Apollo Hospitals
-
సమానత్వం,సాధికారతకోసం కలిసి పనిచేద్దాం : అపోలో సునీతా రెడ్డి
అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీతా రెడ్డి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్బంగా అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీతా రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు అందించారు. 1995 బీజింగ్ డిక్లరేషన్ , ప్లాట్‌ఫామ్ ఫర్ యాక్షన్ నుండి ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కులను ముందుకు తీసుకెళ్లడంలో సాధించిన పురోగతిని గుర్తించాలన్నా ఈ సందర్బంగా పేర్కొన్నారు. అయితే, ఎక్కువ మంది బాలికలు పాఠశాలలో చదువుతున్నప్పటికీ మరియు కీలకమైన సేవలను పొందుతున్నప్పటికీ, పురోగతి సమానంగా లేదనీ, గణనీయమైన సవాళ్లు ఇంకా కొనసాగుతు న్నాయని గుర్తు చేశారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలలోని బాలికలకు, కొన్ని సంఘర్షణ ప్రాంతాలకు , వాతావరణ సంక్షోభం,మహమ్మారి ద్వారా ప్రభావితమైన బాలికలకు చేరడం లేదన్నారు.‘మన సమిష్టి బలాన్ని పెంపొందించుకుంటూ, మహిళలు, బాలికలు తమ పూర్తి సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకునేవ్యవస్థాగత అడ్డంకులను తొలగించుకునేందుకు, నిజంగాసమానమైన, సమ్మిళిత వాతావరణాలను సృష్టించడానికి మనం కలిసి పనిచేయాలి. తరువాతి తరానికి సాధికారత కల్పించడం చాలా ముఖ్యం. శాశ్వత మార్పుకు ఉత్ప్రేరకాలు , భవిష్యత్తును నడిపించడానికి రూపొందించడానికి హక్కులు, వనరులు మరియు అవకాశాలతో వారి సన్నద్ధం కావాలి’’ అన్నారామె.మహిళల హక్కులు మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే చొరవలలో వ్యూహాత్మక పెట్టుబడులు ఏ బాలికను వదిలి వెళ్ళకుండా చూసుకోవడంలో సహాయపడతాయి.తమ స్వాభావిక ప్రభావ మూలధనాన్ని ఉపయోగించుకోని, రాబోయే తరాలకు సాధికారత , సమానత్వం యొక్క వారసత్వాన్నిఅందించాలని ఆమె మహిళా నాయకులను కోరారు.. అందరికీ న్యాయమైన సమానమైన ప్రపంచాన్ని నిర్మించేక్రమంలో మహిళలు, బాలికలందరికీ 'హక్కులు, సమానత్వం, సాధికారత'ను స్పష్టమైన వాస్తవికతగా మార్చేలా కలిసి పనిచేద్దామని ఆమె పిలుపునిచ్చారు. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా! -
సమతుల్యత సాధించాలి
‘‘ఏ రంగంలోనైనా నాయకత్వం వహించడానికి దూరదృష్టి, కొత్త ఆవిష్కరణలపై అవిశ్రాంత కృషి అవసరం. సాంకేతికతంగా వస్తున్న మార్పులను అమలు చేయడంలో, టీమ్ వర్క్‌ను బలోపేతం చేయడంలో ముందుండాలి. బలమైన నాయకులుగా ఉండాలంటే పనిలో నైపుణ్యాలతో పాటు వైవిధ్యాన్నీ పెంపొందించాలి. సక్సెస్ ఉద్దేశం ఒక్కరమే ఎదగడం కాదు, అర్థవంతమైన మార్పుతో మనతోపాటు ఉన్నవారితో కలిసి నడవడం.సమతుల్యం చేయడంలోనే సవాళ్లువైద్య రంగంలో మహిళలు అతిపెద్ద కీలక పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ నిత్యం సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. వృత్తిపరంగా ఎదగడంలోనూ, వ్యక్తిగత బాధ్యతలతో బాలెన్స్ చేయడం అనేది అతిపెద్ద అడ్డంకిగా మారింది. కెరీర్– ఇల్లు రెండింటినీ సమర్థంగా నిర్వహించడానికి సమాజం ఇప్పటికీ మహిళలపై చెప్పలేనన్ని అంచనాలను ఉంచుతోంది. రెండుచోట్లా మహిళలు అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వాతావరణం ఉండాలి. అలా లేకపోవడంతో ‘ఆమె సమర్ధత’కు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. మన సమాజంలో మరొక సవాల్ లోతుగా పాతుకుపోయిన లింగ వివక్ష. నాయకత్వ అవకాశాలను పరిమితం చేసేది ఇదే.నాయకత్వం జెండర్‌తో కాదు సామర్థ్యం వల్లే సాధ్యం అని నిరూపించడానికి మహిళ మరింత కష్టపడి పనిచేయాలి. మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి మరింత చురుగ్గా వ్యవహరించాలి. డెసిషన్ మేకర్స్ జాబితాలో ఎక్కువ మంది మహిళలకు స్థానం ఉండేలా చూసుకోవాలి. మిగతావాటికన్నా వైద్యరంగం భిన్నమైనది, లోతైనది కూడా. ఎందుకంటే ఇక్కడప్రాణాలను కాపాడటం, ఆరోగ్య ఫలితాలలో మంచి మార్పులు తీసుకురావడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, సరిహద్దులను దాటి ఆలోచించడం, యథాతథ స్థితి కొనసాగేలా టీమ్స్‌ను ప్రోత్సహించడం... వంటివి వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలో మనల్ని ముందు ఉంచుతుంది.నెట్‌వర్క్‌ను నిర్మించుకోవాలిసాధారణంగా మహిళలు రిస్క్ తీసుకొని, తమ స్థానాన్ని సాధించేందుకు వెనకాడతారు. మీ ముందు చూపును, అంతర్దృష్టిని నమ్మండి. బలమైన మద్దతునిచ్చే నెట్‌వర్క్‌ను నిర్మించుకోండి. విజయం ఎప్పుడూ ఒంటరి ప్రయాణం కాదు. మిమ్మల్ని సవాలు చేసేవారు, మార్గదర్శకులు, సహచరులు, టీమ్స్‌తో ముందుకు కదలాలి. నేర్చుకోవడాన్ని ఎప్పుడూ ఆపవద్దు. సవాళ్లను సోపానక్రమాలుగా స్వీకరించాలి. ప్రతి అడ్డంకిని నూతనంగా ఆవిష్కరించడానికి, అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం అనుకోవాలి. మహిళా వ్యవస్థాపకులు పరిశ్రమలను రూపొందిస్తున్నారు, ఇది మన సమయం అని గుర్తించండి’’ అంటూ మహిళాభ్యున్నతికి మార్గదర్శకం చేస్తున్నారు డాక్టర్ సంగీతారెడ్డి. మార్పులు తప్పనిసరిరోల్ మోడల్స్ మార్గదర్శకత్వంతో పాటు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లాలి. వ్యవస్థాగత అడ్డంకులను పరిష్కరించాలి. పనిప్రదేశంలో సమాన వేతనం, నిష్పాక్షికమైన కెరీర్ పురోగతికి మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా, మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి మారాలి. మహిళలు ఆరోగ్య సంరక్షణలో పాల్గొనేవారు మాత్రమే కాదు, భవిష్యత్తుకు చురుకైన రూపశిల్పులుగా మారాలి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆరోగ్య సంరక్షణలో సరికొత్త మార్పులు
డిజిటల్ ఆవిష్కరణలతో ఆరోగ్య సంరక్షణలో సరికొత్త మార్పులు వచ్చాయని అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బయోఏషియా 2025 సదస్సులో పాల్గొన్న ఆమె 'ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ అండ్ పేషెంట్ అవుట్‌కమ్స్' అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో మాట్లాడారు.ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) ఈ-సంజీవని టెలిమెడిసిన్ వంటి కార్యక్రమాల ప్రభావాన్ని ఎత్తి చూపారు. ఈ కార్యక్రమాలు ఆసుపత్రులు, డిజిటల్ హెల్త్ వేదికలు, ఇంటి ఆధారిత ఆరోగ్య సంరక్షణ మధ్య అంతరాలను పూడ్చాయని, ఎక్కువ మందికి ఆరోగ్య సంరక్షణ అందేలా చేశాయని వివరించారు. కోవిడ్ మహమ్మారి తర్వాత డిజిటల్ స్వీకరణ 300 శాతానికి పైగా పెరిగిందని, ఈ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ మోడల్స్ మరిన్ని రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.టెక్నాలజీ పాత్రవైద్యుల నైపుణ్యాన్ని భర్తీ చేయడం కంటే, సాంకేతిక పరిజ్ఞానం క్లినికల్ ఎక్సలెన్స్ కు తోడ్పడాలని డాక్టర్ సంగీతా రెడ్డి అభిప్రాయపడ్డారు. మెరుగైన రోగ నిర్ధారణ, చికిత్స ప్రణాళిక, రోగి పర్యవేక్షణ కోసం కృత్రిమ మేధ ఆధారిత సాధనాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామని, ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ తో అపోలో హాస్పిటల్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నట్లు వెల్లడించారు.ఎక్కువ మందికి చేరువఆయుష్మాన్ భారత్, మైక్రో ఇన్సూరెన్స్ మోడల్స్, హెల్త్ కేర్ లెండింగ్ వంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను డాక్టర్ సంగీతా రెడ్డి నొక్కి చెప్పారు. ఆర్థిక అడ్డంకులను తగ్గించడానికి, టైర్ -2 నగరాలు, అణగారిన కమ్యూనిటీలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను చేరువ చేసేందుకు ఈ చర్యలు అవసరమని ఉద్ఘాటించారు. అధునాతన చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడం, నివారణ చేయడంలోనే ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తు ఉందని ఆమె స్పష్టం చేశారు. అత్యాధునిక ఆవిష్కరణలను క్లినికల్ నైపుణ్యంతో మిళితం చేయడం ద్వారా ముదిరిపోక ముందే వ్యాధి భారాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. -
సులభతర వీసా విధానం అవసరం
న్యూఢిల్లీ: వైద్య చికిత్సల కోసం భారత్‌కు వచ్చే విదేశీ రోగులకు సులభతర వీసా విధానాన్ని ప్రవేశపెట్టాలని అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ‘హీల్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో కలసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ‘హీల్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వంతో కలసి పనిచేయాలన్నది మా ఆలోచన! ఈ–వీసాలను మరింత పెంచాలి’ అని మీడియాతో చెప్పారు.పొరుగు దేశాలైన థాయిలాండ్, టర్కీ, ఫిలిప్పీన్స్, సింగపూర్ దేశాలు ఎక్కువ మంది రోగులను ఆకర్షిస్తున్నాయని, దేశంలోకి వచ్చిన వెంటనే వీసా జారీ విధానాన్ని అమలు చేస్తున్నట్టు గుర్తు చేశారు. భారత్‌లో అధిక నాణ్యమైన హెల్త్‌కేర్ వసతులు ఉన్నాయంటూ.. ప్రపంచ సగటు ధరల్లో పదో వంతుకే అందిస్తున్నట్టు చెప్పారు. కాబట్టి విదేశీ రోగుల రాకను సులభతరం చేయాలని, మెడికల్ వీసాలను వేగంగా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్య పర్యాటకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎంతో కీలకంగా చూస్తున్నట్టు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి అన్నారు.ఇదీ చదవండి: ‘చిన్న షేర్ల విషయంలో అప్పుడే హెచ్చరించాం’‘వీసా ప్రక్రియలను మెరుగ్గా మార్చాలి. భారత్‌లోకి ప్రవేశ అనుభవం మెరుగ్గా ఉండాలి. మనకు చాలా పట్టణాల్లో అద్భుతమైన విమానాశ్రయ వసతులు ఉన్నాయి’ అని అమె గుర్తు చేశారు. ఐఐటీ, ఇతర సంస్థలతో కలసి ఆవిష్కరణల కోసం అపోలో హాస్పిటల్స్ కృషి చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రూ.3,000 పడకలు పెంచుకోనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. -
మాజీ సీఈసీ నవీన్ చావ్లా ఇకలేరు
న్యూఢిల్లీ: మాజీ ఎన్నికల ప్రధానాధికారి(సీఈసీ) నవీన్ చావ్లా(79) కన్నుమూశారు. అపొలో ఆస్పత్రిలో శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారని మరో మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషి తెలిపారు. పది రోజుల క్రితం కలిసినప్పుడు బ్రెయిన్ సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరనున్నట్లు చెప్పారని గుర్తు చేసుకున్నారు. 1969 బ్యాచ్ ఐఏఎస్ అయిన చావ్లా 2005 నుంచి 2009 వరకు ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు. అనంతరం 2009 ఏప్రిల్ నుంచి 2010 జులై వరకు సీఈసీగా పనిచేశారు. కమిషనర్‌గా ఆయన పక్షపాతంతో వ్యవహరించినట్లు బీజేపీ ఆరోపించింది. 2006లో లోక్‌సభలో అప్పటి ప్రతిపక్ష నేత ఎల్కే అడ్వాణీ 204 మంది ఎంపీల సంతకాలతో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు వినతి పత్రం సమర్పించారు. బీజేపీ ఆరోపణలపై 2009లో అప్పటి సీఈసీ ఎన్ గోపాలస్వామి కమిషనర్ బాధ్యతల నుంచి చావ్లాను తొలగించాలంటూ ప్రభుత్వానికి సిఫారసు కూడా చేశారు. ఈ విషయమై బీజేపీ సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. దేశ 16వ సీఈసీ నవీన్ చావ్లా హయాంలో కీలక ఎన్నికలు సంస్కరణలు అమలయ్యాయి. స్త్రీ, పురుషతోపాటు థర్డ్ జెండర్ వ్యక్తులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ‘ఇతరులు’అనే కేటగిరీని తీసుకురావడం అందులో ఒకటి. సీఈసీతో సమానంగా కమిషనర్లను అభిశంసించాలన్నా పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమయ్యేలా రాజ్యాంగ సవరణ తేవాలని ప్రతిపాదించారు. ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. కాగా, నవీన్ చావ్లా 1992లో మదర్ థెరిసా జీవిత చరిత్రను రాశారు. 1997లో ప్రచురితమైన లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ మదర్ థెరిసా అనే పుస్తకానికి సహ రచయితగా ఉన్నారు. -
'ఇది మాకు దక్కిన గొప్ప ఆశీర్వాదం'.. ఉపాసన ట్వీట్
మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ప్రస్తుతం ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉంది. తాజాగా అయోధ్యలోని రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్లో పంచుకున్నారు. సనాతన ధర్మం గురించి మా తాత చాలా నేర్పించారని ఈ సందర్భంగా ఉపాసన గుర్తు చేసుకున్నారు. ఇక్కడ సేవ చేసే అవకాశం లభించడం మాకు గొప్ప ఆశీర్వాదం లాంటిదని పోస్ట్ చేశారు.ఆయన మాటల స్ఫూర్తితోనే అయోధ్య రామమందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు ఉపాసన తెలిపారు. ఈ సందర్భంగా అయోధ్యలో ఏర్పాటు చేసిన అపోలో అత్యవసర సంరక్షణ కేంద్రాన్ని(అపోలో ఎమర్జన్సీ కేర్ సెంటర్) ప్రారంభించామని వెల్లడించారు. ఇప్పటికే తిరుమల, శ్రీశైలం, కేదార్నాథ్, బద్రీనాథ్‌లో సేవలందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. రామజన్మ భూమిలో సేవ చేయడం అదృష్టమని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఉపాసన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. Thatha taught us that true Sanatan Dharma for us lies in healing with dignity & empathy. Inspired by his words we opened a free Emergency Care Centre at the Ram Mandir in Ayodhya.After successfully serving in Tirumala, Srisailam, Kedarnath, and Badrinath, we are blessed to… pic.twitter.com/YcCVf0ZM61— Upasana Konidela (@upasanakonidela) December 15, 2024 -
ఎల్కే అద్వానీకి అస్వస్థత
-
తెగిన చేతిని అతికించిన వైద్యులు
రోడ్డు ప్రమాదంలో పూర్తిగా తెగిపోయిన చేయి గోల్డెన్ అవర్ దాటిన తర్వాత అపోలో ఆస్పత్రికి రోగి.. 8 గంటల పాటు శ్రమించి అతికించిన వైద్య బృందం సాక్షి, హైదరాబాద్: రోడ్డుప్రమాదంలో పూర్తిగా తెగిపడిపోయిన చేయిని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్తి వైద్యులు విజయవంతంగా అతికించారు. గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన తొలి గంట)సమయం దాటిపోయిన తర్వాత కూడా అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించటం గమనార్హం. మంచిర్యాలకు చెందిన పవన్‌కుమార్ అనే వ్యక్తి అక్టోబర్ 11న బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగి మోచేయి పై భాగంవరకు తెగి పడిపోయింది. తెగిన చేయిని ఓ కవర్లో చుట్టి అతడిని హుటాహుటిన మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడి డాక్టర్లు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి రిఫర్ చేశారు. పవన్‌కుమార్‌ను హైదరాబాద్‌కు తరలించే సమయానికి అప్పటికే గోల్డెన్ అవర్ కూడా దాటిపోయింది. అయినప్పటికీ 8 గంటల పాటు శ్రమించి క్లిష్టమైన మైక్రోవ్యాసు్కలర్ రీప్లాంటేషన్ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి చేయిని తిరిగి అతికించారు. సాధారణంగా వేలు కానీ, చిన్న అవయవం కానీ తెగిపడిపోతే సులువుగానే అతికించవచ్చని, పూర్తి చేయిని అతికించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స వివరాలను బుధవారం మీడియా సమావేశంలో అపోలో ఆస్పత్రి కన్సల్టెంట్ మైక్రో సర్జన్ డాక్టర్ జీఎన్ భండారి వెల్లడించారు. 26 రోజుల్లోనే పవన్ కోలుకున్నాడని తెలిపారు. అతికించిన చేయి వేళ్లు తిరిగి పనిచేసేందుకు ఆరు నెలల సమయం పడుతుందని, ఇందుకోసం మరికొన్ని శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. తెగిన వెంటనే జాగ్రత్త చేయాలి తెగిపోయిన శరీర భాగాలను అతికించే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డాక్టర్ భండారి అన్నారు. తెగిపోయిన శరీర భాగాలను నీటితో కడిగి, పాలిథీన్ కవర్ లేదా అల్యూమినియం కవర్లో ఉంచాలని తెలిపారు. ఆ కవర్‌ను ఐస్ప్యాక్లో పెట్టి తీసుకొస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. అయితే నేరుగా ఐస్‌లో ఉంచితే అవయవం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, అప్పుడు తిరిగి అతికించడం సాధ్యం కాదని వివరించారు. పుట్టుకతో లోపాలు, విరిగిపోయిన చేతులు, పక్షవాతం వంటి వ్యాధుల కారణంగా చేతులు, కాళ్లు పనిచేయకపోతే బ్రెయిన్ డెడ్ అయిన వారి భాగాలను అతికించే అవకాశం ఉందని తెలిపారు. మీడియా సమావేశంలో అపోలో హాస్పిటల్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ బాబు, శస్త్ర చికిత్సలో పాలుపంచుకున్న డాక్టర్ గురుప్రసాద్ (ప్లాస్టిక్ సర్జన్), డాక్టర్ వివేక్ రెడ్డి (ఆర్థోపెడిక్ సర్జన్), డాక్టర్ శరణ్య (అనస్తీషియా) తదితరులు పాల్గొన్నారు. -
రామ్ చరణ్ పెద్ద మనసు.. చిన్నారి ట్రీట్మెంట్ కోసం లక్షల్లో ఖర్చు
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ పెద్ద మనసు చాటుకున్నాడు. మెగాస్టార్‌కు వారసుడిగానే కాకుండా సాయంలోనూ చిరంజీవికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. తన మంచి మనసుతో ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడి ప్రాణదాతగా నిలిచాడు. తమ కూతురు దక్కదని భావించిన ఆ తల్లిదండ్రులకు దేవుడిలా సాయం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.చిరంజీవి పుట్టినరోజు నాడే (ఆగష్టు 22) ఓ ఫోటో జర్నలిస్ట్ కుటుంబంలో చిన్నారి జన్మించింది. అయితే, పుట్టుకతోనే పల్మనరీ హైపర్‌టెన్షన్ (గుండె సంబంధిత) జబ్బుతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. పాప గుండెలో సమస్య ఉందని, బతకడం కష్టమని వైద్యులు చెప్పడంతో చిన్నారిని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. లక్షల్లో ఖర్చయ్యే వైద్యం చేయించే స్థోమత ఆ తండ్రికి లేకపోవడంతో సతమతమవుతున్నారు. తీవ్రమైన ఆవేదనతో దిక్కుతోచనిస్థితిలో ఉన్న వారి విషయం రామ్ చరణ్ దృష్టికి వెళ్లడంతో 53 రోజులపాటు చికిత్సకు సాయమందించారు. ఆపై చిన్నారి చికిత్స కోసం రక్తం, ప్లేట్లెట్లు వంటివి చిరంజీవి బ్లడ్ బ్యాంకు నుంచి సమకూర్చారు. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో చిన్నారి డిశ్చార్జ్ అయ్యింది. తమ కూతురు ఇక దక్కదని ఆందోళన చెందిన ఆ తల్లిందండ్రుల్లో రామ్‌చరణ్ సంతోషం నింపారు. -
అవయవ దానంతో ముగ్గురికి పునర్జన్మ
కాకినాడ క్రైం: ఆ యువకుడి అవయవ దానంతో ముగ్గురికి పునర్జన్మ లభించింది. పశి్చమగోదావరి జిల్లా తోకలపూడి గ్రామానికి చెందిన పోలిశెట్టి రేవంత్ శ్రీ మురహరి (19) స్వగ్రామం నుంచి విశాఖపటా్ననికి పరీక్ష రాసేందుకు ఈ నెల 21వ తేదీన బయలుదేరాడు. మార్గ మధ్యలో ఎర్రవరం హైవేపై రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించగా తగిన వైద్య సేవలు అందించినా తలకు తీవ్ర గాయం కావడంతో ఫలితం లేకపోయింది. బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో వైద్యులు డాక్టర్ ఎంవీ కిరణ్‌కుమార్, డాక్టర్ శివరామగాంధీ కుమారుడి పరిస్థితిని తండ్రి సుబ్రహ్మణ్యంకి వివరించి అవయవ దాన ప్రాధాన్యాన్ని వివరించారు. దీంతో సుబ్మహ్మణ్యం జీవన్‌దాన్ వెబ్సైట్లో తన కుమారుడి అవయవ దానానికి రిజిస్టర్ చేశారు. దీంతో రేవంత్ కిడ్నీని కాకినాడ అపోలో ఆసుపత్రికి, మరో కిడ్నీని విశాఖపట్టణం కేర్ ఆసుపత్రికి, కాలేయాన్ని షీలానగర్ అపోలో ఆసుపత్రికి తరలించి ముగ్గురి ప్రాణాలు కాపాడారు. ఇందుకు కాకినాడ అపోలోలో ఆర్గాన్ హార్వెస్టింగ్ నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ సాయంతో సోమవారం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయవాలను సురక్షితంగా సకాలంలో తరలించారు. -
సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: వరద సహాయక చర్యల నిమిత్తం పలు సంస్థల నుంచి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువలా వస్తున్నా యి. జీఎంఆర్ గ్రూప్ సంస్థల నుంచి రూ.2.5 కోట్లు విరాళంగా ప్రకటించారు. కెమిలాయిడ్స్ కంపెనీ చైర్మన్ రంగరాజు రూ.కోటి విరాళం ఇవ్వగా, శ్రీచైతన్య విద్యాసంస్థలు రూ.కోటి, విర్కో ఫార్మా రూ.కోటి, అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి రూ.కోటి విరాళంగా అందజేసినట్లు శుక్రవారం సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్‌రెడ్డి వరద బాధితులకు తన వంతుగా నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ము ఖ్యమంత్రి ప్రత్యేక అధికారి (ఓఎస్డీ) వేముల శ్రీనివాసులును కలిసి రూ.1.85 లక్షల చెక్కు ను అందజేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వాణిజ్య సంఘాలు, కార్పొరేట్ సంస్థలు తమ వంతు విరాళాలు ఇచ్చి వరద బాధితుల పక్షాన నిలవాలని కోరారు. -
అపోలో కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్..70 మంది విద్యార్ధులకు అస్వస్థత?
చిత్తూరు జిల్లా అపోలో మెడికల్ కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. కలుషిత ఆహారం తిన్న 70 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న యాజమాన్యం అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వా ఆస్పత్రికి తరలించింది. -
అపోలో హాస్పిటల్స్ ప్రెసిడెంట్‌గా మధు శశిధర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో హాస్పిటల్స్ ప్రెసిడెంట్, సీఈవోగా మధు శశిధర్ నియమితులయ్యారు. అపోలో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా 2023 అక్టోబర్‌లో ఆయన చేరారు. యూఎస్‌లోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ సంస్థలో పలు హోదాల్లో పనిచేశారు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ట్రెడిషన్ హాస్పిటల్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తించారు. ఇంటర్నల్ మెడిసిన్, పల్మనరీ, క్రిటికల్ కేర్ మెడిసిన్ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. -
అపోలో హాస్పిటల్స్ లాభం 60 శాతం అప్..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అధిక ఆదాయ ఊతంతో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ (కన్సాలిడేటెడ్) నికర లాభం 60 శాతం పెరిగి రూ. 245 కోట్లకు చేరింది. క్రితం క్యూ3లో సంస్థ లాభం రూ. 153 కోట్లు. ఇక సమీక్షాకాలంలో ఆదాయం రూ. 4,264 కోట్ల నుంచి 14 శాతం పెరిగి రూ. 4,851 కోట్లకు చేరింది. షేరు ఒక్కింటికి రూ. 6 చొప్పున అపోలో హాస్పిటల్స్ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ప్రివెంటివ్ హెల్త్‌కేర్, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ విషయంలో ప్రజలకు సాధికారత కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. డిసెంబర్ 31 నాటికి అపోలో నెట్వర్క్ నిర్వహణలోని పడకల సంఖ్య 7,911కి చేరింది. ఆక్యుపెన్సీ 65 శాతానికి చేరింది. మూడో త్రైమాసికంలో ఫార్మసీకి సంబంధించి అపోలో హెల్త్ నికరంగా 119 కొత్త స్టోర్స్ ప్రారంభించడంతో మొత్తం స్టోర్స్ సంఖ్య 5,790కి చేరింది. గురువారం బీఎస్ఈలో కంపెనీ షేరు సుమారు 3 శాతం పెరిగి రూ. 6,432 వద్ద క్లోజయ్యింది. -
ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌కి ప్రాణాపాయం లేదన్న వైద్యులు
-
యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్‌కు సర్జరీ
Updates.. కేసీఆర్ హెల్త్ బులెటిన్ మాజీ సీఎం కేసీఆర్‌కు ఎడమ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ శస్త్రచికిత్స నిర్వహించిన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్లు, అనస్థీషియాలజిస్టుల బృందం విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ ► యశోద ఆస్పత్రి డాక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స. ► మరికాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్న యశోద ఆస్పత్రి డాక్టర్లు ►యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్‌కు సర్జరీ ►కొద్దిసేపటి క్రితమే కేసీఆర్‌కు ప్రారంభమైన ఆపరేషన్ ►కేసీఆర్‌కు ఎడమ తుంటిలో ఫ్యాక్చర్ ►గత రాత్రి ఇంట్లో జారిపడ్డ కేసీఆర్ ►హుటాహుటిన రాత్రే ఆసుపత్రికి తరలించిన కుటుంబసభ్యులు ► యశోద ఆసుపత్రి నాలుగో ఫ్లోర్‌లోని ఆపరేషన్ థియేటర్‌కు కేసీఆర్‌ను షిఫ్ట్ చేస్తున్న వైద్యులు ► కాసేపట్లో ఎడమ కాలు తుంటికి శస్త్ర చికిత్స అందించనున్న యశోద వైద్యులు ► కాసేపట్లో కేసీఆర్‌కు సర్జరీ ►యశోద ఆసుపత్రి నాలుగో అంతస్తులో ఆపరేషన్ ► మాజీ సీఎం కేసీఆర్ సేవలు భవిష్యత్తులో తెలంగాణకు అవసరం: మురళీధర్ రావు బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ ► ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం ► క్రియాశీలక రాజకీయాల్లోకి కేసీఆర్ ఆరోగ్యంగా వస్తారని ఆశిస్తున్నాం. యశోద ఆసుపత్రిలో హరీశ్ రావు కామెంట్స్ కేసీఆర్ గారికి యశోద ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. హిప్ రీప్లేస్మెంట్ చేయాలని వైద్యులు సూచించారు. ఈరోజు సాయంత్రం సర్జరీ జరుగుతుంది. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండటంతో డాక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేసీఆర్ అభిమానులు ఎవరూ ఆసుపత్రి వద్దకు రావద్దు. సాయంత్రం సర్జరీ జరిగిన తర్వాత డాక్టర్లు హెల్త్ బెలిటెన్ను విడుదల చేస్తారు. కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించిన కేటీఆర్ ►కేటీఆర్‌లో ట్విట్టర్లో..‘బాత్రూంలో పడిపోవడంతో కేసీఆర్ గారికి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపుతున్న వారందరికీ ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేశారు. Sri KCR Garu needs to undergo a Hip Replacement Surgery today after he had a fall in his bathroom Thanks to all those who have been sending messages for his speedy recovery pic.twitter.com/PbLiucRUpi — KTR (@KTRBRS) December 8, 2023 మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ ఆరా.. ►యశోదా ఆసుపత్రి దగ్గర భద్రతను పెంచిన ప్రభుత్వం ►కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందించాలని సూచించిన రేవంత్ ►మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. ఎడమ తుంటి మార్పిడి చేయాలని ప్రకటించిన వైద్యులు కేసీఆర్ కి సిటి స్కాన్ చేసి ఎడమ తుంటి విరిగినట్టు గుర్తించిన వైద్యులు సిటీ స్కాన్లతో సహా, హిప్ ఫ్రాక్చర్ ఉన్నట్టు గుర్తించిన వైద్యులు. ఎడమ హిప్ రీప్లేస్మెంట్ అవసరమని సూచించిన వైద్యులు ఇలాంటి కేసుల్లో కోలుకునేందుకు ఆరు నుంచి ఎనిమది వారాల రెస్ట్ అవసరం ఆర్థోపెడిక్, అనస్థీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్‌తో సహా వైద్య బృందం అతన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సర్జరీ చేయనున్న వైద్యులు ►కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేసీఆర్ గారికి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. Distressed to know that former Telangana CM Shri KCR Garu has suffered an injury. I pray for his speedy recovery and good health. — Narendra Modi (@narendramodi) December 8, 2023 ►మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఈ సందర్బంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆరోగ్యశాఖ కార్యదర్శిని యశోద ఆసుపత్రికి పంపించారు సీఎం రేవంత్. ►తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయనకు చికిత్స కల్పించేందుకు హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ►గజ్వేల్ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో శుక్రవారం తెల్లవారుజాము 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైనట్లు సమాచారం. బాత్రూమ్లో కాలుజారి పడిపోవడంతో ఆయన ఎడమ కాలి తుంటికి గాయాలైనట్లు తెలిసింది. తుంటికి రెండు చోట్ల గాయమైనట్టు వైద్యులు తెలిపారు. దీంతో, తుంటి భాగంగాలో స్టీల్ ప్లేట్ వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ►కాగా, ప్రమాదంలో తుంటి బాల్ డ్యామేజీ అయినట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతో, ఆయనను సోమాజిగూడలోని యశోదకు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈరోజు సాయంత్రం మైనర్ సర్జరీ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక ట్రీట్మెంట్.. మొదటి హాస్పిటల్‌గా గుర్తింపు
అపోలో క్యాన్సర్ సెంటర్ సరికొత్త మైలురాయిని చేరుకుంది.దక్షిణాసియాలో మొట్టమొదటి సైబర్‌నైఫ్(CyberKnife® S7™ FIM) రోబోటిక్ రేడియో సర్జరీ సిస్టమ్‌ను అపోలో క్యాన్సర్ సెంటర్లో ప్రవేశపెట్టారు.సైబర్‌నైఫ్ సిస్టమ్ అనేది క్యాన్సర్, చికిత్స చేయలేని క్యాన్సర్ కణితులకు రేడియేషన్ థెరపీని అందించే నాన్-ఇన్వాసివ్ చికిత్స. ఇది మెదడు, ఊపిరితిత్తులు, వెన్నెముక, ప్రోస్టేట్ ,పొత్తికడుపు క్యాన్సర్లతో సహా శరీరం అంతటా క్యాన్సర్ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయంగా ఈ విధానం అందుబాటులో ఉంది. గతంలో రేడియేషన్‌తో చికిత్స పొందిన రోగులు, మెటాస్టాటిక్ గాయాలు పునరావృత క్యాన్సర్లు ఉన్నవారు కూడా సైబర్‌నైఫ్ చికిత్స తీసుకోవచ్చు. సైబర్‌నైఫ్ సిస్టమ్ అనేది రేడియేషన్ డెలివరీ పరికరాన్ని కలిగి ఉన్న ఏకైక రేడియేషన్ డెలివరీ సిస్టమ్. దీన్ని లీనియర్ యాక్సిలరేటర్ అని పిలుస్తారు, రేడియేషన్ థెరపీలో ఉపయోగించే హై-ఎనర్జీ X-కిరణాలు లేదా ఫోటాన్లను పంపిణీ చేయడానికి నేరుగా రోబోట్‌పై అమర్చబడుతుంది. ఇది వేలాది బీమ్ కోణాల నుంచి మోతాదులను అందించడానికి,శరీరంలో ఎక్కడైనా డెలివరీ ఖచ్చితత్వానికి కొత్త ప్రమాణాన్ని సెట్ చేయడానికి రోబోట్‌ను ఉపయోగిస్తారు. అపోలో క్యాన్సర్ సెంటర్లో గత 15 సంవత్సరాలుగా సైబర్‌నైఫ్ టెక్నాలజీని ఉపయోగించడంలో నైపుణ్యం కలిగిన నిపుణుల బృందం ఉంది. ఇప్పటివరకు, ఇక్కడ మూడు వేల క్యాన్సర్ కేసులను పర్యవేక్షించారు.ఇప్పుడు సైబర్‌నైఫ్ సిస్టమ్‌ను ప్రారంభించి క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన విధానాన్ని విప్లవాత్మకంగా ప్రారంభించి దక్షిణాసియాలో మొదటి సంస్థగా నిలిచింది.సైబర్నైఫ్లో సర్టిఫైడ్ ఫెలోషిప్ శిక్షణా కార్యక్రమాన్ని అందించినందుకు గానూ అపోలో క్యాన్సర్ సెంటర్ దేశంలోనే మొదటి సంస్టగా గుర్తింపు పొందింది. సీనియర్ కన్సల్టెంట్ – రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్ మహదేవ్ పోతరాజు మాట్లాడుతూ..సైబర్‌నైఫ్ చికిత్సలుసాధారణంగా 1-5 సెషన్లలో నిర్వహించబడతాయి. చికిత్స వ్యవధి సాధారణంగా 30-90నిమిషాల వరకు ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో అనస్థీషియా లేదా కోతలు అవసరం లేదు.చాలా మంది రోగులు చికిత్స సమయంలో రోజువారీ కార్యకలాపాలను కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది అని అన్నారు. -
900కుపైగా సినిమాల్లో నటన.. తొలి చిత్రానికే నంది అవార్డు
సాక్షి, హైదరాబాద్: కథానాయకుడిగా, సహాయ నటుడిగా, హాస్యనటుడిగా, కొన్ని చిత్రాల్లో ప్రతినాయకుడిగానూ నటించిన ‘ఆల్ రౌండర్’ చంద్రమోహన్ (82) ఇక లేరు. కొన్నాళ్లుగా ఆయన గుండె, కిడ్నీ సంబంధిత, మధుమేహం వ్యాధులతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికాగా.. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 9.45కు చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. తర్వాత ఆయన భౌతికకాయాన్నిఫిలింనగర్‌లోని స్వగృహానికి తీసుకెళ్లారు. అక్కడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు చంద్రమోహన్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. చంద్రమోహన్‌కు భార్య జలంధర, కుమార్తెలు మధుర మీనాక్షి, మాధవి ఉన్నారు. జలంధర ప్రముఖ రచయిత్రికాగా.. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరపడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అమెరికాలో ఉన్న మధుర మీనాక్షి వచ్చాక సోమవారం మధ్యాహ్నం చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన మేనల్లుడు, ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. ‘రంగుల రాట్నం’తో మొదలై.. ఏపీలోని కృష్ణా జిల్లా పమిడిముక్కలలో మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు 1942 మే 23న జన్మించారు చంద్రమోహన్. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రఖ్యాత దర్శకుడు కె.విశ్వనాథ్ తమకు దగ్గరి బంధువు కావడంతో.. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో చెన్నై వెళ్లారు. బీఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘రంగుల రాట్నం’(1966) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. హీరోగా సుమారు 175కుపైగా సినిమాలు చేశారు. మొత్తంగా తన 55 ఏళ్ల సినీ కెరీర్లో కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటుడిగా ఇలా దాదాపు 900కుపైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. తనదైన నటనతో ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. పలు తమిళ సినిమాల్లోనూ నటించారు. విభిన్న పాత్రలతో.. ఎన్నో అవార్డులతో.. ‘సుఖదుఃఖాలు, కాలం మారింది, ఓ సీత కథ, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి, పదహారేళ్ల వయసు, శంకరా భరణం’ వంటి క్లాసిక్ చిత్రాల్లో మెప్పించారు చంద్రమోహన్. ‘గంగ మంగ’, ‘లక్ష్మణ రేఖ’వంటి చిత్రాల్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు. శ్రీకాంత్ హీరోగా నటించిన ‘కోతలరాయుడు’ (2022) తెలుగులో చంద్రమోహన్ చివరి చిత్రం. తొలిచిత్రం ‘రంగుల రాట్నం’కు నంది అవార్డు అందుకున్నారు. 1987లో ‘చందమామ రావే’ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో ‘అతనొక్కడే’ చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు, సిరిసిరిమువ్వ’ సినిమాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. -
ఆనంద్ మహీంద్రాకే కంటతడి పెట్టిస్తోంది! వీడియో వైరల్
నిత్యజీవితంలో ప్రతి రోజూ మనసును తాకే సంఘనటనలు ఎన్నెన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఇలాంటి సంఘటన దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా'ను సైతం కన్నీళ్లు పెట్టుకునే చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కార్తీక్ సింగ్ అనే ఒక చిన్నారి క్యాన్సర్ చికిత్స కోసం క్రమం తప్పకుండా ఆసుపత్రికి వస్తాడు, వచ్చిన ప్రతిసారి మహీంద్రా థార్ వీడియోలు చూడటం పట్ల, ఆ కారు గురించి మాట్లాడటం పట్ల ఎక్కువ ఆసక్తి కనపరిచేవాడు. అక్కడి వైద్యులతో తానూ పెద్దవాడైన తరువాత మహీంద్రా థార్ కొనుగోలు చేస్తానని చెప్పేవాడు. దీంతో ఆ చిన్నారి కోరికను నెరవేర్చారు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా స్వయంగా తన ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. నిజానికి ఈ వీడియోను అపోలో హాస్పిటల్స్ లక్నో షేర్ చేసింది. హాస్పిటల్ అధికారులు కార్తీక్‌కు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. దీని కోసం లక్నో సమీపంలోని డీలర్‌షిప్‌ను సందర్శించి అక్కడి సిబ్బందికి విషయాన్ని పూర్తిగా వివరించింది. డీలర్షిప్ కూడా వారికి సహాయం సంతోషించారు. కార్తీక్ తరువాత కీమో సెషన్ షెడ్యూల్ సమయానికి అతనిని పికప్ చేయడానికి మహీంద్రా థార్ అతని ఇంటికి వచ్చింది. అప్పటికే కారు క్యాబిన్ బెలూన్లతో నిండిపోయి ఉంది. ఇది చూసి కార్తిక్ ఎంతగానో సంతోషించాడు. నిజంగా హాస్పిటల్ సిబ్బంది తీసుకున్న చొరవ చాలా అభినందనీయం. ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబం.. ఒక షిప్ విలువే వేల కోట్లు! తమ కుమారుడిని సంతోషపెట్టేందుకు ఆసుపత్రి అధికారులు చేసిన ప్రయత్నాలకు తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ 'నాకు మాటలు రావడం లేదు, కళ్ళల్లో కన్నీళ్లు మాత్రమే ఉన్నాయంటూ' వెల్లడించాడు. మమ్మల్ని ఈ మంచి పనిలో భాగస్వామ్యం చేసినందుకు హాస్పిటల్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తూ అభిఞ్ఞాదిస్తున్నారు. I’m speechless. Just tears in my eyes. Thank you @drsangitareddy Thank you Apollo Hospitals for an initiative with such humanity & for making us a part of it. और कार्तिक, मैं आपका सबसे बड़ा Fan हूं ! pic.twitter.com/d0Z1LETB9a — anand mahindra (@anandmahindra) September 23, 2023 -
అపోలో హాస్పిటల్స్ చేతికి ‘కోల్‌కతా’ ఆస్పత్రి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ తూర్పు రాష్ట్రాల్లో మరింతగా కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కోల్‌కతాలో పాక్షికంగా నిర్మించిన ఓ ఆస్పత్రిని కొనుగోలు చేసింది. ఫ్యూచర్ ఆంకాలజీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి తమ అనుబంధ సంస్థ అపోలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ రూ. 102 కోట్లకు ఈ హాస్పిటల్‌ను కొనుగోలు చేసినట్లు సంస్థ వెల్లడించింది. కోల్‌కతా ప్రాంతంలో అపోలో హాస్పిటల్‌కు ఇది రెండో ఆస్పత్రి కాగా, తూర్పు ప్రాంతంలో అయిదోది. దీనితో కోల్‌కతా, భువనేశ్వర్, గువాహటివ్యాప్తంగా 1,800 పైచిలుకు పడకలతో అతిపెద్ద హెల్త్‌కేర్ ప్రొవైడర్‌గా తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగలమని తెలిపింది. తూర్పు రాష్ట్రాల్లో వచ్చే 3 ఏళ్ల వ్యవధిలో పడకల సంఖ్యను మరో 700 మేరకు పెంచుకోనున్నామని, తద్వారా సదరు ప్రాంతంలో మొత్తం పడకల సంఖ్య 2,500కి చేరగలదని వివరించింది. తాజాగా కొనుగోలు చేసిన సోనార్‌పూర్‌లో ఆస్పత్రిని 325 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇందులో తొలి దశ కింద 1.75 లక్షల చ. అ. విస్తీర్ణంలోని 225 పడకలు వచ్చే 12 నెలల్లో అందుబాటులోకి రాగలవని సంస్థ ఎండీ సునీతా రెడ్డి తెలిపారు. అధునాతన సాంకేతికతతో అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్న అపోలో హాస్పిటల్స్‌ను రెండు దశాబ్దాలపైగా కోల్‌కతా, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తున్నారని ఆమె చెప్పారు. -
గైనిక్ సర్జరీల్లోనూ రోబోలు
సాక్షి, హైదరాబాద్: వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రొబోటిక్ సర్జరీలు హైదరాబాద్‌లోనూ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. పేరొందిన దాదాపు ప్రతి ఆసుపత్రీ ఈ శస్త్రచికిత్సా విధానాన్ని ఉపయోగిస్తోంది. చికిత్సా వ్యయం ఎక్కువైనప్పటికీ ఎక్కువ మంది రోగులకు నప్పే అనేక ప్రయోజనాల వల్ల రానురానూ రొబోటిక్ సర్జరీల ఎంపిక కూడా పెరుగుతోంది. విభిన్న రకాల శస్త్రచికిత్సల్లో దోహదపడుతున్న రొబోటిక్ సర్జరీ గైనకాలజీ విభాగంలోనూ ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో గైనకాలజీ శస్త్రచికిత్సల్లో రోబోల వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అపోలో ఆసుపత్రికి చెందిన కన్సెల్టెంట్ అబ్స్ట్రిటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనురాధా పాండా మరిన్ని వివరాలు తెలియజేశారు. అవి ఏమిటంటే... మరింత కచ్చితత్వం... ‘‘గైనకాలజీలో రోబో అసిస్టెడ్ కీహోల్ సర్జరీని కొత్త ఆవిష్కరణగా చెప్పొచ్చు. సాధారణ లేపరోస్కోపిక్ సర్జరీలతో పోలిస్తే రోబో సాయంతో చేసే సర్జరీల్లో త్రీడీ విజన్ (త్రిమితీయ ఆకారం) ఎక్కువ కచ్చితత్వాన్ని అందిస్తుంది. శస్త్ర చికిత్సలకు ఉపయోగించే పరికరాలను 360 డిగ్రీల కోణంలో తిప్పడానికి వీలుండటం వల్ల శరీరంలో సంక్లిష్టమైన ప్రదేశాలను సైతం చేరుకోవచ్చు. ఈ శస్త్రచికిత్సా విధానంలో తక్కువ రక్త నష్టంతోపాటు నొప్పి, ఇన్ఫెక్షన్ ముప్పు కూడా తక్కువగా ఉంటుంది. తద్వారా రోగులు ఆసుపత్రిలో ఉండాల్సిన వ్యవధి కూడా తగ్గుతుంది. ఈ శస్త్రచికిత్సల్లో సర్జన్ ఒక కంప్యూటర్ కన్సోల్ నుంచి పనిచేస్తారు. తన చేతి కదలికలతో రొబోటిక్ చేతులను కదిలిస్తూ ఆపరేషన్ నిర్వహిస్తారు. ‘‘క్లిష్టమైన హిస్టెరెక్టమీ (గర్భాశయం తొలగింపు) ఆపరేషన్లకు రోబో సాయాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యేకించి ఊబకాయంతో ఉన్న రోగి పొత్తికడుపుపై పలు శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. కచ్చితత్వం, తక్కువ నొప్పితోపాటు చిన్న కోతల ద్వారానే శస్త్రచికిత్స చేయడానికి ఈ విధానం వీలు కల్పిస్తుంది’’అని డాక్టర్ అనురాధా పాండా వివరించారు. గైనిక్ రొబోటిక్ సర్జరీలతో ప్రయోజనాలు... మయోమెక్టమీ అనేది గర్భాశయ కండరాల గోడ (ఫైబ్రాయిడ్) నుంచి నిరపాయకరమైన కణుతులను తొలగించడానికి ఉపయోగించే ఒక ప్రక్రియ. రొబోటిక్ సర్జరీ ఫైబ్రాయిడ్ కుట్టు తొలగింపునకు కూడా వీలు కల్పిస్తుంది. ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయం వెలుపల గర్భాశయ లైనింగ్ వంటి కణజాలాలు పెరిగే పరిస్థితి. ఈ కణజాలాలు హార్మోన్లకు ప్రతిస్పందిస్తాయి. పీరియడ్స్ సమయంలో రక్తస్రావం, నొప్పి ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ శస్త్రచికిత్స ఒక సవాలు వంటిది. దీనికోసం పెల్విస్, పెల్విక్ సైడ్ వాల్స్‌లో లోతుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రోబో అసిస్టెడ్ ఎండోమెట్రియోసిస్ శస్త్రచికిత్స ద్వారా మరింత కచ్చితమైన రీతిలో అండాశయ తిత్తిని తొలగించడం సాధ్యపడుతుంది. పేగు, మూత్రాశయం, మూత్ర నాళానికి అతుక్కొని ఉండే డీప్ ఇన్ఫిల్ట్రేటింగ్ ఎండోమెట్రియోసిస్ వ్యాధి చికిత్సలోనూ రొబోటిక్ సర్జరీ తక్కువ సంక్లిష్టతతో కూడుకుంటున్నదని పలు అధ్యయనాలు తెలిపాయి. హిస్టెరెక్టమీ సర్జరీ తర్వాత కొందరిలో తలెత్తే వాల్ట్ ప్రోలాప్స్ అనే పరిస్థితిని సరిదిద్దడంలోనూ రొబోటిక్ సర్జరీ ఉపకరిస్తుంది. ఊబకాయ రోగుల్లో శస్త్రచికిత్సలకు లేపరోస్కోపీతో పోలిస్తే రోబోటిక్ సర్జరీ వారి అనారోగ్యాన్ని, ఆసుపత్రిలో ఉండే వ్యవధిని తగ్గిస్తుంది. లేపరోస్కోపీతో పోల్చినప్పుడు రొబోటిక్ శస్త్రచికిత్స ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. అయితే భవిష్యత్తులో ఈ చికిత్సా విధానం వాడకం మరింత విస్తృతమైతే ఈ సర్జరీల ధరలు తగ్గే అవకాశం ఉంది. -
ఉపాసన తాతగారికి రూ.కోటి చెక్ అందించిన ‘జైలర్’ నిర్మాత
సూపర్ స్టార్ రజనీకాంత్ ఖాతాలో చాలా కాలం తర్వాత ‘జైలర్’తో ఓ హిట్ పడింది. అది ఆషామాషీ హిట్ కాదు.. ఇటీవల కాలంలో తమిళ్లో ఇలాంటి విజయం సాధించిన సినిమానే లేదు. ఆగస్ట్ 10న విడుదలైన ఈ చిత్రం.. నెల రోజులు పూర్తికాకముందే ప్రపంచ వ్యాప్తంగా రూ.700 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టి..సూపర్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించిన చిత్రమిది. వాస్తవానికి ఈ స్థాయి విజయాన్ని ఈ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కూడా ఊహించలేదు. ప్రిరిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువగా వసూళ్లు వచ్చాయట. అందుకే చిత్ర నిర్మాత కళానిధి మారన్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. లాభాల్లోని కొంత భాగాన్ని హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్‌కి పంచేశారు. అంతటితో ఆగకుండా ఖరీదైన కార్లను గిఫ్ట్‌గా అందించారు. జైలర్ విజయంలో కీలక పాత్ర వహించింది ఈ ముగ్గురే కాబట్టి..వారికి లాభాల్లోని కొంత మొత్తం ఇవ్వాల్సిందేనని నిర్మాత ఇలా చేశారట. కేవలం చిత్రబృందానికే కాకుండా లాభాల్లోని కొంత డబ్బును సామాజిక సేవ చేయడానికి ఉపయోగించాలని నిర్మాత కళానిధి మారన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా అపోలో హాస్పిటల్స్‌కు రూ.కోటి చెక్ ఇచ్చారు. సన్ పిక్చర్స్ తరఫున నిర్మాత కళానిధి మారన్ భార్య కావేరి.. మంగళవారం అపోలో హాస్పిటల్స్ చైర్మన్, ఉపాసన కొణిదెల తాతయ్య డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డిని కలిసి కోటి రూపాయల చెక్ అందజేశారు. 100 మంది నిరుపేద పిల్లలకు గుండె శస్త్ర చికిత్సల కోసం ఆ డబ్బును అందించారట. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ సంస్థ ట్విటర్ ద్వారా తెలియజేసింది. సన్ పిక్చర్స్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమాల్లో వచ్చిన లాభాలను ఇలాంటి మంచి పనులకు ఉపయోగించడం గొప్ప విషయమని కామెంట్ చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని హిట్ చిత్రాలను నిర్మించి, లాభాల్లో కొంత మొత్తాన్ని ఇలా సామాజిక సేవకు ఉపయోగించాలని కోరుకుంటున్నారు. On behalf of Sun Pictures, Mrs. Kavery Kalanithi handed over a cheque for Rs.1 Crore to Dr. Prathap Reddy, Chairman, Apollo Hospitals, towards heart surgery for 100 under privileged children. #Jailer #JailerSuccessCelebrations pic.twitter.com/o5mgDe1IWU — Sun Pictures (@sunpictures) September 5, 2023 -
మాజీ సీఎం కుమారస్వామికి అస్వస్థత.. అపోలోకు తరలింపు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. వివరాల ప్రకారం.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కుంటుంబ సభ్యులు వెంటనే ఆయనను బెంగళూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాస్త అసౌకర్యం, నీరసం ఉందని కుమారస్వామి చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. Health bulletin on HD Kumaraswamy | "Currently, he is hemodynamically stable, comfortable and coherent and has been kept under close observation," Apollo Specialty Hospital, Jayanagar pic.twitter.com/qMDI9wlyqz — ANI (@ANI) August 30, 2023 ఇక, చికిత్స అనంతరం అపోలో వైద్యులు మాట్లాడుతూ.. కుమార స్వామి తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కుమారస్వామికి చికిత్స జరుగుతోందని అపోలో హాస్పిటల్ డాక్టర్లు వెల్లడించారు. ఆయనకు అన్ని రకాల టెస్ట్‌లు నిర్వహించినట్లు తెలిపారు. చికిత్స చేస్తున్నామని.. ఆ చికిత్సకు కుమారస్వామి ఆరోగ్యం కూడా బాగానే సహకరిస్తోందని స్పష్టం చేశారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన డాక్టర్లు.. అది ఎప్పుడు అనేది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం పలువురు ప్రముఖులు బెంగళూరులోని అపోలో ఆస్పత్రికి చేరుకుని కుమారస్వామిని పరామర్శించారు. Former Karnataka Chief Minister HD Kumaraswamy admitted to Apollo Hospital in Bengaluru as he suffers a high temperature. A health bulletin released by the hospital says that the former CM is responding to treatment and is on the road to recovery. #HDKumaraswamy #Karnataka… pic.twitter.com/uDdhqa7x0c — NewsFirst Prime (@NewsFirstprime) August 30, 2023 గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపిన ఆయనకు ఒళ్లు నొప్పులతో పాటు జ్వరం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. గత వారం రోజులనుంచి ఆయన పలు మీటింగుల్లో పాల్గొంటున్నారు. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలార్ జిల్లా పర్యటకు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. తీరికలేని పని వల్లనే ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇటీవలే కుమార స్వామికి గుండె సంబంధిత ఆపరేషన్ కూడా జరిగింది. దీంతో కుటుంసభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: అధీర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ రద్దు.. -
వారి కోసం ఉపాసన కీలక నిర్ణయం.. !
ఉపాసన కొణిదెల తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మెగా కోడలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన బిడ్డకు క్లీంకారగా నామకరణం చేశారు. అయితే మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్‌లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపింది. తన బిడ్డ వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నట్లు వెల్లడించింది. (ఇది చదవండి: మొన్న సెలవులు.. ఇప్పుడేమో ఏకంగా జైలర్ స్పెషల్ షోలు..!) అయితే సామాజిక ఉపాసన సేవలోనూ ఎప్పుడు ముందుంటుంది. తన సేవలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటోంది. అలానే ఒంటరి తల్లుల కోసం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. వారి కోసం ప్రత్యేకంగా ప్రతి ఆదివారం ఉచిత ఓపీడీ సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అపోలో చిల్డ్రన్స్ పేరిట జూబ్లీహిల్స్‌లోని ఆస్పత్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియోను కూడా షేర్ చేసింది. దీంతో ఉపాసన చేస్తున్న సేవలను నెటిజన్స్ అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. 'హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అపోలో చిల్డ్రన్స్ ప్రారంభోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా.. ఒంటరి తల్లుల కోసం ప్రత్యేకంగా ప్రతి ఆదివారం ఉచిత ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (OPD) సేవలను పరిచయం చేయడం గర్వకారణం. ప్రతి ఒక్కరూ 040 -23607777 నంబర్‌కు కాల్ చేసి మీ స్లాట్‌ను బుక్ చేసుకోండి. ఈ సేవలు ప్రతి ఆదివారం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు అందుబాటులో ఉంటాయి. సంతాన సాఫల్యతతో ఎదురయ్యే సవాళ్లను, ఒంటరి తల్లులను చూసి నేను తీవ్రంగా చలించిపోయా. ప్రత్యేక శిశువైద్యుల బృందం, అత్యాధునిక సాంకేతికతతో, అపోలో హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం వారి ఆరోగ్య సంరక్షణ ప్రయాణంలో మీ కుటుంబాలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రతి బిడ్డకు సమగ్ర సంరక్షణ అందే విధంగా పెంపొందించే వాతావరణాన్ని సృష్టించడం మా లక్ష్యం.' అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉపాసన నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. (ఇది చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ఈరోజు ఫోకస్ లో అపోలో హాస్పిటల్స్, స్పైస్ జెట్...!
-
తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్‌లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నారి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. గత నెల నామకరణం ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఇక కుమార్తెతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్న ఈమె.. తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలానే ఒంటరి తల్లుల కోసం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ప్రెగ్నెన్సీ జర్నీ 'ప్రతి తల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఓ ఎమోషనల్ జర్నీ. బిడ్డకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆ తల్లిదండ్రులు ఎంతో తల్లడిల్లిపోతారు. అదే బిడ్డ తిరిగి ఆరోగ్యంగా మారితే వాళ్ల సంతోషానికి అవధులుండవు. అలాంటి మధుర క్షణాలు.. పిల్లల పేరెంట్స్ కు అందిస్తున్న డాక్టర్స్ కు నా తరఫున ధన్యవాదాలు. నా ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది నాకు సలహాలు ఇచ్చేవారు' (ఇదీ చదవండి: కీర్తి చెల్లిగా చేస్తే.. ఈమె తల్లి చిరుకు హీరోయిన్గా చేసింది!) నాకు బాధేసింది 'నా వరకు పర్లేదు కానీ కొందరు మహిళలకు ఇలాంటి అండ దొరకదు. అది తెలిసి నేను చాలా బాధపడ్డాను. మరీ ముఖ్యంగా సింగిల్ మదర్స్ కు ఇలాంటి విషయాల్లో సపోర్ట్ ఉండదు. కాబట్టి వీకెండ్స్ లో నా ఆస్పత్రిలో ఒంటరి తల్లులకు ఉచితంగా ఓపీడీ చికిత్స అందించబోతున్నాం. ఇలాంటి ఓ ఎమోషనల్ జర్నీలో నా వంతు సహాయం అందించడానికి రెడీగా ఉన్నాను. ఇది చాలామందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా' అని ఉపాసన చెప్పుకొచ్చింది. క్లీంకార రాకతో రామ్ చరణ్-ఉపాసన దంపతులకు 2012లో పెళ్లయింది. అయితే ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేకపోవడంతో అభిమానుల దగ్గర మిగతా వాళ్ల వరకు చాలా కామెంట్స్ చేశారు. వాటన్నింటికీ ఎండ్ కార్డ్ వేస్తూ గతేడాది డిసెంబరులో ఉపాసన ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించారు. ఈ జూన్ లో పాపకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీతోపాటు ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీలయ్యారు. ప్రస్తుతం అందరూ పాపతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) (ఇదీ చదవండి: వరుస రీమేక్స్‌పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి) -
గద్దర్ మరణం: మహాబోధి విద్యాలయంలో రేపు గద్దర్ అంత్యక్రియలు
Updates.. గద్దర్ మృతి పట్ల ఆయన భార్య విమల బోరున విలపించారు. ► రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమయాత్ర కొనసాగనుంది. మహాబోధి విద్యాలయంలో రేపు గద్దర్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ► అల్వాల్‌లో గద్దర్ స్థాపించిన స్కూల్ గద్దర్ అంత్యక్రియలు. మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించాలని గద్దర్ భార్య విమల సూచించారు. ► గద్దర్ మృతిపట్ల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు దిగ్భాంతి వ్యక్తం చేశారు. కాలికి గజ్జెకట్టి తెలంగాణ ఉద్యమంలో తన ఆట,పాటలతో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించారని కొనియాడారు. తన పాటలతో కోట్లాది మంది హృదయాలను ఉత్తేజపరిచిన గద్దర్ మరణం తెలంగాణకు తీరని లోటన్నారు. ► గద్దర్ మృతి బాధాకరం: ప్రియాంక గాంధీ. గద్దర్ మృతికి ప్రియాంక గాంధీ ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. ఆయన మృతి చాలా బాధాకరం అని ట్వీట్ చేశారు. Saddened to hear about the passing of Shri Gummadi Vittal Rao garu, the iconic poet and relentless activist. His unwavering dedication to social causes and the fight for Telangana's statehood was truly inspiring. Gaddar ji's powerful verses echoed the aspirations of millions,… pic.twitter.com/Zaq7Ev7zv6 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 6, 2023 ►ప్రజా యుద్ధనౌక అందించిన స్ఫూర్తి చరిత్ర మరవదని డైరెక్టర్ ఎన్. శంకర్ అన్నారు. గద్దర్ మృతికి దర్శకుడు ఎన్. శంకర్ సంతాపం తెలిపారు. ‘పల్లె పాట మీద ప్రేమ ప్రేమపెంచుకుని, జనం పాటను గుండెకు హత్తుకుని, పోరుపాటను ఎగిరే ఎర్రజెండా కు అద్దిన, ప్రజల గుండె గొంతుక ప్రజా యుద్ధనౌక అందించిన స్ఫూర్తి చరిత్ర మరవదు.. గద్దరన్న ఏ లోకంలో వున్నా.. అన్న పాట అన్ని కాలాల్లో వినిపిస్తూనే ఉంటుంది.. జోహార్ గద్దరన్న’ అని యన్. శంకర్ చెప్పారు. ► గద్దర్ మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే, కేసీఆర్ సంతాపం తెలిపారు. గద్దర్ మరణం బాధాకరం. ప్రజాయుద్ధనౌకగా ప్రజల హృదయాల్లో గద్దర్ నిలిచారు. తెలంగాణ గొప్ప ప్రజాకవిని కోల్పోయింది. గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. తన జీవితాన్ని గద్దర్ ప్రజలకే అంకితం చేశారు. తన ఆటపాటలతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించారు. ► గద్దర్ పార్ధీవదేహం ఉన్న ఎల్బీ స్టేడియం వద్దకు హరగోపాల్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గద్దర్ జ్ఞాపకాలు మరిచిపోలేం. విప్లవ ఉద్యమానికి గద్దరే స్ఫూర్తి. బలహీనవర్గాల పీడిత ప్రజల కోసం పోరాడిన వ్యక్తి గద్దర్. ► గద్దర్ మృతిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గద్దర్ మరణం చాలా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. గద్దర్ తన గళంతో కోట్లాది మందిని ఉత్తేజపరిచారు. గద్దర్ మరణం తీరని లోటు. గద్దర్ లేని లోటు తీర్చలేనిది, పూడ్చలేనిది. తెలంగాణ ఉద్యమంలో మాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చారు. ప్రజల్లో జానపదం ఉన్నంత కాలం గద్దర్ పేరు నిలిచిపోతుంది. ► అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. మెతుకు సీమ ముద్దు బిడ్డ నేలకొరిగారు. నమ్మిన సిద్దాంతం కోసం నాలుగు దశాబ్దాలు పోరాడారు. మా ఉమ్మడి మెదక్ జిల్లాకు తీరని లోటు. గద్దర్ పాటలు తెలంగాణ ప్రజలను చైతన్యం చేశాయి. ► గద్దర్ మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ► ఎల్బీ స్టేడియానికి గద్దర్ పార్థివదేహం తరలింపు. ప్రజల సందర్శనార్థం గద్దర్ పార్థివదేహన్ని అక్కడికి తరలించారు. గేట్ నెంబర్-6 వద్ద పార్ధివదేహన్ని ఉంచారు. గద్ధర్ పార్థివదేహం వెంట విమలక్క, సీతక్క, రేవంత్ రెడ్డి, వీహెచ్ ఉన్నారు. ► కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. గద్దరన్న మృతి వార్త జీర్ణించుకోలేకపోతున్నాను. ఉద్యమ నాయుకులు ఎక్కడి నుంచి వచ్చినా వారు ఏ పార్టీలో ఉన్నా ఆ భావం ఉంటుంది. ప్రజా సమస్యల పోరాడిన వ్యక్తి ఇలా కన్నుమూయడం చాలా బాధాకరం. గద్దరన్న భార్య కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమెకు ఇప్పుడు మనమందరం బాసటగా ఉండాలి. ► కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సంతాపం తెలిపారు. గద్దర్ మృతి చాలా బాధాకరం. ప్రజా గొంతుక మూగబోయింది. ► గద్దర్ మృతిపై నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. గద్దర్ ఓ విప్లవశక్తి. ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా మన గద్దర్ గుర్తుకు వస్తారు. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ► గద్దర్ మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. వారి గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్న కి లాల్ సలాం. సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసింది. ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చనిది. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు, లక్షలాది ఆయన అభిమానులకు, శ్రేయోభిలాషులకు నా ప్రగాడ సంతాపం. వారి గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్న కి లాల్ సలాం ! 🙏🙏 సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటల తో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర… pic.twitter.com/a7GtDUFYeD — Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2023 ► గద్దర్ మృతిపై గవర్నర్ తమిళిసై సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ కవి, విప్లవ వీరుడు, ఉద్యమకారుడు గద్దర్ @గుమ్మడి విట్టల్ రావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతితో తెలంగాణ రాష్ట్రం తన అద్భుతమైన కవితా శైలితో, నాయకత్వ పటిమతో చెరగని ముద్ర వేసిన ఒక ప్రముఖ కవిని, ఉద్యమకారుడిని కోల్పోయిందని గవర్నర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ సమయంలో, ప్రజాయుద్ధనాయకుడిగా రాజకీయాలలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయం. మృతుల కుటుంబ సభ్యులకు, అనుచరులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ► మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి.హెచ్ విద్యాసాగర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపైన మడమ తిప్పని పోరాటం చేసిన యోధుడు గద్దర్. కోట్లాది మందిని ఆకర్షించిన కంఠం మూగబోవడం మనస్తాపాన్ని కలిగించింది. సిద్ధాంత పరమైన వైరుద్యం ఉన్నప్పటికి ప్రజా సమస్యల కోసం వారు ఎంతో మంది నాయకులను కలవడం జరిగింది. గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ, వారు మనోధైర్యంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ► తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా యుద్ధ నౌకగా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటుచేసుకున్న విప్లవ గాయకుడు గద్దర్ కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. వివిధ అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన గద్దర్.. తెలంగాణ ఉద్యమంలోనూ తన పాటతో, తన మాటతో.. సరికొత్త ఊపును తీసుకొచ్చారు. విశ్వవిద్యాలయాల వేదికగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన పడిన సమయంలో.. ‘పొడుస్తున్న పొద్దమీద నడుస్తున్న కాలమా!’ అన్న గద్దర్ పాట ఓ సంచలనం. తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో చాలా సందర్భాల్లో వేదిక పంచుకునే అవకాశం లభించింది. రాష్ట్ర సాధనకు సంబంధించిన ఎన్నో అంశాలను పరస్పరం పంచుకునే అవకాశం కూడా దొరికింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2012లో నేను చేపట్టిన ‘తెలంగాణ పోరుయాత్ర’ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాల్లో గద్దర్ నాతో కలిసి నడిచారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ► గద్దర్ మృతిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా.. తెలంగాణ ఉద్యమనేత గద్దర్ మరణ వార్త విని చాలా బాధపడ్డాను. తెలంగాణ ప్రజలపై ఆయనకున్న ప్రేమే అణగారిన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసేలా చేసింది. ఆయన వారసత్వం మనందరికీ స్ఫూర్తిదాయకంగా కొనసాగాలి అని కామెంట్స్ చేశారు. Saddened to hear about the demise of Shri Gummadi Vittal Rao, Telangana’s iconic poet, balladeer and fiery activist. His love for the people of Telangana drove him to fight tirelessly for the marginalised. May his legacy continue to inspire us all. pic.twitter.com/IlHcV6pObs — Rahul Gandhi (@RahulGandhi) August 6, 2023 ► అమీర్‌పేట్ ఆసుపత్రి నుంచి అల్వాల్‌లోని భూదేవీనగర్కు గద్దర్ పార్థీవదేహాన్ని తరలిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు, కళాకారులు అపోలో ఆసుపత్రి వద్ద గుమ్మిగూడారు. ► అపోలో ఆసుపత్రికి చేరుకున్న టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న. ► గద్దర్ మృతిపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతాపం తెలిపారు. ఉద్యమ గళం మూగబోయింది. ప్రజా యుద్ధ నౌక కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర కీలకం. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్‌తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. నా పోరాటానికి ఆయనే స్ఫూర్తి. ప్రజా సమస్యలపై గద్దర్ పోరాటం అజరామరం. తనదైన పాటలతో ఎంతో మందిని ఉత్తేజపరిచారు. అనేక పాటలతో ఆనాడు ఉద్యమానికి ఊపు తెచ్చారు. ఆయనకు నివాళులు. ► గద్దర్ మృతి నేపథ్యంలో అపోలో ఆసుపత్రి వద్ద అరుణోదయ ఉద్యమకారణి విమలక్క కంటతడిపెట్టారు. అనంతరం విమలక్క మీడియాతో మాట్లాడుతూ.. కామ్రేడ్ గద్దరన్నకు రెండు రాష్ట్రాల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుండి వినమ్రంగా విప్లవ జోహార్లు. తాను బ్రతికనంత కాలం గద్దరన్న ప్రజల పాటగా నిలబడ్డాడు. గద్దరన్న ఒక లెజెండ్. ప్రజల పాట గద్దరన్న. ప్రజల ఆట, మాట గద్దరన్న. అమరుల కుటుంబాలకు గద్దరన్న అండగా నిలబడ్డారు. గద్దరన్నను ఇలా బెడ్ మీద చూస్తానని అనుకోలేదు. ఆయన కుటుంబాకు ప్రగాఢ సానుభూతి. జోహార్ గద్దరన్న అని అన్నారు. ► గద్దర్ మరణించడానికి గల కారణాలపై వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. గద్దర్ మృతికి గల ప్రధాన కారణాలను వెల్లడించారు. ప్రధానంగా ఊపిరితిత్తులు, మూత్ర సమస్యలతోనే గద్దర్ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. జూలై 20న తీవ్రమైన గుండెజబ్బుతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు.. ఆగస్టు 3వ తేదీన బైపాస్ సర్జరీ చేశారు. అయినప్పటికీ ఆయనకు గతంలో ఉన్న ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో కోలుకోలేక మృతి చెందారని బులెటిన్‌లో వైద్యులు ప్రకటించారు. ► గద్దర్ మృతిపై నటుడు ఆర్. నారాయణ మూర్తి స్పందించారు. ‘ఒక అన్నమయ్య పుట్టారు.. దివంగతులయ్యారు ఒక రామదాసు పుట్టారు.. దివంగతులయ్యారు ఒక పాల్ రబ్సన్ పుట్టారు.. దివంగతులయ్యారు ఒక గద్దర్ పుట్టారు.. డివంగతులయ్యారు ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసింది’ అని అన్నారు. ► గద్దర్ మృతి నేపథ్యంలో విమలక్క, వీహెచ్ అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే, పలువురు రచయితలు, కళాకారులు కూడా అపోలోకు తరలివెళ్లారు. గద్దర్ లేరన్న వార్త తమను షాక్‌కు గురిచేసిందని రచయితలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ► సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం గద్దర్ కన్నుమూశారు. అయితే, గద్దర్ ఇటీవలే అపోలో ఆసుపత్రిలో గుండె చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలోనే గద్దర్ తుదిశ్వాస విడిచారు. ఇక, గద్దర్ మృతిపై పలువరు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
గద్దర్ మృతికి ప్రధాన కారణమిదే!
తెలంగాణ ప్రజల గొంతుక మూగబోయింది. ఇన్ని రోజులు తన పాటలతో ఊర్రూతలూగించిన ప్రజా గాయకుడు గద్దర్ ఇకలేరు. అనారోగ్యం కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆదివారం ఆగస్టు 6న అమీర్‌పేట్‌లోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన అసలు పేరు విఠల్ రావు కాగా.. 1949 జూన్ 5న తూప్రాన్‌లో జన్మించారు. (ఇది చదవండి: ఒక శకం ముగిసింది.. గద్దర్ మరణంపై ఆర్ నారాయణమూర్తి దిగ్భ్రాంతి) అయితే రెండు రోజుల క్రితమే అపోలో ఆసుపత్రిలో గుండె చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో గుండె ఆపరేషన్ సక్సెస్ అయినట్టు కూడా వైద్యులు ప్రకటించారు. కానీ అంతలోనే ఆయన మృతిచెందడం విషాదకరంగా మారింది. ఆయన మరణించడానికి గల కారణాలపై వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. గద్దర్ మృతికి గల ప్రధాన కారణాలను వెల్లడించారు. ప్రధానంగా ఊపిరితిత్తులు, మూత్ర సమస్యలతోనే గద్దర్ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. జూలై 20న తీవ్రమైన గుండెజబ్బుతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు.. ఆగస్టు 3వ తేదీన బైపాస్ సర్జరీ చేశారు. అయినప్పటికీ ఆయనకు గతంలో ఉన్న ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో కోలుకోలేక మృతి చెందారని బులెటిన్‌లో వైద్యులు ప్రకటించారు. (ఇది చదవండి: గద్దర్ మరణం.. కన్నీరు పెట్టిన విమలక్క) -
వస్తానని మాట ఇచ్చావు.. మరి ఇదేంటి గద్దర్ అన్నా!
ప్రజా పాట ఆగిపోయింది.. ప్రజా ‘యుద్ధనౌక’ అలసిపోయింది. ఇక సెలవు అంటూ దిగికేగింది. తెలంగాణ రాష్ట్రం సాధనలో కీలక పాత్ర పోషించిన గద్దర్ ఇక లేరు. ఈరోజు(ఆదివారం) ఆయన తుదిశ్వాస విడిచారు. అపోలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గుండె సంబంధిత అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరిన గద్దర్.. గత నెల 31 తేదీన ప్రజలకు ఒక లేఖ రాశారు. తాను త్వరలోనే తిరిగి ప్రజాక్షేత్రంలోకి వస్తానంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు అదే ప్రజల్ని తీవ్రంగా బాధిస్తోంది. తిరిగి వస్తావని మాట ఇచ్చావు కదా.. గద్దర్ అన్నా.. మరి ఇదేంటి అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇటీవల గద్దర్ రాసిన లేఖ ఇదే.. గుమ్మడి విఠల్ నాపేరు. గద్దర్ నాపాట పేరు. నా బతుకు సుదీర్ఘ పోరాటం. నా వయస్సు 76 సంవత్సరాలు. నా వెన్నుపూసలో ఇరుక్కున్న తూటా వయస్సు 25 సంవత్సరాలు. ఇటీవల నేను పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతుగా "మా భూములు మాకే" నినాదంతో పాదయాత్రలో పాల్గొన్నాను. నా పేరు జనం గుండెల చప్పుడు. నా గుండె చప్పుడు ఆగిపోలేదు. కానీ ఎందుకో గుండెకు గాయం అయ్యింది. ఈ గాయానికి చికిత్సకై అమీర్ పేట/ బేగంపేట లోని శ్యామకరణ్ రోడులో అపోలో స్పెక్ట్రా (Apollo Spectra) హాస్పిటల్ లో ఇటీవల చేరాను. జూలై ఇరువై నుండి నేటి వరకు అన్నిరకాల పరీక్షలు, చికిత్సలు తీసుకుంటూ కుదుట పడుతున్నాను. విషాదం.. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత గుండె చికిత్స నిపుణులు డాక్టర్ దాసరి ప్రసాదరావు, డాక్టర్ డి. శేషగిరిరావు, డాక్టర్ వికాస్, డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఎన్. నర్సప్ప (అనిస్తీషియా), డాక్టర్ ప్రఫుల్ చంద్ర నిరంతర పర్యవేక్షణలో వైద్యం అందుతున్నది. గతంలో నాకు డాక్టర్ జి. సూర్య ప్రకాశ్ గారు, బి. సోమరాజు గారు వైద్యం చేశారు. పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి మీ మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభించి, ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నాను. నా యోగ క్షేమాలు విచారించడానికి అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ అమీర్ పేట్, హైదరాబాద్ కు చెందిన కింది నెంబర్ : 8978480860 (ఫ్రంట్ ఆఫీస్) కు సందేశం పంపవల్సిందిగా విజ్ఞప్తి. ఇట్లు ప్రజా గాయకుడు మీ గద్దర్ 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Folk Singer Gaddar: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యం కారణంగా ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం గద్దర్ తుదిశ్వాస విడిచారు. కాగా, గద్దర్ చనిపోయినట్టు ఆయన కుమారుడు సూర్యం తెలిపారు. అయితే, గద్దర్ రెండు రోజుల క్రితమే అపోలో ఆసుపత్రిలో గుండె చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో గుండె ఆపరేషన్ సక్సెస్ అయినట్టు కూడా వైద్యులు ప్రకటించారు. ఇంతలోనే ఆయన మృతిచెందడం విషాదకరంగా మారింది. ► ఇక, తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. గద్దర్ 1949లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని తుప్రాన్‌లో జన్మించారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు. నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలో విద్యాభ్యాసం చేశారు. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదివారు. గద్దర్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ► 1969 ఉద్యమంలో కూడా గద్దర్ పాల్గొన్నారు. మా భూమి సినిమాలో వెండితెరపై గద్దర్ కనిపించారు. జననాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ కూడా ఒకరు. 1971లో నర్సింగరావు ప్రోత్సాహంతో ఆపర రిక్షా అన్న పాటును గద్దర్ రాశారు. అనేక పాటు స్వరపరిచారు. ► ఉద్యమ సమయంలో వచ్చిన జైబోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దుమీద అనే పాట ఎందరినో ఉత్తేజపరిచింది. తన పాటతో గద్దర్ ఎంతో మందిని ఉత్తేజపరిచారు. ► 1975లో కెనరా బ్యాంకులో గద్దర్ ఉద్యోగం చేశారు. హన్మాజీపేట స్వగ్రామం. 1984లో కెనరా బ్యాంక్‌లో క్లర్క్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం.. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్ పోరాడారు. ► 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ క్రమంలో నకిలీ ఎన్కౌంటర్లను గద్దర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ► ప్రజా సాహిత్య పురస్కారం కూడా గద్దర్ అందుకున్నారు. ఒరేయ్ రిక్షా సినిమాలో నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా అనే పాటకు నంది అవార్డు వచ్చింది. ► గద్దర్ మృతి నేపథ్యంలో విమలక్క, వీహెచ్ అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే, పలువురు రచయితలు, కళాకారులు కూడా అపోలోకు తరలివెళ్లారు. గద్దర్ లేరన్న వార్త తమను షాక్‌కు గురిచేసిందని రచయితలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ► గద్దర్ మృతిపై సీఎల్పి నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ప్రజా గాయకుడు ప్రజా యుద్ధనౌక మూగబోయింది.. అన్నా.. 🫂🙏🏻😭#Gaddar pic.twitter.com/hBVSs6e9D9 — Bhatti Vikramarka Mallu (@BhattiCLP) August 6, 2023 -
ప్రజాగాయకుడు గద్దర్‌కు అస్వస్థత
హైదరాబాద్: ప్రముఖ కవి, ప్రజా గాయకుడు గద్దర్(74) అస్వస్థతకు లోనయ్యారు. చికిత్స కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయన ఏ ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరాన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ప్రజా శాంతి పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించిన ఆయన గత నెలలో కొత్త పార్టీ ప్రకటించారు. గద్దర్ ప్రజా పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి.. ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆ టైంలో తెలిపారాయన. -
ఎంత ఆనందించానో మాటల్లో చెప్పలేను.. వీడియో షేర్ చేసిన ఉపాసన
ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది జూన్‌లో ఉపాసన- రామ్ చరణ్ తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత మెగా ఇంట్లోకి వారసురాలు అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే మెగా వారసురాలి బారసాల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. తన మనవరాలి పేరును మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్-ఉప్సీల బిడ్డకు క్లీంకార అనే పేరును పెట్టినట్లు వెల్లడించారు. (ఇది చదవండి: రామ్ చరణ్- ఉపాసన బిడ్డకు ఆ పేరు.. అసలు కారణం ఇదేనా?) అయితే ఉపాసన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తనకు పుట్టబోయే బిడ్డకోసం ముందుగానే గదిని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. గది వాతావరణం ప్రకృతి ఒడిలో ఉన్న ఫీలింగ్ కలిగేలా గోడలను అందంగా తీర్చిదిద్దారు. దీని కోసం ప్రత్యేక డిజైనర్లు పనిచేశారు. ఆస్పత్రిలో ఉన్నా కూడా ఇంట్లో ఉన్నట్లు ఫీలయ్యేలా ఉపాసన గదిని తీర్చిదిద్దారు. పుట్టిన బేబీ చూడగానే బొమ్మలు, పక్షులు, చెట్లు కనిపించేలా కర్టన్స్ డిజైన్ చేయించారు. ఫారెస్ట్‌ను తలపించేలా డిజైనర్స్ దీనిని తయారు చేశారు. వాటిని తన బిడ్డకు గదిలో కనిపించేలా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: అలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం.. కల్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్) ఉపాసన ట్వీట్లో రాస్తూ..'అమ్రాబాద్ ఫారెస్ట్, వేద వైద్యం ద్వారా ప్రేరణ పొందిన ఈ సుందరమైన ప్రదేశాలలో నేను జన్మనివ్వడం. నా క్లీంకారను పెంచడం ఎంత ఆనందించానో మీకు చెప్పలేను. ధన్యవాదములు పవిత్రా రాజారామ్.' అంటూ పోస్ట్ చేసింది. Can’t tell u how much I enjoyed giving birth & raising my klin Kaara in these lovely spaces inspired by the Amrabad Forest & Vedic healing. Thank you Pavitra Rajaram 🤗 pic.twitter.com/Yaki3DWiNL — Upasana Konidela (@upasanakonidela) July 14, 2023 -
డెలివరీకి ముందు ఉపాసన ఏం చేసిందంటే.. వీడియో వైరల్!
