health bulletin
-
తమ్మినేని ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన ఏ ఐజీ హాస్పిటల్
-
నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని.. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్‌కి చేరుకుంటున్నాయని ఏఐజీ ఆసుపత్రి ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తమ్మినేని వీరభరం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని తెలిపిన వైద్యులు.. ఊపిరితిత్తుల్లోని నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. లంగ్స్‌లో నీరునీ వైద్యులు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రసుత్తం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. మెడిసిన్‌కి తమ్మినేని రెస్పాండ్ అవుతున్నారని, ఆరోగ్యం కుదట పడితే వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉంటుందని.. వచ్చే 24 నుంచి 48 గంటలు చాలా కీలకమని వైద్యులు పేర్కొన్నారు. స్వగ్రామమైన ఖమ్మం జిల్లాలోని తెల్దారుపల్లిలో ఉన్న తమ్మినేనికి సోమవారం సాయంత్రం ఒంట్లో నలతగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పల్స్ తక్కువగా ఉండటాన్ని గుర్తించి వెంటనే చికిత్స అందించారు. అయితే గుండె కొట్టుకోవడంలో తేడాలున్నాయని వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు తమ్మినేనిని వెంటిలేటర్ సపోర్టుతో ఖమ్మం నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. -
TS: కొత్త వేరియంట్ కలకలం.. జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఇలా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 పాజిటివ్ కేసులు నమోదు అవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక, తెలంగాణలో కొత్తగా మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యారోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. తెలంగాణలో ఈరోజు కొత్తగా ఆరు కేసులు నమోదు కాగా, వైరస్ నుంచి ఒకరు కోలుకున్నారు. కాగా, ఇప్పటి వరకు తెలంగాణలో 20 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో 19 మందికి చికిత్స జరుగుతోంది. ఇక, నేడు హైదరాబాద్‌లో నాలుగు, మెదక్‌లో ఒకటి, రంగారెడ్డిలో ఒక పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. ఈరోజు 925 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. వీరిలో ఇంకా 54 మందికి సంబంధించి కోవిడ్ టెస్టు రిజల్ట్ రావాల్సి ఉందని అధికారులు బులిటెన్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం చోటుచేసుకుంది. భూపాలపల్లి జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కొత్త వైరస్ సోకి.. ఎంజీఎం కోవిడ్ వార్డులో చేరినట్లు తెలుస్తోంది. అంతేగాక నగరానికి చెందిన మరో ముగ్గురిని సైతం అనుమానితులుగా గుర్తించినట్లు వాట్సాప్‌లో సమాచారం చక్కర్లు కొట్టింది. దీంతో రోగులు, అటెండెంట్లు ఆందోళనకు గురవుతున్నారు. కాగా కరోనా భయంతో ఆసుపత్రి సిబ్బంది నో మాస్క్, నో ఎంట్రీ విధానాన్ని పాటిస్తున్నట్లు సమాచారం. మాస్క్‌లు లేకుండా ఎవరిని లోపలికి రావొద్దని సెక్యూరిటీ చెబుతున్నారు. ఆసుపత్రిలో కరోనా కేసులు నమోదయ్యాయన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో, ఎంజీఎం అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎంజీఎం కొవిడ్ వార్డులో ఎలాంటి అనుమానితులు గానీ, కరోనా జేఎన్1 లక్షణాలు ఉన్న వారు గానీ నమోదు కాలేదని తెలిపారు. -
మాజీ సీఎం కేసీఆర్ కు సర్జరీ సక్సెస్
-
కేసీఆర్‌కు 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరం: వైద్యులు
-
హీరో విజయ్‌కాంత్ హెల్త్ బులెటిన్.. ఆరోగ్యం ఎలా ఉందంటే?
ఈ మధ్య అనారోగ్యానికి గురైన తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కాంత్.. అనారోగ్యం వల్ల ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్!) 'విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. అయినప్పటికీ గత 24 గంటల్లో ఆయన పరిస్థితి స్థిరంగా లేనందున.. ఆయనకు పల్మనరీ చికిత్సలో సహాయం కావాలి. త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాం. ఇంకా 14 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది' అని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో విజయకాంత్‌ను.. ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల ఆస్పత్రిలో చేర్పించారు. డయాబెటిస్ కారణంగా గతంలో ఆయన కుడికాలి మూడు వేళ్లని తొలగించారు. (ఇదీ చదవండి: Kiraak RP Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..) -
నటుడు విజయకాంత్ హెల్త్ బులిటెన్ విడుదల
డీఎండీకే అధినేత, సీనియర్ నటుడు విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదని మళ్లీ వార్తలు తెరపైకి వచ్చాయి. చెన్నై మయత్ ఆస్పత్రి యాజమాన్యం నివేదిక ప్రకారం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ మరికొన్ని రోజులపాటు చికిత్స అందించాల్సి ఉందని తెలిపింది. డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్య కారణాలతో నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చేరారు. విజయకాంత్ దగ్గు, జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నందున సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లినట్లు డీఎండీకే నేతలు అప్పట్లో వివరించారు. సుమారు 10 రోజుల నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై వారు పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. విజయకాంత్ సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లారని.. ఒకట్రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తారని ఇలాంటి పరిస్థితిల్లో ఆయనపై వచ్చే వదంతులను ఎవరూ నమ్మవద్దని వారు తెలిపారు. కానీ ఆయనకు ఇప్పటికీ కూడా ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తుండటంతో అభిమానుల్లో అనుమానం పెరిగిపోయింది. వైద్యులు ఏమైనా దాస్తున్నారా..? అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఈ పరిస్థితిలో, ఈ రోజు (29-11-2023), DMDK అధినేత విజయకాంత్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మయత్ హాస్పిటల్ వైద్యులు నివేదికను విడుదల చేశారు. అందులో విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు. నిన్నటి వరకు ఆయన బాగానే ఉన్నారని కానీ గత 24 గంటల నుంచి అతని ఆరోగ్య పరిస్థితి స్థిరంగా లేనందున, అతనికి పల్మనరీ చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అతను త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని అందులో తెలిపారు. వైద్యుల సూచన ప్రకారం అతనికి ఇంకా 14 రోజులు ఆసుపత్రిలో నిరంతర చికిత్స అవసరం ఉందని తెలిపారు. -
చంద్రబాబు చర్మ సంబంధిత సమస్యకు జైల్లో చికిత్స
-
D Srinivas: డీఎస్ పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్(74) హెల్త్ బులిటెన్ విడుదల అయ్యింది. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నాం రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నాయి. శ్వాస సంబంధిత సమస్యలతో సోమవారం మధ్యాహ్నాం నగరంలోని ఓ ఆస్పత్రిలో ఆయన్ని చేర్పించారు. అప్పటి నుంచే ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం ఇవాళ మరింత విషమించినట్లు తెలుస్తోంది. ‘‘ఆయన శ్వాస తీస్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ICU లో ట్రీట్మెంట్ అందిస్తున్నాం. వయసు రీత్యా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తాయి. ఆస్తమా, కిడ్నీల సమస్య, బీపీ పడిపోవడం లాంటి సమస్యలున్నాయి. 48 గంటలు గడిస్తే కానీ హెల్త్ కండిషన్ చెప్పలేం. :::సిటీ న్యూరో వైద్యుడు ప్రవీణ్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి, నిజామాబాద్ రూరల్ నుంచి ధర్మపురి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు డి. శ్రీనివాసే పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. డీఎస్ ఉమ్మడి ఏపీలో రెండుసార్లు మంత్రిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్)లో రాజ్యసభ సభ్యుడిగానూ పని చేశారు. ఆయన కొడుకులు ఇద్దరూ రాజకీయాల్లో ఉండగా.. చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీ. అనారోగ్యం కారణంగా డీఎస్ కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. -
ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, కర్నూలు: ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్‌ను విశ్వభారతి ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో లక్ష్మమ్మకు చికిత్స అందిస్తున్నారు. లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమెకు సీసీయూలో చికిత్స కొనసాగుతుందన్నారు. అల్ట్రా స్కాన్‌లో పరీక్షలో పురోగతి కనిపించింది. లక్ష్మమ్మను సాధారణ రూమ్‌కు షిఫ్ట్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. కాగా, పులివెందుల భాకరాపురంలోని తమ నివాసంలో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మాతృమూర్తి లక్ష్మమ్మ ఛాతీలో నొప్పి రావడంతో సొమ్మసిల్లి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో స్థానికంగా ఉన్న దినేశ్ నర్సింగ్ హోంలో చేర్పించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ప్రత్యేక అంబులెన్స్‌లో బయలుదేరగా పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. కార్డియాక్ నిపుణుడు హితేశ్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్ రవికళాధర్‌రెడ్డి పర్యవేక్షణలో లక్ష్మమ్మకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. చదవండి: ఓవరాక్షన్ సరే!.. అప్పుడేమైంది గురివింద బాబు? -
అమ్మ పరిస్థితి సీరియస్, 7 రోజులు గడువివ్వండి : సీబీఐకి అవినాష్ విజ్ఞప్తి
సాక్షి, కర్నూలు: దర్యాప్తునకు హాజరు కావాలంటూ సిబిఐ ఇచ్చిన నోటీసులకు లిఖిత పూర్వకంగా జవాబిచ్చారు ఎంపీ అవినాష్ రెడ్డి. "మా అమ్మ లక్ష్మి (67 ఏళ్లు) తీవ్ర అస్వస్థతకు గురయి, ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోంది. బ్లడ్ ప్రెషర్‌తో పాటు హైపర్ టెన్షన్ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మా నాన్నా భాస్కరరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం మీకు తెలిసిందే. మా తల్లితండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత ఒక్కగానొక్క కొడుకయినా నాపై ఉంది. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో అమ్మకు తోడుగా ఉండి ఆమె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. వైద్యులు చికిత్స అందిస్తున్నారు కానీ, నిస్సత్తువతో పాటు మగతలో ఉంటున్నారు. ఇప్పటికే ఒకసారి గుండె పోటు వచ్చింది. ప్రస్తుతం పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని డాక్టర్లు చెప్పారు. అమ్మ లక్ష్మికి డాక్టర్లు యాంజియోగ్రామ్ టెస్టు చేయగా.. గుండెలో రెండో చోట్ల బ్లాక్‌లు ఉన్నాయని తేలింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆమెను మరిన్ని రోజులు ICUలోనే ఉంచి చికిత్స అందించాలని డాక్టర్లు సూచించారు. పై పరిస్థితుల దృష్ట్యా నాకు 7 రోజుల గడువు కావాలని కోరుతున్నాను. అమ్మ ఆరోగ్యం కుదుటపడగానే మీ ముందు విచారణకు హాజరు కాగలనని అవినాష్ రెడ్డి సిబిఐకి ఇచ్చిన లిఖిత పూర్వక జవాబులో పేర్కొన్నారు. ఇటు సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. సుప్రీం కోర్టులో తన పిటిషన్ పై రేపు విచారణ ఉందని సిబిఐకి తెలిపారు అవినాష్ రెడ్డి. తన తల్లి ఆరోగ్యం దృష్ట్యా ఈ నెల 27 వరకు మినహాయింపు ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరారు అవినాష్ రెడ్డి. మరో వైపు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితిపై సోమవారం ఉదయం హెల్త్‌బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. లక్ష్మమ్మ కార్డియో సమస్యతో బాధపడుతున్నారు. బీపీ తక్కువగా ఉండి.. ఏం తినలేకపోతున్నారు. వాంతులు అవుతున్నాయి. మెదడుకు, పొట్టకు అల్ట్రాసౌండ్ చేయాల్సి ఉంది. ఆమె ఇంకా వైద్య బృందం పర్యవేక్షణలో ఉంది. ఇంకా కొన్నిరోజులు ఆస్పత్రిలోనే ఉండాలి. లో బీపీ కారణంగా ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించాలి అని వైద్యులు ప్రకటించారు. -
ఆందోళనకరంగానే అవినాష్‌రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి
సాక్షి, కర్నూల్: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్‌ను శనివారం సాయంత్రం విడుదల చేశారు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చికిత్స అందిస్తున్న వైద్య బృందంలోని డాక్టర్ హితేష్‌రెడ్డి ప్రకటించారు. ‘‘యాంజియోగ్రామ్ చేస్తే రెండు వాల్స్ బ్లాక్ అయినట్లు తేలింది. లక్ష్మమ్మకు చికిత్స చాలా అవసరం. ఆమెకు బీపీ తక్కువగా ఉంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం’’ అని డాక్టర్ హితేష్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. పులివెందులలోని నివాసంలో శుక్రవారం ఉదయం శ్రీలక్ష్మి అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో స్థానికంగా ఓ ఆస్పత్రిలో చేర్పించగా.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో ప్రత్యేక ఆంబులెన్స్‌ను ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గం మధ్యలో ఆమె పరిస్థితి విషమించడంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. -
అవినాష్ తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులెటిన్ విడుదల
కర్నూలు: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆమె హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఛాతీలో నొప్పి రావడంతో లక్ష్మమ్మను ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఆమె కార్డియో సమస్యతో బాధపడుతున్నారని డా. రితేష్ బులెటిన్‌లో పేర్కొన్నారు. యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం ఉందని, లక్ష్మమ్మకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు విశ్వభారతి ఆస్పత్రి డాక్టర్ రితేష్ స్పష్టం చేశారు. -
ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం : నిమ్స్ వైద్యులు
-
డాక్టర్ ప్రీతి హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెడికో ప్రీతి ఆరోగ్యం అత్యంగా విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ద్వారా వైద్యులు మరోసారి స్పష్టం చేశారు. కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ల ర్యాంగింగ్ వేధింపులు భరించలేక మెడికో ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్‌తో ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికీ ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వెంటిలేటర్ చికిత్స అందుతోందని బులిటెన్ ద్వారా వైద్యులు వెల్లడించారు. మల్టి డిసిప్లినరీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో ప్రీతికి చికిత్స అందుతోందని నిమ్స్ అధికారులు వెల్లడించారు. అంతకు ముందు ప్రీతి బీపీ కూడా మెయింటేన్ అవ్వటం లేదని, కిడ్నీ పనితీరు సరిగ్గా లేదని కిందటి హెల్త్ బులెటిన్‌లో వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. జరిగింది ఇదే.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి.. కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో పీజీ (అనస్థీషియా) ఫస్టియర్ చదువుతోంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు ఉన్నాయి. సైఫ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట. ఆ వేధింపులతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ లో విధులు నిర్వహిస్తుండగా ప్రీతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్పృహ లేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రీతి తీసుకున్న ఇంజెక్షన్లు ఆమె అవయవాలపై తీవ్ర ప్రభావం చూపించాయని, వెంటిలేటర్‌పై వైద్య చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న ప్రీతి అనస్థీషియా ఇంజెక్షన్లు తీసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రీతిని వేధించిన సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు సైఫ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కానీ సీనియర్ విద్యార్థులు సైఫ్‌ను అరెస్టు చేయొద్దని ధర్నాకు దిగారు. -
ప్రీతిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం
లక్డీకాపూల్ (హైదరాబాద్)/సాక్షి, వరంగల్: పీజీ వైద్యవిద్యార్థిని ️ప్రీతిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని నిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమెకు ప్రొటోకాల్ ప్రకారం వైద్య చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యంపై శనివారం యాజమాన్యం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిమ్స్ వైద్య బృందం సభ్యులు మాట్లాడుతూ.. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందన్నారు. ప్రస్తుతం ఆమెకు ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. కాగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ పరిస్థితిలో ఉన్న ప్రీతిని నిమ్స్‌కు తీసుకువచ్చారని వైద్యులు తెలిపారు. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌లు నిమ్స్‌కు వచ్చి ప్రీతి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రీతి ర్యాగింగ్ ఘటనకు మతం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రగతిభవన్‌లో కూడా పేదవర్గాలపై కనబడకుండా ర్యాగింగ్ జరుగుతోందని తెలిపారు.ప్రీతి విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిష్పాక్షికంగా విచారణ: మంత్రి హరీశ్‌రావు ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా కల్పించారు. నిష్పాక్షికంగా పూర్తి విచారణ జరుగుతుందని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యంపై మంత్రి సమీక్షించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి, చికిత్స చేస్తున్న ప్రత్యేక వైద్య బృందాన్ని ఆరా తీశారు. డాక్టర్ ప్రీతికి అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సైఫ్ విషయంలో ఏం చేద్దాం?: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో అరెస్టయిన సీనియర్ విద్యార్థి సైఫ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ర్యాగింగ్, వేధింపుల కేసులో అరెస్టయి జైలుకెళ్లిన సైఫ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కాళోజీ హెల్త్‌వర్సిటీకి.. కేఎంసీ ప్రిన్సిపల్ మోహనదాస్ శనివారం లేఖ రాశారు. సోమవారంలోగా నిర్ణయం రావొచ్చని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా సైఫ్‌పై చర్యలు ఉంటాయని ప్రిన్సిపల్ శనివారం ‘సాక్షి’కి తెలిపారు. అలాగే, కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా కేఎంసీలో సోమవారం ర్యాగింగ్ నియంత్రణ కమిటీ సమావేశమై నివేదికను రూపొందించి పంపుతుందన్నారు. ప్రీతి కేసులో సైఫ్‌పై ఆరోపణలు రుజువైతే అతడి పీజీ అడ్మిషన్‌ను రద్దు చేసే అవకాశం ఉందని చెపుతున్నారు. ఒకవేళ ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించేలా సైఫ్ వ్యవహార శైలి ఉందని రుజువైతే ఎంబీబీఎస్ పట్టా కూడా రద్దు కావచ్చంటున్నారు. ఏమైనా.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడి చర్యలుంటాయని మోహన్‌దాస్ తెలిపారు. ‘సర్’పై సర్వత్రా చర్చ: కేఎంసీ కాలేజీలో సీనియర్లను.. జూనియర్లు ‘సర్’అని పిలుస్తున్నారని, దీనిపై దృష్టి సారించాల్సి ఉందని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇలా పిలిపించుకోవడం ర్యాగింగ్ కిందికే వస్తుందని వరంగల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అభిప్రాయపడింది. సీనియర్లు, జూనియర్ల మధ్య ‘సర్’అనే పదం చాలా గ్యాప్ తీసుకొస్తుందని నిపుణులు అంటున్నారు. -
అత్యంత విషమంగా మెడికో ప్రీతి ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగవుతుందని, నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఆమెను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోన్నామని బులిటెన్‌లో పేర్కొన్నారు. మరోవైపు మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణ కొనసాగుతోంది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఫోన్ చాటింగ్‌తోపాటు పలు కీలక ఆధారాలు సేకరించారు. సైఫ్‌పై ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ, ర్యాగింగ్ కేసులు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి కేఎంసీలో పీజీ (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతోంది. శిక్షణలో భాగంగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తోంది. జనవరి 22న పాయిజన్ ఇంజిక్షన్ తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్తితిలోకి వెళ్లి యువతి ఒక్కసారిగా కుప్పకూలంతో సహచర విద్యార్థులు, డాక్టర్లు ఆమెను వెంటనే ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రీతి ప్రాణాల కోసం పోరాడుతోంది. ప్రీతిని కాపాడేందుకు నిమ్స్ వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కాలేజీలో సీనియర్ వేధింపులతోక ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సీనియర్ విద్యార్థి సైఫ్‌పై కాలేజీ యజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆమె తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన యువతి అంటూ అవమానపరుస్తూ వేధింపులకు గురిచేశారని ఆరోపించారు.సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
మెరుగైన చికిత్స కోసం తారకరత్నను విదేశాలకు తరలిస్తారా?
గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత వారం రోజులుగా ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు బులిటిన్ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కాస్త కోలుకున్నా ఇంకా మెరుగుపడలేదు. గుండెపోటుకు గురైన సమయంలో దాదాపు 45 నిమాషాల పాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో న్యూరో సర్జన్లతో పాటు 10మంది వైద్యుల బృందం.. ఆయన హెల్త్ కండీషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తోంది. రీసెంట్గా మెదడు స్కానింగ్ తీసిన వైద్యులు రిపోర్డుల ఆధారంగా ట్రీట్మెంట్ అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మెదడులో స్వెల్లింగ్ క్రమంగా తగ్గుతోందని, వాపు తగ్గిన తర్వాత ఒకట్రెండు రోజుల్లో తారకరత్న కోలుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పరిస్థితిని బట్టి అవసరమైతే తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంస సభ్యులు ఉన్నట్లు సమాచారం. -
తారకరత్న తాజా హెల్త్ బులెటిన్.. వైద్యులు ఏమన్నారంటే?
సినీనటుడు నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి యాజమాన్యం తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అయితే ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు బులెటిన్‌లో వైద్యులు వెల్లడించారు. కొన్ని మీడియాల్లో ఆయనకు ఎక్మోపై చికిత్స అందించినట్లు వచ్చిన కథనాలపై వైద్యులు క్లారిటీ ఇచ్చారు. ఆయనకు ఇప్పటి వరకు ఎక్మోపై ఎలాంటి చికిత్స అందించలేదని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం పరిస్థితిపై ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు వివరాలు అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. -
తారకరత్నకు మెలెనా? ఈ వ్యాధి గురించి తెలుసా..
సాక్షి, బెంగళూరు: తీవ్ర గుండెపోటుతో నారాయణ హృదయాల ఆసుపత్రిలో చేరి ప్రాణాంతక పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న. అయితే తాజాగా ఆయన ఆరోగ్య స్థితిపై మరో ఆప్డేట్ అందింది. అరుదైన వ్యాధి అయిన మెలెనాతో తారకరత్న బాధపడుతున్నారని అక్కడి వైద్య బృందం ప్రకటించినట్లు తెలుస్తోంది. జీర్ణశయాంతర రక్తస్రావాన్ని మెలెనా స్థితిగా పేర్కొంటారు. సాధారణంగా మెలెనా వల్ల ఎగువ జీర్ణశయాంతర (GI) మార్గంతో పాటు నోరు, అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు మొదటి భాగం బ్లీడింగ్ సంభవిస్తుంది. కొన్ని సందర్భాల్లో.. ఎగువ జీర్ణాశయాంతరం దిగువ భాగంలో ఉండే.. పెద్ద ప్రేగు ఆరోహణ భాగంలో కూడా రక్తస్రావం జరగవచ్చు. కారణాలు.. ఎగువ జీర్ణశయాంతర మార్గం దెబ్బ తినడం. కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం, కడుపులో పుండు, రక్త నాణాలు వాపు, లేదంటే రక్తస్రావం, రక్తసంబంధిత జబ్బుల వల్ల మెలెనా సంభవిస్తుంది. మెలెనా లక్షణాలు.. మెలెనా వల్ల మలం నల్లగా, బంక మాదిరి స్థితిలో బయటకు వస్తుంది. విపరీతమైన దుర్వాసన వస్తుంది. హెమటోచెజియా స్థితికి.. మెలెనాకు ఎలాంటి సంబంధం ఉండదు. మెలెనా వల్ల శరీరంలో రక్త స్థాయి తగ్గిపోతుంది. అనీమియాతో పాటు బలహీనంగా మారిపోతారు. ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరం లేత రంగులోకి మారిపోవడం, అలసట, విపరీతమైన చెమటలు, ఉన్నట్లుండి కుప్పకూలిపోవడం, గందరగోళం నెలకొనడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. రక్తం తక్కువగా పోయే స్థితిలో.. చిన్నపేగులో రక్తస్రావం, పొత్తి కడుపు నొప్పి, నోటి నుంచి రక్తం పడడం, బలవంతగా మింగడం, అజీర్తి, రక్తపు వాంతుల లక్షణాలు కనిపిస్తాయి. చికిత్సలు పెప్టిక్ అల్సర్ ట్రీట్మెంట్తో పాటు ఎండోస్కోపీ థెరపీలు, ఆంజియోగ్రాఫిక్ ఎంబలైజేషన్, సర్జికల్ థెరపీలు, రక్త మార్పిడి లాంటి చికిత్సలు అందిస్తారు. అయితే.. మెలెనా వల్ల కొన్నిసార్లు విపరీతమైన రక్తస్రావ స్థితి నెలకొంటుంది. ముక్కు, చెవులతో సహా అనేక చోట్ల నుండి రక్తస్రావం జరుగుతుంది. కొన్నిసార్లు తీవ్రమైన గుండెపోటు తర్వాత.. రక్త నాళాలలో రక్తస్రావం జరుగుతుంది. రక్తస్రావం కారణంగానే.. గుండెకు వైద్యం అందించడంలో సవాళ్లు ఎదురవుతుంటాయి. అందువల్ల కృత్రిమ గుండె కదలిక కోసం ఎక్మో మెషిన్ ఇంప్లాంటేషన్ చేస్తారు. మెలెనా.. రక్తపోటు కూడా నేపథ్యాన్ని తగ్గిస్తుంది. అందుకే రక్తపోటు సమతుల్యత కోసం ప్రత్యేక మిషన్ యొక్క అప్లికేషన్ ఉపయోగిస్తారు. ప్రస్తుతం తారకరత్న విషయంలో ఇదే జరుగుతోంది. ఆయన గుండెనాళాల్లోకి రక్తప్రసరణ కావడం కష్టతరంగా మారడంతో.. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపిణీ చేసేందుకు యత్నిస్తున్నారు. తారకరత్న ఆరోగ్యం క్షణక్షణం క్షీణిస్తోందని, అయినప్పటికీ నైపుణ్యం కలిగిన వైద్య బృందంచే అధునాతన చికిత్స అందిస్తోందని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. -
అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, బెంగళూరు: సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. తాజాగా తారకరత్న హెల్త్ కండీషన్‌పై శనివారం మధ్యాహ్నం హృదయాలయ డాక్టర్లు బుటిటెన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. కాగా, టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్బంగా తారకతర్న అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆయన ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. దీంతో, తారకరత్నను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం, నారాయణ హృదయాలయ డాక్టర్లు కుప్పం వెళ్లారు. వైద్య చికిత్సల అనంతరం.. శనివారం బులిటెన్ విడుదల చేశారు. ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే సరికే తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిన్న రాత్రి తారకరత్నను బెంగళూరు ఆసుపత్రికి తీసుకువచ్చాము. ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స జరుగుతోంది. తారకరత్నకు ప్రస్తుతం ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నాము. గుండె నాళాల్లోకి రక్తప్రసరణ కావడం లేదు. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది అని తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బెంగళూరులోనే ఉండి ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. -
కృష్ణ హెల్త్ కండీషన్ పై వైద్యుల ప్రెస్ మీట్
-
విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల..
Chiyaan Vikram Health Bulletin Released: స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఆసుపత్రి పాలయ్యారు. శుక్రవారం (జులై 8) మధ్యాహ్నం విక్రమ్ అస్వస్థతకు గురికాడంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఛాతీలో నొప్పి కారణంగానే విక్రమ్ ఆస్పత్రికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. నిపుణలైన వైద్యులతో చికిత్స అందించినట్లు ఆస్పత్రి యాజామాన్యం పేర్కొంది. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, రోజంతా వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, శనివారం ఉదయం డిశ్చార్జ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే విక్రమ్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై విక్రమ్ తనయుడు ధృవ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. దీనికి సంబంధించిన పోస్ట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. విక్రమ్‌కు గుండెపోటు వచ్చిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపాడు. ఈ పోస్ట్‌లో 'ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులరా, నాన్నకు ఛాతీలో కొద్దిపాటి నొప్పికారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు రాలేదు. ఈ పుకార్లు విని మేము చాలా బాధపడ్డాం. ఈ సమయంలో మా కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం. మా చియాన్ ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు' అని పేర్కొన్నాడు. మరోవైపు విక్రమ్ ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా నేడు (జులై 8) సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన 'పొన్నియిన్ సెల్వన్' టీజర్ లాంచ్‌కి విక్రమ్ హాజరు కావాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు విక్రమ్ కోబ్రా సినిమాలో కూడా నటిస్తున్నాడు. -
Corona Updates: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు..
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ కేసుల పెరుగుదల చూస్తుంటే ఫోర్త్‌వేవ్ మొదలైందా అనే సంకేతాలకు ఊతమిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా అధికమవుతున్నాయి. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసులు మళ్లీ 19 వేలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో 18,930 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,35,66,739కు పెరిగింది. ఈ మేరకు కేంద్రవైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 35 మంది మరణించారు. ఇప్పటి వరకు 5,24,305 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 14,650 మంది కోలుకోగా మొత్తం మహమ్మారి నుంచి 4,29,21,977 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం 1,19,457 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.52శాతంగా ఉంది. ఇక ఇప్పటి వరకు 4,29,21,977 మంది కోవిడ్ బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇక ఇప్పటి వరకు 198 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. చదవండి: హైదరాబాద్‌లో వణుకు పుట్టిస్తున్న డెంగీ.. పెరుగుతున్న డయేరియా #COVID19 | India reports 18,930 fresh cases, 14,650 recoveries, and 35 deaths in the last 24 hours. Active cases 1,19,457 Daily positivity rate 4.32% pic.twitter.com/cAqSEIWR0L — ANI (@ANI) July 7, 2022 -
Covid: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే!
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తోంది. కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నిత్యం 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,899 మంది కోవిడ్ బారిన పడ్డారు. నిన్న ఒక్క రోజే వైరస్‌తో 15 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 72,474. యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్‌పై ఆదివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,855కు చేరుకుంది. పెరుగుతున్న పాజిటివ్ కేసుల కారణంగా రోజూవారీ పాజిటివిటీ రేటు 7.71 శాతానికి పెరిగింది. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,518 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,26,99, 363కు చేరుకుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,96, 14,88,807 మందికి కరోనా వ్యాక్సిన్లను అందించినట్టు కేంద్రం తెలిపింది. చదవండి: Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్