తాడేపల్లి, సాక్షి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ప్రచారంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లడ్డూ కల్తీ జరిగిందన్న ఆధారాల్లేకుండా.. పైగా దర్యాప్తు ఇంకా మొదలుకాకముందే మీడియా ముందుకు వచ్చి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని? నిలదీసింది. దేవుడ్ని రాజకీయంలోకి లాగొద్దంటూ చురకలంటించింది. ఈ తాజా పరిణామాలపై వైఎస్సార్‌సీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు..
- పదవీ ఉందని పెదవి జారితే..అబద్ధాని నిజం చేయాలని చూస్తే.. భక్త ద్రోహం చేయాలని చూస్తే ఇలానే ఉంటుంది
- మహాప్రసాదం కు మలినం అంటగట్టాలని చూస్తే సుప్రీం కోర్టు స్పందించిన తీరు ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు
- మొత్తం ప్రపంచ వ్యాప్తంగా హిందుత్వ సంఘాలు ఆందోళనకు గురయ్యాయి.
- సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు శ్రీవారి ప్రసాదం పై బాధించింది
- ఈవో చెప్పిన మాటలకు భిన్నంగా మాట్లాడుతూ.. జంతువులు కొవ్వు వాడారు అని ఎలా చెబుతారు
- తప్పు జరిగింది అంటూ ఎల్లో మీడియా విష ప్రచారం చేశారు
- మహా ప్రసాదం.. మహా మాలిన్యం అయింది అంటూ ప్రచారం చేశారు
- స్వామి ప్రతిష్ఠ కు భంగం వాటిల్లే విధంగా లడ్డు ప్రసాదం విషయంలో అసత్యాలు ప్రచారం చేశారు
- దేవుడ్ని వివాదాల్లో తీసుకుని రాకండని ఎంత చెప్పినా వినలేదు
- కేసు పెట్టకుండా,విచారణ జరపకుండా చంద్రబాబు మాట్లాడాడు.
- సీఎం హోదాలో ఉంటూ అసత్య లు మాట్లారు..
- సుప్రీంకోర్టు సరైనా విధంగా ప్రశ్నించింది... దేవుడే సుప్రీంకోర్టుతో మాటలు పలికించారు..
- నిజం ఎప్పటికి గెలుస్తుంది.. తప్ప చేయాలేదు కాబట్టే దైర్యం మేము విచారణ కోరాం
- స్వామీవారి వైభవాన్ని తగ్గించే విధంగా చంద్రబాబు, పవన్ మాట్లాడుతున్నారు
- బాబు, పవన్ లను హిందువులందరూ ఛీ కోడుతున్నారు
:::భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్
- చంద్రబాబు ఇప్పటికైనా శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలి
- కోట్లాది మంది భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారు
- సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు మాటలను తప్పుపట్టింది
- చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్‌తో విచారణ చేస్తే వాస్తవాలు వెల్లడి కావు
- స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలి
- చంద్రబాబును కూడా ఆ విచారణ సంస్థ ప్రశ్నించాలి
- సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలనేది మా డిమాండ్
- తప్పుడు ఆరోపణలు చేసి భక్తుల మనోభవాలతో ఆడుకోవద్దని చంద్రబాబు, పవన్ ను కోరుతున్నాను
- NDDB రిపోర్ట్ టీడీపీ కార్యాలయంలో విడుదల చేయటంపై విచారణ జరగాలి
- సుప్రీం కోర్టు విచారణలో వాస్తవాలు బయటకు వస్తున్నాయి
- రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదు
- చంద్రబాబు తరఫు న్యాయవాదులు కూడా కల్తీ జరిగిందనే ఆరోపణలు ఉన్న నెయ్యిని వాడలేదని కోర్టులో చెప్పారు
- సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యతా రాహిత్యంగా మాట్లాడారు
- సిట్ వేయాల్సిన అవసరం ఏంటి, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది
- మూడో తారీఖున జరిగే విచారణలో నిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నాను
- తిరుమల శ్రీవారితో రాజకీయాలు చేయవద్దని చంద్రబాబును కోరుతున్నాను
- సుప్రీంకోర్టు విచారణ ద్వారా అనేక అనుమానాలు తొలిగాయి
::: వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి
తిరుమల లడ్డు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని స్వాగతిస్తున్నా. చంద్రబాబు కనుసైగల్లో సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అంటూ వ్యవహరించే టీమ్ పై తమని ఏమాత్రం నమ్మకం లేదు. ఈ కేసులో సుప్రీం కోర్టు కలగజేసుకోవాలి ..
::: ఆర్కే రోజా, మాజీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment