సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ఉధృతికి ప్రకాశం బ్యారెజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు విపత్తు శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. బుధవాంర ఆయన మీడియాతో మాట్లాడుతూ... మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో, వుట్ ఫ్లో 7,20,701 లక్షల క్యుసెక్కులుగా నమోదైనట్లు చెప్పారు. అలాగే వంశధార నదికి కూడా వరద ఉధృతి పెరుగుతోందని, దీంతో గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బుధవారం బ్యారెజ్ ఇన్ ఫ్లో 42,980 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 42,916 క్యూసెక్కులు నమోదైందని తెలిపారు. ఇక ముంపు ప్రాంతాల్లోకి వరద ప్రవాహాం చేరుతున్నప్పుడు ముందస్తు పునరావాస కేంద్రాలను వెళ్లాలని, లోతట్టు ప్రాంత, లంక గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు విజ్ఞప్తి చేశారు.
దుర్గగుడి అధికారుల అత్యవసర భేటీ:
దుర్గగుడి ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడడంపై గుడి అధికారులు ఈవో సురేష్ బాబు, చైర్మన్ పైలా సోమినాయుడు, దుర్గగుడి ఈడీ భాస్కర్ బుధవారం అత్యవసర సమావేశమయ్యారు. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండటంతో సమావేశమైనట్లు తెలిపారు. ఈ నెల 17నుంచి జరిగే దసరా ఉత్సవాలకు ఘాట్ రోడ్డులో భక్తులను అనుమతించాలా లేదా అనే దానిపై అధికారులు ప్రధానంగా చర్చించారు. ఇలాగే వర్షాలు కొనసాగితే ఘాట్ రోడ్డు మీదుగా భక్తులకు అనుమతి ఇవ్వకూడదని అధికారులు నిర్ణయించామని, దీనిపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌తో సమావేశం నిర్వహించిన తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తమని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment