అనుమానాస్పద స్థితిలో మూడు చిరుతల మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో మూడు చిరుతల మృతి

Published Sat, Jun 24 2023 12:42 AM | Last Updated on Sat, Jun 24 2023 10:04 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: తమిళనాడు, నీలగిరి జిల్లా కూడలూరు అటవీ ప్రాంతంలో మూడు చిరుతలు మృతిచెందాయి. అనుమానాస్పద స్థితిలో ఈ మరణాలు ఉండడంతో అటవీశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. నీలగిరి జిల్లా కూడలూరు పరిధిలో బంధిపుర పులుల అభయారణ్యం ఉంది. ఇక్కడి మంగళ గ్రామంలో ఏడాది వయస్సు ఉన్న ఓ చిరుత మరణించినట్టు సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. చిరుతల మధ్య గొడవ జరిగిన తరహాలో ఆ పరిసరాలు ఉండడం, దాడిలో ఈ చిరుత మరణించి ఉంటుందని భావించారు.

పోస్టుమార్టం సైతం నిర్వహించారు. అదేసమయంలో కూత వేటు దూరంలోని తేహం అనే ప్రాంతంలో మరో మగ చిరుత మృతదేహం బయటపడింది. ఈ రెండు చిరుతలు పరస్పరం దాడి చేసుకుని మరణించి ఉంటాయని భావించారు. అయితే, ఇక్కడికి సమీపంలోని కుందలుపేట వద్ద మరో చిరుత మరణించి ఉండడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఇది విషంతో కూడిన మాంసం తినడంతో మరణించినట్ట విచారణలో తేలింది. ఈ చిరుతలు మరణించి మూడు రోజులై ఉండవచ్చునని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో అటవీశాఖ అధికారి రమేష్‌ పర్యవేక్షణలో సిబ్బంది విచారిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement