Ram Charan Makes Cameo in New Video as Upasana Is Wheeled in for Delivery - Sakshi
Sakshi News home page

Upasana: 'అత్యంత సంతోషకరమైన క్షణాలివే'..ఉపాసన వీడియో వైరల్!

Published Sun, Jun 25 2023 3:46 PM | Last Updated on Mon, Jun 26 2023 9:07 AM

Ram Charan makes cameo in new video as Upasana is wheeled in for delivery - Sakshi

మెగా కుటుంబం, ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మధుర క్షణాలు ఈ నెల 20న ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లయిన 11 ఏళ్లకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులయ్యారు.  జూన్ 20న మంగళవారం మెగా కోడలు ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఇంట పండగ వాతావరణం నెలకొంది.  ఈ సందర్భం కోసం మెగా ఫ్యామిలీతో ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ప్రత్యేకమైన సందర్భానికి జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్ వేదికైంది.

(ఇది చదవండి: మెగాప్రిన్సెస్‌కు ఘనస్వాగతం, ఫోటో షేర్‌ చేసిన ఉపాసన)

కాగా.. డెలివరీ కోసం ఒకరోజు ముందుగానే మెగా కుటుంబం అపోలో ఆస్పత్రికి చేరుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోనూ ఉపాసన తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఆస్పత్రిలో వీల్‌ చైర్‌పై వెళ్తున్న వీడియోను అభిమానులతో పంచుకుంది. 

'అంతేకాకుండా ఐదు రోజుల క్రితం జరిగిన అత్యంత మధురమైన క్షణమిదే. మీ అందరికీ ప్రేమకు ధన్యవాదాలు.' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. వీడియోతో పాటు మై లిటిల్ ప్రిన్సెస్ రావడానికి ముందు అంటూ కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

(ఇది చదవండి: ఆదిపురుష్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ఎలాంటి కామెంట్‌ చేశాడంటే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement