Forest Officials
-
ఆంధ్రా ఒడిషా బోర్డర్లో పెద్దపులి కలకలం
సాక్షి,శ్రీకాకుళం: ఆంధ్రా-ఒడిశా బోర్డర్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పెద్దపులి కదలికలతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. కాశీబుగ్గ రేంజ్ ఫారెస్ట్ అధికారి ఏ.మురళీకృష్ణ ఆదేశాల మేరకు ఇచ్ఛాపురం మండలంలోని పలు గ్రామాలలో పులి కోసం అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.ఒంటరిగా రాత్రిపూట పొలాలకు వెళ్లొద్దని గ్రామస్తులకు అటవీ అధికారులు సూచించారు.ఇటీవలే ఒడిశాలోని గంజాం జిల్లా జయంతిపురంలో యువకుడిపై పెద్దపులి దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది.ఇదీ చదవండి: AP: ఆమెకు టెర్రర్ -
మియాపూర్: ‘చిరుత కాదు.. అడవి పిల్లి’
హైదరాబాద్,సాక్షి: హైదరాబాద్ నగరంలోని మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత పులి సంచరించినట్లు నిన్న (శుక్రవారం) సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో తీవ్ర కలకలం రేపింది. ఆ వీడియోపై అటవీశాఖ అధికారులు క్లారీటీ ఇచ్చారు. మియాపూర్ సంచరించింది చిరుత పులి కాదని.. అడవి పిల్లిగా అధికారులు నిర్ధారించారు. శుక్రవారం మియాపూర్ మెట్రో స్టేషన్ పరిధిలో చిరుత సంచరిస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే అక్కడ సంచరించిన జంతువు.. చిరుత పులి కాదని.. అడవి పిల్లిగా అధికారులు తేల్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.చదవండి: కలెక్టర్..ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు? -
నంద్యాలలో చిరుత సంచారంతో కలకలం?
నంద్యాల జిల్లా: జిల్లా మిడుతూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమీపంలో చిరుత పులి కలకలం సృష్టించింది. అయితే స్థానికులు తమకు చిరుత కనిపించిందని చెప్పడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పాద ముద్రలు సేకరించారు. పాదముద్రలు సరిగ్గా లేకపోవడంతో.. అది పులినా లేక మరేదైనా జంతువు అన్నది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసతమైతే కెమెరాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. కాగా, కొద్ది నెలల క్రితం నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులోని పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మెహరున్నీసాపై తాజాగా చిరుతపులి దాడి చేసి తలను తినేసిన సంఘటన స్థానికులను కలచివేసింది. కట్టెపుల్లల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆమైపె చిరుతపులి దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.ఇదిలా ఉండగా మహానందిలోనూ చిరుతపులి సంచారంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. నంద్యాల, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని నల్లమల అడవి పరిసరాల్లో ఉన్న గ్రామాల సమీపంలో చిరుతపులులు సంచరిస్తున్నాయి. నెలల వ్యవధిలోనే నలుగురు చిరుతపులి దాడిలో గాయపడ్డారు. ఇటీవల అటవీశాఖలోని మూడాకుల గడ్డ ప్రాంతంలో ఉన్న లెపర్డ్ బేస్ క్యాంపులో విధులు నిర్వహించే అజీమ్‌బాషాపై చిరుతపులి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి చిరుత సంచరిస్తుందనే ప్రచారంతో స్థానికులు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. -
జీపీఎస్ ట్రాకర్‌తో రాబందు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో నాలుగు రోజులుగా కెమెరా లేని జీపీఎస్ ట్రాకర్‌తో తిరుగు తున్న రాబందును అటవీశాఖ అధికారు లు గురువారం చిన మిడిసిలేరు ప్రాంతంలో పట్టుకున్నారు. ఆదివారం నీరసంగా, కదల్లేని స్థితిలో నాయకకాలనీలోని ఏకలవ్య పాఠశాల సమీపంలో ఈ రాబందు కనిపించగా స్థానికులు మాంసాహారం పెట్టగా తినేసి వెళ్లిపోయింది. ఈ విషయం బయటపడటంతో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. అయితే మహారాష్ట్రకు చెందిన ముంబై నేచురల్ హిస్టరీ సొసైటీ వారు నాగపూర్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి ఆగస్టు 10న ఇలాంటి రాబందులను వదిలిపెట్టినట్లు తెలిసింది. ఈ రాబందు ఎక్కువ దూరం వెళ్లలేకపోతుండటాన్ని జీపీఎస్ ద్వారా గుర్తించిన అక్కడి అధికారులు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నట్లు తెలిసి అటవీశాఖ రాష్ట్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వగా చర్ల రేంజ్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. రేంజ్ కార్యాలయానికి తరలించి ఆహారం అందించి పశువైద్యుల ద్వారా పరీక్ష చేయిస్తున్నారు. కాగా, తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఈ రాబందు తిరుగుతుండటంతో మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు పోలీసులే పంపించారనే చర్చ జరిగింది. చివరకు పరిశోధనల కోసం విడిచిపెట్టినట్లు తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
UP: తోడేళ్ల దాడుల వెనక ప్రతీకార కోణం!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోంది. గత కొన్ని నెలలుగా తోడేళ్ల వరుస దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీటిని పట్టుకోవడం కోసం అధికారులు ‘ఆపరేషన్ భేడియా’ చేపట్టారు.అయినా ఇవి కొన్ని గ్రామాల్లోని ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటివరకు ఈ తోడేళ్ల దాడిలో మొత్తం ఎనిమిది మంది మృతిచెందగా.. అందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. అర్థరాత్రి సమయంలో చిన్నారులనే టార్గెట్ చేస్తున్నాయి ఈ తోడేళ్ల గుంపు.అయితే తాజాగా ఈ తోడేళ్లు సంబంధించి ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సంజయ్ పాఠక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తోడేళ్ల సైతం ప్రతికారం తీర్చుకోవటం కోసం దాడులు చేస్తాయని అన్నారు. ‘‘తోడేళ్లకు ప్రతీకారం తీర్చుకునే అలవాటు ఉంది. వాటి నివాసాలు, పల్లలకు హాని తలపెడితే.. మనుషులపై ప్రతీకారంతో దాడులు చేస్తాయి. ఈ దాడుల వెనక ప్రతీకార కోణం కూడా ఉండవచ్చనే అనుమానం ఉంది’’ అని ఓ జాతీయ మీడియాతో వెల్లడించారు.బహ్రైచ్‌లోని రాముపూర్ సమీపంలోని ఓ చెరుకు తోటలో రెండు తోడేలు పిల్లలను గుర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. భారీ వర్షం కారణంగా ఆ ప్రాంతంలో వరదలు వచ్చాయని, ఆ వరదల్లో తోడేలు పిల్లలు చనిపోయి ఉండవచ్చని తెలిపారు. అయితే.. వాటి తల్లి తోడేలు తమపై ప్రతీకారం తీర్చుకుంటోందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. అటవీ ప్రాంతంలో తోడేళ్ల ఆవాసాలను తొలగించటంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక అవి గ్రామాలుపై దాడులు చేస్తున్నాయని అటవీశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. -
అనుచిత వ్యాఖ్యలు, క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు.. కానీ!: బెంగాల్ మంత్రి
కోల్‌కతా: అటవీశాఖ మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి ఎట్టకేలకు దిగివచ్చరు. జైళ్లశాఖ మంత్రి పదవికి ఆయన సోమవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం మమతా బెనర్జీకి పంపించారు. అయితే తాను సీఎం మమతా బెనర్జీకి తప్ప మరో అధికారికి(అటవీ అధికారిణికి) క్షమాపణలు చెప్పేది లేదని తేల్చి చెప్పారు.‘నేను ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రధాన కార్యదర్శి ద్వారా నా రాజీనామాను సమర్పించాను. కానీ నేను ఏ అధికారికి క్షమాపణ చెప్పను. కేవలం నేను ముఖ్యమంత్రికి క్షమాపణలు చెబుతాను. ఆ రోజు ప్రజల కష్టాలు చూసి, అటవీ శాఖ వాళ్ళు ఎలా హింసిస్తున్నారో చూసి చలించిపోయాను. నేను ఒక అనుచిత పదాన్ని ఉపయోగించినందుకు క్షమించండి. కానీ నేను చెప్పిన దాని కోసం క్షమాపణలు చెప్పలేను. నేను ఏం చేసినా ప్రజల కోసమే’ అని గిరి అన్నారు. అయితే పుర్బా మేదినీపూర్ జిల్లాలోని తాజ్పూర్ సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో దుకాణాలు ప్రారంభించేందుకు చిన్నతరహా వ్యాపారుల నుంచి అటవీ శాఖ అధికారులు లంచం డిమాండ్ చేశారని మంత్రి ఆరోపించారు.కాగా రామ్‌నగర్ నుంచి టీఎంసీ ఎమ్మెల్యేగా గెలుపొందిన అఖిల్ గిరి మమతా మంత్రివర్గంలో జైళ్లశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన 1998లో టీఎంసీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. తాను సహనం కోల్పోవడానికి దారీతిసన పరిణామాలను సీఎంకు వివరంగాచెబుతానని అన్నారు. అయితే బీజేపీలో చేరుతున్నారా అని గిరి మీడియా అడగ్గా.. 2026 వరకు తన పదవీకాల ఉందని, అప్పటి వరకు పార్టీ కోసం ఎమ్మెల్యేగా పనిచేస్తానని తెలిపారుఇదిలా ఉండగా మంత్రి అఖిల్ గిరి అదివారం అటవీ శాఖ మహిళా అధికారి మనీషా సాహుపై బెదిరింపులకు పాల్పడ్డారు. తేజ్‌పుర్ బీచ్ సమీపంలోని అటవీ శాఖ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఫారెస్ట్ రేంజర్ మనీషా సాహు తొలగించారు. దీంతో మంత్రి గిరి స్థానికుల సమక్షంలో మహిళా అధికారిపై మాటల దూషణలకు దిగారు. మనీషా సాహు పదవీకాలన్ని తగ్గించాలని హెచ్చరించారు. అధికారిని బెదిరించిన వీడియో వైరల్‌గా మారడంతో మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి ఈ వ్యవహారం సీఎం మమతా వరకు చేరింది. దీంతో ఆమె మహిళా అధికారికి క్షమాపణలు చెప్పాడలని, అంతేగాక మంత్రివర్గం నుంచి వైదొలగాలని ఆదేశించారు. -
అటవీ అధికారులపై గిరిజనుల దాడి
-
శంషాబాద్: ఆపరేషన్ చిరుత.. చిక్కేనా?
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మూడు రోజుల క్రితం చొరబడిన చిరుతను బంధించడం కోసం అటవీ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత బోన్ వరకు వచ్చి వెళ్లిపోతుంది. దీంతో చిరుతను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు అధికారులు. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు చిక్కాయి. మేకను ఎరగా వేసినా.. చిరుత బోనులోకి రావటం లేదు. ఒకే ప్రాంతంలో మూడు రోజుల నుంచి చిక్కకుండా చిరుత తిరుగుతోంది. చిరుత కోసం 4 రోజులుగా స్పెషల్ టీమ్స్ శ్రమిస్తున్నాయి. ఎండకాల కావడంతో అడవిలో నీరు లభించకే చిరుతలు బయటకు వస్తున్నాయని అధికారులు తెలిపారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని చెప్పారు. ఒంటరిగా పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. -
అడవి తల్లిని వీడం.. బయటకెళ్లి బతకలేం
సాక్షి, నాగర్‌కర్నూల్: అడవి నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు చెంచులు తీవ్ర విముఖత చూపుతున్నారు. ఏళ్లుగా అడవినే నమ్ముకుని జీవిస్తున్న తాము బయటకు వెళ్లి బతకలేమని, తాము అడవిలోనే ఉంటామని తేల్చి చెబుతున్నారు. అడవుల్లో పులులకు ఆటంకం లేకుండా జనసంచారాన్ని తగ్గించడంతోపాటు మానవులకు, వన్యప్రాణులకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని తగ్గించే పేరిట నట్టడవిలోని చెంచులను మైదాన ప్రాంతాలకు తరలించాలని అటవీ అధికారులు నిర్ణయించడం తెలిసిందే. ఈ మేరకు నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న సార్లపల్లి చెంచుపెంట వాసులను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నాగర్‌కర్నూల్ జిల్లా డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీ నుంచి రీలొకేషన్‌కు అనుమతి రావడంతో ఈ నెల 5న గ్రామస్తుల నుంచి ఒప్పందాలపై సంతకాల సేకరణ ప్రారంభించింది. రీలొకేషన్లో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, లబ్ధిదారుల మధ్య ఎంఓయూ కోసం అటవీశాఖ అధికారులు గ్రామస్తులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో 2–3 నెలల్లోనే సార్లపల్లి వాసుల రీలొకేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. సార్లపల్లి తర్వాత విడతల వారీగా కుడిచింతలబైల్, కొల్లంపెంట, కొమ్మెనపెంట వాసులను సైతం అడవి బయటకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్యలను చెంచులు వ్యతిరేకిస్తున్నారు. తమను అడవి బయటకు తరలించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. మల్లాపూర్ పెంటలోని చెంచుల ఆవాసాలు ఎనీ్టసీఏ ద్వారా పునరావాస ప్యాకేజీ.. అయినా చెంచులు విముఖం అడవి లోపల నివసిస్తున్న వారిని బయటకు తరలిస్తే ఒక్కో కుటుంబానికి ఎన్టీసీఏ ద్వారా రూ.15 లక్షల పునరావాస ప్యాకేజీ అందించనుంది. వీరి పునరావాసం కోసం నాగర్‌కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద అటవీశాఖకు చెందిన స్థలాన్ని కేటాయించారు. రూ.15 లక్షల ప్యాకేజీ వద్దనుకుంటే బాచారం వద్ద 220 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం, జీవనోపాధి కోసం 5 ఎకరాల వ్యవసాయ భూమిని అందజేస్తారు. సార్లపల్లిలో 269 కుటుంబాలు ఉండగా, వాటిలో 83 కుటుంబాలే చెంచులు. మిగతా కుటుంబాల్లో ఇతర వర్గాల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఎనీ్టసీఏ ప్యాకేజీకి ఇప్పటివరకు 186 కుటుంబాలు ఒప్పుకోగా వాటిలో చెంచు కుటుంబాలు ఆరే ఉన్నాయి. అడవి నుంచి బయటకు తరలింపునకు మెజార్టీ శాతం చెంచు కుటుంబాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. కనీస సౌకర్యాలకు దూరం.. నల్లమల అటవీప్రాంతంలో మొత్తం 88 ఆవాసాల్లో చెంచులు నివసిస్తున్నారు. వీటిలో 20 ఆవాసాలు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్నాయి. అడవిలో అటవీ శాఖ ఆంక్షల నేపథ్యంలో ఇక్కడి చెంచులు కనీస మౌలిక సదుపాయాలకు సైతం నోచుకోవడం లేదు. అడవిలో ఉన్న అప్పాపూర్ గ్రామ పంచాయతీ మినహా మరెక్కడా చెంచుపెంటల్లో కనీసం అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, వైద్యశాల లేవు. మేం అడవిలోనే ఉంటాం.. బయటకు పోలేం ఏళ్లుగా తాతల కాలం నుంచి అడవినే నమ్ముకుని బతుకుతున్నాం. మేం బయటకు పోయి జీవించలేం. మా వల్ల వన్యప్రాణులు, పులులకు ఎలాంటి హాని లేదు. ఇప్పుడు కూడా ఉండదు. దయచేసి మమ్మల్ని అడవి నుంచి విడదీయద్దు. మేమంతా అడవిలోనే ఉంటాం. –చిగుర్ల లింగమ్మ, చెంచు మహిళ, సార్లపల్లి, అమ్రాబాద్ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా మమ్మల్ని ఆగం చేయొద్దు.. అడవిలో ప్రశాంతంగా ఉన్న మమ్మల్ని ఆగం చేయద్దు. మేం బయటి ప్రపంచంలో బతకలేం. బాచారం లాంటి మైదాన ప్రాంతాలకు తరలిస్తే అక్కడ ఏజెన్సీ నియమాలు, హక్కులు వర్తించవు. మైదాన ప్రాంతాల్లో ఉన్న చెంచులు మాకంటే దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. – కుడుముల మల్లేశ్, చెంచు యువకుడు, సార్లపల్లి స్వచ్ఛందంగా ముందుకొస్తేనే.. టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో జంతు సంరక్షణ కోసమే స్థానికులకు మరోచోట పునరావాసం కలి్పస్తున్నాం. రీ లొకేషన్లో ఒత్తిడి లేదు, స్వచ్ఛందంగా ముందుకొస్తేనే తరలింపు ఏర్పాట్లు చేస్తున్నాం. – రోహిత్ గోపిడి, డీఎఫ్ఓ, నాగర్‌కర్నూల్ జిల్లా -
Tripura: అక్బర్, సీత సింహాలు.. త్రిపుర సర్కారు కీలక నిర్ణయం
అగర్తల: మగ, ఆడ సింహాలకు అక్బర్, సీత అని వివాదాస్పద పేర్లు పెట్టిన ఉదంతంలో త్రిపుర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఈ విషయంలో బాధ్యున్ని చేస్తూ ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్( వైల్డ్‌లైఫ్ అండ ఎకో టూరిజం) ప్రబిన్ లాల్ అగర్వాల్‌ను సోమవారం ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సింహాలకు పెట్టిన పేర్లు హిందూ మతస్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఇప్పటికే కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో త్రిపుర ప్రభుత్వం ఉన్నతాధికారి సస్పెన్షన్ నిర్ణయం తీసుకోడం చర్చనీయాంశమవుతోంది. పశ్చిమబెంగాల్లోని సిలిగురి నుంచి తీసుకువచ్చిన రెండు సింహాల్లో మగ సింహానికి అక్బర్ అని, ఆడ సింహానికి సీత అని త్రిపుర సెపాయిజాలా జూ అధికారులు పేర్లు పెట్టారు. ఇది వివాదస్పదం అవడంతో వీహెచ్‌పీ కోర్టుకు వెళ్లింది. ఇదీ చదవండి.. జ్ఞానవాపి మసీదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు -
పక్కా ప్లాన్‌తోనే...
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పశువులను చంపుతున్నాయన్న ప్రతీకారంతోనే కొందరు పులులను మట్టుబెట్టుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ డివిజన్లో రెండు పులుల్లో ఒకటి స్పష్టంగా ఇదే కారణంగా చనిపోయినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు.. తమ పశువులను చంపి తింటున్న పులులను లేకుండా చేయాలని భావించి వాంకిడి మండలం సర్కెపల్లికి చెందిన పశువు యజమాని, ముగ్గురు పశువుల కాపరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. ఇందుకోసం ఉచ్చులు, విష ప్రయోగం కూడా చేసినట్టు తెలుస్తోంది. కళేబరంపై గడ్డి మందు చల్లి.. ఇటీవలే ఓ రైతుకు చెందిన పశువును పులి చంపి తినేసింది. సాధారణంగా ఒకసారి వేటాడితే, పులి ఆ మాంసాన్ని వారం దాకా భుజిస్తుంది. మళ్లీ వస్తుందని తెలుసుకొని ఎద్దు కళేబరంపై గడ్డి మందు చల్లి మట్టుబెట్టారు. మొదట ఉచ్చులు కూడా వేసినట్టు సమాచారం. గడ్డి మందు చల్లిన పశువు కళేబరాన్ని తిని ఎస్9 మగపులి చనిపోగా, ఆ పరిసరాల్లోనే ఉన్న ఎస్6కు చెందిన రెండు పిల్లల జాడ ఇంకా తెలియదు. వాటిని ట్రేస్ చేస్తేనే అసలు విషయం తెలుస్తుంది. సీన్ రీ కన్స్ట్రక్షన్ పులిపై ఎలా విష ప్రయోగం చేశారో నలుగురు నిందితులు బుధవారం అడవిలో అధికారుల ముందు యథాతథంగా చేసి చూపించారు. కేసు దర్యాప్తులో భాగంగా చనిపోయిన పశువుల రైతుల వివరాలు అటవీ అధికారులు సేకరిస్తుండగా, నలుగురు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో కాగజ్‌నగర్ పోలీసుల సాయంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారు నిజం ఒప్పుకున్నట్టు తెలిసింది. పరిహారంలో జాప్యం కాగజ్‌నగర్ రేంజ్ దరిగాం, సర్కెపల్లి పరిధిలోనే ఆరు పులులు ఉన్నాయి. తరచూ పశువులపై దా డులు చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నాయి. అయితే నిబంధనల ప్రకారం పశువుల విలువ మేరకు వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. కానీ నెలల తరబడి జాప్యం జరుగుతోంది. దీంతో పశువులను చంపుతున్నాయనే కోపంతోనే కొందరు విష ప్రయోగం చేసి పులుల మరణానికి కారణమవుతున్నారనే వాదనలు ఉన్నాయి.పులుల సంరక్షణ పకడ్బందీగా చేస్తున్నామని చెప్పే అధికారులు కిందిస్థాయి వాస్తవ పరిస్థితులను తెలుసుకోలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరో పశువుపై దాడి రెండు రోజుల క్రితం కాగజ్‌నగర్ రేంజ్ ఉట్పల్లి శివారులో ఓ పశువును పులి చంపేసింది. అప్రమత్తమైన అధికారులు కెమెరాలు బిగించారు. అక్కడకు మళ్లీ భుజించేందుకు పులి వస్తే ట్రేస్ అవుతాయి. ఇక్కడ సంచరించే ఆరింటిలో రెండు చనిపోగా, మరో నాలుగింటి జాడపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే అటవీ అధికారులు ఈ కేసు దర్యాప్తు వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. గురువారం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. -
చిరుత కలకలం: బయటికి రావద్దంటూ పోలీసుల హెచ్చరికలు
న్యూఢిల్లీలోని సైనిక్ ఫాంహౌజ్‌లో చిరుతపులిసంచారం కలకలంరేపింది.శనివారం తెల్లవారుఝామునరాత్రి వాహనదారులకు కంటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక వీడియోలో, చిరుతపులి గోడపై నుండి దూకి అడవిలోకి పారిపోయిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, రాత్రి బయటకు రావద్దంటూ ప్రకటన జారీ చేశారు. ఫాంహౌజ్‌కు కొద్ది దూరంలో చిరుత సంచారంతో భయాందోళనకు గురైన స్థానికులు ఆటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారి సుబోధ్ కుమార్ సమాచారం ప్రకారం చిరుత గోడ దూకి అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో రెండు కేజ్‌లను ఏర్పాటు చేయడం తోపాటు, ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. 80-90 కిలోల బరువున్న పూర్తిగా పెరిగిన చిరుతపులి అని తెలిపారు. అటవీ, ఢిల్లీ పోలీసులకు చెందిన 40 మంది సిబ్బందిని ఈ ప్రాంతంలో మోహరించినట్లు అధికారి తెలిపారు. అలాగే ఫాంహౌజ్ వైపు ఎవరూ వెళ్లకుండా స్థానికులను అప్రమత్తం చేశామని ట్రాప్ బోనులను ఏర్పాటు చేసి, వాటి సమీపంలో గుమిగూడ వద్దని ప్రజలకు సూచించినట్లు తెలిపారు. ట్రాప్ బోనులకు సమీపంలో గుమిగూడవద్దని ప్రజలకు సూచించినట్లు పోలీసు అధికారి తెలిపారు.. ఇందులో భాగంగానే అందరూ ఇళ్లనుంచి బయటికి రావద్దని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం గమనార్హం. #WATCH | Announcements are being made in Delhi's Sainik Farm area urging people to stay indoors after a leopard was spotted in the area, earlier today. https://t.co/P4nFo6i3rx pic.twitter.com/HzKnabl7qB — ANI (@ANI) December 2, 2023 -
వలలో చిక్కి.. చెట్టుకు వేలాడిన చిరుత
అడ్డతీగల: కోతుల బెడద నివారణ కోసం వరి చేను చుట్టూ అమర్చిన వలలో చిక్కిన చిరుత పులి తప్పించుకుపోవడానికి చెట్టు పైకి ఎక్కి.. దానికి వేలాడుతూ రాత్రంతా అవస్థ పడింది. అటవీ అధికారులు వచ్చి రక్షించినా.. తీవ్ర గాయంతో చివరకు ప్రాణాలు విడిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం ఎల్లవరం శివారున రేగులపాడు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం రేగులపాడు వద్ద చెట్టుకు వేలాడుతున్న చిరుతను చూసిన స్ధానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంపచోడవరం డీఎఫ్‌వో జీజీ నరేంద్రన్, అడ్డతీగల సబ్ డీఎఫ్‌వో బి.శ్రీరామారావు, అడ్డతీగల రేంజి అధికారి షేక్ షెహన్షా, ఎస్ఐ అప్పలరాజు ఇతర సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. వల నడుముకు చుట్టుకుపోయి వేలాడుతున్న చిరుతను రక్షించేందుకు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. విశాఖపట్నం జూ నుంచి రెస్క్యూ టీంని రప్పించి రాజమహేంద్రవరం నుంచి బోను తెప్పించారు. రాత్రి నుంచి చెట్టుకు వేలాడడంతో చిరుత అలసిపోయిన విషయం గమనించి.. ట్రాక్టర్లో నిచ్చెన ఉంచి దాని మీద ఆధారపడి చిరుత సేదతీరేలా చేశారు. మంచినీటిని అందించారు. అనంతరం రెస్క్యూ టీం సభ్యులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చిరుతను బోనులోకి చేరవేశారు. అయితే కొద్దిసేపటి అనంతరం చిరుత మరణించింది. దీంతో అటవీ అధికారులు పోస్ట్‌మార్టం నిర్వహించి ఘటనా స్ధలంలోనే చిరుతను దహనం చేశారు. కొన్నిగంటల పాటు వల నడుం చుట్టూ చుట్టుకుపోవడంతో చిరుత పెనుగులాడటం, ఆహారం లేక నీరసించి పోవడంతో మృతి చెందిందని డీఎఫ్‌వో నరేంద్రన్ చెప్పారు. ఈ ప్రాంతంలో చిరుతలు మరిన్ని ఉండవచ్చని, ప్రజలు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. వన్యప్రాణులకు ఎటువంటి హాని తలపెట్టకుండా అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. -
తిరుమలలో చిరుతను ట్రాప్ చేసిన అటవీశాఖ అధికారులు
-
Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత
సాక్షి, తిరుపతి: తిరుమలలో కాలి బాటలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం TTD, అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత సతల్ఫితాన్ని ఇస్తోంది. తాజాగా మరో చిరుత పులిని బంధించారు అధికారులు. మూడు నెలల వ్యవధిలో బోనులో చిక్కిన ఐదవ చిరుత ఇది. నరసింహ ఆలయం- ఏడవ మైలు రాయి మధ్య ఏర్పాటు చేసిన ట్రాప్‌లో ఈ చిరుత చిక్కినట్లు అటవీ శాఖఅధికారులు తెలిపారు. నాలుగు రోజుల కిందట ట్రాప్ కెమెరాల్లో దీని సంచారాన్ని అధికారులు గుర్తించి.. బోను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు నిన్న రాత్రి అది ట్రాప్‌లో చిక్కింది. ఇక కాసేపట్లో అటవీ శాఖ అధికారులతో పాటు టీటీడీ చైర్మన్ భూమన చిరుతను బంధించిన ప్రాంతానికి వెళ్తున్నట్లు సమాచారం. ఇక.. తిరుపతిలో 'ఆపరేషన్ చిరుత’ కొనసాగుతోంది. తాజాగా చిక్కిన చిరుతతో కలిపి ఐదింటిని అధికారులు బంధించినట్లయ్యింది. మిగిలిన వాటి కోసం అన్వేషణ కొనసాగుతుందని అధికారులు అంటున్నారు. భద్రతే ప్రధాన ప్రాముఖ్యత.. నడక మార్గంలో గత కొన్నిరోజులుగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. వాటిని ట్రాప్ చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. చిన్నారి కౌశిక్‌పై దాడి.. అలాగే చిన్నారి లక్షిత మృతి ఘటనలతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. భక్తుల భద్రతే తమ ప్రధాన ప్రాముఖ్యతగా పేర్కొంటూ.. రక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేక సమావేశాల ద్వారా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కూడా. మరోవైపు టీటీడీ సమన్వయంతో అటవీ శాఖ అధికారులు చిరుతలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించి.. సక్సెస్ అవుతున్నారు. జూన్ 24, ఆగష్టు 14, ఆగష్టు 17, ఆగష్టు 28వ తేదీల్లో, తాజాగా.. సెప్టెంబర్ 6వ తేదీన చిరుతలు బోనులో పడ్డాయి. ఇదీ చదవండి: కర్ర పంపిణీపై విమర్శలు.. స్పందించిన టీటీడీ -
తిరుమల: ఎట్టకేలకు చిక్కిన చిరుత.. ఆపరేషన్ సక్సెస్
సాక్షి, తిరుపతి: తిరుమల శేషాచలం కొండల్లో ఆపరేషన్ చిరుత విజయవంతంగా ముగిసింది. వారం రోజులుగా తప్పించుకుంటూ తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు ఆదివారం రాత్రి బోనులో చిక్కింది. దీంతో ఇకపై నడకదారి మార్గంలో భక్తులు ప్రశాంతంగా సంచరించే అవకాశాలు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. నడక మార్గంలో గత కొన్నిరోజులుగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. వాటిని ట్రాప్ చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగో చిరుత.. బోను దాకా వచ్చిపడకుండా పోతోంది అది. అలా వారం గడిచింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఎట్టకేలకు చిక్కింది. ఈ చిరుత పట్టివేతతో.. ఆపరేషన్ చిరుత ముగిసినట్లేనని అధికారులు అంటున్నారు. చిరుతల పట్టివేత పూర్తి కావడంతో.. ఇకపై భక్తులు ప్రశాంతంగా నడకమార్గంలో సంచరించే అవకాశం ఉందని అంటున్నారు. టీటీడీ అప్రమత్తత చిన్నారి కౌశిక్‌పై దాడి.. అలాగే చిన్నారి లక్షిత మృతి ఘటనలతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. భక్తుల భద్రతే తమ ప్రధాన ప్రాముఖ్యతగా పేర్కొంటూ.. రక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేక సమావేశాల ద్వారా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కూడా. మరోవైపు టీటీడీ సమన్వయంతో అటవీ శాఖ అధికారులు చిరుతలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించి.. విజయవంతమయ్యారు. మరో 500 ట్రాప్ కెమెరాల ఏర్పాటు చిరుత చిక్కిన ప్రదేశాన్ని సీసీఎఫ్‌వో నాగేశ్వరరావు పరిశీలించారు. ‘‘చిరుతను ఎస్వీ జూపార్క్‌కు తరలించాం. ఇది మగ చిరుత. రెండేళ్ల వయసుంది. నడక మార్గంలో ట్రాప్ కెమెరాలు నిరంతరం ఉంటాయి. నడకమార్గంలో ప్రస్తుతం 300 కెమెరాలు ఉన్నాయి. మరో 500 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. -
ఫారెస్ట్ అధికారిపై చర్యలకు ఓకే చెప్పిన హైకోర్టు
సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్థానిక సంస్థలపైనా ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. మానవ మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమని, అడవులు, సరస్సులు, నదులు, అన్ని జీవరాశులను కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులు, ప్రభుత్వాలపై ఉందని పేర్కొంది. రంపపు కోత మిల్లులను అటవీ ప్రాంత పరిధి నుంచి తరలించే విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నేపథ్యంలో కర్నూలు ఫారెస్ట్ రేంజ్ అధికారిగా పనిచేసిన చాణిక్యరాజు అనే అధికారిపై చట్ట ప్రకారం చర్యలు ప్రారంభించేందుకు ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. చాణిక్యరాజుకు ఊరటనిస్తూ ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) 2017లో ఇచి్చన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారానికి ఆరు నెలల్లో తార్కిక ముగింపు తీసుకురావాలని సూచించింది. -
పులి మాంసం రుచి చూద్దామని..!
కర్ణాటక: కొందమాల్ జిల్లా బల్లిగుడా రేంజ్, తుమ్మిదిబందో పోలీస్ స్టేషన్ పరిధిలోని రైకియా అటవీ ప్రాంతంలో పులిని వేటాడి హతమార్చి, మాంసం తిందామనుకున్న 13మంది ప్రబుద్ధులను అటవీశాఖ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బల్లిగుడ అటవీ ప్రాంతంలో రైకియా గ్రామస్తులు బుధవారం రాత్రి ఉమ్మడిగా పులిని వేటాడారు. అనంతరం గ్రామం సమీపంలోని తోటలో అంతా కలిసి వాటాలు వేసుకున్నారు. ఇంటికి తీసుకు వచ్చి, కమ్మగా వండుకున్నారు. ఎట్టకేలకు.. పులి మాంసం రుచి చూద్దామనుకొని సిద్ధమవుతున్న సమయంలో విషయం బయటకు పొక్కడంతో అటవీశాఖ, పోలీసులు అధికారులు దాడి చేశారు. ఈ మేరకు 13మంది గ్రామస్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పులి చర్మం, గోళ్లు, ఇతర అవయవాలు, వండిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పులి వయస్సు, బరువు ఇతర వివరాలేమీ తెలియలేదు .ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. జింక మాంసం.. కిలో రూ.1500లు రాయగడ: రాయగడ రిజర్వ్ ఫారస్ట్‌లో జింకను వేటాడి, మాంసాన్ని విక్రయిస్తుండగా అటవీశాఖ అధికారులు దాడులు చేపట్టారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆశాఖ డిప్యూటీ రేంజర్ సంజయ్‌కుమార్ సాహు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయగడ సమీపంలోని మానిక్జోల గ్రామంలో జింక మాంసం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో అటవీశాఖ అధికారి గౌరీశంకర్ సాహు, గార్డు సంతోష్ పాణిగ్రాహి, సిబ్బంది దాడులు నిర్వహించారు. పితామహల్ గ్రామానికి చెందిన మాధవ ఉలక(43), మానిక్జోలకు చెందిన మాధవ ఉలక(41) వేటాడి తెచ్చిన జింక మాంసాన్ని గ్రామంలో కిలో రూ.1,500ల చొప్పున విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో అధికారులు దాడులు నిర్వహించారు. నిందితుల్లో కొంతమంది పరారు కాగా, ఇద్దరు పట్టుబడ్డారు. దీనిపై కేసు నమోదు చేసి, నిందితులను కోర్టులో హాజరు పరిచారు. వారినుంచి 3కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
ఆదర్శంగా నిలుస్తున్న ఫారెస్ట్ అధికారి మమతా ప్రియదర్శి
డ్యూటీ సమయంలో బుద్ధిగా కూర్చుని తమ పని తాము చేసుకుని సమయం అయిపోగానే ఇంటికి వెళ్లిపోయే అధికారులు కొందరయితే, ఆఫీసు పని వేళల తరవాత కూడా పని గురించి ఆలోచించి వినూత్న నిర్ణయాలతో అందరికి ఆదర్శంగా నిలుస్తుంటారు మరికొందరు. ఈ రెండో కోవకు చెందిన వ్యక్తే జార్ఖండ్ ఫారెస్ట్ అధికారి మమతా ప్రియదర్శి. పర్యావరణం గురించి అవగాహన కల్పించడంతో పాటు జంతువులకు మనుషులకు మధ్యన సంధి కుదురుస్తూ అందరికీ ప్రేరణగా నిలుస్తోంది. జంషెడ్పూర్ డివిజినల్ ఫారెస్ట్ అధికారిగా పనిచేస్తోంది మమతా ప్రియదర్శి. ఫారెస్ట్ అధికారిగా అడవులను సంరక్షించడంతో పాటు పర్యావరణం దెబ్బతినకుండా ఉండేందుకు శాయశక్తులా కృషిచేస్తోంది. ప్రకృతి ప్రాముఖ్యత, కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ రేపటి పౌరులకు అవగాహన కల్పిస్తున్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటోన్న మార్పులు, నీటి సంరక్షణ, మనుషులు– జంతువుల మధ్య ఏర్పడే సంఘర్షణలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు వివిధ రకాల డాక్యుమెంటరీలను ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఇప్పటిదాకా 347 గ్రామాలు, వివిధ స్కూళ్లలో ప్రదర్శించిన డాక్యుమెంటరీలతో రెండున్నర లక్షలమందికిపైగా అవగాహన కల్పించింది. వ్యాన్‌కు పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణ గురించి వివరించి చెబుతున్నారు. ఈ కార్యక్రమం గురించి ఆమె మాటల్లోనే... ‘‘ఈ మధ్యకాలంలో తరచూ అడవుల్లో మంటలు రేగి చాలా వృక్షాలు కాలిపోతున్నాయి. దీనివల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది. అసలు అడవులు ఎందుకు తగలబడుతున్నాయో కూడా ఈ చుట్టుపక్కల నివసిస్తోన్న చాలామందికి తెలీదు. ఏనుగులకు, మనుషులకు మధ్య తరచూ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి వాటన్నింటిని అధిగమించడానికి తీసుకొచ్చిందే ఈ కార్యక్రమం. అందుకే ఆడియో–వీడియో జంతువులకు ఎలాగూ అర్థం చేయించలేము. మనమే అర్థం చేసుకుని వాటికి అడ్డు తగలకుండా, మూగజీవాలు మనకి ఇబ్బంది కలిగించకుండా మనమే సర్దుకుపోవాలి. అందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ... కూర్చోబెట్టి చెపితే ఎవరూ వినరు. అందుకే ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి వారి ఆసక్తిని ఇటు మళ్లిస్తున్నాం. కొంతవరకైనా గుర్తుపెట్టుకుని పాటిస్తారు. ఈ డాక్యుమెంటరీలలో నాలుగు విభిన్న అంశాలపై వీడియోలు ప్లే చేస్తున్నాం. మనుష్యులు– జంతువుల సంఘర్షణ మొదటిది, రెండో వీడియోలో అడవులు తగలబడినప్పుడు ఏం చేయాలి... మూడో అంశంగా కర్బన ఉద్గారాలు విడుదలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. నాలుగో అంశం మొక్కల పెంపకం, మొక్కలను ఎలా కాపాడాలి, నీటిసంరక్షణ గురించి సరళమైన భాషలో చెబుతున్నాం. వీటివల్ల విద్యార్థులు, గ్రామస్థులకు సులభంగా అర్థమవుతుంది. స్కూళ్లు, పబ్లిక్ ప్లేసుల్లో.. ఇప్పటిదాకా స్కూళ్ళతో పాటు, గ్రామాల్లోని పబ్లిక్ పేసుల్లో వ్యాన్ వీడియోలు ప్లేచేసి వీలైనంత అవగాహన కల్పించాం. పాఠ్యపుస్తకాల్లో సిలబస్ కాకుండా కొత్త విషయాలు తెలుసుకున్నందుకు వాళ్లు చాలా సంతోషపడుతున్నారు. -
తిరుమల: బోనులో చిక్కిన చిరుత
సాక్షి, తిరుపతి: తిరుమలలో బోనులో చిరుత పులి చిక్కింది. మొన్న అలిపిరి మార్గంలో మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుతే ఇది. 7వ మైలురాయి వద్ద ఇది బోనులో పడింది. కేవలం ఒక్కరోజులోనే చిరుతను బంధించారు అధికారులు. నిన్న సాయంత్రం చిరుతను బంధించేందుకు రెండు బోన్లను ఏర్పాటు చేశారు అధికారులు. 150 ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిన్న రాత్రి(శుక్రవారం, జూన్ 23) 10.45 గంటల ప్రాంతంలో చిరుత బోనులో పడినట్లు తెలుస్తోంది. డీఎఫ్‌వో ఏమన్నారంటే.. బాలుడిపై దాడి చేసిన ఒక్కరోజులోనే చిరుతను బంధించాం. తల్లి, పిల్ల చిరుతలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ చిరుతను ఇంకా వేటాడడం పూర్తిగా అలవాటు కాలేదు అని డీఎఫ్‌వో తెలియజేశారు. చిన్నారి కౌశిక్‌ను పరామర్శిస్తున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. పక్కన చికిత్స అందిస్తున్న వైద్యుడు తిరుమల నడక మార్గంలోని 7వ మైలు వద్ద ఓ చిరుత పులి బాలుడిపై దాడి చేసింది. తన తాతతో కలిసి అక్కడే ఉన్న దుకాణంలో తినుబండారాలు కొనుక్కుంటున్న సమయంలో హఠాత్తుగా వచ్చిన చిరుత బాలుడి మెడ పట్టుకుని ఎత్తుకెళ్లింది. వెంటనే స్పందించిన అక్కడి దుకాణదారుడు, తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ చిరుత వెనుక పరుగులు తీశారు. టార్చ్‌లు వేస్తూ, రాళ్లు విసరడంతో 7వ మైలు కంట్రోల్ రూం వద్ద చిరుత బాలుడిని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయింది. చిరుత దాడి నుంచి బాబును అక్కడి భద్రతా సిబ్బంది రక్షించారు. గాయాల పాలైన బాలుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. బాలుడి చెవి వెనుక, మరికొన్ని ప్రాంతాల్లో చిరుత దంతపు గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గాయపడిన బాలుడు కర్నూలు జిల్లా ఆదోని వాసి కౌషిక్(3)గా గుర్తించారు. దాడి గురించి తెలియగానే.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి బాలుడిని పరామర్శించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. చిరుత దాడి చేసిన మెట్ల మార్గంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్టు తెలిపారు. ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతామన్నారు. భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఇదీ చదవండి: గోవధ నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారు? -
అనుమానాస్పద స్థితిలో మూడు చిరుతల మృతి
సాక్షి, చైన్నె: తమిళనాడు, నీలగిరి జిల్లా కూడలూరు అటవీ ప్రాంతంలో మూడు చిరుతలు మృతిచెందాయి. అనుమానాస్పద స్థితిలో ఈ మరణాలు ఉండడంతో అటవీశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. నీలగిరి జిల్లా కూడలూరు పరిధిలో బంధిపుర పులుల అభయారణ్యం ఉంది. ఇక్కడి మంగళ గ్రామంలో ఏడాది వయస్సు ఉన్న ఓ చిరుత మరణించినట్టు సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. చిరుతల మధ్య గొడవ జరిగిన తరహాలో ఆ పరిసరాలు ఉండడం, దాడిలో ఈ చిరుత మరణించి ఉంటుందని భావించారు. పోస్టుమార్టం సైతం నిర్వహించారు. అదేసమయంలో కూత వేటు దూరంలోని తేహం అనే ప్రాంతంలో మరో మగ చిరుత మృతదేహం బయటపడింది. ఈ రెండు చిరుతలు పరస్పరం దాడి చేసుకుని మరణించి ఉంటాయని భావించారు. అయితే, ఇక్కడికి సమీపంలోని కుందలుపేట వద్ద మరో చిరుత మరణించి ఉండడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఇది విషంతో కూడిన మాంసం తినడంతో మరణించినట్ట విచారణలో తేలింది. ఈ చిరుతలు మరణించి మూడు రోజులై ఉండవచ్చునని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో అటవీశాఖ అధికారి రమేష్ పర్యవేక్షణలో సిబ్బంది విచారిస్తున్నారు. -
ముచ్చెమటలు పట్టిస్తున్న ‘అరి కొంబన్’
సాక్షి, చైన్నె: తమిళ అటవీ అధికారులను అరి కొంబన్ ఏనుగు ముప్పుతిప్పలు పెడుతోంది. దీనిని పట్టుకునేందుకు అధికారులు ఉరకులు.. పరుగులు తీస్తున్నారు. అయితే దీనికి మత్తు మందు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇటీవల ఈ ఏనుగును పట్టుకునే సమయంలో కేరళ అధికారులు అనేక డోస్‌లుగా మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో మరోసారి ఇచ్చేందుకు సంశయిస్తున్నారు. వివరాలు.. కేరళను వణికించిన అరి కొంబన్ఏనుగు ఆదివారం తమిళనాడు సరిహద్దులోని తేని జిల్లా కంబం పట్టణంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ ఏనుగు వీరంగం సృష్టిస్తుండడంతో దీనిని అడవిలోకి తరిమేందుకు వందలాదిగా అటవీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగారు. కంబం పట్టణం ఈ ఏనుగు పుణ్యమా నిర్మానుష్యంగా మారింది. ఉదయాన్నే ఈ ఏనుగు కంబం నుంచి వీడి పొరుగున ఉన్న సురులి పట్టి గ్రామంలోకి ప్రవేశించింది. దీంతో గ్రామస్తులు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. ఈ ఏనుగుకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడానికి నిర్ణయించినా, చివరకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇది వరకు ఈ ఏనుగును కేరళ అధికారులు పట్టుకునే క్రమంలో పలు డోస్‌లుగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్టు తేలింది. ప్రస్తుతం మళ్లీ ఇంజెక్షన్ ఇచ్చిన పక్షంలో ఏనుగు ఆరోగ్యానికి ఏదేని ముప్పు తప్పదేమో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. మంత్రి సమీక్ష.. ఈ ఏనుగును అడవిలోకి తరిమి కొట్టడం లేదా, ఎలాగైనా పట్టుకునే విధంగా కుంకీలను రంగంలోకి దించారు. కోయంబత్తూరు జిల్లా ముదుమలై శరణాలయం నుంచి స్వయంబు అనే ఏనుగుతో పాటుగా మరో రెండు కుంకీలను రంగంలోకి దించారు. ఈ మూడు కుంకీలు సురులి పట్టి పరిసరాలల్లో తిష్ట వేశారు. అరి కొంబన్ను మచ్చి చేసుకునే విధంగా కుంకీలు ప్రయత్నాల్లో ఉన్నాయి. అరి కొంబన్ రూపంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించడంతో పాటుగా దానిని పట్టుకునేందుకు చేపట్టాల్సిన ప్రత్యేక ఆపరేషన్‌పై అటవీ శాఖ మంత్రి మది వేందన్ దృష్టి పెట్టారు. ఆదివారం మధ్యాహ్నం అటవీ, పోలీసు అధికారులు, కలెక్టర్లు, వైద్యులతో ఆయన సమావేశమయ్యారు. అరి కొంబన్ను ఎలాగైనా పట్టుకుని తీరాలని నిర్ణయించారు. అలాగే, ఈ ఏనుగు కారణంగా ప్రాణ హాని జరగకుండా ముందు జాగ్రత్త చర్యలను గ్రామంలో విస్తృతం చేశారు. -
ఉప్పు తప్పించును వేసవి ముప్పు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వేసవి మండిపోతుండటంతో జంతువుల ఆరోగ్య పరిరక్షణపై అటవీ అధికారులు దృష్టి సారిస్తున్నారు. మనుషుల్లాగే వన్యప్రాణులు కూడా శరీరంలో ఖనిజాల (మినరల్స్) శాతం తగ్గిపోతే అనారోగ్యం బారిన పడతాయి. రోజువారీ ఆహారంలో భాగంగా ఖనిజాలు.. కూడా సరిగా అందితేనే జీవ క్రియలు సజావు గా సాగుతాయి. అయితే అడవుల్లో బతికే జంతువులు సహజ సిద్ధంగా తినే మేత ద్వారా ఉప్పు (సోడియం)ను తీసుకుంటాయి. బండలు, కర్రల్ని, నీటి మడుగుల వద్ద మట్టిని నాకుతూ శరీర సమతాస్థితిని కాపాడుకుంటాయి. అయితే గతంలో కంటే ప్రస్తుతం సహజసిద్ధ ఉప్పు లభ్యత తగ్గిపోయింది. మరోవైపు వేసవిలో డీహైడ్రేషన్ కారణంగా మరింత ఎక్కువగా మినరల్స్ అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో తగినంత ఉప్పు అందకపోతే వన్యప్రాణులు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దీని ని దృష్టిలో ఉంచుకుని వాటి ఆవాసాల్లోనే నీటి కుంటల వద్ద అధికారులు ఉప్పు గడ్డలు ఏర్పాటు చేస్తున్నారు. గత రెండేళ్లుగా కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలో ఈ పద్ధతిలో జంతువుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. మట్టి, ఉప్పును కలిపి.. సహజమైన ఉప్పు, చెరువు మట్టి రెండింటినీ కలిపి (70 శాతం ఉప్పు, 30 శాతం చెరువు పూడిక మట్టి) కుప్పలా తయారు చేస్తారు. ఒక అడుగు లేదా అడున్నర ఎత్తులో నీటి కుంటలకు సమీపంలో జంతువులకు కనిపించేలా ఉంచుతారు. దాహం తీర్చుకోవడానికి వచ్చే జంతువులు కాళ్లు, కొమ్ములతో కుప్పల్ని గీరుతూ, మట్టిలో ఉన్న ఉప్పును నాలుకతో చప్పరిస్తుంటాయి. ఒక దాన్ని చూసి మరొకటి అలా నాకుతూ ఉంటాయి. ఒక్కోసారి గుంపులుగా కూడా వస్తుంటాయి. అలా పదే పదే నాకడం వల్ల వాటికి అవసరమైనంత ఉప్పు లభిస్తుంది. ఇప్పటికీ గ్రామాల్లో పశువులు, మేకలు, గొర్రెలకు ప్రత్యేకంగా ఉప్పును నాకిస్తుంటారు. ఈ విధానాన్నే అధికారులు అడవిలో ఉపయోగిస్తున్నారు. మొదట మార్కెట్లో దొరికే రెడీమేడ్ ఉప్పు గడ్డలను వాడేవారు. అయితే వాటి గడువు తేదీ, ప్రాసెస్ కారణంగా జంతువులకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని అటవీ సిబ్బందే సాధారణ ఉప్పును మట్టితో కలిపి జంతువులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఖనిజ లోపం ఏర్పడకుండా.. వన్యప్రాణుల్లో ఖనిజ లోపం రాకుండా నీటికుంటల వద్ద ఉప్పు గడ్డలను ఏర్పాటు చేస్తున్నాం. దాహం తీర్చుకోవడానికి వచ్చినప్పుడు మట్టిలో ఉన్న ఉప్పును అవి చప్పరిస్తున్నాయి. ఇది వాటి ఆరోగ్యాన్ని కాపాడుతోంది. – ఎస్.మాధవరావు ఎఫ్‌డీవో, జన్నారం, మంచిర్యాల జిల్లా -
తప్పిపోయిన 'ఆశ'.. ప్రాజెక్టు చీతా బృందంపై గ్రామస్థుల దాడి
మధ్యప్రదేశ్ కునే నేషనల్ పార్క్‌లో ప్రాజెక్ట్ చీతా బృందంపై గ్రామస్థులు దాడి చేశారు. రక్షిత ప్రాంతం నుంచి తప్పిపోయిన చీత 'ఆశ' కోసం అధికారుల రాత్రి వేళలో గస్తీ నిర్వహించింది. ఈ క్రమంలో దారిదోపిడి దొంగలు అనుకుని స్థానిక గ్రామస్థులు ఆ బృందంపై దాడి చేశారు. ప్రాజెక్టు చీతాలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో చీత ఆశ రక్షిత ప్రాంతం నుంచి బయటకు తప్పిపోయింది. చీత మెడకు కట్టిన జీపీఎస్ ట్రాకర్‌ను గమనిస్తూ ఫారెస్ట్ అధికార బృందం రాత్రి వేళలో గస్తీ నిర్వహిస్తోంది. బురఖేడా గ్రామ సమీపంలో చీత కోసం వెతుకుతున్నారు. గ్రామం చుట్టూ అప్పటికే నాలుగు సార్లు తిరిగారు. అయితే పశువులను దొంగలించిన ఘటనలు ఇటీవల ఆ గ్రామంలో జరిగిన నేపథ్యంలో.. చీత కోసం గాలిస్తున్న అధికారులను దొంగలని స్థానికులు భావించారు. అంతేగాక వారు ధరించిన దుస్తులు కూడా వారి అనుమానాలను మరింత పెంచాయి. దీంతో రాళ్లతో, కర్రలతో చీతా బృందంపై దాడి చేశారు గ్రామస్థులు. ఈ ఘటనలో నలుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. అటవీ శాఖ వాహనం కూడా పాడైపోయింది. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చదవండి: రూ.లక్ష ఫోన్ కోసం డ్యామ్‌లో నీటిని ఎత్తిపోశాడు.. తీరా చూస్తే.. -
కామారెడ్డి: ఫారెస్ట్ ఆఫీసర్లను బంధించిన తండా వాసులు
సాక్షి, కామారెడ్డి: మాచారెడ్డి మండలం పాత ఎల్లంపేట పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. అటవీ అధికారుల్ని తండా వాసులు బంధించారు. అటవీ భూమిని చదును చేస్తుండగా అధికారులు అక్కడికి వెళ్లారు. తండావాసుల్ని అడ్డుకోగా.. వాళ్లు ఉల్టా అధికారుల్ని బంధించారు. పోలీసుల కథనం ప్రకారం.. అక్కాపూర్ -మైసమ్మ చెరువు దుర్గమ్మ గుడి తండా సమీపంలోని అటవీ భూమిని అక్కడి ప్రజలు చదును చేస్తున్నారు. ఆ సమయంలో అటవీ అధికారులు అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహించిన తండా వాసులు.. అధికారుల్ని బంధించారు. ఈ ఘటనపై స్థానిక మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మాచారెడ్డి డిప్యూటీ రేంజ్ అధికారి రమేష్. దీంతో.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: నెహ్రూ ఓఆర్ఆర్ ప్రవేట్ చేతుల్లోకి..