
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం శుక్రవారం ఇంద్రకీలాద్రిపై వరలక్ష్మీ దేవి రూపంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో దుర్గ గుడి అధికారుల ఆలయ మర్యాదలతో స్పీకర్‌కు స్వాగతం పలికారు. దర్శనానంతరం తమ్మినేని వేద పండితుల చేత ఆశీర్వచనం తీసుకున్నారు. ఆలయ అధికారులు స్పీకర్‌కు అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను కూడా అందజేశారు. అనంతరం తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ.. శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారిని వరలక్ష్మీ దేవి రూపంలో దర్శించుకోవడం మరింత ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నాను అని తమ్మినేని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment