమానిస్తున్న అధికారులు.. నిర్థారణ కోసం అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. రాజశేఖర్ ఇంటి బెడ్రూమ్లో కొన్ని అనుమానిత మరకల్నీ ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. ఇవేంటనేవి గుర్తించేందుకు పరీక్షలకు పంపారు. శనివారం ఆ నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఉప్పల్ పోలీసులు ఇప్పటి వరకు దాదాపు 71 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. మరోపక్క శవమైన చిన్నారి ఎవరనేది ఇప్పటికీ స్పష్టత రాలేదు. కరీంనగర్ జిల్లా తండాల నుంచి తీసుకువచ్చిన శిశువుగా వార్తలు రావడంతో ప్రత్యేక పోలీసు బృందాలు ఆ జిల్లాలో ఆరా తీశాయి. తండాల్లో విచారించినప్పటికీ ఎలాంటి సమాచారం రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలపై కూపీ లాగుతున్నారు. గతేడాది çనవంబర్ నెలలో పాతబస్తీలోని ఓ ప్రాంతం నుంచి శిశువు అదృశ్యమైనట్లు ఉప్పల్ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆ శిశువుకు తల్లిదండ్రుల నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు తెలిసింది. ఈ నమానాలకు రాజశేఖర్ ఇంటిపై లభించిన తల నుంచి సేకరించిన నమూనాలతో పోలుస్తూ డీఎన్ఏ పరీక్షలు చేయనున్నారని సమాచారం. మిస్టరీగా మారి, పోలీసులకు సవాల్ విసురుతున్న ఈ కేసుపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.