మెగా కుటుంబం, ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మధుర క్షణాలు ఈ నెల 20న ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లయిన 11 ఏళ్లకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులయ్యారు. జూన్ 20న మంగళవారం మెగా కోడలు ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఇంట పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భం కోసం మెగా ఫ్యామిలీతో ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ప్రత్యేకమైన సందర్భానికి జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్ వేదికైంది. (ఇది చదవండి: మెగాప్రిన్సెస్‌కు ఘనస్వాగతం, ఫోటో షేర్ చేసిన ఉపాసన) కాగా.. డెలివరీ కోసం ఒకరోజు ముందుగానే మెగా కుటుంబం అపోలో ఆస్పత్రికి చేరుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోనూ ఉపాసన తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఆస్పత్రిలో వీల్ చైర్‌పై వెళ్తున్న వీడియోను అభిమానులతో పంచుకుంది. 'అంతేకాకుండా ఐదు రోజుల క్రితం జరిగిన అత్యంత మధురమైన క్షణమిదే. మీ అందరికీ ప్రేమకు ధన్యవాదాలు.' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. వీడియోతో పాటు మై లిటిల్ ప్రిన్సెస్ రావడానికి ముందు అంటూ కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: ఆదిపురుష్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ఎలాంటి కామెంట్ చేశాడంటే..) Moments before the #MegaPrincess arrived ❤️ Love this emotion video of #UpasanaKonidela. We spot #RamCharan𓃵 at the end too! 😍🫶🏼pic.twitter.com/1FYOijRvtS — ᴠᴇɴᴋᴀ𝟽ᴋᴜᴍᴀʀᴍsᴅɪᴀɴ (@venkysayzzz) June 25, 2023 -
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. కూతురితో రామ్‌చరణ్, ఉపాసన (ఫొటోలు)
-
Live: రామ్ చరణ్, ఉపాసన ప్రెస్ మీట్
-
Ram Charan-Upasana: అపోలో ఆస్పత్రిలో మెగా ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
-
మెగా వారసురాలు అంటూ.. వీడియోలు షేర్ చేస్తున్న ఫ్యాన్స్
ప్రముఖ నటుడు రామ్‌చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. నేడు (జూన్ 20)న పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చింది. దీంతో ఇరు కుటుంబాల్లో ఆనందం వెల్లువిరిసింది. హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్ అందుకు వేదిక అయింది. ఇప్పటికే అక్కడకు చిరంజీవి చేరుకున్నారు. మరోవైపు మెగా ఫ్యాన్స్ కూడా సంబరాలు మొదలుబెట్టారు. చిరంజీవి మరోసారి తాత అయ్యారు. పెళ్లైన పదకొండు ఏళ్ల తర్వాత రామ్‌చరణ్, ఉపాసన దంపతులు తల్లితండ్రులు అయ్యారు. ఇంకేముంది మెగా వారసురాలు వచ్చేసింది అంటూ.. ట్వీట్స్‌తో తమ ఆనందాన్ని సోషల్‌మీడియా ద్వారా ఫ్యాన్స్ పంచుకుంటున్నారు. కొణిదెల ఇంట మూడో తరం రావడంతో ఆ బిడ్డకు దేవుడి ఆశీర్వాదం ఉండాలని పలు దేవాలయాల్లో వారు పూజలు చేయడం ప్రారంభించారు. పండంటి బిడ్డ పుట్టడంతో రామ్ చరణ్ రెండు నెలలు షూటింగ్‌కు కూడా బ్రేక్ ఇచ్చేశాడు. తన కూతురితో ఆయన ఆనందంగా గడపనున్నారు. (ఇదీ చదవండి: మహేష్ బాబుతో గొడవలు.. థమన్ రియాక్షన్ ఇదే) కంగ్రాట్స్ అన్న వదిన అంటూ చిరంజీవి సినిమాకు సంబంధించిన ఒక వీడియోను అభిమానులు షేర్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా అపోలో ఆస్పత్రి వద్ద హార్ట్ సింబల్లో ఉండే బెలూన్స్ ఎగురవేశారు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: తమన్నా చేసిన పనితో ఆందోళనలో జైలర్ యూనిట్) Biggest Mega Festival of #MegaPrincess Kick starting 🥁🥁#RamCharanUpasanaBabyGirl@AlwaysRamCharan @upasanakonidela ✨️💕 pic.twitter.com/h7ZX5JXPTG — Trends RamCharan™ (@TweetRamCharan) June 20, 2023 మెగా వారసురాలు 👧❤️ Congratulations @AlwaysRamCharan & @upasanakonidela garu ❤️#RamCharanUpasanaBabyGirl pic.twitter.com/SpK2q0LZKJ — RC CELEBRATIONS™ (@RC_celebrations) June 20, 2023 Congratulations @AlwaysRamCharan & @upasanakonidela anna and Vadina ❤️... #MegaPrincess pic.twitter.com/qfKm3l6Ty4 — Thodagottina TELUGODU ⚡ (@jashwanthvamsi) June 20, 2023 -
తల్లిదండ్రులైన రామ్ చరణ్- ఉపాసన దంపతులు
ప్రముఖ నటుడు రామ్‌చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో నేడు వారి ఆనందం రెట్టింపు అయింది. ఈ విషాయాన్ని అధికారికంగా ప్రకటించారు. మంగళవారం (జూన్ 20)న మెగా ఇంట్లోకి స్టార్ బుజ్జాయి అడుగు పెట్టింది. మెగా కుటుంబంలో బుడి బుడి అడుగులకు అపోలో హాస్పిటల్ వేదిక అయింది. ఉపాసన, పుట్టిన పాపాయి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ఇప్పటికే రామ్ చరణ్, సురేఖ హాస్పిటల్‌కు చేరుకున్నారు. డెలీవరీ అయ్యేంత వరకు ఉపాసనతోనే చరణ్ ఉన్నారని తెలుస్తోంది . మొత్తంగా అయితే మెగా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన చరణ్-ఉపాసనలకు వారు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగా ప్రిన్సెస్ పేరిట పూజలు, అర్చనలు చేయాలని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షలు రవణం స్వామినాయుడు ఇప్పటికే పిలుపునిచ్చారు. (చదవండి: మనవరాలి జాతకం అద్భుతం.. చిరంజీవి) -
Video: డెలివరీ డేట్ ఫిక్స్...ఆసుపత్రికి ఉపాసన!
మెగా కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ తొలి బిడ్డను స్వాగతించేందుకు సిద్ధమయ్యారు. మరికొద్ది గంటల్లో చిరంజీవి ఇంట్లోకి కొత్త మెంబర్ అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ఉపాసనకు జూన్ 20న డెలివరీ డేట్ ఇవ్వడంతో.. మంగళవారం పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం. రేపు ఉదయం డెలివరీ నేపథ్యంలో ఇప్పటికే రామ్ చరణ్ దంపతులు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో మెగా ఫ్యామిలీలోకి వారసుడు వస్తాడా? వారసురాలు వస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా చరణ్- ఉపాసనలకు 2012లో వివాహమైన సంగతి తెలిసిందే. వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్టు గతేడాది డిసెంబరు 12న వెల్లడించారు. ఉపాసన ప్రస్తుతం నిండు గర్భిణీ. అయినప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ మెగా ఫ్యాన్స్ కోసం పలు విషయాలను షేర్ చేస్తున్నారు. అయితే దాదాపు పెళ్లైన పది సంవత్సరాలకు ఈ జంట ఓ బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. ఇక ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ‘జూనియర్ చరణ్ కోసం ఎదురుచూస్తున్నాం. ‘అడ్వాన్స్ కంగ్రాట్స్’ అంటూ పలువురు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే బిడ్డ పుట్టబోయే ముందు తన పూర్తి సమయాన్ని ఉపాసనతో గడపాలని, అందుకోసం ఆగస్టు నెల వరకు షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఇక ఈ సినిమా అనంతరం చరణ్.. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో నటించనున్నారు. చదవండి: Janhvi Kapoor: జాన్వీకి కొత్త కష్టాలు.. ఓటీటీల వల్ల! The Mega couple reach the hospital as @upasanakonidela is expected to deliver the first child with @AlwaysRamCharan tomorrow 💕#RamCharan #Upasana #GlobalStarRamCharan #GameChanger pic.twitter.com/WhGrc8qA0u — SivaCherry (@sivacherry9) June 19, 2023 -
ఎంబీబీఎస్ పూర్తి అయ్యి 16 ఏళ్లట. ఇప్పటికీ అదే జీతమట!
కొందరి ఉద్యోగంలో ఉన్నతి ఉండక, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే! అన్నట్లుగా ఉంటుంది. ఏం చేద్దాం అన్న కలిసిరాదు. కనీసం ఏళ్లుగా చేస్తున్నాడు కదా అని యజమాన్యం కూడా జాలి చూపదు. ఆ ఉద్యోగి నా వల్ల కాదని రాజీనామ చేసేంత వరకు పరిస్థితి అంతే అన్నట్లు ఉంటుంది. అచ్చం అలాంటి పరిస్థితిని ఓ డాక్టర్ ఎదర్కొంటున్నాడు. వివరాల్లోకెళ్తే..హైదరాబాద్‌లోని అపోలా హాస్పటల్స్‌లో పనిచేస్తేన్న బిహార్‌కి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ అరకొర జీతాన్ని ఎంత పొదుపుగా వాడాలో నేర్చుకున్నాని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. తాను 2004లో ఎంబీబీఎస్ పూర్తి చేశానని, 16 ఏళ్ల నుంచి ఒకే జీతం అందుకున్నట్లు తెలిపాడు. ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పటి నుంచి అంతే జీతం అని చెబుతున్నాడు. దీంతో తన కుటుంబసభ్యులు ఎవరూ కూడా చూసేందుకు రావడం కూడా మానేసిట్లు తెలిపాడు. అలాగే తన నాన్న పనిచేసే ప్రభుత్వ కార్యాలయం ఫ్యూన్ జీతం, కొడుకు జీతం ఒకటేనని అమ్మ బాధపడుతుంటుందని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. తాను తమిళనాడులోని వెల్లూరులో ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లు వైద్యుడు సుధీర్ తెలిపారు. తాను అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి ఐదేళ్లు ఎంబీబీఎస్ పూర్తి అయ్యే వరకు కూడా తన ఖర్చులన్నీ తానే నిర్వహించుకున్నట్లు తెలిపాడు. ఆర్థిక స్తోమత లేని కారణంగా తన కుటుంబ సభ్యులెవరూ ఆ సమయంలో తనను చూసేందకు కూడా వచ్చేవారు కాదని చెప్పుకొచ్చారు. ఒక జూనియర్ డాక్టర్ తను జీవించడానికే ఇంతలా కష్టపడుతున్నప్పుడూ.. ఎలా సామాజిక సేవ చేయగలను అని పోస్ట్ పెట్డడంతో రిప్లైగా సదరు వైద్యుడు సుధీర్ తన గురించి వివరించాడు. ఈ విషయం నెట్టిట వైరల్ అవ్వడంతో నెటిజన్లు భారతదేశంలో వైద్యులకు తగిన జీతాలు లభించడం లేదని ఒకరు, పేషంట్ల దగ్గర నుంచి భారీగా వసూలు చేసే ఆస్పత్రి యాజమాన్యం వైద్యులకు మాత్రం తగిన జీతాల ఇవ్వదంటూ మండిపడుతూ ట్వీట్ చేశారు. Apollo Hospitals' doctor says his salary was Rs 9,000 10 years after completing MBBS #MedTwitter #equity #investments https://t.co/mI1FmfE6xp — Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) April 6, 2023 (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి) -
మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తిగా ఉన్నా.. ఉపాసన ట్వీట్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఉపాసన తల్లి కాబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించింది మెగా ఫ్యామిలీ. పెళ్లైన పదకొండేళ్ల తర్వాత ఉపాసన తల్లి కాబోతుండటంతో మెగా ఇంట సంతోషం నెలకొంది. ఇటీవలే స్నేహితులు ఆమెకు సీమంతం వేడుక కూడా నిర్వహించారు. ఆ ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియాతో పంచుకున్నారు. అయితే తాజాగా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. తమకు పుట్టబోయే బిడ్డ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది ఉపాసన. తన ప్రసవానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. అయితే ఇటీవల ఉపాసన డెలివరీ ఎక్కడనే విషయంపై నెటిజన్లు కొన్నిరోజులుగా ఉత్సాహం చూపిస్తున్నారు. విదేశాల్లో డెలివరీకి ప్లాన్ చేస్తున్నారంటూ రూమర్స్ సృష్టించారు. తాజాగా ట్వీట్‌తో వాటన్నింటికీ చెక్ పెట్టారు ఉపాసన. ఇండియాలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు తెలిపారు. ఇటీవలే ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్’ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు రామ్‌చరణ్ అమెరికా వెళ్లారు. ప్రముఖ అమెరికన్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’లోనూ ఆయన సందడి చేశారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ వ్యక్తిగత విషయాల గురించి చర్చించారు. ఆ సమయంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘ఉపాసన కొద్ది రోజులపాటు అమెరికాలో ఉంటుంది. అప్పుడు మీరు అందుబాటులో ఉండాలి’ అని అన్నారు. దీనికి ఆస్టన్ స్పందిస్తూ.. మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడమంటే తనకు అదో గౌరవమని.. ఎక్కడ అందుబాటులో ఉండమన్నా సిద్ధం’’ అని తెలిపారు. దాంతో, ఉపాసన డెలివరీ అమెరికాలో జరగుతుందనే ప్రచారం సాగింది. తాజాగా ఉపాసన ట్విటర్లో రాస్తూ..' డాక్టర్ జెన్ ఆస్టన్ మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నా. దయచేసి ఇండియాలోని మా అపోలో ఆస్పత్రుల ఫ్యామిలీలో చేరండి. డాక్టర్ సుమనా మనోహర్, డాక్టర్ రూమా సిన్హాతో కలిసి మా బిడ్డ ప్రసవంలో భాగం కావాలని కోరుకుంటున్నా.' అంటూ ఆ వీడియోను పోస్ట్ చేసింది. ఇది చూసిన రామ్ చరణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్లీజ్ టేక్ కేర్ సిస్టర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తున్నారు. కాగా.. 2012లో ఉపాసన- రామ్ చరణ్ వివాహం జరిగింది. ఉపాసన తాతయ్య, అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి కావడం విశేషం. అందుకే అపోలో ఆస్పత్రిలోనే బిడ్డను ప్రసవించనున్నట్లు ఉపాసన ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Dr Jen Ashton, ur too sweet. Waiting to meet you. Pls join our @HospitalsApollo family in India along with Dr Sumana Manohar & Dr Rooma Sinha to deliver our baby 🤗❤️ A big shout out to all the viewers of @ABCGMA3 & @AlwaysRamCharan ‘s fans & well wishers. U are much loved https://t.co/byeGqOllsK — Upasana Konidela (@upasanakonidela) February 25, 2023 -
బాండ్ల జారీ ద్వారా రూ.105 కోట్లు: అపోలో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ ప్లేస్మెంట్ విధానంలో ఐసీఐసీఐ బ్యాంక్‌నకు నాన్–కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేయడం ద్వారా రూ.105 కోట్లు సమీకరించనున్నట్టు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైసెస్ బుధవారం తెలిపింది. ఒక్కొక్కటి రూ.10 లక్షల విలువైన 1,050 ఎన్సీడీలను జారీ చేసేందుకు డైరెక్టర్ల కమిటీ ఆమోదం తెలిపిందని కంపెనీ వెల్లడించింది. ఎన్ఎస్ఈ హోల్‌సేల్ డెట్ మార్కెట్లో వీటిని లిస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
అపోలో ఆస్పత్రి నుంచి వైఎస్ షర్మిల డిశ్చార్జ్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, షర్మిలకు 15 రోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఆమరణ నిరాహార దీక్షకు వైఎస్ షర్మిల పూనుకోగా, శనివారం అర్ధరాత్రి పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి అపోలో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆదివారం అక్కడ చికిత్స పొందారు షర్మిల. దీక్ష కారణంగా లో బీపీ, బలహీనత ఉండటంతో వైఎస్ షర్మిలను అపోలో ఆస్పత్రిలో చేర్పించినట్లు నిన్నటి బులిటెన్‌లో వైద్యులు తెలిపారు. -
NIMS Director: అనారోగ్యంతో అపోలోకు.. ఆరోగ్యంగా నిమ్స్‌కు..!
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యానికి గురైన నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.మనోహర్ పూర్తి అరోగ్యంతో తిరిగి వచ్చారు. సోమవారం ఆయన డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయన గుండెపోటు రావడంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. అప్పటి వరకు నిమ్స్ డీన్ డాక్టర్ ఎస్.రామ్మూర్తికి పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ నెల 2వ తేదీతో ఆయన ఇంచార్జి డైరెక్టర్ గడువు ముగియడంతో మనోహర్ తిరిగి బాధ్యతలను చేపట్టారు. వివాద రహితుడిగా ముద్రపడిన మనోహర్ తాజాగా వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ వైద్య ప్రమాణాలను సొంతం చేసుకున్న నిమ్స్‌కు డైరెక్టర్ మాత్రం తనకు అనారోగ్యం వస్తే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ వ్యవహారాన్ని నిమ్స్ ఉద్యోగ వర్గాలు సహా రాజకీయపక్షాలు సైతం తీవ్రంగా పరిగణించాయి. ఎమర్జెన్సీ సమయంలో ఇంటికి సమీపంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందడం తప్పుకాదని.. అయితే కోలుకున్న తర్వాత కూడా అదే ఆస్పత్రిలో వైద్యసేవలు పొందడం మాత్రం కచ్చితంగా నిమ్స్ ఆస్పత్రిని అవమానించడమేనంటూ మండిపడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మనోహర్ స్థానంలో కొత్త డైరెక్టర్ని నియమించేందుకు సమాలోచనలు చేసింది. ఒక దశలో అర్హులైన వారి ఎంపికకు సెర్చ్ కమిటీని వేసేందుకు సైతం ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అయితే అధికారికంగా మనోహర్ తన పదవి నుంచి వైదొలగకపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డైరెక్టర్ మనోహర్ మళ్లీ బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చదవండి: (Hyderabad Doctor: పెళ్లికి ముందే మరొక యువతితో సంబంధం.. అయితే..) -
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. నడిరోడ్డుపై పల్టీ కొట్టి..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పక్కనే ఉన్న దేవాలయాన్ని కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యువకుడికి గాయాలుగా ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లో ఆదివారం ఉదయం ఓ యువకుడు హల్చల్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ హై స్పీడ్‌లో కారుతో దేవాలయాన్ని ఢీకొట్టాడు. దీంతో, కారు ఒక్కసారిగా పల్టీ కొట్టింది. కాగా, ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు అతడిని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
నిమ్స్ డైరెక్టర్‌కు అపోలోలో చికిత్స.. ప్రభుత్వ ఆసుపత్రులపై చిన్నచూపు?
నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) డైరెక్టర్ మనోహర్ రెండు రోజుల క్రితం గుండెపోటుతో హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చేరడం వివాదాస్పదంగా మారింది. ప్రతిష్టాత్మక ఆసుపత్రికి డైరెక్టర్‌గా ఉన్న మనోహర్... తమ దవాఖానాను కాదని ప్రైవేటులో చికిత్స పొందుతుండడం చర్చనీయాంశంగా మారింది. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రి ప్రతిష్టను మసకబార్చే చర్యగా నిమ్స్ ఉద్యోగులతో పాటు వైద్యరంగంలోని వారు కూడా దీన్ని తప్పుబడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎవరు ఏ ఆసుపత్రిలోనైనా.. మరెక్కడైనా చికిత్స పొందవచ్చు. అయితే సాక్షాత్తూ ఒక ఆసుపత్రికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తే ఆ ఆసుపత్రిని కాదని మరో చోట వైద్యసేవలు పొందడం సామాన్య ప్రజలకు అది ఎలాంటి సందేశం ఇస్తుంది? అంటూ పలువురు నిమ్స్ డైరెక్టర్ చికిత్స ఉదంతాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఉదంతాలు ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ నిమ్స్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందడం చర్చకు దారి తీసింది. అయితే ఈ దఫా ఏకంగా డైరెక్టరే నిమ్స్‌ను కాదని నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిని ఆశ్రయించడం మరింత వివాదంగా మారింది. వ్యక్తిగత, కుటుంబ వైద్యుడు అపోలోలో పనిచేస్తుండడం వల్లనే అక్కడ చికిత్సకు వెళ్లినట్టుగా డైరెక్టర్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే గతంలో ఇలాంటి సందర్భాల్లో సదరు వ్యక్తిగత వైద్యులే నిమ్స్‌కు వచ్చి ట్రీట్మెంట్స్ ఇచ్చిన దాఖాలాలున్నాయని మరికొందరు అంటున్నారు. నిజానికి నిమ్స్ కార్డియాలజీ విభాగానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు ఉంది. ఎక్కడెక్కడి నుంచో రోగులు నిమ్స్‌కు వచ్చి చికిత్స తీసుకుని కోలుకుని వెళుతుంటారు. చదవండి: హైదరాబాద్‌లో రాగల 24 గంటల్లో భారీ వర్షం ఈ పరిస్థితుల్లో సాక్షాత్తూ నిమ్స్ డైరెక్టర్ ప్రైవేటు ఆసుపత్రిలో చేరడం ఆసుపత్రి పేరు ప్రతిష్టలకు నష్టం కలుగజేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నగరంలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారిన ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో బుధవారం రోజంతా చర్చోపచర్చలు నడిచాయి. ఎక్కువ మంది డైరెక్టర్ చేరికను తప్పుపట్టగా కొందరు సమర్థిస్తూ కూడా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల పిల్లలు చదవకపోవడం లాంటి పోలికల దగ్గర్నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు సైతం ప్రైవేటు ఆసుపత్రుల్నే ఆశ్రయిస్తుండడం దాకా ఈ చర్చల్లో భాగమయ్యాయి. ఏదేమైనా ఈ తరహా ఉదంతాలు పునరావృతం కాకుంటే మేలని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపై, ఉన్నతాధికారులపై ఉందని, వారు వ్యక్తిగత చికిత్సల కోసం ప్రభుత్వాసుపత్రులను ఎంచుకోవడం ద్వారా ప్రజలకు స్ఫూర్తిని అందించాలని అందరూ కోరుకుంటున్నారు. -
‘నిమ్స్ డైరెక్టర్‌కు అపోలోలో చికిత్సా?’
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్‌కు ఛాతీ నొప్పి రావడంతో అపోలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారన్న వార్త వినడానికే విచిత్రంగా ఉందని ఏఐసీసీ సభ్యుడు కొనగాల మహేశ్ అభిప్రాయపడ్డారు.తెలంగాణ నలుమూలల నుంచి పేద, మధ్యతరగతి వర్గాల ఆరోగ్య ఆశాజ్యోతి అయిన నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ ఆ ఆస్పత్రిని కాదని ప్రైవేటు ఆస్పత్రిలో చేరడం నిమ్స్‌లో పనిచేసే డాక్టర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. అక్కడ పనిచేసే టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని కూడా అవమానపరచినట్లేనని బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్ హోదాలో నిమ్స్ ఆస్పత్రిపై ప్రజలకు నమ్మకం పెంచాల్సింది పోయి ఆయనే కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లడాన్ని బట్టి నిమ్స్‌లో మౌలిక సౌకర్యాలు లేవని అర్థమవుతోందని విమర్శించారు. చదవండి: ఈటలపై సస్పెన్షన్ వేటు? -
వందల కోట్ల కొనుగోలు, అపోలో చేతికి నయతి హెల్త్‌కేర్ ఆస్పత్రి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ (ఏహెచ్ఈఎల్) ఉత్తరాదిలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా నయతి హెల్త్‌కేర్ అండ్ రీసెర్చ్ ఎన్సీఆర్కి గురుగ్రామ్‌లో ఉన్న ఆస్పత్రి అసెట్‌ను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ. 450 కోట్లు. 5.3 ఎకరాల్లోని ఈ కాంప్లెక్స్‌ను 650 పడకల వరకూ విస్తరించే అవకాశం ఉంటుందని ఏహెచ్ఈఎల్ తెలిపింది. దీన్ని 24 నెలల్లో సమగ్ర హెల్త్‌కేర్ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేయనున్నట్లు అపోలో హాస్పి టల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. -
అపోలో, బసవతారకంలో ఉచిత వైద్యం అందించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని అపోలో, బసవతారకం కేన్సర్ ఆస్పత్రులు.. ఉచిత ఇన్ పేషంట్, ఔట్ పేషంట్ సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోలో పేర్కొంది. దీనిపై డీఎంహెచ్ఓ పర్యవేక్షణ ఉంటుందని వివరించింది. ఈ మేరకు తాజా జీవో ప్రతిని మంగళవారం తెలంగాణ హైకోర్టుకు సమర్పించింది. రాష్ట్ర సర్కార్ నుంచి తక్కువ ధరలకు భూమి తీసుకున్న టైంలో.. జరిగిన ఎంవోయూల మేరకు ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం అందజేయాలని, కనీసం కరోనా కష్టకాలంలోనైనా దీన్ని అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఓమిమ్ మానెక్షా డెబారా, తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. ‘ఎంఓయూల ప్రకారం రెండు ఆస్పత్రులు పేదలకు ఉచితంగా పడకలను కేటాయించి వైద్యం చేయకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. జరిమానా విధింపు అవకాశం కూడా ఉంది. అపోలోకు భూమి ఇచ్చినప్పుడు 15% బెడ్స్ పేదలకు ఉచిత కేటాయించేలా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు 1981లో జీవో 517 జారీ అయ్యింది. ఇక బసవతారకం ఆస్పత్రికి 7.35 ఎకరాలను 1989లో ప్రభుత్వం ఏడాదికి రూ.50 వేలకు లీజుకు ఇచ్చినందుకు గాను 25% పడకలు, రోజూ 40% ఔట్పేషంట్లకు ఉచిత వైద్యం చేసేలా 1989లో జీవో 437 జారీ అయ్యింది. ఇవి అమలు చేసే విధానాన్ని వివరిస్తూ ఈ నెల 16న రాష్ట్ర సర్కార్ మరో జీవో 80 జారీ చేసింది’అని ఏజీ వివరించారు. అనంతరం విచారణను ఆగస్టు 8న వాయిదా వేసింది. జీవో 80లోని ముఖ్యాంశాలు ♦ అపోలో, నందమూరి బసవతారకం మెమోరియల్ కేన్సర్ ఆస్పత్రులు వరుసగా 15%, 25% పడకలను పేదల కోసం కేటాయించాలి. ♦ ఇది దాతృత్వం కాదు.. ఇది వారి కర్తవ్యం. ♦ ఎందుకంటే హైదరాబాద్ నగరంలో అత్యంత విలువైన భూములను ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ఈ ఆస్పత్రుల ఏర్పాటు కోసం తక్కువ ధరకు ఇచ్చింది. ♦ ప్రధాన మంత్రి జీవన్ ఆరోగ్య యోజన, ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించాలి. ♦ బసవతారకం ఆస్పత్రి 40% పేదలకు తప్పకుండా ఓపీ సేవలు ఉచితంగా అందించాలి. ♦ ఇవన్నీ సరిగా అమలవుతున్నాయా.. లేదా.. అన్నది డీఎంహెచ్ఓ అప్పుడప్పుడు పరిశీలించి ధ్రువీకరించాలి. ♦ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆహార భద్రత కార్డుదారులు ఉచిత ఓపీకి అర్హులు. ఇదీ చదవండి: ఇక అరచేతిలో ఆర్టీసీ బస్సు -
డైరెక్టర్ మణిరత్నంకు కరోనా.. ఆస్పత్రిలో చేరిక
ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం కరోనా బారిన పడ్డారు. స్వల్ప అస్వస్థత కారణంగా పరీక్షలు చేయించుకున్న ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆయన ఆరోగ్యానికి సంబంధించి విషయాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే మరణిరత్నం ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య, నటి సుహాసిని ప్రకటన ఇవ్వనున్నట్లు తమిళ మీడియా పేర్కొంది. ప్రస్తుతం మరణిత్నం పొన్నియన్ సెల్వన్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: నటి కల్యాణితో విడాకులు.. కారణమేంటో చెప్పిన డైరెక్టర్ ఈ మూవీ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో జూలై 8న పొన్నియన్ సెల్వన్ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకినట్లుగా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బలిటెన్ రావాల్సి ఉంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. -
దగ్గుబాటికి గుండెపోటు
సాక్షి, హైదరాబాద్: సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు మంగళ వారం గుండెపోటుకు గురయ్యారు. హుటా హుటిన ఆయనను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేసి 2 స్టెంట్లు వేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న దగ్గుబాటిని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరామర్శించారు. -
మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. ఆయన స్వగ్రామం శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా బొజ్జల పనిచేశారు. చదవండి: ఉత్తరాంధ్రపై మరోసారి అక్కసు వెల్లగక్కిన చంద్రబాబు 1994-99లో రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 2014లో చంద్రబాబు క్యాబినెట్లో అటవీ శాఖ మంత్రిగా బొజ్జల పని చేశారు. 2004-09లో కాంగ్రెస్ నేత ఎస్సివి నాయుడు చేతిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి శ్రీ కాళహస్తి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. -
వాస్క్యులర్ వ్యాధులు–శస్త్ర చికిత్సలు..
శారీరకంగా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలంటే, మంచి వాస్క్యులర్ (నాడీ వ్యవస్థ) ఆరోగ్యాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం అంటున్నారు అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్‌కు చెందిన వాస్క్యులర్ –ఎండోవాస్క్యులర్ సర్జన్, డా. సి. చంద్ర శేఖర్. ఈ వ్యాధుల వివరాలు అందించే చికిత్సల విషయాలను ఆయన ఇలా తెలియజేస్తున్నారు.. రక్త సరఫరాపై ప్రభావం... రక్తనాళాలు కణజాలాల నుండి వ్యర్థాలను తొలగిస్తాయి శరీరమంతటికీ ఆక్సిజన్, పోషకాలను తీసుకువెళతాయి. అయితే వాస్క్యులర్ వ్యాధులు సాధారణంగా ఈ రక్త నాళాలను ప్రభావితం చేస్తాయి, ఈ ఫలకం (కొవ్వు, కొలెస్ట్రాల్‌తో తయారైనది) సిరలు లేదా ధమనుల లోపల రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది . రక్త నాళాలకు ఏదైనా నష్టం జరిగి రక్తం ప్రవహించకుండా నిరోధించడం వలన ప్రాణాంతక అంతర్గత రక్తస్రావం లేదా స్ట్రోక్ వంటి వివిధ సమస్యలు కలుగుతాయి. శస్త్రచికిత్సలతో... చిన్నపాటి వాస్కులర్ వ్యాధులను జీవనశైలి మార్పుల ద్వారా సరిచేయవచ్చు, అయితే కొంతమందికి మందులు లేదా శస్త్రచికిత్స అవసరం కావచ్చు. వాస్కులర్ వ్యాధుల చికిత్సకు అందుబాటులో ఉన్న వాస్కులర్ సర్జరీలు... ► యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ అనే ప్రక్రియలో కాథెటర్–గైడెడ్ బెలూన్ని ఉపయోగించి ఇరుకైన ధమనిని తెరుస్తారు. ఈ విధానం కనిష్ట ఇన్వాసివ్ ప్రక్రియ. ► అథెరెక్టమీ: ఇది రక్తనాళాల నుండి ఫలకాన్ని కత్తిరించడానికి, తొలగించడానికి అనుమతించే ఒక ప్రత్యేకమైన కాథెటర్‌ను నిరోధించబడిన ధమనిలోకి చొప్పించే మరొక అతితక్కువ ఇన్వాసివ్ ప్రక్రియ, ► ఆర్టెరియోవెనస్ ఫిస్టులా: ముంజేయిలోని సిర నేరుగా ధమనికి అనుసంధానించి, సిరను బలంగా వెడల్పుగా చేస్తుంది ► ఆర్టెరియోవెనస్ గ్రాఫ్ట్: ఈ రకమైన శస్త్రచికిత్సలో సింథటిక్ ట్యూబ్ ద్వారా ధమనిని సిరకు కనెక్ట్ చేయడం జరుగుతుంది. ► ఓపెన్ అబ్డామినల్ సర్జరీ: ఈ శస్త్రచికిత్సలో పొత్తికడుపు గుండా వెళ్ళే ప్రదేశంలో చిన్న కోత ఉంటుంది. సమస్య ఉన్న ప్రాంతం చుట్టూ రక్త ప్రవాహాన్ని మళ్లించడానికి దీన్ని చేస్తారు. ► థ్రోంబెక్టమీ: ఈ ప్రక్రియలో సిర లేదా ధమని నుంచి రక్తం గడ్డకట్టడం తొలగించబడుతుంది. సరైన రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడంలో ఈ ప్రక్రియ సహాయపడుతుంది. దీనికి బదులుగా ఒక్కోసారి యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ కూడా చేయవచ్చు. ► వాస్కులర్ బైపాస్ సర్జరీ: బైపాస్ గ్రాఫ్టింగ్ అనేది దెబ్బతిన్న నాళాన్ని దాటవేసే రక్త ప్రవాహానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది. వెర్టెబ్రోబాసిలర్ వ్యాధి, పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి, మూత్రపిండ వాస్కులర్ వ్యాధి, మెసెంటెరిక్ వాస్కులర్ వ్యాధి ఉన్న రోగులకు దీన్ని చేస్తారు. ఓపెన్ కరోటిడ్ , ఫెమోరల్ ఎండార్టెరెక్టమీ: ఈ ప్రక్రియలో కాళ్లు లేదా మెదడులకు రక్తాన్ని అందించే ధమనుల లోపలి పొరలో ఉన్న ఫలకాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం జరుగుతుంది. ► ఈ శస్త్రచికిత్సలు రోగి జీవితాన్ని మెరుగుపరుస్తాయి, రోగుల శారీరక పరిస్థితిని బట్టి శస్త్ర చికిత్స అనంతరం కోలుకోవడానికి 1–2 వారాలు అవసరం కావచ్చు –డా. సి. చంద్ర శేఖర్,వాస్కులర్ – ఎండోవాస్కులర్ సర్జన్, అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి -
మెగా కోడలు ఉపాసనకు ప్రతిష్టాత్మక అవార్డు
మెగా కోడలు, అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ ఉపాసన కొణిదెల ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఆమె చేసే సేవా, సామాజీక కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవనక్కర్లేదు. అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ ద్వారా ఆమె నిత్యం హ్యుమన్ లైఫ్, వైల్డ్ లైఫ్ కోసం ఆమె నిత్యం కృషి చేస్తుంటారు. ఈ క్రమంలో ఆమెకు ప్రతిష్టత్మక అవార్డు నాట్ హెల్త్ సీఎస్ఆర్ అవార్డు వరించింది. గ్రామీణా ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి గుర్తింపు 2022 ఏడాదికి గానుఈ పురస్కారాన్ని ఉపాసన అందుకున్నారు. చదవండి: తెలుగు సినిమాల్లో అసలు నటించను: బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్ ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ..ఓ గొప్ప కార్యక్రమంలో తమల్ని భాగం చేసిన తాతయ్య, అపోలో ఆస్పత్రుల ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికే ఈ అవార్డ్ ఘనత దక్కుతుందని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధిలో భాగంగా వైద్య సేవలను మెరుగుపర్చాలనే ఆయన లక్ష్యమే తనకు స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుంటుండగా..సతీమణి ఉపాసన తన కెరీర్లో భర్త గర్వించే పురస్కారాలు అందుకోవడం విశేషం. చదవండి: నేను కూడా ఈ వ్యాధితో బాధపడ్డాను, మానసికంగా కుంగిపోయా: హీరోయిన్ -
మంత్రి గౌతమ్ రెడ్డి మరణం.. ఆసుపత్రి వద్ద దృశ్యాలు
-
అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 'వైద్యరంగంలో ఆధునిక భారత ఆరోగ్య సంరక్షణ రూపశిల్పిగా పరిగణించబడుతున్న ప్రతాప్ సి. రెడ్డికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఎల్లప్పుడూ ఆయన సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు' పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ శనివారం ట్వీట్ చేశారు. Warm greetings on the 91st birthday to Sri Pratap C Reddy Garu, Founder-Chairman of Apollo hospitals, a revered fatherly figure in the medical fraternity and widely regarded as an architect of modern Indian healthcare. May God bless him with a happy and healthy life ahead. — YS Jagan Mohan Reddy (@ysjagan) February 5, 2022 చదవండి: (Anantapur: అనంత గర్భం.. అరుదైన ఖనిజం) -
నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో.. అపోలో హాస్పిటల్స్‌కి గోల్డెన్ ఛాన్స్ !
Apollo Hospitals may replace Indian Oil: హెల్త్ సెక్టార్లో దశాబ్ధాల అనుభవం కలిగిన అపోలో హాస్పిటల్స్‌కి వైద్యపరంగా ఎన్నో మైళ్లు రాళ్లు అధిగమించింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో సైతం మరో ఘనత సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో లిస్టయిన కంపెనీలను స్మాల్‌క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ కంపెనీలుగా పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో లార్జ్ క్యాప్ కంపెనీల్లో టాప్ 50 కంపెనీల షేర్ల విలువ, బదలాయింపు, ట్రేడింగ్‌లు ఎంతో కీలకం. నిత్యం వార్తల్లో మార్కెట్ హెచ్చు తగ్గులకు సంబంధించి వచ్చే వార్తలు కూడా ఈ టాప్ 50 కంపెనీలకు సంబంధించినవే ఉంటాయి. ఎన్ఎస్ఈ టాప్ 50 లిస్టులో చోటు సాధించడం ఆశామాషీ వ్యవహారం కాదు. ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఈ ఘనత సాధించేందుకు అడుగు దూరంలో ఉంది. ఎడిల్వైజ్ ఆల్టర్రేటివ్ రీసెర్చ్ అందిస్తున్న వివరాల ప్రకారం ప్రతీ ఏడు ఫిబ్రవరి మధ్యలో ఎన్ఎస్ఈ తన టాప్ 50 జాబితాను సవరిస్తుంది. కంపెనీల పనితీరు, షేర్ల ట్రేడింగ్ ఆధారంగా కొన్ని కంపెనీలు కొత్తగా ఈ లిస్టులో చేరుతుండగా మరికొన్ని స్థానం కోల్పోతాయి. కాగా ప్రస్తుత అంచనాల ప్రకారం ఫిబ్రవరిలో చేపట్టే సెమీ యాన్యువల్ ఇండెక్స్ రివ్యూలో అపోలోకి టాప్ 50 కంపెనీల జాబితాలో చోటు దక్కవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ఇండియన్ ఆయిల్ స్థానాన్ని అపోలో భర్తీ చేయవచ్చని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రచురించింది. ఇటీవల కాలంలో అపోలో హాస్పిటల్స్ షేర్లు మార్కెట్లో ఎక్కువగా ట్రేడింగ్ జరుగుతున్నాయి. అపోలో షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతీ రోజు 175 మిలియన్ డాలర్ల ట్రేడింగ్ ఈ షేర్ల మీద జరుగుతోంది. వీటికి సంబంధించి రోజువారి సగటు ట్రేడింగ్ వాల్యూమ్ 1.7గా ఉంది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ నుంచి పెట్టుబడులు వెనక్కి తరలిపోతున్నాయి. తాజా పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అపోలోకి టాప్ 50లో చోటు దక్కడం ఖాయమంటున్నారు. -
‘ఒమిక్రాన్‌పై అలాంటి ప్రచారం అస్సలు మంచిది కాదు.. వారికి మరింత ప్రమాదం’
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ వేరియంట్ తేలికపాటిదేనని, ప్రమాదకరం కాదని.. ఈ వైరస్ సోకినా పెద్దగా ఇన్ఫెక్షన్లు లేనందున భయపడాల్సిన పని లేదనే భావన ప్రజల్లోకి వెళ్లడం ఆందోళన కలిగించే విషయమని అపోలో గ్రూప్ హాస్పిటల్స్ ప్రెసిడెంట్ కె.హరిప్రసాద్ అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రమాదకరరీతిలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ వేరియంట్ అయినా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తేనే వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై జరుగుతున్న వివిధ రకాల ప్రచారం నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే.. వేగంగా వ్యాప్తి చెందే రకం ఇది కోవిడ్–19లో ప్రస్తుతం వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ మునుపటి వేరియంట్లతో పోలిస్తే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. మంచి రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తిలోకి ఈ వైరస్ ప్రవేశిస్తే ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. కానీ ఆ వ్యక్తి నుంచి ఇతరులకు ఈ వైరస్ వేగంగా సోకుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ సోకితే వచ్చే ఇన్ఫెక్షన్ తేలికపాటి లక్షణాలను కలిగిస్తున్నట్లు గుర్తిస్తున్నాం. ఇది సోకిన ప్రజలు దానిని ఒక చిన్నపాటి జలుబుగా భావిస్తున్నారు. వాస్తవానికి ఒమిక్రాన్ కారణంగా కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని తెలియకపోతే, వారు సాధారణ వ్యక్తుల్లాగే బయట సమాజంలో తిరుగుతారు. తద్వారా అనేక మంది ఇతర వ్యక్తులకు ఇన్ఫెక్షన్ సోకే పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణ విషయంగా భావించవద్దు ఒమిక్రాన్ తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగించదు, మరణాలకు దారితీయదనే భావన ప్రజల్లో క్రమంగా సాధారణంగా మారుతోంది. ప్రస్తుతం ఈ వైరస్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నా (అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు) ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొందరికి ఐసీయూ సంరక్షణ కూడా అవసరమవుతోంది. ఇతర దేశాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. డెల్టా అత్యంత ప్రమాదకరమని అందరికీ తెలుసు. సెకండ్ వేవ్‌లో ఆ వేరియంట్ మనకు భయంకరమైన అనుభవాన్ని మిగిల్చింది. ఇప్పటికీ కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. మున్ముందు ఇది భారీ నష్టాలకు కారణమయ్యే అవకాశం ఉందని గ్రహించాలి. వ్యక్తులుగా మన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి. పౌరులుగా ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి, అది కలిగించే నష్టాన్ని వీలైనంతగా తగ్గించడానికి ప్రభుత్వానికి సహకరించాలి. జాగ్రత్తలు పాటించాలి ప్రతి ఒక్కరూ మాస్కును సరైన రీతిలో ధరించాలి. గుంపులుగా గుమిగూడకుండా.. ఎక్కువ మంది పాల్గొనే సమావేశాలకు దూరంగా ఉండాలి. భౌతిక దూరం పాటించాలి. తక్కువ లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్ష చేయించుకోవాలి. పరిస్థితులను బట్టి ముందస్తుగానే వైద్య సహాయం తీసుకోవాలి. హోమ్ ఐసోలేషన్ పాటించాలి. నిబంధనల ప్రకారం ఇమ్యునైజేషన్ డోస్‌లను (బూస్టర్లతో సహా) తీసుకోవాలి. -
కైకాల కుమారుడికి సీఎం జగన్ ఫోన్
సాక్షి, అమరావతి: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కైకాల కుమారుడికి ఫోన్ చేశారు. కైకాల చిన్న కుమారుడు, కేజీఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కైకాల రామారావు(చిన్నబాబు)కు సీఎం జగన్ ఫోన్ చేసి.. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ తెలిపారు. ప్రస్తుతం కైకాల హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అదే విధంగా రాష్ట్ర మంత్రి పేర్ని నాని కూడా కైకాల ఆరోగ్య పరిస్థితి గురించి వారి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చదవండి: Smart Policing: స్మార్ట్ పోలీసింగ్‌లో సర్వేలో ఏపీ అరుదైన రికార్డు.. కైకాల కుమారుడి ఫోన్ చేసిన సినీ ప్రముఖులు సినీ ప్రముఖులు చిరంజీవి, అల్లు అరవింద్, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, సీనియర్ నటుడు రావు రమేష్ కన్నడ సూపర్ స్టార్ యష్, మరో స్టార్ శివ రాజ్ కుమార్‌లు కైకాల కుమారుడికి ఫోన్ చేసి కైకాల ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కైకాలకు ఏమీ కాదని, తామంతా ఉన్నామని సినీ ప్రముఖుల ధైర్యం చెప్పారు. మరోవైపు కైకాల కోలుకుంటున్నారని, ఎలాంటి ఇబ్బంది లేదని, దయచేసి పుకార్లు సృష్టించి ప్రజలను, కైకాల అభిమానులను ఆందోళనకు గురి చేయవద్దని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. -
నటుడు కైకాల ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా
CM YS Jagan Inquires About Kaikala Satyanarayana Health Condition: నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా కైకాల ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కైకాల కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజుల క్రితం ఇంట్లో ఆయన జారిపడటంతో నొప్పులు ఎక్కువగా ఉండటంతో అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే బీపీ లెవల్స్ చాలా తక్కువగా ఉండటంతో వాసో ప్రెజర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. కైకాలను ఎప్పటికప్పుడు వైద్యుల బృందం పరిశీలిస్తోందని తెలిపారు. -
కైకాల ఆరోగ్యంపై ఆడియో సందేశం ఇచ్చిన కూతురు రమాదేవి
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు వెంటిలెటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి కాస్తా విషమంగా ఉందని, ఆయనను కాపాడేందుకు కృషి చేస్తున్నామంటూ రెండు రోజుల క్రితం అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. చదవండి: కైకాల సత్యనారాయణకు వెంటిలేటర్‌పై చికిత్స దీంతో ఆయన ఆరోగ్యంపై రకరకాలుగా పుకార్లు పుట్టుకొస్తున్నాయి, ఒక దశలో ఆయన పరిస్థితి విషమించిందని, పరిస్థితి చేచారిందంటూ సోషల్ మీడియాల్లో ప్రచారం మొదలు పెట్టారు. ఇక ఈ పుకార్లకు చెక్ పెడుతూ కైకాల కూతురు రమాదేవి ఓ ఆడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రి కోలుకుంటున్నారని, చికిత్సకు స్పందిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: నిక్‌తో ప్రియాంక విడాకులు? తల్లి మధు చోప్రా క్లారిటీ అంతేగాక తన తండ్రి కైకాల ఆరోగ్యం కొంత మెరుగుపడిందని, ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నట్లు ఆమె చెప్పారు. ఇక ఆయన ఆరోగ్యంపై అనవసరపు ప్రచారం చెయోద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇక ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను కూడా ఎవరూ నమ్మోద్దని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవరం లేదని ఆమె స్పస్టం చేశారు. కాగా ప్రస్తుత సమాచారం ప్రకారం కైకాల సత్యనారాయణ అపోలోలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఆయన చికిత్సకి స్పందిస్తున్నారు. త్వరలోనే కైకాల కోలుకుంటారని వైద్యులు చెప్తున్నారు. -
నటుడు కైకాల ఆరోగ్య పరిస్థితి మరింత విషమం
Kaikala Satyanarayana Health Condition: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఈ రోజు ఉదయం ఆయన అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉండటంతో వైద్యులు వెంటిలెటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు అపోలో వైద్యులు కైకాల ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ రోజు ఉదయం 7.30 గంటలకు ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారని, ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే కైకాల ఆరోగ్యం మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామని అపోలో వైద్యులు తమ ప్రకటనలో వెల్లడించారు. చదవండి: బ్రేకప్‌లు, విడాకులు మన స్టార్ హీరోయిన్స్‌కు కలిసోచ్చాయా?! -
ఆక్సిజన్ సపోర్టు తొలగింపు: కళ్లు తెరచి చూస్తున్న సాయితేజ
సాక్షి, హైదరాబాద్: మెగా హీరో సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన పూర్తిగా కోలుకున్నట్లు బుధవారం వైద్యులు తెలిపారు. సాయితేజ్‌కు వెంటిలేటర్ తొలగించారు. తేజ్ ఆరోగ్యం మెరుగవడంతో కళ్లు తెరిచి చూస్తుండడంతో బుధవారం ఆక్సిజన్ సపోర్టు సైతం తీసేసినట్లు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు. క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని పేర్కొన్నారు. కాగా కొన్ని రోజుల కిందటే ఆయన్ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు. సొంతంగానే శ్వాస తీసుకుంటూ అందరితో మాట్లాడగలుగుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉంది. చదవండి: సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై స్పందించిన నరేశ్ -
పూర్తిగా కోలుకున్న సాయిధరమ్ తేజ్
బంజారాహిల్స్ (హైదరాబాద్): రోడ్డు ప్రమాదానికి గురై జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది. ఆయన స్పృహలోనే ఉన్నారని, వెంటిలేటర్ తొలగించినట్లు వైద్యబృందం సోమవారం వెల్లడించింది. మూడు రోజుల కిందటే ఆయన్ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చామంది. సొంతంగానే శ్వాస తీసుకుంటున్న సాయిధరమ్.. అందరితో మాట్లాడగలుగుతున్నారని తెలిపింది. మరో రెండు, మూడురోజుల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నట్లు పేర్కొంది. ఈనెల 10న దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి వెళ్తూ బైక్ స్కిడ్ అయి సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. -
'సాయి ధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారు..వెంటిలేటర్ తొలగించాం'
Sai Dharam Tej Latest Health Bulletin: హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అపోలో హాస్పిటల్స్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. సాయి ధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారని, వెంటిలేర్‌ను కూడా తొలిగించినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయితే చికిత్స నిమిత్తం మరికొన్ని రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంటారని వెల్లడించారు. కాగా కొన్ని రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రోడ్డుపై ఇసుక ఉండటంతో అతడి స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయిన అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన కాలర్ బోన్ ఫ్యాక్చర్ కాగా ఛాతి, కుడి కన్నుపై గాయాలయ్యాయి. ఇటీవలో ఆయన కాలర్ బోన్‌కు శస్త్ర చికిత్స చేసిన సంగతి తెలిసిందే. చదవండి : కాబోయే భర్తకు గ్రాండ్‌గా సర్ప్రైజ్ ఇచ్చిన నయనతార ‘మా’ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నిబంధనలు ఇవే -
సాయి తేజ్: ఐసీయూలో కొనసాగుతున్న చికిత్స, నిలకడగా ఆరోగ్యం
యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్‌కు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతుంది. ఆదివారం అపోలో వైద్యులు అయన కాలర్ బోన్‌కు శస్త్ర చికిత్స చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిన్న(సోమవారం)హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు సర్జరీ విజయవంతమైందని, ఆయనను మరో 36 గంటల పాటు ఆబ్జర్వేషన్‌లో ఉంచాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సాయి తేజ్‌ను ఐసియూలోనే ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చదవండి: ఐసీయూలో అయినా వ్యక్తి ప్రైవసీకి గౌరవం ఇవ్వండి: నిఖిల్ అపోలో అసుపత్రి వైద్యులు డా. అలోక్ రంజన్ నేతృత్వంలోని వైద్య బృందం తేజ్‌ను క్లోజ్‌గా మానిటరింగ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే నిన్న ఆయన వెంటిలెటర్ తొలగించాలని అనుకున్నప్పటిక సాయి స్పృహలోకి వచ్చాకే తొలగిస్తామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తేజ్అరోగ్యం నిలకడగా ఉంది, చికిత్సకు స్పందిస్తున్నారని, రోజు రోజుకు ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు అపోలో వైద్యులు పేర్కొన్నారు. -
సాయి తేజ్ మూడు రోజుల్లో బయటకు వస్తారు: మోహన్‌బాబు
సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ బైక్‌పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడిన నటుడు సాయిధరమ్ తేజ్ హైదరాబాద్‌లోని అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిని పరామర్శించేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. తాజాగా సినీ నటుడు మంచు మోహన్ బాబు తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి సోమవారం సాయంత్రం ఆస్పత్రికి వచ్చారు. సాయిధరమ్ తేజ్‌ను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాయిబాబా ఆశీస్సులతో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఆయన తిరిగి బయటికి వస్తాడు అని చెప్పారు. చదవండి: ‘ఢిల్లీలో ఏమన్న చేసుకోండ్రి.. మా రాష్ట్రంలో ఏందీ లొల్లి’ ఆదివారం తేజ్‌కు శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్నాడని వైద్యులు ప్రకటించారు. 36 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. కాగా శుక్రవారం సాయంత్రం సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా రోడ్డుపై ఇసుక ఉండడంతో అతడి స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయి అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన కాలర్ బోన్ ఫ్యాక్చర్ కాగా ఛాతి, కుడి కన్నుపై గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? ఇది చూస్తే మీ స్ట్రెస్ హుష్‌కాకి -
నిలకడగా సాయి తేజ్ ఆరోగ్యం, ఇంకా 36 గంటలు అబ్జర్వేషన్లో..
అపోలో ఆసుత్రిలో చికిత్స పొందుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మెల్లిమెల్లిగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. నిన్న (ఆదివారం) సాయి తేజ్‌కు శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అపోలో వైద్యులు సోమవారం సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ‘‘సాయి తేజ్ మెల్లి మెల్లిగా కోలుకుంటున్నారు. నిన్న ఆయన కాలర్ బోన్‌కు చేసిన ఆపరేషన్ విజయంతం అయ్యింది. చదవండి: Sai Dharam Tej Accident: సాయి తేజ్ కాలర్ బోన్ సర్జరీ సక్సెస్, హెల్త్ బులెటిన్ విడుదల ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మొదట్లో ఉన్న దానికంటే వెంటిలేటర్ అవసరం ఇప్పుడు తగ్గింది. ఇంకా ఆయనను 36 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాల్సి ఉంది’’ అని అపోలో వైద్యులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా శుక్రవారం సాయంత్రం సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళుతుండగా రోడ్డుపై ఇసుక ఉండటంతో అతడి స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయిన అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన కాలర్ బోన్ ఫ్యాక్చర్ కాగా ఛాతి, కుడి కన్నుపై గాయాలయ్యాయి. -
ఇవాళ కూడా ఐసీయూలోనే సాయిధరమ్ తేజ్: వైద్యులు
-
సాయి తేజ్ యాక్సిడెంట్.. సీసీ టీవీ పుటేజీ వీడియో వైరల్
Sai Dharam Tej Accident Video: మెగా హీరో సాయి తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్-45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు 108 సాయంతో మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. (చదవండి: వెంటిలేటర్‌పైనే సాయిధరమ్‌తేజ్.. కొనసాగుతున్న చికిత్స) ప్రస్తుతం సాయిధర్మ్ తేజ్‌కు ప్రాణాపాయం లేదని.. ఎటువంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఆయన పరిస్థితిపై అపోలో వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నేడు కూడా ఐసీయూలోనే సాయి తేజ్‌కు చికిత్స అందిస్తామని వెల్లడించారు. రేపు మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు. సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ పుటేజీని పోలీసులు విడుదల చేశారు. ఆ వీడియో మీ కోసం.. -
వెంటిలేటర్‌పైనే సాయిధరమ్‌తేజ్.. కొనసాగుతున్న చికిత్స
Sai Dharam Tej Health Condition: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్‌తేజ్‌కు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇంకా వెంటిలేటర్‌పైనే సాయిధరమ్‌తేజ్‌కు చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు శనివారం ఉదయం తాజా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇవాళ కూడా ఐసీయూలోనే సాయిధరమ్‌తేజ్‌కు చికిత్స అందిస్తామని వెల్లడించారు. రేపు మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు. ప్రయాణానికి ముందు సాయిధరమ్ తేజ్ ఆహారం తినడంతో.. ప్రమాద వల్ల పుడ్‌పైప్ నుంచి ఊపిరితిత్తుల పైప్ వరకు ఆహారం చేరింది. ఊపిరితిత్తుల వద్ద ఇరుక్కున్న ఆహారాన్ని వైద్యులు రాత్రి తొలగించారు. ప్రమాదం వల్ల ఒత్తిడికి గురైన సాయిధరమ్‌తేజ్ కుడివైపు ఊపిరితిత్తులు జీసీఎస్ స్కోర్ తక్కువగా ఉన్నట్లు వైద్యులు గమనించారు. శరీర భాగాల్లో ఎక్కడైనా అవయవాలు దెబ్బతిన్నాయా అనేదానిపై వైద్యులు పరిశీలిస్తున్నారు. ఇవీ చదవండి: సాయిధరమ్‌తేజ్ కోలుకుంటున్నారు: చిరంజీవి షటప్.. ఉమాదేవికి ఇచ్చిపడేసిన ప్రియాంక సింగ్ -
సాయిధరమ్‌తేజ్ కోలుకుంటున్నారు: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: అభిమానులు ఆందోళన పడవద్దని.. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో సాయిధరమ్‌తేజ్ కోలుకుంటున్నారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.. రెండు రోజుల్లో సాయిధరమ్ తేజ్ తిరిగి వస్తాడని చిరంజీవి పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయిధరమ్‌తేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేనల్లుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్న సమాచారంతో శుక్రవారం రాత్రి చిరంజీవి, పవన్‌కల్యాణ్, అల్లు అరవింద్ వెంటనే మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి వచ్చారు. మెడికవర్ ఆసుపత్రి వైద్యులను అడిగి సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సాయితేజ్ కోలుకుంటున్నాడని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. మెరుగైన వైద్యం కోసం మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రి నుండి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి సాయిధరమ్‌తేజ్‌ను తరలించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సాయిధరమ్‌తేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు రోడ్డు ప్రమాదంలో హీరో సాయి ధరమ్ తేజ్‌కు తీవ్రగాయాలు -
సాయిధరమ్‌తేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు
సాక్షి, హైదరాబాద్: సాయిధర్మ్ తేజ్‌కు ప్రాణాపాయం లేదని.. ఎటువంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఆయన పరిస్థితిపై అపోలో వైద్యులు అర్ధరాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్ విరిగిందని.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు. ప్రముఖ టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్-45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా అతను ఈ ప్రమాదానికి గురయ్యారు. కుడి కన్నుపై, ఛాతీ, పొట్ట భాగంలో తీవ్రగాయాలయినట్లు డాక్టర్లు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీ: అపోలో రూ.2 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి: సీఎం సహాయ నిధికి అపోలో హస్పిటల్స్ గ్రూపు కోటి రూపాయలు విరాళం ప్రకటించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద కనెక్ట్ టు ఆంధ్రాకు మరో కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. మొత్తంగా రూ.2 కోట్ల విరాళాలకు సంబంధించిన చెక్కులను గురువారం అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీతా రెడ్డి, ప్రెసిడెంట్ (ప్రొక్యూర్మెంట్ అండ్ కార్పొరేట్ డెవలప్మెంట్) నరోత్తమ్ రెడ్డి, సీఈఓ (ఏహెచ్‌ఈఆర్‌ఎఫ్) కె ప్రభాకర్, సీఈఓ (నాలెడ్జ్ వెర్టికల్) శివరామకృష్ణన్‌లు క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌కు అందజేశారు. ఇవీ చదవండి: పవర్ ‘ఫుల్ ఆదా’ ఏపీ: వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం -
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారా?
-
Kathi Mahesh : ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ మృతి
సాక్షి, చెన్నై : ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ మృతి చెందారు. గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. త్వరలోనే కుదుటపడుతుందనుకున్న ఆయన ఆరోగ్యం విషమించింది. అకస్మాత్తుగా శ్వాసకోస సమస్యలు తలెత్తడంతో తుదిశ్వాస విడిచారు. కత్తి మహేశ్ మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తల, కంటి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. కత్తి మహేశ్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం మానవతా కోణంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 17లక్షల రూపాయలు అందచేసింది. అయినా కూడా మహేశ్ ప్రాణాలు దక్కలేదు. ‘బిగ్ బాస్ సీజన్ 1’లో కత్తి మహేశ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్-1 ద్వారా సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కత్తి మహేశ్. అంతకుముందు నందు హీరోగా నటించిన పెసరట్టు అనే సినిమాను తెరకెక్కించారు. కాగా, హృదయ కాలేయం, నేనే రాజు.. నేనే మంత్రి, కొబ్బరి మట్ట వంటి చిత్రాల్లోనూ నటించారు. -
వ్యాక్సిన్ తీసుకున్నాక పాజిటివ్: అపోలో జేఎండీ సంగీతారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అపోలో జేఎండీ సంగీతారెడ్డికి కరోనా సోకింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా జూన్ 10న తాను కోవిడ్-19 బారిన పడ్డానని సంగీతారెడ్డి ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ తీసుకుని.. ఎన్ని జాగ్రత్తలు పాటించినా తనకు కరోనా సోకడం షాక్‌కు గురి చేసిందని పేర్కొన్నారు. వ్యాధినిర్ధారణ, చికిత్స రెండూ కీలకమైన అంశాలని తెలిపారు. కరోనా వల్ల విపరీతమైన జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరానని ఆమె తెలిపారు. అయితే కాక్టెయిల్, రీజెనెరాన్ థెరపీద్వారా కోలుకుంటున్నాను అన్నారు. వ్యాక్సిన్ కరోనాను అడ్డుకోలేదు...కానీ వైరస్ ప్రభావం తీవ్రం కాకుండా నిరోధిస్తుందని సంగీతారెడ్డి తెలిపారు. అందువల్ల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు మరవొద్దు అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన డాక్టర్లు, నర్సులకు కృతజ్ఞతలు తెలిపారు. After 500 days of dodging #COVID19 I tested +VE on June10th My initial reaction was of shock & dismay - Why me? I was careful & #vaccinated Hospitalized with high fever I took the cocktail #Regeneron therapy within the early window period & it has made a dramatic difference (1/2) pic.twitter.com/Qybrl61CUQ — Dr. Sangita Reddy (@drsangitareddy) June 14, 2021 చదవండి: రోజుకు పది లక్షల వ్యాక్సిన్లు పంపిణీకి సిద్ధం : అపోలో -
హైదరాబాద్‌లో స్పుత్నిక్ టీకాలు షురూ!
బంజారాహిల్స్: రష్యా తయారీ స్పుత్నిక్–వి టీకాల కార్యక్రమం హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో తొలిడోసును డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఫార్మా సంస్థకు చెందిన ఒక ఉద్యోగికి వేశారు. మన దేశంలో ప్రస్తు తం స్పుత్నిక్ టీకాలను రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఆ సంస్థతో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ భాగస్వా మ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం రెడ్డీస్ ల్యాబ్స్ దిగుమతి చేసుకున్న మొదటి బ్యాచ్ 1.50 లక్షల స్పుత్నిక్ డోసులను వేయనున్నామని, నెల రోజుల వ్యవధిలో మొత్తంగా 10 లక్షల డోసులు రానున్నా యని అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి వెల్లడించారు. తమ నెట్వర్క్ వ్యాప్తం గా టీకా కేంద్రాలను తెరిచి, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అపోలో హాస్పిటల్స్, అపోలో క్లినిక్స్ సహా 60కిపైగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆస్పత్రి ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ డివిజన్ అధ్యక్షుడు కె.హరిప్రసాద్ తెలిపారు. రెడ్డీస్ ల్యాబ్స్ బ్రాండెడ్ మార్కెట్స్ సీఈవో ఎంవీ రమణ మాట్లాడుతూ.. తొలి బ్యాచ్ టీకాను హైదరాబాద్, విశాఖలో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని, త్వరలోఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతాలో మొదలుపెడతామని వెల్లడించారు. -
96 శాతం పోలీసులకు వ్యాక్సినేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటివరకు 96 శాతం మంది పోలీసులకు మొదటి డోసు వ్యాక్సిన్, 76 శాతం మందికి రెండో డోస్ పూర్తయినట్టు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. మిగిలిన వారికి కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏపీ పోలీస్ శాఖ, అపోలో ఆస్పత్రి వైద్యుల సమన్వయంతో మంగళవారం వెబినార్ ద్వారా ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. కరోనాపై జరుగుతున్న యుద్ధంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ను రక్షించుకోవడం ద్వారా సమాజానికి భద్రత కలుగుతుందన్నారు. వైరస్‌ను జయించిన పోలీస్ సిబ్బంది ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. అపోలో ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ సాయిప్రవీణ్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఏపీ పోలీస్ శాఖ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. రీసెర్చ్, అనుభవం పంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. క్రిటికల్ కేసులకు వైద్యం అందించడం, సూచనలు చేయడం వంటి సౌకర్యాలను పోలీస్ సిబ్బందికి అందిస్తామన్నారు. వైద్యులు సుబ్బారెడ్డి, మంజులరావు పోలీసులకు పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల అడిషనల్ డీజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్, డీఐజీ పాలరాజు, రిటైర్డ్ ఐపీఎస్, వెల్ఫేర్ ఓఎస్డీ రామకృష్ణ, పలువురు సీనియర్ ఐపీఎస్‌లు పాల్గొన్నారు. -
కనకారెడ్డికి పునర్జన్మ
సాక్షి, హైదరాబాద్: అవయవమార్పిడి ద్వారా గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న కనకారెడ్డి పూర్తి ఆరోగ్యంతో కోలుకుని డిశ్చార్జికి సిద్ధంగా ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్లో ఈ నెల 2న గ్రీన్ చానెల్ సాయంతో ఎల్బీ నగర్ కామినేనిలో బ్రెయిన్‌డెడ్ అయిన దాత గుండెను తెచ్చి మరో వ్యక్తికి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన విషయం తెలిసిందే. ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేసిన డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే సోమవారం మీడియాతో మాట్లాడారు. మెట్రో రైల్ ద్వారా అవయవాలను తరలించడం ప్రపంచంలో ఇదే మొదటిసారన్నారు. 8గంటల పాటు గుండె మార్పిడి జరిగిందని, ప్రస్తుతం కనకారెడ్డి ఆరోగ్యంగా ఉన్నా రని తెలిపారు. ఈ సర్జరీ జరగడానికి జీవన్దాత ఆర్గనైజేషన్ ఎంతో కృషి చేసిందన్నారు. ఇలాంటి సర్జరీల్లో 75శాతమే సక్సెస్ రేటు ఉంటుందని, ఇప్పటి వరకు నగరంలో 60 ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు జరగ్గా అందులో 42 అపోలో హాస్పిటల్లోనే జరిగా యన్నారు. అవయవదానం చేసిన రైతు నర్సిరెడ్డి కుటుంబానికి తగిన సాయం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గోఖలే కోరారు. నగర ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ... గత సంవత్సరం ప్రత్యేక పరిస్థితుల్లో 25 సార్లు గ్రీన్ చానెల్‌ను ఏర్పాటు చేశామని, భవిష్యత్‌లోనూ పోలీస్ వ్యవస్థ నుంచి సహకారం అందిస్తా మన్నారు. చికిత్స జరిగిన 2 రోజుల వరకు తనకు ఏ విషయం తెలియదని, దేవుడిలా డాక్టర్లు తనకు పునర్జన్మనిచ్చారని కనకారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. గుండె దానం చేసిన రైతు కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో అపోలో గ్రూప్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.హరిప్రసాద్, హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్అండ్టీ మెట్రో సీఈవో అనిల్‌కుమార్, ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన అపోలో బృందం పాల్గొన్నారు. చదవండి: (హైదరాబాద్ మెట్రో రైల్లో తొలిసారి గుండె తరలింపు) -
సీఎం జగన్ ఆదేశాలు: వైద్యురాలికి చికిత్స
సాక్షి, విజయవాడ: తీవ్ర అనారోగ్యానికి గురై చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒంగోలు రిమ్స్ డెంటల్ డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మద్రాస్ అపోలో ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. (చదవండి: టీడీపీ కిడ్నాప్ డ్రామా బట్టబయలు..) కొద్దిరోజుల్లోనే డాక్టర్ ధనలక్ష్మి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని మంత్రి ఆళ్ల నాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు. ఆమె ఆరోగ్య పర్యవేక్షణకు ఒంగోలు నుండి ప్రత్యేకంగా మత్తు వైద్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్‌ను అందుబాటులో ఉంచారు. (చదవండి: పంచాయతీ ఎన్నికలు: పురోహితులకు డిమాండ్) స్పెషల్ కేసుగా తీసుకొని డాక్టర్ ధనలక్ష్మికి అత్యవసర వైద్యం అందించి ప్రాణాపాయం నుండి కాపాడడానికి అన్ని చర్యలు చేపట్టినట్టు మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం భట్ల గూడూరు గ్రామానికి చెందిన డాక్టర్ ధనలక్ష్మి.. కోవిడ్ సమయంలో ఆరు నెలలు కాలానికి వైద్య సేవలు అందించడానికి తాత్కాలిక పద్ధతిలో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ డెంటల్ డాక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలను ఆమె నిర్వహిస్తున్నారు. -
హైదరాబాద్ మెట్రో రైల్లో తొలిసారి గుండె తరలింపు
సాక్షి, హైదరాబాద్: చావు బతుకుల్లో ఉన్న ఒక వ్యక్తికి హైదరాబాద్ మెట్రో ఆపద్బంధువుగా నిలిచింది. అత్యవసరంగా గుండెను తరలించి నిండు ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో తన వంతు సహకారం అందించింది. మెట్రో సహకారంతో.. విపరీతమైన ట్రాఫిక్ ఉండే మహా నగరంలో ఓ మూలన ఉన్న ఆస్పత్రి నుంచి మరో మూలన ఉన్న ఆస్పత్రికి కేవలం 37 నిమిషాల్లోనే వైద్యులు గుండెను తరలించగలిగారు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన రైతు వరకాంతం నర్సిరెడ్డి (45) గత నెల 31 అస్వస్థతకు గురై హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రిలో చేరాడు. సోమవారం అతని బ్రెయిన్ డెడ్ అయినట్లు గుర్తించిన వైద్యులు విషయం కుటుంబ సభ్యులకు చెప్పారు. జీవన్‌దాన్ ప్రతినిధుల కౌన్సెలింగ్‌తో వారు అతని అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తికి గుండె మార్పిడి శస్త్రచికిత్స అత్యవసరమని గుర్తించి నర్సిరెడ్డి గుండెను అతనికి అమర్చాలని నిర్ణయించారు. అంబులెన్స్‌లో ఎల్బీ నగర్ నుంచి జూబ్లీహిల్స్‌కు సకాలంలో గుండెను తీసుకురావడం కష్టమని భావించిన అపోలో వైద్యులు మెట్రో రైలు అధికారులను సంప్రదించారు. ప్రత్యేక రైలు ఏర్పాటుకు వారు ఓకే చెప్పడం, పోలీసులు సైతం సహకరించడంతో గుండె తరలింపు ప్రక్రియకు మార్గం సుగమం అయ్యింది. మెట్రో రైలులో గుండెను తరలిస్తున్న వైద్యులు ఆద్యంతం ఉత్కంఠ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచే ఎల్భీనగర్–నాగోల్ మార్గంలో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ పోలీసుల పహరా, అంబులెన్స్‌కు పైలెటింగ్ చేయడానికి పోలీసు వాహనాలు దారి పొడవునా సిద్ధమయ్యాయి. వైద్యులు నర్సిరెడ్డి గుండెను సేకరించిన తర్వాత.. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ గోఖలే నేతృత్వంలో అరుగురు సభ్యుల వైద్య బృందం సాయంత్రం 4.36 గంటల ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య అంబులెన్స్‌లో కామినేని ఆస్పత్రి నుంచి బయలుదేరారు. కేవలం ఐదు నిమిషాలలోనే నాగోల్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. మరో నిమిషంలో స్టేషన్లో సిద్ధంగా ఉంచిన ప్రత్యేక మెట్రో రైల్లోకి చేరుకున్నారు. వెంటనే బయలుదేరిన రైలు.. మార్గం మధ్యలోని 16 మెట్రో స్టేషన్లలో ఎక్కడా ఆగకుండా గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్ వరకు మొత్తం 21 కి.మీ మార్గాన్ని 28 నిమిషాల లోపుగానే రైలు చేరుకుంది. రైలును ఈ సమయంలో గంటకు 40 కేఎంపీహెచ్ వేగంతో నడిపారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో రెండున్నర నిమిషాల్లోనే అపోలో ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి అపోలో వరకు కూడా పోలీసులు గ్రీన్‌ఛానెల్ ఏర్పాటు చేశారు. డాక్టర్ గోఖలే నేతృత్వంలోని వైద్య బృందం సాయంత్రం 5.15 గంటలకు గుండె మార్పిడి శస్త్ర చికిత్స ప్రారంభించింది. నగరంలో మెట్రోలో గుండెను తరలించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా నగరంలో మార్పిడి చేసే అవయవాల తరలింపు, అత్యవసర వైద్యసేవలకు మెట్రో సేవలను వినియోగించుకోవాలంటూ.. ట్రాఫిక్ రద్దీ, వీఐపీల రాకపోకలతో అంబులెన్స్‌లు నిలిచిపోవడాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. గుండెను సకాలంలో తరలించాం ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన గుండెను బ్రెయిన్ డెడ్ వ్యక్తి శరీరం నుంచి తీసిన నాలుగు గంటల్లోగా తిరిగి అమర్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గుండెను సకాలంలో అపోలోకు చేరవేసేందుకు మెట్రో జర్నీ ఉపకరించింది. – డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, గుండె మార్పిడి నిపుణులు, అపోలో ఆస్పత్రి ప్రజా సేవకు మెట్రో ముందుంటుంది ప్రజాసేవలో మెట్రో ఎప్పుడూ ముందుంటుంది. ఓ నిండు ప్రాణం కాపాడేందుకు మా వనరులను వినియోగించేంలా మాకో అవకాశం దక్కింది. నాగోల్–జూబ్లీహిల్స్ మధ్య రైలును ఏ స్టేషన్లోనూ ఆపకుండా గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేశాం. – కేవీబీ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ -
మెట్రో: అపోలో ఆస్పత్రికి చేరుకున్న గుండె
సాక్షి, హైదరాబాద్: గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం తొలిసారిగా వైద్యులు హైదరాబాద్ మెట్రోరైలును వినియోగించారు. ఎల్బీనగర్ కామినేని నుంచి జూబ్లీహిల్స్ అపోలోకు గుండెను తరలించారు. కాగా నల్లగొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు నర్సిరెడ్డి బ్రెయిన్‌డెడ్ కావడంతో ఆయన కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో గుండె అవసరమున్న వ్యక్తికి డాక్టర్ గోఖలే నేతృత్వంలో శస్త్రచికిత్స చేయనున్నారు. అయితే ట్రాఫిక్ సమస్య కారణంగా గుండె తరలింపు జాప్యం అయ్యే అవకాశం ఉన్నందున, నాగోల్ నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్‌తో పీఏ సిస్టమ్ టెక్నాలజీ ద్వారా గుండె తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. -
గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు మెట్రో రైలు వినియోగం
సాక్షి, హైదరాబాద్: గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం తొలిసారిగా మెట్రోరైలును వినియోగించనున్నారు. అపోలో హాస్పిటల్ వైద్యుడు గోకులే నేతృత్వంలో జరిగే శస్త్ర చికిత్స కోసం గుండెను మెట్రో రైలులో తరలిచించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మెట్రోతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి చికిత్సకు వైద్యులు సిద్దం చేస్తున్నారు. -
కోవిడ్ టీకా తీసుకున్న ఉపాసన
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్‌ని తొలుత వైద్య సిబ్బందికి ఇస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వగా.. నేటి నుంచి ప్రైవేట్ రంగంలోని వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో అపోలో లైఫ్ వైస్ చైర్పర్సన్, బీ పాజిటివ్ మ్యాగ్జైన్ ఎడిటర్, మెగాస్టార్ కోడలు ఉపాసన కొణిదెల గురువారం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. టీకాపై భయాలను తొలగించేందుకు గాను ఆమె అపోలో సిబ్బందితో కలిసి వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు.(చదవండి: 50 కోట్ల మంది కోసం.. ఉపాసన సరికోత్త ఆలోచన) To put an end to the fear of vaccination, @UpasanaKonidela took the initiative & gets herself vaccinated today at Apollo. She also suggested all the citizens to get vaccinated without any hesitation. #COVIDVaccination pic.twitter.com/5w7zer0Kfw — BARaju (@baraju_SuperHit) January 28, 2021 అంతేకాక జనాలు వ్యాక్సిన్‌పై ఎలాంటి సందేహాలు, భయాలు పెట్టుకోకుండా టీకా తీసుకోవాలని ఉపాసన విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నిర్మాత బీఏ రాజు తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఇక అపోలో హాస్పిటల్ వ్యవస్థాపకులు, పద్మ విభూషణ్ అవార్డుగ్రహీత ప్రతాప్ సి. రెడ్డి తొలి రౌండ్లో వ్యాక్సిన్ తీసుకున్న సంగతి తెలిసిందే. -
గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉంది: అపోలో
ముంబై: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోల్‌కతా అపోలో ఆస్పత్రి వర్గాలు దాదా ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులిటెన్‌ని విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని.. భయపడాల్సిన పని లేదని వెల్లడించాయి. ఈ రోజు గంగూలీ సాధారణ కార్డియాక్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లారని.. అన్ని ముఖ్యమైన పారామీటర్స్ సవ్యంగా ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇక గతంలోనే గుండెనొప్పితో బాధపడిన గంగూలీకి యాంజియోప్లాస్టీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రోజు మరోసారి ఆయన ఆస్పత్రికి వెల్లడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొన్నది. (చదవండి: ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది: షమీ) -
రాజకీయాలు వద్దు నాన్నా...
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై సందిగ్ధత నెలకొంది. పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన రజనీ చివరకు ఓ స్పష్టత ఇచ్చారు. ఈ నెల 31న పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తానని చెప్పారు. ఈక్రమంలోనే చేతిలో ఉన్న అన్నాత్తే సినిమా కోసం ఆయన అహర్నిశలు పనిచేసిన్నట్టు తెలిసింది. అయితే, తొందరగా సినిమా ముగించి రాజకీయాలపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో రోజుకు 14 గంటలపాటు షూటింగ్లో పాల్గొనడంతో ఆయన శారీరక, మానసిక ఒత్తిడికి లోనయ్యారు. దాంతో అన్నాత్తే షూటింగ్ కోసం ఈ నెల 13న హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ఐదు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. శరీరంలో బీపీ లెవల్స్ హెచ్చుతగ్గులు కావడంతో జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడ్డాక చెన్నై పయనమయ్యారు. ఈనేపథ్యంలో రాజకీయాలు తమ జీవితంలోకి వచ్చిన తర్వాతే మానసిక ఒత్తిళ్లు పెరిగిపోయాయని రజనీ కూతుళ్లు ఆయన వద్ద వాపోయారని తెలిసింది. రాజకీయాలకు దూరంగా ఉండాలని తండ్రిని కూతుళ్లిద్దరూ కోరినట్టు సమాచారం. మరి రజనీతో కలిసి నడుస్తామని గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న అభిమానులు, రాజకీయ మిత్రుల్లో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది. (చదవండి: నేనే సీఎం అభ్యర్థి: కమల్ హాసన్) వారం రోజుల విశ్రాంతిలో రజనీ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స, తీవ్ర స్థాయిలో బీపీ, వృద్ధాప్య కారణాల రీత్యా వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడికి గురయ్యే పనులను దూరంగా ఉండాలని, కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. దీంతో అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్న రజనీ చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈక్రమంలో పార్టీ ప్రకటన సాధ్యం కాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, రజనీ మక్కల్ మన్రం నిర్వాహకులు మాత్రం పార్టీ ప్రకటనే ఖాయమే ధీమాతో ఉన్నారు. పార్టీతోపాటు మరిన్ని ప్రకటనలు చేయడం ఖాయమని మన్రం కో పర్యవేక్షకుడు తమిళరవి మణియన్ అన్నారు. 234 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టడం ఖాయమని తెలిపారు. రజనీ రాజకీయాల్లోకి రారు– కేఎస్ అళగిరి ఆధ్యాత్మిక భావాలు కలిగిన రజనీకాంత్ రాజకీయాల్లోకి రారని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాప దినోత్సవాన్ని చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్లో సోమవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘రజనీ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతోంది. రాజకీయాల్లోకి వచ్చి పార్టీ గెలిచినా ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇష్టం లేదని అన్నారు. సీఎం కారని స్పష్టమైనప్పుడు ఎందుకు ఓటేయాలని ప్రజలు, అభిమానులు భావిస్తా’రని అన్నారు. (చదవండి: సీఎంతో హీరో విజయ్ భేటీ..!) -
ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్
సాక్షి, హైదరాబాద్: రక్తపోటులో హెచ్చుతగ్గుల సమస్యతో బాధపడుతూ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన సినీనటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆదివారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. గత రెండ్రోజులతో పోలిస్తే ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్లు జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే ఆయనకు మరో వారం రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో స్పష్టం చేశారు. రక్తపోటు పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు ఆయన వ్యక్తిగత వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన అపోలో ఆస్పత్రి నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లిపోయారు. అన్నాత్తే సినిమా షూటింగ్ కోసం ఈ నెల 14న హైదరాబాద్ వచ్చిన రజనీకాంత్.. చిత్ర యూనిట్లో పలువురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఈ నెల 22న ఆయన కూడా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. తాత్కాలికంగా సినిమా షూటింగ్ నిలిపివేయడంతో ఫిలింసిటీలోని హోటల్లో ఆయన హోం క్వారంటై¯Œ అయ్యారు. శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా ఆయన అనారోగ్యం బారిన పడటంతో జూబ్లీ్లహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు. -
నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్ : అధిక రక్తపోటుతో బాధపడుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు ఆదివారం ఉదయం వెల్లడించారు. ఆయనకు నిన్న (శనివారం) కొన్ని పరీక్షలు చేశామని, వాటి రిపోర్టులు రావాల్సి ఉందని వైద్యులు పేర్కొన్నారు. రిపోర్టులను బట్టి రజనీకాంత్‌ను డిశ్చార్జ్ చేసే అంశంపై అపోలో వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, రజనీకాంత్ ఈ రోజు సాయంత్రం చెన్నైకి వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కోసం బేగంపేట విమానాశ్రయంలో చార్టెడ్ ఫ్లైట్ రెడీగా ఉందట. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రజనీకాంత్ చెన్నై వెళ్తారని సమాచారం. -
రేపు రజనీకాంత్ డిశ్చార్జ్
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు వెల్లడించారు. రేపు ఉదయమే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. ఈమేరకు శనివారం సాయంత్రం రజనీకాంత్ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి బాగుందని అపోలో వైద్య బృందం తెలిపింది. ఆయనకు కొన్ని పరీక్షలు చేశామని, వాటి రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొంది. ఈ రోజు రాత్రి ఆయనను బీపీకి సంబంధించిన వైద్యులు పర్యవేక్షణలో ఉంచుతామని చెప్పింది. కాగా 'అన్నాత్తే' సినిమా చిత్రీకరణలో భాగంగా రజనీకాంత్ ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 22న మొత్తం చిత్ర బృందానికి నిర్వహించిన కరోనా టెస్టుల్లో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రజనీ సహా ముఖ్య నటీనటులెవరికీ కరోనా సోకనప్పటికీ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రజనీకాంత్‌కు రక్తపోటు అధికం కావడంతో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో భయాందోళనకు గురైన ఆయన అభిమానులు రజనీ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేపట్టారు. మొత్తానికి వారి ప్రార్థనలు ఫలించి ఆయన ఆరోగ్యవంతుడై ఆదివారం డిశ్చార్జ్ అవనున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: రజనీ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్.. అభిమానుల ఆందోళన) (చదవండి: రజనీకాంత్‌కు తీవ్ర అస్వస్థత) -
రజనీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్
'సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్య బృందం పేర్కొంది. శుక్రవారంతో పోలిస్తే నేడు ఆయన ఆరోగ్యం కొంచెం మెరుగుపడిందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు శనివారం ఉదయం రజనీకాంత్ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి యాజమాన్యం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. ‘రజనీకాంత్ ఆరోగ్యం, ఆయన రక్తపోటుకు సంబంధించి అందుతున్న వైద్యంపై క్లోజ్‌గా మానిటర్ చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఆయన రక్తపోటు ఇప్పటికి కూడా అధికంగానే ఉంది. రక్తపోటును తగ్గించేందుకు మందులు అందిస్తున్నాం. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాం. సాయంత్రానికల్లా నివేదిక వస్తుంది. ఆ తర్వాత అతనికి అందించాల్సిన చికిత్స గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. శనివారం సాయంత్రం కూడా పరీక్షలు నిర్వహించి అంతా సవ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్నాకే డిశ్చార్జ్‌పై నిర్ణయం తీసుకుంటాం’అని అపోలో వైద్య బృందం ప్రకటించింది. కాగా ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ నిమిత్తం రజనీకాంత్ ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్లో పలువురు కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం రజనీకి రక్తపోటు అధికం కావడంతో వెంటనే నగరంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. -
రజనీ ఆరోగ్యంపై మోహన్‌బాబు ఆరా
సాక్షి, చిత్తూరు : అస్వస్థతకు గురవడంతో సూపర్‌స్టార్ రజనీకాంత్ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో చికిత్స నిమిత్తం చేరారు. బీపీ పెరగడంతో ఇబ్బందిపడ్డ ఆయన ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ, చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు ఒక అధికార ప్రకటనను విడుదల చేశారు. (చదవండి : రజనీకాంత్‌కు తీవ్ర అస్వస్థత) కాగా రజనీకాంత్, మోహన్‌బాబు అత్యంత సన్నిహిత మిత్రులనే విషయం తెలిసిందే. ప్రస్తుతం మోహన్‌బాబు తిరుపతిలో ఉన్నారు. తన స్నేహితుడు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారనే వార్త తెలుసుకున్న ఆయన ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయన యోగక్షేమాలు తెలుసుకునేందుకు రజనీ భార్య లతకు, కుమార్తె ఐశ్వర్యకు, సోదరికి ఫోన్లు చేశారు. రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఎలాంటి ఆందోళనా పడాల్సిన అవసరం లేదనీ వారు చెప్పడంతో మోహన్‌బాబు కుదుటపడ్డారు.రజనీ మానసికంగా, శారీరకంగా దృఢమైన వ్యక్తి అనీ, ఈ అస్వస్థత నుంచి ఆయన త్వరగా కోలుకుని, ఎప్పటిలా తన పనులు మొదలుపెడతారనీ మోహన్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. -
నిలకడగా రజనీ ఆరోగ్యం.. అభిమానుల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శుక్రవారం రాత్రి కూడా ఆస్పత్రిలోనే ఉండనున్నారు. ఇంటర్నేషనల్ షూట్‌లోని ప్రత్యేక రూమ్‌లో రజనీకాంత్‌కు వైద్య సేవలు అందిస్తున్నారు. కేవలం ఒక్క డాక్టర్ పర్యవేక్షణలో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. డాక్టర్ కే.హరిబాబు నేతృత్వంలోని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం కుదటపడితే శనివారం ఉదయం డిశ్చార్ చేస్తామని వైద్యులు తెలిపారు. రక్తపోటును తగ్గించేందుకు మందులు వాడుతున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నందున అభిమానులు ఎవరూ ఆస్పత్రి వద్దకు రావద్దని వైద్యులు కోరారు. రజనీ వద్ద ఆయన కుమార్తె ఐశ్యర్య ఆస్పత్రిలో ఉన్నారు. కాగా ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్లో పలువురు కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం రక్తపోటు అధికం కావడంతో వెంటనే నగరంలోని ఆస్పత్రికి తరలించారు. (రజనీకాంత్‌కు తీవ్ర అస్వస్థత) గవర్నర్ ఆరా.. రజనీకాంత్ ఆరోగ్యంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆరా తీశారు. అపోలో ఆస్పత్రికి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులను కోరారు. మరోవైపు తమ అభిమాన నటుడు అనారోగ్యానికి గురికావడంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు. పెద్ద ఎత్తున అపోలో ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ఆయన క్షేమంగా తిరిగిరావాలని కోరుతూ ప్రార్థనలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రజనీ త్వరగా కోలుకోవాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాఘవా లారెన్స్‌తో పాటు పలువురు నటులు ప్రార్థించారు. అభిమానుల్లో ఆందోళన... ఇదిలావుండగా డిసెంబర్ 31న పార్టీ ప్రకటన నేపథ్యంలో రజినీ అస్వస్థతతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. వచ్చే ఏడాది మే నెలలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు రజనీకాంత్ సమాయత్తం అవుతున్నారు. డిసెంబర్ 31న పార్టీ పేరు… జనవరి ఒకటిన పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ ఇప్పటికే రజనీ ప్రకటించిన విషయం తెలిసిందే. మక్కల్ సేవై కర్చీగా(ప్రజా సేవా పార్టీ) రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీకి గుర్తుగా ఆటోను కేటాయించినట్లు సమాచారం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రకటన చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. (రజనీ వెనుక కాషాయం!) -
రజనీకాంత్‌కు తీవ్ర అస్వస్థత
సాక్షి, హైదరాబాద్ : 'అన్నాత్తై’షూటింగ్ కోసం గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఉంటున్న ప్రముఖ సినీనటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ (70) శుక్రవారం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. రక్తపోటులో తీవ్ర హెచ్చుతగ్గులు రావడంతో ఆయన్ను హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయన్ను ప్రత్యేక ఐసీయూకు తరలించి రక్తపోటులో హెచ్చుతగ్గులను నియంత్రించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, బీపీ కూడా సాధారణ స్థితికి చేరుకుందని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే ఆయనకు కరోనా పరీక్షలు కూడా చేశామని, ఆయనకు ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని స్పష్టం చేశారు. ఆస్పత్రి వర్గాలు ఈ మేరకు శుక్రవారంసాయంత్రం మీడియా బులెటన్ విడుదల చేశాయి. ఆయనకు మరింత విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు. శనివారం ఉదయం కూడా పరీక్షలు నిర్వహించి అంతా సవ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్నాకే డిశ్చార్జ్ చేయనున్నుట్ల ప్రకటించారు. మరోవైపు రజనీకాంత్ వ్యక్తిగత వైద్యులు సహా ఆయన కుమార్తె ఐశ్వర్య చెన్నై నుంచి అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హోం క్వారంటైన్లో ఉండగా... ఈ నెల 14న హైదరాబాద్ వచ్చిన రజనీకాంత్.. 15వ తేదీ నుంచి రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైన ‘అన్నాత్తై’షూటింగ్లో పాల్గొంటూ ఫిలిం సిటీలోని సితారా హోటల్లో ఉంటున్నారు. అయితే రెగ్యులర్ పరీక్షల్లో భాగంగా ఈ నెల 22న మొత్తం చిత్ర బృందానికి నిర్వహించిన కరోనా టెస్టుల్లో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రజనీ సహా ముఖ్య నటీనటులెవరికీ కరోనా సోకనప్పటికీ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో నయనతార చెన్నై వెళ్లిపోగా రజనీ మాత్రం హోటల్ గదిలోనే హోం క్వారంటైన్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం, రక్తపోటులో హెచ్చుతగ్గులు రావడంతో వ్యక్తిగత సిబ్బంది వెంటనే ఆయన్ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. త్వరగా కోలుకోవాలి: గవర్నర్ తమిళిసై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొంతుతున్న రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. అపోలో ఆస్పత్రికి ఫోన్ చేసి రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యకు ఫోన్ చేసి రజనీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రజనీ ఆరోగ్యం గురించి తెలుసుకొనేందుకు ఆయన అభిమానులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకోగా పోలీసులు వారిని అదుపు చేశారు. ఈ నేపథ్యంలో బంధువులు, అభిమానులు, ప్రముఖులెవరూ పరామర్శల కోసం ఆస్పత్రికి రావొద్దని కుటుంబ సభ్యులు కోరారు. -
అపోలో ఫార్మసీలో అమెజాన్ ఇన్వెస్ట్మెంట్!
బెంగళూరు, సాక్షి: కోవిడ్-19 కారణంగా కొద్ది నెలలుగా ఆన్ లైన్ ఫార్మసీ రంగం జోరందుకుంది. దేశీ ఫార్మసిస్ రంగంపై కన్నేసిన గ్లోబల్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా అపోలో ఫార్మసీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అపోలో ఫార్మసీలో 10 కోట్ల డాలర్లను(సుమారు రూ. 740 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆంగ్ల మీడియా అభిప్రాయపడింది. ఇందుకు వీలుగా ఇప్పటికే ప్రారంభమైన చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. దేశీయంగా ఓవైపు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, మరోపక్క పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ ఫార్మసీ విభాగంలో విస్తరణకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అపోలో ఫార్మసీలో పెట్టుబడుల ద్వారా అమెజాన్ భారీ అడుగులు వేయాలని భావిస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. తద్వారా దిగ్గజ కంపెనీల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలియజేశారు. చదవండి: (టాటాల చేతికి 1ఎంజీ?) నెట్‌మెడ్స్ దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల ఆన్లైన్ ఫార్మసీ సంస్థ నెట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. రూ. 620 కోట్లు వెచ్చించడం ద్వారా నెట్‌మెడ్స్‌లో 60 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు ఆగస్ట్‌లోనే ఆర్ఐఎల్ వెల్లడించింది. దీంతో డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో.. ఈకామర్స్ రంగంలో ఔషధ విభాగంలోకి సైతం ప్రవేశించేందుకు వీలు కలిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే జియోమార్ట్ పేరుతో ఆన్లైన్ గ్రాసరీ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఆర్ఐఎల్ డీల్ ప్రకారం నెట్‌మెడ్స్ విలువ రూ. 1,000 కోట్లకు చేరినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. కాగా.. ఆగస్ట్ మొదటి వారంలో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్.. బెంగళూరులో ఆన్లైన్ ఫార్మసీ విక్రయాలు ప్రారంభించింది. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు అప్పట్లోనే తెలియజేసింది. చదవండి: (రిలయన్స్ చేతికి నెట్‌మెడ్స్) 1 ఎంజీ ఆన్లైన్ ఫార్మసీ కంపెనీ 1ఎంజీలో మెజారిటీ వాటా కొనుగోలుకి పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ చర్చలు నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. తద్వారా ఈ విభాగంలో ప్రధాన కంపెనీలైన మెడ్ ప్లస్, నెట్ మెడ్స్, ఫార్మజీ, 1ఎంజీ మధ్య పోటీ తీవ్రతరం కానున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. నాలుగు నెలల క్రితమే నెట్ మెడ్స్ ప్రమోటర్ కంపెనీ విటాలిక్లో రిలయన్స్ రిటైల్ 60 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇదేవిధంగా క్లౌడ్ టెయిల్‌తో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. క్లౌడ్ టెయిల్లో అమెజాన్ 24 శాతం వాటా పొందింది. దేశీయంగా నెట్‌మెడ్స్, ఫార్మ్ఈజీ, మెడ్‌లైఫ్ తదితర పలు కంపెనీలు ఆన్లైన్ ద్వారా ఔషధ విక్రయాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. -
మాజీ మంత్రి నాయినిని పరామర్శించిన సీఎం కేసీఆర్
-
నాయినిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తీవ్ర అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. బుధవారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న నాయినిని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాయిని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. సీఎం వెంట రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు. (చదవండి : నాయిని ఆరోగ్యం విషమం ) కాగా, గత నెల 28వ తేదీన కరోనా బారినపడ్డ నాయిని ఇటీవల కోలుకొని మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఆక్సిజన్ పడిపోవడంతో ఈ నెల 13న తిరిగి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ అయి న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
రోజుకు పది లక్షల వ్యాక్సిన్లు పంపిణీకి సిద్ధం : అపోలో
సాక్షి, చెన్నై: కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా అపోలో హాస్పిటల్స్ కీలక విషయాన్ని ప్రకటించింది. రోజుకు 10 లక్షల కోవిడ్-19 వ్యాక్సిన్లను ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని హాస్పిటల్ చైన్ అపోలో హాస్పిటల్స్ గ్రూప్ గురువారం తెలిపింది. కోల్డ్ చైన్ సదుపాయాలతో కూడిన 19 ఔషధ సరఫరా కేంద్రాలున్న పాన్ ఇండియా వెబ్‌ను ప్రభావితం చేస్తామని, 70 ఆస్పత్రులు, 400కి పైగా క్లినిక్‌లు, 500 కార్పొరేట్ ఆరోగ్య కేంద్రాలు, 4వేల ఫార్మసీలను కరోనా వ్యాక్సిన్ల పంపిణీకి విరివిగా ఉపయోగించుకుంటామని తెలిపింది. గరిష్ట సంఖ్యలో అత్యంత సురక్షితంగా, వేగంగా ప్రజలు వ్యాక్సిన్‌ను పొందేలా చూస్తామని అపోలో ప్రకటించింది. (రెండో వాక్సిన్ : పుతిన్ కీలక ప్రకటన) ఈ మేరకు తమ బృందం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని వర్చువల్ మీడియా సమావేశంలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభనా కామినేని ప్రకటించారు. ఇందుకు టీకా కోల్డ్ చెయిన్ ను బలోపేతం చేశామన్నారు. అత్యధిక భద్రతా ప్రమాణాలతో, రోజుకు ఒక మిలియన్ మోతాదులను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు చెప్పారు. దీనికోసం 10వేల మంది నిపుణులకు శిక్షణ ఇచ్చామని, వీరంతా దేశంలోని తమ అన్ని ఆసుపత్రులలోని ఫార్మసీలు, క్లినిక్‌లలో అందుబాటులో ఉంచుతామన్నారు. భారతదేశంలో దాదాపు 30 శాతం మంది అపోలో ఆస్పత్రులకు 30 నిమిషాల దూరంలో ఉన్నారనీ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఆసుపత్రిలో వ్యాక్సిన్ ఇచ్చే సామర్థ్యం గల నిపుణులు ఉంటారని ఆమె తెలిపారు. (వ్యాక్సిన్ : వారు 2022 వరకు ఆగాల్సిందే!) కాగా వచ్చే ఏడాది ఆరంభం నాటికి భారతదేశానికి ఒకటి కంటే ఎక్కువ కోవిడ్-19 వ్యాక్సిన్లు వచ్చే అవకాశం ఉందని, దేశవ్యాప్తంగా పంపిణీ వ్యూహాలను ప్రభుత్వం రూపొందిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతదేశంలోని ఏడు ఔషధ తయారీదారులకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీకి లైసెన్స్ మంజూరు చేసింది. ముఖ్యంగా పూణేకు చెందిన సీరం, క్యాడిల్లా, భారత్ బయోటెక్, రిలయన్స్ లైఫ్ సైన్సెస్, అరబిందో ఫార్మా, జెన్నోవా లాంటి సంస్థలకు ప్రీ క్లినికల్ ట్రయిల్స్, ఎనాలిసిస్ కు అనుమతినిచ్చింది. -
కాంతమ్మకు అభి‘వంద’నం
సాక్షి,హైదరాబాద్: అరవై ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలుండి కోవిడ్ వచ్చిన వా రు కోలుకోవడం కష్టమై చనిపోతున్నవారున్నారు. అయితే, రోగాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలన్న ఆత్మస్థైర్యం ఉంటే వందేళ్ల వయసులోనూ కోవిడ్‌ను జయించవచ్చని నిరూపిం చారు హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన డాక్టర్ లక్ష్మీకాంతమ్మ డేవిడ్. 1920లో మద్రాసులో పుట్టిన లక్ష్మీకాంతమ్మ అక్కడే మెడిసిన్‌ను పూర్తి చేసి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో వివిధ హోదాల్లో పనిచేశారు. నలభై ఏళ్ల క్రితం రిటైరయ్యారు. అప్పట్నుంచి ఇం టిపట్టునే ఉంటున్న ఆమెకు ఇటీవల దగ్గు, జ్వరంతో పాటు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఎదురైంది. కోవిడ్‌గా అనుమానిం చిన కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. (చదవండి: మిస్టర్ సీ.. జిమ్‌కి వచ్చేసీ...) ఆమెకు షుగర్,బీపీతో పాటు కిడ్నీ తదితర వ్యాధులుండటంతో డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి ఆధ్వర్యం లోని వైద్యబృందం చికిత్స అందించారు. దీంతో ఆమె కోవిడ్ నుంచి క్షేమంగా బయటపడ్డారు. గురువారం ఆమెకు వందేళ్లు రావడంతో ఆమె జన్మదినాన్ని అపోలో వైద్యుల సమక్షంలో నిర్వహించారు. నూరేళ్ల వయసులోనూ కోవిడ్‌ను జయించి లక్ష్మీకాంత మ్మ ప్రేరణగా నిలిచారని, విధిరాతకంటే మ నోసంకల్పం గొప్పదని ఆమె ఆత్మస్థైర్యాన్ని వైద్యులు ప్రశంసించారు. ఆమె కుమారుడు డేవిడ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. అమ్మకు మళ్లీ పునర్జన్మ వచ్చినట్లుగా నమ్ముతున్నామన్నారు. లక్ష్మీకాంతమ్మ రికవరీ అందరికీ ఆదర్శమని అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెల ట్వీట్ చేశారు. (చదవండి: ఆరోగ్యంగా ఉందాం) -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అపోలో భాగస్వామ్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్‌తో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అపోలో ఆసుపత్రుల్లో వైద్యానికి రూ.40 లక్షల వరకు రుణాన్ని బ్యాంకు తన కస్టమర్లకు అందిస్తుంది. అవసరమైన వెంటనే ఈ లోన్‌ను మంజూరు చేస్తారు. అపోలో 24/7 డిజిటల్ ప్లాట్‌ఫాంపై వైద్యులను ఉచితంగా సంప్రదించవచ్చు. చికిత్స విషయంలో తమ కస్టమర్లకు ప్రాధాన్యత ఉంటుందని హెచ్డీఎఫ్సీ సీఈవో, ఎండీ ఆదిత్య పురి బుధవారం మీడియాకు తెలిపారు. ఆరోగ్య, ఆర్థిక రంగంపై ఈ భాగస్వామ్యం సానుకూల ప్రభావం చూపిస్తుందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు ఉన్న 6.5 కోట్ల మంది కస్టమర్లకు ఇది ప్రయోజనమని అపోలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని తెలిపారు. -
అపోలో హాస్పిటల్స్- పనాసియా బయో స్పీడ్
మార్కెట్లు పతన బాటలో సాగుతున్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) క్యూ2 ఫలితాలపై ఆశావహ అంచనాలతో అపోలో హాస్పిటల్స్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. మరోపక్క డెంగ్యూ వ్యాధి నివారణకు రూపొందిస్తున్న వ్యాక్సిన్ తొలి రెండు దశల పరీక్షలను విజయవంతంగా ముగించినట్లు వెల్లడించడంతో హెల్త్‌కేర్ కంపెనీ పనాసియా బయోటెక్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. అపోలో హాస్పిటల్స్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్) ఫలితాలపై అశావహ అంచనాలతో అపోలో హాస్పిటల్స్ కౌంటర్ మరోసారి బలపడింది. తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 8.5 శాతం దూసుకెళ్లి రూ. 1,974ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 7 శాతం లాభంతో రూ. 1,948 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది క్యూ1లో నిపుణులు రూ. 110 కోట్ల నష్టాన్ని అంచనా వేయగా.. అపోలో హాస్పిటల్స్ కేవలం రూ. 43 కోట్ల నికర నష్టం ప్రకటించింది. లాక్‌డవున్‌ల కాలంలోనూ ఈ ఫలితాలు ప్రోత్సాహాన్నివ్వడంతో గత రెండు వారాల్లో 21 శాతం ర్యాలీ చేసినట్లు నిపుణులు తెలియజేశారు. పనాసియా బయోటెక్ డెంగీఆల్ పేరుతో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తొలి రెండు దశల పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు ఫార్మా కంపెనీ పనాసియా బయోటెక్ తెలియజేసింది. ఈ పరీక్షలలో మొత్తం నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌లకు వ్యతిరేకంగా యాంటీబాడీలు యాక్టివేట్ అయినట్లు వివరించింది. తద్వారా ఎలాంటి ఇతర సమస్యలూ ఎదురుకాలేదని తెలియజేసింది. సింగిల్ డోసేజీ ద్వారా పరీక్షించిన 80-95 శాతం మందిలో మంచి రెస్పాన్స్ కనిపించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో పనాసియా బయో షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 9.40 ఎగసి రూ. 198 ఎగువన ఫ్రీజయ్యింది. -
కరోనాతో కంగారు వద్దు.. మొదటి దశ సురక్షితం
సాక్షి, చెన్నై : కరోనా వైరస్ సోకిందని కంగారుపడాల్సిన అవసరం లేదు, కనీస అప్రమత్తతను పాటిస్తే కరోనాను సులువుగా జయించవచ్చని అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, బర్డ్ ఆస్పత్రి (తిరుపతి) డైరెక్టర్ డాక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పాజిటివ్ బారినపడగానే ప్రాణం పోదనే ధైర్యాన్ని తెచ్చుకోవాలి. కరోనాకు భయపడకూడదు, మనమే కరోనాను భయపెట్టి తరిమికొట్టాలని చెప్పారు. కరోనా వైరస్‌పై లేనిపోని అపోహలు, పాజిటివ్ వస్తే ప్రాణం పోవడం ఖాయమనే అనసర భయాందోళనలు, దీంతో కొందరు బలవన్మరణాలకు పాల్పడడం వంటి దయనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో చెన్నై అన్నానగర్‌లోని సన్వే క్లినిక్‌లో గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. ఒక కరోనా వైరస్సే కాదు ఏ వ్యాధినైనా నిర్లక్ష్యం చేస్తే ప్రాణం మీదకు వస్తుంది. వ్యాధిని ప్రాథమిక దశ లోనే గుర్తించడం, తగిన చికిత్స తీసుకోవడం తప్పనిసరి. అయితే కరోనా విషయంలో మరికొంత అదనపు అప్రమత్తత అవసరం. కరోనా గురించి ప్రత్యేకంగా భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. పాజిటివ్ బారినపడిన వారిని ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చనే భరోసా వైద్యరంగానికి కలిగింది. కోవిడ్–19 భారత్‌లోకి ప్రవేశించిన కొత్తల్లో కోవిడ్–19 కేవలం శ్వాసను మాత్రమే దెబ్బతీస్తుందని వైద్యరంగం భావించింది. రోగులకు చికిత్స చేసేకొద్దీ కాలక్రమేణా ఎంతో క్లారిటీ వచ్చింది. కరోనా ముదిరితే రక్తనరాలు దెబ్బతినడం, రక్తం కలుషితం కావడం, క్రమేణా ఆక్సిజన్ క్యారీ సామర్థ్యాన్ని తగ్గించడం ద్వారా ప్రాణాపాయ స్థితికి తీసుకెళుతుందని తేలింది. ఆ రెండు దశల్లోనే అదుపు సాధ్యం: కరోనా వైరస్ వ్యాప్తిని రెండు దశలుగా విభిజించాల్సి ఉంటుంది. తొలి దశను వైద్యపరిభాషలో వైరిమియా అంటారు. ఈ దశలో జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు రుగ్మతలతోపాటూ రుచి, వాసన శక్తిని కోల్పోవడం కరోనా లక్షణాలు. మానవ శరీరంలో సహజంగా ఇమిడిఉండే రోగ నిరోధక వ్యవస్థ మూడు నుంచి ఐదు రోజుల్లో రోగిని కోలుకునేలా చేస్తుంది. లేదా పారాసిటమాల్ వంటి మాత్రలను తీసుకోవడం ద్వారా ఇంటిలోనే నయం చేసుకోవచ్చు. ఐదురోజులు దాటినా నయం కాకుంటే కోవిడ్–19 పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. తొలి దశలోనే చికిత్స తీసుకుంటే రోగి ఇతరత్రా ఆరోగ్యసమస్యలను బట్టి పూర్తిగా కోలుకునే అవకాశాలు 90 శాతం వరకు ఉంటాయి. రెండోదశలోనూ మెరుగైన అవకాశాలు: ఇక రెండో దశలోనే అసలైన కరోనా వైరస్ వ్యాధిని రోగి అధికంగా ఎదుర్కొంటాడు. జ్వరం తగ్గకపోవడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, సహజంగా ఉండాల్సిన 95 నుంచి వందశాతం ఆక్సిజన్ క్యారీ సామర్థ్యం 85 శాతానికి పడిపోవడం దీని ప్రధాన లక్షణాలు. అయినా రోగి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. యాంటీ వైరల్ ట్రీట్మెంట్తో రక్షించవచ్చు. రోగిని బోర్లాపడుకోబెట్టి ముక్కు ద్వారా ఆక్సిజన్, డెక్సామెథాసొనె ఇంజక్షన్ ఇచ్చి రక్తనాళాలు చిట్లిపోకుండా అరికట్టవచ్చు. ఈ వైద్యవిధానంతో రికవరీ రేట్ పెరిగినట్లు గుర్తించాంపాజిటివ్ నుంచి కోలుకున్న వారు నుంచి సేకరించిన ప్లాస్మా కణాలను రోగికి ఎక్కించడం ద్వారా నయం చేసే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. రెండో దశలోకి రాకుండా జాగ్రత్తలు పాటించాలి లేదా రెండో దశలోకి ప్రవేశించగానే చికిత్స తీసుకున్నపుడే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ. వీరంతా జాగ్రత్త పొగతాగేవారు, కేన్సర్, షుగర్, అవయవాల మార్పిడి చేయించుకున్నవారు, స్థూలకాయం కలిగిన వారు అదనపు జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యం. బాహ్యప్రపంచంలో తిరగడం పురుషుల్లోనే ఎక్కువ కావడం వల్ల మరణాలు కూడా వారిలోనే ఎక్కువగా ఉన్నాయి. వైద్య చికిత్స ఎంత ముఖ్యమో రోగి భయానికి లోనుకాకుండా ఉండడం అంతే ముఖ్యం. కేవలం భయంతో ప్రాణాలు తీసుకునే వారి సంఖ్య పదిశాతం వరకు ఉంది. -
లీజును రద్దు చేయొచ్చు
సాక్షి, హైదరాబాద్: పేద రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తామనే షరతుతో ప్రభుత్వం నుంచి రాయితీ పద్ధతిలో భూమిని లీజుకు తీసుకుని.. షరతులను ఉల్లంఘించిన ప్రైవేటు ఆసుపత్రుల భూమి లీజును రద్దు చేయొచ్చని హైకోర్టు సూచించింది. ఆ భూమిని స్వాధీనం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అపోలో, బసవతారకం కేన్సర్ ఆసుపత్రులు ప్రభుత్వం నుంచి రాయితీ పద్ధతిలో భూమిని లీజుకు తీసుకుని పేదలకు ఉచితంగా వైద్యం చే యాలన్న నిబంధనను ఉల్లం ఘించాయంటూ రిటైర్డ్ ఉద్యోగి ఓఎం దేబరా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ రెండు ఆసుపత్రుల్లో పేదలెవరికీ ఉచితంగా వైద్యం చేయడం లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు నివేదించారు. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామనే విషయాన్ని వెబ్సైట్లో కూడా పేర్కొనలేదని వివరించారు. ‘ప్రైవేటు ఆసుపత్రుల తీరు దారుణంగా ఉంది. లక్షల్లో డబ్బు లు కడితేనే శవాలను ఇస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు’అని ఈ సందర్భంగా ధర్మాసనం మండిపడింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వంతో పాటు అపోలో, బసవతారకం ఆ సుపత్రుల యాజమాన్యాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను 13కు వాయిదా వేసింది. అపోలో 15%, బసవతారకం 25% బెడ్లు ఇస్తామన్నాయి.. ‘జూబ్లీహిల్స్‌లో అపోలో ఆసుపత్రికి ఎకరాకు రూ.8,500 చొప్పున 30 ఎకరాలను 1985లో ప్రభుత్వం విక్రయిస్తూ జీవో జారీ చేసింది. అయితే 15 శాతం బెడ్లను పేద రోగులకు కేటాయించి వారికి ఉచితంగా వైద్యం చేయాలనే షరతు పెట్టింది. ప్రభుత్వం కేటా యించిన ఈ భూమి విలువ దాదాపు రూ.1,500 కోట్లు. గత 30 ఏళ్లుగా పేదలకు ఇక్కడ వైద్యం అందడం లేదు. ఇటు 1989లో బంజారాహిల్స్‌లో 7.35 ఎకరాలను నందమూరి బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి లీజు పద్ధతిలో ప్రభుత్వం కేటాయించింది. 1,000 బెడ్లతో అక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. ఆ భూమి విలువ దాదాపు రూ.400 కోట్లు. ఆస్పత్రిలో 25 శాతం బెడ్లను పేదలకు కేటాయించాలన్న నిబంధన ఉంది. అయినా ఎప్పుడూ పేదలకు ఉచితంగా వైద్యం అందించిన దాఖలాలు లేవు’అని పిటిషనర్ వ్యాజ్యంలో పేర్కొన్నారు. -
అపోలోకు పద్మారావు
సాక్షి, హైదరాబాద్: హోం క్వారంటైన్లో ఉన్న రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తిగుళ్ల పద్మారావుగౌడ్‌ను మరిం త మెరుగైన వైద్యసేవల కోసం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. పద్మారావుతోపాటు నలుగురు కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. మూడు రోజులుగా హోంక్వారంటైన్లో ఉన్న ఆయనను శుక్రవారం అపోలో ఆస్పత్రికి తరలించి ప్రత్యేకగదిలో వైద్యం అందిస్తున్నారు. కాగా, డిప్యూటీ స్పీకర్ పద్మారావును సీఎం కేసీఆర్ శుక్రవారం ఫోన్ ద్వారా పరామర్శించారు. డిశ్చార్జయిన మహమూద్ అలీ కరోనాతో ఆసుపత్రిలో చేరిన హోం మంత్రి మహమూద్ అలీ శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. ఆయనతో పాటు కుమారుడు, మనవడు కూడా డిశ్చార్జి అయ్యారు. జూన్ 28న మహమూద్ అలీతోపాటు, ఆయన కుమారుడు, మనవడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జూబ్లీహిల్స్ అపోలోలో చేరిన వారంతా ప్రస్తుతం డిశ్చార్జి అయ్యారు. ఇకపై హోంక్వారంటైన్లోనే ఉంటూ చికిత్స పొందనున్నారు. -
ఇంకా చాలా సాధించాలి: ఉపాసన
సాక్షి, సిటీబ్యూరో: విభిన్న రంగాల్లో చెప్పుకోదగిన విజయాలు సాధిస్తున్నప్పటికీ.. తన లక్ష్యాల జాబితా చాలా పెద్దదని చెప్పారు అపోలో లైఫ్ వైస్ చైర్పర్సన్, సినీనటుడు రామ్‌చరణ్ అర్ధాంగి ఉపాసన కామినేని. నగరానికి చెందిన ఔత్సాహిక మహిళా వ్యాపార వేత్తలకు చెందిన ఫిక్కి ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో గురువారం ‘ఫ్రీడమ్ టు బీ మి’ అనే అంశంపై వర్చువల్ సదస్సును ఆన్లైన్ వేదికగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఫిక్కి మహిళా సభ్యులకు, అతిథిగా హాజరైన ఉపాసనకు మధ్య టీవీ యాంకర్ స్వప్న అనుసంధాన కర్తగా వ్యవహరించారు. విభిన్న రంగాల్లో రాణిస్తూ తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే ఫిలాంత్రపిస్ట్ పురస్కారం కూడా అందుకున్న ఉపాసన తాను మరిన్ని లక్ష్యాల సాధనకు ఇంకా ఎంతో శ్రమించాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమెతో ఫిక్కి సభ్యుల ముచ్చట్లు ఆసక్తి కరంగా సాగాయి. కార్యక్రమంలో ఫిక్కి ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చాప్టర్ చైర్ పర్సన్ ఉషశ్రీ మన్నె పాల్గొని మాట్లాడారు.(శభాష్ ఉపాసనా..) -
అటు చికిత్సలు.. ఇటు పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటులో కరోనా వైద్యం, నిర్ధారణ పరీక్షలపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్య చికిత్సకు పచ్చజెండా ఊ పుతూ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు మార్గదర్శకాలివ్వగా, ప్రైవేటు ల్యాబొరేటరీల్లో నిర్ధారణ పరీక్షలకు అనుమతిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ తర్జనభర్జన పడుతోంది. దీనిపై రెండు రకాల ప్ర ణాళికలను తయారు చేసినట్టు వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన కీలక అధికారులు చెబుతున్నా రు. అనుమతిస్తే ఏం చేయాలి? లేకుంటే ఏంట న్న దానిపై ఈ రెండు ప్రణాళికలు సిద్ధంగా ఉ న్నాయి. కొందరు వైద్యాధికారులు మాత్రం హై కోర్టు తీర్పును గౌరవించి ప్రైవేటు, కార్పొరేట్ ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడమే మంచిదని అంటున్నారు. కొందరేమో అలా అ నుమతిస్తే దుర్వినియోగం జరుగుతుందేమోనని, అనవసరంగా పరీక్షలు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. అంతేగాక పాజిటివ్ వచ్చిన వారిని, వారి కాంటాక్టులను పట్టుకోవడంలో ప్రభుత్వ పట్టు పోతుందన్న భావన కూడా నెలకొంది. ఈ రెండు అంశాలపైనే ఇప్పుడు తర్జనభర్జన పడుతున్నారు. త్వరలో దీని పై ఒక నిర్ణయం తీసుకుంటామని ఒక కీలకాధికారి తెలిపారు. ఈ నేపథ్యంలోనే నిర్ణీత ప్రైవేటు ల్యాబొరేటరీలకు ఒకవేళ కరోనా టెస్టులకు అనుమతినిస్తే, కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. ఇతర సాధారణ వైద్య పరీక్షల విషయంలో పలువురు ప్రైవే టు ల్యాబ్‌లకు వెళ్లి తమకు అవసరమైన చెకప్ లు సొంతంగా చేయించుకుంటున్నారు. వాటిని డాక్టర్లకు చూపించి వైద్యం చేయించుకుంటున్నా రు. ఆయా పరీక్షల్లో నెగిటివ్ వస్తే కొందరు డాక్టర్లను కూడా సంప్రదించడం లేదు. కానీ కరోనా పరీక్షల విషయంలో జ్వరం, జలుబు, దగ్గు వం టి అనుమానాలతో ఎవరికి వారు సొంతంగా ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లి పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించొద్దని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. కరోనా అనుమానిత వ్యక్తులు నేరుగా ల్యాబొరేటరీకి కాకుండా, వారు తప్పక ఆసుపత్రుల్లో చేరాల్సిందేనని, అక్కడి డాక్టర్ల సూచన మేరకు మాత్రమే ప్రైవేటు ల్యాబ్‌లు పరీక్షలు చేయాలన్న షరతు విధించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఎవరికివారు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం, వారికి పాజిటివ్ లేదా నెగిటివ్ వచ్చినా తమకు ఆ సమాచారం తెలియకపోతే, వారిని వారి కాంటాక్టులను గుర్తించడంలో సమస్యలు వస్తాయన్న భావనతోనే ఈ నిర్ణయం తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. ఇక చికిత్సలు ఇప్పటికే అనేక ప్రైవేటు, కార్పొరే ట్ ఆసుపత్రుల్లో మొదలయ్యాయని వైద్య, ఆరో గ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే వాటి ల్లో నిర్వహించే చికిత్సలకు ఫీజులను ఖరారు చే యాల్సి ఉందని, దీనిపైనా ఒక నిర్ణయం తీసుకో వాలని భావిస్తున్నట్లు ఒక అధికారి వ్యాఖ్యానిం చారు. సోమవారం జరిగిన సమావేశంలోనూ ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. రోజుకు 2,700 పరీక్షలు.. ప్రస్తుతం రాష్ట్రంలో 10 ప్రభుత్వ ఆధ్వర్యంలోని బోధనాసుపత్రులు, సంస్థల్లో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇకపై ప్రైవేటు ల్యాబొరేటరీ లు తోడైతే పరీక్షల సామర్థ్యం మరింత పెరగనుందని వైద్య, ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఐసీఎంఆర్ రాష్ట్రంలో 13 ప్రైవేటు ఆ సుపత్రులు, వాటికి సంబంధించిన ల్యాబ్‌లు, ఇతర డయాగ్నస్టిక్ సెంటర్లకు కరోనా నిర్ధారణ పరీక్షలకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో పరీక్షలు చేస్తున్న నేపథ్యంలో ప్రైవేటుకు అనుమతి ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సామర్థ్యానికి మించి పరీక్షలు చేయాల్సి వచ్చినప్పుడే ప్రై వేటు రంగంలో నిర్ధారణ పరీక్షలు చేసే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వ భావన. ఇంతలో హై కోర్టు తీర్పుతో ఐసీఎంఆర్ అనుమతిచ్చిన ప్రైవే టు ల్యాబొరేటరీల్లో పరీక్షలపై ఇంకా స్పష్టత రా వాల్సి ఉంది. ఒకవేళ వాటికీ ప్రభుత్వం అనుమతిస్తూ మార్గదర్శకాలు జారీచేస్తే, మొత్తం ప్రభు త్వ, ప్రైవేటుల్లో 23 చోట్ల కరోనా నిర్ధారణ పరీక్ష లు చేసే వీలు కలుగుతుంది. అన్నింటా కలిపి రోజుకు 2,300 నుంచి 2,700 వరకు కరోనా పరీక్షలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఐసీఎంఆర్ అనుమతి పొందినవి ఏంటంటే.. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఫీవర్ ఆసుపత్రి, నిమ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ, సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్, వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో సీబీ నాట్ పద్ధతిలో నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. సీబీ నాట్ ద్వారా సాధారణంగా క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. కానీ దాన్ని ఇప్పుడు కరోనా నిర్ధారణ పరీక్షలకు ఉపయోగిస్తున్నారు. ఇక 13 ప్రైవేటు ల్యాబొరేటరీలు, ఆసుపత్రులకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అవి.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలోని ల్యాబొరేటరీ సర్వీసెస్, హిమాయత్‌నగర్‌లోని విజయ డయాగ్నస్టిక్ సెంటర్, చర్లపల్లిలోని వింటా ల్యాబ్స్, సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్, పంజగుట్టలోని డాక్టర్ రెమిడీస్ ల్యాబ్స్, మేడ్చల్‌లోని పాథ్‌కేర్ ల్యాబ్స్, శేరిలింగంపల్లిలోని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సైన్సెస్, సికింద్రాబాద్ న్యూబోయిన్‌పల్లిలోని మెడిక్స్ పాథ్‌ల్యాబ్స్, సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాబ్ మెడిసిన్, మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఎన్ఆర్ఐ కాలనీలోని బయోగ్నోసిస్ టెక్నాలజీస్, బంజారాహిల్స్‌లోని జర్నలిస్ట్ కాలనీలోని టినెట్ డయాగ్నస్టిక్స్, ఏఐజీ (ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్టో ఎంటరాలజీ) లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి అవకాశముంది. అలాగే ట్రూనాట్ పద్ధతిలో బంజారాహిల్స్ స్టార్ ఆసుపత్రిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాబ్ మెడిసిన్‌లో పరీక్షలు చేయవచ్చు. ఆ మేరకు వాటికి ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. వాటిల్లో కరోనా నిర్ధారణకు ఫీజు ఎంత ఉండాలన్న దానిపై గతంలోనే కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఒక్కో కరోనా పరీక్షకు రూ.4,500 వరకు వసూలు చేసుకోవచ్చని కేంద్రం గతంలో తెలిపింది. అనుమతిస్తే ఆ ప్రకారమే కరోనా నిర్ధారణ పరీక్ష ఫీజు వసూలు చేసే అవకాశముంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలోని ఆరోగ్యశ్రీ పరిధిలోని పేదలకు, ఈజేహెచ్ఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, జర్నలిస్టులకు, ఇతర మెడికల్ స్కీంలలో ఉండే వారికి ఉచితంగా చేస్తారా లేదా కూడా తెలియాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
అపోలో ఫీవర్ క్లినిక్స్ ప్రారంభం
న్యూఢిల్లీ: కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్స్‌ను ప్రారంభించినట్లు అపోలో హెల్త్ అండ్ లైఫ్స్టయిల్లో భాగమైన అపోలో క్లినిక్స్ వెల్లడించింది. జ్వరాలు, తత్సంబంధిత లక్షణాల గురించి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొంది. తొలి దశలో హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు నగరాల్లో 21 క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. తర్వాతి వారంలో వీటిని 50కి పెంచనున్నట్లు వివరించారు. ప్రత్యేక ఫీవర్ క్లినిక్స్‌లో ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉంటాయని తెలిపారు. -
మందులు ఎగురుకుంటూ వస్తాయ్!
మన దేశంలో డ్రోన్ల ద్వారా వైద్య సేవలను అందించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలవనుంది. డ్రోన్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు మందులు, డయాగ్నస్టిక్ శాంపిల్స్ సేవలను అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ మారుట్ డ్రోన్స్, అపోలో ఆస్పత్రుల మధ్య ఒప్పందం కుదిరింది. బేగంపేటలో జరుగుతున్న వింగ్స్ ఇండియా–2020 కార్యక్రమంలో మెడికల్ డ్రోన్ ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా మారుట్ డ్రోన్స్ ఫౌండర్ అండ్ సీఈఓ వీ ప్రేమ్ కుమార్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో ప్రత్యేకంగా మాట్లాడారు. మెడికల్ డ్రోన్ ఎలా పని చేస్తుందో ఆయన మాటల్లోనే.. – హైదరాబాద్, బిజినెస్ బ్యూరో డ్రోన్లు ఎక్కడ ఉంటాయంటే? ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు, బ్లడ్ బ్యాంకుల్లో మారుట్ డ్రోన్స్ ఉంటాయి. ఆర్డర్ రాగానే ఇక్కడి డ్రోన్స్‌లో సంబంధిత సిబ్బంది మందులను అమర్చితే డ్రోన్లు టేకాఫ్ అవుతాయి. 8 నిమిషాల్లో 12 కిలోమీటర్ల దూరం డ్రోన్లు ప్రయాణిస్తాయి. ఎవరికి సేవలందిస్తారంటే? గ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజలకు, రోడ్లు, రవాణా సౌకర్యం సరిగా లేని మారుమూల ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా మందులను సరఫరా చేస్తారు. వర్షా కాలంలో, రాత్రి సమయాల్లో ఆయా మారుమూల ప్రాంతాలకు వెళ్లటం కష్టం కాబట్టి ఇక్కడి ప్రజలకు డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందిస్తారు. రోడ్డు ప్రమాదాలు, గర్భిణిలు, పాము కాటు, గుండెపోటు వంటి అత్యవసర రోగులకు మందులను సరఫరా చేస్తారు. ఈ డ్రోన్ల ద్వారా రక్తం, వ్యాక్సిన్స్, డయాగ్నస్టిక్ శాంపిల్స్, దీర్ఘకాలిక ఔషధాలను సరఫరా చేస్తారు. మెడికల్ అవసరాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అపోలో ఆస్పత్రితో ఒప్పందం చేసుకుంది. డ్రోన్ ఎలా పని చేస్తుందంటే? ఇవి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనుసంధానిత డ్రోన్స్. దీన్ని మొబైల్ యాప్ ద్వారా నియంత్రణ చేస్తారు. ఓలా, ఉబర్లు ఎలాగైతే గమ్య స్థానాన్ని మ్యాప్‌లో చూపిస్తాయో అలాగే ఈ డ్రోన్స్ మ్యాప్స్ ఆధారంగా గమ్య స్థానానికి చేరుకుంటుంది. అంతేకాదు మందులను బుక్ చేయగానే వచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తేనే మందు లు డెలివరీ అవుతాయి. దీంతో సరైన మనిషికే మందులు అందుతాయన్న మాట. డ్రోన్ ఎంత దూరంలో ఉంది? ఎంత సమయం పడుతుంది? వంటి సమాచారం లైవ్‌లో కనిపిస్తుంటుంది. దీంతో రోగికి ఒత్తిడి తగ్గుతుంది. ‘మెడికల్ డ్రోన్స్ సాంకేతికత మీద ఏడాది కాలంగా పని చేస్తున్నాం. సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు’ప్రేమ్ కుమార్ తెలిపారు. డ్రోన్‌కు అమర్చేందుకు మెడికల్ కిట్ సిద్ధం చేస్తున్న దృశ్యం డ్రోన్లతో దోమల నిర్మూలన! గతంలో మారుట్ డ్రోన్స్ జీహెచ్ఎంసీ భాగస్వామ్యంతో మియాపూర్, రాయదుర్గంలోని చెరువుల్లో దోమ మందులను పిచికారి చేసింది. సిరిసిల్ల జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా డ్రోన్ల సహాయంతో సీడ్ బాల్స్‌లను నాటింది. మస్కిటో డ్రోన్స్‌లోని ఏఐ సాంకేతికత పిచికారితో పాటు దోమల సంఖ్య, లార్వా లెక్కింపు, దోమల జాతి, లింగ బేధాలు వంటి రియల్ టైం నివేదికలను కూడా అందిస్తుంది. గంటకు 6 ఎకరాలకు పిచికారి చేస్తుంది. ప్రస్తుతం మూసీ పరీవాహక ప్రాంతంలో 52 కిలోమీటర్లు, తెలంగాణలోని 70 చెరువుల్లో యాంటి లార్వా అరాడికేషన్‌ను ప్రాజెక్టులను చేపట్టామని ప్రేమ్‌కుమార్ తెలిపారు. డ్రోన్ ద్వారా వచ్చిన మెడికల్ కిట్ తీసుకుంటున్న దృశ్యం -
అపోలో హాస్పిటల్స్ లాభం 80 శాతం అప్
న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019–20) డిసెంబర్ క్వార్టర్లో 80% ఎగసింది. గతేడాది (2018–19) క్యూ3లో రూ.50 కోట్లుగా ఉన్న లాభం ఈ క్యూ3లో రూ.90 కోట్లకు పెరిగిందని అపోలో హాస్పిటల్స్తెలిపింది. అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరచడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపనీ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. కార్యకలాపాల ఆదాయం రూ.2,495 కోట్ల నుంచి రూ.2,912 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.3.25 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. -
ఐ యామ్ పాజిబుల్ పుస్తకావిష్కరణ
-
వైద్యానికి రూ.4 లక్షల వరకు రుణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ గ్రూప్, ఆర్థిక సేవల సంస్థ బజాజ్ ఫిన్సర్వ్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇరు సంస్థలు కలిసి అపోలో హాస్పిటల్స్–బజాజ్ ఫిన్సర్వ్ హెల్త్ ఈఎంఐ కార్డును ప్రవేశపెట్టాయి. వైద్య సేవలకు అయిన వ్యయాన్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించేందుకు ఈ కార్డు వీలు కల్పిస్తుంది. ఆసుపత్రిలో ముందస్తు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. రూ.4 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. 12 నెలల్లో ఈ మొత్తాన్ని బజాజ్ ఫిన్సర్వ్కు వెనక్కి చెల్లించాల్సి ఉంటుంది. కార్డుదారుకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీతోపాటు డిస్కౌంట్ వోచర్స్, కూపన్స్ ఆఫర్ చేస్తారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పాన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాన్సల్డ్ చెక్కు సమర్పించి ఈ కార్డు పొందవచ్చు. ఒప్పందం నేపథ్యంలో అపోలో ఆసుపత్రుల్లో ప్రత్యేక కౌంటర్లను బజాజ్ ఫిన్సర్వ్ ఏర్పాటు చేయనుంది. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి, ఎండీ సునీతా రెడ్డి, బజాజ్ ఫైనాన్స్ ఎండీ రాజీవ్ జైన్, ఇరు సంస్థల ప్రతినిధులు ఈ కార్డును ఆవిష్కరించారు. కాగా, అపోలో టెలిహెల్త్ సర్వీసెస్ మలేషియాలో ఈ ఏడాది డిసెంబరు నాటికి 100 టెలి క్లినిక్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు టెలిహెల్త్కేర్ మలేషియాలో ఒప్పందం చేసుకుంది. -
మెడికల్ టూరిజంతో ఎకానమీకి ఊతం..
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో అందుబాటు ధరల్లో వైద్య సేవలందించే మెడికల్ టూరిజం కేంద్రంగా భారత్ ఎదగనుందని, దేశ ఎకానమీకి ఈ విభాగం తోడ్పాటు గణనీయంగా ఉండబోతోందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో తమ పోర్ట్‌ఫోలియోలో ఇది కూడా కీలకం కానుందని ఆమె తెలిపారు. శరవేగంగా వృద్ధి చెందుతున్న ఈ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రత్యేకంగా అంతర్జాతీయ పేషంట్ల విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో దీని ద్వారా దాదాపు 2 లక్షల మంది రోగులకు చికిత్స అందించినట్లు వివరించారు. ఎక్కువ మంది ప్రధానంగా క్యాన్సర్, అవయవ మార్పిడి, ఆర్థోపెడిక్స్, న్యూరోసర్జరీ, హృద్రోగాలు మొదలైన సమస్యల చికిత్స కోసం వస్తున్న వారు ఉంటున్నారని సంగీతా రెడ్డి చెప్పారు. ముఖ్యంగా నేపాల్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాక్, కెన్యా, నైజీరియా, ఇథియోపియా, ఒమన్, యెమెన్, ఉజ్బెకిస్తాన్, మయన్మార్ తదితర దేశాల నుంచి అంతర్జాతీయ పేషంట్లు వస్తున్నారని ఆమె తెలిపారు. -
సోదరుడిని పరామర్శించిన రజనీకాంత్
కర్ణాటక, యశవంతపుర : నటుడు రజనీకాంత్ బుధవారం బెంగళూరు వచ్చారు. శేషాద్రిపురంలోని అపోలో ఆస్పత్రిలో సోదరుడు సత్యనారాయణ రావు గైక్వాడ్‌కు ఇటీవల మోకాలి చిప్ప మార్పిడి శస్త్ర చికిత్సజరిగింది. ఈనేపథ్యంలో రజనీకాంత్ వచ్చి ఆయన్ను పరామర్శించారు. కాగా రజనీకాంత్‌ను చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అస్పత్రి వద్ద కోలాహలం నెలకొంది. అభిమానులు, వైద్య సిబ్బంది, వైద్యులు రజనీకాంత్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. -
‘నేను కేన్సర్‌ని జయించాను’
సోమాజిగూడ: సినీ జీవితంలో హీరోహీరోయిన్లుగా తాము నటిస్తామని, కానీ కేన్సర్‌ను జయించి విజేయులైన మీరే నిజమైన హీరోలని హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ అన్నారు. అపోలో ఆస్పత్రి కేన్స్‌ర్ వైద్యుడు డాక్టర్ పాలకొండ విజయ్ ఆనంద్‌రెడ్డి రచించిన ‘ఐ యామ్ సర్వైవర్’ ఆంగ్ల పుస్తకాన్ని ‘నేను కేన్సర్‌ని జయించాను’ తెలుగు అనువాదాన్న్సాదివారం హోటల్ ఐటీసీ కాకతీయలో రకుల్ ప్రీత్‌సింగ్ ఆవిష్కరించి మాట్లాడారు. అనంతరం కేన్సర్ బాధితురాలు చిన్నారి శ్రావణ సంధ్యతో కేకును కట్ చేయించారు. డాక్టర్ విజయ ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ.. కేన్సర్ వ్యాధి నిర్థారణకు రాక ముందే వారిలో ఆందోళన, భయం పెరుగుతోందని, తాను ఎన్నో రకాల కేన్సర్లతో భయపడేవారిని చూశానన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న డాక్టర్ విజయ్ ఆనంద్‌రెడ్డి, రకుల్‌ప్రీత్ సింగ్,వెంకటపతి రాజు, అపోలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతారెడ్డి వారి భయాన్ని పోగొట్టేందుకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కేన్సర్ వస్తే మరణిస్తామన్న అపోహ చాలామందిలో ఉందని, ఈ వ్యాధి జయించి విజేయులైన 108 మంది జీవితాలను పుస్తక రూపంలో తెచ్చినట్టు చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న భారత మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు క్రికెటర్ యువరాజ్ సింగ్ వీడియోను ఆవిష్కరించి ప్రసంగించారు. అపోలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, తెలుగు అనువాదకులు డాక్టర్ దుర్గంపూడి చంద్రశేఖరరెడ్డి, డాక్టర్ గోవిందరాజు చక్రధర్, ఎమెస్కో అధినేత విజయ్‌కుమార్, ప్రొఫెసర్ రఘురామరాజు, డాక్టర్ కౌశిక్ భట్టాచార్య మాట్లాడారు. అనంతరం కేన్సర్ వ్యాధిని జయించిన భావన, ఆదిలక్ష్మి, సుజాత వారి మనోగతాన్ని వివరించారు. -
వైద్య సేవకు ‘కమీషన్’
పల్లెల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందించినట్టే పట్టణాల్లో సైతం సాధారణ జబ్బులకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అర్బన్ హెల్త్ సెంటర్స్ (యూహెచ్‌సీలు) వైద్యం మాట ఎలా ఉన్నా నిర్వహణ పేరుతో గత ప్రభుత్వ పాలకులు ప్రైవేట్ అపోలో సంస్థకు దోచి పెట్టేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ రూపంలో అప్పటి టీడీపీ పెద్దలు భారీగా కమీషన్లు దోచుకున్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బందితో పాటు, వైద్య శాఖాధికారులు వ్యతిరేకించినా కమీషన్లకు కక్కుర్తి పడి నాటి టీడీపీ ప్రభుత్వం బలవంతంగా వీటిని కార్పొరేట్ సంస్థ అయిన అపోలోకి అప్పగించింది. నాటి నుంచి దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతోంది. సాక్షి, నెల్లూరు: పట్టణ ఆరోగ్య కేంద్రాలను 2000 సంవత్సరంలో ప్రారంభించారు. జిల్లా కేంద్రమైన నెల్లూరులో 8, కావలిలో 3 గూడూరులో 1 వంతున ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. ఇటీవల వెంకటగిరిలో మరో పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాలో 13 కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిని మొదట్లో ఏజెన్సీలు నిర్వహించేవి. సిబ్బంది వెంగళరావు నగర్లో ఖాళీగా ఉన్న పట్టణ ఆరోగ్యకేంద్రం మొత్తం వైద్య, ఆరోగ్యశాఖ అధీనంలో ఉండేవారు. 2016లో అపోలో యాజమాన్యం కిందకు.. నాటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో ఉన్న పట్టణ కేంద్రాలను అపోలో కార్పొరేట్ వైద్యశాలకు, ధనుష్ సంస్థకు అప్పగించింది. అందులో నెల్లూరు జిల్లాలో ఉన్న 13 ఆరోగ్య కేంద్రాలు అపోలో యాజమాన్యం కిందకు వచ్చాయి. ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బంది వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం లెక్క చేయకుండా అపోలోకి అప్పగించింది. దోపిడీకి స్కెచ్ అపోలో సంస్థకు అప్పగిస్తే నాణ్యమైన వైద్య సేవలందుతాయని టీడీపీ ప్రభుత్వం నమ్మబలికింది. కొన్ని రకాల రక్త పరీక్షలు చేస్తారని, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ టెలీ మెడిసిన్ పద్ధతిలో పర్యవేక్షిస్తారని చెప్పింది. నాణ్యమైన వైద్య సేవల పేరుతో దోపిడీకి స్కెచ్ వేసింది. అంతకు ముందు ఆస్పత్రి నిర్వహణకు నెలకు కేవలం రూ.70 వేలు మాత్రమే ఇచ్చేవారు. అదే అపోలోకి అప్పగించగానే నెలకు రూ.4.30 లక్షలకు పెంచేశారు. ఈ డబ్బంతా అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి చెందుతోంది. ఇందులో ఒక్కో ఆస్పత్రి నుంచి నెలకు రూ.ఒక్క లక్ష చొప్పున నాటి టీడీపీ పాలకులకు కమీషన్ల రూపంలో దండుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అంటే నెలకు ఒక్క నెల్లూరు జిల్లా నుంచి రూ.13 లక్షలు సంవత్సరానికి రూ.1.56 కోట్లు కమీషన్లు టీడీపీ నేత విమర్శలు వచ్చాయి. ఒక్క జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక 110 మున్సిపాలిటీల్లో ఎలా ఎంత దండుకున్నారో అర్థమవుతోంది. జీతం బెత్తెడు.. చాకిరీ బారెడు అపోలో యాజమాన్యం కిందకు ఆరోగ్య కేంద్రాలు రాగానే వాచ్మెన్ సూపర్వైజర్ను తొలగించారు. ఒక్క ల్యాబ్ టెక్నీషియన్‌ను నియమించారు. ఒక్క ఆస్పత్రిలో ఇద్దరు ఏఎన్ఎంలు, సీఓ, డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, స్వీపర్ మాత్రమే ఉండేటట్లు చేశారు. సిబ్బందికి కనీసం జీతం పెంచలేదు. పలు రకాల రికార్డులు రాయిస్తూ గొడ్డు చాకిరి చేయిస్తున్నారు. గతంలో మధ్యాహ్నం 2 గంటల వరకే ఓపీ కొనసాగేది. ప్రస్తుతం రెండు పూటలా ఓపీ నిర్వహిస్తున్నామని చెబుతూ రాత్రి 8 గంటల వరకు పని చేయించుకుంటున్నారు. నిమిషం ఆలస్యమైనా జీతం కట్ నర్సులు, సిబ్బంది ఆస్పత్రికి 8.10 గంటలకు రావాలి. కేవలం ఒకే ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆ రోజు జీతం కట్. జీతాలు పెంచమని అడిగితే ఇంటికి వెళ్లి పొమ్మని అపోలో యాజమాన్యం బెదిరిస్తోంది. ఇటీవల గుంటూరులో ఒక నర్సును అపోలోకి చెందిన సూపర్ వైజర్లు జీతాలు పెంచమన్నందుకు దారుణంగా బెదిరించారు. ఈ వ్యవహారం వాట్సప్‌లో హల్చల్ చేసింది. రెంటికి చెడ్డ రేవడిలా.. మొదట్లో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో చేరిన నర్సులను కాలక్రమంలో ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని ప్రకటించింది. ఎప్పటికైనా రెగ్యులర్ అవుతామనే ఆశతోనే నర్సులు పని చేస్తున్నారు. అపోలో సంస్థకు అప్పగించడంతో నర్సులు వైద్యశాఖ నుంచి వేరైపోయారు. ఈ లోపు అనేక మందికి వయో పరిమితి కూడా దాటిపోయింది. ఇప్పుడు నర్సుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఇదంతా టీడీపీ చేసిన పాపమని ఇప్పుడు వారు శాపనార్థాలు పెడుతున్నారు. వృథా ఖర్చు : నిపుణుల కమిటీ నాలుగు రోజుల క్రితం వైద్య ఆరోగ్యశాఖను పరిశీలించడానికి నిపుణుల కమిటీ సభ్యులు జిల్లాలో పర్యటించారు. వారు పెద్దాసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూ పట్టణ ఆరోగ్య కేంద్రాలను అపోలోకి అప్పగించి ప్రజా సొమ్మును వృథా చేశారని వెల్లడించారు. ఇటు రోగులకు ఉపయోగపడక, అటు జీతాలు పెంచక ఆ డబ్బంతా ఏమవుతుందో పరిశీలిస్తున్నామన్నారు. త్వరలోనే ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టణ ఆరోగ్య కేంద్రాలను అపోలో యాజమాన్యం నుంచి తప్పించి నిర్వహణ ప్రభుత్వమే చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. వైద్యశాఖాధికారి డాక్టర్ రాజ్యలక్ష్మిని ఈ విషయమై వివరణ అడిగితే ప్రభుత్వం నుంచి తమకు ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. ఏది ఏమైనా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం పేరిట అపోలోకి దోచి పెట్టిన విషయం తేటతెల్లమైంది. దీనికి త్వరలోనే పుల్‌స్టాప్ పడనుందని, సిబ్బందిని వైద్యశాఖ అధీనంలోనికి తీసుకుని జీతాలు పెంచే అవకాశముందని తెలుస్తోంది. -
చంద్రమౌళికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్ : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన చంద్రమౌళిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చంద్రమౌళి చికిత్స పొందుతున్నారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఆయనను పరామర్శించి...ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్‌తో పాటు పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. విజసాయి రెడ్డి, మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పుట్టపర్తి నియోజక వర్గ వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయ కర్త శ్రీధర్ రెడ్డి కూడా చంద్రమౌళిని పరామర్శించారు. -
శోభన కామినేని ఓటు గల్లంతు
సాక్షి, సిటీబ్యూరో: నాంపల్లి నియోజకవర్గం విజయనగర్‌కాలనీలో నివాసం ఉండే అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ శోభన కామినేని ఓటు గల్లంతయింది. పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఆమె ఓటు వేసేందుకు నగరానికి వచ్చారు. తీరా పోలింగ్ కేంద్రానికి వెళ్లాక అక్కడ తన ఓటు తొలగించినట్లు తెలుసుకొని నివ్వెరపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఓటు ఇప్పుడెలా పోయిందంటూ ఎన్నికల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ పౌరురాలినైన తనకు ఇది ఎంతో విచారకరమైన రోజని ఆవేదన వ్యక్తం చేశారు. తాను దేశ పౌరురాలిని కాదా ? నాకు ఓటు ముఖ్యం కాదా ? అంటూ ప్రశ్నించారు. ఓటు వేశాననే సంతృప్తి కోసం చాలెంజ్ ఓటు వేయవచ్చునని సిబ్బంది చెప్పారని, లెక్కింపునకు నోచుకోని ఓటెందుకని ఆమె ప్రశ్నించారు. బీఎల్ఓపై వేటు.. శోభన కామినేని ఓటు తొలగింపునకు బాధ్యుడైన బీఎల్ఓ (బూత్ లెవెల్ ఆఫీసర్)గా విధులు నిర్వహిస్తున్న హెల్త్ విభాగం ఉద్యోగి ఓం ప్రకాశ్‌ను సస్పెండ్ చేయడంతోపాటు ఔట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నరేందర్‌రెడ్డిని సంబంధిత ఏజెన్సీకి సరెండర్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. మెహదీపట్న ం సర్కిల్లోని విజయనగర్‌కాలనీ పోలింగ్‌బూత్ 49లో శోభన కామినేనికి చట్టవిరుద్ధంగా రెండు ఓట్లున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. ఈ రెండింటిలో ఒకదాన్ని తొలగించాల్సిందిగా సహాయ ఎన్నికల అధికారి బీఎల్ఓను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సంబంధిత 7ఏ నోటీసులు లిఖితపూర్వకంగా జారీ చేయకుండా శోభనకు చెందిన రెండు ఓట్లను బీఎల్ఓ తొలగించారు. చెక్ చేయకుండానే రెండు ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు ఎన్నికల ప్రక్రియలో శిక్షణ వ్యవహారాల నోడల్ ఆఫీసర్‌గా ఉన్న జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ డైరెక్టర్ శశికిరణాచారిని నియమించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఉపాసన శోభన ఓటు గల్లంతుపై ఆమె కుమార్తె ప్రము ఖ హీరో రామ్‌చరణ్ తేజ్ భార్య ఉపాసన ట్విట్టర్ వేదికగా స్పందిచారు. పది రోజుల క్రితం ఓటరు జాబితాలో ఉన్న తన తల్లి పేరు ఇప్పుడు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. తన తల్లి కూడా ప్రభుత్వానికి పన్ను కడు తోందని, భారత పౌరురాలిగా ఆమెకు విలువ లేదా? అంటూ ఘాటుగా స్పందించారు. -
అపోలో పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో పొందిన చికిత్స వివరాలపై ఆర్ముగం కమిటీ దర్యాప్తు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. జస్టిస్ ఆర్.సుబ్బయ్య, జస్టిస్ కృష్ణన్ రామస్వామిల డివిజన్ బెంచ్ అపోలో పిటిషన్‌ను సోమవారం విచారించింది. జయలలిత మరణానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందనీ, అయితే ఆస్పత్రిలో ఉండగా అందించిన చికిత్స సరైనదో కాదో నిర్ధారించే హక్కు ఆర్ముగం కమిషన్‌కు లేదని అపోలో యాజమాన్యం వాదించింది. కమిటీ నేతృత్వంలో వైద్యులు ఆస్పత్రి రికార్డులు పరిశీలించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. ఇందుకు న్యాయస్థానం నిరాకరించింది. -
గాటు లేకుండానే.. గుండెకు చికిత్స
సాక్షి, హైదరాబాద్: శరీరంపై కత్తిగాట్లు, కుట్లే కాదు.. కనీసం నొప్పి కూడా తెలియకుండా పూర్తిగా దెబ్బతిన్న గుండె రక్తనాళాలకు అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. సాధారణంగా ఈ సమస్యతో బాధపడుతున్న రోగులకు ఛాతీని ఓపెన్ చేసి దెబ్బతిన్న రక్తనాళాల స్థానంలో దాతల రక్తనాళాలను అమరుస్తారు. ఈ తరహా చికిత్సను వైద్య పరిభాషలో ‘ట్రాన్స్ కేథటర్ అరోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్’టెక్నిక్ అంటారు. అయితే ఈ చికిత్స ద్వారా ఒకేరోజు ఐదుగురు బాధితులకు 5 రక్తనాళాల మార్పిడి చేయడం దేశ వైద్య చరిత్రలోనే తొలిసారని అపోలో వైద్యులు తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసకుమార్, ఆస్పత్రి డివిజన్ ప్రెసిడెంట్ డాక్టర్ హరిప్రసాద్ చికిత్స వివరాలను మీడియాకు వెల్లడించారు. బాధితులంతా 70 ఏళ్ల పైవారే సిద్దిపేటకు చెందిన రాజేశం(73), హైదరాబాద్‌కు చెందిన రాజేంద్రప్రసాద్(70), ప్రసాదరావు(73), దామోదరం రాఠీ (70)లతో పాటు మరో వ్యక్తి ఎడమ జఠరిక వైఫల్యం (అరోటిక్ వాల్వ్‌స్టెనోసిస్)తో బాధపడుతున్నారు. అరోటిక్ వాల్వ్ అనేది గుండె కింది భాగంలో రక్తాన్ని పంపింగ్ చేసే ఎడమ జఠరికతోపాటు ఆక్సిజన్‌తో నిండిన రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేసే బృహద్ధమనిని కలుపుతుంది. పెరుగుతున్న వయసు కారణంగా రక్తనాళాలు బలహీనపడి కుచించుకుపోయి రక్తం సరఫరా వ్యతిరేక దిశలో ప్రయాణించడంతో గుండె పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీన్ని వైద్య పరిభాషలో అరోటిక్ వాల్వ్ స్టెనోసిస్‌గా పిలుస్తారు. ఈ సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఛాతీపై కోతపెట్టి దెబ్బతిన్న రక్తనాళాల స్థానంలో బ్రెయిన్‌డెడ్ దాతల నాళాలను అమర్చుతుంటారు. బాధితులంతా 70 ఏళ్లు నిండినవారు కావడం.. ఈ వయసులో వారికి ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయడం రిస్క్‌తో కూడిన పనేకాకుండా చికిత్స తర్వాత కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఒక్కోసారి ప్రాణాలను సైతం కోల్పోవాల్సి వస్తుంది. రెండోరోజే డిశ్చార్జ్.. వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ‘హార్ట్‌వాల్వ్ థెరపీ’ ప్రోగ్రామ్‌లో డాక్టర్ శ్రీనివాస్‌కుమార్ ఇటీవల శిక్షణ పొందారు. వృద్ధాప్యంతోపాటు హృద్రోగ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఈ ఐదుగురు బాధితులకు కత్తిగాటుతో పనిలేకుండా కనీసం రక్తం చుక్క కూడా కారకుండా తొడభాగంలోని రక్తనాళం ద్వారా దెబ్బతిన్న గుండె రక్తనాళాలను పునరుద్ధరించినట్లు శ్రీనివాస్‌కుమార్ తెలిపారు. చికిత్స చేసిన రెండో రోజే బాధితులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు. వృద్ధాప్యంతోపాటు ఊపిరితిత్తులు, మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న రోగులకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఒకేరోజు ఐదుగురు బాధితులకు చికిత్స చేయడం దేశవైద్య చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొన్నారు. -
జయలలిత వైద్యానికైన ఖర్చు ఎంత..
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత చికిత్స ఖర్చు వివరాలను మంగళవారం అపోలో ఆసుపత్రి వెల్లడించింది. ఆమె చికిత్సకు మొత్తం రూ.6.85 కోట్లు ఖర్చుచేసినట్లు అపోలో లండన్ డాక్టర్ రిచర్డ్ బీలే వెల్లడించారు. జయలలిత ఫిజియోథెరపీ కోసం సింగపూర్ ఆసుపత్రికి 1.29 కోట్ల, శశికళ కుటుంబ వసతి కోసం 1.24 కోట్ల, జయ ఆహారంకు 1.17 కోట్లు చెల్లించినట్లు డాక్టర్ రిచర్డ్ తెలిపారు. కాగా రెండేళ్ల క్రితం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యం కారణంగా జయలలిత మృతి చెందిన విషయం తెలిసిందే. -
అపోలో హాస్పిటల్స్ నుంచి అపోలో ఫార్మసీ విభజన
న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్... తన ఫార్మసీ (ఔషధ విక్రయ శాలలు) రిటైల్ వ్యాపారాన్ని అపోలో ఫార్మసీస్ లిమిటెడ్ (ఏపీఎల్) పేరుతో వేరు చేయాలని నిర్ణయించింది. అపోలో మెడికల్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు ఏపీఎల్ పూర్తి అనుబంధ సంస్థగా కొనసాగుతుంది. అపోలో మెడికల్స్ ప్రైవేటు లిమిటెడ్‌లో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్‌కు 25.5 శాతం వాటా ఉంటుంది. అలాగే, జీలమ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్–1కు 19.9 శాతం, హేమెంద్ర కొఠారికి 9.9 శాతం వాటా, ఇనామ్ సెక్యూరిటీస్ ప్రైవేటు లిమిటెడ్‌కు 44.7 శాతం చొప్పున వాటాలు ఉంటాయి. ఆరోగ్య సేవలు, ఫార్మసీ వ్యాపారాలకు సంబంధించి దీర్ఘకాలిక విధానాన్ని సమీక్షించిన అనంతరం బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. స్పష్టమైన విధానంతో పనిచేసేందుకు వీలుగా ఈ వ్యాపారాన్ని ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేయడానికి ఇది సరైన సమయమని భావించినట్టు తెలిపింది. రూ.10,000 కోట్ల ఆదాయ లక్ష్యం ఐదేళ్లలో 5,000 ఔషధ దుకాణాలు, రూ.10,000 కోట్ల ఆదాయం లక్ష్యంతో ఫార్మసీ విభాగం పనిచేయనున్నట్టు అపోలో హాస్పిటల్స్ తెలిపింది. ఈ నిర్ణయంతో డిజిటల్ కామర్స్‌లోకి ప్రవేశించేందుకు వీలు కలుగుతుందని, ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఏదన్నది నిర్ణయించుకునే సౌకర్యం వినియోగదారులకు లభిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 400 పట్టణాల్లో అపోలో ఫార్మసీకి 3,167 దుకాణాలు ఉన్నాయి. కంపెనీ వ్యాపారాల పునర్వ్యవస్థీకరణ అనంతరం.. ఏపీఎల్‌కు అపోలో హాస్పిటల్స్ ఔషధ సరఫరాదారుగా ఉంటుంది. తాజా నిర్ణయం అపోలో హాస్పిటల్స్ ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపించదని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని తెలిపారు. -
స్వైన్ ఫ్లూ సైరన్
సాక్షి, కడప : స్వైన్ ఫ్లూ రాయలసీమను వణికిస్తోంది. ఇప్పటికే పొరుగున ఉన్న చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ భయకంపితులను చేస్తుండగా.. చాపకింద నీరులా జిల్లాలోనూ ప్రవహిస్తోంది. ఈ ఏడాది జూలైలో జమ్మలమడుగుకు చెందిన ఒక మహిళ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. అనధికారికంగా మరో ముగ్గురు మత్యువాత పడ్డారు. అయితే వైద్య ఆరోగ్య శాఖ రికార్డుల్లో మాత్రం ఇప్పటికీ ఒకరు మాత్రమే మృతి చెందినట్లుగా చూపించారు. గతేడాది కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖను స్వైన్ ఫ్లూ భయ పెట్టిందనే చెప్పవచ్చు. బుధవారం చక్రాయపేట మండలం నెర్సుపల్లెకు చెందిన చంద్ర స్వైన్ ఫ్లూతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని ‘సాక్షి’ తెలియజేస్తోంది. 2017లోనూ భారీగా కేసులు నమోదు జిల్లాలో గతేడాది స్వైన్‌ఫ్లూ కేసులు భారీగా నమోదయ్యాయి. తెలంగాణ, కేరళతోపాటు రాష్ట్రంలోని వైఎస్సార్ జిల్లాలో కూడా స్వైన్‌ఫ్లూ ఎక్కువగానే కనిపించింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారమే 50 కేసులు నమోదయ్యాయి. కొంత మంది రిమ్స్‌లో ప్రత్యేక వార్డులో చికిత్స పొందగా.. మరి కొంత మంది తిరుపతి స్విమ్స్, బెంగళూరు, హైదరాబాద్‌లో కూడా చికిత్స ద్వారా కోలుకున్నారు. అయితే ఇటీవల మరో ముగ్గురు కూడా స్వైన్‌ఫ్లూ బారిన పడి ప్రాణాలు వదిలారు. సరిహద్దు జిల్లాల్లో అలజడి వైఎస్సార్ జిల్లా ఆనుకుని ఉన్న చిత్తూరు జిల్లాలో స్వైన్‌ఫ్లూ కలవర పెడుతోంది. అందులోనూ జిల్లాలో 2018 జూలై 6న జమ్మలమడుగుకు చెందిన ఓ మహిళ స్వైన్ ఫ్లూ సోకి హైదరాబాదు అపోలో ఆస్పత్రిలో మృతి చెందిన ఘటన కూడా ఉన్న నేపథ్యంలో.. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే జిల్లాలో స్వైన్ ఫ్లూ ఇటీవల ఎక్కువగా కనిపిస్తుండటంతో ఆందోళన రేకెత్తుతోంది. చిత్తూరు, కర్నూలులో స్వైన్‌ఫ్లూతో పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తుండగా, పలు వురు పెద్దాస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ఎప్పుడూ కనిపించని వ్యాధి సాధారణంగా జిల్లాలో వైరల్ జ్వరాలు నమోదవుతుంటాయి. స్వైన్ ఫ్లూ కేసులు అరుదుగా ఉంటా యి. అలాంటిది ఈ వ్యాధి 2012 నుంచి కనిపిస్తోంది. ఇటీవల కాలంలో విజృంభించడం వైద్య ఆరోగ్య శాఖను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాకు చెందిన పలువురు వ్యాధి బారిన పడినా.. హైదరాబాద్, తిరుపతి, వేలూరు, కర్నూలు పెద్దాస్పత్రుల్లో చికిత్స పొందుతూ గతంలో మృత్యువాత పడడంతో రికార్డులకు ఎక్కనట్లు తెలు స్తోంది. జిల్లాలోని ఆస్పత్రులకు సంబంధించి ఎవరూ కూడా స్వైన్‌ఫ్లూతో రాకపోవడం ఊరటనిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ కూడా ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్లలో స్వైన్ ఫ్లూకు సంబం ధించి కౌంటర్లు పెట్టి మందులను అందుబాటులో ఉంచింది. అలాగే పలు పెద్దాస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ వార్డులను కూడా ఏర్పాటు చేశారు. అయితే చక్రాయపేట మండలం నెర్సుపల్లెకు చెందిన చంద్ర స్వైన్ ఫ్లూ సోకి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందడం కలకలం రేపింది. జిల్లాలో కలకలం చక్రాయపేట : నెర్సుపల్లెలో ఓ వ్యక్తి స్వైన్ ఫ్లూతో బుధవారం మృతి చెందిన సంఘటన జిల్లాలో కలకలం రేపింది. వివరాలలోకి వెళితే.. బేల్దారి పూల చంద్ర(50)కు 10 రోజుల క్రితం జలుబుతో కూడిన జ్వరం వచ్చింది. సురభి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకోగా.. జ్వరం తగ్గకపోవడంతో కడప రిమ్స్‌కు వెళ్లారు. అక్కడ కూడా తగ్గకపోవడంతో.. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చంద్రకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. స్వైన్‌ఫ్లూ అని వైద్యులు నిర్ధారించారు. వైద్యం చేయించుకుంటూ అక్కడే మృతి చెందాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉండగా.. ఒక కుమార్తెకు వివాహమైంది. కుటుంబ యజమాని చనిపోవడంతో వారి కుటుంబం వీధిన పడింది. స్వైన్‌ఫ్లూతో చంద్ర మృతి చెందడంతో.. గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. భయ పడొద్దంటున్న డాక్టర్లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేస్తామని వైద్యులు తెలిపారు. స్వైన్‌ఫ్లూ అనుమానత వ్యక్తులను కడప రిమ్స్‌కు పంపించి వైద్యం చేయిస్తామని వారు పేర్కొన్నారు. ఎవరూ భయపడవద్దని వివరించారు. మందులు ఇవ్వని వైద్యులు చంద్ర కుటుంబ సభ్యులకు, గ్రామంలోని ప్రతి ఒక్కరికి జిల్లా వైద్య శాఖ అధికారి, డీఎంహెచ్ఓ అసిఫ్, డాక్టర్ ఏపీడీమాలజిస్ట్ డాక్టర్ ఖాజా, ఎంపీహెచ్‌ఓ వెంకటరెడ్డి, ఎంపీహెచ్‌ఓ ప్రసాద్, డాక్టర్ ఖాజామోద్ధీన్తోపాటు సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ముందస్తు నివారణలో భాగంగా ఎలాంటి మందులు పంపిణీ చేయలేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పరామర్శించిన వైఎస్ భాస్కర్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని వైఎస్సార్సీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జి వైఎస్ భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. మృతి చెందిన పూల చంద్రకు నివాళులర్పించారు. -
నాగం జనార్ధన్‌రెడ్డికి పుత్ర వియోగం
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి కుమారుడు నాగం దినకర్‌రెడ్డి (46) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన వారం రోజుల కిందటే చికిత్స కోసం అపోలో ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేసేందుకు వైద్యులు ఓ వైపు ఏర్పాట్లు చేస్తుండగానే ఆస్పత్రిలో గుండెపోటుతో చనిపోయారు. జనార్దన్‌రెడ్డికి ఇద్దరు కుమారులు కాగా పెద్ద కొడుకైన దినకర్‌రెడ్డి వైద్యవృత్తిలో కొనసాగుతూనే సివిల్ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కుమారుడి మృతితో నాగం తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు కాంగ్రెస్ నాయకులు అపోలో ఆస్పత్రికి చేరుకుని నాగంను పరామర్శించారు. దినకర్ 46 ఏళ్ల వయస్సులోనే చనిపోవడం నాగం కుటంబానికి తీరని లోటని చిన్నారెడ్డి పేర్కొన్నారు. పార్టీ తరఫున నాగం కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన పలువరు నాయకులు నాగంను పరామర్శించారు. -
జయలలిత చికిత్స వీడియో దృశ్యాలు లేవు!!
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణ మిస్టరీ వీడేనా? పలువురిలో చోటుచేసుకున్న అనుమానపు మేఘాలు విచారణ కమిషన్ నివేదికతో తొలగిపోయేనా?.. అన్న ప్రశ్నలకు సమా«ధానం దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. జయ విచారణలో కీలకమైన జయకు చికిత్స వీడియో దృశ్యాలు చెరిగిపోయినట్లు అపోలో ఆస్పత్రి చెప్పడంతో కమిషన్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: దేవుళ్లలా కొలుచుకునే రాజకీయ నేతలకు అస్వస్థత చేకూరినపుడు ప్రజలు తల్లడిల్లిపోవడం సహజమే. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఎంజీ రామచంద్రన్ తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలయ్యారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో, ఆ తరువాత అమెరికాలో ఆయన చికిత్స పొందారు. ప్రజల కోరిక మేరకు ఆస్పత్రిలో ఎంజీఆర్ చికిత్స పొందుతున్న దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు. అమెరికాలో చికిత్స పొందుతూనే ఎంజీఆర్ మరణించినా ప్రజలు ఎలాంటి అనుమానాలు వ్యక్తంచేయలేదు. అయితే అదే తీరులో జయలలిత సైతం ముఖ్యమంత్రి హోదాలోనే 2016 సెప్టెంబరు 22వ తేదీన అపోలో ఆస్పత్రిలో అడ్మిటయ్యారు. జ్వరం, డీహైడ్రేషన్ వంటి స్వల్ప అనారోగ్యమే, రెండు మూడు రోజుల్లో ఆమె డిశ్చార్జ్ అవుతారని వైద్యులు, ప్రభుత్వం ప్రకటించడంతో అమ్మ అభిమానులు ఊరట చెందారు. అయితే వైద్యులు చెప్పినట్లుగా అమ్మ విడుదల కాలేదు. జయ చికిత్స పొందుతున్న వీడియో లేదా ఫొటోలు విడుదల చేయాలని అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు అనేకసార్లు కోరారు. ఆరోగ్యం కుదుటపడిందనే రోజుల తరబడి ప్రచారాలు సాగుతుండగానే అదే ఏడాది డిసెంబరు 5వ తేదీన జయ కన్నుమూయడం చర్చనీయాంశమైంది. అన్నాడీఎంకేలోని వారేగాక ప్రతిపక్షాలు సైతం అనేక అనుమానాలు వ్యక్తంచేశాయి. సీబీఐ విచారణకు డిమాండ్ చేశాయి. పలుచోట్ల నుంచి ఒత్తిడి పెరగడంతో రిటైర్డు న్యాయమూర్తి ఆరుముగస్వామి చైర్మన్‌గా తమిళనాడు ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు విచారణ కమిషన్‌ను నియమించింది. జయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన సుమారు వందమందికి పైగా కమిషన్ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. జయకు చికిత్స చేసిన అపోలో, ఢిల్లీ నిమ్స్ వైద్యులను సైతం కమిషన్ విచారించింది. ఈ దశలో అపోలో ఆస్పత్రిలో జయకు చికిత్స చేసిన వీడియో దృశ్యాలను కమిషన్ అనేకసార్లు కోరింది. అయితే వీవీఐపీలు చికిత్స పొందుతున్న గదుల్లో సీసీటీవీ కెమెరాలు ఉండవని అపోలో బదులిచ్చింది. అయితే అపోలో మాటలకు భిన్నంగా ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో స్వతంత్య్ర అభ్యర్థి టీటీవీ దినకరన్ అనుచరుడు వెట్రివేల్ జయ చికిత్స పొందుతున్న వీడియో దృశ్యాలను విడుదల చేసి కలకలం రేపాడు. అవన్నీ గ్రాఫిక్ దృశ్యాలని కొందరు ఆక్షేపించినా శశికళే స్వయంగా చిత్రీకరించారని చెప్పడంతో అందరూ నమ్మారు. దీంతో అపోలో మరో వివరణ ఇవ్వాల్సి వచ్చింది. చెరిగిపోయాయని వివరణ అపోలో ఆస్పత్రి న్యాయవాది మైనాబాష మాట్లాడుతూ, వీడియో దృశ్యాలపై కమిషన్‌కు వివరణ ఇచ్చామని తెలిపారు. ఆస్పత్రిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రమే సీసీటీవీ కెమెరాలు అమరుస్తామని, వీటిల్లోని దృశ్యాలు సైతం వీవీఐపీలు ఉండేచోట కెమెరాలు ఉండవని తెలిపామని అన్నారు. ఈ కెమెరాల ద్వారా నమోదైన దృశ్యాలు నెలరోజులకు మించి ఉండవని, మరో దృశ్యాలు నమోదు కాగానే పాతవి ఆటోమేటిక్‌గా చెరిగిపోతాయని, ఇలానే జయ చికిత్స దృశ్యాలు సైతం చెరిగిపోయాయని పేర్కొంటూ ఈనెల 11వ తేదీన కమిషన్‌కు లిఖితపూర్వకంగా తెలియజేశామని అన్నారు. నిపుణులను పంపాలని నిర్ణయం అపోలో ఇచ్చిన వివరణ, ఆస్పత్రిలో సీసీటీవీ సర్వర్లను పరిశీలించి చెరిగిపోయిన దృశ్యాలను సేకరించే వీలుందా తెలుసుకునేందుకు ఒక నిపుణుల బృందాన్ని అపోలో ఆస్పత్రికి పంపాలని కమిషన్ నిర్ణయించింది. వీవీఐపీలు చికిత్స పొందుతున్న చోట్ల సీసీటీవీ కెమెరాలు ఉండవని అపోలో ఇచ్చిన సమాధానంపై ఆస్పత్రి సిబ్బంది నుంచి సమాచారం రాబట్టాలని ఆదేశించింది. ఈ విషయపై అపోలో ఆస్పత్రి సీవోవో సుబ్బయ్య విశ్వనాథన్‌ను ఈనెల 25వ తేదీన మరోమారు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. జయ మరణంపై ఇప్పటికే అనుమాన మేఘాలు కమ్ముకుని ఉండగా సీసీటీవీ దృశ్యాలు అందుబాటులో లేకపోవడం, శశికళ తదితరులను ఇంకా విచారించాల్సి ఉండడంతో మిస్టరీ వీడేనా అని ఆలోచనలో పడ్డారు. -
విదేశీ యువతికి ప్రేమలేఖ.. ఊహించని పరిణామం
బంజారాహిల్స్: తన తల్లి చికిత్స నిమిత్తం ఆమెకు సహాయకురాలిగా జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి వచ్చిన సిరియా దేశానికి చెందిన బర్కా అనే యువతి ఆస్పత్రిలోని గదిలో ఉంటోంది. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం, తిమ్మరాజుపల్లి కాటేపల్లి గ్రామానికి చెందిన మునిచంద్ర ఆరు నెలల క్రితం ఇస్లాం మతం స్వీకరించాడు. మెహిదీపట్నంలో ఉంటూ ఎంబీఏ చేస్తున్నాడు. ఆమెను చూసి మనసు పారేసుకున్న మునిచంద్ర తాను ముస్లింనని తన పేరు మహ్మద్ ఆయాన్‌గా పరిచయం చేసుకోవడమే కాకుండా ముస్లిం మతాన్ని స్వీకరించినట్లు పత్రాన్ని కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ‘నువ్వు లేకుండా నేను ఉండలేను, నీది ఏ దేశమైనా ప్రేమిస్తూనే ఉంటాను నా ప్రేమను అంగీకరించు’ అంటూ ఓ లేఖ రాశాడు. తరచూ ఆమె గది వద్దకు వెళ్తూ వేధిస్తుండటంతో బాధితురాలు మంగళవారం రాత్రి సెక్యూరిటీకి ఫిర్యాదు చేసింది. సెక్యూరిటీ గార్డులు మునిచంద్రను చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఏఐ సాయంతో ముందే గుండె జబ్బుల గుర్తింపు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గుండె సంబంధిత వ్యాధుల (సీవీడీ) రాకను ముందుగానే గుర్తించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ప్లాట్‌ఫామ్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్, అపోలో హాస్పిటల్స్ చేతులు కలిపాయి. ఈ భాగస్వామ్యం కింద... కార్డియో వాస్క్యులర్ డిసీజ్ (సీవీడీ) రిస్క్ స్కోర్ ఏపీఐను విడుదల చేశాయి. దేశవ్యాప్తంగా అపోలో హాస్పిటల్స్ నెట్వర్క్ పరిధిలోని వైద్యులు ఈ సీవీడీ ఏపీఐను ఉపయోగించడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల రిస్క్‌ను ముందుగానే గుర్తించి నివారణకు చర్యలు తీసుకుంటారని ఈ రెండు సంస్థలూ ఒక ప్రకటనలో తెలియజేశాయి.భారత్‌కు వెలుపల ఇతర జనాభా విషయంలో ఈ ఏపీఐ పనితీరును తెలుసుకునేందుకు మైక్రోసాఫ్ట్, అపోలో హాస్పిటల్స్ అంతర్జాతీయ భాగస్వాములతోనూ కలసి పనిచేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా పలు సీవీడీ నమూనాలు అందుబాటులో ఉన్నాయని, కానీ ఇవి ప్రత్యేకంగా బారతీయుల అవసరాల కోసం ఉద్దేశించినవి కావని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. మైక్రోసాఫ్ట్ అజూర్ ప్లాట్‌ఫామ్‌పై ఏర్పాటైన ఈ ఏపీఐ భారత జనాభా సీవీడీ రిస్క్‌ను మరింత కచ్చితంగా గుర్తించగలదని స్పష్టం చేశాయి. దేశంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్టు జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. అధిక రక్తపోటు గుండె సమస్యలకూ కారణమవుతుందని తెలిసిందే. జీవన అలవాట్ల ఆధారంగా రిస్క్ 3హెల్త్ చెకప్‌లు, హృదయ సంబంధిత సమస్యల బారిన పడిన రోగుల నుంచి సేకరించిన సమాచారానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించి ఈ ఏపీఐను అభివృద్ధి చేశారు. గుండె సమస్యలకు దారితీసే జీవన విధాన ఆధారిత ఆహార అలవాట్లు, పొగతాగడం, శారీరక శ్రమ, మానసిక పరమైన ఒత్తిడి, ఆందోళన తదితర అంశాల ఆధారంగా రిస్క్ స్కోరును అధికం, మధ్యస్తం, కనిష్టం అంటూ మూడు రకాలుగా వర్గీకరిస్తారు. ఈ రిస్క్ స్కోర్ ఆధారంగా పేషెంట్లకు జీవన సంబంధిత మార్పులను వైద్యులు సూచిస్తారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, తమ వైద్యుల అంతర్జాతీయ అనుభవం గుండె వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. -
తాత గురించి ఉపాసన వీడియో పోస్ట్
సాక్షి, హైదరాబాద్ : మెగా పవర్‌స్టార్ రాంచరణ్‌ను వివాహం చేసుకుని మెగా ఫ్యామిలీ కోడలిగా మారిన తర్వాత ఉపాసన బాధ్యతలు మరింత పెరిగాయి. సోషల్ మీడియాలో నిత్యం పలు అంశాలను, ఉపయోగకర విషయాలను ప్రస్తావించే ఉపాసన తాజాగా తన తాత (ప్రతాప్ రెడ్డి) కల ఇదేనంటూ ఓ వీడియోను తన ఫాలోయర్లతో షేర్ చేసుకున్నారు. సాధ్యమైనంత మందికి ఆరోగ్యకర జీవితాన్ని ఇవ్వాలని తాత కలలు కన్నారని ట్వీట్లో తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చూడాలని తాత భావించారని.. ఇందులో భాగంగానే అపోలో హాస్పిటల్స్ స్థాపించి హెల్త్ కేర్ మోడల్‌కు శ్రీకారం చుట్టారని ట్విటర్ ద్వారా ఉపాసన వివరించారు. -
తన తాత కల ఇదేనంటూ ఉపాసన వీడియో పోస్ట్!
-
లేచి కూర్చుంది...!
వీలైతే నుంచోవడం, లేదంటే ఒక పక్కకు ఒరిగి పడుకోవడం.. గుల్నోరా రపిఖోవాకు ఈ రెండే తెలుసు. చిన్నతనపు ప్రమాదం మిగిల్చిన మానని గాయం ఫలితమిది. ఇన్నాళ్లకు.. కచ్చితంగా చెప్పాలంటే.. ఏకంగా 32 ఏళ్లకు... ఈ ఉజ్బెక్ మహిళ కష్టాలు తొలగిపోయాయి. ...ఇప్పుడు మనందరిలా తనూ లేచి కూర్చోగలదు! ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రి వైద్యులు ఒక చిన్న సర్జరీతో గుల్నోరా రపిఖోవాకు ఆ నరకం నుంచి విముక్తి కలిగించారు. ఆమె ఇప్పుడు హాయిగా కూర్చుంటోంది. ‘‘నాకు చెప్పలేనంత భయం వేస్తోంది. అదే సమయంలో పట్టరాని ఆనందంగా ఉంది’’అంటూ నేలపై కూర్చొని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌కు సమీపంలో సిర్‌దర్య అనే కుగ్రామం గుల్నోరా రపిఖోవా సొంతూరు. ఐదేళ్ల వయసులో ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు జరిగిన అగ్ని ప్రమాదంలో దుస్తులకు మంటలు అంటుకుని వీపు నుంచి మోకాళ్ల వరకూ గాయాలయ్యాయి. ఆసుపత్రిలో ఏడాదిన్నరపాటు మృత్యువుతో పోరాడింది. ఐదుసార్లు శస్త్రచికిత్సలు నిర్వహించినా కాలిన గాయాలు మానలేదు. దీంతో ఆమెకు కూర్చోవడానికి వీలయ్యేది కాదు. ‘జీవితం దుర్భరంగా మారింది. నిల్చోవడం లేదంటే ఒక పక్కకు ఒరిగి పడుకోవడం. మరో విధంగా ఉండలేకపోయా. ఎనిమిదేళ్ల వయసులో స్కూలుకు వెళ్లాను. నిల్చునే పాఠాలు వినేదాన్ని. మందులతోనే నొప్పిని నియంత్రించుకోవాల్సిన పరిస్థితి. సౌకర్యంగా ఉండేందుకు అన్ని రకాల అవకాశాలను నాకు నేను వెతుక్కుని ఉపయోగించా’‘అంటూ గుల్నోరా చెప్పుకొచ్చింది. ఈ దశలో ఆరునెలల క్రితం ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఓ వైద్యశిబిరం గుల్నోరాలో కొత్త ఆశలు చిగురింపజేసింది. అపోలో హాస్పిటల్స్ వైద్యులు నిర్వహించిన ఈ శిబిరానికి వెళ్లిన అమెను పరిశీలించిన ప్లాస్టిక్ కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ షాహిన్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ స్థాయిలో కండరాలు కాలిపోవడం ఎప్పుడూ చూడలేదని, అసలు 30 ఏళ్లుగా ఆమె ఆ బాధను భరిస్తూ ఎలా జీవించి ఉందో అర్థం కాలేదన్నారు డాక్టర్ షాహిన్. అయితే సర్జరీతో ఆమె కూర్చునేలా చేయొచ్చని గుల్నోరా తల్లిదండ్రులకు చెప్పారు. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆమె తల్లిదండ్రులకి సర్జరీ ఖర్చు భరించే ఆర్థిక స్థోమత లేదు. అయితే తాష్కెంట్‌కు చెందిన ఒక మనసున్న వ్యక్తి ఆ ఖర్చు భరించడానికి ముందుకొచ్చారు. దీంతో గత మే 26న ఆమెని ఢిల్లీకి తీసుకువచ్చారు. మే 31న శస్త్రచికిత్స చేశారు. నిజానికి ఆ సర్జరీ అంత సంక్లిష్టమైనదేం కాదని డాక్టర్ షాహిన్ చెప్పారు. ఆమె కాలికి ఉన్న చర్మాన్ని తీసి కాలిన గాయాలపై ఆ చర్మాన్ని గ్రాఫ్టింగ్ చేశారు. రెండు గంటలకుపైగా పట్టిన ఈ సర్జరీ విజయవంతం కావడంతో గుల్నోరా ముఖంలోకి చిరునవ్వు వచ్చింది. ‘నేను ఇప్పుడు కూర్చుంటున్నాను. ఈ విషయం మా అమ్మానాన్నలకు చెప్పా. నమ్మబుద్ధి కావడం లేదంటూ వాళ్లు పెద్దగా ఏడ్చేశారు. నన్ను చూస్తే తప్ప వాళ్లకి నమ్మకం రాదేమో‘అంటూ గుల్నోరా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. భారత్ వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతోంది. బాలీవుడ్ సినిమాలు, హిందీ పాటలంటే అమితంగా ఇష్టపడే రపిఖోవాకు షారూక్ ఖాన్, కాజల్ అంటే చాలా ఇష్టమట. కానీ ఇప్పుడు భారత్ ప్రజల మనసు ఎంత గొప్పదో వర్ణిస్తూ మురిసిపోతోంది. -
అపోలో ఘనత: 32 ఏళ్ల తర్వాత కూర్చొంది
సాక్షి, న్యూఢిల్లీ : జీవితమంతా నిలబడే బ్రతకాల్సి వస్తే?. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదని అనుకుంటాం. ప్రమాదవ శాత్తు తన ఐదవ ఏట అగ్ని ప్రమాదం బారిన పడిన ఓ మహిళ గత 32 ఏళ్లుగా నిల్చొనే ఉంటున్నారు. నిల్చొవడం లేదా పడుకోవడం మినహా ఆమె గత 32 ఏళ్లుగా కూర్చొనేలేదు. అలాంటి వ్యక్తిని కూర్చొనేలా చేసి ఆమె మొహంలో నవ్వులు పూయించారు ఢిల్లీ వైద్యులు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన గుల్నోరా రాపిఖోవా(37) కథ ఇది. ఒక రోజు ఇంట్లోని స్టవ్ దగ్గర నిల్చున్నప్పుడు గుల్నోరా దుస్తులకు మంటలు అంటుకున్నాయి. మంటలతోనే ఆమె బయటకు పరిగెత్తింది. ఇరుగూ పొరుగు వారు చూసి మంటలు ఆర్పి స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనలో గుల్నోరాకి తొడల కింద భాగం తీవ్రంగా కాలిపోయింది. దాదాపు 18 నెలల పాటు ఆసుపత్రిలోనే ఉంది. ఈ సమయంలో దాదాపు ఐదు సార్లు శస్త్ర చికిత్సలు జరిగాయి. అయినా ఎలాంటి మార్పు లేకపోవడంతో ఆమె కూర్చోలేకపోయారు. అధైర్యపడని గుల్నోరా అలానే పాఠశాలకు వెళ్లి నిల్చొని పాఠాలు వినేవారు. అదృష్టవశాత్తు ఈ ఏడాది మేలో తాష్కెంట్లో అపోలో వైద్యులు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి గుల్నోరా వచ్చారు. ఆమె పరిస్థితి తెలుసుకున్న డాక్టర్లు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆమెకు చికిత్స అందించేందుకు అంగీకరించారు. ఓ మానవతావాది సాయంతో గుల్నోరా చికిత్సకు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి వచ్చారు. తాష్కెంట్ నుంచి న్యూఢిల్లీకి వచ్చే విమానంలో సైతం ఆమె నిల్చొనే వచ్చారు. 10 నుంచి 15 ఏళ్ల కంటే ఎక్కువకాలం ఉండే గాయాలు క్యాన్సర్స్‌గా మారే ప్రమాదం ఉండటంతో గుల్నోరాకు పలుమార్లు బయాప్సీ పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు లేవని నిర్ణయించుకున్న తర్వాత శరీరంలోని వేరే భాగాల నుంచి కొంత కండను తీసి గాయాలైన చోట్ల అమర్చారు. నెల రోజులకు పూర్తిగా కోలుకున్న గుల్నోరా కూర్చొగలిగారు. అనంతరం ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. తాను కూర్చొగలుగుతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పానని, తనని చూస్తేగానీ వారు ఈ విషయం నమ్మలేరని గుల్నోరా అన్నారు. -
జయకు విదేశీ వైద్యం వద్దనుకున్నారు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి జయలలితను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలించేందుకు మంత్రులు సిద్ధపడినా, తరువాత వెనక్కి తగ్గారని తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామమోహన్‌రావు వెల్లడించారు. జయ మరణంపై విచారణ జరుపుతున్న కమిషన్‌కు ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆరు నెలల తరువాత బహిర్గతమైంది. తమిళ దినపత్రికలు ఆ విషయాల్ని గురువారం ప్రముఖంగా ప్రచురించాయి. రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముగస్వామి గత డిసెంబరు 21న రామమోహన్ రావును విచారించారు. ‘అత్యుత్తమ వైద్యం అందించేందుకు జయను విదేశాలకు తరలించాలని మంత్రులకు సూచించాను. ఈ విషయంపై వారు 4 రోజులు ఆలోచించి, ఆ తరువాత పూర్తిగా విస్మరించారు’ అని ఆయన వివరించారు. మంత్రులకు మరెక్కడి నుంచైనా అనుమతులు రావాల్సి ఉండే దా? అని కమిషన్ ప్రశ్నించగా తనకు తెలియద ని బదులిచ్చారు. ‘జయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు 2016 డిసెంబరు 4న వైద్యులు చెప్పగానే ఆసుపత్రికి వెళ్లి చూడగా, ఆమె శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. అదే రోజు రాత్రి 10.30 గంటలకు ఇక లాభం లేదని వైద్యులు తేల్చేశారు. ఇదంతా జరిగినప్పుడు అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆసుపత్రిలోనే ఉన్నారు’ అని చెప్పారు. -
జయ ఆస్పత్రిలో ఎందుకు చేరారో తెలియదు!
టీ.నగర్: జయలలిత ఏ వ్యాధి కోసం ఆస్పత్రిలో చేరారో తెలియదని అపోలో ఆస్పత్రి నర్సు బుధవారం వాంగ్మూలం ఇచ్చారు. ఈ వివరణతో విచారణ కమిషన్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి దిగ్భ్రాంతి చెందారు. విచారణ కమిషన్ ఎదుట అపోలో పనిచేస్తున్న డాక్టర్ నళిని, నర్సు ప్రేమ ఆంథోని బుధవారం హాజరయ్యారు. జయకు అందించిన చికిత్స గురించి న్యాయమూర్తి ఆర్ముగస్వామి వారిని వివిధ ప్రశ్నలు అడిగారు. కమిషన్ న్యాయవాదులు ఎస్.పార్థసారథి, నిరంజన్ వారి వద్ద క్రాస్ ఎగ్జామిన్ జరిపారు. న్యాయమూర్తి, కమిషన్ న్యాయవాదులు అడిగిన పలు ప్రశ్నలకు తెలియదు, జ్ఞాపకం లేదని వారు బదులిచ్చినట్టు సమాచారం. డాక్టర్ నళిని 2016 అక్టోబర్ ఐదో తేదీన అపోలో ఆస్పత్రిలో విధుల్లో చేరారు. జయలలితకు చికిత్స అందించిన ప్రత్యేక వార్డులో ఆమె చాలా కాలం పనిచేశారు. జయ మృతిచెందిన డిసెంబర్ ఐదో తేదీన నళిని విధుల్లో ఉన్నారు. అలాగే, నర్సు ప్రేమ ఆంథోని జయలలిత చికిత్సలందుకున్న స్పెషల్ వార్డులో నర్సులపై ప్రత్యేక పర్యవేక్షణ జరిపారు. ఇదిలాఉండగా వీరిరువురూ ఇచ్చిన సమాధానాలతో న్యాయమూర్తి ఆర్ముగస్వామి అసహనానికి గురైనట్టు సమాచారం. -
స్టాక్స్ వ్యూ
పవర్ గ్రిడ్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్; ప్రస్తుత ధర: రూ.206; టార్గెట్ ధర: రూ.287 ఎందుకంటే: పవర్ గ్రిడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు దాదాపు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. నికర లాభం 5 శాతం వృద్ధితో రూ.2,000 కోట్లకు పెరిగింది. వేతనాల పెంపు, రూ.83 కోట్ల మేర కంపెనీ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) వ్యయాలు, రూ.66 కోట్ల మేర తుది టారిఫ్‌ల అడ్జెస్ట్మెంట్స్.. ఈ అంశాలన్నీ నికర లాభంపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 10 శాతం వృద్ధితో రూ.8,230 కోట్లకు పెరిగింది. సర్‌చార్జీ ఆదాయం తక్కువగా ఉండటం, రూ.230 కోట్ల వేతన సవరణ భారం, తుది టారిఫ్‌ల అడ్జెస్ట్మెంట్ భారం రూ.200 కోట్ల మేర ఉండటంతో నికర లాభం అంచనాలను అందుకోలేకపోయింది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభంలో 17 శాతం వృద్ధి సాధించగలదని అంచనా వేశాం. గత ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాలంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేసింది. అంతే కాకుండా రూ.6,000–7,000 కోట్ల విలువైన 13 ప్రాజెక్ట్‌లను కూడా పూర్తి చేసింది. ఈ రంగంలో ఉన్న ఇతర కంపెనీలతో పోల్చితే ఈ కంపెనీయే వేగంగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తోంది. టవర్లను టెలికం సర్వీస్‌లకు వినియోగించే ప్రయోగం విజయవంతమైంది. దీనిని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. సిగ్నలింగ్ వర్క్ కోసం భారత రైల్వేలతో చర్చలు జరుపుతోంది. ఈ రంగంలో రూ.80,000 కోట్ల మేర వ్యాపార అవకాశాలను ఈ కంపెనీ అందిపుచ్చుకోగలదని అంచనా. ఈ కంపెనీ 3–4 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్‌ల విలువ రూ.90,000 కోట్ల మేర ఉంటుంది. ఇవన్నీ పూర్తయితే, రెండేళ్లలో కంపెనీ ఈపీఎస్(షేర్ వారీ ఆర్జన) 13 శాతం మేర చక్రగతిన వృద్ధి చెందుతుందని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరం పుస్తక విలువకు ఒకటిన్నర రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్ ట్రేడవుతోంది. ఇది ఆకర్షణీయమైన ధర. అపోలో హాస్పిటల్స్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్; ప్రస్తుత ధర: రూ.935; టార్గెట్ ధర: రూ.1,700 ఎందుకంటే: భారత్‌లో తొలి కార్పొరేట్ హాస్పిటల్ ఇది. 150 పడకల ఆసుపత్రిగా 1983లో ఆరంభమైన ఈ సంస్థ, ప్రస్తుతం 6,800 పడకలతో 61 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. ఈ రంగానికే సంబంధించిన ఫార్మసీ, కన్సల్టెన్సీ, బీమా, డయాగ్నస్టిక్ క్లినిక్స్, టెలీ మెడిసిన్ సెంటర్స్, మెడికల్ ఎడ్యుకేషన్ సెంటర్స్, రీసెర్చ్ తదితర రంగాలకూ కూడా విస్తరించింది. కొత్త హాస్పిటళ్ల ఏర్పాటు, ఉన్న హాస్పిటళ్ల విస్తరణ కారణంగా ఆరోగ్య సంరక్షణ విభాగం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 10% వృద్దిని సాధించింది. అపోలో ఫార్మసీ విభాగం 20% వృద్ధి చెందింది. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ రుణ భారం రూ.2,700 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించినప్పటికీ, ఫలితాలు వెల్లడైన రోజు ఈ షేర్ 4% వరకూ పతనమైంది. గత మూడు నెలల్లో 20% క్షీణించింది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, స్టెంట్లు, కీళ్ల మార్పిడికి సంబంధించిన ఇంప్లాంట్ల ధరలపై నియంత్రణ, కొన్ని రాష్ట్రాల్లో నర్సుల కనీస వేతనాలు పెంచడం.... ఈ అంశాలన్నీ హాస్పిటల్ రంగ షేర్లపై ప్రతికూల ఫ్రభావం చూపుతున్నాయి. హాస్పిటల్ రంగంలోని సంస్థాగత సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వాలు పాప్యులిస్ట్ చర్యలు తీసుకుంటుండటంతో ఈ రంగంలోని కంపెనీలు కుదేలవుతున్నాయి. ప్రస్తుతం 8%గా ఉన్న ఈ కంపెనీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ (ఆర్ఓసీఈ)మూడేళ్లలో 15%కి పెరుగుతుందని అంచనా. మూడేళ్లలో నిర్వహణ లాభం 21%, మార్జిన్లు 2.5% చొప్పున వృద్ధి చెందగలవని భావిస్తున్నాం. గత మూడేళ్లలో రూ. 2,590 కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడుల ఫలాలు అందనున్నాయి. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్(ఏహెచ్‌ఎల్‌ఎల్) వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే లాభాల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. హాస్పిటల్స్ విస్తరణపైననే ఈ కంపెనీ విజయం అధారపడి ఉంది. విస్తరణలో సమస్యలు, స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత, పెరుగుతున్న వ్యయాలు.. ఇవి ప్రతికూలాంశాలు. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
కాల్పుల ఘటనను దారి మళ్లించేందుకే!
