chemical engineering
-
‘గేట్’ మనోళ్లదే! ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సొంతం
సాక్షి, హైదరాబాద్/కాజీపేట అర్బన్/మధిర: ఐఐటీలు, ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లోని మాస్టర్ డిగ్రీలో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్(గేట్)–2022 ఫలితాలను గురువారం ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మాచర్ల ప్రణీత్ కుమార్, మణి సందీప్‌రెడ్డి ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించారు. గేట్ కోసం దేశవ్యాప్తంగా 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు 7,11,542 మంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మందికిపైగా గేట్ రాశారు. దేశవ్యాప్తంగా 1,26,813 (17.82 శాతం) మంది అర్హత పొందారు. మొత్తం 100 మార్కులుండే ఈ పరీక్షకు ఈసారి 25 మా ర్కులు అర్హత(కటాఫ్)గా నిర్ణయించారు. ర్యాంకుల వివరాలు, డౌన్లోడ్ కోసం gate.iitkgp.ac.in వెబ్‌సైట్‌ను లాగిన్ కావాలని ఐఐటీ ఖరగ్‌పూర్ తెలిపింది. గేట్లో మొదటి ర్యాంకు సాధించిన వరంగల్ నిట్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఫైనలియర్ విద్యార్థి మణి సందీప్‌రెడ్డికి ఆ సంస్థ డైరెక్టర్ ఎన్వీ రమణారావు గురువారం మొక్కను బహూకరించి అభినందించారు. అదేవిధంగా నిట్ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన హర్దీప్ 42వ ర్యాంకు సాధించాడు. స్వీయశిక్షణతోనే టాప్‌ర్యాంక్:మణి సందీప్‌రెడ్డి గేట్లో మొదటిర్యాంకు పొందడం సంతోషంగా ఉంది. రాజమండ్రికి సమీపంలోని వెదురుపాక సొంతూరు అయినప్పటికీ, టెన్త్, ఇంటర్ హైదరాబాద్‌లోనే చదువుకున్నాను. మా నాన్న రామగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌తోపాటు షాపు నిర్వహిస్తాడు. అమ్మ ఐశ్వర్య భాగ్యలక్ష్మి గృహిణి. ఇంజనీరింగ్ చేస్తూనే సొంతంగా గేట్‌కు ఆరునెలలపాటు తర్ఫీదు అయ్యాను. మార్కెట్లో దొరికే వివిధ రకాల స్టడీ మెటీరియల్స్‌తో నా ప్రిపరేషన్ అయ్యాను. పేద కుటుంబంలో విద్యాకుసుమం ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన మాచర్ల శ్రీనివాసరావు– రమామణి దంపతుల కుమారుడు ప్రణీత్‌కుమార్ అలహాబాద్ నిట్‌లో బీటెక్(ఈఈఈ) పూర్తిచేశారు. శ్రీనివాసరావు స్థానిక సీపీఎస్ రోడ్డులో బడ్డీకొట్టు ఏర్పాటు చేసుకుని దారాలు, గుండీలు వంటి టైలరింగ్ మెటీరియల్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. పేద కుటుంబమే అయినా కష్టపడుతూ కుమారుడిని చదివించారు. మాచర్ల శ్రీనివాసరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ రేయింబవళ్లు కష్టపడి చదివిన ప్రణీత్ జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించటం సంతోషంగా ఉందన్నారు. ప్రణీత్‌కుమార్ ఫోన్లో మాట్లాడుతూ చిరు వ్యాపారం చేసే తన తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూసిన పట్టుదలతో చదివినట్లు తెలిపారు. తెనాలి యువకుడికి 21వ ర్యాంకు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన ఆళ్ల శేషసాయిరెడ్డి 21వ ర్యాంకు సాధించారు. ఈయన ప్రస్తుతం కోల్ ఇండియాలో డిప్యూటీ మేనేజరుగా పనిచేస్తున్నారు. మరోవైపు యూపీఎస్సీ నిర్వహిం చిన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ (ఐఈఎస్) ఇంటర్వ్యూకూ హాజరయ్యారు. ఈయన తల్లి దీపలత సెకండరీ గ్రేడ్ టీచరు కాగా.. తండ్రి ఆళ్ల రవీంద్రారెడ్డి రైతు. శేషసాయిరెడ్డి నాగపూర్ ఎన్ఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చదివా రు. బెంగళూరులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సీటు.. ఎంటెక్ చేయటం, తర్వాత పీహెచ్డీ పూర్తిచేయాలని ఉందని ఆయన చెప్పారు. ఐఈఎస్‌లో జాబ్ వస్తే మరింత సంతోషమన్నారు. -
న్యూట్రాస్యూటికల్స్ విప్లవం.. మస్తుగా కెరీర్ అవకాశాలు!!
Nutrify Today world's first launches nutraceuticals academy: కరోనా తర్వాత ఆరోగ్యరంగంతో పాటు అనుబంధ రంగాలన్నింటిలోనూ పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. అదే విధంగా పోషకాహార రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఔషధాల రూపంలో పోషకాలను అందించే న్యూట్రాస్యూటికల్స్ రంగం శరవేగంగా పురోగమిస్తోంది. ప్రస్తుతం అమెరికా తదితర దేశాల్లో భారత న్యూట్రాస్యూటికల్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపధ్యంలో మన స్వదేశీ సంస్థ న్యూట్రిఫై టుడే ఈ రంగాన్ని మరింత వృద్ధిలోకి తెచ్చే చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఒక అకాడమీకి రూపకల్పన చేసింది. నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా.. ప్రపంచంలోనే ప్రప్రధమ న్యూట్రాస్యూటికల్స్ అకాడమీని న్యూట్రిఫై టుడే (https://academy.nutrifytoday.com/) ప్రారంభించింది. పరిశ్రమ వృద్ధితో పాటుగా న్యూట్రాస్యూటికల్స్ విభాగంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌లకు అవసరమైన నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఇది ఏర్పాటైంది. తొలి దశలో ముంబై, బెంగళూరులలో న్యూట్రిఫీ టుడే అకాడీమ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. భారత్, ఆసియా దేశాలే కాకుండా ఆన్లైన్ కరిక్యులమ్ ద్వారా ఇతర దేశాలకు విస్తరించనుంది. గీతం, సెంచురియన్ యూనివర్శిటీ, ఏఐసీసీసీఎంబీ, నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసన్ వంటి పలు యూనివర్శిటీలు న్యూట్రిఫీ టుడే అకాడమీతో ఒప్పందాలు ఏర్పరచుకున్నాయి. చదవండి: Health Benefits Of Saffron: కుంకుమ పువ్వు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? 100బిలియన్ డాలర్ల పరిశ్రమగా... న్యూట్రిఫై టుడే చీఫ్ క్యాటలిస్ట్ అమిత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ‘‘న్యూట్రాస్యూటికల్ ఇంగ్రీడియెంట్ ఫార్ములేషన్‌లో కెరీర్ కోరుకుంటున్న, ఫార్మా, ఫుడ్ టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు తగిన అవకాశాలను న్యూట్రిఫీ టుడే అకాడమీ అందిస్తుంది. రానున్న 2024 నాటికి 5వేల మంది ప్రొఫెషనల్స్‌కు శిక్షణ అందించగలమని అంచనా వేస్తున్నాం. మరోవైపు ప్రస్తుతం ఈ రంగానికి సంబంధించి భారత్ 8 మిలియన్‌డాలర్ల మార్కెట్‌గా ఉంది. అయితే ఇక్కడ నుంచి ఎగుమతులు గణనీయంగా జరుగనున్నాయి.. ఈ రంగంలోని వాటాదారుల అంచనా ప్రకారం 2025 నాటికి ఈ పరిశ్రమ 40బిలియన్డాలర్లను, 2030 నాటికి 100 బిలియన్డాలర్ల విలువ కలిగి ఉంటుంది’’ అని చెప్పారు. ఈ ప్రపంచ ప్రప్రధమ న్యూట్రిఫై టుడే అకాడమీ రూపకల్పనలో డాక్టర్ బాల్కుమార్ మరాఠీ, పూర్వ ఆర్ అండ్ డీ హెడ్ ఆఫ్ యునిలీవర్; బ్రిజెష్ కపిల్, పూర్వ ప్రొక్టర్ అండ్ గాంబెల్ ఇండియా బోర్డ్ మెంబర్ ; నాజ్నిన్ హుస్సెన్, పూర్వ అధ్యక్షుడు ఇండియన్ డైటిటిక్స్ అసోసియేషన్ ఓపినియన్ లీడర్ బేకర్ డిల్లాన్ గ్రూప్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షెల్డన్ బేకర్లు కీలకపాత్ర పోషించారు. చదవండి: అబల కాదు.. ఐరన్ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!! -
ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
విశాఖపట్నం : ఎంబీఏ, ఎంసీఏల్లో ప్రవేశానికి ఐసెట్ ర్యాంకర్ల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం ప్రారంభమయింది. ఉదయం 9 గంటలకే అభ్యర్థులు పాలిటెక్నిక్, కెమికల్ ఇంజినీరింగ్ కేంద్రాలకు చేరుకున్నా ఆన్లైన్ 10.30 గంటలకు ఓపెన్ అయింది. దీంతో సాయంత్రం 6 గంటల వరకు విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. మొదటిరోజు కావడంతో ఆన్లైన్ తెరుచుకోవడం కాస్త ఆలస్యమైనా గురువారం నుంచి 9 గంటలకే వివరాల నమోదు ప్రారంభమవుతుందని ప్రిన్సిపాల్ కె.సంధ్యారాణి, డాక్టర్ బి.దేముడు చెప్పారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఒకటి నుంచి 12,500 ర్యాంకుల వరకు పరిశీలించగా 350 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలలో 12,501 నుంచి 25 వేల వరకు ర్యాంకులు పరిశీలించగా 273 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. గురువారం పాలిటెక్నిక్ కళాశాలలో 25,001 నుంచి 37,500 ర్యాంకుల వరకు, కెమికల్ ఇంజనీరింగ్ కళాశాలలో 37,501 నుంచి 50 వేల ర్యాంక్‌ల వరకు ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. అభ్యర్థులు 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లు చూపాల్సి ఉంటుంది. -
ఉద్యోగాలు
నిట్, తిరుచిరాపల్లి తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగాలు: ఆర్కిటెక్చర్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్, హ్యుమానిటీస్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ స్టడీస్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్. ఎంపిక: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా. చివరి తేది: అక్టోబర్ 8 వెబ్సైట్: http://www.nitt.edu హిందూస్థాన్ షిప్‌యార్డ్ హిందూస్థాన్ షిప్‌యార్డ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కేర్‌టేకర్ షిప్ బిల్డింగ్ సబ్‌మెరైన్ రిపేర్స్ సెక్యూరిటీ అండ్ ఫైర్ సర్వీస్ హెచ్ఆర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సివిల్ వర్క్స్ పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. చివరి తేది: సెప్టెంబరు 15 వెబ్సైట్:http://www.hsl.gov.i -
అంతా ఒడుదొడుకుల ప్రయాణం...
సందర్భం నగేష్ కుకునూర్ బర్త్‌డే సినిమా అనేది మనసుకు స్వాంతన ఇవ్వాలి... మెదడులో ఆలోచన రేకెత్తించాలి. సృజనాత్మక దర్శకుడు నగేష్ కుకునూర్ స్ట్రాటజీ ఇదే. 16 ఏళ్లుగా ఆయనది ఇదే పంథా. అందుకే 12 సినిమాలే చేసినా జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. నగేష్ స్వస్థలం హైదరాబాద్. తన గురించిన ప్రతి అంశం ఆసక్తికరమే. ఆయన కెరీర్, అభిప్రాయాలపై స్పెషల్ ఫోకస్... చదివింది కెమికల్ ఇంజినీరింగ్. కానీ, మనసు పడింది నటన, దర్శకత్వంపై. ఆ సినిమా పిచ్చితోనే విదేశంలో ఉద్యోగాన్ని సైతం వదిలేసుకుని, హైదరాబాద్‌లో అడుగుపెట్టారు నగేష్. అప్పుడంతా మాస్ మసాలా సినిమాల హవా నడుస్తోంది. తను కూడా ఆ గుంపులో గోవిందయ్య కాదలచుకోలేదు నగేష్. సమ్‌థింగ్ డిఫరెన్స్ చూపించాలనుకున్నారు. అలా, ‘వన్ కల్చర్ ఎట్ ఎ టైమ్’ అనే లఘు చిత్రం తీశారు. ఆ తర్వాత ‘హైదరాబాద్ బ్లూస్’కి శ్రీకారం చుట్టారు. 17 లక్షలు... 17 రోజులు మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కథతో ‘హైదరాబాద్ బ్లూస్’ని తెరకెక్కించారు నగేష్. విదేశాల్లో తను సంపాదించిన డబ్బునంతా ఈ సినిమాకి పెట్టేశారు. 17 లక్షల బడ్జెట్‌తో 17 రోజుల్లో ‘హైదరాబాద్ బ్లూస్’ని స్వీయదర్శకత్వంలో రూపొందించడంతో పాటు నటించారు. 1998లో ఈ చిత్రం విడుదలై, భేష్ అనిపించుకుంది. ఈ సినిమాలోని సంభాషణలు ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషల్లో ఉంటాయి. సినిమా చూసినవాళ్లు ‘రియలిస్టిక్ మూవీ’ అని ప్రశంసించారు. ఈ జానర్లో కూడా సినిమా తీయొచ్చా అనుకున్నారు. రిస్క్ లేని జీవితం బాగుండదని... తొలి సినిమా విడుదల చేయడానికి చాలా కష్టాలు పడినప్పటికీ తన పంథా మార్చుకోలేదు నగేష్. హైస్కూల్ నేపథ్యంలో ‘రాక్‌ఫోర్డ్’ తీశారు. జంట నగరాల్లో అప్పుడప్పుడే పైకొస్తున్న నటీనటులను ఈ చిత్రంలో నటింపజేశారు. ఇది కూడా రియలిస్టిక్ సినిమానే. ఒకవైపు పక్కా కమర్షియల్ చిత్రాలు రాజ్యమేలుతున్న తరుణంలో, అందుకు భిన్నంగా పూర్తిగా సహజ చిత్రాలు తీయడానికి ఎంత ధైర్యం ఉండాలి? అని రెగ్యులర్ ఫిలిం మేకర్స్ అనుకున్నారు. కానీ, నగేష్ ఆలోచన ఒక్కటే. ‘‘ఇలాంటి సినిమాలే ప్రేక్షకులు చూస్తారని ఫిక్స్ అవ్వడానికి మనమెవరం? ఒకే రకం సినిమాలిస్తే, ప్రేక్షకుల ఆలోచనా పరిధి ఎలా పెరుగుతుంది? కొత్త సినిమాలు తీయకపోతే వాళ్లకి కొత్త కొత్త అనుభవాలు ఎలా కలుగుతాయి? ప్రేక్షకులకు మనం డిఫరెంట్ మూవీస్ ఇవ్వకపోతే ఎలా?’’ అంటారాయన. అది రిస్క్ కదా అంటే.. రిస్క్ లేని జీవితం ఏం బాగుంటుందని నవ్వేస్తారు. అందుకే, ఆ తర్వాత కూడా బాలీవుడ్ కాలింగ్, 3 దీవారేన్, ఇక్బాల్, డోర్.. ఇలా సామాజిక సృ్పహ ఉన్న చిత్రాలనే తీశారు. ఇటీవల తీసిన ‘లక్ష్మీ’ కూడా ఈ కోవకు చెందినదే. అమ్మాయిలను మాయలో పడేసి అమ్మేయడం, చిన్న వయసులోనే బలవంతంగా వేశ్యలుగా మార్చడం.. ఇలా సమాజంలో జరుగుతున్న అంశాలతో ఈ సినిమా తీశారు నగేష్. అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ ‘సెన్సార్’పరంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు ‘లక్ష్మీ’ తెరకొచ్చింది. ప్రేక్షకులు, విశ్లేషకులు ‘భేష్’ అన్నారు. రీచార్జ్ కావాలి... పదహారేళ్లల్లో పన్నెండు సినిమాలే తీసినా, నగేష్‌కి మంచి పేరు వచ్చింది. కానీ, చిన్న చిత్రాల నిర్మాణానికి ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కోవాలి. ఫైనాన్షియర్లు ముందుకు రారు. పంపిణీదారులూ ఇలాంటి రియలిస్టిక్ సినిమాలంటే పరారవుతారు. మరి.. ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తుంటే, అలుపు రావడంలేదా అంటే.. ‘‘చాలా అలిసిపోయాను’’ అని నిజాయితీగా చెబుతారు నగేష్. ‘‘మన చేతిలో ఓ వివేకవంతమైన సినిమా ఉన్నా, అది ప్రేక్షకులకు దగ్గరవ్వాలంటే భారీ ఎత్తున ప్రచారం చేయాలి. దానికి బాగా ఖర్చు పెట్టాలి. ఎందుకులే అని వదిలేస్తే, పడిన కష్టమంతా వృథా అయిపోతోంది. కానీ, ఇవాళ పబ్లిసిటీ ప్రధానం కాబట్టి, ఖర్చు పెట్టక తప్పడంలేదు. ఓ కమర్షియల్ సినిమా తీసినప్పుడు ఉండేంత హాయి చిన్న బడ్జెట్, రియలిస్టిక్ సినిమాలకు ఉండదు. కానీ, నాకీ దారే బాగుంది. ప్రస్తుతానికి అలసిపోయినట్లనిపిస్తుంది. కానీ, ఓ కొత్త కథ తయారు చేయాలనే ఆలోచన రాగానే మళ్లీ రీచార్జ్ అయిపోతా. ఈ ఒడుదొడుకుల ప్రయాణం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది’’ అంటున్నారు నగేష్.