సాక్షి, హైదరాబాద్: ప్రతి విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు వేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ ద్రం డిమాండ్ చేశారు. ర్యాగింగ్‌ను నిరోధించేందుకు యూజీసీ, ర్యాగింగ్ మార్గదర్శకాలు పాటించడంతో పాటుగా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేసి ఆయా నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
ప్రతి విద్యాసంస్థలో ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేయాలని, కమిటీల్లో తల్లిదండ్రులు, సైక్రియాటిస్ట్, సైకాలజిస్ట్‌లను భాగస్వాములను చేసి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment