icet counselling
-
ఐసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడో!
* ఇప్పటివరకూ విడుదల కాని నోటిఫికేషన్ * కొనసాగుతున్న వాయిదాల పర్వం * విద్యాసంవత్సరం ప్రారంభమై వారం గడిచినా రాని స్పష్టత * పట్టించుకోని ఉన్నత విద్యా మండలి * ఆందోళనలో వేల మంది విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్-2015 కౌన్సెలింగ్ కోసం విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ ఏడాది మే 22న ప్రవేశ పరీక్ష నిర్వహించినా కౌన్సెలింగ్ నిర్వహణపై ఉన్నత విద్యా మండలి ఇప్పటివరకూ చర్యలు చేపట్టలేదు. కాలేజీల అనుబంధ గుర్తింపు విషయంలో యూనివర్సిటీలతో చర్చించడంలో విద్యామండలి అలసత్వం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వస్తున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై వారం రోజులు గడిచినా ఐసెట్ కౌన్సెలింగ్‌పై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఐసెట్‌లో అర్హత సాధించిన 58,037 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ కోసం నిరీక్షణ తప్పేలా లేదు. జూలైలోనే జరగాల్సింది.. మేలో జరిగిన ఐసెట్ ఫలితాలు జూన్‌లోనే వెలువడ్డాయి. పరీక్షకు 63,490 మంది విద్యార్థులు హాజరుకాగా 58,037 మంది అర్హత సాధించారు. జూలై 11న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఐసెట్ ఫలితాల విడుదల సందర్భంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. 17న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 18 నుంచి 22 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 25న సీట్లు కేటాయిస్తామన్నారు. అయితే ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోలేదు. కాలేజీలకు అనుబంధ గుర్తింపు రాకపోవడంతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. కాగా, ఆగస్టు 3 నుంచి కౌన్సెలింగ్ చేపడతామని విద్యా శాఖ గతంలో పేర్కొనగా, అదీ ఆచరణలోకి రాలేదు. ఇప్పటివరకు ప్రవేశాల కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వెలువడకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత విద్యా మండలి త్వరగా ప్రవేశాలకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
విశాఖపట్నం : ఎంబీఏ, ఎంసీఏల్లో ప్రవేశానికి ఐసెట్ ర్యాంకర్ల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం ప్రారంభమయింది. ఉదయం 9 గంటలకే అభ్యర్థులు పాలిటెక్నిక్, కెమికల్ ఇంజినీరింగ్ కేంద్రాలకు చేరుకున్నా ఆన్లైన్ 10.30 గంటలకు ఓపెన్ అయింది. దీంతో సాయంత్రం 6 గంటల వరకు విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. మొదటిరోజు కావడంతో ఆన్లైన్ తెరుచుకోవడం కాస్త ఆలస్యమైనా గురువారం నుంచి 9 గంటలకే వివరాల నమోదు ప్రారంభమవుతుందని ప్రిన్సిపాల్ కె.సంధ్యారాణి, డాక్టర్ బి.దేముడు చెప్పారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఒకటి నుంచి 12,500 ర్యాంకుల వరకు పరిశీలించగా 350 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలలో 12,501 నుంచి 25 వేల వరకు ర్యాంకులు పరిశీలించగా 273 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. గురువారం పాలిటెక్నిక్ కళాశాలలో 25,001 నుంచి 37,500 ర్యాంకుల వరకు, కెమికల్ ఇంజనీరింగ్ కళాశాలలో 37,501 నుంచి 50 వేల ర్యాంక్‌ల వరకు ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. అభ్యర్థులు 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లు చూపాల్సి ఉంటుంది. -
10 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకోసం ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియును ఈనెల 10న ప్రారంభించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నెల 10నుంచి 15వరకు సర్టిఫికెట్ల తనిఖీ, 15నుంచి 21 వరకు వెబ్ఆప్షన్ల నమోదు, 23వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని నోటిఫికేషన్ తెలిపింది. సర్టిఫికెట్ల తనిఖీ కోసం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రా ల వివరాలను ఈనెల 8న https://apicet.nic.in వెబ్సైట్లో పొందుపరుస్తావుని అడ్మిషన్ల క్యాంపు ప్రధా న అధికారి డాక్టర్ కె. రఘునాథ్ తెలిపారు. వికలాంగు లు, సైనికోద్యోగుల పిల్లలు, ఎన్సీసీ, క్రీడలు, ఆంగ్లో ఇండియన్ తదితర ప్రత్యేక కేటగిరీల కింద రిజర్వేషన్ కింద సీటు పొందదలుచుకున్న అభ్యర్థులు హైదరాబాద్ ,. మాసబ్ట్యాంక్వద్ద సాంకేతిక విద్యాభవన్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను వెబ్సైట్లో పొందుపరిచారు. 25,700 మంది వెబ్ఆప్షన్లు నమోదు ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 3, 4 తేదీల్లో 1 నుంచి 40 వేల ర్యాంకు వరకు నిర్వహించిన వెబ్‌కౌన్సెలింగ్‌లో 25,700 మంది అభ్యర్థులు వెబ్ఆప్షన్లు ఇచ్చినట్టు రఘునాథ్ తెలిపారు. 40 వేల లోపు 26వేల మంది ర్యాంకర్లు సర్టిఫికెట్ల తనిఖీకి హాజరైనా, 300 మంది వెబ్ఆప్షన్లు నమోదు చేయలేదన్నారు.