చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు బతకదు: సుబ్రహ్మణ్యస్వామి | Subramanian Swamy Files Pil In Supreme Court For Tirupati Laddu Row latest updates | Sakshi
Sakshi News home page

శ్రీవారి భక్తులెవరూ చంద్రబాబు మాటలను నమ్మొద్దు: సుబ్రహ్మణ్యస్వామి

Sep 23 2024 5:01 PM | Updated on Sep 23 2024 6:16 PM

Subramanian Swamy Files Pil In Supreme Court For Tirupati Laddu Row latest updates

న్యూఢిల్లీ,సాక్షి : శ్రీవారి లడ్డు వివాదంపై దర్యాప్తు జరపాలని కోరుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సుప్రీం కోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ పిల్‌ వచ్చే శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చే అవకాశం రానుంది. ఈ తరుణంలో తిరుమల లడ్డుపై రాజకీయం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుపై సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాక్షి టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. గతంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ గురించి గతంలో లేనిపోని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు నియమించిన సిట్‌తో కాకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలి. ఈ కేసులో దోషులెవరో తేలాలి. ఈ కేసును తేల్చాల్సింది న్యాయస్థానంలోనే. చంద్రబాబు నియమించిన సిట్‌తో కాదు.  

శ్రీవారి భక్తులెవరూ చంద్రబాబు మాటలను నమ్మొద్దు. ఈ అంశంపై సుప్రీంకోర్టు త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. తన రాజకీయ స్వార్థం కోసం శ్రీవారిని ఉపయోగించుకోవడం చంద్రబాబు చేస్తున్న మహా పాపం. శ్రీవారిపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు ఓటమి తప్పదు. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు బతకదు. కల్తీ జరిగిందా లేదా అనేది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ తేలుస్తుంది’ అని సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. 

ఆయన చరిత్ర నాకు తెలుసు సుబ్రహ్మణ్యస్వామి హాట్ కామెంట్స్

Advertisement
 
Advertisement
Advertisement