దివంగత సీఎం, అమ్మ జయలలితకు ఆస్పత్రిలో ఇచ్చిన ఆహారం పదార్థాల్లో తీపిఎక్కువగా ఉన్నట్టు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆమెకు ఎవరు తీపి పదార్థాలు ఇచ్చారో అన్న ప్రశ్న బయలుదేరింది. ఆసుపత్రి వర్గాలు ఇచ్చా యా..? లేదా ఇందులో ఎవరి నిర్బంధమైనా ఉందా..? అన్న చర్చ తెర మీదకు వచ్చింది. సాక్షి, చెన్నై : తమిళనాడులో ఇపుడు ఆస్పత్రిలో ఉన్నపుడు జయలలితకు అందించిన మెనూ చర్చనీయాశంగా మారింది. దీనిపై విచారణ కమిషన్ ఏవిధంగా స్పందిస్తుందనే ప్రశ్న మొదలైంది. 2016 సెప్టెంబరు 22 వ తేదీ నుంచి డిసెంబరు ఐదో తేదీ వరకు అమ్మ జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఐదో తేదీన ఆమె గుండె పోటుతో మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే, ఆమె మరణంలో మిస్టరీ ఉందన్న ఆరోపణల నేపథ్యంలో విచారణకు రిటైర్డ్ జడ్జి ఆర్ముగస్వామి కమిషన్ రంగంలోకి దిగింది. ఈ కమిషన్ ఏ ఒక్కరినీ వదలిపెట్టడం లేదు. జయలలితతో సన్నిహితంగా ఉన్న వాళ్లందరినీ విచారిస్తూ వస్తోంది. ఆస్పత్రి నుంచి నివేదికల మీద నివేదికల్ని ఆ కమిషన్ తెప్పించుకుంటోంది. అదే సమయంలో వాంగ్మూలం ఇచ్చిన వారి వద్ద జయ నెచ్చెలి, చిన్నమ్మ శశికళ తరఫున న్యాయవాది రాజ చెందూరు పాండియన్ క్రాస్ ఎగ్జామిన్ సైతం చేస్తున్నారు. ఈ విచారణల్లో పలు అంశాలు తరచూ వెలుగులోకి రావడం చర్చకు దారితీస్తోంది. ఈనేపథ్యంలో జయలలిత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో శ్వాస సంబంధిత పరీక్షల సమయంలో జరిగిన ఆడియో రికార్డింగ్ శనివారం వెలుగులోకి వచ్చింది. అలాగే, అమ్మకు అందిన ఆహారపు మెనూ సైతం బయటపడింది. ఇందులో జయలలిత వ్యక్తిగత వైద్యుడు శివకుమార్ అందించిన మెనుతో పాటు, ఆసుపత్రి వర్గాలు సమర్పించిన నివేదికలోనూ ఓ మెనూ ఉండడం చర్చకు దారితీసింది. రెండేళ్ల పాటు తన సూచన మేరకు జయలలితకు అందించిన ఆహార పదార్థాల గురించి శివకుమార్ కమిషన్ ముందు స్పష్టంచేశారు. అదే సమయంలో ఆస్పత్రిలో అందించిన ఆహార పదార్థాల్లో అత్యధికంగా తీపి ఉండడం చర్చకు దారి తీసింది. అమ్మకు మధుమేహం 20 ఏళ్లుగా జయలలిత మధుమేహంతో బాధ పడుతున్నట్టుసంకేతాలున్నాయి. ఆమె ఆస్పత్రిలో చేరినప్పుడు షుగర్ లెవల్స్ మరీ ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఆమెకు ఆస్పత్రిలో తీపి పదార్థాలు ఎలా ఇచ్చారో అన్న చర్చ ఊపందుకుంది. ఆసుపత్రి వర్గాలు సైతం ఎలా అనుమతించాయనే ప్రశ్న తెర మీదకు వచ్చింది. మధుమేహంతో ఉన్న వ్యక్తికి అదుపు లేకుండా ఎలా తీపి పదార్థాలు ఇచ్చారన్న ప్రశ్నను కమిషన్ సైతం తెరమీదకు తీసుకు రావడమే కాదు, ఆ దిశగా ప్రత్యేక పరిశీలన, విచారణకు ఆర్ముగస్వామి కమిషన్ నిర్ణయించినట్టు సమాచారం. అదేపనిగా ఇచ్చారా..? డిసెంబరు రెండు, మూడు తేదీల్లో ఆపిల్, మిల్క్‌షేక్స్, వంటి తీపి కల్గిన ఘన, ద్రవ పదార్థాలను జయలలిత స్వీకరించినట్టు ఆ నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది. అలాగే, నవంబర్ 22న లడ్డూ, గులాబ్ జాం, రసగుల్లా వంటి వాటిని సైతం అమ్మ స్వీకరించినట్టుగా మెనూ ద్వారా బయపడిందని సమాచారం. దీన్నిబట్టి చూస్తే, ఆమెకు తీపి పదార్థాలు అదే పనిగా ఆస్పత్రిలో ఎవరైనా ఇచ్చారా..? వైద్యులకు ఈ సమాచారం తెలుసా.. తెలియదా? అనే ప్రశ్న బయలుదేరింది. మధుమేహంతో ఉన్న జయలలితకు ఎందుకు ఇంతగా తీపి పదార్థాలు ఇవ్వాల్సి వచ్చిందో అని చర్చించుకునే వాళ్లు ఎక్కువే. ఈ తీపి పదార్థాల్ని అంశంగా తీసుకుని ఇక, ఆర్ముగస్వామి కమిషన్ విచారణను ఏకోణంలో ముందుకు తీసుకెళుతుందో వేచి చూడాల్సిందే. అలాగే, డాక్టర్ శివకుమార్‌తో పాటు మరికొందరు కొన్ని ఆడియో, వీడియోలను కమిషన్ ముందు ఉంచినట్టు సమాచారం. ఇవన్నీ బయటకు వచ్చిన పక్షంలో చర్చ మరింత ఊపందుకునే అవకాశాలున్నాయి. కాల్పుల ఘటనను దారి మళ్లించేందుకే! తూత్తుకుడి కాల్పుల ఘటనను దారి మళ్లించేందుకే అమ్మ ఆడియో, మెనూ వ్యవహారాలను ప్రభుత్వం తెరమీదకు తీసుకొచ్చిందని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నాయకురాలు సీఆర్ సరస్వతి ఆరోపించారు. ఇక, అమ్మ జయలలితకు అందించే ఆహారం గురించి వైద్యులు రాసి పెట్టుకోవడం సర్వ సాధరణమేనని, ఇదేమీ కొత్త కాదంటూ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ వ్యాఖ్యానించారు. -
వెలుగులోకి ఆసుపత్రిలోని జయ ఆడియో క్లిప్పులు
-
జయలలిత ఆడియో క్లిప్పుల విడుదల
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మాట్లాడిన ఆడియో క్లిప్పులు వెలుగులోకి వచ్చాయి. జయ మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ వీటిని శనివారం విడుదల చేసింది. దాదాపు 1.07 నిమిషాల నిడివి ఉన్న తొలి ఆడియో క్లిప్‌లో ‘మీకు రక్తపోటు(బీపీ) ఎక్కువగా ఉంది. సిస్టోలిక్ పీడనం 140గా ఉంది’ అని జయకు డ్యూటీ డాక్టర్ చెప్పారు. ఆమె వెంటనే ‘డయాస్టోలిక్ పీడనం ఎంతుంది?’ అని అడిగారు. దీనికి 140/80 అని డాక్టర్ జవాబిచ్చారు. దీంతో ‘అయితే అది నాకు మామూలే’ అని జయలలిత సంతృప్తి వ్యక్తం చేశారు. శ్వాస తీసుకోవడంలో తనకు ఎదురవుతున్న ఇబ్బందిని కేఎస్ శివకుమార్ అనే వైద్యుడికి వివరిస్తూ.. ‘శ్వాస తీసుకున్నప్పడు వస్తున్న గురకలాంటి శబ్దం నాకు స్పష్టంగా విన్పిస్తోంది. అది సినిమా థియేటర్లో అభిమానులు వేసే విజిల్స్‌లా ఉంది’ అని జయలలిత చమత్కరించారు. కమిషన్ విడుదల చేసిన మరో 33 సెకన్ల ఆడియో క్లిప్‌లో డా.శివకుమార్ జయతో మాట్లాడుతూ.. గతంతో పోల్చుకుంటే శ్వాస తీసుకుంటున్నప్పుడు వస్తున్న శబ్దం తీవ్రత తగ్గిందని జయలలితకు చెప్పారు. దీంతో ఆమె వెంటనే స్పందిస్తూ.. ‘గురకలాంటి శబ్దం ఎక్కువగా ఉండగానే రికార్డు చేసేందుకు మొబైల్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేయమని మీకు చెప్పాను. మీరేమో కుదరదన్నారు’ అని వ్యాఖ్యానించారు. దీంతో కుమార్ ‘మీరు చెప్పిన వెంటనే మొబైల్లో డౌన్లోడ్ చేశాను’ అని సమాధానమిచ్చారు. అలాగే ఆస్పత్రిలో భోజనానికి సంబంధించి జయలలిత రాసుకున్న లిస్ట్‌ను కమిషన్ బహిర్గతం చేసింది. కాగా, తూత్తుకుడి కాల్పుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఈ ఆడియో క్లిప్పులను విడుదల చేయించిందని ప్రతిపక్ష నేత స్టాలిన్ ఆరోపించారు. 2016, సెప్టెంబర్ 22న అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత 75 రోజుల చికిత్స అనంతరం డిసెంబర్ 5న చనిపోయారు. చికిత్స సమయంలో జయను ఎవ్వరికీ చూపకపోవడంతో ఆమె మరణంపై అనుమానాలు తలెత్తాయి. వీటిని నివృత్తి చేసేందుకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్‌ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ విచారణలో భాగంగా జయకు చికిత్స అందించిన వైద్యులు, అపోలో ఆస్పత్రి చీఫ్ ప్రతాప్.సి. రెడ్డి, జయ నెచ్చెలి శశికళ సహా పలువురి వాంగ్మూలాలను నమోదు చేశారు. -
భర్త రాసినట్లుగానే లేఖలు రాసి..
బంజారాహిల్స్: భార్యా, భర్తల మధ్య విభేదాలు సృష్టించి ఆమెను తనకు అనుకూలంగా మార్చుకోవాలని, ఇందుకోసం తన క్రిమినల్ బ్రెయిన్‌తో ఓ వివాహిత జీవితంతో చెలగాటమాడిన నిందితుడు మాల్యాద్రిని మరింత సమాచారం కోసం కస్టడీలోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు గురువారం తిరిగి జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్, వెంకటేశ్వరనగర్‌కు చెందిన మాల్యాద్రి అపో ఆస్పత్రిలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. శ్రీకృష్ణానగర్‌లోని ఓ ఇంటికి వెళ్లిన మాల్యాద్రి వివాహితతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని పథకం వేసిన అతను భర్తను అడ్డు తొలగించుకునేందుకు ఓ ముఠాకు సుపారీ ఇచ్చాడు. ఆమెపై భర్తకు అనుమానం కలిగేలా ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఉద్యోగం పేరిట బోగస్ అపాయింట్మెంట్ లెటర్ సృష్టించాడు. ఎల్వీ ప్రసాద్ హెచ్ఆర్ మాట్లాడుతున్నట్లుగా తానే ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి ఆమె భర్త రాసినట్లుగా కొన్ని లేఖలు రాసి ఆమె క్యారెక్టర్‌పై అనుమానాలు రేకెత్తించాడు. అపోలో ఆస్పత్రికి కూడా లేఖలు రాసి తనకు సంబంధాలు ఉన్నాయంటూ ఆమె భర్త రాసినట్లుగానే లేఖలు రాసి ఇద్దరి మధ్య చిచ్చుపెట్టాడు. దానిని తనకు అనుకూలంగా మార్చుకొని భర్త ఆమెను వెళ్లగొడితే తనతో పాటు ఉంచుకోవాలని పక్కా పథకం వేశాడు. అయితే చివరకు పోలీసులకు చిక్కాడు. అపోలో, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రుల నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, భర్త రాసినట్లుగా లేఖలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 20న నిందితుడిని అరెస్ట్ చేశారు. మరింత సమాచారం రాబట్టేందుకు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నాడు. ఆమెను దక్కించుకునేందుకే సదరు వివాహిత భర్తను హత్య చేయాలని సుపారి ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. బోగస్ పత్రాలు సృష్టించినట్లు అంగీకరించాడు. -
అంతా పక్కా ప్లాన్..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి నర్సు జీషా షాజిపై ప్రేమోన్మాది ప్రమోద్ పథకం ప్రకారమే దాడి చేశాడని నగర పోలీస్ కమిషనర్ అంజినీ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగానే కేరళ నుంచి యాసిడ్‌ను తీసుకువచ్చి ఆమెపై పోసినట్లు పేర్కొన్నారు. దాడి అనంతరం పారిపోయిన ప్రమోద్ను బంజారాహిల్స్ పోలీసులు కేరళ లోని మావోయిస్టు ప్రాబల్యం ఉన్న మారుమూల ప్రాంతంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ కె.శ్రీనివాసరావులతో కలిసి మంగళవారం తన కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన జీషా తరచూ పాలక్కాడ్ జిల్లాలో ఉంటున్న తన అమ్మమ్మ ఇంటికి వెళ్లేది. ఈ నేపథ్యంలో వారి పక్కింట్లో ఉం డే పెయింటర్ ప్రమోద్‌తో ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. వీరి మధ్య పెరిగిన సాన్నిహిత్యాన్ని ప్రేమగా భావించిన అతను గతేడాది ఆమెకు ప్రతిపాదించాడు. దీనిని జీషా సున్నితంగా తిరస్కరించడంతో ఆమెపై కక్షకట్టిన ప్రమోద్ వేధింపులకు దిగాడు. అతడి వ్యవహారశైలి నచ్చని ఆమె అతడి ని పూర్తిగా దూరం పెట్టింది. తనకు సంబంధించిన ఏ వివరాలూ అతడికి తెలియకుండా జాగ్రత్తపడింది. నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన జీషా గత జూలైలో హైదరాబాద్‌కు వచ్చి జూబ్లీహిల్స్ అపో లో ఆస్పత్రిలో హెల్త్ అసిస్టెంట్‌గా చేరింది. కొన్ని రోజల పాటు ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించిన ప్రమోద్ చివరకు ఫేస్బుక్ ద్వారా జీషా ప్రొఫైల్‌ను గుర్తించాడు. తొలుత ‘అబౌట్’ సహా ఇతర వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఫ్రెండ్ అయితే కానీ ఇది సాధ్యం కాదని తేలడంతో నేరుగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆమె దీనిని యాక్సెప్ట్ చేయకపోవడంతో కొత్త పథకం వేశాడు. ఓ యువతి ఫొటోతో నకిలీ పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసి దాని నుంచి రిక్వెస్ట్ పంపాడు. యువతే అన్న భావనతో జీషా అంగీకరించింది. తద్వారా ఆమె హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో పని చేస్తున్నట్లు గుర్తించాడు. ఇక్కడకు వచ్చి మరోసారి ప్రతిపాదించాలని భావించిన అతగాడు ఆమె తిరస్కరిస్తుందని అనుమానించాడు. అలా జరిగితే ఆమెపై దాడి చేయాలనే ఉద్దేశంతో కేరళలోనే యాసిడ్ ఖరీదు చేశాడు. వాటర్ బాటిల్లో యాసిడ్‌ను తీసుకువచ్చిన ప్రమోద్ గత గురువారం ఆపోలో ఆస్పత్రి వద్ద కాపుకాశాడు. సాయంత్రం ఆస్పత్రి నుంచి హాస్టల్‌కు వెళ్తున్న జీషా వద్దకు వెళ్లిన అతను మరోసారి ప్రతిపాదించడంతో పాటు వెంట పడటం ప్రారంభించాడు. తిరస్కరించిన జీషా వెళ్లిపోతుండగా వెనుక నుంచి ఆమెపై యాసిడ్‌తో దాడి చేశాడు. పది శాతం కాలిన గాయాలతో బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దాడి అనంతరం తన సెల్‌ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ చేసుకు న్న ప్రమోద్ కేరళకు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బంజా రాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇన్స్పెక్టర్ కస్తూరి శ్రీనివాస్ నేతృత్వంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె.రవికుమార్ తదితరులతో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతికంగా ముందుకు వెళ్లిన ఈ టీమ్స్ కేరళలోని పాలక్కాడ్ జిల్లా కేంద్రానికి 80 కిమీ దూరంలో ఉన్న అత్తిపడి వద్ద ప్రమోద్ తలదాచుకున్నట్లు గుర్తించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడి ఆచూకీ తెలుసుకుని పట్టుకున్నారు. ‘ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్స్ యాక్సెప్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతంగా తెలిసిన వారి అభ్యర్థనలే అంగీకరించాలి. లేదా కొన్ని సందర్భాల్లో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయడానికి ఈ కేసే ప్రత్యక్ష ఉదాహరణ’ అని పోలీసు కమిషనర్ అంజినీ కుమార్ అన్నారు. ‘యాసిడ్ అమ్మకాలు అధీకృతంగానే జరగాలి. పరిచయస్తులు, దుర్వినియోగం చేయరని రూఢీ అయిన వారికే విక్రయించాలి. ఎవరికి పడితే వారికి విక్రయించినప్పుడు జరగరానికి జరిగితే సదరు వ్యాపారులూ నిందితులుగా మారతారు’ అని డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రమోద్ను బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
సందడి చేసిన సన్‌రైజర్స్
-
జయ రక్త నమూనాలు మా వద్ద లేవు: అపోలో
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత చికిత్సకు సంబంధించిన వైద్య డాక్యుమెంట్లు, రక్త నమూనాలు తమ వద్ద లేవని అపోలో ఆస్పత్రి యాజమాన్యం మద్రాసు హైకోర్టుకు తెలిపింది. అమృత అనే యువతి జయలలిత కుమార్తెగా రుజువు చేసుకునేందుకు డీఎన్ఏ పరీక్షలు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో జయ రక్తనమూనాలపై బదులివ్వాల్సిందిగా జడ్జి అపోలో ఆస్పత్రిని ఆదేశించారు. ‘ఆమె చికిత్సకు సంబంధించిన పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాం. చికిత్స సమయంలో ఆమె నుంచి సేకరించిన నమూనాలను అప్పటికప్పుడే వాడేశాం. ప్రస్తుతం మావద్ద ఏమీ లేవు’ అని గురువారం కేసు విచారణ సందర్భంగా కోర్టుకు ఆస్పత్రి వివరణ ఇచ్చింది. -
జయలలిత: అపోలోకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత రక్త నమూనాలు వెంటనే సమర్పించాలని అపోలో ఆసుపత్రిని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. తాను జయలలిత కూతుర్ని అని అమృత అనే యువతి గతంలో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జయలలిత రక్త నమూనాలతో తన డీఎన్ఎను పోల్చి.. ఆమె వారసురాలిగా తనను గుర్తించాలని అమృత పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు బుధవారం అపోలో ఆసుపత్రికి ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కాగా 2016 సెప్టెంబర్‌లో అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన జయలతిత అదే ఏడాది డిసెంబర్ 5న మృతిచెందిన విషయం తెలిసిందే. -
విచారణకు ప్రతాప్ సీ రెడ్డి
సాక్షి, చెన్నై : అమ్మ జయలలిత మరణం కేసు విచారణకు హాజరు కావాలని అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డికి సమన్లు జారీ చేయడానికి కమిషన్ కసరత్తులు చేపట్టింది. వారం రోజుల్లో ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. జయలలిత మరణం మిస్టరీని నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్ విచారణను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. పలు కోణాల్లో విచారణ సాగిస్తోంది. జయలలితకు సన్నిహితంగా ఉన్న అందరి వద్ద వాంగ్మూలం సేకరించింది. జయలలిత ఆస్పత్రిలో మరణించిన దృష్ట్యా, ఆమెకు అందించిన వైద్య పరీక్షలు, ఇతర విషయాలను రాబట్టేందుకు ఇప్పటికే అపోలోకు సమన్లు జారీచేసింది. ఆ మేరకు అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, ఆయన కుమార్తె ప్రీతా రెడ్డి తరఫున నివేదిక కమిషన్‌కు చేరింది. ఈ నివేదికలోని వైద్య సంబంధిత అంశాలను ఆ కమిషన్ ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ ఒకటి రెండు రోజుల్లో ముగిసే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు తమ విచారణలో సేకరించిన, అంశాలతో పాటు, ఆ నివేదికలోని మరికొన్ని అంశాల గురించి సమగ్రంగా నివృతి చేసుకోవాల్సి ఉండడంతో ప్రతాప్సీ రెడ్డిని విచారణకు పిలిచేందుకు కమిషన్ చర్యలు చేపట్టింది. ఆయనకు ఒకటి రెండు రోజుల్లో సమన్లు జారీచేసి, వారంలోపు విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశాలిచ్చే అవకాశాలున్నాయి. -
అపోలో ప్రతాప్ రెడ్డికి గుండెపోటు
సాక్షి, చెన్నై: అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డికి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుండెపోటు వచ్చింది. ఆయనకు చెన్నై థౌజండ్ లైట్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చెన్నై తేనాం పేటలోని నివాసంలో శుక్రవారం రాత్రి ఆయనకు శ్వాస సమస్య తలెత్తింది. ఆ వెంటనే గుండెపోటు రావడంతో స్పృహ తప్పారు. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో రాత్రంతా చికిత్స అందించారు. యాంజీయోగ్రామ్ చికిత్స అనంతరం బీపీ, మధుమేహం తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ఐసీయూ నుంచి వీఐపీ వార్డుకు మార్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పరీక్షిస్తున్నారు. -
భర్తను కారుతో ఢీకొట్టిన భార్య
బంజారాహిల్స్: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తన భార్య కోసం వెతుకుతున్న భర్తను ఆమె కారుతో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాసబ్‌ట్యాంక్ రహమాన్ టవర్‌లో ఉంటున్న మహ్మద్ మన్నన్‌ఖాన్ జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం అతని భార్య బుతుల్ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె హైదరాబాద్‌లోనే ఉన్నట్లు సమాచారం రావడంతో మన్నన్‌ఖాన్ ఆమె కోసం గాలిస్తున్నాడు. ఈ నెల 17వ తేదీ రాత్రి ఆమె బంజారాహిల్స్ రోడ్ నెం.12లో కారులో వెళ్తున్నట్లు సమాచారం అందడంతో మన్నన్‌ఖాన్ అక్కడికి వెళ్లగా ఓ వైన్‌షాప్ వద్ద ఆమెను చూసి పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆమె కారు డోరుతో తోసేసింది. కిం దపడ్డ మన్నన్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్పృహతప్పి పడిపోయాడు. అతడి స్నేహితుడు నయీం బాధితుడిని అపోలో ఆస్పత్రికి తరలించాడు. తనను కావాలనే ఢీకొ ట్టిందని బాధితుడు తెలిపినట్లు అతని తండ్రి మాజిద్‌ఖాన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బుతుల్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మైక్రోసాఫ్ట్, అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యం
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ప్రముఖ హెల్త్‌కేర్ రంగ కంపెనీ అపోలో హాస్పిటల్స్ తాజాగా గుండె సంబంధిత వ్యాధుల్లో అధునాతన టెక్నాలజీ వినియోగానికి చేతులు కలిపాయి. కార్డియాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోకస్డ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి ఇవి కలిసి పనిచేస్తాయి. గుండె వ్యాధులకు సంబంధించి రోగికున్న ప్రమాదాన్ని ముందే అంచనా వేయడానికి, అలాగే డాక్టర్లకు వ్యాధి ట్రీట్మెంట్కు అవసరమైన సాయమందించేందుకు కొత్త మెషీన్ లెర్నింగ్ విధానాలను ఇవి అభివృద్ధి చేస్తాయి. ఈ టెక్నాలజీలు... గుండె సంబంధిత వ్యాధులను మెరుగ్గా అంచనా వేయడానికి, నివారించడానికి దోహదపడతాయని అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి పేర్కొన్నారు. -
శస్త్రచికిత్సతో వినికిడి లోపం మాయం
సాక్షి, హైదరాబాద్: పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధపడుతున్న ఆరేళ్ల చిన్నారికి ‘హైరెన్ ఆల్ట్రా కాక్లియర్ ఇంప్లాంటేషన్’వినికిడి శక్తిని ప్రసాదించింది. దేశంలోనే ఈ తరహా ఇంప్లాంటేషన్ ఇదే తొలిదని ప్రముఖ కాక్లి్లయర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ ఈసీ వినయ్‌కుమార్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన చికిత్స వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన నర్సింగరావు, నిత్య కుమారుడు యశ్వంత్(6) పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం అపోలో ఆస్పత్రి డాక్టర్ వినయ్‌కుమార్‌ను సంప్రదించారు. ఆయన కాక్లియర్ ఇంప్లాంటేషన్ ద్వారా వినికిడి శక్తితో పాటు మాటలను తెప్పించవచ్చని సూచించారు. ఇందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో దేశంలోనే తొలిసారిగా దీన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో యశ్వంత్‌కు విజయవంతంగా అమర్చారు. ఈ సర్జరీ సులువుగా, సురక్షితంగా నిర్వహించామని డాక్టర్ వినయ్ చెప్పారు. మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అతి చిన్న సాధనాల్లో ఇది కూడా ఒకటి కావడం వల్ల పిల్లలకు సరిగ్గా అతుకుతుందన్నారు. ఈ పరికరాన్ని ఎముక, చర్మానికి మధ్యలో పెడతారని తెలిపారు. ఉత్తమ వినికిడికి వీలుగా విస్తృత స్థాయిలో శబ్దాలను గ్రహిస్తుందని చెప్పారు. -
విశ్వాసమే కీలకం
సాక్షి, హైదరాబాద్: ‘రోగులు వైద్యులను దేవుడిలా భావిస్తారు. అలాం టి వైద్యుడిపై ప్రస్తుతం రోగుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. జబ్బును ముందే గుర్తించి హెచ్చరించినా లెక్కచేయడం లేదు. తమ నుంచి డబ్బులు గుంజేందుకే లేని రోగాన్ని ఉన్నట్లు చెప్పి భయపెడుతున్నారని భావిస్తున్నారు. వైద్యుల పట్ల నమ్మ కం లేకపోవడం వల్ల వారికంటే ఎక్కువగా నష్టపోయేది రోగులేనన్న విషయాన్ని గుర్తించాలి’ అని పలు వురు ప్రముఖ వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు. రోజు వారి వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం ‘నాట్ జస్ట్ మెడ్స్–లెట్స్ టాక్ బియాండ్ మెడిసిన్’ అనే అంశం పై ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్క్ హోటల్లో జరిగిన సదస్సులో అపోలో ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని, కేర్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు, సన్‌షైన్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి, స్టార్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ గోపిచంద్ మన్నం, డాక్టర్ అమిత్వారే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోగుల్లో తమపై నమ్మకం సడలకుండా చూడాల్సిన బాధ్యత వైద్యులదని అన్నారు. మరోవైపు వృత్తిపరంగా చోటు చేసుకుంటున్న సాంకేతిక మార్పులు, చట్టాలు, ఇతర సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. మెడికల్ కాలేజీ నుంచి బయటకొచ్చి వైద్యుడిగా ప్రాక్టీస్ మొదలు పెట్టిన తర్వాత అనేక అంశాలు సవాల్‌గా మారుతాయని, వృత్తిపరమైన అంశాలే కాదు, ఆర్థిక, సామాజిక అంశాలు, కుటుంబ పరమైన సమస్యలు తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తుంటాయన్నారు. వీటిని తట్టుకోలేక అనేక మంది యువ వైద్యులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. చేస్తే ఒక సమస్య.. చేయకపోతే మరో సమస్య వైద్య పరీక్షలు చేస్తే ఎందుకు చేశారని, చేయకపోతే వ్యాధినెలా నిర్ధారించారని ప్రశ్నిస్తున్నారు. రోగికి ఏదైనా జరిగితే.. వైద్యుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు. నిజం చెప్పినా నమ్మని దుస్థితి. ఇది వైద్యుల కంటే రోగులకే నష్టం తెచ్చిపెడుతుంది. –డాక్టర్ సోమరాజు మధ్యవర్తుల జోక్యం వల్లే.. వైద్యసేవల్లో రాజకీయ నాయకులు, ఇతరుల జోక్యం పెరిగింది. బాధితుల కంటే ఎక్కువ వీరే హల్చల్ చేస్తున్నారు. బెదిరింపులకు, దూషణలకు పాల్పడుతున్నారు. ఈ మార్పు రోగులకు, వైద్యులకు మధ్య కొంత గ్యాప్‌ను పెంచింది. ఇది మంచిది కాదు. వైద్యులపై నమ్మకం ఉంచాలి. –డాక్టర్ ఏవీ గురువారెడ్డి ఒత్తిడి వల్లే వైద్యులు చనిపోతున్నారు ఇతరులతో పోలిస్తే వైద్యులు ఐదు నుంచి పదేళ్లు తక్కువ జీవిస్తున్నారు. వ్యక్తిగత జీవితాన్ని కూడా నష్టపోతున్నారు. వృత్తిపరమైన సమస్యలతో అనేకమంది వైద్యులు ఒత్తిడికి గురవుతున్నారు. వృత్తిపరమైన, ఆర్థికపరమైన ఒత్తిళ్లను తట్టుకోలేక దేశవ్యాప్తంగా ఏటా 2,500 మంది వైద్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. –డాక్టర్ హరిప్రసాద్, అపోలో ఆస్పత్రి -
అస్వస్థతకు గురైన సీఎం.. అపోలోలో చికిత్స
సాక్షి, చెన్నై: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అస్వస్థతకు గురయ్యారు. శనివారం తెల్లవారుజామున అస్వస్థతకు గురికావడంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఎం విజయన్‌కు ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే విజయన్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు ఇప్పటి వరకూ ఎలాంటి బులిటెన్ విడుదల చేయలేదు. కాగా, ఆహారం దొంగిలించాడనే కోపంతో గతనెలలో ఆదివాసీ యువకుడు మధు చిందకి అనే యువకుడిని కొట్టి చంపిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేరళ పాలక్కాడ్ జిల్లాలోని అత్తపడిలో బియ్యం దొంగిలించినందుకు ఓ గుంపు ఎగబడి మధును దారుణంగా కొట్టి చంపింది. ఈ నేపథ్యంలో అతని కుటుంబసభ్యులను పరామర్శించేందుకు విజయన్ శుక్రవారం చెన్నై వెళ్లారు. ఈ క్రమంలో శనివారం ఆయన అస్వస్థతకు గురయ్యారు. -
చిత్తూరు ఆస్పత్రిలో ఏం జరుగుతోంది
పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది చిత్తూరు ప్రభుత్వాస్పత్రి తీరు. పేరుకు కార్పొరేట్ సంస్థ అపోలో ఇక్కడ ఉందనడమే తప్ప నిజంగా ఆ స్థాయిలో వైద్య సేవలు ఏ మాత్రం కనిపించడం లేదు. ఫలితంగా రోగుల ప్రాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. చిత్తూరు అర్బన్: చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని బయటి నుంచి చూస్తే మార్పులు చేసినట్లు కనిపిస్తున్నా అత్యవసర సమయంలో వైద్యం కోసం వచ్చే సామాన్యుడికి మెరుగైన సేవలు అందడంలేదు. ఇక్కడి వైద్య సేవలను కార్పొరేట్ సంస్థ అపోలోకు అప్పగించినా ప్రభుత్వ వైద్యులు, ఆ సంస్థ వైద్యాధికారుల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది. పలు విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదు.ప్రభుత్వ వైద్యులు సొంత ఆస్పత్రులపై చూపే శ్రద్ధ దీనిపై పెట్టడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గణాంకాలు భేష్.. చిత్తూరు ప్రభుత్వాస్పత్రి నిర్వహణ భాద్యతల నుం చి ప్రభుత్వం పక్కకు తప్పుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) మోడ్ కింద అపోలో సంస్థలకు 33 ఏళ్లపా టు లీజుకు ఇవ్వడం తెలిసిందే. అప్పటి వరకు రోజుకు 900 మంది ఉన్న అవుట్ పేషెంట్ల సంఖ్య 2,400కు చేరుకుంది. 350 పడకలకుగానూ 300 మంది వరకు ఇన్‌పేషంట్లుగా ఉన్నారు. అయినా సరే అర్ధరాత్రులు అత్యవసర సేవలు అందడం లేదు. వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. నిన్నటికినిన్న ఒకేసారి నాలుగు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గుండె, ఊపిరితిత్తులు తదితర ప్రత్యేక ఐసీయూ యూనిట్లు ఉన్నా వాటిల్లో సరైన సిబ్బంది లేరనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. విభాగాలు వెలవెల.. చిత్తూరు ఆస్పత్రిలో ఆర్థో, ఆప్తమాలజీ, ఈఎన్టీ, గైనిక్, చిన్నపిల్లల విభాగాలతో పాటు కార్డియో, జనరల్ సర్జన్ లాంటి ఐసీయూలు సైతం ఉన్నాయి. వైద్యవిధాన్ పరిషత్ (ఏపీవీవీపీ) కింద ఇక్కడ వైద్యులతో కలిపి 200 మంది వరకు ఉన్నారు. అపోలో సంస్థల నుంచి మరో 150 మంది వరకు ఉన్నారు. మెడికల్ సూపరింటెండ్ నుంచి, ప్రాంతీయ వైద్యాధికారి లాంటి కీలక పోస్టులు ఇన్‌చార్జ్‌లతో ఉండటంతో పర్యవేక్షణ కొరవడింది. రేడియాలజీ, ఆర్థో విభాగాధిపతుల పోస్టులు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోలేదు. అత్యవసర వైద్యం కోసం వచ్చే వారికి చికిత్స అందించడం రిస్క్‌గా భావించి వేలూరు, తిరుపతి ఆస్పత్రులకు రెఫర్ చేస్తూ చేస్తున్నారు. ఎవరిష్టం వారిది.. ఆస్పత్రిలో రోజుకు ఎందరు వైద్యులు వస్తున్నారు, ఏం పనులు చేస్తున్నారనే పర్యవేక్షణ ఉండడం లేదు. ప్రాంతీయ వైద్యాధికారి (ఆర్ఎంవో)కి రికార్డుల్లో ఉన్న అపోలో డాక్టర్లు, సిబ్బంది కనిపించకుంటే ఎవర్ని అడగాలో తెలియదు. రాత్రిపూట అపోలో వైద్యులు స్టే డ్యూటీ చేయాల్సింటే ‘మీరెవరు మాకు చెప్పడానికి..’ అంటుంటారు. దీనిపై ప్రభుత్వ వైద్యులు డీసీహెచ్ఎస్, ఎంఎస్‌లకు రాత పూర్వక ఫిర్యాదులు ఇచ్చినా ఫలితం శూన్యం. పేరుకు పరిపాలన ప్రభుత్వ వైద్యాధికారులకే ఉన్నా పెత్తనం మొత్తం అపోలో చేతుల్లో ఉందని వైద్యవిధాన్ పరిషత్ అధికారులు అందరిముందే చెబుతున్నారు. అపోలో వైద్యులు రావడంతో ఇన్నేళ్లు తాము పడుతున్న కష్టానికి కొద్దిగా విశ్రాంతి వస్తుందని భావించిన ప్రభుత్వ వైద్యాధికారుల్లో జవాబుదారీతనం కొరవడిందనే చెప్పాలి. ఇక్కడ పనిచేసే 90 శాతం వైద్యుల్లో కొందరు సొంతంగా ఆస్పత్రులు పెట్టుకుంటే, మరికొందరు క్లినిక్స్‌లో ప్రాక్టీసు చేసుకుంటున్నారు. ఇందులో అపోలో వైద్యులకు మినహాయింపు లేదు. ఫలితం సామాన్యులపై.. వైద్యాధికారుల్లో సమన్వయ లోపం ఆస్పత్రికి వచ్చే రోగులపై చూపిస్తోంది. కొన్ని విభాగాలను ఇప్పటికే యూనిట్–1, యూనిట్–2గా విభజించేశారు. వైద్యులు అందర్నీ చూడాల్సిన అవసరం లేదని యూనిట్లకు పరిమితం చేశారు. కాన్పుల వార్డుల్లో స్టేయింగ్ డ్యూటీ చేసేవారు లేకపోవడంతో హైరిస్క్‌తో వస్తున్న గర్భిణుల నాడి పట్టేవాళ్లు కనిపించడలేదు. ఫలితంగా రోగులకు ప్రాణం పోయాల్సిన బంగారు ఘడియలు (గోల్డెన్ హవర్) దుర్వినియోగమవుతున్నాయి. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎంఎన్ఓ, డార్క్ రూమ్ అసిస్టెంట్, ఏఎన్ఎం లాంటి 40కు పైగా పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. కలెక్టర్ కలుగజేసుకుని అపోలో, ప్రభుత్వ వైద్యులను ఓ గాడిలోకి తీసుకురావడంతో పాటు ఖాళీల భర్తీకి చర్యలు చేపడితే గాని ప్రజలకు నమ్మకం ఏర్పడే పరిస్థితి లేదు. -
అపోలో హాస్పిటల్స్ లాభం రూ. 67 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్ నికర లాభం (స్టాండెలోన్ ప్రాతిపదికన) సుమారు 7 శాతం క్షీణించి రూ. 67 కోట్లకు పరిమితమైంది. వ్యయాలు పెరగడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో సంస్థ నికర లాభం రూ. 73 కోట్లు. మరోవైపు తాజాగా ఆదాయం రూ. 1,681 కోట్ల నుంచి రూ. 1,896 కోట్లకు పెరిగింది. విభాగాలవారీగా చూస్తే హెల్త్‌కేర్ సర్వీసుల విభాగం ఆదాయం రూ. 892 కోట్ల నుంచి రూ. 1,008 కోట్లకు, ఫార్మసీ విభాగం రూ. 789 కోట్ల నుంచి రూ. 888 కోట్లకు పెరిగినట్లు అపోలో హాస్పిటల్స్ పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ. 1,600 కోట్ల నుంచి రూ. 1,806 కోట్లకు పెరిగినట్లు వివరించింది.