
ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,806 కరోనా కేసులు నమోదవ్వగా 581 మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు కేంద్రవైద్యారోగ్యశాఖ గురువారం కోవిడ్‌పై హెల్త్‌బులిటెన్ విడుదల చేసింది.
తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య మొత్తం 3,09,87, 880గా ఉంది. ఇక కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 4,11,989కి చేరింది. ఒక్కరోజులో కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 39,130 మంది కాగా.. దీని ప్రకారం ఇప్పటి వరకు మొత్తంగా 3,01,43,850 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,32,041గా ఉంది. ఇప్పటివరకు 39.13 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించారు.