seshachalam forests
-
శ్రీశైలం టు శేషాచలం
రాజంపేట: నాగార్జునసాగర్–శ్రీశైలం అభయారణ్యంలో పులుల కారిడార్ విస్తరిస్తోంది. నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకు పులుల సంచారం ఉన్నట్లు అటవీశాఖ గుర్తించిన సంగతి విధితమే. గతంలో పులులు తిరిగే ప్రాంతం గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల పరిధిలో మాత్రమే ఉండేది. ఆ మూడు జిల్లాలోని నల్లమల్ల అడవుల్లో పులులు సంచరించేవి. కొన్నేళ్లుగా ఇవి తిరిగే కారిడార్ నల్లమల్ల నుంచి వైఎస్సార్, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో శేషాచలం అడవుల వరకు విస్తరించి ఉంది. తరుచూ నిర్వహిస్తున్న పులుల గణనలో ఈ విషయం స్పష్టమైంది. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వు (ఎన్ఎస్టీఆర్)వారి ఆధ్వర్యంలో పులులు గణన చేపడుతున్నారు. పులులు గణన రెండు బ్లాకులో జరుగుతోంది. నాలుగేళ్లకొకసారి చేసే గణన బ్లాక్–3లోకి వస్తుండగా , ప్రతి ఏడాది జరిపే గణన బ్లాక్–4 కిందికి వస్తుంది. ఇటీవల బ్లాక్–4లోని వార్షిక గణనలో టైగర్ కారిడార్ ప్రాంతంలో గత యేడాదిలో ఫిబ్రవరి 20 నుంచి అటవీశాఖాధికారులు గణన ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఎక్కడెక్కడా.. టైగర్ కారిడార్ నంద్యాల, గిద్దలూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి డివిజన్లలో నిర్వహించారు. నంద్యాల డివిజన్లోని చలమరుద్రవరం (రేంజ్), గిద్దలూరులో గుండ్లకమ్మ, వైఎస్సార్ జిల్లాలో ప్రొద్దుటూరు, వనిపెంట, పోరుమామిళ్ల, బద్వేలు, సిద్దవటం, ఒంటిమిట్ట, ముద్దనూరు, అన్నమయ్య జిల్లాలో చిట్వేలు, రాయచోటి , బాలపల్లె తిరుపతి జిల్లాలో భాకరాపేట, తిరుపతి రేంజిలోని అటవీ ప్రాంతాల్లోని సాంకేతిక డిజిటల్ కెమెరాలు అమర్చిసర్వే చేశారు. ప్రతి రెండు చదరుపు అడుగులకు రెండు కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా రేంజిలలో గత యేడాది 188 లోకేషన్లకు మొత్తం 376 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 127 కెమెరాలు అమర్చారు. 40రోజుల పాటు జరిగిన గణనలో 20 రోజులకొక సారి కెమెరాలు తీసి వాటిలోని చిత్రాలను సేకరించారు. అదే ప్రదేశాలలో మళ్లీ కెమెరాలు ఏర్పాటుచేయనున్నట్లు అటవీవర్గాల సమాచారం. కెమెరాల్లోని డేటాను ఆయా అటవీశాఖాధికారులు శ్రీశ్రైలంలోని టైగర్ బయోల్యాబ్‌కు పంపనున్నారు. వాటిలోని చిత్రాలను బయోల్యాబ్ ప్రతినిధులు క్షుణ్ణంగా విశ్లేషించనున్నారు. గత ఏడాది పోరుమామిళ్ల, వనిపెంట అడవుల్లో ఆరు పలులు కెమెరాలకు చిక్కినట్లుగా అటవీ అధికారుల నుంచి అందని ప్రాథమిక సమాచారం. పెరుగుతున్న పులులు సంఖ్య2021లో ఆరుపులులు ఉండగా, 2022లో వాటి సంఖ్య తొమ్మిదికి చేరినట్లు అటవీ వర్గాల సమాచారం. 2019లో బద్వేలు, సిద్ధవటం అటవీ ప్రాంతాల్లో కూడా పులులు ఉండేవని అప్పటి సమాచారం. ఈ సారి గణనలో అవి కెమెరాలకు చిక్కలేదు. అయితే పెనుశిల అభయారణ్యం, శేషాచలం అటవీ ప్రాంతాల వైపు వెళ్లినట్లు అటవీవర్గాలు భావిస్తున్నాయి. చిరుతలు మాత్రం కెమెరాకు చిక్కుతున్నాయి. పెనుశిల అభయారణ్యానికి సోమశిల వెనుకజలాలు అడ్డుగా ఉండటం వల్ల రాలేకున్నాయి. అభయారణ్యాలుశేషాచలం (బయోస్పియర్) లంకామల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యం పెనుశిల లక్ష్మీనరసింహా అభయారణ్యం8ప్రాథమికంగా 8 నుంచి 10 పులులు సంచారంఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని టైగర్ కారిడార్ చేపట్టిన పులుల గణనలో ప్రాథమికంగా 8 నుంచి 10 లోపు పులులను అధికారులు గతంలో గుర్తించారు. వాటి సంఖ్య ఈ ఏడాది పెరిగి ఉంటుందని అటవీశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అడవుల్లో అమర్చిన విదేశీ సాంకేతిక డిజిటల్ కెమెరాల ద్వారా వాటి సంఖ్యను కొనుగొన్నారు. శ్రీశైలంలోని టైగర్ బయోట్యాబ్లో శాస్త్రవేత్తలు కెమెరాల్లో లభ్యమైన చిత్రాలపై విశ్లేషణ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.అడవిలో చెట్లకు కెమెరాలు అమర్చాం శేషాచలం అటవీ ప్రాంతంలో చెట్ల కెమెరాలు అమర్చాము. పులి, చిరుత కెమెరాలో పడితే వివరాలు వెల్లడిస్తాము. సర్వే జ రుగుతోంది. టైగర్ కారిడార్ పరిధిలో పులల గణన జరుగుతుంది. –జగన్నాథ్‌సింగ్, జిల్లా అటవీశాఖాధికారి, రాజంపేట -
మళ్లీ కూసిన గువ్వ
వలస పక్షుల కిల.. కిల.. రావాలతో శేషాచలం కళకళలాడుతోంది. రంగురంగుల ఈకలు.. చూడచక్కని ముక్కులతో.. కొమ్మరెమ్మలపై ఎగురుతూ.. నింగిలో ఆహ్లాదకరమైన విన్యాసాలు చేస్తూ.. వినసొంపైన కిల..కిల.. రావాలతో శేషాచలం అడవులకు వలస పక్షులు మరింత అందం తీసుకొచ్చాయి. ఇప్పటికే శేషాచల కొండల్లో 215 రకాల పక్షి జాతులుండగా.. ఇప్పుడు వలస పక్షులు వాటికి తోడయ్యాయి. మూడేళ్లుగా వర్షాలు బాగా కురుస్తుండటంతో శేషాచల అడవుల్లోని జంతువులకు, పక్షులకు ఆహారం సమృద్ధిగా లభిస్తోంది. దీనివల్లే ఉత్తర భారతదేశంతో పాటు వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి అరుదైన పక్షులు శేషాచలం బాట పట్టాయని శాస్త్రవేత్త కార్తీక్ చెప్పారు. వాటిలో కొన్నింటిని తన కెమెరాలో బంధించినట్లు తెలిపారు. –తిరుపతి అలిపిరి శేషాచలం చేరిన వాటిలో ప్రత్యేకమైనవి.. బ్లాక్ నేప్డ్ మోనార్క్ ఫ్లై క్యాచర్: సాధారణంగా ఈ రకంలో మగ పక్షులు బ్లూ కలర్‌లోనూ.. ఆడ పక్షులు గ్రే కలర్‌లోనూ ఉంటాయి. వీటికి సిగ్గు ఎక్కువ. స్ట్రీక్ త్రోటెడ్ ఉడ్‌పెకర్: ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. పచ్చగానూ.. తలపై ఆరెంజ్ కలర్ జుట్టుతోనూ దర్శనమిస్తుంటాయి. భారతదేశంలోని 12 రకాల ఉడ్ పెకర్స్లో ఈ జాతి అరుదైనది. గ్రీన్ ఇంపీరియల్ పీజియన్: అనేక ఏళ్ల తర్వాత ఇది కళ్యాణి డ్యాం ప్రాంతంలో కనిపించింది. అరుదైన పావురాల్లో ఇది ఒకటి. చైనా, మలేసియా, ఫిలిప్పీన్స్, నేపాల్‌లలో ఇవి కనిపిస్తుంటాయి. ఏసియన్ పారడైజ్ ఫ్లైక్యాచర్: చిన్న తల, పొడవాటి తోక, ఆరెంజ్ కలర్లో ఉండే ఈ పక్షి శేషాచలంలో అరుదుగా కనిపిస్తుంటుంది. చామల రేంజ్‌లోని కోటకాడపల్లి ప్రాంతంలో కెమెరాకు చిక్కింది. మధ్య ఆసియా దేశాల్లో ఈ పక్షులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇండియన్ స్కాప్స్ ఔల్: దక్షిణ ఆసియాలో కనిపించే గుడ్లగూబ ఇది. దీని అరుపులు చాలా వింతగా>.. భయాందోళనకు గురి చేస్తుంటాయి. దీని కళ్లు పెద్దగా ఉంటాయి. కళ్యాణి డ్యాం ప్రాంతంలో ఇటీవల ఇది దర్శనమిచ్చింది. ఎల్లో త్రోటెడ్ బుల్బుల్: పసుపు పచ్చగా.. ముద్దుగా కనిపించే ఈ పక్షులు ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంటాయి. చాలా అరుదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ఈ పక్షులు కపిలతీర్థం ప్రాంతంలో కనిపించడం విశేషం. టికెల్స్ బ్లూ ఫ్లైక్యాచర్: ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చిన అరుదైన జాతి పిట్ట ఇది. చిన్న ముక్కు, పసుపు రంగు గొంతు దీని ప్రత్యేకత. శేషాచలంలో ఈ పిట్టలు సందడి చేస్తున్నాయి. కాపర్ స్మిత్ బార్బెట్: ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’తో కాపర్ స్మిత్ బార్బెట్ను పోల్చవచ్చు. కాపర్ ప్లేట్‌పై సుత్తితో కొడితే ఎలా సౌండ్ వస్తుందో.. ఈ పిట్ట అరిస్తే అలా ఉంటుంది. వివిధ వర్ణాల్లో ఉండే ఈ పిట్ట.. తన అందంతో మంత్రముగ్ధుల్ని చేస్తుంటుంది. బ్లాక్ హుడెడ్ ఓరియోల్: పసుపు, నలుపు రంగుల్లో అందంగా ఉండే ఈ పక్షి ప్రస్తుతం శేషాచలంలో దర్శనమిస్తోంది. ఆరెంజ్ హెడెడ్ త్రష్: ఆరెంజ్ కలర్లో ఉన్న ఈ పక్షి బ్రహ్మదేవ గుండంలో కనిపించింది. ఇది హిమాలయ ప్రాంతం నుంచి వచ్చినట్లుగా కార్తీక్ చెప్పారు. అనేక ఏళ్ల తర్వాత.. శేషాచలంలో ఇప్పటి వరకు 180 రకాల పక్షులను ఫొటోలు తీశాను. ఈ ఏడాది కళ్యాణి డ్యాం, కపిలతీర్థం, మామండూరు, బాలపల్లి, కలివిలేటి కోన, బ్రహ్మదేవ గుండం, మొగిలిపెంట, చామల రేంజ్‌లోని తలకోన, కోటకాడపల్లి తదితర ప్రాంతాల్లో అరుదైన పక్షులు కనిపించాయి. చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ దర్శనమిచ్చాయి. – కార్తీక్, బర్డ్స్మెన్, తిరుపతి -
‘పుష్ప’ను మించిపోతున్న ఎర్ర స్మగ్లర్లు!
చిత్తూరు అర్బన్: ఎర్ర స్మగ్లర్లు ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలతో ఎర్రచందనం దుంగలను అనుకున్న చోటుకి చేరవేస్తున్నారు. అయితే పోలీసులు కూడా డేగ కళ్లతో అలాంటి వారి ఆటలను కట్టిపెడుతున్నారు. తాజాగా అంబులెన్స్‌లో రోగిని ఎక్కించుకుని వెళుతున్నట్టు నటిస్తూ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠా, నీళ్ల క్యాన్లు సరఫరా చేసే ఆటో ముసుగులో ఎర్ర దుంగలను స్మగ్లింగ్ చేస్తున్న మరో ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు ఆర్ముడ్ రిజర్వ్ కార్యాలయంలో గురువారం ఎస్పీ రిషాంత్‌రెడ్డి, ఏఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ సుధాకర్‌రెడ్డిలు మీడియాకు వివరాలు వెల్లడించారు. చిత్తూరు మీదుగా తమిళనాడులోని వేలూరుకు పలు అంబులెన్స్‌లు రోజూ పదుల సంఖ్యలో వెళుతుంటాయి. వాటిలో రోగులను తీసుకెళుతున్నట్టుగా డ్రామాలాడుతూ రోగి సహాయకుల వేషంలో స్మగ్లర్లు రోజూ శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనాన్ని తీసుకెళుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. చిత్తూరు తూర్పు సీఐ బాలయ్య, ఎస్ఐ రామకృష్ణలు సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్రం చిత్తూరు–వేలూరు రోడ్డులోని మాపాక్షి వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ అటుగా వస్తున్న అంబులెన్స్‌నూ తనిఖీ చేసేందుకు నిలిపారు. అందులో 15 మంది ఉండగా.. తనిఖీచేస్తుండగా నలుగురు పారిపోయారు. మిగిలిన వాళ్లను కిందకి దింపి వాహనాన్ని తనిఖీ చేయగా.. 36 ఎర్రచందనం దుంగలు, చెట్లను నరికే గొడ్డళ్లు, కత్తులు దొరికాయి. తమిళనాడులోని తిరువణ్ణామలైకు చెందిన శివాజీ, కాశి, దేవరాజ్, రాధాకృష్ణ, సెల్వం, కుప్పుస్వామి, ప్రశాంత్, జయపాల్, ఉదయ్‌కుమార్, సత్యరాజ్, భాగ్యరాజ్‌లను అరెస్ట్ చేశారు. నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కేసులున్నట్టు ఎస్పీ తెలిపారు. అంబులెన్సులో దాచిన ఎర్రచందనం దుంగలు నీళ్ల క్యాన్ల కింద ఎర్ర చందనం చిత్తూరు నగరం చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిపై పశ్చిమ సీఐ శ్రీనివాసులురెడ్డి, గుడిపాల ఎస్ఐ రాజశేఖర్‌లు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో నీళ్ల క్యాన్లు సరఫరా చేసే ఆటోను తనిఖీ చేయగా 35 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. ఈ కేసులో తమిళనాడు చెన్నైకు చెందిన లక్ష్మీపతి, సామువేలు, ప్రవీణ్‌కుమార్, ముత్తురాజ్‌లను అరెస్ట్ చేశారు. ఈ రెండు కేసుల్లో పట్టుబడ్డ వాహనాలు, ఎర్రచందనం దుంగల విలువ రూ.కోటి వరకు ఉంటుందని ఎస్పీ వివరించారు. ఈ కేసుల్లో మరికొందర్ని అరెస్ట్చేయాల్సి ఉందన్నారు. -
చిత్తూరు శేషాచల అటవీప్రాంతంలో మళ్లీ అలజడి
-
అన్ని నివేదికల్ని కోర్టు ముందుంచండి
సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కేసులో బాలిస్టిక్ విశ్లేషణ నివేదికలు, సీసీటీవీల నివేదికలు, డీఎన్ఏ రిపోర్టులు, పోస్టుమార్టం నివేదికలు, ఇతర స్థాయీ నివేదికల్ని సిద్ధం చేసి తమ ముందుంచాలని హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు స్పష్టం చేసింది. వాటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామంది. ఈ కేసును సీబీఐకి అప్పగించడంపై సిట్ వాదనలు వినిపించేందుకు వీలుగా తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. కూలీల ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం, బాధిత కుటుంబసభ్యులు వేర్వేరుగా పిటిషన్లు వేయడం తెలిసిందే. అలాగే సిట్ ఏర్పాటును సవాలుచేస్తూ వాసిరెడ్డి శ్రీకృష్ణ అనే వ్యక్తి మరో పిటిషన్ వేశారు. వీటన్నింటినీ కలపి ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వృందాగ్రోవర్, డి.సురేశ్‌కుమార్, వి.రఘునాథ్‌లు ఈ కేసును సీబీఐకి ఎందుకప్పగించాలో వివరిస్తూ వాదనలు వినిపించారు. బాధితులకు న్యాయం జరిగేదెప్పుడు? కేసు దర్యాప్తును పూర్తిచేసే విషయంలో సిట్ ఉద్దేశపూర్వకంగా అసాధారణ జాప్యం చేస్తోందని, దీనివల్ల బాధితులకు న్యాయం జరిగే పరిస్థితులుండవని, కాబట్టి కేసు దర్యాప్తు బాధ్యతల్ని సీబీఐకి అప్పగించాలని వృందాగ్రోవర్ నివేదించారు. ఎన్కౌంటర్ కేసును హైకోర్టు, జాతీయ మానవహక్కుల సంఘం స్వయంగా పర్యవేక్షిస్తున్నప్పటికీ సిట్ జాప్యం చేస్తోందని, దీన్నిబట్టి దర్యాప్తు తీరు ఎలాగుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఫిబ్రవరి 10కి ఎన్కౌంటర్ జరిగి ఏడాదవుతుందని, అప్పటికీ దర్యాప్తు పూర్తికాలేదంటే.. బాధితులకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని ప్రశ్నించారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయకుండా దర్యాప్తు ప్రారంభించడంలోనే సిట్ ఉద్దేశాలు స్పష్టమవుతున్నాయన్నారు. -
శేషాచలం అడవుల్లో అగ్నిప్రమాదం
-
సీబీఐ అవసరమేముంది..?
సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో చోటు చేసుకున్న ఎర్ర చందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై సీబీఐతో దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఏముందని హైకోర్టు ప్రశ్నించింది. సీబీఐ అధికారులేమీ ప్రత్యేకం కాదని, దర్యాప్తు విషయంలో వారికీ, రాష్ట్ర పోలీసులకేమీ తేడా లేదని పేర్కొంది. కేసును ఎవరు దర్యాప్తు చేస్తున్నారన్నది ముఖ్యం కాదని, ఎంత నిష్పాక్షికంగా, నిజాయితీగా దర్యాప్తు చేస్తున్నారన్నదే ముఖ్యమని స్పష్టం చేసింది. ఈ కేసును రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయగలరని చెప్పింది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కేస్ డైరీని పరిశీలించిన తరువాతే ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామంది. కేస్ డైరీని తమ ముందుంచాలని అదనపు అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. ప్రభుత్వం ఐజీ స్థాయి అధికారితో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం ఏఏజీ శ్రీనివాస్ కోర్టుకు తెలియజేశారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం.. దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు గాను కేస్ డైరీని తమ ముందుంచాలని అదనపు ఏజీని ఆదేశించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సీబీఐ దర్యాప్తు గురించి ప్రస్తావించగా పై వ్యాఖ్యలు చేసింది. -
కాల్పులపై పిటిషన్
చెన్నై, సాక్షి ప్రతినిధి: చిత్తూరు శేషాచల అడవుల్లో జరిగిన కాల్పుల్లో 20 మంది తమిళ కూలీల దుర్మరణంపై సీబీఐచే విచారణ జరిపించాలని విడుదలై చిరుతైగళ్ కట్చి అధ్యక్షులు తిరుమాళవన్ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాల్పుల ఘటనపై తమిళనాడు ప్రజలకు అనేక సందేహాలు ఉన్నాయని, విచారణ పేరుతో పిలుచుకుపోయి హత్యచేసినట్లు తాము భావిస్తున్నామని పిటిషన్లో పేర్కొన్నారు. అంతేగాక ఎంతోమంది ఆచూకీలేదని తెలిపారు. కనిపించనివారి ఆచూకీ, అసలు స్మగ్లర్ల పేర్లను బైటపెట్టాలని, కాల్పుల ఘటనపై సీబీఐ విచారణ కు ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆంధ్రప్రదేశ్ రాజకీయనేతల హస్తాన్ని వెలుగులోకి తేవాలని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం మొత్తాన్ని పెంచేలా ఆదేశించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు ఈనెల 20వ తేదీన విచారణ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. జలియన్‌వాలాబాగ్ కంటే ఘోరం: శరత్‌కుమార్ స్వాతంత్య్ర పోరాట సమయంలో జలియన్‌వాలాబాగ్‌లో జరిగిన కాల్పుల కంటే ఘోరంగా తమిళ కూలీలను హతమార్చారని అఖిలభారత సమత్తువ మక్కల్ కట్చి (ఏఐవీసీకే) అధ్యక్షులు, ఎమ్మెల్యే శరత్‌కుమార్ వ్యాఖ్యానించారు. కాల్పుల ఘటనపై శుక్రవారం వీసీకే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన జరిపింది. చెన్నై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన శరత్‌కుమార్ మాట్లాడుతూ అమాయక కూలీలపై కాల్పుల ఘటన తమిళనాడు ప్రజల గుండెను పిండేసిందని అన్నారు. కూలీలు చెట్లు నరుకుతుండగా కాల్పు లు జరగలేదు, చేతులు, కాళ్లు కట్టివేసి చిత్రవధకు గురిచేసి పథకం ప్రకారం హతమార్చారని ఆయన ఆరోపించారు. కూలీల మరణం పట్ల విచారం వ్యక్తం చేయకపోగా నిందలు వేయడం సరికాదని ఏపీ అటవీశాఖా మంత్రి బొజ్జలకు హితవు పలికారు. తమిళ ప్రజలకు పొరుగు రాష్ట్రాల్లో రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల ఘటనతో తమిళనాడు యావత్తు తల్లడిల్లుతుంటే ప్రధాని నరేంద్రమోదీ ఏమీ పట్టనట్లుగా విదేశాలు తిరుగుతున్నారని విమర్శించారు. కాల్పులపై సీబీఐ విచారణ కు ఆదేశించాలని, మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 10లక్షల నష్టపరిహారం చెల్లించాలని శరత్‌కుమార్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దిక్కులేనివారమైనాము - సంక్షేమ బోర్డుతో బాధిత కుటుంబాల ఆవేదన ఇంటి పెద్దదిక్కును దారుణంగా పొట్టనపెట్టుకున్న ఏపీ ప్రభుత్వం వల్ల తాము దిక్కులేని వారమైనామని మృతుల కుటుంబీకులు బోరుమన్నారు. చెన్నై చేపాక్‌లోని ప్రభుత్వ అతిధి గృహంలో జాతీయ కొండప్రాంత ప్రజల సంక్షేమ బోర్డు సహాయ కమిషనర్ రవి ఠాకూర్ బాధిత కుటుంబాలను శుక్రవారం కలుసుకున్నారు. ఈ సందర్బంగా పలువురు హాజరై తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. సేలం జిల్లా ఆత్తూరు సమీపం కల్లుకట్టుకు చెందిన మృతుడు శశికుమార్ భార్య రంజితం, తల్లి పూంగొడి ఇతర కుటుంబ సభ్యులు కమిషన్ ముందు కన్నీరు మున్నీరయ్యారు. రంజితం మాట్లాడుతూ ఏర్కాడుకు వెళ్లివస్తానని చెప్పి బయలుదేరిన తన భర్త ఇక తిరిగిరాలేదని వాపోయింది. తన భర్త శవాన్ని పరిశీలించగా, ముఖం కాలినట్లు కమిలిపోయి ఉందని, కళ్లలోని గుడ్లను తొలగించారని, కాళ్లు, చేతులు విరిగి ఉన్నాయని ఆమె తెలిపింది. భర్త మృతితో తాము దిక్కులేని వారయ్యామని ఆదుకోవాలని కోరింది. గత ఏడాది ముగ్గురిని పొట్టనపెట్టుకున్నారు గత ఏడాది సెప్టెంబరు 25వ తేదీన ఏపీ పోలీసులు తమ ప్రాంతానికి చెందిన ముగ్గురిని కాల్పులతో హతమార్చారని తిరువణ్ణామలై జిల్లా జవ్వాదికొండ గ్రామానికి చెందిన మృతుడు చిన్నస్వామి భార్య మలర్ చెప్పింది. విజయకాంత్ (25), శివ (25), వెంకటేష్ (27) ఆనాటి కాల్పుల్లో మృతిచెందగా ఏపీ ప్రభుత్వం నుంచి నేటికీ నష్టపరిహారం అందలేదని మృతుల భార్యలు పవిత్ర, రేఖ, తల్లి పూమల్లి కమిషనర్‌కు చెప్పారు. ఇలా రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన బాధిత కుటుంబాల నుంచి తీసుకున్న వాంగ్మూలాన్ని నమోదుచేశారు. అనంతరం ఠాకూర్ మాట్లాడుతూ బాధితుల అందజేసిన వివరాలను జాతీయ మానవహక్కుల కమిషన్‌కు అందజేస్తామని, ఆ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివరాలు ఇస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం మొత్తాన్ని పెంచాలని, అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని సిఫార్సు చేస్తామని చెప్పారు. -
స్మగ్లర్లను వదిలి... కూలీల కోసం...
సాక్షి, చిత్తూరు: శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రకూలీల కాల్చివేత ఘటన వివాదస్పదంగా మారిన నేపథ్యంలో మృతులతోపాటు మిగిలిన ఎర్రకూలీలను చందనం స్మగ్లర్లుగా నిరూపించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే ఈ ఘటన అంతర్రాష్ట్ర వివాదంగా మారడం, హైకోర్టుతో పాటు జాతీయ మానవహక్కుల సంఘం జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. ముఖ్యంగా తమిళ తలనొప్పిని తప్పించుకునేందుకు అన్ని దారులను వెతుకుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పోలీసులను రంగంలోకి దింపింది. పోలీసులు అధికార పార్టీకి చెందిన బడా చందనం స్మగ్లర్లను వదిలి తమిళ కూలీలనే స్మగ్లర్లుగా చూపెట్టేందుకు స్వరం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే పోలీసులు కూలీల వద్ద దొరికిన ఫోన్ సంభాషణల ఆధారంగా వివరాలు సేకరించారు. ఇందులో చిత్తూరు జిల్లాకు చెందిన అధికార పార్టీకి సంబంధించిన ప్రధాన స్మగ్లర్ల పాత్ర బయటపడినట్లు సమాచారం. అధికారపార్టీ ముఖ్య నేతల ఆదేశాల మేరకు పోలీసులు ఆ స్మగ్లర్ల వివరాలను గోప్యంగా ఉంచి, ముందు ఎన్కౌంటర్ వివాదం నుంచి బయటపడేందుకు తమిళ కూలీలనే స్మగ్లర్లుగా చూపేందుకు రంగంలోకి దిగారు. ఫోన్ నెంబర్ల ఆధారంగా తమిళనాడుకు చెందిన కూలీల వివరాలను సేకరించి వారందరినీ స్మగ్లర్లుగా చూపించేందుకు ఇప్పటికే మన రాష్ట్రానికి చెందిన సీఐడీ పోలీసుల బృందం తమిళనాడులో గాలింపు చర్యలకు దిగినట్లు విశ్వసనీయ సమాచారం. తమ వద్దనున్న ఆధారాలతో తమిళ కూలీలే స్మగ్లర్లంటూ తమిళనాడు ప్రభుత్వంతో పాటు జాతీయ స్థాయిలో చూపించుకునేందుకు పోలీసులు సిద్ధమయినట్లు తెలుస్తోంది. తమిళ కూలీలను శేషాచలం అడవుల్లోకి రప్పించడంలో జిల్లాకు చెందిన ఒకరిద్దరు అధికార పార్టీకి చెందిన స్మగ్లర్లు కీలకపాత్ర పోషించారని, వారిని తప్పించేందుకు రాష్ట్ర స్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయని ఓ పోలీసు అధికారే స్వయంగా చెప్పడం విశేషం. స్మగ్లర్ల ప్రోద్భలంతోనే అధికారులపై తిరుగుబాటు గతంలో ఎర్రకూలీలు అటవీ, పోలీసు అధికారులపై స్మగ్లర్ల ప్రోద్భలం, భరోసాతోనే దాడులకు పాల్పడినట్లు కొందరు పోలీసు అధికారులే చెబుతున్నారు. స్మగ్లర్ల వెన్నుదన్ను లేకపోతే అధికారులపై దాడి చేసే ధైర్యం కూలీలకు లేదని వారు పేర్కొంటున్నారు. ఎర్రకూలీలు వారం రోజులు అడవిలో ఎర్రచందనాన్ని నరికితే అన్ని తామే చూసుకుంటామంటూ స్మగ్లర్లు రూ.30 నుంచి 50 వేల వరకు ముట్టజెప్పుతున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే అటవీ, పోలీసు అధికారులపై దాడులకు దిగిన ఎర్రకూలీలకు స్మగ్లర్లు ప్రోత్సాహకాల కింద ఒక్కొక్క కూలీకి రూ.10 నుంచి 15వేలు ముట్టజెప్పినట్లు గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్చేసిన ఓ నేత ‘సాక్షి’కి వివరించారు. ఈ ఆనవాయితీని చాలా మంది స్మగ్లర్లు కొనసాగించారని, అందుకే ఎర్రకూలీలు అధికారులపై దాడులకు దిగారని ఆయన వివరించారు. మృతుల బంధువుల ఫిర్యాదుతో పోలీసుల్లో ఆందోళన మృతిచెందిన ఎర్రకూలీల కుటుంబసభ్యులు ఆదివారం చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా కాల్చివేతలో పాల్గొన్న టాస్క్ఫోర్సు పోలీసులు మరింత ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. శేషాచలం కాల్పుల ఘటనలో 20 మంది కూలీలు మృతిచెందిన నేపథ్యంలో ఈ తరహా కేసులను స్పెషల్లీ గ్రేవ్ అఫెన్సుల కింద పరిగణిస్తారు. డీఎస్పీ లేదా ఆ పై స్థాయి అధికారులు మాత్రమే ఇలాంటి కేసులు దర్యాప్తు చేయాల్సిఉంది. ఈ కేసు దర్యాప్తులో కీలక అంశాలను అధికారులు వెలుగులోకి తేవాలి. హత్యకేసు కింద దర్యాప్తు ప్రారంభిస్తే మృతుల స్వస్థలాల నుంచి మొదలుపెట్టి ఘటన స్థలం వరకు ప్రతి ఘట్టాన్ని సాక్ష్యాధారాలతో సహా రికార్డు చేయాలి. ప్రాథమికంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న టాస్క్‌పోర్సు బలగాల పూర్తి వివరాలతో పాటు వారు వినియోగించిన ఆయుధాలను మొదట స్వాధీనం చేసుకోవాలి. కాల్పులకు ముందు పాటించాల్సిన నిబంధనలు పాటించారా...? అనే అంశంతో పాటు బాధితుల్లో ఎవరు, ఏ తూటా వల్ల చనిపోయారు..? అది ఏ తుపాకీ నుంచి వెలువడింది..? ఆ తుపాకీని ఉపయోగించింది ఎవరు..? అనేది తేల్చాలి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు తమిళనాడు నుంచి శేషాచలం వరకు ప్రతి అంశాన్ని నిర్ధారించి నమోదు చేయాల్సిఉంటుంది. దీంతో పోలీసులు మరింత ఆందోళన చెందుతున్నారు. -
బాబు ఆదేశాల మేరకే బూటకపు ఎన్కౌంటర్
ఘటనా స్థలాన్ని పరిశీలించిన జాతీయ మానవ హక్కుల కమిటీ చంద్రగిరి: ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతోనే పోలీసులు కూలీలను తీసుకొచ్చి కాల్చి చంపారని మానవ హక్కుల సంఘం నాయకులు ఆరోపించారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రెట్స్ (పీయూడీఆర్), పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీ (పీయూసీఎల్), పీపుల్స్ రైట్స్ ఫర్ ప్రొటెక్షన్ కమిటీ(పీఆర్టీసీ), హ్యూమన్ రైట్స్ కమిషన్ (హెచ్ఆర్సీ) తదితర జాతీయ సంఘాల సభ్యులు శేషాచలం అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడో పట్టుకున్న కూలీలను తీవ్రంగా హింసించి అనంతరం అటవీప్రాంతంలోకి తీసుకువచ్చి కాల్చిపడేసి పోలీసులు ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఎన్ కౌంటర్‌పై వెంటనే సుప్రీంకోర్టు సిట్టింగ్ ఈ కార్యక్రమంలో జాతీయ ప్రజా సంఘాల నేతలు శాంతన్, అజిత్, అజ్మన్, టాటా ఇన్స్టిట్యూట్ ఉద్యోగులు దామోదర్, సుకన్య, కన్నన్, రాష్ట్ర మానవహక్కుల ఉపాధ్యక్షుడు చిట్టిబాబు, ప్రొఫెసర్ లక్ష్మణ్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి నంబూరి శ్రీమన్నారాయణ, తెలంగాణ సహాయ కార్యదర్శి నారాయణరావు, పౌరహక్కుల సంఘం నేత దుడ్డు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పీయూడీఆర్ కమిటీపై కేసు నమోదు అటవీశాఖ అధికారుల అనుమతి లేకుండా అటవీప్రాంతంలోకి వెళ్లిన పీయూడీఆర్ కమిటీపై ఏపీ ఫారెస్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తిరుపతి వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో జి. శ్రీనివాసులు తెలిపారు. తమిళనాడులో ఆరని ‘ఎర్ర’ అగ్ని చెన్నై, సాక్షి ప్రతినిధి: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై రాష్ర్టవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. శనివారం సైతం రాష్ట్రంలో పలు పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించాయి. మక్కల్ ఇలక్కియ కళగం, పురట్చి మానవర్ ఇలైజంర్ మున్నని, పుదియ జననాయక తొళిలాలర్ మున్నని, పెన్‌గళ్ విడుదలై మున్నని తదితర పార్టీలు శనివారం సెంట్రల్ స్టేషన్‌ను ముట్టడించాయి. తమిళగ మున్నేట్ర కాంగ్రెస్ కట్చి నేత అరుళ్దాస్ నాయకత్వంలో సుమారు 150 మంది ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆంధ్రాక్లబ్) ను ముట్టడించారు. స్మగ్లర్లను కాపాడేందుకే కాల్పులు నిందితుల్ని రక్షించేందుకే అమాయక తమిళ కూలీలను కాల్చి చంపారని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఆరోపించారు. తిరుచ్చిరాపల్లిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయవిచారణ జరిపించాలి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లపై సీబీఐ దర్యాప్తు, న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పీయూసీఎల్, ఆల్ ఇండియా పీపుల్స్ ఫోరం, న్యాయవాదులు, ప్రజాస్వామ్య, మానవహక్కుల సంఘాల ఆధ్వర్యంలో ఏపీభవన్ ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. దర్యాప్తు అధికారిగా ఏఎస్పీ త్రిమూర్తులు తిరుపతి: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు అధికారిగా తిరుపతి ఏఎస్పీ త్రిమూర్తులును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎన్కౌంటర్ ప్రభావం తిరుమల శ్రీవారి భక్తులపై కనిపిస్తోంది. ఫర్షణల నేపథ్యంలో తమిళ భక్తుల రాక భారీగాతగ్గింది. -
‘శేషాచలం’పై శ్వేతపత్రం విడుదల చేయాలి
ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు సుబ్రమణియన్ స్వామి రాయచూరు: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు సుబ్రమణియన్ స్వామి డిమాండ్ చేశారు. రాయచూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమిళ కూలీలను ఎన్కౌంటర్ చేయడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకువచ్చేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారన్నారు. 2జీ స్పెక్ట్రం వేలంలో రూ. 4 లక్షల కోట్లు, బొగ్గు క్షేత్రాల వేలంలో రూ. 2 లక్షల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా మోదీ చర్యలు తీసుకున్నారన్నారు. -
కలెక్టరేట్ ముట్టడిస్తామని వైగో హెచ్చరిక
-
'బొజ్జల సినిమా డైలాగులు మాట్లాడుతున్నారు'
చిత్తూరు : ఎర్ర చందనం కూలీల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి ఎండీఎంకే అధినేత వైగో శుక్రవారం వేలూరు నుంచి భారీ ర్యాలీగా బయల్దేరారు. ఆయనతో పాటు తమిళనాడులోని ఇతర పార్టీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైగో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు మానవత్వానికి దూరంగా ఉన్నాయన్నారు. అంతం కాదు...ఆరంభం మాత్రమే అని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి సినిమా డైలాగులు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన కూలీల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.20 లక్షలు చెల్లించాలని వైగో డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం కావాలనే బయట ఉన్న కూలీలను తీసుకువెళ్లి ఎన్కౌంటర్ చేసిందని ఆయన ఆరోపించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ జైళ్లలో ఉన్న కూలీల బాధ్యతను తమిళనాడు ప్రభుత్వానిదే అని వైగో అన్నారు. కాగా తమిళనాడు-ఏపీ సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. ర్యాలీగా వస్తున్న వైగో సహా పలువురు కార్యకర్తలను వేలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కలెక్టరేట్ ముట్టడిస్తామని వైగో హెచ్చరిక
చిత్తూరు : తమిళనాడు ఎర్ర చందనం కూలీల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా చిత్తూరు కలెక్టరేట్ ముట్టడిస్తామని ఎండీఎంకే అధినేత వైగో హెచ్చరించారు. వైగో హెచ్చరికల నేపథ్యంలో ఆయన్ని చిత్తూరు జిల్లా సరిహద్దులోనే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వ్యూహం రచించారు. గుడిపాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు వైగో రాయవేలూరులో కార్యకర్తలతో సమావేశమయ్యారు. మరోవైపు వైగోకు మద్దతుగా తమిళనాడులోని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. చిత్తూరులో భారీ బందోబస్తు చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని వైగో చేసిన ప్రకటన నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో ఈ ఎన్‌కౌంటర్‌పై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయని ఏపీ నుంచి తమిళనాడుకు వెళ్లే ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ఏపీ, తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో అడుగడుగునా పోలీసు బలగాలను మోహరించి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి చిత్తూరు: శేషాచలం ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తమిళనాడు వాసులు చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడి చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని గాంధీనగర్ సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమిళవాసుల్ని సరిహద్దు ప్రాంతంలో ఆంధ్రా పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. -
పట్టుకెళ్లి చంపేశారు!
⇒ ఎర్రచందనం కూలీల ‘ఎన్కౌంటర్’ బూటకమే? ⇒ ప్రభుత్వానికి ముందే తెలుసు.. పథకం ప్రకారమే అంతా జరిగిందన్న వాదనలు ⇒ మృతులందరినీ ముందు రోజే అదుపులోకి తీసుకున్నారంటున్న బంధువులు ⇒ మృతుల్లో ఏడుగురిని ముందు రోజు బస్సులో ప్రయాణిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మృతుల బంధువుల వెల్లడి ⇒ మృతులందరూ కూలీలేనని గుర్తించిన వైనం.. మృతుల్లో స్మగ్లర్లు ఏరీ? ⇒ ‘ఎన్కౌంటర్’పై హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీల ఆగ్రహావేశాలు ⇒ మానవ హక్కుల కమిషన్, ఉమ్మడి హైకోర్టు సీరియస్.. నివేదికలకు ఆదేశాలు ⇒ దుంగలు మోస్తూ దాడులెలా చేశారు? కాల్పులు జరుగుతున్నా పారిపోలేదా? ⇒ పోలీసులు రంగులు వేసిన ఎర్రచందనం దుంగలు.. కూలీల వద్దకు ఎలా వచ్చాయి? ⇒ సమాధానం లేని సందేహాలెన్నో.. ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు బలోపేతం అది ఎన్కౌంటర్ కాదు.. బూటకపు ఎన్కౌంటర్! అక్కడ జరిగింది ఎదురు కాల్పులు కాదు.. పోలీసుల ఏకపక్ష కాల్పులు! మృతిచెందిన కూలీలు అడవిలో తారసపడలేదు.. జనారణ్యం నుంచి పోలీసులే పట్టుకెళ్లారు! ఆ కూలీలు పోలీసులపై దాడి చేయలేదు.. తాము పట్టుకొచ్చిన వారిని పోలీసులే వరుసపెట్టి కాల్చిచంపారు! శేషాచలం అడవుల్లో మంగళవారం నాటి ‘ఎన్కౌంటర్’పై అందులో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం కూలీల మరణంపై.. మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నుంచే కాదు.. మృతుల బంధువుల నుంచీ వెల్లువెత్తుతున్న ఆరోపణలివి. ఘటనా స్థలాల్లో కనిపిస్తున్న దృశ్యాలు, మరణించిన కూలీల బంధువులు చెప్తున్న వివరాలు, పౌర హక్కుల సంఘాలు లేవనెత్తుతున్న సందేహాలకు.. పోలీసులు చెప్తున్న కథనాలకు ఏమాత్రం పొంతన కుదరకపోవటం.. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన కూలీల్లో ఏడుగురు.. ఆ ముందు రోజే బస్సులో ప్రయాణిస్తుండగా పోలీసులు ‘విచారణ’ పేరుతో అదుపులోకి తీసుకున్నారని.. వారితో పాటే ప్రయాణిస్తూ పోలీసుల దృష్టి నుంచి యాధృచ్చికంగా తప్పించుకున్న మరో కూలీ తమిళనాడులోని తన స్వగ్రామంలో బయటపెట్టటం.. ఇది బూటకపు ఎన్‌కౌంటరే అనేందుకు నిదర్శనంగా చూపుతున్నారు. మృతులంతా పొట్టకూటి కోసం కూలీలుగా పనిచేసే వారేనని పోస్టుమార్టం తర్వాత గుర్తించి.. వారి బంధువులకు అప్పగించారు. మరి మృతుల్లో స్మగ్లర్లు ఏరీ అన్న ప్రశ్నకు సమాధానం లేదు. పోలీసులు సోమవారం నాటికే దాదాపు 100 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారని.. వారిలో 20 మందిని సోమవారం రాత్రే అడవుల్లోకి తీసుకెళ్లి అదే రాత్రి కాల్చిచంపారని.. దానిని ఉదయం జరిగిన ‘ఎన్కౌంటర్’గా చిత్రీకరిస్తున్నారని మృతుల బంధువులు వాపోతున్నారు. అసలు శేషాచలం అడవుల్లో ‘ఎన్కౌంటర్’ అంతా ప్రభుత్వ ముందస్తు పథకం ప్రకారమే జరిగిందా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అధికారం చేపట్టిన రోజు నుంచి సీఎం చంద్రబాబు పలు సమీక్షలు నిర్వహించి ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టాలని, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్న నేపథ్యంలో.. 20 మంది కూలీల మరణానికి కారణమైన కాల్చివేత ఘటన చోటుచేసుకుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. మృతుల బంధువుల నుంచీ, పౌర సమాజం నుంచీ, రాజకీయ పార్టీల నుంచీ, పొరుగు రాష్ట్రంలో అన్ని వర్గాల వారి నుంచీ ఆరోపణలు, ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతుండటం.. మానవ హక్కుల కమిషన్, హైకోర్టులు సర్కారు తీరును ఆక్షేపిస్తూ ఘటనపై పూర్తిస్థాయి నివేదికలు కోరటం.. వంటి పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. సీఎం ఢిల్లీ పర్యటనను రద్దుచేసుకుని ‘నష్టనివారణ’ చర్యల్లో నిమగ్నమయ్యారు. అది ముమ్మాటికీ ‘నిజమైన ఎన్‌కౌంటరే’నని బలంగా చెప్పేందుకన్నట్లుగా.. అడవుల్లో కూలీల సంచారానికి సంబంధించి పాత వీడియో ఫుటేజీలు కొన్ని చానళ్లకు లీకయ్యాయి. మంత్రులు రంగంలోకి దిగి.. ‘ఎన్కౌంటర్’ను సమర్థించుకుంటూ మాట్లాడారు. వాళ్లు కూలీలే కదా? అంటే.. ‘కూలీలు అడవిలోకి రాత్రిపూట గడ్డికోయటానికి వచ్చారా? ఎర్రచందనం దొంగతనం చేస్తే సహించేది లేద’టూ మళ్లీ హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. కూలీల మృతదేహాలకు పటిష్ట భద్రత మధ్య రాత్రికి రాత్రే పోస్టుమార్టం పూర్తిచేసి.. వారి బంధువులకు అప్పగించారు. శేషాచలం ‘ఎన్కౌంటర్’లో మృతి చెందిన 20 మంది కూలీల్లో కొందరిని సోమవారం సాయంత్రమే అదుపులోకి తీసుకున్నట్లు తమకు సమాచారం ఉందని మృతుల బంధువులు చెప్తున్నారు. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు పుదూర్ గ్రామ సర్పంచ్ మూర్తి బుధవారం మీడియాకు చెప్పిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన 8 మంది కూలీలు సోమవారం ఉదయం ఇంటి నుంచి బయల్దేరారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిని పుత్తూరు - నగరి మధ్యలో ఆంధ్రా పోలీసులు ఆపి.. వారిని అనుమానంతో ప్రశ్నించారు. ఇంకా విచారించాలంటూ ఏడుగురిని తమతో జీపులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. వారి సహచరుడైన శేఖర్ అనే మరో కూలీ వారితో పాటే బస్సులో ఉన్నప్పటికీ.. అతడు మహిళల కోసం కేటాయించిన సీట్లో కూర్చొని ఉండటంతో పోలీసుల దృష్టిలో పడలేదు. అలా తప్పించుకున్న శేఖర్ తమిళనాడులోని తన స్వగ్రామం పడవేడు పుదూర్ చేరుకుని, పరిసర గ్రామాల్లోని మిగతా ఏడుగురి కుటుంబాలకు, సర్పంచ్ మూర్తికి ఈ విషయాన్ని వివరించాడు. అయితే.. పోలీసులు తీసుకెళ్లిన ఏడుగురు కూలీలు ‘నకిలీ ఎన్కౌంటర్’లో మృతి చెందారన్న విషయం తెలుసుకున్న శేఖర్.. కుటుంబంతో సహా పరారీలో ఉన్నట్లు మూర్తి పేర్కొన్నారు. బంధువులదీ అదే మాట.. తిరువణ్ణామలై జిల్లా మురుగంబాడి గ్రామానికి చెందిన మృతుడు మునస్వామి తల్లి పద్మ, వేటగిరి పాలెంకు చెందిన మృతుడు పళణి సోదరి లక్ష్మి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ పై విషయాన్ని నిర్ధరించారు. ఆ ఏడు మందిని పోలీసు జీపులో తిరుపతి వైపు తరలించారని చెప్పారు. ఆ రాత్రే కాల్చిచంపారు: ఎన్కౌంటర్’లో మృతిచెందిన కూలీలను సోమవారం సాయంత్రానికే తిరుపతికి తీసుకువచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలోనే శ్రీవారి మెట్టు సమీపంలోని శేషాచలం అడవుల్లోకి తీసుకెళ్లి.. వారిని కాల్చి చంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారిని అలా కాల్చిచంపాక.. దానిని ‘ఎన్కౌంటర్’గా చిత్రీకరించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్న తరువాతే మంగళవారం మీడియాకు వెల్లడించినట్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయం ముందే సీఎంతోపాటు, ఉన్నతాధికారులకు సైతం తెలుసునని, శేషాచలం అడవుల్లోకి కూలీలు వెళ్లకుండా భయపెట్టాలనే ఉద్దేశంతోనే కూలీలను పొట్టనపెట్టుకున్నారని కథనాలు వినిపిస్తున్నాయి. అదుపులో ఉన్న కూలీల అరెస్టులు దాదాపు 100 మందికి పైగా కూలీలను కొద్ది రోజుల కిందటే అదుపులోకి తీసుకున్నట్లు వినిపిస్తోంది. అయితే వీరిలో 20 మందిని పోలీసులు ‘ఎన్కౌంటర్’లో కాల్చిచంపగా.. మిగిలిన వారు పోలీసుల అదుపులో ఉన్నట్లు చర్చ సాగుతోంది. అదే సమయంలో.. చిత్తూరులో బుధవారం మీడియా ముందు ముగ్గురు స్మగ్లర్లు, వారి అనుచరులు 11 మందితో పాటు 48 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకా అదుపులో ఉన్నవారిని దశలవారీగా మీడియా ముందు ప్రవేశపెట్టే ప్రణాళికలో భాగంగానే ఇలా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం తరవాత అధికారులు ప్రణాళికాబద్ధంగా లీక్ చేసిన వీడియో ఫుటేజ్‌లు చూస్తే పోలీసుల కథనంపై అనేక సందేహాలు కలుగుతున్నాయి. వారం రోజుల కిందటే ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు శేషాచలం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు, వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారనేది అనధికారిక కథనం. లీకేజ్ ద్వారా బయటకు వచ్చిన విజువల్స్‌లో గత గురువారం నాటివీ ఉన్నాయి. వీరు వారం కిందటే శేషాచలంలోకి ప్రవేశించారని సమాచారం ఉంటే.. సోమవారం రాత్రి వరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎందుకు రంగంలోకి దిగలేదన్నది సమాధానం లేని ప్రశ్న. మరోపక్క నిఘా కెమెరాలో 3 రోజుల పాటు రికార్డయిన విజువల్స్‌ను పరిశీలించిన అధికారులకు.. స్మగ్లర్లు, కూలీలు ఎంత మంది ఉన్నారనేది అంచనా వేయలేకపోయారా? ఇలాంటి సందేహాలు మరెన్నో వ్యక్తమవుతున్నాయి. - సాక్షి ప్రతినిధి, తిరుపతి ‘బూటకపు ఎన్కౌంటర్’ను నిర్ధారిస్తున్న అంశాలివీ.. అడవుల్లో వందల సంఖ్యలో కూలీలు మారణాయుధాలతో ఉన్నారని తెలిసినప్పుడు ఒక్కో బృందంలో కేవలం 12 మంది పోలీసులు, ముగ్గురు అటవీ శాఖ అధికారులతోనే కూంబింగ్‌కు ఎందుకు వెళ్లినట్టు? కూలీలను పట్టుకోవడానికి అనువుగా చుట్టుపక్కల జిల్లాల నుంచి అదనపు బలగాలను ఎందుకు తెప్పించుకోలేదు? రూ. 20 లక్షల వ్యయంతో అటవీశాఖ ఏర్పాటు చేసిన ఈ ఆధునిక రహస్య కెమెరాలు చీకట్లో కూడా దృశ్యాలను రికార్డు చేయగలవు. ఏదైనా బృందం అడవిలోకి కూబింగ్‌కు వెళ్ళినప్పుడు, అక్కడ నిఘా కెమెరాల ఏర్పాటు ఉంటేవాటిని ఇతర ప్రాంతాల్లో ఉన్న అధికారులు అనునిత్యం పరిశీలిస్తుంటారు. అలాంటప్పుడు కూలీల వద్దకు చేరిన ఆయుధాల విషయం వారికి తెలుస్తుంది. దీన్ని గమనిస్తే ముప్పును ముందే ఊహించి అదనపు బలగాలను అడవిలోకి పంపడమో, ఉన్న వాటిని వెనక్కు రప్పించడమో చేసి కూలీలు బయటకు రాకుండా చుట్టూ దిగ్భందించడమో ఎందుకు చేయలేదు? ఇవేవీ లేకుండా కేవలం 15 మందితో కూడిన బృందాలు రెండు చోట్ల తమకు ఎదురైన, హఠాత్తుగా దాడి చేసిన వంద మందికి పైగా ఎర్రచందనం కూలీల్లో 20 మంది కాల్చిచంపడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఎర్రచందనం దుంగలతో వెళ్తున్న కూలీలకు పోలీసులు ఎదురైతే వారంతా చెల్లాచెదురవుతారు. ఆపై తమ వద్ద ఉన్న ఆయుధాలతో కనిపించిన వారిపై, రాళ్ళతో దూరంగా ఉన్న పోలీసులపై దాడులు చేస్తారు. అయితే శేషాచలంలో ‘ఎన్కౌంటర్’ జరిగినట్లు చెప్తున్న రెండు చోట్లా కేవలం 10 నుంచి 16 మీటర్ల విస్తీర్ణంలోనే 20 మంది ఎర్రచందనం కూలీల మృతదేహాలూ పడున్నాయి. ఎన్కౌంటర్ ఘటన ప్రాంతాన్ని పరిశీలిస్తే ఒక్కో కూలీ 25 నుంచి 30 కేజీల బరువున్న దుంగల్ని మోసుకుపోతున్నట్టు స్పష్టమవుతుంది. అలా మోసుకుపోతున్న వారికి ఒక్కసారిగా పోలీసులు ఎదురైతే బరువు మోస్తూ దాడికి పాల్పడగలరా? దుంగలను పడేసి దాడి చేశారంటే.. సాధారణంగా దుంగలను పడేసి పారిపోతూనో.. లేదా ముందుకొచ్చి దాడికి పాల్పడినట్టో కనిపించాలి? కాని ఒక్కొక్కరు ఒక్కో దుంగ పక్కన ఒరిగి పడిపోయి ఉండటం అనేక సందేహాలకు తావిస్తోంది. పోలీసులు కాల్పులు జరిపినప్పుడు ప్రాణ భయంతో తప్పించుకుని పారిపోయేందుకు కొంతదూరమైనా పరుగెత్తే ఆస్కారముంది. ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్ని మృతులు అటువంటి ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. చూస్తే అక్కడికి ఎర్రకూలీలను తీసుకెళ్ళి వారిని కాల్చిచంపి వారిపక్కన దుంగలను వేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మృతదేహాల వద్ద లభించిన దుంగలపై పెయింట్ రంగులు ఎలా వచ్చాయి? పోలీసులు రికవరీ చేసిన దుంగలను యార్డుల్లో భద్రపరిచేప్పుడే రంగులు వేస్తారు. కూలీల వద్ద పడివున్న దుంగలు కొత్తగా నరికినవి కాదని చాలా స్పష్టంగా తెలుస్తోంది. కూలీలు దాడులకు దిగారని పోలీసులు చెప్తున్నారు. యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిలో ఎవరూ తీవ్రంగా గాయపడకపోవడం అనుమానాస్పదంగా ఉంది. రెండు బృందాలు శేషాచలం అడవుల్లోకి సోమవారం రాత్రి 7 గంటలకు వెళితే మంగళవారం ఉదయం 5, 6 గంటల మధ్యలోనే కిలోమీటరు దూరంలోనే ఒకేసారి సచ్చినోడిబండ, చీకటీగలకోనలో ఎర్ర కూలీలు పోలీసులపై రాళ్లు, గొడ్డళ్లతో దాడిచేశారని పోలీసులు చెప్తున్నారు. వందలాది మంది కూలీలు పోలీసులపై దాడిచేస్తే ఒక్క కూలీనీ ప్రాణాలతో పట్టుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు చెప్తున్న ప్రకారం ‘ఆత్మరక్షణకే కాల్పులు’ జరిపితే.. ఒక్క కూలీ అయినా గాయాలతో బతికి ఉండే అవకాశం లేదా? పోలీసులు ఎర్ర కూలీలనే అనుమానంతో పుత్తూరు సమీపంలో అదుపులోకి తీసుకుంటే మంగళవారం ఉదయం శేషాచలం కొండల్లో పోలీసులపై వారు ఎదురుదాడికి ఎలా పాల్పడతారు? దీనికి తోడు సోమవారం రాత్రే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి సమీపంలో ని గ్రామాల్లో తుపాకుల శబ్దం వినబడినట్లు ప్రచారం జరగడంతో ఆ ఘటన బూటకపు ఎన్కౌంటర్ అనేదానికి ఊతమిస్తోంది. -
ఎన్కౌంటర్ మృతులకు రూ. 3లక్షల పరిహారం
తమిళనాడు/చిత్తూరు: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన కూలీలకు ఒక్కొక్కరికి రూ. 3లక్షల చొప్పున నష్టపరిహారాన్ని తమిళనాడు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూలీల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మద్రాస్ హైకోర్టు లాయర్లు బుధవారం నిరసకు దిగారు. ఎన్కౌంటర్ పేరుతో కూలీలను కాల్చిచంపినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిరసనగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. -
'ఆ ఎన్కౌంటర్లన్నీ బూటకం'
చిత్తూరు: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లన్నీ బూటకమంటూ కరుణాకరణ్ అనే వ్యక్తి ఘాటుగా విమర్శించాడు. పోలీసుల జరిపిన కాల్పుల్లో తిరువన్నామళైకు చెందిన మునిస్వామి అనే కూలీ మృతిచెందాడు. సోదరుడి మృతిపై స్పందించిన కరుణాకరణ్ బుధవారం విలేకరులతో మాట్లాడాడు. కూలీ కోసం తమ సోదరుడు ఎన్నో ప్రాంతాలకు వెళ్తుంటాడనీ, కూలీ కోసం చిత్తూరు జిల్లా నగరికి వెళ్లిన తన సోదరుడు ఇలా విగతజీవిలా కనిపించాడంతో తమ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయిందని వాపోయాడు. సోదరుడి మృతిపై న్యాయపోరాటం చేస్తామని చెప్పాడు. సోదరుడు మునిస్వామితో పాటు తమ గ్రామం నుంచి 8మంది కూలీలు వెళ్లారనీ, వారిలో ఏడుగుర్ని చిత్తూరు జిల్లా నగరి వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా చెప్పాడు. అయితే వారిలో ఒకరు తప్పించుకున్నట్టుగా కరుణాకరణ్ అన్నాడు. పోలీసుల అదుపులో ఉన్న ఏడుగురు ఇప్పడు శవాలుగా కనిపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది కచ్చితంగా బూటకపు ఎన్‌కౌంటరేనని కరుణాకరణ్ మండిపడ్డాడు. -
శేషాచల కొండల్లో ఫ్లయింగ్ స్నేక్
తిరుపతి : భారతదేశంలో ఎక్కడా కనిపించని శ్రీలంకన్ ఫ్లయింగ్ స్నేక్ శేషాచలం అడవుల్లో ఉన్నట్టు నిర్ధారణ అయిందని తిరుపతి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ శివరామ్‌ప్రసాద్ తెలిపారు. ఆయన వివరాల మేరకు చెట్ల పైభాగాన సంచరించే ఈ స్నేక్ బూడిద రంగులో ఉంటుంది. శరీరంపై నల్లటి చారలుంటాయి. విషపూరితమైన ఈ పామును చామల రేంజ్ అటవీప్రాంతంలో శివరామ్‌ప్రసాద్ ఆధ్వర్యంలో తమిళనాడు పరిశోధకుడు బుభేష్గుప్తా ఏడాది క్రితం గుర్తించారు. బెంగుళూరులోని ఇండియన్ సైన్స్ ఇన్స్టిట్యూట్కు డీఎన్ఏని పంపి 2 రోజుల క్రితం నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం దీన్ని తిరుపతిలోని బయో రీసెర్చి సెంటర్లో ఉంచారు. వైఎస్ఆర్ జిల్లా బాలపల్లి రేంజ్‌లోని కోడూరు ప్రాంతంలో ఈ పాము కనబడిందని.. ఇక్కడ స్లెండర్ కోరల్ స్నేక్, షీల్టైల్ స్నేక్, బూబ్రౌన్ వైన్ స్నేక్, ఎల్లో కాలీడ్ ఉల్ఫ్ స్నేక్, రేసర్ లనూ గుర్తించారని తెలిపారు. -
రూ.10 లక్షల ఎర్రచందనం స్వాధీనం
- మూడు వాహనాలు సీజ్ - ఆరుగురు ఎర్రకూలీల అరెస్ట్ తిరుపతి(మంగళం) : శేషాచల అడవుల్లో నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.10 లక్షల ఎర్రచందనాన్ని స్ట్రైకింగ్‌ఫోర్సు అధికారులు పట్టుకున్నారు. తిరుపతి-చిత్తూరు హైవేలో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారని ఈస్ట్ డీఎఫ్‌వో శ్రీనివాసులురెడ్డి సమాచారం మేరకు ఎఫ్ఆర్వో కే.మదనమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహిం చారు. ఆమార్గంలో టాటా సుమో, టాటా ఇండికాతో పాటు మినీ అశోక్లైలాన్డ్ వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని, ఆరుగురు ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు. మూడు వాహనాలలో 25ఎర్రచందనం దుంగలున్నాయని, ఇవి వాహనాలు సహా రూ.10 లక్షలు చేస్తాయని ఎఫ్ఆర్వో తెలిపారు. ఎర్రచందనం పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఈస్ట్ డీఎఫ్‌వో శ్రీని వాసులురెడ్డి తెలిపారు. ఈదాడుల్లో స్ట్రైకింగ్ ఫోర్సు అధికారులు డీవైఆర్వో జయరాములు, ఎఫ్‌బీవో ఎం.మునినాయక్ పాల్గొన్నారు. అదేవిధంగా నగరి మండలం నాగరాజకుప్పం దారిలో కారు సహా 10 లక్షల విలువజేసే ఎర్రచందనాన్ని సోమవారం స్వాధీనం చేసుకున్నారు. తిరుమలోరూ.2 లక్షల విలువైన 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. -
దాడులు... కాల్పులు
- దద్దరిల్లిన శేషాచలం అడవులు - పోలీసులపై ఎర్రకూలీల దాడి - ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు - ఎర్రకూలీ మృత అదుపులో మరొకరు..! - బాలుపల్లె రేంజ్లో ఘటన రాజంపేట/రైల్వేకోడూరు అర్బన్: పోలీసుల కాల్పులు, ఎర్రచందనం చెట్లను నరికే కూలీల గొడ్డళ్లు, రాళ్ల దాడులతో శేషాచలం అడవులు మరోసారి దద్దరిల్లాయి. పోలీసుల కాల్పులలో ఓ కూలీ మృతి చెందాడు. బాలుపల్లె రేంజ్ పరిధిలోని దట్టమైన శేషాచలం అటవీ ప్రాంతంలో బుధవారం 25 మందితో కూడిన కూలీల బృందం ఎర్రచందనం చెట్లను నరికేపనిలో ఉన్నారు. ఇంతలో పోలీసుల బూట్ల చప్పుళ్లతో వారు అప్రమత్తమయ్యారు. కొంతదూరం నుంచే ఎర్రకూలీలను చూసిన స్పెషల్ పార్టీ పోలీసులు ముందస్తు హెచ్చరికగా గాలిలోకి కాల్పులు జరిపారు. అయితే ఎర్రకూలీలు పోలీసులపై ఎదురుదాడికి సిద్ధమయ్యారు. తమ వద్ద ఉన్న గొడ్డళ్లతో పాటు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒక కూలి మృతి చెందాడు. మిగిలిన వారు పరారయ్యారు, బుధవారం సాయంత్రం 6-7 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. చీకటి పడటంతో కూలీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురువారం తరలిస్తామని డీఎస్పీ జీవీ రమణ తెలిపారు. కాగా మరో కూలీ పోలీసులకు పట్టుపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ఈ సందర్భంగా తిరుపతి డీఎఫ్ఓ మాట్లాడుతూ కూంబింగ్ చేస్తున్న పోలీసులపై ఎర్రకూలీలు గొడ్డళ్లతో దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. కాగా గతనెలలో శేషాచలం అటవీ ప్రాంతంలోనే పోలీసులు జరిపిన కాల్పులలో వీరమణి అనే ఎర్రకూలీ మృతి చెందాడు. -
శ్రీగంధం.. ఎర్రచందనం..
మొక్కల పెంపకానికి జిల్లావాసుల ఆసక్తి ►‘మన ఊరు.. మన ప్రణాళిక’లో విజ్ఞప్తులు ►జిల్లా భూభాగం అనువు కాదంటున్న అటవీ అధికారులు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : శేషాచలం అడవుల్లో పెరిగే శ్రీ గంధం, ఎర్రచందనం మొక్కల పెంపకానికి జిల్లావాసులు ఆసక్తి చూపుతున్నారు. ‘మన ఊరు.. మన ప్రణాళిక.’లో భాగంగా గ్రామాలకు వెళ్లిన అటవీ అధికారులకు ఈ అరుదైన రకాల మొక్కలను సరఫరా చేయాలని విజ్ఞప్తులు వచ్చాయి. ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లాగా పేరుంది. నాణ్యమైన టేకు కలపకు జిల్లా దేశంలోనే ప్రసిద్ధి గాంచింది. కానీ, ఇప్పుడు జిల్లా వాసులు మాత్రం ఈ అరుదైన రకాల మొక్కలు సరఫరా చేయాలని కోరుతున్నారు. ఈ మొక్కలు సరఫరా చేయాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వ చ్చాయని సోషల్ ఫారెస్టు డీఎఫ్‌వో జానకిరామయ్య ‘సాక్షి’తో పేర్కొన్నారు. జిల్లా భూముల్లో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు పెరిగే అవకాశాలున్నప్పటికీ.. నాణ్యత అంతగా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై మీడియాలో తరచూ కథనాలు వస్తుండటం కూడా ఒక కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘హరితహారానికి’ 72 లక్షల మొక్కలు తెలంగాణలో 25 శాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో కొత్తగా కొలువుదీరిన కేసీఆర్ సర్కారు ముందుకెళుతోంది. ఇందుకోసం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఏటా ఒక్కో నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ సీజనులో నాటేం దుకు జిల్లాలో 72 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఈ లెక్క న ఒక్కో గ్రామ పంచాయతీకి 8వేల మొక్కలు సరఫరా చేయనున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో అటవీశాఖకు సంబంధించి సామాజిక వన విభాగం (సోషల్ ఫారెస్టు)తో, టెరిటోరియల్ విభాగం నర్సరీలను పెంచుతోంది. డ్వామా, సింగరేణి, అట వీ అభివృద్ధి సంస్థ(టీఎఫ్‌డీసీ) వంటి ప్రభుత్వ రంగ సంస్థల నర్సరీ లు కూడా జిల్లాలో ఉన్నాయి. కాగజ్‌నగర్‌లో ఉన్న ప్రైవేటు సంస్థ ఎస్పీఎం కూడా నర్సరీలను పెంచుతోంది. నిమ్మ, జామ, దానిమ్మ, టేకు, సుబాబుల్, నీలగిరి వంటి మొక్కలు ఈ ఏడాది అందుబాటులో ఉన్నాయి. ఏటా వర్షాకాలంలో ప్రారంభంలో జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు నెలాఖరు వరకు మొక్కలు నాటుతారు. ఈ సీజనులో జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉన్న 72 లక్షల మొక్కలు నాటేందు కు ఏర్పాట్లు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 2.35 కోట్ల మొక్కల పెంపకానికి ప్రణాళిక రానున్న సంవత్సరానికి 2.35 కోట్ల మొక్కలు పెంచాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అటవీశాఖ సామాజిక వన విభాగం డీఎఫ్‌వో జానకిరామయ్య తెలిపారు. ‘మన ఊరు.. మన ప్రణాళిక ..’లో భాగంగా జిల్లా లో మొక్కల పెంపకానికి అనువైన స్థలాలను గుర్తిస్తున్నామని అన్నా రు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, బొడగుట్టలు, కాలువల పక్కన స్థలాలు, పడీత్ భూములు వంటి వాటిని గుర్తించామని అన్నారు. ఇంటి ఆవరణలు, పొలంగట్లలో ఏ మేరకు స్థలం అందుబాటులో ఉందో గుర్తిస్తున్నామని తెలిపారు. -
బడా స్మగ్లర్లపై పోలీసు కన్ను
- చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక బృందాలు - మూడో రోజూ రహస్య విచారణ - శేషాచలం కొండల్లో కొనసాగుతున్న కూంబింగ్ - చెక్‌పోస్టుల్లో పోలీసు సిబ్బంది మోహరింపు సాక్షి, చిత్తూరు: శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో చిత్తూరు, తిరుపతి అర్బన్ జిల్లాల పోలీసులు బడా స్మగ్లర్లపై దృష్టి సారించారు. నిన్నమొన్నటి వరకు జిల్లాలోని స్థానిక స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్న వీరు ప్రస్తుతం అంతర్రాష్ట్ర స్మగ్లర్ల కోసం వేట ముమ్మరం చేశారు. చెన్నై స్థావరంగా ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పేరుమోసిన బడా స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకునేందుకు చిత్తూరు నుంచి ప్రత్యేక పోలీసు బృందం వెళ్లింది. అదే సమయంలో కర్ణాటక రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డాగా ఉన్న కటికనహళ్లి గ్రామంలో ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకునేందుకు మరో బృందాన్ని పంపించారు. చెన్నై, బెంగళూరు పోలీసుల సహకారంతో ఏకకాలంలో దాడులు నిర్వహించి ఎలాగైనా ప్రధాన స్మగ్లర్లను పట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. మరోవైపు తిరుమల కొండల్లో అటవీ, పోలీసు శాఖలతో కూడిన నాలుగు ప్రత్యేక బృందాలు కూంబింగ్ చేస్తున్నాయి. చామల, తిరుపతి, మామాండూరు అటవీ రేంజ్‌ల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తిరువణ్ణామలై జిల్లాకు ప్రత్యేక బృందాలు డీఎఫ్‌వో వైల్డ్‌లైఫ్, తిరుపతి అర్బన్ ఎస్పీల సంయుక్త ఆధ్వర్యంలో తమిళనాడులోని తిరువణ్ణామలై, వేలూరు ప్రాంతాలకు పోలీసు, అటవీ శాఖల సంయుక్త బృందాలను పంపి అక్కడి వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శేషాచల కొండ ల్లో ఎర్రచందనం నరికేందుకు వస్తున్న వారిలో ఎక్కువ మంది తిరువణ్ణామలై జిల్లా జమునామత్తూరు, జవ్వాదిహిల్స్ ప్రాంతాలకు చెందిన గిరిజనులుగా గుర్తించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించకుండా చేయాలనే వ్యూహంతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఉన్నారు. పోలీసుల మోహరింపు జిల్లాలోని ఎర్రవారిపాళెం, భాకరాపేట, రొంపిచెర్ల పోలీసుస్టేషన్లతోపాటు సరిహద్దు ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల్లో పోలీసులను భారీగా మోహరించారు. చెక్‌పోస్టుల్లో పోలీసుల సంఖ్య పెంచాలని కలెక్టరు సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో భాగం గా జిల్లా పరిధిలో ఈ మార్పు చేశారు. చిత్తూరు, గుడిపాల సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. పీడీ యాక్టు పెట్టే యోచన పోలీసులు ఇప్పటికే తాము అదుపులోకి తీసుకున్న స్థానిక స్మగ్లర్లపై పీడీ యాక్టు పెట్టారు. జిల్లా తూర్పు అటవీ శాఖ పరిధిలో కూడా ఎర్రచందనం దొంగలపై ఐపీసీ కేసులు నమోదు చేసి పీడీ యాక్టు మోపేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ మేరకు కలెక్టర్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న జిల్లాకు చెందిన నలుగురు స్మగ్లర్లను రహస్య ప్రదేశంలో విచారిస్తూనే ఉన్నారు. వీరినుంచి ఇంకా కొన్ని వివరాలు రాబట్టిన తర్వాత అరెస్టులు చూపించే అవకాశముంది. బుధవారం తిరుపతికి రానున్న కాబోయే సీఎం చంద్రబాబునాయుడుకు ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి చేపట్టిన చర్యల గురించి ఎస్పీలు వివరించనున్నారు. రేణిగుంటలో మరో నలుగురు.. రేణిగుంట, న్యూస్‌లైన్: స్మగ్లర్‌గా గుర్తించిన వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం వనిపెంట గ్రామానికి చెందిన శేషు(35)తోపాటు మరో ముగ్గురిని మంగళవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు రేణిగుంట డీఎస్పీ బాదేపల్లి శ్రీనివాస్ తెలిపారు. వారి నుంచి రూ.10.09 లక్షల నగదు, రూ.50 లక్షల విలువైన 26 ఎర్రచందనం దుంగలు, కత్తి, స్కార్పియో వాహనం, బంగారు చైను, రెండు ఉంగరాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రేణిగుంట అర్బన్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ అరెస్టు వివరాలను వెల్లడించారు. మండలంలోని ఆంజనేయపురం చెక్‌పోస్టు వద్ద సీఐ రామచంద్రారెడ్డి, ఎస్ఐలు భాస్కర్ నాయక్, మధుసూదన్‌రావు, రఫీ నిఘా వేశారు. స్కార్పియోలో కోడూరు వైపు నుంచి అతివేగంగా వస్తుండగా వెంబ డించారు. శేషుతోపాటు డ్రయివర్ నగేష్(20), నరసింహులు(40), వీరయ్య(37)ను అరెస్టు చేశారు. జంట హత్యల కేసులో నిందితుడి అరెస్ట్ తిరుమల శేషాచల అడవుల్లో ఇటీవల జరిగిన అటవీ అధికారులు శ్రీధర్, డేవిడ్ కరుణాకర్ హత్యల కేసులో నిందితుడు కర్ణాటక రాష్ట్రం కటికనహళ్లికి చెందిన జమాల్‌ఖాన్ అలియాస్ జమాల్ అహ్మద్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. -
తిరుమలలో మళ్లీ చెలరేగిన కార్చిచ్చు
-
తిరుమలలో మళ్లీ చెలరేగిన కార్చిచ్చు
వందలాది ఎకరాల్లో అడవి బుగ్గిపాలు సాక్షి, తిరుమల: తిరుపతి శేషాచల అడవుల్లో మళ్లీ కార్చిచ్చు చెలరేగింది. ఆదివారం శ్రీవారి మెట్టుకు సమీపంలోని నారాయణగిరి పర్వత శ్రేణుల్లో మంటలు ఎగసిపడ్డాయి. ఈ అగ్నికి వందలాది ఎకరాల అడవి బుగ్గిపాలైంది. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫైరింజన్లు మంటలు ఎగువ ప్రాంతంలోని జేఈవో క్యాంపు కార్యాలయం, ఇతర కాటేజీల వరకు మంటలు విస్తరించకుండా నిరోధించారు. ముందు జాగ్రత్తగా శ్రీవారిమెట్టు కాలిబాటలో వచ్చే భక్తులను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిలిపివేశారు. ఆ మార్గంలో ప్రమాదం లేదని నిర్ధారించుకున్నాకే భక్తులను అనుమతించారు. అయితే గాలి వాలుతో మంటలు కింది భాగంలోని లోయ నుంచి కల్యాణి డ్యాం ఉండే అటవీ ప్రాంతంలోకి విస్తరించాయి. ఆ ప్రాంతంలో సాయంత్రం వరకు మంటలు రేగుతూనే ఉన్నాయి. దట్టమైన పొగ కూడా అలముకుంది. మంటలు అదుపుచేసే పనులను టీటీడీ సీవీఎస్వో ఘట్టమనేని శ్రీనివాసరావు పర్యవేక్షించారు. -
శేషాచలంలో మళ్లీ దావానలం..
-
శేషాచలంలో మళ్లీ దావానలం..
సాక్షి, తిరుమల: తిరుమల శేషాచలం అడవుల్లో ఆరు రోజులుగా రగిలిన కార్చిచ్చును ఆర్పివేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ కార్చిచ్చు రాజుకుంది. శ్రీవారిమెట్టు కాలిబాట ఆరంభంలో రోడ్డు పక్కనే గుర్తుతెలియని వ్యక్తులు అడవికి నిప్పుపెట్టడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కంగుతిన్న టీటీడీ, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికప్పుడే అందుబాటులో ఉన్న మూడు ఫైరింజన్లను రంగంలోకి దించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. తిరుమల, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కూడా మరికొన్ని ఫైరింజన్లు తెప్పించారు. ఇరుకైన అటవీమార్గంలో ఫైరింజన్ల పైపులు వెళ్లేందుకు కొంత ఇబ్బంది పడినా ఎట్టకేలకు మంటలను అదుపు చేశాయి. సాయంత్రం వెలుతురు సరిగా లేని కారణంగా ఓ హెలికాప్టర్ అగ్నిప్రమాద ఘటన స్థలంపై ఏరియల్ సర్వే నిర్వహించినా.. సహాయక చర్యల్లో మాత్రం పాల్గొనలేకపోయింది. ఇదిలావుంటే.. శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగే అవకాశాలను గుర్తించి, నివారించేందుకు ప్రతి సంవత్సరం చేపట్టే ‘ఫైర్ ట్రేసింగ్ ఆపరేషన్స్’ టీటీడీ వారు ఈ ఏడాది చేపట్టకపోవటం వల్లే దావానలాలు వ్యాపిస్తున్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరు రోజులుగా కార్చిచ్చులో బుగ్గయిన శేషాచలం శుక్రవారం మధ్యాహ్నానికి పూర్తిగా చల్లబడింది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు ఎంఐ17సీ-130 హెలికాప్టర్లు మంటలు చెలరేగిన కాకులకొండ, తుంబరు కోనల్లో మంటలు వచ్చిన ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో మొత్తం 2.5 లక్షల లీటర్ల నీటిని వెదజల్లాయి. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు చివరిసారిగా హెలికాప్టర్లతో ఏరియల్ సర్వే నిర్వహించి ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత ఆపరేషన్ ముగిసిందని అధికారులు ప్రకటించారు. తిరుమల అడవులను ఆవరించిన దావానలాన్ని భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) విజయవంతంగా ఆర్పివేసిందని రక్షణ శాఖ కూడా బెంగళూరులో ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో.. రెండు రోజులుగా కాకులకొండ, తుంబురుకోనలో మంటలు ఆర్పే చర్యల్లో పాల్గొన్న 150 మంది సైనిక సిబ్బంది, అరక్కోణం, విశాఖపట్నంకు చెందిన 40 మంది నావికాదళం, చెన్నైలోని రాజస్థాన్ 25వ బెటాలియన్‌కు చెందిన 100 మంది అగ్నిమాపక సిబ్బంది వెనుతిరిగేందుకు సిద్ధమయ్యారు. కానీ.. సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమలకు నడిచివచ్చే కాలిబాట మార్గమైన శ్రీవారిమెట్టు వద్ద అడవికి నిప్పు అంటుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే సైనిక, నౌకాదళం, అగ్నిమాపక సిబ్బందిని అక్కడికి పంపించారు.. వారు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో మంటలను ఆర్పివేశారు. ఈ సిబ్బంది మొత్తాన్నీ, ఆపరేషన్ శేషాచలాన్నీ మరో రోజు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. -
" 'అలా' చేసినందుకే... కొండల్లో అగ్నికీలలు"
-
చల్లారిన కార్చిచ్చు!
సాక్షి, తిరుమల/హైదరాబాద్: శేషాచల అడవుల్లో మంటలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. ‘ఆపరేషన్ శేషాచలం’ చాలావరకు విజయవంతమైంది. నాలుగు రోజులుగా అడవుల్ని కబళిస్తున్న కార్చిచ్చు గురువారం సాయంత్రానికి ఆరిపోయినట్టు కనిపించింది. వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన మూడు హెలికాప్టర్లతో పాటు వివిధ విభాగాలకు చెందిన సుమారు 700 మంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అడవుల్లో చెలరేగిన మంటల్ని అదుపు చేసేందుకు హెలికాప్టర్ల సాయం కావాలని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్.. గవర్నర్ నరసింహన్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ చొరవ తీసుకుని కేంద్రాన్ని సంప్రదించడంతో త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. బుధవారం శేషాచలంలో చేతక్ హెలికాప్టర్ ద్వారా సర్వే చేసిన వాయుసేన సిబ్బంది నీటిని చల్లాల్సిన ప్రాంతాలను గుర్తించారు. రాత్రి 11-30 గంటల సమయంలో అత్యాధునిక సీ-130 ఎయిర్‌క్రాఫ్ట్ రెక్కీ నిర్వహించి మంటలు ఎటు నుంచి ఎటువైపు వ్యాపిస్తున్నాయో మరోసారి పరిశీలించింది. గురువారం మధ్యాహ్నం చేతక్ తో పాటు మరో రెండు హెలికాప్టర్లు మరోసారి శేషాచలంలో పరిస్థితిని అంచనా వేశాయి. అధికారులు ఒక్కో హెలికాప్టర్ కు 3 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న భారీ బకెట్లను ఏర్పాటు చేశారు. అవి తిరుమల ఆలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమారధార ప్రాజెక్టులో నీటిని తోడుకుంటూ అడవిపై వెదజల్లాయి. వివిధ విభాగాల సిబ్బంది నేలపైనుంచి మంటల్ని ఆర్పారు. దీంతో సాయంత్రానికల్లా మంటలు చాలావరకు అదుపులోకి వచ్చాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ: గవర్నర్ నరసింహన్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి బి.సోమశేఖరరెడ్డి తిరుమలలో పరిస్థితిని సమీక్షించారు. టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ స్వయంగా మంటలు ఆర్పే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, జిల్లా కలెక్టర్ రాంగోపాల్ ఆపరేషన్‌కు నేతృత్వం వహించారు. దావానలం వల్ల 460 హెక్టార్లలో అడవి దగ్ధమైందని ఈవో గిరిధర్ గోపాల్ తెలిపారు. టీటీడీ అడవి చుట్టూ ప్రహరీగోడ, రింగ్‌రోడ్డు: భవిష్యత్‌లో ఇలాంటి అగ్నిప్రమాదాలు తిరుమల సరిహద్దులను తాకకుండా 6,004 ఎకరాల్లో విస్తరించిన టీటీడీ అడవి చుట్టూ ప్రత్యేకంగా రింగ్‌రోడ్డు, ప్రహరీగోడ నిర్మించాలని గురువారం సమావేశమైన టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. -
ఆటవికంపై విచారణకు ఆదేశం: డీజీపీ
-
ఆటవికంపై విచారణకు ఆదేశం: డీజీపీ
తిరుపతి: శేషాచల అడువుల్లో పోలీసుల ఆటవిక చర్యలపై.. సాక్షి ప్రసారం చేసిన కథనాలపై ప్రభుత్వం స్పందించింది. దీంతో డీజీపీ ప్రసాదరావు తక్షణమే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా ఆదేశించారు. ఎర్రచందనం కూలీని దాడిచేసింది పోలీసులా..? లేదా అటవీశాఖ సిబ్బందా ? అనేది తెలిపాలని ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. అంతేకాక దాడి జరిగిన సంఘటనా స్థలాన్ని గుర్తించాలని డీజీపీ స్పష్టీకరించారు. కాగా, శేషాచల అడవుల్లో ఎర్రచందనం కూలీని చిదకబాదిన ఘటనపై హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించాలని పౌరహక్కుల సంఘం నేతలు క్రాంతిచైతన్య,షామీర్భాషాలు డిమాండ్ చేశారు. మంగళవారం వారు సాక్షితో మాట్లాడారు. తక్షణమే విచారణకు ఆదేశించాల్సిందిగా హెచ్ఆర్సీని వారు కోరారు. లేని పక్షంలో తామే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. -
అటవీ సిబ్బందికి ఆయుధాలు!
ఆదిలాబాద్ : రెండు దశాబ్దాల కల ఫలించనుంది. అడవుల రక్షణకు ఆయుధాలు తప్పనిసరని అటవీశాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలకు మోక్షం లభించనుంది. దేశంలో 42వ అభయారణ్యంగా పేరున్న ‘కవ్వాల్’లో అటవీశాఖ అధికారులు, సిబ్బందికి ఆయుధాలు తప్పనిసరని మూడేళ్లుగా ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోగా, ఇటీవల వరుస సంఘటనల్లో స్మగ్లర్ల చేతిలో అటవీశాఖ ఉద్యోగులు మృతిచెందిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్ పోలీసు, అటవీ, రెవెన్యూశాఖల ఉన్నతాధికారులతో రెండు రోజుల క్రితం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్లు పాల్గొన్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీ అధికారులను హతమార్చడం, అంతకు ముందు నిజామాబాద్‌తోపాటు జిల్లాలోని పెంబి అడవుల్లో సత్యనారాయణ అనే బీట్ ఆఫీసర్‌ను చంపడం వంటి సంఘటనలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించడంతోపాటు అత్యధికంగా అడవులున్న జిల్లాల్లో అ టవీశాఖ అధికారులు, సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయించడంతో త్వరలోనే అటవీ సి బ్బంది చేతికి ఆయుధాలు రానున్నాయన్న చర్చ ఆ శాఖ అధికారులు, ఉద్యోగుల్లో సాగుతోంది. త్వరలోనే పోలీసుశాఖకు ఉత్తర్వులు మావోయిస్టుల కార్యకలాపాల నేపథ్యంలో అటవీ, ఆబ్కారీశాఖలకు చెందిన ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఆయుధాలు, వైర్లెస్ సెట్ల కోసం మావోయిస్టులు అధికారులు, సిబ్బందిపై దాడులకు పాల్పడిన నేపథ్యంలో ప్రభుత్వం అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. సుమారు 20 ఏళ్లుగా అటవీ, ఆబ్కారీశాఖలకు చెందిన ఆయుధాలు పోలీసుశాఖ ఆధీనంలో ఉన్నాయి. మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గడం, నాలుగైదేళ్లుగా అటవీ, ఆబ్కారీశాఖల అధికారులు, సిబ్బందికి స్మగ్లర్లు, అక్రమార్కుల ఆగడాలు అధికమయ్యాయి. మూడేళ్ల కాలంలో జిల్లాలో ముగ్గురికిపైగా మృత్యువాత పడగా, పలు సంఘటనల్లో అటవీశాఖ అధికారులు, సిబ్బంది గాయపడ్డారు. రాష్ర్టవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడటంతో అటవీ, ఆబ్కారీశాఖలకు తిరిగి ఆయుధాలు అప్పగించాలన్న ప్రతిపాదన వచ్చింది. ప్రధానంగా అటవీశాఖ అధికారులపై ఇటీవల దాడులు ఉధృతం కావడంతో పోలీసుశాఖ వద్ద డిపాజిట్ చేసిన ఆయధాలను తిరిగి తీసుకోవాలని నిర్ణయించారు. సీఎం కిరణ్‌తో జరిగిన సమావేశం అనంతరం అటవీశాఖ పీసీసీఎఫ్ బీఎస్ఎన్ రెడ్డి అటవీశాఖ సీసీఎఫ్లకు ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆదేశాలు వెలువడటమే తడువుగా అటవీశాఖ జిల్లా అధికారులు పోలీసుస్టేషన్లో మూలన ఉన్న తుపాకుల దుమ్ము దులిపే పని లో పడినట్లు సమాచారం. సుమారుగా 20 క్రితం పోలీసులకు అప్పగించిన ఆయుధాలకు సంబంధించిన వివరాల కోసం పాత ఫైళ్లను వెతుకుతున్నారు. పోలీసుశాఖ ఆధీనంలో ఉన్న తమ తుపాకులను తిరిగి ఇవ్వాలని లేఖలకు రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. పరిశీలనలో అటవీస్టేషన్ల ప్రతిపాదన అటవీ విస్తీర్ణంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న జిల్లాలో 7.15 లక్షల హెక్టార్లలో అడవులు ఉన్నాయి. ఇది మొత్తం జిల్లా విస్తీర్ణంలో 43 శా తం. అయితే ఇటీవల కాలంలో వేల హెక్టార్లలో అడవులు నరికివేతకు గురయ్యాయి. దేశంలోనే అత్యధికంగా అడవులు నరికవేతకు గురవుతు న్న జిల్లా ఖమ్మం తర్వాత ఆదిలాబాదేనని ప్ర భుత్వం సర్వేలో వెల్లడైంది. మిగిలిన అడవుల ను పరిరక్షించేందుకు, తమను తాము రక్షించుకునేందుకు ఆయుధాల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మూడేళ్లుగా ఆయుధాల కోసం పదేప దే ప్రభుత్వానికి లేఖలు రాసినా... కొందరి మర ణం తర్వాతైనా ఆయుధాల ప్రతిపాదనకు మో క్షం కలిగింది. ఈ నేపథ్యంలో వీలైనంత తొందరలో ఆయుధాలను చేపట్టేందుకు సన్నద్ధమవుతుండగా, అటవీస్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనకు వచ్చినట్లు ఓ సీనియర్ అటవీశాఖ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. కాగా ఆదిలాబాద్ అటవీశాఖ సర్కిల్ పరిధిలో ఆరు టెరిటోరియల్, నాలుగు ఫంక్షనల్ డివిజన్లు, ఏడు సబ్ డివిజన్లున్నాయి. వీటి పరిధిలో 26 రేంజ్‌లు, 116 సెక్షన్లు, 296 బీట్లు ఉన్నాయి. అయితే ఇంతకు ముందు ఆయుధాలు లేని కారణంగా తరచూ పోలీసులను వెంట తీసుకెళ్లి స్మగ్లర్లు, అటవీభూముల ఆక్రమణదారులను భయపెట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఇకపై నేరుగా అటవీశాఖ ఉద్యోగుల చేతికే ఆయుధాలు అందనుండటంతో ఇప్పుడు అడవుల రక్షణ, స్మగ్లర్ల ఆటకట్టించడం అంత పెద్ద పనేం కాదని అధికారులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. -
పీలేరే స్మగ్లింగ్ కేంద్రం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం అక్రమ రవాణాకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజక వర్గం అడ్డాగా మారుతోంది. పీలేరు నుంచి చెన్నై, బెంగళూరుకు వెళ్లే రహదారులు ఉన్నాయి. ఎర్రచందనం ఎక్కువగా ఉన్న శేషాచలం అడవులు అక్కడకు దగ్గర. స్మగ్లర్లకు రాజకీయ నేతలు, అధికారుల సహకారం ఇవన్నీ కూడా అక్రమరవాణా పెరగడానికి కారణాలు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి జిల్లా అయిన చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్లు ఆదివారం రెచ్చిపోయి ఇద్దరు అటవీశాఖ అధికారులను హతమార్చడం, మరో ఆరుగురిని గాయపర్చడంతో పీలేరు కేంద్రంగా సాగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణా మరోమారు చర్చనీయాంశమైంది. అక్రమ రవాణా ద్వారా కిరణ్‌కుమార్ రెడ్డి ఆయన అనుచరులు వందల కోట్లు సంపాదించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పలు పర్యాయాలు బహిరంగంగానే ఆరోపించారు. గతంలో పీలేరుకు ప్రాతినిధ్యం వహించిన అటవీశాఖా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరో అడుగు ముందుకేసి పీలేరు కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్న తీరును బహిర్గతం చేశారు. పీలేరు నుంచే ముఖ్యమంత్రి అనుచరులు వందలాది మంది కూలీలను తరలిస్తున్న వైనాన్ని పెద్దిరెడ్డి బయటపెట్టినా సంబంధిత అధికారులెవ్వరూ స్పందించలేదు. ఈ ఆరోపణలకు ఎన్నడూ సమాధానం ఇవ్వని ముఖ్యమంత్రి స్మగ్లింగ్ నివారణకు తీసుకున్న చర్యలూ నామామాత్రమే. ఇవన్నీ కూడా అనుమానాలను పెంచుతున్నాయి. పైగా, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈ మూడేళ్లలోనే ఎన్నడూ లేనంతగా వందల కోట్ల ఎర్రచందనం తరలిపోయింది. దట్టమైన అడవుల్లోకి వెళ్లి ఎర్రచందనం చెట్లను నరికి రహదారులపై చేర్చేందుకు తమిళనాడు నుంచి వచ్చే వందలాది మంది కూలీలను ఎదుర్కొనేందుకు అటవీశాఖ బీట్ అధికారులకు తుపాకులిస్తామన్న ముఖ్యమంత్రి హామీ నేటికీ ఆచరణరూపం దాల్చలేదు. రెండేళ్ల క్రితం అటవీశాఖాధికారుల సమావేశంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు అటవీశాఖాధికారులకు తుపాకులివ్వనున్నట్టు ఆయన ప్రకటిం చారు. ముఖ్యమంత్రి హామీ మేరకు వైఎస్ఆర్, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు 400 తుపాకులు కొనుగోలు చేయాల్సి ఉంటుందంటూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. నేటికీ తుపాకుల కొనుగోలు జరగలేదు. ఆదివారం నాటి సంఘటనలో తుపాకులు లేకపోవడం వల్లే కూలీల దాడులను తిప్పికొట్టేలేక పోయామని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సిబ్బంది చెప్పారు. అధికార పార్టీ నేతలతో పాటు పోలీసు, అటవీ శాఖలకు చెందిన కొందరు అధికారులు, కింది స్థాయి సిబ్బంది స్మగ్లర్లకు సహకరిస్తూ టాస్క్‌ఫోర్స్‌ను నీరుగారుస్తున్నారు. మూడున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రి నియోజకవర్గ కేంద్రంలోనే పనిచేస్తున్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరిస్తున్నా చర్యలు మాత్రం తీసుకోలేదు. ఇటీవల బదిలీపై వెళ్లిన ఎస్పీ కాంతి రాణా టాటా సదరు సీఐకి ఈ ఆరోపణలపై మెమో కూడా ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి సోదరుడి అండదండలు ఉండడంతో ఆయనపై చర్యలు కాదుకదా బదిలీ కూడా చేయలేకపోయారు. ఇక టాస్క్ఫోర్సు అధికారులు కూడా ఎర్రచందనం కూలీల అరెస్టులకే పరిమితమై స్మగ్లర్లను ఏమీ చేయలేకపోతున్నారు. కూలీలు ఇచ్చే సమాచారం ఆధారంగా స్మగ్లర్ల వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్న సమయంలో అధికార పార్టీ నేతల నుంచి వస్తున్న ఒత్తిడులే ఇందుకు కారణమని చెబుతున్నారు.