సాక్షి, ఆదిలాబాద్ జిల్లా: అటవీ అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఘటన జరిగింది. తెల్లవారుజామున కేశవపట్నం గ్రామంలో అటవీ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కార్డెన్ సెర్చలో పలు ఇళ్లలో కలప దుంగలు, ఫర్నిచర్ దొరికాయి. కలప దుంగలు స్వాధీనం చేసుకుంటున్న క్రమంలో అటవీ అధికారులపై గ్రామస్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో అటవీ సిబ్బంది భయంతో పరుగులు తీశారు.
ఈ ఘటనలో ఇద్దరు అటవీశాఖ సిబ్బందికి గాయాలయ్యాయి. అటవీ శాఖ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనలో బీట్ ఆఫీసర్ జాధవ్ నౌశిలాల్ స్వల్పంగా గాయపడ్డారు. అటవీ శాఖకు సంబంధించిన ఓ వాహనంంపై దాడి చేసిన స్థానికులు అద్దాలు పగలగొట్టారు. కేశవపట్నం చేరుకున్న పోలీసు బలగాలు.. గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. దాడి విషయాన్ని అటవీ శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.
ఇదీ చదవండి: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు
Comments
Please login to add a commentAdd a comment