
మా గ్రామాలను మహబూబ్‌నగర్‌లో కలపండి
మరికల్, మల్కాపూర్, కల్మన్‌కల్వ, చాకల్‌పల్లి, కొత్తపల్లి ప్రజల ఆందోళన
కుల్కచర్ల: తమ గ్రామాలను మహబూబ్‌నగర్ జిల్లాలో కలపాలని మండల పరిధిలోని మరికల్, మల్కాపూర్, చాకల్‌పల్లి, కల్మన్‌కల్వ, కొత్తపల్లి గ్రామ పంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు గురువారం కుల్కచర్ల-నవాబ్‌పేట్ రోడ్డుపై గురువారం బైఠాయించారు. మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అనంతరం రోడ్డుపై టైర్లు వేసి కాల్చివేశారు. అనంతరం మరికల్‌లో ఏర్పాటు చేసిన సమావేశం నిర్వహించారు. తమ గ్రామాలను మహబూబ్‌నగర్ జిల్లాలో కలిపే వరకూ ఆందోళన విరమించేది లేదని తీర్మానించారు. అందుకోసం ఆ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులతో విలీన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక దగ్గర ఆందోళన చేయాలని తీర్మానించారు.
విలీన కమిటీ.. విలీన కమిటీ చైర్మన్‌గా సుధాకర్‌రెడ్డి (కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్) వైస్ చెర్మన్‌గా పాండురంగయ్య (వైస్ ఎంపీపీ) కన్వీనర్‌గా పాండురంగాచారి, సభ్యులుగా రాజు నాయక్ (మరికల్ సర్పంచ్), మెగ్యానాయక్ (మల్కాపూర్), చెన్నయ్య (కొత్తపల్లి), చిన్నరామయ్య(చాకల్‌పల్లి), కృష్ణాజీ, రామ్మోహన్‌శర్మ, నరేందర్‌ప్రసాద్, నర్సింలు, నిరంజన్, కృష్ణాచారి, ఉదయ్‌శంకర్, సత్తయ్య, వెంకటేష్, శ్రీనివాస్, నరేందర్‌లను ఎన్నుకున్నారు.