శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు సుబ్రమణియన్ స్వామి డిమాండ్ చేశారు.
ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు సుబ్రమణియన్ స్వామి
రాయచూరు: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు సుబ్రమణియన్ స్వామి డిమాండ్ చేశారు. రాయచూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమిళ కూలీలను ఎన్‌కౌంటర్ చేయడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకువచ్చేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారన్నారు. 2జీ స్పెక్ట్రం వేలంలో రూ. 4 లక్షల కోట్లు, బొగ్గు క్షేత్రాల వేలంలో రూ. 2 లక్షల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా మోదీ చర్యలు తీసుకున్నారన్నారు.