
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన కొణిదెల దంపతులు తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంతో పాటు ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకున్నారు. జూన్ 20వ తేదీ, మంగళవారం పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆరోజు నుంచి అపోలో ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో ఆమె ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మెగా ప్రిన్సెస్‌తో ఆమె ఈరోజు జూన్ 23న డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: కోలీవుడ్ సూపర్‌స్టార్ ఎవరు?)
ఉపాసనతో పాటు బేబీ కూడా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలపడంతో ఈ రోజు మధ్యాహ్నం డిశ్చార్జ్ కానున్నారు. ఇప్పటికే అందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మెగా అభిమానులతో పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొందరికి ఓ సందేహం ఉంది. ఉపాసనకు నార్మల్ డెలివరీనా..? సిజేరియన్ చేశారా? అని! దీంతో నేడు ఈ దంపతులిద్దరూ సమాధానం చెప్పే అవకాశం ఉంది!
ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లే ముందు రామ్ చరణ్- ఉపాసన దంపతులు అపోలో ఆస్పత్రి వదద మీడియాతో మాట్లాడనున్నారు. మెగా ప్రిన్సెస్ రాకతో శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ థాంక్స్ తెలపనున్నారు. ఇదే సమయంలో బేబీకి చెందిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో రియాక్ట్ అయిన మెగా ఫ్యామిలీ అవన్నీ ఫేక్ అని తెలిపింది. మరీ ఈరోజు బేబీ ఫోటో రివీల్ చేస్తారేమోనని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
(ఇదీ చదవండి: పిల్లలు ఎందుకు కలగలేదో ఓపెన్‌గానే చెప్పేసిన నటి)
Comments
Please login to add a commentAdd a comment