- కాగిత రహిత కార్యాలయంగా ప్రణాళికలు
- ఆన్‌లైన్లో వాణిజ్య సముదాయాల వివరాలు
- చర్యలు వేగవంతం చేస్తున్న వీసీ యువరాజ్
సాక్షి, విశాఖపట్నం: వుడాను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఆ సంస్థ వీసీ డాక్టర్ ఎన్.యువరాజ్ చర్యలు చేపట్టారు. సేవల్లో పారదర్శకతకు పె ద్దపీట వేయడంతోపాటు, సమాచారంలో గోప్యతకు తావులేకుండా ఏర్పా ట్లు చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన అన్ని సేవల్ని ఆన్‌లైన్‌ద్వారా కోరుకున్న వెంటనే పొందేందుకు వీలుగా కంప్యూటరీకరణ పనుల్ని వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే గు రువారం వివిధ విభాగాధిపతులు, ప రిపాలనాధికారులు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, కార్యనిర్వాహక ఇంజినీర్లతో స మీక్షించారు. పలు చర్యలపై దిశానిర్దేశనం చేశారు.
ప్రతిపాదనలు
కాగితరహిత కార్యాలయంగా వుడా ను మార్చేందుకు, సేవ ల్లో సరళతకు చేపట్టాల్సిన చర్యలన్ని సూచించారు.
వచ్చే నెలపై 5వ తేదీలోగా వుడా దుకాణాలు, వాణిజ్యసముదాయాలు, కార్యాలయ భవన సముదాయాల కేటాయింపుల వ్యవహారాలన్నీ ఆన్‌లైనీకరించి, అవసరమైనవారికి ఆన్‌లైన్ ద్వారానే కేటాయించనున్నారు.
విశాఖ, అనకాపల్లి, విజయనగరం తదితర ప్రాంతాల్లో వుడా అభివృద్ధి చేసిన దుకాణాలు, వాణిజ్య సముదాయాల పూర్తి వివరాలు, కే టాయింపుదారుల వివరాలు, చెల్లిం చాల్సిన అద్దెలు, బకాయిలు తది తర సమాచారాన్నంతా వెబ్‌సైట్లో పొందుపరచనున్నారు.
వుడాకు చెందిన సందర్శన కేంద్రాలు, పార్కుల్లో దుకాణాల కేటాయింపుల వివరాల్ని కూడా వేరేగా వెబ్‌సైట్లో చేర్చనున్నారు.
ఫిబ్రవరి నెలాఖరులోగా వుడాకు చెందిన ఆస్తులు, వాటి వివరాలనమోదుపై విభాగాలవారీ ఆస్తుల చిట్టా రూపొందించి, పూర్తి స్థాయిలో సమర్పించాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు.
ఇంజినీరింగ్, ఎస్టేట్ విభాగాలు అదనపు శ్రద్ధ వ హించాల్సిందిగా హెచ్చరించారు.
ఈ సమావేశంలో వుడా కార్యదర్శి డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్, చీఫ్ ఇంజినీరు ఐ.విశ్వనాథరావు, చీఫ్ అక్కౌంట్స్ ఆఫీసర్ డి.విజయభారతి, చీఫ్ అర్బన్ ప్లానర్ ఆర్.జె.విద్యుల్లత, ఎస్టేట్ అధికారి బి.భవానిదాసు, డీఎఫ్‌ఓ బి.రాజారావు, ఈఈలు, ఏఓలు పాల్గొన్నారు.