సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచి, సీనియారిటీ ప్రకారం వారిని రెగ్యులరైజ్ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. నిమ్స్ హాస్పిటల్‌లో 1,350 మంది కార్మికులు కాంట్రాక్టు పద్ధతిలో 25 ఏళ్లుగా పని చేస్తున్నా.. కనీస వేతనం నెలకు రూ.14,700 మాత్రమే వస్తోందని తెలిపారు.
లేబర్ కమిషన్ ముసాయిదా ప్రకారం వీరికి రూ.20 వేల వరకు జీతం పెరిగే అవకాశమున్నా, రాష్ట్ర ప్రభుత్వం నేటికీ గెజిట్ జారీ చేయలేదని తమ్మినేని వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత నిమ్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సీనియారిటీ ప్రకారం జూనియర్లకు రు.20 వేలకు తగ్గకుండా, సీనియర్లకి వారి సీనియారిటీని బట్టి జీతం పెంచేలా చూడాలని ఆ లేఖలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment