సాక్షి, హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని.. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్‌కి చేరుకుంటున్నాయని ఏఐజీ ఆసుపత్రి ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తమ్మినేని వీరభరం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని తెలిపిన వైద్యులు.. ఊపిరితిత్తుల్లోని నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
లంగ్స్‌లో నీరునీ వైద్యులు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రసుత్తం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. మెడిసిన్‌కి తమ్మినేని రెస్పాండ్ అవుతున్నారని, ఆరోగ్యం కుదట పడితే వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉంటుందని.. వచ్చే 24 నుంచి 48 గంటలు చాలా కీలకమని వైద్యులు పేర్కొన్నారు.
స్వగ్రామమైన ఖమ్మం జిల్లాలోని తెల్దారుపల్లిలో ఉన్న తమ్మినేనికి సోమవారం సాయంత్రం ఒంట్లో నలతగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పల్స్ తక్కువగా ఉండటాన్ని గుర్తించి వెంటనే చికిత్స అందించారు. అయితే గుండె కొట్టుకోవడంలో తేడాలున్నాయని వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు తమ్మినేనిని వెంటిలేటర్ సపోర్టుతో ఖమ్మం నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment