
సాక్షి, తిరుమల: శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడుతున్నాయి. అన్నమయ్య జిల్లా బాలపల్లి డివిజన్, మొగలిపెంట వద్ద మరోసారి మంటలు వ్యాపించాయి. అటవీశాఖ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు నాలుగు బృందాలుగా అటవీశాఖ సిబ్బంది యత్నిస్తున్నారు.
ఫారెస్ట్ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే మంటలు చెలరేగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు నివారణకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదు అటవీప్రాంతంలోకి అనుమతి లేకుండా ఎవ్వరు వెళ్లరాదని అధికారులు అంటున్నారు.
కాగా, గత ఏడాది కూడా శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. పాపవినాశనం వైపు మంటలు వేగంగా వ్యాపించాయి. కోరుట్ల అటవీ ప్రాంతం, కాకులకొండల్లో భారీగా మంటలు వ్యాపించాయి. వేలాది ఎకరాల్లో అడవీ సంపద దగ్దమైంది.