
సాక్షి, విజయవాడ: బెజవాడ దుర్గమ్మ గుడిలోని వెండి రథం, సింహం ప్రతిమలు మాయమైనట్టు ఆలయ అధికారులు గుర్తించారు. రథానికి నాలుగు వైపులా ఉండాల్సిన సింహం ప్రతిమల్లో మూడు కనిపించడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారి వెండి రథాన్ని బుధవారం పరిశీలించారు. అమ్మవారి వెండిరథంపై మూడు సింహాలు కనిపించడం లేదని పరిశీలనలో తేలిందని వెల్లడించారు. ఆలయాల్లో రథాల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చాలా ఆలయాల్లో భద్రతను ప్రైవేట్ ఏజెన్సీలు చూస్తున్నాయని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రథాన్ని ఉపయోగించలేదని తెలిపారు. ఘటనపై దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని మంత్రి చెప్పారు. అన్ని విషయాలు విచారణలో తేలుతాయని అన్నారు.
(చదవండి: మంత్రి సీదిరి అప్పలరాజు సాహసం)
Comments
Please login to add a commentAdd a comment