న్యూఢిల్లీ, సాక్షి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టులో వరుస పిటిషన్‌లు దాఖలవుతున్నాయి. చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆ వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ విషయాన్ని ఎక్స్ వేదికగానూ సుబ్రహ్మణ్యస్వామి స్వయంగా తెలియజేశారు. తిరుపతి తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. ప్రసాదం కలుషితమైందన్న ఆయన వ్యాఖ్యలు భక్తుల్లో ఆందోళన రేకెత్తించాయి. అందుకే దర్యాప్తునకు ఆదేశించేలా సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాను అని పోస్ట్ చేశారాయన.
Today I filed a PIL seeking Supreme Court direction to investigate unsubstantiated allegation by CM C.B. Naidu that the Tirupati Tirumala Temple Prasadam were adulterated with meat of animals and other rotten items creating chaos almost bhaktas
— Subramanian Swamy (@Swamy39) September 23, 2024
వైవీ సుబ్బారెడ్డి పిటిషన్
మరోవైపు వైస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సైతం సుప్రీంలో పిల్ వేశారు. చంద్రబాబు వ్యాఖ్యల సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని ఆయన పిటిషన్‌లో సుప్రీంను అభ్యర్థించారు.
అంతకు ముందు.. తిరుమల లడ్డూ వివాదంపై సురేష్ ఖండేరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో సీబీఐ లేదంటే ఇతర కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని, దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్వహణకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని ఆయన తన పిటిషన్ ద్వారా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment