ర‌జ‌నీ ఆరోగ్యంపై మోహన్‌బాబు ఆరా | Mohan Babu Phone To Rajinikanth Wife Inquiry About Rajini Health | Sakshi
Sakshi News home page

ర‌జ‌నీకాంత్ యోగ‌క్షేమాలు తెలుసుకున్న మోహ‌న్‌బాబు

Dec 26 2020 8:21 AM | Updated on Dec 26 2020 10:15 AM

Mohan Babu Phone To Rajinikanth Wife Inquiry About Rajini Health - Sakshi

ర‌జ‌నీకాంత్,మోహ‌న్‌బాబు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, చిత్తూరు : అస్వ‌స్థ‌త‌కు గుర‌వ‌డంతో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ శుక్ర‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లోని అపోలో హాస్పిట‌ల్స్‌లో చికిత్స నిమిత్తం చేరారు. బీపీ పెర‌గ‌డంతో ఇబ్బందిప‌డ్డ‌ ఆయ‌న ఆరోగ్య స్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ, చికిత్స అందిస్తున్న‌ట్లు ఆస్పత్రి వ‌ర్గాలు ఒక అధికార ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు.
(చదవండి : రజనీకాంత్‌కు తీవ్ర అస్వస్థత)

కాగా ర‌జ‌నీకాంత్‌, మోహ‌న్‌బాబు అత్యంత స‌న్నిహిత మిత్రుల‌నే విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం మోహ‌న్‌బాబు తిరుప‌తిలో ఉన్నారు. త‌న స్నేహితుడు అస్వ‌స్థ‌త‌తో ఆస్పత్రిలో చేరార‌నే వార్త తెలుసుకున్న ఆయ‌న ఆందోళ‌న‌కు గుర‌య్యారు. వెంట‌నే ఆయ‌న యోగ‌క్షేమాలు తెలుసుకునేందుకు ర‌జ‌నీ భార్య ల‌త‌కు, కుమార్తె ఐశ్వ‌ర్య‌కు, సోద‌రికి ఫోన్లు చేశారు. ర‌జ‌నీ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌నీ, ఎలాంటి ఆందోళ‌నా ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌నీ వారు చెప్ప‌డంతో మోహ‌న్‌బాబు కుదుట‌ప‌డ్డారు.ర‌జ‌నీ మాన‌సికంగా, శారీర‌కంగా దృఢ‌మైన వ్య‌క్తి అనీ, ఈ అస్వ‌స్థ‌త నుంచి ఆయ‌న త్వ‌ర‌గా కోలుకుని, ఎప్ప‌టిలా త‌న ప‌నులు మొద‌లుపెడ‌తార‌నీ మోహ‌న్‌బాబు ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement