
సాక్షి, హైదరాబాద్ : అధిక రక్తపోటుతో బాధపడుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు ఆదివారం ఉదయం వెల్లడించారు. ఆయనకు నిన్న (శనివారం) కొన్ని పరీక్షలు చేశామని, వాటి రిపోర్టులు రావాల్సి ఉందని వైద్యులు పేర్కొన్నారు. రిపోర్టులను బట్టి రజనీకాంత్‌ను డిశ్చార్జ్ చేసే అంశంపై అపోలో వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, రజనీకాంత్ ఈ రోజు సాయంత్రం చెన్నైకి వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కోసం బేగంపేట విమానాశ్రయంలో చార్టెడ్ ఫ్లైట్ రెడీగా ఉందట. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రజనీకాంత్ చెన్నై వెళ్తారని సమాచారం.