Subramanian Swamy
-
చంద్రబాబుపై బీజేపీ నేత, మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి విమర్శలు
-
ఆ అసత్యాలపై బదులేది బాబూ?
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి లడ్డూ విషయంలో అసత్యాలు చెప్పినందుకు అత్యున్నత న్యాయస్థానం మందలించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నుంచి ఇంతవరకూ సమాధానమే లేదని బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సుబ్రమణియన్ స్వామి మండిపడ్డారు. ఈమేరకు తిరుపతి లడ్డూ కల్తీ కేసు విచారణ సందర్భంగా గతేడాది సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ స్వామి ఆదివారం తన ఎక్స్ ఖాతాలో మూడు పోస్టులు చేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కోర్టు తీవ్రంగా మందలించిందని, కల్తీ నెయ్యిని వాడారనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ‘ఆ అసత్యాలపై ఇప్పటికీ చంద్రబాబు నుంచి సమాధానం లేదు. ఆయన నిర్లక్ష్యంపై మోదీ ఎందుకు చర్యలు తీసుకోరు? బాబు ఎప్పడు బీజేపీని వదిలేస్తారు?’ అని ఎక్స్‌లో స్వామి ప్రశ్నలు సంధించారు.సుప్రీంలో పిల్ దాఖలు చేసిన స్వామి..: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని నియమించాలని కోరుతూ సుబ్రమణియన్ స్వామి గతేడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం తెలిసిందే. ల్యాబ్ నివేదికపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్ధించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవోలను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసులో సుబ్రమణియన్ స్వామి స్వయంగా (పార్టీ ఇన్ పర్సన్) వాదనలు వినిపించారు. ఏ నివేదిక ఆధారంగా రాద్ధాంతం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారో.. దాన్ని రూపొందించేందుకు ఉపయోగించిన నెయ్యి ఎక్కడిది? టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో అది ఉందా? నివేదిక వెనుక రాజకీయ పార్టీల దురుద్దేశాలున్నాయా? అనే విషయాలను తేల్చాలని స్వామి తన పిటిషన్లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు.దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న కోర్టు..లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ దాఖలైన పిటిషన్‌పై సెప్టెంబర్ 30న విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తిరుపతి లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ ప్రభుత్వం చేసిన వాదనను నిరూపించేందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవంటూ.. ఆ ఆరోపణలను తీవ్రంగా తప్పుబట్టింది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన ల్యాబ్ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు.. పరీక్ష కోసం పంపిన నెయ్యిని తిరస్కరించారని, లడ్డూల తయారీకి దాన్ని ఉపయోగించలేదని పేర్కొంది. -
లడ్డూ వివాదంపై సంచలన ట్వీట్..
-
బాబు కొంపముంచిన లోకేష్
-
చంద్రబాబు అబద్ధాల కోరు
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరని, ఆయన అసత్యాలకూ ఓ చరిత్ర ఉందని ప్రముఖ న్యాయవాది, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్ స్వామి తీవ్రస్థాయిలో ఆరోపించారు. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం హోదాలోని వ్యక్తి ప్రచారం చేయడాన్ని ఖండించారు. చంద్రబాబు దు్రష్పచారాన్ని శ్రీవారి భక్తులెవరూ నమ్మొద్దన్నారు. స్వార్థ రాజకీయాల కోసం శ్రీవారిని ఉపయోగించుకోవడం మహా పాపమంటూ చంద్రబాబుకు హితవు పలికారు. తిరుమల లడ్డూ వివాదంపై దర్యాప్తు జరపాలని కోరుతూ సుబ్రమణియన్ స్వామి సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్‌తో కాకుండా సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలని తాను ‘సుప్రీం’ను ఆశ్రయించినట్లు సుబ్రమణియన్ స్వామి మీడియాకు చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. బాబు మాటలకు, పనులకు పొంతన ఉండదు.. చంద్రబాబును నేను ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్నా. ఆయన చేసే పనులకు, చెప్పే మాటలకు పొంతన ఉండదు. గతంలో ఏసుక్రీస్తు ఫొటోలున్నాయని.. కొండపై ఏదో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ అప్పటి సీఎం వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసి ఇలాగే దు్రష్పచారానికి శ్రీకారం చుట్టారు. దీనిపై హైకోర్టుకు ఆధారాలను చూపించలేకపోయారు. నిజానికి.. చాలాఏళ్లుగా టీటీడీలో ఓ విధానం ఉంది.. అంత తేలిగ్గా ఎలా నెయ్యికల్తీ జరుగుతుంది? సిట్‌తో కాదు.. ‘సుప్రీం’తో విచారణ జరిపించాలి..చంద్రబాబే ఆరోపణలు చేసి ఆయనే తన సిట్‌తో విచారణ జరిపించడం అనేది సరైంది కాదు. చంద్రబాబు చీప్‌ట్రిక్స్ అన్నీ బయటకు రావాలంటే ఆయన సిట్‌తో కాకుండా సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలి. ఎందుకంటే.. సిట్ పోలీసులు కేవలం సమాచారం మాత్రమే సేకరిస్తారు.. అదే సుప్రీంకోర్టు అయితే కల్తీ జరిగిందా లేదా అనేది తేలుస్తుంది. అలాగే, ఈ వ్యవహారానికి గల కారణాలు, వెనుక ఎవరున్నారు, ఎందుకు చేశారు అనే విషయాలూ వెలుగులోకి వస్తాయి. అప్పుడు సీబీఐ విచారణ అవసరం ఉండే అవకాశాలు ఉంటాయి. ఇలా ఇన్ని అబద్ధాలు ఆడుతూ, చీప్‌ట్రిక్స్‌కు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు ఉండదు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న అందరినీ జైలుకు పంపే కుట్రలో భాగమే ఈ చిల్లర రాజకీయాలు. -
ఆయన చరిత్ర నాకు తెలుసు సుబ్రహ్మణ్యస్వామి హాట్ కామెంట్స్
-
చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు బతకదు: సుబ్రహ్మణ్యస్వామి
న్యూఢిల్లీ,సాక్షి : శ్రీవారి లడ్డు వివాదంపై దర్యాప్తు జరపాలని కోరుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ వచ్చే శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చే అవకాశం రానుంది. ఈ తరుణంలో తిరుమల లడ్డుపై రాజకీయం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుపై సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.సాక్షి టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. గతంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురించి గతంలో లేనిపోని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు నియమించిన సిట్‌తో కాకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలి. ఈ కేసులో దోషులెవరో తేలాలి. ఈ కేసును తేల్చాల్సింది న్యాయస్థానంలోనే. చంద్రబాబు నియమించిన సిట్‌తో కాదు. శ్రీవారి భక్తులెవరూ చంద్రబాబు మాటలను నమ్మొద్దు. ఈ అంశంపై సుప్రీంకోర్టు త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. తన రాజకీయ స్వార్థం కోసం శ్రీవారిని ఉపయోగించుకోవడం చంద్రబాబు చేస్తున్న మహా పాపం. శ్రీవారిపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు ఓటమి తప్పదు. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు బతకదు. కల్తీ జరిగిందా లేదా అనేది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ తేలుస్తుంది’ అని సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. -
ప్రసాదం వివాదంపై మరో బిగ్ ట్విస్ట్ .. సుప్రీం కోర్టుకు సుబ్రమణ్య స్వామి
-
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్
-
బాబు వ్యాఖ్యలపై పిటిషన్లు
న్యూఢిల్లీ, సాక్షి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టులో వరుస పిటిషన్లు దాఖలవుతున్నాయి. చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆ వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగానూ సుబ్రహ్మణ్యస్వామి స్వయంగా తెలియజేశారు. తిరుపతి తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. ప్రసాదం కలుషితమైందన్న ఆయన వ్యాఖ్యలు భక్తుల్లో ఆందోళన రేకెత్తించాయి. అందుకే దర్యాప్తునకు ఆదేశించేలా సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాను అని పోస్ట్ చేశారాయన.Today I filed a PIL seeking Supreme Court direction to investigate unsubstantiated allegation by CM C.B. Naidu that the Tirupati Tirumala Temple Prasadam were adulterated with meat of animals and other rotten items creating chaos almost bhaktas— Subramanian Swamy (@Swamy39) September 23, 2024 వైవీ సుబ్బారెడ్డి పిటిషన్మరోవైపు వైస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సైతం సుప్రీంలో పిల్ వేశారు. చంద్రబాబు వ్యాఖ్యల సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని ఆయన పిటిషన్లో సుప్రీంను అభ్యర్థించారు. అంతకు ముందు.. తిరుమల లడ్డూ వివాదంపై సురేష్ ఖండేరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో సీబీఐ లేదంటే ఇతర కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని, దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్వహణకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని ఆయన తన పిటిషన్ ద్వారా కోరారు. -
సీఎం జగన్‌పై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రశంసలు..
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా హర్డ్ వర్క్ చేస్తున్నారు. సీఎం జగన్‌కు ప్రజల్లో మంచి క్రెడిబిలిటీ ఉందన్నారు. సీఎం జగన్‌పై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రశంసలు కురిపించారు. కాగా, సుబ్రహ్మణ్యస్వామి ఈరోజు తిరుమలకు వచ్చారు. ఆంధ్రజ్యోతిపై టీటీడీ 100 కోట్లు పరువునష్టం కేసుకు సంబంధించి కోర్టుకు హాజరయ్యారు. ఇక, ఈ కేసు విచారణను ఈనెల 27వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అనంతరం, సుబ్రహ్మణస్వామి మాట్లాడుతూ ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులపై సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు గతంలో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా సోనియా గాంధీతో కలిశారు. ఇప్పుడు బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక జరగాలి. ఎన్నికల కోసం సిద్ధమవ్వాలన్నారు. మరోవైపు, రాష్ట్రంలో సీఎం జగన్ పాలనపై స్పందిస్తూ.. ‘సీఎం జగన్ చాలా హర్డ్ వర్క్ చేస్తున్నారు. ప్రజల్లో మంచి క్రెడిబిలిటీ ఉంది. మరోసారి అది నిరూపించుకుంటారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఆంధ్రజ్యోతిపై పరువునష్టం దావా.. విచారణ వాయిదా
సాక్షి, తిరుపతి: బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి శుక్రవారం తిరుపతి జిల్లా కోర్టుకు హాజరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ ఆంధ్యజ్యోతి ప్రచురించిన అసత్య కథనాలపై టీటీడీ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతి దినపత్రికపై సుబ్రహ్మణ్యస్వామి వందకోట్ల పరువు నష్టం దావా కేసు దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన సుబ్రహ్మణ్య స్వామి.. టీటీడీ జత చేసిన పత్రాలను పరిశీలించారు. అయితే న్యాయవాదుల సమ్మె కారణంగా కేసు విచారణను కోర్టు ఫిబ్రవరి 5 తేదీకి వాయిదా వేసింది. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ.. తాను రిజిస్టర్ న్యాయవాది కానందున కేసులు వాదించేందుకు జడ్జి అంగీకరించలేదని తెలిపారు. కేసులో వాదనలు వినిపించేందుకు హైకోర్టు ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు తీసుకు వచ్చానని చెప్పారు. న్యాయవాదుల సమ్మె కారణంగా కేసు వాయిదా పడిందన్నారు. టీటీడీ ప్రతిష్ట దెబ్బ తీసేందుకు ఆంధ్రజ్యోతి అసత్య వార్తను ప్రచురించారని విమర్శించారు. దీనికి సంబంధించి దేవస్థానం అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించిందని తెలిపారు. చదవండి: TTD: తిరుమల నుంచి అయోధ్యకు లక్ష లడ్డూలు -
చంద్రబాబు, పవన్‌లపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు హిందూ వ్యతిరేకి అని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. దేశంలోని ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ప్రముఖమైనదైన తిరుమల తిరుపతి దేవాలయం (టీటీడీ)పై బాబు, పవన్‌కల్యాణ్ అసత్యాలు ప్రచా రం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హిందూ దేవాలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా రాజకీయాలు చేసుకోవాలని హితవు పలికారు. హిందూ దేవాలయాలను కించపరిస్తే సహించేది లేదన్నారు. ఢిల్లీల్లో న్యాయవాది సత్య సభర్వాల్‌తో కలిసి స్వామి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని ఇష్టారీతిన అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ క్రిస్టియన్ అని, తిరుమల ఆలయం సమీపంలో అన్యమత ప్రచారం జరుగు తోందనడం అబద్ధం. ప్రజా క్షేత్రంలో పోరాడలేకే చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నిజానికి.. కాగ్ ద్వారా ఆడిట్‌కు టీటీడీ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. చదవండి: మహిళా కమిషన్‌ను పవన్ గౌరవించడం లేదు: వాసిరెడ్డి పద్మ వారి ఆరోపణలు అసత్యమని రుజువుచేస్తా వైఎస్సార్సీపీ నేతలు తప్పుడు రశీదులిచ్చి శ్రీవాణి ట్రస్టు ద్వారా సొమ్ములు లూటీ చేస్తున్నా రని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఆరోపిస్తున్నారు. నేను శ్రీవాణి ట్రస్టును సందర్శించి వారి ఆరోపణలు అవాస్తవమని రుజువు చేస్తా. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల వ్యాఖ్యలు మతప్రాతిపదికన శతృత్వం సృష్టించేలా ఉన్నాయి. ఉద్దేశ/దురుద్దేశపూర్వకంగా భక్తుల మతపరమైన భావాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఇక టీటీడీలో అవకతవకలు జరిగాయంటూ ఢిల్లీ వచ్చి అసత్యా లు ప్రచారం చేస్తున్నారు. తిరుమల ఆలయ ప్రతిష్ట తగ్గించేలా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై నేను వేసిన పరువు నష్టం దావా కేసు పురోగతిలో ఉంది. చదవండి: పవన్ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే.. ఇదిగో సాక్ష్యం -
రాహుల్ కొత్త పాస్‌పోర్ట్ ప్రయత్నం.. సుబ్రమణ్యస్వామి కౌంటర్ ఇదే..
ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు సిద్దమయ్యారు. ఈ నెల 31 నుంచి రాహుల్.. పది రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, రాహుల్.. జూన్ 4న న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఏర్పాటు చేసే బహిరంగ సభతో పాటు వాషింగ్టన్, కాలిఫోర్నియాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక, రాహుల్ అమెరికా పర్యటన నేపథ్యంలో కొత్త పాస్‌పోర్టు కోసం ఢిల్లీ హైకోర్టును కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సాధారణ పాస్‌పోర్టును పొందేందుకు అనుమతి(ఎన్వోసి) ఇవ్వాలని రాహుల్ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. మే 26(శుక్రవారం)తేదీన విచారణ జరుపనున్నట్టు స్పష్టం చేసింది. అయితే, మోదీ ఇంటి పేరు వ్యవహారంలో రాహుల్‌కు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో, రాహుల్ తన లోక్‌సభ సభ్యత్వం కోల్పోవడం, అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సి వచ్చింది. అందులో భాగంగానే రాహుల్ తన పాస్‌పోర్టు సహా అన్ని రకాల ప్రయాణ పత్రాలను సంబంధిత అధికారులు సమర్పించారు. అంతకు ముందు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ.. రాహుల్ పాస్‌పోర్టును సీజ్ చేసింది. దీంతో ఇప్పుడు కొత్తగా సాధారణ పాస్‌పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. అందుకే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ కొత్త పాస్‌పోర్టుపై కోర్టును ఆశ్రయించడంపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి స్పందించారు. రాహుల్ విజ్ఞప్తిని ఆయన వ్యతిరేకించారు. ఇప్పుడు రాహుల్ గాంధీని విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు ఆటంకం కలుగుతుందని సుబ్రమణ్యస్వామి తెలిపారు. పాస్‌పోర్టు ఇవ్వకపోవడమే మంచిదని పరోక్షంగా స్పష్టం చేశారు. #Breaking BJP leader Subramanian Swamy opposes Rahul Gandhi's plea for grant of a fresh passport. Swamy says that if Gandhi is allowed to travel abroad, it may hamper the probe in the National Herald case. #RouseAvenueCourt @RahulGandhi @Swamy39 #Passport pic.twitter.com/tO28Q5ykjm — Bar & Bench (@barandbench) May 24, 2023 ఇది కూడా చదవండి: పెద్ద నోట్ల రద్దు.. ఇంతకీ వాటిని ఏం చేశారు.. ఎక్కడున్నాయో తెలుసా? -
ఆర్బీఐ, సీబీఐకి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), దర్యాప్తు సంస్థ సీబీఐకు సోమవారం నోటీసులు జారీ చేసింది. బ్యాంకు రుణాల మోసం కేసుల్లో ఆర్బీఐ నామినీ డైరెక్టర్, ఇతర సిబ్బంది పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం తాజా నోటీసు లిచ్చింది. వివిధ బ్యాంకింగ్ స్కామ్‌లలో ఆర్బీఐ అధికారుల పాత్రపై విచారణ జరపాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పీటీషన్ను సుప్రీం విచారణకు స్వీకరించింది. జస్టిస్ బీఆర్ గవాయి, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం బీజేపీ నేత పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఆర్బీఐ, సీబీఐను కోరింది. కాగా కింగ్‌ఫిషర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యెస్ బ్యాంక్ లాంటి వివిధ కుంభకోణాల్లో ఆర్బీఐ అధికారుల ప్రమేయంపై విచారణ జరగలేదని స్వామి ఆరోపించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంతో సహా, పలు చట్టాలను ప్రత్యక్షంగా ఉల్లంఘిస్తూ ఆర్బీఐ అధికారులు నిర్లక్క్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. Supreme Court issues notice to Reserve Bank of India (RBI) and Central Bureau of Investigation (CBI) on a plea filed by BJP member Subramanian Swamy seeking a CBI probe into the alleged role of RBI's nominee director in bank loan fraud cases. — ANI (@ANI) October 17, 2022 -
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి షాక్.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు
సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఇందుకు ఆరు వారాలు గడువిస్తూ నోటీసులు పంపింది. సుబ్రహ్మణ్యస్వామికి కేంద్రం 2016 జనవరిలో ఢిల్లీలో అధికారిక నివాసం కేటాయించింది. రాజ్యసభ ఎంపీ అయిన ఆయన పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగిసింది. దీంతో బంగ్లాను ఇతర ఎంపీలకు కేటాయించాల్సి ఉన్నందున ఆయన ఖాళీ చేయాలని కోర్టు సూచించింది. సుబ్రహ్మణ్యం రియాక్షన్.. అయితే బంగ్లా ఖాళీ చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు. 2016లో తాను ఎంపీ కాకముందే భద్రతా కారణాల దృష్ట్యా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తనకు జడ్ ప్లస్ కేటగిరీతో ఢిల్లీలో బంగ్లా కేటాయించారని పేర్కొన్నారు. ఆ తర్వాత తాను ఎంపీ అయ్యాక అదే బంగ్లాలో నివాసం ఉంటున్నట్లు పేర్కొన్నారు. తనకు బంగ్లా కావాలని ఎప్పుడూ ఎవర్నీ అడగలేదని స్పష్టం చేశారు. అయితే పాత ఒప్పందం మళ్లీ కొనసాగుతుందా అని భద్రతా అధికారులకు లేఖ రాశానని వివరించారు. ఈ విషయంపైనే కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. కానీ కేంద్రం తనకు బంగ్లా కేటాయించలేమని చెప్పిందని పేర్కొన్నారు. అందులో ఇబ్బందేమీ లేదని, తాను బంగ్లా ఖాళీ చేస్తానని స్పష్టం చేశారు. చదవండి: డబ్బు, అధికార మదంతో బీజేపీ సిగ్గుచేటు చర్య -
బ్రహ్మణేతర అర్చకులు.. స్టాలిన్ సర్కార్‌కు నోటీసులు
ఢిల్లీ/చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఆలయాల్లో బ్రహ్మణేతరులను అర్చకులుగా నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్ ఆధారంగా.. నియామకాలపై వివరణ కోరుతూ స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి ఈ మేరకు సుప్రీం కోర్టులో స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఆలయాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం, బ్రహ్మణేతరులను ఆలయ అర్చుకులుగా నియమించడం లాంటి స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ స్వామి ఈ పిటిషన్ వేశారు. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రాగానే.. ఎన్నికల హామీలో భాగంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని కులాల వాళ్లను ఆలయ అర్చుకులుగా నియమిస్తామని మాటిచ్చారు ఆయన. ఈ మేరకు అర్చక శిక్షణ తీసుకున్న పలువురిని కిందటిఏడాదిలో అగస్టులో అర్చకులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ విభాగం.. సుమారు 208 మందికి అర్చక ఉద్యోగ నియామక పత్రాలు అందించింది. అయితే.. ఈ నియామకాలపై బీజేపీ నేత స్వామి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తండ్రి కరుణానిధిలాగే.. తనయుడు స్టాలిన్ కూడా ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడని, దీనిపై కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు కూడా. ఈ మేరకు ‘‘స్టాలిన్.. ఆయన తండ్రిలాగా ఆలయాల విషయంలో తప్పులు చేయరనే అనుకుంటున్నా. స్టాలిన్ 2014లో సభనాయాగర్ నటరాజ్ ఆలయ విషయంలో సుప్రీం కోర్టు నుంచి చివాట్లు తిన్న విషయం మరిచిపోయారేమో!. ఇప్పుడు ఆలయాల అర్చకుల విషయంలో తప్పు చేస్తుంటే ఊరుకోను. కోర్టుకు వెళ్లాల్సి వస్తే.. వెళ్తానంటూ కిందటి ఏడాది ఆగస్టులో స్వామి ఓ ట్వీట్ కూడా చేశారు. ఇదీ చదవండి: ఇంటి నుంచి వెళ్లగొట్టారు.. ఆజాద్ ఆవేదన -
నిర్మలా సీతారామన్‌పై బీజేపీ సీనియర్ సెటైర్లు: తీవ్ర చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణంపై ప్రతిపక్షాల డిమాండ్‌పై పార్లమెంటులో చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి సెటైర్లు వేశారు. ఆర్థిక మాంద్యం భయాలు, భారత్ కరెన్సీ రూపాయి విలువ పతనం తదితర అంశాలను ప్రస్తావించిన నిర్మలా సీతారామన్ దేశంలో మాంద్యం పరిస్థితులన్న ప్రశ్నేలేదని స్పష్టం చేశారు. డాలర్ మారకంలోభారత్ రూపాయి విలువ కుప్పకూలలేదని అది తన సహజ స్థాయిని కనుగొంటోందని ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్ వ్యంగ్యంగా స్పందించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే ప్రసక్తే లేదు.. నిజమే, ఆమె సరిగ్గా చెప్పారు. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ ఏడాది క్రితమే మాంద్యంలోకి జారుకుందంటూ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ఇక మాంద్యం లోకి జారుకోవడం అనే ప్రశ్న లేదంటూ విమర్శించారు. తద్వారా దేశ ఆర్థికపరిస్థితి, నిర్మలా సీతారామన్ ప్రకటనపై ట్వీట్ చేసి మోదీ సర్కార్‌పై వ్యంగ్య బాణాల్ని సంధించడమే కాదు, తీవ్ర చర్చకు తెర తీశారు. (ఆనంద్ మహీంద్ర వీడియో: నెటిజనుల కౌంటర్స్ మామూలుగా లేవు!) “No question of the Indian economy getting into recession” says Finance Minister according to media today. She is right!! Because Indian economy has already got into recession last year. So question of getting into recession does not arise. — Subramanian Swamy (@Swamy39) August 2, 2022 కాగా ద్రవ్యోల్బణంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రకటన సందర్భంగా విపక్షాలపై తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేశారు. కోవిడ్ మహమ్మారి విసిరిన సవాళ్లు,సంక్షోభం ఉన్నప్పటికీ దేశం మంచి స్థితిలోనే ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్నా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ నిలుస్తోందని, అలాగే పరిస్థితులను నియంత్రించేందుకు రిజర్వు బ్యాంక్ చర్యలు చేపడుతోందని ఆమె తెలిపారు. ముఖ్యంగా అమెకా పరిస్థితిని ప్రస్తావిస్తూ, భారత్‌లో మాంద్యం వచ్చే ప్రశ్నే లేదని సీతారామన్ తెలిపిన సంగతి తెలిసిందే. (బ్లెస్సింగ్స్ అడిగిన కస్టమర్‌కు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే రిప్లై) -
బీజేపీకి బిగ్ షాక్.. అమిత్ షా, జై షాపై కమలం నేత సంచలన కామెంట్స్
ఐపీఎల్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు కిక్ ఇచ్చే గేమ్. రిచ్ టోర్నీగా పేరొందిన భారత ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనేందుకు వివిధ దేశాల క్రికెటర్లు సైతం ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, సొంత పార్టీ నేతలు, పార్టీ విధానాలపై అప్పుడప్పుడు విమర్శలు చేసే సుబ్రమణ్య స్వామి తాజాగా ఐపీఎల్, అమిత్ షా కుమారుడు జై షాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. సుబ్రమణ్య స్వామి.. ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు నిఘా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐపై ఒక నియంతలా పెత్తనం చెలాయిస్తున్నాడని ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. మరో అడుగు ముందుకేసి.. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేబట్టబోదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అందుకే దీనిపై కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఐపీఎల్లో కొత్త ప్రాంఛైజీకి చెందిన గుజరాత్ టైటాన్స్ కప్ కొట్టింది. అందరి అంచనాలకు తల కిందులు చేస్తూ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ నుంచీ గుజరాత్ వరుస విజయాలతో టాప్‌లోనే కొనసాగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, సుబ్రమణ్య స్వామి అంతుకుముందు.. జమ్ముకశ్మీర్‌లో పండిట్లు, హిందువుల హత్యలను ఆపడంతో హెం మంత్రి అమిత్ షా విఫలమయ్యారని ఆరోపించారు. అమిత్ షాకు హోంశాఖ కంటే క్రీడాశాఖనే బాగా సెట్ అవుతుందని సెటైరికల్ కామెంట్స్ చేశారు. అలాగే, జ్ఞానవాపీ మసీదు వివాదంపై కూడా అమిత్ షాను టార్గెట్ చేసిన సుబ్రమణ్య స్వామి.. మసీదు అంశానికి సంబంధించి షా అనవసరంగా తప్పుడు అంచనాలను పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. There is widespread feeling in intelligence agencies that the Tata IPL Cricket outcomes were rigged. It may require a probe to clear the air for which PIL may be necessary since Govt will not do it as Amit Shah’s son is defacto dictator of BCCI — Subramanian Swamy (@Swamy39) June 2, 2022 ఇది కూడా చదవండి: ‘మీ సీనియర్ నాయకుడి అవినీతిని బట్టబయలు చేస్తాం’ -
దేశం మొత్తం ఒక్కటే డీఎన్ఏ
శ్రీనగర్‌కాలనీ: దేశం మొ త్తం ఒక్కటే డీఎన్ఏ ఉం దనే విషయాన్ని ఒవైసీకి చెప్పానని, టెస్ట్ చేయించుకోవడానికి రమ్మని సవాల్ విసిరినా, ఆయన ముందుకు రాలేదని మాజీ పార్ల మెంట్‌సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్యస్వామి అన్నారు. కాశీ విశ్వనాథస్వామి ఆలయాన్ని ముట్టుకోవద్దని ఒవైసీ అంటున్నారని, అక్కడ పూజించే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీ సత్యసాయి నిగమాగమంలో ఇస్కాన్ సంస్థకు చెందిన ‘కౌఇజం’ యూ ట్యూబ్ చానల్ ప్రారంభోత్సవం జరిగింది. దీనికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలో చెక్కు చెదరకుండా బతికున్న సంస్కృతి, హిందూ సంస్కృతి మాత్రమేనన్నారు. దేశంలోని ప్రతి ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులపై ఉందని తెలిపారు. మన సంస్కృతి, నాగరికత ఆవు తోనే ముడిపడి ఉందని చెప్పారు. గోవును జాతీయ జంతువుగా చేయాలని పోరాడుతున్నామన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ గుర్తు ఆవు అని, స్వలాభం కోసం మార్పులు చేసుకుని హస్తం గుర్తుగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఇస్కాన్ చైర్మన్ డాక్టర్ సహదేవ దాసా, బీఎస్ఎఫ్ మాజీ అడిషనల్ డీజీ పి.కె.మిశ్రా పాల్గొన్నారు. -
మద్దతు ధరపై తగ్గేదేలే!
సాక్షి, న్యూఢిల్లీ: రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించేవరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ పార్టీ తమ పోరాటం కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం మెడలు వంచేందుకు కలిసివచ్చే అన్ని పార్టీలు, సంఘాలతో కలిసి పోరాడేందుకు తాము సిద్ధమని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై తమ పార్టీ ఎంపీలు గట్టిగా కొట్లాడతారని చెప్పినట్టు సమాచారం. ధాన్యం సేకరణలో జాతీయ విధానం తీసుకురావాల్సిన ఆవశ్యకతను మరోమారు నొక్కిచెప్పిన సీఎం.. దేశ వ్యాప్తంగా సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయాన్ని, రైతులను ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ నూతన విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ఐదు రోజుల కిందట ఢిల్లీకి వచ్చిన కేసీఆర్‌తో గురువారం రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి, భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ రాజకీయ ప్రణాళిక, బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో జాతీయస్థాయి కూటమి ఏర్పాటు, వ్యవసాయ సమస్యలు, పంటలకు చట్టబద్ధతపై పోరాటం వంటి అంశాలపై చర్చించా రు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవితలు భేటీలో ఉన్నారు. అంతా కలిసి సీఎం నివాసంలోనే మధ్యాహ్న భోజనం చేశారు. బీజేపీతో దేశ సమగ్రతకు ముప్పు పార్టీవర్గాల సమాచారం ప్రకారం.. సుబ్రహ్మణ్య స్వామితో భేటీలో ప్రధానంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు అంశంపై కేసీఆర్ చర్చించారు. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లతో తాను జరిపిన భేటీలు, జేడీయూ, ఆర్జేడీ సహా ఇతర పార్టీల నేతలతో చర్చల వివరాలను ఆయనకు తెలియజేశారు. మతతత్వాన్ని బీజేపీ పెంచి పోషిస్తోందని, దీనివల్ల మున్ముందు దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లే అవకాశాలున్నాయన్న అంశాన్ని ప్రస్తావించారు. రాజకీయంగా బీజేపీని ఎదుర్కొనేందుకు భావసారూప్యత కలిగినపార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సి ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు అవసరం ఉందని, ఇందుకోసం తన ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. రైతు పోరాటాలకు సంపూర్ణ మద్దతు రైతు సంఘం నేత టికాయత్‌తో జరిగిన భేటీలో ప్రధానంగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనలు, చట్టాల రద్దు అనంతరం కేంద్రం తీరు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరిపై ప్రధానంగా చర్చించారు. గత సీజన్లో రాష్ట్రంలో పండించిన ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరును వివరించారు. వ్యవసాయానికి ప్రత్యామ్నాయ జాతీయ విధానంపై రైతు సంఘాలు చేసే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. రైతు ఉద్యమంలో చనిపోయిన 750 కుటుంబాలకు సంబంధించి తెలంగాణ ప్రకటించిన రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా అంశం ప్రస్తావనకు రాగా.. మార్చి 10 తర్వాత ఆయా రైతుల జాబితాను అందజేస్తామని టికాయత్ చెప్పారు. తెలంగాణ విధానాలు దేశమంతా అమలవ్వాలి బీకేయూ నేత రాకేశ్ టికాయత్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు వంటి రైతు ప్రోత్సాహక పథకాలు దేశమంతటా అమలు కావాలని బీకేయూ నాయకుడు రాకేశ్ టికాయత్ అన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగ అనుకూల విధానాలు అమలవుతున్నాయని, రైతు సంక్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం టికాయత్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ నూతన వ్యవసాయ విధానం రావాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంలో ప్రత్యామ్నాయ విధానాల రూపకల్పన కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నా. అందులో భాగంగానే తెలంగాణ సీఎంను కలిశా. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కలుస్తా. వ్యవసాయ రంగం, రైతాంగ సమస్యలపై హైదరాబాద్‌లో లేదా మరోచోట అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తాం’అని టికాయత్ తెలిపారు. కేసీఆర్‌తో వ్యవసాయ అంశాల గురించి మాత్రమే చర్చ జరిగిందని, రాజకీయాలపై మాట్లాడలేదని ఆయన తెలిపారు. అయితే రాజకీయాల్లోనూ పోటీ ఉండాలని, పీపుల్స్ ఫ్రంట్ రావాల్సిన అవసరం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వేదికగా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి కూడా ప్రస్తుతం ఉందని, అలాంటప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. నేడు జార్ఖండ్‌కు కేసీఆర్ సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ శుక్రవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో భేటీ కానున్నారు. రాంచీకి వెళ్లనున్న కేసీఆర్.. చైనా సరిహద్దులోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను కూడా అందజేయనున్నారు. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబంతో పాటు 19 మంది అమర జవాన్ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని గతంలో సీఎం ప్రకటించారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగతా కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం చర్యలు చేపట్టనున్నారు. -
ఆదాయ పన్ను రద్దు చేయండి
కరోనా వేళ దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతోంది. కోట్ల మంది ప్రజలు పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒత్తిడి కింద నలిగిపోతున్నారు. కొవిడ్-19 జబ్బు ప్రభావంతో మందుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి కేంద్ర ప్రభుత్వాన్ని సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలంటూ సలహా ఇచ్చారు. ఏకంగా ఇన్కమ్ ట్యాక్స్‌ను రద్దు చేయాలంటున్నారు ఆయన. ఈ పరిస్థితుల్లో ఆదాయ పన్ను వసూళ్లను రద్దు చేయడం ఉత్తమం. అది కొన్నాళ్లపాటు!. ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచి ఈ నిర్ణయం ప్రకటించడం ద్వారా ఆర్థిక ప్రగతికి బలం ఇచ్చినట్లు అవుతుంది. పరిస్థితులు సర్దుకుని సాధారణ స్థితికి వచ్చే వరకు పౌరుల నుంచి పన్నులు వసూలు చేయకపోవడం మంచిదే అని ఓ జాతీయ మీడియా హౌజ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుబ్రమణియన్ స్వామి వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రిగా ఉండి ఉంటే మీరు ఏం చేసి ఉండేవారన్న ప్రశ్నకు.. మొదటగా పన్ను వసూళ్లను రద్దు చేస్తా. ఏప్రిల్ 1 నుంచి ఇది దేశ వ్యాప్తంగా వర్తిస్తుందని ప్రకటిస్తా. పరిస్థితుల సాధారణం అయ్యేదాకా అది కొనసాగిస్తా. ఆపై దాన్ని శాశ్వతంగా కొనసాగించడం గురించి ఆలోచిస్తా’ అని పేర్కొన్నారు. ఇక తన వాదనను సమర్థించుకునే క్రమంలో సుబ్రమణియన్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. మార్గాలెన్నో.. బీజేపీ మొదటి దఫా అధికారంలోకి వచ్చిన మొదట్లోనే నేను ఈ సలహా ఇచ్చా. ఆదాయపు పన్ను ద్వారా సుమారు 4 లక్షల కోట్ల ఆదాయం పొందుతున్నాము. అదే బడ్జెట్ చూసుకుంటే దాదాపు 8-9 లక్షల కోట్ల మధ్య ఉంటోంది. ట్యాక్సేషన్ బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వనరుల్ని పెంచుకోవచ్చు కదా అని చెప్పాను. ఉదాహరణకు.. 2జీ లైసెన్స్‌ల వేలం. మొదటి వేలంలో దాని ద్వారా ఎంత వచ్చిందో తెలుసా? 4 లక్షల కోట్లు. అంటే ఆదాయ పన్నుల వసూళ్లకి సమానం. పన్నులు పెంచే బదులు.. ఇలాంటి ప్రత్యామ్నాయాలు ప్రభుత్వం ముందర ఎన్నో ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ ఒక్కసారి గాడిన పడిందంటే.. ప్రజలు వాళ్లంతట వాళ్లే పన్నులు చెల్లిస్తారు. అలాగే, రీఇన్వెస్ట్ చేసిన కంపెనీల ఆదాయానికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుందని రూల్ పెడితే.. పొదుపు రేటు పెరుగుతుంది. ఆపై వృద్ధి రేటు కూడా పెరుగుతుంది అని స్వామి చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లోనుల మీద వడ్డీ రేటును తగ్గిస్తే (12 నుంచి 9 శాతానికి) మంచిదని, అది ప్రభుత్వం చేతుల్లో ఉందని, బ్యాంకులు కూడా చేసి తీరతాయని సుబ్రమణియన్ స్వామి అభిప్రాయపడ్డారు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను 6 నుంచి 9 శాతానికి పెంచడం ద్వారా ప్రజలు సేవింగ్స్‌కు ముందుకొస్తారని పేర్కొన్నారు. మహమ్మారి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుండి ఉత్పన్నమయ్యే ఆర్థిక ఒత్తిడి కారణంగా జీడీపీ వాటా పరంగా గృహాల పొదుపు మొత్తం తగ్గిందని, పెట్టుబడులు కూడా తగ్గాయని స్వామి అంటున్నారు. ప్రపంచ మహమ్మారి విధ్వంసానికి ముందు 2019-20 నాలుగో త్రైమాసికంలో చూసిన వృద్ధి స్థాయిని ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ తిరిగి పొందలేదని సుబ్రమణియన్ స్వామి గుర్తు చేస్తున్నారు. ఆర్థిక అంచనాలు, అధికారిక డేటా ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి బలమైన వృద్ధిని సూచిస్తున్నప్పటికీ.. మిగిలిన త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఆధారపడి ఉంటుందని సుబ్రమణియన్ స్వామి అన్నారు. ఇదిలా ఉంటే బడ్జెట్‌టైంలో సుబ్రమణియన్ స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. అయితే గతంలోనూ ఆయన ఇలాంటి సలహాలే ఇచ్చారు కూడా!. క్లిక్ చేయండి: బడ్జెట్ 2022లో మధ్యతరగతి వర్గానికి ఊరట! -
దేశంలోని నాలుగు లక్షల హిందూ దేవాలయాలపై అసత్య ఆరోపణలు
-
టీటీడీ వెబ్‌సైట్‌పై దుష్ప్రచారం.. తెలుగు దిన పత్రికపై దావా: ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి
సాక్షి, తిరుపతి: హిందూ దేవాలయాలపై ఎక్కడ అసత్య ప్రచారం చేసినా తాను ముందుంటానని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నారు. దేశంలో హిందూ దేవాలయాలు ఎక్కడా ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదని, బ్రాహ్మణులే వంశపారపర్యంగా అర్చకత్వానికి అర్హులు అనడం సరికాదని చెప్పారు. ఈ మేరకు తిరుపతిలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. అనువంశిక అర్చకత్వానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. పురాణాల్లో విశ్వామిత్రుడు, వాల్మీకీలు బ్రాహ్మణులు కాకపోయినా ఆధ్యాత్మిక ప్రచారం చేశారని గుర్తు చేశారు. దేశంలోని నాలుగు లక్షల హిందూ దేవాలయాలపై అసత్య ఆరోపణలు చేస్తే తాను సహించనని, న్యాయపోరాటం చేస్తానని సుబ్రమణ్యస్వామి తెలిపారు. చదవండి: థాయ్‌లాండ్‌కు చంద్రబాబు.. అంత రహస్యమెందుకో? తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెబ్‌సైట్‌తో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారని ఓ తెలుగు దిన పత్రిక ఆరోపణలపై టీటీడీ ఈవో విజ్ఞప్తి మేరకు పరువు నష్టం దావా కేసు వేసినట్లు ఆయన తెలిపారు. అసత్య వార్తలు రాసిన సదరు తెలుగు దినపత్రిక క్షమాపణ చెప్పాలని, రూ. 100 కోట్లు జరిమాన చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. భారత దేశంలో 80 శాతం మంది హిందువులు ఉన్నారని, హిందువుగా ఉన్నందుకు గర్విస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఇక తమిళ రాజకీయాల గురించి ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో కరుణానిధి, అన్నాడీఎంకే పార్టీల పాలన దరిద్రంగా సాగిందని.. ఎంకే స్టాలిన్ పాలన ఇంకా చూడలేదన్నారు. చదవండి: నాడు ‘పార్టీలేదు బొక్కాలేదు’.. నేడు చంద్రబాబు గుట్టు రట్టు చేసిన అచ్చెన్న -
సీఎం జగన్‌ను కలిసిన రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ‘ఆంధ్రజ్యోతి’ కథనం
సాక్షి, అమరావతి: టీటీడీ ప్రతిష్టను దిగజార్చడంతో పాటు, భక్తుల మనోభావాలను దెబ్బతీసి సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించిందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి బుధవారం హైకోర్టుకు నివేదించారు. ఈ కేసును పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. కథనాన్ని ప్రచురించే ముందు టీటీడీ అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదన్నారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగానే తాను ఈ వ్యాజ్యం దాఖలు చేసినట్టు చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం.. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.ఈ మేరకు సీజే జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. -
సీఎం జగన్‌ను కలిసిన ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి
సాక్షి, తాడేపల్లి : టీటీడీకి సంబంధించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు కథనాల వెనక చంద్రబాబు హస్తం ఉందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. సొంత లాభం కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడం సరికాదన్నారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు వార్తలు తనను తీవ్రంగా కలిచివేశాయన్నారు. అందుకే ఆంధ్రజ్యోతిపై పరువునష్టం దావా వేశానన్నారు. ఓ కేసు విషయంలో బుధవారం ఏపీకి వచ్చిన ఆయన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఆయనను సాదరంగా ఆహ్వానించి, శాలువతో సత్కరించి జ్ఞాపికను అందించారు. ఇరువురి మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. భేటీ అనంతరం ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ లావాదేవీలను కాగ్ ద్వారా ఆడిట్ చేయించేందుకు సీఎం జగన్ అంగీకరించారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో మంచి సంబంధాలు ఉండేవని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సీఎం జగన్ చర్చలు జరుపుతారని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రధానికి సీఎం జగన్ రెండు సార్లు లేఖ రాశారని గుర్తుచేశారు. అఖిల పక్షం, కార్మిక నేతలతో కలుస్తానని సీఎం చెప్పారన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తాను విభేదిస్తున్నానని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. -
ఆంధ్రజ్యోతిపై పరువునష్టం దావా వేశా
-
ఆంధ్రజ్యోతిపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) గురించి కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మండిపడ్డారు. టీటీడీ పరువుకు భంగం కలించేలా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతిపై రూ. 100 కోట్లు పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. తిరుపతిని సందర్శించిన సుబ్రహ్మణ్యస్వామి, టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘తిరుమల స్వామి వారి ఆలయం గురించి ఆంధ్రజ్యోతి తప్పుడు ప్రచారం చేస్తోంది. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. చంద్రబాబు నాయుడు తమను కాపాడతారన్న భావనలో ఆంధ్రజ్యోతి ఉంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతిది ఒక మాట.. కానీ, బాబు ఓడిన తర్వాత ఆ మాట మార్చింది. చంద్రబాబుకు ప్రజల మద్దతు లేదు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదు. కుట్రపూరితంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లు పరువునష్టం దావా వేశా. నా జీవితంలో ఎప్పుడూ పరువు నష్టం దావా కేసు ఓడిపోలేదు’’ అని ఆంధ్రజ్యోతి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరును విమర్శించారు. చదవండి: వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు: బీజేపీ ఎంపీ -
పెట్రో సెగ: కేంద్రంపై బీజేపీ ఎంపీ వ్యంగ్యాస్త్రం
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పెట్రోల్ ధరలు సెంచరీ దాటగా.. తాజాగా బడ్జెట్లో కేంద్రం పెట్రోల్, డీజిల్ మీద వ్యవసాయ సెస్ విధిస్తున్నుట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవ్వగా.. ఈ సెస్‌ను సుంకం నుంచి మినహాయిస్తామని... వినియోగదారులపై ఈ భారం మోపమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: పెట్రో...కనికట్టు) ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లకు సంబంధించి ఓ వ్యంగ్య ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశారు. ఇక దీనిలో ‘‘రామ జన్మభూమిగా భావించే ఇండియాలో లీటర్ పెట్రోల్ ధర 93 రూపాయలు.. సీతమ్మవారు పుట్టిన దేశం నేపాల్‌లో లీటర్ పెట్రోల్ ధర 53 రూపాయలు.. అదే రావణుడి లంకలో పెట్రోల్ లీటర్ 51 రూపాయలు మాత్రమే’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఇక దేశంలో ఇంధన రేట్లు పెరిగిన నాటి నుంచి ఈ ఫోటో వైరలవ్వగా.. సుబ్రహ్యణ్య స్వామి ట్వీట్ చేయడంతో మరోసారి ఇది వైరలవుతోంది. ఇక దీనిపై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. pic.twitter.com/Imrz3OSag7 — Subramanian Swamy (@Swamy39) February 2, 2021 -
వ్యాక్సిన్: సుబ్రమణియన్ స్వామి కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అతిత్వరలోనే అందుబాటులోకి రానుందని భావిస్తున్న కరోనా వైరస్ టీకాకు సంబంధించి బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి సంచలన ట్వీట్ చేశారు. ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందిస్తున్న కోవిషీల్డ్ వాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ కనీసం అత్యవసర వినియోగానికి కూడా ఇంకా అనుమతి ఇవ్వలేదు..ఈ నేపథ్యంలో భారతీయులంతా ప్రయోగాలకు ఉపయోగించుకునే గినియా పిగ్స్‌లా మారి పోనున్నారా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. సీరం ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి సంబంధించి నిపుణుల కమిటీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. (తొలి విడతలో 3 కోట్ల మందికి టీకా ఉచితం : కేంద్ర మంత్రి) దీంతో ట్విటర్లో దుమారం రేగింది. ముఖ్యంగా మన శాస్త్రవేత్తల సామర్ధ్యాన్నే తప్పుబడుతున్నారా అని కొంతమంది ప్రశ్నించారు. అలాగే మహమ్మారి గురించి ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెట్టి డబ్ల్యూహెచ్ఓ మొత్తం ప్రపంచాన్నే మోసం చేసింది. అలాంటి సంస్థను ఎందుకు విశ్వసించాలంటూ మరికొంతమంది ట్విటర్ యూజర్లు ప్రశ్నించారు. అయితే టీకాలకు తాను వ్యతిరేకం కాదని, కానీ ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ దేశాన్ని దోచుకోవాలనుకుంటున్న దోపిడీదారులను అనుమతించకూడదంటూ స్వామి సమాధానం ఇచ్చారు. (కరోనా వ్యాక్సిన్ : కోవిషీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్) మరోవైపు ఈ వ్యాక్సిన్‌ను బీజేపీ వ్యాక్సిన్ అంటూ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు. తాను వ్యాక్సిన్‌ను తీసుకోబోనని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నవ్యాక్సిన్‌ను తానెలా విశ్వసిస్తున్నానంటూ వైద్యులను శాసస్త్రవేత్తలను అవమానిస్తున్నారన్న బీజేపీ విమర్శలనుఆయన తిప్పికొట్టడం విశేషం. WHO hasn't cleared AstraZeneca even for emergency use!! Are Indians going to be Guinea pigs? — Subramanian Swamy (@Swamy39) January 2, 2021 -
బాబులో ‘కాగ్’ వణుకు
సాక్షి, అమరావతి: టీటీడీ నిధుల వినియోగంపై కాగ్‌తో దర్యాప్తునకు అనుకూలంగా ప్రస్తుత పాలక మండలి తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్ష నేత చంద్రబాబులో వణుకు మొదలయ్యాయని బీజేపీ జాతీయ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి సోమవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. అందుకే తిరుమల శ్రీవారి దర్శనాల్లో డిక్లరేషన్ అంశంపై బాబు అనుకూల మీడియా విపరీతంగా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇందులో భాగంగానే టీటీడీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారన్నారు. స్వామి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడూ ఏ మతస్తుడు అన్నది గుర్తించడం కష్టమని.. భక్తుడు తనకు తాను చెబితేగానీ తెలియదనే దాని గురించే టీటీడీ చైర్మన్ మాట్లాడారని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు -
నాకైతే సంబంధం లేదు: సుబ్రహ్మణ్యస్వామి
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రష్యా పర్యటనపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అసహనం వ్యక్తం చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా డిఫెన్స్ మినిస్టర్ వెయి ఫెంఘెతో భేటీ అయిన తర్వాత మళ్లీ జైశంకర్ మాస్కో వెళ్లడం ఎందుకు అని ప్రశ్నించారు. విదేశాంగ విధాన పరంగా.. ఈ ఏడాది మే 5 తర్వాత భారత్, చైనాతో పరిష్కరించుకోవాల్సిన సమస్యలేవీ లేవని, అలాంటప్పుడు ఆ దేశ విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ అనవసరం అన్నారు. ఇలాంటి విషయాలు ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలను పలుచన చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే స్పందించి భారత విదేశాంగ మంత్రి రష్యా పర్యటనను రద్దు చేయాల్సిందిగా ట్విటర్ వేదికగా విజ్జప్తి చేశారు.(చదవండి: ఎల్ఏసీని గౌరవించాలి) కాగా జూన్‌లో గల్వాన్‌లోయలో చైనా ఆర్మీ ఘాతుకానికి కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత సైనికులు అమరులైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకోగా.. దౌత్య, మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. అయినప్పటికీ డ్రాగన్ దేశం తన వైఖరి మార్చుకోలేదు. వివిధ స్థాయి చర్చల్లో కుదిరిన బలగాల ఉపసంహరణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతో ఇటీవల మరోసారి వాస్తవాధీన రేఖ( ఎల్ఏసీ) వెంబడి ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ క్రమంలో శుక్రవారం మాస్కోలో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి వెయి ఫెంఘెతో దాదాపు రెండు గంటల 20 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఎల్ఏసీను చైనా గౌరవించాలని, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలు మానుకోవాలని స్పష్టంచేశారు. భారత్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు కట్టుబడి ఉందని.. ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల పర్యటనకై జైశకంర్ మంగళవారం రష్యాకు బయల్దేరనున్నారు. ఈ సందర్భంగా డ్రాగన్ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఆయన సమావేశం కానున్నట్లు సమాచారం. నాకైతే సంబంధం లేదు.. బీజేపీ ఐటీ సెల్ విభాగం పనితీరుపై ఆ పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో పనిచేసే కొంతమంది సభ్యులు నకిలీ ఐడీలతో సోషల్ మీడియా వేదికగా తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై తన ఫాలోవర్లు గుర్రుగా ఉన్నారని, కాబట్టి వారు ఎదురుదాడికి దిగే అవకాశం ఉందని, అందుకు తాను బాధ్యత వహించబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు.. ‘‘బీజేపీ ఐటీ సెల్ దుర్మార్గంగా తయారైంది. అందులోని కొంత మంది సభ్యులు ఫేక్ ఐడీలతో నకిలీ ట్వీట్లతో నాపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. ఒకవేళ నా ఫాలోవర్లు అదే రీతిలో బదులిస్తే అందుకు నేను బాధ్యత వహించను. బీజేపీ ఐటీ సెల్ తీరుకు పార్టీ ఎలాగైతే బాధ్యత వహించదో.. అచ్చంగా అలాగే’’ అంటూ ట్విటర్ వేదికగా విమర్శలు సంధించారు. ‘‘మాది మర్యాద పురుషోత్తముల పార్టీ. రావణ, దుశ్శాసన ఇక్కడ లేరు. ఇటువంటి విషయాలను నేను పెద్దగా పట్టించుకోను గానీ.. గొడవలు సృష్టించే వాళ్లను బీజేపీ.. పదవి నుంచి తీసేయాలి’’ అంటూ మరో ట్వీట్లో ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయపై విరుచుకుపడ్డారు. అయితే ఇందుకు గల మూలకారణం గురించి మాత్రం సుబ్రహ్మణ్యస్వామి ప్రస్తావించలేదు. The BJP IT cell has gone rogue. Some of its members are putting out fake ID tweets to make personal attacks on me. If my angered followers make counter personal attacks I cannot be held resonsible just as BJP cannot be held respinsible for the rogue IT cell of the party— Subramanian Swamy (@Swamy39) September 7, 2020 -
‘నీట్, జేఈఈపై ఇప్పుడేం చేయలేం’
న్యూఢిల్లీ: సమాజంలో జరిగే కీలక అంశాలపై విశ్లేషించే రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తాజాగా నీట్, జేఈఈ పరీక్షలపై ట్విటర్ వేదికగా స్పందించారు. సుబ్రహ్మణ్యస్వామి ఆదివారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో నీట్ ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలని కొందరు తనను కలిసారని, కానీ తనను ముందే సంప్రదిస్తే మరో విధంగా ఉండేదని తెలిపారు. పరీక్షలు రద్దు చేయాలని కొందరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేయలేదని, వారు సైతం రద్దుకు మద్దతిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అయితే నీట్, జేఈఈ పరీక్షలను రద్దు చేయాలని ప్రతిపక్ష పార్టీలు, కొందరు సామాజికవేత్తలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రవేశ పరీక్షలు(నీట్, జేఈఈ) నిర్వహించాలని పట్టుదలతో ఉంది. కాగా ఇది వరకే కోవిడ్ నిబంధనలు పాటించి ప్రవేశ పరీక్షలు నిర్వహించుకోవచ్చని సుప్రీం తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ప్రవేశ పరీక్షలను ఆపడం అసాధ్యమని, సుప్రీం తన తీర్పును సమీక్షించే అవకాశం లేదని పేర్కొన్నారు. మరోవైపు నీట్ పరీక్షలను రద్దు చేయాలని ఆగస్ట్ 4న కొందరు రివ్యూ పిటిషన్ వేశారు. కానీ సుప్రీం కోర్టు వాదనలను(రివ్యూ పిటిషన్) వినడానికి నిరాకరించింది. కాగా పరీక్షలు రద్దు చేయాలని రివ్యూ పిటిషన్ వేసిన వారిలో పశ్చిమ బెంగాల్ న్యాయ శాఖ మంత్రి మొలోయ్ ఘటక్, జార్ఖండ్ ఆర్థిక మంత్రి రామేశ్వర్ ఒరాన్, రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ, పంజాబ్ కార్మిక శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్దూ, మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఉదయ్ సమంత్ తదితరులు ఉన్నారు. (చదవండి: గాంధీ హత్యకేసుపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు) -
వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు: బీజేపీ ఎంపీ
సాక్షి, అమరావతి: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)తో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేయించాలన్నది గొప్ప నిర్ణయమని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీటీడీలో నిధుల వ్యయాన్ని కాగ్‌తో ఆడిటింగ్ చేయించడంతోపాటు, ఇక ముందు కూడా ఇలాగే చేయాలని కోరుతూ సత్యపాల్ సబర్వాల్‌తో కలసి సుబ్రహ్మణ్యస్వామి గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ అంశంపై స్వచ్ఛందంగానే సానుకూలంగా స్పందించింది. టీటీడీ నిధులను కాగ్‌తో ఆడిట్ చేయించాలని నిర్ణయించారు. టీటీడీ ఆదాయ, వ్యయాలన్నీ పూర్తి పారదర్శకంగా ఉండాలని చెప్పారు. తద్వారా టీటీడీకి భక్తులు, దాతలు విరాళాల రూపంలో ఇస్తున్న నిధుల నిర్వహణ సక్రమంగా ఉండాలని నిర్దేశించారు. ఈ మేరకు 2020–21 నుంచి టీటీడీ ఆదాయ, వ్యయాలను కాగ్‌తో ఆడిట్ చేయించాలని ఆగస్టు 28న సమావేశమైన టీటీడీ పాలకమండలి తీర్మానాన్ని ఆమోదించింది. హైకోర్టుకు కూడా తెలియజేయాలని నిర్ణయించింది. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు టీటీడీ నిధుల వ్యయాన్ని కాగ్‌తో ఆడిటింగ్ చేయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. తన ప్రతిపాదనను సీఎం వైఎస్ జగన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాలకమండలి సభ్యులు గొప్ప మనసుతో సమ్మతించారని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు స్పందించిన వైవీ సుబ్బారెడ్డి పారదర్శకత, అవినీతిరహిత పాలన పట్ల సీఎం నిబద్ధతతో ఉన్నారంటూ ట్వీట్ చేశారు. చదవండి: రైతులపై రూపాయి భారం పడినా రాజీనామా -
సుశాంత్ మరణం : షాకింగ్ వీడియో
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై తాజాగా ఒక షాకింగ్ వీడియో అభిమానుల్లో ఆందోళన రేపుతోంది. ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా.మీనాక్షి మిశ్రా సుశాంత్ మరణానికి కారణం ఆత్మహత్య కాదు హత్య అని చెబుతున్న ఒక వీడియోను షేర్ చేశారు. దీనిపై తన వాదనలకు మద్దతుగా ఈ వీడియోలో వివరించారు. ముఖ్యంగా సుశాంత్ ముఖంపై, ఇతర ప్రదేశాల్లో గాయాల గురించి వివరించారు. అలాగే ఉరి వేసుకున్నపుడు బాధితుడి శరీరంపై మార్పులను గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. దీంతో సుశాంత్ ఆత్మహత్యపై ఇప్పటికే వ్యక్తమవుతున్నఅనుమానాలకు తోడు తాజా వీడియో ద్వారా మరింత బలం చేకూరుతోందన్న వాదన వినిపిస్తోంది. (‘సుశాంత్ హత్యకు గురయ్యారు’) మరోవైపు సుశాంత్ ది ఆత్మహత్యకాదు కచ్చితంగా హత్యే అంటూ సంచలనం రేపిన మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్ స్వామి ఈ ట్వీట్ ను రీట్వీట్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. (సుశాంత్ కేసు : మరో వివాదం) Shocking relevations made on Sushant’s case! PS: Sensitive Content. pic.twitter.com/r0orseM72b — Dr.Minakshi Mishra (@savethesaviours) August 2, 2020 -
సుశాంత్ మృతిపై స్వామి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్‌ను హత్య చేశారని ఆరోపించిన స్వామి ముంబై పోలీసుల ఎఫ్ఐఆర్పై పలు సందేహాలు వ్యక్తం చేశారు. తన ఆరోపణలకు మద్దతుగా ఓ డాక్యుమెంట్‌ను ట్విటర్లో పోస్ట్ చేసిన సుబ్రహ్మణ్యస్వామి ఇందులో పేర్కొన్న 26 పాయింట్లలో 24 పాయింట్లు ఇది హత్యేనని పేర్కొంటున్నాయని వ్యాఖ్యానించారు. స్వామి ట్వీట్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం ఆయన పలు వాదనలను ముందుకుతెచ్చారు. సుశాంత్ రాజ్‌పుత్ మెడపై ఉన్న గుర్తు ఆత్మహత్యతో సరిపోలడం లేదని, ఇది నరహత్యను సూచిస్తోందని అన్నారు. ఈ డాక్యుమెంట్ ప్రకారం సుశాంత్ శరీరంపై కొట్టిన గుర్తులు ఉన్నాయని, ఎలాంటి సూసైడ్ నోట్ లేదని ఇందులో పొందుపరిచారని పేర్కొన్నారు. సుశాంత్ కంటే ముందు బలవన్మరణానికి పాల్పడిన మేనేజర్ దిశా సలియాన్‌కు కొన్ని అంశాలు తెలిసిఉంటాయని చెప్పుకొచ్చారు. ముంబై పోలీసులు సుశాంత్ కేసులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను అనుసరించారా అని సుబ్రహ్మణ్య స్వామి సందేహం వ్యక్తం చేశారు. సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని స్వామి డిమాండ్ చేశారు. సుశాంత్ మరణంపై ఆయన బుధవారం బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో మాట్లాడారు. సుశాంత్ మరణానికి ఆయన మాజీ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి వేధింపులే కారణమని ఆరోపిస్తూ సుశాంత్ తండ్రి పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా సుశాంత్ జూన్ 14న ముంబైలోని బాంద్రా నివాసంలో ఉరి వేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. సుశాంత్ బలవన్మరణంతో సినీ పరిశ్రమలో వేళ్లూనుకున్న బంధుప్రీతిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. చదవండి : రియాతో బంధం తెంచుకోవాలనుకున్నాడు: అంకిత -
సుశాంత్ కేసులో సీబీఐ విచారణ జరగాలి: స్వామి
ముంబై: సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై కేంద్ర దర్యాప్తు సంస్ధ(సీబీఐ)తో విచారణ జరిపించాలని మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్ చేశారు. న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు ఇష్కారణ్ సింగ్ భండారీతో సుశాంత్ కేసు సీబీఐ విచారణకు తగినదో లేదో కనుక్కోవాలని చెప్పినట్లు ట్విట్టర్ వేదికగా శుక్రవారం వెల్లడించారు. (నిషేధిత చైనా యాప్ కంపెనీలకు 79 ప్రశ్నలు) ఈ కేసులో పోలీసుల వెర్షన్ సరైనదైనా అనే కోణంలో కూడా పరిశీలన చేయాలని భండారీతో చెప్పినట్లు స్వామి మరో ట్వీట్లో పేర్కొన్నారు. యూట్యూబ్ లైవ్‌లో సుశాంత్ ఆత్యహత్య ఘటనపై సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడతారని భండారీ ట్వీట్ చేశారు. (పాకిస్తాన్‌కు అమెరికా భారీ షాక్) ప్రస్తుతం ముంబై పోలీసులు సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటిదాకా 30 మంది నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. అందులో సుశాంత్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, వృత్తికి సంబంధించిన వారు ఉన్నారు. ఇటీవల సంజయ్ లీలా బన్సాలీ కూడా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన సుశాంత్‌కు బాజీరావు మస్తానీ, రామ్‌లీలా, పద్మావత్ సినిమాలను ఆఫర్ చేశారు. అయితే, డేట్స్ కుదరకపోవడం వల్లే ఆ సినిమాలు చేయలేకపోయామని ఆయన వెల్లడించారు. సుశాంత్ కేసుకు సంబంధించిన సమాచారం ఉంటే ఎవరైనా తనకు సాక్ష్యాధారాలతో సహా పంపొచ్చని భండారీ పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ రూపా గంగూలీ, పుస్తక రచయిత తుహిన్ సిన్హా, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఇది ఓ కృత్రిమ వివాదం..
-
టీటీడీపై దుష్ప్రచారం బాబు కుట్రే
ఈ ప్రభుత్వం టీటీడీ ఆస్తులను వేలం వేస్తోందన్న దుష్ప్రచారం అంతా చంద్రబాబు కుట్రే. వాస్తవానికి టీటీడీ ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వమే. అప్పటి టీటీడీ కమిటీలో ఏపీ బీజేపీ నేత భాను ప్రకాశ్‌రెడ్డి కూడా సభ్యుడిగా ఉన్నారు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం మాట మార్చి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. 51 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని 2016, జనవరి 30న సమావేశమైన టీటీడీ పాలకమండలి తీర్మానించింది. ఆ సమయంలో ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తన మనుషులతో నియమించిన టీటీడీ పాలకమండలే ఆ 51 ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. అంటే టీటీడీ ఆస్తులను విక్రయించాలన్న నిర్ణయం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్నదే. ఆ సమయంలో ఏపీ బీజేపీ నేత మాణిక్యాలరావే రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రిగా ఉన్నారు కూడా. చంద్రబాబు కుట్రలకు ఏపీలో కొందరు బీజేపీ నేతలు వత్తాసు పలుకుతుండటం దురదృష్టకరం. టీటీడీ ఆస్తుల విక్రయానికి వ్యతిరేకంగా ఇళ్లల్లో ఉపవాస దీక్షలు చేస్తుండటం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వంలో టీటీడీ ఆస్తుల విక్రయానికి అనుకూలంగా వ్యవహరించినందుకు వీరంతా ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి. అప్పుడు తప్పు చేశాను.. ఇప్పుడు అబద్ధాలు చెప్పానని చంద్రబాబు కూడా అంగీకరించాలి. ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. – సుబ్రహ్మణ్యస్వామి, బీజేపీ నేత సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం టీటీడీ ఆస్తులను వేలం వేస్తోందన్న దుష్ప్రచారం అంతా చంద్రబాబు కుట్రే. వాస్తవానికి టీటీడీ ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వమే. అప్పటి టీటీడీ కమిటీలో ఏపీ బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి కూడా సభ్యుడిగా ఉన్నారు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు మాటమార్చి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు’.. అని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి కుండబద్దలుగొట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే కాదు.. ఏపీకి ద్రోహం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోసం, కుట్ర అన్నవి చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటేనని ‘సాక్షి’కి మంగళవారం ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మండిపడ్డారు. టీటీడీ ఆస్తులను వేలం వేయాలని టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించిన విషయాన్ని ఆయన ఆధారాలతో సహా బయటపెట్టారు. చంద్రబాబును ప్రజలు నిలదీయాలని ఆయన సూచించారు. తాను చేసిన మోసానికి చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేశారు. అలాగే, టీటీడీ ఆస్తులను వేలం వేయాలన్న టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం వైఎస్ జగన్ నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేయడాన్ని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్వాగతించారు. నిజాయితీ, నిబద్ధత ఉన్న అరుదైన రాజకీయ నేత వైఎస్ జగన్ అని ఆయన ప్రశంసించారు. టీటీడీ ఆస్తుల వేలంపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం.. చంద్రబాబు సర్కారు హయాంలో జరిగిన వాస్తవాలపై సుబ్రహ్మణ్యస్వామి తన ఇంటర్వ్యూలో అంశాల వారీగా చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. వేలం వేయాలని నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వమే టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేయాలని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగానే నిర్ణయించారు. ఏపీలోనూ.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న టీటీడీకి చెందిన 84 ఆస్తులను విక్రయించాలని 2015లోనే టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఇందుకోసం 2015, జూలై 28న ఓ కమిటీని నియమించింది. అప్పటి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న ఏపీ బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి కూడా ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఆ కమిటీ పలుమార్లు భేటీ అయి ఆ ఆస్తులను కాపాడలేమని, విక్రయించాలని సూచించింది. ఆ కమిటీ నివేదికలో భానుప్రకాశ్‌రెడ్డి కూడా సంతకం చేశారు. 2016, జనవరి 29న చివరిసారిగా ఆ కమిటీ సమావేశమై 53 ఆస్తులను విక్రయించాలని సూచించింది. అనంతరం 2016, జనవరి 30న సమావేశమైన టీటీడీ పాలక మండలి.. 51 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని తీర్మానించింది. అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఏపీ బీజేపీ నేత మాణిక్యాలరావే రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఏపీకి ద్రోహం చేస్తున్న చంద్రబాబు అసలు టీటీడీ ఆస్తులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేలం వేస్తోందంటూ టీడీపీ కృత్రిమ వివాదం సృష్టించింది. ఇది కచ్చితంగా చంద్రబాబు కుట్రే. నా దగ్గర అన్ని ఆధారాలూ ఉన్నాయి. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం టీటీడీ ఆస్తులను వేలం వేస్తోందని చంద్రబాబు ఇంతవరకూ ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే కాదు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు. కుట్రలు చేయడం చంద్రబాబు నైజం. ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఆయన కుట్రలు పన్నుతున్నారు. వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌ను చేయగానే ఆయన క్రిస్టియన్ అని దుష్ప్రచారం చేశారు. కానీ, వైవీ హిందూ ధార్మిక వాది. నాకు బాగా తెలుసు. కొందరు ఏపీ బీజేపీ నేతల తీరు దురదృష్టకరం చంద్రబాబు కుట్రలకు ఏపీలో కొందరు బీజేపీ నేతలు వత్తాసు పలుకుతుండటం దురదృష్టకరం. అప్పట్లో టీటీడీ ఆస్తుల వేలాన్ని సమర్థించిన ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. ఇళ్లల్లో ఉపవాస దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. వీరంతా కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతలు తెలుసుకోవాలి. అక్కడ కేదార్నాథ్, బద్రీనాథ్ దేవాలయాలతో సహా అన్ని దేవాలయాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అన్నింటికీ ముఖ్యమంత్రే తనను తాను చైర్మన్‌గా ప్రకటించుకున్నారు. ఇది బీజేపీ సిద్ధాంతానికి విరుద్ధమని తెలీదా. ఏపీ బీజేపీ నేతలు ఉత్తరాఖండ్ వెళ్లి ఉపవాస దీక్షలుచేయాలి. సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు టీటీడీ ఆస్తులను వేలం వేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలుపుదల చేయడం సంతోషకరం. అందుకు ఆయనకు ధన్యవాదాలు. వైఎస్ జగన్ అరుదైన రాజకీయ నేత. ఆయన మాట మీద నిలబడే వ్యక్తి. రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత ఉన్న నేత. మంచి నాయకుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి కూడా. టీటీడీ ఆస్తులను వేలం వేయాలని చంద్రబాబు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఆధారాలను ఆయన ప్రజల ముందుంచాలి. అంతేకాదు.. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయాలి. టీటీడీ ఆస్తుల అంశంపై సలహాలు, సూచనలివ్వాలని హిందూ ధార్మిక సంస్థలు, మత పెద్దలు, భక్తులను జగన్ కోరడం సరైన చర్య. ప్రభుత్వానికి నేనూ సలహాలిస్తాను. అలాగే.. అందరూ తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలి. చంద్రబాబును ప్రజలు నిలదీయాలి రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వంపై కుట్రలకు పాల్పడుతూ దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబును ప్రజలు నిలదీయాలి. టీటీడీ ఆస్తులను విక్రయించాలని ఎందుకు తీర్మానించారో చెప్పాలని కూడా ప్రశ్నించాలి. భానుప్రకాశ్‌రెడ్డినీ నిలదీయాలి. చంద్రబాబు వాస్తవాన్ని అంగీకరించి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. విద్వేషాలు రెచ్చగొట్టే యత్నాలను మానుకోవాలి. -
టీటీడీ గుట్టువిప్పిన సుబ్రహ్మణ్య స్వామి
సాక్షి, ఆంధ్రప్రదేశ్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భూముల అమ్మకాలపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గుట్టు విప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే (2016) టీడీపీ, బీజేపీ కలిసి టీటీడీ ఆస్తులు అమ్మాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీని కోసం నియమించిన కమిటీలో బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి కూడా సభ్యుడిగా ఉన్నారని ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో తమ పార్టీకి చెందిన నాయకుడు దేవాదాయ శాఖకు మంత్రిగా ఉన్నారని, చంద్రబాబు హయాంలోనే ఆస్తుల అమ్మకాల నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. నిరర్థక ఆస్తుల అమ్మకాలపై గత ప్రభుత్వ తీర్మానాన్ని నిలుపుదల చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి సుబ్రహ్మణ్య స్వామి ధన్యవాదాలు తెలిపారు. (2016 టీటీడీ బోర్డు నిర్ణయం నిలుపుదల) కాగా గత వారం రోజులుగా టీడీపీ ఆస్తులపై ప్రతిపక్ష టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీలో సాక్షి టీవీతో మాట్లాడారు. ‘తిరుమల ఆస్తుల అమ్మకంపై టీడీపీ, బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారు. దేవుడిపైన అబద్ధాలు చెప్పడం సరైనది కాదు. రాజకీయాల్లో నిజాయితీ ముఖ్యం. అబద్ధాలు చెబితే దొరికి పోక తప్పదు. సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయత కలిగిన వ్యక్తి. చెప్పింది చేసి.. సూటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తి . క్రిస్టియన్ అయినంత మాత్రాన ప్రభుత్వంపై బురద జల్లడం మంచిది కాదు. చంద్రబాబు ఈ రాజకీయాలు మానుకోవాలి. బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలి. తిరుమల ఆస్తులను అమ్మకూడదు. వాటిని ఇతర కార్యక్రమాలకు ఉపయోగించాలని, ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నాను.’ అని అన్నారు. (అవన్నీ నిరర్థక ఆస్తులే) కాగా టీటీడీపై గతంలోనూ సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ హయాంలో ఆలయ నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డుకోవాలని తన పిటిషన్లో ప్రస్తావించారు. దీనిపై ఆయన సుప్రీంను సైతం ఆశ్రయించగా.. హైకోర్టుకు వెళ్లమని న్యాయస్థానం సూచించింది. -
సుబ్రమణియన్ స్వామి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ హత్య కేసును రీ-ఓపెన్ చేయాలంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి ట్విటర్ వేదికగా సంచలన వాఖ్యలు చేశారు. గాంధీ హత్య కేసును రీఓపెన్ చేసి పునర్విచారణ జరిపించాలని ఆయన కోరారు. గాంధీజీ హత్యపై సుబ్రమణియన్ స్వామి ట్విట్టర్లో వరుస ప్రశ్నలు సంధించారు. గాంధీ మృతదేహానికి ఎందుకు పోస్టుమార్టమ్ నిర్వహించలేదని ప్రశ్నించారు. ప్రత్యక్ష సాక్షులైన అభా, మనులను కోర్టులో ఎందుకు విచారించలేదన్నారు. గాడ్సే కాల్చిన రివాల్వర్‌ను ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. అందుకే కేసును రీఓపెన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ('కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ ముద్రిస్తే మేలు') 1st question: Why no post mortem or autopsy on Gandhiji's body? 2nd : Why Abha and Manu as direct eyewitnesses not questioned in court? 3rd: How many empty chambers in Godse's revolver? Italian revolver "untraceable"!! Why? We need to re-open the case — Subramanian Swamy (@Swamy39) February 16, 2020 మరో ట్వీట్లో అసోసియేటెడ్ ప్రెస్ ఇంటర్నేషనల్ జర్నోను ప్రస్తావిస్తూ.. ఆరోజు సాయంత్రం 5.05 గంటలకు అతను 4 బుల్లెట్ శబ్దాలు విన్నాడని చెప్పారు. అయితే గాడ్సే మాత్రం తాను రెండుసార్లు మాత్రమే కాల్చాడని చెప్పాడన్నారు. ఏపీఐ జర్నలిస్టు బిర్లా హౌజ్ వద్ద గాంధీ 5.40గంటలకు చనిపోయాడని చెప్పాడని.. అంటే, 35నిమిషాల పాటు ఆయన బతికే ఉన్నారని అన్నారు. కాగా సుబ్రమణియన్ స్వామి చేసిన ఈ ట్వీట్‌పై నెటిజెన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.(ఇమ్రాన్‌ది రోడ్డుపక్క ప్రసంగం) Page 52 quotes Associated Press International journo: he heard at 5.05 pm 4 shots [not 3 as PP in Court later told court]. Godse deposed he fired only 2. Same API journalist said Gandhi declared dead in Birla House at 5.40PM i.e., he was alive for 35 mins. — Subramanian Swamy (@Swamy39) February 16, 2020 కాగా, గతంలోనూ గాంధీ హత్యపై పునర్విచారణ జరిపించాలన్న డిమాండ్లు వినిపించాయి. 2017 అక్టోబర్‌లో ఐటీ ప్రొఫెషనల్ డా.పంకజ్ కుముద్‌చంద్ర ఫడ్నీస్ గాంధీ హత్యపై పునర్విచారణ కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గాంధీ హంతకుడు నాథురామ్ గాడ్సే నాల్గవ బుల్లెట్‌ను కాల్చాడా లేదా అన్న దానిపై కొంత అస్పష్టత ఉన్నందున.. ఈ హత్యను పరిశీలించాల్సిన అవసరం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. గాంధీ హత్య కేసులో గాడ్సే, దత్తాత్రేయ ఆప్టేలను 15 నవంబర్,1949లో ఉరితీశారని.. దేశంలో సుప్రీం కోర్టు ఏర్పాటుకు 71 రోజుల ముందు ఈ ఘటన జరిగిందని తెలిపారు. అప్పట్లో సుప్రీం కోర్టు లేకపోవడం వల్ల ఈస్ట్ పంజాబ్ హైకోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేసే అవకాశం వారికి లేకుండా పోయిందని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. -
'కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ ముద్రిస్తే మేలు'
న్యూఢిల్లీ: భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించడం వల్ల మేలు జరుగుతుదని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి చెప్పారు. ఈ సందర్భంగా ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేశుని బొమ్మను ముద్రించిన విషయాన్ని ప్రస్తావించారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇండోనేషియా కరెన్సీపై గణేశుని బొమ్మ ముద్రించడాన్ని విలేకరులు ఆయన వద్ద ప్రస్తావించినపుడు స్వామి మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. తాను దీనికి అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. గణేశుడు విఘ్నాలను తొలగిస్తాడని చెప్పారు. లక్ష్మీదేవి బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రిస్తే, భారతీయ కరెన్సీ పరిస్థితిని మెరుగుపడవచ్చునని చెప్పారు. దీని గురించి ఎవరూ చెడుగా అనుకోవాల్సిన అవసరం లేదన్నారు. చదవండి: ‘టీటీడీపై దుష్ప్రచారం చేస్తే పరువునష్టం దావా’ -
తిరుమలలో అన్యమత ప్రచారంలో నిజం లేదు
-
‘టీటీడీపై దుష్ప్రచారం చేస్తే పరువునష్టం దావా’
సాక్షి, తిరుమల: టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై పరువునష్టం దావా వేయాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం టీటీడీ నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. వాటిపైన సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కోరారు. అంతేకాకుండా ఏళ్ల తరబడి శ్రీవారి సేవలో ఉన్న అర్చకులను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని మండిపడ్డారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరిగి ఆ అర్చకులకు అవకాశమివ్వడం శుభపరిణామమన్నారు. ఏ ప్రభుత్వం అజమాయిషీ లేకుండా టీటీడీకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని సుబ్రహ్మణ్యస్వామి కోరారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్యమతస్తుడని సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగిందని వ్యాఖ్యానించారు. టీటీడీని అన్యమతస్థులతో నింపారని ప్రచారం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై పరువు నష్టం దావా వేయాలని పేర్కొన్నారు. టీటీడీ నిధులపై ఆడిటింగ్ లేకపోవడంతో నిధులు పక్కదారి పట్టాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ నిధులు కేవలం ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వాడాలని పేర్కొన్నారు. చదవండి: ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లు దావా: టీటీడీ వలసదారులకు ఎన్డీయే పౌరసత్వం కల్పిస్తోంది.. భారతదేశంలో వుండి కూడా పౌరసత్వం లేక పనిచేసే అవకాశం కోల్పోతున్న వారిని ఆదుకొని, దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని కనుగొని వారికి మన దేశ పౌరసత్వం పొందే అవకాశం ఉందా లేదా అని పరిశీలించడమే ఎన్నార్సీ ప్రధాన ఉద్దేశ్యమని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. భారతీయ ముస్లింలకు ఇది నష్టం కలిగిస్తుందన్నదాంట్లో వాస్తవం లేదన్నారు. ఎన్నార్సీకి అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్(కాంగ్రెస్) అంగీకరించారని గుర్తు చేశారు. కానీ దీనిపై కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. సుదీర్ఘ కాలంగా జీవిస్తున్న వలసదారులకు ఎన్డీయే పౌరసత్వం కల్పిస్తోందని స్పష్టం చేశారు. దీనిపై అనవసర విద్వేశాలు రెచ్చగొట్టడం మంచిపద్ధతి కాదని హితవు పలికారు. -
‘డిసెంబర్ 6 నుంచి రామ మందిర నిర్మాణం’
లక్నో : అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు డిసెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వెల్లడించారు. రామజన్మ భూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై బుధవారం భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన నేపథ్యంలో సాక్షి మహారాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బుదవారం ఆయన ఉన్నావోలో మీడియాతో మాట్లాడుతూ..1992 డిసెంబర్ 6వ తేదీనే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేశారని, మసీదు నిర్మాణం కూల్చి వేసిన తేదీనే ఆలయ నిర్మాణం ప్రారంభం కావడం విశేషమని సాక్షి మహారజ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కృషి వల్లే రామ మందిర నిర్మాణం కల నిజమైందని ఆయన అన్నారు. రామ మందిర్ నిర్మాణానికి హిందూవులు, ముస్లింలు కలిసి రావాలని ఎంపీ పిలుపునిచ్చారు. బాబర్ వారి పూర్వీకుడు కాదని, ఒక ఆక్రమణ దారుడని.. ఈ విషయాన్ని సున్నీ వక్స్ బోర్డు అంగీకరించాలన్నారు .మరో బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి మాట్లాడుతూ..తన పిటిషన్ తర్వాతే అయోధ్య కేసులో సుప్రీంకోర్టు విచారణను వేగవంతం చేసిందని పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణం ఎంతో మంది హిందువుల కలని సాకారం చేస్తుందని, ఈ దీపావళి మాత్రమే కాకుండా దేశం మొత్తం ఏడాదిపాటు పండగ చేసుకుంటుందని ఆయన తెలిపారు. -
ఇమ్రాన్‌ది రోడ్డుపక్క ప్రసంగం
సాక్షి,న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దీనిపై స్పందించారు. ఇమ్రాన్ ప్రసంగాన్ని 'రోడ్డుపక్క ప్రసంగం'తో పోల్చారు. శనివారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రోడ్డు పైనున్న జనాలను ఉద్దేశించి మాట్లాడినట్టు ఇమ్రాన్ ప్రసంగం సాగిందని, పాక్ ఆర్మీ ఒత్తిడికి తలొగ్గి అలా ప్రసంగించారని విమర్శించారు. ఇమ్రాన్ ప్రసంగం పాక్‌లో చదువురాని కొందరికి సంతోషం కలిగించొచ్చని, ధైర్యంగా ప్రసంగించారని వారి మెప్పు పొందొచ్చని అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఒత్తిడికి లొంగే ఆయన ప్రసంగం సాగినట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. -
రాయని డైరీ
తెలుసు కదా అని ఏదైనా చెప్పబోతే, ‘మాకు తెలియకపోతే కదా’ అని ఎవరైనా చటుక్కున అనేస్తే మనసు ఎంత చివుక్కుమంటుంది! ‘డెబ్బయ్ తొమ్మిదేళ్ల వయసులోని రాజకీయవేత్తకు, ఆరితేరిన ఆర్థిక నిపుణుడికి మనకు తెలిసినవే కాకుండా, అదనంగా మరికొన్ని కూడా తెలిసి ఉండే అవకాశం ఉందేమో తెలుసుకుందాం’ అని వీళ్లంతా ఎందుకు అనుకోరు?! రీసెంట్గా నిర్మలా సీతారామన్‌కు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా గట్టెక్కించవచ్చో ఐదు టిప్స్ ఇచ్చాను. ‘అసలు గట్టెక్కించాల్సిన అవసరం ఏముందీ’ అన్నట్లు విస్తుపోయి చూశారు! బీజేపీ గట్టున ఉంటే దేశం కూడా గట్టునే కదా ఉంటుంది అని ఆమె నమ్మకం కావచ్చు. ‘‘ఎందుకలా విస్తుపోయి చూశారు నిర్మలగారూ?’’ అన్నాను. ‘‘బీజేపీ వాళ్లకు బీజేపీ వాళ్లు టిప్స్ ఇవ్వడం నేనెక్కడా చూళ్లేదు. మీరు బీజేపీ అయుండి, నేను బీజేపీ అయుండి మీరు నాకు టిప్స్ ఇవ్వడమేవిస్మయంగా ఉంది’’ అన్నారు. ‘‘అయితే మీకు నా టిప్స్ నచ్చాయి కానీ, ఆ టిప్స్‌ని నేనివ్వడమే మీకు నచ్చలేదన్నమాట’’ అన్నాను.‘‘నేను అడగకుండా ఎవరు నాకు టిప్స్ ఇచ్చినా నాకు నచ్చదు సుబ్రహ్మణియన్ గారూ. పైగా మీరు ‘టిప్స్ ఇచ్చేదా’ అని నన్ను అడక్కుండానే నాకు టిప్స్ ఇచ్చేశారు’’ అన్నారు సీతారామన్! రెండు పొరపాట్లు చేశానని అర్థమైంది. అడగకుండా టిప్స్ ఇవ్వడం. టిప్స్ఇమ్మంటారా అని అడగకపోవడం.సీతారామన్ గురించి ఆలోచిస్తూ ఉంటే అయోధ్య రాముడి గురించి కబురొచ్చింది! ‘‘మిస్టర్ సుబ్రహ్మణియన్.. కేసును సుప్రీం కోర్టు తీసేసుకుంది. మధ్యవర్తులు చేతులెత్తేశారు. మీరేం చెప్పదలచుకున్నారు? ఇండియా వాంట్స్ టు నో’’ అంటున్నాడు ఆర్ణబ్ గోస్వామి! ‘‘ఇండియా నా నుంచి తెలుసుకోవాలని కోరుకుంటోందా?!’’ అని అడిగాను నిస్సత్తువగా. చెప్పలేకపోవడం వల్ల దేహానికి కలిగిన నిస్సత్తువ కాదది. వినేవారెవరన్న నిస్పృహ వల్ల మనసును ఆవరించిన నిస్సత్తువ. ‘‘ఎస్ మిస్టర్ సుబ్రహ్మణియన్.. ఇండియా వాంట్స్ టు నో అబౌట్ యువర్ కామెంట్స్. అయోధ్య మధ్యవర్తుల కమిటీలో ఉండేందుకు అప్పట్లో మీరూ ఉత్సాహం చూపారు కదా..’’ అన్నాడు ఆర్ణబ్. ‘‘నా దగ్గర కామెంట్స్ ఏమీ లేవు ఆర్ణబ్. టిప్స్ ఉన్నాయి. అవి ఇండియాకు పనికొస్తాయా? ఎందుకంటే ఇండియాలోనే కొందరు నేనిచ్చే టిప్స్‌ని తీసుకోవాలని అనుకోవడం లేదు’’ అన్నాను. ‘‘వెల్ మిస్టర్ సుబ్రహ్మణియన్. ఇండియా అంటే.. మీ టిప్స్‌ని తీసుకోనివాళ్లు మాత్రమే కాదు, మీ టిప్స్‌ని తీసుకునేవాళ్లు కూడా..’’ అన్నాడు ఆర్ణబ్. ‘‘మరి ముందే టిప్స్ కావాలని ఎందుకు అడగలేదు ఆర్ణబ్! ఇండియా వాంట్స్ టు నో అబౌట్ యువర్ కామెంట్స్ అని కదా మీరన్నారు..’’ అన్నాను. ఆర్ణబ్ పెద్దగా నవ్వాడు. ఆర్ణబ్ పెద్దగా చెవులు పగిలేలా మాట్లాడ్డమే తప్ప, ఏవీ పగలకుండా పెద్దగా నవ్వడం ఇదే తొలిసారి నేను వినడం! చెవులు పగలడమే బాగుంది. ‘‘మిస్టర్ సుబ్రహ్మణియన్.. ముందే టిప్స్ కావాలని మిమ్మల్ని ఎందుకు అడగలేదంటే, కామెంట్స్ అడిగినా మీరిచ్చేది టిప్సే కదా అనే నమ్మకం..’’ అన్నాడు! ‘‘నమ్మకం మంచిదే ఆర్ణబ్. ఒకవేళ నా మూడ్ బాగుండి, టిప్స్ ఇవ్వకుండా మీరడిగినట్లు కామెంట్సే ఇస్తే?’’ అన్నాను. ‘‘మీకు తెలియందేముంది మిస్టర్ సుబ్రహ్మణియన్, మూడాఫ్ చెయ్యడానికి మా దగ్గర ఒక టీమ్ ఎప్పుడూ ట్వంటీ ఇంటూ సెవన్.. పని చేస్తూనే ఉంటుంది కదా’’ అన్నాడు ఆర్ణబ్! -
ఇండియా బుల్స్ షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై: సోమవారం నాటి నష్టాల మార్కెట్లో ఇండియా బుల్స్ గ్రూపునకు భారీ షాక్ తగిలింది. పలు షెల్ కంపెనీలద్వారా ఇండియాబుల్స్ గ్రూప్ రూ. లక్ష కోట్లకు పైగా నిధులను అక్రమంగా దారి మళ్లించిందని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు దీనిపై సిట్ ద్వారా దర్యాప్తు చేయాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆదివారం లేఖ రాసినట్టుగా వార్తలు వ్యాపించాయి. దీనికి సంబంధించిన లేఖ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో దాదాపు100 షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. దీంతో ఈ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంకు(ఎన్‌హెచ్‌బీ) నుంచి షెల్ కంపెనీల ద్వారా నిధులను సమీకరించి ఇండియాబుల్స్ గ్రూప్ అక్రమంగా మళ్లించినట్లు సుబ్రమణ్యన్ స్వామి ఆరోపించారు. మనీలాండరింగ్ స్కామ్ కింద సీబీఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐవో, ఐటీ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయవలసిందిగా ప్రధాని మోదీని కోరినట్టు సమాచారం. ట్రేడింగ్‌లో ఇండియాబుల్స్ గ్రూప్‌నకు చెందిన లిస్టెడ్ కంపెనీల కౌంటర్లలో అమ్మకాల వెల్లువ కురిసింది. ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ 10 శాతానికిపైగా పడిపోయి టాప్‌లూజర్‌గా నమోదైంది. ఐబీ వెంచర్స్ 5 శాతం, ఐబీ కన్జూమర్ ఫైనాన్స్ 3 శాతం ఇండియాబుల్స్ రియల్టీ 8.4 శాతం పతనమయ్యాయి. ఐబీ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ షేరు 5శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకి రూ. 121.55 వద్ద ఫ్రీజ్ అయింది. మరోవైపు బీజేపీ నేత ఆరోపణలను ఇండియా బుల్స్ హౌసింగ్ బీఎస్ఈ ఫైలింగ్‌లో తీవ్రంగా ఖండించింది. జూన్ 28నాటి సుబ్రమణియన్ స్వామి ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలను హైలైట్ చేయాలనుకుంటున్నామంటూ వివరణ ఇచ్చింది. ఎన్‌హెచ్‌బి నుంచి ఇండియాబుల్స్ హౌసింగ్‌కు ఎలాంటి రుణాలులేవని కంపెనీ సీఈవో గగన్ బాంగా స్పష్టం చేశారు. అసలు తమ చరిత్రలో ఎన్‌బీహెచ్ నుంచి లోన్స్ గానీ, రీఫైనాన్సింగ్ నిధులను గానీ తీసుకోలేదన్నారు. తమ మొత్తం లోన్‌బుక్ సుమారు రూ.87,000 కోట్లుగా ఉందని వివరించారు -
‘బీజేపీ నుంచి ఆయనను సాగనంపండి’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు క్రిమినల్ కంప్లైంట్ చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు ఆధారంగా ఆబిడ్స్ రోడ్డు పోలీసులు స్వామిపై కేసు నమోదు చేశారు. రాహుల్ గాంధీ మాదక ద్రవ్యాలను వినియోగిస్తారని సుబ్రహ్మణ్యస్వామి రెచ్చగొట్టే విధంగా లేనిపోని వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ యువజన కాంగ్రెస్ నాయకులు సోమవారం సుబ్రహ్మణ్యస్వామి దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుబ్రహ్మణ్యస్వామి తీరును తప్పు పట్టారు. హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా స్వామి వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ జాతీయతపై నిరాధార ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. నైతిక విలువలు, ఉన్నత ప్రమాణాల గురించి పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి పూర్తిగా భిన్నంగా బీజేపీ ఎంపీల ప్రవర్తన ఉందని, సుబ్రహ్మణ్యస్వామి చేసిన తాజా వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. బీజేపీ నుంచి స్వామిని సస్పెండ్ చేయాలని డాక్టర్ దాసోజు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో శ్రవణ్‌తో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఇతరులు పాల్గొన్నారు. అనంతరం మైనార్టీ సంక్షేమ విద్యా సంస్థలో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 33 మంది విద్యార్థులను కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. -
సర్కస్‌లో కోతి మాదిరిగా...
సాక్షి, విజయవాడ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహణ బాధ్యత సాధువులకు అప్పగిస్తే అభివృద్ధి జరుగుతుందని తన నమ్మకమని ప్రముఖ న్యాయవాది, బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. టీటీడీ పై తాను దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించిందని తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 6న వాదనలు వినిపించనున్నట్లు పేర్కొన్నారు.‘హైకోర్టు ఆధ్వర్యంలో ఆడిట్ కమిటీ నియమించాలి. టీటీడీ ప్రభుత్వం చేతుల్లో ఉంది. దేవాలయాలు ప్రభుత్వ అజమాయిషీలో ఉండకూడదు అనేది నా సలహా. టీటీడీకి వచ్చిన ఆదాయాన్నిరాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోంది. కానీ అక్కడ మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం లేదు’ అని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం టీటీడీ వ్యవహారంలో చాలా దారుణంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కస్‌లో కోతి మాదిరి బాబు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కస్‌లో కోతి మాదిరి అటూ ఇటూ దూకుతున్నారని సుబ్రమణ్య స్వామి ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం చేస్తానని చెప్పినప్పటికీ.. నాలుగేళ్ల తమతో కలిసి ఉన్న చంద్రబాబు చివరి సంవత్సరం కాంగ్రెస్ పంచన చేరారని విమర్శించారు. ‘ప్రత్యేక హోదా ఇవ్వలేదనే నెపంతో చంద్రబాబు కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. మొదటి సంవత్సరమే ప్రత్యేక హోదా ఇవ్వలేము అని చెప్పాం మరి అప్పుడు ఏం చేశారు అని సుబ్రమణ్య స్వామి ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహారం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. -
‘ఫెర్నాండెజ్ అంటే ఇందిర కూడా భయపడేది’
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) తీవ్ర అస్వస్ధతతో మంగళవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన స్నేహితుడు, బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి, ఫెర్నాండెజ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ టైంలో ఫెర్నాండెజ్‌ను చూస్తే.. ఇందిరా గాంధీ విపరీతంగా భయపడేవారన్నారు సుబ్రమణ్య స్వామి. ఆయన మాట్లాడుతూ.. ‘గాంధీ కుంటుంబం అంటే ఫెర్నాండెజ్‌కు అసలు ఇష్టం ఉండేది కాదు. ఆ కుటుంబం దేశాన్ని నాశనం చేస్తుందని ఆయన నమ్మేవాడు. ఆయన తన జీవితాంతం కాంగ్రెస్‌ను, గాంధీ కుటుంబాన్ని వ్యతిరేకించాడు’ అని తెలిపారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాలను ఫెర్నాండెజ్ తీవ్రంగా వ్యతిరేకించేవాడన్నారు. ‘ఆ సమయంలో ఫెర్నాండెజ్‌ను చూస్తే ఇందిరా గాంధీ భయపడేవారు. ఆయనను అరెస్ట్ చేసిన తర్వాతే ఇందిరా గాంధీ ప్రశాంతంగా ఉండగలిగార’ని తెలిపాడు సుబ్రమణ్య స్వామి. అంతేకాక తమ అనుబంధం గురించి మాట్లాడుతూ.. ‘ఫెర్నాండెజ్ నాకు చాలా ప్రియమైన స్నేహితుడు. మేం తరచుగా కలుసుకుని పలు అంశాల గురించి చర్చించేవాళ్లం. అతను చాలా తెలివైన వాడు. అతడు తన జీవితంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎన్నో గొప్ప ర్యాలీలు, సభలు నిర్వహించాడ’ని తెలిపారు. అంతేకాక ఫెర్నాండెజ్ బోఫోర్స్ కేసును ఓ కొలిక్కి తీసుకురావాలనిభావించారు. కానీ వాజ్‌పేయ్ సూచన మేరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారన్నారు సుబ్రమణ్య స్వామి. అంతేకాక సైనికులు క్షేమం గురించి ఫెర్నాండెజ్ కన్నా ఎక్కువగా ఏ రక్షణశాఖ మంత్రి కృషి చేయలేదని ప్రశంసించారు. -
ప్రియాంకపై స్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక ‘బైపోలార్ డిజార్డర్’ అనే మానసిక రుగ్మతతో బాధపడుతోందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. ఈ వ్యాధి ప్రజలకు కూడా వ్యాపించేలా కాంగ్రెస్ యత్నిస్తోందని, బైపోలార్ డిజార్డర్‌తో ప్రియాంక ప్రజా జీవితంలో పనిచేయలేదని ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ప్రియాంకకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తూర్పు యూపీ ప్రచార ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ గత బుధవారం కాంగ్రెస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక ప్రియాంక పొలిటికల్ ఎంట్రీపై ఇటీవల మరికొందరు బీజేపీ నేతలు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అందమైన ముఖం చూసి జనం ఓట్లు వేయరని బిహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝా వ్యాఖ్యానించగా.. అవినీతి, కళంకిత మనిషి రాబర్ట్ వాద్రా భార్య కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చేపట్టడం బీజీపీకి లాభిస్తుందని బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ మరో నేత కైలాష్ విజయ్వర్జియా.. ‘కాంగ్రెస్‌లో సమర్థవంతమైన నాయకులు లేరు. అందుకనే ప్రియాంకకు పదవులు కట్టబెట్టారు. చాకొలేట్ ఫేస్‌లతో వచ్చే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొందామని కాంగ్రెస్ నేతలు కలలుగంటున్నారు’ అని ఎద్దేవా చేశారు. బైపోలార్ డిజార్డర్ ఉన్నవారిలో మానసిక ఉద్వేగాలు అతి ఎక్కువగా ఉంటాయి. సంతోషంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఎగ్జయిట్‌మెంట్‌కి లోనుకావడం, బాధగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా కుంగిపోవడం జరుగుతుంది. వీరిలో కనిపించే ఈ మానసిక స్థితిని బైపోలార్ డిజార్డర్‌గా పిలుస్తారు. -
మోదీ సర్కార్‌ను కూలదోస్తా: బీజేపీ ఎంపీ
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మందిర నిర్మాణంపై ముస్లిం వర్గాలకు అభ్యతరం లేదనీ, అయినా కూడా కేంద్రంలోని మోదీ సర్కార్, యూపిలోని యోగి సర్కార్ ఈ విషయంలో జాప్యం చేస్తే సంహించేది లేదని అన్నారు. ఏదేని కారణాలతో రామమందిర నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే సొంత ప్రభుత్వాలను కూడా కూల్చేందుకు వెనకాడనని హెచ్చరించారు. బీజేపీ నేతలే ఆలయ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే జనవరి తర్వాత అయోధ్య కేసును విచారిస్తామని సుప్రీం కోర్టు ప్రకటించిన నేపథ్యంలో సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
శబరిమల వివాదం : హిందూ సంఘాలపై స్వామి ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా ఆలయంలోకి మహిళా భక్తుల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న హిందూ సంస్థలు, నిరసనకారులపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మండిపడ్డారు. ‘సుప్రీం కోర్టు ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు అది తమ సంప్రదాయమని హిందువులు చెబుతున్నారని, ట్రిపుల్ తలాక్ కూడా సంప్రదాయమేనని, కానీ దాన్ని రద్దు చేసిన తర్వాత అందరూ స్వాగతించారని, హిందువులు కూడా ఇదే మాదిరి వ్యవహరించా’లని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఇది హిందూ పునరుజ్జీవానికి, తిరోగమనానికి మధ్య సాగుతున్న పోరాటమని అభివర్ణించారు. హిందువులందరూ ఒకటేనని, కుల వ్యవస్థ రద్దు కావాలని హిందూ పునరుజ్జీవ శక్తులు కోరుతున్నాయన్నారు. బ్రాహ్మణులు ప్రస్తుతం కేవలం మేథావులుగానే మిగిలిపోలేదని, వారు సినిమా, వ్యాపారం తదితర రంగాల్లోనూ ఉన్నారని చెప్పుకొచ్చారు. పుట్టుకతోనే కులం నిర్ధారణ అవుతుందని ఎక్కడ రాశారని, శాస్ర్తాలను సవరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. శబరిమల ఆలయంలోకి పది నుంచి 50 సంవత్సరాల మహిళల ప్రవేశాన్ని హిందూ నిరసనకారులు అడ్డగిస్తున్నారనే వార్తల నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. -
టీటీడీపై స్వామి పిటిషన్.. స్వయంగా వాదనలు
సాక్షి. హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ని ఏపీ ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించాలని కోరుతూ తమిళనాడుకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీని ప్రభుత్వం అజమాయిషీ నుంచి తప్పించి నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని పిటిషన్లో పేర్కొన్నారు. స్వామి స్వయంగా బుధవారం హైదరాబాద్ వచ్చి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరో పదిరోజుల్లో తిరిగి హైదరాబాద్ వస్తానని.. తానే స్వయంగా ఈ కేసులో వాదలు వినిపిస్తానని ఆయన తెలిపారు. పిటిషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన ఢిల్లీ పయనమయ్యారు. కాగా టీటీడీ నిధులు గత కొంత కాలంగా ఏపీ ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. టీటీడీలో నిధుల దుర్వినియోగం, టీటీడీకి సంబంధించిన విలువైన నగలు, కానుకలు మాయం అవుతున్నాయని ఆరోపిస్తూ.. సుబ్రహ్మణ్య స్వామి గతంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. ఇదివరకే టీటీడీ వివాదంపై స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, సుప్రీంకోర్టు ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. టీటీడీ ప్రధాన అర్చకుడి పదవి నుంచి రమణ దీక్షితులును తొలగించడం మొదలుకుని శ్రీవారి నగలు మాయం కావడం, ఇతరత్రా విషయాల్లో చోటుచేసుకుంటున్న వివాదాలు తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ వ్యవహారాలపై సీబీఐ విచారణ చేపట్టాలని స్వామి కోరుతున్నారు. -
‘ఇమ్రాన్ ఖాన్ ఓ చప్రాసీ’
అగర్తల : ఇస్లామాబాద్‌లో సైన్యం, ఐఎస్ఐ ఉగ్రవాదులు పాలన కొనసాగిస్తున్నారు. అక్కడ ఇమ్రాన్ ఖాన్ ఓ చప్రాసీ మాత్రమే అంటూ బీజేపీ వివాదాస్పద ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాక పాకిస్తాన్‌ను నాలుగు భాగాలుగా విభజించాలని పేర్కొన్నారు. పాకిస్తాన్ సరిహద్దు తీవ్రవాదాన్ని ప్రోత్సాహిస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందంటూ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ ఐక్య రాజ్య సమితి వేదికగా ప్రకటించిన నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పాకిస్తాన్లో సైన్యం, ఉగ్రవాదం అధికారమేలుతున్నాయి. ఇప్పుడక్కడ ఇమ్రాన్ ఖాన్ కేవలం ఓ చప్రాసీ మాత్రమే. మన దేశం ఎంత శాంతియుతంగా ఉంటున్న పాక్ మాత్రం దూకుడుగానే వ్యవహరిస్తోంది. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక్కటే మార్గం. పాకిస్తాన్‌ను బలూచ్, సింధ్, పష్తున్లతో పాటు పశ్చిమ పంజాబ్ అనే నాలుగు భాగాలుగా విభజించాలి. అప్పుడైతేనే ఈ సమస్యలు సమసిపోతాయి’ అన్నారు. అంతేకాక ‘అంతర్జాతీయ వేదికల మీద మన దేశం, పాకిస్తాన్ తప్పులను ఎత్తిచూపినప్పుడల్లా ఆ దేశం ఒత్తిడికి గురై ఏవేవో ఆరోపణలు చేస్తుంది. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక పాకిస్తాన్ గురించి మర్చిపోండి. మన ఆర్మీని సిద్ధం చేయండి. కేవలం ఒక్క రోజులో పాక్ నాలుగు భాగాలుగా విడిపోతుంది’ అన్నారు. ఈ సందర్భంగా ఆయన బంగ్లాదేశ్ గురించి కూడా ప్రస్తావించారు. ‘మన దేశం అన్ని రకాలుగా బంగ్లాదేశ్‌కు సాయం చేస్తోంది. కానీ బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. అందుకే ఆమె హిందూవులను వేధిస్తూ, దేవాలయాలను నాశనం చేస్తూన్న పిచ్చి వారిని ఆపడంలేదు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే బంగ్లాదేశ్‌పై తగు చర్యలు తీసుకోవాలిని నేను మన ప్రభుత్వానికి సిఫారసు చేస్తాన’ని తెలిపారు. -
టీటీడీపై పిటిషన్; హైకోర్టును ఆశ్రయించండి
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వివాదంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. టీటీడీ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులును తొలగించడం మొదలుకుని శ్రీవారి నగలు, ఇతరత్రా విషయాల్లో చోటుచేసుకుంటున్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఆయన వీటిపై సీబీఐ విచారణ చేపట్టాలని సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. కాగా, కోర్టు తీర్పుపై సుబ్రహ్మణ్యస్వామి ట్విటర్లో స్పందించారు. ‘తిరుపతి విషయంలో నేను దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇప్పుడు నేను హైకోర్టును ఆశ్రయిస్తాను. ఇది ఒక మంచి ప్రారంభం’ అని ఆయన పేర్కొన్నారు. -
సెక్షన్ 377పై తీర్పు : ‘హెచ్ఐవీ కేసులు పెరుగుతాయి’
న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పును బీజేపీ వివాదాస్పద నేత, ఎంపీ సుబ్రమణియన్ స్వామి తప్పు పట్టారు. దీని వల్ల హెచ్ఐవీ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సెక్షన్ 377పై సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వలింగ సంపర్కం గురించి ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పే చివరిది కాదు. దీన్ని ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్‌కి తీసుకెళ్లవచ్చని తెలిపారు. సెక్షన్ 377పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక దుష్ప్రవర్తనకు దారి తీయడమే కాక పలు లైంగిక వ్యాధుల సంక్రమణకు అవకాశం కల్పించినదిగా ఆయన అభిప్రాయపడ్డారు. దీని వల్ల హెచ్ఐవీ కేసులు పేరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక స్వలింగ సంపర్కం అనేది ఒక జన్యుపరమైన రుగ్మతగా పేర్కొని.. దీన్ని ఒక ప్రత్యామ్నాయ లైంగిక ప్రవర్తనలా పరిగణించకూడదని తెలిపారు. స్వలింగ సంపర్కం గురించి సుమారు 157 ఏళ్లుగా సాగుతున్న వివాదానికి సుప్రీం కోర్టు నేటితో స్వస్తి పలికింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ ఏకగ్రీవంగా తీర్పును వెలువరించడం విశేషం. -
‘పరిపూర్ణానందపై బహిష్కరణ ఎత్తేయండి’
సాక్షి, హైదరాబాద్ : స్వామి పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేయడంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి తీవ్ర అభ్యంతరం తెలిపారు. గూండాల విషయంలో నగర బహిష్కరణను అమలు చేస్తారని గుర్తు చేసిన స్వామి, తన అభ్యంతరాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గురువారం ఓ లేఖ రాశారు. సంఘ వ్యతిరేక, ప్రమాదకర కార్యకలాపాల చట్టం 1980లోని సెక్షన్ 3 కింద పరిపూర్ణానందపై చర్యలు తీసుకోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఆ సెక్షన్‌ను చదివితే అది గూండాల బహిష్కరణకు ఉద్దేశించిందన్న విషయం తనకు తెలిసిందన్నారు. అటువంటిది పరిపూర్ణానందపై ఈ సెక్షన్ కింద చర్యలు తీసుకోవడం ఆయనను అవమానించడం, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడమేనన్నారు. కాబట్టి వెంటనే బహిష్కరణ ఉత్తర్వుల రద్దుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో తాను న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుందని తెలిపారు. -
పీడీపీ సహకరిస్తే హిందూ వ్యక్తిని సీఎంగా ఎన్నుకుంటాం
-
‘కశ్మీర్‌కు హిందూ సీఎం కావాలి’
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో హిందూ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని బీజేపీ వివాదాస్పద నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) హిందూ లేదా సిక్కు వ్యక్తిని సీఎంగా ప్రతిపాదిస్తే తాము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. దేశ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కశ్మీర్‌కు కేవలం ముస్లిం వ్యక్తే సీఎంగా ఎన్నుకునే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారని, దానికి స్వస్తి పలికి హిందూ వ్యక్తి సీఎం కావాలని స్వామి పేర్కొన్నారు. ముస్లిం వ్యక్తి తప్ప ఒక్క హిందూ వ్యక్తి కూడా ఇంత వరకు సీఎంగా ఎన్నుకోలేదని, పీడీపీ సహకరిస్తే తామూ చేసి చూసిస్తామని తెలిపారు. కాగా జూన్ 19న పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ మద్దతు విరమించుకోవడంతో సీఎం మహబూబా ముప్తీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కశ్మీర్లో గవర్నర్ పాలన విధించారు. -
టీటీడీపై సుప్రీంకోర్టులో పిటిషన్ : స్వామి
న్యూఢిల్లీ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలిలో గత కొంతకాలం నుండి వివాదాలు కొనసాగుతున్నాయి. ఓవైపు ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులును తొలగించడం మొదలుకుని శ్రీవారి నగలు, ఇతరత్రా విషయాల్లో చోటుచేసుకుంటున్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో టీటీడీ వివాదంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 19న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియంత్రణ నుంచి టీటీడీని తొలగించాలన్నదే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ సారాంశమని సమాచారం. ఆభరణాల మాయం అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు చేయాలని డిమాండ్, దేవాలయ నిర్వహణ సాధువులకు ఇవ్వాలని, లేదంటే లూటీ ఇలాగే కొనసాగుతుందని గతంలో స్వామి వ్యాఖ్యానించారు. బోర్డులో జరుగుతున్న వివాదంపై టీటీడీ సిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలపగా, భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. టీటీడీ బోర్డులో పొరుగు రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రి భార్యకు చోటు కల్పించడం, టీడీపీ ఎమ్మెల్యే అనితకు సైతం బోర్డు మెంబర్‌గా నియమించారు. అయితే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అనిత చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఏపీ ప్రభుత్వం ఆమె విషయంలో వెనక్కి తగ్గింది. -
రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్‌కి డ్రగ్స్ అలవాటు ఉందని, డోపింగ్ టెస్ట్ నిర్వహిస్తే ఆ విషయం తేలుతుందని స్వామి పేర్కొన్నారు. తాజాగా పంజాబ్ ప్రభుత్వం ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సాక్షి, న్యూఢిల్లీ: ‘పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ముందుగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి డోపింగ్ టెస్ట్ నిర్వహించాలి. ఆయన ఖచ్ఛితంగా విఫలం అవుతారు. ఎందుకంటే ఆయన కోకైన్ తీసుకుంటారు కాబట్టి’ అని ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ స్వామి పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ కూడా స్పందిస్తూ.. ‘పంజాబ్‌లో డ్రగ్స్ అడిక్ట్స్ ఎక్కువగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 70 శాతం యువత డ్రగ్స్ మత్తులో ఊగుతోందని రాహుల్ అంటున్నారు. కానీ, వారి పార్టీలోనే ఉన్న డ్రగ్ అడిక్ట్స్‌కు ముందుగా డోప్ టెస్టులు నిర్వహించండి. అది రాహుల్‌తోనే మొదలుపెడితే బాగుంటుంది’ అని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. (సంచలన నిర్ణయం) ప్రభుత్వ ఉద్యోగులకు(పోలీస్ శాఖతోసహా) డోప్ టెస్ట్ నిర్వహించాలని, నిందితులుగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ సర్కార్ నిర్ణయించింది. అంతేకాదు నిషేధిత డ్రగ్స్ విక్రయించే, అక్రమ రవాణాకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించేలా కఠిన చట్టాన్ని రూపొందిస్తున్నామని కెప్టెన్, సీఎం అమరీందర్ సింగ్ ఇటీవల ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల అనంతరం చేసే ఎంపిక ప్రక్రియ సమయంలో కొత్త అభ్యర్థులకు సైతం డ్రగ్స్ టెస్ట్‌లు చేయిస్తామని ఆయన తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.. సీఎంతోసహా ప్రజా ప్రతినిధులందరినీ ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. -
శశిథరూర్‌కు భారీ ఊరట
భార్య మృతి కేసులో కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్‌కు భారీ ఊరట లభించింది. పాటియాలా హౌస్ కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గురువారం ఈ మేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సాక్షి, న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో ఆమె భర్త, కాంగ్రెస్ నేత శశిథరూర్‌కు ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. సునంద మృతిలో కేసులో 3000 పేజీల చార్జిషీట్‌ను రూపొందించిన ఢిల్లీ పోలీసులు.. థరూర్ పేరును నిందితుడిగా చేర్చారు. ఐపీసీలోని 498-ఏ(గృహహింస), 360(ఆత్మహత్యకు ప్రేరేపించటం) సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే ఇంతదాకా అరెస్ట్ మాత్రం చేయని పోలీసులు.. తాజాగా జూలై 7న కోర్టు విచారణకు మాత్రం హాజరుకావాలంటూ సమన్లు జారీ చేశారు. దీంతో థరూర్ ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే బెయిల్ దొరికితే ఆయన దేశం విడిచిపోతారని పోలీసులు వాదించగా, కోర్టు ఆ వాదనతో ఏకీభవించలేదు. లక్ష రూపాయల పూచీకత్తు, దేశం విడిచిరాదన్న షరతుల మేరకు కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. జనవరి 17, 2014న ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్ గదిలో సునంద అనుమానాదాస్పద స్థితిలో మృతి చెందగా, కేసుపై దర్యాప్తు కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. స్వామి వెటకారం... కాగా, సునంద పుష్కర్ మృతి కేసులో శశి థరూర్‌కు బెయిల్ లభించటంపై బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి స్పందించారు. ‘థరూర్ ఇప్పుడు వేడుకలు జరుపుకోవటం అప్రస్తుతం. అతనేం తీహార్ జైల్లో కూర్చోడు. రాహుల్, సోనియా గాంధీలతో కూర్చుంటాడు. అఫ్కోర్స్.. వాళ్లు కూడా బెయిల్ వాలాస్(బెయిల్‌పై ఉన్నవాళ్లే) కదా! మంచి కంపెనీ’ అంటూ స్వామి ఛలోక్తులు విసిరారు. -
’ పింక్ డైమండ్ ’ గోల్మాల్ గోవిందం !
-
సుబ్రహ్మణ్యస్వామిని కలిసిన రమణ దీక్షితులు
-
టీటీడీ వ్యవహారంపై సుప్రీంలో పిటిషన్ : స్వామి
సాక్షి, చెన్నై : రమణ దీక్షితులుతో పదవీ విరమణ చేయించే అధికారం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి లేదని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. టీటీడీపై ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఆభరణాల మాయం అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మూడు అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు. తక్షణమే రమణ దీక్షితులు రిటైర్మెంట్పై స్టే ఇవ్వాలని కోరతానని చెప్పారు. టీటీడీపై సమీక్ష నిర్వహించే అధికారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని పేర్కొన్నారు. దేవాలయ నిర్వహణ సాధువులకు ఇవ్వాలని, లేదంటే లూటీ ఇలాగే కొనసాగుతుందని అన్నారు. బీజేపీకి ఈ కేసుకు సంబంధం లేదని చెప్పారు. విరాట్ హిందూ సంఘటన ఆధారంగా కేసు వేస్తున్నట్లు స్వామి వెల్లడించారు. దేవాలయానికి బంగారుపూత కేసులో విజయం సాధించినట్లే, ఈ కేసులో సైతం విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్‌ను దెబ్బతీసింది ఆయనే..
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ నైతిక ఓటమికి రాహుల్ గాంధీనే కారణమని బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి అన్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏఎన్ఐతో స్వామి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆయన సెటైర్లు పేల్చారు. ‘రాహుల్ అపరిపక్వ రాజకీయాలే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ఆయన వేసిన సవాళ్లు అసంబద్ధంగా, మూర్ఖంగా ఉన్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం కూడా లేదు. రాహుల్ ఇంక లండన్ వెళ్లి స్థిరపడటం మంచిది. బీజేపీ వందకు పైగా సీట్లు సాధిస్తుందని నేను ముందు నుంచే చెబుతున్నా. లింగాయత్ అంశంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. బీజేపీ అవినీతి నిర్మూలన ఎజెండా కన్నడ ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. పట్టణాలతోపాటు గ్రామాల్లో కూడా ప్రజలు బీజేపీకి ఓట్లేశారు’ అని స్వామి తెలిపారు. ఇక ఈవీఎంల మూలంగానే బీజేపీ విజయం సాధించిందన్న కాంగ్రెస్ ఆరోపణలపై స్వామి నవ్వి ఊరుకున్నారు. మరోవైపు జేడీఎస్-కాంగ్రెస్ పొత్తు అంశంపై స్పందించని స్వామి, తన మిత్రుడైన యెడ్యూరప్ప ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. BJP MP Subramanian Swamy's reaction when asked about Congress raising questions on EVMs #KarnatakaElections2018 pic.twitter.com/ZWGSrdwaD8 — ANI (@ANI) 15 May 2018 -
ఆదాయ పన్ను రద్దు చేయండి!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ వివాదాస్పద ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి తనదైన శైలిలోవ్యాఖ్యలు చేశారు. ఆదాయపు పన్నును రద్దు చేయాలని పిలుపునిచ్చారు. దీని వలన ఎక్కువ మంది పొదుపు చేయడానికి వీలవుతుందని, తద్వారా పెట్టుబడుల పెరుగుదలకు దారితీస్తుందన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఇండియన్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఫ్యూచర్ అఫ్ ఇండియా ఇన్ ఎమర్జింగ్ వరల్డ్ 8వ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగం, పేదరికం సమస్యల పరిష్కారానికి దేశం 10 ఏళ్లలో 10 శాతం వృద్ధిరేటు సాధించాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు, స్టార్టప్ కంపెనీలు అధిక పన్ను భారాన్ని మోస్తున్నారన్నారు. చాలా తక్కువమంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారు. ఇది కూడా వేధింపులతో సమానమన్నారు. మధ్య తరగతిపై భారాన్ని తగ్గించేందుకు, వ్యక్తిగత ఆదాయపన్నును రద్దు చేయాలని సూచించారు. అందువల్ల ప్రజల్లో పొదుపు సామర్ధ్యం పెరుగుతుందని, పెట్టుబడులు పుంజుకుంటాయన్నారు. -
మీవల్లే జైల్లో శశికళ.. రూప సెల్ఫీపై చర్చ
సాక్షి, బెంగళూరు : శశికళ పరప్పన అగ్రహార జైల్లో శశికళ వీఐపీ సదుపాయాలపై నివేదికతో ఐపీఎస్ అధికారిణి రూప వార్తల్లోకెక్కారు. అప్పటి నుంచి తరచూ ఆమె వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ విమర్శలకు దారితీసింది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిని పొగుడుతూ ఆయనతో దిగిన ఓ సెల్ఫీని ఆమె ట్వీట్ చేయగా.. అది చర్చనీయాంశమైంది. ‘మీరు(సుబ్రహ్మణ్య స్వామి) చాలా గొప్ప వ్యక్తి సార్. మీరే గనుక ఫిర్యాదు చేయకుంటే మాత్రం ఆ వ్యక్తి అసలు జైలుకి వెళ్లే వారు కాదేమో. మీ స్ఫూర్తితోనే ఆమె జైల్లో చేసిన అక్రమాలు నేను బయటపెట్టా’ అని రూప ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ఆ ట్వీట్‌పై పలువురు విమర్శలు మొదలుపెట్టారు. ‘మీరు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు’ అంటూ ఓ వ్యక్తి రీట్వీట్ చేయగా... రూప దానికి స్పందించారు. ‘నేను జైలు రిపోర్టు అందజేయగానే నన్ను బదిలీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక పోలీస్ శాఖ ప్రవర్తించింది. అప్పుడు ఎవరూ ప్రశ్నించరు. కానీ, ఇప్పుడు ఓ స్పూర్తిదాయాక వ్యక్తితో ఫోటో దిగితే రాజకీయాలు చేస్తున్నారు. ఇది సరికాదు’ అని ఆమె పేర్కొన్నారు. కాగా, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదుతో తేనెతుట్టే కదిలింది. సుమారు రెండు దశాబ్దాలపాటు జరిగిన విచారణ అనంతరం బెంగళూరు కోర్టు గతేడాది ఫిబ్రవరిలో జయలలిత ఆమె సన్నిహితురాలు శశికళను కోర్టు దోషులుగా తేల్చింది. అయితే అప్పటికే జయలలిత మరణించగా, శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇదిలా ఉంటే శశికళకు జైల్లో వీఐపీ ట్రీట్ మెంట్ అందిందని.. అందుకోసం అధికారులు రూ. 2 కోట్లు లంచం తీసుకున్నారంటూ జైల్లో డీఐజీగా ఉన్న రూప సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కర్ణాటక హోం శాఖ.. ఆపై రూపను వేరే విభాగానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
ఎయిరిండియా అమ్మకంపై స్వామి సంచలన వ్యాఖ్యలు
ఎయిరిండియా అమ్మకంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తన సొంత ప్రభుత్వంపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిరిండియా ప్రతిపాదిత సేల్కు వ్యతిరేకంగా తను ప్రైవేట్ క్రిమినల్ లా కంప్లైంట్ దాఖలు చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతిపాదించిన ఎయిరిండియా సేల్‌లో మరో కుంభకోణం చోటు చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఎయిరిండియాలో 76 శాతం వాటాలను అమ్మాలని కేంద్రం సిద్ధమవుతున్న క్రమంలో ఆయన ఈ ఫిర్యాదు నమోదుచేయడం సంచలనానికి తెరతీసింది. అంతేకాక ఈ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియతో ప్రైవేట్ ప్లేయర్ల చేతిలోకి ఎయిరిండియా యాజమాన్య హక్కులు వెళ్లనున్నాయి. ప్రస్తుతం ప్రతిపాదించిన ఎయిరిండియా సేల్ మరో కుంభకోణం చోటు చేసుకుంటుందని, ఎవరి ఈ ప్రక్రియ చేస్తున్నారో, ఏం చేస్తున్నారో తాను గమనిస్తున్నానని, ఒకవేళ ఏదైనా నేరం కంటపడితే ప్రైవేట్ క్రిమినల్ లా కంప్లైంట్ దాఖలు చేయనున్నట్టు స్వామి హెచ్చరించారు. ఎయిరిండియా విక్రయంపై మొదటి నుంచి స్వామి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. రూ.52వేల కోట్లకు పైగా రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియాకు 2012లో యూపీఏ ప్రభుత్వం రూ.30వేల కోట్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ కల్పించింది. ఈ నిధులతో సంస్థ నెట్టుకొస్తూ ఉంది. రెండు రోజుల క్రితమే కంపెనీలో వ్యూహాత్మక వాటా విక్రయానికి సంబంధించిన ప్రాథమిక సమాచార పత్రాన్ని కేంద్రం విడుదల చేసింది. దీని ప్రకారం 76 శాతం వాటాలు విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. అలాగే, లాభాల్లో ఉన్న చౌక విమాన సేవల విభాగం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, సింగపూర్‌కి చెందిన ఎస్‌ఏటీఎస్‌తో కలిపి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ ఏఐఏటీఎస్ఎల్లో కూడా డిజిన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. -
రామసేతును కాపాడుతాం
న్యూఢిల్లీ : భారత్-శ్రీలంక మధ్య సముద్రంలో ఉన్న చారిత్రక నిర్మాణమైన రామ సేతును కాపాడుతామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీం కోర్టులో అఫడవిట్ దాఖలు చేసింది. సేతుసముద్రం ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్మణాన్ని ఎట్టి పరిస్థితుల్లో తొలగించబోమని స్పష్టం చేసింది. దేశప్రజల ఆసక్తి దృష్ట్యా ఈ చారిత్రాత్మక నిర్మాణాన్ని ముట్టుకోబోమని, కాపాడటానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపింది. సేతు సముద్రం ప్రాజెక్టుతో రామసేతు నిర్మాణం దెబ్బతింటుందని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ విచారణలో భాగంగా షిప్పింగ్ కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ అఫడవిట్ దాఖలు చేసింది. లంకలో ఉన్న సీత కోసం వానరసేన సాయంతో రాముడే ఈ సేతును నిర్మించినట్లు ప్రచారం జరిగింది. ఇది తమిళనాడులోని రామేశ్వరం దగ్గర్లో ఉన్న పంబన్ దీవి నుంచి శ్రీలంక ఈశాన్య తీరంలోని మన్నార్ దీవి వరకు ఉంది. ఇది సహజసిద్ధంగా ఏర్పడిందని కొందరు వాదించినా.. అదంతా ఉత్తదే అని చాలాసార్లు తేలిపోయింది. -
శ్రీదేవి మృతిపై సుబ్రహ్యణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు
-
నిర్మలా సీతారామన్‌ను టార్గెట్ చేసిన స్వామి
సాక్షి,న్యూఢిల్లీ : కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తన పదవికి రాజీనామా చేయాలన్నారు. జమ్మూ కాశ్మీర్ షోపియాన్‌లో సైన్యం కాల్పులు..సామాన్య ప్రజలు మరణించిన ఘటనలో మేజర్ ఆదిత్యకుమార్‌పై చట్టపరమైన చర్యలపై సుప్రీంకోర్టు మద్యంతర స్టే విధించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీం తాజా వ్యాఖ్యల అనంతరం ఆమె రాజీనామా చేయాలని కోరాలన్నారు. కాల్పులు జరిగిన సమయంలో తన కొడుకు (ఆదిత్య) ఘటనాస్థలంలో లేడని..అతనిపై నమోదైన కేసును కొట్టివేయాలని మేజర్ ఆదిత్యా తండ్రి లెఫ్టినెంట్ కల్నల్ కరమ్‌వీర్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన సుప్రీం కేసు విచారణఫై సోమవారం మధ్యంతరం స్టే విధించింది. సైన్యంపై రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేస్తుందని ప్రశ్నించింది. అలాగే ఈ కేసులో తమ వైఖరి వెల్లడించాల్సిందిగా, జమ్ముకశ్మీర్ ప్రభుత్వాన్ని, కేంద్రాన్నికోరింది. రెండు వారాల్లో తమ స్పందన తెలియచేయాలని నోటీసులు జారీ చేసింది. దీనిపై సీనియర్ న్యాయవాది ముకుల్ రోహతగి మాట్లాడుతూ ఈ కేసును హైకోర్టులో విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. ఎఫ్ఐఆర్పై విచారణను ఆపివేయడం తోపాటు.. కర్తవ్య నిర్వహణలో భాగంగా తీసుకున్న మేజర్ ఆదిత్య చర్యపై కేంద్ర ప్రభుత్వం లేదా జమ్మూకశ్మీర్ పోలీసులు యాక్షన్ తీసుకోలేవని కోర్టు పేర్కొందని చెప్పారు. మరోవైపు ఇది ఆర్మీకి సానుకూలమైన ప్రోత్సాహకరమైన రోజంటూ కరమ్ంసింగ్ న్యాయవాది ఐశ్వర్య భాటి సంతోషం వ్యక్తం చేశారు. పిటీషన్ కాపీని భారత అటార్నీ జనరల్ కార్యాలయానికి అందించాలని తమను కోరిందని చెప్పారు. కాగా జనవరిలో షోపియాన్‌లో ఆందోళనకారులపై కాల్పులు, ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో మేజర్ ఆదిత్యాకుమార్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. : Nirmala Sitaraman should be asked to resign after SC’s remarks on the FIR — Subramanian Swamy (@Swamy39) February 12, 2018 -
వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్
సాక్షి, శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మెహబూబాపై బీజేపీ నేత, ఎంపీ సుబ్రమణియన్ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సైన్యం పై కేసు నమోదు చేయటం ఏంటని? ఆయన కశ్మీర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంగళవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సైన్యంపైనే కేసా? ఆమె తీసుకున్న నిర్ణయం అర్థం పర్థం లేనిది. ఈ అంశంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి. తక్షణమే కేసు వెనక్కి తీసుకోకపోతే.. విచక్షణ అధికారాలను ఉపయోగించి ప్రభుత్వాన్ని రద్దు చెయ్యండి’’ అని సుబ్రమణియన్ స్వామి వ్యాఖ్యానించారు. కాగా, ఈ వివాదం ఇప్పుడు పీడీపీ-బీజేపీ మిత్రపక్షం మధ్య చిన్నగా చిచ్చును రాజేస్తోంది. మెహబూబా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేబినెట్ నుంచి బయటకు వచ్చేందుకు బీజేపీ నేతలు సిద్ధం కావటం కలకలం రేపింది. అయితే అధిష్ఠానం సూచనలతో వారు వెనక్కి తగ్గినట్లు సమాచారం. అసలేం జరిగింది... దక్షిణ కశ్మీర్ షోపియాన్ జిల్లాలోని గోవాంపురా ప్రాంతంలో శనివారం సైనిక వాహన శ్రేణిపై దాదాపు 250 మందికి పైగా నిరసనకారులు రాళ్లు రువ్వారు. అంతేకాదు ఒక అధికారి నుంచి ఆయుధాన్ని లాక్కునేందుకు ప్రయత్నించడంతో వారిపై సైనికులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. దీంతో లోయలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జవాన్ల కాల్పుల్లో పౌరుల మృతికి నిరసనగా వేర్పాటువాదులు ఒక్క రోజు బంద్‌కు పిలుపునిచ్చారు. ఘటనపై పూర్తి నివేదిక సమర్పించమని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సైన్యాన్ని ఆదేశించారు. మరోవైపు కాల్పుల జరిపిన సైన్యంపై జమ్మూ కశ్మీర్ పోలీసులు కేసు నమోదుచేశారు. గర్వాల్ 10 బెటాలియన్‌పై హత్య, హత్యాయత్నం కేసును నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. -
నేషనల్ హెరాల్డ్ కేసులో అనూహ్య మలుపు
సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ శనివారం అనూహ్య మలుపు తిరిగింది. కేసు విచారణను ప్రారంభించిన పటియాలా కోర్టుకు బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి ఆదాయ పన్ను శాఖ(ఐటీ) ఆదేశాలను సమర్పించారు. ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ పెద్ద తలకాయలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 2012లో రూ. 90.25 కోట్ల రుణాన్ని వడ్డీ లేకుండా నేషనల్ హెరాల్డ్ న్యూస్‌పేపర్‌ను నడుపుతున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందంటూ సుబ్రమణియన్ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. అందులో సోనియా, రాహుల్, మోతీలాల్ వోరాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2016లో స్వామి పిటిషన్‌పై స్పందించాలంటూ కోర్టు సోనియా, రాహుల్‌లను న్యాయస్థానం కోరింది. దీంతో గతేడాది నవంబర్‌లో రాహుల్, ఆయన తల్లి సోనియాలు కోర్టులో స్వామి పిటిషన్‌పై కౌంటర్‌ను దాఖలు చేశారు. శనివారం పటియాలా కోర్టు ఈ కేసులో విచారణను ప్రారంభించగా.. తన పిటిషన్‌ను బలపర్చుతూ స్వామి ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన ఆదేశాల పత్రాలను ఆధారాలుగా సమర్పించారు. రూ. 414 కోట్ల పన్నును కాంగ్రెస్ పార్టీ చెల్లించాలని కోర్టులో వాదించారు. -
‘స్వలింగ సంపర్కం’పై స్వామి ఏమన్నారంటే..
సాక్షి, న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కులతోపాటు, స్త్రీ, పురుషుల మధ్య అసహజ శృంగారానికి అడ్డుకట్ట వేస్తున్న భారతీయ శిక్షా స్మతిలోని 377వ సెక్షన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పునర్ పరిశీలించేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి స్వలింగ సంపర్కం (మగ-మగ, ఆడ-ఆడ మధ్య శృంగారం), ఎల్జీబీటీల అంశంపై స్పందించారు. ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందినవారు ఏం చేసినా వ్యక్తిగత విషయంగా ఉండాలని, కానీ పబ్లిక్ లో ఆ విషయాన్ని బహిరంగంగా వెల్లడించడంలాంటివి చేస్తే శిక్షించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. జన్యు పరమైన లోపాల కారణంగానే స్వలింగ సంపర్కులుగా తయారవుతారని చెప్పారు. తమ జెండర్ (హోమో సెక్స్‌వల్) పలానా అని, తాము పలానా కమ్యూనిటీ(ఎల్జీబీటీ) వ్యక్తులతో శృంగారంలో పాల్గొంటామని బహిర్గతం చేయడం చేస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచంలో సగానికి పైగా దేశాలు స్వలింగ సంపర్క వివాహాలను వ్యతిరేకిస్తున్నారని స్వామి గుర్తుచేశారు. మనుషులు సాధారణంగా హమో సెక్స్‌వల్స్‌గా మారడం లేదని, జన్యుపరమైన లోపాలు అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోందని బీజేపీ సీనియర్ నేత పేర్కొన్నారు. -
ఇదే మంచి తరుణం
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాతో ద్వైపాక్షి సంబంధాలను మరింత ధృఢతరం చేసుకోవడానికి భారత్‌కు ఇదే మంచి తరుణమని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందన్న కారణంతో అమెరికా ఆ దేశానికి నిధులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్వామి ఇటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు భారత్ మరింత దగ్గరయ్యేందుకు ఇంతకుమించిన మంచి సమయం మరొకటి లేదని ఆయన అన్నారు. భారత్ వెంటనే తన రాయబార కార్యలయాన్ని టెల్ అవైవ్ నుంచి జెరూలసలేంకు మార్చడం మంచిదని ఆయన మరోసారి సూచించారు. ఈ చర్యతో పాకిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టడంతో పాటు.. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు మరింత దగ్గరకావొచ్చన్న భావనను ఆయన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు 15 ఏళ్లుగా అమెరికా లక్షలకోట్ల రూపాయల నిధులు విడుదల చేసినా.. ఆ దేశం తమకు అబద్దాలను చెప్పిందన్న ట్రంప్ ట్వీట్‌ను సుబ్రమణ్య స్వామి స్వాగతించారు. అమెరికా ఇప్పటికైనా నిజాలు గ్రహించిందని వ్యాఖ్యానించారు. -
రజనీ ప్రకటన.. స్వామి రియాక్షన్
సాక్షి, చెన్నై : రజనీకాంత్ రాజకీయాలపై ఇలా ప్రకటన చేశాడోలేదో.. వెంటనే బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి స్పందించారు. కాసేపటి క్రితం ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన మరోసారి రజనీపై విమర్శలు చేశారు. ‘‘రజనీ రాజకీయాల్లోకి వస్తానని మాత్రమే చెప్పాడు. అంతకు మించి వేరే ఏ వివరాలు చెప్పలేకపోయాడు. అతనో నిరక్షరాస్యుడు. ఇదంతా మీడియా హైప్ మాత్రమే. తమిళ ప్రజలను రజనీ తక్కువగా అంచనా వేస్తున్నారు. కానీ, ఆయన అనుకుంటున్నట్లు వారు అంత తెలివి తక్కువోళ్లు కాదు. చాలా తెలివైన వాళ్లు. ఎప్పుడెలా స్పందించాలో వాళ్లకు బాగా తెలుసు’’ అని స్వామి వ్యాఖ్యలు చేశారు. కాగా, గతంలోనూ స్వామి రజనీకాంత్‌ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కూడా. రజనీకాంత్ రాజకీయాలకు సరిపోడని..రాజకీయాల్లో ఎలా మెలగాలన్న జ్ఞానం తలైవాకు లేదని. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఇబ్బందికర పరిస్ధితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని స్వామి హెచ్చరించారు కూడా.