విశాఖపట్నం : ఎంబీఏ, ఎంసీఏల్లో ప్రవేశానికి ఐసెట్ ర్యాంకర్ల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం ప్రారంభమయింది. ఉదయం 9 గంటలకే అభ్యర్థులు పాలిటెక్నిక్, కెమికల్ ఇంజినీరింగ్ కేంద్రాలకు చేరుకున్నా ఆన్‌లైన్ 10.30 గంటలకు ఓపెన్ అయింది. దీంతో సాయంత్రం 6 గంటల వరకు విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు.
మొదటిరోజు కావడంతో ఆన్‌లైన్ తెరుచుకోవడం కాస్త ఆలస్యమైనా గురువారం నుంచి 9 గంటలకే వివరాల నమోదు ప్రారంభమవుతుందని ప్రిన్సిపాల్ కె.సంధ్యారాణి, డాక్టర్ బి.దేముడు చెప్పారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఒకటి నుంచి 12,500 ర్యాంకుల వరకు పరిశీలించగా 350 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలలో 12,501 నుంచి 25 వేల వరకు ర్యాంకులు పరిశీలించగా 273 మంది పేర్లు నమోదు చేసుకున్నారు.
గురువారం పాలిటెక్నిక్ కళాశాలలో 25,001 నుంచి 37,500 ర్యాంకుల వరకు, కెమికల్ ఇంజనీరింగ్ కళాశాలలో 37,501 నుంచి 50 వేల ర్యాంక్‌ల వరకు ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. అభ్యర్థులు 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లు చూపాల్సి ఉంటుంది.
ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
Published Thu, Sep 18 2014 1:53 AM | Last Updated on Tue, Sep 18 2018 7:45 PM
Advertisement