Educational institutions
-
పరీక్షల సమరం
సాక్షి, హైదరాబాద్: ఇది పరీక్షల సమయం. భవిష్యత్తును నిర్ణయించే తరుణం. ఇటు వార్షిక పరీక్షలు.. మరోవైపు ప్రవేశ పరీక్షలతో విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అయ్యే కాలం. తీవ్రమైన ఒత్తిడితో గడిపే సీజన్. విద్యార్థుల్లో టెన్షన్..విద్యాసంస్థల్లో హైటెన్షన్. ఇంకోవైపు తల్లిదండ్రుల అటెన్షన్. మొత్తం మీద వేసవికి ముందే వేడి ఊపందుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు పరీక్షల పోరుకు సిద్ధమవుతున్నారు. వీరికి అండగా నిలిచే తల్లిదండ్రులు, పరీక్షల సమరానికి సిద్ధం చేసే అధ్యాపకులు, ఇతరులు కలిపి మరో కోటి మంది ఈ క్రతువులో భాగస్వాములవుతారని అంచనా. ఫైనల్ పరీక్షలు, ఉన్నత చదువులకు సంబంధించిన ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. పరీక్షల సమయంలో పిల్లలకు అందుబాటులో ఉండేందుకు తల్లిదండ్రులు సెలవులు పెట్టడం లాంటి ఏర్పాట్లు చేసుకుంటుంటే, మరోవైపు విద్యాసంస్థలు..ప్రత్యేక తరగతులు, మోడల్ టెస్టులతో ఫలితాల తరాజులో మొగ్గు తమవైపే ఉండేలా విద్యార్థులను సన్నద్ధం చేయడంలో నిమగ్నమయ్యాయి.మార్చి టు జూన్..మార్చి నుంచి జూన్ వరకూ వరుసగా ఎన్నో పరీక్షలు. ముందుగా ఇంటర్మీడియెట్ పరీక్షలు మొదలవుతాయి. మార్చి 5వ తేదీ నుంచి 25 వరకూ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే ప్రాక్టికల్స్ పూర్తయ్యాయి. థియరీ పరీక్షల కోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇంటర్ పరీక్షలు చివరలో ఉండగానే టెన్త్ పరీక్షలు షురూ అవుతాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకూ ఇవి కొనసాగుతాయి. ఓరియంటల్ సబ్జెక్టులు రెండురోజుల పాటు జరుగుతాయి. ఇక ఇంటర్ పూర్తి చేసిన ప్రతి విద్యార్ధికీ కీలకమైన ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షే గేట్ పాస్. ఇది ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకూ జరుగుతుంది. ప్రఖ్యాత ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సాధించాలనేది లక్షల మంది కల. ఈ మెట్టు ఎక్కాలంటే జేఈఈ పరీక్ష రాయాల్సిందే. తొలి విడత సెషన్ ఇప్పటికే పూర్తయింది. రెండో విడత ఏప్రిల్ 1 నుంచి 8 వరకు జరుగుతుంది. ఇక ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ మే 18న జరుగుతుంది. ఇక డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి వరుసబెట్టి పరీక్షలున్నాయి. ఐసెట్, పీజీఈసెట్, ఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్.. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే యూజీ, పీజీ నీట్... ఇలా జూన్ వరకూ పరీక్షలే పరీక్షలు. విద్యార్థుల వెనుక కీలకంగా.. రాష్ట్రంలో జరిగే పలు పరీక్షలకు సుమారు 25 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా. ఇది మనకు ప్రత్యక్షంగా కని్పంచే సంఖ్య మాత్రమే. ఒక్కో విద్యార్థిని పరీక్షకు సన్నద్ధం చేసేందుకు ఇద్దరు తల్లిదండ్రులు, సగటున మరో ఇద్దరు ఉపాధ్యాయులు తెర వెనుక కృషి చేస్తారు. వీరే కాదు పరీక్షల ఏర్పాట్లలో ఉండే ఉద్యోగులు, విద్యాసంస్థల సిబ్బంది పాత్రా కీలకమే. ఈ లెక్కన సుమారు కోటి మందికి ఇది పరీక్షా కాలమనే చెప్పాలి. విద్యార్థులను సన్నద్ధం చేయడం మొదలుకుని, పరీక్షా కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ప్రశ్నాపత్రాలు పంపడం, వాటిని మూల్యాంకన కేంద్రాలకు చేర్చడం..మొత్తం మీద ఎవరికీ ఈ సీజన్లో కంటి మీద కునుకు ఉండదంటే అతిశయోక్తి కాదు. విద్య, వైద్యం, రెవెన్యూ, రవాణా, పోలీస్... తదితర శాఖలకూ ఇది పరీక్షా కాలమనే చెప్పాలి. ఒక రకంగా ప్రభుత్వానికీ ఇవి ఓ సవాలే. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరుతుంది. దీంతో పరీక్షల దగ్గర్నుంచి ఫలితాల వెల్లడి వరకు టెన్షన్ తప్పని పరిస్థితి. పూర్తిస్థాయిలో రివిజన్ చేయిస్తున్నాం టెన్త్, ఇంటర్ పరీక్షలు కీలకమైనవి. ఇప్పటికే విద్యార్థులను సిద్ధం చేశాం. మరోసారి పూర్తిస్థాయిలో రివిజన్ చేయిస్తున్నాం. విద్యార్థులు పరీక్షలు అంటే కాస్తా టెన్షన్‌గా ఫీలవ్వడం సహజం. ఇలాంటి వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అందరికీ మంచి మార్కులు వచ్చేలా టీచర్లు ప్రత్యేక తరగతులు తీసుకుంటూ అలుపెరుగకుండా కష్టపడుతున్నారు. – ఆర్.పార్వతీరెడ్డి (హార్వెస్ట్ విద్యాసంస్థలు, ఖమ్మం) ఒకింత టెన్షన్‌గానే ఉంది గతంలో చాలా పరీక్షలు రాశా. వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయని నమ్మకం ఉంది. అయితే ఒక్కోసారి చదివిందే వస్తుందా? ఇంపార్టెంట్ ఏమిటనే గందరగోళానికి గురవుతున్నా. ముఖ్యమైన చాప్టర్స్ పదేపదే చదవమని టీచర్లు చెబుతున్నారు. నాలో ధైర్యం పెంచేలా తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నారు. – ముక్తివరపు శేఖర్ (ఇంటర్ సెకండియర్ విద్యార్థి, హైదరాబాద్) ––––––––––––––––––పరీక్షలయ్యే వరకు ధైర్యం చెబుతున్నాం.. అమ్మాయి చదువుపైనే దృష్టి పెడుతున్నాం. రాత్రి పడుకునే వరకూ ఏం కావాలో అందిస్తున్నాం. పరీక్షలంటే భయం ఉండకుండా ధైర్యం చెబుతున్నాం. ఆరోగ్యం దెబ్బతినకుండా చూస్తున్నాం. కాలేజీకి వెళ్లి లెక్చరర్లతో మాట్లాడి వారి సలహాలు కూడా పాటిస్తున్నాం. – సానియా బేగం (ఇంటర్ విద్యార్ధిని తల్లి, జడ్చర్ల) -
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారతీయ వర్సిటీల హవా
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు ఇటీవలికాలంలో బాగా మెరుగయ్యాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు దశాబ్దకాలంలో అంతర్జాతీయ వర్సిటీ ర్యాంకింగ్స్‌లో పెరిగిన భారతీయ వర్సిటీల సంఖ్యను ప్రబల తార్కాణంగా ప్రభుత్వం చూపించింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 2015 ఏడాదిలో కేవలం 11 భారతీయ విశ్వవిద్యాలయాలు మాత్రమే ర్యాంక్‌లు సాధిస్తే ప్రస్తుత సంవత్సరంలో ఏకంగా 46 వర్సిటీలు ర్యాంక్‌లు సాధించడం విశేషం. అంటే దశాబ్దకాలంలో భారత వర్సిటీలు 318 శాతం వృద్ధిని సాధించాయి. జీ20 సభ్యదేశాల్లో ఇంతటి వృద్ధిని సాధించిన ఏకైక దేశంగా భారత్ నిలిచిందని కేంద్ర విద్యాశాఖ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో అంటే 1950–51 కాలంలో పాఠశాల్లో చేరే వారి సంఖ్య(గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో–జీఈఆర్) కేవలం 0. 4 శాతంగా నమోదైతే ఇప్పుడు 2021–22 నాటికి 71 రెట్లు పెరిగి ఏకంగా 28.4 శాతానికి చేరుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2035 నాటికి 50శాతం జీఈఆర్ లక్ష్యంగా ముందుకు అడుగులు వేçస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ప్రభుత్వ వర్సిటీల ద్వారా 3.25 కోట్ల మందికి విద్య రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న వారి సంఖ్య సైతం గణనీయంగా పెరిగిందని నీతి ఆయోగ్ తాజాగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి పదో తేదీన నీతి ఆయోగ్ ఒక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 3.25 కోట్ల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 2035 నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేసే లక్ష్యంతో నూతన జాతీయ విద్య విధానం, 2020ను అమలుచేస్తున్నామని విద్యాశాఖ తెలిపింది. ‘1857లో కోల్‌కతా, ముంబై, మద్రాస్‌లలో తొలి విశ్వవిద్యాలయాలు స్థాపించబడినప్పటి నుంచి దేశ ఉన్నత విద్యావ్యవస్థ గణనీయంగా విస్తరించింది. 1947లో స్వాతంత్రం వచ్చే నాటికి దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల ద్వారా 2.38 లక్షల మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారు. అక్ష్యరాస్యత రేటు 14 శాతం ఉండటంతో ఆరోజుల్లో విద్య వ్యవస్థ ఆందోళనకరంగా ఉండేది. ఆనాటి రోజుల నుంచి విద్యలో పురోగతి సాధిస్తూ ఈ విశ్వవిద్యాలయాల ద్వారా 81 శాతం విద్యార్థుల నమోదును సాధించాం’’అని కేంద్రం వివరించింది. ఎస్‌పీయూల ద్వారా పురోగతి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2011–12లో 2.34 కోట్ల మంది విద్యార్థులు ప్రభుత్వ వర్సిటీల్లో చదువుకుంటే 2021–22 నాటికి ఆ విద్యార్థుల సంఖ్య 3.24కోట్లకు పెరిగింది. ఓబీసీ విద్యార్థుల్లో వృద్ధి 80.9 శాతం మంది కాగా ఎస్సీ విద్యార్తుల్లో 76.3 శాతం వృద్ధి కనిపించింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లో దాదాపు 16 లక్షల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వరిస్తున్నారు. వీరిలో 68 శాతం మంది లెక్చరర్లు/అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. రీడర్లు/అసోసియేట్ ప్రొఫెసర్లు 10శాతం మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే భారత్ నుంచి పరిశోధనా పత్రాలు సైతం గణనీయంగా పెరిగాయి. 2017లో మొత్తం పరిశోధనా పత్రాల్లో భారత్ వాటా కేవలం 3.5 శాతం ఉండగా 2024 ఏడాదిలో అది 5.2 శాతానికి పెరిగింది. -
ఉన్నత చదువులకు.. యూఎస్ బాట
అధిక ప్యాకేజీలిచ్చే సంస్థల్లో ఉద్యోగాలు సాధించేందుకు నైపుణ్యంతో కూడిన ఉన్నత విద్య అవసరమని యువత భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారతీయ విద్యార్థులు విదేశాల్లో అవకాశాలను వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో విద్యనభ్యసించేందుకు భారతీయ యువత ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలోనే 2023–24లో అమెరికా వర్సిటీల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారు. – సాక్షి, అమరావతిదేశీయంగా పరిమిత సంఖ్యలోనే సీట్లుదేశంలోని అగ్రశ్రేణి సంస్థల్లో పరిమిత సంఖ్యలో సీట్లు ఉండటంతో ఎక్కువ మంది యూఎస్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేశంలోని జాతీయ విద్యాసంస్థల్లో అధిక కటాఫ్‌లు, రిజర్వేషన్ విధానాలు, అవినీతి ఘటనల కారణంగా చాలామంది విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన దేశీయ విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందలేకపోతున్నారు. అత్యంత పోటీ ఉండే ఐఐటీల్లో లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌కు, అడ్వాన్స్‌కు హాజరవుతుంటే.. కేవలం వేలల్లోనే ప్రవేశాలు పొందుతున్నారు.కొన్ని సందర్భాల్లో జనరల్ కేటగిరీల్లో అత్యధిక స్కోర్ సాధించిన విద్యార్థులకు సైతం సీట్లు దక్కడం లేదు. తత్ఫలితంగా దేశంలో అగ్రశ్రేణి సంస్థల్లో అత్యంత పోటీ వాతావరణం చాలామంది విద్యార్థులను విదేశాల్లో చదువులను ఎంపిక చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. విదేశాల్లో చదువుకోవడానికి అయ్యే ఖర్చు భారత్‌లోని కొన్ని అగ్రశ్రేణి సంస్థల ఫీజులతో సమానంగా ఉంటోంది. ఒకప్పుడు తక్కువ ఖర్చులు అధిక నాణ్యత కలిగిన విద్యను అందించిన ప్రసిద్ధ ఐఐటీలు ఇటీవల ఫీజులను పెంచేశాయి. అందుకే చాలామంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. అగ్రశ్రేణి వర్సిటీలకు నిలయం అత్యాధునిక పరిశోధన అవకాశాలు, సౌకర్యాలు అందిస్తూ.. అంతర్జాతీయంగా జర్నల్స్‌ను ప్రచురించే అగ్రశ్రేణి వర్సిటీలకు అమెరికా నిలయంగా మారింది. భారతదేశంలో విద్య కొంతవరకు సాపేక్షంగా ఉన్నప్పటికీ ఐఐటీలు, ఐఐఎంల వంటి అగ్రశ్రేణి సంస్థలు యూఎస్ వర్సిటీలను అందుకోలేపోతున్నాయి. పైగా ఇటీవల కాలంలో ఐఐటీలు, ఐఐఎంల్లో ఫీజులు గణనీయంగా పెరిగాయి. దీంతో ప్రవేశాలు పొందే అవకాశాలు మరింత సన్నగిల్లాయి.మరోవైపు అమెరికా వర్సిటీలు విదేశీ విద్యార్థులకు సైతం అనుకూలమైన ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి. తద్వారా విద్యా, కెరీర్ వృద్ధికి ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఆ దేశం మారింది. ఈ క్రమంలోనే అమెరికాలో 42.9 శాతం మంది భారతీయ విద్యార్థులు గణితం, కంప్యూటర్ సైన్స్, 24.50 శాతం మంది ఇంజనీరింగ్, 11.20 శాతం మంది బిజినెస్ మేనేజ్మెంట్, 5.40 శాతం మంది ఫిజికల్, లైఫ్ సైన్సెస్ కోర్సులు చేస్తున్నారు. దశాబ్దంన్నర తర్వాత అమెరికాలో 2023–24లో 3.31 లక్షల మంది విద్యార్థులు నమోదయ్యారు. ఇది అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారత్ అగ్రస్థానంలో నిలబెట్టింది. యూఎస్‌లో ఉద్యోగ అవకాశాలు జాబ్ మార్కెట్లో ప్రపంచ దిగ్గజ సంస్థలన్నీ అమెరికాలోనే ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు మెకిన్సే, గూగుల్, అమెజాన్, యాపిల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటి అగ్ర కంపెనీల్లో ఉద్యోగాలు సాధించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ఏడాది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎఫ్–1 వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 41శాతం పెరిగింది. -
నేడు ప్రభుత్వ సెలవు
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అలాగే రాష్ట్రంలో వారం రోజులు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. -
మన విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యమెంత?
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా నేషనల్ అచీవ్మెంట్ సర్వే (న్యాస్) జరగనుంది. దీనికో సం రాష్ట్రంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయా స్కూళ్ళను సందర్శించి సర్వేలో భాగంగా పరీక్ష నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు దీనిని పర్యవేక్షిస్తారు. న్యాస్ పరీక్ష ఆధారంగానే రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయనేది నిర్ధారిస్తారు. ప్రతి మూడేళ్ళకోసారి ఈ పరీక్ష జరుగుతుంది. 2021లో జరిగిన న్యాస్ పరీక్షలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అయిదవ స్థానంలో నిలిచింది. జాతీయ సగటు స్కోర్ కంటే కూడా రాష్ట్ర విద్యార్థుల స్కోర్ తక్కువగా ఉన్నట్టు గుర్తించా రు. దీంతో ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది. న్యాస్ను ప్ర తిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పడంతో కొన్ని నెలలుగా పరీక్షపై పాఠశాలల ప్రధానోపాధ్యా యులు దృష్టి పెట్టారు. విద్యార్థులకు ఇప్పటికే మూడుసార్లు మోడల్ పరీక్షలు నిర్వహించారు. తాజా పరీక్ష ఫలితాలను ఏప్రిల్ లేదా మే నెలలో వెల్లడిస్తారని అధికారులు తెలిపారు. ఫరాఖ్‌కు నిర్వహణ బాధ్యతలు న్యాస్ పరీక్షను 2021 వరకూ జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) నిర్వహించింది. ఈసారి నుంచి రాష్ట్రీయ సర్వేక్షణ్–2024 పేరుతో ఎన్సీఈఆర్టీలోని స్వ తంత్ర సంస్థ ఫరాఖ్ (పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్) నిర్వహిస్తోంది. గ తంలో 3, 5, 8, 10 తరగతులకు న్యాస్ పరీక్ష ఉండేది. ఈసారి 3, 6, 9 తరగతులకు ఆ క్లాసు ల్లోని ప్రమాణాల మేర పరీక్ష నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 75,565 పాఠశాలల నుంచి 22,94,377 మంది ఈ పరీక్ష రాస్తున్నారు. వీరిలో ప్రభుత్వ స్కూళ్ళ నుంచి 50 శాతం, ప్రైవేటు స్కూళ్ళ నుంచి మరో 50 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 3,500 పాఠశాలల నుంచి లక్ష మందిని పరీక్షకు ఎంపిక చేశారు. ఈసారి క్రిటికల్ థింకింగ్ కూడా.. న్యాస్ పరీక్ష విధానంలో ఈసారి నైపుణ్యాలకు పెద్దపీట వేస్తున్నారు. తరగతుల వారీగా విద్యార్థులకు భాష, గణితం, సైన్స్, సోషల్ సైన్స్, పరిసరాల పరిజ్ఞానంపై ప్రశ్నలు ఇస్తారు. ఈసారి అదనంగా విమర్శనాత్మక ఆలోచన (క్రిటికల్ థింకింగ్)కు సంబంధించిన నేర్పు, విశ్లేషణ నైపుణ్యాలు, భవిష్యత్‌లో ఉద్యోగాలు చేసేందుకు అవసరమైన నైపుణ్యాలపై కూడా ప్రశ్నలు ఇస్తున్నారు. మల్టిపుల్ చాయిస్‌గా ఉండే ప్రశ్నలకు ఓఎంఆర్ షీట్లో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. మూడో తరగతికి 45 ప్రశ్నలు, గంటన్నర సమయం, ఆరో తరగతికి 51 ప్రశ్నలు, గంటన్నర, 9వ తరగతికి 60 ప్రశ్నలకు రెండు గంటల సమయం ఉంటుంది. మొత్తం మీద న్యాస్ పరీక్ష కఠినంగా ఉండే అవకాశం ఉందని టీచ ర్లు చెబుతున్నారు. ప్రశ్నలను అనేక విధాలుగా ఇస్తున్నారని, సెంట్రల్ సిలబస్‌తో కూడిన ప్రశ్నలకు రాష్ట్ర విద్యార్థులు ఏ మేరకు జవాబిస్తారో వేచిచూడాల్సి ఉందని అంటున్నారు. -
కాలం చెల్లిన సరుకులు...కుళ్లిన గుడ్లు
సాక్షి, హైదరాబాద్: పురుగులు పట్టిన బియ్యం, కుళ్లిన గుడ్లు, పాడైపోయిన కూరగాయలు, గడువు తీరిపోయిన (ఎక్స్పైర్ అయిన) నిత్యావసరాలు, అపరిశుభ్ర పరిస్థితుల్లో వాటి నిల్వ... ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లలో ఎక్కడ చూసినా ఇదే దుస్థితి. ఇదేమిటని అధికారులు ప్రశి్నస్తే... కాంట్రాక్టర్ల నుంచి నాణ్యతలేని సరుకులు వస్తున్నాయని, ఇదేమిటంటే రాజకీయ నేతల పేర్లు చెప్తుండటంతో ఏమీ చేయలేకపోతున్నామనే సమాధానాలు వస్తున్నాయి. అదే సమయంలో విద్యా సంస్థల్లో అపరిశుభ్ర పరిసరాలు, నిర్లక్ష్యం కూడా అధికారుల తనిఖీలలో స్పష్టంగా బయటపడుతోంది.కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... క్షేత్రస్థాయిలో తనిఖీలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మండల స్థాయి అధికారులు మొదలుకొని కలెక్టర్ల వరకూ తనిఖీలు ప్రారంభించారు. అటు రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులు కూడా పరిశీలన చేపట్టారు. ఈ క్రమంలో విద్యా సంస్థలు, హాస్టళ్లలో దారుణమైన పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి.కాంట్రాక్టర్లు కారణమంటూ.. ⇒ నాణ్యత లోపించిన ఆహారం కనిపించినా, కలుషితమైన ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనా... సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎంలు), ఇతర క్షేత్రస్థాయి విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవడం పరిపాటి అయిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. నాణ్యతలేని సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లను వదిలిపెట్టి తమను వెంటాడితే ఫలితం ఏమిటని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకులాలకు పాలు, పండ్లు, అల్లం, వెల్లుల్లి, కూరగాయలు, గుడ్లు, చికెన్ ఇతర నిత్యావసరాలను టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో జీసీసీ ద్వారా హాస్టళ్లకు కూడా కాంట్రాక్టర్లే సరుకులు ఇస్తున్నారు.గడువు తీరిన నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారని హెచ్ఎంలు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. కాంట్రాక్టర్లు పల్లీపట్టీలు, మసాలా దినుసులు ఎక్కడ కొనుగోలు చేసి, తెస్తున్నారో తెలియని పరిస్థితి ఉందని.. అరటిపండ్లను దూర ప్రాంతాల నుంచి తీసుకొస్తుండటంతో విద్యా సంస్థలకు చేరేలోగా కుళ్లిపోతున్నాయని అంటున్నారు. ప్రధానోపాధ్యాయులు వాటిని గుర్తించి, తిరస్కరిస్తే కాంట్రాక్టర్లు ఎదురుదాడికి దిగుతున్నారని చెబుతున్నారు. ప్రతి కాంట్రాక్టర్ ఏదో ఒక రాజకీయ నాయకుడికి అనుచరుడు కావడం, ఆ నేతల పేర్లు చెప్పి బెదిరిస్తుండటంతో ఏమీ చేయలేకపోతున్నామని వాపోతున్నారు. వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా తమను బలి చేస్తే ఆహార నాణ్యత ఎలా పెరుగుతుందని ప్రశి్నస్తున్నారు. విద్యాసంస్థలకు పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తున్న బియ్యంలోనూ పురుగులు ఉంటున్నాయని చెబుతున్నారు.పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలెన్నో ⇒ ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం పంగిడి మాదర వసతి గృహంలో చిన్నారులకు చెంచాలతో పాలు పోస్తున్న తీరు తనిఖీల్లో బయటపడింది. ఇక్కడ పాలలో రాగిమాల్ట్, బెల్లం వంటివేవీ కలిపి ఇవ్వడం లేదు. ⇒ కెరమెరి మండలం గిరిజన ఆశ్రమ పాఠశాలలో గడువు తీరిన ఉప్పు ప్యాకెట్‌ను కలెక్టర్ గుర్తించారు. అలాగే గడువు తీరిన ఉప్పు ప్యాకెట్లు ఆసిఫాబాద్ జీసీసీ గోదాంలో 12 క్వింటాళ్లు, చిక్కీలు 12 క్వింటాళ్లు ఉన్నట్టు తేలింది. ⇒ విద్యార్థులకు వారంలో నాలుగుసార్లు గుడ్డు ఇవ్వాలి. అది కనీసం 50 గ్రాముల కన్నా ఎక్కువ బరువు ఉండాలి. కానీ 40 గ్రాముల కన్నా తక్కువ ఉండే చిన్న గుడ్లు ఇస్తున్నారని, అందులోనూ పలుచోట్ల కుళ్లిపోయిన గుడ్లు వస్తున్నాయని అధికారుల పరిశీలనలో తేలింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. కాంట్రాక్టర్లను నోటిమాటగానే హెచ్చరిస్తున్నారని, ఎలాంటి చర్య తీసుకోవడం లేదని పలువురు ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. ⇒ మహబూబ్‌నగర్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలును అధికారులు తనిఖీ చేశారు. చాలా చోట్ల 3, 4 రోజులకోసారి కూరగాయలు తీసుకొస్తున్నారు. వండే సమయానికి అవి చెడిపోతున్నాయని, పురుగులు, దోమలు వాలుతున్నట్టు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ⇒ ధన్వాడలోని కేజీబీవీని నారాయణపేట కలెక్టర్ రాత్రివేళ తనిఖీ చేశారు. అక్కడ నిల్వ ఉంచిన వంకాయలు మెత్తబడిపోయి ఉన్నట్టు గుర్తించారు. మరికల్ తహసీల్దార్ సాంఘిక సంక్షేమ గురుకులాన్ని సందర్శించారు. నేలపై కూరగాయలు కుప్పలుగా పోసి నిల్వచేసి ఉన్నాయి. దీనితో కలుషి తమై, అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉందని సిబ్బందిపై తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇒ మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో వంట చేసే ఆవరణ అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. విద్యార్థులు చేతులు, కంచాలు కడిగే చోట దుర్వాసన వస్తోంది. వెల్దుర్తి మండలం కుకునూరు ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ లేకపోవడంతో.. భోజనం సమయంలో కుక్కలు, పందులు వస్తున్నాయి. -
ఆహార నాణ్యతపై టాస్క్‌ఫోర్స్!
సాక్షి, హైదరాబాద్: విద్యా సంస్థలు, హాస్టళ్లు, ఆస్పత్రుల్లో పంపిణీ చేస్తున్న ఆహారం నాణ్యత పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల కోసం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం మొదలు... సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, వసతిగృహాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాల యాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభు త్వ వైద్య కళాశాలల్లో అందించే ఆహారం నాణ్య తపై నిఘా, పర్యవేక్షణ కోసం టాస్క్‌ఫోర్స్ కమి టీని ఏర్పాటు చేసింది. ఎస్సీ అభివృద్ధి శాఖతోపాటు గిరిజన, బీసీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలు, వైద్యారోగ్య శాఖ పరిధి లోకి వచ్చే అన్ని విద్యా సంస్థల్లో అందించే ఆహా రం నాణ్యతను పర్యవేక్షించే బాధ్యతను ఈ కమి టీకి అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో సభ్యులుగా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ లేదా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, సంబంధిత విద్యా సంస్థ ఉన్నతాధికారి/ అదనపు సంచాలకుడు, విద్యా సంస్థ జిల్లా స్థాయి అధికారి (డీఎస్‌డబ్ల్యూఓ/ డీటీడబ్ల్యూఓ/డీబీసీడబ్ల్యూఓ/ డీఈఓ) తదితరులుంటారు. ఈ కమిటీ నిర్దేశించిన విద్యా సంస్థలను సందర్శించి ఆహార భద్రత చర్యల ను పరి శీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏదైనా సంస్థలో లోటుపాట్లను గుర్తిస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు బాధ్యులపై చర్యల కోసం సిఫార్సు చేయాలని సూచించింది.విద్యా సంస్థల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు, పర్యవేక్షక అధికారిటాస్క్ఫోర్స్ మాత్రమేకాకుండా విద్యా సంస్థల స్థాయిలో ఫుడ్ సేఫ్టీ కమిటీలను, పర్యవేక్షక అధికారిని సైతం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటికి సంబంధించిన మార్గదర్శ కాలను జారీ చేసింది. విద్యా సంస్థల్లో మెరుగైన, బలవర్థకమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. కలుషిత ఆహారంతో కలిగే అనా రోగ్య సమస్యలు, తదుపరి పరిణామాల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ కమిటీలు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.» ఫుడ్ సేఫ్టీ కమిటీలో విద్యా సంస్థ ప్రధానోపా« ద్యాయుడు/ ప్రిన్సిపల్/ వార్డెన్‌తోపాటు మరో ఇద్దరు సిబ్బంది సభ్యులుగా ఉంటారు.» ఈ కమిటీ సభ్యులు ప్రతిరోజు భోజనం తయారు చేసే ముందు స్టోర్ రూమ్, వంట గదిని తనిఖీ చేయాలి. తర్వాత వంటగది నిబంధనలకు అనుగుణంగా నాణ్యత, ప్రమాణాలు పాటిస్తున్నట్టు నిర్ధారించాలి.» వంట వండిన తర్వాత ఆహార నాణ్యతను కమిటీ సభ్యులు రుచి చూసి పరిశీలించిన తర్వాతే విద్యార్థు లకు అందించాలి. ప్రతిరోజు ఈ బాధ్యతలను విధిగా పూర్తి చేయాలి.» త్వరలో నోడల్ డిపార్టుమెంట్ యాప్‌ను తయారు చేస్తుంది. అప్పటి నుంచి తనిఖీలకు సంబంధించిన ఫోటోలను, ఇతర సమాచా రాన్ని యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.» ఇక జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి విద్యాసంస్థకు ప్రత్యేకంగా ఒక పర్యవేక్షక అధికారికి నియమి స్తారు. ఈ పర్యవేక్షక అధికారి ప్రతిరోజు భోజనం వండే ముందు, తర్వాత తనిఖీ చేస్తారు. అక్కడి పరిస్థితిని చిత్రాలు తీసి జిల్లా కలెక్టర్/ సంబంధిత ఉన్నతాధికారికి సమర్పిస్తారు.» వీటన్నింటికి సంబంధించి తక్షణమే చర్యలు తీసు కోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనంమల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ మల్హర్ మండలం మల్లారం కస్తూర్భా గాంధీ పాఠశాలను గురువారం ఆక స్మికంగా తనిఖీ చేశారు. బియ్యం, నిత్యావసర సరకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి అల్పాహారం, భోజన సదుపాయాల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వసతి గృహాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో ఆహార నాణ్యత పరిశీలనకు ప్రతీ శుక్రవారం తహసీల్దార్, ఎంపీడీవోలు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. -
వానల వేళ.. కాటేసే కరెంట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విద్యాసంస్థల్లో తరగతులు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పరిస్థితి మెరుగుపడిందికానీ, అనేక ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో భద్రతా ప్రమాణాలు అంతంతమాత్రమే. పెచ్చులూడిపోయి నీరుకారే స్లాబులు, తడిచి చెమ్మెక్కిన గోడలు ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటాయి.అలాంటి విద్యాసంస్థల్లో వర్షాల వల్ల విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యుత్ వైర్లు, లైన్లు, స్విచ్ బోర్డులు, ఎర్తింగ్, ట్రాన్స్ఫార్మర్లు వంటి వాటిపై ఆడిట్ నిర్వహించాలని ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలు విద్యుత్ ప్రమాదాల నివారణకు నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. ఈ నియమాలు పాటిస్తే మేలు » ఎలక్ట్రిక్ వైరింగ్, స్విచ్‌లు, జాయింట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి.. పాడైపోయిన, అరిగిపోయిన వాటిని వెంటనే మార్చాలి » పాఠశాలలు, కళాశాలల ఆవరణలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, ప్రధాన బోర్డులకు తప్పనిసరిగా కంచె ఏర్పాటుచేయాలి »పిల్లలు విద్యుదాఘాతానికి గురయ్యే ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి » అన్ని ప్రైవేట్, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఎలక్ట్రికల్ సేఫ్టీ నిబంధనలను అనుసరించాలి » భూమిలో ఉన్న స్తంభాలను సరిగ్గా ఇన్సులేట్ చేయాలి. అన్ని కేబుల్స్, జంక్షన్లను ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్లు, సరి్టఫైడ్ ఎల్రక్టీషియన్లతో తనిఖీ చేయించాలి » ప్రామాణిక, మంచి నాణ్యత గల ఎలక్ట్రిక్ పరికరాలను ఉపయోగించాలి. కేబుల్స్, ప్లగ్‌లు కరగకుండా నిరోధించాలంటే సాకెట్‌కు ఎక్కువ పరికరాలను కనెక్ట్ చేయకూడదు. ఒకవేళ ఎక్కువ పరికరాలు సర్క్యూట్లో ప్లగ్ చేస్తే.. కరెంట్ వైర్లు వేడెక్కి స్పార్క్ వచ్చి మంటలు చెలరేగుతాయి » విద్యార్థులు, సిబ్బందికి లీకేజీలు, ఎలక్ట్రిక్ షాక్‌లను అరికట్టడం, బాధితులను రక్షించడం, షాక్‌కు గురైన వారికి ప్రథమ చికిత్స అందించడం వంటి అంశాల్లో అవగాహన కల్పించాలి » షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవిస్తే తప్పించుకోవడానికి వీలుగా అన్నిరకాల ఏర్పాట్లు చేసుకోవాలి »సబ్స్టేషన్లు, సరఫరా లైన్లకు దూరంగా పాఠశాలలు ఉండేలా చూసుకోవాలి »ఓపెన్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్, జంక్షన్ బాక్స్, స్ట్రీట్ బాక్స్ మొదలైనవి కూడా పాఠశాలలకు సమీపంలో ఉండకూడదు »పాఠశాల ఆవరణలోను, విద్యార్థులు వెళ్లే మార్గంలోను ఉండే ట్రాన్స్ఫార్మర్లకు పూర్తి స్థాయిలో కంచె వేయాలి » విద్యుత్ సరఫరాలో అంతరాయం, ఎలక్రిక్ పరికరాల్లో మరమ్మతులు వస్తే తప్పనిసరిగా ఎల్రక్టీషియన్ సహాయం తీసుకోవాలి. సొంతంగా మరమ్మతులు చేయకూడదు » కుళాయి, నీళ్ల ట్యాంకులకు సమీపంలో ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఉపయోగించకూడదు » వర్షం, తుపానుల సమయాల్లో సరఫరా లైన్లు ఉన్న ఏ నిర్మాణం కింద ఆశ్రయం పొందకూడదు »కరెంటు తీగలకు సమీపంలోని చెట్లు ఎక్కడం, తాకడం వంటివి చేయకూడదు »ఎలక్ట్రికల్ పరికరాల మరమ్మతులకు మెటల్ నిచ్చెనలు ఉపయోగించకూడదు » స్విచ్ ఆఫ్ చేసిన తరువాత మాత్రమే ప్లగ్‌ని పట్టుకుని కేబుల్స్‌ను డిస్కనెక్ట్ చేయాలి » త్రీ పిన్ ఎర్త్ ప్లగ్‌లు, సాకెట్లను ఉపయోగించాలి. విరిగిన త్రీ పిన్ ప్లగ్‌లను ఎప్పుడూ వాడకూడదు » ఎక్స్టెన్షన్ కేబుల్స్‌ను వినియోగించకపోవడమే మంచిది. తప్పదనుకుంటే ఒకే సామర్థ్యం (ఆంపియర్ రేటింగ్) ఉన్నదాన్ని ఎంచుకోవాలి » అన్ని కనెక్షన్లు గట్టిగా, చెక్కుచెదరకుండా ఉన్నాయో లేదో నిర్ధారించుకుని.. ఏవైనా వదులుగా ఉంటే వెంటనే ఎలక్ట్రికల్ ఇన్చార్జికి తెలియజేయాలి » కేబుల్స్ చాలా వేడిగా ఉన్నట్లు అనిపించినా.. షాక్ తగిలినా.. పరిస్థితిని సంబంధిత అధికారులకు తెలియజేయాలి » వర్షం నీటితో నిండిపోయిన రహదారుల్లో విద్యుత్ వైర్లు పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దారిలో వెళ్లే వాహనాలు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి » ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే దారిలో విద్యుత్ స్తంభాలను తాకకూడదు నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోంది మానవ నిర్లక్ష్యం వల్లే విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. విద్యుత్ చట్టం 2003 ప్రకారం.. విద్యుత్ ప్రమాదాలు, ప్రాణ, ఆస్తి నష్టం నుండి ప్రజలను రక్షించడం ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ల కర్తవ్యం. అందులో భాగంగానే పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నాం. విద్యాసంస్థలు తప్పనిసరిగా విద్యుత్ భద్రతా ప్రమాణాలను పాటించాలి. మేం అందించిన సూచనల ప్రకారం నడుచుకోవాలి. తద్వారా విద్యార్థులను విద్యుత్ షాక్ నుంచి కాపాడుకోగలుగుతాం. – జి.విజయలక్ష్మి, డైరెక్టర్, ఎలక్ట్రికల్ సేఫ్టీ -
సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. ఆ విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్
-
TG: ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇక.. ఇవాల్టీ నుంచే విద్యాసంస్థలో ఉచిక విద్యుత్ అమలులోకి వస్తుందని, జీవో కూడా విడుదల చేశామని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని 27,862 విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందనుంది.గురువారం రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ‘విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్తు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. విద్యతో పాటు గురువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. గత పది సంవత్సరాల్లో ఇబ్బందులు పడ్డ ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు నిర్వహించింది మా ప్రభుత్వమే. 11,062 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ వేసి పరీక్షలు నిర్వహించాం, మరో 6వేల పోస్టులకు నోటిఫికేషన్ వేస్తాం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. యూనివర్సిటీల మౌలిక వసతులకై రూ.300 కోట్లు కేటాయించాం. ప్రభుత్వ బడుల మౌలిక వసతుల కల్పనకు రూ.667 కోట్లు వెచ్చించాం. శానిటేషన్ వర్క్స్ ఏర్పాటుకు రూ. 136 కోట్లు విడుదల చేశాం. ప్రగతిశీల తెలంగాణ రాష్ట్రం నిర్మాణం కావడానికి ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో భట్టితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. -
ఎఫ్టీఎల్, బఫర్జోన్లను పక్కాగా తేల్చండి
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రమూల గ్రామంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన ‘గాయత్రి’నిర్మాణాలపై చట్టప్రకారం ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. తొలుత అక్కడి నాదెం చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్జోన్లను పక్కాగా నిర్ధారించాలని ఆదేశించింది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌ల సహకారంతో ఈ ప్రక్రియ చేపట్టి.. చెరువు ఎన్ని ఎకరాలు, ఆక్రమణలు ఎంతమేర జరిగాయన్నది తేల్చి.. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది. వారి వాదనలు విన్నాక చట్టప్రకారం చర్యలు చేపట్టాలని తేల్చిచెప్పింది. లాంటి నిర్మాణాలు చేపట్టవద్దు.. చట్ట విరుద్ధంగా తమ విద్యా సంస్థల భవనాల కూలి్చవేతకు హైడ్రా, అధికారులు ప్రయతి్నస్తున్నారంటూ.. గాయత్రి విద్యా, సాంస్కృతిక ట్రస్టు, అనురాగ్ వర్సిటీ, నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, గూడ మధుకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 796, 813 సర్వే నంబర్లలోని 17.21 ఎకరాల్లో ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషన్లపై జస్టిస్ టి.వినోద్‌కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘1954, 1955 కాస్రా పహాణీ ప్రకారం నాదెం చెరువు విస్తీర్ణం 61 ఎకరాలు. పిటిషనర్ విద్యా సంస్థలు బఫర్ జోన్లోనే ఉన్నాయి.కూల్చివేత సహా ఎలాంటి చర్యలు చేపట్టినా పిటిషనర్‌కు నోటీసులు జారీ చేస్తాం. ఆ భూముల్లో ఇకపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా పిటిషనర్‌ను ఆదేశించాలి’’అని న్యాయమూర్తిని స్పెషల్ జీపీ కోరారు. దీనికి న్యాయమూర్తి సమ్మతిస్తూ.. అధికారుల నుంచి అనుమతి పొందినా కూడా తదుపరి ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పిటిషనర్లను ఆదేశించారు. నాగోల్‌లోని సర్వే ఆఫ్ ఇండియా, సనత్‌నగర్, షాద్‌నగర్‌లలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల నుంచి నాదెం చెరువుకు సంబంధించి స్పష్టమైన మ్యాప్‌లను తీసుకుని.. వాటి ఆధారంగా చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్థారించాలని స్పెషల్ జీపీకి సూచించారు. ఆ తర్వాత అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. -
నెల తర్వాత తెరుచుకున్న బంగ్లా బడులు
ఢాకా: బంగ్లాదేశ్‌లో నెల రోజులకు పైగా మూతబడిన విద్యాసంస్థలు ఆదివారం మళ్లీ తెరుచుకున్నాయి. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడం, ప్రధాని హసీనా గద్దె దిగడం వంటి పరిణామాల మధ్య దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు సహా అన్ని విద్యాసంస్థలు జూలై 17వ తేదీ నుంచి మూతబడ్డాయి. ప్రధాన సలహాదారు మహ్మద్ యూనుస్ సారథ్యంలో ఇటీవల తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెల్సిందే. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో..‘ప్రధాన సలహాదారు యూనుస్ ఆదేశాల మేరకు ఆగస్ట్ 18వ తేదీ నుంచి అన్ని విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించాలని సంబంధిత వర్గాలను కోరుతున్నాం’అంటూ 15వ తేదీన విద్యాశాఖ డిప్యూటీ కార్యదర్శి మొసమ్మత్ రహీమా అక్తర్ పేరిట ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆదివారం ఉదయం యూనిఫాం ధరించిన స్కూలు విద్యార్థులు విద్యాసంస్థలకు చేరుకోవడం కనిపించింది. రాజధాని ఢాకాలోని చాలా ప్రాంతాల్లో ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగిపోయింది. బంగ్లాదేశ్‌లో పాఠశాలలు ఆదివారం నుంచి గురువారం వరకు పనిచేస్తాయి. -
ఫీజులు.. గుండెలు గుభిల్లు
విద్యార్థులు, తల్లిదండ్రుల డ్రీమ్ కోర్సు అయిన ఇంజనీరింగ్‌కు సంబంధించి దేశంలోనే ప్రఖ్యాత విద్యా సంస్థ ఐఐటీ బాంబేలో నాలుగేళ్ల బీటెక్‌కు 2008లో మొత్తం ట్యూషన్ ఫీజు రూ.1,08,000 ఉండగా ఇది 2024–25 నాటికి ఏకంగా రూ.8,00,000కు చేరింది. అలాగే మరో ప్రముఖ విద్యా సంస్థ ఎన్ఐటీ తిరుచిరాపల్లిలో 2011–12లో బీటెక్‌కు రూ.1,42,000 ఫీజు ఉండగా 2023–24 నాటికి ఇది 5,02,800కు పెరిగింది. మొత్తం మీద ఐఐటీల్లో 15 ఏళ్లలో ఏడు రెట్లు, ఎన్ఐటీల్లో 12 ఏళ్లలో మూడున్నర రెట్లు ఫీజులు పెంచారు. అలాగే ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల్లలో 15 ఏళ్లలో 8 రెట్లు ఫీజులు పెరిగాయి. భారతదేశంలో పెరిగిపోతున్న విద్యా వ్యయంపై కెరీర్స్360 ఫౌండర్ చైర్మన్ మహేశ్వర్ పెరి అందిస్తున్న ప్రత్యేక వ్యాసం⇒ మన దేశంలో చదువు రోజురోజుకీ భారంగా మారుతోంది. ప్రాథమిక విద్య నుంచి మేనేజ్ మెంట్ చదువుల వరకు ప్రతి దశలోనూ విద్య సామాన్యుడికే కాదు, మధ్య తరగతికీ తలకు మించిన భారంగా పరిణమించింది. విద్యలో ప్రభుత్వ పాత్ర క్రమేణా తగ్గడం.. ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొచ్చి ఫీజులు పెంచుకుంటూ పోవడమే అందుకు ప్రధాన కారణం.⇒ గత 13 ఏళ్లలో ప్రభుత్వ బడుల సంఖ్యలో పెరుగుదల కేవలం 9 శాతం. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లు ఏకంగా 35% పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశంలోని మొత్తం కాలేజీల్లో 79 % ప్రైవేటువే. 14 ఏళ్ల కిందట దేశంలోని ప్రతి రెండు ప్రభుత్వ యూనివర్సిటీలకు ఒక ప్రైవేటు యూనివర్సిటీ ఉంటే నేడు ప్రైవేటు వర్సిటీల సంఖ్య ప్రభుత్వ వర్సిటీల సంఖ్యను అధిగమించేసింది. వీటన్నింటి ఫలితంగా చదువులపై పెట్టాల్సిన ఖర్చు గణనీయంగా పెరిగిపోయింది. ఇవన్నీ ఆందోళనకరమైన పరిణామాలు. ⇒ మన చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టి, పెద్ద పెద్ద విషయాలను పక్కనపెట్టేశామేమో అనిపిస్తోంది. ఈ సందర్భంగా మనమంతా కొన్ని అంశాలు ఆలోచించాలి. మన ప్రజల సుసంపన్నమైన అభివృద్ధికి ఇప్పటికీ కట్టుబడే ఉన్నామా? నిపుణులైన మానవ వనరులను తయారుచేసుకోవడంలో మనం వెనకబడుతున్నామా? గత 15–20 ఏళ్లలో దేశంలో విద్యా రంగంలో చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే అవుననే అనిపిస్తుంది. ఐఐటీలను మించి స్కూల్ ఫీజులు.. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఫీజులు స్కూల్‌ను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉన్నాయి. హైదరాబాద్ లోని పటాన్చెరులో ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్ 2024–25 విద్యా సంవత్సరానికి రూ.12 లక్షల ఫీజు వసూలు చేస్తోంది. ఇది కాకుండా అడ్మిషన్ ఫీజు కింద మరో రూ.1.7 లక్షలు చెల్లించాల్సిందే. అలాగే శంషాబాద్‌లో ఉన్న మరో అకాడమీ ఏడాదికి రూ.9.5 లక్షల ఫీజు వసూలు చేస్తోంది. అలాగే మోకిలాలో ఉన్న ఇంకో ఇంటర్నేషనల్ స్కూల్లో ఏడాదికి రూ.8.2 లక్షల ఫీజు ఉంది. వీటికి అదనంగా అడ్మిషన్ ఫీజు కింద మరింత ముట్టజెప్పాల్సిందే. భారీ ఫీజులతో తల్లిదండ్రుల్లో ఆందోళన ఆ కోర్సు, ఈ కోర్సు అనే తేడా లేకుండా ప్రతి కోర్సుకు ఫీజుల మోత మోగిపోతోంది. మనదేశంలో విద్యా వ్యయం ఏయేడాదికాయేడాది అంతకంతకూ పెరిగిపోతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను అత్యున్నత విద్యా సంస్థల్లో చదివించాలని కలలు కంటారు. తమ కంటే తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని ఆశిస్తారు.మంచి విద్యా సంస్థలో తమ పిల్లలు సీటు సాధించాలని.. ఆ తర్వాత కోర్సు పూర్తయ్యాక మంచి పే ప్యాకేజీతో ఉద్యోగం సాధించాలని ఆకాంక్షిస్తారు. అత్యుత్తమ విద్య, ఆ తర్వాత మంచి ఉద్యోగం సాధించాలంటే మేటి విద్యా సంస్థల్లో చదవకతప్పదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో అందరికంటే ముందుండాలన్నా, మంచి అవకాశాలు దక్కించుకోవాలన్నా నాణ్యమైన చదువులతోనే సాధ్యమని నమ్ముతున్నారు. అయితే పెరుగుతున్న ఫీజులు తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతున్నాయి. క్యాష్ చేసుకుంటున్న విద్యా సంస్థలు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆకాంక్షలను విద్యా సంస్థలు ‘క్యాష్’ చేసుకుంటున్నాయి. ఫీజులను అమాంతం పెంచేస్తున్నాయి. నర్సరీ నుంచి మొదలుపెడితే పీజీలు, పీహెచ్‌డీల వరకు ఈ విద్యా వ్యయం ఏటా అంతకంతకూ గణనీయంగా పెరుగుతోంది. ధనవంతులకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా మధ్యతరగతి వర్గాలు, పేదలు అంతకంతకూ పెరిగిపోతున్న విద్యా వ్యయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏటా భారీగా పెరిగిపోతున్న ఫీజులను కట్టలేక నాణ్యమైన చదువులకు విద్యార్థులు దూరమవుతున్నారు. ఇలా అర్థంతరంగా చదువులు మానేసేవారి శాతం అంతకంతకూ పెరిగిపోతోంది. కొంతవరకు బ్యాంకులు విద్యా రుణాలు అందిస్తున్నా అవి అందరికీ దక్కడంలేదు. దీంతో డ్రాపవుట్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వరంగంలో తగ్గిపోయిన విద్యాసంస్థలుప్రపంచంలోనే అత్యధిక యువజనాభా భారతదేశంలోనే ఉంది. అయితే దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు ఏర్పాటు కావడం లేదు. ప్రైవేటు రంగంలోనే ఎక్కువ విద్యా సంస్థలు ఏర్పాటవుతున్నాయి. దీంతో ప్రైవేటు విద్యా సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తూ నడ్డి విరుస్తున్నాయి.ప్రభుత్వ రంగంలో ఎక్కువ విద్యా సంస్థలు ఏర్పాటయితే ప్రైవేటు సంస్థలతో పోలిస్తే ఫీజుల భారం తక్కువగా ఉంటుంది. అయితే అలా జరగకపోవడంతో పేదలు, మధ్యతరగతి వర్గాలు భారీ ఫీజులను చెల్లించలేక చదువులకు స్వస్తి చెబుతున్నాయి. దేశంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో గత 15 ఏళ్లలో వివిధ కోర్సుల ఫీజులు 300 శాతం పెరిగాయి. దేశంలో గత 20 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే దిమ్మతిరిగే విషయాలు వెల్లడయ్యాయి. భారీగా ఫీజుల భారం.. దేశంలో ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీలు పెరిగిపోవడం.. ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు తగ్గిపోవడంతో విద్యార్థులపై భారీ ఎత్తున ఫీజుల భారం పడుతోంది. దీంతో విద్యకు సంబంధించిన ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతోంది. తాజా నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం.. 2014–2018 మధ్య ప్రాథమిక విద్యకు తల్లిదండ్రులు 30.7 శాతం వ్యయం చేశారు. అలాగే ప్రాథమికోన్నత తరగతులకు 27.5 శాతం ఖర్చు పెట్టారు. లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. కోవిడ్ తర్వాత తమ పిల్లల స్కూల్ ఫీజులు 30 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగాయని 42 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. తన కుమారుడి ఫీజు కింద నెలకు రూ.30,000 చెల్లిస్తున్నానంటూ హరియాణాలోని గురుగ్రామ్‌లో ఒక తండ్రి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో ఒక స్కూల్ ఒకేసారి 50 శాతం ఫీజు పెంచింది. 44 శాతం మంది చదువులకు దూరం నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం.. 23 శాతం మంది ఆర్థిక ఇబ్బందులతోనే చదువులు మానేశారు. 21 శాతం మంది తమ కుటుంబ పోషణ కోసం పనులకు వెళ్లడం వల్ల చదువులు మానేశామని చెప్పారు. అంటే దేశ యువతలో 44 శాతం మంది పెరిగిన ఫీజులు, కుటుంబ ఆరి్థక పరిస్థితులతో ఉన్నత చదువులు చదవలేకపోయారు. ఈ నేపథ్యంలో విద్య నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.ఎంబీబీఎస్.. ఫీజుల మోత మోగాల్సిందే..⇒ ప్రైవేటు స్టేట్ యూనివర్సిటీల్లో రూ.80 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకు ⇒ డీమ్డ్ యూనివర్సిటీల్లో రూ.1.25 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు ⇒ ఎన్నారైలకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు -
‘నీట్’పై నోరు మెదపరేమి?
తిరుపతి సిటీ (తిరుపతి జిల్లా)/మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నీట్ పేపర్‌లీక్ వల్ల దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని, అయినా కేంద్రం నోరు మెదపకపోవడం దారుణమని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్త విద్యార్థి సంఘాల పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడ్డాయి. తిరుపతి ఎస్వీ వర్సిటీ ఏడీ బిల్డింగ్ వద్ద జిల్లా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.సంఘాల నేతలు మాట్లాడుతూ..లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆయోమయంలో ఉన్నా రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి నేతలు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ స్పందించక పోవడం దారుణమన్నారు. ఎన్టీఏను రద్దు చేసి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి యువతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు మోదీ సర్కార్ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ, కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్దం చేసేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసు అడ్డుకుని దిష్టిబొమ్మలను లాక్కొన్నారు.ధర్నాలో విద్యార్థి సంఘాల నేతలు రవి, అక్బర్, నవీన్, ప్రవీణ్, మల్లి కార్జున, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే, నీట్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని, పరీక్ష రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్‌లో భాగంగా విజయవాడ సిద్ధార్థ కళాశాల కూడలి వద్ద విద్యార్థి సంఘాల నాయకులు గురువారం ఆందోళన చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్న నాయకులు కళాశాల లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి మాచవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎసరు పెడుతున్న కూటమి ప్రభుత్వం
-
టీడీపీ ఎంపీగారి బస్సులా.. అయితే ఓకే!
సాక్షి, అమరావతి: ఆయనో టీడీపీ ఎంపీ. ఉమ్మడి గుంటూరు జిల్లాలో విద్యా సంస్థల టైకూన్‌గా గుర్తింపు పొందారు. అంతకంటే అర్హత ఏముంటుందని రవాణా శాఖ అధికారులు భావించారు. అందుకే ఆయన విద్యా సంస్థకు చెందిన వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. విద్యా సంస్థల బస్సుల్లో భద్రతా ప్రమాణాల కోసం విద్యార్థుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం 2023లో చేసిన మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను ఏమాత్రం పాటించకపోయినా సరే నిరభ్యంతరంగా రిజిస్ట్రేషన్లు చేసేస్తూ స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. విద్యార్థుల భద్రతతో ముడిపడిన వ్యవహారం అయినప్పటికీ ఎంపీ ఒత్తిడికి తలొగ్గి ఆయన చెప్పినట్లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కేంద్ర మోటారు వాహనాల చట్టం ఏం చెబుతోందంటే..విద్యా సంస్థల బస్సుల్లో భద్రతా ప్రమాణాలను నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రత్యేక చట్టం రూపొందించింది. ప్రధానంగా అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు.. పొరపాటున అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే నివారణ చర్యలు చేపట్టేందుకు స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించింది. ఫైర్ డిటెక్షన్, అలార్మ్ సిస్టం, ఫైర్ సప్రెషన్ సిస్టం, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టంలకు సంబంధించిన పరికరాలు, ఉపకరణాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.రూల్స్, గీల్స్ ఏమీలేవు..ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదేళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయన కుటుంబం దశాబ్దాలుగా ఉన్నత విద్యా సంస్థలను నిర్వహిస్తోంది. ఆ విద్యా సంస్థ కోసం ఇటీవల కొత్తగా 50 బస్సులను కొనుగోలు చేశారు. అందుకోసం చెన్నై నుంచి వాహనాల ఛాసీస్‌లను కొనుగోలు చేసి బస్సుల బాడీ బిల్డింగ్ పనులు చేయించారు. కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన మోటారు వాహనాల చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అగ్నిమాపక పరికరాలు, ఉపకరణాలు ఏర్పాటు చేయలేదు. కానీ తమ విద్యా సంస్థల ట్రస్ట్ తరఫున కొనుగోలు చేసిన ఆ బస్సులను రిజిస్ట్రేషన్ చేయాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక పరికరాలు పొందుపరచలేదని కొందరు అధికారులు చెప్పినా సరే ఆ ప్రజాప్రతినిధి పట్టించుకోలేదు. ‘మా బస్సులను రిజిస్ట్రేషన్ చేయండి.. మిగిలిన విషయాలు ఎత్తొద్దు.. 40 ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నాం.. మాకు కొత్తగా రూల్స్ చెప్పొద్దు’ అని ఆయన గదమాయించారు. దాంతో రవాణా శాఖ అధికారులు గప్‌చుప్‌గా ఆ విద్యా సంస్థ బస్సులకు రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లో 17 బస్సులకు రిజిస్ట్రేషన్లు చేసినట్టు సమాచారం. మిగిలిన బస్సులకు కూడా త్వరగా రిజిస్ట్రేషన్లు చేసేయడానికి అధికారులు దస్త్రాలు వేగంగా కదుపుతున్నారని తెలిసింది. -
అందనంత అద్దెలు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇందుమతి మాదాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకుంటోంది. 2 బీహెచ్‌కే ఫ్లాట్‌కు రూ.15 వేలతో మొదలై.. ఏటా 10 శాతం పెరుగుదలతో గత ఐదేళ్లలో కిరాయి రూ.22,500కు చేరింది. మెయింటెనెన్స్ చార్జీలు అదనం. అయితే ఇటీవలే ఇంటి యజమాని ఆమెకు ఫోన్ చేసి ఈ నెల నుంచి రూ.5 వేలు రెంట్ అదనంగా పెంచుతున్నట్లు చెప్పాడు. ఇష్టముంటే ఉండండి.. లేకపోతే ఖాళీ చేయండంటూ హుకుం జారీ చేశాడు. ఇప్పటికప్పుడు వేరే ఇల్లు వెతుక్కోవడం, షిఫ్టింగ్ అంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. వీటికి తోడు స్థానికంగా ఓ ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న తన పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుంది. దీంతో చేసేదేం లేక అదనపు అద్దెకు అయిష్టంగానే ఒప్పుకుంది.’’ఇది ఇందుమతి ఒక్కరికే కాదు నగరంలోని చాలా మంది పరిస్థితి ఇదే. విద్యా సంస్థలు, కార్యాలయాలు పునఃప్రారంభం కావడంతో నగరంలో అద్దెలకు డిమాండ్ బాగా పెరిగింది. ఒక ప్రాంతానికో లేదా కాలనీకో ఇది పరిమితం కాలేదు. కాస్త పేరున్న ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి ఉంది.స్కూళ్లు, ఆఫీసులున్న చోట హాట్‌కేక్‌లు..పేరున్న విద్యాసంస్థలు, ఆసుపత్రులకు చేరువలో ఉన్న ప్రాంతాల్లో గృహాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఉండటంతో చాలా మంది సొంతూర్లకు వెళ్లిపోయారు. దీంతో నగరంలో చాలా వరకు టులెట్ బోర్డులు కనిపించేవి కానీ, కరోనా ప్రభావం నుంచి పూర్తిగా కోలుకున్న కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాయి. దీంతో ఆఫీసులకు చేరువలో ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ హౌస్‌లలో కిరాయిలు హాట్‌కేక్‌లా మారాయి.అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మణికొండ, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కొంపల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు గణనీయంగా పెరిగాయి. కరోనా తర్వాత ఇంటి అద్దెలు కొన్ని చోట్ల రెట్టింపయ్యాయి. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు ఆరు నెలల కాలంలో 15 శాతానికి పైగానే పెరిగాయి. బేగంపేట, ప్రకాశ్ నగర్, సోమాజిగూడ, పంజగుట్ట, బోయిన్పల్లి, మారేడుపల్లి, అల్వాల్ ప్రాంతాల్లో 20–25 శాతం అద్దెలు పెరిగాయి.నడ్డివిరుస్తున్న అద్దెలు..హైదరాబాద్‌లో ఇంటి అద్దెలు కిరాయిదారుల నడ్డి విరుస్తున్నాయి. తమ జీతాలు తప్ప అన్నీ పెరుగుతున్నాయంటూ నిట్టూర్చే సగటు జీవి.. పెరిగిన ఈ అద్దెలను భరించలేక నగర శివార్లకు తరలి వెళ్తుండటంతో అక్కడ కూడా అద్దెలు భారీగానే పెరుగుతున్నాయి. అనరాక్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ఓ అధ్యయనం ప్రకారం హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో అద్దెలు గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తొలి మూడు నెలల కాలంలోనే 10–15 శాతం పైగానే పెరిగాయి. గతంలో రూ.10–15 వేలకు నగరం నడి మధ్యలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అద్దెకు లభించేవి. కానీ, ఇప్పుడు రూ.20–25 వేలకు పైగా ఖర్చు చేస్తే కానీ దొరకని పరిస్థితి.అడ్వాన్స్‌లు, మెయింటెనెన్స్‌ల భారం కూడా..ఇంటిని అద్దెకు ఇవ్వాలంటే 3–4 నెలలు అడ్వాన్స్‌ను ఇంటి యజమానులు వసూలు చేస్తున్నారు. పైగా ఫ్లాట్ అద్దెతో పాటు ప్రతి నెలా మెయింటెనెన్స్ వ్యయం కూడా అద్దెదారుల పైనే పడుతుంది. 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్ అద్దె రూ.25 వేలు ఉండగా.. నిర్వహణ ఖర్చు రూ.2 నుంచి రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది.అద్దె చట్టం ఏం చెబుతోందంటే..⇒ అద్దెదారుడు, యజమాని మధ్య నిబంధనలు.. షరతులతో కూడిన రెంటల్ అగ్రిమెంట్ రాసుకోవాలి. దీన్ని సంబంధిత జిల్లా రెంట్ అథారిటీకి సమర్పించాలి.⇒ ఓనర్ నాన్ కమర్షియల్ బిల్డింగ్ లేదా ఇళ్లకు సంవత్సరానికి 8 నుంచి 10 శాతానికి మించి అద్దె పెంచకూడదు. అది కూడా 3 నెలల ముందే కిరాయిదారునికి నోటీసు అందించాలి.⇒ కిరాయిదారులు, యజమానుల వివాదాలను పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక అద్దె అధికారులు, కోర్టు, ట్రిబ్యు నల్లను ఏర్పాటు చేయాలి.⇒ అద్దెదారుడు ప్రాపర్టీకి సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించి బ్యాంకులో తనఖా పెట్టడం, రుణాలు తీసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడకూడదు.⇒ ఒకవేళ అద్దెదారుడు ఇంటిని ఖాళీ చేయాలని భావిస్తే యజమానికి మూడు నెలల ముందు తెలపాలి.⇒ కిరాయిదారుడు ఇంటి లోపల విద్యుత్ వైర్లు, బోరు, నల్లా, టైల్స్, బాత్రూమ్, శాని టేషన్ వంటి వాటికి నష్టం కలిగించకూడదు. రిపేర్లకు సంబంధించి అయ్యే ఖర్చును యజమానే భరించాలి.కరోనా తర్వాత నుంచి..కరోనా కాలంలో నివాస అద్దెలు దీర్ఘకాలం పాటు నిలిచిపోయాయి. ఆఫీసుల పునఃప్రారంభం తర్వాత నుంచి అద్దెలకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్,బెంగళూరు, పుణే, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కిరాయిలు గణనీయంగా పెరుగుతున్నాయి. కేంద్రం, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలతో రానున్న రోజుల్లో నగరాలు అభివృద్ధి చెందడం ఖాయం. దీంతో సమీప భవిష్యత్తులో నివాసాలకు మరింత డిమాండ్ ఏర్పడుతుంది. – అనూజ్ పూరీ,చైర్మన్, అనరాక్ గ్రూప్ -
గురుకులాల్లో పదోన్నతుల టెన్షన్
సాక్షి, హైదరాబాద్: కొత్త నియామకాలకు ముందే గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్ టీచర్లకు పదోన్నతులు కల్పించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఏళ్ల తరబడి వారంతా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గురుకుల పాఠశా లలు, కళాశాలల్లోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను తెలంగాణరాష్ట్ర గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఓ కొలిక్కి తీసుకొచ్చింది. వారంరోజుల్లో ఖాళీ లు భర్తీ చేసి అర్హులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.అయితే ఈ నియామకాల కంటే ముందుగా పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘా లు ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రతరం చేశాయి. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, ఉన్నతాధికారులకు వినతులు కూడా సమర్పించాయి. సీనియారిటీ జాబితాలు సిద్ధం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)ల పరిధిలో దాదాపు వెయ్యి విద్యా సంస్థలున్నాయి. వీటి పరిధిలో 22వేలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లలో సీని యర్లకు పదోన్నతులు కల్పించాలి. దీనికి సంబంధించి సొసైటీలు ఇప్పటికే సీనియారిటీ జాబితాలు సిద్ధం చేశాయి. ప్రభుత్వం అనుమతిస్తే రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసే వీలుందని సొసైటీ అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే అన్ని కేటగిరీల్లో 3 వేల మందికి పదోన్నతులు దక్కుతాయి. ఆలస్యమైతే.. అంతే టీఆర్‌ఈఐఆర్‌బీ ద్వారా గురుకుల విద్యాసంస్థల్లో కొత్తగా 9వేల మంది ఉద్యోగులు చేరనుండగా, ఇప్పటికే గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ఉద్యోగాలతోపాటు పీజీటీ కేటగిరీల్లో 2వేల మంది నియామక పత్రాలు అందుకున్నారు. మిగిలిన వారికి కూడా ఈ నెలాఖరులోగా నియామక పత్రాలు, ఆ తర్వాత పోస్టింగ్ ఇచ్చే అవకాశముంది. అయితే కొత్తవారికి నియామక పత్రాలు ఇవ్వగానే వారి సర్విసు గణన ప్రారంభమవుతుంది. దీంతో అర్హత ఉండి పదోన్నతులు రాని వారంతా కొత్తగా నియమితులైన వారికంటే జూనియర్లుగా ఉండిపోతారు. ఇలా పీజీటీ, జేఎల్, డీఎల్ కేటగిరీల్లోని సీనియర్ల సీనియారిటీ క్రమం తారుమారు అవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారు చాలా కేటగిరీల్లోని టీచర్లకు పదోన్నతులు రాలేదు. ఇటీవల సీఎంతోపాటు సీఎస్, ఇతర ఉన్నతాధికారులను కలిసి పరిస్థితిని వివరించాం. వారు సానుకూలంగా స్పందించారు. నూతన నియామకాలకంటే ముందే పదోన్నతులు కల్పిస్తారనే నమ్మకం ఉంది. – మామిడి నారాయణ, గురుకుల ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధి సీనియర్లు నష్టపోతారు కొత్త నియామకాల తర్వాత పదోన్నతుల ప్రక్రియ చేపడితే సీనియర్లు తీవ్రంగా నష్టపోతారు. తదుపరి పదోన్నతుల సమయంలో జూనియర్లుగా మిగిలి పోయే ప్రమాదం ఉంది. దాదాపు ఆరేళ్లుగా గురు కులాల్లో పదోన్నతులు నిర్వహించలేదు. పదేళ్ల నుంచి ఒకే స్థానంలో పనిచేస్తున్న టీచర్ల సంఖ్య పెద్దగానే ఉంది. నూతన నియామకాలకంటే ముందే పదోన్నతులు, బదిలీలు నిర్వహిస్తే ప్రస్తుతం పనిచేస్తున్నవారికి లాభదాయకం. – సీహెచ్.బాలరాజు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు -
నేడు విద్యా సంస్థలకు సెలవు
సాక్షి, అమరావతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు బుధవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తుపాను తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం కూడా కాకినాడ నుంచి నెల్లూరు వరకు ఉన్న జిల్లాల్లో విద్యా సంస్థలు తెరవరాదని ఆదేశించారు. -
బిహార్‌లో 65 శాతానికి రిజర్వేషన్లు
పాట్నా: బిహార్‌లో ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో కుల రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. దీంతో, రాష్ట్రంలో అన్ని రిజర్వేషన్లు కలిపి 75శాతానికి చేరినట్లయింది. గురువారం అసెంబ్లీలో బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్థికంగా బలహీన వర్గాలకు కేటాయించిన 10శాతం రిజర్వేషన్‌తో కలిపి ఇప్పుడు రిజర్వేషన్లు మొత్తమ్మీద 75 శాతానికి చేరుకున్నాయి’అని అన్నారు . అంతకుముందు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, అత్యంత వెనుకబడిన కులాలు(ఈబీసీలు), ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీల)కు ప్రస్తుతమున్న 50% రిజర్వేషన్లను 65%కి పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. సమగ్ర కులగణన ఆధారంగా విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. -
మరాఠా రిజర్వేషన్లకు ఓకే : ఏక్నాథ్ షిండే
ముంబై: విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు. రిజర్వేషన్ల అమ లు విషయంలో చట్టపరిధిలో విధివిధానాలు ఖరారు చేయడానికి కొంత సమయం అవసరమని చెప్పారు. రిజర్వేషన్ల అంశంపై మరాఠా ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి షిండే నేతృత్వంలో బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. రిజర్వేషన్ల కోసం మరాఠాలు చేపడుతున్న ఆందోళనలు, జరుగుతున్న హింసాకాండపై చర్చించారు. నిరవధిక దీక్ష విరమించాలని సామాజిక కార్యకర్త మనోజ్ జారంగీని కోరుతూ అఖిలపక్ష భేటీలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానంపై ముఖ్యమంత్రి షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన(ఉద్ధవ్‌వర్గం) నాయకుడు అనిల్ పారబ్ తదితరులు సంతకాలు చేశారు. అనంతరం సీఎం షిండే మీడియాతో మాట్లాడారు. హింసకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించవద్దని రాజకీయ పారీ్టలకు సూచించారు. -
'అన్అకాడమీ'లో అసలేం జరుగుతోంది?
బెంగళూరు: సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులున్న ఎడ్టెక్ సంస్థ 'అన్అకాడమీ'లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) సుబ్రమణియన్ రామచంద్రన్ తన పదవికి రాజీనామా చేశారు. రెండు నెలల క్రితం అన్అకాడమీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) వివేక సిన్హా సంస్థ నుంచి వైదొలిగారు. తాజాగా, రామచంద్రన్ సైతం కంపెనీని విడిచి పెట్టి వెళ్లడం ఎడ్టెక్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. అయితే, సీఎఫ్‌వో ఎందుకు రాజీనామా చేశారు? రెండు నెలల క్రితం అన్అకాడమీ ట్యూటర్ కరన్ సంగ్వాన్ చేసిన వ్యాఖ్యలకు.. వరుస రిజిగ్నేషన్లకు ఏమైనా సంబంధం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో అన్‌అకాడమీని బ్యాన్చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ సమయంలో అన్అకాడమీ ట్యూటర్ కరన్ సంగ్వాన్ లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బిల్లుపై క్లాస్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే పేరు మార్పు వల్ల ఒరిగేదేమీ లేదని.. ఉన్న చట్టాలను పేర్లు మార్చి తీసుకురావడం వల్ల ఉపయెగం లేదన్నాడు కరణ్. పైగా ‘ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఓటు వేసేటప్పుడు, చదువుకున్న అభ్యర్థిని ఎన్నుకోండి.. అప్పుడు మీరు జీవితంలో మళ్లీ ఇలాంటి బాధలు పడకుండా ఉంటారు.. పేర్లు మార్చడం మాత్రమే తెలిసిన వారికి ఓటు వేయకండి,’ అని చెప్పడం పెద్ద ఎత్తున వివాదానికి దారి తీసింది We are an education platform that is deeply committed to imparting quality education. To do this we have in place a strict Code of Conduct for all our educators with the intention of ensuring that our learners have access to unbiased knowledge. Our learners are at the centre of… — Roman Saini (@RomanSaini) August 17, 2023 దీనికి కారణమైన కరణ్‌ను అన్అకాడమీ వ్యవస్థాపకుడు రోమన్ సైనీ విధుల నుంచి తొలగించారు. ‘క్లాసు రూమ్ వ్యక్తిగత అభిప్రాయాలకు వేదిక కాదని.. టీచర్(కరణ్) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని’ పోస్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాతే అన్అకాడమీ నుంచి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో)సుబ్రమణియన్ రామచంద్రన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) వివేక సిన్హాలు బయటకు వచ్చారు. చదవండి👉 చేస్తే చేయండి..లేదంటే పోండి, వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించిన అన్అకాడమీ! -
పాఠాలే కాదు.. జీవితపాఠాలూ నేర్పాలి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులకు మొదటి సంవత్సరంలోనే ఆత్మస్థైర్యం కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) విశ్వవిద్యాలయాలకు సూచించింది. విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం తొలగించి మానసికంగా దృఢంగాఉండేలా చూడాలని పేర్కొంది. తొలిదశలో నిర్వహించే అవగాహన కార్యక్రమం (ఇండక్షన్ ప్రోగ్రామ్) నుంచే ఇది మొదలవ్వాలని తెలిపింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ అధ్యయనాలపై ఏఐసీటీఈ దృష్టి పెట్టింది. ఇంటర్ వరకూ ఎక్కువగా బట్టీ విధానంలో చదివే విద్యార్థులు ఇంజనీరింగ్‌లోని భిన్నమైన విద్యా విధానం వల్ల సొంత అవగాహన పద్ధతులపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారని ఏఐసీటీఈ భావించింది. ఈ సమస్యను అధిగమించడానికి వీలుగా ఇంజనీరింగ్ విద్యకు ముందుగా విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలని జాతీయ విద్యావిధానం–2020లో సూచనలు చేసింది. ఇప్పటికే ఇంజనీరింగ్ తరగతులు మొదలైనందున వచ్చే ఏడాది నుంచి విశ్వవిద్యాలయాలు దీనిపై దృష్టి పెట్టే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఇవీ సూచనలు.. కేవలం పుస్తకాలకే కాకుండా సామాజికంగా ఎదురయ్యే సవాళ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. తరగతి పాఠాలకే పరిమితం చేయకుండా సామాజిక అంశాలపై చర్చా వేదికలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. ప్రతి యూనివర్సిటీలోనూ దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరాక ఇంటర్ వరకూ ఉన్న వాతావరణం నుంచి ఇంజనీరింగ్ అనే కొత్త ప్రపంచం అర్థమయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విద్యార్థి ఏ ప్రాంతం నుంచి వచ్చాడు? అతని సామర్థ్యం ఏమిటి? అందరిలో కలుస్తున్నాడా? వంటి అంశాలను అధ్యాపకులు గమనించాలి. తరగతి గదిలో అందరి మధ్య సఖ్యత పెరిగి స్నేహపూర్వక వాతావరణం నెలకొన్న తర్వాతే బోధన చేపట్టాలి. ఇంజనీరింగ్‌లోని వివిధ బ్రాంచీలకు చెందిన విద్యార్థుల మధ్య సమన్వయం నెలకొనేందుకు కాలేజీలు ప్రయత్నించాలి. దీనికోసం సృజనాత్మకత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపకల్పనకు వర్సిటీలు కృషి చేయాలి. అకడమిక్ నాలెడ్జ్‌తోపాటు అనుభవపూర్వకంగా విద్యను నేర్చుకోవడం వల్ల విద్యార్థి మానసిక వికాసం పెరుగుతుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అభిప్రాయపడింది. దీన్ని కాలేజీలు విధిగా అనుసరించాలి -
మరింత సులభంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
సాక్షి, అమరావతి: ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీని రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. విద్యా సంస్థల్లోకి ప్రవేశాలు, స్కాలర్షిప్లు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాసే పరీక్షల్లో ఫీజు మినహాయింపు, సంక్షేమ పథకాల కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి కావడంతో వాటన్నింటికీ గ్రామ, వార్డు సచివాలయాల్లో చేసే ఆరు దశల ధృవీకరణ సరిపోతుందని స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా రెవెన్యూ శాఖ జీవో జారీ చేసింది. పేద కుటుంబాల ఆదాయన్ని బియ్యం కార్డు ద్వారా నిర్థారించవచ్చని, ఆ కార్డును చూపించినప్పుడు ప్రభుత్వ సంస్థలు ఆదాయ ధృవీకరణ పత్రాలు అడగకూడదని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా పలు శాఖలు ప్రత్యేకంగా వీటిని అడుగుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరు దశల ధ్రువీకరణ అమలవుతున్న నేపథ్యంలో దరఖాస్తుదారులు మళ్లీ ప్రత్యేకంగా సర్టీఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ సమస్య పరిష్కారానికి రెవెన్యూ శాఖ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో వచ్చిన అభిప్రాయాల మేరకు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఆదాయ ధృవీకరణ పత్రాలు లేని పదో తరగతి, ఇంటర్ విద్యార్థులందరికీ రెవెన్యూ శాఖ వాటిని ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు సంబంధిత శాఖలు ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగకూడదు. గ్రామ, వార్డు సచివాలయాలు జారే చేసే ధృవీకరణ పత్రం వీటికి సరిపోతుంది. ఆ శాఖలు సచివాలయాల ద్వారా ధ్రువీకరణ పత్రాలను తెప్పించుకుని పని పూర్తి చేయాలి. ఇందుకోసం మూడు రోజుల సమయాన్ని నిర్దేశించారు. పోస్ట్ మెట్రిక్యులేషన్ స్కాలర్‌షిప్‌లకు కూడా ఆరు దశల ధ్రువీకరణ పత్రాన్నే తీసుకుంటారని తెలిపింది. ఆరు దశల ధ్రువీకరణ ప్రక్రియను రియల్ టైమ్‌లో పూర్తి చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సాఫ్ట్‌వేర్‌ను ఆయా సంక్షేమ పథకాలు, సిటిజన్ సర్వీసుల సాఫ్ట్వేర్లతో అనుసంధానం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఈడబ్ల్యూఎస్ సర్టీఫికేషన్, ఇతర కేంద్ర ప్రభుత్వ సంబంధిత వినియోగం, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వంటి నిర్దిష్ట కేసులకు మాత్రం ఆదాయ ధృవీకరణ పత్రాలను జారీకి ప్రస్తుత విధానం కొనసాగుతుంది. ఏ అవసరం కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రం కోరుతున్నారో, అందుకోసం మాత్రమే పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ జారీ చేస్తుంది. ఆరు దశల ధ్రువీకరణ ఇలా.. ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆరు దశల్లో దరఖాస్తుదారు ఆర్థిక స్థితిని అంచనా వేస్తారు. ఆధార్ కార్డు, ఇతర వివరాల ద్వారా ఆ వ్యక్తికి ఉన్న భూమి, మున్సిపల్ ఆస్తి, 4 చక్రాల వాహనం ఉందా? ప్రభుత్వ ఉద్యోగమా? ఆదాయపు పన్ను వివరాలు, వారు వినియోగించే విద్యుత్ యూనిట్లను పరిశీలిస్తారు. వీటి ద్వారా వారి ఆరి్థక స్థితిని నిర్ధారిస్తారు. -
ఎన్ఈపీ సారథులు ఏపీ విద్యార్థులు
సాక్షి, అమరావతి: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ)–2020 అమలులో విద్యార్థులను భాగస్వామ్యం చేసే లక్ష్యంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల ‘ఎన్ఈపీ సారథి’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం అమలు కోసం ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులను ఎంపిక చేసింది. తాజాగా వారి జాబితాను ప్రకటించింది. ఎన్ఈపీ సారథులుగా ఎంపికైన వీరిని ఎన్ఈపీ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీలు, వివిధ ఉన్నత విద్యాసంస్థలకు చెందిన వైస్చాన్స్లర్లు, డైరెక్టర్లు ప్రిన్సిపాళ్లు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఆయా విద్యాసంస్థల్లో విద్యార్థులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం ద్వారా ఎన్ఈపీ లక్ష్యాలను మరింత సులభంగా సాధించగలుగుతామని యూజీసీ భావిస్తోంది. మన రాష్ట్రం నుంచి 8 కాలేజీలకు చెందిన 23 మంది విద్యార్థులకు ఈ అవకాశం దక్కింది. సర్టిఫికెట్, డిప్లొమో, యూజీ, పీజీ విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఎన్ఈపీ లక్ష్యాల సాధనలో విద్యార్థులను నిమగ్నం చేయడం, ఉన్నత విద్యారంగంలో సంస్కరణలపై విద్యార్థుల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా యూజీసీ దీనికి శ్రీకారం చుట్టింది. విద్యా సంస్కరణలు విజయవంతంగా అమలు కావడానికి విద్యార్థుల ప్రమేయం, వారిలో నిబద్ధత చాలా ముఖ్యమైనవని, అప్పుడే ఇది విజయ వంతం అవుతుందని యూజీసీ అభిప్రాయ పడుతోంది. ఈవెంట్లు, డిబేట్లు, పోటీలు, క్విజ్లు వంటి కార్యక్రమాలను కాలేజీల్లో నిర్వహించేలా కార్యక్రమాలు రూపొందించింది. అలాగే సోషల్ మీడియా ద్వారా ఎన్ఈపీపై ప్రచారం చేయడం, కాలేజీల్లో ఎన్ఈపీ హెల్ప్ డెసు్కల ఏర్పాటు తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రతిభగల విద్యార్థుల ఎంపిక ఎన్ఈపీ అంబాసిడర్‌గా యూనివర్సిటీలు, విద్యాసంస్థలు తమ సంస్థల్లో అత్యుత్తమ వ్యక్తిత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సామర్థ్యాలు, సృజనాత్మకత, బాధ్యతాయుత ప్రవర్తన, నాయకత్వ పటిమ ఉన్న ముగ్గురు విద్యార్థులను నామినేట్ చేశాయి. వారి నుంచి యూజీసీ అర్హులైన వారిని ఎంపిక చేసి ఎన్ఈపీ అంబాసిడర్లుగా ప్రకటించింది. వీరి విధుల్లో ఎన్ఈపీ– 2020 కార్యక్రమాలపై ఇతర విద్యార్థులకు అవగాహన పెంచడం, క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం ప్రధానమైనవి. అంతేగాక ఈ కార్యక్రమం అమలుపై యూజీసీకి ఫీడ్‌బ్యాక్‌ను అందించాలి. అంబాసిడర్‌గా ఎంపికైన వారికి యూజీసీ గుర్తింపు సర్టిఫికెట్ ఇస్తుంది. ఈ సర్టిఫికెట్తో వారికి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. సర్టిఫికెట్తో పాటు యూజీసీ ఆన్లైన్ ప్రోగ్రామ్‌లు, ఇతర అవకాశాలను కూడా వారు పొందుతారు. అలాగే ఈ అనుభవం వారికి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విద్యాకోర్సుల అభ్యాసానికి సహకరిస్తుంది. -
హైదరాబాద్‌లో స్కూళ్లకు ఇవాళ సెలవు
-
నెలాఖరులోగా గురుకుల పరీక్షల తుది ‘కీ’లు!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ వడివడిగా సాగుతోంది. తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో అర్హత పరీక్షలను కేవలం మూడు వారాల వ్యవధిలో నిర్వహించి రికార్డు సృష్టించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ).. చివరి పరీక్ష రోజునే ప్రాథమిక కీలను విడుదల చేసింది. తాజాగా ‘ఫైనల్ కీ’(తుది జవాబు పత్రం) తయారీలో గురుకుల బోర్డు నిమగ్నమైంది. దాదాపు 56 కేటగిరీలకు సంబంధించి 19 రోజుల పాటు రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. ప్రాథమిక కీలను విడుదల చేసి అభ్యంతరాలను కూడా ఆన్లైన్ పద్ధతిలో స్వీకరించింది. శనివారంతో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. ఆన్లైన్లో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించేందుకు బోర్డు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అభ్యర్థుల అభ్యంతరాలను తగిన ఆధారాలతో పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా ఫైనల్ కీలను తయారుచేసి వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు టీఆర్‌ఈఐఆర్‌బీ కసరత్తు వేగవంతం చేసింది. ఈనెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేలా గురుకుల బోర్డు కసరత్తు చేస్తోంది. అవరోహణ క్రమంలో నియామకాలు గురుకుల విద్యా సంస్థల్లో వివిధ కేటగిరీల్లో 9,231 ఉద్యోగాలకు వెబ్‌నోట్ జారీ చేసిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. ఆ తర్వాత జారీ చేసిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ల ప్రకారం 9,210 పోస్టులకు మాత్రమే ప్రకటనలను పరిమితం చేసింది. ఇందులో భాగంగా ఈనెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అర్హత పరీక్షలు జరిగాయి. సగటున 75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ కేటగిరీలు మినహా మిగతా అన్ని కేటగిరీల్లోని అర్హత పరీక్షల ప్రాథమిక కీలను వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. కోర్టు కేసుల నేపథ్యంలో ఈ మూడు కేటగిరీల కీలను విడుదల చేయలేదు. ఈ నెలాఖరులో తుది కీలను ఖరారు చేసి, అదేరోజున అభ్యర్థులు సాధించిన మార్కులను కూడా వెబ్సైట్లో పెడతారు. గురుకుల సొసైటీల్లో ఉద్యోగాల భర్తీకి బోర్డు అవరోహణ విధానాన్ని ఎంచుకుంది. ముందుగా పైస్థాయి పోస్టులను భర్తీ చేస్తూ క్రమంగా కింది స్థాయిలో పోస్టుల నియామకాలను ముగిస్తుంది. ఈ క్రమంలో తొలుత డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ పోస్టులను భర్తీ చేస్తారు. ప్రస్తుతం తుది కీలను విడుదల చేసి మార్కులు ప్రకటించిన తర్వాత అర్హతల ఆధారంగా డీఎల్, జేఎల్ పోస్టులకు డెమో పరీక్షలు సైతం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అతి త్వరలో తేదీలను ఖరారు చేసే దిశగా గురుకుల బోర్డు చర్యలు వేగవంతం చేసింది. -
కేంద్ర గిరిజన వర్సిటీకి నేడు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజనుల జీవితాల్లో విద్యా కుసుమాలు విరబూసేలా విజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. విభజన హామీల్లో ఒకటైన ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటును గత చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు. గిరిజన ప్రాంతంలోనే యూనివర్సిటీ గిరిజన విశ్వవిద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తిరాజేరు మండలం మర్రివలస, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలోని ప్రభుత్వ,ప్రైవేటు భూమి సేకరించారు. విశాఖపట్నం–రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందుబాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేశారు. ఇందుకోసం భూములిచ్చిన రైతులకు రూ.29.97 కోట్ల పరిహారం చెల్లించారు. మౌలిక వసతుల కల్పనకు మరో రూ. 28.49 కోట్లు ఖర్చు చేశారు. అందించే కోర్సులు ఈ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లిష్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమెస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, బి.కామ్‌లో ఒకేషనల్ తదితర 14 కోర్సులను అందిస్తారు. వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఒకేషనల్, జాబ్ ఓరియెంటెడ్ షార్ట్ టర్మ్ కోర్సులను కూడా అందిస్తారు. గిరిజన తెగల వ్యక్తిగత, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధిని ఈ యూనివర్సిటీ ద్వారా ప్రోత్సహిస్తారు. ఇప్పటికే విజయనగరం జిల్లా కొండకరకంలోని ఆంధ్రా యూనివర్సిటీ పాత పీజీ క్యాంపస్ భవనాల్లో నిర్వహిస్తున్న వర్సిటీ తరగతుల్లో 385 మంది విద్యార్థులున్నారు. -
Scholarship Scam: మైనారిటీ స్కాలర్షిప్.. భారీ కుంభకోణం
న్యూఢిల్లీ: మైనారిటీల్లోని పేద కుటుంబాల పిల్లలకు అందాల్సిన ఉపకార వేతనాలు భారీగా పక్కదారి పట్టాయి. అనర్హులు వాటిని కాజేశారు. ఏళ్లుగా అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ దందాకు వివిధ స్థాయిల్లో నోడల్ అధికారులు కొమ్ముకాశారు. స్కాలర్షిప్ పథకానికి ఆమోదం పొందిన విద్యా సంస్థల్లో 53 శాతం నకిలీవని తాజాగా తేలింది. అయిదేళ్లలో రూ.144.83 కోట్లు అనర్థులు జేబుల్లో వేసినట్లు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంతర్గత విచారణలో వెల్లడైంది. దీంతో, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఈ అక్రమాలపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ జూలై 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ శాఖ అంతర్గత విచారణ జరిపిన 1,572 విద్యా సంస్థల్లో 830 వరకు బోగస్‌వేనని గుర్తించారు. ప్రస్తుతానికి 830 విద్యాసంస్థల బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నకిలీ ఆధార్ కార్డులు, కేవైసీ పత్రాలతో లబ్ధిదారులకు బోగస్ అకౌంట్లను బ్యాంకులు ఎలా ఇచ్చాయనే దానిపైనా దృష్టి సారించనుంది. రాష్ట్రాల వారీగా అక్రమాలు.. ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలోని పరిశీలన జరిపిన మొత్తం 62 విద్యాసంస్థలూ బోగస్‌వే. రాజస్తాన్: పరిశీలన జరిపిన 128 విద్యాసంస్థల్లో 99 నకిలీవి. అస్సాం: రాష్ట్రంలోని స్కాలర్షిప్ అందుకుంటున్న మొత్తం విద్యా సంస్థల్లో 68శాతం ఉత్తుత్తివే. కర్ణాటక: కర్ణాటకలోని 64 శాతం విద్యాసంస్థలు బోగస్‌వి. ఉత్తరప్రదేశ్: 44 శాతం విద్యాసంస్థలు నకిలీవి. పశ్చిమబెంగాల్: 39 శాతం సంస్థలు నకిలీవి. పక్కదారి పలు విధాలు ► కేరళలోని మలప్పురంలో ఒక బ్యాంకు శాఖలో 66 వేల స్కాలర్షిప్పులు పంపిణీ అయ్యాయి. ఇక్కడ రిజిస్టరయిన మైనారిటీ విద్యార్థుల కంటే ఉపకారవేతనాలు తీసుకున్న వారి సంఖ్యే ఎక్కువ. ► జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌కు చెందిన ఒక కాలేజీలో 5 వేల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 7 వేల మంది స్కాలర్షిప్పులు అందుకున్నారు. తొమ్మిదో తరగతి చదువుకుంటున్న 22 మంది విద్యార్థులకు ఒకే మొబైల్ నంబర్ ఒక్క తండ్రి పేరుతోనే రిజిస్టరయి ఉంది. మరో విద్యాసంస్థకు అనుబంధంగా హాస్టల్ లేకున్నా విద్యార్థులందరూ స్కాలర్షిప్ పొందారు. ► అస్సాంలో.. ఒక బ్యాంక్ బ్రాంచిలో 66 వేల మంది స్కాలర్షిప్ లబ్ధిదారులున్నారు. సంబంధిత మదర్సాకు వెళ్లి పరిశీలనకు యత్నించగా నిర్వాహకులు అధికారులను బెదిరింపులకు గురిచేశారు. ► పంజాబ్‌లో.. స్కూల్లో పేరు నమోదు చేయించుకోని మైనారిటీ విద్యార్థులు సైతం ఉపకారవేతనాలు అందుకున్నారు. -
తెలంగాణలో రేపు అన్ని విద్యాసంస్థలకు సెలవు
-
వానలు తగ్గేదాకా..పరీక్షలన్నీ వాయిదా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, విద్యా సంస్థలకు వరుసగా సెలవులు ప్రకటించడం పరీక్షల నిర్వహణపై ప్రభావం చూపుతోంది. వర్షాలు తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అన్నిరకాల పరీక్షలను వాయిదా వేయాలని ఉన్నతాధికారులు యూని వర్సిటీలు, విద్యా సంస్థలకు సూచించారు. దీంతో ఇప్పటికే డిగ్రీ, ఇంజనీరింగ్‌లో ఇంటర్నల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. డిగ్రీ ప్రవేశాల తేదీల్లోనూ మార్పులు చేశారు. ఇంజనీరింగ్ సీట్లలో తొలివిడత చేరికలకు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలను పొడిగించారు. మలి విడత ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఈ నెల 27తో ఆప్షన్లు ఇచ్చే గడువు ముగుస్తుండటంతో.. ఈ గడువునూ మరికొంత పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు. బడుల్లో అంతర్గత పరీక్షలకు తిప్పలు పాఠశాలల్లోని విద్యార్థులకు జూలైలో జరగాల్సి ఉన్న ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ–1) పరీక్షలను వాయిదా వేయాలని అధికారులు భావిస్తున్నారు. వర్షాల మూలంగా వారం రోజులుగా సెలవులు ఇచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇటీవలి వరకు పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందలేదు. ఇప్పుడీ వర్షా లతో మళ్లీ అంతరాయం రావడంతో నిర్ణీత సిలబస్ పూర్తవలేదని.. ఎఫ్ఏ–1 పరీక్షలను వాయిదా వేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇంటర్ ప్రవేశాల తేదీ పొడిగింపు భారీ వర్షాలతో వరుస సెలవులు, ఇంటర్నెట్, ఇతర ఇబ్బందుల నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఈ నెల 25 నుంచి నెలాఖరు వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఇంకా లక్ష మందికిపైగా ఇంటర్లో చేరాల్సి ఉందని.. వానలు ఇలాగే కొనసాగితే గడువు పొడి గించాలని బోర్డ్ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. వర్సిటీల్లో పరీక్షలు వాయిదా.. దోస్త్ గడువు పెంపు ఉస్మానియా, జేఎన్టీయూహెచ్ సహా పలు యూని వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో అంతర్గత పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటిని ఈ నెలాఖరులో నిర్వ హించాలని భావించినా.. వానలు తగ్గే అవకాశం లేకపోవడంతో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు ఆలస్యం కాను న్నాయి. డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ కౌన్సెలింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీని ఈ నెల 28 వరకూ పొడిగించారు. ఇక ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్‌కు ఆప్షన్ల గడువు 27తో ముగియనుంది. ఈ నెల 31న సీట్ల కేటాయింపు ఉంటుందని సాంకేతిక విద్య కమిషనరేట్ తెలిపింది. వర్షాలు తగ్గకపోతే రెండో విడత చేరికల తేదీని పొడిగించే వీలుందని అధికారులు అంటున్నారు. -
విద్యాసంస్థలకు సెలవులు పొడిగించేనా!
సాక్షి, హైదరాబాద్: విద్యాసంస్థలు సోమవారం నుంచి పునః ప్రారంభమవుతాయా? వర్షాలు ఇంకా పడుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగిస్తారా? ఏ నిర్ణయమూ తీసుకోలేక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. భారీవర్షాల నేపథ్యంలో గురు, శుక్ర, శనివారం వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు. కొన్ని జిల్లాల అధికారులు ఈ సమయంలో స్కూళ్లు తెరవడం మంచిది కాదంటున్నారు. చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతికూల పరిస్థితులున్నాయని, తరగతి పైకప్పులు కురుస్తున్నాయని, వర్షపునీరు గదుల్లో ఉందని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కొన్నిచోట్ల పైకప్పుల నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయని, తరగతిలో విద్యార్థులు ఉంటే ప్రమాదమని ఎంఈఓలు కూడా డీఈఓలకు చెప్పారు. కొన్ని పాఠశాలల ప్రాంగణంలో వరదనీరు ఇంకా నిల్వ ఉందని, విద్యార్థులు పరుగెడితే జారిపడే ప్రమాదం ఉందంటున్నారు. కొన్ని స్కూళ్లల్లో గోడల్లో చెమ్మ ఉందని, ఫలితంగా విద్యుత్ బోర్డుల్లోంచి గోడలకు కరెంట్ వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పారు. ఏ ఒక్క విద్యార్థికి సమస్య తలెత్తినా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సెలవు రోజుల్లో కూడా ప్రైవేట్ స్కూళ్లు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా తరగతులు నిర్వహించాయని చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాల పంపిణీలో ఆలస్యమైందని, దీంతో బోధన కుంటుపడిందని, ఇంకా సెలవులు పొడిగించడం సరికాదని కొంతమంది టీచర్లు అంటున్నారు. ప్రమాదంగా ఉండే స్కూళ్లను గుర్తించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు. సాంకేతిక సమస్యలెన్నో.... వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం, నెట్వర్క్ కనెక్షన్లో ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో దోస్త్, ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఎంసెట్ రెండోవిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కావాలి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువు ఆదివారంతో ముగిసింది. అయితే చాలామంది విద్యార్థులు రిపోర్ట్ చేయలేకపోయారని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా రెండోవిడత కౌన్సెలింగ్ వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సెల్ఫ్ రిపోర్టింగ్ గడువూ పొడిగించాలని కోరుతున్నాయి. డిగ్రీ కళాశాల ప్రవేశాలకు సంబంధించి దోస్త్‌కు సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీ ఈ నెల 26తో ముగుస్తుంది. జిల్లా, మండల కేంద్రాలకు వెళ్లి నెట్‌లోనో, లేదా కాలేజీకి నేరుగా వెళ్లి రిపోర్టు చేసేందుకు అనేక సమస్యలున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. వర్షాల వల్ల రవాణా వ్యవస్థ దెబ్బతిన్నదని, వేరే ప్రాంతాలకు వెళ్లడం కష్టమవుతోందని అంటున్నారు. ఈ కారణంగా దోస్త్ రిపోర్టింగ్ గడువు పొడిగించే యోచనపై అధికారులూ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. -
విద్యాసంస్థలకు సెలవులు.. పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వానలు పడుతుండటంతో ప్రభుత్వం గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. వానలు తగ్గకపోతే శనివారం కూడా సెలవు ఇవ్వాలని క్షేత్రస్థాయిలో అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన పలు పరీక్షలను రద్దు చేశారు. అన్ని యూనివర్సిటీల పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగే ఇంటర్నల్ పరీక్షలను రద్దు చేశారు. వీటిని తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. ఇక ఇంజనీరింగ్ సహా వివిధ రకాల కౌన్సెలింగ్‌ల తేదీలను మార్చాలని విద్యార్థులు కోరుతున్నారు. అకస్మాత్తుగా సెలవు నిర్ణయంతో.. రెండు రోజులుగా వానలు పడుతుండటంతో విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలన్న విజ్ఞప్తులు వచ్చాయి. కానీ దీనిపై బుధవారం రాత్రి వరకు కూడా అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రెండు రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్టుగా గురువారం ఉదయం ప్రకటించారు. ఇది కూడా జిల్లా అధికారులకు మెసేజీల ద్వారా తెలిపారు. మీడియాకు సమాచారం ఇవ్వలేదు. దీనితో సెలవుల విషయం తెలిసేసరికే విద్యార్థులంతా వానలో ఇబ్బందిపడుతూనే స్కూళ్లకు చేరారు. కొన్నిచోట్ల అప్పటికప్పుడే విద్యార్థులను తిప్పి పంపేయగా.. మరికొన్ని విద్యా సంస్థలు ఒంటి గంట వరకు ఇళ్లకు పంపించాయి. ఆటోల్లో, సైకిళ్లపై, నడుచుకుంటూ బడులకు వచ్చే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సెలవు విషయం తెలియడంతో తల్లిదండ్రులు హడావుడిగా స్కూళ్ల వద్దకు వచ్చి పిల్లలను తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇంటర్నెట్ ఇబ్బందితో.. ఎంసెట్ తొలివిడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఇటీవలే మొదటి విడత సీట్ల కేటాయింపు జరిగింది. ఈ నెల 22 నాటికల్లా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంది. రెండు రోజులుగా వానలతో పలుచోట్ల విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్కు అంతరాయం ఏర్పడింది. దీనితో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నామని, సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఉన్నత విద్యా మండలి అధికారి ఒకరు తెలిపారు. ఇక గురువారం జరగాల్సిన టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు సాంకేతిక విద్యా మండలి ప్రకటించింది. హాస్టళ్ల నుంచి ఇళ్లకు.. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. చాలాచోట్ల హాస్టళ్ల చుట్టూ నీరు చేరడం, పలుచోట్ల పైకప్పుల నుంచి నీరు కారడంతో ఇబ్బందిగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో శుక్ర, శనివారాలు సెలవు ఎడతెరిపిలేని వానల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్నిరకాల విద్యాసంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా శుక్ర, శనివారాలు రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. వైద్యం, పాల సరఫరా వంటి అత్యవసర సేవలు కొనసాగుతాయని తెలిపింది. ప్రైవేటు సంస్థలు కూడా వారి కార్యాలయాలకు సెలవులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖను ఆదేశించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి జీహెచ్ఎంసీ పరిధిలో విద్యాసంస్థలు, ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాలకు రెండు రోజుల సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
యమున విశ్వరూపం.. ముంపులో ఢిల్లీ.. జల దిగ్బంధంలో జనజీవనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రహదారులు నదులయ్యాయి. ఇళ్లు నీట మునిగిపోయాయి. శ్మశాన వాటికలు సైతం జలమయంగా మారాయి. రోడ్లపైకి వచ్చే వీలు లేకుండాపోయింది. మొత్తంగా ఢిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో యమునా నదిలో నీటమట్టం గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏకంగా 208.62 మీటర్లకు చేరుకుంది. దీంతో నగరంలో మరిన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉధృత స్థిరంగా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల కారణంగా వజీరాబాద్, చంద్రావాల్, ఓక్లాలోని నీటి శుద్ధి ప్లాంట్లను ప్రభుత్వం మూసివేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనగానే వీటిని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. సహాయక చర్యల కోసం 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు వరద తీవ్రత దృష్ట్యా నగరంలో విద్యా సంస్థలు, అత్యవసర కార్యకలాపాలు లేని ప్రభుత్వ కార్యాలయాలకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురువారం సెలవు ప్రకటించింది. ఆదివారం దాకా సెలవు అమల్లో ఉంటుందని పేర్కొంది. నగరంలోకి భారీ వాహనాల ప్రవేశంపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. అత్యవసర సరుకులు రవాణా చేసే వాహనాలు మినహా ఇతర వాహనాలు రాకూడదని స్పష్టం చేసింది. రోడ్లపై నీరు పొంగిపొర్లుతుండడంతో తూర్పు ఢిల్లీలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రహదారులను అధికారులు పూర్తిగా మూసివేశారు. మరికొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వరదల ప్రభావం మెట్రోరైలు వ్యవస్థపైనా పడింది. ముందు జాగ్రత్త చర్యగా యమునా నదిపై ఉన్న పట్టాలపై మెట్రోరైలు వేగాన్ని గంటకు 30 కిలోమీటర్లకు పరిమితం చేశారు. యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్లోకి ప్రయాణికులను అనుమతించడంలేదు. పంజాబ్, హరియాణాల్లోనూ... చండీగఢ్: పంజాబ్, హరియాణాలనూ వర్షాలు, వరద ఇంకా వదల్లేదు. జనజీవనం సాధారణ స్థితికి చేరుకోలేదు. విద్యా సంస్థలకు సెలవులను పంజాబ్ ప్రభుత్వం ఈ నెల 16 దాకా పొడిగించింది. ఢిల్లీలో యమునా నది వరదకు కారణమైన హరియాణాలోని హత్రికుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గించారు. వర్షాల వల్ల రెండు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 21 మంది మృతిచెందారు. హిమాచల్‌లో సురక్షిత ప్రాంతాలకు పర్యాటకులు సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు, కొండ చరియలు విరిగిపడడం వల్ల ఉన్నచోటే చిక్కుకుపోయిన పర్యాటకులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురువారం చందర్తాల్ నుంచి 256 మందిని తరలించారు. గత నాలుగు రోజుల్లో 60 వేల మంది పర్యాటకులను తరలించినట్లు అధికారులు చెప్పారు. కాసోల్, ఖీర్గంగలో 10 వేల మంది చిక్కుకుపోయారు. వారు తమ కార్లను వదిలేసి బయటకు రావడానికి ఇష్టపడడం లేదు. హిమాచల్‌లో వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 91కు చేరుకుంది. 14 మంది గల్లంతయ్యారు. కేజ్రివాల్ ఇంటి వద్దకు వరద నీరు ఢిల్లీలోని కీలక ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. సెక్రెటేరియట్ ఏరియాలో ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రుల నివాసాలు ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం జలమయంగా మారింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నివాసం వద్దకు వరద నీరు చేరింది. కాశ్మీరీ గేట్ బస్ టెరి్మనల్ నీట మునగడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులను నిలిపివేశారు. ప్రఖ్యాత ఎర్రకోట గోడల వరకూ యమునా నది నీరు చేరుకుంది. ఇక్కడ మోకాళ్ల లోతు నీటిలో జనం నడిచి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. రాజ్‌ఘాట్, పురానా ఖిలా సైతం జలమయమయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సుశ్రుత ట్రామా కేర్ సెంటర్ మునిగిపోవడంతో 40 మంది రోగులను మరో ఆసుపత్రికి తరలించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ తదితర రాష్ట్రాల్లో మరికొన్ని రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. -
చదువులకూ పెద్దన్నే..
అమెరికా సంయుక్త రాష్ట్రాలు..! కొందరికి అగ్రరాజ్యం.. దేశాలకు పెద్దన్న.. మరికొన్నింటికి కుట్రదారు, శత్రువు.. కానీ ప్రపంచం మొత్తం అంగీకరించే ఓ అంశంలో పైచేయి ఆ దేశానిదే.. అదే అత్యుత్తమ ఉన్నత విద్య. రెండు వందలకుపైగా దేశాలున్న ఈ భూమ్మీద ఒక్క అమెరికానే ఎక్కువమంది విదేశీ విద్యార్థులను ఎందుకు ఆకర్షిస్తోందో తెలుసా? రెండు లక్షల మంది.. గత ఏడాది ఒక్క భారతదేశం నుంచే ఉన్నత చదువుల కోసం అమెరికాకు చేరిన విద్యార్థుల సంఖ్య ఇది. గత ఏడాది మొత్తంగా 200 దేశాలకు చెందిన 9.48 లక్షల మందికిపైగా విద్యార్థులు అమెరికాలోని నాలుగు వేలకుపైగా ఉన్న యూనివర్సిటీల్లో చేరడం గమనార్హం. దీనికి ఎన్నో కారణాలు. అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, విస్తృత అవకాశాలు, వైవిధ్యత, చదువుకోవడంలో రకరకాల వెసులుబాట్లు, అంతర్జాతీయ గుర్తింపు, స్కాలర్షిప్లు.. ఇలా మరెన్నో సానుకూల అంశాలు విద్యార్థులను అమెరికా వైపు ఆకర్శిస్తున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలు టాప్! అమెరికా మొత్తమ్మీద ఉన్నత విద్యనందించే సంస్థలు నాలుగు వేలకుపైనే ఉన్నాయి. అత్యాధునిక కృత్రిమ మేధ/మెషీన్ లెర్నింగ్ మొదలుకుని జెనెటిక్ ఇంజనీరింగ్ వరకు.. ఆర్ట్స్, హ్యుమానిటీస్, పొలిటికల్ ఎకానమీ.. ఇలా ఎన్నో రంగాలకు సంబంధించి విస్తృతస్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నా.. ప్రభుత్వ సంస్థల్లో చేరే విద్యార్థులే ఎక్కువని అక్కడి విద్యాశాఖ గణాంకాలు చెప్తున్నాయి. కాలేజీలు, యూనివర్సిటీల్లో అత్యధికం గ్రాడ్యుయేట్, పీహెచ్డీ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయి. కమ్యూనిటీ కాలేజీల్లో రెండేళ్ల కోర్సులుంటాయి. ఇవి సిద్ధాంతాలకు కాకుండా వాస్తవిక జ్ఞానానికి, ఉద్యోగాలకు పనికొచ్చే విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. విదేశీ విద్యార్థుల్లో చాలామంది ఈ కమ్యూనిటీ కాలేజీలు అందించే రకరకాల సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు చేసి.. తర్వాత ఉన్నత విద్య కోసం ఇతర యూనివర్సిటీల్లో చేరుతుంటారు. హార్వర్డ్, యేల్, బ్రౌన్, ప్రిన్స్టన్ వంటి ప్రైవేట్ యూనివర్సిటీలు విద్యార్థుల ఫీజులతోపాటు దాతలు ఇచ్చే విరాళాలతో నడుస్తూంటాయి. ఎన్నో రకాల వెసులుబాట్లతో.. భారత్‌లో ఇంటర్మీడియట్లో చదివే కోర్సులే మీరు భవిష్యత్తులో ఏం కావాలని అనుకుంటున్నారో నిర్ణయిస్తాయి. ఎంపీసీ అయితే ఇంజనీరింగ్.. బైపీసీ అయితే వైద్యం. కానీ అమెరికాలో విభిన్న చదువులకు అవకాశం ఉంటుంది. చాలా యూనివర్సిటీల్లోని నాలుగేళ్ల గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌లోనూ రెండేళ్లపాటు హ్యుమానిటీస్, నేచురల్ సైన్సెస్, సోషల్ సైన్స్, గణితం వంటి సబ్జెక్టుల్లో కోర్సు చేయాల్సి ఉంటుంది. ఈ నాలుగేళ్ల కోర్సు సమయంలో ఎప్పుడైనా మీరు ఎంచుకున్న మేజర్ (ప్రధాన సబ్జెక్ట్)ను మార్చుకోవచ్చు. ఇంజనీరింగ్ చేస్తూ కంప్యూటర్ సైన్స్ నుంచి కృత్రిమ మేధకు మారిపోవచ్చు. యూనివర్సిటీలో చేరేటప్పుడు ఫలానా సబ్జెక్టు అని ఎంచుకోవాల్సిన అవసరమూ లేదు. యూనివర్సిటీ అందించే వేర్వేరు కోర్సులను దగ్గరి నుంచి పరిశీలించి.. నచ్చిన అంశాన్ని మేజర్‌గా ఎంచుకోవచ్చు. కచ్చితంగా క్లాస్‌రూమ్‌లకు రావాలన్న నియమం లేదు. ఆన్లైన్ కోర్సులు చేయవచ్చు. ఒకేసారి రెండు డిగ్రీలు చదవవచ్చు. ఒక యూనివర్సిటీ నుంచి ఇంకోదానిలోకి మారి కోర్సులు కొనసాగించేందుకూ అభ్యంతరాలు ఉండవు. గుర్తింపు, ఉద్యోగావకాశాలు అమెరికా యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికి ప్రపంచ దేశాలన్నింటిలోనూ తగిన గుర్తింపు ఉంటుంది. చదువుకునే సమయంలోనే వివిధ దేశాల వారితో కలిసిమెలిసి ఉండే అవకాశం లభిస్తుంది. పేరు ప్రతిష్టలున్న అధ్యాపకులు, నిపుణుల నుంచి నేర్చుకుని ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే యూనివర్సిటీల పూర్వ విద్యార్థుల నెట్వర్క్, ఫార్చ్యూన్–500 కంపెనీల్లో అత్యధికం అగ్రరాజ్యంలోనే ఉండటం వంటి కారణాలతోనూ అమెరికాలో చదివిన వారికి మెరుగైన ఉద్యోగావకాశాలు కలిగిస్తాయి. అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత మూడేళ్లపాటు ఆ దేశంలోనే పనిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్ విద్యార్థులకు ఇది ఎంతో విలువైన వృత్తిపరమైన నైపుణ్యాన్ని అందిస్తుంది. దీన్ని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ (ఓపీటీ) అంటారు. యూనివర్సిటీలు స్వయంగా కెరీర్ సర్వీసులను కూడా అందిస్తాయి. విదేశీ విద్యార్థులకు, కంపెనీలకు మధ్య వారధిగా నిలుస్తాయి. రెజ్యూమ్‌లు ఎలా తయారు చేసుకోవాలన్న చిన్న అంశాల నుంచి కంపెనీలతో కెరీర్ ఫెయిర్లు, మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ వరకు సాయం అందిస్తాయి. ఖర్చుల మాటేమిటి? అమెరికా చదువులంటే ఖరీదైనవని చాలామంది అంటూ ఉంటారు. అందులో వాస్తవం కొంతే. జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే.. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం బోలెడన్ని స్కాలర్షిప్లు, గ్రాంట్లు అందుబాటులో ఉన్నాయి. దీనికితోడు చదువుకునేటప్పుడే పనిచేసుకునేందుకు అవకాశం కల్పించడం, రుణాలు వంటి మార్గాల ద్వారా విద్యాభ్యాసానికయ్యే ఖర్చులను పొందవచ్చు. ♦ అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి లభించే ఆర్థిక సాయం ప్రధానంగా రెండు రకాలు. ఒకటి మీ అవసరాలను తీర్చేది. రెండోది మీ ప్రతిభకు అనుగుణంగా దక్కేది. కొన్ని స్కాలర్షిప్స్ ట్యూషన్ ఫీజులతోపాటు అక్కడి రోజువారీ ఖర్చులకు కావాల్సిన మొత్తాలను కూడా అందిస్తాయి. కొన్ని స్కాలర్షిప్లు ట్యూషన్ ఫీజు మొత్తం లేదా అందులో కొంత భాగాన్ని చెల్లిస్తాయి. ♦ యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాను ఉదాహరణగా తీసుకుంటే.. విదేశీ విద్యార్థుల కోసం మెరిట్ ఆధారిత స్కాలర్ర్షిప్ లు, క్యాంపస్‌లో ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మీ అవసరాలకు తగిన ఆర్థిక సాయం (నీడ్స్ బేస్డ్ ఫైనాన్షియల్ ఎయిడ్) ఈ యూనివర్సిటీలో లభించదు. ♦ కేవలం గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌కు మాత్రమే కాకుండా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌కు కూడా కొన్ని కాలేజీలు, విద్యాసంస్థలు ఆర్థిక సాయం అందిస్తాయి. ఈ అంశంపై మీకు సాయం అవసరమనుకుంటే ‘ఎడ్యుకేషన్ యూఎస్ఏ’ విభాగాన్ని సంప్రదించవచ్చు. - కంచర్ల యాదగిరిరెడ్డి -
ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలు
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యా సంస్థల్లో వివిధ కోర్సులను ఇంగ్లిష్ మాధ్యమంలో బోధిస్తున్నప్పటికీ, పరీక్షలను విద్యార్థులు వారి మాతృభాషగా ఉన్న ప్రాంతీయ భాషలో రాసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతించింది. విద్యార్థులు కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నప్పటికీ, వారు పరీక్షలలో ప్రాంతీయ భాషను ఎంచుకొనేందుకు అవకాశవిువ్వాలని అన్ని సెంట్రల్ వర్సిటీలు సహా అన్ని విశ్వవిద్యాలయాలకు బుధవారం లేఖ రాసింది. స్థానిక భాషల్లో ఉన్నత విద్యా కోర్సులను ప్రోత్సహించేందుకు, బోధనాభ్యసన ప్రక్రియల్లో విద్యార్థులు మరింత చురుగ్గా పాల్గొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూజీసీ పేర్కొంది. ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సుల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలన్న నూతన విద్యా విధానం మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. పాఠ్య పుస్తకాలను స్థానిక భాషల్లో రూపొందించడం, ఇతర భాషల నుంచి ప్రామాణిక పుస్తకాలను బోధనలో వినియోగించడానికి ఈ విధానం ఉపకరిస్తుందని యూజీసీ అభిప్రాయపడింది. స్థానిక భాషలకు పెరుగుతున్న ప్రాధాన్యత వివిధ పోటీ పరీక్షల్లో, ఉద్యోగ రాత పరీక్షల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో స్థానిక భాషలకు అవకాశం కల్పించాలని వివిధ రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో యూజీసీ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) పరీక్షలను గతంలో హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లో నిర్వహించేవారు. తరువాత పశ్చిమబెంగాల్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల నుంచి వారి ప్రాంతీయ భాషల్లో ఆ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్లు వచ్చాయి. దీంతో జేఈఈ పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే వివిధ పరీక్షలు, ఇతర ఉద్యోగ పరీక్షలను కూడా ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఇదే తరహాలో వివిధ విశ్వవిద్యాలయాల్లోనూ వివిధ కోర్సుల్లో స్థానిక భాషల్లో పరీక్షలు రాసుకొనేలా యూజీసీ నిర్ణయం తీసుకుంది. స్థానిక భాషలో పరీక్ష రాస్తే విద్యార్ధులు తాము నేర్చుకున్న అంశాలను సంపూర్ణంగా సమాధానాలుగా రాయగలుగుతారని, వారిలోని పరిజ్ఞానాన్ని మరింత లోతుగా మూల్యాంకనం చేసేందుకు కూడా ఇది ఉపకరిస్తుందని యూజీసీ అభిప్రాయపడింది. ఉన్నత విద్యలో చేరికలను పెంచేందుకు కూడా ఇది ఉపకరిస్తుందని వివరించింది. ప్రస్తుతం ఉన్నత విద్యలో గరిష్ట చేరికలు 27 శాతం కాగా, దీన్ని 2035 నాటికి 50 శాతానికి పెంచాలన్నది నూతన విద్యా విధానం లక్ష్యమని, దీనిని సాధించడానికి నూతన విధానం ఉపకరిస్తుందని పేర్కొంది. -
బోధనాస్పత్రుల బలోపేతం
కర్నూలులోని అశోక్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ కేదారేశ్వరయ్య గత ఫిబ్రవరిలో గుండెపోటుకు గురవటంతో కుటుంబ సభ్యులు స్థానిక జీజీహెచ్‌లో చేర్చారు. స్టెంట్ వేయడానికి వీలులేని ప్రదేశంలో రక్తనాళాల్లో బ్లాక్ ఉండటంతో బైపాస్ సర్జరీ అవసరమైంది. కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి చిన్న కోతతో అరుదైన పద్ధతిలో బైపాస్ సర్జరీ చేశారు. ప్రైవేట్‌లో రూ.5 లక్షలు దాకా ఖర్చయ్యే శస్త్ర చికిత్సను జీజీహెచ్‌లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేశారు. తెనాలి రూరల్ మండలం పెదరావూరుకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థికి గత నెలలో ఫిట్స్ రావడంతో కన్ను తీవ్రంగా వాచింది. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా ప్రాణాలకు ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొనడంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ముక్కులో ఇటమాయిడ్ సైనసైటిస్‌తో ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్థారించిన వైద్యులు ఆర్టిటల్ డికంప్రషన్ ఆపరేషన్ ద్వారా విద్యార్థి కంటి చూపుతో పాటు, ప్రాణాలను కాపాడారు. సుమారు రూ.3 లక్షల ఖరీదైన ఆపరేషన్‌ను జీజీహెచ్‌లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా నిర్వహించారు. సాక్షి, అమరావతి: అరుదైన శస్త్ర చికిత్సలను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బోధనాస్పత్రుల్లో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా మానవ వనరులు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. రోగుల తాకిడికి అనుగుణంగా వనరులు సమకూర్చడంతో ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు గణనీయంగా మెరుగయ్యాయి. ఏడాదిలో 2.22 లక్షల కేసులు 2022–23లో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద 2,22,147 కేసులకు వైద్య సేవలు అందించారు. ఇందుకు రూ.388.63 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. 2018–19 నుంచి బోధనాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కేసులను పరిశీలిస్తే ఇదే అత్యధికం. టీడీపీ హయాంలో కేవలం 90 వేల లోపు కేసులకు మాత్రమే బోధనాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందగా ఇప్పుడు ఏకంగా రెండు లక్షలకు పైగా చేరుకోవడం గమనార్హం. విజయవాడ జీజీహెచ్ టాప్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవల్లో విజయవాడ జీజీహెచ్ 2022–23లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. 27,081 ఆరోగ్యశ్రీ కేసులు ఇక్కడ నమోదయ్యాయి. 22,104 కేసులతో కర్నూలు జీజీహెచ్ రెండో స్థానంలో, 21732 కేసులతో విశాఖ కేజీహెచ్ మూడో స్థానంలో ఉన్నాయి. ప్రత్యేక పర్యవేక్షణ ఇన్నాళ్లూ ప్రభుత్వాస్పత్రుల్లో వనరులు సరిగా లేకపోవడంతో ఆరోగ్యశ్రీ వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ క్లెయిమ్‌లలో 30 శాతం ప్రభుత్వాస్పత్రుల నుంచి ఉంటున్నాయి. వీటిని మరింత పెంచి ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో 2019 నుంచి బోధనాస్పత్రుల్లో 1,582 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతోపాటు ప్రమోషన్ల రూపంలో కలిపి మొత్తం రెండు వేల వరకూ పోస్టుల భర్తీ చేపట్టింది. గతంతో పోలిస్తే మైనర్, మేజర్ సర్జరీలు, ఇతర చికిత్సలు బోధనాస్పత్రుల్లో గణనీయంగా పెరిగాయి. ఆరోగ్యశ్రీ కేసులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచినట్లు డీఎంఈ డాక్టర్ వినోద్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రతివారం సమీక్ష చేపట్టి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. -
కళాశాలల్లో ఇక ‘కళా గురువులు’
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న యాంత్రిక పద్ధతిని నివారించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నడుం బిగించింది. ప్రస్తుత విద్య ఒత్తిడితో కూడుకుని యాంత్రికంగా మారుతుండటంతో విద్యార్థులకు విద్యపై ఆసక్తి సన్నగిల్లుతోంది. దీన్ని మార్చి విద్యార్థులు ఇష్టంతో విద్య నేర్చుకునేలా యూజీసీ చర్యలు చేపట్టింది. చదువులను ఆహ్లాదకరంగా మార్చడానికి వివిధ కళారూపాలను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వివిధ కళల్లో లబ్ధప్రతిష్ట లైన వారిని కళాశాలల్లో కళా గురువులుగా నియమించనుంది. వీరి ద్వారా హస్తకళలు, సంగీతం, నృత్యం, జానపదాలు, థియేటర్, తోలు»ొమ్మ ప్రదర్శనలు, ఫొటోగ్రఫీ, కాలిగ్రఫీ, యోగా, పెయింటింగ్, ఇంద్రజాలం (మ్యాజిక్) వంటి వాటిని సహ పాఠ్య కార్యక్రమాలుగా ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు యూజీసీ తాజాగా ముసాయిదా ప్రతిపాదనలు విడుదల చేసింది. సృజనాత్మకతను పెంపొందించే ఈ సంప్రదాయ కళారూపాలు ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించేందుకు దోహదపడతాయని యూజీసీ భావిస్తోంది. దీనివల్ల విద్యార్థుల్లో కళాత్మక ఆలోచనలకు, సృజనాత్మకతకు అవకాశం ఉంటుందని, చదువుల్లోనూ వారు మరింత ఉత్సాహంగా ఉంటారని అభిప్రాయపడుతోంది. అదే సమయంలో మరుగునపడిపోతున్న కళారూపాలకు మళ్లీ కొత్త జీవం పోసినట్లు అవుతుందని తలపోస్తోంది. ఏకకాలంలో రెండు ప్రయోజనాలు.. మన దేశం గొప్ప కళా, సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. ప్రాచీన కాలం నుంచి అనేక అద్భుతమైన కళారూపాలు ఉన్నాయి. వీటిని కళాకారులు సంరక్షించుకుంటూ వస్తున్నారు. అయితే వీటికి విద్యా వ్యవస్థతో సంబంధం లేకుండా పోవడంతో కొత్త తరానికి ఈ కళల గురించి అవగాహన లేదు. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు, కళలకు మధ్య చాలా అంతరం ఏర్పడింది. దీన్ని తగ్గించడానికి ఈ కళాగురువుల విధానానికి యూజీసీ శ్రీకారం చుట్టింది. దీనివల్ల ఈ కళా రూపాలను సంరక్షించుకునే వీలు కలుగుతుంది. అదే సమయంలో ఒత్తిడితో యాంత్రికంగా మారిపోయిన విద్యా విధానం నుంచి విద్యార్థులు బయటపడటానికి.. ఆహ్లాదకరంగా విద్య నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కళాశాలల్లో విద్య, బోధన, పరిశోధన ఇతర విద్యా కార్యకలాపాల్లో నైపుణ్యం కలిగిన కళా గురువులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించనున్నారు. ఉన్నత విద్యా విధానంతో హస్త కళలు, నృత్య రూపకాలు, సంగీతం, లలిత కళలు మొదలైనవాటిని అనుసంధానం చేస్తారు. తద్వారా విద్యార్థుల అభ్యసన ప్రక్రియను మెరుగుపరచనున్నారు. మూడు విభాగాల్లో కళా గురువులు.. ఆయా కళల్లో స్థానిక కళాకారులను గుర్తించి ఎంప్యానెల్ చేయడానికి ఆయా విద్యాసంస్థలు కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కమిటీ.. కాంపిటెంట్ అథారిటీకి సిఫార్సులను అందించాలి. కళా గురువులను మూడు విభాగాల్లో ఎంపిక చేయనున్నారు. పరమేష్టి గురువు, పరమ గురువు, గురువు అనే విభాగాల్లో వీరిని నియమించనున్నారు. పరమేష్టి గురువుగా నియమితులు కావాలంటే పద్మ అవార్డు లేదా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు పొంది ఉండాలి. కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి. పరమ గురువుకు కనీసం ఒక జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ గుర్తింపు పొందిన అవార్డు, లేదా తత్సమాన అవార్డు తప్పనిసరి. అనుభవం 10 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు. ఇక గురువుకు.. పరమేష్టి, పరమ గురువుల కేటగిరీల్లో లేని మాస్టర్లుగా పేరు తెచ్చుకున్న కళాకారులను ఎంపిక చేయొచ్చు. అనుభవం 5 ఏళ్లకన్నా తక్కువ ఉండరాదు. అయితే అంతర్జాతీయ, జాతీయ, ప్రభుత్వ గుర్తింపు పొందిన కచేరీల్లో పాల్గొని ఉండాలి. ఎంప్యానెల్ అయిన కళా గురువులకు కార్యకలాపాలను నిర్వహించడానికి తగిన వేదికను ఏర్పాటు చేస్తారు. అవసరమైన ఇతర సహాయంతో పాటు సౌకర్యాలు అందిస్తారు. ప్రయాణ ఖర్చులు, వసతి, నిబంధనల ప్రకారం గౌరవ వేతనం ఇస్తారు. కళారూపాల జాబితా ఇలా.. హస్త కళలు: కుండలు, వెదురు ఆకృతులు, చెక్క పని, టెర్రాకోట, మధుబని, పిచ్వాహి, చరఖా నేయడం, మొఘల్ ఉడ్ ఆర్ట్, స్టోన్, కాంస్యం పని, మీనాకారి పని, నేత, అద్దకం, బ్లాక్ ప్రింటింగ్, మినియేచర్ పెయింటింగ్, ఉడ్ కారి్వంగ్, ప్రింటెడ్ టెక్స్టైల్స్, నేచురల్–ఆర్గానిక్ డైస్ ప్రిపరేషన్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, కార్పెట్ నేత, కాలిగ్రఫీ, దడ్తాన్ గోయ్ తదితరాలు. శాస్త్రీయ సంగీతం: హిందుస్థానీ గాత్రం, హిందుస్థానీ వాద్యం, కర్ణాటక గాత్రం, కర్నాటిక్ ఇన్సŠట్రుమెంటల్, గుర్బానీ, సుఫియానా సెమీ క్లాసికల్, లైట్, మోడ్రన్ మ్యూజిక్, తుమరి/ దాద్రా/కజ్రీ, గజల్, గీత్, భజన్, సూఫీ తదితరాలు. సోపాన సంగీతం: ఖవాలీ, భక్తి– భజన, రామాయణం, శ్రీమద్భాగవత్ పఠనం తదితరాలు, రవీంద్ర సంగీతం, ఫ్యూజన్/జుగల్బందీ/తల్వాధ్య, ఆర్కె్రస్టా/కోరల్, రాక్, బ్యాండ్/జాజ్, కోయిర్ గానం తదితరాలు. డ్యాన్స్: సంప్రదాయ నృత్య రూపకాలైన కథక్, ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, మణిపురి, మోహినీయాట్టం, ఛౌ, సత్త్రియ, యక్షగానం, పాండ్వానీ తదితరాలు. జానపద నృత్యం: భాంగ్రా/గిద్దా, గర్బా, రౌఫ్, ఘూమర్, బిహు, లావణి, విలాసిని నాట్యం, ధిమ్సా, బగురుంబా, అలీ ఐ లిగాంగ్, కోలాటం, నాట్యం, అజిలాము, రొప్పి, ఫోనింగ్, కజారి, ఝుమారి, దండారి, గెండి, పంతి, కర్మ, దమ్కాచ్, మాండో, తల్గారి, సువారి, దసరవదన్, కుంబీ, ఫుగాడి, రాస్, భావాయి, తిప్పానీ, గుగ్గ, ఖోరియా, కులు నాటి, నామ్గెన్, హికత్, ఛమ్, దుమ్హాల్, కుడ్, భంద్ జషన్, ఫాగువా, కృష్ణ పారిజాత, నాగమండల, భూత ఆరాధన, కైకొట్టికలి, తుంబి తుల్లాల్, కర్మ, గౌర్ మారియా, కక్సర్, అహిరి, పావ్రీ, ధంగారి గజ, ఖంబ థోయిబి, పుంగ్ చోలోమ్, నోంగ్క్రెమ్, చెరావ్, ఖుల్లం, చంగ్లో–సువాలువా, ఘుమురా, రుక్ మార్, గోటిపువా, ఝుమర్, కుచి్చఘోడి, కల్బేలియా, భావాయి, సపేరా నృత్యం, సింఘీ చామ్, ఖుకూరి, తలచి, కరగాట్టం, మయిల్అట్టం, కుమ్మి, కావడి, గరియా, హోజాగిరి, రాస్లీల, చర్కుల, బరదానాటి, చాపెలి, లాంగ్వీర్, గంభీర, కలికాపటడి, డోమ్ని, కలరిపట్టు, ఒట్టంతుల్లాలెట్ తదితరాలు. వృత్తిపరమైన కళారూపాలు: పెయింటింగ్, ప్రింట్ మేకింగ్, టెక్స్టైల్, డ్రాయింగ్, స్కల్ప్చర్, సిరామిక్, కాలిగ్రఫీ, ఫొటోగ్రఫీ, జానపద థియేటర్, నౌతంకి, యోగా, ఇసుక కళ, మెహందీ, ఫ్లోర్ ఆర్ట్ (రంగోలి/మందన/కోలమెట్సీ), కథకులు, మ్యాజిక్ షో, పప్పెట్ షో, కామిక్ ఆర్ట్ తదితరాలు. -
ప్రతి విద్యాసంస్థలో ర్యాగింగ్ నిరోధక కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ప్రతి విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు వేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ ద్రం డిమాండ్ చేశారు. ర్యాగింగ్‌ను నిరోధించేందుకు యూజీసీ, ర్యాగింగ్ మార్గదర్శకాలు పాటించడంతో పాటుగా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేసి ఆయా నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రతి విద్యాసంస్థలో ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేయాలని, కమిటీల్లో తల్లిదండ్రులు, సైక్రియాటిస్ట్, సైకాలజిస్ట్‌లను భాగస్వాములను చేసి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. -
ఆన్లైన్ చదువులపైనే ఆసక్తి
సాక్షి, అమరావతి: ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌మయం. ప్రతి రంగంలోనూ టెక్నాలజీ తన హవాను ప్రదర్శిస్తోంది. ఇందుకు విద్యా రంగం మినహాయింపు కాదు. ముఖ్యంగా కోవిడ్ కల్లోల పరిస్థితుల్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్స్, వెబ్సైట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. స్కూళ్లు, కళాశాలలు లేకపోవడంతో విద్యార్థులంతా ఇళ్లకే అతుక్కుపోయారు. దీంతో ఆయా విద్యా సంస్థలు తమ విద్యార్థులకు ఆన్లైన్ వేదికగా పాఠాలు బోధించాయి. అభ్యసనం మొదలుకుని.. పరీక్షల వరకు అన్నీ ఆన్లైన్ వేదికగానే సాగాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఆన్లైన్ చదువులపై ఆసక్తి చూపేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేరుగా కాలేజీల్లో చదివే అవకాశాల్లేనివారితో పాటు ఉద్యోగాల్లో ఉన్నవారు, అదనపు విద్యార్హతలను సంపాదించుకోవాలనుకొనే వారు ఈ ఆన్లైన్ కోర్సులను ఆశ్రయిస్తున్నారు. సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతూ అన్ని రంగాల్లోనూ డిజిటలైజేషన్ వేగంగా విస్తరిస్తుండడంతో ఆన్లైన్ విద్య అందరికీ మరింత అందుబాటులోకి వచ్చింది. ‘స్వయం’.. వందలాది కోర్సులు.. ఆన్లైన్ కోర్సులకు భారీగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఎడ్టెక్ సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ విద్యాసంస్థలు, వర్సిటీలు కూడా ఆన్లైన్ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్’ (స్వయం – https://swayam.gov.in/) ఏర్పాటు చేసి వందలాది కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ కోర్సులకు సంబంధించి ఇదివరకు ఉన్న నిబంధనలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఒకింత సడలించింది. నిర్ణీత ప్రమాణాలతో ఆన్లైన్ కోర్సులను అందించేందుకు పలు సంస్థలకు అనుమతులు కూడా మంజూరు చేస్తోంది. యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికే యూజీసీ మార్గదర్శకాల మేరకు ఆన్లైన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. మరోవైపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీలు) కూడా https://nptel.ac.in/ ద్వారా ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి. విద్యార్థులే కాకుండా ఆసక్తి ఉన్న వారెవరైనా ఈ కోర్సులను అభ్యసించేలా చర్యలు చేపట్టాయి. ఆన్లైన్లోనే కాకుండా ఓడీఎల్ విధానంలోనూ.. కరోనాకు ముందు ఆన్లైన్ చదువులవైపు ఆసక్తి చూపినవారి సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. కరోనా తర్వాత వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2021–2022లో ఆన్లైన్ కోర్సుల్లో చేరినవారి సంఖ్య 170 శాతం మేర పెరిగినట్లు యూజీసీ సహా పలు సంస్థల అధ్యయనాలు వెల్లడించాయి. ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) విధానంలోనూ ఆన్లైన్ కోర్సుల్లో చేరుతున్నారు. ఆన్లైన్, ఓడీఎల్ మార్గాల్లో చదువులు కొనసాగిస్తున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతుండడంతో ఆ మేరకు సంస్థలు కూడా అవసరాలకు తగ్గ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. బిజినెస్ మేనేజ్మెంట్పైనే మోజు.. వివిధ వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు అందిస్తున్న ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సులు, వాటిలో చేరే వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఆన్లైన్, ఓడీఎల్ కోర్సులను అభ్యసించే వారిలో ఎక్కువగా పురుషులే ఉంటున్నారు. ఉన్నత విద్య విభాగం సర్వే గణాంకాలు పరిశీలిస్తే.. పురుషుల సంఖ్యలో సగం మంది మహిళలు మాత్రమే ఈ ఆన్లైన్, ఓడీఎల్ కోర్సుల్లో చేరుతున్నారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేవారిలో ఎక్కువ మంది బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరుతున్నట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సెంట్రల్, స్టేట్, డీమ్డ్, ప్రైవేటు వర్సిటీలు ఈ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. టెక్నాలజీ అంశాలకు సంబంధించి ఐఐటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఎప్పటికప్పుడు కొత్త సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. ఐఐటీలు వంటి జాతీయస్థాయి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఆన్లైన్, ఓడీఎల్ కోర్సులు అందిస్తున్న నేపథ్యంలో విదేశీ విద్యార్థులు కూడా వీటిని అభ్యసించేందుకు ముందుకు వస్తుండటం విశేషం. -
ఏపీలోనూ విదేశీ కోర్సులు.. ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్ రాష్ట్రంలోనూ అమలు
విద్యార్థులకు సర్టిఫికేషన్ కోర్సుల ద్వారానే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సోలార్ పార్క్‌లు, సోలార్ మోటార్లు, ప్యానల్స్ రిపేరు వంటి వాటిలో నైపుణ్యం కొరతను అధిగమించేలా ప్రతి నియోజకవర్గంలో స్కిల్ సెంటర్లు అందుబాటులో ఉండాలి. వీటిలో ఈ దిశగా కోర్సులు, కరిక్యులమ్, శిక్షణ ఉండాలి. వచ్చే జూన్ నాటికి ఈ తరహా కోర్సులు ఏర్పాటు చేయాలి. కళాశాలలకు అనుమతుల విషయంలో యూనిఫామ్ పాలసీ ఉండాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విదేశాల్లోని ప్రముఖ విద్యా సంస్థలు అక్కడి విద్యార్థులకు అందిస్తున్న వివిధ కోర్సులను రాష్ట్రంలోని విద్యార్థులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా కోర్సులు మన విద్యార్థులకు ఏమేరకు గరిష్ట ప్రయోజనం కల్పిస్తాయో పరిశీలించి, వాటిని ఇక్కడ కూడా అమల్లోకి తీసుకురావడంపై దృష్టి సారించాలని సూచించారు. తద్వారా రాష్ట్ర విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిగ్రీ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థుల నైపుణ్యాలను పెంచాలని, ఈ దిశగా వివిధ కోర్సుల పాఠ్య ప్రణాళికల్లో సమగ్రత తేవాలని సూచించారు. ఉన్నత విద్యా సంస్థల్లోని కోర్సుల పాఠ్య ప్రణాళికను ఆయా జిల్లాల్లో ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా జాబ్ ఓరియెంటెడ్‌గా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్ కోర్సులను ఈ పాఠ్య ప్రణాళికలో భాగం చేయాలని చెప్పారు. ప్రఖ్యాత కాలేజీలు అనుసరిస్తున్న పాఠ్య ప్రణాళికలను కూడా పరిశీలించి, రాష్ట్రంలో కూడా అటువంటి పాఠ్య ప్రణాళికలను అమలు చేయాలన్నారు. స్వయం ఉపాధిని కల్పించే కోర్సుల కోసం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) వంటి సంస్థలతో అనుసంధానం (టైఅప్) చేసుకోవాలని సూచించారు. రిస్క్ అనాలసిస్, రిస్క్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ వంటి కోర్సులపై దృష్టి పెట్టాలన్నారు. ఈ తరహా కోర్సుల వల్ల డిగ్రీ పూర్తి కాగానే విద్యార్థులకు స్వయం ఉపాధి అందుతుందని చెప్పారు. వచ్చే జూన్ కల్లా పాఠ్య ప్రణాళికలో ఈ కోర్సులు భాగం కావాలన్నారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరితగతిన నియామకాలు ► ఉన్నత విద్యా శాఖలో 2 వేలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. ఈ ఖాళీలను త్వరగా భర్తీ చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇప్పటికే చేపట్టిన నోటిఫికేషన్లకు సంబంధించిన కోర్టు కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకుని, జూన్ కల్లా నియామక ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలి. ► ఉన్నత విద్యా శాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తున్న నేపథ్యంలో సిబ్బంది నియామకాలు త్వరితగతిన చేపట్టాలి. యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్కు సంబంధించి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడం గురించి ఆలోచించాలి. సమర్థులైన బోధన సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టాలి. తద్వారా విశ్వవిద్యాలయాల్లో బోధన ప్రమాణాలను పెంచేందుకు అవకాశముంటుంది. ట్రిపుల్ ఐటీలలో సిబ్బంది నియామకం, ఇతర పెండింగ్ అంశాలను సత్వరమే పరిష్కరించాలి. కాలేజీలు ప్రమాణాలు పెంచుకునేలా చేయూత ► రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలన్నింటికీ న్యాక్ తదితర సంస్థల అక్రిడిటేషన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఉన్నత విద్యా శాఖ పరిధిలోని ప్రతి కాలేజీలో కూడా బోధనపరంగా, వసతుల పరంగా నాణ్యత పెరగాలి. ఈ దిశగా ప్రతి విద్యా సంస్థ కూడా నాక్ అక్రిడిటేషన్ సాధించాలి. ► కాలేజీలు ప్రమాణాలు పెంచుకునేలా మూడేళ్ల పాటు వారికి చేయూతనివ్వాలి. ఒక్కో ఏడాది ఒక్కో లక్ష్యాన్ని అందుకుంటూ మూడేళ్లలో అక్రిడిటేషన్‌కు వీలుగా ప్రమాణాలు పెంచుకోవాలి. మూడేళ్ల తర్వాత కచ్చితంగా ఉన్నత విద్యాశాఖలోని విద్యా సంస్థలు న్యాక్ అక్రిడిటేషన్ సాధించాలి. అలా సాధించలేని పక్షంలో సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలి. అప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ► కళాశాలల్లో కోర్సులన్నీ నేటి అవసరాలకు తగిన విధంగా రూపొందించాలి. వివిధ కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్ అందించే బాధ్యత స్కిల్ యూనివర్సిటీ తీసుకోవాలి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో 175 స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ► ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులు ఏర్పాటు చేయాలి. ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖలు కలిసి కరిక్యులమ్ రూపొందించాలి. హై ఎండ్ స్కిల్స్‌లో భాగంగా సాప్ట్వేర్ స్కిల్స్‌ను కూడా అభివృద్ధి చేయాలి. కోడింగ్, క్లౌడ్ సర్వీసెస్ లాంటి డిమాండ్ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలి. సెంట్రల్ ఆంధ్రాలో అకడమిక్ స్టాఫ్ కాలేజ్ ► బోధనా సిబ్బంది సామర్థ్యం మెరుగు పరచడానికి తిరుపతి, విశాఖపట్నంలలో ఉన్న అకడమిక్ స్టాఫ్ కాలేజీలను బలోపేతం చేయాలి. వీటితో పాటు సెంట్రల్ ఆంధ్రా పరిధిలో ఒక చోట అకడమిక్ స్టాఫ్ కాలేజీ ఏర్పాటు చేయాలి. ► కొన్ని ప్రైవేట్ బీఈడీ కాలేజీల్లో బోధన, వసతులు తీసికట్టుగా ఉన్నాయని.. మరికొన్ని కాలేజీలు మోసపూరిత చర్యలకు దిగుతున్నాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయా కాలేజీల్లోని బోధన సిబ్బంది, వసతి, సౌకర్యాలను ప్రమాణంగా తీసుకోవాలి. అందులో చదివే విద్యార్థుల హాజరును మరొక ప్రమాణంగా తీసుకుని ఆయా కాలేజీలపై ఒక నిర్ణయానికి రావాలి. డ్రాపవుట్లకు తావులేకుండా చర్యలు ► పిల్లలు చదువులు ప్రారంభించిన తర్వాత ఏ దశలోనూ డ్రాప్ అవుట్ అన్న పరిస్థితే రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. పిల్లలను బడికి పంపితే చాలు.. నేరుగా తల్లి అకౌంట్లోకి అమ్మ ఒడి పథకం ద్వారా డబ్బు జమ చేస్తోంది. టెన్త్ తర్వాత ఐటీఐ, పాలిటెక్నిక్ వైపు వెళ్తున్న వారికి కూడా విద్యా దీవెన, వసతి దీవెన అమలు చేస్తోంది. ► మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి ఇతర చదువులు చదువుతున్న వారికి పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తోంది. సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను దేశంలో అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. అలాగే వసతి దీవెన కూడా అందిస్తున్న రాష్ట్రం ఏపీనే. ఈ కార్యక్రమాల వల్ల ఎక్కడా చదువులు మానేయాల్సిన పరిస్థితి అన్నది లేదు. ఫలితంగా జీఈఆర్ (గరిష్ట చేరికల నిష్పత్తి) తప్పకుండా పెరుగుతుంది. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాల సాధనలో ఇవి ప్రతిబింబించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ► ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, విద్యా శాఖ సలహాదారు ఏ.సాంబశివారెడ్డి, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఆర్జీయూకేటీ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కేసి.రెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఉన్నత విద్యాసంస్థల్లో అసాంఘిక చర్యలపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: సరికొత్త చట్టాలు, అధునాతన సాంకేతికత సహాయంతో ఉన్నత విద్యాసంస్థల్లో అసాంఘిక చర్యలపై ఉక్కుపాదం మోపాలని ఉన్న త విద్యా, పోలీసుశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనికిగాను ప్రస్తుత చట్టాలను మరింత కఠినతరం చేయాలని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యామండలి నేతృత్వంలో గురువారం ఇక్కడ ‘విద్యాసంస్థల్లో భద్రతాచర్యలు, రక్షణ విధానం’అనే అంశంపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. యూనివర్సిటీలు, కాలేజీల్లో మాదవద్రవ్యాలు, సైబర్ నేరాలు, వివక్ష, వేధింపుల నియంత్రణ సవాల్‌గా మారిందని పోలీసు అధికారులు చెప్పినట్లు తెలిసింది. విద్యాసంస్థల్లోకి పోలీసుల ప్రవేశాన్ని అడ్డుకునే చట్టాలను మార్చాలని, స్వేచ్ఛగా ప్రవేశించి, ఏ కేసునైనా శోధించే వీలు కల్పించాలని, నిఘా వ్యవస్థ కోసం పటిష్టమైన చర్యలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని పోలీ సు అధికారులు అభిప్రాయపడ్డారు. సీసీ కెమెరా లు, కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని పలువురు సూచించగా వీటన్నింటికీ నిధుల సమ స్య ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలిసింది. అంతిమంగా పోలీసు, విద్యాశాఖ కలిసి పనిచేయాలని, ఈ దిశగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయాలని నిర్ణయించారు. సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్, స్వాతి లక్రా, సుమతి తదితరులు పాల్గొన్నారు. భద్రత ముఖ్యమే: లింబాద్రి సమావేశం అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.లింబాద్రి మీడియాతో మాట్లాడారు. నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యాసంస్థల్లో భద్రత కీలకమైన అంశమని, దీని కోసం పోలీసు లు, విద్యాశాఖ సమన్వయంతో ముందుకువెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ విద్యార్థులుండే వర్సిటీ క్యాంపస్‌ల్లో డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టడం వంటి విషయాలపై అవగాహనకు సరికొత్త విధానాలు అనుసరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. కొత్తగా కాలేజీల్లోకి అడుగుపెట్టే వారిలో న్యూనతాభావం తొలగించేందుకు, ఒత్తిడికి లోనవ్వకుండా కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటు అవసరంపై చర్చించనట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు వెలువడే వీలుందని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడే క్రమంలో వాటిని వినియోగించే విద్యార్థులను నేరస్తులుగా చూడబోమన్నారు. గవర్నర్ ఆమోదించగానే ఖాళీల భర్తీ: మంత్రి సబిత సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసెంబ్లీ ఆమోదం పొంది, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న విద్యాశాఖ బిల్లులపై అనుమానాలను నివృత్తి చేశానని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి స్పష్టం చేశారు. ఆమె గురువారం బషీర్‌బాగ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. కొంత కాలంగా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ఆమోదం లభించిన వెంటనే వర్సిటీల్లోని ఖాళీ లను భర్తీ చేస్తామని చెప్పారు. బిల్లులను గవర్నర్ ఎందుకు ఆమోదించడం లేదో తనకు తెలియ ద ని పేర్కొన్నారు. కరోనా కాలంలో తెలంగాణ లోనే ఉన్న చంద్రబాబు ఒక్కసారైనా ఇక్కడి ప్రజలను కలిసే ప్రయత్నం చేయలేదని ఆమె వి మర్శించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రజలపై మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. -
జేఈఈ మెయిన్ సిలబస్ ఖరారు
సాక్షి, అమరావతి: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023 సిలబస్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం.. మ్యాథమెటిక్స్‌లో 16 టాపిక్‌లు, ఫిజిక్స్ సెక్షన్–ఏలో 20 టాపిక్స్, సెక్షన్–బిలో ప్రయోగ నైపుణ్యాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇక కెమిస్ట్రీలోని ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీల్లో 10 చొప్పున టాపిక్స్ ఉన్నాయి. తెలుగు, ఇంగ్లిష్, హిందీ తదితర మాధ్యమాల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించనున్నారు. విద్యార్థులు ఏ భాషలో పరీక్ష రాయాలనుకుంటున్నారో ముందుగానే దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్‌లో భాగంగా బీఈ, బీటెక్‌లో ప్రవేశాలకు పేపర్–1, బీఆర్క్ కోసం పేపర్–2ఏ, బీప్లానింగ్‌కు పేపర్–2బీని నిర్వహిస్తారు. పేపర్–1లో మూడు సెక్షన్ల కింద మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ప్రశ్నలుంటాయి. కంప్యూటర్ ఆధారితంగా పరీక్షలు జరుగుతాయి. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు ఉంటాయి. అలాగే నెగిటివ్ ఆన్సర్‌కు 1 మార్కు కోత ఉంటుంది. పేపర్–1లో మూడు సెక్షన్లలో 300 మార్కులకు 90 బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలుంటాయి. పేపర్–2ఏలో 400 మార్కులకు 82 ప్రశ్నలు ఇస్తారు. పేపర్–2బీలో 400 మార్కులకు 105 ప్రశ్నలుంటాయి. జనవరి, ఏప్రిల్‌లో రెండు సెషన్లుగా పరీక్షలు.. కాగా జేఈఈ మెయిన్ పరీక్షలను జనవరి, ఏప్రిల్‌లలో రెండు సెషన్లుగా నిర్వహించేలా ఎన్టీఏ షెడ్యూల్ విడుదల చేసింది. తొలి సెషన్ జనవరి 24 నుంచి 31 వరకు, రెండో సెషన్ ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనుంది. ఇప్పటికే తొలి సెషన్‌కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే జనవరి సెషన్ పరీక్షల తేదీల్లోనే పలు ఇంటర్మీడియెట్ బోర్డులు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నాయి. ఒకే తేదీల్లో ఈ రెండు పరీక్షలు రావడం వల్ల తమకు నష్టం కలుగుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా జనవరి సెషన్‌కు సన్నద్ధం కావడానికి తక్కువ సమయం ఇచ్చారని, ఈ తేదీలను పొడిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే కరోనా సమయంలో రద్దు చేసిన ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధనను పునరుద్ధరించడం వల్ల కూడా ఎక్కువ మందికి నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ నిబంధనను కూడా సడలించాలని కోరుతున్నారు. -
విద్యార్థుల భద్రతపై సమావేశం
సాక్షి, హైదరాబాద్: విద్యాసంస్థల్లో విద్యార్థులకు భద్రత, రక్షణ వ్యవస్థ ఏర్పా టుపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహిస్తున్నట్టు మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా జరిగే ఈ కార్యక్రమంలో డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, అదనపు డీజీ స్వాతిలక్రా సహా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉప కులపతులు పాల్గొంటారని ఆయ న తెలిపారు. కళాశాలల్లో చేరే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవ్వకుండా, సైబర్ నేరాలకు ఆకర్షితులవ్వకుండా, వివిధ కారణాల వల్ల ఆత్మన్యూనత భావానికి లోనవ్వకుండా ఏ తరహా జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలిపారు. -
AP: అత్యవసర వైద్యం మరింత బలోపేతం
సాక్షి, అమరావతి: ప్రజలు తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు అత్యవసరమయ్యే క్లిష్టమైన సంరక్షణ(క్రిటికల్ కేర్)ను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గుండెపోటు, కార్డియో వాస్కులర్ స్ట్రోక్స్, శ్వాసకోశ రుగ్మతలు, పాయిజన్, సెప్టిక్ షాక్, ఇతర సందర్భాల్లో బాధితులకు నాణ్యమైన వైద్య సేవల కోసం నెల్లూరు జీజీహెచ్, కడప, శ్రీకాకుళం రిమ్స్‌లలో క్రిటికల్ కేర్ బ్లాక్ (సీసీబీ)లు ఏర్పాటు చేయడానికి కార్యాచరణ రూపొందించింది. కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి దేశవ్యాప్తంగా లక్షల మంది మృత్యువాత పడ్డారు. వైరస్ నుంచి కోలుకున్న అనంతరం పలు రకాల తీవ్ర అనారోగ్య సమస్యలతో మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకతను కరోనా వైరస్ తెలియజేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సీసీబీల ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.71.25 కోట్లతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నెల్లూరు, కడప, శ్రీకాకుళంలో ఒక్కోచోట రూ.23.75కోట్ల ఖర్చుతో రూ.71.25 కోట్లతో 50 పడకల సామర్థ్యంతో సీసీబీలను ఏర్పాటుచేస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు జీజీహెచ్, కడప రిమ్స్‌లో సీసీబీల ఏర్పాటుకు డీపీఆర్‌లు రూపొందించగా, వాటికి ఆమోదం లభించింది. సీసీబీల ఏర్పాటుకు టెండర్లను పిలవాలని ఎన్హెచ్ఎం నుంచి ఏపీఎంఎస్‌ఐడీసీకి ప్రతిపాదనలను పంపారు. శ్రీకాకుళం రిమ్స్‌లో సీసీబీ ఏర్పాటుకు డీపీఆర్‌ను రూపొందిస్తున్నారు. త్వరగా టెండర్లు పూర్తి చేసి, శరవేగంగా సీసీబీలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్ ‘సాక్షి’తో చెప్పారు. -
‘పని’కొచ్చే విద్య కావాలి! ఒక సబ్జెక్ట్‌లో బీటెక్.. సాఫ్ట్వేర్ జాబ్‌లో చేరిపోవడం!
-కంచర్ల యాదగిరిరెడ్డి ♦ ప్రస్తుతం చదివే చదువుకు, చేసే పనికి ఏమైనా సంబంధం ఉంటోందా? ఏదో ఒక సబ్జెక్ట్‌లో బీటెక్ చదవడం.. ఏ మాత్రం సంబంధం లేని సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిపోవడం! ఉద్యోగంలో చేరాక తగిన నైపుణ్యం లేక తడబడుతూ భవిష్యత్‌ను అంధకారం చేసుకోవడం!! ..ఒక్క మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జరుగుతున్నది ఇదే. ఇక్కడ తప్పు ఎవరిది..? చదివిన చదువుదా, ఉద్యోగాలిస్తున్న కంపెనీలదా అని తరచి చూస్తే.. సమస్య అంతా దశాబ్దాల పాటు నామమాత్రపు మార్పులతో నెట్టుకొస్తున్న విద్యా వ్యవస్థలదే. మరి ఏం చేస్తే బాగుంటుందంటే.. తరగతులను తిరగేయాలని, సిలబస్‌లో సమూలంగా మార్పులు రావాలని అంటున్నారు ప్రొఫెసర్ సంజయ్‌శర్మ. ప్రపంచ ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ అయిన సంజయ్‌శర్మ ‘న్యూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్’ పేరుతో ఈ ఏడాది సెపె్టంబర్లో ఓ విధాన పత్రాన్ని విడుదల చేశారు. అంతేకాదు ఉద్యోగార్హతలు, విద్యా (సిలబస్) విధానాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఆయన ఓ పోరాటమే ప్రారంభించారు. ఉన్నత విద్యకు– ఉద్యోగ నైపుణ్యానికి మధ్య అంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యకు, ఉద్యోగ నైపుణ్యాలకు మధ్య అంతరం పెరిగిపోతూనే ఉంది. డిగ్రీ లేదా పీజీ పట్టా చేత పట్టుకుని ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోవడం, అక్కడ చేయాల్సిన పనులను సీనియర్లు చెబితే నేర్చుకోవడం, తప్పులు చేస్తూ దిద్దుకుంటూ ముందుకు వెళ్లడంతోనే సరిపోతోంది. ‘‘ప్రపంచంలో 80శాతం మంది ఉద్యోగులది ఇదే పరిస్థితి. అందువల్ల అన్నిరంగాల్లో పరిశోధనలు కుంటుపడుతున్నాయి. అందుబాటులో ఉన్న ఉద్యోగాలతో కాలం వెళ్లదీస్తున్నంత కాలం పరిశోధనల్లో ముందడుగు ఉండదు’’ అని యాపిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ గతంలో పలు సందర్భాలలో ఎత్తిచూపారు. మధ్యతరగతికి భారమవుతున్న ఉన్నత విద్య ఇప్పుడు ఉన్నత విద్య మునుపటిలా చౌక కాదు. బ్యాంకులిచ్చే రుణాలతో చదువుకున్నవారు అప్పులు తీర్చడంతో జీవితాన్ని మొదలుపెడతారు. అమెరికాలో ఉన్నతవిద్యకు అయ్యే ఖర్చు వార్షిక ద్రవ్యోల్బణం కంటే వేగంగా పెరిగిపోతోందని అధ్యక్షుడు బైడెన్ స్వయంగా చెప్పారు. ఈ మధ్యే ఆయన కొన్ని షరతులతో కొందరు విద్యార్థులకు ఫీజు బకాయిలు రద్దు చేశారు. అయినా సరే అమెరికాలో ఇప్పుడు విద్యార్థులపై ఉన్న భారం లక్షా డెబై ఐదు వేల కోట్ల డాలర్లు. రూపాయల్లో చెప్పాలంటే సుమారు కోటిన్నర కోట్లు. చాలా దేశాల్లో ఉన్నత విద్యకు సబ్సిడీలు ఇస్తున్నారు. స్థూల జాతీయోత్పత్తిలో సగటున 2.5 శాతం వరకూ విద్యకు ఖర్చు పెడుతున్నారు. ఇంతఖర్చు చేస్తున్నా ఉద్యోగాలకు తగ్గట్టుగా విద్యను రూపొందించడంపై దృష్టి పెట్టడం లేదు. దీనితో డిగ్రీ/ పీజీ పట్టా పుచ్చుకుని ఉద్యోగాల్లో చేరేవారికి నైపుణ్యాలు ఉండటం లేదని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పలు సందర్భాల్లో ఉటంకించారు. ఈ క్రమంలోనే కంపెనీలు కాలేజీల డిగ్రీలను పక్కనపెట్టేసి ఉద్యోగులకు తమ అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని కంపెనీలు ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలను తగ్గిస్తున్నాయి. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హత అవసరమైన ఉద్యోగాల సంఖ్య 45 శాతం వరకూ తగ్గిపోయినట్టు ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి. విద్యా సంస్థలు మాత్రం ఈ సమస్యను గుర్తించడం లేదు. ఎంఐటీ ప్రొఫెసర్ సంజయ్ శర్మ ‘న్యూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్’ పేరిట చేసిన ప్రతిపాదనపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత సానుకూలతలను కొనసాగిస్తూనే.. ‘న్యూఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్’ ప్రతిపాదిస్తున్న కొత్త పద్ధతి ప్రస్తుత ఉన్నత విద్య విధానంలోని మేలైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. సామాజిక, భావోద్వేగ అభివృద్ధితోపాటు బతికేందుకు అనువైన సంపూర్ణమైన చదువు ప్రస్తుత విద్యావిధానంలోని సావకాశం. ఎట్టి పరిస్థితుల్లో వీటిని కాపాడుకోవాల్సిందే అంటారు సంజయ్ శర్మ. తాము వీటికి మరిన్ని అంశాలను జోడించి కంప్యూటర్ సైన్స్, బిజినెస్ రంగాలకు ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని ప్రతిపాదిస్తున్నామని ఆయన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ కోసం రాసిన ఒక వ్యాసంలో తెలిపారు. ఈ కొత్త విధానంలో బోధన పద్ధతులతోపాటు నిర్మాణాత్మక బోధన అంశాల్లోనూ మార్పులు చేస్తున్నామన్నారు. మొత్తమ్మీద చూస్తే ఈ కొత్త విధానంలో ‘ఫ్లిప్డ్ క్లాస్రూమ్’ అనేది ఒక అంశం. ప్రస్తుతం తరగతి గదిలో కేవలం ప్రొఫెసర్లు చెప్పే పాఠాలు (సిలబస్‌కు లోబడి) మాత్రమే ఉంటున్నాయి. మొత్తం కోర్సు అవధిలో 95 శాతం ఈ పాఠాలే. మిగతా ఐదు శాతం కంపెనీల్లో ఇంటర్న్íÙప్లు లేదా ప్రాక్టికల్స్ ఉంటాయి. ‘ఫ్లిప్డ్ క్లాస్రూమ్’లో ఏముంటుంది? ఫ్లిప్డ్ క్లాస్రూమ్ ప్రస్తుత విధానానికి భిన్నంగా ఉంటుంది. పాఠాలన్నీ డిజిటల్ రూపంలో ఉంటాయి. విద్యార్థి తనకు కావాల్సిన టైమ్‌లో వాటిని చూసుకోవచ్చు. వాస్తవంగా తరగతి గదిలో ఉద్యోగ సంబంధిత అంశాలపై చర్చలు జరుగుతాయి. నైపుణ్యాల శిక్షణ ఇస్తారు. న్యూఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కోర్సు కూడా నాలుగేళ్లు ఉంటుంది. ఇందులో సెమిస్టర్లకు బదులు 11 ట్రైమిస్టర్లు (త్రైమాసికాలు) ఉంటాయి. ఇందులో నాలుగింటిలో పరిశ్రమకు సంబంధించిన అంశాలను విద్యార్థికి అందజేస్తారు. వీటిని కో–ఆప్స్ అని పిలుస్తున్నారు. పరిశోధనశాలలు, మ్యూజియంలు, ఇతర విశ్వవిద్యాలయాలు, ఐఎంఎఫ్, యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ కో–ఆప్స్‌లో భాగంగా ఉంటాయి. కంపెనీల ఉద్యోగులు కొందరు తమ ఉద్యోగాలకు తాత్కాలిక విరామమిచ్చి విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకుంటారు. ఈ భాగస్వామ్యం వల్ల విద్యార్థికి చాలా లాభాలు ఉంటాయి. పైగా కోర్సు సమయంలోనే విద్యార్థి కొంత ఆదాయం పొందే అవకాశమూ ఏర్పడుతుంది. కో–ఆప్స్ సమయంలో కంపెనీలు విద్యార్థులకు రెమ్యూనరేషన్ చెల్లిస్తాయి. కంపెనీలకు తమకు కావాల్సిన నైపుణ్యాలతో ఉద్యోగార్థులు లభిస్తారు. న్యూఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రతిపాదిస్తున్న కొత్త డిగ్రీలో ఐదారు అంశాలపై క్రెడిట్స్ ఉంటాయి. ఒక్కో అంశానికీ ప్రత్యేకంగా విలువ ఉంటుంది. ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో లీనియర్ ఆల్జీబ్రా, కంప్యూటేషన్, మెషీన్ లెర్నింగ్‌లతోపాటు నైతిక విలువలు, సామాజిక శా్రస్తాలు కలగలిపి బోధిస్తారు. విద్యార్థులు కోర్సు పూర్తి చేయకపోయినా.. వారు సాధించిన క్రెడిట్లకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కోర్సుకాలం పూర్తయిపోయినా మిగిలిన క్రెడిట్లను ఎప్పుడైనా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. చదువుతూనే.. అప్రెంటిస్‌షిప్.. నిజానికి న్యూఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రతిపాదిస్తున్న కొత్త విద్యావిధానం ఇతర రూపాల్లో కొన్నిచోట్ల అమల్లో ఉంది. ఉదాహరణకు జర్మనీలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు చదివేవారు కాలేజీలో సగం సమయం మాత్రమే ఉంటారు. తర్వాత సంబంధిత పరిశ్రమలో వారికి ఒకేషనల్ అప్రెంటిస్íÙప్ పేరుతో శిక్షణ అందిస్తారు. అది పూర్తయిన తరువాతే డిగ్రీ లభిస్తుంది. భారత్ విషయానికి వస్తే ఆతిథ్య రంగంలో ఈ రకమైన విధానం అమల్లో ఉంది. ఐహెచ్ఎస్ వంటి సంస్థల్లో కోర్సులు చేసేటప్పుడు కోర్సులో గణనీయమైన సమయం హోటల్స్, రెస్టారెంట్లలో ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, మరికొన్ని సంస్థల్లోనూ కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ఈ రకమైన పద్ధతి అమల్లో ఉంది. ఇప్పుడు శర్మ ప్రతిపాదన అమల్లోకి వస్తే చదవడంతో పాటు నేర్చుకోవాలన్న తపన ఉన్న వారికి ఉద్యోగావకాశాలకు కొదవ ఉండదు. దేశంలో పది మందిలో ఒకరికే నైపుణ్యాలు భారతదేశంలో చదువులకు, ఉద్యోగ నైపుణ్యాలకు మధ్య సంబంధమే లేదని చెప్పాలి. ప్రతి పది మంది పట్టభద్రుల్లో ఒకరికి, ప్రతి ఐదుగురు ఇంజనీర్లలో ఒకరికి, నలుగురు మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లలో ఒకరికి మాత్రమే ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. దేశంలో ఏటా సుమారు కోటీ 30లక్షల మంది ఉద్యోగ మార్కెట్లోకి అడుగుపెడుతుంటే.. వీరిలో అత్యధికులకు నైపుణ్యాలు ఉండటం లేదు. ఎప్పుడో కాలం చెల్లిననాటి ఉద్యోగాలకు తగ్గట్టు విద్యాబోధన ఉండటమే ఈ సమస్యకు ప్రధాన కారణమని ఐఐటీ ఖరగ్‌పూర్ డీన్ జయంత ముఖోపాధ్యాయ స్పష్టం చేశారు. నైపుణ్యాల ఆవశ్యకత గురించి ఐక్యరాజ్యసమితి దాదాపు దశాబ్దకాలంగా చెప్తున్నా భారత్‌లో ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు నామమాత్రమే. 2020 నాటి వరల్డ్ ఎకనమిక్ ఫోరం నివేదిక కూడా డేటాసైన్స్, బిగ్ డేటా, మెషీన్ లెరి్నంగ్, ఏఐ, వెబ్ డెవలప్మెంట్, ప్రోగ్రామింగ్ వంటి రేపటి తరం నైపుణ్యాలను ఉద్యోగార్థులకు అందించాలని సూచించడం గమనార్హం. రెండేళ్ల క్రితం విడుదలైన జాతీయ విద్యా విధానం కూడా పిల్లలకు ఆరో తరగతి నుంచే వృత్తి నైపుణ్యాలను అందించాలని.. ఇంటర్న్షిప్స్ ద్వారా విద్యార్థులకు ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలను ముందుగానే అందించాలని సిఫార్సు చేసింది. -
పెళ్లినాటికి నాకు సైకిల్, రెండు గేదెలే... కానీ, ఇప్పుడు
హుడాకాంప్లెక్స్(రంగారెడ్డి జిల్లా): ‘నా పెళ్లి(1976) నాటికి సైకిల్, రెండు పశువులు మాత్రమే ఉండె. కానీ, ఇప్పుడు వేలకోట్ల ఆస్తులు ఉన్నాయి. అతిపెద్ద విద్యాసంస్థలు స్థాపించా. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రిని కూడా అయ్యా’ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఎక్స్పోను శనివా రం ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ తాను ఎంతో కష్టపడ్డానని, అనేక వ్యాపారాలు చేసి, ఆర్థికంగా అంచెలంచెలుగా ఎదిగానని తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశానని చెప్పారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రపంచ నగరాలకు దీటుగా హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి చెప్పారు. అభివృద్ధి ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముందుచూపుతో నగరం నలమూలలా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. దేశవ్యాప్తంగా రియల్ఎస్టేట్ రంగం కుదేలైనా హైదరాబాద్‌లో మాత్రం శరవేగంగా దూసుకుపోతోందని, ప్రభుత్వం ఈ రంగానికి ప్రోత్సాహకాలు అందజేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. బెంగళూరు కాదు, హైదరాబాదే.. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు గుర్తుకొ చ్చేదని, కానీ ఇప్పుడు కేటీఆర్ చొరవతో హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారిందని, ప్రపంచ స్థాయి సాఫ్ట్వేర్ కంపెనీలు, వాటి ముఖ్య కార్యాలయాలు ఇక్కడే కొలువుదీరాయని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎల్బీ నగర్లో చేపట్టిన అభివృద్ధి వల్ల ఈస్ట్‌జోన్ వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుందని తెలిపారు. నాగోలు నుంచి గండిపేట వరకు మూసీకి ఇరువైపులా రూ.1,370 కోట్ల వ్య యంతో 120 అడుగుల రోడ్డు నిర్మించేందు కు ప్రణాళికలు రూపొందించామని చెప్పా రు. కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, ఫిర్జాదిగూడ, బోడుప్పల్ మేయర్లు వెంకట్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి నరసింహారావు పాల్గొన్నారు. -
China Zero Covid policy: యూనివర్సిటీలు ఖాళీ
బీజింగ్: చైనాలో ‘జీరో కోవిడ్’ నిబంధనలకు వ్యతిరేకంగా గొంతెత్తిన వారిపై షీ జిన్‌పింగ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. నిరసనలు, ఆందోళనలను ఎక్కడికక్కడ అణచివేస్తోంది. తాజాగా విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులను వారి ఇళ్లకు బలవంతంగా పంపిచేస్తుండడం గమనార్హం. దీంతో విద్యా సంస్థలు ఖాళీ అవుతున్నాయి. విద్యార్థులు నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా నిబంధనలను సడలించాలని, అధ్యక్షుడు జిన్‌పింగ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జనం వీధుల్లోకి వస్తున్నారు. డ్రాగన్ దేశంలో ఈ స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత వెల్లువెత్తడం గత కొన్ని దశాబ్దాల్లో ఇదే మొదటిసారి. పోలీసులు, సైనిక సిబ్బంది భారీ సంఖ్యలో మోహరించడంతో బీజింగ్, షాంఘై సహా పలు నగరాల్లో మంగళవారం ఆందోళనలు పెద్దగా కనిపించలేదు. మరోవైపు ‘జీరో కోవిడ్’ వ్యూహాన్ని ఇప్పటికిప్పుడు మార్చే అవకాశం లేదని అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సంకేతాలిచ్చింది. అప్పట్లో వర్సిటీలే ఉద్యమ కేంద్రాలు అధినేత షీ జిన్‌పింగ్ చదువుకున్న తిసింగువా యూనివర్సిటీ నుంచి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. రాజధాని బీజింగ్‌లోని పాఠశాలలు సైతం ఇదే నిర్ణయం తీసుకున్నాయి. గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని విద్యాసంస్థలు కూడా విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపించాయి. కొన్ని యూనివర్సిటీలు విద్యార్థులకు బస్సులను సమకూర్చాయి. ఇకపై తరగతులు, వార్షిక పరీక్షలను ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్లు తేల్చిచెప్పాయి. ఇళ్లకు వెళ్లిపోవాలని కోరుకొనే వారికి అన్ని ఏర్పాట్లు చేస్తామని బీజింగ్ ఫారెస్ట్రీ యూనివర్సిటీ ప్రకటించింది. చైనాలో 1980వ దశకంలో ప్రజాస్వామ్య సంస్కరణల కోసం విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అప్పట్లో యూనివర్సిటీ క్యాంపస్‌లే ఉద్యమ కేంద్రాలుగా మారాయి. 1989లో చరిత్రాత్మక తియానన్మెన్ స్క్వేర్ వద్ద విద్యార్థుల ఊరేగింపుపై సైన్యం దాడి చేసింది. యూనివర్సిటీల్లో విద్యార్థులు లేకుండా చేయడం ద్వారా జీరో కోవిడ్ వ్యతిరేక పోరాటాన్ని నీరుగార్చాలన్నదే ప్రభుత్వ వ్యూహమని యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో పనిచేస్తున్న చైనా రాజకీయ వ్యవహారాల నిపుణుడు డాలీ యాంగ్ విశ్లేషించారు. చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిత్యం 30 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రజలంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా జనం రాకపోకలపై అధికారులు ఇప్పటికే ఆంక్షలు విధించారు. ప్రయాణాలు మానుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీలు విద్యార్థులను ఇళ్లకు పంపిస్తుండడం గమనార్హం. -
2024 నాటికి అన్ని కాలేజీలకు నాక్ గుర్తింపు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం... అన్ని కళాశాలల్లో ప్రమాణాల పెంపునకు సైతం అనేక చర్యలు చేపట్టింది. 2024 నాటికి డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అన్ని ఉన్నత విద్యాసంస్థలకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) గుర్తింపును తప్పనిసరి చేసింది. నాక్‌తో పాటు ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లోనూ రాష్ట్ర విద్యాసంస్థలు స్థానం సంపాదించేలా చర్యలు చేపట్టింది. కాలేజీలకు నాక్ గుర్తింపు రావడంలో సహకారం అందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో ప్రత్యేకంగా క్వాలిటీ అస్యూరెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయించింది. దీని ద్వారా అన్ని కాలేజీలు నాక్ ‘ఎ’ గ్రేడ్‌తో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకులు సాధించేలా కార్యాచరణ చేపట్టింది. క్వాలిటీ అస్యూరెన్స్ సెల్లో వర్సిటీలు, స్వయంప్రతిపత్తి పొందిన కాలేజీలు, పరిశ్రమల ప్రముఖులతోపాటు ఉన్నత విద్యాశాఖ నుంచి సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సెల్ ద్వారా ఇప్పటికే కాలేజీలు నాక్ గుర్తింపు సాధించేలా మార్గనిర్దేశం చేస్తోంది. విద్యా ప్రమాణాల పెంపు, నాక్ గుర్తింపునకు అవసరమైన వనరుల కల్పన, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌కు అవసరమయ్యే అంశాల్లో కాలేజీలను ముందుకు తీసుకువెళ్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో క్వాలిటీ లీడర్లుగా 164 ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ కాలేజీలు, వర్సిటీలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కాలేజీలు నాక్ గుర్తింపు సాధించేలా సహకారం అందిస్తున్నారు. ప్రమాణాల పెంపునకు అత్యధిక ప్రాధాన్యం.. తొలి అడుగుగా నాక్ ‘బీ’ కేటగిరీలో ఉన్న కాలేజీలను గుర్తించి.. వాటి ద్వారా అసలు నాక్ గుర్తింపు లేని కాలేజీలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే 72 నాక్ గుర్తింపు ఉన్న కాలేజీలను, 13 వర్సిటీలను గుర్తించి వాటిని క్యూ (క్వాలిటీ) మెంటార్లుగా ఏర్పాటు చేశారు. వీటితోపాటు మరో 117 కాలేజీలను కూడా క్వాలిటీ మెంటార్లుగా గుర్తించి 346 కాలేజీలు నాక్ గుర్తింపు సాధించేలా వాటిని అనుసంధానించారు. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాములు, శిక్షణ, ఈ–కంటెంట్ ప్రిపరేషన్ తదితర అంశాల్లో ఆయా కాలేజీలకు సహాయమందిస్తున్నారు. ఉద్యోగాలు కొల్లగొట్టేలా ఉచిత శిక్షణ.. ప్రభుత్వం అన్ని కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు విద్యార్థులకు సర్టిఫికేషన్ కోర్సులను ఉచితంగా అందిస్తోంది. ఇంటర్న్‌షిప్ కోసం కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానించారు. మైక్రోసాఫ్ట్, సిస్కో, సేల్స్‌ఫోర్స్, ఏడబ్ల్యూఎస్ వంటి సంస్థల ద్వారా లక్ష మందికి వర్చువల్ ఇంటర్న్‌షిప్‌నకు చర్యలు చేపట్టారు. ఐసీఐసీఐ, విప్రో, ఐబీఎం, ఎడెల్వైస్, హీరో, హోండా, మారుతి సుజికీ వంటి సంస్థల్లో ఫుల్‌స్టేక్, హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్ వంటి అంశాల్లో 50 వేల మందికి వర్చువల్ ఇంటర్న్‌షిప్‌ను అందిస్తున్నారు. -
Telangana: మరో గుడ్‌న్యూస్! డిసెంబర్లో గురుకుల నోటిఫికేషన్?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటివరకు గిరిజన రిజర్వేషన్లు, ఇతరత్రా అవాంతరాలతో నోటిఫికేషన్ విడుదలలో జాప్యం నెలకొంది. ప్రభుత్వం అనుమతించిన పోస్టుల భర్తీకీ సంబంధించిన ప్రతిపాదనల(ఇండెంట్లు)ను గురుకుల సొసైటీలు తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు సమర్పించాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రతిపాదనల మేరకు పోస్టులవారీగా రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల వివరాలను పరిశీలించేందుకు నియామకాల బోర్డు సన్నద్ధమైంది. రాష్ట్రంలోని నాలుగు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో 9,096 బోధ న, బోధనేతర పోస్టుల భర్తీకి ఇప్పటికే రాష్ట్ర ప్రభు త్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ భర్తీ బా ధ్యతలను ప్రభుత్వం తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు అప్పగించింది. వారంలోగా పూర్తి... తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగా ణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) ల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో సొసైటీలవారీగా మంజూరు చేసిన పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు రూపొందించిన సొసైటీలు బోర్డుకు సమర్పించాయి. ఈ ప్రతిపాదనలను వారంరోజుల్లోగా పరిశీలించేలా బోర్డు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రతిపాదనల పరి శీలనకు షెడ్యూల్ రూపొందించిన బోర్డు సంబంధిత సొసైటీ అధికారులు సహకారం అందించాలని స్పష్టం చేసింది. సొసైటీలు సమర్పించిన ప్రతిపాదనల్లో పొరపాట్లు, సవరణలుంటే వాటిని పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వనుంది. డిసెంబర్లో నోటిఫికేషన్ గురుకుల విద్యాసంస్థల ఖాళీల భర్తీకి సంబంధించి వచ్చేనెలలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. వారంరోజుల్లోగా ప్రతిపాదనల పరిశీలన పూర్తయిన అనంతరం పోస్టుల వారీగా నోటిఫికేషన్లు ఇవ్వాలని గురుకుల నియామకాల బోర్డు కార్యాచరణ సిద్ధం చేయనుంది. ప్రాధాన్యతాక్రమంలో పై నుంచి కిందిస్థాయి వరకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ ప్రక్రియను సైతం అదే క్రమంలో పూర్తిచేయాలని భావిస్తోంది. -
వర్సిటీల్లో నిష్ణాతుల నియామకం
సాక్షి, అమరావతి: యూనివర్సిటీలు, కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థల్లో అనుభవజ్ఞులైన నిపుణుల సేవలను వినియోగించుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించింది. ఇందుకోసం ‘ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ (పీవోపీ)’ హోదాను సృష్టించింది. ఈ విధానం కింద వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన వారిని, పారిశ్రామిక నిపుణుల సేవలను వినియోగించుకొని ప్రపంచస్థాయి అత్యున్నత ప్రమాణాలు సాధించవచ్చని పేర్కొంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో పార్టు టైమ్, గెస్ట్, కాంట్రాక్టు ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తున్నారు. వీరికన్నా వివిధ రంగాల్లో నిపుణులైన వారి సేవల వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని యూజీసీ అభిప్రాయపడుతోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు పీవోపీ విధానంతో మంచి ఫలితాలు సాధిస్తున్నాయని వివరించింది. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఉన్నత విద్యా కళాశాలల ప్రిన్సిపాళ్లు వారి సంస్థల్లో పీవోపీ నియామకాలకు నిబంధనల మార్పునకు చర్యలు తీసుకోవడంతోపాటు, ఆ చర్యల నివేదికను కూడా పంపాలని యూజీసీ అన్ని సంస్థలను కోరింది. పీవోపీల నియామకాలపై గత నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి అధికారిక విద్యార్హతలు, ప్రచురణ తదితరాలు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఎమ్ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో అమలు ప్రాక్టీస్ ప్రొఫెసర్ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు అనుసరిస్తున్నాయి. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎమ్ఐటీ), హార్వర్డ్ విశ్వవిద్యాలయం, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (ఎస్ఓఏఎస్), యూనివర్సిటీ ఆఫ్ లండన్, కార్నెల్ విశ్వవిద్యాలయం, హెల్సింకి విశ్వవిద్యాలయం వంటి అనేక విశ్వవిద్యాలయాల్లో ఈ విధానంలో నిపుణుల నియామకం జరుగుతోంది. మన దేశంలోనూ ఢిల్లీ, మద్రాస్, గౌహతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (ఐఐటీలలో) పీవోపీలను నియమించారు. పీవోపీల నియామకానికి యూజీసీ మార్గదర్శకాలు.. ► ఈ నిపుణుల నియామకం విశ్వవిద్యాలయం, కళాశాలల మంజూరైన పోస్టుల పరిమితి మేరకు మాత్రమే ఉంటుంది. ► విద్యా సంస్థల్లో నియమించే పీవోపీల సంఖ్య మంజూరైన పోస్టుల్లో 10 శాతానికి మించకూడదు ► సంస్థలో మంజూరైన పోస్టుల సంఖ్యను లేదా రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకంపై ప్రభావం చూపకూడదు ► గౌరవ ప్రాతిపదికన ఈ నియామకాలు ఉండాలి ► పరిశ్రమల ద్వారా ఆయా సంస్థలకు వచ్చే నిధులు లేదా ఆయా ఉన్నత విద్యా సంస్థల్లోని సొంత నిధులతో నియామకాలు చేపట్టాలి ► పీవోపీల గరిష్ట పదవీ కాలం మూడేళ్లు. అవసరమైన సందర్భాల్లో ఒక సంవత్సరం పొడిగించవచ్చు ► ఇప్పటికే టీచింగ్ పొజిషన్లో ఉన్నవారికి లేదా పదవీ విరమణ చేసిన వారికి ఈ పథకం వర్తించదు. -
‘ఓపెన్’లో ఖాళీలు తగ్గవా?
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలు, ప్రభుత్వోద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బుధవారం పలు ప్రశ్నలు సంధించింది. ఈ కోటా వల్ల ఓపెన్ కేటగిరీలో అందుబాటులో ఉండే సీట్లు, ఖాళీలు 40 శాతానికి తగ్గిపోతాయన్న వాదనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ బేలా ఎం.త్రివేదీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ప్రస్తావించింది. ఓపెన్ కేటగిరీలోని 50 శాతం ఖాళీలను తగ్గించడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులను గుర్తు చేసింది. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లోని పేదలను కులం ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి నహాయించడం వాస్తవమేనా? ఈ కోటా వల్ల ఓబీసీల్లోని క్రీమీ లేయర్‌కు అందుబాటులో ఉండే ఖాళీలు కూడా 40 శాతానికి తగ్గుతాయన్నది నిజమేనా? మెరిట్ ఉన్న వారందరికీ ఓపెన్ కేటగిరీలో పోటీపడేందుకు అవకాశం ఉండాలి కదా’’ అంటూ ప్రశ్నించింది. ఓపెన్ కేటగిరీ ఖాళీలకు ఏ విధంగానూ కోత పడని రీతిలోనే ఈడబ్ల్యూఎస్ కోటాను రూపొందించినట్టు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. ఓపెన్, రిజర్వుడు కేటగిరీలు ప్రత్యేకమైన విభాగాలు. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు 50 శాతం రిజర్వుడు కేటగిరీలో తగిన ప్రాతినిధ్యం దక్కిందని వేణుగోపాల్ వివరించారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా ఈడబ్ల్యూఎస్ వర్గానికి కూడా ఎన్నికల్లో కొన్ని స్థానాలు రిజర్వు చేయగలరా అని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ గురువారం కూడా కొనసాగనుంది. ఇక ప్రత్యక్ష ప్రసారాలు సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కీలక కేసుల విచారణ ప్రక్రియ ఇకపై ప్రత్యక్షప్రసారం కానుంది. తొలుత రాజ్యాంగ ధర్మాసనాల విచారణలు 27వ తేదీ నుంచి ప్రసారం కానున్నాయి. ప్రస్తుతానికి యూట్యూబ్ ద్వారా ప్రసారాలు ఉంటాయని సమాచారం. త్వరలో సుప్రీంకోర్టు సొంత ప్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తుందని కోర్టు వర్గాలు తెలిపాయి. గుజరాత్, ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్, పట్నా, మధ్యప్రదేశ్ హైకోర్టులు ఇప్పటికే తమ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. -
నీట్ ఫలితాలు విడుదల 9.93 లక్షల మంది ఉత్తీర్ణత
-
అడ్వాన్స్‌డ్‌ను అధిగమిస్తున్నారు
సాక్షి, అమరావతి: దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో చదవాలని ప్రతి విద్యార్థి కోరుకుంటాడంటే అతిశయోక్తి కాదు. అయితే వీటిలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, అడ్వాన్స్డ్ అత్యంత క్లిష్టమైనవి. అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకులు సాధిస్తేనే ఐఐటీల్లో సీట్లు లభిస్తాయి. ర్యాంకులు సాధించడం అటుంచి ఈ పరీక్షల్లో అర్హత మార్కులు సాధించడమే ఒకప్పుడు కష్టంగా ఉండేది. 15 ఏళ్ల క్రితం ఐఐటీలు, ఎన్ఐటీల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అంతేకాకుండా వీటికి శిక్షణ ఇచ్చే విద్యా సంస్థలు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉండేవి. నాణ్యమైన మెటీరియల్ కొరత కూడా ఉండేది. అయితే 2008 నుంచి కొత్త ఐఐటీలు, ఎన్ఐటీలు ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా శిక్షణా కేంద్రాలూ పెరిగాయి. ఇంటర్నెట్ సౌకర్యం కూడా అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ శిక్షణ కూడా అందుబాటులో కొచ్చింది. దీంతో ఐఐటీల్లో సీటు సాధించేవారి సంఖ్య పెరిగింది. 2007లో ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో కేవలం 3 శాతంలోపు మాత్రమే ఉన్న ఉత్తీర్ణుల సంఖ్య తాజాగా 30 శాతం వరకు చేరడం ఇందుకు నిదర్శనం. గతంలో ఐఐటీ–జేఈఈగా, జేఈఈ మెయిన్‌గా, ఏఐఈఈఈగా వేర్వేరు పేర్లతో కొనసాగిన ప్రవేశ పరీక్షలు ప్రస్తుతం జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్గా కొనసాగుతున్నాయి. ప్రవేశానికి రెండంచెల విధానం.. ఎన్ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశానికి 2013 నుంచి జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లను ప్రవేశపెట్టారు. ఈ పరీక్షల కోసం ప్రస్తుతం 10 లక్షల మందికిపైగా పోటీ పడుతున్నారు. ఏక పరీక్ష విధానం ఉన్నప్పుడు కూడా అభ్యర్థులు లక్షల్లోనే పరీక్ష రాసేవారు. ఐఐటీ ప్రవేశపరీక్షలో క్వాలిఫై అయినవారు 2007లో 2.96 శాతం, 2008లో 2.77 శాతం, 2009లో 2.60, 2010లో 2.87, 2011లో 2.81, 2012లో 5.02 శాతం మంది ఉన్నారు. 2013 నుంచి రెండు విడతల వడపోత విధానం (జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్) అమల్లోకి వచ్చాక మెయిన్ పరీక్ష దాటుకుని అడ్వాన్స్డ్ పరీక్ష దాకా వచ్చే అభ్యర్థుల సంఖ్య తగ్గింది. 2013లో అడ్వాన్స్డ్ పరీక్షకు 1,26,749 మంది దరఖాస్తు చేయగా 1,15,971 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 20,834 మంది (17.96 శాతం) అర్హత మార్కులు సాధించారు. 2014లో 22.70, 2015లో 22.47, 2016లో 24.76, 2017లో 31.99 శాతం, 2018లో 20.61, 2019లో 23.99 శాతం, 2020లో 28.64 శాతం, 2021లో 29.19 శాతం మంది అడ్వాన్స్డ్ పరీక్షలో క్వాలిఫై అయ్యారు. నేడే జేఈఈ అడ్వాన్స్డ్ సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నేతృత్వంలో జరిగే ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. జూలైలో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షకు దేశవ్యాప్తంగా 8లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2.5 లక్షలమంది అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత సాధించారు. అయితే, కేవలం 1.60 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన పేపర్–1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించబోమని ఎన్టీఏ పేర్కొంది. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. ఈసారి పేపర్–1, పేపర్–2 కూడా నెగెటివ్ మార్కింగ్ ఉంటుందని ప్రకటించింది. సరైన జవాబు రాస్తే 4 మార్కులు, సమాధానం తప్పయితే ఒక మార్కు మైనస్ అవుతుంది. ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ సంస్థలు, కేంద్ర ప్రభుత్వనిధులతో నడిచే ఇతర సంస్థల్లో దాదాపు 50 వేల వరకు ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. జేఈఈ మెయిన్స్ ర్యాంకు ద్వారా నిట్‌లో, అడ్వాన్స్డ్ ర్యాంకు ద్వారా ఐఐటీల్లో సీట్లు పొందే వీలుంది. -
AP: 27న స్కూళ్లకు సెలవు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూళ్లకు ఈ నెల 27(నాలుగో శనివారం)ను సెలవు దినంగా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు కమిషనర్ కె.సురేష్‌కుమార్ గురువారం సర్క్యులర్ జారీ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల కోసం ఆగస్టు 13వ తేదీ(రెండో శనివారం) నాడు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు పనిచేశాయి.సెలవు దినంలో స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు పనిచేసినందున దానికి ప్రత్యామ్నాయంగా 27వ తేదీని సెలవు దినంగా పరిగణించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
గురుకుల సీటు... వెరీ హాటు..!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. పూర్తిస్థాయిలో అడ్మిషన్లు చేపట్టినట్లు సొసైటీలు ప్రకటిస్తున్నా... ‘ఒక్క సీటు’ కావాలంటూ ప్రవేశాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కార్యాలయాలు కిక్కిరిసి పోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల సొసైటీ పాఠశాలల్లో ఐదోతరగతిలో నూతన అడ్మిషన్ల ప్రక్రియ, బ్యాక్లాగ్ ఖాళీ సీట్ల భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు ఆయా సొసైటీలు బహిరంగంగా ప్రకటించాయి. అర్హత పరీక్షల ద్వారా విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి మెరిట్ ప్రకారం గురుకుల సొసైటీలు అడ్మిషన్లు చేపట్టాయి. కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్లు చేపట్టాయి. అడ్మిషన్లు పూర్తయ్యాయని, సీట్లు లేవని బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ సీట్లు కావాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు సొసైటీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఫిజికల్ రిపోర్టింగే మిగిలింది... రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ గురుకుల సొసైటీలు, విద్యాశాఖకు చెందిన జనరల్ గురుకుల సొసైటీల పరిధిలో 750 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో ప్రతి సంవత్సరం ఐదో తరగతిలో దాదాపు 50 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. నాల్గోతరగతి చదివే విద్యార్థులకు రాత పరీక్ష నిర్వహించి, మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. రిజర్వేషన్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆన్లైన్ పద్ధతిలో ప్రక్రియ పూర్తి చేస్తారు. 2022–23 విద్యా సంవత్సరంలో ఇదే తరహాలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీలు ఉమ్మడిగా అర్హత పరీక్ష నిర్వహించాయి. దాదాపు 1.6 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోగా.. ఒక్కో సీటుకు సగటున ముగ్గురు పోటీపడ్డారు. పరీక్ష అనంతరం మెరిట్ ఆధారంగా సొసైటీలు సీట్లు కేటాయించారు. మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ప్రత్యేకంగా అర్హత పరీక్ష నిర్వహించి ఆమేరకు అడ్మిషన్లు చేపట్టింది. 6, 7, 8, 9 తరగతుల్లోని బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి సైతం సొసైటీల వారీగా పరీక్షలు నిర్వహించారు. అర్హులైన విద్యార్థులకు సీట్లు కేటాయించారు. అన్ని గురుకుల సొసైటీల్లో సీట్ల కేటాయింపులు పూర్తయ్యాయి. ఈ వారాంతంలోగా పాఠశాలల్లో ఆయా విద్యార్థులు ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రవేశాల ప్రక్రియ దాదాపు ముగిసినట్లే. సీట్లు లేవు... దయచేసి రావొద్దు... ఐదు గురుకుల సొసైటీల పరిధిలో సీట్ల కేటాయింపులు పూర్తయినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం గురుకుల సొసైటీ కార్యదర్శి కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దీంతో సీట్లు లేవంటూ సొసైటీలు ఇప్పటికే ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశాయి. గిరిజన గురుకుల సొసైటీ, జనరల్ గురుకుల సొసైటీలు కార్యాలయాల వద్ద సూచనలు చేస్తూ పోస్టర్లు అంటించాయి. అయినప్పటికీ సీట్ల కోసం దూరప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య తగ్గడం లేదు. సీట్ల కోసం వచ్చే వారిని కార్యాలయాల్లోకి అనుమతించకుండా, వారిని నిలువరించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. -
కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్తలు పాటించండి
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు సరాసరిన 15 వేలకు పైగా నమోదవుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ముఖ్యంగా ఈ స్వాతంత్య్ర వేడుకల సమయంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమావళిని పాటించాలని కోరింది. ముందు జాగ్రత్తలు పాటిస్తూ, ఉత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో జనం గుమికూడకుండా చూసుకోవాలని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. దీంతోపాటు, ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రోత్సహిస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలోని ఒక ప్రముఖ ప్రాంతంలో పదిహేను, నెల రోజులపాటు కొనసాగించాలని పేర్కొంది. ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కూడా కోరింది. -
ఎక్కడ అనుమతిస్తే.. అక్కడే
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థలను ఇష్టానుసారంగా నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంజూరైన నియోజకవర్గాల పరిధిలోనే పాఠశాలలను నిర్వహించాలని పేర్కొంది. గురుకుల పాఠశాలలను ఒక చోట మంజూరు చేస్తే మరో ప్రదేశంలో నిర్వహిస్తున్న తీరుపై ప్రభుత్వం ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీలకు సంబంధించి దాదాపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున గురుకులాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ఒకటి బాలికలది కాగా, మరొకటి బాలుర గురుకులం. వీటిని సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే నిర్వహించాలి. ఈ మేరకు గురుకుల పాఠశాలల మంజూరు సమయంలోనే ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది నిర్దేశిస్తారు. కానీ ప్రస్తుతం మూడువంతుల గురుకుల విద్యా సంస్థలను అనుమతించిన చోట కాకుండా ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. అద్దె భవనాలు దొరక్క.. రాష్ట్రంలో దాదాపు వెయ్యి సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో 820 గురుకుల పాఠశాలలు కాగా, వీటిలో మూడోవంతు పాఠశాలలకు అనుబంధంగా జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇవికాకుండా డిగ్రీ కాలేజీలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం గురుకుల విద్యా సంస్థలను విడతలవారీగా మంజూరు చేయగా.. వాటికి భవనాలను నిర్మించే వరకు అద్దె భవనాల్లో కొనసాగించాలని సూచించింది. దీంతో గురుకుల విద్యా సంస్థల సొసైటీ నిబంధనలకు అనుగుణంగా భవనాలను వెతికినప్పటికీ ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతాల్లో తగిన భవనాలు లభించక.. మూతబడ్డ ఇంజనీరింగ్ కాలేజీలు, జూనియర్, డిగ్రీ కాలేజీ భవనాలను అద్దెకు తీసుకుని పాఠశాలలు ఏర్పాటు చేశారు. భవనాల లభ్యత ఉన్న చోటనే అద్దెకు తీసుకుని అక్కడే గురుకులాలను ప్రారంభిస్తూ వచ్చారు. ఈ క్రమంలో పెద్ద భవనాలున్న చోట రెండు, మూడు, నాలుగు.. గురుకుల పాఠశాలలను ఒకే క్యాంపస్‌లో నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల పాఠశాల మంజూరు చేసిన ప్రాంతం దాటి దాదాపు 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. ఫిర్యాదులతో.. స్పందించిన సర్కారు అనేక చోట్ల ఆయా నియోజకవర్గాల పరిధి దాటి వీటిని ఏర్పాటు చేయడంతో స్థానికతకు ప్రాధాన్యతమిస్తూ అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇబ్బందులు ఎదురవుతుండటాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా ఈ అంశంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా.. అనుమతించిన ప్రాంతంలోనే గురుకుల పాఠశాలలను నిర్వహించాలని స్పష్టం చేసింది. రెండురోజుల కిందట రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సీ గురుకుల సొసైటీ అధికారులతో సమావేశమై లొకేషన్ల అంశాన్ని చర్చించారు. ప్రభుత్వం ఎక్కడ మంజూరు చేస్తే అక్కడే గురుకులాన్ని నిర్వహించాలని, ఆయా ప్రాంతాల్లో అద్దె భవనాలను గుర్తించి వెంటనే అక్కడికి మార్చాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా ఇతర గురుకుల సొసైటీల్లోనూ ఇదే తరహాలో ఆదేశాలు ఇచ్చేందుకు సంబంధిత శాఖలు సిద్ధమవుతున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. -
జేఈఈ మెయిన్‌కు 6,29,778 మంది
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ సహా జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం నుంచి తుది విడత జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ నిర్వహిస్తోంది. పరీక్ష కేంద్రానికి కనీసం గంట ముందే చేరుకోవాలని ఎన్టీఏ సూచించింది. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుందని తెలిపింది. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించే అవకాశం లేదని స్పష్టం చేసింది. కోవిడ్ సమయంలో నాలుగు విడతలుగా పరీక్ష నిర్వహించారు. ఈ సంవత్సరం మాత్రం రెండు విడతలుగానే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడత పరీక్షను నిర్వహించిన ఎన్టీఏ అభ్యర్థుల పర్సంటైల్ కూడా ప్రకటించింది. రెండో విడత జరగబోయే పరీక్షకు దేశవ్యాప్తంగా 6,29,778 మంది రిజిస్టర్ చేసుకున్నట్టు ఎన్టీఏ పేర్కొంది. సిలబస్ కుదించకుండా చాయిస్ జేఈఈ మెయిన్స్ పరీక్ష విధానాన్ని ఈ సంవత్సరం పూర్తిగా మార్చారు. గతంలో సెక్షన్–ఏ లోని బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలకు మాత్రమే నెగెటివ్ మార్కులుండేవి. ఈసారి సెక్షన్–బీ లోని న్యూమరికల్ వేల్యూ ప్రశ్నలకు కూడా నెగెటివ్ మార్కులుంటాయని ఎన్టీఏ తెలిపింది. బీఈ, బీటెక్‌తో పాటు బీఆర్క్‌కు సంబంధించిన పేపర్–2ఏ లోని సెక్షన్–బీ లో ప్రతి ప్రశ్నకూ నెగెటివ్ మార్కు ఉంటుంది. కరోనాతో 2021–22లోనూ పలు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు సిలబస్‌ను కుదించినా ఎన్టీఏ మాత్రం కుదించలేదు. కాకపోతే కొన్ని మినహాయింపులను ప్రకటించింది. పేపర్–1, పేపర్–2ఏ, 2–బీ విభాగాల్లో పార్టు1లలోని ప్రశ్నల్లో చాయిస్‌ను ఇచ్చింది. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఉర్దూ సహా పలు ప్రాంతీయ భాషల్లో కూడా ఉంటాయి. ఏపీ, తెలంగాణల్లో ఇంగ్లిష్తో పాటు తెలుగు మాధ్యమ ప్రశ్నపత్రాలు ఇస్తారు. తుది విడత మెయిన్ పరీక్ష ముగిసిన కొద్ది రోజులకే ప్రాథమిక కీ విడుదల చేసేందుకు ఎన్టీఏ సన్నాహాలు చేస్తోంది. ఆ మర్నాడే పూర్తిస్థాయి పర్సంటైల్ వెలువడే వీలుంది. ఆగస్టు రెండో వారంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సంబంధించిన ప్రక్రియ మొదలవ్వనుంది. అదేనెల 28న పరీక్ష నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. టై బ్రేకర్‌లోనూ మార్పులు ఈసారి టై బ్రేకర్ నిబంధనల్లోనూ మార్పులు జరిగాయి. సమానమైన స్కోరు సాధించిన వారి విషయంలో వయసును కూడా ప్రమాణంగా తీసుకోవాలని నిర్ణయించింది. 2021లో ఈ పద్ధతిని రద్దు చేసిన ఎన్టీఏ మళ్లీ అమల్లోకి తెచ్చింది. సమాన మార్కులు వచ్చిన విద్యార్థులుంటే మొదట స్కోర్ల వారీగా వరుసగా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అనంతరం తప్పుడు సమాధానాల నిష్పత్తిని అవే సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తారు. అప్పటికీ సమాన స్థాయిలో ఉంటే వయసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ సాధ్యం కాకుంటే ముందుగా దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. మొదటి విడత రాసినవారికి సులువే తొలి విడత జేఈఈ మెయిన్స్ రాసిన వాళ్లకు ఈ పరీక్ష కొంత తేలికగానే ఉండే వీలుంది. జూన్‌లో జరిగిన పరీక్ష తాలూకూ ప్రశ్నపత్రం ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. దాదాపు అవే చాప్టర్స్ వచ్చే వీలుంది. మేథ్స్‌లో సుదీర్ఘంగా ప్రశ్నలుంటే కంగారు పడకూడదు. నెగెటివ్ మార్కింగ్‌ను దృష్టిలో పెట్టుకుని జవాబులివ్వాలి. – ఎంఎన్ రావు (గణిత శాస్త్ర బోధకుడు) పాత పేపర్లు తిరగేస్తే మంచిది జూన్‌లో జరిగిన జేఈఈలో ఫిజిక్స్ పేపర్ మధ్యస్తంగానే ఉంది. ఈసారీ ఇంచుమించు ఇదే మాదిరిగా ఉండే వీలుంది. ఇవే చాప్టర్స్‌ను చదువుకుని, పాత పేపర్లు ఒక్కసారి తిరగేస్తే తేలికగా సమాధానం ఇవ్వొచ్చు. తెలియని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. దీనివల్ల నెగెటివ్ మార్కుల బాధ నుంచి తప్పించుకోవచ్చు. – జీకే రావు (ఫిజిక్స్ బోధకుడు) -
తీరుమారని ‘ఉన్నతశ్రేణి’
సమాజానికి దీపధారులుగా దాని అభ్యున్నతికి పాటుపడవలసిన ఉన్నతశ్రేణి విద్యాసంస్థలు అందుకు విరుద్ధమైన పోకడలు పోతున్నాయని తాజాగా పార్లమెంటుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సమర్పించిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ రేటింగ్‌ల మాటెలా ఉన్నా దేశంలో ఇప్పటికీ ఉన్నతశ్రేణి మేధో కేంద్రాలుగా ఐఐటీ, ఐఐఎంలదే అగ్రస్థానం. ఎన్నడో 50వ దశకంలో ప్రథమ ప్రధాని నెహ్రూ హయాంలో ఈ సంస్థలు మొగ్గతొడిగి క్రమేపీ విస్తరించాయి. కానీ వాటి ఆలోచనా శైలి, పనితీరు మాత్రం ఆ కాలంలోనే ఉండిపోయాయన్న సందేహం కలుగుతుంది. నిరుడు ఢిల్లీ ఐఐటీలోని 8 విభాగాల్లో పరిశోధనలు చేసేందుకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారు 637 మంది దరఖాస్తు చేసుకుంటే వారిలో ఒక్కరంటే ఒక్కరిని కూడా తీసుకోలేదు. మొత్తం 53 పీహెచ్డీ సీట్లుంటే ఆర్థికంగా వెనకబడిన కోటా(ఈడబ్ల్యూఎస్) కింద వచ్చిన 1,362 దరఖాస్తుల నుంచి ఆ సీట్లకు ఎంపిక చేశారు. దేశంలోని మరో 9 ఐఐటీల్లో కూడా పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. హైదరాబాద్, తిరుపతి ఐఐటీలు సహా ఎనిమిదింటిలో కొన్ని విభాగాల్లో అసలు ఎస్టీ విద్యార్థులే లేరు. మండీ ఐఐటీ అయితే ఎస్టీలతోపాటు ఎస్సీల నుంచి ఒక్కరంటే ఒక్కరిని కూడా తీసుకోకుండా చరిత్ర సృష్టించింది. ఎనిమిది ఐఐటీల్లో ఆరు సబ్జెక్టుల్లో ఓబీసీలకు స్థానమే లేదు. ఈ ఐఐటీల్లో హైదరాబాద్, తిరుపతి కూడా ఉన్నాయి. అటు ఐఐఎంల వాలకం కూడా ఇంతే. ఈ సంస్థలు కూడా పీహెచ్డీ సీట్లలో నిబంధనలన్నిటినీ గాలికొదిలాయి. పీహెచ్డీ సీట్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం వాటా దక్కాల్సి ఉండగా 2018–19 మొదలుకొని 2021–22 విద్యాసంవత్సరం వరకూ ఏటా కనీసం 4 శాతం కూడా ఆ వర్గాలకు రాలేదు. ఉన్నత శ్రేణి విద్యాసంస్థలకు స్వయం ప్రతిపత్తి ఉండాలనీ, వాటిపై మితిమీరిన ప్రభుత్వ నియంత్రణ ఉండరాదనీ అందరూ కోరుకుంటారు. వర్తమానంలో ఎదురయ్యే సవాళ్లకు దీటుగా ఆలోచించేలా, సంక్లిష్ట సమస్యలకు మెరుగైన పరిష్కారాలను రూపొందించేలా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఆ ప్రతిపత్తి తోడ్పడాలి తప్ప అట్టడుగు వర్గాలవారి అవకాశాలకు గండికొట్టేందుకు కాదు. ఉన్నత శ్రేణి విద్యాసంస్థలు కావొచ్చు, మరేవైనా కావొచ్చు... అవి వైవిధ్య భరిత భారత సమాజాన్ని ప్రతిబింబించాలి. అన్ని వర్గాలవారికీ అందులో భాగస్వామ్యం ఉండాలి. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలుంటాయి. భిన్న వర్గాలవారు కలిసి చదువుకోవడంవల్ల సమాజ పోకడలు ఎలా ఉంటాయో, పరిష్కారాలు ఆలోచించే తీరెలా ఉండాలో అందరికీ అవగాహన కలుగుతుంది. అది అంతిమంగా సమాజ అభ్యున్నతికి దోహదపడుతుంది. ఉన్నతశ్రేణి విద్యాసంస్థల సారథులు విశాల దృక్పథంతో వ్యవహరిస్తే అదేమంత కష్టం కాదు. కానీ ఇప్పుడు వెల్లడైన నివేదికలు గమనిస్తే ఆ సంస్థలు శల్యసారథ్యంతో కునారిల్లుతున్నాయనీ, రిజర్వేషన్ల మౌలిక ఉద్దేశమే దెబ్బతింటున్నదనీ అర్థమవుతుంది. ఆరేళ్ల క్రితం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతమైనా, మూడేళ్లక్రితం ముంబైలోని ఉన్నత శ్రేణి వైద్య కళాశాల పీజీ విద్యార్థిని పాయల్ తాడ్వి ప్రాణం తీసుకున్న వైనమైనా వాటి సారథుల వైఫల్యాలనూ, ఆ విద్యాసంస్థల నిర్వహణ తీరునూ పట్టిచూపాయి. ఈ ఉదంతాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. కానీ మీడియాకు ఎక్కని, కారణాలు వెల్లడికాని ఆత్మహత్యలు మరెన్నో చూస్తే గుండె చెరువవుతుంది. నిరుడు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభకు అందజేసిన గణాంకాల ప్రకారం 2014–21 మధ్య ఉన్నతశ్రేణి విద్యాసంస్థల్లో 122 మంది విద్యార్థులు బలిదానం చేస్తే అందులో 71 మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు. ఇక మధ్యలో చదువు చాలించుకుని వెళ్తున్నవారిలో సైతం అట్టడుగు వర్గాలవారే ఎక్కువ. నిరుడు ఆగస్టులో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం ఏడు ఐఐటీల్లో 60 శాతంమంది డ్రాపౌట్లు రిజర్వేషన్ కేటగిరీలవారే. ఉన్నతశ్రేణి విద్యాసంస్థల తీరుతెన్నులకు ఈ గణాంకాలు అద్దం పడ తాయి. దశాబ్దాల తరబడి ఈ విద్యాసంస్థలు ఇలా అఘోరిస్తుంటే పాలకులు ఏం చేస్తున్నట్టు? పార్లమెంటులో ప్రశ్నలు తలెత్తినప్పుడు వివరాలు తెప్పించుకోవడం, సభముందు పెట్టడం తప్ప మరేమీ చర్యలుండటం లేదా? పదే పదే రాజ్యాంగ విలువలకూ, నియమ నిబంధనలకూ తూట్లు పొడుస్తుంటే ప్రభుత్వాలు నిస్సహాయంగా మిగిలిపోవడం సరైందేనా? ఓబీసీ వర్గంనుంచి వచ్చిన నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నా ఇది కొనసాగడం వింత కాదా? నిజానికి ఐఐటీ, ఐఐఎంలు నెలకొల్పినప్పుడు వాటిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాల్లోని విద్యా సంస్థలు కూడా ఎదుగుతాయని అందరూ ఆశించారు. అయితే పాఠ్యాంశాలు మొదలుకొని అన్ని విషయాల్లో మన విద్యాసంస్థలు ఈనాటికీ తీసికట్టే. బడ్జెట్లలో విద్యారంగానికి ఎప్పుడూ అరకొర కేటాయింపులే గనుక వాటి ఎదుగుదల ఆరోగ్యవంతంగా లేదు. అసలు ఉన్నతశ్రేణి విద్యాసంస్థల నిర్వహణే ఇంత అన్యాయంగా ఉంటే ఇతరేతర అంశాల్లో ఏం జరుగుతున్నదనుకోవాలి? అధ్యాపక నియామకాలకు ప్రధానార్హత పీహెచ్డీ కనుక అట్టడుగు వర్గాలవారికి అందులో దక్కే అవకాశం సామాజికంగా ఎందరికో స్ఫూర్తిదాయకమవుతుంది. మరింతమంది ఎదగడానికి తోడ్పడుతుంది. అందుకే వివిధ వర్గాలకు దక్కవలసిన వాటా కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. నూరు పూలు వికసించేందుకూ, వేయి ఆలోచనలు వర్ధిల్లేందుకూ ఉన్నతశ్రేణి విద్యా సంస్థలు వేదికలు కావాలి. -
హైదరాబాద్ ఐఐటీ అదుర్స్
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దేశంలోని ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో నిలిచి హైదరాబాద్ ఐఐటీ మరోసారి సత్తా చాటింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ర్యాంకుల్లో హైదరాబాద్ ఐఐటీ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు జాతీయ ర్యాంకులు సాధించాయి. అన్ని విభాగాలకు కలిపి (ఓవరాల్) ఇచ్చిన ర్యాంకుల్లో ఐఐటీ(హెచ్) 14వ ర్యాంకును (గతేడాది 16వ ర్యాంకు) సొంతం చేసుకుంది. ఈ సంస్థకు 62.86 జాతీయ స్కోర్ లభించింది. ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలో ఐఐటీ(హెచ్) టాప్–10లో నిలిచి 9వ ర్యాంకు పొందింది. పరిశోధన విభాగంలో 12వ ర్యాంకు సాధించింది. దేశంలోకెల్లా ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్ తొలిస్థానంలో నిలిచి వరుసగా నాలుగోసారి ఈ ఘనత సాధించగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు) దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా నిలిచింది. హెచ్‌సీయూ భళా.. జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఓవరాల్ విభాగంలో 20వ ర్యాంకు, రీసెర్చ్‌లో 27వ ర్యాంకు సాధించింది. వర్సిటీల ర్యాంకుల్లో ఉస్మానియా వర్సిటీ 22వ ర్యాంకు పొందింది. ఓవరాల్ ర్యాంకుల విభాగంలో 46వ స్థానంలో నిలిచింది. ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలోవరంగల్ ఎన్ఐటీ 21 ర్యాంకు ఓవరాల్ విభాగంలో 45వ ర్యాంకు పొందింది. ఇంజనీరింగ్ విద్యలో జేఎన్టీయూ (హైదరాబాద్)కు జాతీయస్థాయిలో 76వ ర్యాంకు దక్కింది. కాగా, ప్రతిభగల విద్యా ర్థులు, సమర్థులైన అధ్యాపకుల కృషివల్లే ఐఐటీ (హెచ్) దినదినాభివృద్ధి చెందుతోందని సంస్థ డైరెక్టర్ ప్రొ.బీఎస్ మూర్తి తెలిపారు. వివిధ విభాగాల్లో ఓయూ ర్యాంకులు సాధించడంపై వర్సిటీ వీసీ రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. -
ఆన్లైన్ కోర్సులు ప్రారంభించండి
సాక్షి, అమరావతి: యూనివర్సిటీలు సహా దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు ‘మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు’ (మూక్స్)కింద స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పైరింగ్ మైండ్స్ (స్వయం) ద్వారా రూపకల్పన చేసిన కోర్సుల్లో 40 శాతం ఆన్లైన్లో అందించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించింది. విద్యా సంస్థలు ప్రస్తుతం అందిస్తున్న కోర్సులకు ఇవి అదనమని తెలిపింది. వీటి అమలుకు చర్యల నివేదికలను కూడా సమర్పించాలని తాజాగా పేర్కొంది. విద్యార్థులు డిజిటల్, ఆన్లైన్ వేదికలుగా చదువులు కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం మూక్స్ వేదికను ఏర్పాటు చేసింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా కేంద్రం ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ‘స్వయం’ ద్వారా వివిధ ఆన్లైన్ కోర్సులకు రూపకల్పన చేసింది. అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలు అవి అందిస్తున్న కోర్సులకు అదనంగా ‘స్వయం’ ద్వారా ఆన్లైన్ కోర్సులనూ అందించాలని 2021లోనే సూచించింది. కరోనా సమయంలో కొంతవరకు స్పందన వచ్చినా, ఆ తర్వాత అనుకున్న రీతిలో ముందుకు సాగలేదు. దీంతో ‘స్వయం’ కోర్సుల్లో కనీసం 40 శాతమైనా అందించాలని తాజాగా పేర్కొంది. వీటి ద్వారా విద్యార్థులు తక్కువ ఫీజుతో ఉన్నత విద్య అందుకోగలుగుతారని భావిస్తోంది. రెగ్యులర్ కోర్సులు చేస్తూనే డ్యూయెల్ డిగ్రీ కింద స్వయం కోర్సులకు అవకాశం కల్పించింది. ఈ కోర్సులకు యూజీసీ క్రెడిట్ ఫ్రేమ్వర్కును కూడా ఏర్పాటుచేసింది. ఈ కోర్సులు అభ్యసించే వారికి క్రెడిట్ల కేటాయింపుతో పాటు వాటిని వేర్వేరు కోర్సులు అభ్యసించే సంస్థలకు బదలాయించుకొనే వెసులుబాటు కూడా కల్పించింది. పలు విశ్వవిద్యాలయాలు ఇప్పటికే క్రెడిట్ బదిలీ కోసం ‘స్వయం’ కోర్సులను ఆమోదించాయని, మిగిలిన వర్సిటీలు కూడా చర్యలు తీసుకోవాలని యూజీసీ తాజాగా పేర్కొంది. ముందుగా వర్సిటీలు అకడమిక్ కౌన్సిళ్ల నుంచి ఆమోదం పొందాలని పేర్కొంది. క్రెడిట్ల కేటాయింపు, బదిలీని ఆయా విభాగాల హెడ్లు, డీన్లు ఆమోదించాలని తెలిపింది. ఈ ఆన్లైన్ కోర్సుల విధానంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదిలో ప్రత్యక్ష బోధన ద్వారా విద్యార్థులకు మేలు జరుగుతుందని, ఇలా డిజిటల్, ఆన్లైన్ బోధన వల్ల ప్రమాణాలు మెరుగుపడవని అభిప్రాయపడుతున్నారు. పైగా ఆన్లైన్ కోర్సుల్లో పర్యవేక్షణ కొరవడుతుందని, విద్యార్థుల సామర్థ్యాలు, నైపుణ్యాన్ని కచ్చితంగా అంచనా వేయలేమని పేర్కొంటున్నారు. విద్యా సంస్థల్లో బోధన సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పించలేక ఇలా ఆన్లైన్ బోధన వైపు వెళ్లడం సరైన పద్ధతి కాదని చెబుతున్నారు. -
గురుకులాల్లో మరో 1,000 కొలువులు!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో కొత్తగా మరో వెయ్యి కొలువుల భర్తీకి సన్నాహాలు మొదలయ్యాయి. ఇటీవల నాలుగు గురుకుల సొసైటీల్లో 9,096 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇవన్నీ బోధన విభాగానికి సంబంధించినవే. తాజాగా మరో వెయ్యి బోధనేతర ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో అనుమతులు ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి ఉద్యోగ ఖాళీల వివరాలను సంబంధిత గురుకుల సొసైటీలు ప్రభుత్వానికి నివేదించాయి. తాజాగా గుర్తించిన ఖాళీలన్నీ జూనియర్ అసిస్టెంట్ కేడర్‌కు చెందినవే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పెద్ద సంఖ్యలో గురుకుల విద్యా సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వచ్చింది. విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నప్పుడు కేటగిరీల వారీగా పోస్టులను మంజూరు చేసిన ప్రభుత్వం.. తాజాగా వాటిని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తోంది. ఇప్పటికే దాదాపు 10 వేల ఉద్యోగాలను మూడేళ్ల క్రితం భర్తీ చేయగా..ఇప్పుడు మరిన్ని ఖాళీల భర్తీకి ఉపక్రమించింది. అత్యధికంగా బీసీ గురుకులంలో.. ప్రస్తుతం ప్రభుత్వం అనుమతిం చనున్న వెయ్యి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో అత్యధికం బీసీ గురుకుల సొసైటీలోనే ఉన్నాయి. దాదాపు 450 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కేవలం బీసీ గురుకుల సొసైటీలోనే భర్తీ కానున్నాయి. ఆ తర్వాత 300 పోస్టులు మైనార్టీ, 150 పోస్టులు ఎస్సీ, మరో 100 పోస్టులు ఎస్టీ గురుకుల సొసైటీలో భర్తీ కానున్నట్లు సమాచారం. ఈ పోస్టులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. గురుకుల విద్యా సంస్థల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రత్యేకంగా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఉన్నప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ బాధ్యతలు టీఎస్పీఎస్సీకే ప్రభు త్వం అప్పగించింది. దీంతో ఈ పోస్టులు కూడా టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. వారాంతంలో ట్రిబ్ సమావేశం తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ఈ వారాంతంలో సమావేశం కానుంది. ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించిన 9,096 ఉద్యోగాలకు గురుకుల సొసైటీల ద్వారా ఇండెంట్లు గురుకుల బోర్డుకు చేరుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో అన్ని సొసైటీల నుంచి ప్రతిపాదనలు వచ్చిన తర్వాత సమావేశమై పోస్టుల భర్తీకి రిజర్వేషన్లు, రోస్టర్, జోనల్, మల్టీజోనల్, జిల్లా కేడర్ల వారీగా పోస్టుల వివరాలను సరిచూసుకోనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. -
గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు విద్యార్థి స్థానికతే కీలకం..వారికే సగం సీట్లు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు విద్యార్థి స్థానికతే కీలకం కానుంది. రెండు కేటగిరీల్లో స్థానికతను విశదీకరిస్తూ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. శాసనసభ నియోజకవర్గం యూనిట్‌గా స్థానికతను గుర్తించి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాత జిల్లా యూనిట్‌గా స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. 2022–23 విద్యాసంవత్సరానికి సంబం ధించిన ప్రవేశాల ప్రక్రియను స్థానికత ఆధారంగానే నిర్వహించాలని గురుకుల విద్యా సంస్థలు నిర్ణయించాయి. ప్రతి గురుకుల పాఠశాలలో 50 శాతం సీట్లను అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని స్థానిక విద్యార్థులకే కేటాయించనున్నారు. నాలుగు సొసైటీల్లో అడ్మిషన్లకు ఒకే పరీక్ష.. గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా అర్హత పరీక్ష ఉంటుంది. మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీలు కలసి ఐదోతరగతిలో ప్రవేశాలకు ఉమ్మడిగా వీటీజీసెట్ నిర్వహిస్తున్నాయి. పరీక్ష ఉమ్మడిగా నిర్వహించినప్పటికీ విద్యార్థులను కేటగిరీలుగా విభజించి ప్రవేశాలు కల్పిస్తున్నారు. కాగా, తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ మాత్రం ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించి సీట్లను భర్తీ చేస్తోంది. నియోజకవర్గం, జిల్లా యూనిట్ల ఆధారంగా సీట్లు భర్తీ చేసినా.. ఇంకా మిగిలితే అప్పుడు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు. వచ్చే వారం ఫలితాలు? నాలుగు గురుకుల సొసైటీల్లో ఐదోతరగతిలో ప్రవేశాలకు మే 8న వీటీజీసెట్–2022 అర్హత పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు వచ్చే వారం వెలువడే అవకాశం ఉన్నట్లు సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. ఫలితాలు ప్రకటించిన వెంటనే అర్హత సాధించిన విద్యార్థులకు సంబంధిత పాఠశాలల్లో సీట్లు కేటాయిస్తారు. -
ఇక పరీక్షలన్నీ సకాలంలోనే..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశం పొందేందుకు రాష్ట్ర విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పరీక్షలు పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అలాగే రాష్ట్ర యూనివర్సిటీల్లో జాతీయ, అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాన్ని పెంచే చర్యలు చేపట్టనుంది. ఆరు యూనివర్సిటీల ఉపకులపతులతో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి శనివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చర్చించిన అంశాలను ఆయన మీడియాకు వెల్లడించారు. కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన కౌన్సెలింగ్ ఆగస్టులోనే నిర్వహిస్తుండగా ఇందులో సీటు పొందాలనుకొనే విద్యార్థులకు రాష్ట్రంలో సకాలంలో తుది సెమిస్టర్ పూర్తికాక అవకాశం కోల్పోతున్నారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జూన్ చివరి నాటికే డిగ్రీ కోర్సుల తుది సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేయాలని తీర్మానించామన్నారు. ఇందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిపారు. మేలో పీజీ నోటిఫికేషన్.. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని, ఈ బాధ్యతను ఓయూ తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. పీజీ సెట్‌కు మేలో నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అన్ని విశ్వవిద్యాలయాలతో ఉన్నత విద్యామండలి సమన్వయం చేసుకుంటుందని ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అఖిల భారత సర్వే కోసం అవసరమైన డేటాను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేయాలని వీసీలకు సూచించారు. ‘న్యాక్’ స్పీడ్ పెంచాలి.. రాష్ట్రంలో ఎక్కువ విద్యాసంస్థలు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకొనేలా ప్రోత్సహించాలని, దీని కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని వీసీల సమావేశంలో నిర్ణయించారు. అలాగే గుర్తింపు కాలపరిమితి తీరిన కాలేజీలను తిరిగి దరఖాస్తు చేయించడం, గుర్తింపు ఉన్న కాలేజీల స్థాయి పెంపునకు చర్యలు చేపట్టాలని తీర్మానించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వి. వెంకటరమణ, వర్సిటీల వీసీలు రవీందర్, రవీంద్రగుప్తా, గోపాల్‌రెడ్డి, రమేశ్, రాథోడ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిని అడ్డుకునే ఇంగ్లిష్ వ్యతిరేకత
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇంగ్లిష్‌కు బదులుగా హిందీలో మాట్లాడాలని ఇటీవలే కేంద్ర హోంమంత్రి అన్నారు. కానీ ఇంగ్లిష్ రాజ్యమేలుతున్న ప్రైవేట్ రంగాన్ని ఆయన సౌకర్యవంతంగా విస్మరించారు. ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్‌ని అడ్డుకుంటే, దేశంలోని శూద్ర, దళిత, ఆదివాసీ కమ్యూనిటీలు ఎదుర్కొనే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. హిందీని అధికార భాషగా అమలు చేయాలనుకున్నప్పుడు... ఇంగ్లిష్ స్కూళ్లు, కాలేజీలను ఏం చేస్తారు? శూద్ర, దళిత, ఆదివాసీలు ఇప్పుడిప్పుడే ఇంగ్లిష్‌ను అలవర్చుకోవడం ప్రారంభిస్తున్నారు. అంతర్జాతీయ జాబ్ మార్కెట్లో ప్రవేశించాలనే కనీస ఆశను కూడా వారిలో తుంచేయాలని చూస్తే ఎలా? ఇంగ్లిష్ నేర్చుకోవడానికి వ్యతిరేకంగా నిలిచిందంటే... భారత్ మళ్లీ అనివార్యంగా వెనక్కు వెళుతుంది. ఒకే దేశం, ఒకే భాష అని ప్రబోధిస్తున్న ఆరెస్సెస్, బీజేపీల ఎజెండా మళ్లీ ముందు కొచ్చింది. హిందీని జాతీయ, అధికారిక భాషగా ఆమోదించాలంటూ దక్షిణ భారతదేశంపై, ఈశాన్య భారతదేశంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వ పథకం కూడా ముందుకొచ్చింది. అయితే ఇది అంతటితో ఆగిపోలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవలి ప్రకటన చూస్తే మరింత సీరియస్ అంశాన్ని అది సూచిస్తోంది. అధికార భాషా కమిటీ చైర్మన్ హోదాలో కేంద్ర హోంమంత్రి 2022 ఏప్రిల్ 7న ఒక డేరింగ్ ప్రకటన చేశారు. ‘దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇంగ్లిష్‌కు బదులుగా హిందీలో మాట్లా డాలి’ అనేశారాయన. గుర్తించాల్సింది ఏమిటంటే, సాధారణంగా ఇంగ్లిష్‌ని ప్రధానమైన భావవ్యక్తీకరణ భాషగా కలిగి ఉంటున్న ప్రైవేట్ రంగాన్ని ఆయన పూర్తిగా విస్మరించేశారు. అమిత్ షా ప్రకటనకు సరిగ్గా ఒకరోజు ముందు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్పర్సన్ ఎం.జగదీష్ కుమార్ మాట్లాడుతూ, భారత దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్‌లు నెలకొల్పు కోవడానికి ఒక పథకాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. మరి ఈ క్యాంపస్‌లలోని విద్యార్థులు, టీచర్లు హిందీ మాట్లాడతారా? ‘అశోకా’ లేదా ‘ఎమిటీ’ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లిష్‌కి బదులుగా హిందీలో బోధించాలని అమిత్ షా కోరగలరా? ఒకటి మాత్రం నిజం. కేంద్ర హోంమంత్రి జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీలను హిందీ మీడియం విద్యాసంస్థలుగా మార్చాలని చూస్తున్నారు. భారతదేశ భాషా బాహుళ్యవాదం భవిష్యత్తు గురించి ఆందోళన చెందడానికి ముందు, ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్‌ని వ్యతిరేకించడం ద్వారా దేశంలోని శూద్ర, దళిత, ఆదివాసీ కమ్యూనిటీలు ఎదుర్కొనే పర్యవసానాలను చూడటం ముఖ్యం. ప్రభుత్వ రంగం లోని పరిశ్ర మలను, విద్యాసంస్థలను ప్రైవేటీకరించాలని బలంగా ప్రభోధిస్తున్న వారిలో అమిత్ షా ఒకరు. అయితే దేశంలోని దాదాపు అన్ని ప్రైవేట్ రంగ విద్యాసంస్థలూ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్ని, కళాశాలలనే నడుపుతున్నాయన్న విషయాన్ని అమిత్ షా విస్మరిస్తున్నారు. హిందీని బోధనా భాషగా, అధికార భాషగా అమలు చేయాలనుకున్నప్పుడు ఇంగ్లిష్ స్కూళ్లు, కాలేజీలను ఏం చేస్తారు? భారతీయ ఆర్థిక వ్యవస్థకు భారీ రాబడిని తెచ్చిపెడుతున్న ప్రధాన వనరు అయిన సాఫ్ట్వేర్ కంపెనీలలో హిందీని అమలు చేయడానికి అమిత్ షా ప్లాన్ ఏమిటి? దక్షిణ భారత, ఈశాన్య భారత రాష్ట్రాలను హిందీ మాట్లాడాలని నిర్బంధిస్తే, వాటి భాషలు, వాటి వ్యక్తీకరణ సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతింటాయి. హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాలపై హిందీని రుద్దాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం ఇదే మొదటిసారి కాదు. అంతర్గతంగా, బాహ్యాంగా ఆర్థిక సంబంధాలలో ఇంగ్లిష్ ఒకే విధమైన స్థాయిని పొందని కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే దేశవ్యాప్తంగా హిందీ అమలు కోసం ఎంతగానో ప్రయత్నిం చింది. తమిళనాడు ప్రథమ ముఖ్యమంత్రిగా సి.రాజగోపాలాచారి పాలిస్తున్నప్పుడు 1937–1940 మధ్యకాలంలో రాష్ట్ర జనాభాపై హిందీని రుద్దాలని ప్రయత్నించారు. దీంతో హిందీ వ్యతిరేక ఉద్యమం అక్కడ తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ శిబిరంలో రాజ గోపాలాచారి ఒక మెతకస్వభావం కలిగిన హిందుత్వ వాదిగా ఉండే వారు. హిందీపై ఆయన వైఖరి కాంగ్రెస్‌లోని బ్రాహ్మణ సిద్ధాంత కర్తలను విభజించి వేసింది. ఉదాహరణకు టి.టి. కృష్ణమాచారి పక్కా హిందీ వ్యతిరేకిగా, ఇంగ్లిష్ సమర్థకుడైన నేతగా ఉండేవారు. అయితే తమిళనాడుపై హిందీని నిర్బంధంగా రుద్దడానికి వ్యతిరేకంగా శూద్ర, దళిత ప్రజానీకాన్ని కూడగట్టిన ఘనత పెరియార్ రామస్వామి నాయకర్‌కే దక్కాలి. 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం చేసిన హిందీని రుద్దాలనే ప్రయత్నం తమిళనాడులో భారీ స్థాయి ఆందోళనలకు, కాల్పులకు దారితీయడమే కాదు... చాలా మంది ఆత్మాహుతికి కూడా కారణమైంది. ఈ క్రమంలో హిందీ వ్యతిరేక పోరాటంలో 70 మంది ప్రజలు చనిపోయారు. ఫలితంగా 1967 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పొందింది. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేత అన్నాదురై తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత చరిత్ర తెలిసిందే. అయితే తమిళ ప్రజల ఇంగ్లిష్ అనుకూల ఆందోళనల వల్ల ఎవరు లబ్ధి పొందారు అంటే తమిళ బ్రాహ్మణులే. వీరు చాలావరకు ప్రైవేట్ క్రిస్టియన్ మిషనరీ పాఠశాలల్లో చదువుకున్నారు. బ్రాహ్మ ణిజంపై తిరుగుబాటు చేసిన తమిళ బ్రాహ్మణ మహిళ గీతా రామ స్వామి... ఇటీవల రాసిన తన జ్ఞాపకాల్లో (ల్యాండ్, గన్స్, క్యాస్ట్, విమెన్) ఇంట్లోనూ, తాను చదువుకున్న ఇంగ్లిష్ మీడియం పాఠశాల లోనూ పరస్పర వ్యతిరేకమైన విశ్వాసాల మధ్య తన బాల్యం గడిచి పోయిందని చెప్పారు. ఇంట్లో బ్రాహ్మిన్గానూ, పాఠశాలలో కేథలిక్ గానూ తాను గడిపానని ఆమె చెప్పారు. రుతుస్రావం అనేది భయంకరమైన కాలుష్యమని, రజస్వలగా ఉన్నప్పుడు దేవతా విగ్రహాలను తాకితే అవి మైలపడిపోతాయనీ, విరిగిపోతాయనీ బ్రాహ్మణ భావజాలంతో కూడిన ఇల్లు ఆమెకు నేర్పింది. కానీ ఆమె చదివిన పాఠశాల మాత్రం రుతుస్రావం అంటే తనలోని సంతాన శక్తిని చాటే ప్రక్రియ అని ఆమెకు బోధించింది. ఈ విధంగా సమాజంలోని అన్ని ఇతర కులాల వారికంటే బ్రాహ్మణు లను, వైశ్యులను ఇంగ్లిష్ విద్య విముక్తి చేసి పడేసింది. ఈరోజు దేశంలోని బడా బడా బనియా పారిశ్రామిక వేత్తలు ఇంగ్లిష్‌లోనే వ్యవ హరాలు నడిపిస్తున్నారు. పైగా ప్రపంచ స్థాయి ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు, కళాశాలలను నడుపుతున్నారు. మరి హిందీ సమర్థకులైన అమిత్ షా వాటిని మూసివేయాలని ప్లాన్ చేస్తున్నారా? భారతదేశంలోని శూద్ర, దళిత, ఆదివాసీలు ఇప్పుడిప్పుడే ఇంగ్లిష్‌ను అలవర్చుకోవడం ప్రారంభిస్తున్నారు. కానీ వారిలో అంత ర్జాతీయ జాబ్ మార్కెట్లో ప్రవేశించాలనే కనీస ఆశను కూడా తుంచే యాలని అమిత్‌షా కోరుకుంటున్నారు. దేశం లోపల కూడా ఇంగ్లిష్‌ను మాట్లాడే, రాసే సామర్థ్యం లేకపోవడం కారణంగానే ఈ కమ్యూని టీలకు ప్రైవేట్ రంగం ఉద్యోగాల్లో స్థానం లేకుండా పోతోంది. వీరు ఇంగ్లిష్‌ను మాట్లాడలేకపోతే, వారు దాన్ని ఎలా నేర్చుకోగలు గుతారు? ఈ ఇంగ్లిష్ విద్య కారణంగానే తమిళ బ్రాహ్మణ మూలాలు కలిగిన కమలా హారిస్ ఏకంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ కాగలిగారు. సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ కాగలిగారు. ఇది మాత్రమే కాదు... వారిలో పటిష్టంగా ఉన్న ఇంగ్లిష్ మీడియం విద్య కారణంగానే తమిళ బ్రాహ్మణులు చారిత్రకంగా కేంద్ర ప్రభుత్వాల్లో అత్యున్నత స్థానాలను చేజిక్కించుకోగలిగారు. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉంటున్న నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉంటున్న ఎస్.జైశంకర్ ఆ ఇంగ్లిష్ విద్యా వారసత్వానికి కొనసాగింపు గానే నిలుస్తున్నారు. ఇంతేకాదు. అమిత్‌షా దేశాన్నే దహించివేయగల మరొక ఎజెండాపై కూడా కృషి చేస్తున్నారు. విస్తరించిన ఇంగ్లిష్ భాషా పునాది సహాయం తోనే భారత్, చైనా దేశాలు నేడు అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడుతు న్నాయి. జాతీయవాద వాగాండబరం ఎలా ఉన్నా, అది ఇంగ్లిష్ నేర్చుకోవడానికి వ్యతి రేకంగా ప్రభావం కలిగించిందంటే... భారతదేశం మళ్లీ అనివార్యంగా వెనక్కు వెళ్తుంది. జాగ్రత్త! కంచె ఐలయ్య షెపర్డ్, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
చదివింపుల్లేవ్.. విదిలింపులే!
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీగా పన్నుల ఆదాయం పొందుతున్న కేంద్ర ప్రభుత్వం... కేంద్రీయ విద్యాసంస్థల మంజూరులో మాత్రం దక్షిణాదికి తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. గత 8 ఏళ్లలో మంజూరు చేసిన 220 కేంద్రీయ విద్యాసంస్థల్లో (157 కేంద్రీయ విద్యాలయాలు, 63 జవహర్ నవోదయ విద్యాలయాలు) దక్షిణాదికి కేవలం 40 (37 కేవీలు, 3 జేవీవీలు) మాత్రమే లభించడం ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఈ అంశంపై ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద కోరిన వివరాలను కేంద్రం తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2,311 కేంద్రీయ విద్యాసంస్థలు (661 జవహర్ నవోదయ విద్యాలయాలు, 1,650 కేంద్రీయ విద్యాలయాలు) ఉన్నాయని తెలిపింది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ప్రాధాన్యత... కొత్తగా విద్యాలయాల మంజూరులో బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేంద్రం ప్రాధాన్యత ఇచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవీల్లో అత్యధికంగా మధ్యప్రదేశ్‌కు 20 మంజూరు చేసిన కేంద్రం... ఆ తర్వాత యూపీకి 16, కర్ణాటకకు 13, ఛత్తీస్‌గఢ్‌కు 10 చొప్పున మంజూరు చేసింది. ఇక జవహర్ నవోదయ విద్యాలయాల విషయానికి వస్తే అత్యధికంగా ఛత్తీస్‌గఢ్‌కు 11, గుజరాత్‌కు 8, యూపీకి 6 చొప్పున ఇచ్చింది. దాదాపు 17 రాష్ట్రాలకు కొత్తగా జేఎన్వీలు మంజూరు చేయకపోవడం గమనార్హం. దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం కర్ణాటకకు మాత్రమే 3 జేఎన్వీలు మంజూరవగా మిగతా రాష్ట్రాలకు ఒక్కటీ లభించలేదు. జిల్లాకో జేఎన్వీ ఏమైంది..? ప్రతి జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయం ఉండాలని కేంద్ర ప్రభుత్వ నిబంధన ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటవగా కొత్త జిల్లాలకు జేఎన్వీలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటై ఆరేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఒక్క జేఎన్వీ కూడా కేంద్రం మంజూరు చేయలేదు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి రాసిన లేఖలో జేఎన్వీల ఏర్పాటును సైతం ప్రస్తావించారు. కానీ కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో కొత్తగా ఒక్క పాఠశాల కూడా ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 జేఎన్వీలు మాత్రమే ఉన్నాయి. -
గురుకుల సెట్–22 దరఖాస్తుకు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఐదో తరగతి ప్రవేశాలకు నిర్వహించనున్న గురుకుల సెట్(వీటీజీసెట్)–2022 దరఖాస్తు గడువును ఏప్రిల్ 7 వరకు పొడిగిస్తున్నట్లు సెట్ చీఫ్ కన్వీనర్ రోనాల్డ్‌రాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వీటీజీసెట్–22 మే 8న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్సైట్లో పరిశీలించవచ్చని ఆ ప్రకటనలో తెలిపారు. -
నకిలీల ‘అవుట్ సోర్సింగ్’
వరంగల్ జిల్లాలో ఉన్న ఓ ఏకలవ్య మోడల్ స్కూల్లో క్రాఫ్ట్ టీచర్‌గా ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పనిచేస్తున్నాడు. వాస్తవానికి ఆ వ్యక్తి పదోతరగతి మాత్రమే చదవగా.. డిగ్రీ, అనుబంధ కోర్సులో ఉత్తీర్ణత సాధించినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. తర్వాత అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా క్రాఫ్ట్ టీచర్ ఉద్యోగం సంపాదించాడు. ఇలా ఒకరిద్దరు కాదు.. గిరిజన గురుకుల విద్యా సంస్థల సొసైటీ, ఏకలవ్య మోడల్ పాఠశాలల్లోని పలు విభాగాల్లో పదుల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పొందారు. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో తాత్కాలిక పద్ధతిలో నియమించే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకూ ‘నకిలీ’చీడ పట్టింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల విద్యా సంస్థలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ‘నకిలీలు’ఉ న్నట్లు తెలుస్తోంది. వారికి అర్హత లేకున్నా ఇంటర్మీ డియట్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను తప్పుడు పద్ధతిలో సృష్టించి వాటి ద్వారా అవుట్ సోర్సింగ్ కొలువులు సంపాదించుకున్నట్లు తెలిసింది. ఈ అంశం జిల్లా స్థాయిలో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. బోగస్ సర్టిఫికెట్లతో బురిడీ.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను జిల్లా స్థాయిలో ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఏజెన్సీల ద్వారా వచ్చే అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి, ఆమోదం తెలిపిన అనంతరం వారిని ఉద్యోగంలో చేరనిస్తారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలవారీ జీతాలను ప్రభుత్వం నేరుగా కాకుండా ఏజెన్సీల ద్వారా చెల్లిస్తారు. ఈ క్రమంలో ఏజెన్సీల్లోని కొందరు నిర్వాహకులు ఒకరిద్దరు అధికారులతో మిలాఖత్ అయ్యి నకిలీ సర్టిఫికెట్లున్న అభ్యర్థులకు కొలువులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల విద్యాసంస్థలు, కాలేజీలతో పాటు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో పెద్ద సంఖ్యలో తప్పుడు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు వందకు పైగా ఉద్యోగులను ఇలా ఎంపిక చేసినట్లు వెల్లడైంది. సబార్డినేట్ పోస్టులే ఎక్కువ.. గిరిజన గురుకుల సొసైటీతో పాటు ఏకలవ్య మోడల్ స్కూళ్లలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసిన ఉద్యోగాల్లో అత్యధికం సబార్డినేట్ పోస్టులే ఉన్నట్లు సమాచారం. వాటితో పాటు కొన్నిచోట్ల బోధన సిబ్బందిని సైతం ఇలాగే భర్తీ చేసినట్లు తెలుస్తోంది. ల్యాబ్ అసిస్టెంట్, అటెండర్ పోస్టులతో పాటు మెస్ మేనేజర్, క్రాఫ్ట్ టీచర్, ఆర్ట్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల్లో ఇలాంటి ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. సబార్డినేట్ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు నకిలీవి సృష్టించగా, బోధన సిబ్బంది కేటగిరీలో డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను తప్పుడు పద్ధతిలో సృష్టించారు. ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ జరపాలని ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అక్రమాల గుట్టు తెలుస్తుందని అంటున్నారు. -
మనమంతా ఒక్కటే..
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/ఉంగుటూరు: మనమంతా ఒక్కటే అనే భావన కలిగినప్పుడే శక్తివంతమైన దేశం ఏర్పడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఏలూరులోని సీఆర్ రెడ్డి విద్యాసంస్థల 75 వసంతాల వేడుకలను బుధవారం ఘ నంగా నిర్వహించారు. ముఖ్యఅతిథి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. శక్తివంతమైన దేశంలో ఆకలి, దారిద్య్రం, లింగ, వర్ణ వివక్షలు ఉండకూడదన్నారు. మన దేశంలో ఇప్పటికీ 25 శాతం మంది పేదరికంలో, 27 శాతం మంది నిరక్షరాస్యులుగా ఉన్నారని, భవిష్యత్‌లో వీటన్నింటినీ అధిగమించి ప్రగతి సాదించాల్సి ఉందన్నారు. సీఆర్ఆర్ విద్యా సంస్థలు 75 ఏళ్లుగా అంకితభావంతో విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుతున్నాయన్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, సీఆర్ఆర్ విద్యా సంస్థల ప్రతినిధులు అల్లూరి ఇంద్రకుమార్, ఎంబీఎస్వీ ప్రసాద్ పాల్గొన్నారు. జగన్నాథాష్టకం సీడీ ఆవిష్కరణ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని విజయవాడ చాప్టర్ స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆడిటోరియంలో జరిగిన సీపీఆర్ అవగాహన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి పాల్గొన్నారు. హఠాత్తుగా గుండెపోటు వచ్చిన వ్యక్తికి అత్యవసరంగా చికిత్సనందించే సీపీఆర్ పద్ధతిని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. విదేశీ దండయాత్రలు, బ్రిటిషర్ల విధానంతో దేశం నష్టపోయిన వైనం పై అమెరికా యాత్రికుడు విల్ దురంత్ రాసిన ద కేస్ ఫర్ ఇండియా పుస్తకానికి తెలుగు అనువాదం ‘భారతదేశం పక్షాన’ను వెంకయ్యనాయుడు ఆవి ష్కరించారు. ఆత్కూరులో విజయవాడ చాప్టర్ స్వ ర్ణభారత్ ట్రస్ట్‌లో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరి చందన్ తనయుడు ప్రసేన్‌జిత్ హరిచందన్ నేతృత్వంలో డివైన్ క్యాప్సుల్ సంస్థ తీసుకొచ్చిన జగన్నాథాష్టకం సీడీని ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. సీడీ తీసుకురావడంలో శ్రమించిన ప్రసేన్‌జిత్ హరిచందన్, గాయకుడు సురేశ్వాడేకర్, సంగీత దర్శకుడు జగ్యాన్దాస్ను అభినందించారు. -
అర్హతలున్నాయి... అవగాహనే లేదు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపును తెలంగాణలో విస్తరించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది. త్వరలో దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు కాలేజీల డేటాను తెప్పించినట్టు, కొన్నింటిని ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో చాలా కాలేజీలకు న్యాక్ గుర్తింపు పొందగల అర్హతలున్నాయని, అయితే సరైన అవగాహన లేకపోవడంతో ఇందుకోసం దరఖాస్తు చేయలేదని అంటున్నారు. ఫలితంగా న్యాక్ గుర్తింపు కలిగిన కళాశాలల విషయంలో తెలంగాణ వెనుకబడి ఉంది. దేశంలో న్యాక్ గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలు 21 శాతం ఉంటే, తెలంగాణలో ఇది 11 శాతానికే పరిమితమైంది. కాలేజీల్లో ఉన్నత విద్య ప్రమాణాల స్థాయిని న్యాక్ గుర్తింపు తెలియజేస్తుంది. చాలా కాలేజీలు న్యాక్ గుర్తింపును అదనపు అర్హతగా భావించడంతో ఈ మేరకు ప్రచారం సైతం చేసుకుంటాయి. ఈ కళాశాలల శాతం ఎంత పెరిగితే ఆ రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాలు అంత ఎక్కువగా ఉన్నట్టన్న మాట. ప్రమాణాలున్నా.. ప్రయత్నమే లేదు రాష్ట్రంలో ప్రస్తుతం 1,976 ఉన్నత విద్యా సంస్థలున్నాయి. వీటిల్లో కేవలం 141 మాత్రమే న్యాక్ గుర్తింపు కలిగి ఉండటం గమనార్హం. ఇందులో 35 ప్రభుత్వ సంస్థలు, 19 ఎయిడెడ్, 87 ప్రైవేటు సంస్థలున్నాయి. రాష్ట్రంలోని 24 యూనివర్శిటీలకు గాను న్యాక్ గుర్తింపు ఉన్నవి పదే. శాతవాహన, జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ సహా కొన్ని ఇప్పటికీ న్యాక్ గుర్తింపు పొందలేదు. ఈ పరిస్థితులపై ఉన్నత విద్య మండలి ఇటీవల క్షేత్రస్థాయి అధ్యయనం చేసింది. దాదాపు వందకుపైగా డిగ్రీ కాలేజీలు న్యాక్ గుర్తింపునకు అర్హత కలిగి ఉన్నట్టు గుర్తించాయి. సొంత భవనాలు, నాణ్యతతో కూడిన బోధన అందించగల ఫ్యాకల్టీ, లేబొరేటరీలు, పటిష్టమైన బోధన విధానాలు, లైబ్రరీ సదుపాయాలు, కచ్చితమైన నిర్వహణ వ్యవస్థ వీటికి ఉన్నాయి. కొన్నేళ్ళుగా అక్కడ మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. ఉపాధి అవకాశాలు పొందడంలోనూ ఈ కాలేజీ విద్యార్థుల శాతం మెరుగ్గా కన్పిస్తోంది. ఇలా న్యాక్ గుర్తింపునకు అవసరమైన అన్ని అర్హతలు, ప్రమాణాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆయా సంస్థలు గుర్తింపు కోసం దరఖాస్తు చేయలేదు. వాస్తవానికి విద్యార్థులు ఏదైనా కాలేజీలో చేరాలనుకున్నప్పుడు న్యాక్ గుర్తింపు ఉందా లేదా అని చూస్తారు. అలాగే దేశ, విదేశీ విద్యా సంస్థలు విద్యార్థుల చేరికల సమయంలో సదరు కాలేజీకి న్యాక్ గుర్తింపు ఉందా లేదా అని చూస్తాయి. అలాగే క్రమబద్ధమైన పర్యవేక్షణ, ప్రమాణాలు కొనసాగించేలా ఈ గుర్తింపు దోహదపడుతుంది. ఇలాంటి ప్రయోజనాలన్నిటిపై అవగాహన లేక, ‘నడుస్తోంది కదా..చూద్దాంలే’అన్న నిర్లిప్త ధోరణిలో చాలా కాలేజీలు ఉంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దరఖాస్తు చేసేలా కార్యాచరణ ఈ నేపథ్యంలోనే న్యాక్ గుర్తింపు కలిగిన కాలేజీలు, వర్సిటీల పెంపు కోసం ఉన్నత విద్యామండలి వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా తొలుత.. ఇప్పటికే గుర్తింపు పొందిన 141 కాలేజీల్లో 81 కాలేజీలు న్యాక్ గుర్తింపును రెన్యువల్ చేయించుకునే దిశగా ప్రోత్సహిస్తారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 72, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 6, గ్రామీణ ప్రాంతాల్లో 63 వరకూ ఉన్నాయి. ఆ తర్వాత మౌలిక వసతులు, ఫ్యాకల్టీ పాటు, అన్ని అర్హతలున్న వందకుపైగా కాలేజీల చేత దరఖాస్తు చేయించాలని నిర్ణయించారు. దీని తర్వాత ప్రమాణాలు పెంచుకుని, న్యాక్ గుర్తింపునకు అర్హత సాధించే దిశగా కాలేజీలను ప్రోత్సహిస్తారు. ఇక ఏమాత్రం ప్రమాణాలు లేని, విద్యార్థుల చేరికలు లేని కోర్సులు, కాలేజీల మూసివేత దిశగా చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. న్యాక్ గుర్తింపు పొందేలా ఆయా సంస్థలతో ప్రత్యేకంగా సమాలోచనలు జరపాలని భావిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. -
విద్యార్థుల ఖాతాల్లోనే డబ్బులేయండి
సాక్షి, హైదరాబాద్: దళిత విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి కేంద్రం కొత్త నిబంధన పెట్టింది. ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన ఆర్థిక సాయాన్ని విద్యా సంస్థలకు కాకుండా నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని తేల్చి చెప్పింది. అప్పడే కేంద్రం నుంచి పథకం వాటా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఆ మేరకు ఖచ్చితమైన హామీనిస్తూ నిర్ణయం తీసుకొని కేంద్రానికి నివేదికివ్వాలని ఆదేశించింది. కేంద్రం వాటా 15 నుంచి 60 శాతానికి పెంపు పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించి ఉపకారవేతనాలను విద్యార్థి ఖాతాలో.. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విద్యార్థి పేరిట కాలేజీ యాజమాన్యం ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అనుసరించిన ఈ పద్ధతినే రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా పాటిస్తోంది. అయితే కాలేజీ యాజమాన్యాలకు ఫీజులు ఇవ్వడాన్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆక్షేపిస్తోంది. ఎస్సీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను నేరుగా విద్యార్థి ఖాతాకే ఫీజు నిధులు ఇవ్వాలని తాజాగా ఆదేశించింది. మరోవైపు ఎస్సీ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో కేంద్ర వాటా గతంలో 15 శాతం ఉండగా రాష్ట్రం వాటా 85 ఉండేది. అయితే గతేడాది నుంచి కేంద్రం నిధులను 60 శాతం ఇస్తోంది. రాష్ట్ర వాటా కంటే కేంద్రం వాటా ఎక్కువగా ఉన్నందున కేంద్రం నిబంధనలు అమలు చేయాలని రాష్ట్ర సర్కారుకు చెప్పింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శి ఆర్.సుబ్రమణ్యం శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో ఈ విషయం స్పష్టం చేశారు. కొత్త నిబంధనతో నష్టమే ఎస్సీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల కింద కేంద్ర, రాష్ట్రాలు ఏటా రూ.440 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం సగటున 2.3 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. కేంద్రం తాజా నిబంధనతో ఇబ్బందులొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ది శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఖాతాకు ఫీజు నిధులు విడుదల చేస్తే కాలేజీ యాజమాన్యానికి చెల్లించడంలో జాప్యం జరుగుతుందని, అలాగే నిధుల విడుదలలో జాప్యం జరిగితే విద్యార్థి వ్యక్తిగతంగా చెల్లించాల్సి వస్తుందని వాదనలు వాదనలు వినిపిస్తున్నాయి. ఫీజుల విషయంలో కాలేజీలు కచ్చితత్వాన్ని పాటించే ప్రమాదం ఉందన్నారు. దీని వల్ల చివరకు డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతుందని విమర్శలూ వస్తున్నాయి. -
విద్యార్ధుల కోసం 200 నగరాల్లో 500 ట్యూషన్ సెంటర్లు..రూ.1,500 కోట్లతో బైజూస్!
న్యూఢిల్లీ: ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ దేశవ్యాప్తంగా బోధనా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. 12–18 నెలల్లో 200 నగరాల్లో 500 సెంటర్లను స్థాపించనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం సుమారు రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు బైజూస్ సీవోవో మృణాల్ మోహిత్ వెల్లడించారు. ఇప్పటికే సంస్థ 80 కేంద్రాలను పైలట్ ప్రాజెక్టు కింద నెలకొల్పింది. వీటి ద్వారా 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో తరగతులను నిర్వహిస్తోంది. ట్యూషన్ సెంటర్ల ఏర్పాటు ద్వారా ఏడాదిలో 10,000 పైచిలుకు మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలన్నది సంస్థ లక్ష్యం. గూగుల్‌తో చేతులు కలిపింది ఇప్పటికే బైజూస్ దేశీయంగా పాఠశాలల్లో ఆన్లైన్ విద్యాభ్యాసానికి తోడ్పడేలా టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌తో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఈ డీల్‌లో భాగంగా గూగుల్ వర్క్‌స్పేస్ ఫర్ ఎడ్యుకేషన్, బైజూస్‌కి చెందిన విద్యార్థి పోర్టల్‌ను అనుసంధానించారు ఇందుకు సంబంధించిన ప్రోగ్రాంలో నమోదు చేసుకున్న విద్యాసంస్థలు.. బైజూస్‌కి చెందిన మ్యాథ్స్, సైన్స్ బోధనా విధానాలతో తమ విద్యార్థులకు రిమోట్‌గా బోధిస్తున్నారు. దీనితో పాటు ఉపాధ్యాయులకు గూగుల్ క్లాస్రూమ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా విద్యాభ్యాసం ప్రయోజనాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలుసుకుంటున్నారని బైజూస్ సీవోవో మృణాల్ మోహిత్ తెలిపారు. గూగుల్‌తో భాగస్వామ్యం ద్వారా ఉపాధ్యాయులకు అవసరమైన సాంకేతిక తోడ్పాటును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
పాఠశాలల్లో ప్రార్థనలపై వివాదం
నశంకరి: పాఠశాలలకు విద్యార్థులు హిజబ్– కాషాయ కండువాలతో రావడం తీవ్ర వివాదాస్పదం కాగా, దక్షిణ కన్నడ, బాగల్‌కోటే జిల్లాల్లో రెండు పా ఠశాలల్లో ఒకవర్గం విద్యార్థులు పాఠశాలల్లో నమాజ్ చేయడం సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. ఇలా అయితే మేము భజన చేస్తామని మరోవర్గం విద్యార్థులు హెచ్చరించారు. దక్షిణ కన్నడ జిల్లా కడబ తాలూకా అంకత్తడ్డ ప్రభుత్వ పాఠశాలలో 10 మందికి పైగా విద్యార్థులు శుక్రవారం నమాజ్ చేసినట్లు వీడియోలు వచ్చాయి. ఇకపై ఎవరైనా తరగతి గదుల్లో నమాజ్ చేసినట్లు కనబడితే తమ విద్యార్థులు భజన చేస్తారని పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ప్రవీణ్భండారీ హెచ్చరించారు. ఇళకల్ ప్రభుత్వ పా ఠశాలలోనూ ఇలాంటి దృశ్యమే పునరావృతమైంది. -
పీజీ చదివేవారేరి?
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లోని వివిధ పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ఏటా సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. బీటెక్‌తోనే విద్యార్థులకు భారీ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. బీటెక్‌తోనే మంచి ఉద్యోగాలు వస్తుండటంతో ఎక్కువ మంది విద్యార్థులు పీజీ, పీహెచ్డీ వైపు మొగ్గు చూపడం లేదు. అలాగే బీటెక్‌లోని కొన్ని కోర్సుల్లోనూ సీట్లు భర్తీ కావడం లేదు. ఈ సమస్య ప్రధానంగా కొత్త ఐఐటీల్లో కనిపిస్తోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత రెండేళ్లలో భర్తీ కాని సీట్లు.. గత రెండేళ్లలో ఐఐటీల్లోని వివిధ కోర్సుల్లో 10,780 సీట్లు, ఎన్ఐటీల్లో 8,700 సీట్లు మిగిలిపోయినట్లు కాగ్ పేర్కొంది. 2020–21 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో 5,484 సీట్లు భర్తీ కాలేదు. వీటిలో బీటెక్ కోర్సుల సీట్లు 476 ఉండగా పీజీ కోర్సుల సీట్లు 3,229 ఉన్నాయి. అలాగే పీహెచ్డీ కోర్సుల్లో 1,779 సీట్లు భర్తీ కాలేదు. కాగా కొత్త ఐఐటీలైన భువనేశ్వర్, గాంధీనగర్, హైదరాబాద్, ఇండోర్, జోధ్‌పూర్, మండి, పాట్నా, రోపార్‌ల్లో సీట్లు ఎక్కువ మిగిలిపోయినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. ఇక 2021–22లో అన్ని ఐఐటీల్లో 5,296 సీట్లు భర్తీ కాలేదు. వీటిలో బీటెక్ కోర్సుల్లో 361 సీట్లు, పీజీ కోర్సుల్లో 3,083 సీట్లు, పీహెచ్డీ కోర్సుల్లో 1,852 సీట్లు ఖాళీగా మిగిలిపోయినట్లు కాగ్ పేర్కొంది. ప్లేస్మెంట్లకే విద్యార్థుల ప్రాధాన్యత మరోవైపు ఐఐటీలు, ఎన్ఐటీల్లో బీటెక్ పూర్తికాగానే విద్యార్థులు మంచి కొలువులకే ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో పీజీ, పీహెచ్డీ సీట్ల వైపు వారు మొగ్గు చూపడం లేదు. బీటెక్ ఉత్తీర్ణతతోనే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో మంచి ఉద్యోగాలు దక్కుతుండటంతో పీజీ, పీహెచ్‌డీల్లో చేరడానికి విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు. పరిశోధనలంటే ఆసక్తి, ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారు మాత్రమే పీజీ, పీహెచ్‌డీల్లో చేరుతున్నారు. అయితే వీరి సంఖ్య అతి స్వల్పంగా ఉంటోంది. పైగా ఐఐటీల్లో పీజీ ప్రవేశాలకు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)ను నిర్వహిస్తున్నారు. బీటెక్ ఉత్తీర్ణులు గేట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని కాగ్ వెల్లడించింది. 2014 నుంచి 2019 వరకు చూస్తే ఐఐటీలలోని పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో 28 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. భర్తీ కాని సీట్లు ఎన్ఐటీల్లోనే అధికం ఐఐటీలతో పోలిస్తే ఎన్ఐటీల్లో సీట్లు ఎక్కువగా మిగిలిపోతున్నట్టు కాగ్ వెల్లడించింది. ముఖ్యంగా కొత్త ఎన్ఐటీల్లో సీట్లు భర్తీ కావడం లేదని పేర్కొంది. ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు ఆరు నుంచి ఏడు రౌండ్ల కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నా సీట్లు మిగిలిపోతుండడం గమనార్హం. కొన్నిసార్లు స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌ను చేపడుతున్నా ఇదే పరిస్థితి. ఐఐటీలు, ఎన్ఐటీలు పరిశోధనలకు ఉద్దేశించినవే అయినా వాటిలో పీహెచ్డీ సీట్లు భర్తీ కావడం గగనంగా మారుతోంది. వివిధ ప్రవేశ పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ చూపినవారికే ఈ కోర్సుల్లో అవకాశం కల్పిస్తున్నారు. ఈ స్థాయిలో మెరిట్ సాధిస్తున్నవారు లేకపోవడం కూడా ఈ సీట్లు మిగిలిపోవడానికి మరో కారణమని నిపుణులు చెబుతున్నారు. కాగ్ నివేదిక ప్రకారం.. అర్హత గల అభ్యర్థులు లేకపోవడం వల్ల పీహెచ్డీ సీట్లు భర్తీ చేయలేకపోతున్నట్లు ఆయా ఐఐటీలు పేర్కొన్నాయి. టాప్ ఐఐటీల్లో ఒకటైన ఢిల్లీలో 800 పీహెచ్డీ సీట్లు ఉండగా.. ఏటా 500 మాత్రమే భర్తీ అవుతున్నాయి. -
హిజాబ్ అంశాన్ని జాతీయ వివాదంగా మార్చొద్దు
న్యూఢిల్లీ/ సాక్షి, బెంగళూరు: దేశంలో ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును సవాలు చేస్తూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సరైన సమయంలో విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వెల్లడించింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు దేశ పౌరుల ప్రాథమిక హక్కును భంగపరిచేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద ప్రజలు తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చని గుర్తుచేశారు. వారి తరపున సీనియర్ అడ్వొకేట్ దేవదత్ కామత్ వాదనలు వినిపించారు. తమ పిటిషన్‌పై ఈ నెల 14న విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో ఇప్పటికే విచారణ కొనసాగుతోందని గుర్తుచేసింది. హైకోర్టు ఇచ్చే తుది తీర్పు కోసం వేచి చూడాలని సూచించింది. స్పెషల్ లీవ్ పిటిషన్‌పై తాము సరైన సమయంలో విచారణ ప్రారంభిస్తామని తేల్చిచెప్పింది. హిజాబ్ అంశాన్ని జాతీయ స్థాయి వివాదంగా మార్చొద్దని హితవు పలికింది. కర్ణాటక ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. హిజాబ్ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు ఇంకా తమకు అందలేదని పేర్కొన్నారు. హిజాబ్ కేసులో విచారణ ముగిసే వరకూ విద్యాసంస్థల్లో మతపరమైన చిహ్నాలు ధరించరాదని ఆదేశిస్తూ కర్ణాటక హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. శాంతిని విచ్ఛిన్నం చేయొద్దు భారత్ లౌకిక దేశమని, ఏదో ఒక మతం ఆధారంగా ఈ దేశం గుర్తింపును నిర్ధారించలేమని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. హిజాబ్ వివాదంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితురాజ్ అవస్తీ నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. ఈ ఉత్తర్వులో న్యాయస్థానం పలు అంశాలను ప్రస్తావించింది. హిజాబ్‌పై వివాదం, విద్యాసంస్థల మూసివేత బాధాకరమని ధర్మాసనం వెల్లడించింది. భారత్‌లో బహుళ సంస్కృతులు, మతాలు, భాషలు మనుగడలో ఉన్నాయని తెలిపింది. ఇష్టమైన మతాన్ని అవలంబించే హక్కు దేశ పౌరులకు ఉందని గుర్తుచేసింది. మనది నాగరిక సమాజమని.. మతం, సంస్కృతి పేరిట శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేసే అధికారం ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. అందుకు చట్టం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వదని పేర్కొంది. మద్రాసు హైకోర్టు సైతం గురువారం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రాజస్తాన్‌కు పాకిన హిజాబ్ గొడవ కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇప్పుడు రాజస్తాన్‌కు సైతం పాకింది. హిజాబ్ ధరించిన వారిని తరగతులకు హాజరు కానివ్వడం లేదని ఆరోపిస్తూ జైపూర్ జిల్లాలోని చాక్సు పట్టణంలో ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యులు శుక్రవారం ప్రదర్శన చేపట్టారు. అయితే, విద్యార్థినులు గత నాలుగైదు రోజుల నుంచే హిజాబ్ ధరించి వస్తున్నారని కళాశాల సిబ్బంది చెప్పారు. కానీ, విద్యార్థినుల వాదన మాత్రం మరోలా ఉంది. తాము గత మూడేళ్ల నుంచి హిజాబ్ ధరించే కాలేజీ వస్తున్నామని, ఎప్పుడూ ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, అకస్మాత్తుగా ఇప్పుడే తమను తరగతులకు అనుమతించడం లేదని పేర్కొన్నారు. 16 దాకా వర్సిటీలకు సెలవులు హిజాబ్ వివాదం నేపథ్యంలో డిపార్టుమెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ కాలేజెస్‌కు చెందిన విశ్వవిద్యాలయాలకు ఈ నెల 16వ తేదీ వరకూ సెలవులు పొడిగించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని ఉన్నత విద్యా మంత్రి అశ్వత్థ నారాయణ్ చెప్పారు. ప్రి–యూనివర్సిటీ(పీయూసీ), డిగ్రీ కాలేజీల పునఃప్రారంభంపై ఈ నెల 14న నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు విద్యా మంత్రి నగేష్ శుక్రవారం తెలిపారు. పీయూసీ, డిగ్రీ కాలేజీల తరగతులు సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పా రు. పాఠశాలలను మళ్లీ తెరుస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుం డా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి చెప్పారు. -
‘హిజాబ్’ రగడ.. స్కూళ్లు తెరవండి: హైకోర్టు
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్– కండువా వివాదం కారణంగా విద్యా సంస్థల మూసివేతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యాసంస్థలు తెరవాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో తుది తీర్పు వచ్చే వరకూ విద్యార్థులు హిజాబ్-కండువాల ప్రస్తావన తేవొద్దని తెలిపింది. హిజాబ్ రగడపై దాఖలైన పిటిషన్‌ను సీజే జస్టిస్ రితురాజ్ అవస్థీ నేతృత్వంలోని హైకోర్టు విచారించింది. గురువారం విచారించిన ధర్మాసనం.. తుది తీర్పును ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకూ హిజాబ్- కండువాల ప్రస్తావనకు దూరంగా ఉండాలని పేర్కొంది. కాగా, వివాదంపై మంగళ, బుధవారాల్లో హైకోర్టులో జరిగిన విచారణలో పరీక్షలు రెండు నెలలే ఉన్నందున ప్రస్తుతానికి మధ్యంతర ఉత్తర్వులైనా ఇవ్వాలని పిటిషనర్లు అభ్యర్థించిన సంగతి తెలిసిందే. -
‘హిజాబ్’పై ధర్మాసనం.. కర్ణాటక హైకోర్టు సీజే నిర్ణయం
బెంగళూరు: హిజాబ్–కాషాయ కండువా గొడవతో కొద్ది రోజులుగా అట్టుడికిన కర్ణాటకలో విద్యా సంస్థల మూసివేత నేపథ్యంలో బుధవారం ప్రశాంతత నెలకొంది. దీనిపై విచారణకు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తూ కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్ రితురాజ్ అవస్థీ నిర్ణయం తీసుకున్నారు. ఆయన సారథ్యంలో ఏర్పాటైన ఈ ఫుల్ బెంచ్‌లో న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీ కూడా ఉంటారు. వివాదంపై మంగళ, బుధవారాల్లో విచారణ జరిపిన జస్టిస్ దీక్షిత్ నివేదన మేరకు సీజే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ దీక్షిత్ ముందు ఇరు పక్షాలు వాడివేడిగా వాదనలు విన్పించాయి. పరీక్షలు రెండు నెలలే ఉన్నందున ప్రస్తుతానికి మధ్యంతర ఉత్తర్వులైనా ఇవ్వాలని పిటిషనర్లు అభ్యర్థించారు. విద్యార్థినులు తమ మత విశ్వాసాలను అనుసరించేందుకు అనుమతించాలని వారి తరఫు లాయర్ దేవదత్త కామత్ కోరారు. ఇందుకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవద్గీ అభ్యంతరం తెలిపారు. ఈ దశలో అలాంటి ఉత్తర్వులివ్వడం పిటిషన్‌ను అనుమతించడమే అవుతుందని వాదించారు. విద్యార్థులు విధిగా డ్రెస్ కోడ్‌ను పాటిస్తూ తరగతులకు హాజరు కావాలన్నారు. కాలేజీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ (సీడీఎంసీ) తరఫున హాజరైన లాయర్ సజన్ పూవయ్య కూడా మధ్యంతర ఉత్తర్వులను వ్యతిరేకించారు. ప్రస్తుత యూనిఫారాలు ఏడాదిగా అమల్లో ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ‘‘తల్లిదండ్రులు, టీచర్లు తదితరులందరితో కూడిన సీడీఎంసీ ఏటా సమావేశమై యూనిఫాం తదితరాలపై ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు తీసుకుంటుంది. యూనిఫాంపై ఇప్పటిదాకా లేని అభ్యంతరాలు ఇప్పడెందుకు?’’ అని ప్రశ్నించారు. మధ్యంతర ఉత్తర్వులపై కూడా విస్తృత ధర్మాసనమే నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. -
హిజాబ్ వర్సెస్ కండువా.. కర్ణాటక సర్కార్ కీలక ఉత్తర్వులు
కర్ణాటకలో ‘హిజాబ్’ వివాదం.. పార్టీల పరస్పర రాజకీయ విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వివాదం మరింత ముదరకముందే చెక్ పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం రంగంలోకి దిగింది. శాంతి భద్రతలను దెబ్బతీసే రీతిలో విద్యాసంస్థల్లో విద్యార్థులు దుస్తుల్ని ధరించడానికి వీల్లేదంటూ తాజా ఉత్తర్వుల్లో నిషేధాజ్క్షలు జారీ చేసింది. కర్ణాటకలోని విద్యాసంస్థల్లో ముస్లిం బాలికలు హిజాబ్స్ ధరించి తరగతి గదులకు హాజరవుతుండడంపై గత నెలరోజులుగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు. ఈ క్రమంలో నెల రోజుల నుంచి ఉడుపి, చిక్మగళూరులో పరిణామాలు వాడీవేడిగా సాగాయి. హిజాబ్స్ ధరించిన బాలికలను స్కూళ్లకు అనుమతించకపోగా.. ప్రతిగా అది ధరించడం తమ హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు. ఈ తరుణంలో.. కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించడంతో.. వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్నట్లు అయ్యింది. దీంతో శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసేంది కర్ణాటక ప్రభుత్వం. ఎంపిక చేసిన డ్రెస్ కోడ్ కర్ణాటక విద్యా చట్టం-1983లోని సెక్షన్ 133 (2) ప్రకారం.. యూనిఫాం ఒకే తరహా దుస్తులను తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది. ప్రైవేట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ తమకు నచ్చిన యూనిఫామ్‌ను ఎంచుకోవచ్చు అని ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొంది. విద్యార్థులు అధికారులు ఎంపిక చేసిన డ్రెస్ కోడ్‌నే అనుసరించాలని స్పష్టం చేసింది. అయితే.. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ యూనిఫాంను ఎంపిక చేయని సందర్భంలో.. సమానత్వం, సమగ్రత మరియు ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే రీతిలో దుస్తులను ధరించకూడదంటూ ఆ ఉత్తర్వులు పేర్కొనడం గమనార్హం. కొన్ని విద్యాసంస్థల్లో బాలబాలికలు తమ మతం ప్రకారం ప్రవర్తించడంతో సమానత్వం, ఐక్యత దెబ్బతింటున్నట్లు తాము గుర్తించామని ఈ సందర్భంగా విద్యాశాఖ పేర్కొంది. సమీక్షల అనంతరం.. ఉడుపి, చిక్కమగళూరు ముస్లిం బాలికలు హిజాబ్స్ ధరించడంపై అభ్యంతరాలు(తరగతి గదుల్లో మాత్రం వద్దనే) వ్యక్తంగా.. శనివారం ఉడుపి కుండాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి.. ‘జై శ్రీరామ్’ నినాదాలతో ర్యాలీలు నిర్వహించిన వీడియోలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. మరోవైపు హిజాబ్ వ్యవహారం కోర్టు గడప తొక్కగా(హిజాబ్ ఆంక్షలను వ్యతిరేకిస్తూ.. ఐదుగురు బాలికల తరపున పిటిషన్ దాఖలైంది).. మంగళవారం(ఫిబ్రవరి 8న) పిటిషన్‌ను విచారణ చేపట్టనుంది హైకోర్టు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే శుక్రవారం నుంచి ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై.. విద్యా శాఖతో, న్యాయ శాఖతో సంప్రదింపులు జరిపారు. శనివారం సాయంత్రం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక బాలికలు తరగతుల్లో హిజాబ్ ధరించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ‘తాలిబనైజేషన్’ ప్రోత్సహించినట్లు అవుతుందంటూ బీజేపీ నేతలు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ హిజాబ్ విషయంలో బాలికలకు మద్దతుగా నిలుస్తోంది. రాహుల్ గాంధీ సైతం స్పందించారు. ఇక ఈ వ్యవహారంపై మాజీ సీఎంల స్పందన మరోలా ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య.. బీజేపీ, ఆరెస్సెస్‌లపై మండిపడగా, హెచ్డీ కుమారస్వామి.. బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకు అనుమతించబడిన ప్రదేశాలలో హిజాబ్‌లను అనుమతించండి, ఈ మధ్య పర్మిషన్ ఇచ్చిన ప్లేసుల్లో మాత్రం నిషేధించండి’ అంటూ కుమారస్వామి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. We're ready for a change in the colour of the hijab in order to match it with the uniform but we cannot leave it. I wear hijab to the Assembly as well, they can stop me if they can. A memorandum will go to the CM & we'll protest in Udupi later: Congress MLA Kaneez Fatima pic.twitter.com/FwkgR3CbR3 — ANI (@ANI) February 6, 2022 -
తొలి రోజు.. అంతంతే హాజరు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ థర్డ్‌వేవ్ నేపథ్యంలో మూతపడ్డ విద్యాసంస్థలు మంగళవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో తొలిరోజు 32.47 శాతం విద్యార్థులు హాజరయ్యారు. పలు చోట్ల అమావాస్య కారణంగా కొన్ని ప్రైవేటు పాఠశాలలు తెరవకుండా ఆన్లైన్లోనే విద్యాబోధన కొనసాగించారు. మిగిలిన చోట్ల కోవిడ్ నిబంధనలు పాటిస్తూ థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ తప్పని సరిచేయగా.. విద్యార్థుల హాజరే స్వల్పంగా ఉండటంతో బెంచీకి ఒకరు, ఇద్దరు చొప్పునే కూర్చున్నారు. సిద్దిపేట, అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాలో 51.17 శాతం, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 19.8 శాతం విద్యార్థులు హాజరయ్యారు. అత్యధిక విద్యార్థుల సంఖ్య కలిగిన హనుమకొండ మర్కజీ పాఠశాలలో 1,108 మంది విద్యార్థులకు 212 మంది, మెదక్ జిల్లా కౌడిపల్లిలో 440 మందికి కేవలం ఎనిమిది మంది మాత్రమే హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని జెడ్పీ బాలికల హైస్కూల్లో పదో తరగతిలో కేవలం నలుగురు విద్యార్థినులు మాత్రమే హాజరయ్యారు. 8, 9, 10 తరగతుల్లో కలిపి మొత్తం 507 మంది విద్యార్థినులు ఉండగా 29 మంది వరకు హాజరయ్యారు. జనగామ రైల్వే ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు హాజరయ్యారు.