villagers
-
నాగర్ కర్నూల్ జిల్లా మైలారంలో ఉద్రిక్తత
-
ఆదిలాబాద్: అటవీ శాఖ సిబ్బందిపై గ్రామస్తుల రాళ్ల దాడి
సాక్షి, ఆదిలాబాద్ జిల్లా: అటవీ అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఘటన జరిగింది. తెల్లవారుజామున కేశవపట్నం గ్రామంలో అటవీ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కార్డెన్ సెర్చలో పలు ఇళ్లలో కలప దుంగలు, ఫర్నిచర్ దొరికాయి. కలప దుంగలు స్వాధీనం చేసుకుంటున్న క్రమంలో అటవీ అధికారులపై గ్రామస్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో అటవీ సిబ్బంది భయంతో పరుగులు తీశారు.ఈ ఘటనలో ఇద్దరు అటవీశాఖ సిబ్బందికి గాయాలయ్యాయి. అటవీ శాఖ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనలో బీట్ ఆఫీసర్ జాధవ్ నౌశిలాల్ స్వల్పంగా గాయపడ్డారు. అటవీ శాఖకు సంబంధించిన ఓ వాహనంంపై దాడి చేసిన స్థానికులు అద్దాలు పగలగొట్టారు. కేశవపట్నం చేరుకున్న పోలీసు బలగాలు.. గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. దాడి విషయాన్ని అటవీ శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.ఇదీ చదవండి: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు -
దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసనలు
-
లగచర్ల బాధితులతో NHRCని కలిసిన బీఆర్ఎస్ నేతలు
-
తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిసిన లగచర్ల గ్రామస్తులు
-
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి.. లగచర్లలో ఉద్రిక్తత
వికారాబాద్, సాక్షి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు చేదు అనుభవం ఎదురైంది. దుద్యాల మండలం లగచర్లకు వెళ్లిన ఆయనకు నిరసన సెగ తగలడంతో పాటు గ్రామస్తులు దాడి చేశారు. లగచర్లలో సోమవారం ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణ జరిగింది. దుద్యాల, లగచర్ల పోలేపల్లి, లగచర్ల తాండలో ప్రజలతో చర్చించేందుకు కలెక్టర్ సహా అధికారులు వచ్చారు. అయితే ఫార్మా కంపెనీకి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై దాడి జరిగినట్లు సమాచారం. ఆపై గ్రామస్తులు పట్టరాని కోపంతో అధికారుల వాహనాలపై గ్రామస్తులు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆ వెంటనే అధికారులంతా అక్కడి నుంచి వెళ్లేపోయే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం లగచర్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. భారీగా పోలీసులు మోహరించారు. -
వరదలకు కొట్టుకుపోయిన రోడ్డు.. డోలీనే అంబులెన్స్‌గా మార్చి..
చంపావత్: ఉత్తరాఖండ్‌లో హృదయవిదారక ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా చంపావత్ జిల్లాలోని సీల్ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఈ గ్రామానికి ఇతర ప్రాంతాలతో సంబంధం పూర్తిగా తెగిపోయింది. అయితే ఇదే సమయంలో గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలు లక్ష్మీదేవి(60)ని ఆస్పత్రికి తరలించడంలో చేయూతనందించి మానవత్వాన్ని చాటుకున్నారు ఆ గ్రామస్తులు.గ్రామం నుంచి ఆస్పత్రికి వెళ్లే రోడ్డు పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో గ్రామస్తులు డోలీ సాయంతో బాధితురాలు లక్ష్మీదేవిని సుమారు మూడు కిలోమీటర్లు ముందుకు తీసుకువెళ్లి, ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీల్ గ్రామంలో ఉంటున్న జోగా సింగ్ భార్య లక్ష్మీదేవి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఆస్పత్రికి తరలించేందుకు రోడ్డు మార్గం సరిగాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామస్తులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. డోలీ సాయంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. గంగలి, నేత్ర సలాన్‌ల మధ్య రోడ్డు పూర్తిగా మూసుకుపోయిందని గ్రామస్తులు తెలిపారు. వీలైనంత త్వరగా రోడ్డును బాగుచేయించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. सड़क बंद एंबुलेंस बनी 'डोली'..उत्तराखंड: चंपावत में ग्रामीणों ने तीन किलोमीटर पैदल चलकर सड़क तक बीमार महिला को ऐसे पहुंचाया.#Uttarakhand । #Champawat । #Ambulance pic.twitter.com/7sL9cnRqCL— NDTV India (@ndtvindia) September 23, 2024ఇది కూడా చదవండి: మానవత్వమా.. కళ్లు మూసుకో! -
లావేరు మండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న అదపాక గెడ్డ
-
ఓటింగ్‌ను బహిష్కరించిన గ్రామస్తులు
ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు ఈరోజు(సోమవారం) ఐదో దశ పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైనా యూపీలోని ఒక గ్రామంలో ఇప్పుటికీ ఒక్క ఒటు కూడా పడలేదు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం యూపీలోని కౌశాంబి పరిధిలోని హిసంపూర్ మాడో గ్రామానికి చెందిన వేలాది మంది గ్రామస్తులు ఓటు వేయడానికి నిరాకరించారు. గ్రామంలోని కూడలి వద్ద ఓటింగ్ బహిష్కరణకు సంబంధించిన పోస్టర్లు అతికించారు. అయితే ఓటరు కేంద్రం వద్ద ఉన్న ఎన్నికల సిబ్బంది ఓటర్ల కోసం వేచి చూస్తున్నారు. మధ్యాహ్నం కావస్తున్నా ఒక్కరు కూడా ఓటు వేయలేదు.గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, దీనిపై ఇంత వరకు ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా నోరు మెదపలేదని వారు మీడియా ముందు వాపోయారు. అందుకే తాము ఓటింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. గ్రామపెద్ద వీరేంద్ర యాదవ్ మాట్లాడుతూ గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు లేదని, రైలు పట్టాలు దాటి వెళ్లాల్సి వస్తున్నదన్నారు. గ్రామానికి చెందిన పిల్లలు చదువుకోడానికి రైల్వే లైన్ దాటి వెళుతున్నారన్నారు.తాము ఇక్కడి రైల్వేలైన్‌పై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజాప్రతినిధులు కోరగా హామీ ఇచ్చి, దానిని విస్మరించారన్నారు. గ్రామస్తులంతా పోలింగ్ కేంద్రం బయటే నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వారిని ఒప్పుంచేందుకు ప్రయత్నించినా , వారు తమ డిమాండ్లు నెరవేరేవరకూ ఓటు వేయబోమని తెగేసి చెప్పారు. -
ప్రియాంక ఉంటేనే ఓటు.. గ్రామస్తుల హెచ్చరిక!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలో ఆసక్తికర రాజకీయం నెలకొంది. ఐదో దశ నామినేషన్లకు గడువు సమీపిస్తున్నా, అటు రాయ్‌బరేలీ, ఇటు అమేధీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులెవరనేది కాంగ్రెస్ ఇంకా వెల్లడించలేదు. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ పేరు వినిపించింది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఇక్కడి పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లు అయోమయంలో చిక్కుకున్నారు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో రాయ్‌బరేలీ జిల్లాలోని కనకపూర్ గ్రామస్తులు మరో ముందడుగు వేశారు. గ్రామం బయట ‘ప్రియాంకా గాంధీ పోటీ చేయకుంటే తాము ఓటు వేయం’ అని రాసివున్న బ్యానర్‌ను ఉంచారు. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీచేయకుంటే ఓటింగ్‌ను బహిష్కరిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. గాంధీ కుటుంబంతో తమ అనుబంధం ఏళ్ల నాటిదని, అందుకే గాంధీ కుటుంబం నుండి ప్రియాంక లేదా రాహుల్ ఇక్కడి నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.మరోవైపు అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాంధీ కుటుంబం ఆసక్తి చూపడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంకా గాంధీకి రాయ్‌బరేలీ స్థానం నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని, రాహుల్ గాంధీ వయనాడ్ స్థానానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాల అభ్యర్థులను కాంగ్రెస్ నేడు (బుధవారం) ప్రకటిస్తుందనే వార్త వినిపిస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేకుంటే కాంగ్రెస్ ప్లాన్ బీని సిద్ధం చేసినట్లు సమాచారం. -
ఈ ఊరు మాది.. అందరూ ఖాళీ చేయండి!
కిషోర్‌కుమార్ పెరుమాండ్ల, మహబూబ్‌నగర్: ఆ గ్రామానికి 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఐదేళ్ల క్రితం గ్రామపంచాయతీగా ఆవిర్భవించింది. 200 కుటుంబాలు.. 1,000 మంది జనాభా. ఇందులో నాలుగు సామాజిక వర్గాలకు చెందిన వారు ఉండగా.. ఎక్కువగా బోయ, ఆ తర్వాత కుర్వ, ముస్లిం, గౌడ్లు ఉన్నారు. చాలావరకు వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నారు. అంతా బాగానే ఉన్న ఆ ఊరుకు ఇప్పుడు ఆపదొచ్చింది. కొందరు వ్యక్తులు గ్రామం మొత్తాన్ని ఖాళీ చేయించి, 200 కుటుంబాల్ని నిరాశ్రయుల్ని చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి రాజకీయ నాయకులు, పోలీసులు తోడుకావడంతో పల్లెవాసులు ఎప్పుడు ఇల్లు వదిలి పోవాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని చమన్‌ఖాన్‌దొడ్డి వాసుల దీనగాథపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. అనుబంధ గ్రామం నుంచి పంచాయతీగా.. చమన్‌ఖాన్‌దొడ్డి మొదట్లో మల్లంపల్లి గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉండేది. శాసనసభ, లోక్ సభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ గ్రామంలోని ఓటర్లు మల్లంపల్లికి వెళ్లి ఓటు వేసేవారు. ఐదేళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినప్పుడు చమన్‌ఖాన్‌దొడ్డి కూడా నూతన గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం 450 మంది ఓటర్లు ఉన్నారు. భూమి మొత్తం మాదేనంటూ.. ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించిన భూమి మొత్తం తమదేనంటూ.. ఈ ప్రాంత పూర్వీకుల వారసులుగా చెప్పుకుంటున్న ముగ్గురు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. వీరికి ఎక్స్‌పార్టీ డిక్రీ ఆర్డర్ వచ్చింది. దీంతో వారు కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, ఊరు ఖాళీ చేయమంటూ గ్రామస్తులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన పరిస్థితుల నేపథ్యంలో.. రాజకీయ నాయకులు, పోలీసులు కూడా వారికే దన్నుగా నిలవడంతో స్థానికులు లబోదిబోమంటున్నారు. మేము మూడు తరాలుగా ఇక్కడే ఉంటున్నామని, మా పెద్దలు ఇక్కడే పుట్టి, ఇక్కడే చనిపోయారని.. ఉన్న ఫళంగా ఊరు వదిలి పొమ్మంటే ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎస్పీ రితిరాజ్‌కు వినతిపత్రం అందజేశారు. మరి ప్రభుత్వం ఎలా అభివృద్ధి పనులు చేపట్టింది?! గ్రామంలో ప్రభుత్వ పంచాయతీ కార్యాలయం, ఐదో తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలున్నాయి. గ్రామంలో బ్రహ్మంగారి గుడి, కనకదాసు గుడి, దర్గా, మసీదు, పీర్లగుడి, ఆంజనేయస్వామి, శివాలయాలతో పాటు గ్రామ దేవతలైన మారెమ్మ, సుంకులమ్మ, బొడ్రాయి, సావిడి వంటి నిర్మాణాలు ఏళ్ల క్రితమే ఉన్నాయి. అదేవిధంగా గ్రామంలో అంతర్గత రహదారులు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం, వాటర్ ట్యాంకులు వంటివి కూడా ప్రభుత్వం ఎప్పుడో ఏర్పాటు చేసింది. గ్రామ కంఠానికి చెందిన భూముల్లో ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు రికార్డులు ఉండగా.. ఇప్పుడు ఎవరో వచ్చి ఈ భూమి తమదే అని ఎలా అంటారని, ఎలా ఖాళీ చేయమంటున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఊరొదిలి పొమ్మంటే ఎలా? నేను ఈ గ్రామంలోనే పుట్టా. మా తాత, ముత్తాతలు కూడా ఇక్కడే పుట్టి, ఇక్కడే చనిపోయారు. ప్రస్తుతం మా కుటుంబ సభ్యులమే 30 మంది వరకు ఉన్నాం. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. అకస్మాత్తుగా ఊరు వదిలిపొమ్మంటే ఎలా కుదురుతుంది? – భీమయ్య గ్రామకంఠం కిందే ఉంది.. గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసినప్పుడు అప్పటి తహసీల్దార్ వచ్చి మా ఊరు మొత్తం 9 ఎకరాల వరకు ఉంటుందని చెప్పారు. రెవెన్యూ రికార్డులో భూమి మొత్తం గ్రామ కంఠం కిందే ఉందన్నారు. అలాంటిది మా ఊరి ముఖం ఒక్కసారి కూడా చూడని వారు వచ్చి.. గ్రామం మొత్తం మాదే, ఖాళీ చేసి వెళ్లిపొమ్మంటున్నారు. ఇదెక్కడి న్యాయం? – ఆంజనేయులు ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతాం చమన్‌ఖాన్‌దొడ్డికి సంబంధించిన అంశం ఇప్పటివరకు నా దృష్టికి రాలేదు. దీనిపై గ్రామస్తులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. – రాంచందర్, ఆర్డీఓ, గద్వాల -
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు: వేలాదిమందికి అన్నదానం
అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకలతో గుజరాత్‌లోని జామ్‌నగరం సందడిగా మారిపోతోంది. జామ్ నగరం అనంగానే రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నీతా అంబానీల కుమారుడు పెళ్లి జరుగుతున్న ప్రాంతం అని ఠక్కున చెప్పేలా వార్తల్లో నిలిచిపోయింది. ఆ వివాహ వేడుకకు ముందే ఆ నగరంలో ఏకంగా 14 దేవాలయాలను నిర్మించడంతో ఆ నగరం పేరు మరోసారి మారుమ్రోగిపోయింది. ఇక ప్రీ వెడ్డింగ్ వేడుకనే ఏకంగా అన్నదానంతో ప్రారంభించడంతో ఆ నగర సమీపంలోని గ్రామాల పేర్లు ఒక్కసారిగా తెరమీదకు వచ్చాయి. . ఈ కార్యక్రమంలో భాగంగా అంబానీల కుంటుంబం ఎంతమందికి బోజనాలందించిందంటే.. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డిండగ్ వేడుకలు వచ్చే నెల మార్చి 1 నుంచి 3 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామిక వేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చెంట్‌తో జులై 12 ఘనంగా వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ముందుగా జరగనున్న ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఇరు కుటుంబాలు అన్నదాన సేవతో ప్రారంభించారు. గుజరాతీ సంప్రదాయ వంటకాలతో స్థానికులకు భోజనాలు పెట్టారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం జయప్రదంగా జరిగేలా స్థానికుల ఆశీర్వాదం కోసం అంబానీ కుటుంబం అన్నసేవను ప్రారంభించింది. ఈ అనదానాన్ని జామ్‌నగర్ రిలయన్స్ టౌన్షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో నిర్వహించారు. ఈ అన్నదాన సేవలో రాధికా మర్చంట్ కుటుంభ సభ్యులు కూడా పాల్గొనడం విశేషం. సుమారు 51 వేల మంది స్థానికులకు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో భోజనానికి హాజరైన వారంతా జానపద సంగీతాన్ని ఆస్వాదించారు. ప్రముఖ గుజరాతీ గాయకుడు కీర్తిదాన గాధ్వి తన గాన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అలాగే ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా సంప్రదాయబద్ధంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనే అతిథులకు గుజరాత్‌లోని కచ్ఛ్ లాల్పూర్కు చెందిన మహిళా కళాకారులు తయారు చేసిన సంప్రదాయ కండువాలను అందజేస్తారు. ఇక ఈ ఫ్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఖతార్ ప్రధాని మహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, భూటాన్ రాణి జెట్సన్ పెమా, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, సౌదీ అరాంకో చైర్పర్సన్ యాసిర్ అల్ రుమయ్యన్ ఉన్నారు. (చదవండి: అనంత్ అంబానీ అధిక బరువుకి కారణం ఇదే! కాబోయే భార్య..!) -
Makar Sankranti 2024: సంక్రాంతి వైభవాన్ని కనుమా!
భారతీయులు అందులోనూ దాక్షిణాత్యులు, ముఖ్యంగా తెలుగువారు సంక్రాంతిని ఎంతో వైభవోపేతంగా చేసుకుంటారు. ఆడపడుచులు, అల్లుళ్లతో సహా సంక్రాంతికి మాత్రం తమ స్వగ్రామాలకి చేరుకుంటారు అందరు. సంక్రాంతి వైభవం అంతా పల్లెలలో చూడాలి. సంక్రాంతి పండుగ సమయానికి పంటలు ఇంటికి వచ్చి రైతులు, వ్యవసాయ కూలీలు గ్రామంలో ఉన్న అందరు కూడా పచ్చగా ఉంటారు. ప్రకృతి కూడా పచ్చగా కంటికి ఇంపుగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ΄పొలం పనులు పూర్తి అయి కాస్త విశ్రాంతి తీసుకునే వీలుండటంతో సందడి, సంబరాలు. తమకి ఇంతటి భద్రత కలగటానికి మూలమైన భూమిని, రైతులను, కూలీలను, పాలేర్లను, పశువులను, పక్షులను అన్నింటికి కృతజ్ఞతను తెలియచేయటం, తమ సంపదను సాటివారితో బంధుమిత్రులతో పంచుకోవటం ఈ వేడుకల్లో కనపడుతుంది. భారతీయులు చాంద్రమానంతో పాటు కొన్ని సందర్భాలలో సూర్యమానాన్ని కూడా అనుసరిస్తారు. అటువంటి వాటిల్లో ప్రధానమైనది మకరసంక్రమణం. మకరసంక్రమణంతో సూర్యుడి గమనం దిశ మారుతుంది. అప్పటి వరకు దక్షిణదిశగా నడచిన నడక ఉత్తర దిక్కుగా మళ్ళుతుంది. అందుకే ఆ రోజు నుండి ఆరునెలలు ఉత్తరాయణం అంటారు. అప్పటికి ఆరునెలలనుండి దక్షిణాయనం. ఈ పుణ్య సమయంలో చేయవలసిన విధులు కూడా ఉన్నాయి. వాటన్నింటిని సంక్రాంతి సంబరాల్లో మేళవించటం జరిగింది. ► విధులు అంతరిక్షంలో జరిగే ఖగోళవిశేషాల ననుసరించి ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనుషులు చేయవలసిన పనులను పండుగ విధులుగా చెప్పటం మన ఋషుల ఘనత. అవి మనిషి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగాను ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞాన్ని అందించేవిగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయికి ఎదగటానికి సహాయం చేసేవిగా ఉంటాయి. మన పండుగలు బహుళార్థసాధక ప్రణాళికలు. అన్నింటిని సమీకరించి ఎప్పుడేం చెయ్యాలో చక్కగా చె΄్పారు. ► పెద్దపండగ సంక్రాతిని పెద్దపండగ అంటారు. చాలా పెద్ద ఎత్తున చేసుకోవటంతో పాటు ఎక్కువ రోజులు చేసుకుంటారు. సంక్రమణం జరిగే రోజు పండుగ, ముందురోజు భోగి, మూడవరోజు కనుము. నాలుగవ రోజు ముక్కనుము. నిజానికి పండుగ వాతావరణం నెలరోజుల ముందు నుండే నెలకొంటుంది. ► నెల పట్టటం సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15వ తేదీ కాని, 16 వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14వ తేదీ వరకు కాని, 15 వ తేదీ వరకు కాని ఉండే ధనుర్మాసం అంతా ప్రత్యేకంగానే కనపడుతుంది. దీనిని ‘నెలపట్టటం’ అని అంటారు. అంటే ఈ నెల అంతా ఒక ప్రత్యేక మైన పద్ధతిని పాటిస్తామని చెప్పటం. ఇళ్ల ముందు ఆవుపేడ కళ్ళాపిలో అందంగా తీర్చి దిద్దిన రంగవల్లికలు, ఆకాశంలో నుండి క్రిందికి దిగి వచ్చినట్టు కనపడే చుక్కల ముగ్గుల మధ్యలో కంటికింపుగా దర్శనమిచ్చే గొబ్బెమ్మలు, గొబ్బెమ్మల పైన అలంకరించ బడి పలకరించే బంతి, చేమంతి, గుమ్మడిపూలు, వాటిని తొక్క కుండా ‘హరిలో రంగ హరి’ అంటు అందరిని తన మధురగానంతో మేలుకొలుపుతున్న హరిదాసులు, వారు వెళ్ళగానే ‘అయ్యగారికీ దండం పెట్టు, అమ్మగారికీ దండం పెట్టు’ అంటు గంగిరెద్దుల నాడించేవారు, జంగంవారు, బుడబుక్కలవారు ...... తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించే ఎంతోమంది జానపద కళాకారులు – అదొక కలకలం, అదొక కళావిలాసం. ఈ నెల అంతా విశిష్టాద్వైత సంప్రదాయాన్ననుసరించే వారు తిరు΄్పావై లేక శ్రీవ్రతం లేక స్నానవ్రతం అనే దాన్ని ఆచరిస్తారు.ద్వాపరయుగం చివరలో గోపికలు ఆచరించిన ఈ వ్రతాన్ని గోదాదేవి ఆచరించి శ్రీరంగనాథుని వివాహం చేసుకుని ఆయనలో సశరీరంగా లీనమయింది. వైష్ణవదేవాలయాల్లో తెల్లవారుజామునే కృష్ణుని అర్చించి బాలభోగంగా నివేదించిన ప్రసాదాన్ని తెల్లవారక ముందే పంచిపెడతారు. ప్రకృతిలో భాగమైన సర్వజీవులు స్త్రీలు. వారు పరమపురుషుని చేరుకోవటం కోసం చేసే సాధన మధురభక్తి మార్గం. దానికి ప్రతీక అయిన గోదాదేవి చేసిన వ్రతాన్ని ఈ నెలరోజులు సాధకులు, భక్తులు అందరు ఆచరిస్తారు. ఆండాళు తల్లి ఆ రోజుల్లో గోపికలుగా భావించుకున్న తన చెలులను వ్రతం చెయ్యటానికి స్నానం చేద్దాం రమ్మని మేలు కొలుపుతుంది. ఇప్పుడు ఆపని హరిదాసులు చేస్తున్నారు. ► సంక్రాంతి అసలు ప్రధానమైనది సంక్రాంతి, అంటే సంక్రమణం జరిగే రోజు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే రోజు. ఈ పుణ్య కాలంలో దానాలు, తర్పణాలు ్రపాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం, పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయని వారు ఈ రోజు చేస్తారు. అసలు మూడు రోజులు పేరంటం చేసే వారున్నారు. దక్షిణాయణం పూర్తి అయి పితృదేవతలు తమ స్థానాలకి వెడితే మళ్ళీ ఆరునెలల వరకు రారు కనుక వారికి కృతజ్ఞతా పూర్వకంగా తర్పణాలు ఇస్తారు. కొంతమంది కనుము నాడు తర్పణాలిస్తారు. ► కనుము తమ ఇంటికి పంట వచ్చి ఆనందంగా ఉండటానికి కారణభూతమైన భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి కూడా తమ కృతజ్ఞతలని తెలియ చేయటం ఈ పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి, పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె΄పొటేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు. పాలేళ్ళకి ఈరోజు సెలవు. వాళ్ళని కూడా తలంటు పోసుకోమని కొత్తబట్టలిచ్చి పిండి వంటలతో భోజనాలు పెడతారు. సంవత్సరమంతా వ్యవసాయంలో తమకు సహాయం చేసిన వారి పట్ల కతజ్ఞత చూపటం నేర్పుతుంది ఈ సంప్రదాయం. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవ మర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పక్షులు వచ్చి తమ పంట పాడుచేయకుండా ఉండేందుకు, పురుగులని తిని సహాయం చేసినందుకు వాటికి కూడా కృతజ్ఞతను ఆవిష్కరించేందుకు వరి కంకులను తెచ్చి చక్కని కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ్రపాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’, ‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’ అనే సామెతలు కనుముకి పితదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. ► ముక్కనుము ముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలిసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని మాంసాహారం తినటానికి కేటాయిస్తారు. ఒక పండుగ, అందులోనూ ప్రధానమైన పండుగను చేసుకోవటంలో ఎన్ని అంశాలను మిళితం చేసి, వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని పెంపొందించే విధంగా ప్రయోజనాత్మకంగా రూ΄పొందించారో మన పెద్దలు! – డా. ఎన్.అనంతలక్ష్మి -
తుఫాన్ ప్రభావిత బాధితులతో సీఎం వైఎస్ జగన్...అందరికీ సాయం చేస్తాం
-
రేవంత్ రెడ్డి చదువుకున్న బడి ఇదే..!
-
కేసీఆర్‌ను కలిసిన చింతమడక గ్రామస్తులు
సిద్దిపేట రూరల్/మర్కూక్ (గజ్వేల్): బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును తన స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు కలిశారు. బుధవారం తొమ్మిది బస్సుల్లో సుమారు 540 మంది గ్రామస్తులు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో కేసీఆర్‌ను పలువురు ప్రముఖులు కలుస్తున్నందున వారిని లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో సుమారు రెండు గంటలపాటు నిరీక్షించారు. అనంతరం లోపలికి అనుమతించారు. దీంతో కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఆయన్ను చూసిన గ్రామస్తులు భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ నినాదాలు చేశారు. అయితే...ఆయన మాట్లాడకుండానే అభివాదం చేస్తూ లోపలికి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు ఉన్నారు. -
గ్రామస్తులు, బీఆర్ఎస్ కార్యకర్తలు మధ్య వాగ్వాదం
-
ఏకంగా రోడ్డునే దోచేశారు: అవాక్కవుతున్న నెటిజన్లు, వైరల్ వీడియో
బిహార్‌లో మరో వింత చోరీ వైరల్‌గా మారింది. ఏకంగా నిర్మాణంలో ఉన్న రోడ్డునే లూటీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిహార్ రాష్ట్రంలోని జెహనాబాద్‌లో ఈ షాకింగ్ దొంగతనం చోటు చేసుకుంది. ఈ వైరల్ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహంతో స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. జెహనాబాద్ గ్రామానికి ముఖ్యమంత్రి గ్రామ సడక్ యోజన కింద రహదారిని నిర్మిస్తున్నారు. కాంట్రాక్టర్ కార్మికులతో కాంక్రీట్ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. కాంట్రాక్టర్లు పాక్షికంగా పూర్తి చేసినా సిమెంట్ పనులను మాత్రం ప్రారంభించలేదు. దీంతో అదును చూసి గ్రామస్తులంతా కలిసి నిర్మాణంలో ఉన్న రోడ్డును లూటీ చేశారు. కొత్తగా వేసిన కాంక్రీటు రోడ్డుకు సంబంధించిన కాంక్రీటు, ఇసుక, చిప్స్ మొత్తాన్ని క్షణాల్లోనే ఖాళీ చేసేశారు. ఒకరికొకరు పోటీ పడి మరీ తన పని కానిచ్చారు. పాక్షికంగా నిర్మించిన రహదారి నిర్మాణ సామగ్రిని దొంగిలించినట్లు గుర్తించినట్లు అధికారులు ధృవకరించారు. జిల్లా కేంద్రానికి మంచి కనెక్టివిటీని అందించాలనే లక్ష్యంతో స్థానిక RJD ఎమ్మెల్యే సతీష్ కుమార్ రెండు నెలల క్రితం రహదారికి శంకుస్థాపన చేశారు. అయితే సిమెంట్ పనులు పూర్తి కాకుండానే గ్రామస్తులు చోరీ చేశారని సతీష్ ఆరోపించారు. దీనిపై మఖ్దుంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసామన్నారు. ఇది ఇలా ఉంటే అయితే రోడ్డు వేయకముందే అడ్డగోలుగా దోచుకున్నారనీ ఈ రహదారిని ఇంకా మూడు కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉందని వారు చెప్పారు. వాస్తవానికి ఇది స్థానిక పాలనా యంత్రాంగం నిర్లక్ష్యం, వైఫల్యమేనని గ్రామానికి చెందిన కొంతమంది విమర్శించారు. అయితే బిహార్‌లో ఇలాంటి వింత వింత చోరీలు ఇదే మొదటిసారి కాదు. గతంలో రైల్వే ట్రాక్స్ దొంగిలించారు. మరోసారి రైల్వే ఇంజిన్ మాయమైంది. ఆ తరువాత ఏకంగా వంతెననే ఎత్తుకుపోయారు. ఇపుడు మరో దొంగతనంతో తమ రికార్డును తామే అధిగమించారు. ప్రస్తుతం కాంక్రీటు రోడ్డు చోరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటువంటి దొంగలపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వారిని 5 సంవత్సరాల పాటు అన్ని ప్రభుత్వ సౌకర్యాలకు దూరంగా ఉంచాలంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. बिहार में लोगों ने मुख्यमंत्री की सड़क ही लूट ली! जहानाबाद के मखदूमपुर के औदान बीघा गांव में मुख्यमंत्री सड़क ग्राम योजना के तहत सड़क बनाई जा रही थी. दावा है कि ढलाई के समय लोग पूरा मटेरियल ही लूट ले गये. बताया जा रहा कि इससे पहले भी ये सड़क ऐसे ही लूट ली गई थी. (@AdiilOfficial) pic.twitter.com/ZCBiStXr5Y — Utkarsh Singh (@UtkarshSingh_) November 3, 2023 -
ఇంట్లో వాళ్లే కాదు... మొత్తం ఊరంతా
కొండకు బోయొచ్చినప్పటి నుంచి కత్తి గెలిసిన కోడే గతం మా జయక్క మగం ఎలిగిపోతావుంది. కుమ్మరి ఎంగటప్ప చేత్తో తయారు చేసిన మొంటి ఉండీని మా జయక్క పది రూపాయలుకి ఇంటికి కొనక్కచ్చింది. ఎంగటప్ప దానికి ఎంతో సుందరంగా పూజులు కూడా తీర్సినాడు. ఆ ఉండీని ఎంగట్రమణ సామి పటాలకాడ పెట్టి ‘ఉండీ నిండిన్నాపొద్దు దావకర్సులకు ఈ దుడ్డు పెట్టుకొని నీ కొండకు వస్తాను సామీ’ అని మొక్కుంది. ఆ పొద్దు నుండి జయక్క చీర కొంగున ముడేసిన రూపాయి బిల్లలు, అరుదుగా చేతికి మిగిలే ఐదు రూపాయల బిల్లలు, ఎబుడన్న కతగెతిగ మిగిలిన యాబై రూపాయల నోట్లు, పంటపలం అమ్మిన సొమ్ములో అవసరం కోసం అప్పుచేసిన డబ్బుల్లో, కూలి డబ్బుల్లో కొద్దిగా తీసి ఉండీలో ఏసేది. అన్ని రకాల డబ్బుల్లో నుండి ఈ నోటు పక్కకు పోయిన బాద లేదులే అనుకోని ఏసిన నూరు రుపాయల నోట్లు, ఎంత ఉన్నా మనచేతిలో కర్సయిపోతుంది అనుకోని తెంపుచేసి ఏసిన ఒగటో రెండో ఐదు నూర్లు కాగితాలు కూడా ఉండేవి. ఈ రకంగా మూడేండ్ల నుండి కూడేసిన ఉండీ నిండి నిబ్బాలాడతా ఉంది. "మా ఊర్లోవాల్లు తిరుపతి కొండకు పోవాలంటే ఒగ ఇంట్లోవాల్లే పోరు. ఊర్లో కాగలిగినోల్లు అమ్మలక్కలు, అబ్బలబ్బలు మాట్లాడుకుని ఒగ పది పదైదు మందన్న జమై పోతారు." జయక్క నన్ను నా మొగున్ని పైనం చేసే. ‘ఇద్దరం వొచ్చేస్తే ఇంటికాడ మనిసి ఉండల్ల ఆ యమ్మిని తోడుకొనిపో’ అనే నా మొగుడు. ‘ఏం పాపా ఈ పైనం అట్ల పదాం పద మూడేళ్ల నాటి మొక్కుబడి తీర్సుకొని వద్దాము’ అనే జయక్క. ‘సర్లే’ అంటి. తిరపతికి పోను జతకు మనిసి దొరికితే సాలు అని కాసుకోనుండేవాల్లు. మా ఊరి లింగమ్మత్త, రెడ్డమ్మ, సరోజి, మగోల్లు నాగన్న, ఎంగటప్ప, రమణన్న.. అంతా తొమ్మిది మంది జమైనాము. మా ఊరు దావన పోయే తొమ్మిదిగంట్ల రైలు ఎక్కితే సరిగ్గా రెండు గంటలకు తిరపతిలో దిగతాం అని ఈ పొద్దే అందరం మాట్లాడుకొని పయనాలు కడతా ఉండాము. మా జయక్క ఉండీని చేతికి ఎత్తుకొని బరువు చూసే. కోటీసురాలు ఐనట్టు ఎలిగిపోతా వుంది మగం. ఆ వుండి పగలగొట్టే. సిల్లరంతా జల్లున రాలే. నోట్లన్నీ ఓపక్క, సిల్లరంతా ఓ పక్క లెక్కేసుకుండే. అంతా మూడేలు పైచిలుకు ఉన్నింది. ‘ఈ దుడ్డు మల్ల మిగిలించుకొని రాకూడదంట పాపా. అంతా కర్సు పెట్టేయలంట’ అని నాకు బింకంగా సెప్తా ఉంది. ఆ మరుసునాడు తెల్లారుజామునే లేసి అందరం తయారై ఒగ పూటకు సింతపులుసన్నం, గోదుమ రొట్లు, చెనిగ్గింజల గెట్టూరిబిండి ఏసి మనిసికి ఒగ పట్లాము కట్టుకొని బ్యాగుల్లో పెట్టుకొని పోతిమి. మా జయక్క వక్కాకు బలే ఏస్తుంది. ‘పాపా నాకు అన్నము లేకపోయినా ఉంట. వక్కాకు లేకుండా ఉండ్లేను’ అంటుంది. ఈ అమ్మకు దోడుమైనోల్లే సరోజమ్మ.. లింగమ్మ కూడా. ఈ ముగ్గురూ మేము పోయే తొక్కు వక్కాకు సిక్కదేమో అని మల్ల కొండ నుంచి తిరుక్కోని ఇంటికి వొచ్చిందంక ఉండేటిగా టౌనుకు పోయి కాలకట్ట తమలపాకులు, పిడుకుడు వక్కలు, పావు సేరు దుగ్గు తెచ్చుకున్నారు. మొగోల్లు మా యంగటన్న బీడీలు ఇపరీతంగా తాగతాడు. నాగన్న, రమణన్న కూడా తాగేవాల్లే. వాల్లకు కావాల్సిన బీడీలు, అగ్గిపెట్లు తెచ్చుకొని బ్యాగుల్లో పెట్టుకున్నారు. రెడ్డెక్క నేను తప్పనిడిసి మిగతా ఏడు మందికి బస్సెక్కినా రైలెక్కినా కిటికీ పక్కన వారసీటే కావాలంటారు వక్కాకు ఊంచుకోను. గెడిసేపన్నా వాల్ల నోర్లు ఊరికే ఉండవు. మేక నమిలినట్లు నమలతానే ఉంటారు. యాడబడితే ఆడ ఊంచుతారు. మాకు సగిచ్చదు. మేము వాల్ల మింద సిటుమొరుక్కుంటానే తిరపతి అలిపిరి మెట్లకాడికి పోతిమి కాలిదావన పోదామని. మా జయక్క కొండకు ముందే రెండుసార్లు వొచ్చింది. ఎంగటన్న కూడా ముందు వొచ్చినోడే. మిగతావాల్లకు ఇదే తొలిసారి. అందరం కియిలోకి పొయి నిలబడి ఆడ నుంచి బ్యాగుల్ని మనుసుల్ని తనికీ చేసే తావుకు పొయినాం. వీలంతా ఎనకెనకనే గుంజిట్లు పెడతా ఉంటే నేను రెడ్డెక్క ముందుగా పోతిమి. మావి చూసి అంపించేసిరి. మేము కడగా బారడు దూరం నిలబడితిమి. ఈల్లు ఎంచేపటికీ రాలా. మల్లొచ్చిరి. ఏమట ఇంతసేపు అంటే మా జయక్క మగం తప్ప మిగతా అందరివీ చింతాకంత అయిపొయినాయి. లింగమత్త ఐతే ఏడుపు మగమే పెట్టేసింది. ఎంగటన్న మటుకు నగుమొగంతో కనపడే. సరోజమ్మ ఉండుకొని ‘నేను నా వక్కాకు తిత్తి కనపడదు కదా అని పావడ నాడాకు కట్టి రెండు కాళ్ళ సందులో దిగేసుకోనుంటే అదెవుతో పోలీసిది ఒల్లంతా పామేటప్పుడు మూట పెద్దగా ఉండి చేతికి తగిలింది. తీయే అని పెరుక్కొని అంతా ఇసిరి పారేస. వక్కాకు పోతేపానీ బంగారట్ల తిత్తి ఆరు పారవులు ఏసి కుట్టిండేది. ఆరు ఏండ్లుకు ముందు కనుపూరి గంగమ్మ తిరణాల్లో తీసుకోనుంటి. ఎంత దుడ్డు మోసిందో ఎంత వక్కాకు మోసిందో! దుడ్డుతో ఎక్కువ బిక్కటైనబుడు తిత్తిని గాలిస్తే ఏదో ఒగ పార్వలో అంతో ఇంతో దొరికేది. అంత అచొచ్చిన తిత్తి పాయనే’ అని ఒకటే బాధపడే. ఇంతలో లింగమ్మ ‘ఓ నీ తిత్తి పోతే మల్ల తీసుకోవచ్చులే నాది సీమెండి పొడువు సున్నంకాయి. మాయమ్మ వాల్ల అమ్మ కాడ నుండి మూడు తరాల కాయి. మాయమ్మ గుర్తుగా అట్లే పెట్టుకో నుంటి. కాయినిండా ఒకసారి సున్నం పెడితే వారమంతా నమిలినా అయిపోయేదికాదు. ఆ సున్నంగాయి మూతకు ఎండి గొలుసు ఏసి, మూడు గెజ్జిలు కట్టి సున్నం లోడుకోను చిన్నగెంటి, పొల్లు గుచ్చుకునే పుల్ల, గుబిలిగెంటి ఇవన్నీ మూతకు కుచ్చు ఏసింటి. నా శనికాటం దాన్ని యాడన్న దాసిపెట్టుకోకూడదా! కడుపు సెన్నిట్టు అయిపోయా’ అని బాధపడే. నేను ఉండుకొని ‘పోతేపోనీలే వక్కాకే కదా ఏమో కలిమి పోయినట్టు ఏడస్తుండారే’ అంటే ‘అయ్యో నాయనా అదే మా పానాదరవ. పది దినాలు పస్తయిన ఉంటాము. గెడిసేపు వక్కాకు లేదంటే తలకాయి ఎర్రియాకోలం పడుతుంది. తెలిసినోల్లను గాని తెలీనోల్లను గాని అడగదామా అనిపిస్తుంది. మే జయా నువ్వు ముందే వచ్చింటివి కదా మాకు చెప్పిండకూడదా ఇంతకు నువ్వేమి చేసినావు’ అని అడిగిరి. ‘నేను వొట్టి తిత్తి నడుములో చెక్కోని వక్కాకు అంత మూటగట్టి గుడ్ల బ్యాగులో నడన పెట్టిన. ఆ నడుసుకొని పోయే మిసన్లో బ్యాగు ఏస్తే అది కిర్రుమనే. ఆ పోలీస్‌ది బ్యాగులో ఏందో ఉంది తీ బయటికి అనే. అమ్మా బజన చెక్కలు గిని అంటే ఏది చూపించు అనే. అవి పైనే ఉన్నాయి ఒగ జత అవి తీసిచూపిస్తే సరే పో అనే. పోనిలే మా ఇల్లిలప దేవుడు ఆ ఎంగట్రమన సామే నన్ను కాపాడినాడు. ఆ యప్ప సాస్టాగా నాపాలిటున్నాడు’ అని చెప్పే జయక్క. కత్తి గెలిసిన కోడేగతం మా జయక్క మగం ఎలిగిపాతా ఉంది. లింగమ్మకు కోపమొచ్చే ‘ఎంత మోసకారుదానివే! నీ యట్లాదాని మాటలకు ఎంగట్రరమణ సామే యామారి పోయినాడంట. నీ యట్లాడిది సామీ నేను అనుకునింది జరిగితే నీకు సిటికెల పందిరి ఏపిస్తాను అని మొక్కునిందంట. దేవుడు ఒరే ఇంతవరకు ఎవరు "తిరపతి కొండన మనకు పావలా బాగం వస్తుంది. దాని ఆనవాలు ఇబుటోల్లకు తెలియక గమ్మునుండారు. అది ఎట్లంటే ముందు కాలాన సామి అడివి మార్గాన తిరగతా ఉంటె దినానికి మూడు జతల చెప్పులు అరిగిపోయేవంట. పతిరోజూ మూడు జతల మెట్లు కుట్టకపోయి ఇచ్చేవాల్లంట మనోల్లు." ఏపీలేదే ఎట్లుంటుంది ఈ సిటికెల పందిరి చూద్దాం అని అసోద్దపోయి ఆ యమ్మ కోరిన మొక్కుతీర్సినాడు. దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడంట ఇంగ ఎప్పుడు వచ్చి ఏపిస్తుంది సిటికెల పందిరి అని. ఆ యమ్మ నలగరు ఆడోల్లను పిలుసుకొనిబొయ్యి నలగర్నీ నాలుగు సమకాలంగా నిలబెట్టి నడిమిద్ద ఆ యమ్మ నిలబడుకొని అందరూ కలిసి సుట్టూ సిటికెలు ఏసిరంట. ఇదేసామి సిటికెల పందిరి నా మొక్కు సెల్లిపోయింది అంటే సామే బెబ్బిర్లకపోయి ఓరే ఎంత యామారిపోయినాను అనుకున్నంట. అట్లా దానివి నువ్వు’ అనే! లింగమ్మ చెప్పిన కతకు అందరం నగుకుంటూ ఉండగానే మగోల్ల మగాలు కూడా సప్పగిల్లినాయి. ఈల్ల బీడీలకట్టలు కూడా పెరుక్కొన్నారు. రమనన్న బీడీలకట్టని సరాయి లోజోబిలో పెట్టుకొని ఉన్నాడు. పోలీసులు తడిమేటప్పుడు చేతికి తగిలి పెరికి అక్కడ బారేసినరంట. నాగన్నది కూడా అట్లే పెరుక్కొన్నారు. ఎంగటప్ప మాత్రానికి బీడీలు కట్ట అగ్గిపెట్టి కట్ డ్రాయర్లో ఆయప్ప మాను కింద పెట్టుకున్నాడంట! ఈయప్ప ముందే రెండుసార్లు కొండకు వచ్చి పోయినాడు అందుకే తెలివి చేసినాడు. ఆయప్పవి మిగిలినాయి. మెటికిలు ఎక్కేటప్పుడు నాగన్న ఊరికే ఉండేదిలే కొండంతా పారజూస్తా ఎదో ఒకటి చెబతానే ఉంటాడు. ‘తిరపతి కొండన మనకు పావలా బాగం వస్తుంది. దాని ఆనవాలు ఇబుటోల్లకు తెలియక గమ్మునుండారు. అది ఎట్లంటే ముందు కాలాన సామి అడివి మార్గాన తిరగతా ఉంటె దినానికి మూడు జతల చెప్పులు అరిగిపోయేవంట. పతిరోజూ మూడు జతల మెట్లు కుట్టకపోయి ఇచ్చేవాల్లంట మనోల్లు. ఎంగట్రమణ సామికి పెండ్లి పెట్టుకున్నారు. చెప్పులు కుట్టే ఆయప్పకు జరం వొచ్చి మూర్తం టయానికి ఇవ్వలేక పెండ్లి అయిపోనంక చెప్పులు కుట్టకపోయి ఇచ్చినాడంట. మూర్తం టయానికి చెప్పులు బిన్నతేలేదని నువ్వు ఎన్ని మెట్లు కుట్టిన నీకు మెట్టు కరువైతుంది అని ఆ దేవుడు శపించినాడు. అందుకే కుట్టేవోనికి మెట్టు కరువు అనేది. ఇప్పుడు కూడా దినామూ మన మాదిగోడు జత మెట్లు కుట్టకపోయి ఆడ పెట్టాల అందుకే కొండన మనకు పావలా బాగం వస్తుంది’ అనే! అయితే ‘మనం దీని గురించి సెరియ తీసుకోవాల్సిందే’ అని ఎకసక్కలాడిరి. సద్ది మూట్లు మోయాలంటే బరువు అదే కడుపులో ఉంటే అంత బరువు ఉండదని నడన అందరూ కూసోని తినేస్తిమి. కొండెక్కి గుండ్లు కొట్టుకొని ఆ దేవుని దర్శనం బాగా చేసుకుంటిమి. గుళ్లో నుండి బయట పన్నాము. లింగమ్మ, సరోజమ్మ.. జయక్క యాడికిపోతే ఆడికి పోయేది ఎనకాలే వక్కాకు కోసం. ఎంగటప్ప యాడికి పోతే ఆడికి నాగన్న రమనన్న బంట్రోతులే గతం బీడీల కోసం పోయేది. అవి ఆయప్ప సామాన్లో పెట్టుకోనున్నివైనా సరే వాల్లు ఇడిసిపెట్లా. ఇదే తంతు ఇంటికి వచ్చిందంక. మా జయక్క మాత్రానికి వక్కాకు మిగిల్చినందుకు ఎంగట్రమణ సామి పటం తెచ్చుకుంది పూజించుకోను! (చదవండి: అన్నింటిలో కన్నా అన్నదానమే గొప్ప దానం! ) -
అనారోగ్యంతో చిరుత.. గ్రామస్థుల ఆకతాయి చేష్టలు!
భోపాల్: మధ్య ప్రదేశ్‌లోని ఓ గ్రామ శివారులోకి చిరుతపులి ప్రవేశించింది. మొదట చిరుతను చూసి భయపడిన జనాలు.. అది ఆవేశంగా, హుషారుగా కనిపించకపోవడంతో ఆశ్యర్యపోయారు. తరువాత దాని దగ్గరకు వెళ్లి పరీక్షించగా.. సదరు చిరుత అనారోగ్యానికి గురైనట్లు తెలుసుకొని దానికి పెంపుడు జంతువుగా చూస్తూ ఆటపట్టించారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేవాస్ జిల్లా ఇక్లేరా సమీపంలోని అడవిలో చిరుత సంచరిస్తూ కనిపించింది. దాన్ని చూసి బెంబేలెత్తిన గ్రామస్తులు దూరంగా పారపోయేందుకు ప్రయత్నించారు. అయితే కొద్దిసేపటికి చిరుత దూకుడుగా లేకుండా నీరసంగా ఉండటం చూసి అది అస్వస్థతకు గురైనట్లు అర్థమైంది. దీంతో గ్రామస్థులు చిరుతపులి చుట్టూ చేరి దానితో ఆడుకోవడం ప్రారంభించారు. పెంపుడు జంతువులా చూస్తూ దానితో సెల్ఫీలు తీసుకున్నారు. కొంతమంది అయితే చిరుతపై ఎక్కి రైడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించారు. చదవండి: ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ.. VIDEO | Rescue operation underway by forest officials in Madhya Pradesh’s Iklera village after a leopard was found by locals in a dazed state. “A team from Ujjain is reaching to capture the leopard and the animal will be shifted based on the directions of the higher officials,”… pic.twitter.com/NHpS0f1Mx6 — Press Trust of India (@PTI_News) August 30, 2023 ఈ విషయాన్ని ఓ గ్రామస్తుడు అటవీశాఖకు సమాచారం అందించాడు. అధికారులు వచ్చే వరకు కూడా కొంతమంది ఆగకుండా దాన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. అయితే ఉజ్జయిని నుంచి రెస్క్యూ టీం ఇక్లెరాకు చేరుకుని చిరుతను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. రెండేళ్ల చిరుతపులిని చికిత్స నిమిత్తం భోపాల్‌లోని వాన్ విహార్‌కు తీసుకెళ్లినట్లు అటవీ అధికారి సంతోష్ శుక్లా తెలిపారు. దానికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు. అయితే తీవ్ర అనారోగ్యంతో ఉన్న చిరుతపులిని ప్రజలు ఇబ్బంది పెట్టారని ఆయన అన్నారు చిరుత సరిగ్గా నడవలేని స్థితిలో అడవిలో సంచరిస్తుందని ఫారెస్ట్ గార్డు జితేంద్ర చౌహాన్ తెలిపారు. దానికి వాన్‌విహార్‌లో చికిత్స అందిస్తున్నామని, పూర్తిగా కోలుకునే అవకాశం ఉందన్నారు. ఇక గ్రామస్థులు చిరుతతో ఆడుకుంటున్న వీడియో నెట్టింట్లో వైర్‌గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘అభివృద్ధి ముసుగులో ఇప్పటికే వాటి(జంతువుల) స్థలాలను ఆక్రమిస్తున్నాం. ఇప్పుడు వాటిని కూడాఇబ్బంది పెడుతున్నాం. మనుషులుగా మనం సిగ్గుపడాలి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. -
‘కొంగకు వారు.. వారికి కొంగ’.. జంతు ప్రేమకు నిదర్శనం!
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీకి చెందిన ఆరిఫ్ అతని ఫ్రెండ్ కొంగ మధ్యగల స్నేహబంధాన్ని స్థానికులు కథలు కథలుగా చెబుతుంటారు చాలామంది ఇటువంటి కథలను ఎక్కడా వినివుండరు. ఈ ఉదంతం ఎంతవరకూ చేరిందంటే యూపీ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం ఆరిఫ్, ఆ కొంగను కలుసుకున్నారు. అనంతరం ఆయన ఆ కొంగను జూపార్కుకు తరలించారు. అయినా గ్రామంలోని వారెవరూ ఆ కొంగను మరచిపోలేరు. ఆ కొంగకు గ్రామంలోని వారంతా స్నేహితులే. ఆ కొంగ గ్రామంలోని వారందరితో కలసిమెలసి ఉండేది. గ్రామంలోని వారంతా ఆ కొంగ అంటే ఎంతో ప్రేమ చూపించేవారు. ఆరిఫ్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగే ఆ కొంగ ప్రతీరోజూ ఉదయాన్నే తన అరుపులతో అందరినీ నిద్ర నుంచి లేపేది. అనంతరం స్థానికుల మధ్య కలివిడిగా తిరిగేది. కొంగను చూసినవారంతా దానికి ఫొటోలు తీసేవారు. కుద్రహా బ్లాక్ పరిధిలోని రోహరి గ్రామం.. కైద్హవా తాల్ సమీపంలో ఉంది. తాల్లో ఇసుకబట్టీలు ఉన్నాయి. ఉదయం కాగానే ఈ ప్రాంతం నుంచి ఒక కొంగవచ్చి గ్రామంలో కలివిడిగా తిరుగుతుంటుంది. ఊరి జనం దానిని చూడగానే స్నేహ పూర్వంగా ఉంటూ, దానికి ఏదో ఒక ఆహారం అందించేవారు. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారం సాగుతూ వస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి సమీపంలోని ఇటుకబట్టీ దగ్లర కూలీలకు విచ్రితమైన రీతిలో రెండు గుడ్లు లభించాయి. వాటిని కూలీలు.. కొన్ని కొంగల దగ్గర విడిచిపెట్టారు. తరువాత ఆ గుడ్ల నుంచి కొంగ పిల్లలు బయటకు వచ్చాయి. కొద్ది రోజుల తరువాత ఒక కొంగ పిల్ల చనిపోయింది. మిగిలిన మరో కొంగను ఆ బట్టీలో పనిచేసే కూలీలు గ్రామానికి తీసుకువచ్చి, అక్కడ విడిచిపెట్టారు. ప్రస్తుతం ఆ కొంగ ఆ గ్రామంలో లేకపోయినా, స్థానికులు దానిని తలచుకోని రోజుంటూ ఉండదు. ఆరిఫ్ ఆ కొంగను ఎంతో ప్రేమగా సాకేవాడు. ఇది కూడా చదవండి: నడక చైర్‌లోని పసివాడు.. పైకప్పు కూలిపోయేంతలో.. వైరల్ వీడియో! -
దారుణం: సగం గుండు కొట్టించి.. మెడలో చెప్పుల దండలు వేసి..
రాంచీ: జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేసి దొరికిపోయిన ఇద్దరు యువకులను స్థానికలు పట్టుకుని శిరోముండనం చేశారు. అనంతరం చెప్పుల దండలు మెడలో వేసి.. ఓ బురద గుంటలో నిల్చోబెట్టారు. ఈ దారుణ ఘటన రాజ్‌మహల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇద్దరు యువకులు ఓ మహిళ ఇంట్లో రూ.4300 దొంగతనం చేశారు. ఇందులో ఓ బాలుడు దొరికిపోయాడు. అతన్ని పట్టుకున్న స్థానికులు మరో బాలున్ని ఇంట్లో నుంచి లాక్కొచ్చారు. ఊర్లో అందరి సమక్షంలోనే సగం గుండు కొట్టించారు. అనంతరం చెప్పుల దండలు మెడలో వేసి, ఊరేగించారు. ఈ ఘటనను కొందరు యువకులు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇవి కాస్త వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేశారు. పిల్లలను ఆరు గంటల పాటు బురదలోనే నిల్చొబెట్టారని బాధితుల తల్లిదండ్రులు ఆరోపించారు. రూ.3000 విధించిన జరిమానా చెల్లించిన తర్వాతనే పిల్లలను వదిలిపెట్టారని పోలీసులకు చెప్పారు. దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. దోషులపై కఠిన శిక్షలు విధిస్తామని వెల్లడించారు. ఇదీ చదవండి: డ్రైవింగ్‌లో ‘భ్రాంతి’ ముప్పు!.. 50% రోడ్డు ప్రమాదాలకు కారణమిదే! -
బాబోయ్ ఇదేం ఆచారం! ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి.. ఆపై
బెంగళూరు: వేసవి కాలం పోయింది.. ఇక వానల కోసం ప్రజలు, ముఖ్యంగా రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వర్షాల కోసం వాళ్ల పూర్వికులు ఆచరించిన ఆచారాలు పాటించడం ప్రారంభించారు. ఇందులో కొన్ని వింతగా కూడా ఉంటున్నాయి. తాజాగా ఓ గ్రామంలో వానలు పడటంలేదని ఆ గ్రామస్తులంతా కలిసి ఓ విచిత్ర కార్యక్రమం నిర్వహించారు. వాన దేవుళ్లను తృప్తిపర్చడం కోసం గ్రామంలోని ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి జరిపించారు. ఒక అబ్బాయికి పెళ్లి కొడుకు లాగా, మరో అబ్బాయికి పెళ్లి కూతురు లాగా తయారు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతేడాది కంటే తక్కువ వర్షపాతం నమోదైందని మాండ్య జిల్లాలోని కృష్ణరాజ్‌పేట తాలూకా గంగేనహళ్లి గ్రామంలో ఈ పూజలు నిర్వహించారు. కళ్యాణోత్సవంలో భాగంగా ప్రజలకు ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేసి వర్షం కురవాలని వానదేవుడిని ప్రార్థించారు. వాన దేవతలను ప్రసన్నం చేసుకోవడం ద్వారా వర్షాలు పడుతాయని ఇది సాంప్రదాయ ప్రార్థనలో ఒక భాగమని స్థానికులు తెలిపారు. రాష్ట్రంలో రుతుపవనాలు తగ్గుముఖం పట్టడంతో గతేడాది కంటే ఈ ఏడాది తక్కువ వర్షాలు కురిశాయని వారు తెలిపారు. ఇదిలావుండగా, రానున్న మూడు రోజుల పాటు కోస్తా, దక్షిణ లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కర్ణాటక వాతావరణ శాఖ తెలిపింది. మెజారిటీ కోస్తా జిల్లాలు, దక్షిణ లోతట్టు ప్రాంతాల్లోని అనేక జిల్లాలు, ఉత్తర లోతట్టు ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షం, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. చదవండి: కనిమొళి అభినందన.. ఆమె ఉద్యోగం పోయిందా?.. అసలేం జరిగిందంటే.. -
ఆ ఊర్లో మహిళలు దుస్తులే ధరించరు.. 5 రోజుల పాటు!
భారతదేశంలోని నివసిస్తున్న ప్రజలు.. వారు పాటించే ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు ప్రాంతం బట్టి మారుతూ ఉంటాయి. అయితే ఇందులో కొన్ని వింతగా, ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఇక ప్రత్యేకించి గ్రామాల్లో నివసించే ప్రజలు వారి ఆచార వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ఒక వింత ఆచారాన్ని స్థానికులు పాటిస్తున్నారట. సంవత్సరంలో కొన్ని రోజులు అక్కడి మహిళలు దుస్తులు ధరించరట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ ఆచారాన్ని అక్కడి వాళ్లు పాటిస్తున్నారు. అయితే దీనికి వెనుక ఒక కారణముందని అంటున్నారు. అదేంటంటే..! ఈ గ్రామం ఎక్కడ ఉంది? అవును, మనం మాట్లాడుకుంటున్న గ్రామం పరాయి దేశంలో కాదు, మన దేశంలోనే ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మణికర్ణ లోయలోని పిని అనే గ్రామంలో, శతాబ్దాలుగా ఒక సంప్రదాయం కొనసాగుతోంది, ఇందులో మహిళలు సంవత్సరంలో 5 రోజులు దుస్తులు ధరించరు. ఈ ఐదు రోజులు పిని గ్రామానికి బయటి వ్యక్తులెవరూ రాలేరు. ఈ ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక్కడి ప్రజలు కూడా దాన్ని కచ్చితంగా పాటిస్తున్నారు. మహిళలు బట్టలు ధరించరు ఈ ఐదు రోజులు మహిళలు దుస్తులు ధరించరు. మహిళులు వారి ఇంటి వద్దనే ఉంటారు, బయటకు రారు. మరోవైపు ఈ ఐదు రోజులు నియమనిష్టలతో ఈ ఆచారాన్ని మహిళలు కొనసాగిస్తారట. ఈ సమయంలో స్త్రీలే కాదు, పురుషులు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు. అలాంటి వారు మద్యం తాగలేరు, నాన్ వెజ్ తినరు. అంతే కాదు ఈ ఐదు రోజులు భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. గ్రామస్తులు ఈ సంప్రదాయాన్ని ఎందుకు పాటిస్తున్నారు? గ్రామస్తుల ప్రకారం, ఈ సంప్రదాయం పాటించకపోతే కొన్ని రోజుల తర్వాత మహిళకు చెడు జరుగుతుందని అక్కడి గ్రామస్తులు నమ్ముతున్నారు. ఇది పాటిస్తున్నప్పుడు భార్యాభర్తలు ఒకరినొకరు చూసి నవ్వకూడదట. పురుషులు కూడా ఈ సంప్రదాయాన్ని పాటించడం తప్పనిసరి. సంప్రదాయం చరిత్ర సంప్రదాయ చరిత్ర పుటలు ఆసక్తికరంగా ఉన్నాయి. శతాబ్దాల క్రితం తమ గ్రామాన్ని రాక్షసులు ఆక్రమించాయి. గ్రామంలోని వివాహిత స్త్రీలకు అందమైన దుస్తులు ధరింపజేసి రాక్షసులు ఎత్తుకెళ్లేవారట. అప్పుడు లహువా ఘోండ్ అనే దేవత ప్రత్యక్షమై ఆ రాక్షసులను ఓడించి మహిళలను విడిపించిందట. అప్పటి నుంచి మహిళలు అందమైన దుస్తులు ధరిస్తే రాక్షసులు వస్తారని, అందుకే సంవత్సరంలో 5 రోజులు మహిళలు బట్టలు లేకుండా ఉంటారని అక్కడి గ్రామ పెద్దలు చెబుతున్నారు. చదవండి: చైనా కంపెనీ వింత నిబంధన: అఫైర్లు వద్దు.. విడాకుల మాటే ఎత్తొద్దు...! -
అనుమానం వచ్చింది.. అంతే వాళ్లని చెట్టుకు కట్టేసి..
సదాశివపేటరూరల్ (సంగారెడ్డి): సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని కొల్కూర్ గ్రామంలో మంత్రాల(చేతబడి) నెపంతో గ్రామస్తులు శనివారం ఓ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. సదాశివపేట సీఐ నవీన్ కుమా ర్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన ముత్తంగి యాదయ్య కుటుంబం చేతబడి చేస్తోందనే అనుమానంతో గ్రామానికి చెందిన శివ య్య, లక్ష్మణ్, కోవూరి కుమార్, గడ్డం పెంటయ్య, బాగప్ప, బెగరి కుమార్, గడ్డం శ్యామల, గడ్డం ఆగమ్మ తదితరులు కలిసి యాదయ్య కుటుంబాన్ని తాళ్లతో చెట్టుకు కట్టేసి కట్టెలతో దాడి చేశారు. కొందరు గ్రామస్తులు నిలువరించడంతో యాదయ్య, ఆయన భార్య అమృత, కుటుంబ సభ్యులు గాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దళితులపై మంత్రాలనెపంతో దా డి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్, జిల్లా అధ్యక్షుడు అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చదవండి: బంజారాహిల్స్: మసాజ్ చేస్తూ గొలుసు కొట్టేశారు...