
రాస్తారోకో చేస్తున్న వినాయకపురం, సత్రవాడ గ్రామస్తులు
నగరి: చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ పరిధి సత్రవాడ వద్ద కుశస్థలి నది నుంచి ఇసుకను ఎడాపెడా తరలించేయడం, కాలకృత్యాలు తీర్చుకోవడానికి యేటిగట్టుపైకి వెళ్లే మహిళలను ఫొటోలు, వీడియోలు తీస్తూ అసభ్యకరంగా ప్రవర్తించడంపై స్థానిక గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్రవాడ, వినాయకపురం గ్రామాలకు చెందిన మహిళలు బుధవారం సత్రవాడ సచివాలయం ఎదురుగా రోడ్డుపై బైటాయించి రాకపోకలను స్తంభింపజేశారు.
రాత్రి, పగలు తేడా లేకుండా వందల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు ప్రతిరోజు ఇసుకను దోచుకెళుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక తరలింపుదారులు యేటిగట్టుకు వెళ్లే మహిళల ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని మండిపడ్డారు.