Nutrify Today world's first launches nutraceuticals academy: కరోనా తర్వాత ఆరోగ్యరంగంతో పాటు అనుబంధ రంగాలన్నింటిలోనూ పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. అదే విధంగా పోషకాహార రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఔషధాల రూపంలో పోషకాలను అందించే న్యూట్రాస్యూటికల్స్ రంగం శరవేగంగా పురోగమిస్తోంది. ప్రస్తుతం అమెరికా తదితర దేశాల్లో భారత న్యూట్రాస్యూటికల్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపధ్యంలో మన స్వదేశీ సంస్థ న్యూట్రిఫై టుడే ఈ రంగాన్ని మరింత వృద్ధిలోకి తెచ్చే చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఒక అకాడమీకి రూపకల్పన చేసింది.
నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా..
ప్రపంచంలోనే ప్రప్రధమ న్యూట్రాస్యూటికల్స్ అకాడమీని న్యూట్రిఫై టుడే (https://academy.nutrifytoday.com/) ప్రారంభించింది. పరిశ్రమ వృద్ధితో పాటుగా న్యూట్రాస్యూటికల్స్ విభాగంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌లకు అవసరమైన నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఇది ఏర్పాటైంది. తొలి దశలో ముంబై, బెంగళూరులలో న్యూట్రిఫీ టుడే అకాడీమ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. భారత్, ఆసియా దేశాలే కాకుండా ఆన్‌లైన్ కరిక్యులమ్ ద్వారా ఇతర దేశాలకు విస్తరించనుంది. గీతం, సెంచురియన్ యూనివర్శిటీ, ఏఐసీసీసీఎంబీ, నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసన్ వంటి పలు యూనివర్శిటీలు న్యూట్రిఫీ టుడే అకాడమీతో ఒప్పందాలు ఏర్పరచుకున్నాయి.
చదవండి: Health Benefits Of Saffron: కుంకుమ పువ్వు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
100బిలియన్ డాలర్ల పరిశ్రమగా...
న్యూట్రిఫై టుడే చీఫ్ క్యాటలిస్ట్ అమిత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ‘‘న్యూట్రాస్యూటికల్ ఇంగ్రీడియెంట్ ఫార్ములేషన్‌లో కెరీర్ కోరుకుంటున్న, ఫార్మా, ఫుడ్ టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు తగిన అవకాశాలను న్యూట్రిఫీ టుడే అకాడమీ అందిస్తుంది. రానున్న 2024 నాటికి 5వేల మంది ప్రొఫెషనల్స్‌కు శిక్షణ అందించగలమని అంచనా వేస్తున్నాం. మరోవైపు ప్రస్తుతం ఈ రంగానికి సంబంధించి భారత్ 8 మిలియన్‌డాలర్ల మార్కెట్‌గా ఉంది. అయితే ఇక్కడ నుంచి ఎగుమతులు గణనీయంగా జరుగనున్నాయి.. ఈ రంగంలోని వాటాదారుల అంచనా ప్రకారం 2025 నాటికి ఈ పరిశ్రమ 40బిలియన్‌డాలర్లను, 2030 నాటికి 100 బిలియన్‌డాలర్ల విలువ కలిగి ఉంటుంది’’ అని చెప్పారు.
ఈ ప్రపంచ ప్రప్రధమ న్యూట్రిఫై టుడే అకాడమీ రూపకల్పనలో డాక్టర్ బాల్‌కుమార్ మరాఠీ, పూర్వ ఆర్ అండ్ డీ హెడ్ ఆఫ్ యునిలీవర్; బ్రిజెష్ కపిల్, పూర్వ ప్రొక్టర్ అండ్ గాంబెల్ ఇండియా బోర్డ్ మెంబర్ ; నాజ్నిన్ హుస్సెన్, పూర్వ అధ్యక్షుడు ఇండియన్ డైటిటిక్స్ అసోసియేషన్ ఓపినియన్ లీడర్ బేకర్ డిల్లాన్ గ్రూప్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షెల్డన్ బేకర్‌లు కీలకపాత్ర పోషించారు.
చదవండి: అబల కాదు.. ఐరన్ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!!
Comments
Please login to add a commentAdd a comment