కేంద్ర మాజీమంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరని, ఆయన అసత్యాలకూ ఓ చరిత్ర ఉందని ప్రముఖ న్యాయవాది, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్ స్వామి తీవ్రస్థాయిలో ఆరోపించారు. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం హోదాలోని వ్యక్తి ప్రచారం చేయడాన్ని ఖండించారు. చంద్రబాబు దు్రష్పచారాన్ని శ్రీవారి భక్తులెవరూ నమ్మొద్దన్నారు.
స్వార్థ రాజకీయాల కోసం శ్రీవారిని ఉపయోగించుకోవడం మహా పాపమంటూ చంద్రబాబుకు హితవు పలికారు. తిరుమల లడ్డూ వివాదంపై దర్యాప్తు జరపాలని కోరుతూ సుబ్రమణియన్ స్వామి సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్‌తో కాకుండా సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలని తాను ‘సుప్రీం’ను ఆశ్రయించినట్లు సుబ్రమణియన్ స్వామి మీడియాకు చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
బాబు మాటలకు, పనులకు పొంతన ఉండదు..
చంద్రబాబును నేను ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్నా. ఆయన చేసే పనులకు, చెప్పే మాటలకు పొంతన ఉండదు. గతంలో ఏసుక్రీస్తు ఫొటోలున్నాయని.. కొండపై ఏదో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ అప్పటి సీఎం వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసి ఇలాగే దు్రష్పచారానికి శ్రీకారం చుట్టారు. దీనిపై హైకోర్టుకు ఆధారాలను చూపించలేకపోయారు. నిజానికి.. చాలాఏళ్లుగా టీటీడీలో ఓ విధానం ఉంది.. అంత తేలిగ్గా ఎలా నెయ్యికల్తీ జరుగుతుంది?
సిట్‌తో కాదు.. ‘సుప్రీం’తో విచారణ జరిపించాలి..
చంద్రబాబే ఆరోపణలు చేసి ఆయనే తన సిట్‌తో విచారణ జరిపించడం అనేది సరైంది కాదు. చంద్రబాబు చీప్‌ట్రిక్స్ అన్నీ బయటకు రావాలంటే ఆయన సిట్‌తో కాకుండా సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలి. ఎందుకంటే.. సిట్ పోలీసులు కేవలం సమాచారం మాత్రమే సేకరిస్తారు.. అదే సుప్రీంకోర్టు అయితే కల్తీ జరిగిందా లేదా అనేది తేలుస్తుంది.
అలాగే, ఈ వ్యవహారానికి గల కారణాలు, వెనుక ఎవరున్నారు, ఎందుకు చేశారు అనే విషయాలూ వెలుగులోకి వస్తాయి. అప్పుడు సీబీఐ విచారణ అవసరం ఉండే అవకాశాలు ఉంటాయి. ఇలా ఇన్ని అబద్ధాలు ఆడుతూ, చీప్‌ట్రిక్స్‌కు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు ఉండదు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న అందరినీ జైలుకు పంపే కుట్రలో భాగమే ఈ చిల్లర రాజకీయాలు.
Comments
Please login to add a commentAdd a comment