Velampalli Srinivas
-
సోషల్ మీడియా సైనికులను కేసులతో భయపెట్టలేరు: వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. అక్రమ కేసులపై పోలీస్ కమిషనరేట్‌లో వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్.. పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు.. డీసీపీకి వినతిపత్రం అందించారు.కూటమి ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోంది: దేవినేని అవినాష్ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో పోలీసుల తీరు సరిగాలేదు. నందిగామ నియోజకవర్గం పెండ్యాలలో 150 మందికి నోటీసులిచ్చారు. అక్రమ కేసులు బనాయించి కూటమి ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోంది. సోషల్ మీడియా కార్యకర్తలకు మేం అండగా ఉంటాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా మేం తోడుగా ఉంటాం.తక్షణమే అక్రమ కేసులు, దాడులు ఆపాలి: వెల్లంపల్లి శ్రీనివాస్ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని సోషల్ మీడియా కార్యకర్తల పై అక్రమంగా కేసులు పెట్టారు. వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టినా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నోటీసులిచ్చి.. అరెస్టులు చేస్తున్నారు. ప్రశ్నించే గొంతుక ఉండకూడదని అక్రమంగా కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. తప్పుడు కేసులను ప్రోత్సహించొద్దని పోలీసులను కోరుతున్నాం. కేసుల పేరుతో పూటకో స్టేషన్ మార్చి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ప్రశ్నించే గొంతుకను అణచివేస్తే తిరగబడే రోజు కచ్చితంగా వస్తుందిఅన్యాయంపై ప్రశ్నిస్తే తప్పా: మల్లాది విష్ణుప్రతిపక్షం గొంతు నొక్కాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై టీడీపీ అనేక అబద్ధపు ప్రచారాలు చేసింది. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి విజయవాడలో కేసులు పెడుతున్నారు. 90 మంది మహిళలకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే తప్పా. ఇచ్చిన హామీలు నెరవేర్చమని కోరడం తప్పా. కూటమి ప్రభుత్వం తీరు మారకపోతే ఛలో అసెంబ్లీ చేపడతాం. హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా?కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్: దొడ్డా అంజిరెడ్డికూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. తిరువూరులో ఇద్దరు విద్యార్థులపై అక్రమంగా కేసులు పెట్టారు. దివ్యాంగులను కూడా వదలడం లేదు. సోషల్ మీడియా సైనికులను కేసులతో భయపెట్టలేరు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్సీపీ పూర్తిగా అండగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం తప్పిదాలను ఎండగడతాం -
‘‘చంద్రబాబూ.. ఇప్పటికైనా క్షమాపణలు చెప్పు’’
తాడేపల్లి, సాక్షి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ప్రచారంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లడ్డూ కల్తీ జరిగిందన్న ఆధారాల్లేకుండా.. పైగా దర్యాప్తు ఇంకా మొదలుకాకముందే మీడియా ముందుకు వచ్చి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని? నిలదీసింది. దేవుడ్ని రాజకీయంలోకి లాగొద్దంటూ చురకలంటించింది. ఈ తాజా పరిణామాలపై వైఎస్సార్సీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు.. పదవీ ఉందని పెదవి జారితే..అబద్ధాని నిజం చేయాలని చూస్తే.. భక్త ద్రోహం చేయాలని చూస్తే ఇలానే ఉంటుందిమహాప్రసాదం కు మలినం అంటగట్టాలని చూస్తే సుప్రీం కోర్టు స్పందించిన తీరు ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారుమొత్తం ప్రపంచ వ్యాప్తంగా హిందుత్వ సంఘాలు ఆందోళనకు గురయ్యాయి.సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు శ్రీవారి ప్రసాదం పై బాధించిందిఈవో చెప్పిన మాటలకు భిన్నంగా మాట్లాడుతూ.. జంతువులు కొవ్వు వాడారు అని ఎలా చెబుతారుతప్పు జరిగింది అంటూ ఎల్లో మీడియా విష ప్రచారం చేశారుమహా ప్రసాదం.. మహా మాలిన్యం అయింది అంటూ ప్రచారం చేశారుస్వామి ప్రతిష్ఠ కు భంగం వాటిల్లే విధంగా లడ్డు ప్రసాదం విషయంలో అసత్యాలు ప్రచారం చేశారుదేవుడ్ని వివాదాల్లో తీసుకుని రాకండని ఎంత చెప్పినా వినలేదుకేసు పెట్టకుండా,విచారణ జరపకుండా చంద్రబాబు మాట్లాడాడు.సీఎం హోదాలో ఉంటూ అసత్య లు మాట్లారు..సుప్రీంకోర్టు సరైనా విధంగా ప్రశ్నించింది... దేవుడే సుప్రీంకోర్టుతో మాటలు పలికించారు..నిజం ఎప్పటికి గెలుస్తుంది.. తప్ప చేయాలేదు కాబట్టే దైర్యం మేము విచారణ కోరాంస్వామీవారి వైభవాన్ని తగ్గించే విధంగా చంద్రబాబు, పవన్ మాట్లాడుతున్నారుబాబు, పవన్ లను హిందువులందరూ ఛీ కోడుతున్నారు:::భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ చంద్రబాబు ఇప్పటికైనా శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలికోట్లాది మంది భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారుసుప్రీంకోర్టు కూడా చంద్రబాబు మాటలను తప్పుపట్టిందిచంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్‌తో విచారణ చేస్తే వాస్తవాలు వెల్లడి కావుస్వతంత్ర సంస్థతో విచారణ జరపాలిచంద్రబాబును కూడా ఆ విచారణ సంస్థ ప్రశ్నించాలిసుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలనేది మా డిమాండ్తప్పుడు ఆరోపణలు చేసి భక్తుల మనోభవాలతో ఆడుకోవద్దని చంద్రబాబు, పవన్ ను కోరుతున్నానుNDDB రిపోర్ట్ టీడీపీ కార్యాలయంలో విడుదల చేయటంపై విచారణ జరగాలిసుప్రీం కోర్టు విచారణలో వాస్తవాలు బయటకు వస్తున్నాయిరాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదుచంద్రబాబు తరఫు న్యాయవాదులు కూడా కల్తీ జరిగిందనే ఆరోపణలు ఉన్న నెయ్యిని వాడలేదని కోర్టులో చెప్పారుసీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యతా రాహిత్యంగా మాట్లాడారుసిట్ వేయాల్సిన అవసరం ఏంటి, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించిందిమూడో తారీఖున జరిగే విచారణలో నిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నానుతిరుమల శ్రీవారితో రాజకీయాలు చేయవద్దని చంద్రబాబును కోరుతున్నానుసుప్రీంకోర్టు విచారణ ద్వారా అనేక అనుమానాలు తొలిగాయి::: వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి తిరుమల లడ్డు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని స్వాగతిస్తున్నా. చంద్రబాబు కనుసైగల్లో సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అంటూ వ్యవహరించే టీమ్ పై తమని ఏమాత్రం నమ్మకం లేదు. ఈ కేసులో సుప్రీం కోర్టు కలగజేసుకోవాలి ..::: ఆర్కే రోజా, మాజీ మంత్రి -
అదో విఫల గళం
సాక్షి, అమరావతి: నారా లోకేశ్ పాదయాత్రకు బాహుబలి స్థాయిలో బిల్డప్‌లు ఇచ్చేందుకు చంద్రబాబు, ఎల్లో మీడియా ఎంత ప్రయత్నించినా ప్రజలు జోకర్‌గానే భావిస్తున్నారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ సమన్వయకర్త(విజయవాడ తూర్పు) దేవినేని అవినాశ్ వ్యాఖ్యానించారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. పాదయాత్రకు ప్రజా స్పందన లేకపోవడంతో చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్‌ను రంగంలోకి దించారని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ సైకోల్లా ప్రవర్తిస్తుండటం వల్లే వారిని ప్రజలు ఆదరించడం లేదన్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో ప్రజలు మెచ్చేలా పరిపాలిస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రభంజనంలో ఆ ముగ్గురూ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ఆ ముగ్గురూ ద్రోహులే: వెలంపల్లి శ్రీనివాస్ అధికారంలో ఉండగా విజయవాడ, గుంటూరు ప్రాంతాలను ఏమాత్రం అభివృద్ధి చేయకుండా చంద్రబాబు, లోకేశ్ ద్రోహం చేశారు. టీడీపీ సర్కార్‌కు మద్దతిచ్చిన పవన్‌కళ్యాణ్ కూడా ద్రోహే. ఆ ముగ్గురూ కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో 45 దేవాలయాలను కూల్చేసిన హిందూ ద్రోహులు. మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు విగ్రహాలను సైతం ధ్వంసం చేసిన ద్రోహులు. కుల మతాలు, పార్టీలకు అతీతంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. వాటిని పొందిన వారిలో టీడీపీ నేతలు వర్ల రామయ్య, బుద్దా వెంకన్న కూడా ఉన్నారు. లోకేశ్ పాదయాత్రకు టీడీపీ నేతలు కూడా స్పందించడం లేదు. టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీల్లో కేశినేని నాని, గల్లా జయదేవ్.. లోకేశ్ పాదయాత్రను బహిష్కరించారు. లోకేశ్ పాదయాత్రపై చంద్రబాబుకు నమ్మకం ఉంటే 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీకి పెట్టే దమ్ము పవన్‌కు ఉందా? రాజకీయాల్లో జీరో అయిన పవన్ ఇప్పుడు సినిమాల్లో కూడా జీరో అయిపోయారు. ఆ ముగ్గురూ సన్నాసులు కాబట్టే కలసి పోటీ చేసి జగన్‌ను ఎదుర్కోవాలని ప్రయత్నిస్తున్నారు. విదేశీ విద్య పథకం ద్వారా ఆర్య వైశ్యుల పిల్లలను కూడా విదేశాలకు పంపిన ఘనత సీఎం జగన్‌ది. పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగం ఫలితంగా నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరిస్తే రాష్ట్ర అవతరణ దినాన్ని జూన్ 2కు మార్చింది చంద్రబాబే. దాన్ని మళ్లీ మార్చి నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవాన్ని సీఎం జగన్ నిర్వహిస్తున్నారు. బ్యారేజ్‌పై ఫొటో షూట్‌కు రూ.5 కోట్లు: మల్లాది విష్ణు టీడీపీ హయాంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రకాశం బ్యారేజీ మీదుగా వెళ్తామంటే అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారు. నల్ల బెలూన్లతో నిరసన తెలిపి పసుపు నీళ్లతో కడిగే స్థాయికి దిగజారిపోయారు. ఇప్పుడు లోకేశ్ పాదయాత్రను మేం ఎక్కడన్నా అడ్డుకునే ప్రయత్నం చేశామా? డబ్బులు, మద్యాన్ని పంచి పెయిడ్ వర్కర్లతో ప్రకాశం బ్యారేజ్‌పై ఈవెనింగ్ వాక్ చేసిన లోకేశ్ ఫొటో షూట్‌కు రూ.5 కోట్లు ఖర్చు పెట్టారు. విజయవాడ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన రూ.500 కోట్లను దారి మళ్లించి ద్రోహం చేసింది చంద్రబాబే. దొంగ టీడీఆర్ బాండ్లను తయారు చేసి అమ్మిన పార్టీ టీడీపీ. అమ్మవారి దేవాలయంలో క్షుద్ర పూజలు చేసిన వ్యక్తి లోకేశ్. బ్రాహ్మణ వీధిలో గోశాలను కూలగొట్టి గోవులకు నిలువ నీడ లేకుండా చేశారు. నదీ తీరంలో పురోహితులకు చోటు లేకుండా చేసిన ఘనత కూడా టీడీపీదే. మేం 11 అంశాలతో రూపొందించిన చార్జ్షిట్కు లోకేశ్, చంద్రబాబు సమాధానం చెప్పాలి. జగనన్న కాలనీల ద్వారా విజయవాడలో 90 వేల మందికి ఇళ్ల స్థలాలు అందించిన ఘనత సీఎం జగన్‌ది. టీడీపీ పాలనలో వైశ్యులు, ముస్లింలు, బ్రాహ్మణులకు ఏం చేశారో లోకేశ్ చెప్పాలి. ఆర్–5 జోన్లో విజయవాడకు చెందిన 30 వేల మందికి సీఎం జగన్ ఇళ్ల పట్టాలిస్తుంటే వాటిని రద్దు చేస్తానని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబు, లోకేశ్, పవన్ ముగ్గురూ సైకోలే. విజయవాడ నగరం వైఎస్సార్సీపీ అడ్డా. ఎర్ర పుస్తకం పట్టుకుని సైకోలా: దేవినేని అవినాశ్ పెయిడ్ వర్కర్లతో ఈవెనింగ్ వాక్ చేస్తున్న లోకేశ్‌కు 2014–19 మధ్య ప్రజలకు ఏం చేశారో చెప్పే దమ్ముందా? ఎర్ర పుస్తకం పట్టుకుని సైకోలా ఊగిపోతున్నాడు. లోకేశ్ యాత్ర వల్ల చంద్రబాబు సీఎం కాలేరు. లోకేశ్ ఎమ్మెల్యే కాలేడు. చంద్రబాబూ? ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది. గత నాలుగేళ్లలో సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో విజయవాడ నగరం మౌలిక సదుపాయాల కల్పనతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిటైనింగ్ వాల్, ఫ్లైఓవర్లు వంటి అనేక నిర్మాణాలు పూర్తి చేశారు. పాదయాత్రలో లోకేశ్ వాటిని చూడాలి. టీడీపీ హయాంలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌ను సింగపూర్ కంపెనీకి కట్టబెట్టాలని చూస్తే ఇప్పుడు సీఎం జగన్ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. -
బాబు దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్‌లో బయటికొచ్చాడు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్‌లో బయటికి వచ్చి.. సంక్షేమ పాలన అందిస్తున్న ప్రభుత్వంపై అక్కసు వెల్లగక్కుతున్నాడని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్లో గడప గడపకూ మన ప్రభుత్వంలో పాల్గొన్న వెలంపల్లి.. పవన్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్ లో బయటికి వచ్చాడు. ప్రజారాజ్యం పార్టీలో అసలైన కోవర్ట్ పవన్ కళ్యాణే. చిరంజీవికి అధికారం రాలేదని.. ఆయన్ని పక్కకి పెట్టింది పవనే. ప్రజారాజ్యానికి 18 సీట్లు వచ్చాయని అసలు పార్టీలో కనపడకుండా పోయాడు. నాడు ప్రజారాజ్యం ను విలీనం చేయవద్దని పవన్ ఎందుకు చెప్పలేకపోయాడు?. అసలు ప్రజారాజ్యం పార్టీ విలీనానికి కారణమే పవన్ కళ్యాణ్. మేం పిలుస్తున్నా పవనే రావడం లేదని స్వయంగా నాగబాబు.. మెగా అభిమానుల మధ్య చెప్పాడు.. చిరంజీవి లేకపోతే పవన్ ఎక్కడున్నాడు?. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే పవన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ, పవన్ కల్యాణ్ కార్పొరేటర్‌గా కూడా గెలవలేడు అని వెల్లంపల్లి జోస్యం చెప్పారు. ఇక ఎలాంటి తారతమ్యాలు లేకుండా సంక్షేమ పథకాలను అర్హులకు అందిస్తున్న ప్రభుత్వం తమదని.. పథక లబ్ధి అందుకుంటున్న వాళ్లలో టీడీపీ కార్యకర్తలు కూడా ఉంటున్నారని ఆయన గుర్తు చేశారు. కేశినేని నాని ఏ పార్టీలో ఉన్నారో ఎవరికీ తెలియదని, ఎంపీగా ఉన్నా నియోజకవర్గానికి ఏమీ చేయడం లేదని విమర్శించారు. ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి,ఎం.ఎల్.సి. రూహుల్లాహ్,కార్పొరేటర్ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీతో పవన్‌లో ఫ్రస్ట్రేషన్ -
‘మాన్సాస్’ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు వెళ్తాం
సాక్షి, అమరావతి: మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ట్రస్ట్ పరిధిలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ట్రస్ట్ విషయంలో కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామన్నారు. ఏదైనా చట్టప్రకారమే అన్నీ జరుగుతాయని చెప్పారు. ఈ మేరకు సోమవారం మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ట్విట్టర్ పిల్లాడు లోకేష్ ప్రతి దాంట్లో వేలు పెడతాడని.. మాన్సాస్ ట్రస్ట్ గురించి ఆయనకు ఏమి తెలుసని ప్రశ్నించారు. లోకేష్ ఈ విషయం గురించి మాట్లాడటానికి అటు పిల్లాడు కాదు.. ఇటు పెద్దవాడు కాదని ఎద్దేవా చేశారు. ఒక కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చినంత మాత్రాన లోకేష్ గెలిచినట్టు కాదన్నారు. మాన్సాస్‌లో జరిగిన అక్రమాలను గుర్తించి చర్యలు చేపడుతున్నామన్నారు. ఏది చేసినా చట్టప్రకారం, న్యాయబద్ధంగా చేస్తామని తెలిపారు. బ్రహ్మంగారి మఠం విషయంలో చట్టప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు. వీలునామా చట్టప్రకారం 90 రోజుల్లో ధార్మిక పరిషత్‌కు చేరాలన్నారు. పీఠాధిపతులతో కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రూల్స్ ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు. శివస్వామి ముందుగా తన నిర్ణయం ప్రకటించడం సరికాదన్నారు. విషయం తేలే వరకు అక్కడ ఇన్‌చార్జ్‌ను నియమించామన్నారు. -
సింహం ప్రతిమలు మాయం, మంత్రి పర్యటన
సాక్షి, విజయవాడ: బెజవాడ దుర్గమ్మ గుడిలోని వెండి రథం, సింహం ప్రతిమలు మాయమైనట్టు ఆలయ అధికారులు గుర్తించారు. రథానికి నాలుగు వైపులా ఉండాల్సిన సింహం ప్రతిమల్లో మూడు కనిపించడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారి వెండి రథాన్ని బుధవారం పరిశీలించారు. అమ్మవారి వెండిరథంపై మూడు సింహాలు కనిపించడం లేదని పరిశీలనలో తేలిందని వెల్లడించారు. ఆలయాల్లో రథాల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చాలా ఆలయాల్లో భద్రతను ప్రైవేట్ ఏజెన్సీలు చూస్తున్నాయని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రథాన్ని ఉపయోగించలేదని తెలిపారు. ఘటనపై దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని మంత్రి చెప్పారు. అన్ని విషయాలు విచారణలో తేలుతాయని అన్నారు. (చదవండి: మంత్రి సీదిరి అప్పలరాజు సాహసం) -
కుట్రతోనే ద్రవ్య బిల్లుకు మోకాలడ్డు
సాక్షి, అమరావతి: శాసన మండలిలో టీడీపీ సభ్యులు కుట్రపూరితంగానే ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అగ్రహం వ్యక్తంచేశారు. స్వయం ప్రకటిత మేధావి, అసెంబ్లీ రూల్స్ బుక్ తానే తయారుచేసినట్లు ఫీలయ్యే యనమల రామకృష్ణుడు.. బిల్లులను మండలిలో అడ్డుకుని తీరుతామని ముందే చెప్పారన్నారు. చంద్రబాబు తీరు అసెంబ్లీలో ఒక రకంగా, మండలిలో ఒక రకంగా ఉందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ► సంఖ్యాబలం ఉందని మండలిలో టీడీపీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది. ► నారా లోకేశ్ చౌదరి ప్రోత్సాహంతోనే టీడీపీ సభ్యులు దీపక్‌రెడ్డి, బీద రవిచంద్ర తనపై, మంత్రులు కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్‌పై గూండాల్లా దాడి చేశారు. ► ఫొటోలు తీయొద్దని చెప్పినందుకు లోకేశ్ దాడికి తెగబడ్డారు. ► ప్రజా కోర్టులో చంద్రబాబు ఎప్పటికీ దోషిగా మిగిలిపోతారు. ► గతంలో చైర్మన్ విచక్షణాధికారం అని చెప్పి రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించారు. ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ కూడా అదే రీతిలో ప్రవర్తించారు. ► చైర్మన్ సీట్లో కూర్చొన్న వ్యక్తి టీడీపీ సభ్యులను ఉద్దేశించి ‘మా వాళ్లు’ అని సంబోధించడం ఎంతవరకు సమంజసం? ► తనను ఓడించిన ప్రజల మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే యనమల నిన్న సభలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ► చైనా సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన తెలుగు వ్యక్తి కల్నల్ సంతోష్‌బాబుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, వైఎస్సార్సీపీ తరఫున నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. లోకేశ్ డైరెక్షన్లోనే దాడి చంద్రబాబు, లోకేశ్ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నందుకే చంద్రబాబు తనయుడు లోకే‹శ్ నాయుడు తనపై కక్షగట్టి ప్రవర్తిస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. తిరుమలలో అన్యమత ప్రార్థనలు అంటూ దుష్ప్రచారం చేసిన లోకేశ్‌కు దమ్ముంటే వాటిని నిరూపించాలని ఆనాడు సవాల్ విసిరానని.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కౌన్సిల్ వేదికగా లోకేశ్ దాడులు చేయించారని వెలంపల్లి అన్నారు. ఆర్యవైశ్యుడినని.. మాటల్లో చెప్పలేని విధంగా తనపై దాడి చేశారని గురువారం ఆయన ‘సాక్షి’తో అన్నారు. ల్యాండ్ మాఫియా గూండా దీపక్‌రెడ్డి వెల్‌లోకి వచ్చి మంత్రులను బయటకు నెట్టేయాలంటూ మాట్లాడారని తెలిపారు. రూల్స్‌కు విరుద్ధంగా లోకేశ్ సెల్ఫోన్లో ఫొటోలు తీయడం.. వీడియో రికార్డింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకే నాపై టీడీపీ నేతలు దాడిచేశారని.. ఇదంతా మీడియా వారు లాంజ్‌లో నుంచి చూశారని మంత్రి వివరించారు. లోకేశ్, దీపక్‌రెడ్డి, బీద రవిచంద్ర మీద డిప్యూటీ చైర్మన్ చర్యలు తీసుకోవాలని వెలంపల్లి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సమన్వయంతో ఉండాలని సీఎం వైఎస్ జగన్ చెప్పారు కాబట్టే సమన్వయంతో ఉంటున్నామని ఆయన అన్నారు. -
‘ఆయన పాపంతోనే రాష్ట్రం అప్పుల ఊబిలోకి’
సాక్షి, విజయవాడ: ఉగాది నాటికి పేదలకు 25 లక్షలు ఇళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం విజయవాడలో ‘ప్రధాన మంత్రి అవాస్ యోజన - వైఎస్సార్ అర్బన్ హౌసింగ్ పథకం’ క్రింద లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ధనుంజయ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. 137 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు కావడం శుభపరిణామం అని పేర్కొన్నారు. చంద్రబాబు పాపంతో రాష్ట్రం అప్పుల ఉబిలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు. ఆయన పాలనలో 108, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీని నీరుగార్చరని మండిపడ్డారు. గ్రామ సచివాలయాల ద్వారా సీఎం వైఎస్ జగన్ పేదలకు పాలనను చేరువ చేశారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు చేరాలన్న చిత్తశుద్ధితో సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. అర్హులందరికీ ఇళ్లు అందేలా చూస్తామని వెల్లడించారు. అమరావతి అంటూ కలల రాజధానిని చంద్రబాబు చూపారన్నారు. రాష్ట్రంలో ఉన్న13 జిల్లాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. గతంలో దళారుల పాలన సాగింది.. ఉగాది నాటికి ఇల్లు లేని పేదలను ఇంటివారిని చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం లో ఇప్పటికే 27 వేల మంది ఇళ్లకు అర్హుల జాబితాలో వున్నారని తెలిపారు. పేదల ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో 3 వేల మందిని ఎంపిక చేసి అవకతవకలకు పాల్పడ్డారన్నారు. టీడీపీ నేతలు పేదల దగ్గర హడావుడి చేసి ఇళ్ల మంజూరు కోసం డబ్బులు వసూలు చేశారని మండిపడ్డారు. గత పాలనంతా దళారుల పాలనలా సాగిందన్నారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని ఎమ్మెల్యే విష్ణు అధికారులను కోరారు. -
13 జిల్లా సమగ్రాభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం
-
అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు
-
‘టీడీపీ పాలనలో ఆయన ఆచూకీ లేకుండా చేశారు’
సాక్షి, విజయవాడ: గత ఐదేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఊసే ఎత్త లేదని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం సౌమరంగ చౌక్ లో శ్రీవాసవీ ఫౌండేషన్, వాసవీసేవాదళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 67వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన రోజున సైతం చంద్రబాబు దిక్కుమాలిన నవ నిర్మాణ దీక్షలు చేశారని మండిపడ్డారు. పొట్టి శ్రీరాములు త్యాగం ప్రజల్లో గుర్తుండిపోయే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారని తెలిపారు. టీడీపీ పాలనలో పొట్టి శ్రీరాములు ఆచూకీ లేకుండా చేశారన్నారు. అవతరణ దినోత్సవం రోజున శ్రీరాములు మనవరాలును సీఎం జగన్ ఘనంగా సత్కరించారన్నారు. వైశ్య కార్పొరేషన్ అంశంపై నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాలవారికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆయన పోరాటం అజరామరం.. సత్యనారాయణపురంలో నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడని ప్రస్తుతించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటం అజరామరం అని పేర్కొన్నారు. -
మత విద్వేషాలకు చంద్రబాబు, పవన్ కుట్ర
సాక్షి, అమరావతి: మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కుట్రలు చేస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనలేక అన్యమత ప్రచారం అంటూ ఆరోపణలకు దిగుతున్నారని తెలిపారు. పార్ట్నర్స్ ఇద్దరు వేరువేరుగా చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధమా? అని మంత్రి సవాల్ విసిరారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బ్రిటిష్ వారి విభజించు పాలించు పాలసీని నల్ల దొరలు చంద్రబాబు, పవన్‌లు అనుసరిస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో, పచ్చ మీడియాలో కావాలని చంద్రబాబు, పవన్.. సీఎంపై విష ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. హిందూ దేవాలయాలు, అర్చకుల అభివృద్ధికి రూ.234 కోట్లు మొదటి బడ్జెట్లో కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దని చెప్పారు. చంద్రబాబు ఇసుక దీక్షకు 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలలో 15 మంది రాలేదని, దీక్షకు వారి మద్దతు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు టీడీపీని బీజేపీలో విలీనం చేయడానికి అన్ని విధాలుగా అడుగులు వేస్తూ.. సీఎంపై మతపరమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ భవానీ ఐల్యాండ్‌లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నిర్మాణం చేసిన తోరణం చూసి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారన్నారు. అర్చకులకు చంద్రబాబు ఏనాడైనా మేలు చేశారా?: మల్లాది విష్ణు చంద్రబాబు విజయవాడలో 40 దేవాలయాలు కూలదోస్తే, సీఎం వైఎస్ జగన్ నిర్మిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్‌కల్యాణ్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అర్చకుల మేలు గురించి ఏనాడైనా చంద్రబాబు ఆలోచించారా? అని ప్రశ్నించారు. అర్చకులకు సంబంధించిన జీవో నంబర్ 76ను ఎందుకు అమలు చేయలేదని విష్ణు నిలదీశారు. అవినీతి రాజధాని కాంట్రాక్ట్ పనిలో రూ.150 కోట్లు లంచం తీసుకున్న నేత ఎవరో టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. సోషల్ మీడియాలో మితిమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేవినేని ఉమా, యనమల రామకృష్ణుడు రోడ్లపైకి వచ్చి గగ్గోలు పెట్టడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. -
‘కృష్ణా, గోదావరి వద్ద లాంగ్ మార్చ్ చేయండి’
సాక్షి, విజయవాడ: వరదల కారణంగానే ఇసుక కొరత తలెత్తిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద ఆదివారం ఈ ఇద్దరూ వరద పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 70 రోజుల నుంచి వరదలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరిందన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చి చూస్తే పవన్ కల్యాణ్‌కు పరిస్థితి తెలుస్తుందన్నారు. లాంగ్‌మార్చ్‌లు, యాత్రలు సముద్రం ఒడ్డున కాకుండా కృష్ణా, గోదావరి నదుల వద్ద చేయాలని సవాల్ చేశారు. టీడీపీ హయాంలో కొల్లగొట్టిన ఇసుకంతా వరదల ద్వారా మళ్లీ నదుల్లోకి చేరిందన్నారు. ఐదేళ్లకు సరిపడా ఇసుక ఇప్పుడు నదుల్లో ఉందని మంత్రి తెలిపారు. వరద తగ్గగానే ఇసుక వారోత్సవాలు నిర్వహించి కొరతను తీరుస్తామన్నారు. చంద్రబాబు చేసిన ఇసుక దోపిడీని అరికట్టడానికే ఇసుక పాలసీ తీసుకువచ్చామని పేర్కొన్నారు. రెండు స్థానాల్లో ఓడినా బుద్ధి రాలేదు.. చంద్రబాబు సొంత కొడుకు గుంటూరులో నిరసన దీక్ష చేస్తే.. వైజాగ్‌లో దత్తపుత్రుడు పవన్ లాంగ్‌మార్చ్ చేస్తున్నారని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. రాజకీయం చేయడానికే లాంగ్‌మార్చ్ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ప్రజలు ఓడించారని.. అయినా ఆయనకు బుద్ధి రాలేదని అన్నారు. ఆయనను ప్రజలు నమ్మేపరిస్థితి లేదన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వెల్లంపల్లి పేర్కొన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే.. చంద్రబాబుకు అమ్ముడుపోయి.. పవన్‌కల్యాణ్ లాంగ్‌మార్చ్‌లు చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇసుకదోపిడీకి పాల్పడితే ఏ రోజైనా లాంగ్‌మార్చ్‌లు చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ లాంగ్ మార్చ్ చేపట్టారని విమర్శించారు. ఇసుక కొరత మానవ తప్పిదం అంటూ అవాస్తవాలు మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దోచుకున్న టీడీపీ నేతలతో కలిసి పవన్ లాంగ్ మార్చ్ చేస్తారా అంటూ నిప్పులు చెరిగారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రకృతి వనరుల వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని రాజకీయ అవకాశంగా మార్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని విష్ణు తప్పుబట్టారు. -
‘దళారులకు స్థానం లేదు..పథకాలన్నీ ప్రజల వద్దకే’
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికారంలో ఉండగా కాపులను మోసం చేశారని..కాపుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. విజయవాడలో రెండో రోజు జరుగుతున్న ‘కాపు విదేశీ విద్య దీవెన’ సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమంలో జక్కంపూడి రాజా, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజా మీడియాతో మాట్లాడుతూ.. కాపులకు ఇచ్చిన హామీని వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారన్నారు. కాపులకు ప్రతి ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు సీఎం జగన్ కేటాయిస్తున్నారని వెల్లడించారు. పవన్ కల్యాణ్ పోటీ చేసిన ఉభయగోదావరి జిల్లాలో కాపులు వైఎస్ జగన్‌కు అండగా నిలబడ్డారన్నారు. ఇస్తామని చెప్పి మోసం చేశారు.. కాపులకు ఏడాదికి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని.. కానీ వైస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2,000 కోట్లు కాపులకు కేటాయించారని పేర్కొన్నారు. ఐదేళ్లలో కేవలం 1,700 కోట్లు మాత్రమే చంద్రబాబు కేటాయించారని విమర్శించారు. కాపు విదేశీ దీవెన పథకానికి వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందేవని.. వైఎస్ జగన్ పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. వారికి మాత్రమే లోన్లు ఇచ్చేవారు: మంత్రి వెల్లంపల్లి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలకు మాత్రమే లోన్లు ఇచ్చేవారని.. వైఎస్ జగన్ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ తండ్రి బాటలో నడుస్తూ.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ ఏడాది కాపు విదేశీ విద్య దీవెన పథకం ద్వారా 1000 మందిని విదేశాలకు పంపుతున్నామని మంత్రి వెల్లడించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలనలో దళారులకు స్థానం లేదని.. సంక్షేమ పథకాలన్నీ నేరుగా ప్రజల వద్దకే చేరుతున్నాయని తెలిపారు. -
‘పోలీసుల సేవలు ప్రశంసనీయం’
సాక్షి, విజయవాడ: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రులు కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల మాట్లాడుతూ.. నిత్యం కష్టపడి పనిచేస్తూ.. సమాజాన్నికాపాడటంలో పోలీసుల పాత్ర మరవలేనిదన్నారు. రాష్ట్రంలో నక్సల్స్ దాడుల్లో అనేక మంది పోలీసులు అమరులయ్యారన్నారు. పోలీసుల సంక్షేమ కోసం తొలిసారిగా వారాంతరపు సెలవును మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. సుమారు 600 మంది పోలీసులు, సిబ్బంది, విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. సమాజానికి తమ వంతు సేవ చేయాలన్న పోలీసు శాఖ సంకల్పం అభినందనీయమని కురసాల కన్నబాబు అన్నారు. సేవలు ప్రశంసనీయం:మంత్రి వెల్లంపల్లి కుటుంబాలను సైతం వదిలి నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే పోలీస్ శాఖ సేవలు ప్రశంసనీయమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దసరా ఉత్సవాలు విజయవంతం కావడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తున్నారని సీపీ ద్వారకా తిరుమలరావును మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అభినందించారు. అపోహలను పొగొట్టడమే లక్ష్యం: సీపీ అక్టోబర్ 15 నుంచి 21వ తేదీ వరకు వారం రోజుల పాటు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తున్నామని విజయవాడ సీపీ ద్వారాక తిరుమలరావు తెలిపారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు పోలీసు శాఖ ఉపయోగించే ఆయుధాల గురించి అవగాహన కల్పించామన్నారు. సమాజంలో పోలీస్ శాఖ పట్ల ఉన్న అపోహలను పొగొట్టాలన్నదే తమ లక్ష్యమన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ద్వారక తిరుమలరావు పేర్కొన్నారు. -
సీనియర్ నేత మరణించాడనే బాధ కూడ టీడీపీ నేతలకు లేదు
-
దుర్గగుడి ఫ్లైఓవర్ విజయవాడకు ప్రతిష్టాత్మకం
-
డిసెంబర్‌కల్లా దుర్గగుడి ఫ్లైఓవర్ పూర్తి
సాక్షి, విజయవాడ: ఈ ఏడాది డిసెంబర్ నాటికి దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులను దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఆయన ఆదివారం పరిశీలించారు. పనుల జాప్యంపై మంత్రులు ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి కృష్ణదాస్ మాట్లాడుతూ.. దుర్గగుడి ఫ్లైఓవర్ విజయవాడ నగరానికే ప్రతిష్టాత్మకమని అన్నారు. తొలి ప్రాధాన్యతగా ఫ్లైఓవర్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారన్నారు. గత ప్రభుత్వ హయాంలో పనులు ముందుకు సాగలేదని విమర్శించారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. డిజైన్ మార్పుతో పాటు, వయాడక్ట్ ఏర్పాటు చేయడం లాంటి పనుల వల్ల బడ్జెట్ పెరిగిందన్నారు. ఫ్లైఓవర్ పనుల కోసం నెలరోజులపాటు ట్రాఫిక్‌ను నిలిపివేయాల్సి ఉంటుందన్నారు. -
దుర్గగుడి పవిత్రతను కాలరాస్తున్న టీడీపీ
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ) : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రెండో అతి పెద్ద ఆలయంగా ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం పవిత్రతను తెలుగుదేశం పార్టీ కాలరాస్తుందని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. వన్‌టౌన్‌లోని ఆయన కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉంటున్న బుద్దా వెంకన్న హిందువుల ఆలయాల్లో దోపిడీకి పాల్పడుతుంటే, స్థానిక ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మైనార్టీ ఆస్తులను దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిని అదుపు చేయాలంటే ఎక్కడ తన క్షుద్ర పూజల వ్యవహారం బయటపడుతుందోననే భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. ఆదివారం శొంఠి పద్మజ అనే మహిళ మదనపల్లిలో ప్రత్యేకంగా నేయించిన 18 వేల విలువైన చీరను అమ్మవారికి బహూకరించారన్నారు. ఆ చీర అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద ఉంచారని, అలా ఉంచిన కాసేపటికే అది మాయమైందన్నారు. ఆ విషయాన్ని పాలకమండలి, అధికారులు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. చీరను దొంగిలించిన సన్నివేశాలు సీసీ పుటేజ్‌ల నుంచి తొలగించడంలో పాలకమండలి బంధువు హస్తం ఉందన్నారు. చీరదొంగతనం విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాలకవర్గ సభ్యురాలు సూర్యలత తన ఇంట్లో వస్త్ర దుకాణం నిర్వహిస్తుండటం వలన ఆ చీర అక్కడకు చేరి ఉంటుందని వెలంపల్లి అనుమానం వ్యక్తం చేశారు. దుర్గగుడిపై జరుగుతున్న అవినీతి వెనుక ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హస్తం ఉందన్నారు. జుమ్మా మసీదు లీజు రద్దు చేస్తానని జలీల్‌ఖాన్ ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదన్నారు. -
పోలీసుల ఉక్కుపాదం
ధర్నా చౌక్‌లోనూ నిరసనకు అవకాశమివ్వని వైనం వెలంపల్లి, గౌతంరెడ్డి సహా 20 మంది అరెస్ట్ గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్‌లో వైఎస్సార్ సీపీ శ్రేణులు చేపట్టిన ధర్నాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ధర్నాకు అనుమతి లేదంటూ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి ఉంగుటూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ధర్నా చౌక్‌లో వేసిన టెంట్‌ను పోలీసులే తొలగించారు. పార్టీ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి పి.గౌతంరెడ్డి, కార్యదర్శి పైలా సోమినాయుడు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్, కార్పొరేటర్ బుల్లా విజయ్‌కుమార్, మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు గౌస్‌మొహిద్దీన్, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు విశ్వనాథ రవి, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి సహా 20మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి ఉంగుటూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని కోరినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎటువంటి నిరసన, ధర్నా కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని పోలీసులు చెప్పారు. తాము అనుమతి కోసం లెటర్ పెట్టామని, అనుమతి నిరాకరించినట్లు తమకు లిఖిత పూర్వకంగా ఎటువంటి లెటర్ రాలేదని వెలంపల్లి శ్రీనివాస్, గౌతంరెడ్డి పోలీసులకు చెప్పారు. వారి వాదనను వినిపించుకోకుండా వాహనాల్లో ఎక్కించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోందని వెలంపల్లి శ్రీనివాస్, గౌతంరెడ్డి మండిపడ్డారు. బస్సు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ప్రతిపక్ష నేతపై అక్రమంగా కేసులు బనా యించడమే కాకుండా నిరసన తెలిపేందుకు వచ్చిన తమను అక్రమంగా అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాత్రి పది గంటల సమయంలో నాయకులను ఉంగుటూరు నుంచి సత్యనారాయణపురం పీఎస్‌కు తీసుకువచ్చారు.