
అమరావతి, సాక్షి: ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్‌సీపీకే దక్కాలని బీజేపీ ఫైర్‌బ్రాండ్, ప్రముఖ లాయర్ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) అంటున్నారు. ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై ఆయన కోర్టుకెక్కారు. ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు వెల్లడించారు.
‘‘తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక(Tirupati Deputy Mayor Election) సందర్భంగా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలామందిని భయపెట్టి దాడులు చేశారు. ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని పిల్ వేశా. నేను వేసిన పిల్ మార్చి 12వ తేదీన విచారణకు వస్తుంది’’ అని మీడియాకు తెలిపారాయన. తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్‌ఐఆర్ మాత్రమే వేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారాయన. ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే.. దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుంది అని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయడ్డారు.

ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్‌సీపీదే
ఏపీలో ప్రతిపక్షంలో ఒక్క వైఎస్సార్‌సీపీ(YSRCP)నే ఉంది. కాబట్టి ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష(Principal Opposition) హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్యెల్యేలు ఉన్నా వైఎస్సార్‌సీపీకి ఆ హోదా దక్కాల్సిందే అని స్పష్టం చేశారాయన. ఈ క్రమంలో ఆయన మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
👉తిరుపతి లడ్డూ అంశం(Tirupati Laddu Controversy) ముగిసిపోయింది. కల్తీలాంటి అంశాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తిరుపతి లడ్డూను కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరూ అనుకోరు.
👉మంచి విషయం ఎవరు చెప్పినా పార్టీలకతీతంగా అంగీకరించాలి. నా నిర్ణయాలను పార్టీ ఎన్నడూ వ్యతిరేకించలేదు అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ఏపీ కూటమి ప్రభుత్వం (AP Kutami Prabhutvam)లో బీజేపీ భాగమై ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీసే అవకాశం లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment