రజనీకాంత్‌ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ | Rajinikanth Health Update: Apollo Doctors Released Health Bulletin | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్‌ విడుదల

Published Sat, Dec 26 2020 11:24 AM | Last Updated on Sat, Dec 26 2020 2:09 PM

Rajinikanth Health Update: Apollo Doctors Released Health Bulletin - Sakshi

'సాక్షి, హైదరాబాద్‌: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్య బృందం పేర్కొంది. శుక్రవారంతో పోలిస్తే నేడు ఆయన ఆరోగ్యం కొంచెం మెరుగుపడిందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు శనివారం ఉదయం రజనీకాంత్‌ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి యాజమాన్యం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.

‘రజనీకాంత్ ఆరోగ్యం, ఆయన రక్తపోటుకు సంబంధించి అందుతున్న వైద్యంపై క్లోజ్‌గా మానిటర్ చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఆయన రక్తపోటు ఇప్పటికి కూడా అధికంగానే ఉంది. రక్తపోటును తగ్గించేందుకు మందులు అందిస్తున్నాం. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాం. సాయంత్రానికల్లా నివేదిక వస్తుంది. ఆ తర్వాత అతనికి అందించాల్సిన చికిత్స గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. శనివారం సాయంత్రం కూడా పరీక్షలు నిర్వహించి అంతా సవ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్నాకే డిశ్చార్జ్‌పై నిర్ణయం తీసుకుంటాం’అని అపోలో  వైద్య బృందం ప్రకటించింది.

కాగా ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్‌ నిమిత్తం రజనీకాంత్‌ ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్‌లో పలువురు కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలోనే‌ శుక్రవారం ఉదయం రజనీకి రక్తపోటు అధికం కావడంతో వెంటనే నగరంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement