Durga Temple
-
ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
విజయవాడ దసరా ఉత్సవాల్లో ఘోర అపచారం
-
ఇంద్రకీలాద్రి: వీఐపీ దర్శనాలతో సామాన్య భక్తుల అగచాట్లు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రికి ప్రోటోకాల్ దర్శనాలు పోటెత్తాయి. ప్రోటోకాల్ దర్శనాలు.. సామాన్య భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. వీఐపీ టైమ్ స్లాట్ దర్శనాలు అమలుకావడం లేదు. సిఫార్సు లెటర్స్ ఉంటే చాలు అంతా వీఐపీలే అన్నట్టుగా, ఉదయం నుంచి సిఫార్సు లెటర్లతో భారీగా క్యూకట్టారు. క్యూలైన్లు ముందుకు కదలక సామాన్య భక్తులు నానా అవస్థలు పడుతున్నారు.500 రూపాయలు టిక్కెట్లు తీసుకున్న భక్తులు నాలుగు గంటలుగా క్యూలైన్లలోనే పడిగాపులు పడుతున్నారు. ప్రోటోకాల్ దర్శనాలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, అధికారులతో 500 రూపాయల క్యూలైన్లలోని భక్తులు వాగ్వాదానికి దిగారు. ఐదు రూపాయల ఎందుకు పెట్టారంటూ మండిపడ్డారు.మరోవైపు ఇంద్రకీలాద్రిపై లడ్డూలు అందక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు లేదు ఇవ్వటం కుదరదంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఘాట్ రోడ్డులో ఒకే ఒక్క లడ్డూ సేల్ పాయింట్‌ను అధికారులు ఏర్పాటు చేయడంతో దుర్గమ్మ దర్శనానంతరం ప్రసాదం అందకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: గోల్మాల్ సర్కార్.. వరద లెక్కలో ‘బాబు’ లీలలే వేరయా! -
విజయవాడ దుర్గగుడిలో జత్వానీకి రాచమర్యాదలు
-
పవన్ కళ్యాణ్... చర్చకు రెడీ... పోతిన మహేష్ ఓపెన్ ఛాలెంజ్
-
గుడిలో దుర్గమ్మను ఫొటో తీసేందుకు భక్తుడి యత్నం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఓ భక్తుడు నిబంధనలను అతిక్రమించి సెల్‌ఫోన్‌తో దుర్గగుడిలోకి ప్రవేశించాడు. అమ్మవారిని ఫొటో తీసేందుకు ప్రయతి్నంచాడు. దీనిని గుర్తించిన ఆలయ అధికారులు ఆ భక్తుడి నుంచి సెల్‌ఫోన్ లాక్కుని హుండీలో వేసిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వారం క్రితం కూడా ఓ భక్తుడు అమ్మవారి మూలవిరాట్‌ను సెల్ ఫోన్‌తో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన సంగతి విదితమే. ఆదివారం నుంచి భక్తులు ఎవరూ సెల్‌ఫోన్‌తో ఆలయంలోకి ప్రవేశించకుండా ఆలయ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని మైక్ ప్రచార కేంద్రం నుంచి పదే పదే సెల్ఫోన్లతో ఆలయంలోకి ప్రవేశించవద్దని సూచనలు చేస్తూనే ఉన్నారు. అయితే సోమవారం రాత్రి ఓ భక్తుడు తన ఖరీదైన సెల్‌ఫోన్‌తో ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారిని ఫొటో తీసేందుకు ప్రయతి్నంచాడు. ఇంతలో అక్కడే ఉన్న సెక్యూరిటీ, ఆలయ సిబ్బంది వెంటనే గమనించి కేకలు వేయడంతో ఆ భక్తుడు సెల్‌ఫోన్ తీసుకుని రావిచెట్టు వైపు పరుగు తీశాడు. ఆ భక్తుడికి పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఆలయ ఈఓ రామరావు దృష్టికి తీసుకెళ్లారు. ఈఓ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆ భక్తుడి నుంచి సెల్‌ఫోన్ తీసుకుని ఆలయంలో ఉన్న హుండీలో వేశారు. హుండీ కానుకల లెక్కింపు సమయంలో సెల్‌ఫోన్‌ను బయటకు తీస్తారని, అప్పుడు దానిని ఏమి చేయాలో ఆలోచిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. -
సెల్‌ఫోన్‌తో నో ఎంట్రీ!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సెల్‌ఫోన్‌తో అంతరాలయంలో మూలవిరాట్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఘటనపై దుర్గగుడి అధికారులు సోమవారం సీరియస్‌గా స్పందించారు. సోమవారం ఉదయం నుంచి సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేకంగా తనిఖీలు చేసిన తర్వాతే కొండపైకి అనుమతించారు. దర్శనం కోసం క్యూలైన్లోకి ప్రవేశించే ముందే భక్తులతో పాటు వారి బ్యాగులు, లగేజీలను పూర్తిగా తనిఖీ చేశారు. క్యూలైన్లోకి ప్రవేశించిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించే మార్గాల వద్ద మరోమారు తనిఖీలు నిర్వహించారు. సర్వదర్శనం, రూ. 100, రూ.300, రూ.500 టికెట్ చెకింగ్ పాయింట్ వద్ద తనిఖీలు నిర్వహించడంతో పాటు సెల్‌ఫోన్‌తో ఉన్న భక్తులను బయటకు పంపేశారు. దీంతో ఒకరిద్దరు భక్తులు సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగినా వారిని బయటకు పంపేశారు. కొంత మంది ఇదే విషయాన్ని వీడియో రికార్డు చేసి మరో మారు సోషల్‌మీడియాలో అప్లోడ్ చేశారు. సెల్ఫోన్లతో క్యూలైన్లోకి వస్తే, మళ్లీ కౌంటర్ వద్దకు వెళ్లాల్సి వస్తుందని, దీంతో గంట సమయం వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ముందుగానే సెల్ఫోన్లను కౌంటర్లో పెట్టుకుని రావాలని ఆలయ సిబ్బంది సూచిస్తున్నారు. మరో వైపున భక్తులెవరిని ఎట్టి పరిస్థితులలోనూ సెల్‌ఫోన్‌తో ఆలయంలోకి పంపే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. అలాగే మహా మండపం రాజగోపురం వద్ద, లక్ష్మీ గణపతి విగ్రహం వద్ద, నటరాజ స్వామి వారి ఆలయం వద్ద సెల్ఫోన్లతో ఫొటోలు దిగే వారిని వారించారు. కొంత మంది నుంచి సెల్ఫోన్లను తీసుకునే ప్రయత్నం చేయడంతో వాదనలు జరిగాయి. సెల్ఫోన్లను ఆలయంలోకి అనుమతించకుండా ఇదే విధంగా కట్టుదిట్టంగా వ్యవహరించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. -
ఆషాఢంలో దుర్గ గుడికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
దుర్గగుడి అభివృద్ధి పనులకు 7న సీఎం జగన్ శంకుస్థాపన
పెంటపాడు: విజయవాడలోని శ్రీ కనకదుర్గ, మల్లేశ్వరస్వామివార్ల ఆలయ అభివృద్ధి పనులకు డిసెంబర్ 7న సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. గురువారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ దుర్గమ్మ గుడిని రూ.225 కోట్లతో సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. డిసెంబర్ 8న రూ.125 కోట్లతో శ్రీశైలం క్షేత్రంలో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతాయని వెల్లడించారు. రూ.60 కోట్లతో సింహాచల క్షేత్రం, రూ.80 కోట్లతో అన్నవరం క్షేత్రం, రూ.70 కోట్లతో ద్వారకాతిరుమల క్షేత్రంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. చదవండి: విశాఖ నుంచి పాలనకు కీలక అడుగు -
దుర్గగుడి పంచాంగం బ్రోచర్ ను ఆవిష్కరించిన మంత్రి కొట్టు సత్యనారాయణ
-
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతీదేవిని దర్శించుకున్న సీఎంకు ఆలయ వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్నిసీఎంకు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అందజేశారు. తొలుత ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం జగన్‌కు పూర్ణకుంభంతో వేద పండితులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయ చిన్న రాజగోపురం వద్ద సీఎం జగన్‌కు అర్చకులు పరివేష్టం చుట్టారు. శుక్రవారం అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి రూపంలో అమ్మవారు భక్తులకు అనుగ్రహించారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం నాడు దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. రద్దీకి అనుగుణంగా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. -
సిఫారసులకు చెల్లుచీటీ!.. టికెట్ ఉంటేనే దుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ దర్శనంలో అధికారులు భారీ మార్పులు చేశారు. సిఫారసులు ఉన్నవారికే దుర్గమ్మ దర్శనం అనే భావన తొలగించి, ఎటువంటి సిఫారసులతో పనిలేకుండా కేవలం గంటన్నర వ్యవధి లోపే దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని దేవదాయశాఖ మంత్రితోపాటు అధికారులు, చైర్మన్ చెబుతూనే ఉన్నారు. ఏటా ఇలానే చెబుతారు కదా అని సాధారణ భక్తులు భావించినా, ఈసారి దాన్ని చేతల్లో అమలు చేసి చూపించారు. టికెట్ ఉంటేనే దర్శనం అనే రీతిలో ఏర్పాట్లు జరిగాయి. వినాయకుడి గుడి నుంచి అమ్మవారి దర్శనం పూర్తయి కొండ దిగేవరకూ కేవలం గంటన్నర వ్యవధిలోపే దర్శన సమయం పడుతుండటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని ఏర్పాట్లను మంగళవారం విజయవాడ సీపీ టీకే రాణా తనిఖీ చేశారు. క్యూలైన్లో ఉన్న భక్తులతో మాట్లాడారు. దర్శనానికి ఎంత సమయం పడుతుందనే వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రొటోకాల్ వాహనాలపైనే కొండకు... పాలకమండలి, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఎవరైనా దేవస్థానానికి చెందిన ప్రొటోకాల్ వాహనాలపైనే కొండపైకి చేరుకోవాలి. టికెట్ ఉంటేనే వాహనాల్లోకి ప్రవేశం అని ప్రకటించారు. వారితో వచ్చిన ఎవరైనా టికెట్ తీసుకోవాల్సిందే అని పేర్కొన్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లోనైనా, వీఐపీలైనా టికెట్ కొనుగోలు చేస్తున్నారు. ఇక టికెట్ కొనుగోలు చేసిన సామాన్య భక్తులు ఎవరైనా నేరుగా ఆలయానికి చేరుకునే వీలులేకుండా పక్కా ప్రణాళికతో కట్టడి చేశారు. ఘాట్ రోడ్డులోని ఓం టర్నింగ్ నుంచి అమ్మవారి ఆలయం చేరుకునే లోపు ఐదు చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వాటికి ఎంఆర్వోలు, ఇతర రెవెన్యూ ముఖ్య అధికారులకు బాధ్యతలు అప్పజెప్పారు. గతంలో సీఎం గేట్, ఆలయ సిబ్బంది రాకపోకలు సాగించే మార్గాల్లో ఉన్న గేట్లకు సైతం తాళాలు వేశారు. ఎవరైనా సరే క్యూలైన్లోనే దర్శనానికి వెళ్లాలని అటు పోలీసులు, ఇటు రెవెన్యూ శాఖల అధికారులు చెబుతున్నారు. అలానే సిఫారసులు ఉన్నా, నేరుగా దర్శనానికి కాకుండా, క్యూలైన్లోనే అనుమతిస్తుండటంతో ఆలయ ప్రాంగణం ప్రశాంతంగా కనబడుతోంది. మరోవైపు డీసీపీ విశాల్‌గున్నీ ఆలయ ప్రాంగణంలోనే ఉంటూ భక్తులు ఎవ్వరూ అనధికార మార్గాల్లో అమ్మవారి దర్శనానికి వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. పోలీసు అధికారులు సిఫారసు చేసిన వారిని సైతం పోలీసులు నేరుగా దర్శనానికి కాకుండా రూ.500 టికెట్ క్యూలైన్లోనే పంపుతున్నారు. చదవండి: దసరాకు ప్రత్యేక రైళ్లు -
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
-
దుర్గ గుడిలో అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి
-
India Famous Durga Temples Images: భారతదేశంలోని ప్రసిద్ధ దుర్గా దేవాలయాలు (ఫొటోలు)
-
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రులు ఉత్సవాలు
-
దుర్గ గుడి, శ్రీశైలంలో అభివృద్ధి పనులకు ఈ నెలలో సీఎం శంకుస్థాపన
విజయవాడ దుర్గ గుడి వద్ద భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం దాదాపు రూ.225 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఈ నెలలో సీఎం జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి సత్యనారాయణ వెల్లడించారు. శ్రీశైలం ఆలయం వద్ద మరో రూ.175 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేస్తారని చెప్పారు. దుర్గ గుడి వద్ద ప్రసాదం పోటు, అన్నదానం భవనం, శివాలయం నిర్మాణ పనులు, రాక్ మిటిగేషన్ (కొండ చరియలు విరిగిపడకుండా), ఆటోమేషన్ పార్కింగ్ వసతి తదితర పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ఇప్పుడున్న ఘాట్ రోడ్డు వాస్తుపరంగా అంత శుభప్రదం కాదని వాస్తు పండితులు పేర్కొంటున్నందున రాజగోపురం నుంచి భక్తులు వచ్చి వెళ్లేలా దుర్గానగర్‌లో ఎలివేటెడ్ క్యూలైన్ (ప్లై ఓవర్), క్యూ కాంపెక్స్ విస్తరణ చేపడుతున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆలయాల పక్కన రెండు అంతస్తులతో పూజా మండపాలు కడుతున్నామన్నారు. ఇక శ్రీశైలం ఆలయం వద్ద రూ.75 కోట్లతో క్యూ కాంప్లెక్స్, రూ.40 కోట్లతో సాల మండపాల నిర్మాణంతో పాటు ఇటీవల అటవీ శాఖ నుంచి ఆలయం స్వాదీనంలోకి వచ్చిన 4,600 ఎకరాలకు ఫెన్సింగ్ నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. అక్టోబరు నుంచి ధర్మ ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. -
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా మహోత్సవాలు
-
ఆంధ్రజ్యోతి కథనంపై దుర్గగుడి స్పందన
సాక్షి, కృష్ణా: విజయవాడ దుర్గగుడికి చెందిన సీవీ రెడ్డి ఛారిటీస్‌లో మాంసాహారం పేరుతో వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. పోలీసులు మాంసాహారం వండుకుని తిన్నారంటూ అందులో పేర్కొంది. అయితే ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని ఖండించారు దుర్గగుడి అధికారులు. దుర్గ గుడి ఈవో భ్రమరాంబ ఆదేశాల మేరకు సత్రాన్ని సందర్శించి.. అన్ని రూములు, పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు అధికారులు. ఆపై సత్రంలో ఎలాంటి మాంసాహారం వండటం స్వీకరించడం లేదని పర్యవేక్షణాధికారి స్పష్టత ఇచ్చారు. తప్పుడు కథనం ఆధారంగా.. చేసిన ఆరోపణలను నిరూపించడంతో పాటు రేపటి పేపర్లో వివరణ ప్రచురించాల్సిందిగా ఆంధ్రజ్యోతిని అధికారులు కోరినట్లు ఈవో వెల్లడించారు. -
ACB Raids: నగేష్ మామూలోడు కాదు..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఏసీబీ.. అవినీతి అధికారుల భరతం పడుతోంది. 14400 కాల్‌సెంటర్, ఏసీబీ యాప్‌లకు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా పక్కా ఆధారాలతో కేసులు నమోదు చేసి, అవినీతి జలగలను కటకటాల వెనక్కి పంపుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై విజయవాడలోని పటమట సబ్ రిజిస్ట్రార్ అజ్జా రాఘవరావుకు సంబంధించిన ఆస్తులపై మంగళవారం సాయంత్రం నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న విషయం తెలిసింది. బుధవారం కూడా ఈ సోదాలు కొనసాగాయి. అలాగే దుర్గగుడి సూపరింటెండెంట్ వాసా నగేష్‌పై వచ్చిన ఆరోపణలపైనా ఏసీబీ అధికారులు బుధవారం ఇంద్రకీలాద్రికి వచ్చి తనిఖీలు నిర్వహించారు. పెద్ద చేపే.. పటమట సబ్ రిజిస్ట్రార్ అజ్జా రాఘవరావు ఆస్తులపై తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు రాఘవరావుతో పాటు మరో ముగ్గురు ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి పటమట కార్యాలయం, ఆయన ఇల్లు, బంధువులు, స్నేహితులకు సంబంధించిన ఇళ్లు, తదితర ప్రాంతాల్లో మొత్తం ఆరుచోట్ల జరిపిన సోదాల్లో భారీ ఎత్తున అక్రమాస్తులకు సంబంధించిన విలువైన పత్రాలు, నగదు, వాహనాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్‌కు డబ్బులు కలెక్టు చేస్తున్న ముగ్గురు కీలక ప్రైవేటు వ్యక్తులు అదుపులోకి తీసుకొని ఎవరెవరి నుంచి డబ్బులు కలెక్ట్ చేశారో ఆరా తీస్తున్నారు. తాజాగా ఇటీవల రెండు భవనాల కొనుగోలు చేసేందుకు రూ.50 లక్షల అడ్వాన్స్ ఇచ్చినట్లు గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం నాలుగు నుంచి ఐదుకోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు కనుగొన్నారు. మార్కెట్ విలువ ఆధారంగా వీటి విలువ రూ.10కోట్ల నుంచి రూ.15కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకా కొన్ని లాకర్స్‌ను ఓపెన్ చేయాల్సి ఉన్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు. గతంలో 2018లో అవనిగడ్డ సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో జరిగిన సోదాలకు సంబంధించి శాఖాపరమైన చర్య ఇంకా పెండింగ్‌లో ఉంది. నగేష్ మామూలోడు కాదు.. విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవాలయం సూపరింటెండెంట్ వాసా నగేష్ ఆస్తుల పైనా సోదాలు కొనసాగుతున్నాయి. కుమ్మరిపాలెంలోని లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నంబర్ ఎఫ్–34లోని నివాసం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో 6 చోట్ల, దుర్గ గుడిలోని ఏఓ కార్యాలయంతో పాటు ఏఓ బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇంకా పలు చోట్ల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు అధికారుల సోదాల్లో రూ.5కోట్ల నుంచి రూ.7కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించారు. ఇంద్రకీలాద్రిపై కలకలం.. దుర్గగుడి సూపరిండెంటెంట్ వాసా నగేష్‌పై బుధవారం అవినీతి నిరోధక శాఖ సోదాలు చేయడంతో ఇంద్రకీలాద్రిపై కలకలం రేగింది. నగేష్ తన వ్యక్తిగత పనులపై బుధ, గురువారాలు సెలవుపై వెళ్లారు. అయితే ఏసీబీ అధికారులు దాడులు చేసినట్లు తెలిసిన వెంటనే కొంత మంది నాల్గో అంతస్తులోని కార్యాలయానికి వెళ్లి ఆరా తీసేందుకు ప్రయత్నించగా నగేష్ అందుబాటులోకి రాలేదు. గతంలో పాలకవర్గ సమావేశంలో సైతం ఈయన అవినీతిపై ఈవోను పలువురు ప్రశ్నించారు. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అయితే నగేష్‌పై ఆరోపణలు చేసిన వారు సాక్ష్యాలు ఉంటే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని ఈవో భ్రమరాంబ ఆ సమావేశంలో దాట వేశారు. పాలక మండలి ఫిర్యాదును సైతం ఈవో బుట్టదాఖలు చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈయనపైన చర్య తీసుకోకపోడటానికి ప్రధాన కారణం ఈయనే షాడో ఈవోగా వ్యవహరిస్తూ, అన్నీ చక్కబెడుతుండటమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కీలక బాధ్యతలు ఆయనకే.. ద్వారకాతిరుమల నుంచి ఇంద్రకీలాద్రికి బదిలీపై వచ్చిన నగేష్‌కు ఈవో భ్రమరాంబ ఆలయంలోని పలు విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించారు. దేవస్థానంలో కీలకమైన అంతరాలయ పర్యవేక్షణతో పాటు ప్రసాదాల కౌంటర్లు, టోల్గేట్లు నిర్వహణ బాధ్యతలు నగేష్ చూస్తారు. అంతే కాకుండా ఆలయం సిబ్బంది పొరపాటున ఏదైనా తప్పు చేసినట్లు గుర్తిస్తే దానికి నగేష్నే విచారణ అధికారిగా నియమించడం సర్వసాధారణమైంది. నకిలీ టికెట్ల వ్యవహారంలో లోతుగా విచారణ చేస్తే నగేష్ మెడకు చుట్టుకునే అవకాశం ఉన్నప్పటీకీ ఈవో వెనకేసుకురావడంతో అది తప్పింది. ఇప్పుడు ఏసీబీ తనిఖీలతో ఆలయ ప్రతిష్ట మసకబారే పరిస్థితి ఏర్పడిందని పలు భక్తులు ఆరోపిస్తున్నారు. -
Vijayawada: ఇంద్రకీలాద్రిపై కోటిదీపోత్సవ ధగధగలు (ఫొటోలు)
-
కార్తీక మాస ప్రత్యేక పూజలు, పుణ్యస్థానాలు (ఫొటోలు)
-
విజయవాడ దుర్గ గుడిలో భవానీల రద్దీ (ఫొటోలు)
-
700 ఏళ్ల నాటి ఆచారానికి స్వస్తి పలికి...కొత్త సంప్రదాయానికి శ్రీకారం
బిహార్: భారత్‌లో పలు రాష్ట్రాలు, గ్రామాల్లో ప్రజలు శరన్న నవరాత్రులను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఒక్కోచోట ఒక్కో సంప్రదాయ రీతీలో దుర్గామాత పూజలందుకుంటోంది. అలాగే బిహార్‌లోని బెగుసరాయ్‌లో చారిత్రాత్మక పురాతన ఆలయంలో దుర్గామాత వైష్ణవి దేవిగా పూజలందుకుంటోంది. ఇక్కడి ప్రజలు అమ్మవారిని చాలా విభిన్నంగా ఆరాధిస్తారు. అమ్మవారికి జంతుబలులు ఇవ్వడం అనేది కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ సంప్రదాయంగా పాటిస్తున్నారు. కానీ ఈ బెగుసురాయ్‌లో ఉన్న పురాతన వైష్ణవీ మాత ఆలయంలో మాత్రం నవరాత్రి సందర్భంగా అమ్మవారికి ఇచ్చే బలులు మామూలుగా ఉండవు. వేల సంఖ్యల్లో జంతు బలులు జరుగుతుంటాయి. ఏటా నవరాత్రులకు వైష్ణవి మాతకు దాదాపు 10 వేలకు పైగా జంతువులను బలి ఇస్తారు. భక్తుల తమ కోరిక నెరవేరిన వెంటనే ఈ జంతు బలులతో తమ మొక్కులను తీర్చుకుంటుంటారని ప్రజలు చెబుతున్నారు. ఇది అక్కడ 700 ఏళ్ల నాటిగా అనాధిగా వస్తున్న ఆచారం. వాస్తవానికి అక్కడ ఉన్నఅమ్మవారు ఒక శక్తిపీఠంగా అలరారుతున్న పవిత్రమైన క్షేతంగా ప్రసిద్ధి. అలాంటి పవిత్రమైన ప్రదేశంలో ఈ జంతుబలులు అనేది కాస్త అందర్నీ కలిచివేసే అంశమే. ఐతే ఇప్పుడు వారంతా ఈ 700 ఏళ్ల నాటి ఆచారానికి తిలోదాకాలిచ్చేసి ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఆ ఆలయాన్ని నిర్వాహిస్తున్న మా దుర్గా టెంపుల్ పుష్పలత ఘోష్ ఛారిటబుల్ ట్రస్ట్. ఈ వైష్టవీ దేవి విగ్రహం ఆలయ చరిత్ర ప్రకారం 700 ఏళ్ల క్రితం బెంగాల్‌లోని నదియా నుంచి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ దేవతను లాకన్పుర్లో కులదేవతగా ఆరాధిస్తారని సమాచారం. బెగుసురాయ్లోని ఈ వైష్టవీ దేవీ ఆలయంలో భక్తులు ప్రస్తుతం జంతు బలులకు బదులుగా అమ్మవారికి చెరకు, గుమ్మడికాయ వంటి కూరగాయాలు, పండ్లు సమర్పిస్తారు . అంతేగాదు ఈ ఆలయాన్ని స్థాపించినప్పడూ ఈ ఆచారాన్నే పాటించేవారిని రానురాను కాలానుగుణంగా మార్పులు సంతరించుకుని.. ఈ జంతు బలలు వచ్చినట్టు చరిత్ర ఆధారంగా తెలుస్తోందని ట్రస్ట్ కమిటీ పేర్కొంది. చదవండి: దుర్గమ్మ దర్శన వేళల్లో మార్పులు) -
విజయవాడ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు (ఫొటోలు)
-
ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ టికెట్లు
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో ఉన్న 11 ప్రధాన ఆలయాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి దర్శనం టికెట్లను పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆలయాల వద్ద గదుల కేటాయింపు వంటి వాటిని కూడా ఆన్లైన్ పరిధిలోకి తెస్తామన్నారు. మంత్రి మంగళవారం విజయవాడలో దేవదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ గుడి, పెనుగ్రంచిపోలు, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయం, వాడపల్లి, ఐనవల్లి ఆలయాల్లో ఆన్లైన్ టికెట్ విధానం తప్పనిసరి చేస్తున్నట్లు చెప్పారు. భక్తులు అడ్వాన్స్‌గా నిర్ణీత తేదీకి ఆన్లైన్ దర్శన టికెట్లు, గదులు బుకింగ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. రద్దీ అధికంగా ఉండే మరో 12 ఆలయాల్లోనూ ఆన్లైన్ విధానం అమలుపై చర్చిస్తున్నట్లు వివరించారు. వారం వారం సమీక్ష ఇకపై ప్రతి బుధవారం దేవదాయశాఖ సమీక్ష సమావేశం నిర్వహించి, ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఉద్యోగుల పదోన్నతులకు అడ్డుగా ఉన్న కోర్టు కేసుల ఉపసంహరణకు ఉద్యోగ సంఘాల నేతలు ముందుకొచ్చారని, ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు. దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌లో సిబ్బంది నియామకాలను చేపట్టినట్లు వివరించారు. కొత్తగా ఏర్పాటైన ధార్మిక పరిషత్ తొలి సమావేశం అక్టోబరు 10న నిర్వహించనున్నట్లు చెప్పారు. దసరా ఉత్సవాల్లో వీఐపీలకూ టైం స్లాట్ దర్శనాలు దసరా ఉత్సవాల్లో విజయవాడ కనకదుర్గ గుడిలో వీఐపీలకు కూడా టైం స్లాట్ ప్రకారమే దర్శనాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. వీఐపీలు కూడా టికెట్ కొనాలని చెప్పారు. రోజుకు ఐదు ప్రత్యేక టైం స్లాట్లు ఉంటాయన్నారు. రెండేసి గంటలు ఉండే ఒక్కొక్క టైం స్లాట్‌లో రెండు వేల వీఐపీ టికెట్లను ఇస్తామన్నారు. అందులో 600 టికెట్లు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలు ఉన్నవారికి కేటాయించి, మిగిలినవి అందరికీ ఇస్తామన్నారు. ఒక లేఖకు ఆరు టికెట్లు ఇస్తామన్నారు. సిఫార్సు లేఖలు, ఇతర వీఐపీ టికెట్ల బుకింగ్‌కు విజయవాడ కలెక్టర్ ఆఫీసులో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు వంటి ప్రివిలేజ్డ్ వీఐపీలు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉదయం, సాయంత్రం వేళల్లో అర్ధ గంట చొప్పున ఉచిత దర్శనం ఉంటుందని తెలిపారు. సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. దుర్గ గుడి ఘాట్ రోడ్డును పూర్తిగా క్యూలైన్లకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఉచిత దర్శనానికి మూడు లైన్లు, రూ.300 టికెట్ వారికి ఒకటి, రూ.100 టికెట్ వారికి మరొక క్యూ ఉంటాయని చెప్పారు. వికలాంగులు, వృద్ధులకు రోజూ ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఒకసారి, సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య మరోసారి ప్రత్యేక దర్శనాలు ఉంటాయని వివరించారు. మంత్రులకూ అంతరాలయ దర్శనం ఉండదు దసరా ఉత్సవాల సమయంలో దుర్గగుడిలో అంతరాలయ దర్శనం గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి ప్రముఖులకు మాత్రమే ఉంటుందని తెలిపారు. మంత్రులకు సైతం బయట నుంచే దర్శనాలు కల్పించాలని ఆలోచన చేస్తున్నామని వివరించారు. దసరా ఉత్సవాల తర్వాత దుర్గగుడిలో అంతరాలయ దర్శనానికి రూ. 500 టికెట్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. -
ఇంద్రకీలాద్రి: భక్తుల కోలాహలం.. దుర్గమ్మకు ఆషాఢం సారె
-
Fact Check: ‘గోడ’ చాటు కుట్రలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల తప్పుడు ప్రచారాలకు తెరతీస్తున్న టీడీపీ నేతలు గోడమీద పిల్లుల్లా వ్యవహరిస్తూ సామాజిక మాధ్యమాల్లో బురద చల్లుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం దేవాలయాలను సైతం వారు వదలడం లేదు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఉదంతమే దీనికి తాజా ఉదాహరణ. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండేళ్ల కిత్రం తీసుకున్న నిర్ణయం మేరకు స్థానిక నీలమణి దుర్గమ్మ వారి ఆలయ ప్రహరీ గోడ, ఆర్చిని అధికారులు శనివారం స్వల్పంగా తొలగించారు. దీనిపై దుష్ప్రచారం చేస్తూ లోకేష్ సహా టీడీపీ నేతలు వైషమ్యాలను రగిల్చేందుకు సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెట్టారు. (చదవండి: రాష్ట్రపతి పాలన పెట్టాలనడం సరికాదు) ధ్వజస్థంభం, మండపానికి నష్టం వాటిల్లకుండా.. వాస్తవానికి భూ సమీకరణ ప్రక్రియలో భాగంగా ఆలయ ధ్వజ స్థంభం, మండపం లాంటివి సైతం తొలగించాల్సి ఉంది. ప్రస్తుతం 30 సెంట్ల విస్తీర్ణంలో ఆలయ ప్రాంగణం ఉండగా తొమ్మిది సెంట్ల మేర సమీకరణలో పోవాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే భక్తుల మనోభావాలను గౌరవిస్తూ నీలమణి దుర్గమ్మవారి ఆలయం ధ్వజస్థంభం, మండపం లాంటి వాటికి నష్టం వాటిల్లకుండా స్థానిక ఎమ్మెల్యే ఆరేడు నెలలుగా అధికారులతో పలు సంప్రందింపులు జరిపినట్లు దేవదాయ శాఖ వర్గాలు తెలిపారు. ఈ క్రమంలో ఫ్లైఓవర్ ప్రక్కగా నిర్మించాల్సిన అప్రోచ్ రోడ్డు డిజైను మార్చేందుకు సైతం స్థానిక ఎమ్మెల్యే కేంద్ర అధికారులను సైతం ఒప్పించారు. (చదవండి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లైంగిక వేధింపులు) దీంతో కేవలం ప్రహరీ గోడ, ప్రధాన ద్వారం అర్చిని రెండు అడుగుల మేర తొలగించేందుకు మాత్రమే పరిమితమైనట్లు అధికారులు తెలిపారు. తొమ్మిది సెంట్లకు బదులుగా ఇప్పుడు కేవలం అర సెంటు ఆలయ భూమిని మాత్రమే ఫ్లైఓవర్ నిర్మాణానికి వినియోగించుకుంటున్నారు. తొలగించిన గోడ స్థానంలో కేవలం మూడు అడుగులు మాత్రమే ఆలయం లోపలికి జరిపి కొత్తగా ప్రహారీ గోడ, ముఖ ద్వారం ఆర్చిని సంబంధిత కాంట్రాక్టరు ఆధ్వర్యంలోనే నిర్మించేలా ఒప్పందం జరిగింది. భూ సమీకరణ పరిహారం రూ.1.40 కోట్లు రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం కోసం 2019 ఆగస్టు 28వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన భూ సమీకరణ నోటిఫికేషన్ ప్రకారం గతేడాది అక్టోబరులో ఆలయానికి రూ. 1,40,57,404 పరిహారాన్ని మంజూరు చేశారు. జిల్లా స్పెషల్ గ్రేడ్ కలెక్టర్, స్థానిక తహసీల్దార్, దేవదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఈనెల 22వ తేదీన ఆలయాన్ని సందర్శించి ఎక్కువ నష్టం వాటిల్లకుండా తొలగింపులు పూర్తయ్యేలా మార్కింగ్‌లు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక తహసీల్దార్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ఆర్ అండ్ బీ డీఈఈ, సమక్షంలో తొలగింపు ప్రక్రియ చేపట్టారు. దసరా ఉత్సవాల కోసం వాయిదా ఫ్ల్రై ఓవర్ నిర్మాణంలో భాగంగా మూడు నెలల కిత్రమే ప్రహారీ గోడ తొలగింపు చేపట్టాలని కాంట్రాక్టర్ల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ ఆలయంలో దసరా ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఇన్నాళ్లు వాయిదా వేసినట్లు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. ఆలయంలో దసరా ఉత్సవాల పూర్తయిన తర్వాతే తొలగింపు పనులు చేపట్టామని, వెంటనే కొత్త ప్రహారీ గోడ, ఆర్చి నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నట్టు వివరించారు. బూతులు బెడిసికొట్టడంతో.. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభితో బూతులు మాట్లాడించి ప్రజల మధ్య వైషమ్యాలను రగిల్చే ఎత్తుగడ బెడిసికొట్టడంతో తాజా ఘటనను ఆ పార్టీ నేతలు ఎంచుకున్నారు. ‘రెండున్నరేళ్ల పాలనలో హిందూధర్మం మంటగలిసింది. దేవుళ్లకి తీరని అపచారం తలపెట్టారు’ అంటూ లోకేష్ మీడియాకు ప్రకటనలు విడుదల చేశారు. ఫ్యాక్ట్ చెక్‌తో వాస్తవాలు వెలుగులోకి.. ఈ సంఘటనకు సంబంధించిన వాస్తవాలను ఫ్యాక్ట్ చెక్ ద్వారా ప్రభుత్వం బయటపెట్టింది. టీడీపీ అధికారిక సోషల్ మీడియా పోస్టులతో పాటు స్థానిక ఆలయ ఈవో విడుదల చేసిన ప్రెస్‌నోట్‌ను జతపరిచి ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వం మీడియాకు వాస్తవాలను వెల్లడించింది. -
ఇంద్రకీలాద్రి: రేపు, ఎల్లుండి వీఐపీ, ప్రొటోకాల్ దర్శనాల రద్దు
సాక్షి, విజయవాడ: రేపు, ఎల్లుండి ఇంద్రకీలాద్రిపై వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలను రద్దు చేశారు. రేపు,ఎల్లుండి సాధారణ దర్శనాలను మాత్రమే అనుమతిస్తామని కలెక్టర్ తెలిపారు. భవానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించమని కలెక్టర్ తెలిపారు. చదవండి: ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ -
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ ఫొటోలు
-
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో అర్చకులు.. సీఎంకు స్వాగతం పలికారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సీఎం సమర్పించారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం అంతరాలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అందజేశారు. (చదవండి: దేవదేవుడికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ) ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు సీఎంకు పరివట్టం కట్టి తలపాగా చుట్టారు. పట్టు వస్త్రాలను సీఎం తలపై పెట్టగా వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య వైఎస్ జగన్.. దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. సీఎం జగన్ తో పాటు దుర్గమ్మను దర్శించుకున్న వారిలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని... ఎమ్మెల్యే జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కనకదుర్గమ్మకు సీఎం వైఎస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పించారని తెలిపారు. దేవీ నవరాత్రుల సందర్భంగా కోటి మంది అక్కచెల్లెమ్మలకు రూ.6782 కోట్లు ఆసరా అందించారని తెలిపారు. ఎంతమంది విఘ్నాలు తలపెట్టినా.. రాక్షసుల రూపంలో అడ్డుతగిలినా కనకదుర్గమ్మ, వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు సీఎం జగన్‌పై ఉంటాయని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. చదవండి: ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్ర (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇంద్రకీలాద్రి: 4 గంటల నుంచే అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శన వేళలను ఆలయ వైదిక కమిటీ ఖరారు చేసింది. ఉత్సవాలలో ప్రతి రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. ► తొలి రోజైన 7వ తేదీన అమ్మవారికి స్నపనాభిషేకం స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకారం నేపథ్యంలో ఉదయం 9 గంటలకు దర్శనం ప్రారంభం అవుతుందని వైదిక కమిటీ పేర్కొంది. ► ఇక 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజు తెల్లవారుజామున 4 గంటలకే దర్శనం ప్రారంభం అవుతుంది. ► 11వ తేదీ సోమవారం అమ్మవారిని అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మీగా అలంకరిస్తారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకు దర్శనం నిలిపివేస్తారు. రెండు గంటలకు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించిన అనంతరం దర్శనాలు ప్రారంభమవుతాయి. ► ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రోజుకు ఎంత మంది భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించాలనే దానిపై సృష్టత లేదని తెలుస్తుంది. త్వరలోనే జరగబోయే జిల్లా అధికారుల రివ్యూ మీటింగ్‌లో దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ► 12వ తేదీ మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించనున్నారని పేర్కొన్నారు. చదవండి: వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌లో ఏపీ మరో రికార్డు -
27న దుర్గమ్మ సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 27వ తేదీన సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించేందుకు దేవస్థాన వైదిక కమిటీ నిర్ణయించింది. 27వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మహామండపం ఆరో అంతస్తులో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తారు. టికెట్ ధరను రూ.1,500గా దేవస్థానం నిర్ణయించింది. టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు దేవస్థానమే పూజా సామాగ్రిని సమకూర్చుతుంది. భక్తులు టికెట్లను దేవదాయ ధర్మాదాయ శాఖ వెబ్సైట్ https://tms.ap.gov.in ద్వారా, దేవస్థాన ఆర్జిత సేవా టికెట్ల కౌంటర్లలో కొనుగోలు చేయవచ్చునని ఆలయ అధికారులు పేర్కొన్నారు. అలాగే, 27వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగే ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే అవకాశాన్ని భక్తులకు దేవస్థానం కల్పించింది. ఇందుకోసం తెల్లరేషన్ కార్డు ఉన్న భక్తులు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 23వ తేదీ నుంచి దేవస్థానం దరఖాస్తులను పంపిణీ చేస్తుంది. దరఖాస్తులను మహా మండపం గ్రౌండ్ ఫ్లోర్‌లోని టోల్ ఫ్రీ కౌంటర్లో ఉచితంగా పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులతో పాటు తెల్లరేషన్ కార్డు జిరాక్స్ కాపీని జత చేసి 25వ తేదీ సాయంత్రం 4 గంటల లోపుగా అందజేయాలి. సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొనే భక్తులు తప్పని సరిగా మాస్కులు ధరించాలని దేవస్థానం సూచించింది. పవిత్రోత్సవాల సందర్భంగా దర్శన వేళల్లో మార్పు దుర్గ గుడిలో ఈ నెల 21వ తేదీ నుంచి పవిత్రోత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శన వేళల్లో మార్పు చేశారు. 21 నుంచి పవిత్రోత్సవాలు ముగిసే 23వ తేదీ వరకు ఉదయం 9 గంటల తర్వాతే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అలాగే, ఆ మూడు రోజులపాటు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. -
నచ్చిన వారికి కొలువులు.. అడిగినంత వేతనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): నచ్చిన వారికి కొలువులివ్వడం.. వారు అడిగినంత వేతనాలు చెల్లించడం దుర్గగుడి అధికారులకు పరిపాటిగా మారింది. కమిషనర్ ఆర్డర్‌తో పని లేదు.. ఆలయంలో ఉద్యోగం చేసే అర్హతలున్నాయా లేదా అనేది అవసరం లేదు.. కావాల్సిందల్లా అధికారుల అండదండలే.. గత కొంత కాలంగా దుర్గగుడిలో పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అయితే ఈ విషయం ఏసీబీ అధికారుల దృష్టికి వెళ్లకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు పాటించారు. సోదాలు జరుగుతున్న సమయంలో ఈ ఉద్యోగులను విధుల్లోకి రానివ్వకుండా చూశారు. ప్రస్తుతం అక్కడి ఉద్యోగుల్లో ఇదీ చర్చనీయాంశం అయ్యింది. ►అమ్మవారి పల్లకీసేవ, ఊరేగింపులు, ఉత్సవాల సమయంలో బోయలు సేవలు చేస్తుంటారు. గతంలో దేవస్థానంలో 14 మంది బోయలు విధులు నిర్వహిస్తుండగా, కొత్తగా ఇద్దరు బోయలను విధుల్లోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో భారీగానే సొమ్ము చేతులు మారినట్లు తెలుస్తోంది. కొత్తగా విధుల్లోకి చేరిన బోయలకు కమిషనర్ అనుమతి లేదు. రెండు నెలలుగా వారికి వేతనాలు చెల్లించడం లేదు. బోయలకు వేతనాలు చెల్లించాలంటే తొలుత వారి వివరాలను దేవస్థాన పరిపాలనా విభాగం రిజిస్ట్రార్‌లో నమోదు చేసుకోవాలి. తమ వివరాలను నమోదు చేసి వేతనాలు చెల్లించాలంటూ బోయలు రెండు నెలలుగా ఈవో చాంబర్‌కు, పరిపాలనా విభాగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ►అమ్మవారి ప్రసాదాలను విక్రయించే కౌంటర్లలో ఇద్దరు సిబ్బందిని దేవస్థాన అధికారులు నియమించారు. గతంలో ఏళ్ల తరబడి విధులు నిర్వహించిన సిబ్బందిని కరోనా సమయంలో ఆలయ అధికారులు తొలగించారు. తొలగించిన వారి స్థానంలో కొత్తగా ఇద్దరిని నియమించడానికి భారీగానే సమర్పించుకున్నట్లు సమాచారం. ►దుర్గగుడిలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాలను కవరేజీ చేసేందుకు ఒక ఫొటోగ్రాఫర్, ఒక వీడియో గ్రాఫర్ ఉన్నారు. అయితే నెల రోజుల కిందట మరొకరిని అదనంగా విధుల్లోకి తీసుకున్నారు. ఇక్కడకూ కమిషనర్ ఆర్డర్ లేదు. ►ఇలా అనధికారికంగా విధుల్లోకి తీసుకున్న వారి నుంచి కమీషన్లు దండుకున్న అధికారులు వాస్తవంగా పనిచేస్తున్న సిబ్బంది కన్న ఎక్కువగా జీతాలు ఇస్తామంటూ నమ్మబలికినట్లు తెలిసింది. అధికారుల తీరుపై సిబ్బంది ఆగ్రహం దుర్గగుడిలో ఎన్నో ఏళ్లుగా 80 మంది ఎన్‌ఎంఆర్‌లు(నాన్ మస్టర్ రోల్)గా, ఇంజినీరింగ్ విభాగంలో మరో 18 మంది కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో అనేక మంది రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న వారు ఉన్నారు. అయితే ఎన్‌ఎంఆర్‌లకు రూ.15 వేల నుంచి రూ.16 వేలు చెల్లిస్తుండగా.. అనధికారికంగా కొత్తగా విధుల్లోకి చేర్చుకున్న వారికి మాత్రం రూ.18 వేలు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. దీనిపై సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: 13 మంది దుర్గ గుడి ఉద్యోగుల సస్పెన్షన్.. నేడు కుప్పానికి బాబు: మేము రాలేం బాబోయ్! -
పాపాల పుట్టలు పగులుతున్నాయ్
సాక్షి, అమరావతి: భక్తుల రద్దీ అధికంగా ఉండే ఆలయాల్లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న అక్రమార్కులపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. పెద్ద ఆలయాల్లో అవినీతికి ఆస్కారం ఉన్న విభాగాల్లో కొందరు ఉద్యోగులు ఏళ్ల తరబడి తిష్ట వేసి సాగిస్తున్న అవినీతి దందాలపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. విజయవాడ దుర్గగుడిలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఉద్యోగుల అవినీతి బట్టబయలైంది. పదేళ్లుగా దుర్గమ్మ ఆలయ ఆస్తుల రిజిస్టర్‌ను సరిగా నిర్వహించడం లేదన్న విషయం కూడా బయటపడింది. అమ్మవారికి భక్తులు సమర్పించే కానుకలు సహా ఆలయానికి వచ్చే ఆదాయం, ఆస్తుల వివరాలను 43వ నంబర్ రిజిస్టర్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉండగా, పదేళ్లుగా అలాంటివేవీ నమోదు చేయడం లేదని ఏసీబీ అధికారులు తేల్చారు. అవినీతికి పరాకాష్టగా మారిన ఈ వ్యవహారంలో 15 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేయడం దేవదాయ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. శ్రీశైలం ఆలయంలోనూ.. 2020 జూన్‌లో ఏసీబీ అధికారులు శ్రీశైలం ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. 2016 ఏప్రిల్ నుంచి ఆలయంలో చోటుచేసుకున్న అక్రమాలను బయటపెట్టారు. స్వామివారి దర్శన టికెట్లకు సంబంధించి దాదాపు రూ.2.50 కోట్ల మేర అక్రమాలు చోటుచేసుకున్నట్టు అప్పట్లో ఏసీబీ అధికారులు గుర్తించారు. అప్పట్లో టికెట్ల విక్రయ విభాగంలో పనిచేసే 26 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై కేసులు నమోదు చేసిన ప్రభుత్వం, ఆ తర్వాత ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉన్నారన్న ఆరోపణలతో ఆరు నెలల క్రితం 11 మంది ఆలయ రెగ్యులర్ ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ప్రసాదాల నుంచి ఫొటోల వరకూ.. దుర్గ గుడిలో కీలకంగా పనిచేసే ఓ ఉద్యోగి సంప్రదాయ విక్రయ కౌంటర్లో తన సమీప బంధువును అనధికారికంగా నియమించి భారీగా సొమ్ములు దిగమింగుతున్నట్టు ఏసీబీ తేలి్చంది. అమ్మవారి దర్శన టికెట్ల అమ్మకాలకు సంబంధించి ప్రైవేట్ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో జరిగే లావాదేవీలకు సంబంధించిన రశీదుల రిజిస్టర్లో సూపరింటెండెంట్ సంతకాలు ఉండటం లేదని, టికెట్ల విక్రయాల్లో భారీ లొసుగులు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. భక్తులు అందజేసే చీరల్ని ఉంచే గొడౌన్, అమ్మవారి ఫొటోలు అమ్మే విభాగంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఏసీబీ తేల్చింది. అన్న ప్రసాద విభాగంలో కూరగాయలు, పాలు, ఇతర సామగ్రి కొనుగోళ్లలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్టు గుర్తించింది. అన్నదానం కోసం భక్తులు ఇచ్చిన రూ.54,31,382 నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చేయకుండా బ్యాంకు ఖాతాలో అలా ఉంచినట్టు తేల్చారు. కొందరు ఎన్ఎంఆర్ ఉద్యోగులు ఆరు నెలలకు పైగా విధులకు హాజరుకాకపోయినా వారిని కొనసాగిస్తున్నట్టు నిర్ధారించారు. దుర్గ గుడికి మళ్లీ వచ్చిన ఏసీబీ ఇంద్రకీలాద్రి (విజయవాడ, పశ్చిమ): ఏసీబీ అధికారులు మరోమారు బుధవారం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. బ్రాహ్మణ వీధిలోని దేవస్థాన పరిపాలనా భవనానికి వెళ్లిన అధికారులు ఆలయ సిబ్బందిని ప్రశ్నించారు. ఇంతకుముందు ఆలయంలో జరిపిన తనిఖీలకు సంబంధించి కొన్ని కీలక పత్రాల గురించి ఆరా తీయడంతో పాటు కొన్ని సంతకాలు తీసుకున్నట్టు తెలిసింది. ఇదిలావుండగా.. ఆలయ ఈవో ఎంవీ సురేష్ బాబు తీరుపై సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన అంతర్గత బదిలీల సందర్భంగా ఈవో తనకు అనుకూలంగా ఉన్న వారిని అందలం ఎక్కించినట్టు పేర్కొంటున్నారు. కిందిస్థాయి ఉద్యోగులకు సూపరింటెండెంట్ స్థాయి బాధ్యతలు అప్పగించగా.. సూపరింటెండెంట్ స్థాయి అధికారులకు కింది స్థాయిలో విధులు కేటాయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై ఎవరి దందా వారిదే దుర్గ గుడిలో పదేళ్లుగా కొనసాగుతున్న అనేక అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆలయంలోని కొన్ని కీలక విభాగాల్లో ఏళ్ల తరబడి తిష్ట వేసిన ఉద్యోగులు ఎవరికి వారు అవినీతి దందాలను కొనసాగిస్తున్నట్టు తేలింది. ఈవోలు కూడా ఆ ఉద్యోగుల దందాకు వంత పాడుతూ వస్తున్నారు.ఆలయ ఆస్తులకు సంబంధించిన 43 రిజిస్టర్‌తో పాటు షాపులు, భూముల లీజులకు సంబంధించిన 8ఏ రిజిస్టర్‌ను కూడా సక్రమంగా నిర్వహించడం లేదని ఏసీబీ తేల్చింది. వాటికి సంబంధించి పెద్ద సంఖ్యలో ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకోవడం లేదని స్పష్టం చేసింది. సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లను సమకూర్చేందుకు టీడీపీ హయాంలో మాక్స్ డిటిక్టెవ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం దానికి దేవదాయ శాఖ కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉండగా.. అనుమతులు పొందకుండానే రెండేళ్లుగా ఆ ఏజెన్సీని కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థకు పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లిస్తున్నారు. ఆరేళ్లుగా ఆలయ పర్యవేక్షక సూపరింటెండెంట్ బాధ్యతలు చూస్తున్న ఉద్యోగికి ఆ ప్రైవేట్ ఏజెన్సీతో బినామీ లావాదేవీలున్నట్టు ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం ఆలయాలు సహకార డెయిరీల నుంచే నెయ్యి కొనుగోలు చేయాల్సి ఉండగా, గత కొన్నేళ్లుగా గుంటూరు జిల్లా టీడీపీ నాయకుడికి చెందిన డెయిరీ నుంచి ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్టు తేలింది. -
13 మంది దుర్గ గుడి ఉద్యోగుల సస్పెన్షన్..
సాక్షి, అమరావతి/సాక్షి, విజయవాడ: విజయవాడ దుర్గ గుడిలో పనిచేసే ఐదుగురు సూపరింటెండెంట్ స్థాయి సిబ్బందితో సహా మొత్తం 13 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గుడిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరం అందజేసిన నివేదిక మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గుడి భూములు, షాపుల లీజు వ్యవహారాలతో పాటు అన్నదానం, దర్శనాల టికెట్ల అమ్మకం, అమ్మవారి చీరల వ్యవహారాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అందించిన ప్రాథమిక సమాచారం మేరకు ఏడు రకాల విభాగాల్లో పనిచేసే సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా ఆలయ ఈవో సురేష్‌బాబును ఆదేశిస్తూ దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు సోమవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు అన్నదానం, స్టోర్స్, హౌస్ కీపింగ్ విభాగపు సూపరింటెండెంట్లతో పాటు, గుడి భూములు, షాపుల లీజు వ్యవహారాలను పర్యవేక్షించే విభాగపు సూపరింటెండెంట్, ఇంద్రకీలాద్రి కొండపై వివిధ రకాల కౌంటర్లను నిత్యం పర్యవేక్షించే సూపరింటెండెంట్లను సస్పెండ్ చేస్తూ సురేష్‌బాబు చర్యలు తీసుకున్నారు. దర్శన టికెట్ల అమ్మకం కౌంటర్లో పనిచేసే ముగ్గురితో పాటు ప్రసాదాల పంపిణీ, అమ్మవారి చీరలు భద్రపరిచే విభాగం, ఫొటోల అమ్మకం విభాగాల్లో పనిచేసే సిబ్బందిని ఈవో సస్పెండ్ చేశారు. చదవండి: రికార్డు: ‘ఐబీపీఎస్’లో ఏపీ ఫస్ట్ డేటాతో పురోగతికి బాట -
దుర్గమ్మ కలశ జ్యోతుల ఉత్సవం
-
ఏడుపాయల క్షేత్రంలో చోరీ
పాపన్నపేట (మెదక్): మెదక్ జిల్లా ఏడుపాయల దుర్గమ్మ క్షేత్రంలో చోరీ జరిగింది. అమ్మవారికి భక్తులు కానుకగా ఇచ్చిన వెండి గడప తొడుగును ఈవో కార్యాలయంనుంచి దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనలో ఆలయ సిబ్బందిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్‌లో మంజీర నదికి వరదలు వచ్చిన సమయంలో ఆలయ అర్చకులు గర్భగుడి గడపకు ఉన్న వెండి తొడుగు తీసి ఈఓ కార్యాలయంలో భద్రపర్చారు. అయితే మూడు రోజుల క్రితం వెండి తొడుగు కనిపించక పోవడంతో కార్యాలయంలో వెతికారు. ఎంత వెతికినా వెండి తొడుగు దొరక్కపోవడంతో ఈఓ శ్రీనివాస్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సంగయ్య తెలిపారు. వెండి గడప తొడుగు సుమారు రెండు కిలోల వంద గ్రాముల బరువు, రూ.84 వేల విలువ చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం వెండి తొడుగు దాచి ఉంచిన కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగతనం జరగడం గమనార్హం. గతంలోనూ చోరీలు.. ఏడుపాయల క్షేత్రంలో గతంలోనూ పలు దొంగతనాలు జరిగాయి. ఆలయ హుండీని పగులగొట్టి సొత్తును దోచుకెళ్లారు. రెండేళ్ల క్రితం ఇనుప స్క్రాప్ మాయమైంది. ఇటీవల ఘనపురం ఆనకట్టకు వెళ్లే దారిలో బిగించిన సీసీ కెమెరాలను సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. ఇప్పటివరకు దొంగలు దొరకలేదు. పలు దొంగతనాల్లో ఆలయ సిబ్బంది ప్రమేయంపై ఆరోపణలు వచ్చాయి. -
అమ్మవారిని దర్శించుకున్న చినజీయర్ స్వామి
సాక్షి, విజయవాడ: ఇంద్ర కీలాద్రిపై శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని చినజీయర్ స్వామి దర్శించుకున్నారు. చిన్న జీయర్ స్వామికి దుర్గ గుడి ఈవో సురేష్ బాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించి ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. చిన్న జీయర్ స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం చిన జీయర్ స్వామి మాట్లాడుతూ, ‘ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపిస్తోంది. కరోనా మహమ్మారి బారిన పడి ప్రజలు కష్టాలు పడుతున్నారు. కరోనా నివారణ వ్యాక్సిన్ కోసం భారత్ సహా ప్రపంచ దేశాల్లో తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్ లోనూ వ్యాక్సిన్ పై రెండో దశ పరీక్షలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ కోసం చేస్తోన్న ప్రయత్నాలు సఫలం కావాలని అమ్మవారిని ప్రార్థించా. వ్యాక్సిన్ వస్తే ప్రజల్లో వ్యాధినిరోధక శక్తి పెరిగి తిరిగి శక్తిమంతులవుతారు. భారత్ తిరిగి శక్తివంతమైన దేశంగా వెలుగొందాలని కోరుకున్నా. పర్యావరణ పరిరక్షణ చాలా ముఖ్యమైంది. ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ పాటు పడాలి’ అని అన్నారు. చదవండి: శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మ -
వరదలు: లంక ప్రజలు మరింత అప్రమత్తం
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ఉధృతికి ప్రకాశం బ్యారెజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు విపత్తు శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. బుధవాంర ఆయన మీడియాతో మాట్లాడుతూ... మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో, వుట్ ఫ్లో 7,20,701 లక్షల క్యుసెక్కులుగా నమోదైనట్లు చెప్పారు. అలాగే వంశధార నదికి కూడా వరద ఉధృతి పెరుగుతోందని, దీంతో గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బుధవారం బ్యారెజ్ ఇన్ ఫ్లో 42,980 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 42,916 క్యూసెక్కులు నమోదైందని తెలిపారు. ఇక ముంపు ప్రాంతాల్లోకి వరద ప్రవాహాం చేరుతున్నప్పుడు ముందస్తు పునరావాస కేంద్రాలను వెళ్లాలని, లోతట్టు ప్రాంత, లంక గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు విజ్ఞప్తి చేశారు. దుర్గగుడి అధికారుల అత్యవసర భేటీ: దుర్గగుడి ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడడంపై గుడి అధికారులు ఈవో సురేష్ బాబు, చైర్మన్ పైలా సోమినాయుడు, దుర్గగుడి ఈడీ భాస్కర్ బుధవారం అత్యవసర సమావేశమయ్యారు. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండటంతో సమావేశమైనట్లు తెలిపారు. ఈ నెల 17నుంచి జరిగే దసరా ఉత్సవాలకు ఘాట్ రోడ్డులో భక్తులను అనుమతించాలా లేదా అనే దానిపై అధికారులు ప్రధానంగా చర్చించారు. ఇలాగే వర్షాలు కొనసాగితే ఘాట్ రోడ్డు మీదుగా భక్తులకు అనుమతి ఇవ్వకూడదని అధికారులు నిర్ణయించామని, దీనిపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌తో సమావేశం నిర్వహించిన తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తమని అధికారులు తెలిపారు. -
ఇంద్రకీలాద్రి: టికెట్ ఉంటేనే దర్శనం!
సాక్షి, అమరావతి: ఇంద్రకీలాద్రిపై ఈ నెల 17 నుంచి 25 వరకు జరగనున్న దసరా ఉత్సవాల్లో టికెట్లు కలిగి ఉన్న వారినే కనకదుర్గమ్మ వారి దర్శనానికి అనుమతించనున్నట్టు కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ వెల్లడించారు. ఆన్లైన్లో రూ.300లు, 100ల టికెట్లతో పాటు ఉచిత దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో దుర్గ గుడి చైర్మన్ పైలా స్వామినాయుడు, ఈవో ఎం.సురేష్‌బాబులతో కలిసి కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉత్సవాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. క్యూలైన్లలో భక్తులకు శానిటైజర్లు సమకూరుస్తామన్నారు. సాధారణ రోజుల్లో రోజూ 10 వేల టికెట్లు, మూలా నక్షత్రం రోజున 13 వేల టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు. గంటకు వెయ్యి మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. పదేళ్ల లోపు, 65 ఏళ్ల పైబడ్డ వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగులకు ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిపైకి అనుమతించడం లేదని స్పష్టం చేశారు. కోవిడ్ దృష్ట్యా ఇతర జిల్లాల పోలీసులను బందోబస్తుకు రప్పించడం లేదని తెలిపారు. ఆన్లైన్లో లక్ష టికెట్లు.. అమ్మవారి దర్శనానికి లక్ష టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని దేవస్థానం చైర్మన్ పైలా స్వామినాయుడు తెలిపారు. భక్తులు ఇప్పటికే సుమారు 67 వేల టికెట్లు తీసుకున్నారని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని జిల్లాల భవానీ దీక్ష గురువులతో మాట్లాడామన్నారు. దేవాలయంలో భవానీ దీక్షల మాలధారణ, విరమణలకు అనుమతించడం లేదని, వీటిని వారి గ్రామాల్లోనే చేపట్టాలని సూచించినట్టు తెలిపారు. అమ్మవారి తెప్పోత్సవం యథావిధిగా నిర్వహిస్తామని, కానీ భక్తులను అనుమతించబోమని స్పష్టం చేశారు. వీఐపీలకు ప్రత్యేక సమయాలు కేటాయిస్తామన్నారు. ఉదయం 5 నుంచి రాత్రి 8 వరకే దర్శనాలు ఉత్సవాల మొదటి రోజు అక్టోబర్ 17న ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు, ఆ తర్వాత రోజుల్లో ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని ఈవో సురేష్‌బాబు తెలిపారు. మూలా నక్షత్రం (21న) రోజున అమ్మవారి దర్శనం ఉదయం 3 నుంచి రాత్రి 9 వరకు ఉంటుందన్నారు. వినాయక గుడి నుంచి భక్తులను అనుమతిస్తామని.. భక్తులు మాస్క్‌లు ధరించాలని, థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలని, తమ వెంట మంచినీరు తెచ్చుకోవాలని సూచించారు. ఆలయ బస్సులు, లిఫ్టు సౌకర్యాన్ని, ఘాట్‌రోడ్డు దారిని నిలిపి వేస్తున్నామన్నారు. ఆన్లైన్ ద్వారా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, వాటికి సంబంధించిన ప్రసాదాన్ని, వస్త్రాలను పోస్టు ద్వారా పంపుతామని చెప్పారు. మీడియా పరిమిత సంఖ్యలో రెండు షిఫ్టుల్లో కవరేజీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. -
‘అది గుడిని, గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్’
-
‘అది గుడిని, గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్’
సాక్షి, గుంటూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘గుడిని, గుడిలో లింగాన్ని మింగేవాళ్లు. చంద్రబాబుకు దేవుడంటే అసలు నమ్మకం లేదు. ఆయన రాష్ట్రంలో కుల, మతాలను రెచ్చగొడుతున్నారు. టీడీపీ హయాంలో విజయవాడలో 41 ఆలయాలను కూల్చారు. ఆనాడు ఎవరైనా దేవాలయాల కూల్చివేతపై మాట్లాడారా? గోదావరి పుష్కరాల్లో 30 మందిని చంద్రబాబు బలి తీసుకున్నారు. ఎక్కడో చిన్న తప్పిదం జరిగితే దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌తో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద జల్లుతున్నారు. బుద్ధా వెంకన్న సైకిల్ బెల్లను దొంగతనాలు చేసేవాడు. ఆయనో బుద్ధిలేని వ్యక్తి. మంత్రి వెలంపల్లి నివాసంలో వెండి సింహాలు ఉన్నాయనటం దారుణం. మంత్రి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. వెండి రథానికి నాలుగు అడుగుల దూరంలో బుద్ధా వెంకన్న ఇల్లు ఉంది. ఈ కేసులో బుద్ధా వెంకన్నను విచారణ చేయాలి.’ అని ఎమ్మెల్యే గిరిధర్ డిమాండ్ చేశారు. (చదవండి: హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి) (చదవండి: చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం) -
సింహం ప్రతిమలు మాయం, మంత్రి పర్యటన
సాక్షి, విజయవాడ: బెజవాడ దుర్గమ్మ గుడిలోని వెండి రథం, సింహం ప్రతిమలు మాయమైనట్టు ఆలయ అధికారులు గుర్తించారు. రథానికి నాలుగు వైపులా ఉండాల్సిన సింహం ప్రతిమల్లో మూడు కనిపించడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారి వెండి రథాన్ని బుధవారం పరిశీలించారు. అమ్మవారి వెండిరథంపై మూడు సింహాలు కనిపించడం లేదని పరిశీలనలో తేలిందని వెల్లడించారు. ఆలయాల్లో రథాల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చాలా ఆలయాల్లో భద్రతను ప్రైవేట్ ఏజెన్సీలు చూస్తున్నాయని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రథాన్ని ఉపయోగించలేదని తెలిపారు. ఘటనపై దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని మంత్రి చెప్పారు. అన్ని విషయాలు విచారణలో తేలుతాయని అన్నారు. (చదవండి: మంత్రి సీదిరి అప్పలరాజు సాహసం) -
దుర్గగుడి సిబ్బందికి కరోనా సెగ
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ బెజవాడ దుర్గగుడి సిబ్బందిని వణికిస్తోంది. ఇప్పటికే ఆలయంలోని కీలక అధికారితో పాటు ఐదరుగురు సిబ్బంది కరోనా బారిన పడగా తాజాగా మరో ఏడుగురుకు పాజిటివ్ రావడం ఇంద్రకీలాద్రిపై చర్చనీయాశంగా మారింది. ఇప్పటికీ రెండుసార్లు సిబ్బందికి వైద్య పరీక్షలు చేయించారు. గతంలో ఒక వేదపడింతుడు, ఉద్యోగి కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. అయితే వారికి కరోనాతో పాటు ఇతర శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి. మిగిలిన వారు సురక్షితంగా బయట పడ్డారు. తాజాగా గత వారం దుర్గగుడిలో రెండోసారి 393 మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో ఏడుగురికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 450 మంది వరకు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. సిబ్బందిలో ఆందోళన కరోనా పరీక్షలు చేసే వరకు వ్యాధి బయటపడటం లేదు. దీంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కొండపై పరిస్థితి మారిపోయింది. ఆలయంలో రోజూ శానిటైజ్ చేసినా, మాస్క్‌లు ధరించినా రోజు ఎవరో ఒకరు కరోనా బారిన పడ్డారనే సమాచారం వస్తూ ఉండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. మిగిలిన ఆలయాతో పోల్చితే తక్కువే... శ్రీశైలం, అన్నవరం తదితర ఆలయాలతో పోల్చితే ఇక్కడ కరోనా సోకిన సిబ్బంది తక్కువగానే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఆయా దేవాలయాల్లో 25 మంది కంటే ఎక్కువ మంది సిబ్బంది కరోనాకు గురికావడంతో ఏకంగా దేవాలయాలను కొద్దిరోజులు మూసివేశారు. ఇక్కడ అలా కాదు. లాక్డౌన్ సడలించిన తరువాత ఒక్కరోజు కూడా ఆలయాన్ని మూసివేయలేదు. దీనికి రక్షణ చర్యలే కారణమని ఈఈ భాస్కర్ తెలిపారు. -
ఇంద్రకీలాద్రిపై శ్రావణమాసం సందడి
-
శ్రావణ శుక్రవారం అమ్మవారి గుడికి భక్తులు
-
ఆలయ అభివృద్ధికి దాతలు భాగస్వాములవ్వాలి
సాక్షి, విజయవాడ: కనక దుర్గ గుడిలో శాశ్వత కేశఖండన శాల నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు అన్నారు. గురువారం మూడు గంటల పాటు కొనసాగిన పాలకమండలి సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా బారిన పడిన సిబ్బందిని ఆలయపరంగా ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం దాతలు ముందు రావాలని కోరారు. డోనర్స్ సెల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా ఆలయ ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ.. పాలకమండలి సమావేశంలో 38 అంశాలపై చర్చించామని తెలిపారు. శివాలయం పునర్నిమాణం, అన్నదానం, ప్రసాదం పొటు, కేశఖండన శాల నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పనులకు సంబంధించి అనుమతులు కూడా వచ్చాయని తెలిపారు. తూర్పు రాజగోపురం నుండి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో దాతలు భాగస్వాములు అవ్వాలని కోరారు. సిబ్బందికి కోవిడ్ ఇన్సూరెన్స్ కల్పించేలా కమిషనర్ దృష్టి కి తీసుకు వెళతామన్నారు. భక్తులు నిర్భయంగా దర్శనానికి రావచ్చని, ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. లాక్ డౌన్ ఎత్తేస్తే దర్శన సమయంలో మార్పులు చేస్తామని వ్యాఖ్యానించారు. -
కనక దుర్గమ్మకు ఆషాఢ సారె..
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ఆలయ వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు పవిత్ర సారెను సమర్పించారు. వైదిక కమిటీ కమిటీ సభ్యులు,అర్చకులకు ఆలయ మర్యాదలతో ఈవో ఎంవీ సురేష్‌బాబు స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారె సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను తమ ఆడపడుచుగా భావించి భక్తులు సారె సమర్పించుకుంటారు. ఆషాఢంలో ప్రతి ఏడాది పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తారన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆషాఢ సారె మహోత్సవం కొనసాగుతుంది. -
కనక దుర్గమ్మకి బంగారు బోనం
సాక్షి, విజయవాడ: బెజవాడ కనక దుర్గమ్మకి తెలంగాణ మహాంకాళి ఉమ్మడి దేవాలయాల కమిటీ బంగారు బోనం సమర్పించింది. ఆదివారం తెలంగాణ నుంచి వచ్చిన బోనాలకు దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈఓ సురేష్ బాబు స్వాగతం పలికారు. జమ్మిదొడ్డి నుంచి ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి సన్నిధికి తెలంగాణ మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు కాలినడకన చేరుకున్నారు. జమ్మిదొడ్డి వద్ద కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. (కరువు సీమలో సిరులు) రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి ఏడాది దుర్గమ్మకు బోనం సమర్పిస్తున్నామని తెలిపారు. కరొనా కారణంగా అమ్మవారికి ఆడంబరంగా కాకుండా కేవలం పరిమితంగానే బంగారు బోనం సమర్పిస్తున్నామని చెప్పారు. అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. అదే విదంగా ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు తలిపారు. సాయంత్రం 7 గంటల వరకు శాకాంబరిదేవీగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిబంధనలను అనుసరించి శాకాంబరి ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు. కరోనా నిబంధనల ప్రకారం పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నట్లు చెప్పారు. -
ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉస్తవాలు
-
ఇంద్రకీలాద్రి: ఆషాఢ సారె మహోత్సవం
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె మహోత్సవం ప్రారంభమైంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి తొలి ఆషాడమాస సారెను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆషాడ మాస సారెను దేవస్థానం తరపున అందజేయటం ఆనందంగా ఉందన్నారు. ఆషాఢంలో ప్రతి ఏడాది పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తారన్నారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటించాలని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 20 వరకు సారె మహోత్సవం.. వచ్చే నెల 20వ తేదీ వరకు ఆషాఢ సారె మహోత్సవం కొనసాగుతుందని దుర్గ గుడి ఈవో సురేష్‌బాబు తెలిపారు. సారె సమర్పించడానికి వచ్చే భక్తులు ముందుగా ఆన్లైన్లలో బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే అమ్మవారికి సారె సమర్పించాలని వెల్లడించారు. భక్తులు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించి, మాస్క్‌లు ధరించాలని కోరారు. గుంపులు గుంపులుగా రావొద్దని భక్తులకు ఈవో సురేష్‌బాబు విజ్ఞప్తి చేశారు. -
రెండో రోజు దుర్గమ్మ దర్శనం..
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఆన్లైన్ టిక్కెట్లు బుక్ చేసుకుని భక్తులు దర్శనానికి వస్తున్నారు. క్యూలైన్లలో భక్తులు భౌతిక దూరం పాటించేలా ఆరు అడుగుల మార్కింగ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్టాట్ బుక్ చేసుకున్న భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి దర్శనాలు ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకే అమ్మవారి దర్శనం కొనసాగుతుంది. (భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్) కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంద్రకీల్రాదీపై అధికారులు పకడ్బందీ జాగ్రత్త చర్యలు చేపట్టారు. దర్శనానికి గంటకు 250 మంది భక్తులను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. శానిటైజ్ చేసి చేతులు శుభ్రం చేసుకుని, మాస్క్ ధరిస్తేనే భక్తులకు అనుమతిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ లో టెంపరేచర్ ఎక్కువ వస్తే అనుమతులు ఇవ్వడం లేదు. శఠగోపురం, తీర్థ ప్రసాదంతో పాటు ఆశీర్వచనాలు రద్దు చేశారు. అంతరాలయ దర్శనం నిలిపివేశారు. ముఖ మండపం ద్వారానే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. మహా మండపం వద్ద మరో ఆన్ లైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. కరోనా దృష్ట్యా అన్ని అర్జిత సేవలకు అనుమతి ఇవ్వడం లేదు. ఘాట్ రోడ్డు మార్గం ద్వారా భక్తులకు అనుమతిలేదని, వృద్ధులు, చిన్నపిల్లలకు ఆలయ ప్రవేశం లేదని అధికారులు స్పష్టం చేశారు. (ఏపీ: నేడు, రేపు భారీవర్షాలు) -
‘ఆ స్థాయి మహేష్‌కు లేదు’
సాక్షి, విజయవాడ: మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌పై జనసేన నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, వైఎస్సార్సీపీ నేత కొనకళ్ల విద్యాధరరావు అన్నారు. దేవాలయాలు పునర్నిర్మాణం చేయలేదన్న మహేష్ వ్యాఖ్యల్లో అర్థం లేదని తోసిపుచ్చారు. టీడీపీ ప్రభుత్వం పుష్కరాలను అడ్డు పెట్టుకుని అనేక దోపిడీలకు పాల్పడిందని విమర్శించారు. టీడీపీ హయాంలో దేవాలయాలు కూల్చివేస్తుంటే బాబుతో దోస్తీ చేసిన పవన్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన తప్పులను ఈ ప్రభుత్వం సరిచేస్తోందని హితవు పలికారు. పైలా సోమినాయుడు, కొనకళ్ల విద్యాధరరావు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘జిల్లాలోని దేవాలయాలకు ఏడాది కాలంలో రూ.15 కోట్లు ఇచ్చిన ఘనత వెలంపల్లికే దక్కుతుంది. అవగాన లేకుండా పోతిన మహేష్ మాట్లాడడం తగదు. శివస్వామిని విమర్శించే స్థాయి మహేష్ కు లేదు. కరోనా సమయంలో ప్రజలందరికీ కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేసిన వ్యక్తి వెలంపల్లి. వైఎస్సార్సీపీ నేతల వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని అసత్య ప్రేలాపనలు చేస్తున్నారు. గత టీడీపీ హయాంలో కూల్చివేసిన ఆలయాలను తిరిగి పునర్నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఆధారాలుంటే విమర్శలు చేయాలి తప్ప అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు’అని వారు పేర్కొన్నారు. -
కరోనా డేంజర్: దుర్గ గుడిలో సేవలు నిలిపివేత
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ విజృంభిస్తున్నందున దుర్గ గుడిలో మార్చి 31 వరకు అన్ని సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు పేర్కొన్నారు. అమ్మవారి అంతరాలయ దర్శనాలను రద్దు చేశామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలను నిలిపేసినట్లు వెల్లడించారు. కేశ ఖండనశాలను, అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లే బస్సులను, లిఫ్టులను నిలిపివేశామన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు శానిటైజేషన్ లిక్విడ్ అందజేస్తున్నామని తెలిపారు. భక్తులందరికీ వైద్యపరీక్షలు చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాక దేశ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని హోమాలు జరిపిస్తున్నామన్నారు. (హమ్మయ్యా.. మనోళ్లు వచ్చేశారు) దుర్గాగుడి ఆలయ ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ.. ఉగాది రోజు పంచాగశ్రవణం ఉంటుందని, కానీ అమ్మవారి సేవలకు భక్తులకు అనుమతి లేదన్నారు. అమ్మవారికి జరిగే సేవలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. భక్తులు ఎవరైనా ముందుగా సేవలను బుక్ చేసుకుని ఉంటే వారిపేరున సేవలు నిర్వహిస్తామన్నారు. లేదు, డబ్బు తిరిగి కావాలనుకుంటే చెల్లిస్తామన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిసరాలను శుభ్రపరుస్తున్నామని తెలిపారు. మహామండపం నుంచి మెట్లమార్గం ద్వారా ఘాట్ రోడ్డు మార్గాల్లోనే భక్తుల అనుమతినిచ్చామన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు దర్శనానికి రాకపోవడమే మంచిదని సూచించారు. పొంగలి, కదబం, దద్దోజనం వంటి ప్రసాదాలు ప్యాకెట్ల రూపంలో అందిస్తున్నామని తెలిపారు. (ఓ మై గాడ్... వెంకన్న రక్షించాడు) చదవండి: కరోనాపై టీటీడీ దండయాత్ర -
‘టీడీపీకి మరోసారి చెంపదెబ్బ తప్పదు’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం కొనసాగుతుందని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మరోసారి ప్రజలు పట్టం కడతారని పేర్కొన్నారు. టీడీపీకి మరోమారు చెంపదెబ్బ తప్పదని విమర్శించారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీలు కనుమరుగవడం ఖాయమన్నారు. 58 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసిన పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమేనని చెప్పారు. (అభ్యర్థులు లేకే చంద్రబాబు డ్రామాలు) బాబుకు బీసీలు బుద్ధి చెబుతారు.. బీసీలకు అన్యాయం చేయడానికే ప్రతిపక్ష నేత చంద్రబాబు కోర్టుకు వెళ్లారని.. ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెబుతారన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను విమర్శించే అర్హత మాజీ మంత్రి దేవినేని ఉమాకు లేదని దుయ్యబట్టారు. అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. టీడీపీ నేతలు గుండాయిజం మానుకోవాలని సోమినాయుడు హితవు పలికారు. (టీడీపీకి హైకోర్టులో చుక్కెదురు) -
ఏపీ: మూడు ఆలయాలకు పాలకమండళ్లు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రముఖ ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం పాలక మండళ్లను నియమించింది. విజయవాడ, సింహాచలం, ద్వారకా తిరుమల ఆలయాలకు పాలక మండళ్లను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువరించింది. ప్రిన్సిపల్ కార్యదర్శి ఉషారాణి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పాలకమండళ్లలో పదహారుగురు చొప్పున సభ్యులను నియమించారు. మూడు ఆలయాల్లోని ప్రధాన అర్చకులు ఎక్స్అఫిషియో సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సింహాచలం, ద్వారకా తిరుమలలో వ్యవస్థాపక కుటుంబ సభ్యులు చైర్మన్‌గా వ్యవహరిస్తారని వెల్లడించింది. దుర్గ గుడి పాలక మండలి చైర్మన్‌గా పైలా సోమినాయుడును ఎన్నుకునే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ మేరకు ఆలయాల పాలకమండళ్లలో మహిళలకు పెద్దపీట వేశారు. (చదవండి: 29 నుంచి ‘అరకు ఉత్సవ్’) విజయవాడ: దుర్గ గుడి పాలక మండలి సభ్యులు 1. పైలా సోమినాయుడు 2. కటకం శ్రీదేవి 3. డీఆర్కే ప్రసాద్ 4. బుసిరెడ్డి సుబ్బాయమ్మ 5. పులి చంద్రకళ 6. ఓవీ రమణ 7. గంటా ప్రసాదరావు 8. రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి 9. చక్కా వెంకట నాగ వరలక్ష్మి 10. కార్తీక రాజ్యలక్ష్మి 11. నేటికొప్పుల సుజాత 12. నేలపట్ల అంబిక 13. కానుగుల వెంకట రమణ 14. నెర్సు సతీశ్ 15. బండారు జ్యోతి 16. లింగంబొట్ల దుర్గాప్రసాద్ (పధాన అర్చకుడు) ద్వారకా తిరుమల: వెంకటేశ్వరస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు 1. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు (చైర్మన్) 2. మాతూరు శ్రీవల్లీ 3. గ్రంథి శేషగిరిరావు 4. కర్పూరం గవరయ్య గుప్తా 5. గూడూరి ఉమాబాల 6. కనకతాల నాగ సత్యనారాయణ 7. కొండేటి పద్మజ 8. కొత్తా విజయలక్ష్మి 9. చిలువులూరి సత్యనారాయణరాజు 10. కుంజా శాంతి 11. నందిని బందంరావూరి 12. మనుకొండ నాగలక్ష్మి 13. జి. సత్యనారాయణ 14. మేడిబోయిన గంగరాజు 15. వీరమళ్ల వెంకటేశ్వరరావు 16. పీవీఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథ ఆచార్యులు (ప్రధాన పూజారి) సింహాచలం: లక్ష్మీనరసింహ దేవస్థానం పాలక మండలి సభ్యులు 1. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు (చైర్మన్) 2. దాడి దేవి 3. వారణాసి దినేశ్‌రాజ్ 4. నల్లమిల్లి కృష్ణారెడ్డి 5. జి. మాధవి 6. గడ్డం ఉమ 7. రాగాల నరసింహారావు నాయుడు 8. దాడి రత్నాకర్ 9. సూరిశెట్టి సూరిబాబు 10. రంగాలి పోతన్న 11. సంచిత గజపతిరాజు 12. దొనకొండ పద్మావతి 13. నెమ్మాడి చంద్రకళ 14. సిరిపురపు ఆశాకుమారి 15. విజయ్ కే. సోంధి 16. గొడవర్తి గోపాల కృష్ణామాచార్యులు (ప్రధాన అర్చకుడు) -
ఇంద్రకీలాద్రి పై భవానీ దీక్షల విరమణ
-
వైరల్ : ప్రార్థన చేసి, గుంజీలు తీసి ఆపై..
సాక్షి , హైదరాబాద్ : ఒక దొంగ దర్జాగా గుడి లోపలికి వచ్చి దేవుడిని ప్రార్థన చేసి మరీ కిరీటాన్ని ఎత్తుకెళ్లాడు. ఈ వింత ఘటన మన హైదరాబాద్‌లోని అబిడ్స్ ప్రాంతంలోనే బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. కాగా దొంగ చేసిన పని సీసీ కెమెరాలో రికార్డవడం అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దొంగతనం చేసే ముందు ఆ వ్యక్తి చేసిన పని అందరికి నవ్వు తెప్పిస్తుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో నిత్యం రద్దీగా ఉండే అబిడ్స్ ప్రాంతంలో ఉన్న దుర్గ గుడికి బుధవారం సాయంత్రం ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చిన సమయంలో గుడిలో ఎవరు లేరు. ఇదే అదనుగా భావించిన సదరు దొంగ కిరీటాన్నీ ఎత్తుకెళ్లాలని భావించాడు. అయితే కిరీటాన్ని దొంగలించడానికి ముందు తనను క్షమించాలంటూ ప్రదర్శనలు చేసి దేవతను ప్రార్థించి కొన్ని గుంజీలు తీశాడు. తరువాత తనను ఎవరైనా గమనిస్తున్నారేమోనని చుట్టు పక్కల చూశాడు. ఎవరు చూడట్లేదని నిర్థారించుకొని మెళ్లిగా కిరీటాన్ని తీసి తన షర్టులోకి దోపుకున్నాడు. మళ్లీ ఎప్పటిలాగే ఎవరికి ఏ అనుమానం రాకుండా బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యడు. గురువారం ఉదయం యధావిధిగా గుడికి వచ్చిన పూజారి విగ్రహానికి కిరీటం లేకపోవడాన్ని గమనించాడు. దీంతో వెంటనే మేనేజర్‌కు తెలపగా అతను పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిక్షించి దొంగ చేసిన పనికి అవాక్కయ్యారు. దొంగపై సెక్షన్ 380 కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నారు. అయితే ఈ వీడియోపై సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. దేవుడి సొమ్మును ఎత్తుకెళ్తున్నందుకు తనకు ఏ పాపం తగలకూడదనే ఇలా చేసి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ హైకోర్టు సీజే
-
నటుడు కృష్ణంరాజు అసహనం
ఇంద్రీకలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గగుడి అధికారుల తీరుపై మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు అసహనం వ్యక్తం చేశారు. దసరా మహోత్సవాల్లో అమ్మవారిని దుర్గాదేవిగా దర్శించుకునేందుకు కృష్ణంరాజు ఆదివారం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఘాట్ రోడ్డు మీదగా కొండపైకి విచ్చేసిన కృష్ణంరాజు కుటుంబం కుంకుమార్చనలో పాల్గొనాలని పోలీసు సిబ్బందిని అడిగింది. అయితే సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కృష్ణంరాజు, అతని కుటుంబం ఈవో కార్యాలయం పక్కనే ఉన్న క్యూలైన్లో నుంచి కుంకుమ పూజ జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. క్యూలైన్లో వెళ్తున్న కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు దంపతులు సాధారణ భక్తులతో పాటు అష్టకష్టాలు పడుతూ మెట్లు దిగి ఆరో అంతస్తుకు చేరుకున్నారు. మార్గంలో పలుచోట్ల కృష్ణంరాజు ఆయాస పడుతూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కనీసం నడవలేనని చెప్పినా ఆలయ సిబ్బంది పట్టించుకోకపోవడంతో కృష్ణంరాజు అసహనం వ్యక్తం చేశారు. మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడైన కృష్ణంరాజును పట్టించుకోకపోవడం సరికాదని పలువురు భక్తులు పేర్కొన్నారు. అనంతరం విశేష కుంకుమార్చనలో పాల్గొన్న కృష్ణంరాజు కుటుంబం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకుంది. ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. -
‘దసరా ఉత్సవాల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది’
-
‘దసరా ఉత్సవాల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది’
సాక్షి, విజయవాడ : దసరా రాష్ట్ర పండుగ కాబట్టి గత టీడీపీ ప్రభుత్వంలా కాకుండా దసరా ఉత్సవాలకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం దసరా ఏర్పాట్ల పనులను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దుర్గగుడి ఈవో సురేష్ బాబు, జాయింట్ కలెక్టర్ మాధవిలత పర్యవేక్షించారు. వినాయకుడి గుడి వద్ద నుంచి కొండ పైభాగం వరకు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశా. దసరా ఏర్పాట్లను ఈ నెల 25 నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాం. కేశఖండనశాల ఏర్పాటుపై అధికారులతో చర్చించాను. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాము. దసరా ఉత్సవాలకు ఫ్లై ఓవర్ పనులు ఆటంకం కలుగుతాయనే ఉద్దేశంతో పరికరాలను తొలగించాలని ఆదేశించా’’మని తెలిపారు. -
దుర్గమ్మను దర్శించుకున్నస్పీకర్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం శుక్రవారం ఇంద్రకీలాద్రిపై వరలక్ష్మీ దేవి రూపంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో దుర్గ గుడి అధికారుల ఆలయ మర్యాదలతో స్పీకర్‌కు స్వాగతం పలికారు. దర్శనానంతరం తమ్మినేని వేద పండితుల చేత ఆశీర్వచనం తీసుకున్నారు. ఆలయ అధికారులు స్పీకర్‌కు అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను కూడా అందజేశారు. అనంతరం తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ.. శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారిని వరలక్ష్మీ దేవి రూపంలో దర్శించుకోవడం మరింత ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నాను అని తమ్మినేని తెలిపారు. -
బెజవాడ దుర్గమ్మకు బోనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): హైదరాబాద్‌లోని భాగ్యనగర్ శ్రీ మహాంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు బోనాలను సమర్పించారు. ప్రతి ఏటా ఆషాడ మాసంలో తెలంగాణ నుంచి అమ్మవారికి బోనాలను సమర్పించడం ఆనవాయితీగా జరుగుతుంది. ఆదివారం ఉదయం బ్రాహ్మణ వీధిలోని దేవస్థాన పరిపాలనా భవనంలోని జమ్మిచెట్టు వద్ద అమ్మవారికి, బోనాలకు దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆలయ ఈవో వి.కోటేశ్వరమ్మ, బోనాల కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. బ్రాహ్మణ వీధి, రథం సెంటర్, ఘాట్‌రోడ్డు మీదగా ఊరేగింపు ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. బోనాలకు ఈవో సాదరంగా స్వాగతం పలికారు. బోనాలను సమర్పించేందుకు హైదరాబాద్ నుంచి విచ్చేసిన సుమారు వెయ్యి మంది కళాకారులు, బోనాల కమిటీ సభ్యులు నిర్వహించిన ఊరేగింపు ఎంతో అకట్టుకుంది. -
భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తాం : దుర్గగుడి ఈవో
సాక్షి, విజయవాడ : ఆషాడం మాసంలో తెలంగాణ బోనాలు మొదలైతే.. దుర్గగుడిలో పవిత్ర సారె ఉంటుందని కనకదుర్గ గుడి ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. ఆషాడ మాసం మొత్తం పవిత్ర సారె కార్యక్రమం ఎంతో వైభవోపేతంగా జరుగుతుందని అన్నారు. గతేడాది యాభై వేలమంది భక్తులు పవిత్రసారె తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఈసారి కూడా అమ్మవారికి పవిత్ర సారె తీసుకొచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. జూలై 3నుంచి ఆగస్ట్ 1వరకు ఈ ఆషాడ మాసం ఉంటుందని అన్నారు. పవిత్రసారె తీసుకొచ్చే భక్తులు ముందుగా తెలియజేస్తే.. అందుకు తగ్గ ఏర్పాట్లతో పాటు అన్నప్రసాదాలు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. జూలై 14,15,16 తేదీల్లో శాఖంబరి ఉత్సవాలు జరుగుతున్నాయని ప్రకటించారు. 16న చంద్రగ్రహణం సందర్భంగా ఆరోజు సాయంత్రంఘైదు గంటలకే దర్శనం నిలుపుదల చేస్తామని, మళ్లీ ఉదయం పదిగంటలకు తిరిగి దర్శనం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ మహంకాళి అమ్మవారి దేవాలయం నుంచి ఆహ్వానం వచ్చిందని, బోనం సమర్పించడానికి 26న అక్కడికి వెళ్లనున్నుట్లు తెలిపారు. పవిత్ర సారె తీసుకొచ్చే వారందరికి ముఖమండప దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. -
దుర్గాఘాట్‌లో వరుణ యాగం
-
దుర్గగుడిలో అమ్మవారి హుండీ సొత్తుకు రెక్కలు
-
దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్
ఇంద్రకీలాద్రి /మంగళగిరిటౌన్/గన్నవరం: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో వి.కోటేశ్వరమ్మ, ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ నరసింహన్ దంపతులకు ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. నృసింహుని సేవలో గవర్నర్ గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులకు ఆలయ ఈవో మండేపూడి పానకాలరావు, అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత ఎగువసన్నిధిలోని పానకాల నరసింహస్వామిని దర్శించుకుని గవర్నర్ దంపతులు పానకాన్ని స్వీకరించారు. అనంతరం దిగువ సన్నిధిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకున్నారు. ఆలయ పండితులు వేదాశీర్వచనం అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని ఈవో బహూకరించారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో గవర్నర్‌కు ఘనస్వాగతం అంతకుముందు గవర్నర్ నరసింహన్ దంపతులకు గన్నవరం విమానాశ్రయంలో పలువురు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గురువారం విజయవాడలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించడానికి ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడికి చేరుకున్నారు. గవర్నర్ దంపతులకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర్, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, ప్రొటొకాల్ డైరెక్టర్ కన్నల్ అశోక్, నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ రోడ్డు మార్గం ద్వారా విజయవాడ చేరుకున్నారు. -
ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు
-
దుర్గగుడిలో టిక్కెట్ల ధర తగ్గింపు!
సాక్షి,విజయవాడ: పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నిశ్చయ సీఎం వైఎస్ జగన్ స్ఫూర్తితో భక్తులకు ఉచిత సేవలు అందించాలని నిర్ణయించినట్లు దుర్గగుడి కార్యనిర్వహణాధికారి కోటేశ్వరమ్మ పేర్కొన్నారు. 29 లేదా 30వ తేదీలలో నిశ్చయ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌లతో పాటు గవర్నర్ నరసింహన్ అమ్మవారి దర్శనానికి వస్తారని తెలిపారు. దేవస్థానం ఈవో చాంబర్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో కోటేశ్వరమ్మ మాట్లాడుతూ సీఎంగా వైఎస్. జగన్ 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారని, ఆ రోజు నుంచి అమ్మవారి సన్నిధిలో సెల్‌ఫోన్ కౌంటర్లో టికెట్‌ను రద్దు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.5 వసూలు చేస్తుండగా, ఇకపై సెల్‌ఫోన్‌ను ఉచితంగా భద్రపరుచుకోవచ్చని, దీనిని సేవా కార్యక్రమంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే దేవస్థానం చెప్పుల స్టాండ్, క్లోక్ రూమ్‌ల సేవలను ఉచితంగా అందిస్తుందన్నారు. దుర్గగుడిలో అంతరాలయ దర్శనానికి రూ.300 టిక్కెట్‌ను రూ.200కు తగ్గించాలని నిర్ణయించి, ఉన్నతాధికారుల అనుమతి కోసం పంపామన్నారు.అనుమతులు రాగానే రేట్లు తగ్గిస్తామన్నారు. రూ.18 కోట్ల డిపాజిట్లు గతంలో దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి రూ.140 కోట్ల మేర డిపాజిట్లు ఉండేవని, టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఆలయ విస్తరణ పనులు, స్థల సేకరణ నిమిత్తం ఆ డిపాజిట్లు తీసినట్లు పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు రూ.18 కోట్లు దేవస్థానం తరఫున వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో జమ చేసినట్లు చెప్పారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
దుర్గగుడి పాలక మండలి రాజీనామా
-
ఐదెకరాల కథ కంచికేనా!?
సాక్షి, విజయవాడ : దుర్గగుడికి రాజధానిలో ఐదు ఎకరాల భూమిని తీసుకోవాలనే ఆలోచన కార్యరూపం దాల్చలేదు. టీటీడీ రాజధానిలో వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మిస్తుండగా.. దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం తరఫున కల్యాణ మండపం కట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి దరఖాస్తు.. రాజధానిలో ఐదు ఎకరాల భూమి సీఆర్డీఏ ద్వారా ఇప్పించాలని కోరుతూ ప్రభుత్వానికి దుర్గగుడి ఈవో వి.కోటేశ్వరమ్మ దరఖాస్తు చేశారు. ఈ భూమికి ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం సూచనల మేరకే దుర్గగుడి అధికారులు ఈ దరఖాస్తు చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆఖరు సమావేశం వరకు.. గత మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం ఆఖరి మంత్రివర్గ సమావేశం నిర్వహించింది. ఈ ఆఖరి సమావేశంలోనైనా దుర్గగుడికి ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తారని దుర్గగుడి అధికారులు భావించారు. రాజధాని ప్రాంతంలో భూమి కేటాయింపులు జరిగితే దాతల సహకారంతో అక్కడ కల్యాణ మండపం నిర్మించాలని భావించారు. అయితే ప్రభుత్వం మాత్రం దుర్గగుడికి భూమి ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. సీఆర్డీఏలో ఫైల్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉందని దుర్గగుడి అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ముందు కొన్ని ప్రైవేటు సంస్థలకు మాత్రం రాజధానిలో విలువైన భూముల్ని కట్టపెట్టిన ప్రభుత్వం దుర్గగుడికి మాత్రం ఇవ్వడంపై ఆసక్తి చూపలేదు. కొత్తగా ప్రభుత్వం వచ్చే వరకు ఆ ఫైల్ పక్కన పెట్టినట్టే. దుర్గగుడి భూముల్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం.. రాజధానిలో భూముల కోసం అధికారులు ప్రయత్నించే కంటే దేవస్థానానికి ఉన్న భూముల్ని ఉపయోగించుకుంటే ఉపయుక్తంగా ఉంటుందని పలువురు భక్తులు భావిస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఉన్న రాజధాని భూములను తీసుకొని అక్కడ కల్యాణ మండపం నిర్మించే కంటే అదే నిధులతో దుర్గగుడి సమీపంలోని పోరంకి, భవానీపురంలో టీటీడీ నుంచి తీసుకున్న భూముల్లో, నున్నలోని ఐదు ఎకరాల్లో కాటేజ్‌లు, కల్యాణ మండపాలు నిర్మించడానికి భక్తుల సహకారం తీసుకుంటే ఉపయుక్తంగా ఉంటుందని దుర్గమ్మ భక్తులు పేర్కొంటున్నారు. రాజధానిలో దుర్గగుడి కల్యాణ మండపం నిర్మించినా అక్కడకు వెళ్లి పెళ్లి చేసుకుంటే అమ్మవారి సన్నిధిలో చేసుకున్నట్లు భక్తులు భావించరని అభిప్రాయపడుతున్నారు. -
దుర్గగుడిపై వ్యక్తి హల్చల్
సాక్షి, ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ) : దుర్గగుడిపై మతి స్థిమితం లేని ఓ వ్యక్తి శుక్రవారం హల్చల్ చేశాడు. ఎటువంటి తాడు లేకుండా ప్రమాదకర పరిస్థితులలో చెట్లు, కొండ అంచులను పట్టుకుని పాకుకుంటూ కొండపైకి చేరుకున్నాడు. మతి స్థిమితం లేని వ్యక్తి చేస్తున్న చర్యలను చూసి పోలీసులతోపాటు సెక్యూరిటీ సిబ్బంది, భక్తులకు ముచ్చెమటలు పట్టాయి. చివరకు ఆ వ్యక్తి క్షేమంగా కొండపైకి చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జగ్గయ్యపేట మండలం మర్రిపాకకు చెందిన కుండల నాగేశ్వరరావు కొద్ది రోజుల కిందట లారీ ఎక్కి నగరానికి చేరుకున్నాడు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో మహా మండపం సమీపంలోని పాత మెట్ల వద్దకు చేరుకున్న నాగేశ్వరరావు కొండపైకి చేరుకోవాలని బావించాడు. మెట్ల మార్గం నుంచి కాకుండా పక్కనే ఉన్న రాళ్లు, చెట్ల మధ్య నుంచి కొండపైకి ఎక్కడం ప్రారంభించాడు. సుమారు అరగంట తర్వాత కొండ సగం దూరం ఎక్కిన నాగేశ్వరరావు కిందకు చూసే సరికి భయం వేసింది. అయినా సరే కొండ రాళ్లు అంచులను పట్టుకుని మెల్లగా పాకుకుంటూ పైకి ఎక్కడం ప్రారంభించాడు. కొంత దూరం ఎక్కిన తర్వాత భయంతో కొండ అంచున కూర్చోవడంతో అతనిని భక్తులు గమనించారు. అవుట్ పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసు సిబ్బంది, ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బంది కొంత మంది కొండ కింద నుంచి, మరి కొంత మంది పై నుంచి నాగేశ్వరరావును పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఎక్కడ పట్టుతప్పి కింద పడిపోతాడోనని భయంతో తాడు సహాయంతో పైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఇంతలో శానిటేషన్ విభాగంలో పనిచేసే ఓ యువకుడు తాడుతో కిందకు దిగి అతనిని పట్టుకుని పైకి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత నాగేశ్వరరావును పోలీసులకు అప్పగించారు. అవుట్ పోస్టులోకి తీసుకువెళ్లగా నాగేశ్వరరావు తన పూర్తి వివరాలను తెలిపాడు. అతని మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు భావిస్తున్నారు. తన మేకలు కొండపైన ఉన్నాయని, వాటిని పట్టుకునేందుకు వచ్చానని పొంతన లేని సమాధానాలు చెప్పసాగాడు. అతనిని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
మూడునాళ్ల ముచ్చటే....!
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులందరూ సంప్రదాయ దుస్తులలో రావాలని చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. అమ్మవారి సన్నిధిలో ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తులను ధరించాలనే నిబంధనతో పాటు ఆలయంలోకి సెల్ఫోన్లు తీసుకువెళ్లడం నిషేధం. ఈ రెండు దుర్గగుడి దేవస్థానంలో అమలు కావడం లేదు. సెల్ఫోన్ల నిషేధం మూడేళ్ల కిందట నుంచి అమలు చేస్తుండగా, జనవరి 1వ తేదీ నుంచి డ్రస్ కోడ్‌ను అమలు చేస్తున్నారు. సెల్‌ఫోన్ కౌంటర్ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌పై కొన్ని ఆరోపణలు రావడంతో దేవస్థానమే స్వయంగా కౌంటర్లు నిర్వహిస్తుంది. ఆలయంలోకి సెల్ఫోన్లు తీసుకువెళ్లకుండా దేవస్థాన సిబ్బంది నియంత్రించలేకపోతున్నారు. కొంత మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బోర్డులను చూసి తమ సెల్ఫోన్లను కౌంటర్లలో భద్రపరుస్తున్నారు. వీఐపీలు, రూ.100, రూ.300 టికెటుపై వచ్చిన భక్తుల వద్ద సెల్ఫోన్లు కనిపించడం, దర్శనం తర్వాత వారు ఆలయ ప్రాంగణంలోనూ, రాజ గోపురం వద్ద అమ్మవారి ప్రతిమల వద్ద ఫొటోలు దిగుతూ కనిపించడంతో కౌంటర్లలో సెల్ఫోన్లు పెట్టిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని కౌంటర్లలోని సిబ్బందిని ప్రశ్నిస్తే క్యూలైన్ల వద్ద తనిఖీలు లేవని, కౌంటర్లలో ఫోన్లు పెట్టిన వారివే తాము భద్రపరుస్తామని పేర్కొం టున్నారు. ఆలయ అధికారులలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో, ఆలయంలో అమలు చేసే ని యమ నిబంధనలను సాధారణ భక్తులకే అమలుచేయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. క్యూలైన్లో వచ్చే వారికే డ్రస్ కోడ్ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జనవరి 1వ తేదీ నుంచి డ్రస్ కోడ్ అమలు చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే సాధారణ భక్తులకే డ్రస్ కోడ్ అమలు చేయడంపై భక్తుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. ఘాట్‌రోడ్డు, మమా మండపం మెట్లు, లిప్టు ద్వారా వచ్చే భక్తులకు ఖచ్చితంగా డ్రస్కోడ్ అమలు చేస్తున్నారు. డ్రస్కోడ్ కోసం దేవస్థానం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి రూ.100 చీరలను విక్రయిస్తుంది. కొంతమంది ప్రముఖులు, వీఐపీలు, ప్రొటోకాల్ ఉన్న వారు డ్రస్ కోడ్ పాటించడకుండా ఆలయానికి చేరుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ వంటి శాఖలతో పాటు మరి కొన్ని శాఖలకు చెందిన అధికారులు అమ్మవారి దర్శనానికి విచ్చేసినప్పుడు వారి సిబ్బంది దగ్గర ఉండి మరీ దర్శనాలు చేయిస్తున్నారు. ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు ఎటువంటి డ్రస్ కోడ్ అమలు కాదా అంటూ ఆలయ సిబ్బందిపై మహిళా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఫిర్యాదులు చేసే వరకు వెళ్లుతున్నారు. తాజాగా గురువారం ఓ భక్తురాలు డ్రస్ కోడ్ పాటించడం లేదని వెనక్కి పంపిన సెక్యూరిటీ సిబ్బంది, కొద్ది నిమిషాలలోనే ప్రొటోకాల్ ఉన్న వారికి ఎటువంటి డ్రస్ కోడ్ పాటించడకుండా అమ్మవారి దర్శనానికి పంపడం ఆ భక్తురాలు గమనించింది. అటు సెక్యూరిటీ సిబ్బందితో పా టు ఘాట్‌రోడ్డులోని సమాచార కేంద్రం లోని సిబ్బందిౖపై చిందులు తొక్కింది. దేవస్థాన అధికా రులు భక్తులందరిని ఒకేలా చూడాలని, అలా చేతకాని పక్షంలో నిబంధనలు పెట్టడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవస్థానంలో ఓ నిబంధన పెట్టినప్పుడు దానిని సక్రమంగా అమలు చేసేవిధంగా కొంతమంది అధికారులకు బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉంది. సెల్పోన్లు నిషేధం, డ్రస్ కోడ్ సక్రమంగా జరిగేలా పర్యవేక్షకులు లేకపోవడం గమనార్హం. -
ఇది మొదటిసారి కాదా?
దుర్గగుడిలో దర్శనం టికెట్ల స్కాంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా బయట పడటం ఇదే ప్రథమం కాదని, గతంలోనూ పలుమార్లు టికెట్ల స్కాంను గుర్తించినా.. పూర్వపు ఈవోలు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. తాజా ఉదంతంలో కేవలం కౌంటర్లో టికెట్లను విక్రయించిన సిబ్బందే కాకుండా టికెట్లను స్కానింగ్ చేసే సిబ్బందితో పాటు త్రిలోక్ సంస్థకు చెందిన ఐటీ టెక్నీషియన్ కీలక పాత్ర పోషించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ) : దుర్గగుడి టికెట్ల స్కాంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటువంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఘటనపై దుర్గగుడి ఈవో వి. కోటేశ్వరమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు సమాచారం. ఘాట్ రోడ్డు కౌంటర్ నుంచే టికెట్లు జారీ దుర్గగుడి ఘాట్ రోడ్డుతో పాటు మహా మండపం వద్ద రూ. 300, రూ.100 టికెట్లు విక్రయించే కౌంటర్లను త్రిలోక్ సంస్థ నిర్వహిస్తోంది. శనివారం మధ్యాహ్నం ఘాట్ రోడ్డులోని కౌంటర్ నుంచే టికెట్లను విక్రయించినట్లు ఆలయ ఈవో విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది. కేవలం ఘాట్ రోడ్డులోని కౌంటర్లోనే ఈ తరహా అక్రమాలకు పా ల్పడ్డారా.. లేక మిగిలిన కౌంటర్లలోనూ ఈ తరహా అక్రమాలు జరిగాయా అనే దిశగా విచారణ జరుగుతున్నట్లు సమాచారం. అంతా కలిసే చేశారా..! తాజా ఘటనలో కేవలం కౌంటర్లో టికెట్లు విక్రయించిన సిబ్బంది పాత్ర మాత్రమే ఉందనుకునే వీలులేదని పలువులు వ్యాఖ్యానిస్తున్నారు. కౌంటర్లో విక్రయించిన టికెట్లను అమ్మవారి ఆలయం చిన్న గాలి గోపురం వద్ద ఉన్న స్కానింగ్ కౌంటర్ వద్ద స్కాన్ చేశారు. ప్రతి కార్డుకు ఇచ్చిన బార్కోడ్ స్కాన్ చేసినప్పుడు కంప్యూటర్లో ఆ కార్డు వివరాలు సరిపోల్చుతాయి. అయితే స్కానింగ్‌లోని సిబ్బంది ఈ విషయాన్ని గమనించలేదా..? లేక స్కానింగ్ కౌంటర్లో సిబ్బంది టికెట్ల విషయం తెలిసి.. కావాలని తప్పించారా? అనేది తేలాల్సి ఉంది. కౌంటర్లో పని చేసే సిబ్బంది, టికెట్లు స్కానింగ్ చేసే సిబ్బంది ఇద్దరు త్రిలోక్ వారు నియమించిన వారు కావడంతో ఇటువంటి అక్రమాలు బయటకు రావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సీరియల్ నంబర్‌ను గుర్తించేది ఏలా..? రూ. 100, రూ.300 టికెట్ల యాక్సిస్ కార్డులపై ముద్రించే బార్ కోడ్ కింద సీరియల్ నంబర్ సృష్టంగా లేకపోవడమే అక్రమాలకు ఆస్కారం కల్పించిందన్న విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి యాక్సెస్ కార్డుకు ఒక గుర్తింపు నంబర్ ఉంటుంది. యాక్సెస్ కార్డుపై ముద్రించే బార్ కోడ్ కింద ఆ రోజు విక్రయించిన టికెట్ల సీరియల్ నంబర్‌ను ముద్రిస్తారు. అయితే టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు యాక్సిస్ కార్డుపై ఉన్న నంబర్‌ను మాత్రమే గమనిస్తుంటారు. అయితే ఇదే స్లిప్పై చిన్నవిగా ఉన్న సీరియల్ నంబర్ కింద మరో మారు తేదీ, నెల, ఏడాదిని కూడా ముద్రిస్తున్నారు. ఈ సీరియల్ నంబర్లను గుర్తించ వీలు లేకపోవడమే ఇటువంటి అక్రమాలను అటు భక్తులు కానీ, ఆలయ అధికారులు గానీ గుర్తించే అవకాశం లేకుండా పోతున్నారు. టికెట్ల జారీ ఇకదేవస్థాన సిబ్బందితోనేనా? రూ. 100, రూ. 300 టికెట్ల కౌంటర్లను నిర్వహించే బాధ్యత ఇక దేవస్థానం తీసుకోనున్నట్లు సమాచారం. శుక్రవారం టికెట్ల స్కాం బయట పడిన వెంటనే ఆలయ ఈవో వి. కోటేశ్వరమ్మ త్రిలోక్ అధికారులతో సమావేశమై వెంటనే కౌంటర్ల నిర్వహణ నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఒకటి రెండు రోజులలో నగదు లెక్కల వివరాలను దేవస్థానానికి అప్పగించిన తర్వాత కౌంటర్లలో వ్యవహారం తేలే అవకాశాలు ఉన్నాయి. -
డ్రెస్ కోడ్ వచ్చేసింది..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జీన్స్, టీ షర్టులను ధరించిన యువతులే...కాదు పంజాబీ డ్రస్‌పై చున్నీ లేని యువతులు సైతం తెలుగు వారి సంప్రదాయ పద్ధతికే ఆమోద ముద్ర వేశారు. ఆంగ్ల సంవత్సరాది నుంచి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో డ్రస్ కోడ్‌ను అమలు చేయగా, ఆలయ అధికారుల నిర్ణయానికి భక్తులు ఆమోద ముద్ర వేశారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన భక్తులు దేవస్థానంలో అమలు చేస్తున్న డ్రస్ కోడ్ బాగుందని కితాబు ఇచ్చారు. ఆధునిక డ్రస్‌లలో వచ్చిన యువతులు, మహిళలు దేవస్థానం విక్రయించిన చీరలను కొనుగోలు చేసి సంప్రదాయ పద్ధతిలో దుర్గమ్మను దర్శించుకున్నారు. కేవలం చీరలే కాకుండా పంజాబీ డ్రస్‌పై చున్నీ లేని వారికి కూడా అమ్మవారి దర్శనానికి అనుమతించకపోవడంతో యువతులందరూ కలిసి చీరను కొనుగోలు చేసి చున్నీలుగా ధరించారు. రూ.100లకే అమ్మవారి చీర డ్రస్ కోడ్ అమలు చేస్తున్న దుర్గగుడి అధికారులు భక్తుల కోసం దేవస్థానమే రూ.100లకు చీరను విక్రయించింది. వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్ల వద్ద ఆధునిక డ్రస్‌లు వేసుకుని అమ్మవారి దర్శనానికి వచ్చే వారికి డ్రస్ కోడ్ గురించి తెలియజేశారు. భక్తులు దేవస్థానం విక్రయిస్తున్న రూ.100 చీరలను కొనుగోలు చేసి వాటిని ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. పంజాబీ డ్రస్‌పై చున్నీ లేకపోవడంతో కొంతమందికి సిబ్బంది అడ్డు చెప్పగా, వారందరూ కలిసి ఒక చీరను కొనుగోలు చేసి, దానిని చున్నీగా కట్ చేసుకుని ధరించడం కనిí ³ంచింది. డ్రస్ కోడ్ బాగుందని కొంతమంది విద్యార్థినులు పేర్కొన్నారు. డ్రస్ కోడ్ పాటించి అమ్మవారిని దర్శించుకున్న కొంత మంది యువతులు, కళాశాల విద్యార్థినులతో దేవస్థాన ఈవో వీ.కోటేశ్వరమ్మ మాట్లాడారు. ముంబయి, మహా రాష్ట్ర, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల నుంచి విచ్చేసిన భక్తులు చీరలను ధరించి ఆలయ ప్రాంగణంలో ఫొటోలు, సెల్ఫీలు దిగడం కనిపించింది. చీర «గురించి ఎప్పుడూ తెలియని వారు కూడా ధరించారు. మరింత ప్రచారం కల్పించాలి.. సంప్రదాయ వస్త్రాలను ధరించి అమ్మవారిని దర్శించుకోవడం బాగుంది.. డ్రస్ కోడ్‌పై మరింత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. కేవలం దేవస్థాన పరిసరాలలోనే కాకుండా నగరంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్‌తో పాటు ప్రధాన కూడళ్లలో బోర్డులు ఏర్పాటు చేయాలి. కాటం సాయిశిరీష, ఇంజనీరింగ్ విద్యార్థిని ఈవోనే మాకు చీర ఇచ్చారు... కొత్త సంవత్సరం నుంచి డ్రస్ కోడ్ అనే విషయం మాకు తెలియదు. గుడికి వచ్చిన మాకు ఈవో గారు చీరను ఇచ్చారు. చీరతో మా ఫ్రెండ్‌కు ఓనీ, నాకు చున్నీగా చేసుకున్నాం. అమ్మవారి దర్శనానికి అందరూ సంప్రదాయ దుస్తులలోనే వస్తే బాగుంటుంది. ఆలయాలలో సంప్రదాయాలను పాటించడం మనందరి బాధ్యత. శ్రావ్య, ఇంజినీరింగ్ విద్యార్థిని -
వివాదాల కీలాద్రి!
రాజకీయ జోక్యం అధికం కావడం.. అధికారుల మధ్య ఆధిపత్య పోరు.. పాలకవర్గం పెద్దల చర్యలు వెరసి ఇంద్రకీలాద్రిపై వ్యవహారాలు 2018లో భక్తుల మెప్పు పొందలేకపోయాయి. వివిధ కారణాలతో నలుగురు ఈవోలను మార్చడం.. అభివృద్ధి పనుల అంశంగా ఎవరి ధోరణి వారిదన్నట్లు నడుచుకోవడం ఇబ్బందికర పరిస్థితులకు దారితీశాయి. పవిత్ర దుర్గగుడి వ్యవహారాల్లో వర్గపోరుకు పాలకపక్షం ఆజ్యం పోసిందన్న విమర్శలు మిన్నంటాయి. సాక్షి, విజయవాడ : దుర్గగుడిలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది వివాదాలు జరిగాయి. దేవస్థానం పాలకమండలి సభ్యుల చర్యల వల్ల దేవస్థానం ప్రతిష్ట దిగజారే పరిస్థితి తలెత్తింది. ఒకే ఏడాది నలుగురు ఈవోలను మార్చి దేవస్థానం అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుందనే విమర్శలు వినిపించాయి. దేవస్థానంలో నాయీబ్రాహ్మణులు రోడ్డెక్కి ధర్నా చేసి చివరకు ముఖ్యమంత్రిని నిలదీసే పరిస్థితి ఏర్పడింది. ఈవో సూర్యకుమారిపై బదిలీ వేటు ఐటీ మంత్రి నారా లోకేష్ కోసం గత ఏడాది డిసెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయని పత్రికలు కోడై కూశాయి. ఈ అంశం వివాదం కావడంతో ఈ ఏడాది జనవరి 7న అప్పటి ఈవో సూర్యకుమారిపై బదిలీ వేటుపడింది. అయితే దీనిపై జరిగిన విచారణలో వెల్లడైన వాస్తవాలను ప్రభుత్వం ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఈవో వర్సెస్ ఏఈవో.. దసరా ఉత్సవాల్లో జరిగిన జ్ఞాపికల స్కాం చివరకు ఏఈవో అచ్యుతరామయ్య సస్పెక్షన్ వరకు వెళ్లింది. దీంతో ఈవో కోటేశ్వరమ్మకు, ఏఈవో అచ్యుతరామయ్యకు మధ్య తీవ్ర వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఏఈవో అచ్యుతరామయ్య తనను బెదిరించారంటూ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు ఈవో నియామకం చెల్లదంటూ ఏఈవో కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. చివరకు ఆలయ చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు జోక్యంతో ఏఈవోనే ఒకడుగు దిగి వచ్చి ఈవో కోటేశ్వరమ్మకు బేషరతుగా క్షమాపణ చెప్పడంతో ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. భక్తులకు సౌకర్యాలు.. ప్రస్తుతం దుర్గగుడి నిధులు తరిగిపోవడంతో భక్తుల సహకారంతోనే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఘాట్‌రోడ్డు, మల్లికార్జున మహామండపంలో భక్తుల సౌకర్యార్థం షెడ్లు వేయించారు. అన్నదాన భవానాన్ని మల్లికార్జున మహామండపంలోకి మార్చడంతో భక్తులకు సౌకర్యవంతంగా ఉంది. ఒకే ఏడాది నలుగురుకార్యనిర్వహణాధికారులు ఒకే ఏడాదిలో నలుగురు ఈఓలు మారడంతో దేవస్థానం అభివృద్ధికి ఆటంకంగా మారింది. దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగిన నేపథ్యంలో ఈవో ఎ.సూర్యకుమారిని జనవరి 7 బదిలీ చేశారు. అదే రోజు తాత్కాలిక ఈవోగా అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధ బాధ్యతలు స్వీకరించారు. జనవరి 29న మొవ్వ పద్మను ఈవోగా నియమించారు. పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత చీర మాయం చేసిన ఘటనలో మొవ్వ పద్మను పదవి నుంచి తప్పించారు. ఆగస్టు 17న వి.కోటేశ్వరమ్మ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఇలా ఈవోలను మార్చడం చర్చనీయాంశంగా మారింది. దుర్గమ్మను దర్శించుకున్నతెలంగాణ సీఎం కేసీఆర్.. జూన్ 28న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దుర్గమ్మను దర్శించుకుని ముక్కెరను బహూకరించారు. తమిళనాడు డెప్యూటీ సీఎం పన్నీరుసెల్వం అమ్మవారిని దర్శించుకోవడం విశేషం. ఆలయ ప్రతిష్ట దెబ్బతీసిన పాలకమండలిదేవాలయం ప్రతిష్టను దేవస్థానం పాలకమండలి దెబ్బతీసింది. పాలకమండలి సభ్యులు తమ స్థాయిని దిగజార్చుకునే విధంగా ప్రవర్తించారు. జూన్ రెండో వారంలో దేవస్థానంలో పాలకమండలి సభ్యుడు పెంచలయ్య కేశఖండనశాలలోని ఒక క్షురకుడిపై చేయి చేసుకున్నాడు. దీంతో క్షురకులంతా రోడ్డెక్కారు. చివరకు ఈ వివాదం ముదిరి క్షురకులు తమకు వేతనాలు ఇవ్వాలంటూ ధర్నాకు దిగారు. క్షురకులంతా వెళ్లి చంద్రబాబును కలసి ఆయన్ను నిలదీయడం.. నాయీబ్రాహ్మణులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 5న దుర్గగుడిలో భక్తులు సమర్పించిన ఖరీదైన చీరను పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత మాయం చేసిందంటూ ఆరోపణలు వచ్చాయి. చివరకు ఈ వివాదం ముదిరి కోడెల సూర్యలతను పాలకమండలి నుంచి తొలగించారు. ఈ ఘటనలతో దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింది. చిన్నారి మిస్సింగ్.. మహిళల డ్రస్సింగ్ రూమ్‌లో సీసీ కెమెరాలు అమ్మవారి దర్శనానికి వచ్చిన చిన్నారి నవ్య శ్రీ జూన్ 17న మల్లికార్జున మహామండపం సమీపంలో మాయమైంది. సీసీ కెమెరాల సహాయంతో బాలిక ను ఒక మహిళ గుంటూరు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఈలోగా ఆ మహిళ నవ్యశ్రీని పోలీసులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. జూన్ 25న దుర్గగుడికి చెందిన ఓ కాటేజీలో మహిళలు దుస్తులు మార్చుకునే ప్రదేశంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై భక్తులు ఆందోళన వ్యక్తం చేయడంతో చివరకు కెమెరాలు తొలగించారు. -
హోమం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నేతలు
-
పాలనాపరమైన అంశాల్లో... మీ జోక్యం అనవసరం!
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గగుడి పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు, ఆలయ ఈవో వి. కోటేశ్వరమ్మల మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దసరా ఉత్సవాలలో కళాకారులకు దేవస్థానం పంపిణీ చేసిన మెమెంటోల వ్యవహారంలో ఆలయ ఈవో పలువురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఛైర్మన్ గౌరంగబాబు ఉద్యోగులకు మద్దతుగా నిలిచారు. తాజాగా సోమవారం దేవస్థానానికి చెందిన మాడపాటి సత్రం బోర్డు మీటింగ్ హాల్లో నిర్వహించిన పాలక మండలి సమావేశంలో ఈ వ్యవహారం మరోమారు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఉద్యోగుల వ్యవహారంపై పాలక మండలి సభ్యులు చర్చకు తీసుకురాగా సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే ఆలయ చైర్మన్‌పై ఈవో వి. కోటేశ్వరమ్మ విరుచుకు పడ్డారు. సస్పెండైన ఉద్యోగులను వెనక్కి తీసుకోవాలని లెటర్ ఇచ్చింది చైర్మన్, కాబట్టి చైర్మన్‌ను అడగండి అంటూ ఈవో ఆగ్రహం గా చెప్పడంతో పాలక మండలి సభ్యులం దరూ ఆవాక్కయ్యారు. ‘పాలనాపరమైన వ్యవహారంలో జ్యోకం చేసుకోవద్దని’ చెప్పడంతో చైర్మన్ అలిగి వెళ్లిపోయారు. తొలుత బోర్డు మీటింగ్‌లో పాల్గొన్న చైర్మన్ మీడియా సమావేశంలో పాల్గొనకుండానే వెళ్లిపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
..తప్పేముందీ!
సాక్షి, విజయవాడ: దుర్గగుడిపై తప్పులను మాఫీ చేయడంలో దుర్గగుడి అధికారులకు పెట్టింది పేరు. అవినీతికి పాల్పడేందుకు ప్రయత్నించిన వారిని గుర్తించిన కొద్దిరోజులు సస్పెన్షన్ చేసి తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. విధుల్లోకి నలుగురు ఉద్యోగులు... దసరా ఉత్సవాల్లో జ్ఞాపికల కోనుగోలులో అవినీతి చోటుచేసుకుంది. 1200 కోనుగోలు చేసి 2,000లకు బిల్లులు పెట్టారు. గుమాస్తా నుంచి ఏఈఓ వరకు అందులో ప్రాతదారులే. చివరకు భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఈఓ కోటేశ్వరమ్మ చర్యలు తీసుకున్నారు. వెంటనే నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. అంతే కాకుండా మీడియా ఎదురుగా వాగ్వాదానికి దిగి బెదిరించిన ఏఈఓ అచ్యుత రామయ్యపై ఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దేవస్థానంలో అవినీతి పక్షాళన ప్రారంభమైందని అందరూ భావించారు. అధికార పార్టీనా? మజాకా? వెంటనే ఏఈఓ అచ్యుతరామయ్య అధికారపార్టీ నేతలను ఆశ్రయించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక కీలక నేత, దేవస్థానానికి సమీపంలో ఉండే మరో ప్రజాప్రతినిధి తెరవెనుక ఈ విషయంలో జోక్యం చేసుకుని చక్రం తిప్పారు. దీంతో పాలకమండలి చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు రంగంలోకి దిగి సిబ్బందిపై సస్పెన్షన్ ఎత్తివేసేందుకు ఈఓతో సంప్రదింపులు జరిపారు. క్షమాపణలతో సమసిన వివాదం... ఏఈవో అచ్యుతరామయ్య, చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు సమక్షంలో విలేకరుల సమావేశం పెట్టి తాను ఈలో కోటేశ్వరమ్మను దూషించడం తప్పేనంటూ పచ్చాతాపం ప్రకటించారు. ఆ తరువాత ఈఓ, ఏఈఓల మధ్య రాజీ ప్రయత్నాలు జరిగాయి. చివరకు శుక్రవారం సిబ్బందిపై ఈఓ సస్పెన్షన్ ఎత్తివేశారు. కాగా పోలీసులు కూడా ఈ కేసుపై విచారణ చేసి అవినీతి జరిగిన మాట వాస్తవమేనని నిందితులను అరెస్టుకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఈఓ కోటేశ్వరమ్మ సూచన మేరకు అరెస్టులు చేయలేదు. సస్పెన్షన్ ఎత్తివేయడంతో తప్పు ఓప్పుయిందా? అని భక్తులుప్రశ్నిస్తున్నారు. దుర్గగుడిలో ఎంతటి అవినీతి జరిగినా, ఏ తప్పులు చేసినా అధికారపార్టీ నేతల్ని ఆశ్రయిస్తే అన్ని సమసిపోతాయని మెమోంటోల స్కామ్ రుజువు చేస్తోంది. -
దుర్గగుడిలో డ్రెస్ కోడ్
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): మహిళలు జీన్స్, షాట్స్, టీ షర్టులు, స్లీవ్‌లెస్ షర్టులు ధరించి వస్తే అమ్మవారి దర్శనం కానట్లే. పురుషులు సైతం షాట్స్, సగం ప్యాంట్లు ధరించి వస్తే అమ్మవారి దర్శనానికి అనుమతించరు. రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవస్థానంగా పేరున్న విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో డ్రెస్ కోడ్‌ను అమలు చేయడానికి దేవస్థాన ఈవో వీ కోటేశ్వరమ్మ నిర్ణయించారు. ఇప్పటికే డ్రెస్ కోడ్ అమలుకు దేవస్థాన పాలకమండలి ఆమోదంతోపాటు వైదిక కమిటీతో చర్చలు జరిపారు. జనవరి 1వ తేదీ నుంచి డ్రెస్ కోడ్ అమలుకు రంగం సిద్ధమైంది. లంగాజాకెట్, లంగాఓణీ, పంజాబీ డ్రెస్, చుడీదార్ ధరించిన మహిళలనే అనుమతిస్తారు. అమ్మ శారీస్ పేరిట చీరలను విక్రయించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రూ.100లకే చీర అందుబాటులోకి తీసుకువస్తున్న దేవస్థానం, చీరలు కట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రెస్ కోడ్ అమలుపై భక్తులకు అవగాహన కల్పించేలా దేవస్థాన ప్రాంగణంలో ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. -
అమ్మవారి సొమ్ము.. హారతి కర్పూరంలా..
సాక్షి, విజయవాడ: విజయవాడలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, దేవాదాయశాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రాత్రి స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కోటి దీపోత్సవం జరిగింది. దీని ఖర్చు భారం దుర్గగుడిపై మోపారన్న విమర్శలు వస్తుండటంతో సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. లడ్డూ ప్రసాదాలకు టెండర్.. కోటి దీపోత్సవానికి 10వేల మంది భక్తులు వస్తారని అంచనా. అయితే 12 వేల మందికి ఏర్పాట్లు చేశారు. దీపోత్సవంలో కూర్చునే వారికే పూజాసామగ్రి, లడ్డూ, పులిహోర ప్రసాదాల వితరణ చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ కార్యక్రమానికి స్వయంగా రావడంతో ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఇందులో భాగంగా భక్తులకు ఉచిత ప్రసాదాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీని కోసం దుర్గగుడి నుంచి 7,500 లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేయాలంటూ దేవాదాయశాఖాధికారులు ఆదేశించారు. దీంతో అప్పటికే భక్తులకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్న 7,500 లడ్డూ,పులిహోర ప్యాకెట్లును ఇందిరాగాంధీ స్టేడియానికి తరలించారు. రూ. 1.50లక్షల భారం.. ఒక్కొక్క లడ్డూ రూ.15, పులిహోర ప్యాకెట్ రూ.5 చొప్పున మొత్తం రూ.1.50 లక్షలు దుర్గమ్మ ఖాతాలో వేశారని ఇంద్రకీల్రాదిపై ప్రచారం జరుగుతోంది. ఇది కాకుండా దేవస్థానం నుంచి వేదపండితుల్ని పంపమంటూ ఆదేశాలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పొల్గొనడం వల్ల ఏమాత్రం తేడా రాకూడదని దేవస్థానం వేదపండితుల్ని, ప్రసాదాలను వినియోగిస్తున్నారని తెలిసింది. దేవస్థానానికి ఏమాత్రం సంబంధం లేకుండా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకు పేరు వచ్చే ఈ కార్యక్రమానికి దుర్గగుడి ఖాతా నుంచి చెల్లించాలని నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నారు. ప్రతి నెల రూ.5 లక్షలు భారం.. రాష్ట్ర ప్రభుత్వం ఫెర్రీలో ఆర్భాటంగా కృష్ణా, గోదావరి నీరు కలిసే చోట సంగమ ప్రదేశంగా ప్రకటించింది. ఇక్కడ ప్రతి రోజు కృష్ణమ్మకు హారతులు ఇస్తున్నారు. ఈ హారతులకు ప్రతి నెల రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును దుర్గమ్మ ఖాతా నుంచి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. కనీసం దుర్గాఘాట్‌లో జరగని కృష్ణమ్మ హారతులకు దుర్గగుడి ఖాతా నుంచి ఎందుకు నిధులు చెల్లింస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. రాజధాని అమరావతిలో జరిగే పలు కార్యక్రమాలకు దేవాదాయశాఖ చేయాల్సిన ఖర్చును సైతం దుర్గగుడి నెత్తిన వేయడంపై భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. -
దుర్గమ్మకెరుక!
సాక్షి, విజయవాడ: 2017 దసరా ఉత్సవాలకు రూ.14 కోట్లు ఖర్చు అయ్యాయని, ఈ ఏడాది ఈ ఖర్చును రూ.8 కోట్లు కుదిస్తున్నామంటూ దుర్గగుడి ఈవో వి.కోటేశ్వరమ్మ దసరా ఉత్సవాలకు ముందు ప్రకటించారు. అయితే వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. అకౌంట్ విభాగం లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత ఈ ఏడాది దసరా ఖర్చులు సుమారు రూ. 8 కోట్లు అయ్యాయని, అందులో రూ.5 కోట్ల వరకు చెల్లించామని, మిగిలినవి చెల్లించాల్సి ఉందంటూ అధికారులు లెక్కలు చెప్పారు. దీంతో గత ఏడాది అంత ఖర్చు ఎందుకయ్యిందనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఆరా తీసిన పాలకమండలి.. గత ఏడాది దసరా ఉత్సవాలకు, ఈ ఏడాది దసరా ఉత్సవాలకు పాలకమండలి ఉంది. దీంతో గత ఏడాది ఎక్కువ ఖర్చులు ఎందుకు అయ్యాయి. ఈ ఏడాది ఎక్కడ తగ్గాయనే అంశంపై పాలకమండలి ఆరా తీసింది. గత ఏడాది రూ. 6.65 కోట్లు ఖర్చు చేశామంటూ అకౌంట్స్ విభాగం అధికారులు లిఖిత పూర్వకంగా పాలకమండలికి తెలియజేశారు. మొదలైంది వివాదం.. దీంతో గత ఏడాది ఉత్సవాలకు రూ.6.65 కోట్లు ఖర్చు అయితే ఈ ఏడాది ఉత్సవాలకు రూ.8 కోట్లు ఖర్చయిందని, అందువల్ల ఈ ఏడాది దేవస్థానానికి మిగిలింది ఏమీటంటూ ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో సభ్యులు అధికారులను ప్రశ్నించారు. దేవస్థానానికి ఖర్చులు తగ్గనప్పుడు మీడియాలో ఖర్చులు నియంత్రించామని చెప్పాల్సిన అవసరం ఏమీ వచ్చిందంటూ సభ్యులు అధికారులను నిలదీశారు. గత ఏడాది రూ.14 కోట్లు ఖర్చు చేయకుండా చేశామని చెప్పడం ఏమీటంటూ ప్రశ్నించినట్లు తెలిసింది. తారుమారైన లెక్కలు.. దీంతో ఉలిక్కిపడ్డ అకౌంట్ విభాగం అధికారులు లెక్కల్ని తారు మారు చేశారు. గత ఏడాది దసరా ఉత్సవాలకు రూ.13.62 కోట్లు ఖర్చయినట్లు లెక్కలు తయారు చేసి మీడియాకు విడుదల చేశారు. ఇందులో పూజా సామాగ్రి, ప్రొవిజన్స్‌కు రూ.4.06 కోట్లు, ఇంజినీరింగ్ వరŠక్స్‌కు రూ.2.78 కోట్లు, ఇతర ఖర్చుల కింద రూ.2.78 కోట్లు చూపించారు. మిగిలిన సొమ్ములో వివిధ శాఖలకు చెల్లించిన ఖర్చుల్ని వివరిస్తున్నారు. ఇవి తెలియాలి.. అయితే పాలకమండలికి ఒక లెక్కలు, మీడియాకు మరొక లెక్కలు చెప్పాల్సిన అవసరం అకౌంట్స్ విభాగానికి ఎందుకు వచ్చిందనే అంశం ఆదాయ పన్నుశాఖ నుంచి వచ్చిన ఈవో కోటేశ్వరమ్మ తేల్చాల్సి ఉంది. రెండు రకాల లెక్కలు చెబుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గత ఏడాది అసలు ఖచ్చితంగా ఎంత ఖర్చయిందో కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ముదురుతున్న వివాదం
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాల్లో సాంస్కృతిక కళాకారులకు ఇచ్చే మెమెంటోల కొనుగోలులో అవినీతి వ్యవహారం దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈవో)కి, సహాయ కార్యనిర్వహణాధికారి(ఏఈవో)కి మధ్య వివాదానికి దారితీసింది. ఏఈవో అచ్యుత రామయ్యను ఈవో వి.కోటేశ్వరమ్మ సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ నెలాఖరుకు రిటైరయ్యే అచ్యుతరామయ్య చివర రోజుల్లో సస్పెండ్‌కు గురి అవ్వడం జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు దాఖలు... దుర్గగుడి ఈవో వి.కోటేశ్వరమ్మకు తనను సస్పెండ్ చేసే అధికారం లేదని, తాను ఏ తప్పు చేయలేదని ఏఈవో అచ్యుత రామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 8వ తేదీన హైకోర్టులో కేసు వేశారు. తనను విధుల్లో కొనసాగించాలని కోరారు. ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు పెండింగ్‌లో పెట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని, ఈవో కోటేశ్వరమ్మను హైకోర్టు కోరినట్లు సమాచారం. సాగదీస్తారా? సమాధానమిస్తారా? ఏఈవో అచ్యుత రామయ్య వేసిన కేసుపై అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి సమాధానం ఇస్తారా? లేక కేసు సాగదీస్తారా? అని ఇంద్రకీలాద్రిపై చర్చ జరుగుతోంది. దుర్గగుడిలో కేసులు నమోదైతే దాన్ని సాధ్యమైనంత వరకు సాగదీసి చివరకు సమాధానం ఇస్తారు. ఇటీవల పాలక మండలి నుంచి సస్పెండైన కోడెల సూర్యకుమారి, హైకోర్టుకు వెళ్లారు. దీనిపై ఇప్పటి వరకు దేవస్థానం అధికారులు న్యాయస్థానానికి సరైన సమాచారం ఇవ్వలేదు. పోలీసుల విచారణ ప్రారంభం ఈఓ వి.కోటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు పై వన్‌టౌన్ పోలీసులు కేసు విచారణ ప్రారంభించారు. మెమెంటోలు కొనుగోలులో గోల్మాల్ వ్యవహారంతో పాటు ఈవోను ఏఈవో అచ్యుతరామయ్య బెదిరించడంపై పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా తొలుత మెమెంటోలు సరఫరా చేసిన అనూష హ్యండీ క్రాఫ్ట్ నిర్వాహకుడు రమేష్‌ను పిలిచి విచారించారు. ఎన్ని ఆర్డర్ ఇచ్చారు? ఎన్ని సరఫరా చేశారు? ఎంతకు బిల్లు తీసుకున్నారు? రమేష్‌తో ఈ వ్యవహారంలో ఎవరెవ్వరూ మాట్లాడారు తదితర సమాచారం పోలీసులు సేకరించారు. ఈ కేసులో మరొక ఆరుగురిని పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. దేవాలయ ప్రతిష్టకు భంగం... దేవస్థానంలో ఈవో, ఏఈఓల మధ్య ఏర్పడిన వివాదం దేవాలయ ప్రతిష్ట దెబ్బతింటోంది. గతంలో దేవస్థానంలో చిన్నపిల్ల తప్పిపోయి దొరకడం, చీర మాయం కేసు, డార్మెటరీలలో సీసీ కెమెరాల వివాదాలు మరిచిపోక ముందే తాజాగా ఈవో, ఏఈవోల వివాదం తెరపైకి వచ్చింది. ఒకదాని తరువాత ఒకటి వివాదాలతో దేవాలయ ప్రతిష్ట దెబ్బతింటోదని భక్తులు వాపోతున్నారు. -
పాలకమండలి రద్దు చేస్తాం!
ఇంద్రకీలాద్రిలో ఆధిపత్యపోరు తారస్థాయికి చేరింది. ఆలయ పాలకమండలి.. ఈవోపై ఆధిపత్యం సాధించడానికి రోజు ఏదో ఒక సమస్యను సృష్టిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా దసరా శరన్నవరాత్రులు మొదలైన రోజు నుంచి చీటికీమాటికీ వివాదం రేపుతున్నారు. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వం సక్రమంగా స్పందించకపోవడంపై భక్తుల్లో తీవ్ర అసహనం నెలకొంది. దీనిని గమనించిన సీఎం నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. బుధవారం ఈ విషయంపై సీఎంవో(ముఖ్యమంత్రి కార్యాలయం) అధికారులతో సమీక్షించి.. పాలకమండలిపై తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారని తెలిసింది. దసరా ఉత్సవాల కన్నా ఆలయంలో వివాదాలే ఎక్కువ ప్రచారంలోకి వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సాక్షి, అమరావతి బ్యూరో: దసరా ఉత్సవాల సందర్భంగా నెలకొన్న వివాదాల నేపథ్యంలో సీఎంవో నుంచి బుధవారం ఉదయం దుర్గగుడి ఆలయ పాలకమండలి చైర్మన్ గౌరంగబాబుకు ఫోన్ చేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిత్యం వివాదాలకు కారణం ఏంటని.. మీపై సీఎం చాలా కోపంగా ఉన్నారని.. అధికారులతో కలసి సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు తెలిసింది. తీరు మారకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామనే సంకేతాలిచ్చినట్లు వినికిడి. ఈ నేపథ్యంతో దసరా ఉత్సవాల తర్వాత పాలకమండలి రద్దు చేస్తారనే ప్రచారం ఇంద్రకీలాద్రిపై వినిపిస్తోంది. ఒకరిద్దరు పాలకమండలి సభ్యులు ఇక తమ పనైపోయిందని వ్యాఖ్యానించడం గమనార్హం. వివాదాల దసరా.. దసరా ఉత్సవాలు మొదలైన రోజు నుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. గురువారం మంత్రి నారాయణ రాకతో ఉత్సవ మూర్తికి పంచభోగాలు ఆలస్యం చేశారు. అమ్మవారి నివేదన కంటే ఆలయ అధికారులకు మంత్రి గారి సేవే ప్రాధాన్యం కావడంపై ధార్మికవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పనిని ప్రచారానికి వాడుకోవటం అలవాటైన టీడీపీ నేతలు ఇంద్రకీలాద్రిపై భక్తుల క్యూలైన్లలో మళ్లీ మీరే రావాలి.. అంటూ తెలుగుదేశం పార్టీ ప్రచార ఫ్లెక్సీలు కట్టారు. పాలకమండలి సభ్యుడైన వెలగపూడి శంకరబాబే ఇలా చేయడం గమనార్హం. ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడాల్సిన పాలకమండలి సభ్యుడే ఇలా చేయటం ఏంటని భక్తులు పాలకమండలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మూలా నక్షత్రం రోజున.. మూలా నక్షత్రం సందర్భంగా పోలీసుల వ్యవహారశైలి వివాదాస్పదమైంది. ఏకంగా ఆలయ చైర్మన్‌ను సోమవారం తెల్లవారుజామున తొలిపూజకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా మరోసారి ఉదయం కూడా తన చాంబర్‌కు కూడా వెళ్లకుండా నిలువరించి వివాదానికి కారణమయ్యారు. ఆఖరికి విజయవాడ సీపీ ద్వారకాతిరుమల రావు వచ్చి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీటీడీ తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడంలోనూ వివాదాలే రాజ్యమేలాయి. బోర్డు సభ్యుడిగా తనకు అవకాశం ఇవ్వలేదని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అధికారులపై చిందులు తొక్కి ఆగ్రహంగా గుడి నుంచి వెళ్లిపోయారు. అతనితో వచ్చిన అనుచరులు ఆలయ సూపరింటెండెంట్‌ను చొక్కాపట్టుకొని బెదిరించి, కేకలు వేస్తూ ఇంద్రకీలాద్రిపై ‘బోండా గిరి’ ప్రదర్శించి కొండపై ప్రశాంతతకు భంగం కలిగించారు. పాలకమండలి చైర్మెన్‌ను ఈవో మంగళవారం క్యూలైన్లో దర్శనానికి రావాలని సూచించడంతో ఆయన గుడిలోనే నిరసన దిగటం, సీఎంకు ఫిర్యాదు చేయాలని పాలకమండలి నిర్ణయించడంతో.. వారికి ఈవోకి మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. ఇలా నిత్యం ఏదో ఒక వివాదంతో ఈ ఏడాది పండుగ పర్వదినాలు మొత్తం వివాదాలమయంగా మారి వివాదాల దసరా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇంద్రకీలాద్రిపై కుండపోత వర్షం
-
‘వీఐపీ అయినా క్యూలైన్లో రావాల్సిందే’
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో.. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం(అక్టోబర్ 14) రోజు మూలా నక్షత్రం సందర్బంగా సరస్వతీ దేవీ అవతారంలో కనకదుర్గమ్మను అలంకరించనున్నారు. ప్రతి యేటా మూడు లక్షల మందికి పైగా భక్తులు మూలా నక్షత్రం నాడు అమ్మవారిని దర్శించుకుంటారు. దీంతో రేపటి ఉత్సవాల నిర్వహణ గురించి దుర్గ గుడి ఈవో వి. కోటేశ్వరమ్మ పాలకమండలి సభ్యులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. మూలా నక్షత్రం సందర్భంగా భక్తులకు అంతరాయల దర్శనం ఇవ్వలేమని తెలిపారు. ముఖమండప దర్శనానికి రూ.100 టికెట్ పెడుతున్నామని, రేపు ఏ వీఐపీని ప్రత్యేకంగా చూడమని స్పష్టం చేశారు. వీఐపీ అయినా క్యూలైన్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేషనల్ లెవెల్ వీఐపీలకు తప్ప ఎవరికీ ప్రత్యేక దర్శనం లేవని పేర్కొన్నారు. అందరూ క్యూలైన్లో నిలబడితే అమ్మ వారి సేవ చేసినట్టేనని వివరించారు. పాలకమండలి మధ్య విభేదాలు ఇంట్లో కుటుంబసభ్యుల గొడవలాంటిదన్నారు. పాలకమండలి సభ్యులు కూడా టికెట్లు కొనేల చర్యలు చేపడతామన్నారు. దుర్గమ్మ గుడి పవిత్రతను కాపాడాలని, రాజకీయ పార్టీల ప్రచారాలకు తావులేదని పేర్కొన్నారు. -
దుర్గగుడిలో మంత్రి దేవినేనికి చుక్కెదురు
సాక్షి, విజయవాడ : దుర్గగుడిలో మంత్రి దేవినేని ఉమకు చుక్కెదురైంది. సాధారణ భక్తులు వెళ్లే క్యూలైన్లో కొండపైకి వచ్చిన మంత్రి ఉమని.. ఓ భక్తురాలు సమస్యలపై నిలదీసింది. క్యూలైన్లో ఉన్న మంత్రి ఉమ గుడిలోని సదుపాయాల గురించి భక్తులను అడుగగా.. క్యూలైన్ల నిర్వహణ గందరగోళంగా ఉందని, గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఓ మహిళా భక్తురాలు అసహనం వ్యక్తం చేసింది. వీఐపీలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. దీంతో జవాబు చెప్పలేక పోయిన మంత్రి సమయం అవుతోందంటూ గుడిలోకి వెళ్లిపోయారు. ఫిర్యాదు చేస్తే పట్టించుకోని మంత్రి ఈ మాత్రానికే క్యూలైన్లలో రావటం, సమస్యలు ఉన్నాయా అని అడగటం ఎందుకని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. -
రేపటి నుంచే కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు
సాక్షి, విజయవాడ : బుధవారం నుంచి కనకదుర్గమ్మ దేవస్థానంలో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14న మూలానక్షత్రం నాడు సరస్వతీదేవి అవతారంలో కనకదుర్గమ్మను అలంకరించనున్నారు. ప్రతియేటా మూడు లక్షల మంది భక్తులు మూలానక్షత్రం నాడు అమ్మవారిని దర్శించుకుంటారు . ఈ ఉత్సవాల్లో భక్తులు ఇచ్చిన ఆభరణాలతో నిత్యం అమ్మవారికి అలంకారాలు చేయనున్నట్లు తెలిపారు. రూ.8.30 కోట్లతో అమ్మవారి ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. 5 వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రత ను కల్పించారు. ఉత్సవాల తొలి రోజు కాణిపాకం వినాయక ఆలయం నుంచి అమ్మ వారికి పట్టువస్త్రాలు రానున్నాయి. ఈనెల 18తో ఉత్సవాల ముగుస్తాయని దుర్గ గుడి ఈవో వి. కోటేశ్వరమ్మ తెలిపారు. -
అమ్మదర్శనం.. గంటలోపే
దుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. తొమ్మిది రోజులపాటు రోజుకొక అవతారంలో దర్శనమిచ్చే∙అమ్మను చూసి తరించడానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. అలా వచ్చే వారందరికీ సులభంగా అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని ఆనందంగా తిరిగి వెళ్లేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో దుర్గమ్మ సన్నిధిలో ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎ.కోటేశ్వరమ్మ ‘సాక్షి’కి వివరించారు. సాక్షి: దసరా ఉత్సవాల్లో అమ్మవారి దర్శన వేళలు ఏమిటి? ఈవో : మొదటి రోజు స్నపనాభిషేకం అనంతరం ఉదయం 9 గంటలకు భక్తుల దర్శనాలకు అనుమతిస్తాం. మిగిలిన రోజుల్లో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది. మూలా నక్షత్రం రోజున అర్థ్ధరాత్రి ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. సాధారణ పర్వదినాల్లో గంటలోపు, మూల నక్షత్రం రోజున రెండు గంటల్లోనూ అమ్మవారి దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. సాక్షి:ఈ ఏడాది భక్తుల రద్దీ ఏ విధంగా ఉంటుందని అంచనా? ఈవో : సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారని భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. మా అంచనాలకు మించే భక్తులు వచ్చే అవకాశం ఉంది. సాక్షి:దసరా వ్యయంలో పొదుపు చర్యలు పాటిస్తున్నారు? భక్తులకు ఇబ్బందులు రావా? ఈవో : గత ఏడాది రూ.15 కోట్లు ఖర్చు అయ్యిం ది. ఈ ఏడాది సుమారుగా రూ.8.3 కోట్లతో అంచనాలు తయారు చేశాం. మహా అయితే మరో 10 శాతం పెరగవచ్చు. అయితే భక్తులు సౌకర్యాల్లో గత ఏడాది కంటే ఏమాత్రం తగ్గవు. వారికి కావా ల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తాం. సాక్షి: భక్తులకు దర్శనం కోసం ఏ మార్గంలో వెళ్లాలి? ఈవో : భక్తుల్ని వినాయకుడు గుడి నుంచి రెండు క్యూలలో అనుమతిస్తాం. కొండపైన ఓం టర్నింగ్ నుంచి ఐదులైన్లు ఏర్పాటు చేస్తున్నాం. వినాయకుడు గుడి నుంచి క్యూలైన్లోకి వచ్చి దర్శనం అనంతరం మల్లికార్జున మహామండపం ద్వారా, శివా లయం వద్ద రాయబార మండపం మెట్లమార్గం ద్వారా క్రిందకు వెళ్లే ఏర్పాటు చేస్తున్నాం. సాక్షి: అమ్మవారి దర్శనం టిక్కెట్లు ఎంత? ఈవో : గత ఏడాది తరహాలోనే రేట్లు ఉన్నాయి. రేట్లు పెంచలేదు. అంతరాలయ దర్శనానికి రూ.300. ముఖమండప దర్శనానికి రూ.100 రేట్లు ఉంటాయి. ఇవే కాకుండా సర్వదర్శనం క్యూౖ లెన్లు ఉంటాయి. మూలనక్షత్రం రోజు విజయదశమి రోజున టిక్కెట్లు ఉండవు. అందరూ ఉచిత దర్శనమే చేసుకోవచ్చు. సాక్షి: ప్రత్యేక పూజల వివరాలు చెప్పగలరు? ఈవో : ప్రత్యేక కుంకుమార్చన మల్లికార్జున మహా మండపం 6వ అంతస్తులో జరుగుతాయి. రుసుం రూ.3,000. ఉదయం 7గంటల నుంచి 9 గంటల వరకు, 10 గంటల నుంచి 12 గంటల వరకు రెండు బ్యాచ్‌లు ఉంటాయి. విశేష చండీ హోమం రుసుము రూ.4000.ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. మూల నక్షత్రం రోజు రుసుము రూ.5000. మూడు బ్యాచ్‌లు ఉంటాయి. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు బ్యాచ్‌లు ఉంటాయి. సాక్షి: లడ్డూ, పులిహోర ప్రసాదాలు అందక చివర్లో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది అదే పరిస్థితి తప్పదా? ఈవో : ఈ ఏడాది 40 లక్షలు లడ్డూలు, 20 వేల కేజీల పులిహోర ప్రసాదాలు తయారు చేయిస్తున్నాం. భక్తులకు కావాల్సి న ప్రసాదాలు అందుబాటులో ఉంటాయి. ఇవి కాకుండా క్యూౖ లెన్లో వచ్చే భక్తులకు జల, క్షీర, కదంబ ప్రసాదాలను ఉచితంగా పంపిణీ చేయాలని భావిస్తున్నాం. ఇంద్రకీలాద్రి పై మూడు చోట్ల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఉచి తంగా అప్పం ప్రసాదం పం పిణీ చేస్తాం. కనకదుర్గానగర్‌లో ప్రసాదాల కౌంటర్లు ఉంటాయి. సాక్షి: అన్నప్రసాదం ఎంతమందికి ఉంటుంది? ఈవో : అర్జున వీధిలోని అన్నప్రసాద భవనంలోనే అన్నదానం జరుగుతోంది. ప్రతిరోజు 20 వేల మందికి, మూల నక్షత్రం రోజు 40 వేల మందికి అన్నదానం జరుగుతుంది. ఎక్కువ మందికి భోజనాలు పెట్టేందుకు అవసరమైతే బఫే పద్ధతిని ప్రవేశపెడతాం. ఉచిత కదంబం ప్రసాదం ఉంటుంది. సాక్షి:భక్తులు రాత్రి పూట బస చేయాలంటే ఇబ్బందిగా ఉందా? ఈవో : కాటేజీలు లేకపోవడం ఇబ్బందే. అయితే మల్లికార్జున మహామండపంలో నిద్రించవచ్చు. కాగా పేద, మధ్య తరగతి భక్తుల కోసం సీవీ రెడ్డి చారిటీస్‌లో కాటేజ్‌లు ఉన్నాయి. వాటిని వినియోగించుకోవచ్చు. సాక్షి:అదనపు సిబ్బంది సేవలు వినియోగించుకుంటున్నారా? ఈవో : ఇతర దేవాలయాల నుంచి 167 మం ది సిబ్బంది ఇప్పటికే వచ్చారు. వీరు కాకుండా 4,600 మం ది పోలీసులు అందుబాటులో ఉంటారు. భక్తులకు తక్షణ సహాయం అందచేసేందుకు వెయ్యి మంది ఎన్సీసీ,, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను సిద్ధః చేశాం. అత్యవసర పరిస్థితుల్లో భక్తులు క్యూ మార్గం లోంచి బయటకు వచ్చేందుకు ప్రతి ఐదు మీట ర్లకు ఒక అత్యవసర ద్వారం ఏర్పాటు చేస్తున్నాం. «రథం సెంటర్, మున్సిపల్ ఆఫీసుల వద్ద చెప్పులను, సామాన్లును భద్రపరుచుకునే కౌంటర్లు ఏర్పాటు చేశాం. భక్తుల సౌకర్యార్ధం ఘాట్‌రోడ్డులోనూ, కనకదుర్గానగర్ తదితర 15 ప్రదేశాల్లో ప్రధమ చికిత్సా కేంద్రాలు, అంబులెన్స్‌లు ఏర్పాటు చేశాం. సాక్షి:భక్తులు తలనీలాలు ఎక్కడ సమర్పించుకోవాలి? ఈవో : సీతమ్మవారి పాదాలు వద్ద కేశఖండన శాల ఏర్పాటు చేస్తున్నాం. దేవస్థానానికి చెందిన 200 మంది నాయీ బ్రాహ్మణులు అందుబాటులో ఉంటారు. జల్లు స్నానాలు చేయవచ్చు. సీతమ్మవారి పాదాలు వద్ద 30, పద్మావతి ఘాట్ వద్ద 30, దోబిఘాట్ వద్ద 10 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశాం. సాక్షి:నగరోత్సవం, తెప్పోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఈవో : దసరా ఉత్సవాల్లో ప్రతి రోజు సాయంత్రం 4 గంటలకు నగరోత్సవం శివాలయం మెట్ల మార్గం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నగరోత్సవం అర్జున వీధి, రథం సెంటర్, వినాయకుడు గుడి, మరలా రథం సెంటర్ టోల్గేట్ మార్గం ద్వారా కొండపైకి వెళ్తుంది. నగరోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా బ్రహ్మరథం, బేతాళనృత్యాలు, తాళభజన్లు, సంకీర్తణలు, కోలాట బృందాలు, నృత్య బృందాలు, వేద విద్యార్థులుతో పాటు అనేక బృందాలు పనిచేస్తాయి. చండీశ్వరుడు చిన్న పల్లకి, తిరుచ్చి, స్వామి వారు, అమ్మవారు పల్లకి, ఘాటాటోపం కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. విజయదశమి రోజు దుర్గాఘాట్‌లో దుర్గమల్లేశ్వరుల తెప్పోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నాం. పున్నమి ఘాట్, దుర్గాఘాట్‌ల నుంచి భక్తులు అమ్మవారి నదీ విహారం తిలకించి పునీతులవ్వచ్చు. సాక్షి:పాలకమండలి సభ్యుల సేవలు ఏ విధంగా ఉంటాయి? ఈవో : ఉత్సవాల్లో పాలకమంది సభ్యులు, సిబ్బంది కలిసి మెలసి ముందుకు వెళ్తున్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో వారి అమూల్యమైన సలహాలు ఇస్తున్నారు. పండుగ రోజుల్లో వారు భక్తులకు అందుబాటులోనే ఉంటారు. అందరి సహకారంతో... శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించే దసరా మహోత్సవాలను అందరి సహాకారంతో విజయవంతంగా నిర్వహిస్తామని ఈవో వీ. కోటేశ్వరమ్మ అన్నారు. సోమవారం మహా మండపం ఆరో అంతస్తులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవాల ఏర్పాట్ల గురించి వివరించారు. దసరా ఉత్సవాల విజయవంతం చేయడంలో మీడియా సహకారం కూడా అవసరమని, గతంలో అనేక ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో మీడియా సహకారం ఎంతో ఉందన్నారు. -
దుర్గగుడిలో ‘ఉద్వాసన’ పర్వం
దుర్గగుడిలో ఉద్వాసనల పర్వం కొనసాగుతోంది.. ఇటీవల 150 మంది సెక్యూరిటీ సిబ్బందిని ఇంటికి పంపించిన అధికారులు తాజాగా మరో 14 మంది తాత్కాలిక సిబ్బందిపై వేటు వేశారు.. తమకు అనుకూలమైనవారిని నియమించుకునేందుకే అధికారపార్టీ నాయకులు ఇటువంటి తంత్రాలను ప్రయోగిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా తాము అమ్మవారి సన్నిధిలో సేవలందిస్తున్నామని.. వేతనం తక్కువైనా అమ్మ సన్నిధిలో సేవచేశామనే తృప్తితో జీవితాలను నెట్టుకొస్తున్నామని.. ఇప్పుడు హఠాత్తుగా పొమ్మంటే మా గతేం కావాలని సిబ్బంది వాపోతున్నారు.. సాక్షి,విజయవాడ: ‘బాబు వస్తే జాబు వస్తుంది’ అని చంద్రబాబు ప్రభుత్వం గత ఎన్నికల ముందు ప్రచారం చేసుకున్నారు. బాబు వచ్చాక కొత్త జాబులు రావడం మాట పక్కన పెడితే.. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. దుర్గగుడిలో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తే 150 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగాలు పోయి ఘటన జరిగిన నెల కూడా కాక ముందే ఇప్పుడు లడ్డూ, పులిహోర విక్రయాల విభాగంలో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న 14 మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. 8 ఏళ్లుగా సేవలు ఈ 14 మంది సిబ్బంది ఎనిమిదేళ్ల క్రితం దుర్గగుడిలోకి వచ్చారు. అప్పట్లో లడ్డూల విక్రయాలు బ్యాంకులు నిర్వహించేవి. తొలి ఆరేళ్లు ఆంధ్రాబ్యాంకు, ఎస్బీహెచ్ అంటూ బ్యాంకులు మారాయి కాని సిబ్బంది మాత్రం మారలేదు. రెండేళ్ల క్రితం బ్యాంకులను తప్పించి దేవస్థానమే స్వయం లడ్డూలు విక్రయాలు ప్రారంభించింది. అయితే సిబ్బందిని మాత్రం కొనసాగించారు. దేవస్థానం తరఫున ఇద్దరు పర్మినెంట్ ఉద్యోగుల పర్యవేక్షణలో ఈ 14 మంది సిబ్బంది రెండు షిప్టులలో విధులు నిర్వహించేవారు. మల్లికార్జున మహామండపం కింద భాగంలో మూడు కౌంటర్లు, శివాలయం వద్ద ఒక కౌంటర్, నటరాజ మండపం వద్ద మరొక కౌంటర్ నిర్వహించేవారు. లడ్డూలు, పులిహోర విక్రయాల్లో ఈ సిబ్బంది కీలకపాత్ర పోషించేవారు. ఏ రోజు సొమ్ము ఆరోజు దేవస్థానానికి జమ చేసేవారు. గత ఈఓ జీతాలు పెంచితే.... బ్యాంకుల ఆధీనంలో సిబ్బంది పనిచేసేటప్పుడు నెలకు రూ.8,650 చొప్పున చెల్లించేవారు. అయితే గత ఈఓ ఎం. పద్మ వీరి సమస్యలను అర్ధం చేసుకుని రూ.12,000 జీతం పెంచారు. దీనికి తోడు జీఎస్టీ, పీఎఫ్ కలిపితే రూ.17వేలు వరకు అయ్యేది. లడ్డూల ప్రసాదాల విభాగాన్ని చక్క దిద్దుతుండగానే ఆమె బదిలీ జరిగింది. ఆమె స్థానంలో వచ్చిన కోటేశ్వరమ్మ 14 మంది సిబ్బందిపై వేటు వేశారు. తిరిగి ప్రసాదాల కౌంటర్ల నిర్వహణ బాధ్యత బ్యాంకులకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో బ్యాంకులు ప్రసాదాలను విక్రయించేటప్పుడు భక్తుల నుంచి విమర్శలు రావడంతో దేవస్థానమే ఆ బాధ్యత చేపట్టింది . ఇప్పుడు తిరిగి బ్యాంకులకు అప్పగిస్తే.. గతంలో జరిగిన పరస్థితులు పునరావృతం కాదా? అనేది ప్రశ్న. అధికారపార్టీకి చెందిన కొంతమంది రాజకీయ నేతలు స్వలాభం కోసమే ఈ తొలగింపులు జరిగాయని, తరువాత తమకు అనుకూలమైన వారి వద్ద ముడుపులు తీసుకుని దేవస్థానంలో పోస్టింగ్‌లు ఇప్పిస్తారని ఇంద్రకీలాద్రిపై ప్రచారం సాగుతోంది. ఈఓ మారిన ప్రతిసారి అధికారపార్టీ నేతలకు ఇది మాములేనని భక్తులు చర్చించుకుంటున్నారు. మా సిబ్బందిని వినియోగించుకుంటాం ప్రస్తుతం మా వద్ద పనిచేసే 14 మంది పర్మినెంట్ సిబ్బంది ఖాళీగా వున్నారు. వీరి సేవలు వినియోగించుకునేందుకు 14 మందిని తొలగించాను. త్వరలోనే ప్రసాద విక్రయ బాధ్యతలను బ్యాంకుకు ఇచ్చిన తరువాత పర్మినెంట్ సిబ్బంది సేవలు వేరే విభాగంలో వినియోగించుకుంటాం.– కోటేశ్వరమ్మ, దుర్గగుడి ఈఓ -
అ‘ధర్మ’కర్త మండలి !
సాక్షి,విజయవాడ : ఎన్నో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న దుర్గ గుడి పాలక మండలి అవసరమా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే దుర్గమ్మకు భక్తులు సమర్పించిన చీరను కాజేయడంతో కోడెల సూర్యలతను పాలకమండలి నుంచి ప్రభుత్వం తొలగించింది. పదవి కోల్పోయిన సూర్యలత పాలకమండలి చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, సభ్యుడు వెలగపూడి శంకరబాబు పై ఆరోపణలు చేశారు. వెలగపూడి శంకరబాబు ఐదుగురు ఓపీడీఎస్ మహిళల్ని వేధించారని, దీనిపై వారు ఫిర్యాదు చేసినా చైర్మన్ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఎంతో హుందాగా ఉండాల్సిన పాలకమండలి సభ్యుడు దేవస్థానంలో పనిచేసే మహిళా సెక్యురిటీ సిబ్బందిని లైంగిక వేధింపులకు గురి చేశారనే విషయం ఇంద్రకీలాద్రి పై చర్చనీయాశంగా మారింది. చైర్మన్ దేవస్థానంలో సెక్యురిటీ టెండర్లను పారదర్శకంగా పాటించకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా పాలకమండలిలో ఉన్న మరొక సభ్యుడుకు నేర చరిత్ర ఉంది. అవినీతికి ఆలవాలమైన కమిటీ... దుర్గగుడి పాలకమండలి అవినీతికి ఆలవాలంగా మారింది. పాలకమండలి సభ్యులకు ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉండటంతో అధికారులు, సిబ్బంది కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పటికే 14 నెలలు గడిచిపోవడంతో ఉన్న కొద్దికాలంలో సాధ్యమైనంత రాబట్టేందుకు కొంతమంది పాలకమండలి సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాము చేయాల్సిన పనులు వదిలివేసి... పాలకమండలి సభ్యుడు దేవస్థానం ఆదాయం పెంచేందుకు కృషి చేయాలి. తమ పరపతిని ఉపయోగించి దేవస్థానానికి విరాళాలు వచ్చేటట్లు చేయాలి. అయితే ఏడాది గడిచిన పెద్దగా విరాళాలు తెచ్చిన దాఖాలు లేవు. తమ పరపతిని ఉపయోగించి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాబట్డడం లేదు. ఇక అధికారులకు మంచి సూచనలేమైనా చేశారంటే అదీ కనపడదు. భక్తులపై ఆర్థిక భారం తగ్గించే ప్రయత్నాలు కూడా ఏమీ కపడవు. భక్తిభావం లేని ఇటువంటి పాలకమండలి ఎంతమేరకు అవసరమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. -
దుర్గగుడిలో మహిళలపై లైంగిక వేధింపులు
-
‘దుర్గ గుడి వ్యవహారాలన్నింటికీ ఆయనే కారణం’
సాక్షి, విజయవాడ : దుర్గ గుడిలో జరిగే వ్యవహారాలన్ని బుద్దా వెంకన్న కనుసన్నల్లోనే జరుగుతన్నాయి. అందుకే చీర మాయం అయిన వ్యవహారంపై పోలీసులు ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత కొంత కాలం నుంచి దుర్గగుడిలో జరుగుతున్న చీరల మాయంపై ప్రభుత్వం ఇప్పటివరకూ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. పాలకమండలి సభ్యుల వ్యవహారశైలి వివాదస్పదంగా ఉన్నా ప్రభుత్వ చర్యలు మాత్రం శూన్యమని విమర్శించారు. గతంలో తాంత్రిక పూజలు.. ఇప్పుడు చీరల మాయం అసలు ఇంతకు దుర్గ గుడిలో ఏం జరుగుతుందో అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రజలకు తెలయజేయాలని డిమాండ్ చేశారు. గతంలో మంత్రి నారా లోకేష్ కోసమే దుర్గ గుడిలో తాంత్రిక పూజలు నిర్వహించారు కాబట్టే అందుకు సంబంధించిన నివేదిక ఇంత వరకూ రాలేదని ఆరోపించారు. యనమల జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పు : మల్లాది విష్ణు రాష్ట్రంలో కొన్ని పత్రికల రాతలు చూస్తూంటే అవి ఎవరి విజయం కోసం పనిచేస్తున్నాయో జనాలకు అర్థమవుతుంది. మరి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖలో ప్రస్తావించిన అంశాలకు యనమల రామకృష్ణుడు ఎందుకు సమాధానం చెప్పలేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మల్లాది విష్ణు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ కృషి చేస్తోంటే.. టీడీపీ మాత్రం నిస్సిగ్గుగా బీజేపీతో స్నేహం కొనసాగిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న కుట్రలన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు సర్కారు పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. -
బెజవాడ గడపలో ‘శ్రీనివాస కల్యాణం’
‘శ్రీనివాస కళ్యాణం’ చిత్ర యూనిట్ సభ్యులు బుధవారం విజయవాడ నగరంలో సందడి చేశారు. సినిమా గురువారం విడుదలవుతున్న నేపథ్యంలో నటీనటులు నగరానికి విచ్చేశారు. విజయవాడ మురళిఫార్చూన్ హోటల్లో చిత్రం హీరో నితిన్, హీరోయిన్ రాసిఖన్నా, నందిత శ్వేత సందడి చేస్తున్న చిత్రమిది. లబ్బీపేట(విజయవాడతూర్పు): మంచి కుటుంబ కథాచిత్రం ‘శ్రీనివాస కల్యాణం’ అని సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. శ్రీనివాస కల్యాణం చిత్రం గురువారం విడుదల కానున్న నేపథ్యంలో, ఆ చిత్ర యూనిట్ సభ్యులు బుధవారం నగరంలో సందడి చేశారు. ఈ సందర్భంగా మురళీ పార్క్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ దిల్‌రాజ్ క్లాసికల్ సినిమాలు తీస్తారని, ఈ చిత్రంలో నటించేందుకు తనకు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. నితిన్ మొదటి సారి కొడుకుగా నటించాడని, నటీనటులు అంతా చక్కగా నటించినట్లు ఆయన పేర్కొన్నారు. సినిమా హీరో నితిన్ మాట్లాడుతూ ఈ చిత్రం తనకెంతో ప్రత్యేకమన్నారు. ఈ సినిమాలో అనేక మంది సీనియర్ నటులు ఉన్నారని, వారి ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు హీరోయిన్లు చక్కగా నటించారని, తన జీవితంలో గుర్తుండుపోయే చిత్రం శ్రీనివాస కల్యాణం అన్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. చిత్ర దర్శకులు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ శతమానం భవతి సినిమాను ప్రేక్షకులు ఆదరించారని, కుటుంబ కథాచిత్రం తీయాలని ప్రేక్షకులు కోరడంతో ఈ సినిమా తీసినట్లు తెలిపారు. సంప్రదాయం, కుటుంబ విలువలను ప్రేక్షకులకు తెలియచేయాలనేదే ఈ చిత్రం ఉద్దేశం అన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ 378 రోజుల కిందట ఫిదా తీశానని, ఇప్పుడు ఈ చిత్రం సూపర్‌హిట్ కానుందన్నారు. శ్రీనివాస కల్యాణం చిత్రాన్ని సెన్సార్ వాళ్లు చూసి తమను అభినందించారని, డిస్ట్రిబ్యూటర్స్ చూసి సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఒక మంచి చిత్రం తీశామని, ప్రేక్షకులు ఆదరించాలన్నారు. హీరోయిన్ రాశీకన్నా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రం శ్రీనివాస కల్యాణం అన్నారు. మరో హీరోయిన్ నందినీ మాట్లాడుతూ తనకు ఈ చిత్రంలో ఒక చక్కని పాత్ర ఇచ్చారన్నారు. ఈ సమావేశంలో నటుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు. దుర్గమ్మకు ప్రత్యేక పూజలు.. ఇంద్రకీలాద్రి(విజయవాడ వెస్ట్) : శ్రీనివాస కల్యాణం చిత్ర బృందం బుధవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకుంది. హీరో నితిన్, హీరోయిన్లు రాశీఖన్నా, నందితా శ్వేతల పాటు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు సతీశ్ వేగేశ్న, నటులు రాజేంద్రప్రసాద్, అజయ్‌లు అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. వీరికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ ఇన్చార్జి ఈవో అచ్యుతరామయ్య, సూపరిండెంటెంట్ చందు శ్రీనివాస్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. గురువారం సినిమా విడుదల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు బృందం పేర్కొంది. పాలక వర్గ సభ్యుడు పద్మశేఖర్, ప్రొటోకాల్ ఆఫీసర్ శ్రీనివాసమూర్తిలు పాల్గొన్నారు. హీరో నితిన్, హీరోయిన్లను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. -
‘టీడీపీ పాలనలో దుర్గమ్మకీ రక్షణ లేదు’
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ దుర్మార్గపు పాలనలో ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా దేవికి సైతం రక్షణ కరవైందని బీజేపీ అధికార ప్రతినిధి గాయత్రి మండిపడ్డారు. బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె టీడీపీ పాలనలో టీడీపీ పాలనలో అమ్మాయిలకే కాకుండా, సాక్షాత్తు దుర్గమ్మకే రక్షణ లేకుండా పోయిందని అన్నారు. భక్తులు సమర్పించిన సారెలో చీర మాయమైతే, ఇప్పటివరకూ విచారణ చేపట్టకపోవడంపై ప్రభుత్వ తీరును ఆమె ఎండగట్టారు. భక్తుల మనోభావాలతో టీడీపీ నాయకులు ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని, శివ స్వామిని హౌస్ అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. దుర్గగుడి పాలకమండలి ఒక అరాచక శక్తిగా తయారు అయ్యిందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాత ఈవో సూర్యకుమారి ఉన్నప్పుడు 50 లక్షల రూపాయల చీరలు మాయం చేశారని ఆరోపించారు. టీడీపీ అధినేత తిరుపతిలోని వజ్రాలు మాయం చేస్తుంటే...మేం తక్కువ అనే విధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు దుర్గ గుడిలో చీరలు మాయం చేస్తున్నారని విమర్శించారు. చీర మాయం విషయంపై ఒక కమిటీ వేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని గాయత్రి డిమాండ్ చేశారు. -
దుర్గగుడి పవిత్రతను కాలరాస్తున్న టీడీపీ
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ) : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రెండో అతి పెద్ద ఆలయంగా ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం పవిత్రతను తెలుగుదేశం పార్టీ కాలరాస్తుందని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. వన్‌టౌన్‌లోని ఆయన కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉంటున్న బుద్దా వెంకన్న హిందువుల ఆలయాల్లో దోపిడీకి పాల్పడుతుంటే, స్థానిక ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మైనార్టీ ఆస్తులను దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిని అదుపు చేయాలంటే ఎక్కడ తన క్షుద్ర పూజల వ్యవహారం బయటపడుతుందోననే భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. ఆదివారం శొంఠి పద్మజ అనే మహిళ మదనపల్లిలో ప్రత్యేకంగా నేయించిన 18 వేల విలువైన చీరను అమ్మవారికి బహూకరించారన్నారు. ఆ చీర అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద ఉంచారని, అలా ఉంచిన కాసేపటికే అది మాయమైందన్నారు. ఆ విషయాన్ని పాలకమండలి, అధికారులు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. చీరను దొంగిలించిన సన్నివేశాలు సీసీ పుటేజ్‌ల నుంచి తొలగించడంలో పాలకమండలి బంధువు హస్తం ఉందన్నారు. చీరదొంగతనం విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాలకవర్గ సభ్యురాలు సూర్యలత తన ఇంట్లో వస్త్ర దుకాణం నిర్వహిస్తుండటం వలన ఆ చీర అక్కడకు చేరి ఉంటుందని వెలంపల్లి అనుమానం వ్యక్తం చేశారు. దుర్గగుడిపై జరుగుతున్న అవినీతి వెనుక ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హస్తం ఉందన్నారు. జుమ్మా మసీదు లీజు రద్దు చేస్తానని జలీల్‌ఖాన్ ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదన్నారు. -
‘చీర మాయంపై పోలీసులకు ఫిర్యాదు చేయం’
సాక్షి, విజయవాడ : బెజవాడ దుర్గమ్మ గుడిలో అమ్మవారి పట్టు చీర మాయమైన ఘటనపై విచారణ జరుపుతామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ ఛైర్మన్ గౌరంగ బాబు తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయదల్చుకోలేదన్నారు. చీర ఎటుపోయిందో తామే తెలుస్తామని, విచారణ కోసం నియమించే కమిటీలో పాలకుల మండిలి సభ్యులే ఉంటారని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి వివాదాన్ని పరిష్కరిస్తామన్నారు. ఇక పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదన్న మీడియా ప్రశ్నలకు ఛైర్మన్ మాటదాటవేశారు. విచారణ కమిటీలో పాలకులే ఉంటారన్న ఛైర్మన్ వ్యాఖ్యలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి పట్టుచీర ఎక్కడ?.. ఉండవల్లి భక్తులు దుర్గమ్మకు ఆషాఢ సారెలో సమర్పించిన రూ.18 వేల విలువైన పట్టుచీర ఆదివారం మాయమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికి కూడా చీర విషయంలో ఎలాంటి సమాచారం లేకపోవటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లిలో ఎంతో భక్తితో నేయించి అమ్మవారికి సమర్పించిన పట్టుచీర కనిపించకపోవటంపై సమర్పకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఆలయ ఈవో నుంచి ఎలాంటి సమాధానం లేదని లలిత భక్తమండలి వాపోయింది. ఆలయ పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలతనే చీరను తీసుకున్నారని వారు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఆమె ఖండించారు. ఉండవల్లి నుంచి అమ్మవారి సారె ఇవ్వడానికి వచ్చిన వారికి తనే స్వాగతం పలికానని, కానీ వేణుగోపాల స్వామికి చెందిన భక్తులు ఇచ్చిన చీరను మాత్రమే తను తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. పాలకమండలి సభ్యురాలిని కాబట్టే ఆరోపణలు చేస్తున్నారని, చీర తీసుకెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. మరోవైపు సూర్యలతే కవర్లో పెట్టి చీర పట్టుకెళ్లడం చూశానని దుర్గ గుడి వైదిక కమిటీ సభ్యుడు శంకర్ శాండిల్య తెలిపారు. సూర్యలతకు తనకు ఎలాంటి విభేదాలు లేవని చూసిందే చెబుతున్నానని స్పష్టం చేశారు. -
దుర్గగుడిలో చీర మాయంపై సీఎంను కలుస్తాం
-
రూ. 50 లక్షల చీరల స్కాంలో ధర్మకర్త పాత్ర
సాక్షి, విజయవాడ : దుర్గగుడి ధర్మకర్త కోడెల సూర్యలత చీరల వ్యాపారం కోసం దుర్గగుడిలో చీరలు మాయం చేస్తున్నట్లు తెలుస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. దుర్గగుడిలో ఉండవల్లి భక్తులు సమర్పించిన పట్టుచీర మాయం కావటంపై ఆయన స్పందించారు. గతంలో జరిగిన 50 లక్షల రూపాయల చీరల స్కాంలో ధర్మకర్త పాత్ర ఉందని అన్నారు. దుర్గమ్మ సన్నిధిలో చీర మాయమై 24 గంటలు గడుస్తున్నా విచారణ జరిపించకపోవటం విడ్డూరమన్నారు. ఆలయ ధర్మకర్తే తీసిందని ఆధారాలున్నా ఆలయ అధికారులు వెనకేసుకు రావటం సిగ్గుచేటన్నారు. దుర్గగుడి అధికారులు, పాలకమండలి సభ్యులు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే, స్ధానిక ప్రజాప్రతినిధులు చీర మాయంపై స్పందించకపోవటం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. దుర్గగుడిలో చంద్రబాబు క్షుద్రపూజలు చేయించారు కాబట్టి పాలకమండలి ఎన్ని అరాచకాలు చేస్తున్నా వెనకేసుకు వస్తున్నారని మండిపడ్డారు. క్షుద్రపూజలు జరిగాయని రిపోర్టులు చెబుతుంటే ఇప్పటివరకు చర్యలు లేవని అన్నారు. దుర్గగుడి పవిత్రతను దెబ్బతీసేందుకు పాలకమండలి కంకనం కట్టుకుందని ఎద్దేవా చేశారు. దుర్గగుడి పాలకమండలిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మైనార్టీ ఆస్తులను జలీల్ ఖాన్, హిందువుల ఆస్తులను బుద్దా వెంకన్న ఖాజేస్తున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. దుర్గగుడిలో చీర మాయంపై విచారణ జరిపించకుంటే పోలీసులకు తామే ఫిర్యాదు చేసి విచారణ చేపట్టాలని కోరతామన్నారు. అమ్మవారి పట్టుచీర ఎక్కడ?.. ఉండవల్లి భక్తులు దుర్గమ్మకు ఆషాఢ సారెలో సమర్పించిన రూ.18 వేల విలువైన పట్టుచీర ఆదివారం మాయమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికి కూడా చీర విషయంలో ఎలాంటి సమాచారం లేకపోవటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లిలో ఎంతో భక్తితో నేయించి అమ్మవారికి సమర్పించిన పట్టుచీర కనిపించకపోవటంపై సమర్పకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఆలయ ఈవో నుంచి ఎలాంటి సమాధానం లేదని లలిత భక్తమండలి వాపోయింది. చీరెను సమర్పించిన ఉండవల్లి భక్తులు ఈవో కార్యలయం ముందు బైఠాయించారు. ఆలయ పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలతనే చీరను తీసుకున్నారని వారు ఆరోపించారు. -
దుర్గమ్మ గుడిలో మరో మాయాజాలం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): బెజవాడ దుర్గమ్మ గుడిలో మరో మాయాజాలం చోటు చేసుకుంది. దుర్గమ్మకు ఆషాఢ సారెలో సమర్పించిన రూ.18 వేల విలువైన పట్టుచీర ఆదివారం మాయమైంది. ఇంద్రకీలాద్రిపై మహామండపంలోని ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి పట్టుచీరను అలంకరించిన పది నిమిషాల తర్వాత పట్టుచీర మాయం కావడంతో సారెను సమర్పించిన భక్త బృందం తీవ్ర మనస్తాపానికి గురైంది. అమ్మవారి సన్నిధి నుంచి చీరను దొంగిలించడంతో ఇంద్రకీలాద్రిపై భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన లలితా మిగతా పారాయణ భక్త బృందం సభ్యులు దుర్గమ్మకు సారెను సమర్పించారు. సారెలో అమ్మవారికి సమర్పించేందుకు మదనపల్లిలో ప్రత్యేకంగా పట్టుచీరను నేత నేయించారు. సుమారు రూ.18 వేల విలువైన పట్టుచీరతోపాటు పూలు, పండ్లు, పూజా సామగ్రితో 300 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మహామండపం ఆరో అంతస్తులో భక్త బృంద సభ్యులైన పద్మజ, బాలాత్రిపుర సుందరి అమ్మవారికి పట్టుచీరను సమర్పించారు. అమ్మవారి వేదిక వద్ద ఉన్న ఆలయ వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య, అర్చకుడు రమేశ్ ఉత్సవమూర్తికి పట్టుచీరను అలంకరించారు. కొద్దిసేపటి తర్వాత పట్టుచీరను ఉత్సవమూర్తిపై నుంచి తీసి పక్కనే ఉన్న అర్చకులకు అందచేశారు. ఇంతలో భక్త బృందానికి చెందిన బాలాత్రిపుర సుందరి చీరను ఇవ్వాలని కోరగా అప్పటికే చీర మాయమైనట్లు గుర్తించారు. సిబ్బంది ఎదురుదాడి చీర మాయం కావడంతో బాలాత్రిపుర సుందరి, పద్మజ ఆలయ సిబ్బందిని నిలదీశారు. ఆలయ సిబ్బంది మాత్రం మీ బృందం సభ్యులకే చీరను ఇచ్చామంటూ ఎదురుదాడికి దిగారు. భక్తితో అమ్మవారికి సమర్పించిన చీరను తామే తీసుకుని అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముందంటూ వారు సిబ్బందిని ప్రశ్నించారు. చీర మాయమైన వ్యవహారంపై ఆలయ ఈవో ఎం.పద్మకు ఫిర్యాదు చేశారు. తర్వాత సీసీ కెమెరా పుటేజీని భక్త బృందం, ఆలయ అధికారులు పరిశీలించారు. సీసీ పుటేజీ వైదిక కమిటీ సభ్యుడు చీరను ఉత్సవమూర్తి పై నుంచి తీసే వరకే ఉండటం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టైంది. మాయమైన చీర కోసం భక్త బృందం సభ్యులు చీరల కౌంటర్‌తోపాటు మహామండపం ఆరో అంతస్తులో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో చీర విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని పాలకమండలి సభ్యుడు ఒకరు భక్త బృందం సభ్యులకు సూచించడంతో వారు అవాక్కయ్యారు. ఆలయ సిబ్బందే చీరను మాయం చేసి ఉంటారనే నిర్ధారణకు వచ్చారు. మరోసారి బయటపడిన డొల్లతనం దుర్గగుడిలో సీసీ కెమెరాల పనితీరు డొల్లతనం మరోసారి బయటపడింది. ఆషాఢ మాసం ప్రారంభం నుంచి భక్తుల రద్దీతో ఉంటున్న ఆరో అంతస్తులో సీసీ కెమెరాల పుటేజీ పూర్తిస్థాయిలో లభ్యం కాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చీరను ఉత్సవమూర్తి పై నుంచి తీసిన తర్వాత పుటేజీ లభ్యం కాకపోవడం వెనుక కచ్చితంగా ఆలయ సిబ్బంది పాత్ర ఉండొచ్చని అంటున్నారు. పుటేజీని కావాలనే తొలగించి ఉంటారని భావిస్తున్నారు. -
దుర్గా ట్రస్ట్‌కు కోటి రూపాయల టోకరా!
సాక్షి, విజయవాడ : భూమి అమ్మకం పేరిట ఓ వ్యక్తి దుర్గా ట్రస్ట్‌కు కోటి రూపాయలు ముంచాడు. భవానీ భక్తుల ఆశ్రమం కోసం నూజీవీడులో 100 ఎకరాల భూమి ఉందని నమ్మ బలికి ట్రస్ట్‌ను మోసం చేసి కటకటాలపాలయ్యాడు. పలు కేసుల్లో నిందితుడైన కేసినేని రమేశ్ అలియాస్ నవీన్ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపించి విడతల వారీగా అఖిల భారత భవానీ పీఠం నుంచి డబ్బులు కాజేశాడు. ఈ పీఠానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులు విరాళాలు అందజేశారు. మోసాన్ని గ్రహించిన ట్రస్ట్ కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు రమేష్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు పాత నేరస్థుడేనని గుర్తించారు. గతంలో అతనిపై అనేక ఛీటింగ్ కేసులు నమోదయ్యాయని, జైలు శిక్ష కూడా అనుభవించాడని పేర్కొన్నారు. -
దుర్గగుడి ఉద్యోగులపై ఉక్కుపాదం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన దుర్గగుడి ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించింది. రాబోయే ఆరునెలల్లో సిబ్బంది సమ్మెలు, ధర్నాలు చేయకుండా ఈచట్టం అడ్డుకుంటుంది. అత్యవసర సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగుల సమ్మెలపై ఉపయోగించాల్సిన ఈ చట్టాన్ని దుర్గగుడి సిబ్బందిపై ప్రయోగించడం చర్చనీయాశంగా మారింది. దేవాలయంలోని కేశఖండనశాల, విద్యుత్, మంచినీటి సరఫరా, వైద్యం, అన్నదానం, ట్రాన్స్‌పోర్టు, పారిశుధ్యం, ఆలయ నిర్వహణ విభాగాల్లో సిబ్బంది నమ్మెలో పాల్గొనడాన్ని నిషేధిస్తూ తొలిసారిగా ఈ చట్టం ప్రభుత్వం ప్రయోగించింది. కమిషన్ కాకుండా కనీస వేతనం ఇవ్వమంటూ నాయీ బ్రాహ్మణులు ఇటీవల రోడ్డెక్కిన విషయం విధితమే. అయితే అప్పటికప్పుడు వారు రోడ్డెక్కలేదు. నిబంధనల మేరకు ముందుగా నోటీసు ఇచ్చిన తరువాతనే సమ్మె చేశారు. కనీస వేతనాలు ఇవ్వమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని కోరి ఆయన ఆగ్రహాన్ని నాయి బ్రాహ్మణులు చవిచూశారు. అది చాలదన్నట్లు వారికి ఇప్పుడు ప్రభుత్వం బహుమతిగా ఎస్మా చట్టాన్ని ఇచ్చింది. ఇక నుంచి తమ ఆవేదనను చెప్పుకోకుండా గొంతు నొక్కేసింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.... దేవస్థానంలో సుమారు 250 మంది రెండు దశాబ్దాలుగా తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 19 మంది న్యాయస్థానానికి వెళ్లగా హైకోర్టు సానుకూలంగా స్పందించింది. అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు వీరిని పర్మినెంట్ చేసే విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. చివరికి తమ నిరసనలు తెలిపే అవకాశం లేకుండా చేయడం సరికాదంటున్నారు. ఇటు సిబ్బందికీ, భక్తులకు అటు ప్రభుత్వానికి వారధిలాగా పనిచేయాల్సిన దేవస్థానం పాలకమండలి పూర్తిగా విఫలమైంది. పాలకమండలిని పట్టించుకోకుండా ప్రభుత్వం ఇప్పుడు ఎస్మాచట్టం ప్రయోగించింది. ఆరునెలలు ముగిసే ముందు మరో ఆరునెలలు వరకు ఈ చట్టాన్ని పొడిగించి ఎన్నికల్లో వ్యతిరేకత లేకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శలు వస్తున్నాయి. -
దేవాదాయ శాఖలో మరో అపచారం
-
మొక్కుబడి పాలన
సాక్షి, విజయవాడ : దుర్గగుడికి సుమారు దశాబ్దకాలం తరువాత ఏర్పడిన పాలకమండలి అధి కారం చేపట్టి ఏడాది దాటుతున్నా భక్తులకు కానీ, సిబ్బందికి కానీ ఒరిగిందేమీ లేదు. గత ఏడాది జూన్ 29న పాలకమండలి బాధ్యతలు స్వీకరిం చింది. ఈ ఏడాది కాలంలో అధికారులతో వివా దాలు పెట్టుకోవడం మినహా చెప్పుకోదగిన నిర్ణయాలు ఏవీ పాలకమండలి తీసుకోలేకపోయింది. భక్తులకు ఉపయోగపడే నిర్ణయాలు నిల్ ఏడాదిలో భక్తులకు ఉపయోగపడే నిర్ణయాలు ఒక్కటి కూడా తీసుకోలేకపోయింది. పెంచిన టిక్కెట్ల ధర తగ్గించడం కానీ, దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రాత్రిళ్లు బస చేసేందుకు కాటేజ్‌లు నిర్మించడం కాని, అమ్మవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడం కాని చేయలేకపోయింది. దసరా, భవానీదీక్షలకు చేసే తాత్కాలిక ఏర్పాట్లను పర్మినెంట్ ఏర్పాట్లుగా మార్చి దేవస్థానం ఖర్చులు తగ్గేటట్లు చేయలేకపోయారు. తమకు ఉన్న పరిచయాలు ఉపయోగించుకుని దేవస్థానం ఆదాయం పెంచలేదు. ఇక పాలమండలి సభ్యులు ప్రభుత్వంలో తమకు ఉన్న పరపతిని ఉపయోగించి దేవస్థానానికి రావాల్సిన నిధులను ప్రభుత్వం నుంచి రాబట్టలేకపోయారు. కనీసం దసరా ఉత్సవాలకు అయ్యే వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టలేకపోయారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఏర్పడిన పాలకమండలి సిబ్బంది అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టేవారు. ప్రస్తుత పాలకమండలి అది కూడా చేయలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. అధికారులతో గొడవ..క్షురకుల సమస్య పరిష్కారం నిల్ పాలకమండలి ఏడాది కాలంలో అధికారులతో గొడవ పడటం మినహా సాధించింది ఏమీ లేదు. గత ఈఓ ఎ.సూర్యకుమారితో ఢీ అంటే ఢీ అన్నారు. తాంత్రిక పూజలు దేవస్థానంలో జరగకుండా అడ్డుకోలేకపోయారు. పూజలు అయిపోయిన తరువాత పాలకమండలి ఈఓ పై మీడియాలో విరచుకుపడటంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది. మరో వైపు దేవస్థానం క్షురకుడిపై పాలకమండలి సభ్యుడు పెంచలయ్య దాడిచేయడం చిలికిచిలికి గాలివానగా మారింది. తమకు జీతాలు ఇవ్వాలంటూ క్షురకులు రోడ్డెక్కగా చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు వారిపై వీరంగం వేయడంతో దేవాలయ పాలకమండలితో పాటు రాష్ట్రప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది. ముఖ్యమంత్రి ఆగ్రహం ఈఓ సూర్యకుమారిపై పాలకమండలి సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సభ్యు›లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ప్రస్తుతం అధికారులకు ఎదురు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తూతూమంత్రంగా పాలకమండలి సమావేశాలు ముగుస్తున్నాయి. దసరాకు రూ. 32 లక్షలతో దేవాలయానికి రంగులు వేయాలని, దుర్గగుడిలో వేర్వేరు ప్రాంతాల్లో రూ.10 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రికార్డింగ్ స్టోరేజీకి మరో రూ.8 లక్షలు వెచ్చించాలని, దేవాలయంలో అగ్నిమాపక సామగ్రి ఏర్పాటుకు రూ.36 లక్షలు ఖర్చు చేయాలనే తాత్కాలిక నిర్ణయాలు మాత్రమే తీసుకున్నారు. -
మూడు కత్తెర్లకు ఓకే
ఇంద్రకీలాద్రి : దుర్గగుడి కేశఖండన శాలలో క్షురకులు నిరవధిక సమ్మె చేస్తుండటంతో ఆలయానికి చెందిన పర్మనెంట్ సిబ్బందితో పనులు చేయించేలా ఏర్పాట్లు చేశారు. అయితే వారితో కూడా తలనీలాలు తీసేందుకు క్షురకులు ఒప్పుకోకపోవడంతో కేవలం మూడు కత్తెరలు మాత్రమే వేసేం దుకు అంగీకరిస్తున్నారు. ఆదివారం 3,500 మంది భక్తులు మూడు కత్తెర్లు ఇవ్వగా, సోమవారం 1,300 మంది భక్తులు మూడు కత్తెర్లు ఇచ్చారు. పరిస్థితి తీవ్రతరం సోమవారం మంత్రి వర్గంతో నాయీ బ్రాహ్మణుల సంఘ ప్రతినిధుల చర్చలు విఫలం కావడం, ఒకటి రెండు రోజుల్లో బార్బర్ షాపులను కూడా మూసి వేయాలని నిర్ణయించడంతో సమస్య ఇప్పుడు మరింత తీవ్రతరమవుతోంది. భక్తుల నమ్మకాలపై కూడుకున్న వ్యవహారం కావడంతో ప్రభుత్వం దీనిపై త్వరగా ఒక నిర్ణయానికి రావాలని పలువురు కోరుతున్నారు. ‘సెంటిమెంట్’ను వాడేసుకుంటున్నారు భక్తుల సెంటిమెంట్‌ను కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. అమ్మవారికి తలనీలాలను ఇచ్చేందుకు వచ్చే భక్తులను కొంత మంది సెలూన్ల యజమానులు, ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా దండుకుంటున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఇంద్రకీలాద్రికి విచ్చేసే భక్తులు అమ్మవారికి తలనీలాలను సమర్పిస్తుంటారు. అయితే ప్రస్తుతం కొండపై కేశఖండన శాలలో క్షురకుల సమ్మెలో ఉండటంతో భక్తులు తలనీలాలు సమర్పించడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే కనీసం మూడు కత్తెర్లతో తలనీలాలు ఇచ్చేందుకు ముందుకు వస్తుండగా, మరి కొంత మంది ఆలయానికి సమీపంలోని బార్బర్ షాపులలోనైనా తలనీలాలు ఇచ్చేయాలని నిర్ణయానికి వస్తున్నారు. దీంతో బ్రాహ్మణ వీధి, రథం సెంటర్లోని సెలూన్లకు డిమాండ్ పెరిగింది. ఇష్టానుసారంగా చార్జీలు దీనికి తోడు కొంత మంది ఆటో డ్రైవర్లు భక్తులను సెలూన్ల వద్దకు తీసుకువెళ్లి తలనీలాలు సమర్పించిన తర్వాత తిరిగి దుర్గాఘాట్ వరకు వదిలేందుకు ఒక్కొక్కరికి రూ. 70 నుంచి రూ. 100ల వరకు వసూలు చేస్తున్నారు. భక్తుల సెంటిమెంట్‌ను ఈ విధంగా ఆటో డ్రైవర్లు ఆదాయ మార్గంగా మాలుచుకుంటుండగా, బార్బర్ షాపుల యజమానులు ఒక్కొక్కరికి గుండు చేసేందుకు రూ. 50లు తక్కువ కాకుండా తీసుకోవడం కొసమెరుపు. వేల రూపాయలు చార్జీలు పెట్టుకుని యాత్రలు చేసుకుంటూ వస్తున్నామని తలనీలాలు ఇవ్వకుండా తిరి గి వెళ్లితే అశుభమని బావించి ఎంత ఖర్చు అయినా సరే భరించి తలనీలాలు ఇస్తున్నామని శ్రీకాకుళం జిల్లా నుంచి విచ్చేసిన బృందం పేర్కొంది. -
దుర్గగుడిలో చిన్నారి అదృశ్యం
సాక్షి, విజయవాడ: విజయవాడ దుర్గగుడిలో ఓ చిన్నారి అదృశ్యమైంది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో తమ ఐదేళ్ల కూతురు నవ్యశ్రీ తప్పిపోయిందని తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారి తప్పిపోయందని ఆలయ అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా.. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని నిర్లక్ష్య సమాధానం చెప్పారని వాపోయారు. వారి నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చిన్నారి ఆచూకీ కోసం నగర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఉన్నత అధికారులు తెలిపారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో గాలింపు చర్యలు కొనసాగొస్తున్నారు. గుర్తుతెలియని మహిళ.. నవ్యశ్రీను తీసుకెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డైయ్యాయి. వీటి ఆధారంగా చిన్నారి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఉదయం విజయవాడ దుర్గ గుడిలో అదృశ్యమయిన నవ్యశ్రీ సాయంకాలం నరసరావుపేటలో ప్రత్యక్షమైంది. చిన్నారిని రైలులో నరసరావుపేటకు తెచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు. చిన్నారిని అక్కడి నుంచి పోలీసులు గుంటూరు రూరల్ ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఓ అనుమానిత దంపతులను పోలీసులు విచారించగా.. పాపను పెంచుకోవడానికే తీసుకొచ్చామని తెలిపారు. -
విజయవాడ దుర్గా గుడిలో చిన్నారి అదృశ్యం
-
దుర్గమ్మ భక్తులపై భారం
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై టీడీపీ పాలకమండలి వచ్చిన తరువాత భక్తులకు సౌకర్యాలకు కల్పించడం కంటే భారాలు మోపేందుకే ఆసక్తి చూపుతుంది. గతంలో లడ్డూ, ప్రసాదాలు, కార్లు పార్కింగ్, కొన్ని పూజల ధరలు పెంచిన పాలకమండలి తాజాగా శాంతి కల్యాణం టికెట్ ధరలను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బుధవారం మాడపాటి గెస్ట్‌హౌస్‌లో చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, ఈవో ఎం.పద్మల ఆధ్వర్యంలో పాలకమండలి సమావేశం జరిగింది. అనంతరం చైర్మన్, ఈవో సమావేశ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈవో, చైర్మన్ మాట్లాడుతూ శాంతి కల్యాణం టికెట్ ధర రూ.500 నుంచి రూ.1000కు పెంచామని చెప్పారు. గతంలో శాంతి కల్యాణం చేయించుకున్న భక్తులకు రూ.100 టికెట్ లైన్లో దర్శనానికి అనుమించేవాళ్లమని ఇప్పు డు అంతరాలయ దర్శనానికి(రూ.300 టికెట్) అనుమతిస్తామన్నారు. రూ.13.70 కోట్లతో జీ+4 కాటేజ్‌లు గొల్లపూడిలో దేవస్థానానికి చెందిన స్థలంలో జీ+4 కాటేజ్‌లను రూ.13.70 కోట్లతో నిర్మించాలని నిర్ణయించారు. అయితేఈ నిధులు భక్తుల నుంచి సేకరిస్తారు. రూ.10 లక్షలు చెల్లించిన దాత పేరును ఒక గదికి, రూ.15 లక్షలు ఇచ్చిన దాత పేరు ఒక సూట్‌కు పెడతారు. దాతలకు ఏడాదికి 30 రోజులు ఈ రూమ్ లేదా కాటేజ్‌ను ఉచితంగా వాడుకోవచ్చని, మిగిలిన రోజుల్లో భక్తులకు అద్దెలకు ఇస్తామని చెప్పారు. భక్తులకు ఉచిత ప్రసాదాలు ఇంద్రకీలాద్రిపై ఉన్న ఉపాలయాలైన నటరాజస్వామి, సుబ్రహ్మణేశ్వరస్వామి వార్ల దేవాలయాలకు వచ్చే భక్తులకు కూడా ఇక నుంచి ఉచితంగా ప్రసాదాలు పంపిణీ చేయాలని పాలకమండలి నిర్ణయించింది. ఇప్పటికే అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఉచిత ప్రసాదం అందజేస్తున్నారు. ఇక నుంచి ఉపాలయాలు వద్ద కూడా ఉచిత ప్రసాదాల పంపిణీ జరుగుతుంది. ఇంద్రకీలాద్రిపై శ్రీ పాశుపతాస్త్రాలయం ఇంద్రకీలాద్రిపై పాశుపతాస్త్రాలయం పునః నిర్మించేందుకు ఎ.శివనాగిరెడి(స్థపతి) కన్సల్టెంట్‌గా నియమించేందుకు పాలకమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.58లక్షలతో గ్రీనరీ అంశం వాయిదా ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఇంద్రకీలాద్రిపై గ్రీనరీ అభివృద్ధికి రూ.58 అంచనాలతో తయారు చేసిన ప్రతిపాదనను వాయిదా వేశారు. గ్రీనరీని దేవస్థానం సిబ్బందే చేయాలని సూచించింది. క్షురకులకు మాస్క్‌లు దేవస్థానంలోని కేశఖండన శాలలో పనిచేసే క్షురకులు గ్లౌజ్‌లు, మాస్కులు ధరించాలనే ప్రతిపాదనకు పాలకమండలి ఆమోదముద్ర వేసింది. క్షురకులు అనారోగ్యంతో చనిపోయినప్పడు, అతడి భార్యకు లేదా వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి మాత్రమే కేశఖండన శాఖ వద్ద పనిచేయడానికి అనుమతి ఇచ్చే ప్రతిపాదనను తమ పరిధిలోకి రాదని పాలక మండలి సభ్యులు అభిప్రాయపడ్డారు. ఉపాలయాల్లో నగల అలంకరణ అమ్మవారికి భక్తులు సమర్పించే బం గారాన్ని భద్రపరిచి అమ్మవారికి ఏడువారాల నగలు, ఉపాలయాల్లోని దేవతామూర్తులకు వెండి, బంగారు ఆభరణాలు తయారు చేయించాలని నిర్ణయించారు. వెండి విక్రయించగా వచ్చిన సొమ్ము బంగారం, బాండ్లుగా మార్చాలని నిర్ణయించారు. 140 ఎకరాలభూములు వేలం శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, దాని దత్తత దేవాలయాలకు సుమారు 140 ఎకరాల భూములు ఉన్నాయి. వీటి లీజు పరిమితి ముగియడంతో తిరిగి వేలం నిర్వహించి మూడేళ్ల కాలపరిమితికి లీజుకు ఇచ్చేందుకు దేవస్థానం అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 21 నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకు ఒకొక్క రోజు ఒక్కో దేవాలయానికి చెందిన భూముల లీజు హక్కు కోసం వేలం నిర్వహించాలని నిర్ణయించారు. వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చని ఈవో ఎం.పద్మ తెలిపారు. దేవస్థానం ఆస్తులను జాగ్రత్తగా కాపాడి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. నగరం సమీపంలో దేవస్థానానికి చెందిన ఏడు ఎకరాల భూమిలో చైతన్య విద్యాసంస్థల మురుగు వదులుతున్న విషయాన్ని పరిశీలించి ఆ సంస్థకు నోటీసులు ఇచ్చామని, ఒకటి రెండు రోజుల్లో మురుగు రాకుండా పకడ్బందీగా ఏర్పాటుచేసి ఆ భూమిని కాపాడతామని చెప్పారు. ప్రస్తుతం ఆ భూమికి వేలం నిర్వహించడం లేదని ఈవో తెలిపారు. -
దేవుడి వెండి స్వాహా!
సాక్షి, అమరావతి : బంగారం కొట్టులో కిలో వెండి (కడ్డీ రూపంలోని వెండి) ధర ప్రస్తుతం రూ.43 వేల దాకా పలుకుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ కిలో వెండి ధర రూ.40,642 నుంచి రూ. 43,042ల మధ్యలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కిలో వెండిని సగటు ధర రూ.33 వేల చొప్పున విక్రయించింది. అంటే కిలోకు రూ.10 వేల నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన 16,559 కిలోల వెండిని ప్రభుత్వం అమ్మేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కలిసి రూ.16కోట్లు కమీషన్ల రూపంలో కొట్టేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ధర ఇంత తక్కువా? దేవదాయ శాఖ పరిధిలోని ప్రధాన ఆలయాల్లో భక్తులు సమర్పించిన వెండి ఆభరణాల నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ఆ వెండిని అమ్మి, వచ్చిన సొమ్ముతో బంగారం కొనుగోలు చేయాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు గతేడాది జులైలో నిర్ణయించారు. దేవుడి అలంకరణకు ఉపయోగించని వెండి ఆభరణాలను కరిగించి, కడ్డీల రూపంలోకి మార్చాలని ఆయా ఆలయాల ఈవోలను ఆదేశించారు. వెండి ఆభరణాలను కడ్డీల రూపంలోకి మార్చిన తర్వాత.. శ్రీకాళహస్తి ఆలయానికి చెందిన 14,936.040 కిలోలను ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో రూ.49.38 కోట్లకు విక్రయించారు. కిలోకు సరాసరి ధర రూ.33,063 చొప్పున శ్రీకాళహస్తి ఆలయానికి అందింది. విజయవాడ దుర్గ గుడికి చెందిన 1,123.696 కిలోల వెండి కడ్డీలను రూ.3,68,88,506 కు ఇటీవల అమ్మారు. కిలోకు సరాసరి ధర రూ.32,827 చొప్పున ఆలయానికి దక్కింది. శ్రీశైలం ఆలయానికి చెందిన 500 కేజీల వెండిని కూడా తక్కువ ధరకే అమ్మేశారు. అర గంటలో వేలం ముగింపు ఆలయాల్లో ఏ పనికైనా ఈ–టెండర్ విధానాన్ని అమలు చేసే దేవాదాయ శాఖ భారీ మొత్తంలో వెండి అమ్మకానికి మాత్రం కేవలం అరగంటలో వేలం ప్రక్రియ ముగిసే విధానాన్ని ఎంపిక చేసుకుంది. బంగారం, వెండి వంటి వస్తువుల అమ్మకం, కొనుగోలుకు మధ్యవర్తిత్వం వహించే కేంద్ర ప్రభుత్వరంగ బ్రోకరేజీ సంస్థ ఎంఎంటీసీ ద్వారానే వెండి అమ్మకం జరపాలని ప్రభుత్వం దేవాదాయ శాఖను ఆదేశించింది. ఎంఎంటీసీ ద్వారా జరిగే వేలం ప్రక్రియ అరగంట వ్యవధిలోనే ముగుస్తోంది. ఆ సమయంలో అన్లైన్లో అమ్మకానికి పెట్టిన వెండిని ఎవరు ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ముందుకొస్తారో వారికే బిడ్ ఖరారు చేస్తారు. ముందే సమాచారం లీక్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ ద్వారా వేలం ప్రక్రియ కొనసాగినప్పటికీ.. కేవలం ఆరగంట పాటు కొనసాగే వేలాన్ని ఏ రోజు, ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై రెండు రోజుల ముందే ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇచ్చేలా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో తమకు బాగా కావాల్సిన వ్యక్తులతో దేవుడి వెండిని కొనిపించి, కమీషన్లు కొట్టేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వీఐపీ దర్శనం చేయిస్తా..!
ఇంద్రకీలాద్రి (విజయవాడ వెస్ట్) : అందరికీ గ్రూప్‌గా వీఐపీ దర్శనం చేయిస్తా... అంతరాలయంలోకి పంపుతాను... మామూలుగా అయితే టికెటు రూ.300... మీరు ఐదుగురికి రూ.వెయ్యి ఇవ్వండి చాలు.. అమ్మవారిని దగ్గర నుంచి కూడా చూడవచ్చు... అంటూ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి బురిడీ కొట్టిస్తున్న ముఠా ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో తిరుగుతోంది. ఈ ముఠాలో ఒకరు కాదు ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఘాట్ రోడ్డులోని పూజా సామాగ్రి విక్రయించే దుకాణాలలో పని చేసిన కొంత మంది వ్యక్తులు ఈ విధంగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు. ఇదే తరహాలో గురువారం ఓ భక్తుల బృందాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన కొంత మంది భక్తులను పూర్ణా అనే వ్యక్తి కలిశాడు. అందరికీ వీఐపీ దర్శనం చేయిస్తానని డీల్ మాట్లాడుకున్న తర్వాత వారిని అంతరాలయంలో దర్శనానికి పంపుతానని చెప్పి వారిని క్యూ లైన్లోకి పంపాడు. అయితే వారు అంతరాలయంలోకి కాకుండా ముఖ మండప దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి పూర్ణా కనిపించలేదు. దీంతో ఆగ్రహించిన భక్తులు ఆలయ ప్రాంగణంలో వెతికారు. కొద్దిసేపు తర్వాత పూర్ణా కనిపించడంతో వారు నిలదీశారు. దీంతో వారి మధ్య వాదోపవాదనలు జరగడంతో పోలీసులు పూర్ణాను అదుపులోకి తీసుకున్నారు. ఆలయ సిబ్బంది పాత్రపై ఆరా... ముఠాకు సహకరిస్తున్న ఆలయ సిబ్బందిపైనా ఈవో ఆరా తీస్తున్నట్లు సమాచారం. నకిలీ టికెట్లు, టికెట్ల రీసైకిలింగ్‌పై దృష్టి పెట్టడంతో కొందరు సిబ్బంది రూటు మార్చి ఈ ముఠాతో చేతులు కలిపారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిబ్బంది సహకారం లేకుండా ఇటువంటి దర్శనాలు సాధ్యం కాదనేది ఆలయ ఉన్నతాధికారుల మాట. -
దుర్గగుడి పాలకమండలి సమావేశం
సాక్షి, విజయవాడ: విజయవాడలో దుర్గగుడి పాలక మండలి సమావేశం బుధవారం జరిగింది. ఈవో పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. దుర్గగుడికి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. అదే విధంగా ఈ సమావేశంలో ప్రసాదం టెండర్లకు పాలకమండలి ఆమోదం తెలిపింది. పాడైపోయిన పాత బస్సులను వేలం వేయాలని సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఏపీ ప్రత్యేక హోదా కోసం మే 3 నుంచి 7 వరకు అతిరుద్రమహా చండీయాగం నిర్వహించనున్నట్టు ఈవో పద్మ తెలిపారు. -
పవన్‌కు ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సవాల్
సాక్షి, అమరావతి: విజయవాడ దుర్గగుడి పార్కింగ్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేస్తున్నారన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పందించారు. ఆయన గురువారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. దుర్గగుడి పార్కింగ్ వద్ద తాను డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు చేశారని.. వాటిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు. బీజేపీ దగ్గర ప్యాకేజీ తీసుకుని పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా వైఖరి మార్చుకున్నారని ఆరోపించారు. మంత్రి లోకేష్ అవినీతిపై ఆధారాలున్నాయా అని ఆయన ప్రశ్నించారు. ఒకసారి రాజధాని ప్రాంతాన్ని చూస్తే అభివృద్ధి ఏం జరుగుతుందో కనిపిస్తుందన్నారు. పవన్ కల్యాణ్ సభ పెడుతున్నారంటే.. ప్రత్యేక హోదాపై గట్టి పోరాటం చేస్తారని ప్రజలంతా భావించారని, కానీ ఆయనేమో అసలు విషయం గాలికి వదిలేశారని తెలిపారు. ప్రధాని మోదీని ఒక్కమాట అనని పవన్.. జనసేన వల్లే టీడీపీ గెలిచినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జనసేన, బీజేపీ పార్టీలు లేనప్పుడే మెరుగైన ఫలితాలు సాధించామని, ఆ పార్టీలతో కలిసిన తర్వాతే తమ ఓటు బ్యాంక్ తగ్గిందని జలీల్ ఖాన్ వెల్లడించారు. -
దుర్గమ్మను దర్శించుకున్న శేఖర్ మాస్టర్
చిట్టినగర్(విజయవాడపశ్చిమం): ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ బుధవారం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన శేఖర్ మాస్టర్‌ను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా, ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు. శేఖర్ మాట్లాడుతూ నేను విజయవాడలో పుట్టి పెరిగిన వాడినేనని అన్నారు. నగరానికి వచ్చినప్పుడల్లా అమ్మవారిని దర్శించుకుంటానన్నారు. కార్యక్రమంలో శేఖర్ మాస్టర్‌తోపాటు టీడీపీ మైనార్టీ సెల్ ప్రధానకార్యదర్శి షేక్.హుస్సేన్ బాషా(బాషీ)తోపాటు ఉల్లి ప్రసాద్, ఉల్లి సుధాకర్, పలువురు డ్యాన్స్ విద్యార్థులు పాల్గొన్నారు. -
సమస్యలు.. సవాళ్లు!
సాక్షి, విజయవాడ : దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా ఐఏఎస్ అధికారి ఎం.పద్మ సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమెకు అనేక సమస్యలు, సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. గత ఈఓలు నిష్క్రమించిన తీరును చూస్తే ఆలయ ఈఓ పదవి ముళ్ల కిరీటం వంటిదని అర్థమవుతుంది. ఆలయంలోని సమస్యలనే కాదు, రాజకీయ ఒత్తిళ్లనూ ఎదుర్కోక తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రి లోకేష్ కోసం గత ఈఓ సూర్యకుమారి తాంత్రిక పూజలు నిర్వహించారన్న ఆరోపణలు రావడంతో బదిలీకాక తప్పలేదు. దేవస్థానంలో దీర్ఘకాలంగా తిష్టవేసిన అధికారులు, ఉద్యోగులు, పాలకమండలి నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవినీతి సర్వాంతర్యామి! దుర్గగుడిలో అవినీతి సర్వాంతర్యామిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. అన్నదానం, ప్రసాదాలు తయారీ, అకౌంట్స్, స్టోర్స్, టికెట్ విక్రయాలు, ఇంజినీరింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ అవినీతిని విజిలెన్స్ అధికారులు గత ఏడాది ఎండగట్టారు. అటెండర్లు టికెట్లను రీసైక్లింగ్ చేస్తుండగా భక్తులు పట్టుకుని అధికారులకు అప్పగించారు. అన్నదానంలో భోజనం చేసిన భక్తుల కంటే ఎక్కువ మందిని లెక్క చూపించడం, అకౌంట్ విభాగంలో అడ్వాన్సులు తీసుకోవడం, ప్రసాదాల తయారీ దిట్టంలో హస్తలాఘవం, అడ్డగోలు నిర్మాణాలు చేపట్టడం, వాటిని కూల్చివేయడం వంటివి సర్వ సాధారణమయ్యాయి. దేవస్థానంలో దీర్ఘకాలంగా తిష్టవేసిన అధికారులకు ఎన్నిరకాలుగా అవినీతి చేయాలో తెలుసన్న విమర్శలు ఉన్నాయి. కొత్త ఈఓ దేవస్థానంలో తిష్టవేసిన అవినీతిపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. తరిగిపోతున్న అమ్మవారి మూలధనం దేవస్థానంలో అభివృద్ధి పేరుతో అనేక భవనాలను కూల్చివేశారు. కొత్తకొత్త నిర్మాణాలు చేపట్టారు. ఇటీవల అన్నదానం కోసం తాత్కాలిక భవనం నిర్మించారు. అర్జున వీధిలో అందం కోసం పర్గోలా నిర్మిస్తున్నారు. ఘాట్‌రోడ్డుకు తరుచూ మరమ్మతులు చేస్తున్నారు. భవానీమండపం, అన్నదానం భవనం కూల్చిన చోట నూతన నిర్మాణాలు చేయాల్సి ఉంది. అభివృద్ధి పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు ఆలయ మూల నిధులు తరిగి పోతున్నాయి. రూ.125 కోట్ల మూలధనం రూ.60 కోట్లకు తగ్గిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న పనులకు ఉన్న మూలధనం చాలదు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సాయంగా అందనందునే ఈ పరిస్థితి నెలకొంది. కొత్త ఈఓ మూలధనం పెంచాల్సిన అవసరం ఉంది. రాజకీయ నేతల ఒత్తిళ్లు దుర్గగుడిలో అర్చకుల నుంచి సిబ్బంది వరకు జిల్లాలో ఎవరో ఒక నాయకుడితో సంబంధాలు ఉన్నాయి. గుడిలో చీమ చిటుక్కుమన్నా, జిల్లాకు చెందిన ఒక మంత్రికి, ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి చేరిపోతాయి. వెంటనే వారి నుంచి ఈఓకు ఆదేశాలు అందుతాయి. లడ్డూ ప్రసాదాల రేట్లు పెంచుతూ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను ఓ మంత్రి ఆదేశాల మేరకు తగ్గించారు. అధికార పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తరుచుగా ఈఓలకు ఏదోఒక సిఫార్సు చేస్తూనే ఉంటారని సమాచారం. కొత్తగా వచ్చే ఈఓ వీటన్నింటినీ తట్టుకుని ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. పాలకమండలిలో కొందరు సభ్యులు అత్యుత్సాహంతో అధికారులకు ఆదేశాలు ఇస్తూ, పాటించకుంటే ఆగ్రహం వ్యక్తంచేస్తుంటారు. భక్తులకు సౌకర్యాలు నిల్ రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఆలయమైనప్పటికీ భక్తులకు కనీస సౌకర్యాలు లేవు. ఒకటి రెండు రోజులు అమ్మవారి సన్నిధిలో ఉండేందుకు కాటేజీలు అసలే లేవు. ఘాట్ రోడ్డును తరుచు మూసివేస్తూ ఉం టారు. లిప్టులు ఉన్నా.. సామాన్య భక్తులకు అందుబాటులో ఉండవు. దీంతో ఏడంతస్తులూ ఎక్కి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందే. అన్నదానం కోసం గంటలుతరబడి వేచి ఉండాలి. వారాంతంలోనూ, పర్వదినాల్లో ప్రసాదాలు అం తంత మాత్రంగానే లభిస్తాయి. దసరా ఉత్సవాలు, భవానీదీక్షలప్పుడు కనీసం నాలుగు కిలో మీటర్ల దూరం నడిస్తే కానీ అమ్మవారి దర్శన భాగ్యం కలగదు. భక్తులకు వాహనాల పార్కింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ సమస్యలను పరిష్కరిస్తే దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగి మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. -
దుర్గగుడిలో మళ్లీ ప్లేట్ కలెక్షన్లు
సాక్షి, విజయవాడ : దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో తిరిగి ప్లేట్ కలెక్షన్లు మొదలయ్యాయి. సూర్యకుమారి కార్యనిర్వహణాధికారిగా ఉండగా అర్చకులు ప్లేట్లు ఉంచి భక్తుల నుంచి కానుకలు తీసుకోవడాన్ని నియంత్రించారు. అర్చకుడు శఠగోపం పెట్టిన తరువాత భక్తులు హుండీలోనే కానుకలు ఇవ్వాలని స్పష్టంచేశారు. ఎవరైనా అర్చకులు పేట్లు పెట్టి దక్షిణలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ప్లేట్ కలెక్షన్లకు అర్చకులు స్వస్తి పలికారు. అయితే క్షుద్రపూజల నేపథ్యంలో ఈఓ సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీచేసింది. దీంతో ఆలయంలో మళ్లీ ప్లేట్ కలెక్షన్లు ప్రారంభమయ్యాయి. ఆలయ ఆదాయానికి గండి సాధారణంగా దుర్గగుడికి నెలకు రూ.2 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అర్చకులకు పేట్లలో దక్షిణ రూ పంలో రూ.75 లక్షల వరకు వస్తుందని అంచనా. ఈ ఓ సూర్యకుమారి పేట్ కలెక్షన్ నిలుపుదల చేసిన తరువాత ఆ స్థాయిలో కాకున్నా ఆలయ ఆదాయం కొంతమేరకు పెరిగింది. ప్రస్తుతం అర్చకులు తిరిగి ప్లేట్ కలెక్షన్లు ప్రారంభించడంతో తిరిగి దేవస్థానం ఆదాయం తగ్గే అవకాశం ఉందని భక్తులు అంటున్నారు. ప్లేట్ కలెక్షన్లో అందరికీ వాటాలు అర్చకుల వద్ద ఉండే ప్లేట్లలో భక్తులు వేసే దక్షిణ కేవలం అర్చకులకు మాత్రమే తీసుకుంటారనుకుంటే పొరపాటే. ఆ విధంగా తీసుకుంటే అర్చకులు ఆలయ అధికారులు ఆగ్రహానికి గురికాక తప్పదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్లేట్ కలెక్షన్ ద్వారా వచ్చే ఆదాయంలో ఆలయ అధికారుల నుంచి సెక్యురిటీ సిబ్బంది వరకు వాటాలు పంచుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. అర్చకులకు రూ.లక్ష వస్తే అందులో వాటాల కింద సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేలు చెల్లిస్తారని సమాచారం. దేవస్థానంలో పరిధిలోని కీలక ఆలయాల్లో పోస్టింగ్‌లు పొందడానికి అర్చకులు అధికారులకు, సిబ్బందికి మామూళ్లు ముట్టచెబుతారన్న ఆరోపణలు ఉన్నాయి. తమకు మామూళ్లు దక్కుతున్నందునే అధికారులు కూడా ప్లేట్ కలెక్షన్‌ను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్లేట్లలో భక్తులు సమర్పించే కానుకలను అర్చకులు ఎప్పటికప్పుడు తీసేసి ఎవరికీ అనుమానం రాకుండా చూస్తారని సమాచారం. చూసీ చూడకుండా ఉండేందుకే.. దేవస్థానంలో పనిచేసే కొంతమంది సీనియర్ అర్చకులు విధులకు హాజరుకాకుండా తమ అసిస్టెంట్లను పంపుతారు. డ్యూటీలో ఎవరూ ఉన్నారనే ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉండేందుకు మామూళ్లు ముట్టచెబుతారు. బయటి అర్చకులు దేవస్థానంలోకి రావడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలోనే తాంత్రిక పూజలు జరిగాయని చెబుతున్న రోజు కూడా బయట వ్యక్తులు అంతరాయలయంలోకి వచ్చినా ఎస్పీఎఫ్ సిబ్బంది, డ్యూటీలో ఉన్న సిబ్బంది పట్టించుకోలేదు. అదే చివరకు వివాదానికి దారితీసింది. కొత్త కార్యనిర్వహణాధికారిగా ఐఏఎస్ అధికారి ఎం.పద్మ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె కూడా గత ఈఓ తరహాలో ప్లేట్ కలెక్షన్ నిలుపుదల చేసి, ఆలయ ఆదాయాన్ని పెంచాలని భక్తులు కోరుతున్నారు. -
వచ్చేదెవరు..?
దుర్గగుడి కొత్త కార్యనిర్వహణాధికారిగా ఎవరు వస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. దుర్గమ్మ ఆలయంలో జరిగిన తాంత్రిక పూజల వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఈఓగా నియమితులైన తొలి మహిళా ఐఏఎస్ అధికారి సూర్యకుమారి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో మళ్లీ ఐఏఎస్‌ను నియమిస్తారా లేక దేవాదాయశాఖకు చెందిన రీజినల్ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమిస్తారా? అన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. సాక్షి, విజయవాడ: దుర్గగుడి కార్యనిర్వహణాధికారి(ఈఓ) గా ఎవరు వస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. మళ్లీ ఐఏఎస్ అధికారినే నియమిస్తారా? లేక దేవాదాయశాఖకు చెందిన రీజినల్ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమిస్తారా? అన్న అంశంపై ఇంద్రకీలాద్రిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగడం, అది వివాదాస్పదం కావడంతో కొన్ని రోజుల క్రితం వరకూ ఈఓగా బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్ అధికారి ఎ.సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతానికి దేవాదాయశాఖ కమిషనర్ వై.వి.అనూరాధ ఆలయ ఇన్చార్జి ఈఓగా బాధ్యతలు చూస్తున్నారు. మరో పక్షం రోజుల్లో ప్రభుత్వం కొత్త ఈఓను నియమించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంతో తమకు అనుకూలంగా ఉండే అధికారినే ఈఓగా తీసుకొచ్చేందుకు ఇద్దరు కీలకమంత్రుల చుట్టూ దేవస్థానానికి చెందిన కొంతమంది అర్చకులు, అధికారులు ప్రదక్షిణ చేస్తున్నారు. ఐఏఎస్ వచ్చేనా? దేవస్థానం ఈఓగా తిరిగి ఐఏఎస్ అధికారిని నియమిస్తారా? లేక దేవాదాయశాఖకు చెందిన రీజినల్జాయింట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమిస్తారా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. కొన్నేళ్ల నుంచి ఈఓగా పనిచేసేవారు వివాదాస్పదం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈఓగా రావడానికి ఐఏఎస్‌లు సుముఖంగా లేరని తెలిసింది. ముమ్మరంగా ప్రయత్నాలు దుర్గగుడిలో దీర్ఘకాలంగా పనిచేసిన ఏఈఓ, సూపరింటెండెంట్లు, గుమస్తాలను కలిపి మొత్తం 23 మందిని ఇటీవల ఇతర ఆలయాలకు బదిలీ చేశారు. అయితే అంగబలం, అర్థబలం ఉపయోగించి వారిలో కొందరు తిరిగి ఇక్కడకు చేరుకున్నారు. వారిలో అన్నదానం, ప్రసాదాలు తయారీ, స్టోర్స్ వంటి కీలకవిభా గాల్లో పనిచేసిన అధికారులు ఉన్నారు. వారే తిరిగి తమకు అనుకూలంగా ఉండే అధికారిని ఈఓగా తీసుకొచ్చేందుకు ముమ్మరంగా లాబీ నడుపుతున్నారని సమాచారం. దేవస్థానానికి చెందిన కొంతమంది అర్చకులు వారికి సహాయం చేస్తున్నారని తెలిసింది. త్రినాథరావు కాకపోతే సింహాచలం ఈఓగా ఉన్న రామచంద్రమోహన్‌ను అయినా దుర్గగుడి ఈఓగా నియమించాలనే వారు కోరుతున్నారని సమాచారం. పాలకమండలి దూరం..దూరం ఆలయంలో ఈఓగా పనిచేసిన తొలి మహిళా ఐఏఎస్ అధికారి సూర్యకుమారి దుర్గమ్మకు తాంత్రిక పూజలు చేయించారంటూ వ్యాఖ్యలు చేసి, చివరకు ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురైన పాలకమండలి సభ్యులు మాత్రం ఈఓ విషయంలో ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఈఓ గురించి మాట్లాడితే మరోసారి వివాదం అవుతుందని భావించే వారు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ ఆలోచనలను మంత్రుల వద్దనే పంచుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. కోటేశ్వరమ్మ లేదా త్రినాథరావు ముంబాయికి చెందిన ఐఆర్ఎస్ అధికారి కోటేశ్వరమ్మ ఈఓగా వస్తారంటూ తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆమె అక్కడ రిలీవ్ కాలేదు. దీంతో ఆమె ఈఓగా రావడం సందిగ్ధంగా మారింది. ఈలోగా దేవస్థానంలో ఒకవర్గం తమకు అనుకూలంగా ఉండే అధికారిని ఈఓగా తీసుకొ చ్చేందుకు లాబీ నడుపుతోంది. ఐఏఎస్‌కు బదులు దేవాదాయశాఖకు చెందిన అధికారిని నియమిస్తేనే పరిస్థితుల్ని చక్కదిద్దుతారని ఆ వర్గం ప్రచారం చేస్తోంది. ద్వారకా తిరుమల ఆలయ ఈఓ వి.త్రినాథరావును తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన 2013 డిసెంబర్ నుంచి 2014 నవంబర్ వరకు దుర్గగుడి ఇన్చార్జి ఈఓగా ఏ విధమైన వివాదాలు లేకుండా పనిచేశారు. ద్వారకా తిరుమల ఆలయంలో ఐదేళ్ల నుంచి ఈఓ పనిచేస్తున్నారు. దీంతో ఆయన త్వరలో బదిలీ అవుతారని సమాచారం. ఈ నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉండే ఈఓను నియమించాలంటూ దుర్గగుడికి చెందిన కొందరు అధికారులు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన ఇద్దరు మంత్రుల వద్దకు వెళ్లినట్లు సమాచారం. -
అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు
సాక్షి, ఇంద్రకీలాద్రి: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు దుర్గ గుడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భోగి మంటలు, ఆశీర్వచన మండపంలో బొమ్మల కొలువు, హరిదాసుల పాటలు, గంగిరెద్దుల సందడి ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. గత ఏడాది తొలిసారిగా అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును తిలకించేందుకు అశేష సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఈ ఏడాది కూడా అదే తరహాలో ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
వివాదాల్లో ఈవో.. కారణాలు ఏవేవో!
సాక్షి, విజయవాడ: దశాబ్దకాలంలో టి.చంద్రకుమార్, ఈ.గోపాలకృష్ణారెడ్డి, ఎన్.విజయకుమార్, ఎం.రఘునాథ్, కె.ప్రభాకరశ్రీనివాస్, సీహెచ్ నర్సింగరావు దుర్గగుడికి పూర్తికాలం ఈవోలుగా పనిచేశారు. ఇందులో ప్రభాకర శ్రీనివాస్, నర్సింగరావు స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్లు కాగా, మిగిలిన వారు దేవాదాయశాఖలో రీజనల్ జాయింట్ కమిషనర్ కేడర్‌వారు. అయితే, వీరిలో ఏ ఒక్కరూ గట్టిగా రెండేళ్లు కూడా పనిచేసిన దాఖలాలు లేవు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోపణపై అర్థంతరంగా బదిలీ అయినవారే. సీహెచ్ నర్సింగరావు ఒక అర్చకుడిని మనోవ్యధకు గురిచేయడంతో అతను ఆస్పత్రి పాలయ్యాడు. అర్చకులంతా «నిరసన తెలియజేయడంతో నర్సింగరావును బదిలీ చేశారు. ఒక మహిళా ఉద్యోగినిపై తన పీఏ సహాయంతో లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణతో ప్రభాకర శ్రీనివాస్‌ను మార్చారు. ఈవో పీఏ ఒక మహిళా ఉద్యోగిని లైగింకంగా వేధిస్తూ ఎస్ఎంఎస్ పెట్టడం వివాదాస్పదమైంది. దేవస్థాన హుండీల్లో ఉండాల్సిన డబ్బు ఈవో కార్యాలయంలో ప్రత్యక్షమవ్వడంతో అమ్మవారి సొమ్ము దారి మళ్లుతోందంటూ రఘునాథ్‌ను ఆ సీటు నుంచి తప్పించారు. టెండర్లలో అవినీతి జరిగిందని, నిధులు దుర్వినియోగం చేశారని విజయకుమార్‌ను, ఇంద్రకీలాద్రిపై ఉన్న ఇళ్లను తొలగించేందుకు అమ్మవారి సొమ్మును చెల్లించే విషయంలో అవకతవకలు జరిగాయని చంద్రకుమార్‌ను బదిలీ చేశారు. ఇక రెండుసార్లు ఇన్చార్జిగా పనిచేసిన చంద్రశేఖర్ ఆజాద్ ఒకసారి పాలకమండలితో విభేదించి, రెండోసారి పుష్కరాలకు పూర్తిస్థాయి ఈవోను వేయాలని మార్చారు. తాత్కాలిక ఈవోగా పనిచేసిన ఆర్.కృష్ణమోహన్ హయాంలో తొక్కిసలాట జరగడంతో ఆయననూ మార్చారు. తొలి మహిళా అధికారికీ తప్పని అవమానం దుర్గగుడికి తొలి మహిళా ఐఏఎస్ అధికారి సూర్యకుమారికి అవమానం తప్పలేదు. టీటీడీ తరహాలో స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఇచ్చి ఆమెను దుర్గగుడి ఈవోగా వేశారు. ఆమెపై ఆరోపణలు రావడంతో చివరకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం రద్దు చేశారు. దేవస్థానంలో తాంత్రిక పూజలు చేయించిన విషయం పొక్కడంతో ఈవో పదవి నుంచి తప్పించారు. ఈవోగా రెండేళ్లూ పనిచేయని సూర్యకుమారి తన పదవీ కాలమంతా వివాదస్పదంగానే గడిపారు. ఆదాయం పెంచడం కోసం టికెట్ రేట్లు పెంచడం, అమ్మవారి మూలధనాన్ని దుబారా చేయడం.. ఇలా అనేక విమర్శలు మూటగట్టుకున్నారు. కనీసం మూడేళ్లు ఉంటేనే అభివృద్ధి ఈవోలు కనీసం రెండేళ్లయిన పనిచేయకుండా మార్చివేయడంతో దేవాలయం అభివృద్ధి కుంటుపడుతోంది. దసరా, భవానీ దీక్షల విరమణ చేస్తే వారికి కొంత అవగాహన వస్తుంది. ఇలా అవగాహన పెంచుకుని పట్టు బిగించేలోపే ఈవోను బదిలీ చేసేస్తున్నారు. దీంతో అభివృద్ధి కుంటుపడుతోంది. అర్చకులతోపాటు అనేక మంది సిబ్బంది దీర్ఘకాలం దేవస్థానంలోనే ఉండటంతో వచ్చిన ఈవోలను తప్పుదోవ పట్టిస్తున్నారు. చివరకు ఈవోలు అప్రదిష్టను మూటగట్టుకుని వెళ్తున్నారు. -
దుర్గ గుడి ఈవోగా అనురాధ
-
తాంత్రిక పూజలు: ఈవోపై వేటు..
-
తాంత్రిక పూజలు: ఈవోపై వేటు.. సీఎం స్పందన!
సాక్షి, విజయవాడ: దుర్గ గుడిలో తాంత్రిక పూజల వ్యవహారంపై సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. అనధికార వ్యక్తులు గుడిలో ప్రవేశించినట్టు నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. పర్యవేక్షణ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్వవహరించారని, ఈ ఘటనపై లోతుగా విచారణ జరుగుతోందని చెప్పారు. జరిగిన తప్పిదానికి ఈవో బదిలీ చేశామన్నారు. విచారణ పూర్తయిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు. ఈవోపై వేటు! మరోవైపు దుర్గగుడి తాంత్రిక పూజల వివాదంలో ఆలయ ఈవో సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేశారు. దుర్గమ్మ గుడిలో అపచారం జరిగినమాట నిజమేనని ..ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని పోలీసులు తెలిపారు. తాంత్రిక పూజల వ్యవహారంలో నిజనిర్ధారణ కమిటీతో పాటు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన వెనక ఉన్నది ఈవో సూర్యకుమారి అంటూ...ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో వెంటనే సూర్యకుమారిని బదిలీ చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఇన్చార్జ్ ఈవోగా దేవాదాయ శాఖ కమిషనర్‌గా అనురాధకు బాధ్యతలు అప్పగించారు. పెద్దలు ఎవరో తేలాల్సి ఉంది! విజయవాడ దుర్గగుడిలో తాంత్రికపూజలు జరిగాయని రుజువైంది కాబట్టి...ఈ పూజలు చేయించిన పెద్దలు ఎవరో తేలాల్సి ఉందని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానదేంద్రస్వామి అన్నారు. అనంతపురంలోని రాంనగర్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో ఆయన పాల్గొన్నారు. అసలైన దోషులను వదిలి అర్చకులను వేధించటం సరికాదని... ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాంత్రిక పూజలు జరిగాయో బయటపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తాంత్రికపూజలపై దిద్దబాటు జరక్కపోతే రాష్ట్రానికే అరిష్టమని స్వరూపానదేంద్రస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. -
మంత్రి మాణిక్యాలను బర్తరఫ్ చేయాలి
సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహారంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావును బర్తరఫ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాంత్రిక పూజలు ఎవరికోసం చేశారో చెప్పాలని కోరారు. తాంత్రిక పూజల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని ప్రధాని నరేంద్ర మోదీ కంట్రోల్ చేస్తున్నారని, మోదీ నియంత పోకడలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయని, మోదీకి అనుకూలంగా లేకపోతే సీబీఐతో దాడులు చేయించటం పరిపాటిగా మారిందన్నారు. -
మన కమిటీ.. మన నివేదిక!
సాక్షి, అమరావతి: వడ్డించే వాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది లేదు అనే సామెత అక్షరాలా సరిపోతుంది దుర్గగుడి వ్యవహారంలో. వివాదం ఏదైనా కమిటీ వేసేది మనమే.. వచ్చే నివేదిక మనకు అనుకూలంగానే అన్న చందంగా తయారయ్యింది ప్రస్తుత పరిస్థితి. నిజనిర్థరణ కమిటీని వేసి విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు చేయాల్సిన పనులన్నీ చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇందుకోసం ముందుగానే తాంత్రిక పూజలు జరగలేదని నిజనిర్థారణ కమిటీతో చెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, కీలక నిందితుడు పార్థసారథితో పాటు అర్చకులు, దేవస్థానం ఇద్దరు ప్రధాన అర్చకులు, స్థానాచార్య, ఇతర అర్చకులను పిలిచి విచారణ చేశారు. ఈ విచారణలో కొంత మంది తాంత్రిక పూజలు జరిగాయని నిర్థారించి చెప్పగా, మరికొంత మంది అర్చకులు కూడా తాంత్రిక పూజలు జరిగిన మాట వాస్తవేమని అభిప్రాయ పడ్డారు. అయితే ఆలయ అధికారులు, అర్చకులు విచారణలో చెప్పిన మాటలను కమిటీ పరిగణలోకి తీసుకోకుండా నివేదిక సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం, తెలుగుదేశం నాయకుల ఒత్తిడికి లోబడి నివేదిక రూపుదిద్దకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు, నివేదికను ఎలా రూపొందించాలి అనే విషయంపై నిజనిర్థారణ కమిటీతో పలుపార్లు చర్చలు జరిపారు. ప్రభుత్వం చేతికి మట్టి అంటకుండా తాంత్రిక పూజలు జరగలేదనే విధంగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. దేవస్థానంలోని విషయాలు బయటకు పొక్కడం వల్ల ఎవరూ నోరు ఎత్తవద్దంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. నిజ నిర్ధారణ కమిటీ తీరుపై హిందూ ధర్మకర్తలు, పీఠాధిపతులు, స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజాలను వెల్లడించాల్సిన కమిటీ ప్రభుత్వం ఒత్తుడులకు లోబడి పనిచేసిందని విమర్శించారు. దుర్గాదేవి, మహిషాసురమర్దిని అవతారాలు ఒక్కటేనని మీరు ఎలా నిర్ణయిస్తారంటూ కమిటీ సభ్యులపై స్వామీజీలు మండిపడ్డారు. -
అంతా తూచ్!
‘డిసెంబర్ 26వ తేదీ దుర్గగుడిలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదు. ఆలయ ప్రధాన అర్చకుడు బదిరీనాథ్‌బాబు అలాంటి వారు కాదు. ఇతర అర్చకుల సహాయం తీసుకున్నారు. అంతే..’ అంటూ దుర్గగుడి ఉద్యోగుల సంఘం నిజనిర్ధారణ కమిటీ ముందు వాపోయింది. శుక్రవారం ఉదయం నుంచి 11 గంటల పాటు సాగిన విచారణలో దేవాలయ ప్రతిష్ట దెబ్బతింటోందని వారంతా ఆవేదన చెందారు. అనంతరం ఉద్యోగులంతా కనీసం మీడియాతో కూడా మాట్లాడకుండా గప్‌చుప్‌గా వెళ్లిపోయారు. సాక్షి,విజయవాడ: దుర్గగుడిలో డిసెంబర్ 26వ తేదీ రాత్రి ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదంటూ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఉద్యోగులు, అర్చకుల సంఘం నిర్ధారించింది. శుక్రవారం ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్‌లో ఉన్న నిజనిర్ధారణ కమిటీ సభ్యులు రఘునా«థ్, చిర్రావూరి శ్రీరామశర్మను వారు కలిసి మాట్లాడి ఒక విజ్ఞాపన పత్రం అందజేశారు. ఆరోజు తాంత్రిక పూజలు జరిగే అవకాశమే లేదని, దేవాలయం ప్రతిష్ట దెబ్బతినడం తమకు ఎంతో బాధ కలిగిస్తోందంటూ ఆ పత్రంలో వివరించారు. ఏ తప్పు జరగలేదు : ఆలయ సిబ్బంది వేద పండితుడు గురునాథ ఘనాపాటి మాట్లాడుతూ ప్రధాన అర్చకుడు బదిరీనాథ్‌బాబు తాంత్రిక పూజలు ఎప్పుడు చేసే అవకాశం లేదన్నారు. ఆయన పూర్వీకులు ఐదు తరాలుగా అమ్మవారి సేవలోనే ఉన్నారని, ఇప్పటికీ ఏ దేవాలయంలోనైనా స్వామివార్లకు, అమ్మవార్లకు అలంకారం చేయాలంటే ఆయనే వెళ్తారని చెప్పారు. అలాంటి వ్యక్తి తాంత్రిక పూజలు చేసేందుకు సహకరించే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు. బదిరీనాథ్‌బాబు ఒక్కరే పూజా కార్యక్రమాలు నిర్వహించలేరని, ఇతర అర్చకుల సహాయం తీసుకుంటారని చెప్పారు. మహిషాసురమర్దనీదేవి అలంకారం చేయాలంటే సామగ్రి కావాలని, అవేమి అక్కడ లేవని గుర్తుచేశారు. ఈ ఘటనలో దేవస్థానం సూపరింటెండెంట్, టెంపుల్ ఇన్స్పెక్టర్, ఎస్పీఎఫ్ సిబ్బంది ఏ తప్పు చేయలేదని ఆలయ సిబ్బంది, ప్రతినిధులు తెలిపారు. దేవస్థానంలో సిబ్బంది, అర్చకుల్లో గ్రూపులు ఉన్నాయని, వాటివల్లే ఏదో జరిగిందనే ప్రచారం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయని, అయితే తామంతా ఒకటేనని నిజనిర్ధారణ కమిటీకి వివరించారు. యూనియన్ నాయకుడు రాజు, వైదిక కమిటీ సభ్యులు ఎం.షణ్ముఖేశ్వరశాస్త్రి, కోటా ప్రసాద్, రంగాబత్తుల శ్రీనివాసరావు పాల్గొన్నారు. గతంలో ఈ సఖ్యత ఏమైంది? నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల్ని కలిసి బయటకు వచ్చిన అనంతరం అర్చకుల్లో విభేదాలు వచ్చాయి. గతంలో ఐదుగురు అర్చకులను దేవస్థానం నుంచి బలవంతంగా బయటకు పంపినప్పుడు ఈ సఖ్యత ఏమైందంటూ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు లేని ఐక్యత ఇప్పుడు ఎందకంటూ ప్రశ్నించారు. అన్ని విషయాల్లోనూ దేవస్థానం సిబ్బంది ఏకతాటిపై ఉండాలనేదే తన ఆవేదనంటూ గట్టిగా చెప్పారు. 11 గంటల పాటు విచారణ ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు నిజనిర్ధారణ కమిటీ సభ్యులు విచారణ చేశారు. ఆరోజు వ్యవహారంలో బాధ్యులైన పార్థసారథితో పాటు అర్చకులు, దేవస్థానం ఇద్దరు ప్రధాన అర్చకులు, స్థానాచార్య, ఇతర అర్చకులను పిలిచి విచారణ చేశారు. గప్‌చుప్‌గా.. విచారణ ఎదుర్కొని వచ్చిన వారంతా మౌనంగా వెళ్లిపోయారే తప్ప లోపల ఏమీ జరిగిందో మీడియాకు చెప్పేందుకు నిరాకరించారు. దేవస్థానంలోని విషయాలు బయటకు పొక్కడం వల్ల ఎవరూ నోరు ఎత్తవద్దంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో అందరూ మౌనంగానే వెళ్లిపోయారు. పాలకమండలి సభ్యులు కూడా అక్కడ కనిపించలేదు. చైర్మన్ యలమంచిలి గౌరంగబాబును ఆయన చాంబర్లో రఘునాథ్, శ్రీరామ్‌శర్మ కలిశారు. ఆరోజు జరిగిన దానిపై ఆయన అభిప్రాయం కోరగా, పోలీసు నివేదిక వచ్చాక చెబుతానని అన్నట్లు తెలిసింది. -
‘ఉమా నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకో’
సాక్షి, విజయవాడ : టీడీపీ పాలనలో ప్రజలకే కాదని, చివరికి అమ్మవారికి కూడా భద్రత కరువైందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దుర్గగుడిలో అర్థరాత్రి తాంత్రిక పూజలు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నా మళ్లీ విచారణ కమిటీ ఏమిటని సుధాకర్ బాబు సూటిగా ప్రశ్నించారు. వీడియో క్లిప్పింగ్స్ స్పష్టంగా ఉంటే విచారణ కమిటీనా అని అన్నారు. ‘టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఈ పూజలు లోకేష్ కి రాజయోగం కోసం చేయించారు అని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటివరకు సీఎం ఎందుకు నోరు మెదపలేదు. ఇది మీ ఇంట్లో విషయం కాదు, కోట్లాది మంది హిందువుల మత విశ్వాసం దెబ్బతింది. గుళ్లో జరిగిన విషయాలు అన్ని ప్రజలకు వివరించాలి. అమ్మ వారి నగలు నిజమైనవేనా అన్న అనుమానం వస్తుంది. మీరు నియమించిన కమిటీకి విలువ లేదు. దేవినేని ఉమా మీరు సూటిగా సమాధానం చెప్పండి, ఒక స్థానిక ఎంపీని మాట్లాడనీయరా, చిత్రవతికి మీ హయాం లో ఇచ్చిన నిధులు ఎన్ని?. ఉమా నోరు అదుపులో పెట్టుకో. అడ్డగోలుగా విమర్శించద్దు. నీ అవినీతి విజయవాడలో, మైలవరం లో ఎవరిని అడిగినా చెబుతారు. పులివెందులకి నీళ్లు ఇచ్చే విషయంలో మీ హయాంలో ఎంత ఖర్చు పెట్టారో, వైఎస్ఆర్ హయాంలో ఎంత పెట్టారో లెక్కలు బయటపెట్టండి.’ అని డిమాండ్ చేశారు. -
తాంత్రిక పూజలపై నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు
విజయవాడ : దుర్గగుడిలో అర్ధరాత్రి తాంత్రిక పూజలు నిర్వహించారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నిజనిర్దారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు కమిటీ ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో దేవాదాయ శాఖ ఇంఛార్జి అదనపు కమిషనర్ రఘునాధ్, ఆగమ శాస్త్ర సలహా బోర్డు సభ్యుడు చిర్రావుల శ్రీరామ శర్మ సభ్యులుగా ఉన్నారు. నేడు, రేపు కమిటీ విచారణ చేయనున్నారు. దుర్గగుడి ఈఓ కార్యాలయానికి విచారణ కమిటీ సభ్యులు చేరుకున్నారు. -
గుడిలో ‘ఏవో’ పూజలు చేశారు!
సాక్షి, అమరావతి బ్యూరో/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) :‘బెజవాడ దుర్గమ్మ అలయంలో నిబంధనలకు విరుద్ధంగా 2017, డిసెంబర్ 26 అర్ధరాత్రి ‘ఏవో’ పూజలు చేశారు. అమ్మవారి గుడిలో అనుసరిస్తున్న స్మార్థ వైదిక ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఈ తంతు జరిగింది. ఆలయంతో సంబంధంలేని బయట వ్యక్తులు అమ్మవారి అంతరాలయంలోకి ప్రవేశించారు’ అని పోలీసులు దాదాపుగా నిర్ధారించారు. ‘భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఈ ఉదంతంలో అన్ని వాస్తవాలూ వెలుగు లోకి రావాలంటే పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించాలి’ అని కూడా సూచించినట్లు సమాచారం. ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారి ఆలయంలో నిబం ధనలకు విరుద్ధంగా తాంత్రిక పూజలు నిర్వహించడం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ప్రైవేటు వ్యక్తులు ఆలయంలోకి అర్ధరాత్రి దాటాక వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దాంతో కేసు విచారణ చేపట్టిన పోలీసులు ప్రస్తుతానికి కీలక సమాచారాన్ని రాబట్టి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు సమాచారం. విడిచిపెట్టారు.. కానీ నిఘా పెట్టారు: అర్చకుడు సృజన్‌ను పోలీసులు గురువారం విడిచిపెట్టారు. అమ్మవారికి డిసెంబర్ 26 అర్ధరాత్రి అలంకరణ చేసింది అతనే. మంత్రి లోకేష్‌కు రాజయోగం కోసమే తాంత్రిక పూజలు నిర్వహించినట్లు సృజన్ సన్నిహితుల వద్ద చెప్పినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అతణ్ని అదుపులోకి తీసుకున్నా విషయాన్ని పోలీసులు నిర్ధారిం చలేదు. దీనిపై అతని కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దాంతో సృజన్‌ను గురువారం ఉదయం అతని స్వస్థలం పెద్దపులివేరులో విడిచిపె ట్టారు. సృజన్ ఎవరితో మాట్లాడకుండా హెచ్చరించి అతనిపై నిఘా పెట్టారు. -
నోరు మెదపవద్దని సీఎం ఆదేశం
-
పాలకమండలి సభ్యులపై చంద్రబాబు ఆగ్రహం
సాక్షి, విజయవాడ : దుర్గగుడి పాలకమండలి సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో తాంత్రిక పూజలు జరిగాయని వాస్తవాలు బైటపెట్టిన పాలక మండలిపై సీఎం అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాకుండా దుర్గగుడి వివాదంపై పాలక మండలి సభ్యులు ఇకపై నోరు మెదపవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గురువారం పాలక మండలి సభ్యులతో అత్యవసర సమావేశం అయ్యారు. ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను పాలకమండలి సభ్యులకు వివరించారు. అయితే ఎటువంటి విచారణ జరగకుండానే ఆలయంలో పూజలు జరగలేదని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఎలా ప్రకటించారని పాలకమండలి సభ్యులు...ఎమ్మెల్సీని నిలదీశారు. ఈవో వ్యవహారంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఎటువంటి పరిస్థితి ఏర్పడిందని పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం ఇలాగే ముదిరితే పాలక మండలినే రద్దు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారంటూ సభ్యులను ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హెచ్చరించారు. అలాగే ఈవో సూర్యకుమారి తప్పేమీ లేదని చెప్పకపోతే దుర్గగుడి ఆయల ప్రతిష్ట దెబ్బతింటుందని సూచన చేశారు. కాగా సంప్రదాయాలకు విరుద్ధంగా దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగడం ఇంద్రకీలాద్రిపై హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. దీనికితోడు ఈవో సూర్యకుమారిని బదిలీ చేశారంటూ సమాచారం రావడంతో బుధవారం దీనిపైనే చర్చ జరిగింది. ఈవో సూర్యకుమారి స్థానంలో సింహాచలం ఈవో రామచంద్ర మోహన్ ఇన్చార్జి బాధ్యతలు తీసుకుంటారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే, బుధవారం రాత్రి వరకూ ఈవోను మార్చుతున్నట్లు ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అంతా సందిగ్ధంలో పడింది. దీనిపై పూర్తి విచారణ చేయించి, నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి ప్రకటించడంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన దేవస్థానం వర్గాల్లో నెలకొంది. -
దుర్గగుడిలో తాంత్రిక పూజలు: తెరవెనుక టీడీపీ ఎమ్మెల్సీ!
సాక్షి, విజయవాడ: కనకదుర్గ ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయని వైఎస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ కోసమే దుర్గగుడిలో బుద్ధా వెంకన్న తాంత్రిక పూజలు చేయించారని అన్నారు. గతంలో టీడీపీ హయాంలోనే అమ్మవారి అభరణాలు చోరీకి గురయ్యాయని అన్నారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు విలేకరులతో మాట్లాడారు. గుడి పవిత్రతను టీడీపీ నేతలే దెబ్బతీస్తున్నారని, హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారని మండిపడ్డారు. దుర్గగుడే కాదు.. అన్ని ప్రధాన ఆలయాల సీసీటీవీ దృశ్యాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాంత్రిక పూజలకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే అమ్మవారి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా దుర్గగుడిలో శాంతిపూజలు జరిపించాలని ప్రభుత్వానికి సూచించారు. పులివెందులలో సీఎం చంద్రబాబు సభ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి చేతిలోని మైక్ లాక్కోవడం దారుణమని మండిపడ్డారు. ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన తప్పు ఏంటి, నిజాలు మాట్లాడితే తట్టుకోలేరా అని ప్రశ్నించారు. ఒక ఎంపీపై రౌడీషీటర్లతో దాడికి దిగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ అని వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు అన్నారు. -
అసలేం జరిగింది?
సాక్షి, విజయవాడ: సంప్రదాయాలకు విరుద్ధంగా దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగడం ఇంద్రకీలాద్రిపై హాట్ టాపిక్‌గా మారింది. దీనికితోడు ఈవో సూర్యకుమారిని బదిలీ చేశారంటూ సమాచారం రావడంతో బుధవారం దీనిపైనే చర్చ జరిగింది. ఈవో సూర్యకుమారి స్థానంలో సింహాచలం ఈవో రామచంద్ర మోహన్ ఇన్చార్జి బాధ్యతలు తీసుకుంటారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే, బుధవారం రాత్రి వరకూ ఈవోను మార్చుతున్నట్లు ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అంతా సందిగ్ధంలో పడింది. దీనిపై పూర్తి విచారణ చేయించి, నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి ప్రకటించడంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన దేవస్థానం వర్గాల్లో నెలకొంది. మరోసారి బయటపడిన విభేదాలు దుర్గగుడి పాలకమండలికి, ఈవో సూర్యకుమారికి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తాంత్రిక పూజలు జరగడంపై తాము గతనెల 30న పాలకమండలిలో చర్చించినా ఈవో సూర్యకుమారి వేగంగా నిర్ణయం తీసుకోలేదని, అందువల్ల ఆమెను ఈవో పదవి నుంచి తొలగించి విచారణ చేయాలంటూ పాలకమండలి సభ్యులు డిమాండ్ చేశారు. అదే సమయంలో కొంతమంది సభ్యులు దేవస్థానంలో జరుగుతున్న కొన్ని అవినీతి వ్యవహారాలను మీడియా వద్ద ఏకరువు పెట్టారు. సూర్యకుమారి కూడా సాయంత్రం 4 గంటలకు తనను కలిసిన మీడియాతో మాట్లాడేటప్పుడు పాలకమండలి సభ్యులను కలుపుకోలేదు. పాలకమండలి సభ్యులు చేసిన వ్యాఖ్యలకు స్పందించలేదు. తాంత్రిక పూజలు జరిగాయని పాలకమండలి సభ్యులు చెబుతుంటే.. కేవలం శుద్ధిచేసే కార్యక్రమమే జరిగిందంటూ ఈవో సూర్యకుమారి చెప్పారు. వైదిక కమిటీ, ఆలయ అర్చకులతో ఆరోజు సంఘటనపై ఈవో సుదీర్ఘంగా చర్చించారు. అదే సమయంలో దేవస్థానం ప్రతిష్ట దెబ్బతినేలా ఎవరూ మాట్లాడటం సరికాదంటూ ఈవో సూర్యకుమారి వ్యాఖ్యలు చేశారు. ఆరోజు ఏం జరిగిందనే అంశంపై తాము విచారణ చేయిస్తున్నామని, మొత్తం నివేదికను ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. మసకబారుతున్న ఆలయ ప్రతిష్ట దుర్గగుడిలో ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు దేవాలయ ప్రతిష్టను మసకబార్చేలా ఉన్నాయి. ఇటీవల దేవస్థానంలో ఒక అటెండర్ చంద్రశేఖర్ టికెట్లు రీసైక్లింగ్ చేస్తుండగా అయ్యప్ప భక్తులకు పట్టుబడ్డాడు. చివరకు చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేశారు. అంతకుముందు విజిలెన్స్ నివేదికలోనూ ఏడాది కాలంగా దేవస్థానంపై జరుగుతున్న అవకతవకలను బహిర్గతం చేశారు. ప్రసాదాల తయారీ నుంచి ఇంజినీరింగ్ విభాగం వరకూ జరుగుతున్న అవినీతిని ఈ నివేదికల్లో విజిలెన్స్ అధికారులు ఏకరువు పెట్టారు. -
తాంత్రిక పూజలు ఎవరి కోసం?
పెందుర్తి: కనకదుర్గమ్మ గర్భాలయంలో తాంత్రిక పూజలు ఎవరి కోసం జరిగాయో బహిర్గతం చేయాలని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా క్షుద్ర పూజలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ ఘటన దురదృష్టకరమని, దేశానికి అరిష్టమని, భక్తులకు ప్రమాదకరమని స్వరూపానం దేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని శారదా పీఠంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దుర్గమ్మ సాత్విక శక్తులను అణచివేసేలా.. భయంకరమైన క్షుద్రశక్తులను ఆలయంలోకి రప్పిస్తారా అని స్వరూపానందేంద్ర మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. -
‘దుర్గగుడిలో అర్థరాత్రి పూజలు వాస్తవమే’
సాక్షి, విజయవాడ : విజయవాడ దుర్గగుడిలో అర్థరాత్రి తాంత్రిక పూజలపై పాలకమండలి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆలయంలో అర్థరాత్రి పూజలు జరిగిన విషయం వాస్తవమేనని పాలకమండలి పేర్కొంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశామని తెలిపింది. ఇటువంటి ఘటనల వల్ల భక్తుల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయని, ఆలయ ఈవో సూర్యకుమారి తనపై వస్తున్న ఆరోపణలను రూపుమాపుకునేందుకే ఇటువంటి పూజలు నిర్వహించారని పాలకమండలి ఆరోపించింది. ఈవో సూర్యకుమారికి తెలిసే ఇదంతా జరిగిందని, ఆమె చెప్పడం వల్లే పూజలు, అలంకారం చేశామని బయట వ్యక్తులు చెబుతున్నారని వ్యాఖ్యానించింది. గతంలో ఈవో ఘాట్‌రోడ్‌లోని పర్ణశాలలో హోమగుండాలు ఏర్పాటు చేసి క్షుద్రపూజలు చేశారని, ఆమె వ్యవహార శైలి ఆది నుంచి వివాదాస్పదంగా ఉందని పాలకమండలి ఆరోపణలు చేసింది. ఆలయ ప్రతిష్టను ఈవో సూర్యకుమారి దిగజార్చారని, ఆలయంలో అర్థరాత్రి పూజలపై గత నెల 30న జరిగిన సమావేశంలో ప్రశ్నిస్తే ఆమె అన్నీ అబద్ధాలు చెప్పారని, అలాగే టెండర్ల విషయంలోనూ ఈవో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారని పాలకమండలి చెప్పుకొచ్చింది. ఈవోపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది. బయటి వ్యక్తులు అంతరాలయంలోకి వెళ్లడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని ఆలయ పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు, పాలకమండలి సభ్యులు పేర్కొన్నారు. మరోవైపు తాంత్రిక పూజల వ్యవహారంపై ఈవో సూర్యకుమారి ప్రెస్మీట్లో వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. -
పూజల కోసం పిలిచారని చెప్పలేదు
-
నా మీద చాలామంది కోపంగా ఉన్నారు..
సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదని ఆలయ ఈవో సూర్యకుమారి తెలిపారు. తాంత్రిక పూజల వ్యవహారంపై ఆమె బుధవారం ప్రెస్‌మీట్ లో మాట్లాడుతూ.. తాంత్రిక పూజలు అంటే ఏంటో తనకు తెలియదని, దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నామన్నారు. అలాగే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఈవో తెలిపారు. గత నెల 26వ తేదీ రాత్రి సాధారణంగా చేసే అలంకారమే జరిగిందని, అందుకు సంబంధించిన సామాగ్రిని మాత్రమే లోనికి వెళ్లిందని ఆమె పేర్కొన్నారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా 14మందికి నోటీసులు ఇచ్చామన్నారు. అలాగే సీసీ టీవీ ఫుటేజ్ ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈవో స్పష్టం చేశారు. బదిలీకి సంబంధించి తనకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని ఆమె తెలిపారు. నా మీద చాలామంది కోపంగా ఉన్నారు.. ‘గుడిలో నా మీద చాలామందికి కోపం ఉంది. పాలకమండలికి, నాకు మధ్య కొంత దూరం ఉంది. పాలకమండలి కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ వింగ్ ప్రారంభించాం. గుడిలో వంద గ్రూపులు ఉన్నాయి. నా మీద కొంత ఒత్తిడి వచ్చింది. కానీ నిబంధనల ప్రకారమే పని చేశాం. బయోమెట్రిక్ పెట్టడం, పని సక్రమంగా చేయడం, కొత్త పూజలు ప్రవేశ పెట్టడం కూడా కొందరికి నచ్చలేదు. హుండీ 20శాతం, టిక్కెట్ ఆదాయం 80శాతం పెరిగింది. సుమారు 130 కోట్ల వరకు డిపాజిట్ లు వున్నాయి. ఒక్క కార్తీకమాసంలో కోటి రూపాయల ఆదాయం పెరిగింది. ఇక గుడిలో పూజలకు సంబంధించి ఎస్పీఎఫ్, దేవాదాయ సిబ్బంది, ఓపిడిఎస్ స్టాఫ్ ను ఆలయ ఈఈ వెంకటేశ్వర రాజు విచారిస్తున్నారు. పాలకమండలి కూడా రెండు రోజుల కిందటే సీసీ టీవీ ఫుటేజీ చూసింది. బయటి వ్యక్తులు ఎలా వచ్చారని పాలకమండలి సభ్యులు ప్రశ్నించారు.’ అని అన్నారు. కాగా ఈ వివాదం నేపథ్యంలో ఈవో సూర్యకుమారిపై వేటు పడింది. ఆమెను ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. సూర్యకుమారి స్థానంలో ఇన్చార్జ్ ఈవోగా రామచంద్ర మోహన్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సింహాచలం దేవాలయ ఈవోగా ఉన్న ఆయనను వెంటనే రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. -
దేవాలయాల పవిత్రను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే
-
బయట వ్యక్తులు అంతరాలయం వద్ద ఉన్నది నిజమే!
సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఎంతో పవిత్రమైన ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో రహస్యంగా తాంత్రికపూజలు నిర్వహించిన వ్యవహారం వెలుగుచూడటం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఓ యువనేత పదవి కోసమే ఈ తాంత్రిక పూజలు నిర్వహించినట్టు ఆరోపణలు వస్తుండటం రాజకీయ దుమారం రేపుతోంది. గత నెల 26న అర్ధరాత్రి శాంతస్వరూపినిగా ఉన్న దుర్గమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించి.. భైరవీ పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది. భైరవీ పూజలు నిర్వహిస్తే శక్తులు వస్తాయనే నమ్మకముంది. ఈ నేపథ్యంలో భైరవీ పూజలు నిర్వహించి.. అనంతరం మళ్లీ దుర్గామాతగా అలంకారాన్ని మార్చినట్టు సమాచారం. బయట వ్యక్తులు అంతరాలయం వద్ద ఉన్నది వాస్తవమే! దుర్గగుడిలో తాంత్రిక పూజల కేసులో లీగల్ తీసుకొని.. ఆ ప్రకారం నడుచుకుంటామని విజయవాడ వన్‌టౌన్ సీఐ కాశీ విశ్వనాథ్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు పూజారులను విచారించామని తెలిపారు. దుర్గగుడి అంతరాయలం వద్ద బయట వ్యక్తులు ఉన్నది వాస్తవమేనని ఆయన తేల్చి చెప్పారు. ఈ పూజలకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తామన్నారు. దుర్గగుడిలో ఎవరి కోసం పూజలు నిర్వహించారనే దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకున్నారు. ఈవో సూచనల మేరకే తాము అర్ధరాత్రి పూజలు నిర్వహించినట్టు పూజారులు చెప్తున్నారు. మరోవైపు కిందిస్థాయి పూజారులపై నెపం నెట్టేసి.. ఈ వ్యవహారాన్ని ముగించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, అధికార పార్టీ నేతల అండ లేనిదే ఆలయంలో ఇంతటి అపచారం జరగదని పరిశీలకులు అంటున్నారు. ఈవోపై వేటు.. ఈ వివాదం నేపథ్యంలో కనకదుర్గ ఆలయం ఈవో సూర్యకుమారిపై వేటు పడింది. ఆమెను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమె స్థానంలో ఇన్చార్జ్ ఈవోగా రామచంద్రమోహన్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సింహాచలం దేవాలయ ఈవోగా ఉన్న ఆయనను వెంటనే రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దుర్గగుడిలో తాంత్రికపూజల పేరిట అర్ధరాత్రి జరిగిన అపచారంపై హిందువులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన, రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన దుర్గమ్మ సన్నిధిలో ఇలాంటి అపచారం జరగడమేమిటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిందువులు, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా, ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా తాంత్రిక పూజలు నిర్వహించారని, ఈ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టకూడదని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
లోకేశ్ కోసమే దుర్గగుడిలో తాంత్రిక పూజలు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు తనయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ను సీఎం చేసేందుకే దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాంత్రిక పూజల వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని అన్నారు. పూజ చేస్తూ దొరికిపోయిన తర్వాత ఆ తప్పును అధికారులపై నెట్టేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారం నిలబెట్టుకునేందుకు వేల కోట్ల నల్లధనాన్ని ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఆంగ్ల సంవత్సర సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరగలేదని చెప్పారు. అయితే, ఇదే సమయంలో చంద్రబాబు కుటుంబాన్ని వేద పండితులు ఆశీర్వదించారని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలకు నిబంధనల సడలింపు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయనకు మతిస్థిమితం ఉందా? అని అనుమానం వస్తోందన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలో చెప్పాలన్నారు. ఇందిరాసాగర పోలవరం ప్రాజెక్టును నిర్మించినందుకా? లేక 600 వాగ్ధానాలు చేసి పట్టుమని పది కూడా నిలబెట్టుకోనందుకా? అని నిప్పులు చెరిగారు. పారిశ్రామిక సదస్సుల పేరిట వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని, వాటి వల్ల రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం శూన్యం అని చెప్పారు. ఆలయ ఈవో ఆధ్వర్యంలో పూజలు..?? -
తాంత్రిక పూజల వెనుక చంద్రబాబు ఉన్నారు
-
దుర్గగుడి వద్ద పాము కలకలం
సాక్షి, విజయవాడ: విజయవాడ దుర్గ గుడి వద్ద శనివారం పాము కనిపించడం కలకలం సృష్టించింది. అమ్మవారి దర్శన కోసం భక్తులు క్యూ లైన్లలో ఉండగా సమీపంలోని పచ్చిక నుంచి ఓ పాము వచ్చింది. పామును చూసిన భక్తులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. పాము ప్రత్యక్షంతో దుర్గ గుడి సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి పామును పట్టుకుని అక్కడి నుంచి తరలించారు. -
దుర్గగుడి క్యూ లైన్ వద్ద పాము కలకలం
-
పట్టు చిక్కేదెప్పుడు?
సాక్షి, విజయవాడ: శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం పాలకమండలి సభ్యులు దుర్గగుడిపై పట్టుకోసం తహతహలాడుతున్నారు. దేవస్థానంలో తమ మాటే చలామణి అయ్యేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవాలయం అంతర్గత విషయాలపై చూపించే ఆసక్తి దేవస్థానానికి నిధులు రాబట్టడంపై చూపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కొంతమంది సభ్యులు తరచుగా ఈవో సూర్యకుమారితో విభేదించడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. నిధులు రాబట్టడంలో విఫలం పాలకమండలి సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు వద్ద తమ పరపతి ఉపయోగించి ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమయ్యారు. కనీసం వారు చేసిన తీర్మానాలను ప్రభుత్వంతో అమలు చేయించలేకపోతున్నారు. దసరా ఉత్సవాలకు రూ.10 కోట్లు కావాలని తీర్మానం చేయడం మినహా ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి రాబట్టలేకపోయారు. అంతరాలయ దర్శనం రూ.300 నుంచి రూ.150 తగ్గించాలని పాలకమండలి తీర్మానం చేసినప్పటికీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పక్కన పెట్టింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం కోటప్పకొండకు నిధులు విడుదల చేసింది కానీ దుర్గగుడిపై నిర్లక్ష్యం చూపింది. పరిచయాలున్నా విరాళాలు నిల్ పాలకమండలిలో కొంత మందికి అధికార పార్టీ పెద్దలతో విస్తృత పరిచయాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించి దాతల నుంచి దేవస్థానానికి చందాలు రాబట్టలేక పోతున్నారు. దీంతో అమ్మవారి మూలధనం తరిగిపోతోంది. మంత్రులు, ఎంపీలు, పారిశ్రామికవేత్తలను ఒప్పించి విరాళాలు తెప్పించి దేవస్థానాన్ని ఆదాయంలో అగ్రస్థానంలో నిలబెట్టవచ్చు. దుర్గగుడికి ఆదాయం ఇచ్చేందుకు అనేక మంది దాతలు సిద్ధంగా ఉన్నారు. అయినా వారిని గుర్తించి నిధులు రాబట్టడంపై పాలకమండలి శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధిపై ప్రణాళిక ఏదీ? లడ్డూ ప్రసాదాలు ధరను తొలుత రూ.15 పెంచాలని యోచించారు. అయితే నాణ్యత పెంచి రూ.20 చేయాలని పాలక మండలి సభ్యులు నిర్ణయించారు. దీనిపై విమర్శలు రావడంతో మంత్రి ఉమామహేశ్వరరావు పిలిచి పాలకమండలిని ప్రశ్నించారు. రేట్లు ఎందుకు పెంచామో చెప్పి ఆయన్ను ఒప్పించలేక, ఆయన సూచన మేరకు లడ్డూ రేటును రూ.15కు తగ్గించారు. పాలకమండలి సమావేశం జరిగితే, ఈవోతో విభేదించడమే తప్ప, అభివృద్ధిపై నిర్దిష్టమైన ప్రణాళికలు తయారు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రతిపాదనలు పట్టించుకోని ఈవో బియ్యం మిల్లర్ల వద్ద రూ.41 కొనడాన్ని ఆక్షేపిస్తూ టెండర్లు పిలిస్తే రూ.38కే కాంట్రాక్టర్లు సరఫరా చేస్తారనే వాదన చేశారు. అయితే రూ.38లకు లభించే బియ్యం ఒకలోడు తీసుకుని అగ్‌మార్కుకు పంపించి, వాటిని పరిశీలించిన తరువాత టెండర్ ఇద్దామనే ఈవో ప్రతిపాదనపై పాలకమండలి సభ్యులు సరిౖయెన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. అన్నదానం, ప్రసాదాలు, స్టోర్స్, కేశఖండన వంటి వాటిపై పట్టుకోసం కమిటీలు వేయమంటూ ప్రతిపాదన తెస్తున్నారు. విభాగాలకు కమిటీలు ఏర్పడితే అక్కడ పనిచేసే సిబ్బందికి సమస్యలు తప్పవు. గతంలో ఉన్న పాలకమండలి సభ్యులు గ్యాస్ సిలిండర్లు, ప్రసాదాలు కూడా దేవస్థానం నుంచే తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయి. పాలకమండలి వచ్చి ఐదు నెలలు గడిచినా ఈవోతో విభేదించడం తప్ప భక్తులకు పెద్దగా ఒరిగిందేది కనపడటం లేదు. ఈ పాలకమండలి ఉన్నా,లేకున్నా ఒకటేలాగా ఉందనే విమర్శలు అధికార పార్టీ నేతల నుంచే వినవస్తోంది. -
దుర్గ గుడి వద్ద 4 నెలలు ట్రాఫిక్ మళ్లింపు
విజయవాడ: కనకదుర్గ గుడి వద్ద ప్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో విజయవాడలో ఈనెల 11వ తేదీ నుంచి సుమారు 4 నెలల పాటు ఘాట్ రోడ్డు నుంచి గొల్లపూడి వైపు వెళ్లే అన్ని వాహనాలను మళ్లిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ డి.గౌతం సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ఆ దారిలో ఎటువంటి వాహనాలను అనుమతించబోమన్నారు. వాహన డ్రైవర్లు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా... 1. గొల్లపూడి, పున్నమిఘాట్, భవానీపురం నుంచి విజయవాడ సిటీలోకి వచ్చే ఇతర వాహనాలు.. ► గొల్లపూడి–కబేళా–సి.వి.ఆర్ ఫ్లైఓవర్ –ఫ్లైఓవర్ మధ్య నుంచి డైవర్షన్ తీసుకుని చిట్టినగర్–కె.ఆర్.మార్కెట్ మీదుగా ప్రయాణించాలి. ► గొల్లపూడి–కబేళా–సి.వి.ఆర్. ఫ్లైఓవర్ మధ్య నుంచి డైవర్షన్ తీసుకుని చిట్టినగర్–ఎర్రకట్ట–బి.ఆర్.టి.ఎస్. రోడ్డు మీదుగా ప్రయాణించాలి. ► గొల్లపూడి–కబేళా–సి.వి.ఆర్., ఫ్లైఓవర్ – పైపుల రోడ్డు–ఆంధ్రప్రభ కాలనీ–ఎ.యస్. నగర్ ఫ్లైఓవర్ –బుడమేరు–మీదుగా ప్రయాణించాలి. 2. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి గొల్లపూడి వైపు వెళ్లే ఇతర వాహనాలు .. ► పోలీస్ కంట్రోల్ రూమ్–కె.ఆర్. మార్కెట్–చిట్టినగర్–సితార–గొల్లపూడి మీదుగా ప్రయాణించాలి. ► ఏలూరు రోడ్డు–బుడమేరు–ఎ.ఎస్.నగర్ ప్లై ఓవర్–ఆంధ్రప్రభ కాలనీ–వై.వి. రావు ఎస్టేట్–గొల్లపూడి మీదుగా రాకపోకలు సాగించాలి. 3. హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు.... ► హైదరాబాద్–ఇబ్రహీంపట్నం–మైలవరం– నూజివీడు–హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నంకు మళ్లింపు. 4. ఏలూరు నుంచి హైదరాబాద్ వైపు.. ► హనుమాన్ జంక్షన్–నూజివీడు–మైలవరం– ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్‌కు మళ్లింపు. 5. హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు... ► హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్లే భారీ వాహనాలు, లారీలు, బస్సులు–ఇబ్రహీంపట్నం– జి.కొండూరు–కందులపాడు క్రాస్ రోడ్డు– కొత్తూరు తాడేపల్లి–జక్కంపూడి లేఅవుట్– పాము ల కాలువ– వై.వి.రావు ఎస్టేట్ – రామవరప్పాడు రింగ్–బెంజ్‌సర్కిల్– వారధి మీదుగా ప్రయాణించాలి. 6. గుంటూరు నుంచి హైదరాబాద్ వైపు.. ► గుంటూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలు, లారీలు, బస్సులు వారధి–బెంజ్ సర్కిల్–రామవరప్పాడురింగ్–వై.వి.రావు ఎస్టేట్– పాముల కాలువ–జక్కంపూడి లేఅవుట్ కొత్తూరు తాడేపల్లి–కందులపాడు క్రాస్ రోడ్డు–జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మీదుగా ప్రయాణించాలి. భారీ వాహనాలు, వాహనాల డ్రైవర్లకు సూచన... ► హైదరాబాద్ నుంచి చైన్నై వెళ్లే భారీ వాహనాలు, లారీలు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందున నార్కట్‌పల్లి–మిర్యాలగూడ–పిడుగురాళ్ల–సత్తెనపల్లి మీదుగా ప్రయాణించాలి. ► చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే భారీవాహనాలు, లారీలు ఒంగోలు–మేదరమెట్ల–అద్దంకి–పిడుగురాళ్ల–మిర్యాలగూడ–నల్లగొండ– నార్కట్‌పల్లి మీదుగా హైదరాబాద్ చేరుకోవాలి. ► విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు, లారీలు దేవరపల్లి–సత్తుపల్లి – తల్లాడ–ఖమ్మం–సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్లాలి. ► విశాఖపట్నం నుంచి చెన్నైకు వెళ్లే భారీ వాహనాలు, లారీలు హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ–పామర్రు–చల్లపల్లి–అవనిగడ్డ–బాపట్ల–ఒంగోలు మీదుగా చెన్నైకు వెళ్లాలి. -
దుర్గమ్మ దేవాలయానికి ముప్పు!
భారీ యంత్రాలతో కోనేరు తవ్వకం గుడిలోకి వస్తున్న ప్రకంపనలు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం: ఈఈ భాస్కర్ సాక్షి, విజయవాడ: అభివృద్ధి పేరుతో ఇంద్రకీలాద్రిపై అధికారులు చేస్తున్న హడావుడి.. అమ్మవారి దేవాలయానికి, విగ్రహానికి ముప్పుగా మారింది. ఇప్పటికే ఇంద్రకీలాద్రిపై పలు నిర్మాణాలను అధికారులు తొలగించారు. అలాగే కొత్త నిర్మాణాల కోసం పర్వతాన్ని భారీ యంత్ర పరికరాలతో తవ్వుతున్నారు. కొత్త అందాలకు ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప ఎప్పుడో నిర్మించిన దేవాలయాల గురించి అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇంద్రకీలాద్రిపై కోనేరు ఉండేది. తరువాత దీన్ని మూసివేసి ఇక్కడే భవానీ మండపాన్ని నిర్మించారు. ఇప్పుడు మళ్లీ ఆ ప్రదేశంలోనే జలపాతం, కోనేరు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 21 మీటర్లు పొడవు, 8 మీటర్లు వెడల్పు, 1.5 మీటర్ల లోతులో కోనేరును నిర్మిస్తున్నారు. ఈ కోనేరులోకి నీరు పడే విధంగా జలపాతం ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం అమ్మవారి నిధులు రూ. 3 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కోనేరు తవ్వకానికి భారీ యంత్రాలు వాడుతుం డటంతో కొండంతా ప్రకంపనలు వస్తున్నాయి. పొక్లెయినర్లు, డ్రిల్లింగ్ మిషన్లతో తవ్వినప్పుడు ఆలయంలోనే భారీగా ప్రకంపనలు వస్తున్నాయని, అమ్మవారి విగ్రహం కూడా అదిరే అవకాశం ఉందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఘాట్‌రోడ్డు విస్తరణలో భాగంగా ఇంద్రకీలాద్రిని భారీ యంత్రాలతో పగలగొడుతున్నప్పుడు ఇలాంటి సమస్యే వచ్చింది. దీనిపై అర్చకులు, అధికారులు అభ్యంతరం తెలపడంతో తవ్వకాలను ఆపేశారు. ఇప్పుడు ఆలయానికి అత్యంత సమీపంలోనే కోనేరు, జలపాతం కోసం కొండను పగల గొడుతుంటే మాత్రం దేవస్థానం అధికారులు మాట్లాడటం లేదు. కేవలం అమ్మవారి దేవాలయానికే కాదు.. పక్కనే ఉన్న ఉపాలయాల భద్రతకు ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలాఉండగా దసరాలోగా కోనేరు, జల పాతాన్ని సిద్ధం చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. దేవాలయానికి ఇబ్బంది లేదు: ఈఈ భాస్కర్ కోనేరు కోసం భారీ యంత్రాలతో తవ్వడం వల్ల దేవాలయం భద్రతకు ఇబ్బంది ఉండబోదు. అన్ని జాగ్రత్తలు తీసుకునే కోనేరు నిర్మాణం చేపడుతున్నాం. కోనేరుతో భక్తులకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. గ్రీనరీతో జలపాతాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాం. -
దుర్గగుడి మ్యూజియానికి 50 పంచలోహ విగ్రహాలు
విరాళంగా అందచేసిన హైదరాబాద్ వాసులు ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమం): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఏర్పాటు చేయనున్న మ్యూజియా నికి హైదరాబాద్ వాసులు 50 పంచలోహ విగ్రహాలను ఆలయ ఈవో సూర్యకుమారికి ఆదివారం అందచేశారు. బ్రాహ్మణ వీధిలోని దేవస్థాన పరిపాలనా భవనంలోని బోర్డు మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాతలు పంచలోహ విగ్రహాలను ఈవో సూర్యకుమారికి అందచేశారు. హైదరాబాద్‌కు చెందిన అడవికొలను శేషగిరిరావు ఫ్యామిలీ ఫౌండేషన్ వారు సేకరించిన అతి పురాతనమైన విగ్రహాలు, శాసనాలు, వర్ణచిత్రాలు, నాణేలు, అమ్మవారు, స్వామి వారితో పాటు పరివారానికి చెందిన విగ్రహాలను దేవస్థానానికి అందజేశారు. -
దుర్గగుడిలో నిలిచిపోయిన లడ్డూ తయారీ
-
వైభవంగా శతచండీ సహిత రుద్రయాగం
సాక్షి, విజయవాడ : దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో తొలిసారిగా శత చండీ సహిత రుద్రయాగాన్ని బుధవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇంద్రకీలాద్రి దిగువన మల్లికార్జున మహామండపంలో నిర్మించిన ప్రత్యేక యాగశాలలో ఆలయ కార్య నిర్వహణాధికారి ఎ.సూర్యకుమారి దంపతులు ప్రారంభించగా, దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధ అగ్నిప్రతిష్టాపన చేశారు. దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు పండాలని కోరుతూ ఈ యాగాన్ని బుధవారం నుంచి ఆదివారం వరకూ నిర్వహించనున్నారు. దేవస్థానానికి చెందిన 70 మంది అర్చకులు ఈ రుద్రయాగాన్ని నిర్వహిస్తున్నారు. మహోన్నతమైన ఈ యాగం ప్రారంభించిన రోజునే నగరంలో వర్షం పడటం శుభసూచకమని దేవస్థానం అర్చకులు ‘సాక్షి’కి తెలిపారు. 20వ తేదీ మధ్యాహ్నం పూర్ణాహుతితో రుద్రయాగం ముగుస్తుంది. అనంతరం మహామండపంలోని ఆరో అంతస్తులో శాంతి కళ్యాణం జరుగుతుందని ఈవో సూర్యకుమారి తెలిపారు. భక్తులు ఈ యాగంలో పాల్గొనాలని ఆమె కోరారు. -
ఆదిశేషా.. అనంత శయన..
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : కార్తీకమాసాన్ని పురస్కరించుకుని దుర్గగుడిలో శుక్రవారం అనంత పద్మనాభస్వామికి యంత్రపూజ నిర్వహించారు. స్వామిరూపాన్ని రంగురంగుల ముగ్గులతో తీర్చిదిద్దిన అనంతరం అర్చకులు కరణం శరత్‌కుమార్, సుదర్శన కృష్ణ పూజలు చేశారు. ఈ స్వామిని పూజించిన వారికి అరిష్టాలు తొలగి ధనప్రాప్తి కలుగుతుందన్నారు.